Devotion
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: అది... క్షీరసాగరమథనం!
మనిషి జీవితంలో సంస్కారానికి ఆలంబన గృహస్థాశ్రమంలోనే. దానిలోకి వెడితే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు...అలా చెప్పలేదు శాస్త్రం. అక్కడ ఆటు ఉంటుంది, పోటు ఉంటుంది. దెబ్బలు తగిలినా, సుఖాలు వచ్చినా... అవన్నీ అనుభవంలోకి రావల్సిందే. వాటిలో నీవు తరించాల్సిందే. కుంతీ దేవి చరిత్రే చూడండి. ఎప్పుడో సూర్య భగవానుడిని పిలిచి నీవంటి కొడుకు కావాలంది. కర్ణుడిని కనింది. అయ్యో! కన్యా గర్భం.. అపఖ్యాతి ఎక్కడ వస్తుందో అని విడిచిపెట్టలేక విడిచిపుచ్చలేక... మాతృత్వాన్ని కప్పిపుచ్చి నీళ్ళల్లో వదిలేసింది. తరువాత బాధపడింది. కొన్నాళ్ళకు పాండురాజు భార్యయింది. సుఖంగా ఉన్నాననుకుంటున్న తరుణంలో సవతి మాద్రి వచ్చింది. పిల్లలు లేరంటే మంత్రంతో సంతానాన్ని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని ΄÷ందింది. ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు పాండురాజు. చెప్పింది. మాద్రికి నకులుడు, సహదేవుడు పుట్టారు.శాపం వచ్చింది. పాండురాజు చచ్చిపోయాడు. మాద్రి సహగమనం చేసింది. ఈ పిల్లలు నీ పిల్లలేనని ఏం నమ్మకం? అని... పాండురాజు పిల్లలకు రాజ్యంలో భాగం ఇవ్వరేమోనని... ఇది ధార్మిక సంతానం అని చెప్పించడానికి మహర్షుల్ని వెంటబెట్టుకుని పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి వెళ్లింది. అంత కష్టపడి వెడితే లక్క ఇంట్లో పెట్టి కాల్చారు. పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేసారు, విషం పెట్టారు. .. అయినా చలించకుండా ఇన్ని కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆఖరికి ధర్మరాజు ఆడిన జూదంతో అన్నీ పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది.అజ్ఞాతవాసం కూడా అయింది. తిరిగొచ్చారు. కురుక్షేత్రం జరిగింది. హమ్మయ్య గెలిచాం, పట్టాభిషేకం కూడా అయిందనుకున్నది. కంటికి కట్టుకున్న కట్టు కొంచెం జారి... కోపంతో ఉన్న గాంధారి చూపులు ప్రసరిస్తే ధర్మరాజుకు కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. అటువంటి గాంధారీ ధృతరాష్ట్రులు అరణ్యవాసానికి వెడుతుంటే... తన పిల్లలు గుర్తొచ్చి గాంధారి మళ్ళీ ఎక్కడ శపిస్తుందోనని, మీకు సేవ చేస్తానని చెప్పి... సుఖపడాల్సిన తరుణంలో వారి వెంట వెళ్ళిపోయింది. ఆమె పడిన కష్టాలు లోకంలో ఎవరు పడ్డారు కనుక !!!గంగ ప్రవహిస్తూ పోయి పోయి చివరకు సముద్రంలో కలిసినట్లు ఈ ఆట్లు, పోట్లు కష్టాలు, సుఖాలతో సంసార సాగరంలో చేరి తరించాలి. చివరలో తిలోదకాలు ఇచ్చేటప్పడు ఒక్కొక్కరి పేరు చెబుతున్నారు.. కొంత మంది పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ అంటున్నాడు... కొంత మందికి ధర్మరాజు ‘నావాడు’ అంటున్నాడు. కర్ణుడి పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు ‘నావాడు’ కాదన్నాడు. ధర్మరాజు కూడా ‘నావాడు’ కాదన్నాడు... తట్టుకోలేకపోయింది తల్లిగా. ‘‘వరంవల్ల పుట్టాడ్రా.. వాడు నీ అన్నరా, నీ సహోదరుడు... నా బిడ్డ...’’ అంది.మరి ధర్మరాజేమన్నాడు... తల్లిని శపించాడు..‘‘ఆడవారి నోట్లో నువ్వుగింజ నానకుండుగాక..’’ అని. దీనికోసమా ఇంత కష్టపడ్డది. అప్పుడొచ్చింది ఆమెకు వైరాగ్యం. కృష్ణభగవానుడిని స్తోత్రం చేసింది. గృహస్థాశ్రమం అంటే క్షీరసాగర మథనం. అక్కడ అమృతం పుట్టాలి. జీవితం అన్న తరువాత ఆటుపోటులుండాలి. రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలన్నా, మనిషి తరించి పండాలన్నా గృహస్థాశ్రమంలోనే... అంతే తప్ప భార్యాబిడ్డలకోసం మాత్రమే కాదు.. కర్తవ్యదీక్షతో అన్నీ అనుభవంలోకి వచ్చిన నాడు ఈశ్వర కృప దానంతటదే వస్తుంది. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
Ganesh Chaturthi 2024: అమృత ఘడియల్లో విషమెందుకు?
వినాయకుడి విగ్రహం తయారీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇనుము, సింథటిక్ రంగులతో పాదరసం, క్రోమియం, సీసం, లెడ్ ఆర్సనిక్ తదితర విషపూరిత రసాయనాలను వాడుతున్నారు. వీటితో జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు. మట్టిలో కలవదు. నిప్పుకు కూడా దహనం కాదు. దీనిలో జిప్సం అనేది ముడి పదార్థంగా ఉంటుంది. ఈ విగ్రహాలను నీటివనరుల్లో వేస్తాం. ఆ నీటిని వాడితే డయేరియా, స్కిన్ క్యాన్సర్‌తో పాటు అనేక చర్మ వ్యాధులు సోకే ప్రమాదం వుంది. ముఖ్యంగా తగరంతో చర్మ వ్యాధులు వచ్చి చర్మం రంగు మారుతుంది. ఆర్సనిక్ వల్ల జుట్టు రాలిపోతుంది. సీసం వల్ల కడుపు నొప్పి వస్తుంది. శరీరం పట్టుత్వం తగ్గుతుంది. అంతేగాక ఆ రసాయనాల నీటిని పంట పాలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజ స్వరూపాన్ని కోల్పోతుంది.మట్టితో చేసిన ప్రతిమల వల్ల పైన చెప్పుకున్న ప్రమాదాలేవీ ఉండవు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. చూడటానికి కూడా విగ్రహం ముచ్చటగా ఉంటుంది. పండుగ తర్వాత నిమజ్జనం చేసిన కొద్దిసేపట్లోనే నీటిలో కరిగి΄ోతుంది. దీనివల్ల పర్యావరణం, జీవవైవిధ్యం రెండు కూడా సమతులంగా ఉంటాయి. మట్టి విగ్రహం తయారీలో కేవలం బంకమట్టి మాత్రమే వాడతారు. ఎలాంటి రంగులు వాడరు. కాబట్టి నీరు కలుషితం కాదు.ఎంత విగ్రహం పెట్టి పూజిస్తే అంత గొప్ప అనుకోవడం మానేయాలి. విగ్రహం సైజు కంటే భక్తి ముఖ్యం. పర్యావరణం పట్ల బాధ్యత అంతకంటే ముఖ్యం. రసాయన రంగుల విగ్రహాల వల్ల పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బితింటాయి. రాబోవు రోజుల్లో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతుంది. – డాక్టర్ ఎల్ నాగిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురం -
vinayakachavithi 2024: గరికతో కొలిచినా వరాలే
ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ కార్యాన్నిప్రారంభించాలన్నా ముందుగా ఆయననే పూజించాలి. అప్పుడే ఆ కార్యం శుభప్రదం, శోభస్కరం.. ఆ తర్వాత జయప్రదం అవుతుంది. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు.ఓం గణానాతాం త్వా గణపతిగ్ం హవామహేకవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతఅనశృణ్వన్నూతి భిస్సీద సాధనమ్రాజులలో జ్యేష్ఠుడు, కవులలో కవి, గణాలకు అధిపతి, బ్రహ్మణస్పతి అని వేదాలు ఆయనను స్తుతిస్తే, మంత్రశాస్త్రాలు సుముఖుడనీ ఏకదంతుడనీ, కపిలుడనీ, గణాధ్యక్షుడనీ, గజకర్ణికుడనీ, వికషుడనీ, ఫాలచంద్రుడనీ, ధూమకేతువనీ, గజకర్ణికుడనీ విష్వక్సేనుడనీ, శూర్పకర్ణికుడనీ అన్నాయి. అంతగా ఆరాధించాయి. ఇక ఉపనిషత్తులయితే వాఙ్మయమూర్తిగా.. గణపతిగా... బ్రహ్మణస్పతిగా.. శ్రీ మహాగణాధిపతిగా విశ్వసించాయి. నిండుగా కొలిచాయి. గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. ఆయనను స్తుతిస్తే సర్వ విఘ్నాలూ ఉపశమిస్తాయి. అంతేకాదు ఆయన భక్త సులభుడు కూడా. బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి,ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటీ, రకరకాల పుష్పాలు, పత్రాలతోటీ పూజించి, అరటిపళ్లు, కొబ్బరికాయలు, ఉండ్రాళ్లు, వెలగ పళ్లు, పానకం, వడపప్పు, కుడుములు నివేదించి, అపరాధ క్షమాపణగా ఐదు గుంజిళ్లు తీస్తే చాలు – మన కోర్కెలన్నింటినీ తీర్చే మహా ప్రసన్న గణపతి... వల్లభ గణపతీ ఆయన. ఎలా పూజించాలి?ఏ పూజలోనైనా ముందుగా హరిద్రాగణపతిని (పసుపుతో గణపతి ప్రతిమను చేసి, తమలపాకులో ఉంచాలి) పూజించడం మంచిది. వినాయక చవితినాడు తప్ప తక్కిన రోజుల్లో తులసి దళాలతో పూజించరాదు. 21 రకాల పత్రి లభ్యం కానప్పుడు గరిక దొరికినా ప్రసన్నుడవుతాడు. రక రకాల నైవేద్యాలు సమర్పించలేకున్నా నారికేళం, అరటిపండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు ఉంటే చాలంటాడు. ఈ కింది శ్లోకం చదివితే చతుర్థీ చంద్ర దర్శన దోషం పరిహారమవుతుంది.సింహః ప్రసేనమవధీః సింహా జాంబవతా హతేఃసుకుమారక మారోదీః తవహ్యేషçశ్యమంతకఃఏమి నివేదించాలి?వినాయకచవితిరోజు గణపతిని షోడశోపచారాలతో పూజించి, శక్తికొద్దీ ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, నారికేళాలు, కదళీఫలాలు, పానకం, వడపప్పులను నివేదిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది.పాలవెల్లి ఎందుకు..?ఆకాశంలో గ్రహాలూ నక్షత్రాలూ ఉంటాయనే యథార్థాన్ని గుర్తింపజేసేందుకే, భాద్రపదమాసంలో విరివిగా లభించే పాలవెల్లికి నిండుగా మొక్కజొన్న ΄÷త్తులూ, వెలక్కాయలూ, బత్తాయిలూ... వీటన్నింటినీ కడతారు.నిమజ్జనమెందుకు?భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికిప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి విఘ్నాలనూ దూరం చేయాలని, కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుందాం. అన్నట్లు పూజకు మట్టి వినాయకుడినే తెస్తున్నారు గదా!పత్రి అంటే ఎందుకంత ప్రీతి?కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. అంతేకాదు... మునుల కోరిక మేరకు అగ్నితత్త్వం గల అనలాసురుడనే రాక్షసుని ఉండలా చేసి గుటుక్కున మింగాడాయన. లోపల చేరిన ఆ రాక్షసుడు తన మంటలతో ఆయన ఉదరాన్ని బాధించకుండా చల్లదనాన్ని చేకూర్చడం కోసమే మునులు ఆయనను అనేక రకాల ఔషధ విలువలు గల పత్రితోటీ, పుష్పాలతోటీ పూజించి, మరింత ఉపశమనాన్ని కలిగించడం కోసం గరికతో తాళ్లలా పేని ఆయన ΄÷ట్ట చుట్టూ పట్టీలా కట్టారు. ఆ ఉపచారాలన్నీ ఆయనకు అమితంగా నచ్చి, ఆ నాటినుంచి ప్రతియేటా తనను పత్రితోటీ, పుష్పాలతోటీ, ముఖ్యంగా గరిక΄ోచలతో పూజించిన వారికి కోరిన వరాలనిచ్చే వేల్పు అయ్యాడాయన. -
vinayakachavithi 2024: ప్రతి భాగం ఓ పాఠం... ..ప్రకృతికి పీఠం
భువనచంద్ర వినాయకచవితి అనేది కేవలం ఒక పండుగ కాదు.. ఈ పండుగ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఏనుగు తలకాయ.. అంటే పెద్దది. అంటే గొప్పగా ఆలోచించు.. పెద్ద పెద్ద చెవులు ఉంటాయి అంటే... ‘నాయనా నీ శక్తినంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వేస్ట్ చేయకు, ఇతరులు చెప్పేది శ్రద్ధగా విను.. ఆ విన్నదాన్ని చక్కగా నీ మెదడుతో ఆలోచించు..’ అని అర్థం. ఇక ఆయన పొట్టకు నాగబంధం కట్టేశారు.. అంటే అర్థమేంటీ? జాగ్రత్తగా గమనిస్తే.. నాయనా నువ్వు ఎక్కువ గనుక తిన్నట్టయితే.. అది విషంతో సమానం. అందుకే మితంగా భుజించడం నేర్చుకో.. అందుకే తినే ముందు నీళ్లు జల్లి అమృతమస్తుః అంటాం.. అమృతం ఎప్పుడు అవుతుంది? మితంగా తిన్నప్పుడు అమృతం.. అపరిమితంగా తిన్నప్పుడు అది విషం. మనం తినేటటువంటి ఆహారం ఎలుకలు గనుక తినేస్తే.. ఎలుకలను గనుక కంట్రోల్లో పెట్టక΄ోతే మనిషికి గింజ కూడా దొరకదు. అందు గురించే ఆయనకు వాహనంగా పాదాల దగ్గర ఎలుకను ఉంచి ఎలుకలను కంట్రోల్లో పెట్టుకున్నావో నీ ఆహారం సేవ్ అవుతుంది అని సూచిస్తున్నారు.వినాయకుడి చేతిలోని అంకుశం... దేన్నైనా కంట్రోల్ చేసుకునే పవర్.. ఏ బంధమైనా.. స్నేహం కావచ్చు.. ఏదైనా నిర్ణయం కావచ్చు.. అంకుశం ఏంటంటే.. నువ్వు ఏది చేయాలనుకున్నా ఆ చేస్తున్నది కరెక్టా కాదా అనేది మన చేతుల్లో ఉండాలి. తర్వాత పాశం.. రిలేషన్స్.. ఇలా వినాయకుడి శరీరంలో ఉండే ప్రతి భాగమూ మనకు ఒక పాఠం లాంటిది. జీవిత పాఠం అది. గ్రామాల్లో స్థానికంగా ఉండే దేవతల్లో లక్ష్మీ, వినాయకుడు ఇద్దరూ ఉంటారు. ఆహార ఉత్పత్తి, పొదుపు వల్ల సమృద్ధి. నాకు ఒకరు గొప్ప మాట చె΄్పారు. ఆరోజుల్లో జీతాలు తక్కువ వచ్చేవి కదా.. అప్పుడు ఒకరు చె΄్పారు. అది చాలా మంచి మాట. ‘ఏమండీ.. మా ఇంట్లో చింతపండు, ఉప్పు, ఎండు మిరిపకాయలు, బియ్యం కచ్చితంగా ఎప్పుడూ ఉంచుతానండీ... జీతం రాగానే మొట్టమొదట ఎక్కువ మోతాదులో అవే తీసుకుంటానండి’ అని. ‘అదేంటీ?’ అన్నాను. ‘మన ఇంటికి పది మంది అప్పటికప్పుడు వచ్చారనుకోండి.. ఆ నాలుగు పదార్థాలుంటే కనీసం చారన్నం అయినా పెట్టొచ్చు కదా?’ అని సమాధానం ఇచ్చారు. అంటే మిగిలినవన్నీ లగ్జరీ ఐటమ్స్.ఇక తర్వాత లేఖిని.. వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడం. ఇక్కడ లేఖిని అంటే అక్షరం రాయడం మాత్రమే కాదు.. ఏ విద్యైనా సిద్ధింపచేయాలంటే మొట్టమొదట చెవులు కరెక్ట్‌గా ఉండాలి.. బుర్ర కరెక్ట్‌గా ఉండాలి. అందుచేత సిద్ధి వినాయకుడు.. ఏది మొదలుపెట్టినా ‘అయ్యా ఇది నేర్చుకోదలిచాను.. నన్ను సిద్ధింపచేసే శక్తి నీలో ఉంది గనుక ఈ సిద్ధి నాకు ్రపాప్తించేలా చూడు’ అని నమస్కరిస్తాం. చిన్నతనంలో కూడా అందుకే వినాయకచవితి వచ్చిందంటే.. పుస్తకాలు, అట్టలు.. పెన్నులు అన్నీ స్వామి వారి ముందు ఉంచి పూజ చేసుకుంటాం. ఏ పని మొదలుపెట్టినా.. ఇల్లు కట్టినా.. పెళ్లి చేసినా వినాయకుడికి మొట్టమొదటి స్థానం ఎందుకు ఇస్తారంటే.. ఆయన సిద్ధి కావాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనిదే సిద్ధి లేదు. నిజానికి కుమారస్వామితో ఆయన ΄ోటీ పడినప్పుడు కూడా ఆయన బుద్ధిని ఉపయోగించాడు.. అందుకే ఆయన భార్యలను సిద్ధి బుద్ధి అంటాం.. నీ బుద్ధిని గనుక సక్రమంగా వినియోగించినట్లు అయితే ఆటోమేటిక్‌గా సిద్ధి లభిస్తుంది. వినాయకచవితి ఏం చెబుతుందంటే.. ఏది చేసినా శ్రద్ధతో చెయ్.. చక్కటి ఆలోచనలతో ఉండాలి. ఆయన కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా అంటే అర్థం ఏంటీ? సూక్ష్మమైనదాన్ని కూడా చూడగలగాలి. చీమ కన్ను ఎంత చిన్నగా ఉంటుంది? దానికి కూడా ఆహారం దొరుకుతుంది కదా? అట్లాగే ఏనుగు కళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ అతి సూక్ష్మమైన కదలికలను కూడా అది పట్టుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. జంతువులు అన్నింటిలోనూ చక్కటి బ్రెయిన్ ఉన్న జంతువు ఏనుగు. అదే నెంబర్ వన్ . మానవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత పవర్ దానికి ఉంది. పత్రి అనేది మనం ఎందుకు కోసుకొస్తాం? వెలగ, వాక్కాయ్ వంటివన్నీ ఎందుకు తీసుకొస్తాం పూజకి? ఎందుకంటే ఈ సీజన్ లో వాక్కాయ్ పచ్చడి తినమంటే ఎవరూ తినరు..? అందుకే వాక్కాయ్ – కొబ్బరికాయి, కొబ్బరికాయ – వెలగ కలిసి చేసుకుంటాం. నిజానికి ఈ సీజన్ లో ఇవి తింటేనే రోగనిరోధక శక్తి అద్భుతంగా పని చేస్తుంది. రెండొవది ఆకులు దూసిన తర్వాత కొత్త ఆకులువస్తాయి. అలా కాకుండా ఆ ఆకులు మొక్కకే ముదిరి΄ోతే అక్కడితో ఎండ్ అయి΄ోతుంది. ప్రతి ఔషధ మొక్కలను సజీవంగా ఉంచాలంటే పాత ఆకుల్ని పీకాలి. ఇక కామెర్లకు నేల ఉసిరి బెస్ట్ మెడిసిన్ . ప్రకృతిని రక్షించేవాడు దేవత.. ప్రకృతిని రక్షిస్తూ.. ప్రకృతి మీద ఆధారపడేవాడు మానవుడు. ప్రకృతిని నాశనం చేసేవాడు రాక్షసుడు. ప్రకృతితో సహజీవనం చెయ్ అని చెప్పే ఏకైక పండుగ వినాయకచవితి.సుద్దాల అశోక్‌తేజ వినాయచవితి పట్ల నా పరిశీలన ఏంటంటే పురాణాలు కానివ్వండి.. ప్రబంధాలు కానివ్వండి.. కల్పనలు కావచ్చు.. యదార్థంగా జరిగినవి కావచ్చు.. ఏవైనా.. ఏవైనా సరే.. ప్రజాశ్రేయస్సు కోసం, ప్రకృతి శ్రేయస్సు కోసం రాసినవే.. పుట్టించినవే.. శంకరుడు.. పార్వతమ్మ ఉన్న ఇంట్లోకి వెళ్లబోతుంటే ఒక పిల్లోడు అడ్డుకుంటాడు.. అతడిపై ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు. ఇది కదా కథ? తర్వాత పార్వతమ్మ వచ్చి.. బాగా ఏడ్చి.. భర్త మీద కోప్పడితే.. మళ్లీ బతికించాడు.. ఫస్ట్ ఏంటంటే.. తొందరపాటుతనం మనుషులకే కాదు.. దేవతలమైన మాకు కూడా ఉంటుందని చెప్పడమే ఆ పసివాడ్ని చంపడం.. ఒక తొందరపాటులో ఇన్ని అనర్థాలు జరగుతాయి అని చెప్పడానికి ఈ కథ ఏర్పడింది అనుకుంటాను.. శివుడు సహనంగా ఉండి ఉంటే చంపేవాడు కాదు కదా.. నంబర్ 2– ఎంత పరమేశ్వరుడైనా భార్యకు శరీరంలో సగభాగం ఇచ్చాడు.. అదొక ఆదర్శమైతే.. భార్య అతడు చేసిన పొరబాటు గురించి చెప్పగానే.. ఎక్కడా పురుషాధిక్యత లేకుండా తన పొరబాటు తాను గ్రహించాడు.. అంటే ఇక్కడ స్త్రీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా భావించడం తప్పు అని తన ఈ చర్య ద్వారా తెలిపాడు.. ‘నేను భర్తను, నువ్వు భార్యవి.. అవును చంపేశాను.. నా ఇష్టం..’ అని ఉంటే ΄ోయేది కదా..? కానీ అలా అనలేదు.. పొరబాటు గ్రహించడమే కాదు.. భార్య చెప్పిన దిద్దుబాటు చర్యకు పూనుకున్నాడు. తనకన్నా చిన్నవాళ్లు చెప్పినా.. భార్య చెప్పినా.. మంచి చెప్పినప్పుడు మనం దాన్ని సవరించుకోవాలి.. వీలైతే ఆచరించుకోవాలి.. అనేది రెండో ఘటన.మూడవది ఇది చాలా చిత్రం అనిపిస్తుంది నాకు. తలను తీసేశాడు.. భార్య వచ్చి ఏడవగానే ఉన్న తలను అతికించొచ్చు కదా? ఎన్నో మాయలున్నవాడు.. పైగా నరికిన తల పక్కనే ఉంటుంది కదా? ఆ తలను అతికించకుండా ఏనుగు తల తీసుకుని రావడం ఎందుకు? ఎందుకు అంటే.. మనిషికి ఎంత ్రపాధాన్యత ఉందో.. దేవతలకు ఎంత ్రపాధాన్యత ఉందో.. జంతువులకు కూడా అంతే ్రపాధాన్యత ఉంది అని చెప్పడానికన్నమాట. అంటే ప్రకృతిని గౌరవించడం అనిమాటే. ‘‘నువ్వు జీవించు మిగతా వాటిని జీవించనివ్వు’’ అని చెప్పడం కోసం ఒక జంతువుకి అపారమైన ్రపాధాన్యత ఇవ్వడం కోసం ఏనుగు తలకాయ పెట్టి ఉంటాడా? ఇవన్నీ నా ఆలోచనలే.. నా వ్యక్తిగతమైనవి.తర్వాత శంకరుడి దగ్గర కైలాసంలో పరస్పర శత్రువులైన జంతువులన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఎలుకలను తినే పాము పక్కనే ఉంటుంది. పాముని తినే నెమలి పక్కనే ఉంటుంది. మూడు పరస్పర వైషమ్యాలు కలిగిన జీవరాశులకు కూడా సమానమైన గౌరవం ఇస్తూ సమానమైన జీవితావకాశాన్ని ఇచ్చిన వాడు శివుడు. కైలాసంలో జాతీయ జంతువు ఎవరో తెలుసా..? ఎద్దు. ఎద్దుని వాహనం చేసుకున్నవాడు శివుడు. బ్రహ్మ కమలం మీద ఉంటాడు. విష్ణువు ఆదిశేషువు మీద ఉంటాడు. కాని శివుడు రైతుకి, వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఎద్దును వాహనంగా ఎంచుకున్నాడు. ఇక వినాయకుడిని పూజించే దగ్గర.. సాధారణంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తే మన దగ్గర ఉన్నవో లేనివో నాణాలు తెచ్చిపెడతాం.. లేదా ఆరోజు బంగారం ఏదొకటి కొనుక్కుని పెడతాం. కానీ వినాయకుడికి అవేం ఉండవు. చెరకు, పత్రి, గరిక ఇలా అతి చౌక ఆకులు.. సులభంగా ప్రకృతిలో దొరికే వాటిని తెచ్చి పెడతాం. ప్రకృతి, ప్రకృతిలోని జీవులు, పరమాత్మ మూడు సమానమే అని చెప్పేందుకు గుర్తుగా ఈ వినాయకచవితి కొనసాగుతోంది. దీన్నే అందుకోవాలి సమాజం. దీన్ని అందుకోవాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. అందుకే బాలగంగాధర తిలక్ దైవభక్తిలో దేశభక్తిని రంగరించి.. వినాయకచవితిని మొట్టమొదటిసారి ఘనంగా జరిపించారు. అందుకే అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప శక్తిని నింపింది ఈ పండుగ. మా చిన్నప్పుడు వినాయకచవితికి ఇంత క్రేజ్ లేదు..ఇప్పుడు ఇంత ఘనంగా జరుగుతున్నదంటే దానికి కారణం తిలక్. ఆ గొప్పతనం ఆయనదే. ఆ తర్వాత గణపతితో ఏం చేయించినారు.. ప్రపంచ పరుగు పందెం ΄ోటీ పెట్టేస్తే ఎలుక మీదున్న వాడు ఏం గెలుస్తాడులే అని కుమారస్వామి నెమలి మీద వెళ్లి΄ోతుంటే.. వినాయకుడు అమ్మానాన్నలను మించి ప్రపంచం భూగోళంలో ఏముంటుందని చెప్పి మూడు చుట్లు తిరిగితే.. అందరూ కలసి ఎవరు మొదలు వచ్చారంటే.. వినాయకుడే మొదట వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన దేవుడు అయ్యాడు.. ప్రథమ దేవుడు అయ్యాడు.. ఇక్కడ తల్లిదండ్రుల ్రపాధాన్యత కనిపిస్తుంది. ఇది గ్రహించాల్సింది. -
ఐదు పురాణాల్లో వినాయక గాథ..!
వినాయక చవితి పండుగ గురించి, ఈ పండుగ మహాత్మ్యాన్ని గురించిన గాథలు ప్రముఖంగా ఐదు పురాణాల్లో కనిపిస్తాయి. అవి: 1. శివ పురాణం 2. బ్రహ్మవైవర్త పురాణం 3. ముద్గల పురాణం 4. స్కాంద పురాణం 5. పద్మ పురాణం.శివపురాణం: శివ పురాణం గణేశుడి జన్మ వృత్తాంతం, గణేశుడు గణ నాయకుడిగా మారిన వైనం, మానవ జీవితంలో గణనాథుని ప్రాముఖ్యత విపులంగా చెబుతుంది.బ్రహ్మవైవర్త పురాణం: బ్రహ్మవైవర్త పురాణం గణేశుడి జన్మ వృత్తాంతంతో పాటు వినాయక చవితి రోజున గణేశుని పూజించే విధానం, ఈ పూజ ద్వారా మానవ జీవితంలో కనిపించే ప్రభావం చెబుతుంది.ముద్గల పురాణం: ముద్గల పురాణం గణనాథునికి చేయవలసిన పూజలు, వాటి ప్రాముఖ్యత, గణనాథుని వివిధ అవతారాల గాథలను, వివిధ సందర్భాల్లో వినాయకుడు భక్తులను అనుగ్రహించిన సందర్భాలు, ప్రదర్శించిన మహిమల గాథలను చెబుతుంది.స్కాంద పురాణం: స్కాంద పురాణం కూడా గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయక చవితి పండుగ ప్రాముఖ్యత, గణేశుడికి సంబంధించిన పూజా విధానాలు విపులంగా చెబుతుంది.పద్మ పురాణం: పద్మ పురాణం వినాయక చవితి విశేషాలను చాలా విస్తృతంగా వివరిస్తుంది. ప్రతేకించి వినాయక చవితి పూజలో ఉపయోగించవలసిన పూజా పత్రీ వివరాలను విపులంగా చెబుతుంది.(చదవండి: తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!) -
Vinayaka Chavithi 2024: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!
గణపతి సకల దేవతాగణానికి అధిపతి! సకల విఘ్నాలకూ అధినాయకుడు! సకల కార్యాలనూ నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత! తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావలసిందే! గణేశ్వరుని నామస్మరణతో సకల దేవతలూ సుప్రసన్నులౌతారనీ, తలపెట్టిన కార్యక్రమం దైవారాధనైనా, పూజాది కార్యక్రమాలైనా, శుభకార్యాలైనా ఏదైనాసరే ఎటువంటి అవాంతరాలూ లేకుండా సుఖవంతం అవుతుందనీ విశ్వాసం! అందుకే ప్రతి పూజాధి శుభకార్యాల ఆరంభంలో గణపతిని ప్రథమంగా పూజిస్తుంటాం.అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి ‘పసుపు గణపతి’గా మనందరి తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు.. విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తుంటాము.పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తన గోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమమైనా కూడా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడి విశ్వాసం. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. వినాయకచవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నిటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సంవత్సరం పొడవునా ఎలాంటి ఆటంకాలు, కష్టనష్టాలు కలుగకుండా విజయవంతం కావాలని, సకల విఘ్నాలకు అధిపతిగా విఘ్నేశ్వరాధిపత్యం స్వీకరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితిరోజు మనం ప్రతి సంవత్సరమూ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరున్ని కొలుస్తుంటాం.మన సర్వశుభకార్యాలకు, సుఖసంతోషాలకు, ఆనందాభ్యుదయాలకు క్షేమ స్థైర్య విజయ అభయ, ఆయురారోగ్యాలకు, సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడైన వినాయకుడు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆరాధ్యదైవమే.ఈ వ్రతం పరమార్థం.. సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింపజేయటమే కాక.. భావసమైక్యతకు, సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఈ పండుగ ఇంటిగడప దాటి వీధుల్లోకి వచ్చి నేడు పట్టణాలు, గ్రామవీధుల్లో ఆరాధనోత్సవంగా సాగుతూ ఒక గొప్ప సామూహిక జాతీయ పండుగగా విశేష ప్రాచుర్యం పొందుతోంది.మట్టి వినాయకుడ్ని పూజిద్దాం !పర్యావరణాన్ని కాపాడుకుందాం !!మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు..(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు:వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు:దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం:ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ:శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో:విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ..పూజకు ఏర్పాట్లు..ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన:(ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి:(పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)"అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, çపుండరీకాక్షాయ నమః"శ్రీరస్తు.. శుభమస్తు! అవిఘ్నమస్తు!!విఘ్నేశ్వరుని వ్రతకల్పము..శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనం:ఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా..(అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి."గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః"(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!"(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామం.."ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం:మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, స్థిరవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరి జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి(మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ..(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమఃనానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను)."ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా"శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం..స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగాఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) "ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘"విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ "ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘"పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ "ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ "భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ "ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘"చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘"శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి". (వినాయకుని ధ్యానించండి...)ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి"పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో ‘‘సర్వతీర్థ సముద్భూతంపాద్యం గంగాది సంయుతంవిఘ్నరాజ! గృహాణేదంభగవన్భక్త వత్సలశ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి"అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి)యాః ఫలినీర్యా అఫలాఅపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకంచేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోప వీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామిఅక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి"మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అథాంగ పూజా.. : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజ.. : (ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)- ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)- ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)- ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)- ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)- ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)- ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)- ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)- ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)- ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)- ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)- ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)- ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)- ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)- ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)- ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)- ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)- ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)- ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)- ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)- ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె)- ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి..ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం :శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థన.."తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్" "అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్"శ్రీ వినాయకుని దండకము.. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గాÐ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమఃనీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)"గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః"- మంత్రపుష్పం సమర్పయామి..ఆత్మప్రదక్షిణ నమస్కారమ్: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)"ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.."ప్రార్థన..(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్..ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశుని కథా ప్రారంభం..(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను. పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తి..కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను.అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.విఘ్నేశాధిపత్యము..ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను.అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషిపత్నులకు నీలాపనిందలు..ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహములకేగి, భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానము..యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను.అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను.ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురమునుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను.భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది.ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచూండెను.‘‘మంగళం మహత్’’చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ :ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులు..శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానము..శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) -
Vinayaka Chavithi 2024: బుజ్జి గణపయ్యకు.. బొజ్జ నిండా!
రేపే వినాయక చవితి. ఉదయం చంద్రుడిని చూడవద్దు. చందమామ లాంటి కుడుములు చేద్దాం. వినాయకుడికి నివేదన చేద్దాం. ఓ బొజ్జ గణపయ్యా! నీ బంటు నేనయ్యా!! ఉండ్రాళ్లపై దండు పంపమని స్తోత్రం చదువుదాం!!ఉండ్రాళ్లు..కావలసినవి..బియ్యపు రవ్వ– కప్పు;నీరు – 2 కప్పులు;పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు;నెయ్యి– టీ స్పూన్;ఉప్పు – పావు టీ స్పూన్;పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు (ఇష్టమైతేనే)తయారీ..– శనగపప్పును కడిగి 20 నిమిషాల సేపు నీటిలో నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.– ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి అందులో శనగపప్పు వేసి వేయించాలి.– శనగపప్పు దోరగా వేగిన తర్వాత అందులో నీరు పోసి ఉప్పు వేసి మూత పెట్టాలి.– నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి, రవ్వ వేసి ఉండలు లేకుండా గరిటెతో కలపాలి.– కొబ్బరి తురుము వేసి సమంగా కలిసే వరకు కలిపి నీరు ఆవిరైపోయి రవ్వ దగ్గరగా అయిన తర్వాత దించేయాలి.– వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని గోళీలుగా చేస్తే ఉండ్రాళ్లు రెడీ.పూర్ణం కుడుములు..కావలసినవి..బియ్యప్పిండి– కప్పు;నీరు – కప్పు;నెయ్యి – టీ స్పూన్;ఉప్పు – చిటికెడు. పూర్ణం కోసం... పచ్చి శనగపప్పు – అర కప్పు; నీరు – కప్పు;బెల్లం పొడి– ముప్పావు కప్పు;పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు;యాలకుల పొడి– అర టీ స్పూన్‌తయారీ..– శనగపప్పును కడిగి రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, చల్లారిన తర్వాత నీటిని వంపేసి శనగపప్పును మిక్సీలో వేసి పొడి చేయాలి.– ఈ పొడి డ్రైగా ఉండదు, కొద్దిపాటి తడిపొడిగా ఉంటుంది.– ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి కరిగే వరకు మరిగించాలి.– కరిగిన తర్వాత మరొకపాత్రలోకి వడపోయాలి.– బెల్లం నీటిలో శనగపప్పు పొడి, కొబ్బరి తురుము వేసి గరిటెతో కలుపుతూ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు మరిగించాలి.– చివరగా యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.– చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా చేసి, గోళీలుగా చేస్తే పూర్ణం రెడీ.ఇక కుడుముల కోసం..– ఒక పాత్రలో కప్పు నీరు పోసి అందులో ఉప్పు, నెయ్యి వేసి వేడి చేయాలి.– నీరు మరిగేటప్పుడు స్టవ్ ఆపేసి బియ్యప్పిండి వేసి గరిటెతో కలపాలి.– వేడి తగ్గిన తరవాత చేత్తో మర్దన చేస్తూ చపాతీల పిండిలా చేసుకుని ఎనిమిది భాగాలు చేయాలి.– ఒక్కో భాగాన్ని గోళీలాగ చేసి పూరీలా వత్తాలి.– ఇందులో పూర్ణం పెట్టి అంచులు మూసేయాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి.– ఒక వెడల్పు పాత్రకు నెయ్యి రాసి పూర్ణకుడుములను అమర్చాలి.– ప్రెషర్ కుకర్‌లో నీరు పోసి కుడుముల పాత్ర పెట్టి మూత పెట్టి ఎనిమిది నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆపేయాలి.– చల్లారిన తర్వాత తీసి వినాయకుడికి నివేదన చేయాలి. -
గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాతిగాంచిన జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయిని మహకాళి దేవాలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. అదే సమయంలో దేవి లోక్ శక్తిపీఠం, ఓంకారేశ్వరలోని 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, ఇతర దేవాలయాలు మధ్యప్రదేశ్‌లో ఆధ్యాతి్మక పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.ప్రాణ్‌పూర్ చందేరి సమీపంలో భారతదేశపు మొదటి క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ గ్రామం, చందేరి ఫెస్టివల్, కునో ఫారెస్ట్ ఫెస్టివల్, గాం«దీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్, జల్ మహోత్సవ్ వంటి పండగలు, అక్కడి సంస్కృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 785 పులులతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌ను సొంతం చేసుకున్న వన్యప్రాణి అటవీ ప్రాంతం, 14 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లతో సహా హెరిటేజ్ టూరిజం స్పాట్లు మహారాష్త్ర సొంతం. ఎనిమిది నగరాలను కలుపుతూ భారతదేశంలోనే మొదటి ఇంట్రా స్టేట్ ఎయిర్ ట్యాక్సీ సేవలు ఇక్కడే ప్రారంభమయ్యాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగం ఇటీవలి కాలంలో గణనీయంగా వృద్ధి చెందుతోంది.పెరిగిన పర్యాటకులు..అధికారిక లెక్కల ప్రకారం 2022లో పర్యాటకుల సంఖ్య 34.1 మిలియన్లుగా ఉండగా.. 2023లో ఆ సంఖ్య 112.1 మిలియన్లకు చేరింది. గణనీయమైన పెరుగులతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో రోడ్‌షోలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ‘గ్రీన్, క్లీన్, సేఫ్ మధ్యప్రదేశ్’ అనే థీమ్‌తో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ స్థానిక ఓ స్టార్ హోటల్లో రోడ్ షో నిర్వహించింది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లకు ప్రత్యేక అవగాహన కల్పించారు.సాంస్కృతిక కళలు.. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, లోక్రంగ్, తాన్సేన్ సమారో (2025లో 100వ ఎడిషన్), అల్లావుద్దీన్ ఖాన్ సంగీత్ సమారో, అఖిల భారతీయ కాళిదాస్ సమారోహ్ తో సహా ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తోంది. ‘హార్ట్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియాను సందర్శించడానికి ఔత్సాహికులను ఆహా్వనిస్తున్నారు. సత్సంబంధాల కోసం..హైదరాబాద్‌లో రోడ్ షో విజయవంతమైంది. పలు సంస్థలతో మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ చేసుకున్న అవగాహన ఒప్పందాలు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య బలమైన బంధాలు ఏర్పాటు చేస్తుంది. ట్రావెల్ ఏజన్సీలు, టూర్ ఆపరేటర్లు ఈ వర్క్ షాప్‌లో తమ అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉంది. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నవారిని రాయితీలతో ఆహ్వానిస్తున్నాం. – బిదిషా ముఖర్జీ, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ -
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
August 30: ఆధ్యాత్మిక సమాచారం..
శ్రీవారి దర్శనానికి 18 గంటలు..తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 19 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 76,772 మంది స్వామివారిని దర్శించుకోగా 30,293 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.ఆగమోక్తంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు..శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తికి గురువారం ఆగమోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గురుదక్షిణామూర్తికి పలు రకాల అభిõÙక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమరి్పంచారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.అప్పన్నకు స్వర్ణ పుష్పార్చన..సింహాచలం: సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఉదయం స్వర్ణపుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ బేడా మండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుదీర్చారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు.కనకమహాలక్షి్మకి త్రికాల పంచామృతాభిషేకం..డాబాగార్డెన్స్: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు గురువారం 25వ రోజుకు చేరాయి. అమ్మవారికి విశేష పూజలు, త్రికాల పంచామృతాభిషేక సేవ, విశేష హోమాలు నిర్వహించారు. విశిష్ట శ్రావణలక్ష్మీ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని జపగతినగరంలో వేంచేసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆలయం వద్ద నాట్య ప్రదర్శన, కోలాటం వంటి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.నేటితో ముగియనున్న వరలక్ష్మీ వ్రతాలు..సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోటలోని బాలత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమార రామభీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మీ వత్రాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ సామూహిక వ్రతాల్లో తమ పేర్లు నమోదు చేయించుకున్న మహిళలు ఉదయం 9 గంటలకు ఆలయానికి హాజరుకావాలన్నారు.ఘనంగా సామూహిక సత్య దత్త వ్రతాలు..పిఠాపురం: స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రావణ బహుళ ఏకాదశి సందర్భంగా గురువారం సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ప్రత్యేక అభిõÙకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ పెంపు.. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలోని శ్రీవారి నిత్యార్జిత కల్యాణం సేవా టికెట్ రుసుము సెపె్టంబరు ఒకటో తేదీ నుంచి పెరగనుంది. ప్రస్తుతం రూ.1,500గా ఉన్న ఈ టికెట్ ధరను రూ.2 వేలకు పెంచుతున్నటుŠట్ ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు గురువారం వెల్లడించారు. స్వామివారికి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, కోర్కెలు తీరాలని మొక్కుకున్నవారు ఈ సేవలో ఎక్కువగా పాల్గొంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 70 నుంచి 100 మంది, ప్రతి శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో 230 నుంచి 250 మంది వరకు దంపతులు ఈ సేవలో పాల్గొంటున్నారు. -
ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి! అందరి నోటా ఇదే మాట..
సాక్షి, సిటీబ్యూరో, యాదాద్రి: హైదరాబాద్ తూర్పున టెంపుల్ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్యాతి్మక భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో పాటు దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక ఇతర ఆధ్యాత్మిక మందిరాలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు కొలనుపాకలో వెలసిన జైన మందిరం, జగద్గురు రేణుకాచార్యులు ఉద్భవించిన చండికాండ సహిత సోమేశ్వరాలయాలకు సైతం భక్తుల తాకిడి కనిపిస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇదే ప్రాంతంలో ఉండనే ఉంది. ఒక్క రోజులో దేవాలయాలన్నీ చుట్టి రావచ్చు. వారాంతం, సెలవు రోజుల్లో ఆధ్యాతి్మక పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతోంది.భక్తులతో కిటకిట.. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు గడిచిన నాలుగు నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదగిరిగుట్టకు రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు సందర్శించుకుంటుండగా, తాజాగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరాలయంలోనూ సుమారు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. తాజాగా స్వర్ణగిరి ఆదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. అదే సమయంలో విశాలమైన రహదారి సదుపాయాలు ఉన్నాయి. దీంతో సొంత వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాలు అందిస్తున్నారు.ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో స్వర్ణగిరి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లేందుకు వరంగల్ జాతీయ రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాదిగా బస్సులు, కార్లు, ఇతర రవాణా వాహనాలు ఆ మార్గంలో నడుస్తున్నాయి. ఉప్పల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కొలనుపాక వెళ్లాలనుకునే జైన భక్తులు ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట మార్గంలో వెళ్లే కృష్ణా, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, పుషు్పల్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు భువనగిరి, యాదాద్రి, ఆలేరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అక్కడి నుంచి ఆటో, బస్సులో వెళ్లవచ్చు.మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు..యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి ఆలయంతో పాటు తెలంగాణలో పేరొందిన పది దేవాలయాలు ఉన్నాయి.. ఆ వివరాలు... – అలంపూర్ జోగులాంబ దేవాలయం – బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం – వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం – కొండగట్టు వీరాంజనేయస్వామి దేవాలయం – యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం – చిలుకూరు బాలాజీ దేవాలయం – ఖర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం – ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిరుపతి ఫీల్ ఉంది..కుటుంబ సభ్యులతో కలసి స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, ఆ చుట్టూ ఉన్న టెంపుల్స్ వెళ్లాము. స్వర్ణగిరి కొత్తగా కడుతున్నారు. అక్కడికి వెళ్లగానే తిరుపతి ఫీల్ ఉంటది. యాదగిరి గుట్ట కొత్తగా కట్టిన తరువాత తప్పనిసరిగా ప్రతిఒక్కరూ చూడాలి. ఒక్క రోజులో దేవాలయాలన్నీ దర్శనం చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేశాం. ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేసుకున్నవారికి ఇది బాగుంది. – జలజా రెడ్డి, మణికొండ -
Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? – డి. వరలక్ష్మి, హైదరాబాద్– కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్. కౌసల్య, చిల్కమర్రి– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి! -
సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి!
సకల విఘ్నాలనూ తొలగించే దైవంగా తొలి పూజలు అందుకొనే వేలుపు గణనాథుడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని సూచించే పురాణగాథలు ఉన్నప్పటికీ, ఏ ఆలయంలోనైనా గణేశుడు ఒక్కడే దర్శనమిస్తాడు. ఇద్దరు భార్యలతోనూ కనిపించే ఆలయాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి అరుదైన కోవెళ్ళలోకెల్లా అరుదైన ఆలయం ఒకటుంది. ఇక్కడ భార్యలతో పాటు పుత్రులతో కూడా కలిసి కొలువు తీరాడు పార్వతీ తనయుడు.రణథంబోర్ వినాయకుడిని పరమ శక్తిమంతునిగా, రాజ్య రక్షకునిగా స్థానిక చరిత్ర అభివర్ణిస్తోంది. అది క్రీస్తుశకం 1299వ సంవత్సరం. రణథంబోర్ రాజు హమీర్‌కూ, ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకీ మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారాన్నీ, అవసరమైన ఇతర సరుకులనూ కోటలోని గోదాముల్లో నిల్వ చేశారు. ఈ యుద్ధం చాలా సంవత్సరాలు సాగడంతో గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. వినాయకునికి పరమ భక్తుడైన హమీర్‌కు ఏం చెయ్యాలో పాలు΄ోలేదు. భారమంతా గణపతి మీద వేశాడు.ఒక రోజు రాత్రి అతను నిద్ర΄ోతూండగా ఏకదంతుడు కలలోకి వచ్చాడు. సమస్యలన్నీ మర్నాటి పొద్దుటికల్లా తీరి΄ోతాయని అభయం ఇచ్చాడు. మరునాడు కోటలోని ఒక గోడ మీద మూడు నేత్రాలున్న వినాయకుని ఆకృతి దర్శనం ఇచ్చింది. దరిమిలా యుద్ధం ముగిసి΄ోయింది. ఖిల్జీ సేనలు వెనుతిరిగాయి. మరో చిత్రం ఏమిటంటే కోటలోని గోదాములన్నీ సరుకులతో నిండి ఉన్నాయి. గణేశుడే తన రాజ్యాన్ని రక్షించాడనీ, ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడనీ భావించిన హమీర్ క్రీ.శ. 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు.ఇదీ విశిష్టత..ఈ ఆలయంలో వినాయకుడు మూడు నేత్రాలతో దర్శనం ఇస్తాడు. భార్యలైన సిద్ధి, బుద్ధి తోపాటు కుమారులైన శుభ్, లాభ్ కూడా గణేశునితో పాటు కొలువు తీరి పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. ఇలాంటిది మరే వినాయక ఆలయంలోనూ కనిపించదు. స్వామికి ప్రతిరోజూ అయిదు సార్లు హారతులు ఇస్తారు. అర్చకులతోపాటు భక్తులు కూడా సామూహిక ్రపార్థనలూ, భజనగీతాలాపనలూ చేస్తారు. ఈ స్వామిని పూజిస్తే విద్య, విజ్ఞానాలతోపాటు సంపదనూ, సౌభాగ్యాన్నీ అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయ్ మధోపూర్ జిల్లా రణథంబోర్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల నుంచి సవాయ్ మాధోపూర్ జంక్షన్‌కు నేరుగా రైళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు 17 కి.మీ. దూరంలో ఉన్న రణథంబోర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రణథంబోర్‌కు సమీప విమానాశ్రయం సుమారు 150 కి.మీ. దూరంలోని జైపూర్ లో ఉంది.ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
ఆధ్యాత్మిక సమాచారం
శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,153 మంది స్వామివారిని దర్శించుకోగా 25,863 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.32 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,97,72,140 వచి్చనట్లు ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఆలయ ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీలను ఆలయంలోని గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద లెక్కించారు. బంగారు 98 గ్రాములు, వెండి 605 కిలోలు, విదేశీ కరెన్సీ నోట్లు 233 వచ్చాయి. సింహగిరిపై రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు సింహాచలం: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 30న సింహగిరిపై పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. వ్రతాల్లో పాల్గొనే మహిళలకు పూజాసామగ్రి, ప్రతిమ, రవిక, ప్రసాదం దేవస్థానం ఉచితంగా అందిస్తుందన్నారు. శ్రీవారి క్షేత్రంలో నేత్రపర్వంగా ఉట్ల పండుగ ద్వారకాతిరుమల: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన వెంకన్న దివ్య క్షేత్రంలో బుధవారం సాయంత్రం ఉట్ల పండుగ, స్వామివారి తిరువీధి సేవలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంపై ఉంచి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి వాహనం ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. శ్రీవారి కల్యాణ మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ఉట్టిని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు యువకులకు అందించారు. అనంతరం యువకులు దాన్ని ఉత్సహంగా కొట్టారు. 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని ఆయన కోరారు. కనుల పండువగా చెన్నకేశవుని కల్యాణం పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరులో నూతనంగా నిరి్మంచిన చెన్నకేశవస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు ప్రత్యేక యాగశాలలో వివిధ రకాల హోమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిపారు. వైభవంగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కొత్తపేట: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో నూతనంగా నిరి్మంచిన శ్రీ, భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపనను బుధవారం వైభవంగా నిర్వహించారు. తిరుపతిలో ప్రముఖ శిల్పులతో తయారుచేయించిన దేవతామూర్తుల విగ్రహాలను తీసుకువచ్చి సోమవారం నుంచి గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన నేమాని భాస్కరరామం పర్యవేక్షణలో ఆగమ శాస్త్ర పండితులు మూడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. పంచ మఠాల్లో ప్రత్యేక పూజలు శ్రీశైలం: శ్రీశైల క్షేత్ర పరిధిలోని వీరశైవ జగద్గురు పరంపరకు సంబంధించిన పంచ మఠాల్లో ప్రతిష్టమైన లింగాలకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చిన్న సిద్ధరామ శివాచార్య స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో క్షేత్రంలో ఉన్న ఘంటా మఠం, విభూతి, రుద్రాక్ష, భీమశంకర, సారంగధర మఠాల్లో విశేష అభిõÙకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయా మఠాల్లో లోక కళ్యాణార్థం అభిõÙకాది అర్చనలు చేశామని స్వామి తెలిపారు. -
ఆధ్యాత్మిక సమాచారం
శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమరి్పంచారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.బ్రహ్మోత్సవాలను జయప్రదం చేద్దాం..కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌లు పేర్కొన్నారు. కాణిపాకం ఈవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ద్వారకాతిరుమలలో కృష్ణాష్టమి శోభ ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా జరిగాయి. కొండపైన గోసంరక్షణశాలలో, అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని సప్తగోకులంలో పెద్ద ఎత్తున భక్తులు గోవులకు పూజలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను వైభవంగా జరుపనున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు. అప్పన్నకు విశేషంగా గరుడసేవ సింహాచలం: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడవాహనంపై వేంచేపుచేశారు. అషో్టత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు. ఘనంగా శ్రావణలక్ష్మి పూజలు డాబాగార్డెన్స్: విశాఖ నగరంలోని బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మి పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు. ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.70.96 లక్షలు శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల ద్వారా రూ.70,96,186 ఆదాయం లభించినట్లు ఈఓ డీఎల్వీ రమేష్‌బాబు తెలిపారు. జూన్ 10 నుంచి ఈనెల 27 వరకూ మొత్తం 77 రోజులకు గాను ఈ మేరకు ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు. -
పూజ ఎందుకు చేయాలి !
గృహస్థాశ్రమ వైశిష్ట్యంకొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం. ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి. ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం.హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు/జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్/తనయుల సంభాషణములు/ జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సమ్మోహన స్వరూపుడు
రూపు నల్లన.. చూపు చల్లన. మనసు తెల్లన... మాట మధురం. పలుకు బంగారం.నవ్వు సమ్మోహకరం. వ్యక్తిత్వం విశిష్టం..ఆ ముద్ర అనితర సాధ్యం. అందుకే... నమ్మిన వారికి కొండంత అండ. అసలు కృష్ణుడంటేనే సచ్చిదానంద రూపం.. అలౌకిక ఆనందానికి ప్రతిరూపం..అందుకే ఆ నామం ఆరాధనీయం.. సదా స్మరణీయం.కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా చతుర్విధ çపురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి.దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకూ శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలలో ఎనిమిదవ అవతారంగా నందన నామ సంవత్సర దక్షిణాయన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. నేడు ఆయన ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా ఓ వ్యాస పారిజాతం. చిలిపి కృష్ణునిగా, గో పాలకునిగా, రాధా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టపత్నులకూ ఇష్టుడైన వాడిగా... గోపికావల్లభుడిగా... యాదవ ప్రభువుగా, పార్థుడి సారథియైన పాండవ పక్షపాతిగాను, గీతా బోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, రాజనీతిజ్ఞునిగా... ఇలా బహువిధాలుగా శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం ద్యోతకమవుతుంటాయి. ఎన్నిసార్లు చదివినా, ఎంత తెలుసుకున్నా ఆయన లీలలు మిగిలిపోతూనే ఉంటాయి. శ్రీ కృష్ణుడు బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. గోపికల ఇళ్లలో వెన్నముద్దలను దొంగిలించి తినేవాడు. అది చాలదన్నట్టు వారిలో వారికి తంపులు పెట్టేవాడు. అందులోని అంతరార్థమేమిటంటే.. జ్ఞానానికి సంకేతమైన వెన్న అజ్ఞానానికి చిహ్నమైన నల్లని కుండలలో కదా ఉండేది. అందుకే కుండ పెంకులనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నమైన వెన్నను దొంగిలించడం ద్వారా తన భక్తుల మనసులో విజ్ఞానపు వెలుగులు నింపేవాడు. గోపాలకృష్ణుడు‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. మోహన కృష్ణుడుశ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలిపింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. శ్రీకృష్ణుని పూజించేవారికి మాయవలన కలిగే దుఃఖాలు దరిచేరవని అంటారు.వేణుమాధవుడుకన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...కృష్ణుడికి అర్పించుకోవడం కోసం వేణువు తనను తాను డొల్లగా చేసుకుంటే, ఆ డొల్లలో గాలిని నింపడం కోసం కృష్ణుడు ఎప్పుడూ దానిని తన పెదవుల దగ్గరే ఉంచుకునేవాడు. అందుకే కృష్ణుడి పెదవులు తనను తాకి నప్పుడు పరవశించి మృదు మధురమైన గానాన్ని వినిపిస్తుంది వేణువు. అందుకే నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఇది ఒక అమూల్యమైన సంపద..
తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అద్భుతమైన మానవీయ సంబంధాలు. వారి సమక్షం ఒక విశ్వవిద్యాలయమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక పాఠశాల ఉంది. పాఠశాలల్లో పేరంట్స్ డే జరపడం సర్వసాధారణమే.. కానీ అక్కడ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుతారు. అటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత గొప్ప విశేషమో తెలియ చేయడానికి వారిని ఎందుకు గౌరవించాలో బోధపరచడానికి వారీ ఉత్సవం నిర్వహిస్తారని తెలిసి చాలా సంతోషమేసింది. తాతలు, నానమ్మలు, అమ్మమ్మల దగ్గర పెరిగిన పిల్లల్లో ధైర్యం, సంస్కారం ఎక్కువగా ఉంటుందని ఆ పాఠశాల ప్రిన్సి΄ాల్ తన ప్రసంగంలో తెలియచేసారు. అటువంటి పెద్దల సమక్షంలో పెరిగే పిల్లల మానసిక పరిణతి, సంస్కారబలం వృద్ధి చెందుతాయి. పెద్దల విలువని ఎంతని లెక్కగట్టగలం!!! వారు లేరని బాధపడేవాళ్ళుంటారు చాలా మంది... అటువంటప్పుడు వారిని ఓల్డ్ ఫర్నీచర్ అని తప్పించడం ఎంత నీతిబాహ్యమైన చర్య? తండ్రి పెద్దవాడయిపోయాడు. కొడుకు భుజం మీద చెయ్యివేసుకుని వెళ్ళడం ఒక ఠీవి. తండ్రి చేతిని కొడుకు పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెడితే అదొక ఠీవి. నా కొడుకును సహాయంగా తీసుకుని బయటకు వెళ్ళి రావడం నా అవసరం, నా ఆనందం. దాని ప్రయోజనం మరొకరికి ఎలా తెలుస్తుంది? కొదుకు ఎక్కడ ఉంటే అక్కడ ఉపశమనం. కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఊరట. మనసుకు గొప్పశాంతి. అది సంపద. అంత గొప్ప సంపదకు దూరంగా ఏకాకిగా బతకడమా!!! మనుమలతో కలసి బతకడం భగవంతుడిచ్చిన గొప్ప భాగ్యం. వారిలో తమను తాము చూసుకోవడం పెద్దలకు పెద్ద ఓదార్పు. ఈశ్వరుడిచ్చిన ఇంత గొప్ప సంపద నాకు ఎవరి వలన లభిస్తున్నది... కోడలు వలన. అంటే వివాహం అనేది ఈ సంపద సృష్టికి మూల కారణం అవుతున్నది. స్థిరచరాస్తులు ఎంత పోగేసుకున్నాం అన్నదానికంటే... కుటుంబంలో మనుషుల మధ్య మనసులు ఎంతగా కలిసాయన్నది ఈ ఆనందాలకన్నింటికీ హేతువవుతుంది. ఆరోగ్యకర సమిష్టి జీవనానికి దారివేస్తుంది.జీవితాన్ని కూడా గాలికి వదిలేసి సంపాదన లో మునిగితేలేవాడికి సంసార సుఖం తెలియదు. సంపాదన అవసరమే, కానీ సంసార జీవితాన్ని కలిసికట్టుగా ఆస్వాదించపోతే ఇక గహస్థాశ్రమ వైభవం ఎక్కడుంది? దాని ఫలాలను నీవెక్కడ ఆస్వాదిస్తున్నావు? అంటే బతకడానికి సం΄ాదన... అంతే తప్ప సంపాదన కోసం బతకడం కాదు కదా! శ్రీమంతుల ఇంట అయినా పేదల ఇంటయినా... అరమరికలు లేకుండా ఉమ్మడిగా బతకడం వర్తమానంలో సంతోషాలకే కాదు, తరువాత తరాలకు కూడా సంతోషకారకాలను అందిస్తున్నాం. అందుకే కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, మనుమలు.. ఇదంతా గొప్ప సంపద. ఈ సంపదకు మూలం వివాహ వ్యవస్థ. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం ఒక వైభవానికి నాంది. -
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
Varalakshmi Vratham 2024: సిరి వరాలు
లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. కుచేలుర నుంచి కుబేరుల వరకు అందరికీ ఆమె అనుగ్రహం కావలసిందే. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో ఉన్నత లక్షణాలు కలిగిన లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే సకల సంపదలు పొందగలమనడంలో సందేహం లేదు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు... అందులోనూ రెండవ శుక్రవారమంటే ఇంకా ఇష్టం. ఈ రోజున వరలక్ష్మీవ్రతం చేసుకున్న వారికి సకల సంపదలూ ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి.మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఎలా గౌరవాదరాలతో మర్యాదలు చేస్తామో అదేవిధంగా అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి, మనసు పెట్టి ఈ వ్రతాచరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.సమకూర్చుకోవలసిన సామగ్రిపసుపు, కుంకుమ, గంధం, విడి పూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరుబత్తీలు, కర్పూరం, చిల్లర పైసలు, కండువా, రవికల బట్టలు రెండు, మామిడాకులు, అరటిపండ్లు, ఇతర రకాల పండ్లు ఐదు రకాలు, అమ్మవారి పటం, కలశం, మూడు కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణాలు రెండు, నైవేద్యం కోసం ఓపికను బట్టి ఐదు లేదా తొమ్మిది రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా పాలు, ఇంకా దీపాలు, గంట, హారతి పళ్లెం, స్పూన్లు, పళ్లేలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు.వ్రత విధానంవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున పొద్దున్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవన్నీ దగ్గర లేకపోతే పూజమీద మనసు నిలపడం కష్టం అవుతుంది..ముందుగా గణపతి పూజ చేసుకోవాలి.వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదాఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందనపూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయకగణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి పూజ చేసి, స్వామికి పళ్ళుగానీ బెల్లం ముక్క గానీ నివేదించాలి. తర్వాత వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కలశం ఉంచి అమ్మవారిని ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజించాలి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అనంతరం తోరపూజ చేసుకుని, ‘బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహిమే రమే’ అని చదువుకుంటూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రత కథ చదువుకొని అక్షతలు వేసుకుని, అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది రకాల పిండివంటలు నైవేద్యం పెట్టాలి. ముత్తయిదువులకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత పూజ చేసిన వారు తీర్థప్రసాదాలు స్వీకరించి, పేరంటాళ్లు అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలి. తర్వాత బంధుమిత్రులతో, పూజకు వచ్చిన వారితో కలిసి కూర్చుని భోజనం చేయాలి. రాత్రికి ఉపవసించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం. అదేమంటే అమ్మవారికి ఐదు లేదా తొమ్మిది పిండివంటలు నివేదించాలి అన్నారు కదా అని ఎంతో శ్రమ పడి. ఓపిక లేకపోయినా అన్నీ చేయనక్కర లేదు. పులిహోర, పరమాన్నం, పూర్ణాలు, చలిమిడితోపాటు పానకం, వడపప్పు, అరటిపండ్లు, సెనగలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.స్త్రీలలోని సృజనకు దర్పణం ఈ వ్రతంఅది ఎలాగంటే ఆ రోజున ఒక మంచి పెద్ద కొబ్బరికాయకి వీరు కళ్లు, ముక్కు, చెవులు, నోరు తీర్చి దిద్ది తగిన ఆభరణాలతో అలంకరించి మరీ వరలక్ష్మిని సృజిస్తారు. -
వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాకార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.పూజా విధానం..భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం తయారు చేయు విధానం..తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.ఆ రోజు వీలుకాకపోతే..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.కేవలం వరాల కోసం కాదు..లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?) -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
వడ్డీ కాసులవాడా... గోవిందా..!
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు. కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట. నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు