Women Power
-
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ట్రంప్‌కి తులసీ..కమలకు మాయ..!
పలుకు ఒక్కటి చాలు పది వేల సైన్యం’ అనుకుంటే తులసీ గబార్డ్ అక్షరాలా ఆ మాటకు సరిపోతుంది. చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘డిబేట్’ అనేది కీలక ఘట్టం. ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసే చర్చావేదిక. వచ్చే నెలలో జరగబోయే డోనాల్డ్ ట్రంప్–కమలా హారిస్ డిబేట్ కోసం ట్రంప్‌కు శిక్షణ ఇస్తున్న మహిళగా తులసి వార్తల్లోకి వచ్చింది. కమలా హారిస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న ట్రంప్‌కు తులసికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఆమె బృందంలోని ప్రతిభ విలువైన ఆస్తులుగా కనిపిస్తున్నాయి. ఇక కమలా హారిస్‌కు ఎన్నికల్లో బలమైన సలహదారుగా మాయ హారిస్ ఉంది. ఆమె ఎన్నికల ప్రసంగాలు ఫక్తు ఎన్నికల ప్రసంగాలలాగే ఉండనక్కర్లేదు అనేలా మాయా ప్రసంగాలు ఉంటాయి. కమలా హారిస్ చెల్లెలు మాయా హారిస్‌కు తన ప్రసంగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కుటుంబ బంధాల్లో నుంచి చెప్పొచ్చు. ఆమె ప్రసంగాలలో తన తల్లి ప్రస్తావన ఉంటుంది. ఆమె తన తల్లి గురించి చెప్పే భావోద్వేగపూరిత ప్రసంగాలు ట్రంప్‌పై చేసే రాజకీయ విమర్శల కంటే బలమైన ప్రభావం చూపుతాయి. ఆ అద్భుత నైపుణ్యమే మాయను అక్క కమలా హారిస్‌కు కీ అడ్వైజర్‌ని చేసింది. మరీ ఈ ఇద్దరి నేపథ్యం, వారి వాక్ శక్తి ఏంటో సవివరంగా చూద్దామా..ట్రంప్ సలహాదారుగా తులసీ‘హూ ఈజ్ షీ?’ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తులసి గబార్డ్ గురించి ఆరా తీస్తున్నారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సమోవా–అమెరికన్. రాజకీయ నాయకుడు. తల్లి కరోల్ పోర్టర్ ఇండియానా రాష్ట్రంలో పుట్టింది. టీనేజీలో హిందూమతాన్ని స్వీకరించింది. హిందూమతం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో కుమార్తెకు ‘తులసి’ అని పేరు పెట్టింది. సెప్టెంబర్ 10న ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి, పైచేయి సాధించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రిపరేషన్‌కు సంబంధించి తులసి, ఆమె బృందం సహాయం తీసుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. తులసి సహాయంతో కమలా హారిస్‌పై పై చేయి సాధించి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2020 అధ్యక్ష ఎన్నికల తరువాత డెమొక్రాటిక్ ΄ార్టీని వీడిన తులసి ట్రంప్ మద్దతుదారులలో బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆమె మాటను ట్రంప్ తు.చ. తప్పకుండా పాటిస్తాడు’ అని చెప్పుకుంటారు.‘రాజకీయ చరిత్రలో ఉత్తమ వక్తలలో ఒకరిగా ట్రంప్ గుర్తింపు పొందాడు. ట్రంప్‌కు సంప్రదాయ డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. అయితే గతంలో కమలా హారిస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న తులసి గబార్డ్లాంటి గౌరవ సలహాదారుల అవసరం ఎంతో ఉంది’ అంటుంది ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జాతీయ దృష్టిని ఆకర్షించింది తులసి. దీనికి కారణం ‘డెమోక్రటిక్ డిబేట్స్’లో కమలా హారిస్‌తో పోటీపడి తన సత్తా చాటింది. హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసినప్పటి నుంచి రాజకీయాల వరకు తులసి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ‘నేనే సర్వస్వం’ అనుకునే డోనాల్డ్ ట్రంప్‌ను గ్రేట్ డిబేట్ కోసం సన్నద్ధం చేయడం అతి పెద్ద సవాలు. చిన్నప్పటి నుంచి ‘భగవద్గీత’ శ్లోకాల్లో మునిగి తేలిన తులసికి సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ఉంది. మాటలతో సత్తా చాటే శక్తి ఉంది. కమలకు మాయమద్దతు..చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డిఎన్సీ)లో అక్క కమలా హారిస్‌కు మద్దతుగా మాట్లాడిన మాయా హారిస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన ప్రసంగంలో భారతీయురాలైన తన తల్లి డా. శ్యామల గోపాలన్‌ను స్మరించుకుంది. ‘అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి. మేము స్వతంత్రంగా ముందడుగు వేయడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ హాల్లో అమ్మ ఉండి ఉంటే అక్కను చూసి ఎంత సంతోషించేది. నాకు తెలుసు... ఆమె దివి నుంచి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.’ అంటుంది మాయ. ‘మీ జీవిత కథకు మీరే రచయిత్రులు’ అని తల్లి చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మాయాహారిస్. అక్క ΄ోరాట స్ఫూర్తి ఆమెకు ఎంతో ఇష్టం. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో చదువుకున్న మాయా హారిస్ ‘స్టాన్ఫార్డ్ లా రివ్యూ’ కు ఎడిటర్‌గా కూడా పనిచేసింది. విషయ విశ్లేషణ, ఒక అంశాన్ని అనేక కోణాల్లో చూడడం అనేది అక్కడి నుంచే అలవడింది. సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా ΄ాల్గొనేది మాయ. ‘డొమెస్టిక్ వయొలెన్స్ క్లినిక్’కు కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించింది. లా స్కూల్లో పట్టా పుచ్చుకున్న తరువాత లా క్లర్క్‌గా పనిచేసింది. ఆ తరువాత ‘జాక్సన్’ లా ఫర్మ్‌లో చేరి సివిల్, క్రిమినల్ కేసులపై పనిచేసింది.కేవలం కమలా సోదరిగానే కాదు..రాజకీయ విషయాలకు వస్తే... డెమొక్రటిక్ ΄పార్టీలో హిల్లరీ క్లింటన్ ప్రచార ప్రతినిధిగా, తన సోదరి కమలా హారిస్ కోసం 2020లో ‘క్యాంపెయిన్ ఫర్ ప్రెసిడెంట్’గా పనిచేసింది. ‘వ్యక్తులను తక్కువ అంచనా వేసే వారికి ఎలా జవాబు చెప్పాలో అక్కకు తెలుసు. అండర్‌డాగ్‌గా ఉండడం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలుసు. ఇప్పటికీ ఎన్నో అడ్డంకులను అధిగమించింది. ఆశావాదంతో ముందుకు వెళుతోంది. ఈ చారిత్రక సందర్భంలో ఆమె నాయకత్వం మనకు అవసరం’ అంటుంది మాయా హారిస్.అయితే అక్కలో ఉన్నాయని చెబుతున్న సుగుణాలన్నీ మాయలో కూడా ఉన్నాయి. ఆమె గుర్తింపు ‘కమలా హారిస్ సోదరి’కి మాత్రమే పరిమితమైనది కాదు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, ఉపన్యాసకురాలిగా యూఎస్‌లో తనకంటూ సొంత గుర్తింపు ఉంది. ఎన్నికల ప్రచారం, వ్యూహాల విషయంలో కమలా హారిస్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చెల్లి తనకు ఎంతో అండ. ఉత్తేజిత శక్తి. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?) -
డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?
అన్ని సక్రమంగా ఉన్నా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తిప్పలు పడుతుంటారు. అందుకు ఏవేవో సాకులు కూడా చెబుతుంటారు. కానొ కొందరూ భయానక సవాళ్లును దాటుకుంటూ అసాధ్యం అనే దాన్ని కూడా సాధించి చూపిస్తారు. అలాంటి కోవకు చెందిదే అనా విక్టోరియా. మెక్సికోలోని జకాటెకాస్‌కు చెందిన అనా విక్టోరియా ఎస్పినో డి శాంటియోగా డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ పట్టా పొందిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల అనా జూలై 2024లో యూనివర్సిడాడ్ అటోనోమా డి జకాటెకస్ నుంచి పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసంలో అనేక సవాళ్ల ఎదుర్కొన్నప్పటికీ..ఒక ప్రొఫెసర్ సాయంతో తన కలను సాకారం చేస్తుకుంది. ఆయన మార్గనిర్దేశంలో డౌన్ సిండ్రోమ్‌తో న్యాయ విద్యలో డిగ్రీని సాధించిన అరుదైన వ్యక్తిగా నిలిచింది. జనవరి 30, 1999న జన్మించిన అనా ఓచోవా, ఎస్పినో జపాటాల కుమార్తె. ఆమె తన విద్యను ఆన్లైన్లోనే పూర్తి చేసింది. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించేందుకు యూనివర్సిడాడ్ ఆటోనోమా డి జకాటెకాస్లో చేరింది. అయితే అక్కడ నిర్థిష్ట అవసరాలున్న తనలాంటి వ్యక్తులకు పాఠాలు భోధించే విధానం లేక చాలా ఇబ్బందులు పడింది. అయినప్పటికీ ఆమె దృఢ సంకల్పమే సాయం చేసే మంచి ప్రొఫెసర్ చెంతకు చేరేలా చేసింది. ఆయన అండదండలతో న్యాయపరమైన అధ్యయనంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని అధిగమించగలిగింది. అనా న్యాయవాదిగా అవ్వడానికి ముందు తనలాంటి వికలాంగుల హక్కుల కోసం వాదించే శాసనఫోరమ్లలో పనిచేసేది. ఇది తనకు న్యాయరంగ పట్ల అవగాహనను ఇవ్వడమే గాక భవిష్యత్తు అవకాశాలకు మార్గం సుగమం చేసింది. అలాగే అనా లాయర్‌గా వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని, సమానత్వం కోసం వాదించాలని చూస్తోంది. ఇంతటి స్థితిలో కూడా అంకితభావంతో అనితరసాధ్యమైన తన కలను సాకారం చేసుకుని అందిరిచేత ప్రశంసలందుకోవడమే గాక విదేశాల నుంచి ఉద్యోగా ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక అనాకి పెయింటింగ్ కళలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. 2014 నుంచి అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్లను నిర్వహించింది. తన పెయింటింగ్‌లను 'డెస్టే మి సీ'లో పేరుతో ప్రదర్శించింది.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్‌గా పనిచేసింది.స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!
హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..ఆమె పేరు పేటోంగ్టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్‌క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్‌గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు. ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!) -
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్‌లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్‌లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!
ఓ మహిళ ఇద్దరు పిల్లలు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ గొప్ప మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడం అంత ఈజీ కాదు. ఓపక్క అమ్మగా పిల్లలకు అన్ని ఇవ్వలేకపోతున్న ఆవేదనను తట్టుకుంటూ.. పురషాధిక్య పారిశ్రామిక ప్రపంచంలో నెగ్గుకొచ్చి.. తానెంటో చూపించింది. పైగా అందరిచేత ప్రశంసలందుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..భారతీయ కాస్మెటిక్ రూపరేఖలను మార్చిన వినీత సింగ్ ప్రస్థానం చాలా సవాళ్లుతో కూడుకున్నది. మగవాళ్లు ఆధిపత్యం ఉండే రంగంలో రాణించి అందరికీ స్ఫూర్తిగా నిచింది. అదికూడా ఇద్దరు పిల్లల తల్లిలా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ సౌందర్య సాధనాల సీఈవో స్థాయికి చేరుకుంది. 2021వ సంవత్సంరో బ్యూటీ మార్కెట్లో తన షుగర్ కాస్మోటిక్స్ కంపెనీతో సంచలనం సృష్టించింది. 2015లో వినీత తన భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి ఈ షుగర్ కాస్మటిక్స్‌ని ప్రారంభించిది. అప్పుడే మహిళపట్ల ప్రజల్లో వేనూళ్లుపోయిన భావాలను ఎదుర్కొంది. ఆమె తన షుగర్ బ్రాండ్స్‌తో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా దూసుకుపోవడమే గాక డిజిటల్ యుగం ఫ్లాట్‌ఫాంని క్యాష్ చేసుకుంది. భారతీయ యువుతులు తమ బ్రాండ్‌కి మారేలా చేయడంలో విజయం సాధించింది వినీత. అయితే వినిత గొప్ప మహిళా పారింశ్రామిక వేత్తగా మారడం అంత జీగా జరగలేదు. తన కంపెనీ ప్రారంభదశలో వెంచర్‌ని కాపాడుకునేలా ఇన్వెస్టర్లని తీసుకోవడం అత్యంత సవాలుగా మారింది. ఎందుకంటే వారందరీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట..కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకెందుకు ఇంత పెద్ద పనులు అనే విమర్శలు, ఉచిత సలహాలకు కొదువలేదు అన్నట్లుగా వచ్చాయి. అయినా సరే ఆమె వెనక్కి తగ్గకుండా తన వ్యాపారాన్ని మంచిగా నిర్మించడంపైన దృష్టి పెట్టింది. 17 ఏళ్ల వయసులో తన ప్రొఫెసర్ వ్యవస్థాపకత కోసం నాటిన బీజాలు ఆమె నరనరాల్లో నిక్షిప్తమయ్యాయి. అదే ఆమెను వెనడుగు వేయనివ్వలేదు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించడంపై ఫోకస్ అయ్యేలా చేసింది. లక్షల వేతనం లభించే బ్యాంక్ జాబ్‌ని వదిలి మరీ..స్వంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్సాటు చేయాలని ప్రగాఢంగా నిశ్చయించుకుంది వినీత. ఆ దృఢ నిశ్చరయం ఆమెను షుగర్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు సంబంధించిన సీవోవో స్థాయికి చేరుకునేలా చేసింది. అయితే తనని ఎప్పుడూ అమ్మ అపరాధం వెంటాడుతూ ఉండేదని అన్నారు. అలాగే ఈ కంపెనీ ప్రారంభ రోజుల్లో తన పెద్ద కొడుకు పుట్టడంతో పెద్ద కొడుకు పాలు ఇవ్వడం, పని చేయడం, ఆఫీసు కాల్‌లను నిర్వహించడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో 'అమ్మ అపరాధాన్ని' ఎదుర్కొన్నానని వివరించారు వినిత. అలాగే తన చిన్న కొడుకు ఆరవనెల కడుపున ఉన్నప్పుడూ మారథాన్‌లో పరిగెత్తానని అన్నారు. అంతేగాదు ఆమె తరుచుగా ఆఫీస్ ఫైల్స్, మరో చేత్తో తన బిడ్డను లాలించేది. చెప్పాలంటే ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించేదాన్ననని, అందువల్లో అమ్మగా వాళ్లకు అన్ని సమకూరుస్తున్నానా లేదా అనే భావం కలుగుతుండేదని అన్నారు వినీత. చివరిగా వినీత 'అమ్మ అపరాధం' చాలా విలువైనదని, దాన్ని నిర్వర్తించడం అంత ఈజీ కాదని చెప్పారు. ఏదీఏమైన ఓ తల్లిగా ఇద్దరూ పిలల్లను సాకుతూ..విజయవంతమైన పారిశ్రామికవేత్త ఎదగడం అనేది మాములు విషయం కాదు..!(చదవండి: కన్నూర్ జైలు బిర్యానీ: ఖైదీలే స్వయంగా వండుతారట..!) -
ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..
ప్రధాని నరేంద్ర మోదీ చేతికి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి మరీ భారత్ పయనమవుతున్నారు పాకిస్తాన్ సోదరి ఖమర్ షేక్. రక్షాబంధన్ సందర్భంగా కమర్ షేక్ సరిహద్దునే దాటి వస్తున్నారు. తన సోదరుడు ప్రధాని మోదీతో కలిసి ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలని వస్తున్నట్లు సమాచారం. ఆమె ఇలా వరుసగుగా 30 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ మణికట్టుకు రాఖీ కడుతున్నారట. ఇది వరుసగా ముప్పైవ ఏడాదని ఖమర్ షేక్ చెబుతున్నారు. తన సోదరుడుతో కలిసి ఈ పండుగను జరుపుకోవడాన్ని ఎన్నటికీ మిస్ చేసుకోనని అన్నారు. ప్రతి ఏడాది తానే స్వయంగా రాఖీ కట్టేలా ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. ఎవరీ ఖమర్ షేక్..?కరాచీలో జన్మించింది ఖమర్ షేక్. ఆమెకు 1981లో మొహ్సిన్ షేక్‌తో వివాహం జరిగింది. కమర్ భారతదేశానికి వచ్చినప్పుడు 1990లో అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింగ్ ద్వారా మోదీని కలిసినట్లు చెప్పారు. అప్పటి నుంచే మా మధ్య అన్నా చెల్లెళ్ల సాన్నిహిత్యం ఏర్పడిందని వివరించారు. అంతేగాదు ప్రతి ఏడాది రక్షాబంధన్‌కు తానే స్వయంగా చేతులతో చేసిన రాఖీని మోదీకి కడతానని చెప్పారు. ఈ ఏడాది తాను రాఖీని వెల్వెట్‌పై తయారు చేసినట్లు తెలిపారు. అందులో ముత్యాలు, మెటల్ ఎంబ్రాయిడరీలు, టిక్కీలు ఉపయోగించినట్లు పేర్కొంది. రక్షాబంధన్‌కు ఒక రోజు ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మోదీ 1990లో ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నప్పుడు తొలిసారిగా కలిశానని, అప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతావని మోదీకి చెప్పానని నాటి సంభాషణను గుర్తు చేసుకున్నారు ఖమర్ షేక్. అలాగే ఆమె రాఖీని ఎలా తయారు చేశానో వివరిస్తున్న వీడియోని కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Ahmedabad, Gujarat: Qamar Mohsin Shaikh, PM Narendra Modi's rakhi sister says, "This time I have made the 'Rakhi' myself. I will also gift him (PM Modi) a book on agriculture as he is fond of reading. For the last 2-3 years I was unable to go due to Covid but this time I… pic.twitter.com/BMbbNrRyOP— ANI (@ANI) August 22, 2023 (చదవండి: 'ఖుష్బు ఇడ్లీ' గురించి విన్నారా..? ఆ పేరు వెనకున్న స్టోరీ ఇదే..!) -
90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ
పత్రికలకు, రేడియోకు దూరంగా ఉండే ఆ బామ్మ ఆగ్రహంతో రగిలిపోయింది. కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సాగిన హత్యాచారకాండను మనవరాళ్ల ద్వారా వినగానే ‘సమాజం ఇలాంటి వాటిని ఎలా అంగీకరిస్తుంది? పదండి అందరం నిరసన తెలుపుదాం’ అని 90 ఏళ్ల మాయా రాణి అర్ధరాత్రి కేండిల్ పట్టి రెండు మైళ్లు నడిచింది. ప్రతి అడుగు మనలో కదలిక ఆశిస్తోంది.ఆమెను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. నడుము ఒంగిపోయినా అడుగులు తొణకడం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా మాట తీవ్రతలో వెనుకంజ లేదు. మొన్నటి బుధవారం (ఆగస్టు 14) కోల్‌కతాలో అర్ధరాత్రి సాగిన నిరసనలో 90 ఏళ్ల ఆ బామ్మ చేతిలో క్యాండిల్ పట్టుకుని జనంతోపాటు నడుస్తూంటే అందరూ ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. ఆమెతోపాటు మరింత ఉద్వేగంగా నడిచారు.ఇంత దారుణమా...కోల్‌కతాలోని జోకా ప్రాంతంలో నివాసం ఉండే 90 ఏళ్ల మాయారాణి చక్రవర్తికి ఆగస్టు 9న జరిగిన హత్యాచారం గురించి మనవరాళ్ల ద్వారా తెలిసింది. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిపి హత్య చేశారన్న వార్త తెలియగానే ఆమె కదిలిపోయింది. తన కోల్‌కతా నగరంలో ఇంత దారుణమా అనుకుందామె. ‘ఇంతటి ఘోరాన్ని నా జీవితంలో వినలేదు’ అందామె వాళ్లతో. ‘దీనిని సమాజం ఎలా అంగీకరిస్తుంది? మీరంతా ఏం చేస్తున్నారు?’ అని మనవరాళ్లను ప్రశ్నించింది. ‘మేము అర్ధరాత్రి నిరసన చేయబోతున్నాం. రాత్రిళ్లు సురక్షితంగా తిరగ్గలిగే మా హక్కు కోసం నినదించబోతున్నాం’ అని వాళ్లు చెప్పారు. ‘అయితే నేనూ వస్తాను’ అందామె. ‘రెండు మైళ్లు నడవాలి’ అన్నారు వాళ్లు. ‘నేను నడుస్తాను’ అందామె ఖండితంగా.క్యాండిల్ పట్టుకుని...మోకా అనే ఏరియాలోని తన అపార్ట్మెంట్ నుంచి ఆ ఏరియా ఇ.ఎస్.ఐ ఆస్పత్రి వరకు మూడు కిలోమీటర్లు నడిచింది మాయారాణి చక్రవర్తి. ‘బయట క్షేమంగా లేకపోతే ఇంట్లో మాత్రం క్షేమంగా ఎలా ఉండగలరు ఆడవాళ్లు. నా మనవరాళ్లు పని మీద, చదువు కోసం బయటకు వెళితే వాళ్లు వచ్చేంత వరకూ బితుకుబితుకుమంటూ ఉండాలా నేను. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని అందరం మార్చాలి. అంతేకాదు ఇంత దారుణ నేరం చేసినవారికి శిక్ష పడాలి’ అందామె. సమాజంలో ఎన్ని ఘోరాలు జరిగినా జడత్వంతో మనకెందుకులే అనుకునేవారికి ఆ బామ్మ కదలిక ఒక దివిటీ కావాలని ఆశిద్దాం. -
చీకట్లో ఉరిమిన చిరు స్వరం
ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాదిమంది మహిళలు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె ప్రఖ్యాత ఉద్యమ నాయకురాలు, రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ మహిళ. కోల్‌కత్తాలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 29 ఏళ్ల రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్ పోస్ట్ వైరల్ కావడమే కాదు అర్ధరాత్రి వేళలో ఉద్యమ స్వరమై ప్రతిధ్వనించింది...కోల్కత్తా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌తో పాటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది మహిళలు ఆగస్ట్ 14 అర్ధరాత్రి వీధుల్లోకి వచ్చారు. ‘రీక్లెయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్’ కాప్షన్‌తో రిమ్జిమ్ సిన్హా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన గళం వినిపించేలా చేసింది.‘మహిళల కొత్త స్వాతంత్య్ర పోరాటం’గా ‘రీక్లెయిమ్ ది నైట్’ క్యాంపెయిన్‌ను అభివర్ణించింది రిమ్జిమ్ సిన్హా. రీక్లెయిమ్ ది నైట్’ చిహ్నమైన నెలవంక పట్టుకున్న ఎర్ర చేతి పోస్టర్ వైరల్ అయింది.రిమ్జిమ్ సిన్హా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోషల్‌సైన్స్ రిసెర్చర్. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నన్ను బాధ పెట్టడమే కాదు అభధ్రతాభావానికి గురి చేసింది. నగరాల్లో మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కోరుతూ ఆగస్ట్ 14 అర్ధరాత్రి నిరసన ప్రదర్శన చేయాలనుకున్నాను. రాత్రిపూట బయటకు వెళ్లే హక్కు మహిళలకు ఎందుకులేదు?’ అంటున్న రిమిజిమ్ సిన్హా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది మహిళలను ఐక్యం చేసింది.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై రిమ్జిమ్ సిన్హా మండిపడింది. ‘జూనియర్ డాక్టర్ ఒంటరిగా సెమినార్ హాల్‌కు ఎందుకు వెళ్లింది?’ అని ఆయన ప్రశ్నించాడు.‘బాధితురాలిపై నిందలు మోపే కుసంస్కారాన్ని అంగీకరించబోము. రాత్రివేళ బయట ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు’ అంటుంది సిన్హా. తన పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దేశవ్యాప్తంగా వేలాది మంది అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వస్తారని ఆమె ఊహించలేదు.‘వందమంది వరకు వస్తారనుకున్నాను. ఒకవేళ ఎవరూ రాకుంటే నేను ఒక్కదానినే బయటికి రావాలనుకున్నాను. ఇంతమంది మహిళలు అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి వస్తారని నేను ఊహించలేదు. వారి స్పందన నాకు సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది సిన్హా. రిమ్జిమ్ సిన్హా పేరు సంచలనం కావడం మాట ఎలా ఉన్నా ఎంతోమంది రాజకీయ నాయకులకు టార్గెట్‌గా మారింది. ‘రీక్లయిమ్ ది నైట్’ ఉద్యమ చిహ్నానికి రకరకాలుగా భాష్యం చెబుతూ విమర్శిస్తున్నవారు కూడా ఉన్నారు.‘అర్ధరాత్రిపూట బయటకు వస్తున్నారు. మీకేమైనా అయితే పూచీ మాది కాదు’ అంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. జాదవ్పూర్లోని 8బీ బస్‌స్టాండ్‌కు దగ్గర జరిగిన సభకు హాజరమైన రిమ్జిమ్ సిన్హా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన గురించి మాత్రమే కాదు రాత్రివేళలో మహిళలకు ఎదురయ్యే ట్సాన్స్పోర్ట్ సమస్యలు, పని ప్రదేశంలో మహిళలకు సెపరేట్ టాయిలెట్లు, బడులలో లింగ సమానత్వంపై ΄ాఠ్యాంశాలు, రాత్రి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులకు సురక్షితమై విశ్రాంతి గదులు... మొదలైన వాటి గురించి మాట్లాడింది. ‘రీక్లయిమ్ ది నైట్: ది నైట్ ఈజ్ అవర్స్’ను దృష్టిలో పెట్టుకొని ‘ఇది మహిళల కొత్త స్వాతంత్య్ర ΄ోరాటం’ అంటున్న రిమ్జిమ్ సిన్హా ఆ ΄ోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్‌లోని స్పీజ్‌లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
పోస్టల్ స్టాంపులు.. యుద్ధం ముద్రలు!
మహిళలు ఇల్లు విడిచి బయట అడుగు పెడితే వింతగా చూసే కాలంలో సాహసమే వెన్నెముకగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది మహిళలు. వారి త్యాగాల వెలుగు చరిత్రకే పరిమితమైనది కాదు, వర్తమానంలోనూ స్ఫూర్తిని ఇస్తుంటుంది. ఎంతోమంది మహిళా స్వాతంత్య్ర సమరయో«ధుల పోస్టల్ స్టాంప్స్ విడుదల అయ్యాయి. ఈ చిన్న స్టాంప్‌లు వారి త్యాగాలు, పోరాట పటిమను ప్రతిఫలిస్తాయి. పోస్టల్ స్టాంప్స్‌పై మెరిసిన కొందరు మహిళా స్వాతంత్య్ర సమరయోధుల గురించి...రుక్మిణీ లక్ష్మీపతిఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో పుట్టింది రుక్మిణీ. గాంధీజీ ‘హరిజన సంక్షేమ ని«ధి’ కోసం తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేసింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచింది.సుభద్రా జోషిగాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితం అయిన సుభద్రా జోషి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ‘హమారా సంగ్రామ్’ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసింది. సుభత్రను అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్‌కు తరలించారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో భాగం అయింది. సుభద్ర అంకితభావాన్ని నె్రçహూ ప్రశంసించారు.రాణి మా గైడిన్లియుబ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ‘హెరాక’ ఉద్యమంలో పదమూడు సంవత్సరాల వయసులోనే పాల్గొంది రాణి మా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి మహిళగా చరిత్రకెక్కింది. ‘హెరాక’ ఉద్యమంతో పాటు ఎదుగుతూ వచ్చిన రాణి మా ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, ఆధ్యాత్మిక గురువుగా ప్రఖ్యాతి పొందింది.బేగం హజ్రత్ మహల్తొలి తరం మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్. బేగం హజ్రత్ ఇతర సంస్థానాధీశులతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించింది. ఆ తరువాత కాలంలో మాత్రం ఓటమికి గురైంది. బ్రిటిష్ వారికి చిక్కకుండా అడవుల్లో తలదాచుకొని పోరాడేది.కమలానెహ్రూజవహర్లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రూ మహిళా సాధికారత కోసం గళం విప్పిన యోధురాలు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అరెస్టై జైలుకు వెళ్లింది. ‘దేశ సేవిక’ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది.సుభద్రాకుమారి చౌహాన్సుభద్రాకుమారి చౌహాన్ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన తరువాత నాగపూర్ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహిగా చరిత్రలో నిలిచింది. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతత్య్ర పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింది.అరుణా అసఫ్ అలిభర్త అసఫ్ అలీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది అరుణ. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. కాంగ్రెస్‌పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత బ్రిటిష్ వారు విరుచుకుపడ్డారు. ప్రముఖ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో అరుణా అసఫ్ అలి కార్యకర్తలకు అండగా ఉంది. బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకునేలా చేసింది.దుర్గాబాయి దేశ్ముఖ్దుర్గాబాయి దేశ్‌ముఖ్ సాహసవంతురాలైన సామాజిక కార్యకర్త, చిన్నతనం నుంచే మహిళల హక్కుల కోసం పోరాడింది. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది. గాంధీజీ ప్రభావంతో దుర్గాబాయి మాత్రమే కాదు ఆమె కుటుంబం మొత్తం అన్ని రకాల పాశ్చాత్య దుస్తులను విడిచిపెట్టి, ఖాదీని మాత్రమే ధరించేవారు. మద్రాస్‌లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించింది.రాజ్‌కుమారీ అమృత్ కౌర్రాజ్కుమారీ అమృత్ కౌర్ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. గాంధీజీ కార్యదర్శిగా పని చేసిన ఆమె దండి మార్చ్‌లాంటి ఎన్నో జాతీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమారి ఇరవై నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. రాచరిక కుటుంబంలో పుట్టినప్పటికీ మహాత్ముడి ఆశ్రమంలో సాధారణ జీవితాన్ని గడిపింది. -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిలదొక్కుకోనివ్వని సమస్యను నిలువరించి..స్ఫూర్తిగా నిలిచింది దీపా..!
కొన్ని సమస్యలు మనిషిని మాములుగా కుంగదీయవు. ఒక పట్టాన నిలువనివ్వవు. ఏం చేయాలో ఎలా పరిష్కరించాలో అర్థకానీ విధంగా ఉంటాయి. కానీ ఇక్కడే అసలు పరిష్కారం దాగుంటుంది. మనకు ఎదురై పది శాతం సమస్యకు తొంభై శాతం నీవెలా స్పందిస్తావు అనే దానిపైనే పరిష్కారం దొరకడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతోంది పారా ఒలింపియన్ దీపా. నిలదొక్కుకోనివ్వకుండా పగబట్టి వెంటాడిని సమస్యను తనదైన శైలిలో నిలువరించి తానేంటన్నది ప్రపంచానికి చాటి చెప్పి స్ఫూర్తిగా నిలించింది. ఎవరీ దీపా..? అంటే..ఉక్కులాంటి ధృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం పారాలింపియన్ దీపా మాలిక్. ఆమె తండ్రి ఆర్మీ, తల్లి ఎన్సీపీ క్యాడెట్లో షూటర్. ఆమెకు మూడేళ్ల ప్రాయంలోనే వెనుముక కణితి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీని కారణంగా కోలుకోవడానికి మూడేళ్లు పట్టేంది. అంటే ఆమె ఐదు నుంచి ఎనిమిదేళ్ల ప్రాయం వరకు ఆస్పత్రల్లోనే గడిపింది. అంత పెద్ద భయానక పరిస్థిని నుంచి బయటపడిందని జాలి, సానుభూతులతో పెంచలేదు దీపను ఆమె తల్లిదండ్రులు. మన వద్ద ఉన్న వనరులతో సంబంధం లేకుండా సామార్థ్యం మెరుగుపరుచుకోవడం పైనే దృష్టి సారిస్తే విజయం తధ్యం అనే రీతిగా పెంచారు దీపాని. అంతేగాదు తనకెదురైన సమస్యను పక్కన పెట్టి ఇంకా నువ్వు ఏం చేయగలవు, నీలో ఉన్న శక్తి ఏంటి అన్నదానిపై దృష్టి పెట్టాలని పదే పదే చెప్పేవారు. అదే నినాదంతో పెరిగిన దీపాలో సంకల్పం మెండుగా ఉండేది. అలానే పెరిగింది. సరిగ్గా 19 ఏళ్ల వచ్చేటప్పటికీ తనలానే బైకింగ్ సాహసాల పట్ల ఇష్టం ఉన్న ఆర్మీ అధికారిని వివాహం చేసుకుంది. ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. సరిగ్గా 29 ఏళ్ల వయసులో మళ్లి కణితి వచ్చి ప్రతికారం తీర్చుకుంది. ఈసారి పరిస్థితి సివియర్ అయ్యి తనంతట తాను నడవడానికి ఏడు రోజుల మాత్రమే సమయం ఉందని వైద్యులు తేల్చి చెప్పేశారు వైద్యులు. దీపా ఇక వీల్‌చైర్‌కి పరిమితం అయిపోతుందని, తనకి సేవ చూస్తున్న వాళ్లను చూసి విసుగుపుట్టి చనిపోతుందని అంతా అనుకునేవారు. తన వైకల్యం భర్తతో మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిస్థితి ఆమె మల మూత్రాదులపై నియంత్రణ లేకుండా చేసి ఇబ్బందుకులకు గురి చేసింది. ఇలా వీల్‌చైర్‌తో గదికే పరిమితం కావడాన్ని ఇష్టపడక అహ్మద్‌నగర్‌లో రెస్టారెంట్ ప్రారంభించింది. అక్కడకు వచ్చే లాయర్లు, ఆఫీసర్లు, ఇంజీనర్లును కారణంగా తనలాంటి వారు ఎలా పైకి ఎదగొచ్చు అనే విషయాలు తెలుసుకుంది. అలా ఆమెకు ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం వచ్చే మోడిఫైడ్ బైక్‌ల గురించి తెలుసుకుని నడపడం నేర్చుకుంది. అలా బైక్‌పై తనకున్న ఇష్టం క్రీడాకారిణిగా ఎదిగేలా చేసింది. అంతేగాదు బైక్ నడిపేలా ఎగువ శరీరాన్ని బలోపేతం చేసేందుకు హైడ్రోథెరపీ తీసుకుంది. అంటే ఇక్కడ దీపా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేయాలి. అలా ఆమె వివిద క్రీడల కోసం శిక్షణ పొందింది. చెప్పాలంటే ఇక్కడ దీపా 30 ఏళ్ల వయసులో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చి జేఎల్ఎన్ స్టేడియం సమీపంలో చిన్నఅపార్టెమెంట్లో నివశించడం ప్రారంభించింది. అక్కడ అయితే ఆటలకు సంబంధించిన ప్రాక్టీస్ చేసేది. చాలామంది ఈ వయసులో ఆడుకుంటుందేంటీ?..టైం వేస్ట్ అనేవారు. అయితే అవేమి ఆమె పట్టించుకోలేదు దీపా. ఏదో ఒకరోజు నేనెంటీ అనేది తెలుసుకుంటారనే కసి దీపాలో అంతకంతకు పెరిగిపోయింది. చివరికీ తాను అనుకున్నట్లే పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళగా నిలిచింది. అంతేగాదు 42 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును గెలుచుకుంది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. అంతేగాదు షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి అనేక విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. నాడు ఎవరైతే ఆమెకు చికిత్స ఇవ్వడం వ్యర్థం అంటూ తన కుటుంబానికి సలహాలు ఇచ్చారు వాళ్లే..మా పిల్లలకు నువ్వే స్ఫూర్తి అంటూ ప్రశంసించారని గర్వంగా చెబుతోంది. చివరగా దీపా దయచేసి ఆగస్టు 28, 2024లో జరిగే పారా ఒలింపిక్స్ వీక్షించండి అని ప్రజలను కోరింది. (చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
13 ఏళ్లకే అరంగేట్రం... చైనా బాలిక రికార్డు!
మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయలకు ఎంతో గౌరవం ఉంది. మన ఆచార వ్యవహారాలను ఎంతగానో ఇష్టపడతారని ఎన్నోసార్లు తేటతెల్లమయ్యింది. అది తాజాగా బీజింగ్‌లో 13 ఏళ్ల చైనా బాలిక భరత నాట్య ప్రదర్శనతో నిజమని తేలింది. చైనాలో మన సంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడి చిన్నారులు భరత నాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజింగ్‌లో చైనా బాలిక లీ ముజి (13) అరంగేట్రం (Arangetram) ప్రదర్శన సంచనలనం సృష్టించింది. మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం. ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి లీలా శాంసన్, భారతీయ దౌత్యవేత్తలు, చైనీస్ అభిమానుల సమక్షంలో లీ ముజీ సోలోగా 'అరంగేట్రం' ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్చార్జ్ టీఎస్ వివేకానంద్ మాట్లాడుతూ..చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో సరిగ్గా ప్రదర్శన ఇచ్చిన 'అరంగేట్రం' ఇది అన్నారు. ఇక్కడ లీ చైనీస్ ఉపాధ్యాయులచే చైనాలోనే ఈ భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం ప్రదర్శించడం విశేషం. ఇది భరతనాట్య వారసత్వ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని లీకి శిక్షణ ఇచ్చిన చైనా భరతనాట్య నర్తకి జిన్ షాన్ షాన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాయబారి ప్రదీప్ రావత్ సతీమణి శ్రుతి రావత్ కూడా హాజరయ్యారు. అంతేగాదు లీ ప్రదర్శనం కోసం చెన్నై నుంచి విమానంలో సంగీత విద్వాంసుల బృందం తరలి వచ్చింది. కాగా, లీ ఈ నెలాఖారున ఆమె చెన్నైలో కూడా ప్రదర్శన ఇవ్వనుంది. అరంగేట్రం అంటే?భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు.(చదవండి: తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!) -
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
Mia Le Roux: ఈ అందం వినిపిస్తోందా?
‘సమాజం ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఇదెంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసు. అనూహ్యమైన కలలు కని వాటిని సాధించవచ్చని ఇవాళ నేను నిరూపించాను. దివ్యాంగుల పట్ల ఈ భూగ్రహంలో ఉన్న ఆంక్షల సరిహద్దులను నేను బద్దలు కొట్టాను’ అని హర్షధ్వానాల మధ్య అంది మియా లే రూ. 28 ఏళ్ల బధిర వనిత మియా లే 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాఫ్రికా అందాల పోటీలో కిరీటం ధరించిన తొలి బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఈ పోటీలో గెలిచినందుకుగాను సంవత్సరం పాటు నివసించడానికి ఒక ఖరీదైన ఫ్లాటు, లగ్జరీ బెంజి కారు, సుమారు 50 లక్షల రూపాయల నగదు, ఇంకా అనేక బహుమతులు దక్కాయి. శనివారం (ఆగస్టు 10) రాత్రి దక్షిణాఫ్రికాలోని పాలనా రాజధాని ప్రిటోరియాలో జరిగిన ఫైనల్స్‌లో ఈ ఘనత సాధించింది.పుట్టుకతో చెవుడుఫ్రెంచ్ మూలాలున్న మియా లే కుటుంబం తరాల ముందు వచ్చి సౌత్ ఆఫ్రికాలో స్థిరపడింది. మియా పుట్టాక సంవత్సరం తర్వాత ఆమెకు పూర్తిచెవుడు ఉన్నట్టు గ్రహించారు తల్లిదండ్రులు. కొన్నేళ్ల తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి రెండు సంవత్సరాల పాటు స్పీచ్‌థెరపీ ఇస్తే తప్ప ఆమె మొదటి మాట మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా ఆమె మాట స్పష్టం కాలేదు. ఆమెకు ఇప్పటికీ వినపడదు. ‘నా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానం చేసుకున్నాను. అందువల్ల పెదవుల కదలికను బట్టి కొద్దిగా వినపడే ధ్వనిని బట్టి ఎదుటివారి మాటలు అర్థం చేసుకుంటాను. గుంపులో ఉండి నాతో మాట్లాడితే నాకు ఏమీ అర్థం కాదు. అందరి శబ్దాలు కలిసి నాకు స్పష్టత ఉండదు’ అంటుంది మియా లే. మోడల్‌గా, మార్కెటింగ్ రంగ నిపుణురాలిగా పని చేస్తున్న ఈమె అందాలపోటీలో విజేతగా నిలవాలని కలగని, సాధించింది.నల్లరంగు–తెల్లరంగుసౌత్ ఆఫ్రికా అందాల కిరీటం కోసం నల్ల అందగత్తె చిడిమ్మ అడెస్ట్షినా పోటీ పడింది. ఆమెకు సౌత్ ఆఫ్రికాలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె పౌరసత్వం మీద వివాదం నెలకొంది. ఆమె నైజీరియా తండ్రికీ, మొజాంబిక్ తల్లికీ జన్మించిందని ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతో విజయం అంచు వరకూ చేరిన చిడిమ్మ పోటీ నుంచి తప్పుకుంది. దాంతో మియా గెలుపు సులవు అయ్యింది. రంగును బట్టి మియా గురించి ఒకటి రెండు విమర్శలు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్న చిడిమ్మ మనస్ఫూర్తిగా ఆమెను అభినందించింది. ‘నువ్వు మా అందరి కలలకు ప్రతినిధిగా నిలిచావు’ అని పోటీలో గెలిచిన మియాను చిడిమ్మ కొనియాడింది.నేనొక వారధిని‘దివ్యాంగులు సమాజంలో భాగం కావాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. నాకొచ్చిన ఈ అందాల కిరీటంతో నేను దివ్యాంగులకు ప్రభుత్వానికి ఒక వారధి కాదలిచాను. చిన్నవయసు నుంచి దివ్యాంగులు అసాధ్యమైన కలలు గనే స్థయిర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను’ అంది మియా లే రూ. -
Tanisha Bajia: జేబులో దాగిన స్థైర్యం.. చెయ్యెత్తి జై కొట్టింది
ఆ అమ్మాయి స్కూల్‌కు వచ్చినన్ని రోజులు ఎడమ చేతిని ఎవరూ చూళ్లేదు. దానిని స్కర్ట్ జేబులో పెట్టుకుని ఉంటే అదామె అలవాటనుకున్నారు. కాని అసలు రహస్యం ఏమిటంటే ఎడమ అర చెయ్యి లేకుండా పుట్టింది తనీషా. స్కూల్లో ఎగతాళి చేయకుండా ఉండడానికి మణికట్టుకు దుపట్టా చుట్టి జేబులో దాచేది. కాని ఇప్పుడు దాచడం లేదు. గత నెల బెంగళూరులో జరిగిన 13వ జాతీయ సబ్ జూనియర్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన రజత పతకం ఆమె చేతికి గౌరవాన్ని ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది.ఆరావళి పర్వతాలు చుట్టుముట్టిన రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్లోయి తనీషా సొంత గ్రామం. తన వైకల్యాన్ని చూసి ఇతర పిల్లలు ఆట పట్టించడంతో స్కూల్‌కు వెళ్లకుండా తనీషా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేది. దీంతో ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న వేరే పాఠశాలలో చేర్పించారు. అక్కడ కూడా వెక్కిరింపులు ఎదురు కాకుండా ఉండడానికి ఉపాధ్యాయులకు, తోటిపిల్లలకు తెలియకుండా తన అంగవైకల్యాన్ని జేబులో దాచిపెట్టింది. అంగవైకల్యాన్ని దాచి పెట్టడం అంటే... ఒంటరితననానికి దగ్గర కావడమే.గెలుపుతో విముక్తి‘ఇప్పుడు నా ఎడమ చెయ్యిని దాచాల్సిన అవసరం లేదు’ అంటోంది తనీషా. అద్భుతమైన బెంగళూరు విజయంతో ఆమె ఎడమ చేయి జేబు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అది అంగవైకల్యంలా అనిపించడం లేదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. ఒకప్పుడు తనీషాకు నలుగురితో కలవడం తెలియదు. నలుగురితో కలిసి నవ్వడం తెలియదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛా జీవితపు మాధుర్యాన్ని రుచి చూస్తోంది. ‘ఇప్పుడు నన్ను ఎవరూ ఎగతాళిగా కామెంట్ చేయడం లేదు’ చిరునవ్వుతో అంది తనీషా. గత ఏడాదిలో రాష్ట్ర, జాతీయ చాంపియన్‌షిప్‌లలో మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో సహా అయిదు పతకాలు సాధించింది. ‘ఈ పతకాలు నా జీవితాన్ని మార్చేసాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది’ అంటుంది తనీషా.తొలిసారి పట్టుదల‘నాకు 1,500 మీటర్ల తొలి పరుగు పందెం గుర్తుంది. పోటీలో నన్ను చూసి ఇతర పోటీదారులు నవ్వుతున్నారు. దాంతో పోటీలో పాల్గొనడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. మా నాన్నమాత్రం ఎలాగైనా సరే, పాల్గొనాల్సిందే అన్నాడు. దాంతో సర్వశక్తులు ఒడ్డి పరుగెత్తాను.నాలుగోస్థానంలో నిలిచినప్పుడు అందరూ వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకం కలిగింది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంది తనీషా.జూలైలో పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియానికి వెళ్లిన తనీషా వందలాది మంది ప్రేక్షకులను చూసి కంగారు పడింది. ‘ఇప్పుడు సాధించకపోతే సంవత్సరం శ్రమ వృథా అయిపోతుంది’ అనుకుంది మనసులో. అనుకోవడమే కాదు 400 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేసి రజత పతకం గెలుచుకుంది. ‘ఇప్పుడు ఉన్నంత సంతోషంగా నా కూతురు ఎప్పుడూ లేదు. ఆటలు ఆమెను పూర్తిగా మార్చివేసాయి’ అంటోంది తల్లి భన్వారీదేవి. నాన్న నిలబడ్డాడుపుట్టినప్పుడు ఎడమ అర చెయ్యి లేకపోవడంతో తనీషాను తండ్రి ఇంద్రజ్ బాజియా ఓ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఈ అమ్మాయి మీకు దేవుడు ఇచ్చిన వరం. ప్రేమగా చూసుకోండి... అన్నాడు ఆ డాక్టర్. ఆయన మాటలు తండ్రిలోని దిగులును మాయం చేశాయి. ఇక అప్పటి నుంచి ఎలాంటి వివక్షత చూపకుండా ఆమెను ఆటల్లో ప్రోత్సహించాడు తండ్రి. ‘తనీషా బాగా పరుగెడుతుంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించే సామర్థ్యం ఆమెలో ఉంది. తనీషాకు శిక్షణ ఇవ్వడానికి ప్రతివారం ఆమె గ్రామానికి వెళుతుంటాను’ అంటుంది తనీషా కోచ్ సరితా బవేరియా. నేషనల్ లెవల్ ప్లేయర్ అయిన సరిత బవేరియా దివ్యాంగులైన పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇస్తుంటుంది.