Suryapet
-
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు వేగం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలలో బుధవారం ఎన్డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, డబుల్ బెడ్రూం ఇళ్లను, రామన్నగూడెంలో సమగ్ర ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంటాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ముమ్మరం చేయాలని కోరారు. గురువారం నుంచి సర్వే వివరాలు అన్లైన్ చేసే కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఇంటింటి సర్వేపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీఎస్ఓ సైదిరెడ్డి, గిర్దావర్లు పాటి వెంకట్‌రెడ్డి, ప్రసన్న, సూపర్వైజర్ రామరాజు జలేంధర్‌రావు, ఏఈఓ నేరెళ్ల సత్యం, పంచాయతీ కార్యదర్శి మహాలక్ష్మి, ఎన్యుమరేటర్ ఎ. పుష్ప, సీఓ ఖమ్మంపాటి సైదులు, ఫీల్డ్ అసిస్టెంట్ గంగ, ఎన్డీసీఎంఎస్ కేంద్రం ఇన్చార్జి ఆవుల విక్రం పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు
పాలకవీడు: బహింగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. బుధవారం పాలకవీడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, నేర విభాగానికి సంబంధించిన పలు రికార్డులు, ఫిర్యాదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నిత్యం వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. గుట్కా, గంజాయి రవాణాపై నిఘా ఉంచాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలన్నారు. కోర్టు కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని సీఐ, ఎస్ఐలను ఆదేశింంచారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆయన వెంట సీఐ చరమందరాజు, ఎస్ఐ లక్ష్మీనర్సయ్య, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ -
నిరుద్యోగ యువతకు అండగా జిల్లా గ్రంథాలయం
భానుపురి (సూర్యాపేట) :సూర్యాపేట జిల్లా గ్రంథాలయం నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడానికి అండగా నిలుస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా గ్రంథాలయంలో 57 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్నారని, పిల్లలు ఉద్యోగం సాధించినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలతో పాటు వారికి సౌకర్యాలు కల్పిస్తున్న గ్రంథాలయ ఇన్చార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. గ్రంథాలయంలో చదివి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 36 మందిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బాలమ్మ, ఇన్చార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇరుగు కోటేశ్వరి, పొనుగోటి నిర్మల, ఎన్ సి రోజా, రిటైర్డ్ లైబ్రేరియన్ వెంకట్, నాగేశ్వరరావు, బాలాజీ నాయక్, రంగారావు, శ్రవణ్, విజయ భాస్కర్ పాల్గొన్నారు. -
ఐఎల్ఏ మహాసభలను విజయవంతం చేయాలి
కోదాడ : వరంగల్‌లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో జరిగే 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పలువురు న్యాయవాదులు కోరారు. బుధవారం కోదాడ కోర్టు ఆవరణలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల హక్కుల కోసం ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్కే మూర్తి, ఐఎల్ఏ ఉపాధ్యక్షుడు గట్ల నర్సింహారావు, న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, పాలేటి నాగేశ్వరరావు, ఉసిరికాయల రవికుమార్, దొడ్డ శ్రీధర్, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, తాటి మురళి, వెంకటాచలం, ఆవుల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు 260 మంది కొత్త కానిస్టేబుళ్ల కేటాయింపు
ఫ వీరిలో 67 మంది మహిళలుఫ నేడు ఎస్పీ కార్యాలయంలో ఆర్డర్స్ తీసుకోనున్న నూతన కానిస్టేబుళ్లుసూర్యాపేటటౌన్ : ఎంతో పట్టుదల, కఠోరశ్రమతో పోలీస్ ఉద్యోగానికి ఎంపికై న యువ కానిస్టే బుళ్లు విధుల్లో చేరన్నారు. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను అందుకోనున్నారు. అనంతరం వివిధపోలీస్ స్టేషన్లలో బాధ్యతలు అప్పగించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకొని.. నూతనంగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ కానిస్టేబుళ్లు 260 మందిని సూర్యాపేట జిల్లాకు కేటాయించారు. వీరిలో ఆర్ముడ్ రిజర్వ్, సివిల్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇందులో 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, మిగతా 197 మంది పురుషులు ఉన్నారు. పెన్షనర్లకు డీఏలు విడుదల చేయాలిఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సర్కారు చెల్లించాల్సిన డీఏ లను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతా రామయ్య కోరారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కోశాధికారి హమీద్ ఖాన్, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను త్వరగానే ప్రారంభించినా.. కాంటాలు అనుకున్న సమయానికి వేయలేదు. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. చురుగ్గానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 1,71,197 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇప్పటి వరకు 44,476 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఈ ధాన్యం విలువ సుమారుగా రూ.103.19 కోట్ల మేర ఉంటుంది. బోరుబావుల కిందనే.. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 4.72 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందకపోగా.. సాగర్, మూసీలతో పాటు బోరుబావుల కింద వరి సాగైంది. ప్రస్తుతం జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం సన్నరకం ధాన్యం అధికంగా సాగైనట్లు అధికారులు అంచనా వేసినా.. దొడ్డురకం వరి పంట సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు బాగానే వచ్చింది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా సన్నాలే సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో బోరుబావుల కింద సాగైన వరి పంట మాత్రమే ఎక్కువగా ఉంది. ఇందులోనూ తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ ధాన్యం (దొడ్డురకం) వచ్చింది. జిల్లాలో వరి సాగు : 4.72 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా : 10.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు : 206 సెంటర్లు కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా : దొడ్డురకం: 2 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకం : 1,71,197 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం : దొడ్డురకం: 44,476 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ : రూ.103.19 కోట్లుఫ వానాకాలం ధాన్యం సేకరణ లక్ష్యం 3.70 లక్షల మెట్రిక్ టన్నులుఫ జిల్లాలో 206 సెంటర్ల ఏర్పాటు ఫ సుమారు 44,476 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ చేరేనా.. జిల్లాలో దాదాపు 10.22 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతుల అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు, బహిరంగ మార్కెట్‌కు పోగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు భావించారు. ధాన్యం సేకరణ కోసం 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యేడాది మిల్లుల కేటాయింపు ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ రూ.500 చెల్లించనుండడంతో ఈ రకం ధాన్యం బాగానే కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. కానీ చాలామంది రైతులు మిల్లులు, బహిరంగ మార్కెట్లో అమ్మకానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నరకం ధాన్యం తక్కువగానే ఉంది. ఈ క్రమంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యంలో ఇప్పటికే 44,476 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. మరో 1.60 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాల్సి ఉంది. -
ఐఎల్ఏ మహాసభలను విజయవంతం చేయాలి
కోదాడ : వరంగల్‌లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో జరిగే 2వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పలువురు న్యాయవాదులు కోరారు. బుధవారం కోదాడ కోర్టు ఆవరణలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాదుల హక్కుల కోసం ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఆర్కే మూర్తి, ఐఎల్ఏ ఉపాధ్యక్షుడు గట్ల నర్సింహారావు, న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, పాలేటి నాగేశ్వరరావు, ఉసిరికాయల రవికుమార్, దొడ్డ శ్రీధర్, గోవర్ధన్, వెంకటేశ్వరరావు, తాటి మురళి, వెంకటాచలం, ఆవుల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
25న మట్టపల్లిలో కోటి దీపోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈనెల 25న కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌లు తెలిపారు. ఈమేరకు బుధవారం వారు మాట్లాడారు. 25న సాయంత్రం 6.30గంటలకు ఆలయంలోని ముఖమండపంలో ద్వీపప్రజ్వలన, పవిత్ర కృష్ణానదికి కార్తీక దీపాలతో హారతి, ఆలయ రాజగో పురం ముందు కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈఏడాది జనవరి నుంచి జూన్‌మాసం వరకు భక్తులు సమర్పించిన తలనీలాలకు ఈనెల 22న ఆలయంలో వేలం ఉంటుందని, ఆసక్తి గలవారు రూ.50వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడంలేదుసూర్యాపేటటౌన్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు సామ అంజిరెడ్డి, జేఏసీ కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోడి సైదులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను బుధవారం సూర్యాపేట రైతుబజార్లోగల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24న సూర్యాపేటలో ప్రారంభమయ్యే ఉద్యమకారుల పాదయాత్ర ఉరూరా సాగుతూ భద్రాచలం చేరుకుంటుందన్నారు. ఉద్యమకారులను గుర్తించే సద్బుద్ధిని ప్రభుత్వానికి ప్రసాదించాలని ఆ శ్రీరామచంద్రుడికి వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు బొమ్మి డి లక్ష్మీనారాయణ, కోతి మాధవి, మధుసూదన్‌రెడ్డి, కిషన్, కె.గోపి, విద్యాసాగర్, యూసుఫ్, చిత్రం భద్రమ్మ, గంగయ్య, మైసయ్య, కట్ట రాజు, మోర శైలేందర్ పాల్గొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామి,అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఈకార్యక్రమంలో చెన్నూరు విజయ్‌కుమార్ , మట్టపల్లిరావు, నవీన్‌కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణి భూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీపత్రాలతో అర్చన చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు. స్వామి, అమ్మవారి జోడు సేవను మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కోదాడ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం కోదాడ మండలం తమ్మర వద్ద కోదాడ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. కొనుగోలు చేసిన తరువాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు కమిటీగా ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని, సమస్యలుంటే కమిటీ అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు ముందస్తుగా కోసి పచ్చిధాన్యం తేస్తున్నారని, అలా కాకుండా కోతకు వచ్చిన తరువాత పంట కోయాలని ఆయన సూచించారు. అనంతరం చిమిర్యాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు కోదాడ ప్రభుత్వ వైద్యశాలను, అల్వాలపురం వద్ద ఏర్పాటు చేసిన ఓ వెంచర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్, ఏడీఏ యల్లయ్య, ఏఓ రజని, సొసైటీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సీఈఓలు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కృష్ణ పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. సమాచార పౌర సంబంధాల శాఖ, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కళాయాత్ర వాహనాలను బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం కళాయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రోజూ మూడు గ్రామాల్లో ఆటపాటలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని సూచించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, డీఐఈ మల్లేష్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి పదవ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలోని ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో డీఈఓ అశోక్ తో కలిసి జిల్లాలోని ఎంఈఓలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్ లతో పదవ తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నాటికి ప్రతి విద్యార్థి 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 28 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి పద్మజ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి లత, మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు సెక్రటరీ కళారాణి, క్వాలిటీ కోఆర్డినేటర్స్ శ్రావణ్ కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కొనుగోళ్లు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను త్వరగానే ప్రారంభించినా.. కాంటాలు అనుకున్న సమయానికి వేయలేదు. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. చురుగ్గానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 1,71,197 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇప్పటి వరకు 44,476 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఈ ధాన్యం విలువ సుమారుగా రూ.103.19 కోట్ల మేర ఉంటుంది. బోరుబావుల కిందనే.. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 4.72 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందకపోగా.. సాగర్, మూసీలతో పాటు బోరుబావుల కింద వరి సాగైంది. ప్రస్తుతం జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం సన్నరకం ధాన్యం అధికంగా సాగైనట్లు అధికారులు అంచనా వేసినా.. దొడ్డురకం వరి పంట సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు బాగానే వచ్చింది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా సన్నాలే సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో బోరుబావుల కింద సాగైన వరి పంట మాత్రమే ఎక్కువగా ఉంది. ఇందులోనూ తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ ధాన్యం (దొడ్డురకం) వచ్చింది. జిల్లాలో వరి సాగు : 4.72 లక్షల ఎకరాలు దిగుబడి అంచనా : 10.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు : 206 సెంటర్లు కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా : దొడ్డురకం: 2 లక్షల మెట్రిక్ టన్నులు సన్నరకం : 1,71,197 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం : దొడ్డురకం: 44,476 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ : రూ.103.19 కోట్లుఫ వానాకాలం ధాన్యం సేకరణ లక్ష్యం 3.70 లక్షల మెట్రిక్ టన్నులుఫ జిల్లాలో 206 సెంటర్ల ఏర్పాటు ఫ సుమారు 44,476 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ చేరేనా.. జిల్లాలో దాదాపు 10.22 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతుల అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు, బహిరంగ మార్కెట్‌కు పోగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు భావించారు. ధాన్యం సేకరణ కోసం 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యేడాది మిల్లుల కేటాయింపు ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ రూ.500 చెల్లించనుండడంతో ఈ రకం ధాన్యం బాగానే కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. కానీ చాలామంది రైతులు మిల్లులు, బహిరంగ మార్కెట్లో అమ్మకానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నరకం ధాన్యం తక్కువగానే ఉంది. ఈ క్రమంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యంలో ఇప్పటికే 44,476 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. మరో 1.60 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాల్సి ఉంది. -
జిల్లాకు 260 మంది కొత్త కానిస్టేబుళ్ల కేటాయింపు
ఫ వీరిలో 67 మంది మహిళలుఫ నేడు ఎస్పీ కార్యాలయంలో ఆర్డర్స్ తీసుకోనున్న నూతన కానిస్టేబుళ్లుసూర్యాపేటటౌన్ : ఎంతో పట్టుదల, కఠోరశ్రమతో పోలీస్ ఉద్యోగానికి ఎంపికై న యువ కానిస్టే బుళ్లు విధుల్లో చేరన్నారు. తొమ్మిది నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను అందుకోనున్నారు. అనంతరం వివిధపోలీస్ స్టేషన్లలో బాధ్యతలు అప్పగించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకొని.. నూతనంగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ కానిస్టేబుళ్లు 260 మందిని సూర్యాపేట జిల్లాకు కేటాయించారు. వీరిలో ఆర్ముడ్ రిజర్వ్, సివిల్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇందులో 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, మిగతా 197 మంది పురుషులు ఉన్నారు. పెన్షనర్లకు డీఏలు విడుదల చేయాలిఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సర్కారు చెల్లించాల్సిన డీఏ లను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతా రామయ్య కోరారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కోశాధికారి హమీద్ ఖాన్, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, రంగారెడ్డి, రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరమైతే ఉగ్గపట్టుకోవాల్సిందేనా!
కోదాడ: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేశారు. నాలుగు చోట్ల ఉన్న మరుగుదొడ్లు మూత పడడంతో పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు గానీ పాలకులు గానీ పట్టించుకోవడంలేదు. స్వయం సహాయక సంఘాలకు బిల్లులు చెల్లించక.. కోదాడ పట్టణంలో 80వేల జనాభా ఉండగా వివిధ పనుల నిమిత్త ఇక్కడికి రోజూ మరో 20వేల నుంచి 30వేల మంది వచ్చిపోతుంటారు. పట్టణ జనాభాకు అనుగుణంగా 25 పబ్లిక్టాయిలెట్లు ఉండాలి. కానీ 10 మాత్రమే ఉన్నాయి. వీటిలో రెండు సులభ్‌కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మిగిలిన ఎనిమిదింటిలో ఖమ్మం క్రాస్ రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం, గాంధీ పార్కు, కోదాడ ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్నవాటికి తాళాలు వేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మినహా మిగతా మూడింటికి సంబంధించి మరుగుదొడ్లు నిర్వహించే స్వయం సహాయక సంఘాలకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏడాదికి 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కోదాడ మున్సిపాలిటీ మరుగుదొడ్ల నిర్వహణ బిల్లులు చెల్లించకపోవడంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్లు మూత పడడంతో మల, మూత్ర విసర్జనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, పాత పోస్టాఫీస్ వద్ద ఉన్న మరుగుదొడ్లు మాత్రమే పని చేస్తున్నాయి. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట రోడ్డు వరకు దాదాపు మూడు కిలోమీటర్ల ప్రధాన రహదారి వెంట మున్సిపాలిటీకి చెందిన ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాల వద్ద, హుజూర్నగర్ రోడ్డులోని మార్కెట్ వద్ద ఉన్న సులభ్‌కాంప్లెక్స్‌లు పనిచేస్తున్నాయి. ఇవీ.. కోదాడ బస్టాండ్ ఆవరణలో మున్సిపాలిటీ అధికారులు రూ. 20 లక్షలు ఖర్చు చేసి మరుగు దొడ్లు నిర్మించారు. వీటిని గత సంవత్సరమే ప్రారంభించారు. ఏమైందో ఏమోగానీ వీటికి తాళం వేశారు. ఇదేమిటని అడిగితే ఈ మరుగుదొడ్లను ఆర్టీసీ అధికారులు తామే నిర్వహిస్తామని స్వాధీనం చేసుకున్నారని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు మాత్రం మున్సిపాలిటీ వారు వచ్చి తమ స్థలంలో కట్టారు కాబట్టి అవి తమవే. వీటి నిర్వహణకు తాము టెండర్లు పిలుస్తాం. వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో నెలల తరబడి వీటికి తాళం వేసి ఉంచుతున్నారు. ఫ కోదాడ పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో మరుగుదొడ్లకు తాళం ఫ నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడంతో మూడింటి మూసివేత ఫ ఆర్టీసీ స్థలంలో నిర్మించారని మరొకటి..! ఫ ప్రజలకు తప్పని ఇబ్బందులుపనిచేసేలా చూస్తాం కోదాడ పట్టణంలో మూతబడిన మరుగుదొడ్లు త్వరలో పనిచేసేలా చూస్తాం. ఆర్టీసీ బస్టాండ్‌లోని మరుగుదొడ్ల విషయమై కమిషనర్ వెళ్లి అధికారులతో మాట్లాడారు. త్వరలో సమస్యపరిష్కారం అవుతుంది. – భవాని, పర్యావరణ ఇంజనీర్, కోదాడ మున్సిపాలిటీ -
సూర్యాపేట
సాగర్ సమాచారంవిద్యార్థికి పాముకాటు కేతేపల్లి మండలం మూసీ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. 7పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 584.60 అడుగులు ఇన్‌ఫ్లో : 17,567 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 17,567 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : నిల్ కుడికాల్వ ద్వారా : 9,500 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,367 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 2,400 వరద కాల్వకు : 300- 8లోబుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024సాగర్‌లో మరిన్ని హంగులు నాగార్జునసాగర్‌ను రూ.100 కోట్లతో మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.- 8లో -
ప్రతీ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
పాలకవీడు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనతి కాలంలో ప్రతీ రంగంలో విఫలం చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి మాతృమూర్తి కామేశ్వరమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో అంజిరెడ్డి కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కామేశ్వరమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని వందశాతం అభివృద్ధి పరిచింది తమ అనాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా పురోగమించారని, కాంగ్రెస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా సాయం అందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు, చివరి గెలుపని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు మనోవేదన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి, జిల్లా నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకట్‌రెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, అరిబండి బాబు, దొండపాటి అప్పిరెడ్డి, జయబాబు, పచ్చిపాల ఉపేందర్, బెల్లంకొండ అమర్, చెన్నబోయిన సైదులు, రాపోలు నవీన్, పసుపులేటి సైదులు, లక్ష్మారెడ్డి, జాన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి -
ఆయిల్‌పామ్ సాగుచేసి లాభాలు పొందండి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని బ్రాహ్మణ సదన్ కల్యాణ మండపంలో ఉద్యానవన శాఖ, పతంజలి ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్సాగుపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు నీటి వసతి ఉంటే వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య, సుబ్బారావు, పతంజలి డీజీఎం బి. యాదగిరి, అధికారులు మహేష్, కట్టస్వాతి, ప్రమిత, పతంజలి మేనేజర్ హరీష్, జూనియర్ మేనేజర్ శశికుమార్, వెంకట్, అశోక్, సిబ్బంది రంగు ముత్యం రాజు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలి మునగాల: రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. మంగళవారం మునగాల మండలం మాధవరం శివారులో పతంజలి కంపెనీ ఆధ్వర్యంలో పెంచుతున్న ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీకి ఇతర దేశాల నుంచి వచ్చే మొక్కల వివరాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుతో అధికలాభాలు పొందవచ్చన్నారు. రైతులకు నాణ్యమైన ఆయిల్‌పామ్ మొక్కలు అందించాలన్నారు. నర్సరీలో నాణ్యత లేని మొక్కలను గుర్తించి వెంటనే కాల్చివేయాలన్నారు. రైతులకు నాణ్యమైన , ఆరోగ్యకరమైన మొక్కలు సరఫరా చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మొక్కల పెంపకంలో అలసత్వం వహించవద్దని కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి తీగల నాగయ్య, సాంకేతిక ఉద్యానవన అధికారి మహేష్, పతంజలి డీజీఎం బి.యాదగిరి, మేనేజర్ జె.హరీష్, నర్సరీ అధికారి స్రవంతి పాల్గొన్నారు. ప్రజలను భాగస్వాములు చేయాలి భానుపురి(సూర్యాపేట) : ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 19 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మరుగుదొడ్ల వారోత్సవాల కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చేనెల 5వ తేదీ వరకు వ్యక్తిగత మరుగుదొడ్లకు రంగులు వేయించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీపీఓ నారాయణరెడ్డి, డీఈఓ అశోక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ -
క్రీడలతో దివ్యాంగుల్లో మనోధైర్యం
సూర్యాపేటటౌన్ : క్రీడలతో దివ్యాంగుల్లో మనోధైర్యం పెరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా దివ్యాంగుల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దివ్యాంగులు క్యారం బోర్డ్, చెస్, పరుగుపందెం, షార్ట్ పుట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి డిసెంబర్ 3న జరిగే జిల్లా స్థాయి కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓలు, కార్యాలయ సిబ్బంది, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. స్టెనో, టైపిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు (suryapet.dcourts.gov.in వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు. డిసెంబర్ 2 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలని సూచించారు. -
సర్వేకు ఆపసోపాలు
సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్ల పాట్లు భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో వివరాల సేకరణకు ఎన్యుమరేటర్లు ఆపసోపాలు పాడాల్సివస్తోంది. మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ఫారంలో నింపాల్సి ఉంది. కానీ, తమకు అందుతున్న పథకాలు ఎక్కడ రద్దవుతాయోనన్న అనుమానంతో జనం సరైన సమాధానాలు చెప్పడం లేదు. దీనికితోడు ఎన్యుమరేటర్లు సర్వేకు మధ్యాహ్నం వెళ్తుండడంతో అప్పటికే ప్రజలు వ్యవసాయ, ఇతర పనులకు పోవడంతో ఇళ్లకు తాళాలు ఉంటున్నాయి. దీంతో ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు తిరగాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. మీకెందుకు వివరాలివ్వాలి.. సర్వేలో మొత్తం 75 అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంది. ఇలా ఒక్కో కుటుంబానికి దాదాపు గంట సమయం పడుతుందని ఎన్యుమరేటర్లు ఆవేదన చెందుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలు ఎన్యుమరేటర్లను నిలదీస్తున్నారు. ‘మాకేమైనా పథకాలు ఇస్తారా... మీకెందుకు వివరాలు చెప్పాలని’ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు కనిపిస్తున్నా.. అవి తమవి కాదంటూ దాటవేస్తున్నారు. ఇలా చాలా చోట్ల సర్వే సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. 51వ కాలంలో స్థిరాస్తుల వివరాలు చెప్పడం లేదు. 52వ కాలంలో టీవీ, రిఫ్రిజ్రేటర్, ద్విచక్ర వాహనం, కారు, వాషింగ్ మిషన్ తదితర వివరాలను వెల్లడించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కొన్నిచోట్ల కులం తెలిపే క్రమంలో ఉపకులాలు చెప్పడం లేదని ఎన్యుమరేటర్లు అంటున్నారు. కొన్నిచోట్ల సొంతింట్లో ఉంటున్నా.. అద్దెఇల్లు అని సర్వేలో రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేదని, సర్వేలో సమాధానాలు ఎందుకు చెప్పాలని నిలదీస్తున్నారు. 27వరకు పూర్తయ్యేనా? ఈనెల 8వ తేదీన ప్రభుత్వం సమగ్ర సర్వే ప్రారంభించింది. దీన్ని ఈనెల 27వ తేదీ వరకు పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే జిల్లాలో 3,69,557 ఇళ్లు ఉన్నట్లు ఎన్యుమరేటర్లు గుర్తించారు. ఇందులో ఈనెల 18వ తేదీ నాటికి 2,69,066 ఇళ్లను సర్వే చేశారు. అంటే 72.8 శాతం సర్వే పూర్తయింది. జిల్లావ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో 69.4 శాతం, రూరల్ ప్రాంతాల్లో 73.9 శాతం చొప్పున ప్రజల ఇళ్లకు వెళ్లి సిబ్బంది వివరాలు సేకరించారు. మరో వారం రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎన్యుమరేటర్ల ఇబ్బందుల కారణంగా సర్వే పూర్తవుతుందా ? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా సర్వే చేసిన శాతం ఫ ఉదయం విధులు ముగించుకొని మధ్యాహ్నం సర్వేకు.. ఫ వ్యవసాయ, ఇతర పనులకు జనం వెళ్లడంతో ఆ సమయంలో చాలా ఇళ్లకు తాళాలు ఫ ఒక్కో ఇంటికి రెండుమూడు సార్లు తిరగాల్సిన పరిస్థితి ఫ ఒకవేళ ఉన్నా.. పూర్తి వివరాలు చెప్పేందుకు ఆసక్తిచూపని ప్రజలు ఫ జిల్లాలో 72.8 శాతం సర్వే పూర్తి సూర్యాపేట 73.8% హుజూర్నగర్ 73.6%కోదాడ 69.9% -
వికలాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : వికలాగుల పింఛన్ రూ.6వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చింత సతీష్ కోరారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వికలాంగుల పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డీ. జహీర్ బాబా, ఉపాధ్యక్షుడు చింత సాంబయ్య, కార్యదర్శి మిద్దె సైదులు, సీనియర్ నాయకులు ఉప్పనూతల నరసయ్య, ఎలగందుల కృష్ణమూర్తి, జానయ్య పాల్గొన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలిపెన్పహాడ్: పల్లెల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలని డీపీఓ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం, నాగులపహాడ్ గ్రామ పంచాయతీలను తనిఖీ చేశారు.నాగులపహాడ్ గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. అనంతారం గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. బహిరంగ మల విసర్జన చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సంజీవయ్య, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి రాజు, పంచాయతీ కార్యదర్శి దివ్యభారతి, ఫీల్డ్ అసిస్టెంట్ బేగం తదితరులు పాల్గొన్నారు. మా దుకాణాలను తొలగించొద్దుహుజూర్నగర్ : కొన్నేళ్లుగా చేతి వృత్తులు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నామని తమ దుకాణాలను తొలగించవద్దని బాధితులు మున్సిపల్ అధికారులను వేడుకున్నారు. మంగళవారం హుజూర్ నగర్‌లోని పీర్లకొట్టం సెంటర్లో కటింగ్ , ఇసీ్త్ర షాపులను మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయా షాపుల వారు వచ్చి తమ షాపులను కూల్చొద్దని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు. అధికారులు కొందరికి వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు ఇందిరాల రాంబాబు , పిన్నెల్లి కోటేశ్వరరావు, స్థానికులు పాల్గొన్నారు. 29 నుంచి సీపీఎం మహాసభలుభానుపురి (సూర్యాపేట) : ఈనెల 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా తృతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ మహాసభల సందర్భంగా 29వ తేదీన గాంధీపార్క్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు. రానున్న కాలం కమ్యూనిస్టులదేనని పేర్కొన్నారు. ప్రపంచంలో దోపిడీ, పీడన, వివక్ష, అణిచివేత ఉన్నంతకాలం కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి, నాయకులు దండా వెంకటరెడ్డి, ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వీరబోయిన రవి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొప్పుల రజిత, జ్యోతి పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలి
భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.రాంబాబు, నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీసీ డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు చెరుకు ఏకలక్ష్మి, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, డిపో అధ్యక్షుడు గుండు రమేష్, నాయకులు శ్రీనివాస్, వీరస్వామి, ప్రసాద్, మల్లయ్య, నాగార్జున, రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా చెత్తసేకరణ
ప్రైవేట్ సంస్థకు జీపీఎస్ పరికరాల బిగింపు బాధ్యతలు జీపీఎస్ పరికరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. వాటి బిగింపు బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఒక్క జీపీఎస్ పరికరానికి రూ. 6 వేలకు పైగానే చెల్లిస్తున్నారు. పరికరాల బిగింపు సమయంలో 25 శాతం, బిగించిన తర్వాత 25 శాతం, ఏడాది తర్వాత 25 శాతం, రెండేళ్లకు 25 శాతం చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. హుజూర్నగర్ : మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని అరికట్టేందుకు సూక్ష్యంగా పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా చెత్త సేకరణ వాహనాలైన ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, టిప్పర్లకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. దీనికి టెండర్లు పూర్తి చేసి జీపీఎస్ పరికరాలు కూడా బిగించారు. దీంతో మున్సిపాలిటీల్లో వాహనాలు ఎక్కడ తిరిగి చెత్తను సేకరిస్తున్నాయో అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. 107 వాహనాలకు.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల ఉన్నాయి. వాటిలో మొత్తం 107 వాహనాలకు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిలో సూర్యాపేటలో చెత్త సేకరించే 40 ఆటో ట్రాలీలు, 12 ట్రాక్టర్లు, కోదాడలో 18 ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్లకు జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. హుజూర్‌నగర్‌లో 9 ఆటో ట్రాలీలు, 4 ట్రాక్టర్లు, 2 వాటర్సప్లై ట్యాంకర్లు, తిరుమలగిరిలో 8 ఆటో ట్రాలీలు, రెండు ట్రాక్టర్లు, నేరేడుచర్లలో 5 ఆటో ట్రాలీలు, 2 ట్రాక్టర్లు, 1 వైకుంఠధామం వాహనానికి జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేశారు. అధికారుల పర్యవేక్షణలో టెక్నికల్ సిబ్బంది ఆయా వాహనాలకు పరికరాలు బిగించారు. మున్సిపల్ ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నాయో ఎటు తిరుగుతున్నాయో సెల్ఫోన్లో స్పష్టంగా తెలుసుకోవచ్చు. పారిశుద్ధ్య సిబ్బంది తమకు కేటాయించిన రూట్లో వెళ్తున్నారా? ఎక్కడైనా వాహనాలు నిలిపి ఉంచారా? ఎన్ని ట్రిప్పులు చెత్త సేకరించారు? తదితర విషయాలు జీపీఎస్ ద్వారా తెలిసిపోతాయి. తొలగించినవారిపై చర్యలు.. గతంలో జీపీఎస్ పరికరాలు బిగిస్తే కొందరు వాటిని తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని పని చేయకుండా చేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రైవేటు సంస్థ పర్యవేక్షణ ఉండటంతో వెంటనే మరమ్మతులు చేస్తారు. డ్రైవర్లు ఎవరైనా వాటిని పాడుచేసినా వాటిని తొలగించినా కఠిన చర్యలు ఉంటాయి.తనిఖీ చేసే సమయం ఆదా అవుతుంది మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలపై సూక్ష్మస్థాయి పరి శీలనకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. దీంతో వాహనాలు తనిఖీ చేసే సమయం ఆదా అవుతుంది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల పనిలో పారదర్శకత పెరుగుతుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయి. చెత్త సేకరణ కూడా పక్కాగా జరుగుతుంది. – కె. శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో చెత్తసేకరణ వాహనాలకు జీపీఎస్ ఫ ఒక్కో పరికరానికి రూ.6వేలు ఖర్చు ఫ వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఫ కేటాయించిన రూట్లో పారిశుద్ధ్య సిబ్బంది వెళ్తున్నారా లేదా కనిపెట్టడానికి దోహదం మున్సిపాలిటీ జీపీఎస్ బిగించిన వాహనాలుసూర్యాపేట 52కోదాడ 22హుజూర్నగర్ 15తిరుమలగిరి 10నేరేడుచర్ల 08 -
క్రీడలతో మానసికోల్లాసం
సూర్యాపేట టౌన్: రోజూ క్రీడలు ఆడటం వల్ల మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆటలు ఆడితే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ నిత్యం విఽధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడానికి సమయం దొరికితే ఆటలపై దృష్టి పెట్టాలని కోరారు. క్రీడా కోర్టును తయారు చేయడంలో బాగా పని చేసిన, సమన్వయం చేసిన పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ రవి పాల్గొన్నారు. -
మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా అపూర్వ రవళి
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నుగూరి అపూర్వ రవళి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మిర్యాలగూడ కోర్టు నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న జె.ప్రశాంతి బదిలీపై హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి కోర్టుకు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, న్యాయవాదులు ఎస్. రామరాజు, దండ వెంకట్ రెడ్డి, పెండెం వాణి, ఎండీ అబ్దుల్ లతీఫ్, ధరావతు వీరేష్ నాయక్ , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలత, సీఐలు వై.సురేందర్ రెడ్డి, రాజశేఖర్, ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలను కాలుష్యం బారిన పడకుండా రక్షించిన వారమవుతామని ఆయన అన్నారు. మొక్కలు నాటిన తర్వాత కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డుపుక మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, వెంకట రత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు వీవీరావు, మారపాక వెంకన్న, పంతంగి కృష్ణ, దావుల వీర ప్రసాద్, బచ్చలకూరి గోపి, కట్టా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డి