white house
-
ట్రంప్ కీలక నిర్ణయం.. కరోలిన్ సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్‌ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌ను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024 -
వైట్‌హౌస్‌పై మెలానియా విముఖత
వాషింగ్టన్: ప్రథమ మహిళగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్న మెలానియా ట్రంప్.. శ్వేతసౌధంపై మాత్రం విముఖత చూపుతున్నారు. ఈ దఫా ఆమె పూర్తిస్థాయిలో వాషింగ్టన్కు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఉల్లంఘించడానికే ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తన సమయాన్ని ఎక్కడ? ఎలా? గడుపుతారనే చర్చ నడుస్తోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం వైట్‌హౌస్‌లో ఉంది. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ సైతం ఆహ్వానించారు. ఆ మేరకు ట్రంప్ హాజరయ్యారు. అయితే ప్రథమ మహిళ.. కాబోయే మహిళకు ఇచ్చే విందుకు మాత్రం మెలానియా ట్రంప్ వెళ్లలేదు. జిల్ బైడన్ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు. ఆమె వెళ్ళడం అవసరమని ట్రంప్ బృందంలోని పలువురు సూచించినా మెలానియా నిరాకరించారు. మొదటి పర్యాయంలో పూర్తిస్థాయి వైట్‌హౌస్‌లోనే ఉన్న ఆమె.. ఈసారి మాత్రం స్వతంత్రంగా ఉండటానికే ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదో ఉదాహరణ. 2016లో వైట్‌హౌస్ మెలానియాకు కొత్త... కానీ ‘ఈసారి నాకు ఆందోళన అవసరం లేదు. అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందనేది స్పష్టత ఉంది’అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం ఆమె చెప్పారు. కొడుకుకు దగ్గరగా... మెలానియా ట్రంప్.. వచ్చే నాలుగేళ్లలో ఆమె న్యూయార్క్ సిటీ, ఫ్లోరిడాలోని పామ్బీచ్లలో గడపనున్నారని సమాచారం. అయినప్పటికీ ఆమె ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతారని, ప్రథమ మహిళగా తనకంటూ సొంత వేదిక, ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. 2020 తరువాత మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో ఎక్కువ సమయం గడిపారు. అక్కడే జీవితాన్ని, స్నేహితులను పెంచుకున్నారు. అందుకే ఆమె ఎక్కువ సమయం అక్కడే గడిపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2016లో కూడా ఆమె వాషింగ్టన్కు వెంటనే వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని నెలల తరువాత వైట్‌హౌస్‌కు మారారు. మరోవైపు తన కొడుకు 18 ఏళ్ల బారన్ ట్రంప్ న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుతున్నారు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలన్నది బారన్ కోరిక. టీనేజ్ కొడుకుకు దగ్గరగా ఉండేందుకు ప్రథమ మహిళ ఆసక్తి చూపుతున్నారని, న్యూయార్క్‌లోనూ ఎక్కువ సమయం గడుపుతారని సన్నిహితులు చెబుతున్నారు. ఒక ప్రథమ మహిళ శ్వేతసౌధంలో ఉండటానికి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కానీ.. మెలానియా ట్రంప్‌ను చాలాకాలంగా గమనిస్తున్నవారికి ఇది ఆశ్చర్యం కలిగిచడం లేదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుకుగా లేరు. ట్రంప్ తిరిగి పోటీ చేస్తానన్న ప్రకటనకు హాజరయ్యారు. అక్టోబర్ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీలోనూ పొడిపొడిగానే మాట్లాడారు. ఎన్నికల రాత్రి పారీ్టలోనూ ఆమె పాల్గొనలేదు. ప్రైవసీకే ప్రాధాన్యత.. పదవి నుంచి వైదొలిగిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ పలు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడంతో పామ్ బీచ్, న్యూయార్క్‌ల మధ్య తన సమయాన్ని గడిపారు. కుటుంబంలోని ఇతర సభ్యులు తరచూ కోర్టులో, ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పటికీ, మెలానియా ట్రంప్ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. లారా బుష్, మిషెల్ ఒబామా వంటి ప్రథమ మహిళలు నాలుగేళ్లలో తమకో ప్లాట్‌ఫామ్ నిర్మించుకున్నట్టుగా మెలానియా ట్రంప్ చేయలేదు. ప్రైవసీని కోరుకున్నారు. రిపబ్లికన్ల రాజకీయ నిధుల సేకరణలో ఒక్కసారి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలైలో డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి ఓ లేఖ రాశారు. ‘హింసను ప్రేరేపించే ద్వేషం, విద్వేషాలకు అతీతంగా ఉండండి. కుటుంబమే ప్రథమం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మనమందరం కోరుకుందాం’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక అబార్షన్ హక్కుల విషయంలో భర్త ట్రంప్‌తో విభేదించారు. గత అక్టోబర్‌లో.. ‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది నేను పరిరక్షించే ప్రాథమిక సూత్రం. నిస్సందేహంగా, మహిళలందరికీ పుట్టుకతోనే ఉన్న ఈ ముఖ్యమైన హక్కు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’అని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై తన వైఖరి భర్త డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసని, ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని ఆ తరువాత మీడియాతో చెప్పారు. మెలానియా ట్రంప్ తన భర్తతో రాజకీయంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారని, సంప్రదాయ దృక్పథంతో సమస్యలపై మాట్లాడుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా.. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. -
వాస్తవాలను నిరాకరిస్తున్నామా?
ట్రంప్ విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా కొన్ని అమెరికా ఉదారవాద పత్రికలు అధ్యక్షుడిగా ఆయన గెలుపును ఒప్పుకోలేకపోయాయి. జార్జియా లాంటి నల్లజాతి ప్రజలున్న ప్రాంతాలు కూడా దాదాపుగా ట్రంప్ వైపు మారాయి. గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నారు. ఆయన దోషే కావొచ్చు, కానీ దేనికీ గట్టిగా నిలబడలేదు కాబట్టే కమలా హ్యారిస్ ఓడిపోయారు. ఇది వాస్తవం. భారతదేశంలోనూ మోదీ విజయం పట్ల ఇదే తరహా స్పందన కనబడింది. ప్రజలు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా? వారి ఆలోచనలు, కోరికలు, ఆత్రుతలను సరిగ్గా పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి రావడం అనేది నేటి అమెరికాలో... నరేంద్ర మోదీ గత దశాబ్దంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ భారతదేశం అనుభవించిన భావోద్వేగ తీవ్రతను రేకెత్తిస్తోంది. ‘లిబరల్ ప్రెస్’ అని పిలవ బడుతున్న మీడియా దీన్ని ఒక అంధకారయుతమైన, వినాశకర దినానికి సంబంధించిన దృష్టాంతంగా చిత్రించడానికి ఆపసోపాలు పడింది. అదే సమయంలో ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ నేతృత్వంలోని ‘సంప్రదాయవాద మీడియా’... కష్టకాలంలో, ప్రమాదకరమైన పరి స్థితి నుంచి అమెరికాను బయటపడేసిన వీరుడిగా ట్రంప్‌ను అభివర్ణించడంలో పోటీపడుతోంది.మోదీకి వ్యతిరేకంగా భారత ప్రజల భావోద్వేగ మిశ్రమాను భూతి... ట్రంప్ పట్ల అమెరికన్ల ప్రతిస్పందనలతో సమానంగా ఉండటం అసాధారణం. 2014, 2019, 2024లో మోదీ గెలిచిన మూడు ఎన్నికలలోనూ ఎన్నికల పారవశ్యం వర్సెస్ తీవ్ర ఆగ్రహం ప్రధాన లక్షణంగా ఉండింది. కచ్చితంగా, అమెరికాలో లాగానే భారత దేశంలోనూ మధ్యస్థులుగా ఉండేవాళ్లు ట్రంప్, మోదీ లాంటి విభజిత వ్యక్తిత్వాల బరువుతో చాలావరకు కనుమరుగయ్యారు. పెద్ద ప్రశ్న ఏమిటంటే, మీడియా కానీ, రెండు దేశాల్లోని పోల్ నిపుణులు కానీ ఎక్కడ పొరబడుతున్నారు? మోదీ, ట్రంప్‌ను ద్వేషించడాన్ని మనం ఎంతగానో ఇష్టపడుతున్నామా? ప్రజల ఆలోచనలు, కోరికలు, ఆత్రు తలను పట్టించుకుంటున్నాం అనుకుంటున్నప్పటికీ, వారు నిజంగా ఏమి చెబుతున్నారో చూడటానికి, వినడానికి నిరాకరిస్తున్నామా?ట్రంప్ ఫ్లోరిడాలో తన విజయ ప్రసంగం చేసిన తర్వాత కూడా, ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి గౌరవప్రదమైన వార్తాపత్రికలు ట్రంప్ గెలిచినట్లు అంగీకరించడానికే నిరాకరించాయి. భారతదేశంలో కూడా, 2014, 2019 ఎన్నికల్లో నమ్మశక్యం కాని విధంగా మన బుద్ధిని కాకుండా మన హృదయం చెప్పిందానికి తలూపాం. భారతీయులు సంపూర్ణ ఆమోదంతో మోదీకి ఓటు వేస్తున్నారని నమ్మలేకపోయాం. 2022లో యోగీ ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను కైవసం చేసుకున్నారని నమ్మడానికి నిరాకరించాం. కోవిడ్ –19 సమయంలో సంభవించిన వేలాది మంది మరణాలు దేవుడే ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు రుజువు అని చెప్పుకున్నాం. 2024లో, అదే ఉత్తరప్రదేశ్ బీజేపీకి పూర్తిగా ఓట్లను బట్వాడా చేయడానికి నిరాకరించినప్పుడు కూడా మనం సమానంగా షాక్ అయ్యాము.ఈ అన్ని సందర్భాల్లోనూ క్షేత్ర వాస్తవికతను పట్టించుకోకుండానే మనం కథలో చాలా లోతుగా మునిగిపోయాం. ప్రజా తీర్పు మన ముందుకు వచ్చిన తర్వాత కూడా, దాన్ని అంగీకరించడానికి నిరాక రించాం. మోదీ, ట్రంప్‌లలో ఏదో తప్పు ఉందని నొక్కిచెప్పాం. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మరింత అధ్వాన్నంగా, రాహుల్ గాంధీకి లేదా కమలా హ్యారిస్‌కు అదే కఠినమైన ప్రమాణాలను వర్తింప జేయడానికి నిరాకరించాం.కాబట్టి ఈ రోజు వాస్తవాలను ఎదుర్కొందాం. ఏ వైపూ స్థిరంగా నిలబడలేదు కాబట్టే హ్యారిస్ ఓడిపోయారు. ట్రంప్ దోషి, స్త్రీ లోలుడు, ఇంకో ఘోరం వలసలను ఆపి (భారతదేశానికి మంచిది కాదు) అమెరికాకు ఉద్యోగాలు తెస్తానని వాగ్దానం చేశారు. రాహుల్ విషయానికొస్తే, నాలాంటి వ్యక్తులు డిన్నర్ టేబుల్ వద్ద ఆయన అనేక ఆలోచనలతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారు. కానీ ఆయన దేని కోసం గట్టిగా నిలబడతారో అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగానే ఉంటోంది.అమెరికా, భారతదేశం వంటి గజిబిజి ప్రజాస్వామ్యాలు ట్రంప్, మోదీలనే ఎన్నుకుంటాయి. ఎందుకంటే వారు క్షీణతలో లేదా పరి వర్తనలో సమాజాల ద్వారా ఏర్పడే గందరగోళాన్ని సరళీకృతం చేయగలరు. 2021 జనవరి 6న అమెరికన్ క్యాపిటల్‌పై దాడి, 2002 గుజరాత్ అల్లర్లలో చాలామంది మరణించడం లాంటివి ఉన్నప్పటికీ మనం ఎన్నుకున్న నాయకుల జీవితాల్లోని చీకటి కోణాలను విస్మ రిస్తాము. ఎందుకంటే ఈ రోజు మన కష్టతరమైన జీవితాలను మెరుగుపరుస్తారని వారు హామీ ఇచ్చారు. వారి ప్రస్తుత హామీలు మనకు ఓదార్పునిస్తాయి. వారు మనతో సింపుల్‌గా మాట్లాడతారు. మనం వారి ప్రత్యర్థులను నమ్మినదానికంటే, వీరి పట్ల తక్కువ అప నమ్మకం చూపుతాం.డెమోక్రాట్ అనుకూల దక్షిణ యూఎస్ రాష్ట్రం జార్జియాలోని నల్లజాతి ప్రజలున్న జిల్లాలు దాదాపు పూర్తిగా ట్రంప్ వైపు మారాయి. అలాగే ఆయన లాటిన్ అమెరికన్ల ఓటును 14 శాతం మెరుగు పరుచుకున్నారు. ట్రంప్‌కు ఎందుకు ఓటు వేశారని అడిగితే వాళ్లు చెప్పిన ఒక కారణం: ఎటూ వేస్తారని డెమోక్రాట్లు వారి ఓటును తేలిగ్గా తీసుకోవడం. ఇది విన్నట్టు అనిపిస్తోందా? హ్యారిస్‌ను శిక్షించినట్టుగానే హరియాణాలో భూపీందర్ సింగ్ హుడాను ఓటర్లు శిక్షించారు. కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, రావ్ బీరేందర్ సింగ్ వంటి పార్టీలోని తిరుగుబాటుదారులను తన వెంట తీసుకోవడానికి హుడా నిరాకరించారు. హరియాణాలోని ప్రతి నియోజక వర్గంలోనూ జాట్యేతర ఓట్లపై బీజేపీ సూక్ష్మ దృష్టి పెట్టినట్టుగానే, గత 40 ఏళ్లలో ఇతర ఏ రిపబ్లికన్ అభ్యర్థి కన్నా శ్వేతజాతీయేతర ఓట్లను ట్రంప్ అధికంగా గెలుచుకున్నట్లు డేటా చూపిస్తోంది.విచిత్రంగా, యూపీలో బీజేపీ 29 స్థానాలను కోల్పోయినప్పుడు దాని మెజారిటీ తగ్గిందని కాంగ్రెస్ హర్షధ్వానాలు చేయకుండా ఉండ లేకపోయింది. మరో వైపున మోదీకి ఈ ప్రపంచంలో సగం గర్భం రావడం అనేది ఉండదని తెలుసు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటిలాగానే ప్రధానమంత్రిగా తాను చేయాల్సిన పనుల్ని చేయగలరు. పైగా అధి కారాన్ని సంఘటితం చేసుకోవడానికీ, యూపీలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికీ రాబోయే శాసనసభ ఎన్నికలలో గెలవడమే మార్గం. హరియాణా. మహారాష్ట్ర. జార్ఖండ్.కాకపోతే మోదీపై తిరగబడి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని బలవంతం చేసిన పంజాబ్‌కు భిన్నమైన నియమాలు వర్తింపజేయబడుతున్నాయి. గత కొన్ని వారాలుగా వరి సేకరణలో ఉన్న అపారమైన కష్టాల గురించి చాలా ప్రశ్నలు రేగు తున్నాయి. పంజాబ్ సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా ఉండి వ్యవ సాయంపై గణనీయంగా ఆధారపడి ఉన్నందున దీనిని నివారించ లేమా? పంజాబ్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు వరి తరలింపులో కేంద్రం మరింత అవగాహన చూపలేదా? తడిసిన బియ్యాన్ని అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటకకు పంజాబ్ విక్రయించినట్లు ఈ ఏడాదే ఎఫ్‌సీఐ ఎందుకు గుర్తించింది?బహుశా, వీటిలో కొన్ని వైరల్ అయిన కుట్ర సిద్ధాంతాల్లా అనిపిస్తాయి. ఈ చిక్కుముడి ప్రశ్నలకు సమాధానం కావాలంటే – మోదీ, చెప్పాలంటే ట్రంప్ కూడా అధికార స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆ రాజకీయం కిట్టీ పార్టీ కాదు, ఎన్జీవో కాదు. ఓటర్లు నిర్దిష్ట సంఖ్యకు మించి మీకు ఓటు వేయకపోతే అప్పుడు ఇతర చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు 2024 లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో బీజేపీకి వచ్చినవి 18.3 శాతం ఓట్లు. అప్పుడు విభజించు పాలించు అనే పురాతన నియమం ఉండనే ఉంది.ఇప్పుడు ట్రంప్ అమెరికాను గెలుచుకున్నందున, స్వదేశంపై మనం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. మహారాష్ట్రతో పాటు, నవంబర్ 20న మొదలయ్యే పంజాబ్‌లోని నాలుగు నియోజకవర్గాల ఉప ఎన్నికలతో ఆట ప్రారంభిద్దాం.జ్యోతి మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ సంపాదకురాలు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు. హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు -
ట్రంప్ పాలనలో మస్క్‌కు కీలక పాత్ర..!
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్ కూడా చేరినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.జెలెన్స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పేషీలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్‌నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.ఇలాన్‌మస్క్ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్‌ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్‌ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్‌తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్‌నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్‌హౌజ్‌ను తలిపించేలా సింక్‌తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు. -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
వైట్‌హౌజ్‌కు బ్రైట్ స్టార్స్
అత్యుత్తమ ప్రతిభావంతుల గురించి పద్మిని పిళ్లై, నళినీ టాటాలు కాలేజి నుంచి యూనివర్శిటీ రోజుల వరకు ఎన్నోసార్లు విని ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జాబితాలో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చేరారు. ఇది అదృష్టం కాదు. జ్ఞానదాహం, లోతైన విశ్లేషణ సామర్థ్యం తాలూకు అత్యుత్తమ ఫలితం. భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోంగ్రామ్ (2024–2025)కు ఎంపిక అయ్యారు....‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటాలు ఉన్నారు.బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజనీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుండగా, న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ క్యాబినెట్ అఫైర్స్‌లో పనిచేస్తుంది. ‘వైట్‌హౌజ్ ఫెలోస్ ప్రోగ్రాం’ను 1964లో మొదలుపెట్టారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన ప్రోంగ్రాములలో ఇదొకటి. తమ రంగంలో సాధించి విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ... మొదలైనవి ఎంపిక ప్రక్రియలోని ప్రధాన అంశాలు.ఎంపికైన వ్యక్తులు క్యాబినెట్ కార్యదర్శులు, ఇతర ఉన్నత స్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌజ్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన నాయకులతో రౌండ్ టేబుల్ చర్చలలో వీరు కూడా పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ‘వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాం’కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంది. అయినప్పటికీ తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌజ్ ఫెలోస్ప్రోంగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని ‘స్కిల్డ్ బంచ్’గా పిలుస్తున్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఇమ్యునో ఇంజినీర్ గా పద్మిని పిళ్లైని వైట్‌హౌజ్ వెబ్సైట్ ప్రశంసించింది. పద్మిని గతంలో ఎంఐటీలో ట్యూమర్–సెలెక్టివ్ నానోథెరపీపై పనిచేసిన టీమ్‌కు నాయకత్వం వహించింది.2013లో అనారోగ్యానికి గురైన పద్మిని దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లింది. ఆసుపత్రులలో రోజుల తరబడి గడిపింది. ‘ఆసుపత్రి నుంచి బయటపడిన తరువాత చిన్న పని చేసినా అలిసి పోయేదాన్ని. ఇలా అవుతోందేమిటా అని ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను. ఫుల్ ఎనర్జీ రావడానికి నెలల సమయం పట్టింది. నిరాశలో ఉన్నప్పుడు మనకు ధైర్యం చెప్పేవాళ్లు కుటుంబం, స్నేహితులలో ఉండడం అవసరం’ అంటుంది పద్మిని.రెగిస్ కాలేజీ నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్శిటీలో ఇమ్యునో బయాలజీలో పీహెచ్డీ చేసిన పద్మిని పిళ్లై కోవిడ్ మహమ్మారి విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమె ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్, న్యూయార్క్ టైమ్స్‌లాంటి ప్రముఖ మీడియా సంస్థలు కవర్ చేశాయి.ఇక నళిని టాటా విషయానికి వస్తే.. బ్రౌన్ యూనివర్శిటీలో న్యూరోబయోలాజీలో బీఎస్సీ, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. ‘హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పోందింది. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలనైనే కాదు రాజకీయ, ఆర్థిక విషయాలపై కూడా నళినీ టాటాకు ఆసక్తి ఉంది. -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Cris Comerford: ఆ రుచికి రిటైర్మెంట్
‘విందు భోజనం అంటే సరైన సమయంలో సరైన పదార్థం అందించడమే’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. అన్య జాతులకు ప్రవేశం లేని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వంటశాలలో ప్రవేశం సాధించిన మొదటి మహిళ ఆమె. తొలి శ్వేత జాతీయేతర మహిళ కూడా! 30 ఏళ్లు వైట్‌హౌస్‌లో పని చేశాక తన 61వ ఏట జూలై 31న ఆమె రిటైర్ అయ్యారు. ఎందరో దేశాధినేతలకు తన చేతి వంట తినిపించిన క్రిస్ కమర్‌ఫోర్డ్ పరిచయం.‘అమెరికాకు అనేక మంది రాయబారులు ఉంటారు. కాని క్రిస్ కమర్‌ఫోర్డ్ షెఫ్‌గా ఉండక శాకపాకాల రాయబారి వలే అలాంటి పనే చేశారు. అమెరికా రుచులను ప్రపంచనేతలకు పంచి ఎలా ఉత్సవభరితం చేయవచ్చో చూపించారు’ అని క్రిస్ కమర్‌ఫోర్డ్ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సమకాలిక షెఫ్ ఒకరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్ ‘క్రిస్ కమర్‌ఫోర్డ్ తన టీమ్‌తో కలిసి ప్రేమ, ఆ΄్యాయతలతో కూడిన రుచులతో మా ఆత్మలను నింపారు’ అని వీడ్కోలు సందేశంలో పేర్కొంది. క్రిస్ కమర్‌ఫోర్డ్ విజయగాథ...ఫిలిప్పైన్స్ నుంచిక్రిస్ కమర్ఫోర్డ్ది ఫిలిప్పైన్స్. మనీలాలో బాల్యం గడిచింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫుడ్ టెక్నాలజీలో పి.జి. చేయాలనుకుంది. ‘నాకు సైన్స్ ఇష్టం. ఫుడ్ టెక్నాలజీలో పరిశోధన చేయాలనుకున్నాను. కాని మా నాన్న నువ్వు కలనరీ ఇన్స్టిట్యూట్లో చదివితే ఇంకా రాణిస్తావు అన్నాడు. నేను మా నాన్న సలహాను పాటించడం వల్లే పాకశాస్త్రం తెలుసుకొని వైట్‌హౌస్ దాకా వచ్చాను. కాబట్టి పెద్దల మాట వినండి’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. తన 23వ ఏట అమెరికా వలస వచ్చిన క్రిస్ మొదట షికాగో, తర్వాత న్యూయార్క్ రెస్టరెంట్లలో పని చేసింది. వైట్‌హౌస్‌లో వంటశాలలో మహిళలను తీసుకోక΄ోయినా, శ్వేతజాతీయేతర మహిళలను తీసుకునే అవకాశం అసలు లేక΄ోయినా 1995లో నాటి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వాల్టర్ స్టాన్లీ ఆమెను అసిస్టెంట్ షెఫ్‌గా తీసుకున్నాడు.మన్మోహన్ సింగ్‌తో ప్రమోషన్నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో అమెరికా సందర్శించినప్పుడు వైట్ హౌస్‌లో భారీ విందు జరిగింది. దానికి కావలసిన వంటా వార్పు అంతా క్రిస్ చూసింది. విందుకు హాజరైన వారంతా ఆహా ఓహో అన్నారు. క్రిస్ ప్రతిభ గమనించిన జార్జ్‌బుష్ సతీమణి లారా బుష్ ఆమెకు ఎగ్జిక్యూటివ్ షెఫ్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వైట్‌హౌస్‌లోని సకల వంటా వార్పులకు సర్వోన్నత అధికారి. ఆమె పర్యవేక్షణలోనే దేశాధినేతలు వచ్చినప్పుడు వైట్‌హౌస్‌లో ఇచ్చే గౌరవ విందు, హాలిడే ఫంక్షన్లు, రిసెప్షన్లు, అధికారిక విందులు జరుగుతాయి.ఆహారమే ఆరోగ్యం‘దేశ భవిష్యత్తు నిర్మించడమంటే నేటి బాలలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే’ అంటుంది క్రిస్. ‘పాకశాస్త్రం తెలిసిన వారు ఏది ఉత్తమమైన ఆహారమో ఏది ΄ûష్టికతతో నిండినదో తర్వాతి తరాలకు తెలియ చేయాలి. పిల్లలు మెచ్చుకునే రీతిలో ఆరోగ్యకరమైన వంటలు చేయగలగాలి. వారిని కూరగాయలతో గడపనివ్వాలి. కూరగాయల మడులకు తీసుకెళ్లాలి. వంట పట్ల అభిరుచి, అవగాహన కలిగించాలి’ అంటుందామె. వంట ఒక సవాలువైట్ హౌస్‌లో వంట ఒక సవాలు. జపాన్ దేశాధినేత వచ్చినప్పుడు ఒక మెనూ, కెన్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక మెనూ, భారత ప్రధాని వచ్చినప్పుడు మరో మెనూ తయారు చేయాలి. ఒకోసారి ఆయా దేశాలకు చెందిన వంటవాళ్లను రప్పించి వారితో కలిసి వండాలి. ‘ప్రతి విందుకు నాలుగు రోజుల ముందు నుంచే సిద్ధమవుతాం. సలాడ్లు తాజాగా ఉండేందుకు ఆ రోజున వైట్‌హౌస్‌లోని తోట నుంచి ఆకులు, దుంపలు సేకరిస్తాం. పండిన కూరగాయలు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. వైట్ హౌస్‌లో ఉపయోగానికి రాక΄ోతే అవసరమైనవారికి పంపించేస్తాను’ అంది క్రిస్. -
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు 2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు. కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్ ఔట్) కారణంగా ఆ పిల్లలు తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్ ఆరోపించింది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు. చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు. కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. -
క్వాడ్ సదస్సు కోసం భారత్‌కు బైడెన్
వాషింగ్టన్: భారత్ నేతృత్వంలో ఈ ఏడాది జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హాజరవుతారని వైట్‌హౌజ్ ప్రకటించింది. ఈ ఏడాది క్వాడ్ నేతల సదస్సుకు హాజరయ్యేందుకు తాము కట్టుబడి ఉన్నామని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ సలహాదారు జాన్ కిర్బీ తెలిపారు.బైడెన్ ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడంతో ఆయన షెడ్యూల్లో చాలా సమయం ఉందని చెప్పారు. 2020 నుంచి క్వాడ్ సదస్సులు వర్చువల్ విధానంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మాత్రం భారత్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది జనవరి చివరివారంలో జరగాల్సిన క్వాడ్ సదస్సును భారత్ వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది. -
బ్రహ్మాండంగా బైడెన్ ఆరోగ్యం.. నిర్ధారించిన వైట్ హౌస్ వైద్యులు
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మతిమరుపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వదంతుల్ని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఖండించారు. అధ్యక్షుడి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి జోబైడెన్ ఆరోగ్యం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై డాక్టర్ కెవిన్‌ను ప్రశ్నించారు.ప్రస్తుతం జోబైడెన్ ఆరోగ్యం ఎలా ఉంది? అధ్యక్ష పదవి ముగిసేలోపు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. లేదు.లేదు. ఆయ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మరి మానసిక పరిస్థితి ఎలా ఉందని అడగ్గా.. అద్భుతంగా ఉందని బదులిచ్చారు. మరోవైపు ఆనారోగ్యం కారణంగా డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది సార్లు వైట్ హౌస్‌లో బైడెన్‌తో భేటీ అయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.In just a few months, the American people will choose the course of America’s future. I made my choice.And I would like to thank our great Vice President—@KamalaHarris.She’s experienced, tough, capable. She has been an incredible partner to me and leader for our country.— Joe Biden (@JoeBiden) July 25, 2024 అధ్యక్ష రేసు నుంచి అవుట్ఇటీవల బైడెన్‌కు తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో ఓటమి భయం మొదలైంది. అందుకే మరోసారి బైడెన్‌ను అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. బాహాటంగా నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.కమలా హారిస్ సమర్థురాలంటూపదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలంటూ... ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న ఆరు నెలల పదవీకాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. -
బైడెన్‌కు కరోనా నెగిటివ్.. వైట్‌హౌస్ వేదికగా భావోద్వేగం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా టెస్టుల అనంతరం ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. దీంతో, ఆయన మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా బైడెన్ స్పందిస్తూ.. వైట్ హౌస్‌లో మళ్లీ అడుగుపెట్టడం ఓ ఆనందంగా ఉందన్నారు.కాగా, కరోనా పాజిటివ్ కారణంగా జో బైడెన్ ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నెగిటివ్‌గా తేలడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైడెన్‌కు చికిత్స అందించిన డాక్టర్ కెవిన్ ఓ కన్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యం చాలా బాగుంది. బైడెన్లో కరోనా లక్షణాలో లేవు. టెస్టుల్లో నెగిటివ్‌గా తేలింది అంటూ కామెంట్స్ చేశారు. It's great to be back at the White House. pic.twitter.com/f2HLk1Jp3O— President Biden (@POTUS) July 23, 2024 మరోవైపు.. బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా తర్వాత మళ్లీ వైట్ హౌస్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చారు. 🚨 UPDATE: President Biden just boarded Air Force One and is on his way back to the White House. pic.twitter.com/k2wNDleGa3— Chris D. Jackson (@ChrisDJackson) July 23, 2024 ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా చాలా రోజుల నుంచి బైడెన్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ‘వేర్ ఈజ్ జో’ అనే ట్యాగ్ ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లోకి వచ్చింది. బైడెన్ ఎందుకు కనిపించడం లేదంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధ్యక్షుడు బైడెన్ గతవారం కరోనా బారినపడ్డారు. ఐసోలేషన్‌లో ఉన్నారంటూ ‘వైట్‌హౌస్’ ఒక ప్రకటన కూడా చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి.అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, రాత్రి గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొందంటూ సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. కాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మరో సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పించేందుకు బైడెన్‌పై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. -
జో బైడెన్‌కు పార్కిన్సన్స్.? క్లారిటీ ఇచ్చిన డాక్టర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్సన్స్(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు. కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్సన్ లేదని ఆయన ఫిజీషియన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. -
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్‌హౌస్‌లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్‌గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్‌హైస్‌లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్‌కి చాట్‌జిపిటి గురించి వివరించడంతోనే వెట్‌హౌస్‌లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్‌ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
USA: భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన వైట్‌హౌస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలి కాలంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తుల దాడుల్లో భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వరుస దాడులపై అమెరికాలోని వైట్ హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ క్రమంలో భారతీయులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అలాగే, అమెరికాలో జాతి వివక్షకు, హింసకు తావులేదని తేల్చి చెప్పింది. వివరాల ప్రకారం.. అమెరికాలో భారత సంతతి వారిపై దాడులను వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలో జాతివివక్షకు, హింసకు తావు లేదని తేల్చింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ విభాగం కోఆర్డినేటర్ జాన్ కర్బీ తాజాగా ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. భారతీయులపై దాడులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘జాతి, ప్రాంతం, స్త్రీపురుష బేధాలు సహా మరే ఇతర కారణాలతో జరిగే దాడులైనా క్షమార్హం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ దాడులను ఖండిస్తోంది. వీటిని అరికట్టేందుకు బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది. ఈ దాడుల కారణమైన వారికి కఠినంగా శిక్షిస్తాం అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. నిన్న(గురువారం) కూడా మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలబామాలో హోటల్ నడుపుతున్న ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచ్చిన ఓ కస్టమర్ గన్‌తో కాల్చి చంపాడు. మరోవైపు.. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ తెలిపారు. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు. మరణాలు ఇవే.. ఇక, ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా హత్యకు గురయ్యాడు. సయ్యద్ మజర్ అలీపై కొందరు దాడి చేసి అతడి ఫోన్, వ్యాలెట్ దోపిడీ చేశారు. శ్రేయాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందినట్టు బయటపడింది. -
అమెరికా వైట్‌హౌజ్ గేటుపైకి దూసుకెళ్లిన కారు
వాషింగ్టన్: అమెరికా వైట్‌హౌజ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్వేత సౌధం కాంప్లెక్స్ బాహ్య ద్వారంపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వైట్‌హౌజ్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి.. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని సిక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. #WATCH | Washington, DC: A vehicle crashed into a gate of the White House complex on January 8. A driver was taken into custody as 'the cause and manner' of the incident is being investigated, reports Reuters citing the US Secret Service. (Source: Reuters) pic.twitter.com/WHt5ilnbWc — ANI (@ANI) January 9, 2024 ఇక.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో జోబైడెన్, జిల్ బైడెన్ క్షేమంగా బయటపడ్డారని యూఎస్ సిక్రెట్ సర్వీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: India-Maldives Row:మాల్దీవుల వివాదం: ద్వేషాన్ని భారత్ అస్సలు సహించదు -
మరో షాక్.. ట్రంప్‌కు మూసుకుపోతున్న దారులు
అగస్టా: అగ్రరాజ్య అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌కు రెండోసారి చేరుకునే క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో న్యాయస్థానం ప్రకటించిన పట్టుమని పదిరోజుల గడవక ముందే.. మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనే(Maine) స్టేట్ గురువారం ప్రకటించింది. అమెరికా చట్టసభ క్యాపిటల్(US Capitol Hill)పై 2021, జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అయితే ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతీ తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనే స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ అక్కడి ఎన్నికల విభాగం నిర్ణయించింది. దీంతో.. మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్‌పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరారు అని షెన్నా బెల్లోస్ పేర్కొన్నారు. ఇక.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. తాజా పరిణామాలతో (సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప).. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్ జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
వైట్‌హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
సీక్రెట్ వైట్‌హౌస్! ప్రపంచంలోనే అందమైన భవంతి!
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవంతి ఏదంటే అంతా ‘గుయాంగ్ వైట్‌హౌస్’ పేరే చెబుతున్నారు. ఇప్పుడు అది రహస్య భవంతిగా పేరు పొందింది. చైనాలోని హువాగువోయువాన్ వెట్‌ల్యాండ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఈ పన్నెండు అంతస్తుల మేడ.. అమెరికా అధ్యక్ష భవంతి వైట్‌హౌస్‌ను తలపించేలా ఉంటుంది. ముందున్న సరస్సుతో పాటు మొత్తం 18.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుందీ భవనం. విలాసవంతమైన దాని ఇంటీరియర్‌ను రోజ్‌వుడ్‌తో చేసి ఉంటారని ఊహిస్తున్నారు. అయితే భవంతి లోపలి ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించనందున ఆ సమాచారాన్ని ఇంకా ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ భవంతిని డజన్ల కొద్దీ గార్డులు 24 గంటలూ పహారా కాస్తుంటారు. దీన్ని చూడటానికి చైనా నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతుంటారు. కానీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లేదు. అయితే గుయాంగ్ వైట్ హౌస్ ఎవరిదనేది ఎవరికీ తెలియదు. కొందరు ఇది గుయిజౌ హాంగ్లిచెన్ గ్రూప్ సీఈవో జియావో చున్‌హాంగ్ నివాసమని అంటున్నా, అది ఎంతవరకు నిజమో తెలియదు. (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఆందోళనలు
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదిలావుండగా పాలస్తీనియన్ మద్దతుదారులు అమెరికాలోని వైట్ హౌస్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాలస్తీనియన్ అనుకూలవాదుల నిరసనలతో వాషింగ్టన్ డీసీ నగరంలోని వీధుల్లో రద్దీ నెలకొంది. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు చేతబట్టిన నిరసనకారులలో ఎక్కువగా యువకులు ఉన్నారు. గాజాలో రక్తపాతానికి సూచికగా నిరసనకారులు వైట్ హౌస్ గేట్‌పై ఎరుపు రంగును చల్లారు. పాలస్తీనా అనుకూల నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు లాఫాయెట్ పార్క్‌లోని జనరల్ మార్క్విస్ డి లఫాయెట్ విగ్రహాన్ని పాలస్తీనా జెండాలతో కప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతి నిర్మూలనకు మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. అక్టోబరు 7న గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య మధ్య భీకర యుద్ధం మొదలైంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. అక్టోబరు 7 నుండి జరుగుతున్న యుద్ధంలో 9,400 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..