Sonia Akula
-
విన్నర్ గురించి చెప్పడం వేస్ట్
-
Bigg Boss 8 Telugu: సోనియా ఆకుల స్పెషల్ ఇంటర్వ్యూ
-
బిగ్‌బాస్‌ను వదిలిపెట్టనంటున్న సోనియా.. కొత్తగా ఏం చేసిందంటే?
బిగ్‌బాస్ షో వల్ల నెగెటివ్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే తాను కరెక్ట్‌గా ఉన్నానని.. కానీ, బిగ్‌బాసే తప్పుగా చూపించాడని ఫైర్ అయింది సోనియా ఆకుల. తన మాటల్ని, ప్రవర్తనని మరో కోణంలో ప్రేక్షకులకు చూపించాడని, అందువల్లే జనాలు తనను విమర్శిస్తున్నారంటోంది. ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం ఛాన్స్ దొరికినా బిగ్‌బాస్‌ను తిడుతూనే ఉంది. కొత్త యూట్యూబ్ ఛానల్..మితిమీరిన హగ్గులు, పర్సనల్ టార్గెట్ వంటి స్వయంకృతపరాధాలను సైతం ఒప్పుకోకపోవడం గమనార్హం. తాజాగా ఈ బిగ్‌బాస్ (ఎనిమిదో సీజన్) బ్యూటీ తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు వెల్లడించింది. సామాజిక సేవ నుంచి బిగ్‌బాస్ వరకు మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఒక్కటేం ఖర్మ.. అన్నీ ఉంటాయ్యువర్స్ సోనియా.. ఇక్కడ బిగ్‌బాస్ షోలో ఎపిసోడ్ వెనకాల జరిగిన స్టోరీలను, నా యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించిన కథనాలను, వ్యక్తిగత విషయాలను, లైఫ్‌స్టైల్ కంటెంట్.. ఇలా అన్నీ మీతో పంచుకుంటాను. అలాగే సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కచ్చితంగా సపోర్ట్ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిన్ను బిగ్‌బాస్‌లోనే చూడలేకపోయాం.. ఇంకా యూట్యూబ్‌లో ఏం చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్,అదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సోనియా
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సోనియా ఆకుల పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇదంతా ఆమె మాటల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక్కడ కూడా వైరల్ అవుతుంది.షో నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత ఆమె ఇప్పటికే బిగ్ బాస్ మీద కూడా పలు ఆరోపణలు చేసింది. తన మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి చూపించడమే కాకుండా.. తనను చాలా క్లోజప్ యాంగిల్స్‌లో ప్రేక్షకులకు చూపించారని తెలిపింది. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి మీద కేసు పెట్టినట్లు ఇంటర్వ్యూ ద్వారా సోనియా తెలిపింది. రివ్యూల పేరుతో తనను కించపరిచేలా చాలా ఎక్కువగా చేసినట్లు ఆదిరెడ్డిపై ఆమె ఫైర్ అయింది. అయితే, ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడంతో కేసు విషయంలో కాస్త తగ్గానని ఆమె తెలిపింది.'నా వల్ల నెలరోజుల పాటు రివ్యూవర్లు బాగా బతికారు.. నా గురించి వీడియోలు చేసుకుంటూ చాలామంది పంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో కూడా ఈ 30 రోజులు నా వల్లే రేటింగ్‌తో బతికింది. వాళ్లందరికీ ఇంతటి మంచి ఆదాయం ఇచ్చిన సంతోషం నాకు ఉంది. నా వల్ల సుమారు 40 మంది కొత్త యూట్యూబర్స్కు బతుకుదెరువు దొరికింది. నేను ఎక్కడున్నా తిండి పెట్టే పనిలోనే ఉంటా.' అంటూ సోనియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సోనియా కామెంట్లపై నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ షో గురించి అన్ని విషయాలు తెలిసే లోపలికి వెళ్లావ్ కదా అంటూ చెప్పుకొస్తున్నారు. గత సీజన్లలోని కొందరి కంటెస్టెంట్స్ పేర్లు గుర్తు చేస్తూ.. వారందరికంటే మరీ చెడ్డపేరు తెచ్చుకున్నావ్ అంటూ ఆమెపై మండి పడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెను కావాలనే బిగ్ బాస్ చెడుగా చూపించే ప్రయత్నం చేశాడంటూ తప్పుపడుతున్నారు. ఏదేమైనా తనపై ఎన్ని ట్రోల్స్ వస్తున్నా వాటిని దాటుకొను సోనియా ముందుకు వెళ్తుంది. ఇక్కడే ఆమె ఎంత బలమైనదో తెలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka) -
నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో గతవారం జరిగిన సోనియా ఆకుల ఎలిమినేషన్ అందరూ ఊహించింది మాత్రమే కాదు, ఎంతోమంది కోరుకుంది కూడా! ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి! బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా తొలిసారి తన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.నన్ను టార్గెట్ చేసిందిరియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలను నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు. నన్ను కావాలని బ్యాడ్ చేశాడు. నేను విష్ణుప్రియను టార్గెట్ చేశానంటున్నారు కానీ విష్ణుయే నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ విషయానికి వస్తే అతడు డిప్రెషన్లో ఉన్నాడు. నన్ను ఫ్యామిలీ అని భావించాడు. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు కదా అని సపోర్ట్ చేశాను. నా పెళ్లికి నిఖిల్‌కు చెయిన్, పృథ్వీకి ఇయర్ రింగ్స్ ఇస్తానని కూడా చెప్పాను. తప్పు చేయలేదునా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి చూపించడం తప్పు కదా.. నేను హౌస్‌లో ఏ తప్పూ చేయలేదు, బిగ్‌బాసే తప్పుగా చూపించాడు. సాధారణంగా బయట గైడెన్స్ ఎలా ఇస్తానో హౌస్‌లో కూడా అలాగే ఇచ్చాను. అందులో తప్పేముంది? నా సలహాలు తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్లిష్టం. బిగ్‌బాస్ హౌస్‌లో నేను నాలాగే ఉన్నాను. ఎక్కడా యాక్టింగ్ చేయలేదు. నిజాయితీ ఏమైపోయింది?ప్రతిచోటా గేమ్ గురించే మాట్లాడానే తప్ప ఎవరినీ పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. గేమ్‌లో నిఖిల్, పృథ్వీని మాత్రమే చూస్తే ఎలా? నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను. దీన్ని తప్పుగా చూపించారు. నాగార్జునగారు కూడా నావైపు నిలబడలేదు. ఇక్కడ నీ నిజాయితీ ఏమైపోయింది? అప్పుడు నాకు హౌస్‌లో ఉండాలనిపించలేదు.అందులో నిజం లేదుబిగ్బాస్ లైఫ్ షో అనుకున్నాను, కానీ అది తప్పని తెలుసుకున్నాను. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో నేను లవ్‌లో ఉన్నానని పుకారు లేపారు. అందులో నిజం లేదు. యష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆయన తండ్రి నాకోసం ఓటింగ్ క్యాంపెయిన్ కూడా చేశాడు అని సోనియా చెప్పుకొచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 4వ వారం విశ్లేషణ.. ఫోమ్‌తో ఫామ్‌లోకి వస్తే
బిగ్‌బాస్ 8వ సీజన్లో గడిచిన వారం(4వ) హౌస్‌లోని కంటెస్టెంట్స్ మనసులోని ముసుగులు తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్స్ పర్వంలో వాడాడు బిగ్‌బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్ధం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్ళీ ఫాంలోకి వచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)యధావిధిగా నామినేషన్స్ లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్స్ మధ్య పోటీగా నిర్వహించిన డిఫరెంట్ బెలున్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. ఒక్క నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారు ఆనందంగా ఉండటం చూసి బిగ్‌బాస్ తట్టుకోలేకపోయాడు. ఈ పోటీకి ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది, ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్‌బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడారు.ఇదంతా ఓ ఎత్తయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈమెని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు. హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా మిగతా లేడీ హౌస్మేట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఈ విషయం ఎలిమినేట్ అయిన తరువాత సోనియా నాగార్జునతో బాహటంగానే అందరిముందు చెప్పింది. కండబలం వున్నవారికి గుండెబలం తక్కువుంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్)సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్. ఇతడితో పాటు పృథ్వీ కూడా అదే తీరు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించాడు. వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని అన్నాడు.హౌస్‌లో ఉన్నవాళ్ళ నుంచి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఇంకొంతమందిని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్‌బాస్. ఏదేమైనప్పటికీ అటు బిగ్‌బాస్ ఇటు తెలుగు ప్రేక్షకులు ఒకింత సమానంగా ఆలోచిస్తారనుకోవచ్చేమో ఆలోచించండి.-ఇంటూరి హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్
బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్‌బాస్ బజ్‌లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన సోనియా.. కొన్నింటికి మాత్రం ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)హౌసులో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది అని అడగ్గా.. అభయ్, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది. నిఖిల్‌కి నీపై ఎలాంటి ఫీలింగ్ ఉందని అడగ్గా.. మా అన్నలాగా, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని సోనియా చెప్పింది. లోపల హౌసులో వాళ్లని ఏమారుస్తావేమో గానీ నన్ను వద్దులే అని అర్జున్ సైలెంట్‌గా సెటైర్ వేశాడు.పృథ్వీకి కోపమే మైనస్ అని తెలిసినా.. వాడిని మీరు ఓ ఆయుధంలా ఉపయోగించుకున్నారని మేం అంటున్నాం అని.. అలానే ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకుంటున్నారు గానీ వెనకుండి ఆట నడిపిస్తున్నారని ఆడియెన్స్‌కి తెలుసులే అని సోనియా బాగోతాలన్ని అర్జున్ బయటపెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి నాకేం తెలియదన్నట్లు కూర్చుంటారు 'కపటనాటక సూత్రధారి' అని సోనియాకి కొత్త పేరు పెట్టాడు.(ఇదీ చదవండి: మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?)ఆడపులి అని సోనియా తనకు తానే అనుకోవడంపైన కూడా అర్జున్ కౌంటర్ వేశాడు. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడతుంది, పిల్లిలా వెనకుండదని అన్నాడు. ఇక నిఖిల్-పృథ్వీ గురించి అర్జున్ మాట్లాడుతూ.. వాళ్లు బాధితులు, మీరు బాధపెట్టినోళ్లు కాబట్టి ముందు మీరు బయటకొచ్చేశారు అని అన్నాడు. దీంతో కోపమొచ్చినా సరే సోనియా ఆపుకొంది. చూద్దాం వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో? వాళ్లేం ఆట ఆడతారో చూద్దాం అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.ఇలా హౌసులో శివంగిలా చెలరేగిపోయింది గానీ ఇంటర్వ్యూలో మాత్రం పిల్లిలా అర్జున్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక సౌండ్ చేయలేకపోయింది. మిగతా వాటి సంగతేమో గానీ నిఖిల్, తనకు అన్నయ్య లాంటోడు అని సోనియా చెప్పడం మాత్రం విడ్డూరంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?
బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లా కనిపించింది. లా పాయింట్స్ చెబుతూ అవతలి వాళ్లని ఇరకాటంలో పెట్టింది.ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్లిపోయింది. యష్మి, మిగిలిన వాళ్లతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్కులు కూడా ఆడాలి అనే సంగతి మర్చిపోయింది. అలానే హౌసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. ఈమె మాత్రం ఎప్పుడు చూడు పృథ్వీ-నిఖిల్‌తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. అలా మిగిలిన వాళ్లందరికీ టార్గెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు. దీంతో ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కూడా బయటపెట్టాడు. లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది. కానీ అలా జరగలేదు.సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈమె వెళ్లిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్‌గా ఉంటుందనిపిస్తోంది. ఇదలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)Their Bond 💔 The way he said miss u machan in tears 🥺 ❤️Stay Strong Nikhil 💪#SoniyaAkula #NikhilMaliyakkal #Soniya #BiggBoss #BiggBossTelugu #BiggBossTelugu8 pic.twitter.com/OzPWuSSonx— GeethaRyder (@GeethaRyder) September 29, 2024 -
సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!
ఎంతోమంది బిగ్‌బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ముందే ఊహించిన సోనియాఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్‌కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతార టీమ్ గెలిచింది. సోనియా టాక్సిక్అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్‌లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత.. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్‌గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్.. నిఖిల్ సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్ చేస్తాడన్నాడు.కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్ యష్మి.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తర్వాత నాగ్ ప్రేరణను, ఆదిత్యను సేవ్ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్‌లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్.జైలుకు మణికంఠఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే!)నేనెవరికీ నచ్చనుస్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్.. సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్‌బాస్ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్ 5న) వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ తప్పే సోనియా కొంప ముంచింది! పారితోషికం లెక్కలివే!
తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్‌లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్ అయ్యింది. అందుకుగల కారణాలు చాలానే ఉన్నాయి.గ్రూప్ గేమ్ఈ సీజన్లో కెప్టెన్సీకి బదులుగా చీఫ్స్ ఉంటారని బిగ్‌బాస్ ముందే వెల్లడించాడు. షో మొదలైన రెండు రోజుల్లోనే ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్.. తన ఫ్రెండ్ యష్మిని చీఫ్‌గా సెలక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్దాంతమే చేసింది. గ్రూప్ గేమ్ అంటూ నింద వేసింది.. కట్ చేస్తే వారానికే నిఖిల్‌ను అతడి గ్రూపులో నుంచి వెలేసి తనతో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుంది.విష్ణుతో వైరంచిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తోనే ఎక్కువ ముచ్చట్లు పెడుతూ సోఫాలో సెటిలైపోయింది. వారితో ఆమె ప్రవర్తించిన తీరుకు జనాలు తలకు జండూభామ్ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్‌తో స్నేహం ఎలా కుదిరింది? అని విష్ణుప్రియ క్యాజువల్‌గా అడిగిన పాపానికి అడల్ట్రేటెడ్ కామెడీ అంటూ ఆమెను నిందించింది.మితిమీరిన హగ్గులుకట్ చేస్తే నిఖిల్‌తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి జనాలు చీదరించుకున్నారు. పైగా నిఖిల్‌ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం కూడా జనాలకు మింగుడుపడలేదు. ఈమె తన గేమ్ పాడుచేసుకోవడమే కాక నిఖిల్ గేమ్ కూడా చెడగొడుతోందని పేరు తెచ్చుకుంది. గేమ్‌లో వెనుకంజపైగా యష్మిని. ఎంతసేపూ నిఖిల్, పృథ్వీనే చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపూ ఆ ఇద్దరినే వెంటేసుకుని తిరుగుతే జనాలేమనుకుంటారోనని కాస్తైనా ఆలోచించకపోవడం గమనార్హం. టాస్కుల్లోనూ పెద్దగా ఆడింది లేదు, కానీ ఆడినంత బిల్డప్ ఇచ్చింది.పారితోషికం ఎంతంటే?ఆడపులి అన్న ట్యాగ్‌కు కాస్తయినా న్యాయం చేయలేదు. వెరసి నాలుగోవారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ నాలుగు వారాలకుగానూ సోనియా దాదాపు రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుకు మొట్టికాయలు.. సోనియా గ్యాంగ్‌కు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?గ్రూప్ గేమ్పైగా ఫైర్ బ్రాండ్లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు. సోనియా ఆట కూడా చెడగొట్టండితాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.బొట్టు ఒక్కటే తక్కువఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: సోనియా ఎలిమినేట్.. ఖుషీలో నిఖిల్ ఫ్యాన్స్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిందే 14 మంది కంటెస్టెంట్లు.. అందులో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడువారాలు అందరూ ఊహించి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా నాలుగోవారం మాత్రం ప్రేక్షకులు కోరుకున్న వ్యక్తి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారట!సోనియాకే తక్కువ ఓట్లుఈ వారం ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ శెట్టి, ప్రేరణ, నబీల్, నాగమణికంఠ నామినేషన్లో ఉన్నారు. వీరిలో పృథ్వి, ఆదిత్య, సోనియాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు భోగట్టా! ఈ ముగ్గురిలో కూడా సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి. సోనియా తానే పెద్ద తోపు అని ఫీలవ్వడమే కాక నిఖిల్, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడిస్తోంది. ఈ టాలెంట్ నచ్చకనే ఆపరేషన్ సోనియా పేరిట తనను ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కంకణం కట్టుకున్నారు.సీక్రెట్ రూమ్?అయితే తనవల్ల అంతోఇంతో కంటెంట్ వస్తోంది కాబట్టి ఆమెను పంపించేందుకు బిగ్‌బాస్ టీమ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చివరికి తనను ఎలిమినేట్ చేశారట! ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌లోకి పంపించే ఆస్కారం కూడా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు తిరిగి తనను హౌస్‌లోకి అడుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆమెను పెళ్లి చేసుకునేది నేను, నాకే ప్రాబ్లం లేదు: సోనియా ప్రియుడు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్లలో సోనియా మొదటిస్థానంలో ఉంటుంది. తన ఆట తీరు, మాట తీరు వల్ల విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మొదట్లో నిఖిల్‌ను గ్రూపిజం అంటూ పెద్దపెద్ద మాటలన్న ఆమె తర్వాత అతడినే తనవైపు తిప్పుకుంది. అటు పృథ్వీని సైతం తన చేతికింద పెట్టుకుని ఇద్దరిని తన గేమ్ కోసం అస్త్రంగా వాడుకుంటోంది.కావ్యతో బ్రేకప్?ఇక్కడ జనాలకు అర్థం కాని విషయాలు రెండున్నాయి. ఒకటి.. నిఖిల్‌కు ఆల్రెడీ నటి కావ్యతో బ్రేకప్ అయిందా? రెండు.. డిసెంబర్లో పెళ్లి పెట్టుకుని సోనియా.. అబ్బాయిలతో కాస్త అతి చనువుగా ప్రవర్తించడం! ఈ రెండు విషయాలపై సోనియా స్నేహితుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా సోనియా గురించి చెప్తూ.. ఆమె అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా ఏం చూపించదు. అందరితో ఒకేలా ఉంటుంది. బయటకు వచ్చాక తనపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనే షాకయ్యాను. నాకు ఏ ప్రాబ్లం లేదుఆమె కుటుంబాన్ని, కాబోయే భర్తను కలిశాను. అతడేమన్నాడంటే.. 'సోనియా ఎలాంటిదో మాకు తెలుసు. ఇంట్లో వాళ్లను సోదరుల్లా చూస్తుంది. అబ్బాయైనా, అమ్మాయైనా తనకు నచ్చితే అలా చేతులు పట్టుకునే మాట్లాడుతుంది. అందులో నెగెటివిటీ ఏం లేదు. ఆమెను పెళ్లి చేసుకోబోయేది నేను కదా.. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. తనపై ట్రోలింగ్‌ను పట్టించుకోను అని చెప్పాడు.బ్రేకప్ అంటూ ఏడ్చేశాడునిఖిల్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు వచ్చేముందే తనకు బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. హౌస్‌లో సీత బ్రేకప్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్.. తాను కూడా నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నానని, ఈమధ్యే బ్రేకప్ అయిందని చెప్పుకుంటూ ఏడ్చాడు. నిఖిల్ బ్రేకప్‌కు సోనియా కారణం కాదు అని పేర్కొన్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్ల ప్రతాపం.. మాట్లాడాలంటే భయమేస్తోందని ఏడ్చిన మణి
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీవైల్డ్కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు. చిల్లర గేమ్..దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది. బలవంతమైన త్యాగం!అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠఅయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు. ధైర్యం నూరిపోసిన నబీల్అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికి పట్టపగలే చుక్కలు.. నోరు మూసుకుంటా ప్లీజ్ అంటూ ఎమోషనల్
ఇప్పటిదాకా కంటెస్టెంట్లు తాము ఎలిమినేట్ కాకుండా మరిన్ని వారాలు హౌస్‌లో ఉండేందుకు ఆటాడారు. ఇప్పుడేమో బయట నుంచి వచ్చే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ పెట్టిన రెండు ఛాలెంజ్‌లలో కాంతార ఒకటి గెలిచి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కాస్తా 11కి తీసుకొచ్చింది. ఈ సంఖ్యను ఇంకా తగ్గించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్.లవ్ సాంగ్..పట్టుకుని ఉండు, పగిలిపోతుంది అని మూడో టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పృథ్వీ, నబీల్ హోరాహోరీగా పోరాడారు. చివరికి పృథ్వీ శక్తి టీమ్‌ను గెలిపించాడు. ఈ టాస్క్ మధ్యలో బిగ్‌బాస్.. పృథ్వీని ఓ పాట పాడమన్నాడు. అతడు లవ్ సాంగ్ పాడగా ఇది ఎవరికోసమో? అని నబీల్ అడిగాడు. అందుకు పృథ్వీ క్షణం ఆలోచించకుండా విష్ణుప్రియ పేరు చెప్పాడు. ఇంకేముంది.. ఆ మాటకు విష్ణు సిగ్గుపడుతూనే తెగ మురిసిపోయింది.త్యాగం చేయలేదన్న మణిమరో ప్రోమోలో గెలిచిన శక్తి టీమ్.. కాంతార టీమ్‌లో ఒకరిని తొలగించాలన్నాడు. అందుకు వాళ్లంతా స్ట్రాంగ్ ప్లేయర్ నబీల్ను సైడ్ చేశాడు. ఈ నిర్ణయం కాంతార టీమ్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలో పెద్ద రభసే జరిగింది. అసలు మీ టీమ్‌లో నుంచి మణిని ఎందుకు తీసేశారని ప్రేరణ అడగ్గా అతడే త్యాగం చేశాడని సోనియా అంది. అవునా? అని ప్రేరణ ప్రశ్నించగా లేదని మణి బోర్డు తిప్పేశాడు. నోరు మూసుకుని కూర్చుంటాదీంతో సోనియా, యష్మి.. అతడికి చుక్కలు చూపించారు. నీ అంతట నువ్వే తప్పుకుంటానన్నావ్, ఇప్పుడేమో మాట మారుస్తూ అందరినీ బ్యాడ్ చేస్తున్నావని ఫైర్ అయ్యారు. దీంతో మణి.. ఏదీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటా అని ఎమోషనల్ అవుతూ మైక్ నేలకేసి కొట్టాడు. నలుగురు కలిసి మణిపై ఎగబడటం చూసిన ప్రేరణ.. వారిని చెత్త ఫెల్లోస్ అని తిట్టింది. మరోవైపు సీత. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ గేమ్‌లో ఉండాలంది. నిజమే, కానీ ఆ మాటను ఎవరైనా పట్టించుకుంటారో? లేదో!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్ 8: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. కానీ అతడిపై వేటు?
బిగ్‌బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ పూర్తయ్యాయి. కొత్త చీఫ్‌ని కూడా ఎంపిక చేసేశారు. క్లాన్స్ (గ్రూపులు) కూడా డిసైడ్ అయిపోయాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్ ముద్దుబిడ్డ కోసం ఊహించని వ్యక్తిని ఇంటినుంచి పంపేస్తారనే టాక్ వినిపిస్తోంది.హౌసులో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఈసారి ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా, ఆదిత్య, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్‌లో నబీల్ టాప్‌లో కొనసాగుతున్నాడట. 35 శాతం మంది ఇతడు హౌసులో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే డేంజర్ జోన్లో దోస్తులు సోనియా-పృథ్వీ ఉన్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్)ప్రస్తుతం నిఖిల్ చీఫ్‌గా ఉన్న క్లాన్లోనే పృథ్వీ-సోనియా ఉన్నారు. గొడవల పడటం దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నింటిలోనూ వీళ్లిద్దరూ మంచి పోటీ ఇస్తున్నారు. అలానే సోనియా ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఎపిసోడ్లో వాటిని చూపించట్లేదు. అంటే ఈమె హౌస్‌లో ఉండాలని బిగ్‌బాస్ గట్టిగానే ఫిక్సయినట్లున్నాడు. పృథ్వీని కూడా పంపిస్తాడా అంటే డౌటే.ఇదంతా చూస్తుంటే ఈసారి ఆదిత్య ఓంపై వేటు పడుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే అతడు హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించట్లేదు. మిగతా వాళ్లతో సరిగా ఇంకా కలవలేకపోతున్నాడు. మరి ఈ వారం బిగ్‌బాస్.. ఓటింగ్‌లో చివర్లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఒకర్ని ఎలిమినేట్ చేస్తాడా.. ఆదిత్యని బలి ఇచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్
బిగ్‌బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓ వైపు ఉన్నోళ్లంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్‌కి ఎదురైంది. సోనియా వల్ల అతడికి చెడ్డపేరు రావడంతో పాటు నెగిటివిటీ కూడా మరింత ఎక్కువైపోతోంది. తాజా ప్రోమోలో ఇదే స్పష్టమైంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బండారం బయటపెట్టిన యష్మి.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు)బిగ్‌బాస్ 8లో ప్రస్తుతమున్న వాళ్లలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. శక్తి క్లాన్‌కి ఇతడు చీఫ్‌గానూ ఉన్నాడు. అలానే పెట్టిన ప్రతి గేమ్‌లోనూ పోటీ పడుతూ బెస్ట్ ఇస్తున్నాడు. ఇతడి కూడా ఉంటున్న సోనియా మాత్రం ఆడటం సంగతి పక్కనబెడితే అందరి మధ్య పుల్లలు పెడుతోంది. ఈమె చేస్తున్న పనివల్ల నిఖిల్‌కి చెడ్డ పేరు వస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లోనూ యష్మి-నిఖిల్ బంధం గురించి సోనియా మాట్లాడిన తీరు చాలా వరస్ట్. ఇదంతా అప్పుడు ఎవరూ చెప్పనప్పటికీ ఇప్పుడు బయటపెట్టారు.తాజాగా క్లాన్ కోసం జరిగిన పోటీల్లో గెలిచిన సీత.. కొత్త చీఫ్‌గా ఎంపికైంది. హౌస్‌లోని ఉన్నవాళ్లు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎప్పటిలానే నిఖిల్ చీఫ్‌గా ఉన్న శక్తి క్లాన్లోకి సోనియా, పృథ్వీ వెళ్లగా.. మిగిలిన వాళ్లందరూ సీత చీఫ్‌గా ఉన్న 'కాంతార' క్లాన్లోకి వెళ్లినట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే సోనియా చీప్ బిహేవియర్ ఆమెకు మాత్రమే కాదు నిఖిల్‌కి కూడా మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి) -
Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి
బిగ్‌బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ రచ్చనే సగం ఎపిసోడ్లో చూపించారు. ఈ క్రమంలోనే సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టగా.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనిపించింది. ఇంతకీ బిగ్‌బాస్‌లో 23వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.సోనియా బండారంనామినేషన్స్లో సోనిమా తీసిన పాయింట్స్.. యష్మికి ఎక్కడలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా నిఖిల్-పృథ్వీలనే నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడతుందని యష్మికి కౌంటర్‌గా సోనియా చెప్పింది. దీని వల్ల నామినేషన్స్ పూర్తయిన తర్వాత సోనియా-యష్మి గొడవపడుతూనే ఉన్నారు. 'నిఖిల్, పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితే మీరు మాట్లాడాలి' అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్‌గా మాటలు వదులుతుంటే నేను వంద మాట్లాడతా.. కానీ నేను అంత చీప్‌గా దిగజారను అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది.(ఇదీ చదవండి: తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?)యష్మి ఏడుపుఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్‌గా నువ్వు చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ.. గేమ్ పరంగా నేను చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి.. చేయి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావ్. మేము తప్పుగా మాట్లాడకూడదా.. అంటే ఎవరు హౌస్‌లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో.. నువ్వు వాళ్లకి సిస్టర్ కాదు మదర్ కాదు.. నీ ఇష్టమచ్చినట్లు వాళ్లని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.. ఈరోజు అది క్లియర్ అయింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది.నిఖిల్ ఓదార్పుసోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్లూ నీతో (నిఖిల్) మాట్లాడతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికొచ్చింది మాట్లాడుతుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరుకు తీసుకుని ఆమెని ఓదార్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)హర్ట్ బ్రేక్ చేశావ్ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి నిఖిల్-సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చేయి వేసి మరీ సోనియాకు నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఈమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావ్ అన్నది పాయింట్ కాదురా.. ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకు బతుకున్నావ్ అని, వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అని యష్మి అందని.. అయితే ఇవన్నీ నువ్వు వినను కూడా వినలేదని.. కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నీ వరకు నువ్వు కరెక్ట్‌గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావ్ అని నిఖిల్‌తో సోనియా అంది. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి దూరం పెరిగినట్లే అనిపిస్తోంది.కొత్త చీఫ్‌గా సీతఇక రాత్రంతా సోనియా-యష్మి గొడవ జరగ్గా.. ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్‌కి ఇప్పటికే నిఖిల్ ఉండగా.. కాంతార క్లాన్ చీఫ్‌గా ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరికి చీఫ్ అయ్యే అర్హత లేదే వాళ్ల బొమ్మ విరగ్గొట్టాలని, దీనికోసం బజర్ మోగినప్పుడు సుత్తిని పట్టుకుని.. దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. ఈ ప్రొసెస్‌లో చివరగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్‌కి చీఫ్‌గా బాధ్యతలు అందుకుంది. అయితే ఏ క్లాన్లో ఎవరెవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తెలుస్తోంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీప్ బిహేవియర్ బయటపడింది. అలానే యష్మి మంరింత స్ట్రాంగ్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
వాళ్లిద్దరినీ ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్.. సోనియాపై యష్మి ఫైర్
బిగ్‌బాస్ హోస్లో చీఫ్ పోస్ట్ పోయాక యష్మి ఆటలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్‌కు సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. అందులో యష్మి, సోనియాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవారం నామినేషన్ల తంతు రచ్చరచ్చ అయింది. ఒకరిపై మరోకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ముఖ్యంగా సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఈ గొడవలు ఇంతటితో క్లోజ్ అయ్యాయి అనుకుంటే.. మంగళవారం ఎపిసోడ్లో కూడా ఆ రచ్చ కొనసాగినట్లు ఉంది.సోనియాను యష్మి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. సిస్టర్, మదర్ అంటూ రిలేషన్స్ కలుపుతూ సోనియా గేమ్ ఆడుతుందని యష్మి ఫైర్ అయింది. ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాపై మండిపడింది. టాస్క్‌లలో పృథ్వి, నిఖిల్ ఇద్దరూ సోనియాకు హెల్ప్ చేస్తున్నారనేలా యష్మి మాట్లాడింది. దీంతో సోనియా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే మంగళవారం ఎపిసోడ్ రసవత్తరంగా ఉండేలా ఉంది. -
ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా
చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట.. నామినేషన్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఆదిత్యపై సోనియా సెటైర్లుఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం.. పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కనపెట్టి గుసగుసలు పెడుతున్నావ్, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావ్ కానీ ఫెయిలయ్యావ్ అని వెటకారంగా మాట్లాడింది.గొంతు పెంచితే తప్పా?నైనిక.. నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నబీల్ వంతురాగా.. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్, పృథ్వీ నామీదకు దూసుకురావడమేంటోనని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్ సోనియా బాడీగార్డుల్లా నబీల్‌పై ఎగబడటం గమనార్హం. వెన్నుపోటు..తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదేపదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ.. నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. మనిషిగా కూడా ఫెయిల్ సోనియా వంతురాగా.. సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అని నబీల్ను నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు, ఫేక్ కదా అని కౌంటరిచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లులేవు. ఈ వారం వెళ్తానని మీరు ఫిక్సయ్యారు కాబట్టి ప్లీజ్, వెళ్లిపోండి అని నామినేట్ చేసింది.బొమ్మరిల్లు సిద్దు సీన్ రిపీట్నాగమణికంఠ వంతురాగా.. నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్‌లా ఎక్కువ గైడ్ చేసేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్దార్థ్లా క్లాసు పీకాడు. విష్ణుప్రియ.. నిన్నొకరు(పృథ్వీ) బూతు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్నుకాదని నాకు తెలుసు.. నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుటున్నావని అసలు విషయం బయటపెట్టింది. నేను వీక్ కాదు: మణిపృథ్వీ.. నబీల్, నాగమణికంఠను; సీత.. ప్రేరణ, మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయండని చెప్పి బయటకు వెళ్లిపోయేవాడిని అని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ.. నిఖిల్, పృథ్విని ఆయుధంలా వాడుకుంటున్నావ్, ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఎవర్ని కొడతానో తెలీదుఅందుకు సోనియా.. నేను అందరికంటే అగ్రెసివ్.. నేను గ్రౌండ్లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందున అతడికి ఒకర్ని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'మా కూతుర్ని బద్నాం చేయొద్దు, తనకు పెళ్లి ఫిక్సయింది'
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ ప్రారంభమైన మొదట్లో తనలోని ఫైర్ చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాల్సింది అని అంతా అనుకున్నారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే తన వైఖరికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అంతలోనే ఆమె గాడి తప్పింది. నిఖిల్, పృథ్వీల దోస్తాన్‌తో ఎక్కువ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. మితిమీరిన హగ్గుల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ ట్రోలింగ్‌పై సోనియా పేరెంట్స్ మల్లీశ్వరి- చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పేరు కూడా పోతుందేమోనని..ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మాయి బాగా ఆడుతోంది. అయినా తననే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది. తను సంపాదించుకున్న పేరుతో సినిమా అవకాశాలు వచ్చాయి. అలా బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. కానీ ఈ ట్రోలింగ్ చూస్తుంటే.. తను సంపాదించిన మంచి పేరు పోతుందేమోనని బాధగా ఉంది.అందుకే ఆ ఇద్దరితో అంత చనువుఆమె నిఖిల్, పృథ్వీని పెద్దోడు, చిన్నోడు అని పిలిచింది. అంటే ఇద్దరినీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలా ఫీలైంది. అందుకే వారితో అంత చనువుగా ఉంటోంది. దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తను బిగ్‌బాస్ కప్పు గెలుస్తుందన్న నమ్మకముంది. ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్లు హౌస్‌లో ఉన్న మిగతా అమ్మాయిలు కూడా నా కూతురి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు కనీసం నిఖిల్, పృథ్వీ అయినా అన్నలా తోడున్నందుకు సంతోషంగా ఉంది. తన ఆటతో మున్ముందు అందరి నోళ్లు మూయిస్తుంది.సోనియా పెళ్లి ఫిక్స్సోనియాకు లవ్ ఎఫైర్స్ లేవు. ఆల్రెడీ పెళ్లి ఫిక్సయిపోయింది. డిసెంబర్లోనే వివాహం.. తనకు కాబోయే అత్తామామల అంగీకారంతోనే బిగ్‌బాస్ షోకి వెళ్లింది. త్వరలో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంత బద్నాం చేయొద్దు. తను ఐదుగురు అనాథ చిన్నారులను చదివిస్తోంది. ఇంకా 50 మంది అనాథలను చదివించాలన్నదే ఆమె ధ్యేయం. వారికోసమే తను తపిస్తోంది. అది అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియాకు బ్రేకప్ చెప్పిన నిఖిల్.. అటు విష్ణుప్రియ..
రెడ్ కార్డ్, సీరియస్ వార్నింగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ నిన్న హీటెక్కింది. ఈ వాతావరణాన్ని కూల్ చేసేందుకు నాగ్ సండే రోజు కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్ ఆడించాడు. అటు హౌస్మేట్స్ కూడా సినిమా పాటలకు అద్భుతమైన పర్ఫామెన్స్తో అల్లాడించారు.హార్ట్ బ్రేక్అలాగే సెట్, కట్ గేమ్ ఆడించారు. హౌస్‌లో సెట్ అయ్యేవాళ్లకు హార్ట్, సెట్ అవని వాళ్లకు బ్రేక్ చేసిన హార్ట్ ఇవ్వమన్నాడు. దీంతో నిఖిల్.. పృథ్వీ సెట్ అని.. సోనియా తెలిసో తెలియకో కొన్ని మాటలు అనేస్తుందని, దానివల్ల హార్ట్ బ్రేక్ అవుతుందన్నాడు.సీతతో సెట్..మణికంఠ.. తన ఫ్రెండ్ నిఖిల్‌తో కట్, సోనియాతో సెట్ అని చెప్పాడు. విష్ణుప్రియ తనకు సీతతో సెట్టయిందని చెప్పింది. మంచి ఫ్రెండ్స్‌లా కనిపించే విష్ణుప్రియ, పృథ్వీ ఒకరికొకరు కటీఫ్ చెప్పుకోవడం గమనార్హం. యష్మి సెట్ అయిపోందంటూ ఆమెకు హార్ట్ సింబల్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి