winter parliament sessions
-
రాజ్యాంగం వాళ్లకు ప్రైవేట్ జాగీరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై, నెహ్రూ– గాంధీ కుటుంబంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాజ్యసభలో నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యాంగాన్ని కూడా తమ వ్యక్తిగత జాగీరుగా ఆ కుటుంబం పరిగణించింది. అందుకే కనీసం పార్లమెంటు అనుమతి కూడా లేకుండానే రాజ్యాంగంలోకి ఆర్టీకల్ 35ఏను చొప్పించే దుస్సాహసానికి తెగబడింది. చివరికి పార్లమెంటును కూడా మోసగించిన చరిత్ర కాంగ్రెస్‌ది! రాజ్యాంగం పేరిట 75 ఏళ్లుగా లెక్కలేనన్ని ద్రోహాలకు పాల్పడుతూ వస్తోంది’’ అంటూ మండిపడ్డారు. స్వీయ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఇష్టానికి సవరించిందంటూ పలు ఉదంతాలను ఉటంకించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండికొట్టే తొలి రాజ్యాంగ సవరణతో దేశ మొదటి ప్రధాని నెహ్రూయే ఇందుకు తెర తీశారని ఆరోపించారు. ‘‘సంతుష్టికరణ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా. తన ఓటు బ్యాంకుకు భంగం కలుగుతుందని ముస్లిం మహిళలకు ఏళ్ల తరబడి హక్కులను నిరాకరించిన చరిత్ర ఆ పార్టీది. ముస్లింలకు రిజర్వేషన్లు కలి్పచేందుకు 50 శాతం పరిమితిని అతిక్రమించేందుకు కూడా వెనకాడలేదు! తన పాలనలోని రెండు రాష్ట్రాల్లో రాజ్యాంగ విరుద్ధంగా మతాధారిత రిజర్వేషన్లు తెచి్చంది’’ అంటూ ఆరోపించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యసభలో జరిగిన రెండు రోజుల చర్చకు మంత్రి బదులిచ్చారు. బీజేపీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నంత కాలం మతాధారిత రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించారు. వెనకబడ్డ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయతి్నంచలేదని షా ఆరోపించారు. ఎన్నికల ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం ఇప్పటికైనా కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌లో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.జమిలి బిల్లు కాంగ్రెస్ పుణ్యమే: నడ్డా కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండగా కాంగ్రెస్ చేసిన నిర్వాకాల వల్లే మోదీ సర్కారు జమిలి ఎన్నికల బిల్లు తేవాల్సిన అవసరం ఏర్పడిందని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అన్నారు. మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకూ తొలుత ఒకేసారి ఎన్నికలు జరిగేవి. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు తమకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వాలను యథేచ్ఛగా కూలదోయడంతో జమిలికి బ్రేక్ పడింది’’ అని చెప్పారు. ‘‘ఎమర్జెన్సీ కాంగ్రెస్ చరిత్రపై చెరగని మచ్చ. అందుకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పిందనడం పచ్చి అబద్ధం. మైనారిటీల సంతుïÙ్టకరణ రాజకీయాల్లో భాగంగా మతాధారిత రిజర్వేషన్లకు కాంగ్రెస్ తెర తీయజూస్తోంది. ఆ ప్రయత్నాలను పలుమార్లు కోర్టులు అడ్డుకున్నా దాని తీరు మారడం లేదు. ట్రిపుల్ తలాక్, ఆర్టీకల్ 370పై కాంగ్రెస్ వైఖరి మొదలుకుని షాబానో తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాజ్యాంగ సవరణ దాకా ఇందుకు ఉదాహరణలెన్నో’’ అని నడ్డా ఆరోపించారు. వాటిపై ఆ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల మాటేమిటని కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి కేవలం ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన కలి్పంచినవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలి్పంచుకున్నారు. సభను జైరాం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా సామాజిక, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించింది తప్ప మతాధారితంగా కాదంటూ జైరాం బదులిచ్చారు. వారిద్దరి మధ్య వాడివేడి చర్చ సాగింది. -
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
నెహ్రూ, గాంధీ కుటుంబ పాలనలో... రాజ్యాంగానికి గాయం
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు. ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఆ నినాదం.. అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగమే ఐక్యతా సాధనం సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు. 11 తీర్మానాలు ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు. 1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి. 2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు. 4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి. 5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం. 6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి. 7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. 8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. 9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం. 11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది. -
సావర్కర్‌ను ప్రశంసించిన ఇందిరా గాంధీ: బీజేపీ
న్యూఢిల్లీ: సావర్కర్‌పై రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సావర్కర్‌ను ఇందిరాగాంధీ కూడా ప్రశంసించారని పేర్కొంది. సావర్కర్ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియాలంటే అండమాన్‌లోని సెల్యూలార్ జైలును రాహుల్ సందర్శించాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఎన్డీఏ భాగస్వామి శివసేన (షిండే) ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా లోక్‌సభలో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రాహుల్ నాన్నమ్మ ఇందిర కూడా సావర్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రుడంటూ పొగిడారు. సావర్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు’’ అన్నారు. సావర్కర్‌ను కొనియాడుతూ పండిట్ బాఖ్లేకు ఇందిర రాసిన లేఖను సభలో చదివి వినిపించారు. సావర్కర్‌ను ప్రశంసించినందుకు ఇందిర కూడా కాంగ్రెస్ లెక్క ప్రకారం రాజ్యాంగ వ్యతిరేకి అవుతారా అని ప్రశ్నించారు. సావర్కర్‌పై విమర్శలు రాహుల్‌కు అలవాటుగా మారాయని మండిపడ్డారు. -
మనుస్మృతి మద్దతుదారులు!
న్యూఢిల్లీ: ‘‘బీజేపీకి, ఆరెస్సెస్‌కు రాజ్యాంగంపై విశ్వాసం లేదు. అవి కేవలం మనుస్మృతినే చట్టంగా భావిస్తున్నాయి. దానికే మద్దతిస్తున్నాయి’’ అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది తప్ప మనుస్మృతి ప్రకారం కాదని తేలి్చచెప్పారు. ‘‘పాలక పక్షానికి సుప్రీం నేత అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ రాజ్యాంగాన్ని విమర్శించారు. అందులో భారతీయతే లేదన్నారు. మనుస్మృతి ప్రకారమే దేశం నడవాలని కోరుకున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా వారి సుప్రీం లీడర్‌ను నవ్వులపాలు చేస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో రెండో రోజు శనివారం రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. పేదలను కాపాడుతున్న రాజ్యాంగంపై బీజేపీ నిత్యం దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. బ్రిటిషర్లతో రాజీపడ్డ సావర్కర్ బీజేపీ సుప్రీం లీడర్ సావర్కర్ మాటలతోనే ప్రసంగం ప్రారంభిస్తానని రాహుల్ అన్నారు. ‘‘వేదాల తర్వాత అత్యంత ఆరాధనీయ గ్రంథం మనుస్మృతి అని సావర్కర్ చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, ఆలోచనలకు మనుస్మృతే ఆధారమన్నారు. మన ఆధ్యాతి్మక, దైవిక మార్గాన్ని అది నిర్దేశించిందని చెప్పారు. మను స్మృతి ఆధారంగానే దేశం నడుచుకోవాలంటూ రచనలు, పోరాటం చేశారు. ఇప్పుడు మీరేమో (బీజేపీ) రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడు తున్నారు. అంటే మీ నాయకుని బోధలకు మద్దతిస్తున్నట్టా, లేదా? మీరు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటమంటే సావర్కర్‌ను మీరు అవమానిస్తున్నట్లే. హేళన చేస్తున్నట్టే. కించపరుస్తున్నట్టే. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కూడా సావర్కర్‌ను ప్రశంసించారంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి సావర్కర్ బ్రిటిషర్లతో రాజీపడ్డారని ఇందిర ఆరోపించారు. గాం«దీజీ, నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో జైలుకెళ్తే సావర్కర్ మాత్రం బ్రిటిషర్లకు క్షమాపణ లేఖ రాసి మరీ జైలు నుంచి బయటపడ్డారని అప్పట్లో ఇందిర విమర్శించారు’’ అని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కురుక్షేత్ర యుద్ధంలో మాదిరిగా నేడు దేశంలో రెండు పక్షాలు ఇరువైపులా మోహరించాయని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకటి రాజ్యాంగాన్ని కాపాడే పక్షం. మరొకటి దాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న పక్షం. మేం ప్రతి రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మాకు తమిళనాడులో పెరియార్, కర్ణాటకలో బసవన్న, మహారాష్ట్రలో పూలే, అంబేడ్కర్, గుజరాత్లో గాంధీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్‌ను సందర్శించా. సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించా. బాధిత కుటుంబం అవమానంతో ఇంటికి పరిమితమైతే నిందితులేమో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బాధిత కుటుంబం ఇంటికే పరిమితం కావాలని రాజ్యాంగంలో రాసుందా? అది కేవలం మీ (బీజేపీ) పుస్తకంలోనే రాసుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం సురక్షితమైన చోటికి మార్చకపోతే మేమే ఆ పని చేస్తాం. సంభాల్ హింసాకాండలో ఐదుగురు అమాయకులు బలయ్యారు. సమాజంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది’’ అంటూ దుయ్యబట్టారు. కులం, మతం, వర్గం పేరిట ప్రజలను విడగొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.బలహీన వర్గాల బొటనవేళ్లు నరికేస్తున్నారు ‘‘ఏకలవ్యుడు గురుదక్షిణ కింద బొటనవేలు నరికి ద్రోణాచార్యుడికి సమరి్పంచాడు. నేడు మోదీ ప్రభుత్వం యువత, కార్మికులు, వెనుకబడిన తరగతులు, పేదల బొటన వేళ్లను నిస్సిగ్గుగా నరికేస్తోంది. వారి నైపుణ్యాలను, జీవనోపాధిని దెబ్బతీస్తోంది’’ అంటూ రాహుల్ దుయ్యబట్టారు. ‘‘అగి్నపథ్ తెచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. పదవుల భర్తీకి లేటరల్ ఎంట్రీ విధానం తెచ్చారు. పేపర్ లీకేజీలు కొనసాగిస్తున్నారు. ఇలా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ఆరోపించారు. మోదీ దన్నుతో అదానీ సామ్రాజ్యం దేశంలో కీలక రంగాల్లోకి విస్తరించిందన్నారు. ‘‘మేం అధికారంలోకి వస్తే దేశమంతటా కులగణన నిర్వహిస్తాం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం’’ అని పునరుద్ఘాటించారు. -
పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటన..
న్యూఢిల్లీ: 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కొని ప్రాణ త్యాగం చేసిన భద్రతా సిబ్బందికి లోక్‌సభ శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అమరుల గౌరవార్థం సభ్యులంతా లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం పాత పార్లమెంట్ సంవిధాన్ సదన్ వెలుపల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు అమరులకు సెల్యూట్ చేశారు. అనంతరం మౌనం పాటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో నేతలు మాట్లాడారు. కాగా, అప్పటి ఘటనలో పార్లమెంట్ భద్రతా విభాగం, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్లకు చెందిన 8 మంది సిబ్బందితోపాటు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి నేలకొరిగారు. పార్లమెంట్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించేందుకు తెగబడిన పాకిస్తాన్‌కు చెందిన మొత్తం ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.సర్వదా రుణపడి ఉంటాం: రాష్ట్రపతి ముర్ము 2001లో ఉగ్ర మూకల దాడి నుంచి పార్లమెంట్‌ను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. అమరులకు సర్వదా రుణపడి ఉంటామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఉగ్రమూకలను జాతి యావత్తూ కలిసి కట్టుగా ఎదుర్కొందని, ఉగ్రవాదంపై పోరుకు దేశం కట్టుబడి ఉంటుందని ఆమె ‘ఎక్స్’లో తెలిపారు. -
సంవిధాన్.. సంఘ్ కా విధాన్ కాదు
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అంటే సంఘ్ విధానం కాదన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా అన్నారు. భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ కాదని తేల్చిచెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆమె శుక్రవారం లోక్‌సభలో 32 నిమిషాలపాటు హిందీ భాషలో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. న్యాయం, ఐక్యత, భావప్రకటనా స్వేచ్చకు రాజ్యాంగం ఒక రక్షణ కవచమని ఉద్ఘాటించారు. అలాంటి మహోన్నత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రియాంక ఇంకా ఏం మాట్లాడారంటే... నెహ్రూ పాత్రను ఎవరూ చెరిపేయలేరు ‘‘ఆర్థిక న్యాయానికి, రైతులకు, పేదలకు భూములు పంపిణీకి చేయడానికి మన రాజ్యాంగమే పునాది వేసింది. బీజేపీ నేతలు తరచుగా జవహర్లాల్ నెహ్రూను వేలెత్తి చూపుతున్నారు. వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నెహ్రూపై నిందలు వేస్తున్నారు. దేశం కోసం మీరేం చేస్తున్నారో చెప్పకుండా నెహ్రూను విమర్శిస్తే లాభం లేదు. గతంలో అది జరిగింది, ఇది జరిగింది అని బీజేపీ సభ్యుల విమర్శలు చేస్తున్నారు. రాజకీయ న్యాయం గురించి మాట్లాడుతున్నారు. డబ్బు బలంతో ప్రభుత్వాలను పడగొట్టింది మీరు కాదా? మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యాంగం అమలు కాలేదు. బీజేపీకి నిజంగా ధైర్యం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడు అసలు నిజం ఏమిటో బయటపడుతుంది. మోదీకి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గతంలో రాజులు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్లేవారని చదువుకున్నాం. తమ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో రాజులు స్వయంగా తెలుసుకొనేవారట. తమపై ప్రజల ఆరోపణలు ఏమిటో గ్రహించేవారట. ఇప్పటి రాజు(నరేంద్ర మోదీ) వేషాలు మార్చేయడంలో ఆరితేరిపోయారు. కానీ, ప్రజల్లో వెళ్లే ధైర్యం గానీ, ఆరోపణలు వినే ధైర్యం గానీ ఆయనకు లేదు. మన ప్రధానమంత్రి రాజ్యాంగం ఎదుట తలవంచి నమస్కరించారు. రాజ్యాంగానికి నుదురు తాకించారు. సంభాల్, హథ్రాస్, మణిపూర్‌లో న్యాయం కోసం ఆక్రోశించినప్పుడు ఆయన మనసు చలించలేదు. ఆయన నుదుటిపై చిన్న ముడత కూడా పడలేదు. రాజ్యాంగాన్ని మోదీ అర్థం చేసుకోలేదు.భయాన్ని వ్యాప్తి చేసినవారు భయంతో బతుకుతున్నారు దేశంలో కుల గణన జరగాలన్నదే ప్రజల అభిమతం. అందుకోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభించాలి. కేవలం ఒక్క బిలియనీర్(గౌతమ్ అదానీ) కోసం దేశ ప్రజలంతా కష్టాలు అనుభవించాలా? దేశంలో అసమానతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నట్లుగానే నేడు భయం అంతటా ఆవహించింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాం«దీజీ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకవైపు, బ్రిటిషర్లతో అంటకాగిన భావజాలం కలిగిన వ్యక్తులు మరోవైపు ఉన్నారు. భయానికి ఒక లక్షణ ఉంది. భయాన్ని వ్యాప్తి చేసేవారే ఆదే భయానికి బాధితులవుతారు. ఇది సహజ న్యాయం. నేడు దేశంలో భయాన్ని వ్యాప్తి చేసినవారు అదే భయంతో బతుకున్నారు. చర్చకు, విమర్శకు భయపడుతున్నారు’’ అని ప్రియాంక అన్నారు. -
నేను రైతు బిడ్డను.. నేను కార్మికుడి బిడ్డను
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై శుక్రవారం ఎగువ సభలో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. చైర్మన్ ధన్‌ఖడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ మొదటి గంటలోనే సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే తొలుత బీజేపీ సభ్యుడు రాధామోహన్ దాస్ మాట్లాడారు. ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అంశాన్ని లేవనెత్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజులకు సభలో చర్చ జరగాల్సి ఉండగా, ప్రతిపక్షాలు నిత్యం ధన్‌ఖడ్‌పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని తప్పుపట్టారు. దేశాన్ని, ఉపరాష్ట్రపతి పదవిని, రైతులను కించపరుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రపతులను, ఉప రాష్ట్రపతులను అగౌరవపర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను పదేపదే కించపర్చేవారని చెప్పారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మృతిచెందితే అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వలేదని, మృతదేహాన్ని పటా్నకు తరలించారని గుర్తుచేశారు. అంత్యక్రియలకు హాజరు కాకూడదని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను నెహ్రూ కోరారని తెలిపారు. అయినప్పటికీ నెహ్రూ మాట లెక్కచేయకుండా పటా్నలో బాబూ రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలకు రాధాకృష్ణన్ హాజరయ్యారని వెల్లడించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేవలం ఒక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆరాటపడుతోందని బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి విమర్శించారు. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీకి ధన్‌ఖడ్ అవకాశం ఇచ్చారు. ధన్‌ఖడ్ రైతు బిడ్డ అయితే, ఖర్గే కార్మికుడి బిడ్డ అని చెప్పారు. దళితుడైన ఖర్గేకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను. దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తా. మీకు(విపక్షాలు) నిత్యం ఒక్కటే పని. నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నాపై దు్రష్పచారం చేస్తుండడం వ్యక్తిగతంగ బాధ కలిగిస్తోంది. ఇప్పటికే చాలా సహించా. నాపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కుమీకు ఉండొచ్చు. నోటీసు ఇచ్చాక చర్చ జరగడానికి 14 రోజులు వేచి చూడాలి. కానీ, వేచి చూసే ఓపిక మీకు లేదు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు’’ అని ధన్‌ఖఢ్ మండిపడ్డారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మీ గొప్పలు వినడానికి రాలేదు: ఖర్గే ఆ తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘మీరు(ధన్‌ఖడ్) బీజేపీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. మాపై ఉసిగొల్పుతున్నారు. నేను కార్మికుడి బిడ్డను. జీవితంలో మీకంటే ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నా. మీరు మా పార్టీని, మా పార్టీ నాయకులను కించపరుస్తున్నారు. మీరు చెప్పుకొనే గొప్పులు వినడానికి మేము ఇక్కడికి రాలేదు. చర్చ కోసం వచ్చాం. మీరు పక్షపాతం చూపుతున్నారు. విపక్షాల గొంతును నొక్కేస్తున్నారు. రాజ్యసభ కార్యకలాపాలకు మీరే పెద్ద అడ్డంకి. మరో పదోన్నతి సాధించుకోవడానికి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ సజావుగా సాగాలన్నదే తన ఉద్దేశమని, సభలో గొడవలకు తావులేకుండా సభ్యులంతా సహకరించాలని కోరారు. దీనిపై చర్చించడానికి తన చాంబర్‌కు రావాలని ఖర్గేతోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ధన్‌ఖడ్ ఆహ్వానించారు. దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎలా గౌరవించాలి? మీరు నన్ను దారుణంగా కించపర్చారు అంటూ మండిపడ్డారు. -
పార్లమెంట్లో అదే రగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు. ధన్‌ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్‌ను చీర్లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్‌కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు. నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్‌సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. -
ప్రజాధనమే హారతి కర్పూరం
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలకు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, చట్టాల తయారీకి వేదిక కావాల్సిన చట్టసభలు నిష్ప్రయోజనంగా మారుతుండడం ప్రజాస్వామ్యవాదులను ఆవేదనకు గురి చేస్తోంది. పన్ను చెల్లింపుదార్ల సొమ్ముతో నడిచే పార్లమెంట్లో వారి బాగోగులపై మాట్లాడేవారే కనిపించకుండాపోవడం విస్మయం కలిగిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనలు తప్ప జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల, వారి కష్టాలకు చట్టసభల్లో స్థానం దక్కడం లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పరిస్థితి మరింత దిగజారడం గమనార్హం. ఈ సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. ఈనెల 20వ తేదీన ముగియనున్నాయి. అంటే మరో 9 రోజుల సమయమే మిగిలింది. మధ్యలో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఇప్పటిదాకా పార్లమెంట్లో సరైన చర్చే జరగలేదు. గౌతమ్ అదానీ, జార్జి సోరోస్ వ్యవహారంపై ఇరుపక్షాలు గొడవలు పడడంతోనే సమయమంతా వృథాగా గడిచిపోయింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వాతావరణ కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని, ప్రభుత్వం నుంచి ఏదైనా పరిష్కార మార్గం లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. సొమ్ము వెచ్చిస్తున్నా ఫలితం సున్నా ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతోనే పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతాయి. ఎంపీల వ్యవహార శైలికి అదే ప్రజలు బాధితులుగా మారుతున్నారు. పేదల సమస్యలు ఎప్పటికీ చర్చకు రాకుండాపోతున్నాయి. ఒక్క నిమిషం పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సొమ్ము వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం సున్నా. చర్చించాల్సిన బిల్లులు, తీసుకురావాల్సిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ అదానీ, సోరోస్ వివాదంతో కాలం గడిపేస్తుండడం గమనార్హం. ప్రజలను ప్రజాప్రతినిధులే శిక్షిస్తున్నారని, అందుకు మరొకరు అవసరం లేదని రాజకీయ వ్యాఖ్యాత కమలేష్ సింగ్ ఆక్షేపించారు. ఎంపీల వల్ల విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో అనవసర విషయాలపై సమయం వెచ్చిస్తూ ముఖ్యమైన అంశాలను పక్కనపెడుతున్నారని తప్పుపట్టారు. కొన్నిసార్లు ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లులు చట్టాలుగా మారిపోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదని అన్నారు. ఇదేనా జవాబుదారీతనం? ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన వేదిక పార్లమెంట్. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. పార్లమెంట్ కార్యకలాపాలు జరగపోవడంతో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుకొనే అవకాశం పాలకులకు లభిస్తోందని, జవాబుదారీతనం ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదంతో ఇతర పారీ్టల సభ్యులకు మాట్లాడే వెలుసుబాటు దక్కడం లేదు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్లో మాట్లాడాలని ఆరాటపడుతున్నప్పటికీ వారిని పట్టించుకొనే నాథుడే ఉండడం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో అదానీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తుతుండగా, దాని పోటీగా బీజేపీ ఎంపీలు జార్జి సోరోస్‌ను ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అదానీ, సోరోస్ కాకుండా దేశ సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికైనా పట్టువీడాలని సూచించారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్, బీజేపీలు హైజాక్ చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ప్రాంతీయ పారీ్టలు ఉన్నాయన్న సంగతే అవి మర్చిపోతున్నాయని ధ్వజమెత్తారు. బూడిదలో పోసిన పన్నీరు పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషం వృథా అయ్యిందంటే రూ.2.50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయినట్లేనని 2012లో అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ బన్సల్ చెప్పారు. 2021లో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కారణంగా రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు అప్పట్లో నిపుణులు లెక్కగట్టారు. మరోవైపు పార్లమెంట్ భేటీలు నానాటికీ కుదించుకుపోతున్నాయి. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన తొలి లోక్‌సభ కాలంలో ప్రతిఏటా సగటున 135 రోజుల చొప్పున పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 2019 నుంచి 2024 దాకా మనుగడలో ఉన్న 17వ లోక్‌సభ కాలంలో సగటున ఏటా 55 రోజులపాటే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
పార్లమెంట్లో రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. అధికార, విపక్షాల ధోరణితో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సైతం ఇదే పరిస్థితి పునరావృతమైంది. లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. తొలుత డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్ట సవరణపై జరిగిన చర్చలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ మాట్లాడారు. కోవిడ్ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించలేదని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తప్పుపట్టారు. ఆయనపై బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అధికార, విపక్షాల మధ్య అరుపులు కేకలు చోటుచేసుకోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత జార్జిసోరోస్–కాంగ్రెస్ బంధంపై రగడ జరగడంతో సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదాపడింది. సభ ప్రారంభమైనా గొడవ సద్దుమణగలేదు. దీంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండ యథేచ్ఛగా కొనసాగుతోందని, మానవతా సంక్షోభం నెలకొందని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ జీరో అవర్‌లో పేర్కొన్నారు. మణిపూర్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే సవరణ బిల్లుకు ఆమోదం రైల్వే చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైల్వే సవరణ బిల్లు–2024ను లోక్‌సభలో ఆమోదించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు రైల్వే మంత్రి వైష్ణవ్ సమాధానమిచ్చారు. ఈ బిల్లుతో రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజ్యసభలో నిరసనలు, నినాదాలు ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంతోపాటు సోరోస్ వ్యవహారంపై పార్లమెంట్ ఎగువ సభలో బుధవారం దుమారం రేగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. చైర్మన్ ధన్‌ఖడ్‌పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై చర్చించాలని పట్టుబట్టారు. దాంతో ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కాంగ్రెస్ పార్టీ జార్జి సోరోస్‌తో చేతులు కలిపిందని ఆరోపించారు. సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దల సంబంధాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విపక్షాలు చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు విదేశీ శక్తుల చేతుల్లో పావులుగా మారారని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ధన్‌ఖడ్‌పై రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని ప్రతిపక్షాలపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిల్చొని నడ్డాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పక్ష ఎంపీలు కాంగ్రెస్ తీరుపై మండిపడుతూ నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు.వినూత్న నిరసన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడం, తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చించకపోవడంపై విపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ ఎంపీలకు జాతీయ జెండాలు, గులాబీలు అందజేసి స్వాగతం పలికారు. తమ డిమాండ్లపై దృష్టి పెట్టాలని, కీలకమైన అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగేలా సహకరించాలని అధికార పక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో విపక్షనేత అయిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో అటుగా వస్తున్న రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కార్డు రూపంలోని జాతీయ జెండాను స్వయంగా అందజేశారు. రాహుల్, ప్రియాంకా గాం«దీతోపాటు డీఎంకే, జేఎంఎం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్ల వద్ద జెండాలు, గులాబీలు చేతబూని నిరసన తెలిపారు. ‘దేశాన్ని అమ్మేయకండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్షాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిత్యం పార్లమెంట్ ప్రాంగణంలో వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటం తెల్సిందే. -
అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్‌ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ధన్‌ఖడ్ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్. ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్ ఇచ్చాం. రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే‘‘ ఛైర్మన్ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్ అన్నారు. ‘‘ చైర్మన్ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం -
పార్లమెంటులో ‘సోరోస్’
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ అట్టుడికాయి. సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడుస్తున్న ఫోరం ఆఫ్ డెమొక్రాటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డీఎల్–ఏపీ) అనే సంస్థకు సోనియా కో ప్రెసిడెంట్‌గా ఎందుకున్నారో చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వారి ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు. అదానీ అంశంపై బదులివ్వలేకే ఉద్దేశపూర్వకంగా దీన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డాయి. ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవగానే సోరోస్ అంశంపై చర్చ జరగాలంటూ సభ నాయకుడు జేపీ నడ్డా పట్టుబట్టారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని ఆయనన్నారు. నడ్డాకు మద్దతుగా అధికార పక్ష సభ్యులంతా లేచి నిలబడి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత కూడా ఈ అంశంపైనే దుమారం సాగింది. జమ్మూ కశీ్మర్‌ను భారత్‌కు సంబంధం లేని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించే ఎఫ్డీఎల్–ఏపీ సంస్థతో జార్జ్ సోరోస్ లింకులు ఆందోళన కలిగించే అంశమని నడ్డా అన్నారు. ఇలాంటి వాటి చేతుల్లో కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించారు. ఎన్డీఏ సభ్యులంతా ఆయనతో గొంతు కలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోని చైర్మన్, అధికార పక్షం లేవనెత్తగానే ఈ అంశాన్ని మాత్రం చర్చకు ఎలా అనుమతిస్తారని జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వెలిబుచ్చారు. సభలో లేని సభ్యురాలి ప్రతిష్టకు ఇలా భంగం కలిగించడం సరికాదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ‘‘దేశ ప్రతిష్టకు భంగం కలిగించజూసే శక్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయజాలం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తోందని అభియోగాలున్న సంస్థకు ఈ సభలోని సభ్యురాలే కో ప్రెసిడెంట్ అన్నది మర్చిపోరాదు’’ అని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అధికార పక్షం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభలోనూ ఇవే దృశ్యాలు కని్పంచాయి. అనంతరం పార్లమెంటు బయట కూడా సోరోస్ అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు సోనియాపై విమర్శలు గుప్పించారు. వాటిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.ధన్‌ఖడ్‌పై విపక్షాల ‘అవిశ్వాసం’!రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌తో విపక్షాల అభిప్రాయ బేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే దిశగా అవి పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో అతి త్వరలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘గత ఆగస్టులోనే విపక్ష ఇండియా కూటమి పక్షాలం ఈ దిశగా ప్రయత్నాలు చేశాం. కానీ ధన్‌ఖడ్‌కు మరో అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఊరుకున్నాం. కానీ సోమవారం సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూశాక అవిశ్వాస తీర్మానం తప్ప మరో దారి లేదని తేలిపోయింది’’ అని విపక్ష నేతలు కొందరు వెల్లడించారు. ‘‘ధన్‌ఖడ్ ప్రవర్తన ఎంతమాత్మూ ఆమోదయోగ్యం కాదు. బీజేపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా విశ్వాసపాత్రునిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ, తృణమూల్ తదితర పారీ్టలు ఈ విషయంలో కలిసొస్తున్నట్టు సమాచారం. ఆరి్టకల్ 67(బి) ప్రకారం తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించాక లోక్‌సభ ఆమోదం కూడా పొందితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. -
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. -
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
Winter Parliament Session 2023: లోక్‌సభ నిరవధికంగా వాయిదా
లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే దిగువ సభ వాయిదా పడడం గమనార్హం. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సెషన్‌ను షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న ముగించాల్సి ఉంది. పార్లమెంట్ నూతన భవనంలో పూర్తిస్థాయిలో జరిగిన తొలి సెషన్ ఇదే. ఈసారి సభలో 74 శాతం ప్రొడక్టివిటీ నమోదైనట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మొత్తం 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాలు ఈసారి వాడీవేడిగా జరిగాయి. లోక్‌సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడం, రంగుల గొట్టాలు ప్రయోగించడం వంటివి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడంతో రికార్డు స్థాయిలో 146 మంది ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండయ్యారు. ప్రశ్నలకు లంచాలు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెన్షన్ వేటు పడింది. -
Telecom Bill 2023: టెలికం సేవలపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ముఖ్యాంశాలు.. ► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి. ► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది. ► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు. ► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి. తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి. -
Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడంతో బుధవారం లోక్‌సభలో ఇద్దరు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కేరళ కాంగ్రెస్(మణి) సభ్యుడు థామస్ చెళికాదన్, సీపీఎం సభ్యుడు ఎ.ఎం.అరీఫ్‌ను సభ నుంచి ఈ సెషన్లో మిగిలిన కాలమంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. లోక్‌సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు. -
Parliament Winter Session 2023: సస్పెన్షన్ల పర్వం...78 మందిపై వేటు
పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై నినాదాలు, నిరసనలతో హోరెత్తించిన క్రమంలో ఏకంగా 78 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది! వీరిలో 33 మంది లోక్‌సభ సభ్యులు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఒకే రోజు ఇంతమందిని బహిష్కరించడం పార్లమెంటు చరిత్రలోనే ఇదే తొలిసారి. గత వారమే 13 మంది లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యునిపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన విపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేయడమే వీరి సస్పెన్షన్‌కు కారణం. సస్పెన్షన్లపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా మోదీ సర్కారు కుట్ర పన్నిందని, అందుకే తమను సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. న్యూఢిల్లీ: పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకేరోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీనాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించిందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గత వారమే లోక్‌సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండైన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల పర్వంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో విపక్షాల రగడ భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేయడంతో లోక్‌సభ సోమవారం పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతించాలని, సభా కార్యకలాపాలకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు కోరినా ఫలితం లేకుండాపోయింది. దాంతో 33 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేర్వేరు తీర్మానాలు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. అనంతరం సదరు ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 10 మంది డీఎంకే, 9 మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియంపైకి చేరుకొని నినాదాలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపాలని సభా హక్కుల కమిటీని స్పీకర్ ఆదేశించారు. ఆ నివేదిక వచ్చేదాకా వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేదాకా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభలో కూడా అదే దృశ్యం పునరావృతమైంది. చైర్మన్ ఆదేశాలను ధిక్కరించడంతోపాటు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతూ అనుచితంగా ప్రవర్తించడంతో మొత్తం 45 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్, ఏడుగురు తృణమూల్, నలుగురు డీఎంకే సభ్యులున్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. మిగతా 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీని చైర్మన్ ఆదేశించారు. నివేదిక వచ్చేదాకా సభకు దూరంగా ఉండాలని వారిని చైర్మన్ ఆదేశించారు. దాంతో వారు 3 నెలల దాకా సభకు హాజరయ్యే అవకాశం లేనట్లే. ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన లోక్‌సభ సభ్యులు అదీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొయ్, కె.సురేశ్, అమర్‌సింగ్, రాజమోహన్ ఉన్నిథాన్, తిరుణావుక్కరసర్, కె.మురళీధరన్, ఆంటోనీ (కాంగ్రెస్); కల్యాణ్ బెనర్జీ, అపురూప పొద్దార్, ప్రసూన్ బెనర్జీ, సౌగతా రాయ్, శతాబ్ది రాయ్, ప్రతిమా మండల్, కకోలీ ఘోష్ దస్తీదార్, అసిత్ కుమార్ మాల్, సునీల్ కుమార్ మండల్ (తృణమూల్ కాంగ్రెస్); టీఆర్ బాలు, ఎ.రాజా, దయానిధి మారన్, టి.సుమతి, కె.నవాస్కని, కళానిధి వీరస్వామి, సి.ఎన్.అన్నాదురై, ఎస్.ఎస్.పళనిమాణిక్కం, జి.సెల్వన్, ఎస్.రామలింగం (డీఎంకే); ఈటీ మొహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్); ఎన్.కె.ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ); కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ (కాంగ్రెస్) ప్రస్తుత సెషన్ ముగిసేదాకా సస్పెండైన రాజ్యసభ సభ్యులు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కె.సి.వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, అమీ యాజ్ఞిక్, నరేన్భాయ్ జె.రాథ్వా, సయీద్ నాసిర్ హుస్సేన్, ఫూలోదేవి నేతమ్, శక్తిసింహ్ గోహిల్, రజని అశోక్‌రావు పాటిల్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గార్హీ (కాంగ్రెస్); సుఖేందు శేఖర్ రాయ్, మొహమ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంతను సేన్, మౌసమ్ నూర్, ప్రకాశ్ చిక్ బరాయిక్, సమీరుల్ ఇస్లాం (తృణమూల్ కాంగ్రెస్); ఎం.షణ్ముగలింగం, ఎన్.ఆర్.ఇలాంగో, కనిమొళి ఎన్వీఎన్ సోము, ఆర్.గిరిరాజన్ (డీఎంకే); మనోజ్ కమార్ ఝా, ఫయాజ్ అహ్మద్ (ఆర్జేడీ), రామ్‌గోపాల్ యాదవ్, జావెద్ అలీఖాన్ (ఎస్పీ); రామ్‌నాథ్ ఠాకూర్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీ–యూ); వి.సదాశివన్ (సీపీఎం); వందనా చవాన్ (ఎన్సీపీ); మహువా మజీ (జేఎంఎం); జోస్ కె.మణి (కేసీ–ఎం); అజిత్‌కుమార్ భూయాన్ (స్వతంత్ర) సభా హక్కుల కమిటీ నివేదిక వచ్చేదాకా సస్పెండైన సభ్యులు: జెబీ మాథర్ హిషామ్, ఎల్.హనుమంతయ్య, నీరజ్ డాంగీ, రాజమణి పటేల్, కుమార్ కేట్కర్, జి.సి.చంద్రశేఖర్ (కాంగ్రెస్); జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ.రహీం (సీపీఎం); బినోయ్ విశ్వం, పి.సందోష్‌కుమార్ (సీపీఐ); మొహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే) నియంతృత్వాన్ని పరాకష్టకు తీసుకెళ్లారు. అచ్చం బాహుబలుల మాదిరిగా ప్రవర్తించారు. సభ నడవాలంటే విపక్షాలు ఉండాలనే కనీస నియమాన్నీ మరిచారు. అందర్నీ దారుణంగా సస్పెండ్ చేశారు. – అధీర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్ నేత లోక్‌సభలో పొగ ఘటనకు కారకుడైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను సస్పెండ్ చేయాలని మేం కోరుతుంటే మమ్మల్నే సస్పెండ్ చేశారు. ఈ దారుణ ధోరణి ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం. – సౌగతా రాయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు. 33 మంది లోక్‌సభ ఎంపీలను సస్పెండ్ చేస్తారా?. సభను ప్రశాంతంగా నడపాలి. అధికార పార్టీ సభ్యుల వైఖరి మీదే అది ఆధారపడి ఉంటుంది. విపక్షాలు వివరణ కోరుతుంటే ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం దారుణం. – టీఆర్ బాలు, డీఎంకే నేత -
Parliament security breach: పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతకులకు విజిటర్ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ అలా... లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ ప్రకటించారు. రాజ్యసభ ఇలా... ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. అది మా బాధ్యత: ఖర్గే దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన 14 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బీ కూడా ఉంది..! పార్లమెంట్లో అలజడికి కుట్ర పన్నిన లలిత్ ఝా బృందం, ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్ మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్ రాలేకపోయారు. బూట్లలో పొగ గొట్టాలు లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు. -
Parlament Updates: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
అప్డేట్స్.. ► విపక్షాల నిరసనలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి ఉభయ సభలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ భద్రత వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Suspended MPs stage a protest in front of the Gandhi statue on Parliament premises, in Delhi A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/kVEPhgt9Aq — ANI (@ANI) December 15, 2023 ► ఇండియా కూటమి ఎంపీలంతా ఒక్కటైనట్లు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. తామంతా రాజ్యాంగేతర విధానంతో సస్పెన్షన్‌కు గురైనట్లు ఆరోపించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. #WATCH | Delhi: On his suspension from the Lok Sabha, Congress MP Manickam Tagore says, "All the MPs of the INDIA alliance are united and we were all undemocratically suspended yesterday. We are having a silent protest in front of the Gandhi statue and we will continue the… pic.twitter.com/4naP7Oanh4 — ANI (@ANI) December 15, 2023 ►సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కలిశారు. పార్లమెంట్ అలజడి అంశంలో మొత్తంగా 14 మంది ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi meets the suspended MPs who are protesting at the Makara Dwar in Parliament A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/9QtSZsUXTE — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం 2 వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over the security breach incident. pic.twitter.com/4K6i635k3H — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. స్పీకర్ ఇచ్చిన భద్రతా నియమాలనే ప్రభుత్వం పాటించింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. #WATCH | On the Parliamentary security breach incident, Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Whatever directions the Speaker has given, the government is following them in letter and spirit. The matter is also in the court, high-level investigation is going on.… pic.twitter.com/3mEso77Z65 — ANI (@ANI) December 15, 2023 ►కాంగ్రెస్ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పార్లమెంట్‌కు హాజరయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament #WinterSession pic.twitter.com/dhooCFYaex — ANI (@ANI) December 15, 2023 ►ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సభలో నేడు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. #WATCH | Delhi: A meeting of Floor leaders of the INDIA alliance parties is underway at LoP in Rajya Sabha Mallikarjun Kharge's office in Parliament House to chalk out the strategy for the Floor of the House.#WinterSession pic.twitter.com/Jde3yVbY2G — ANI (@ANI) December 15, 2023 పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్‌లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.