West Godavari District News
-
67,793 మంది పట్టభద్రుల నమోదు
భీమవరం(ప్రకాశం చౌక్): పట్టభద్రుల ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని క లెక్టర్ నాగరాణి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావ జిల్లాల పట్టభద్రుల ని యోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై ఆమె సమీక్షించారు. జాబితాపై అభ్యంతరాలు ంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, ఈనెల 6వ తేదీతో ఫారం–18, 19 స్వీకరణ గడువు ముగిసిందన్నారు. ఈనెల 20న డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ, 23న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటన, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు క్లయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వివరించారు. జిల్లాలో 67,793 మంది ఓటుకు నమోదు చేసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం అదనంగా 25 కేంద్రాలు అవసరం ఉంటుందన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నిందితులకు రాజకీయ అండ
చాట్రాయి : మండలంలోని పోతనపల్లికి చెందిన వై ఎస్సార్ సీపీ కార్యకర్త కాణంగుల చందూపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపర్చి మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిందితులకు రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చర్య లు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నా రు. ఈనెల 15న మంకొల్లుకి చెందిన టీడీపీ కార్య కర్తలు బి.మధు, మరో నలుగురు కలిసి చందూపై రాడ్లతో దాడి చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి వాంగ్మూలం తీసుకుని 108లో చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. అక్క డి నుంచి మెరుగైన వైద్యం కోసం చందూను ఏలూ రు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం బాధితుడు ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. నిందితులు గ్రామంలో తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీని పై ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా కేసు న మోదు చేశామని, ఆస్పత్రి నుంచి బాధితుడి మెడికల్ రిపోర్ట్ రాలేదని వచ్చిన తర్వాత నిందితులను రిమాండ్‌కు పంపిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణుల దాడి పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు -
రక్తనిధి కేంద్రం ప్రారంభం
భీమవరం అర్భన్: రక్తనిధి కేంద్రాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్, కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మండలంలోని రాయలం గ్రామంలో సోమవారం నూతన రక్తనిధి కేంద్రాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డితో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ నిధులు రూ.2.50 కోట్లతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటుచేశారన్నారు. దీంతో జిల్లాలో మొత్తం మూడు బ్లడ్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ 59 రక్తనిధి కేంద్రాలు ఏ ర్పాటుచేయగా రాష్ట్రంలో 18 ఉన్నాయన్నారు. త్వరలో రూ.60 లక్షల విలువైన మొబైల్ బ్లడ్ డోనార్ వాహనాన్ని జిల్లాకు సమకూరుస్తామనఆనరు. భీమవరం శాఖ చైర్మన్ ఎంఎస్‌వీఎస్ బద్రిరాజు, కోళ్ల నాగేశ్వరరావు, సోమరాజు, చె రుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. -
ఆశావర్కర్ల నిరసన గళం
భీమవరం(ప్రకాశం చౌక్): కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రూపు బీమా, నాణ్యమైన ఫోన్స్, యూ నిఫాం, సెలవులు తదితర డిమాండ్లపై ఆశావర్కర్లు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవార భారీ ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో తమ సమస్యలపై అధికారులు చర్చించి రాతపూర్వకమైన హామీ ఇచ్చారని, అయితే వాటిని అమలు చేయడం లేదన్నారు. తమపై పని ఒత్తిడి, రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని, కొన్ని చోట్ల పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో జిల్లా వైద్యశాఖాధికారుల సమక్షంలో జరిగిన స మావేశంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులోనూ తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. వీహెచ్ఎస్ఎన్సీ కమిటీల ద్వారా ఆశావర్కర్ల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ లక్ష్మి, జిల్లా సెక్రటరీ డి.జ్యోతి తదితరులు నాయకత్వం వహించారు. జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు తరలివచ్చారు. -
నరసాపురం డీఎస్పీగా శ్రీవేద
నరసాపురం: నరసాపురం డీఎస్పీగా డాక్టర్ డి.శ్రీవేద సోమ వారం బాధ్యతలు చేపట్టారు. 2022 బ్యాచ్‌కు చెందిన ఆమె అనంతపురం పోలీసు శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌లో ఇక్కడ నియమితులయ్యారు. శ్రీకాకుళంకు చెందిన ఆమె తండ్రి సూర్యప్రకాశరావు ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. గతంలో ఏలూరు రేంజ్ డీఐజీగా కూడా పనిచేశారు. శ్రీవేద డెంటల్ సర్జన్‌గా వైద్య వృత్తిని కొనసాగించి గ్రూప్స్ ద్వారా పోలీసు శాఖకు ఎంపికయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మా ట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తానన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్య నివారణ, అసాంఘిక కార్యక్రమాల అదుపునకు ప్రాధాన్యమిస్తామన్నారు. డివిజన్లోని సీఐలు, ఎస్సైలు ఆమెను కలిసి అభినందించారు. ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారు? భీమవరం అర్బన్: ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు ఇచ్చిన హా మీని వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. మండలంలోని గూట్లపాడులో సోమవారం ఇళ్ల స్థలాలపై ధర్నా చేశారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, తక్కువ ధరకే ఐరన్, సిమెంట్, ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు అధికారం చేపట్టి ఐదు నెలలు కావస్తున్నా నివేశన స్థలాలు, గృహ నిర్మాణంపై కార్యాచరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. హామీ అమలు చేయకుంటే ఉద్యమానికీ వెనుకాడబోమని హె చ్చరించారు. రూరల్ మండల కార్యదర్శి ఎం. సీతారాంప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు తిరుమాని కామేశ్వరరావు, తిరుమాని కామేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. మద్యం దుకాణంతో మూడు గ్రామాలకు ఇబ్బందులు కై కలూరు: మద్యం దుకాణం ఏర్పాటుతో మూ డు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారంటూ సోమవారం వదర్లపాడు గ్రామంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వదర్లపాడు శ్మశాన వాటిక సమీపంలో రైస్‌మిల్లు వద్ద మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా సర్పంచ్ వడుపు లక్ష్మీ నాగదేవి ఆధ్వర్యంలో ని రసన తెలిపారు. వదర్లపాడు, నరసాయిపాలెం, శీతనపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతారని, ఇటుగా విద్యార్థులు పాఠశాలలకు వెళతారన్నారు. సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయన్నారు. విషయం తెలిసిన కై కలూరు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ ఎస్కే రమేష్, ఎస్సై ఆదినారాయణ ఇక్కడకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు. 16 ఫిర్యాదుల స్వీకరణ భీమవరం: ప్రజా ఫిర్యాదులు పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కా ర్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 16 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. కుటుంబ కలహాలు, అత్తంటి వేధింపులు, ఆస్తి, భూతగాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలపై ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రభోత్సవం
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో శివయ్యకు విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి అశ్వ వాహన రథంలో గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి దంపతులు రథం వద్ద కొబ్బరికాయలు కొట్టి బలిహరణ సమర్పించారు. అనంతరం రథోత్సవం ప్రా రంభమైంది. స్వామివారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా అశ్వరథంపై ఊరేగారు. రథం వెనుక ప్రభ వాహనం భక్తులకు కనువిందు చేసింది. శివయ్య, అఘోరాల వేషధారణలతో కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
ఉద్యోగ విరమణ అయినా.. విశ్రాంతి లేదు
ఏలూరు(మెట్రో) : ప్రభుత్వ ఉద్యోగంలో సుదీర్ఘ సేవలందించి 62 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు కూటమి సర్కారు పరీక్ష పెడుతోంది. త్వరలో పెన్షన్ అందుతుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికి వస్తాయని ఎదురుచూసే ఉద్యోగులకు షాకిచ్చింది. ముదిమి వయసులో ఆనందంగా రిటైర్ అవుతున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేలా చర్యలు తీసుకోవడంపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మంజూరు, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు సమయాలను పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలవికాని హామీలతో.. ఎన్నికల సమయంలో కూటమి సర్కారు అన్ని వర్గాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం, కానుకలు ఇస్తాం అని అలవికాని హామీలను ఇచ్చింది. ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారం చేపట్టిన తర్వాత నమ్మి ఓటేసిన వారిని నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చని సీఎం చంద్రబాబు తాజాగా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మంజూరు వ్యవధిని రెట్టింపు చేశారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణ తర్వాత పెన్షన్, ఇతరత్రా ప్రయోజనాల కోసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. 2 నెలల్లో.. 2,800 మంది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది సుమారు 48 వేల మంది ఉన్నారు. ఏలూరు జిల్లాలో 20 వేల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 18 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల కాలంలో ఏలూరు జిల్లాలో సుమారు 1,000 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 800 మంది ఉద్యోగ విరమణ పొందారు. వీరికి పెన్షన్ ప్రతిపాదనలను విజయవాడ కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి సర్వీసు పెన్షన్, ఫామిలీ పెన్షన్లను మంజూరు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ పెన్షన్ మంజూరు కోసం 45 రోజులు, ఫ్యామిలీ పెన్షన్ కోసం 90 రోజులు వ్యవధి ఉండగా.. కూటమి ప్రభుత్వం ఈ సమయాన్ని రెట్టింపు చేసింది. సర్వీస్ పెన్షన్ కోసం 90 రోజులు, ఫ్యామిలీ పెన్షన్ కోసం 180 రోజులు గడువు పొడిగించడంపై రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 180 రోజులపాటు ఎదురుచూపులు తప్పవని అంటున్నారు. ఏళ్లపాటు విధులు నిర్వహించి గౌరవంగా ఉద్యోగ విరమణ చేసిన తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఇలా చేయడం తగదని వాపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పరీక్షే పెన్షన్ మంజూరు సమయం 90 రోజులకు పెంపు ఫ్యామిలీ పెన్షన్ సైతం 6 నెలలకు పొడిగింపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమూ తప్పని ఇబ్బందులు కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 45 రోజుల్లోనే పరిష్కారం ఉమ్మడి జిల్లాలో 38 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులకూ పాట్లు ఉద్యోగి భార్య లేదా భర్త లేదా పిల్లలకు పెన్షన్ ఇవ్వడాన్ని ఫ్యామిలీ పెన్షన్‌గా వ్యవహరిస్తారు. ఫ్యామిలీ పెన్షన్‌ను గత ప్రభుత్వంలో 90 రోజుల్లోపు ప్రభుత్వం ఆమోదించేది. ప్రస్తుత కూటమి సర్కారులో 180 రోజులకు పెంచడంతో మరణించిన ఉద్యోగి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ కోసం ఆరు నెలలు ఎదురు చూడాల్సిందేనని అంటున్నారు. -
108ఉద్యోగుల ఆక్రందన
భీమవరం(ప్రకాశం చౌక్): తమ సమస్యలు పరిష్కరించాలంటూ 108 సర్వీసుల ఉద్యోగులు భీమవరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 108 ఉద్యోగులు కొద్దిరోజు లు నిరసనలు తెలుపుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే ఈనెల 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళతామని ప్రకటించారు. సమ్మె కారణంగా ప్రజలకు జరిగే అసౌకర్యానికి పూర్తి బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వం వహించాల్సి ఉంటుందన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరు గా ప్రభుత్వమే నిర్వహించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రోజుకు మూడు ఫిఫ్టులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ మార్కు లు ఇవ్వాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని, 108 వాహ నాలకు శాశ్వత భవనాలు ఏర్పాటుచేయాలని కో రారు. వేతన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. -
గడువులోపు పరిష్కారం చూపాలి
కలెక్టర్ నాగరాణి భీమవరం (ప్రకాశం చౌక్) : మీకోసంలో వచ్చిన ఫిర్యాదులకు పూర్తిస్థాయిలో గడువులోపు పరిష్కా రం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అర్జీలు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. అనంతరం ఆమె జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాల జారీ చేశారు. అర్జీల్లో కొన్ని.. ● ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సమయంలో రైతు సేవా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ, నూకశాతాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ● భీమవరంలోని గరగపర్రు రోడ్డు బైపాస్ నాలుగు రోడ్ల కూడలి వద్ద మద్యం షాపు ఏర్పాటుతో ఇబ్బంది పడుతున్నామని, దానిని తొలగించా లని స్థానికులు ఎం.సత్యకుమారి, ఆర్.మంగతాయారు వినతిపత్రం సమర్పించారు. ● అత్తిలి మండలం తిరుపతిపురంలో 45 ఎకరాలకు సాగునీరు అందించే బోదే ఆక్రమణకు గురైందని నాగకరుణ కుమారి అనే మహిళ ఫిర్యాదు చేశారు. ● జిల్లాలోని పలువురు దివ్యాంగులు తమకు సామాజిక పింఛన్ మొత్తాన్ని పెంచాలని, ఉపాధికి పంచాయతీ షాపులను అద్దెకు ఇప్పించాలని అభ్యర్థించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సాధ్యమేనా?
తాడేపల్లిగూడెం: గూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రతిపాదిత విమానాశ్రయాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. అటవీ భూముల్లో సుమారు 1100 ఎకరాలకు పైగా కేటాయించి విమానాశ్రయం నిర్మించాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. గూడెంలో విమానాశ్రయ నిర్మాణం ఈ నాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ సుమారు 653 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఉంది. 1.90 కిలోమీటర్ల పొడవున, సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో రన్‌వే ఉంది. వైఎస్ తొలిసారి సీఎం అయ్యాక ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రతిపాదన చేశారు. టెండర్ల వరకు వ్యవహారం వెళ్లింది. ఏవియేషన్ నిబంధనల ప్రకారం విండ్ క్లియరెన్సు సర్టిఫికెట్ ఉండటంతో విమానాశ్రయ ఏర్పాటుకు సత్యం కంప్యూటర్స్‌కు చెందిన మైటాస్ కంపెనీ టెండరు దక్కించుకుంది. సత్యం కంప్యూటర్స్ స్కామ్ నేపథ్యంలో విమానాశ్రయం ఏర్పాటుకాలేదు. అటకెక్కిన కార్గొ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా కార్గో విమానాశ్రయానికి ప్రతిపాదన చేశారు. అమెరికాలో ఉంటున్న భీమవరానికి చెందిన కుటుంబం బిల్డ్ అండ్ ఆపరేట్ పద్ధతిలో విమానాశ్రయం నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అయితే అది కూడా రన్‌వే మీదకు ఎక్కలేదు. ఇదే సమయంలో విమానాశ్రయ భూముల్లో రన్‌వేతో సహా 171.80 ఎకరాల భూమిని ఏపీ నిట్‌కు కేటాయించారు. ఈ రెండు ప్రతిపాదనలు విజయవంతం కాకపోవడంతో ఇజ్రాయెల్ సహకారంతో వెంకట్రామన్నగూడెంలోని కేంద్ర అటవీ పర్యావరణ ప్రాంతంలో ఉన్న భూముల్లో పైలట్ రహిత విమాన విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పాటుతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అప్పటి కేంద్ర విమానయాన మంత్రి అశోకగజపతిరాజు భూమి ఇస్తే విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ పాలసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంటు ఫండ్ కింద రూ.100 కోట్లను కార్పస్ ఫండ్‌గా కేటాయించింది. చివరకు ఆ ప్రతిపాదన ఫలించలేదు. ఉంగుటూరు, నాచుగుంట, గోపీనాథపట్నం పంచాయతీలు తమ పంచాయతీ పరిధిలోని అటవీ భూములను విమానాశ్రయ నిర్మాణానికి వినియోగించుకోవచ్చని తీర్మానాలు చేశాయి. ఎయిర్‌పోర్టు ఇక్కడ సాధ్యమేనా? తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే గూడెం, ఉంగుటూరు నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిఽధిలోని సుమారు 3033 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని డీ నోటిఫై చేసి ఇవ్వాలి. వైఎస్ హయాంలో ఏర్పాటైన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ కోసం అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ 50 ఎకరాలు అదనంగా కావాలనే ప్రతిపాదన చేశారు. అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రఘువీరారెడ్డి వర్సిటీని సందర్శించారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో జై రాం రమేష్ ఈ భూమిని కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. బెంగళూరులోని చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్టు కార్యాలయం చుట్టూ సంబంధిత ఫైల్ చక్కర్లు కొడుతోంది. భూమిని ఇన్ని సంవత్సరాలు గడిచినా కేటాయించలేదు. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న గూడెంలో విమానాశ్రయం ఏర్పాటు ఈ దశలో వర్కవుట్ అవుతుందా? అనే చర్చ సాగుతోంది. 1100 ఎకరాల అటవీ భూముల్లో నిర్మించాలనే ప్రతిపాదన అటవీ భూమిలో నిర్మాణంపైపలు సందేహాలు -
వ్యాన్ బోల్తాపడి వ్యక్తి మృతి
కలిదిండి(కై కలూరు): గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వ్యాన్ కాల్వలో బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన కలిదిండి మండలం అమరావతి పంచాయతీ శివారు కొత్తూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలిదిండి గ్రామానికి చెందిన పోసిన శివనాగరాజు(28)కి ఏడాది క్రితం వివాహం జరిగింది. అతను ఇండియన్ గ్యాస్ కంపెనీ వ్యాన్‌లో సిలిడర్లను సరఫరా చేసేవాడు. సిలిండర్ల లోడుతో వెళుతూ వ్యాన్ అదుపుతప్పి కాల్వలో పడింది. వాహనం కింద డ్రైవర్ నాగరాజు ఉండటంతో ఊపిరాడక మృతి చెందాడు. కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. మండలంలోని శ్రీనివాసపురానికి చెందిన తగరం కల్యాణ్ (31) పామాయిల్ తోటల్లో గెలల కోత పనులకు వెళ్తుంటాడు. సోమవారం శ్రీనివాసపురం శివారులో రైతు పొలంలో గెలల కోతకు కల్యాణ్ వెళ్లాడు. గెల కోస్తుండగా ఐరన్ పైపు తోట మీదుగా వెళ్లిన 11 కెవీ విద్యుత్ వైర్లకు తగలడంతో కల్యాణ్ విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కళ్యాణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎస్సై జబీర్ సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. పరిశోధన రంగంలో స్వావలంబన తాడేపల్లిగూడెం: పరిశోధన, రక్షణ రంగాల్లో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తుందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) శాస్త్రవేత్త, డిఫెన్సు మెటలర్జికల్ రీసెర్చ్ లేబరేటరీ పూర్వపు డైరెక్టర్ డాక్టర్ జి.మధుసూదన రెడ్డి అన్నారు. నిట్‌లో సోమవారం డీఆర్డీఓలో పరిశోధనలకు నిధులనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థలో డీఆర్డీఓ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డీఆర్డీఓ ఆధునిక ఆఽయుధాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, క్షిపణులు, రాకెట్లు , అధునాతనమైన వివిధ పరికరాలు తయారుచేస్తుందన్నారు. దేశ రక్షణ పరిశోధనలకు సంబంధించి ఎన్ఐటీల భాగస్వామ్యం ఉండాలన్నారు. విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ప్రపంచం గర్వించే నూతన ఆవిష్కరణల రూపకల్పనకు కృషి చేయాలన్నారు. పరిశోధనలకు నిధుల సమీకరణ కొత్త ప్రాజెక్టులు, డీఆర్డీఓలో ఉద్యోగ అవకాశాలు వంటి విషయాలపై విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఎంఎంఈ విభాగాధిపతి డాక్టర్ రఫీ, డీన్లు శాస్త్రి, జయరామ్, కురుమయ్య, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ వి.సందీప్, డీఆర్డీఓ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటేశ్వరరావు, అల్లా భక్షు తదితరులు పాల్గొన్నారు. -
సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తి అరెస్టు
భీమవరం: వాకింగ్‌కు వెళ్తున్న తన నుంచి సెల్‌ఫోన్ దొంగిలించి పారిపోతున్న వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించగా బ్లేడ్‌తో దాడి చేసినట్లు పట్టణంలోని నాచువారి సెంటర్‌కు చెందిన నరహరశెట్టి రాజ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్ సోమవారం వీరమ్మ పార్క్ వద్దకు వాకింగ్‌కు వెళుతుండగా తణుకు పట్టణానికి చెందిన వరదా దినకరన్ రాజ్‌కుమార్ జేబులోని సెల్‌ఫోన్ దొంగిలించాడు. పట్టుకోడానికి ప్రయత్నించగా బ్లేడ్‌తో దాడిచేశాడు. అటుగా వస్తున్న మరో ఇద్దరు దినకరన్‌ను పట్టుకున్నారు. దినకరన్‌ను పోలీసుస్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ చెప్పారు. -
జిల్లా జైలును సందర్శించిన డీఎల్ఎస్ఏ కార్యదర్శి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సోమవారం ఏలూరులోని జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహాయం చేస్తుందని తెలిపారు. ఖైదీలతో మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖైదీలకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసులు వాదిస్తుందని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పథకాలు పొందడంలో అండగా ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని రాజీయోగ్యమైన కేసులలోని ముద్దాయిలు సమస్యను పరిష్కరించుకొని కేసు నుంచి విముక్తి పొందాలని సూచించారు. ఎకై ్సజ్ తనిఖీల్లో వ్యక్తి అరెస్టు తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెం గ్రామంలో సోమవారం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని నుంచి ఆరు డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎకై ్సజ్ సీఐ కేఎస్వీ.కళ్యాణ్ చక్రవర్తి వివరించారు. తనిఖీల్లో ఎస్సైలు మురళీమోహన్, దొరబాబు, ఈఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఏలూరు రూరల్ః ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎస్జీఎఫ్ జాతీయయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాసరావు, కోశాధికారి కె.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో పి.జయశ్రీ,, డి.సాయిభవాని, దేవిశ్రీ, ఏ.రుత్విక, జి.పూజిత ఉన్నారని వివరించారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన అంతర్ జిల్లాల పోటీల్లో ప్రతిభ చాటారని గుర్తు చేశారు. దీంతో వీరు ఈ నెల 20 నుంచి 26 వరకూ పాటియాలలో జరిగే 68 వ జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సాంబశివరావు అభినందించారు. పంట ధ్వంసంపై కేసు నమోదు టి.నరసాపురం: పొలంలోకి అక్రమంగా ప్రవేశించి, పంటను ధ్వంసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వి.జయకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బంధంచర్ల గ్రామానికి చెందిన బేతి సరోజినికి గ్రామంలో 5.08 ఎకరాల మెరక భూమి ఉంది. ఈ భూమిలో కుటుంబసభ్యులతో కలిసి పొగాకు పంట సాగు చేసుకుంటోంది. ఈ నెల 16న పాత గొడవల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బేతి శేషయ్య, సిరింగుల సునీల్, బేతి సత్యనారాయణ, కాంతారావు, బేతి పెద్దపుల్లయ్య, బేతి జాన్, బేతి రాజులతో కలిసి సరోజిని పొలంలో ప్రవేశించి పొలంలో ఉన్న షెడ్డును ధ్వంసం చేసి, ట్రాక్టర్‌తో పంటను దున్నివేశారన్నారు. వ్యవసాయ పనిముట్లు ధ్వంసం చేయడంతో పాటు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. చంపుతానని బెదరించినట్లు సరోజిని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఆయుధ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలి ఏలూరు (టూటౌన్): జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో 1500 ఎకరాల విస్తీర్ణంలో నావిక విభాగానికి అవసరమైన ఆయుధాల పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాలని చూస్తున్నాయని దీన్ని తక్షణం నిలుపుదల చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ సోమవారం బహిరంగ లేఖ రాసింది. వివరాలను సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి పత్రికలకు విడుదల చేశారు. ప్రజలు వద్దన్నా పరిశ్రమ పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను అంతా వ్యతిరేకిస్తున్నారని, ఈ పరిశ్రమను స్థాపిస్తే వంకావారిగూడెం పంచాయతీలోని 6 గ్రామాలకు చెందిన 3 వేల మంది నిరాశ్రయులవుతారని చెప్పారు. పరిశ్రమ స్థాపిస్తే పరిసర గ్రామాల ప్రజలపై నిఘా ఏర్పడుతుందని, వారు స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు గాలి, నీరు, వాయువు కాలుష్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ స్థాపిస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు దక్కుతాయని ప్రభుత్వాలు చెబుతున్నా వాస్తవానికి స్వీపర్, గేట్ కీపర్ లాంటి కొద్దిపాటి ఉద్యోగాలు తప్ప ఇంకేమీ రావన్నారు. ప్రైవేటు పరిశ్రమ కాబట్టి ఎలాంటి రిజర్వేషన్లు పాటించరన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులైన లక్ష కుటుంబాల్లో కేవలం 10 వేల కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, జల్లేరు రిజర్వాయర్, అభయారణ్యం బొగ్గుగనుల పేరుతో అడవి బిడ్డలను ఆ ప్రాంతం నుంచి దూరం చేస్తున్నారన్నారు. ఆయుధ పరిశ్రమ పెట్టవద్దని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారని, గ్రామ సభల తీర్మానం అంటే అది సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. -
ఉన్ని దుస్తులకు గిరాకీ
ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఉన్ని దుస్తులకు డిమాండ్ గత నాలుగు రోజుల వరకు ఏలూరు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఉన్ని దుస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణం చేసే వాహనదారులు తప్పనిసరి ఉన్ని దుస్తులు వాడాలి. నగరంలోని పలు మాల్స్, వస్త్ర దుకాణాల్లో సమీప ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తుంటారు. వీరి విధులు ముగిసేసరికి రాత్రి 8 నుంచి 9 గంటలవుతుంది. వీరంతా ఆ సమయంలో తప్పనిసరిగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఇలాంటి వారు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులను తప్పనిసరిగా ధరించాలని వైద్యులు చెబుతున్నారు.ఏలూరు (టూటౌన్): శీతాకాలం రాగానే నగరాలు, పట్టణాల్లో ఉన్ని దుస్తుల దుకాణాలు వెలుస్తాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వచ్చి వీరు దాదాపు మూడు నెలలు ఇక్కడే ఉండి ఉన్ని దుస్తుల అమ్మకాలు చేస్తారు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మప్లర్లు, రగ్గులు ఇలా మనకు శీతాకాలంలో కావాల్సిన అన్ని దుస్తులు వీరి వద్ద అందుబాటులో ఉంటాయి. ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి వచ్చిన వ్యాపారులు ఏలూరులోని పలు ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నారు. నాణ్యత, డిజైన్‌ను బట్టి స్వెట్టర్ రూ.300 నుంచి రూ.700 వరకు ధర పలుకుతుంది. మంకీ క్యాప్‌లు రూ.70 నుంచి రూ.150, చేతి గ్లౌజులు రూ.100, రగ్గులు రూ.800 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరుగుదల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రేట్లు కొంత మేర పెరిగాయని విక్రయదారులు, కొనుగోలుదారులు చెబుతున్నారు. ఏలూరు నగరంలో ఎక్కువగా కెనాల్ రోడ్డులో ఈ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. నవంబరు నెల ప్రారంభం నుంచి ఈ దుకాణాలను ఏర్పాటు చేసినా మొదటి పదిరోజులు అమ్మకాలు అంతంతమాత్రమే. గత నాలుగు రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అమ్మకాలు పెరిగాయి. దీంతో సాయంత్రం అయితే ఈ మార్గం కొనుగోలుదారులతో సందడిగా మారుతోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో స్వెటర్లు, మంకీ క్యాప్‌లకు డిమాండ్ ఏలూరులో పలు చోట్ల వెలసిన దుకాణాలు జనవరి చివరి వరకు అమ్ముతాం ఏటా ఏలూరు నగరానికి ఉన్ని దుస్తుల అమ్మకం కోసం మధ్యప్రదేశ్ నుంచి వస్తాం. నవంబరు ప్రారంభంలో వచ్చి జనవరి చివరికి మా స్వగ్రామం వెళతాం. గత పది రోజులుగా సరిగా అమ్మకాలు లేవు. ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇక్కడి ప్రజల ఆదరణ, మాట తీరు బాగుంది. తిరిగి వెళ్లేటప్పుడు సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న భావన కలుగుతుంది. జి.చంద్ర సింగ్, మధ్యప్రదేశ్, అమ్మకందారుడు ఏటా ఉన్ని దుస్తులు కొంటాం ఏటా శీతాకాలం ఏలూరులో అమ్మే స్వెట్టర్ల దుకాణంలో మా కుటుంబానికి అవసరమైన వాటిని కొనుగోలు చేస్తుంటాం. మంకీ క్యాప్‌లు, చెవులకు పెట్టుకునే పట్టీలు, మప్లర్లు తప్పనిసరిగా కొంటాం. స్వెట్టర్లు, రగ్గులు అవసరం మేరకు కొనుగోలు చేస్తాం. నలుగురు ఉన్న మా కుటుంబంలో ప్రతీ సీజన్లో ఏదో రకం ఐటెమ్ కొనుగోలు చేయడం అలవాటు. వెంపా విజయలక్ష్మి, మల్కాపురం, ఏలూరు రూరల్ మండలం -
అవినీతి ఆరోపణలపై డీఎస్పీ విచారణ
తణుకు: తణుకు మండలం వేల్పూరులో గేదెల అపహరణ కేసులో పోలీసు స్టేషన్లో లక్షలు చేతులు మారినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాఽథ్ తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన ఆకుల మారుతీ అయ్యన్నరావుకు చెందిన రెండు గేదెలను వీరభద్రపురం గ్రామానికి చెందిన చికెన్ వ్యాపారి బండి ఈశ్వరరావు అపహరించుకుపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన తణుకు రూరల్ పోలీసులు రికవరీ పేరుతో బాధితుడు అయ్యన్నరావుకు రూ.5 లక్షలు అందజేశారు. అయితే ఈశ్వరరావు వద్ద రూ.13 లక్షలు తీసుకున్నారని.. తనకు రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చారని బాధితుడు అయ్యన్నరావు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈశ్వరరావు, అయ్యన్నరావు మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. వ్యాన్ బోల్తా భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని గొల్లవానితిప్పలో వంతెనకు అప్రోచ్ లేకపోవడంతో సోమవారం ఆటో వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో ఎవరూ లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. గొల్లవానితిప్ప నుంచి చేపల లోడుతో ఆటో వ్యాన్ రామాయణపురం వైపునకు వంతెనపై నుంచి దిగుతుండగా అదుపుతప్పి పంట కాలువలో పడిపోయింది. డ్రైవర్ సమయ స్ఫూర్తితో కిందకు దిగడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వ్యాన్‌లో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత కొయ్యలగూడెం: పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితునికి అందజేశారు. కొయ్యలగూడెంకు చెందిన గొలిశెట్టి ఉషారాణి సోమవారం స్వీట్షాప్కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడలోని మూడు కాసుల బంగారు గొలుసు పడిపోయింది. గొలుసు కొయ్యలగూడెంకి చెందిన మరో మహిళ ఆకుల లక్ష్మికి దొరికింది. ఇంటికి వెళ్లి చూసుకున్న ఉషారాణి గొలుసు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వి.చంద్రశేఖర్, ఈ–కాప్ కానిస్టేబుల్ సీహెచ్ గణేష్‌లు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా గొలుసు తీసుకున్న మహిళను గుర్తించి రికవరీ చేశారు. అనంతరం బాధితురాలికి దానిని అందజేశారు. -
నవరత్నాల లోగో ధ్వంసం
టీడీపీ నాయకుల దుశ్చర్య ముసునూరు: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో టీడీపీ వర్గీయుల దాడులను వైఎస్సార్ సీపీ మండల నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు దాడి చేసి పగులగొట్టిన నవరత్నాల లోగో, ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆదివారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు తదితరులు పరిశీలించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం మండలంలోని రమణక్కపేట, కాట్రేనిపాడు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు, వైఎస్సార్ సీపీ అనుయాయులపై భౌతిక దాడులు చేసి ఇద్దరిని గాయపర్చారని, తాజాగా ఓ పచ్చ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆసరాగా తీసుకుని గోపవరంలోని సచివాలయం–1పై ఏర్పాటు చేసిన నవరత్నాల లోగోను, ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని పగుల కొట్టారన్నారు. నేతలు ముసునూరుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కంచర్ల వాణి, పార్టీ అధ్యక్షుడు వల్లభనేని గోపాల కృష్ణ, స్థానిక సొసైటీ అధ్యక్షుడు కోటగిరి గోపాలకృష్ణ, వైస్ ఎంపీపీ పి.గంగాధర్, జెడ్పీటీసీ డా.వరికూటి ప్రతాప్, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శిల్పి గురించి శిల్పంమాట్లాడుతుంది
ఏలూరు జిల్లా, చింతలపూడికి చెందిన కనకలింగ వీరబ్రహ్మం ఒకే చట్రంలో రామాయణాన్ని ఆవిష్కరించారు. అరవై నాలుగేళ్ల వీరబ్రహ్మం ఆవిష్కరణల్లో ఇలాంటివెన్నో. ఉలి పట్టుకోవడానికి ముందు ఆయన మృదంగనాదం చేశారు. ఎలక్ట్రికల్ వర్క్ చేశారు. చివరికి ఉలితోనే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. తన ఉలి ప్రస్థానం గురించి ఆయన ‘సాక్షి’తో చెప్పిన వివరాలివి. ఫొటోలో మృదంగమే ఉంది వీరబ్రహ్మం తండ్రి స్వర్ణకారుడు, మృదంగ కళాకారుడు కూడా. వీరబ్రహ్మం మృదంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. ఆరేళ్ల వయసులో కచేరీల్లో పాల్గొన్నారు కూడా. ఇవి అభిరుచిని సంతృప్తి పరుచుకోవడం కోసం మాత్రమేనని, పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే స్వర్ణకారులకు పని దొరకడమూ కష్టమేనని, ఉపా ధి కోసం మరేదైనా పని నేర్చుకో మని చెప్పారు. అది పెద్ద శరాఘాతం. మృదంగం ముట్టుకుంటే కొ డతానని భయపెట్టినప్పుడు కన్నీళ్ల పర్యంతం అయి మృదంగంతో ఒ క్క ఫొటో తీసుకుంటానని బతిమాలడం, చివరికి ఫొటో తీసుకుంటే ఆ ఫొటోలో మృదంగం కనిపిస్తోంది. కానీ బ్రహ్మం కనిపించలేదు. బ్రహ్మం సన్నగా, చిన్నగా ఉండడంతో ఆ ఫొటో కోరిక కూడా అసంతృప్తిగానే మిగిలిపోయింది. ఆయన జీవితంలో సంగీతం ఒక ముగిసిపోయిన ఘట్టమైంది. కార్పొరేషన్ రద్దయింది ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మోటారు మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించారు. నాలుగేళ్లకే ఆ కార్పొరేషన్ రద్దు కావడంతో మెకానిక్‌గా ప్రైవేట్ వర్క్స్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. పోషణకు ఇబ్బంది లేదు కానీ, కళాత్మకమైన పని ఫలానా చేశాననే ఆత్మ సంతృప్తి లేకపోతే జీవితం పరిపూర్ణం కాదనుకునేవారు. ఖాళీ సమయాల్లో చెక్కను శిల్పంగా మలిచే ప్రయత్నం చేసేవారు. ఆ ప్రయత్నం అద్భుతంగా ఉండటంతో అతడి ప్రస్థానం కళాపథంలో నడిచింది. లేపాక్షి తక్కువ చేసింది రాధాకృష్ణుల విగ్రహాన్ని చెక్కడానికి నెల పట్టింది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్లు రెండున్నర వెయ్యికి తీసుకుంటామనడంతో హతాశులయ్యారు వీరబ్రహ్మం. కళాకారులు బతికేదెలా అన్నప్పుడు... తమ దగ్గర ఉన్న బొమ్మలన్నీ అదే ధరలో సేకరించినట్లు, లేపాక్షి బ్రాండ్ ఉంటే ఫినిషింగ్ చూడరని, ఫినిషింగ్ కోసం ఎక్కువ రోజులు కష్టపడకుండా స్థూలంగా రూపం వస్తే చాలని చెప్పారు నిర్వాహకులు. ఈ ధోరణి శి ల్పాలకు శిల్పకారులకు శిక్ష విధించడమేనని బాధపడ్డారాయన. తన శిల్పాల కోసం మార్కెటింగ్ ప్రయత్నాలు మానేసి తనకు నచ్చినవి చెక్కుతూ సంతోషిస్తున్నారు. కానీ ఆయన శిల్పాలు మాట్లాడుతున్నా యి, ఆయన పనిని మార్కెట్ చేస్తున్నాయి. బ్రహ్మంలో శిల్పకారుడిని నిత్యం పనిలో ఉంచుతున్నాయి. నోటిమాట ద్వారా తెలుసుకున్న కళాభిమానులు బొమ్మల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. వీటితోపాటు తన సంతృప్తి కోసం మూడు నెలలు శ్రమించి రామాయణం మొత్తాన్ని ఒకే చట్రంలో చెక్కారు. జాతీయ చిహ్నం, భరతమాత, రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి పింగళి వెంకయ్య వరకు మన జాతీయనాయకుల శిల్పాల కోసం ఉలి పట్టడం ఆయన ఆకాంక్ష. శిల్పగురు గౌరవాన్ని అందుకోవడం శిల్పకారుడిగా తన లక్ష్యమని చెప్పారాయన. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి దారుశిల్పి మందగుల కనకలింగ వీరబ్రహ్మం ఎవరి దగ్గరా శిష్యరికం చేయలేదు కళ తన జీన్స్‌లోనే ఉందన్నారాయన.. కళ అన్నం పెట్టే రోజులు కావన్నాడు తండ్రి బ్రహ్మం నుదుట ఆ బ్రహ్మ ‘కళాకారుడ’నే రాశాడు వినాయకుడితో కొత్త జీవితం నేను చెక్కిన తొలి శిల్పం వినాయకుడు. సరదా కొద్దీ చిన్న చిన్న బొమ్మలేవో చేస్తుండేవాడిని. అది 2001, మా మిత్రుడు కొన్న వినాయకుడి విగ్రహాన్ని చూ స్తే బాధనిపించింది. ఆ శిల్పి మనసు పెడితే బాగా చెక్కి ఉండవచ్చనిపించింది. కళ అంతరించిపోవడానికి దగ్గరగా ఉందా అనే ఆవేదన కూడా కలిగింది. అలాంటి వినాయకుడి రూపాన్నే ఇంకా అందంగా తీసుకురావాలని చెక్కాను. అప్పటి నుంచి దారుశిల్పిగా మారాను. మా అమ్మ మట్టిబొమ్మలు చేసేది. తాతయ్య వెండి, రాగి వస్తువులకు నగిషీ పనిచేసేవారు, అన్నయ్య డ్రాయింగ్ వేసేవారు. ఇన్ని కళల మధ్య పెరగడం వల్లనేమో నా తోపాటు నాలో శిల్పకారుడు కూడా పెరిగాడు. – మందగుల కనకలింగ వీరబ్రహ్మం, దారుశిల్పి -
ఎకై ్సజ్ దాడులు
తణుకు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలుచోట్ల ఆదివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తణుకు మండలం కోనాల గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గెడ్డం వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు, సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. పాలకొల్లు అర్బన్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన కొప్పిశెట్టి పెద్దిరాజును అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 4 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు తెలిపారు. కై కలూరు: ముదినేపల్లి మండలం ప్రొద్దువాక గ్రామంలో బెల్టు దుకాణాలపై ఆదివారం ఎకై ్సజ్ దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్కే.రమేష్ చెప్పారు. బెల్టు దుకాణం నిర్వహిస్తున్న కల్లి రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో ప్రొహిబిషన్ ఎస్సై ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. భీమడోలు: భీమడోలు గొలుసుల గేటు ఏరియాలో బెల్ట్‌షాపు నడుపుతున్న వనం వెంకట రత్నం అనే వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. ఆతని వద్ద నుంచి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
చంద్రబాబు సూపర్ బాదుడు
తణుకు అర్బన్ : చంద్రబాబు ప్రజలకు సూపర్ బాదుడు చూపిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు కొండెక్కించి పేదలను అప్పుల పాలు చేస్తున్న ఘనత చంద్రబాబు మూటగట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని అధికారం ఇస్తే సంపద సృష్టిస్తానంటూ ప్రగల్బాలు పలికిన పెద్దమనిషి ఇప్పుడు దొరికినకాడికి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారని దుయ్యబట్టారు. నాణ్యమైన విద్యుత్‌ను ధరలు పెంచకుండా అందిస్తానని హామీ ఇచ్చి రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడే చంద్రబాబు సూపర్ సిక్స్‌తో ప్రజలను మోసం చేశారని, బడ్జెట్లో వాటికి సరిపడా నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. విద్యారంగం అధోగతి జగన్ హయాంలో విద్యావ్యవస్థకు అందిన ప్రోత్సాహంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, నేడు కూటమి ప్రభుత్వంలో పిల్లలు బడికి వెళ్లని స్థితి వచ్చిందని కారుమూరి ఎద్దేవా చేశారు. తల్లికి వందనం తల్లికి అందకపోవడంతో తమ బిడ్డలను పాఠశాలలకు పంపించని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. జగన్ సంక్షేమంతో మహిళలు ఆర్థికంగా ఎదిగారని దీంతో చిన్నపాటి వ్యాపారాలు చేయడం వంటి అంశాలతో మార్కెట్లో కొనుగోలు శక్తి పెరిగి ఏపీ మొదటి స్థానంలో ఉండేదని ఇప్పుడు 15వ స్థానానికి దిగజారిపోయిందని తెలిపారు. పెరిగిన ధరలతో జీవనం కష్టం కందిపప్పు, మినపప్పు, వంటనూనెల ధరలతో ప్రజలు బతకడమే కష్టంగా మారిందని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 20 లక్షలు ఉద్యోగాలు యువతకు అందిస్తామని, రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామన్న లోకేష్ కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ మాటేంటి.. ఫీజు రీయింబర్స్మెంట్ గాలికొదిలేశారని, ఫీజు కడితేనే పరీక్షలు రాయిస్తామని యాజమాన్యాలు చెబుతుండడంతో తల్లిదండ్రులు అప్పులుచేసి కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కిడ్నాప్‌లకు వలంటీర్లే కారణమన్నట్లుగా మాట్లాడి వారిని తీవ్రంగా అవమానించిన పవన్ కల్యాణ్ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాలికలు, మహిళల కిడ్నాప్‌లు, దాడులు, హత్యలపై నోరెత్తరే అని నిలదీశారు. ఉచిత ఇసుకని ప్రగల్బాలు పలికి నేడు ఇసుక దొరక్కుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, మద్యం దుకాణాలు నేడు బార్లుగా మారాయని, ఇంటి వద్దకే మద్యం అన్నట్లుగా బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే ఉద్దేశంతో సోషల్ మీడియా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అమాయకులను పోలీస్స్టేషన్లు, జైళ్లకు తిప్పుతున్నారని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని కారుమూరి హెచ్చరించారు. సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, విలేజ్ క్లినిక్‌ల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ఇప్పుడు మెడికల్ కళాశాలలను కూడా అవసరం లేదని వెనక్కి పంపిస్తున్న చంద్రబాబు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని నిలదీశారు. కొండెక్కిన నిత్యావసరాలు, కూరగాయల ధరలు విద్యావ్యవస్థ నిర్వీర్యం మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం -
పాఠశాలల పనివేళలు మార్చొద్దు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు పరచడాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఈ. రత్నం బాబు, జీ మోహన్ రావు విద్యాశాఖను కోరారు. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు సవరించారన్నారు. 5 కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు బడులకు వస్తున్నందున సాయంత్రం 5 వరకు పాఠశాలల నిర్వహణ వల్ల విద్యార్థులకు రక్షణ కరువవుతుందని, డ్రాపవుట్ల శాతం పెరుగుతుందని, ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు. -
నేటి నుంచి దళిత వాడల్లో శ్రీవారి ధర్మప్రచారం
ద్వారకాతిరుమల : శ్రీవారి ధర్మప్రచార రథం సోమవారం నుంచి దళిత వాడల్లో పర్యటించనుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ద్వారకాతిరుమలతో పాటు జంగారెడ్డిగూడెం మండలంలోని 8 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ధర్మప్రచారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఆలయ జంటగోపురాల వద్ద ఈ ధర్మప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. జోనల్ బ్యాండ్ పోటీల్లో ప్రథమం తాడేపల్లిగూడెం రూరల్: కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో జరిగిన జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బ్యాండ్ టీమ్ ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ విషయాన్ని ఆదివారం స్కూలు ప్రిన్సిపల్ బి.రాజారావు తెలిపారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల నుంచి 33 టీంలు పాల్గొనగా, తమ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని చెప్పారు. విద్యార్థులకు కర్ణాటక మంత్రి ఎస్ఎస్.మల్లిఖార్జున్, ఎంపీ ప్రభా మల్లికార్జున్ తదితరులు బహుమతి ప్రదానం చేశారన్నారు. న్యూఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో జరగనున్న గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో తమ విద్యార్థులు పాల్గొంటారని ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. ఘనంగా సువర్చలా హనుమద్ కల్యాణం జంగారెడ్డిగూడెం రూరల్ : గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దర్శనార్ధం వేకువజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి, అర్చక స్వాములు శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణ క్రతువు నిర్వహించారు. ఈ కల్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద రాజానగరం, బాల రాజరాజేశ్వరి నాట్యమండలిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. దర్శనాలకు విచ్చేసిన భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది. సుమారు 4,000 మంది భక్తులు స్వామి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు ఆదివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు భారతదేశంలో మహిళా సురక్షత – యువత పాత్ర, విద్యార్థి దశ ప్రాముఖ్యత లేదా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆధ్యాత్మికత అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంతకు ముందు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏలూరు శాఖ ఆధ్వర్యంలో రాజయోగిని సిస్టర్ బీకే లావణ్య, బీకే హిమబిందు, బీకే బేబి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు మెమొరీ మేనేజ్మెంట్ – బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనే అంశంపై సందేశాన్ని, ఆధ్యాత్మికతతో కూడిన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు అధ్యక్షత వహించగా, బ్రహ్మకుమారిస్ సిబ్బంది పాల్గొన్నారు. -
26న కలెక్టరేట్ల వద్ద ధర్నా
ఏలూరు (టూటౌన్): ఈ నెల 26న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రైతుల ఆందోళన ఫలితంగా వ్యవసాయ నల్ల చట్టాలను అమలు చేయమని, రైతు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలలో పాల్గొని అసువులు బాసిన 750 మంది రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఇచ్చిన హామీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి, రైతులు గుర్తించిన 52 పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులపై ముప్పేట దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీ మేరకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టే 4 లేబర్ కోడ్లు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. సమావేశంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రతిష్టాత్మక ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ పనుల్ని కూటమి సర్కారు అటకెక్కించింది. ఇప్పటికే రూ.30 కోట్ల మేర పనులు జరగ్గా, బిల్లులు విడుదలవక నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. మరోవైపు ఈ ఏడాది అడ్మిషన్లు మొదలుకాగా ప్రస్తుతం క్యాంపస్ కాలేజీ నిర్వహిస్తున్న తాత్కాలిక భవనం సరిపోక తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా హబ్‌గా ప్రసిద్ధి చెందింది. భీమవరం, ఉండి, కై కలూరు తదితర నియోజకవర్గాల్లోని 2.53 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. జిల్లాలోని 15కు పైగా ప్రాన్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా రొయ్యలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేశారు. నరసాపురం కేంద్రంగా ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం, జిల్లాలోని ఉండిలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. యూనివర్సిటీ కోసం నరసాపురం పక్కనే లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవన నిర్మాణాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో గతేడాది నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తరగతులు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 1992లో క్యాంపస్ కళాశాల ప్రారంభించగా నరసాపురంలోని కళాశాల రాష్ట్రంలోనే రెండోది కావడం గమనార్హం. ఈ ఏడాది నూతన భవనాల్లో ఆక్వా వర్సిటీ, క్యాంపస్ కళాశాలను ప్రారంభించడం లక్ష్యంగా గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు చేయించారు. మందగించిన పనులు అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాలకు సంబంధించి పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇంతవరకు రూ.30 కోట్ల విలువైన పనులు జరగ్గా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుండా జాప్యం చేయడం నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పనులు మందగించగా మరో వారం పది రోజుల్లో బిల్లులు రాకుంటే పనులు నిలుపుదల చేసే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని మత్య్సశాఖ భవనాల్లోకి తరలిపోతుందన్న ప్రచారం ఉంది. భవనాల పనులు నిలిచిపోతే నరసాపురం ఆక్వా వర్సిటీపై నీలినీడలు కమ్ముకుంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ బ్యాచ్‌కు సరిపోని తాత్కాలిక భవనం ప్రస్తుతం నరసాపురంలోని 12 గదులతో ఉన్న తుపాను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రెండో బ్యాచ్‌కు కౌన్సెలింగ్ మొదలుకాగా ఇప్పటికే 35 సీట్లు పూర్తయ్యాయి. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్, లైబర్రీ, స్టాఫ్ రూమ్ ప్రస్తుతం ఉన్న భవనంలో ఒక బ్యాచ్‌కు మాత్రమే సరిపోతుంది. ఈ ఏడాది నుంచి రెండో బ్యాచ్ క్లాసులు మొదలు పెట్టాల్సిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ భవనం వెదుకులాటలో అధికారులు ఉన్నారు. ఉండి కేవీకేలో ఫిషరీస్‌కు సంబంధించిన భవనాలు ఉండటంతో కళాశాలను అక్కడ నిర్వహించాలని అధికారులు భావించారు. కాగా నరసాపురం నుంచి కళాశాల వెళ్లిపోతే స్థానికంగా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఆ ప్రయత్నాన్ని ఆపుచేయించినట్టు సమాచారం. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన బ్లాకులో కళాశాల నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. బిల్లులు విడుదల చేసి త్వరితగతిన యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నత్తనడకన సాగుతున్న ఆక్వా వర్సిటీ నిర్మాణ పనులు బిల్లుల విడుదలలో కూటమి సర్కారు జాప్యం నత్తనడకన నిర్మాణ పనులు పశ్చిమగోదావరి జిల్లాకు తలమానికంగా ఆక్వా వర్సిటీ భవన నిర్మాణాలకు రూ.100 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కారు రూ.30 కోట్ల విలువైన పనులు పూర్తి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పనులకు బ్రేక్ ఆక్వా వర్సిటీ విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పనులు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధికి ఆక్వా వర్సిటీ దోహదపడుతుంది. యూనివర్సిటీకి సంబంధించిన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేక చొరవ చూపాలి. –వడ్డి రఘురాం, అప్సడా మాజీ వైస్ చైర్మన్ -
క్రీడలతో ఆత్మస్థైర్యం మెండు
భీమడోలు: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేస్తాయని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల అడిషనల్ కార్యదర్శి సునీల్‌రాజ్‌కుమార్ అన్నారు. భీమడోలు మండలంలోని పోలసానిపల్లి బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల కశాశాలలో జోన్ 2 బాలికల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జోన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 29 కళాశాలల నుంచి 1,050 మంది బాలికలు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారు. ప్రిన్సిపాల్ వీవీ రమణ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించారు. పోటీల విజేతల వివరాలను డీసీవో ఎన్.భారతి, ప్రిన్సిపాల్ వీవీ రమణ, జోనల్ కోఆర్డినేటర్ శ్యామల, పీడీ సాయిలక్ష్మి ప్రకటించారు. స్కూల్ గేమ్స్ విభాగంలో.. కబడ్డీలో వట్లూరు (పశ్చిమగోదావరి), బల్లిపర్రు (కృష్ణా), వాలీబాల్‌లో వెంకటాపురం(తూర్పుగోదావరి), పోలసానిపల్లి(పశ్చిమ), ఖోఖోలో ద్వారకాతిరుమల, పోలసానిపల్లి జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. త్రోబాల్ పోటీల్లో పోలసానిపల్లి (పశ్చిమ) ముప్పాళ్ల (కృష్ణా), చెస్‌లో ముమ్మడివరం(తూర్పు), ద్వారకాతిరుమల (పశ్చిమ), క్యారమ్స్‌లో తుని, పిఠాపురం జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. స్పోర్ట్స్ చాంపియన్షిఫ్ను వి.ఇందు(జంగారెడ్డిగూడెం), వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను పి.పూజ, స్పోర్ట్స్ అల్రౌండర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాంపియన్షిఫ్లను జంగారెడ్డిగూడెం కై వసం చేసుకున్నాయి. కళాశాల గేమ్స్ విభాగంలో.. కబడ్డీలో గోపాలపురం(తూర్పు), కుంటముక్కల (ఎన్టీఆర్), వాలీబాల్‌లో పి.వెంకటపురం (తూర్పు), గోపాలపురం (తూర్పు), ఖోఖోలో ఏలేశ్వరం(తూర్పు), పోలసానిపల్లి (పశ్చిమ). త్రోబాల్ విభాగంలో పోలసానిపల్లి, జంగారెడ్డిగూడెం ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. చెస్ విభాగంలో వీరపనేనిగూడెం (కృష్ణా), పి.వెంకటపురం (తూర్పు), క్యారమ్స్‌లో వీరపనేనిగూడెం (కృష్ణా), ముమ్మడివరం(తూర్పు) మొదటి రెండు స్థానాలు సాధించాయి. స్పోర్ట్స్ విభాగంలో చాంపియన్ వి.నిఖిత (ముప్పాళ్ల), వ్యక్తిగత చాంపియన్‌షిప్ కె.లావణ్య (తుని), అల్రౌండ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ గోపాలపురం, ఆల్‌రౌండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో గోపాలపురం, చాంపియన్‌షిప్‌ను పోలసానిపల్లి కై వసం చేసుకుంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విజేతలు వీరే 100 మీటర్ల పరుగులో జి.విమలశ్రీ, టి.పూజ, టి.నీలిమప్రియ, 200 మీ. పరుగులో సీహెచ్ కుమారి, డి.ప్రీతిక, కె.మనీషా, 400 మీ. పరుగులో పి.పూజ, కె.హేమకుమారి, బి.రమ్య, 800 మీ. పరుగులో వి.ఇందు, సీహెచ్ కుమారి, కె.హేమకుమారి, డిస్కస్ త్రోలో కె.కృష్ణశ్రీ, కె.శ్రీవల్లి, ఎన్.రాణి, జావెలెన్‌త్రోలో ఎన్.రాణి, కె.శ్రీవల్లి, సీహెచ్ సమీరా, లాంగ్‌జంప్‌లో బి.రమ్యశ్రీ, వై.రమ్యశ్రీ, సీహెచ్ దివ్యశ్రీ, హైజంప్‌లో బి.రమ్యశ్రీ, సీహెచ్ శిరీషా, దివ్యశ్రీ, షాట్‌ఫుట్‌లో పి.కీర్తన, పి.కృష్ణవేణి, డి.శ్రీలత, వ్యక్తిగత చాంపియన్స్‌లో వి.ఇందు, పి.పూజ, బి.రమ్యశ్రీ విజేతలుగా నిలిచారు. గురుకుల కళాశాల అడిషనల్ కార్యదర్శి సునీల్‌రాజ్‌కుమార్ ముగిసిన జోనల్ పోటీలు