Solar power plants
-
సోలార్ పవర్ డైరెక్టుగా స్పేస్ నుంచే
కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్‌ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..ఆకాశంలోనే అడ్డా వేసి..భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!1. స్పేస్‌లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రేడియో వేవ్స్‌గా మార్చి భూమి మీదకు పంపుతారు.3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.రేడియో తరంగాల రూపంలో పంపుతూ..ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్‌ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్‌గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్‌ల్యాండ్‌లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్‌ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది. ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.మూడు కంపెనీలు కలసి.. యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్‌ల్యాండ్‌కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్‌ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్‌వర్క్‌గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు. - సాక్షి సెంట్రల్డెస్క్ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది. ⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్‌ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. ⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. ⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్‌ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్‌పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
దేవుడి భూముల్లో ‘సౌర’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్ : దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కానుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు దశాబ్దాలుగా వృథాగా ఉంటున్నాయి. ఈ భూముల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వ్యవసాయానికి ఉపయోగపడని భూములను గుర్తించి వాటిల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా దేవాదాయ శాఖ కాకుండా.. స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీలు) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూములు ఇవ్వటం ద్వారా లీజు రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయం రానుండగా, సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ రూపంలో ఎస్‌హెచ్‌జీలకు రాబడి సమకూరుతుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల భూములను గుర్తించి ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో రెడ్కో, ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రస్తుతానికి 250 ఎకరాల భూములను గుర్తించారు. 62 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వీలుంది. వీటి ద్వారా నిత్యం సగటున 2.48 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి ఆలనాపాలనా అంత పక్కాగా లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. వీటిల్లో విడిపించుకోదగ్గ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధిత దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు పొందే కసరత్తు దేవాదాయ శాఖ ప్రారంభించింది.ఇప్పటికే 57 శాతం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయించారు. ఇప్పటికి స్వాధీనం అయిన భూములు, కబ్జా కాకుండా ఉన్న భూములను దేవాలయాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభమైంది. అయితే వ్యవసాయ యోగ్యంగా లేని భూములపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి లేకుండా పోయింది. ఇప్పుడు వాటిల్లో సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే దీన్ని సొంతంగా నిర్వహించగలిగే స్థాయిలో దేవాదాయ శాఖ వద్ద మానవవనరులు లేవు. దీంతో ఎస్‌హెచ్‌జీలను తెరపైకి తెచ్చారు.దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాల భూములుఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రెండుదశల్లో నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో ఐదు దేవాలయాలకు చెందిన 231 ఎకరాలను గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 20 ఎకరాలు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి చెందిన 100 ఎకరాలు, నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ గోశాలకు చెందిన 96 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాలు, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బుజలాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి చెందిన 6 ఎకరాలను మొదటి దశ కోసం గుర్తించారు. రెండో దశలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబాబాద్‌లోని శ్రీ శివాలయం, హనుమకొండ రాగన్న దర్వాజా ప్రాంతంలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవాలయాలకు చెందిన 21 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు.వీటిల్లో త్వరలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్లో రెడ్ కో, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఎకరాకు రూ.15 వేల మేర లీజును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. -
గ్రామాలకు సోలార్ వెలుగులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/మధిర: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. పర్యావరణ హితమైన సౌర విద్యుత్‌ను అందరూ వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు గ్రామాలను పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహాలు ఎన్ని, జనాభా ఎంత, గృహ, వ్యవసాయ కనెక్షన్లు ఎన్ని, సోలార్ విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూఫ్‌టాప్‌లు అనుకూలంగా ఉన్నాయా.. తదితర అంశాలపై విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. టెండర్లు పిలిచిన అనంతరం టీజీ రెడ్కో (తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మోడల్ సోలార్ విలేజ్..గత బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రం మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమాన్ని తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతీ ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా అన్నింటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టులుగా సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెలగనూరు, ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మండలం సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ మూడు గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల సర్వే పూర్తయింది.అంతా సోలార్మయంపైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో గృహ, వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఉదయం సమయంలో సౌర విద్యుత్, రాత్రి సమయాన సాధారణ విద్యుత్‌ను వినియోగిస్తారు. గృహాలపై సోలార్ రూఫ్ టాప్‌లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో వీటి ఏర్పాటులో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంతేకాక మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు యజమానులే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక్కో ఇంటిపై 2 నుంచి 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు.. వ్యవసాయ పంపుసెట్లకు 5 హెచ్‌పీ మోటారుకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్యానల్‌ను అమరుస్తారు. బహుళ ప్రయోజనాలు..సోలార్ విద్యుత్ వినియోగంతో బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి వీలవుతుంది. మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థానికులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలగడమే కాకుండా.. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలను నివారించడానికి సౌరవిద్యుత్ దోహదం చేస్తుంది. సిరిపురంలో సర్వే పూర్తిమధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో ఈనెల 4న సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలు నిమిత్తం విద్యుత్‌శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అంతేకాక గ్రామస్తులు, రైతులకు పైలట్ ప్రాజెక్టు గురించి వివరించారు. సర్వే అనంతరం సిరిపురం వచ్చిన ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోలార్ విద్యుత్‌పై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో మొత్తం 5,428 మంది జనాభా ఉండగా, 1,024 గృహ సర్వీసులు, 510 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. గృహ విద్యుత్‌ను 1,007 మంది 200 యూనిట్లలోపు వినియోగిస్తున్నారు.సోలార్ విద్యుత్.. రైతులకు ఉపయోగంమా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ పంపు సెట్లు ఉన్న రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అవగాహన కల్పించారు. అధికారులు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. మిగులు విద్యుత్‌కు డబ్బు చెల్లిస్తారని తెలిసింది. విద్యుత్ ఉన్నా, లేకున్నా సోలార్ విద్యుత్ పంపుసెట్లతోపంట సాగుకు ఇబ్బంది ఉండదు. – వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లాబిల్లుల భారం తగ్గి, ఆదాయం వస్తుంది..ప్రభుత్వం 200 యూనిట్లలోపు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువైనా బిల్లు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు సోలార్ విద్యుత్ వల్ల బాధలు తప్పుతాయి. మా గ్రామాన్ని ఇందుకోసం ఎంపిక చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. సోలార్ విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గి, ఆదాయం కూడా వస్తుంది. – చీదిరాల వెంకటేశ్వరరావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లారుణపడి ఉంటాం..మా గ్రామంలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉంటాయి. సోలార్ విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకో వడం వల్ల ఆర్థికంగా కలిసొస్తుంది. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకునే అవకాశం ఉండటం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రుణపడి ఉంటాం. ఇప్పటికే రోడ్లు, వైరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. – నండ్రు విజయారావు, సిరిపురం, మధిర మండలం, ఖమ్మంజిల్లా -
పీవీ మాడ్యూల్స్ పరిశ్రమలు నెలకొల్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు ఫోటో వోల్టాయిక్ (పీవీ) మాడ్యూల్స్ పెద్దసంఖ్యలో కావాల్సి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూయ ల్ సెల్ టెక్నాలజీని వినియోగించబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీవీ మాడ్యూ ల్స్, ఫ్యూయల్ సెల్స్ తయారీ యూనిట్ల ఏర్పా టుకు ముందుకు రావాలని ప్రముఖ జపనీస్ కంపెనీ తోషిబాను ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన టోక్యో శివార్లలోని తోషిబా ప్రధాన కార్యాలయంలో ఫ్యూయల్ సెల్, న్యూక్లియర్ పవర్/థర్మల్ పవర్ టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. కంపెనీ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగేరిజో కవహర.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఉత్పత్తులను వివరించారు. తెలంగాణను ఎల్రక్టానిక్ హబ్‌గా మార్చనున్నామని, ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తామని భట్టి విక్రమార్క వారికి చెప్పారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా లిథి యం, ఇతర ఖనిజ తవ్వకాల రంగంలోకి ప్రవేశించనుందన్నారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందు కు పోవచ్చని సూచించారు. భారత్‌లో మూడు రాష్ట్రాల్లో తమ యూనిట్లను నెలకొల్పామని, అందులో తెలంగాణలోని యూనిట్ అత్యంత ముఖ్యమైనదని తోషిబా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వ ఉమ్మడి భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బులెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలి భట్టి విక్రమార్క బుల్లెట్ ట్రైన్లో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసాకా పట్టణాన్ని 2.2 గంటల్లో చేరుకున్నారు. ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలోనూ అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను కోరనున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి పానసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని భట్టి సందర్శించనున్నారు. పర్యటనలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రైతులు/రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకంలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు కలిపి ఇప్పటివరకు 8,112 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు కేంద్రం అనుమతి ఇవ్వగా, అందులో అత్యధికంగా 4 వేల మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రా నికి సంబంధించినవే కావడం గమనార్హం. రైతులు వ్యక్తిగ తంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగా వాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్న సోలా ర్ పవర్ ప్లాంట్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు. రెన్యువబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో) నిబంధనల ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏటా తప్పనిసరిగా కొంత శాతం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్లాంట్ల ద్వా రా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కూడా ఆర్పీఓ నిబంధనల కింద డిస్కంలు తప్పనిసరిగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లించనున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌కు 0.40 పైసలు చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరు త్పాదక ఇంధన శాఖ ప్రోత్సాహకంగా అందించనుంది.త్వరలో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం..డిస్కంలు తమ 33/11 కేవీ, 66/11 కేవీ, 110/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా వాటి పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేందుకు అవకాశం ఉందో గుర్తించి తమ వెబ్సైట్లో ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రక్రియ పూర్తైంది. త్వరలో రైతుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ డిస్కంలు ప్రకటన జారీ చేయనున్నాయి. ఆసక్తి గల రైతులు/డెవలపర్లు మెగావాట్‌కు రూ.,5000కి మించకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రైతులు/డెవలపర్లు కుదుర్చుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఆధారంగా రైతులు/డెవలపర్లకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. -
పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో ‘సూర్య ఘర్’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.ఇదీ చదవండి: ‘ప్రైమ్ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం -
Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్ప్యాక్పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!ఎలా పని చేస్తుంది? ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్సై్కట్స్గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే. ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు. సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు. ఆ సమస్యనూ అధిగమిస్తే... సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.ఆకాశమే హద్దు...!ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!
భూ భ్రమణం, ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య తేడావల్ల గాలులు ఏర్పడి ఒకవైపు నుంచి మరోవైపునకు వీస్తాయి. ఈ గాలి ఎందుకు అవసరం అంటే వెంటనే ఏం చెబుతాం.. గాలి పీల్చకుండా బ్రతుకలేమని అంటాం. వాతావరణ మార్పులకు గాలి అవసరం అని చెబుతాం. అయితే ఇటీవల నెలకొంటున్న పరిస్థితుల వల్ల గాలి అవసరాలు పెరుగుతున్నాయి. గాలి నెమ్మదిగా మన వరండా నుంచి గుమ్మం ద్వారా మన టీవీలో చేరి వినోదాన్ని అందిస్తోంది. మన మొబైల్లో ప్రవేశిస్తోంది. మన మిక్సీలో పిండి రుబ్బేందుకు సహాయం చేస్తోంది. అదేంటి గాలి ఇన్ని పనులు చేస్తోందా అని ఆశ్చర్యపోతున్నారా.. క్రమంగా పవన విద్యుత్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆయా ప్రాజెక్ట్‌ల్లో తయారైన కరెంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి నిత్యావసరాలకు వాడుతున్నాం. ఈరోజు గ్లోబల్ విండ్ డే సందర్భంగా పవన విద్యుత్‌కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.వాస్తవానికి 3500 ఏళ్ల కిందటే పవనశక్తిని కనుగొన్నా.. భౌగోళిక, సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా అంతగా అభివృద్ధి చెందలేదు. పారిస్ వాతావరణ ఒప్పందం తరవాత అనేక దేశాలు పవన విద్యుత్తుపై దృష్టి సారిస్తున్నాయి. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు, కర్బన ఉద్గారాలను కట్టడి చేసేందుకు, ఇంధన సుస్థిరతను సాధించేందుకు పునరుద్ధరణీయ ఇంధన వనరులు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగమవుతున్న ఇంధనాల్లో వీటి వాటా 41శాతం. అందులోనూ పవన విద్యుత్తు 11శాతానికే పరిమితమైంది. సౌర విద్యుత్తు తరవాత చౌకగా లభ్యమయ్యేది పవన విద్యుత్తే. థర్మల్ విద్యుత్తు కంటే దీన్ని సుమారు 35శాతం తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు.ప్రపంచవ్యాప్తంగా భారత్ పవన విద్యుత్తు తయారీలో నాలుగో స్థానం(42.87 గిగావాట్లు)లో ఉంది. మొదటి స్థానంలో చైనా 288.32 గిగావాట్లు, తరవాతి స్థానాల్లో వరుసగా అమెరికా (122.32 గిగావాట్లు), జర్మనీ (62.85 గిగావాట్లు) ఉన్నాయి. డెన్మార్క్ తన విద్యుత్తు అవసరాలన్నింటికీ పూర్తిస్థాయిలో పవనశక్తినే ఉపయోగిస్తోంది. భారతదేశానికి మూడు వైపులా సుమారు 7,600 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. నేషనల్ విండ్‌పవర్ కార్పొరేషన్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త నివేదిక ప్రకారం..సముద్ర తీరాల వద్ద సుమారు 300 గిగావాట్ల సామర్థ్యంతో, ఇతర ప్రాంతాల్లో 195 గిగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన పునరుద్ధరణ ఇంధన వనరుల విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పవనశక్తి ద్వారా 140 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించాలని నిర్ణయించింది. కానీ, నేటికీ పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 42.87 గిగావాట్లకే పరిమితమైంది.రాష్ట్రాలవారీగా పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యంతమిళనాడు 9.62 గిగావాట్లుగుజరాత్ 8.58మహారాష్ట్ర 5.1కర్ణాటక 4.98రాజస్థాన్ 4.34ఆంధ్రప్రదేశ్ 4.11తెలంగాణ 0.12 గిగావాట్లపునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌరశక్తి కూడా ప్రధానపాత్ర పోషిస్తోంది. పవన విద్యుత్తు, సౌరశక్తి మధ్య ప్రధాన తేడాలు గమనిస్తే..సౌరశక్తి పగటిపూటే లభ్యమవుతుంది. విద్యుత్తు వినియోగం మాత్రం రాత్రి వేళల్లో ఎక్కువగానే ఉంటుంది. దాంతో గ్రిడ్ స్థిరత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్యాటరీ నిల్వల ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ, ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పవనశక్తి లభ్యత రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తులను సమ్మిళితం చేయడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
పైకప్పుపై ‘పవర్’..! ఫుల్..!!
ఏ ఇంటికై నా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు స్వయంగా విద్యుత్‌ని ఉత్పత్తి చేసుకుంటే కరెంటు బిల్లు బెడద లేకుండా హాయిగా ఉండొచ్చు. కేవలం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడమే కాదు.. మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్రం సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోంది. సోలార్ విద్యుత్ తయారీకి సబ్సిడీ, రుణ సదుపాయం కల్పించింది. ఆసక్తిదారులు ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించింది. మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’ యాప్‌ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల కరెంటు బిల్లు కాపీని జతపరచాలి.తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. తదుపరి ట్రాన్స్‌కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలో వాట్‌కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కల్పించనున్నారు. చివరగా ఇంటి రూఫ్‌పై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో ‘నెట్ మీటర్’ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తి.. వినియోగదారుడు వాడుతున్న వి ద్యుత్ని గణిస్తారు. ఈపీడీసీఎల్లోని విశాఖపట్నం సర్కిల్లో ఇప్పటి వరకు 452 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.రూ.78 వేల వరకు సబ్సిడీ..కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్‌లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్‌లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.30 రోజుల్లో రాయితీ..నెట్ మీటర్ అమర్చిన తరువాత వినియోగదారులు ‘పోర్టల్’లో బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చెయ్యాలి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోనే వినియోగదారుడికి చెల్లిస్తుంది. ఒక కిలో వాట్ రూఫ్ టాప్ కెపాసిటీ కోసం 3–4 ప్యానల్స్ (1 మీటరు వెడల్పు – 1.6 మీటర్ల ఎత్తు)ని అమర్చనున్నారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్ నెలకు దాదాపు 125 పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ సూర్యరశ్మిని నిలిపేసుకోవడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వినియోగదారుడు పెట్టిన పెట్టుబడి ఆరు నుంచి ఏడేళ్లలో తిరిగి పొందగలరని అధికారులు చెబుతున్నారు.సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు..– దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి.– వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.– సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి.– దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.– పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.– దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే అనర్హులు.– దరఖాస్తుదారు దగ్గర అవసరమైన సరైన పత్రాలు ఉండాలి.– దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..వినియోగదారులే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చూసే ‘సూర్యఘర్’ అద్భుతమైన పథకం. సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ, రుణ సదుపాయం కల్పిస్తోంది. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ మీటర్ విధానం ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.. అందులో ఎంత మేర వినియోగిస్తున్నాం అనే వివరాలు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. సందేహాలుంటే ట్రాన్స్‌కో అధికారులతో నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.దరఖాస్తు చేసేందుకు అవసరమైన పత్రాలు..– ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రం– విద్యుత్ బిల్లు బ్యాంకు పాస్ బుక్– పాస్‌పోర్ట్ సైజు ఫొటో రేషన్ కార్డు– మొబైల్ నంబర్ అఫిడవిట్– ఆదాయ ధ్రువీవీకరణ పత్రం – ఎల్.మహేంద్రనాథ్, ఈపీడీసీఎల్ ఎస్ఈ -
విద్యుత్ సరఫరాలో అంతరాయం.. పరిష్కారం దిశగా ప్రభుత్వం
సంప్రదాయేతర విధానాలతో కరెంటు ఉత్పత్తి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిసమయంలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం ఛార్జీల చెల్లింపులో గతంలోనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని భారీ పరిశ్రమలకు అమలు చేస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి గృహవినియోగదారులకు దీన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.భారత్‌లో అత్యధిక భాగం థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి కరెంట్ తయారవుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండిచడంతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దాంతో సంప్రదాయేతర విధానాల్లో కరెంట్‌ను తయారీని పెంచుతూ క్రమంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. కానీ అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలను భర్తీ చేసేంత కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. అందుకు తగ్గట్టు ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలాలకు అనుగుణంగా, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం నిత్యం మారుతుంటోంది. కానీ ఉత్పత్తి ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నపుడు కరెంట్‌ను పెద్దమొత్తంలో స్టోర్చేసే మార్గాలులేవు. దాంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో వ్యత్యాసం వచ్చినపుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్) విఫలమయ్యే ప్రమాదం ఉంది.అధిక ఖర్చులు..సంప్రదాయేతర కరెంట్ తయారీలో సౌరవిద్యుత్ ప్రధానమైంది. ఇది పగటిపూట ఎక్కువగా అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. అవి గ్రిడ్‌కు అనుసంధానం అయినప్పటికీ వాటిద్వారా వెంటనే విద్యుత్ తయారీ సాధ్యం అవ్వకపోవచ్చు. దాంతో కాలుష్యం ఏర్పడుతోందని తెలుస్తున్నా థర్మల్ విద్యుత్వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ విద్యుత్ తయారీ పెంచడానికి కొంత సమయం పడుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ కరెంట్‌ను బ్యాటరీల్లో నిల్వ ఉంచితే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొంది. ఈ క్రమంలో గ్రిడ్ వైఫల్యం చెందకుండా చూసుకోవడం సవాలుగా మారుతోంది.జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దాంతో రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్ ఎక్కువ వృథా అవుతోంది. పగటిపూట లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్లు కరెంట్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని గతంలో సవరించింది. ఇందులో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చింది. రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.ఈ సవరణల్లో భాగంగా పగలు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయనుంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్ మీటర్లను బిగించాల్సి ఉంటుంది. -
‘సెకీ’ విద్యుత్ చౌక
సాక్షి, అమరావతి: కరెంటు కోసం అర్ధరాత్రి వేళ పొలాల్లో పడిగాపులు కాస్తూ, రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది.ఇందుకోసం ప్రైవేటు రంగం నుంచి కాకుండా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని వ్యవసాయానికి అందించాలని సంకల్పించింది. ఇలా సెకీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్ అత్యంత చౌకగా వస్తోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదు2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీ ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం ఏడాదికి 7 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒప్పందంలో ఒక భాగస్వామిగా ఉండటం వల్ల చెల్లింపులకు ఎటువంటి ఆటంకం కలగదు. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. సెకీ విద్యుత్ అతి తక్కువకు యూనిట్ రూ.2.49 కు వస్తోంది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) యూనిట్ రూ.2.79 కన్నా ఇది తక్కువ. ఈ లెక్కన సెకీ ఒప్పందంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతుంది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ చార్జీల నుంచి కూడా రాష్ట్రానికి మినహాయింపు వస్తుంది.అదే రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌కు పాతికేళ్ల పాటు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. దీనికి కూడా కేంద్రం మినహాయింపునిచ్చింది. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా తీసుకున్నప్పుడు అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది. టీడీపీ వల్లనే నష్టంచంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, వైఎస్ జగన్ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు అసలు పొంతనే లేదు. చంద్రబాబు హయాంలో సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44 కు లభిస్తుంటే (బాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) చంద్రబాబు ఏకంగా యూనిట్‌కు రూ.8.90 వెచ్చించారు. పవన విద్యుత్ యూనిట్‌కు రూ.4.84 వరకు అధిక ధర చెల్లించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు కుదుర్చుకున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఇదే సెకీ నుంచి యూనిట్‌కు రూ.4.57తో గాలివీడులో 400 మెగావాట్లు, మైలవరంలో యూనిట్‌కు రూ.2.77 చొప్పున మరో 750 మెగావాట్లను కొనుగోలు చేసింది. ఇలా చంద్రబాబు హయాంలో మొత్తం దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల డిస్కంలపై ఏడాదికి రూ.3,500 కోట్ల భారం పడింది. ఈ భారాన్ని 25 ఏళ్ల పాటు మోయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే గత ఐదేళ్లుగా సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు ‘సెకీ’తో ఒప్పందం కారణంగా బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12 కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.49 కొనవచ్చు. ఫలితంగా డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. -
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్‌ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్‌లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్.. లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో రూ.78వేలు..?
సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దాని అమలుదిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది. ఈ మేరకు లబ్ధిదారులు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.78వేలు ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువరించనున్నట్లు సమాచారం. పీఎం సూర్య ఘర్ పథకాన్ని రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని గతంలోనే తెలియజేశారు. ఇదీ చదవండి: వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే.. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హైడ్రో పవర్‌పై సింగరేణి ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బొగ్గు ఉత్పత్తితో మొదలైన సింగరేణి సంస్థ ఇప్పుడు తన పరిధి ని విస్తరిస్తోంది. ఇప్పటికే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ మరో యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అందుబాటులో ఉన్న వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా సోలార్ –హైడ్రో పవర్‌పై కూడా దృష్టి పెట్టింది. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని 11 ఏరి యాల్లో విస్తరించి ఉంది. సంస్థ ఆధీనంలో 24 అండర్ గ్రౌండ్ మైన్లు, 19 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఈ 11 ఏరియాల పరిధిలో గత కొన్నేళ్లుగా సింగరేణి సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పుతోంది. ప్రస్తుతం సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 220 మెగావాట్లుగా ఉంది. మరికొన్ని నెలల్లో మరో 70 మెగావాట్ల యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకో 200 మెగావాట్ల ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే టెండర్లు ఆహా్వనించింది. 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తే సింగరేణి సంస్థ వాయు కాలుష్యం విషయంలో నెట్ జీరో సంస్థగా అవతరిస్తుంది. ఇక్కడితో ఆగకుండా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యంగా సింగరేణి అడుగులు వేస్తోంది. సోలార్ ‘డిమాండ్’ సోలార్ విద్యుత్ పగటి వేళలోనే ఉత్పత్తి అవుతుంది. సహజంగా ఆ సమయంలో విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ ఉండే డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మార్గాలపై ఇటీవల సింగరేణి ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీని ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. తద్వారా సింగరేణి సంస్థకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సోలార్ పవర్ ద్వారా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సోలార్ టూ హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ టెక్నాలజీలో నేల మట్టానికి దిగువ స్థాయిలో ఉన్న నీటిని మోటార్ల సాయంతో పైకి తోడుతారు. తిరిగి అదే నీటిని కిందకు వదులుతారు. నీరు కిందికి వెళ్లే మార్గంలో టర్బైన్లు ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ విధానంలో చాలా విద్యుత్ కేంద్రాలు పని చేస్తున్నాయి. అందుబాటులోకి గ్రీన్ ఎనర్జీ.. పగటి వేళ అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ఉన్న నీటిని తోడి పై భాగంలో ఉన్న రిజర్వాయర్‌లో నింపుతారు. సాయంత్రం వేళ పీక్ అవర్స్‌లో విద్యుత్ డిమాండ్ ఉండే సమయంలో పైనున్న రిజర్వాయర్‌లో ఉండే నీటిని కిందికి పంపడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానంలో నీటిని తోడేందుకు ఉపయోగించిన సోలార్ విద్యుత్‌లో 80 శాతం తిరిగి ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం విధానంలో కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. వనరులపై దృష్టి.. ఓపెన్ కాస్ట్ విధానంలో నేలలో నిక్షిప్తమైన బొగ్గు కోసం భూమి పై పొరలను రెండు వందల మీటర్లకు పైగా తొలగిస్తారు. దీంతో భారీ గోతులు ఏర్పడుతాయి. ఇందులో సహజ నీటి ఊటలతో పాటు వర్షపు నీరు భారీగా చేరుకుంటుంది. బొగ్గు ఉత్పత్తి సమయంలో ఈ నీటిని ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా తోడేస్తారు. ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత భారీ గోతులు, నీరు అక్కడే నిలిచి ఉంటాయి. ఇలా భారీగా నీరు నిల్వ ఉన్న ఓపెన్‌కాస్ట్ గనులు ఎక్కడ ఉన్నాయి.. ఈ మైన్స్‌కు సమీపంలో ఉపరితలంపై భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించేందుకు అనువైన ఓపెన్‌కాస్ట్‌లు ఎక్కడున్నాయనే అంశంపై సింగరేణి దృష్టి సారించింది. -
‘90 శాతం ఉచిత విద్యుత్ ఇచ్చాం’.. మంత్రి వెల్లడి
రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 2023లో ప్రభుత్వం 90 శాతం ఉచిత విద్యుత్‌ను అందించినట్లు పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినప్పటి నుంచి ప్రతినెలా గృహాల్లో సరాసరి 300 యూనిట్లకు బదులు 600 యూనిట్ల కరెంట్ అధికంగా సరఫరా అవుతుందన్నారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,873 కోట్లతో పంపిణీ వ్యవస్థలను పునరుద్ధరించినట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇతర సంస్థలతో పవర్‌పర్చేజ్ అగ్రిమెంట్లపై సంతకం చేసిందని చెప్పారు. దాంతో 1,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పంజాబ్ 2023లో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు అయింది. గరిష్ఠంగా జూన్ 23, 2023న 15,293 మెగావాట్ల విద్యుత్ అవసరమైనట్లు తెలిసింది. -
త్వరలో 1.47 లక్షల మందికి ఉపాధి.. ఎలాగంటే..?
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. పసుపురంగు పార్టీ నేతలు పనికిమాలిన, అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆర్భాటాలకు తావులేకుండా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందని ఆ ‘ఎల్లో’ నేతలకు చెంపపెట్టులా ఉన్న ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి. అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్‌లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? సెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
సోలార్‌పవర్‌తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్‌ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్‌ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్‌కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్‌ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్‌లోనే... జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్‌కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్‌లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్‌కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
సాగుకు పగలు మాత్రమే విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని.. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటివేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటివేళల్లో ఎక్కువ డిమాండ్ ఉంటే సౌర, పవన విద్యుత్‌తో తీర్చవచ్చ ని వివరించింది. ఈ నెల 1న దేశంలో పగటిపూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు (ఒక గిగావాట్ అంటే వెయ్యి మెగావాట్లకు సమానం) పెరిగిపోయినా తీర్చడం సాధ్యమైందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొ రత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈ నెల 1న ఆ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని.. అందువల్ల వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగటివేళలకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఈ నెల 5న అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆ లేఖలోని వివరాల మేరకు.. 23 శాతం పెరిగిన డిమాండ్ దేశంలో ఆగస్టులో 23 శాతం డిమాండ్ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఆ నెలలో ఏడు రోజులపాటు రోజువారీగా 5 బిలియన్ యూ నిట్లకుపైగా విద్యుత్ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్ 220 గిగావాట్లకుపైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రివేళల్లో డిమాండ్‌తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మి.యూనిట్ల కొరత ఏర్పడింది. రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30–32 గిగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. దక్షిణాదిలోనే కొరత అధికం దేశవ్యాప్తంగా చూస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జలవిద్యుదుత్పత్తి జరగగా.. ఈసారి 40 గిగావాట్లలోపే ఉండటం గమనార్హం. జూన్–సెపె్టంబర్ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉండగా.. 2–3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలుండగా.. గ్యాస్ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. విద్యుత్ డిమాండ్ తీర్చడానికి కేంద్రం సూచించిన చర్యలివీ.. ♦ విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తిచేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలి. ♦ షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలి. ♦ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విడిభాగాలను ముందుగానే సమీకరించి పెట్టు కోవాలి. ళీ నాణ్యత లేని బొగ్గు, యాష్ పాండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగక.. 12–14 గిగావాట్ల విద్యుత్ లభ్యత లేకుండా పోయింది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరిగేలా చూడాలి. ♦ ఈ నెల 1న జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్నిరాష్ట్రాల జెన్కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకో వాలి. ళీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్‌ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే.. ఆ విద్యుత్‌ను పవర్ ఎక్స్చేంజి ల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలి. ♦ డిమాండ్ అధికంగా ఉండే వేళల్లో, రాత్రివేళల్లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. ♦ నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలి. -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోలార్ పవర్ ఉత్పత్తికి కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది. సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇవీ నిబంధనలు ♦ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్‌టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ♦ ఇంటరాక్టివ్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది. ♦ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి. ♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్వర్క్ నుంచి సోలార్ నెట్‌వర్క్‌ను డిస్కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి. ♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్‌ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు. -
కేజీహెచ్‌లో సోలార్ పవర్ ప్లాంట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/గాజువాక: కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమక్షంలో కేజీహెచ్‌లోని సీఎస్ఆర్ బ్లాక్ రూఫ్ టాప్‌లో సౌర విద్యుత్‌ను ఇన్స్టాలేషన్ చేయడానికి ఎంవోయూ జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వైజాగ్ అసెట్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ ద్వారా కేజీహెచ్‌లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ హెడ్, హెచ్ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. రూ.670 కోట్లతో 1,125 పీహెచ్‌సీల ఆధునికీకరణ రాష్ట్రంలోని 1,125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.670 కోట్లతో ఆధునికీకరించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన కణితి పీహెచ్సీ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామన్నారు. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం జగనన్న ప్రభుత్వం రూ.1,223 కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రూ.8,500 కోట్లను ఖర్చు చేస్తున్నారన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం రూ.3,820 కోట్లు కేటాయించామని తెలిపారు. -
బాల్కనీ ఉంటే చాలు.. సోలార్ పవర్ పొందొచ్చిలా..
సౌరవిద్యుత్తు వాడుక ఇప్పుడిప్పుడే వ్యాప్తిలోకి వస్తోంది. ఇంటికి సౌరవిద్యుత్తు అమర్చుకోవాలంటే, పైకప్పులో చాలాభాగం సౌరఫలకాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారికి ఇదంతా కుదిరే పనికాదు. అందువల్ల సౌరవిద్యుత్తుపై ఆసక్తి ఉన్నా, నగరాల్లో అపార్ట్మెంట్లలో ఉండే జనాలు సౌరవిద్యుత్తు జోలికి పోవడం లేదు. ఈ సమస్యను గమనించి, జపాన్‌కు చెందిన ‘ఇకో ఫ్లో’ బాల్కనీలో కూడా అమర్చుకోవడానికి వీలైన కాంపాక్ట్ పోర్టబుల్ సోలార్ పవర్ జెనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ జెనరేటర్‌తో పాటు ఉండే నాలుగు సౌరఫలకాలను బాల్కనీలో ఎండ సోకే ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. (ఇదీ చదవండి: మొదలైన కీవే ఎస్ఆర్250 డెలివరీలు.. మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్!) దీని ద్వారా ఏడాదికి దాదాపు 1040 కిలో వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే, ఒక ఇంటి అవసరాలకు ఈ విద్యుత్తు పూర్తిగా సరిపోతుంది. దీనిని అరగంట లోపే కోరుకున్న చోట అమర్చుకోవచ్చు. ఆరుబయట పిక్నిక్లకు తీసుకువెళ్లేందుకు కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. దీని ధర 2,049 పౌండ్లు (రూ.2.10 లక్షలు) మాత్రమే! -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది.