Vintalu Visheshalu
-
అపుడు భిక్షాటన...ఇపుడు డాక్టరమ్మగా! ఇంట్రస్టింగ్ జర్నీ
అదృష్టం కలిసి వస్తే.. ఏ స్థితిలో ఉన్నా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుంటే ఆకాశమంత ఎత్తు ఎదగవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మురికి వాడలో పుట్టిన పింకీ ప్రేరణాత్మక కథ చదివితే ఈ మాటలు అక్షరాలా నిజం అనిపిస్తుంది.స్టోరీ ఏంటీ అంటే: పండుగ సీజన్లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలోని మెక్లియోడ్గంజ్లోని బుద్ధ దేవాలయం దగ్గర తన తల్లి కృష్ణతో కలిసి పింకీ హర్యాన్ అనే బాలిక భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేది. అయితే 2004లో ఆమె అదృష్టవశాత్తూ టిబెటన్ బౌద్ధ సన్యాసి జమ్యాంగ్ కంటపడింది. జమ్యాంగ్ ఆమెను ఆదరించి సాయం చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. చివరికి చైనీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ధర్మశాలకు తిరిగి వచ్చింది.#WATCH | Dharamshala: "I was 4.5 years old when I came to the hostel and before that, my mother and I used to beg...In 2004 Guru ji selected me and I am grateful for that...I am also grateful to my parents that they gave me a chance to get my education...," says Pinki Haryan,… https://t.co/czbhOFjfHB pic.twitter.com/HTQEg7HsoE— ANI (@ANI) October 4, 2024అయితే ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. బిచ్చమెత్తుకుంటూ కనిపించిన బాలిక కోసం వెదికి, చరణ్ ఖుద్ వద్ద ఉన్న మురికివాడను సందర్శించి బాలికను గుర్తించాడు. ఆమెను చదివిస్తానని చెప్పాడు. కానీ ఇందుకు ఆమె తండ్రి మొదట్లో ఇష్టపడలేదు. ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్‌కు పంపమని పింకీ హర్యాన్ తల్లిదండ్రులను ఒప్పించాడు. చివరికి పింకీ తండ్రి కాశ్మీరీ లాల్ అంగీకరించి, కొత్తగా ప్రారంభించిన టోంగ్లెన్ ఛారిటబుల్ ట్రస్ట్ హాస్టల్‌కు పంపడంతో అసాధారణ ప్రయాణం మొదలైంది. పింకీ హర్యాన్ చదువులో బాగా రాణించింది. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి తర్వాత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువ కాబట్టి 2018లో చైనాలోని ప్రతిష్టాత్మకమైన వైద్య విశ్వవిద్యాలయంలో చేరింది. ఆరేళ్ల ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ధర్మశాలకు తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా "నా తండ్రి చెప్పులు కుట్టేవాడు , బూట్లకు పాలిష్ చేయడం ద్వారా జీవనం సాగించేవాడు అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తన విజయానికి తాను టిబెటన్ సన్యాసి జమ్యాంగ్కు రుణపడి ఉన్నానని, ఇప్పుడు పేదరికం కారణంగా చదువుకునే స్థితిలో లేని ఇతర పేద పిల్లలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పింకీ చెప్పింది. చిన్నప్పుడు, మురికివాడలో నివసించాను కాబట్టి నా నేపథ్యమే అతిపెద్ద ప్రేరణ అని తెలిపింది. అంతేకాదు పింకీ ప్రేరణతో ఆమె సోదరుడు, సోదరి అదే ఎన్జీవో పాఠశాలలో చేరడం విశేషం. కాగా డబ్బు సంపాదించే యంత్రాలుగా మారడానికి బదులుగా మంచి మానవులుగా మారడానికి పిల్లలను మార్చడమే సన్యాసి జమ్యాంగ్ లక్ష్యమని, గత 19 సంవత్సరాలుగా ఎన్జీవో టోంగ్లెన్ ట్రస్ట్‌తో అనుబంధం కలిగి ఉన్న సిమ్లాలోని ఉమంగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన తన జీవితమంతా ధర్మశాల, మురికివాడల పిల్లలకు అంకితం చేశాడన్నారు. జమ్యాంగ్ దత్తత తీసుకున్న పిల్లలంతా ఒకప్పుడు అడుక్కునేవారు లేదా చెత్తను ఏరేవారే. కానీ ఇప్పుడు వాళ్లంతా డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, హోటల్ మేనేజర్లుగా మారారని చెప్పారు. జమ్యాంగ్ 1992లో టిబెట్ నుండి తప్పించుకుని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చాడు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదరికం ఆయనను కదిలించింది. పేదలకు సాయం చేయడం, ముఖ్యంగా మురికివాడల్లో పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు -
ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!
కోట్లకు పడగలెత్తిన వ్యక్తులైన ఒక్కోసారి అమాంతం కుప్పకూలిపోతారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయి రోడ్డుపాలవ్వుతారు. అరే ఒకప్పుడూ ఎలా ఉండేవాడు ఇప్పుడిలా అని అంతా నోరెళ్లబెడతారు. ఎందుకిలా అనేది ఇది అని చెప్పలేం కానీ చూసేవాళ్లకి ఎవ్వరికైన మనసు ఒక్కసారిగా చివుక్కుమంటుంది. అలాంటి దృశ్యమే నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోని చూస్తే ఎవ్వరికైన ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేస్తాయి. జిగల్ రావల్ అనే సామాజికి కార్యకర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వృద్ధ వ్యక్తి మాట్లాడుతూ కనిపిస్తాడు. అతడు ఒకప్పుడు ఇంజనీర్‌గా బాగా బతికిన వాడినని చెప్పాడు.తాను బాగా సంపాదించేందుకు భార్య పిల్లలతో సహా దుబాయ్ వెళ్లానని, అయితే అక్కడ తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్య తనను వదిలేసి పిల్లలను తీసుకుని వేరే అతనితో వెళ్లిపోయిందని బాధగా చెప్పాడు. ఆమె కోసం సంపాదించాలనుకోవడమే తనకు శాపమయ్యిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తాను పొట్ట పోషించుకోవడం కోసం ఇలా వీధుల్లో చెత్త ఏరుకుంటూ బతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. అతడి పరిస్థితి విన్న ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు మంచి ఫ్రోషనల్గా బతికిన వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో జీవనం సాగించడం ఏంటీ..? అసలు విధి ఇంత ఘోరంగా మనుషులతో ఆడుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
అబ్బా ఇదేం రికార్డు.. చాప్‌స్టిక్స్‌తో జస్ట్ ఒక్క నిమిషంలో..!
వరల్ రికార్డ్సు సృష్టించడం కోసం చాలా మంది విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది భారీగా టాస్క్‌లు పెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తే..కొందరూ భలే ఈజీగా మనం రోజూ చూసే వాటితో క్లిష్టమైన టాస్క్‌లను చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే బంగ్లాదేశ్‌కు చెందిన ఈ మహిళ. ఏం చేసి రికార్డు సృష్టించిందో వింటే ఆశ్చర్యపోతారు. చైనా వాళ్లు ఆహారం తినేందుకు ఉపయోగించే చాప్‌స్టిక్స్‌తో బియ్యం గింజలు తిని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2024న బంగ్లాదేశ్ మహిళ సుమైయా ఖాన్ బియ్యం గింజలను చాప్‌స్టిక్స్‌తో తినడం అనే ఛాలెంజ్‌ని స్వీకరించింది. అయితే సుమైయా చాప్‌స్టిక్‌లతో జస్ట్ ఒక నిమిషంలో దాదాపు 37 గింజలు తిని టాస్క్‌ని పూర్తి చేసింది. టాస్క్ పూర్తి అయ్యిన వెంటనే ఆనందంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేసింది. గతంలో ఈ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన టెలాండ్ లా అనే వ్యక్తి పేరిట ఉంది. అప్పడు టెలాండ్ ఒక నిమిషంలో 27 బియ్యం గింజలు తిని రికార్డు సృష్టించగా..దాన్ని సుమైయా బ్రేక్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?) -
అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?
చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న రాజుల కాలం నాటి ఎన్నో ప్రసిద్ద కోటల గురించి కథకథలుగా విన్నాం. కొన్ని కోటలు మిస్టరీగా ఉండి లోనివి వెళ్లేందుకు భయంకరంగా ఉన్న వింత కట్టడాలను చూశాం. ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎంతో మెచ్చుకుని సంబరిపడ్డాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా కోట మాదిరి ఓ ఆధునాతన కట్టడం మన ముందుక రానుంది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో వింటే షాకవ్వుతారు. ఎక్కడంటే..?చుట్టూ కొలను, కొలను మధ్యలో కోట– చూడటానికి వింతగా ఉంది కదూ! పోలండ్‌లో ఉన్న ఈ రాతికోట పురాతన కట్టడమేమీ కాదు, అత్యంత అధునాతన కట్టడం. పశ్చిమ పోలండ్‌లో ఉన్న నాటెకా అడవి శివార్లలో ఉన్న కొలనులో కృత్రిమ దీవిని నిర్మించి, ఆ దీవిపై ఈ రాతికోట నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. ‘స్టోబ్నిసా క్యాజిల్’ పేరుతో చేపట్టిన ఈ కోట నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. దీని నిర్వాహకులు ప్రస్తుతం కోట పరిసరాలను తిలకించడానికి పర్యాటకులకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కో టికెట్టు ధర 5.90 పౌండ్లు (రూ.650) మాత్రమే!(చదవండి: ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!) -
ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!
ఆకులు సర్వసాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి. అరుదుగా కొన్ని మొక్కల ఆకులు ఎరుపు, పసుపు, నీలం, ఊదా వంటి రంగుల్లోను, రంగు రంగుల మచ్చల్లోను ఉంటాయి. మసిపూసినంత నల్లని ఆకులు ఉండే మొక్క ఇది. ఈ ఆకులు చిన్నవేమీ కాదు, ఏకంగా ఏనుగు చెవులంత పరిమాణంలో ఉంటాయి. అత్యంత అరుదైన ఈ మొక్కను ‘బ్లాక్ మేజిక్’ అని పిలుచుకుంటారు. దీని శాస్త్రీయనామం ‘కోలోకాసియా ఎస్కలెంటా’. చేమదుంపల జాతికి చెందిన ఈ మొక్క ఆకులు ముదురు ఊదా, ముదురాకుపచ్చ రంగుల్లో కూడా ఉంటాయి. నల్లని ఆకులు వచ్చేలా జన్యుమార్పిడి చేసి వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటిని తోటల్లో అలంకరణ కోసం పెంచుకోవడం యూరోపియన్ దేశాల్లో ఫ్యాషన్‌గా మారింది. ‘హాలోవీన్’ వేడుకల్లో ఈ మొక్కలను అలంకరణ కోసం వాడుతుంటారు. (చదవండి: మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!) -
మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!
మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది. జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. (చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
12 ఏళ్లకు ఒకసారి కనువిందు చేసే అద్భుత ప్రకృతి దృశ్యం..!
ప్రకృతి అద్భుతాలు మనసుకు ఆహ్లాదంగానూ, విచిత్రంగాను ఉంటాయి. అబ్బా..! ప్రకృతి అందమే అందం మాటల్లో వర్ణించలేం. అలాంటి ఓ అద్భుత దృశ్యం తమిళనాడు, కేరళ వంటి హిల్స్టేషన్స్లోనే చూడగలం. ఈ అద్భుతం 12 ఒకసారి మాత్రమే కనువిందు చేస్తుంది. ప్రపంచమంత నీలిమయంలా చూపించే ఈ కమనీయ ప్రకృతి దృశ్యానికి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దాం..!తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రకృతి ఉత్కంఠభరిత దృశ్యం కనువిందు చేసింది. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసి ఈ నీలకురించి పువ్వులు ఈ ఏడాది వికసించి..ఆ నింగే భూమిపై వాలిందా అన్నంత అందంగా ఉంది. ఈ నీలకురించి పువ్వులు సాముహికంగా పుష్పిస్తాయి. అంతేగాదు ఇవి కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అదికారిణి సుప్రియ సాహు సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకోవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కుట్టన్ అనే తోడా గిరిజనడు నీలకురించి పూల మధ్య గర్వంగా కూర్చొన్నట్లు కనిపిస్తున్న ఫోటో ఒక వైపు మరోవైపు ఆకుల గుండా పుష్పించిన శక్తిమంతమై నీలం పువ్వుల అందమైన చిత్రం తోపాటు ఓ వీడియో కూడా ఉంటుంది. అందులో పైన నీలి ఆకాశం కింద నీలగిరి పువ్వులతో ప్రపంచమే నీలిరంగు పులుముకుందా అన్నంత అందంగా కృష్ణుని నీలాన్ని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంది. ఈ మొక్కలు అంతరించిపోయే రెడ్‌లిస్ట్‌లో ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సి అవసరం ఉందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి సాహు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోనే కాకుండా కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్లో కూడా నీలకురింజి పూల మొక్కలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని నీలగిరి కొండల్లో చివరిసారిగా 2006న పూశాయి మళ్లీ 2018న పూస్తాయని అనుకున్నారు కానీ అడవిలో వచ్చిన మంటల కారణంగా నీలకురించి కనిపించలేదు. మళ్లీ ఏడాది కనువిందు చేశాయి. భారతదేశంలో ఇలాంటి మొక్కలు మొత్తం 40 రకాలు ఉన్నాయి. ఈ పువ్వులు పరాపరాగ సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్లే 12 ఏళ్లకు గానీ పుష్పించవు. తమిళనాడులోని పలియన్ తెగవారు వీటి వయసును లెక్కిస్తారు. ఆ తెగ వారు నీలకురింజిని పవిత్రంగా భావిస్తారు. అంతేగాదు ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు ద్రవ బంగారంగా భావిస్తారట. అంటే మనం ఈ నీలకురించి పువ్వులను చూడాలంటే మళ్లీ 2036 వరకు ఆగాల్సిందే..!Kuttan a Toda tribesman sits proudly among the blooming Neelakurinji flowers in Nilgiris. Flowers of Neelkurinji bloom once in 12 years cycle. It is said that Nilgiris gets its name due to the magical blue hue imparted by these stunning flowers. Neelakurinji Strobilanthes… pic.twitter.com/ugEgsxBiUk— Supriya Sahu IAS (@supriyasahuias) September 26, 2024 (చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!) -
భార్యామణికోసం ఏకంగా ఐలాండ్నే కొనేసిన వ్యాపారవేత్త?!
కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చుతున్న భర్తల్ని చూశాం. జీవిత సహచరి కోసం ఎన్నో త్యాగాలను చేసే పుణ్యపురుషుల గురించి విన్నాం. కానీ ఒక భర్త భార్య ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఇంకెవ్వరూ చూడకుండా ఉండేందుకు ఏకంగా ఐలాండ్నే కొనేశాడు. విచిత్రంగా అని పిస్తోందా? అయితే ఈ కథనం చదవాల్సిందే.దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదాక్ కోసం హిందూ మహా సముద్రంలోని ఏకంగా 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ.418 కోట్లు) వెచ్చించి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. View this post on Instagram A post shared by Soudi✨ (@soudiofarabia)దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ సదాక్ కథనం ప్రకారం మిలియనీర్ అయిన తన భర్త బీచ్‌లో ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అదీ తాను బికినీ వేసేందుకు, ఇబ్బంది పడకుండా, సురక్షితంగా ఉండేందుకు ఇలా చేశాడని ఇన్స్టాగ్రాం వేదికగా వెల్లడించింది. అయితే గోప్యత, భద్రతా కారణాల దృష్ట్యా ద్వీపం ఖచ్చితమైన లొకేషన్‌ను షేర్ చేయడం లేదు కానీ, ఇది మాత్రం ఆసియా ఖండంలోనే ఉంది అని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు 30 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కాగా ఈ జంట దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వీరికి పెళ్లయ్యి మూడేళ్లు. సౌదీ అల్ సదాక్ ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ ద్వారా ఆమె లగ్జరీ స్టయిల్‌తో బాగా పాపులర్. ఇదీ చదవండి: రాగిముద్ద-నాటుకోడి పులుసు సూపర్ కాంబో -
బిగ్‌బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్‌పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్‌లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్‌లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్‌బీ కూడా చలించిపోయారు. చందర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్‌ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్‌లైన్‌ని అనే లైఫ్‌లైన్‌ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
టెక్ మొగల్ మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ : ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తూ వీడియో వైరల్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఒక వీధి వ్యాపారి వద్ద హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సందడి చేస్తోంది.స్ట్రీట్ ఫుడ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటూ బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో స్ట్రీట్ ఫుడ్ హాట్ డాగ్‌ను ఆస్వాదిస్తున్న తాజా వీడియో ణాల్లో ఇది వైరల్ అయ్యింది. "మీరు హాట్‌డాగ్ తినలేదూ అంటు న్యూయార్క్ వెళ్లనట్టే" అని క్యాప్షన్‌తో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులు రకరకాల కమెంట్లతోపాటు, టెక్ మొగల్ను ప్రశంసల్లో ముంచెత్తారు. వావ్, బిలియనీర్లు కూడా మంచి హాట్ డాగ్‌ని ఇష్టపడతారు!, ఆయనకూడా మనలాగే! గేట్స్ హాట్ డాగ్ అభిమాని అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు హాస్య భరితంగా, "బిల్ మస్టర్డ్ లేదా కెచప్‌ను ఇష్టపడతారా?"అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates)కాగా స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించడం బిల్‌గేట్స్‌కు ఇదే తొలిసారి కాదు తాను ఏ నగరంలో ఉన్నాడో ప్రపంచానికి తెలియజేయడానికి ఆహారాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకోవడం బిల్ గేట్స్‌కు బాగా అలవాటు. ఆ నగరానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాన్ని గుర్తించి, దాన్ని సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తారు.. ఈ సంవత్సరం ప్రారంభంలో, భారతదేశ పర్యటన సందర్భంగా, సోషల్ మీడియాఇన్ఫ్లుయెన్సర్ చాయ్‌వాలా చాయ్ సిప్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సోయా ఆకుతో బరువు తగ్గొచ్చు.. ఇంకా ఆశ్చర్యకర ప్రయోజనాలు -
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్‌ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!) -
ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!
కొన్ని సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. ఎలా వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుట్టాం. వాటి ఆచూకీకై ఏళ్లు తరబడి ఆశగా ఎదురుచూస్తాం. చివరికి ఆశలన్నీ ఆవిరిఅయిపోయి. దొరకదు అనే నైరాశ్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగనట్టుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మన చెంతకు వస్తే ఆ ఆనందం మాటలకందని భావోద్వేగా క్షణం కదూ..అలాంటి కథే ఇక్కడ చోటేచేసుకుంది. గుండెల్ని పిండేసీ ఉద్వేగభరితం లూయిస్ అర్మాండో అల్బినో కథ..!ఏం జరిగిందంటే..కాలిఫోర్నియాకి చెందిన లూయిస్ ఆర్మాండో అల్బినో ఫిబ్రవరి 21, 1951న తన పదేళ్ల సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా తప్పిపోయాడు. ఓ అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని ఆశచూపి ఎత్తుకుపోయింది. అలా కిడ్నాప్‌కి గురైన అల్బినో ఆచూకీ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయే తప్ప..అల్బినో ఆచూకీ గురించి మచ్చుకైనా కేసు ముందుకు సాగలేదు. అతడి కోసం ఎదురుచూసి అతడి తల్లి 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అయితే అల్బినో మేనకోడలు అలిడా అలెక్విన్(60) మాత్రం తన మామ అల్బినో ఆచూకీ ఎలాగైన కనిపెట్టాలని ఎంతోగానో తప్పనపడింది. అందుకోసం నాడు కిడ్నాప్ అయ్యినట్లు ఇచ్చిన పేపర్ యాడ్లు, ఫోటోలను సేకరించి మరీ అన్వేషణ సాగించింది. డీఎన్ఏ పరీక్షలు వంటి ప్రత్యామ్నాయాలతో తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి..మామ అల్బినో ఆచూకిని కనుక్కొంది. అతడు రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ కార్ప్స్ నిపుణుడుని తెలుసుకుంది. అతడు వియత్నాంలో రెండుసార్లు పర్యటించాడు కూడా. అతడి డీఎన్‌తో తన కుటుంబ సభ్యుల డీఎన్ఏ 22% సరిపోలాడం వంటివి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వెంటనే అలిడా తన మామ అల్బినోను కుటుంబ సభ్యులతో కలిపింది. అల్బినో సరిగ్గా తన సోదరుడు రోజర్ 82 ఏటనే కలుసుకున్నాడు. అతడు కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి బాధపడ్డాడు. అయితే మరణానికి ముందు ఇలా తప్పిపోయిన తన తమ్ముడిని కలుసుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటూ రోజర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇరువురు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలసేపు మాట్లాడుకున్నారు. ఈ మధుర క్షణం కోసం అలిడా ఎంతగా తపించిందంటే..స్థానిక లైబ్రరీలలో వార్తాపత్రికల ఆర్కైవ్‌లు, మైక్రోఫిల్మ్‌లు తదితరాలతో అణువణువు జల్లెడ పట్టింది. చివరికి లూయిస్ అల్బినో చిత్రాలను కనిపెట్టి..దశాబ్దాల నాటి మిస్టరీని చేధించింది. తన మామ అల్బినోని కుటుంబంతో కలిపింది మేనకోడలు అలిడా అలెక్విన్ .(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
స్వర్గానికి కొంచెమే తక్కువ... ఎలా చేరుకోవాలో తెలుసా?
కాంచన్‌జంగ... మనదేశంలో ఎత్తైన శిఖరం. ప్రపంచ శిఖరాల జాబితాలో మూడవస్థానం. తొలిస్థానంలో ఎవరెస్టు ఉంటే రెండో స్థానంలో కేటూ ఉంది. కేటూ శిఖరం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పరిధిలో ఉండడంతో మనదేశంలో తొలి ఎత్తైన శిఖరం రికార్డు కాంచన్జంగకు వచ్చింది. ప్రపంచంలో అద్భుతంగా విస్తరించిన అరుదైన నేషనల్ పార్కుల్లో కూడా కాంచన్‌జంగ నేషనల్ పార్కుది ప్రత్యేకమైన స్థానం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది విదేశీ ట్రెకర్లను ఆకర్షిస్తున్న కాంచన్‌జంగ నేషనల్పార్కు, పర్వత శిఖరాలను వరల్డ్ టూరిజమ్ డే (27, సెప్టెంబర్) సందర్భంగా మనమూ చుట్టి వద్దాం...స్వర్గానికి కొంచెమే తక్కువపక్షులు, జంతువులు, పర్వతసానువులు, మంచు శిఖరాలను సంతృప్తిగా వీక్షించాలంటే ట్రెకింగ్‌ను మించినది లేదు. కంచన్‌జంగ నేషనల్ పార్కు, పర్వత శిఖరాలకు ట్రెకింగ్ చేయాలనుకునేవాళ్లకు దారులు పెంచింది సిక్కిం రాష్ట్రం. ట్రెకింగ్‌లో త్వరగా గమ్యాన్ని చేరాలని హడావుడిగా నడిచే వాళ్లు తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని ఆస్వాదించలేరు. ప్రశాంతంగా అడుగులు వేస్తూ సరస్సులు, హిమనీ నదాలు, రోడోడెండ్రాన్ పూల చెట్లు, ఓక్ చెట్లు, ఔషధవృక్షాలను మెదడులో ముద్రించుకోవాలి. ఎప్పుడు కంటికి కనిపిస్తాయో తెలియని కస్తూరి జింక, మేక జాతికి చెందిన హిమాలయ తార్, అడవి కుక్కలు, హిమాలయాల్లో మాత్రమే కనిపించే నీలం గొర్రెలు, మంచు చిరుత, ఎర్రటిపాండా, నల్ల ఎలుగుబంటి, టిబెట్ గాడిదల కోసం కళ్లను విప్పార్చి శోధించాలి. కాంచన్‌జంగ నేషనల్పార్క్ ట్రెకింగ్‌లో కాళ్ల కింద నేలను చూసుకోవడంతోపాటు అప్పుడప్పుడూ తలపైకెత్తి కూడా చూస్తుండాలి. తలదించుకుని ముందుకు΄ోతే పక్షులను మిస్సవుతాం. పక్షిజాతులు 500కు పైగా ఉంటాయి. వాటిని గుర్తించడం కూడా కష్టమే. ఆకుపచ్చరంగులో మెరిసే రెక్కలతో ఏషియన్ ఎమరాల్డ్కూ వంటి అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. కాంచన్‌జంగ పర్వత శిఖరాన్ని చేరడానికి మౌంటనియరింగ్లో శిక్షణ ఉండాలి. ట్రెకింగ్ చేయడానికి సాధారణం కంటే ఒక మోస్తరు ఎక్కువ ఫిట్నెస్ ఉంటే చాలు.నదం నదవుతుంది!కశ్మీర్లో చలికి గడ్డకట్టిన దాల్ లేక్‌ను చూస్తాం. కంచన్‌జంగ టూర్లో జెమూ గ్లేసియర్‌ను తప్పకుండా చూడాలి. ఈ హిమానీనదం దాదాపుపాతిక కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మంచులా బిగుసుకుపోయిన నీరు రాతికంటే గట్టిగా తగులుతుంది. ఎండాకాలంలో కరిగి నీరయి ప్రవహిస్తూ అనేక ఇతర నదులకు చేరుతుంది. తీస్తా నదికి కూడా ఈ గ్లేసియరే ఆధారం.శిఖరాలను చూడవచ్చు!హిమాలయాలను ఏరియల్ వ్యూలో చూడడానికి విమాన ప్రయాణంలోనే సాధ్యం. కంచన్ జంగ నేషనల్ పార్కుకు చేరాలంటే సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్΄ోర్టు నుంచి 220కిమీల దూరం ప్రయాణించాలి. ఈ దూరం రోడ్డు మార్గాన వెళ్ల వచ్చు లేదా హెలికాప్టర్లో 20 నిమిషాల ప్రయాణం. రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వాళ్లు జల్పాయ్గురిలో దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాలి. పరిసరాలను, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రైలు, రోడ్డు ప్రయాణాలు బెస్ట్. ఒకవైపు ఫ్లయిట్ జర్నీ, మరో వైపు ట్రైన్ జర్నీప్లాన్ చేసుకుంటే టూర్ పరిపూర్ణమవుతుంది. ఇక్కడ పర్యటించడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. మనదేశంలో సింగిల్ యూజ్ ప్లాలాస్టిక్ని నిషేధించిన తొలి రాష్ట్రం సిక్కిం. పర్యాటకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనుషులను, లగేజ్‌ని సోదా చేసి ప్లాస్టిక్ వస్తువులను బయటవేస్తారు. -
ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!
కొన్ని ప్రముఖ లగ్జరీయస్ ప్యాషన్ బ్రాండ్లు మార్కెట్లోకి రీలిజ్ చేసే కొత్త వస్తువులు చాలా విలక్షణంగా ఆకర్షణీయంగా ఉంటాయి.పైగా వాటికో స్పెషాలిటీ తప్పక ఉంటుంది. ఆ ఫేమస్ బ్రాండ్లు రిలీజ్ చేసే వస్తువులపై క్రేజ్ మాములుగా ఉంటుంది. అందరూ అటెన్షన్ ఆ వస్తువు పైనే ఉంటుంది. అంతలా ఫ్యాషన్ ప్రపంచంలో వాటికి క్రేజ్ ఉంటుంది. అయితే ఫ్యాషన్‌కే ఐకానిక్ సింబల్‌గా ఉన్న ఈ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్ చూస్తే మాత్రం ఇదేం బ్యాగ్ రా బాబు అంటూ ముఖం చిట్లించేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యాగ్‌పై సర్వత్ర విమర్శలు, జోక్‌లు వినిపిస్తున్నాయి. ప్రాడ్ అనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఈ మెటాలిక్ టోట్ బ్యాగ్‌ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ మరింత వినూత్నంగా ఈ బ్యాగ్‌ని రూపొందించింది. పురుషులకు ఇలా డిజైన్ చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. ఇది మన బస్సుల్లోనూ, రైల్వే టాయిలెట్లలోనూ ఫ్లోర్ మాదిరిగా ఈ మెటాలిక్ బ్యాగ్ ఉంది. చూసిన వాళ్ల అంతా భయనాకంగా ఉందంటూ ఘెరంగా పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించే ప్లోర్ మాదిరిగా బ్యాగ్‌ని డిజైన్ చేయడం ఏమిటి. ఇది ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్మెంట్ లేదా విచిత్రమైన డిజైన్ అని ప్రశ్నలు లేవెనెత్తారు. సర్వత్రా ఈ బ్యాగ్ డిజైన్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. ఇదేం డిజైన్ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఇంతలా విమర్శలు వస్తున్న ఈ బ్యాగ్ ధర వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఏకంగా రూ. 2.73 లక్షలు పలుకుతుందట. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాగ్ డిజైన్ పరంగానే కాకుండా ధర పరంగానూ క్లిక్ అయ్యేలా లేదు కదూ..!.(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
వానమ్మ.. వాన! ఇన్ని రకాల వానలుంటాయంటే నమ్ముతారా?
నిన్నమొన్నటి దాకా వానలు దంచి కొట్టాయి. విపరీతంగా కురిసిన వానలతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కాస్త తెరిపిన పడ్డారో లేదో తెలంగాణాలో, హైదరబాద్‌లో మళ్లీ వానలు ఆగమేఘాలమీద దూసుకొచ్చాయి. అసలు వానలు ఎన్నిరకాలు, వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నమ్మినా నమ్మకపోయినా, వివిధ రకాల వర్షాలు ఉన్నాయి. అవును. అంతేకాదు అన్ని వర్షాలు ఒకేలా ఉండవు! గాంధారి వాన –కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.మాపుసారి వాన –సాయంత్రం కురిసే వానమీసర వాన – మృగశిర కార్తెలో కురిసే వానదుబ్బురు వాన – తుప్పర / తుంపర వానసానిపి వాన – అలుకు (కళ్లాపి చల్లినంత కురిసే వాన)సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వానబట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిసేంత వానతప్పె వాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వానసాలు వాన – ఒక నాగలి సాలుకు సరిపడా వానఇలువాలు వాన – రెండుసాల్లకు – విత్తనాలకు సరిపడా వానమడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వానముంతపోత వాన – ముంతతోటి పోసినంత వానకుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వానముసురు వాన – విడువకుండా కురిసే వానదరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వానబొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వానకోపులు నిండే వాన రోడ్డు పక్కన గుంతలు నిండేంత వనరాళ్ల వాన – వడగండ్ల వానకప్పదాటు వాన – అక్కడక్కడా కొంచెం కురిసే వానతప్పడతప్పడ వాన – టపటపా కొంచెంసేపు కురిసే వానదొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వానఏకార వాన – ఏకధారగా కురిసే వానమొదటి వాన – విత్తనాలకు బలమిచ్చే వానసాలేటి వాన – భూమి తడిసేంత భారీ వానసాలుపెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన -
భార్యల్ని పొట్టిబట్టల్లో చూసి మురిసిపోతారా? హవ్వా!!
బిగ్ బాస్-6 ఫేమ్, హీరోయిన్ సనా ఖాన్ గుర్తుందా. హాట్ గ్లామరస్ రోల్స్ మాత్రమేచేస్తూ చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసిన సనాఖాన్ తాజాగా మహిళల వస్త్రధారణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్యలు చిన్న దుస్తులు వేసుకోవడానికి భర్తలు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నలు వేస్తోంది. అంతేకాదు ఆ సమయంలో తనకేదో దెయ్యం పట్టింది, అందుకే తన సినిమాల్లో ఆధునికత పేరులో పిచ్చి బట్టలు వేసుకున్నాను, ఇపుడు సిగ్గుపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించడం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రుబీనా దిలైక్‌తో నిర్వహించిన పోడ్కాస్ట్లో సనాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సైతాన్ కారణంగానే సింప్లిసిటీకి బదులు మోడ్రన్ దుస్తులు, సల్వార్-కమీజ్పై స్లీవ్‌లెస్ ధరించేలా చేసిందని, తన జీవితంలో అదొక అధ్వాన్నమైన సమయమని చెప్పింది. ప్రస్తుతం తప్పు ఏంటో తెలుసుకున్నా, సిగ్గుపడుతున్నా అని పేర్కొంది. అంతేకాదు ప్రతీ పురుషుడు తన భార్య నిరాడంబరంగా దుస్తులు ధరించాలని కోరుకుంటాడు, కానీ కొంతమంది ఎక్స్పోజింగ్ దుస్తులు వేసుకునేలా భార్యల్ని,ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థం కాదని వాపోయింది. ‘ఆమె నీ భార్య కొంచెమైనా ఆత్మగౌరవం ఉండాలంటూ’ హితవు పలకడం గమనార్హం. కాగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో ‘జై హో’, టాలీవుడ్లో కళ్యాణ్‌రామ్‌తో ‘కత్తి’, నాగార్జునతో ‘గగనం’, మంచు మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లో నటించింది సనాఖాన్. రియాల్టీ షో బిగ్ బాస్ 6లో కూడా హల్ చల్ చేసింది. 2019 తర్వాత సనా ఖాన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుని అందర్నీ దిగ్భ్రాంతికి గురించింది. 2023లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. -
24 క్యారెట్స్ బంగారంతో ‘గోల్డ్ ఫింగర్’ బుల్లి కారు : ధర తక్కువే!
అగోరా మోడల్స్ అరుదైన బాండ్ సేకరణలలో ఒకటైన సూపర్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కారు 1:8 ఆస్టన్ మార్టిన్ డీబీ5 మోడల్ మినీ కారు ఇది. మోడల్ ఇది. 1964 నాటి మూడో జేమ్స్‌బాండ్ చిత్రం గోల్డ్ ఫింగర్లో ఈ కారు కనిపించింది. ఈ మూవీలో సీన్ కానరీ సీక్రెట్ ఏజెంట్ 007గా నటించాడు. 24 క్యారెట్ బంగారం పూత కలిగిన మ్యూజియం క్వాలిటీతో బ్రిటన్‌కు చెందిన అగోరా మోడల్స్ కంపెనీ ఇలాంటి కేవలం ఏడు కార్లు మాత్రమే తయారు చేసింది. ఇయాన్ ప్రొడక్షన్స్ , ఆస్టన్ మార్టిన్ల సహకారంతో నిర్మించిన గోల్డ్ ఫింగర్ సినిమాకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా దీనిని గురువారం లండన్‌లోని బర్లింగ్టన్ ఆర్కేడ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఎజెక్టర్ సీట్లు ,రివాల్వింగ్ నంబర్ ప్లేట్ ఉంటాయి. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు ధర సుమారు రూ.27 లక్షలు. -
మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్ మన్రో జీవితం..!
పదహారు సంవత్సరాల వయసులో ఫ్యాక్టరీ కార్మికుడైన జేమ్స్ డొమెర్టీని పెళ్లి చేసుకుంది మార్లిన్ మన్రో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భర్త సీరియస్‌గా ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.సినిమాల్లోకి అడుగు పెట్టాక, కెరీర్లో పైకి వెళుతున్న కొద్దీ మన్రో వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న మన్రో బేస్ బాల్ స్టార్ జో డిమాజియోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవ లేదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన మన్రో వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోలేదు. మత్తు పదార్థాలకు దగ్గర అయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వ్యసనం మరింత తీవ్రమైంది. ఆ తీవ్ర వ్యసనమే ఆమె పాలిట మృత్యువుగా మారింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మార్లిన్ మన్రో బర్త్ డే సాంగ్ పాడింది. వీరిద్దరు కలిసి ఉన్న ‘ఫోటో’ ఆధారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్రోకెనడీల గురించి రకరకాల కోణాలలో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కెనడీ బర్త్ డే పార్టీకి హాజరైన మూడు నెలలకే మన్రో చనిపోయింది.తన మరణానికి కొన్ని గంటల ముందు మన్రోకు అప్పటి అమెరికా అటార్నీ జనరల్ రాబర్ట్ ఎఫ్ కెనడీతో తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయని, అతడే ఆమెకు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఉండొచ్చనే వెర్షన్ కూడా వినిపించింది. కెనడీ సోదరులు, వారి సర్కిల్ తాలూకు ప్రైవేట్ ప్రపంచంపై ‘ది ఫిక్సర్’ పుస్తకం దృష్టి సారిస్తుంది. మళ్లీ కెనడీ సోదరుల దగ్గరికి వస్తే....మార్లిన్ రెండవ భర్త జో డిమాజియో చెప్పిన దాని ప్రకారం మన్రో అంత్యక్రియలకు హాజరు కాకుండా కెనడీ సోదరులను నిషేధించారు.‘కెనెడీలంతా లేడీ కిల్లర్లే’ అంటూ ఘాటుగా తిట్టేవాడు జో డిమాజియో. ఫ్రెడ్ ఒటాస్ ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ మాత్రమే కాకుండా ‘డెయిలీ మెయిల్’ పత్రికలో వన్స్ అపాన్ ఏ టైమ్ వచ్చిన ‘ఆస్క్ నాట్’ సీరియల్లోని సమాచారాన్ని కూడా ‘ది ఫిక్సర్’ రచయితలు జోష్ యంగ్, మాన్ఫ్రెడ్లు వాడుకున్నారు. మార్లిన్ మన్రోపై ఎన్నో సినిమాలు, వందలాది పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా.... మార్లిన్ మన్రో జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే.(చదవండి: రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?) -
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
కిన్మేమై బియ్యం గురించి విన్నారా? ధర తెలిస్తే కంగుతింటారు!
మనం చూసే సాధారణ తెల్లటి బియ్యం మాదిరిగానే ఉంటాయి జపాన్‌కి చెందిన కిన్మేమై బియ్యం. అయితే దీన్ని ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. జపాన్ వాళ్లు ఈ బియ్యాన్నితాము పేటెంట్ పొందిన ప్రత్యేక సాంకేతిక ప్రక్రియలోనే అభివృద్ది చేశారు. ముఖ్యంగా ఆహార ప్రియలుకు మంచి పోషాకాలను అందించే దృష్ట్యా ప్రత్యేకంగా రూపొందించిన బియ్యం. అయితే ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటంటే వండే ముందు కడగాల్సిన పని ఉండదు. అంటే వీటి వాడకం వల్ల నీటి వృధాను తగ్గించొచ్చు. ఇవి రుచికి కమ్మదనంతో కూడిన స్వీట్‌నెస్‌గా ఉంటాయి. చూసేందుకు కూడా చాలా వెన్న మాదిరి సున్నితంగా ఉంటుంది. పోషకాల పరంగా సంప్రదాయ తెల్ల బియ్యం కంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు బ్రౌన్ రైస్ మాదిరి ప్రయోజనాలకు కూడా అందిస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన చెస్ట్నట్ రంగు ఉన్నతమైన పోషకాహార ప్రొఫైల్‌ని కలిగి ఉంటుంది. అలాగే తొందరగా ఉడికిపోతుంది.ఆరోగ్య ప్రయోజనాలు..ఇవి తెలుపు, గోధుమ వంటి రెండు రకాల్లోనూ లభ్యమవుతాయి. ఇందులో ఊక ఉంటుంది.సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఫైబర్, ఏడు రెట్టు విటమిన్ బీ1 కలిగి ఉంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదర్కొనడంలో సహాయపడుతుంది. ఇందులో ఆరు రెట్లు లిపోపాలిసాకరైడ్లు(ఎల్పీఎస్)ను కలిగి ఉంది. ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, కేన్సర్, డిమెన్షియా(చిత్త వైకల్యం) వంటి వ్యాధులతో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థకు సహజమైన బూస్టర్.కడుపు ఉబ్బరం, అజీర్ణం తదితర సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే అన్నం అధిక నీటిని పీల్చుకోకుండా చేస్తుంది కాబట్టి ఇది బ్రౌన్ రైస్‌కి సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను అందింగలదని చెబతున్నారు నిపుణులు. ధర..మార్కెట్లో ఈ బియ్యం కిలో ధర రూ.15 వేలు పలుకుతోంది. ధరల పరంగా అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డు సాధించింది. అయితే జపాన్‌లో ఈ బియ్యాన్ని ఒక పెట్టేలో 140 గ్రాముల చొప్పున ఆరు ప్యాకెట్లుగా ప్యాక్ చేసి విక్రయిస్తుంటారు. దీని ధర రూ. 13000/-కిన్మెమై రైస్‌ని టోయో రైస్ కార్పొరేషన్ రూపొందించింది. ఈ రైస్ కార్పొరేషన్ వాకయామాలో 1961 స్థాపించబడింది. అక్కడే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్పొరేషన్ సాంకేతికలో మెరుగుదల ఈ కిన్మెమై రైస్ అభివృద్ధికి దారితీసిందని జపాన్ అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు.(చదవండి: టైటానిక్ మూవీ నటి 48 ఏళ్ల వయసులో టెస్టోస్టెరాన్ థెరపీ! మహిళలకు మంచిదేనా..?) -
పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్, పని ఒత్తిడి కారణంగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్త మైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరయిల్ కంపెనీలో పని ఒత్తిడిని తట్టుకోలేకే చనిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఫిర్యాదును స్వీకరించి, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది.కార్మిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిర్యాదును స్వీకరించిందని దర్యాప్తు జరుగుతోందని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్లోతెలిపారు. ఆ సందర్బంగా తల్లి అగస్టీన్‌కు జరిగిన నష్టంపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. రక్షణలేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుతో న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ట్వీట్ చేశారు. Deeply saddened by the tragic loss of Anna Sebastian Perayil. A thorough investigation into the allegations of an unsafe and exploitative work environment is underway. We are committed to ensuring justice & @LabourMinistry has officially taken up the complaint.@mansukhmandviya https://t.co/1apsOm594d— Shobha Karandlaje (@ShobhaBJP) September 19, 2024అన్నా మరణం చాలా బాధాకరమైందంటూ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్‌పై ఆమె స్పందించారు. (ఇదీ చదవండి: నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)కాగా ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తన కుమార్తె, కంపెనీలో పని భారాన్నిభరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మానసిక క్షోభంతో చనిపోయిందంటూ కంపెనీ ఛైర్మన్ రాజీవ్ మెమానికి బాధితురాలి తల్లి అన్నాఅగస్టీన్ ఈమెయిల్ సమాచారం అందించింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరూ రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పనిపరిస్థితులపై చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.