Hanamkonda
-
గూడ్స్ ఘటనతో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
కాజీపేట రూరల్ : పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ –రామగుండం మధ్య మంగళవారం పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఘటనతో బుధవారం కాజీపేట జంక్షన్ మీదుగా ఢిల్లీ–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు, దారి మళ్లించి నడిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్– ముజఫర్‌పూర్ (06229) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–నాగర్సోల్ (17661) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–కరీంనగర్ (07793) ఎక్స్‌ప్రెస్, కరీంనగర్–కాచిగూడ (07794) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రామేశ్వరం (07695) ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–సికింద్రాబాద్ (07696) సికింద్రాబాద్–తిరుపతి (07041) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–సికింద్రాబాద్ (07042) ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్–నాందేడ్ (17409) ఎక్స్‌ప్రెస్, నాందేడ్–ఆదిలాబాద్ (07595) ఎక్స్‌ప్రెస్, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్–సికింద్రాబాద్ (20101) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నాగ్‌పూర్ (12758) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. రీషెడ్యూల్ వివరాలు హైదరాబాద్–న్యూఢిల్లీ (12723) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నిజాముద్దీన్ (12437) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–నిజాముద్దీన్ (12707) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రక్సోల్ (07007) ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ (06229) ఎక్స్‌ప్రెస్‌లు రీషెడ్యూల్‌తో నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్ రైళ్లు రద్దు గూడ్స్ ఘటనతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్ల దారి మళ్లింపు గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్ (15023) ఎక్స్‌ప్రెస్, వికారాబాద్, గుంతకల్మీదుగా, దర్బాంగా–సికింద్రాబాద్ (17008) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్, ఆదిలాబాద్ మీదుగా, తిరుపతి–జమ్ముతావి (22705) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మీదుగా, బెంగళూర్–నిజాముద్దీన్ (22691) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా, దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్‌ప్రెస్, పర్లీ మీదుగా, నిజాముద్దీన్–సికింద్రాబాద్ (07032) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, న్యూఢిల్లీ–హైదరాబాద్ (12724) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, నిజాముద్దీన్–బెంగళూర్ (22692) ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ మీదుగా, నిజాముద్దీన్–హైదరాబాద్ (12722) ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్, పర్లీ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. కాగా, రైళ్ల రద్దు, దారి మళ్లింపు, రీషెడ్యూల్‌తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హెల్ప్‌లైన్ సెంటర్ కాజీపేట జంక్షన్లో రైల్వే అధికారులు హెల్ప్‌లైన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలు, ఆలస్యం, మళ్లింపు, రద్దు వివరాలను తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేడు దానాపూర్ రద్దు సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్ గు రువారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అ దేవిధంగా సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ భా గ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురువారం పెద్దపల్లి–సికింద్రాబాద్ మధ్య నడుస్తుందని అధికారులు తెలిపారు. యథావిధిగే నడిచే అవకాశం పెద్దపల్లి గూడ్స్ ఘటనకు సంబంధించి లైన్‌ను క్లియర్ చేసి గురువారం నుంచి యథావిధిగా రైళ్లను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల పడిగాపులు కాజీపేట జంక్షన్లో హెల్ప్‌లైన్ సెంటర్ వరంగల్ మీదుగా వెళ్లే రద్దయిన రైళ్ల వివరాలు.. 12577–భాగమతి ఎక్స్‌ప్రెస్, 12622–తమి ళనాడు, 12616–గ్రాండ్‌ట్రంక్(జీటీ), 126 55 నవజీవన్ సూపర్ ఫాస్ట్, 16318 హిమసాగర్, 17296 సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్, 20806 ఏపీ ఎక్స్‌ప్రెస్, 12626 కేరళ ఎక్స్‌ప్రెస్, 03259 ఎస్ఎంవీటీ బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 22670 ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 22610 తిరున్వేలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, 12670 గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా, వరంగల్‌లో అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. -
విద్యార్థినులు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి
హసన్‌పర్తి : విద్యార్థినులు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని డాక్టర్ సుమన్ అన్నారు. అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ కౌన్సిల్లో భాగంగా బుధవారం ‘ప్రాబ్లమ్ సాల్వింతగ్, ఐడియేషన్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి డాక్టర్ సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రా బ్లమ్ ఐడెంటిఫికేషన్ కోసం కావాల్సిన మార్గాలను తెలిపారు. కార్యక్రమంలో ఐఐసీ ప్రెసిడెంట్ ఎం. రంజిత్‌కుమార్, కో–ఆర్డినేటర్లు జి. ఝాన్సీరాణి, శ్వేత, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి, అధ్యాపకులు డాక్టర్ మహేందర్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ వాణిశ్రీ, ఏఓ వేణుగోపాలస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత పాటిస్తేనే బిల్లుల చెల్లింపు
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులను టెండర్ ఒప్పందాల మేరకు నాణ్యతతో చేపట్టాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని 57వ డివిజన్లో పూర్తయిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా కమిషనర్ డివిజన్లోని గాంధీనగర్ ప్రాంతంలో నిర్మించిన అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నాణ్యత, రోడ్డు వెడల్పు, లోతు కొలతలు వేయించారు. నాణ్యతను ఎంబీ రికార్డ్ ప్రకారం పరిశీలించారు. నాణ్యత పాటించకపోతే బిల్లుల చెల్లింపులో కోత విధించనున్నట్లు, చేపట్టిన పనులు పది కాలాల పాటు నిలిచేలా కాంట్రాక్టర్లు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా ఇంజనీర్లు పర్యవేక్షించాలని సూచించారు. -
అరుణాచలానికి బస్సు ప్రారంభం
హన్మకొండ: కార్తీక పౌర్ణమి గిరి ప్రదర్శనకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి అరుణాచలం నడిచే బస్సును ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు మాధవరావు, కేశరాజు భానుకిరణ్ బుధవారం ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా బస్ స్టేషన్ నుంచి సూపర్ లగ్జరీ బస్ భక్తులతో బయల్దేరగా.. వారు జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి నెలా పౌర్ణమికి రెండు రోజుల ముందు ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్లు వారు తెలిపారు. భక్తులు ఈసౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీనివాసులు, చిమ్మని సంతోశ్ పాల్గొన్నారు. వైభవంగా తులసీధాత్రి, నారాయణ స్వామి కల్యాణం హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకశుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ధాత్రినారాయణస్వామిని (ఉసిరిక చెట్టు), లక్ష్మీస్వరూపమైన (తులసిచెట్టు)ను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. కృష్ణయజుర్వేద పండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు కల్యాణ క్రతువు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీరుద్రేశ్వరమహాశివలింగానికి పెరుగన్నంతో మహా అన్నపూజ నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకటయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమ్మ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లూరి వెంకటేశ్వరరావు, మంజుల దంపతుల ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు జరిగాయి. నేడు స్వామివారికి లక్ష బిల్వార్చన, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. అలరించిన సంగీత నృత్య కళార్చనహన్మకొండ కల్చరల్: విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో కళార్చన నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం భద్రకాళి ఆలయంలో హిందుస్థానీ గాత్రం, సితార్, కర్టాటక, వయోలిన్, కూచిపూడి నృత్యం, పేరిణి నృత్య విభాగాధిపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్లమా, సర్టిఫికెట్ సంగీత, నృత్య కోర్సు విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ నాడ్గౌడ సుధీర్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ద్వారా విద్యార్థులకు హిందుస్థానీ గాత్రం, పేరిణి, కూచిపూడి నృత్యం, సితార్, వయోలిన్, కర్ణాటక గాత్రం అందిస్తున్నామని తెలిపారు. కళాశాల సిబ్బంది శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకోవాలి
వరంగల్ చౌరస్తా: నగరంలోని గోవిందరాజ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం గోవిందరాజుల గుడి ఆవరణలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వాల్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనంత కోటి దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరయోగుల శ్రీనివాసస్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల నవీన్ రాజ్, పీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, నాయకులు ఆయూబ్, తోట హరీశ్, వశీం, దౌడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుడ్ ఐడియా
మహబూబాబాద్ అర్బన్: నిత్యం రెండు కిలోమీటర్లు దూరంలోని బడికి వెళ్లాలి. నిర్ణీత సమయంలో సైకిల్‌పై వెళ్లలేకపోవడం, కాళ్లనొప్పులు రావడంతో ఆ విద్యార్థి మెదడుకు పనిచెప్పాడు. సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి హాయిగా దానిపై బడికి వెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం జగన్ కాలనీకి చెందిన ఆదర్శ్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల తన నివాసానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు సైకిల్ కొనిచ్చారు. రోజూ నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కడం, సమయానికి పాఠశాలకు చేరుకోకపోవడం, కాళ్లు నొప్పి పెడుతుండడంతోపాటు తొందరగా వెళ్లేందుకు ఏమి చేయాలన్న ఆలోచన చేశాడు. ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించి ఎలక్ట్రిక్ కిట్‌ను రూ. 20 వేలతో ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. తన సైకిల్‌కు అమర్చాడు. ఆ రోజునుంచి హాయిగా పాఠశాలకు వెళ్లొస్తున్నాడు. గంట చార్జింగ్ పెడితే 40 కి.మీ స్పీడ్‌తో 35 కిలో మీటర్లు పోవచ్చని, రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతో అవకాశం ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేస్తానని ఆదర్శ్ ‘సాక్షి’తో తెలిపాడు. -
సాహసమే శ్వాసగా..
కేసముద్రం: వ్యవసాయ బావిలో కారు పడిన ప్రమాదంలో ఇద్దరు బాలురు సాహసం చేశారు. ముగ్గురి ప్రాణాలను కాపాడారు. 2022లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించి ఆ సాహస బాలురను అభినందనలతో ముంచెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన బానోతు భద్రునాయక్, హచ్చాలి దంపతులు, కుమార్తె సుమలత, మనవడు దీక్షిత్‌తో కలిసి 2022 అక్టోబర్ 28న తన బావమరిది బిక్కుతో కలిసి కారులో అన్నారం షరీఫ్‌కు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో కేసముద్రం మీదుగా మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు కేసముద్రంస్టేషన్ బైపాస్ రోడ్డులో ఉన్న వ్యవసాయబావిలో పడింది. అదే సమయంలో మూత్రవిసర్జన కోసం పాఠశాల నుంచి బయటకు వచ్చిన సిద్ధు, రంజిత్ తమ ప్రాణాలకు తెగించి బావిలో దూకారు. కారు అద్దాలు పగులగొట్టి సుమలత, ఆమె కుమారుడు దీక్షిత్, డ్రైవర్ బిక్కును కాపాడారు. అప్పటికే కారు మునిగిపోవడంతో మిగిలిన నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంతో సాహసం చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన సిద్ధు, రంజిత్‌లను అప్పటి కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. -
సూపర్ మెమొరీ
గురువారం శ్రీ 14 శ్రీ నవంబర్ శ్రీ 2024వయసులో చిన్నవాళ్లు. ప్రతిభలో ఘనులు. వేదిక ఏదైనా అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటారు. నచ్చిన రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.. ఉమ్మడి వరంగల్‌కు చెందిన చిచ్చరపిడుగులు. ఒకరేమో సంప్రదాయ నృత్యం ప్రదర్శించి చూపు తిప్పనివ్వకుండా చేస్తే.. మరొకరేమో పద్యాల్ని రాగం తీస్తూ పలుకుతున్నారు. ప్రపంచంలోని వెహికిల్స్‌ను చూసి పేర్లు చెప్పే బుడత ఒకరైతే.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలురు మరికొందరు. ఇంకో బాలుడైతే స్కూలుకు తొందరగా వెళ్లేందుకు సొంతంగా ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసుకున్నాడు. నేడు (గురువారం) జవహర్లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా ఔరా! అనిపించుకుంటున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జనగామ: ఐదేళ్ల వయస్సులోనే వండర్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుని వహ్వా అనిపిస్తోంది జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి నరసింహమూర్తి, శ్వేతా లక్ష్మి దంపతుల కుమార్తె కేఎల్ఆర్ రిహాన్షి. పట్టణంలోని ఓప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న చిన్నారి, స్థానిక మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం గురువు పులిగిల్ల సుఖేశ్ మాస్టర్ వద్ద రెండున్నరేళ్ల వయస్సు నుంచే నృత్యంలో తర్ఫీదు తీసుకుంటోంది. జనగామలో హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏకచత్వారింశత్ నిమిష నృత్య పద్య పఠన ప్రదర్శన నిర్వహించారు. ఆసమయంలో చిన్నారి వయస్సు ఐదేళ్లు. ఇందులో రిహాన్షి 41 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా నృత్య ప్రదర్శన చేస్తూనే.. కంటిన్యూగా 42 వేమన పద్యాలు చెప్పి అందరినీ అబ్బురపర్చి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. చిన్నారికి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ గర్ల్ పేరుతో ప్రముఖ సినీహీరో సుమన్ చేతుల మీదుగా రుద్రమదేవి అవార్డు అందించారు. హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల సమ్మేళనంలో చిన్నారి రిహాన్షి ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. బుద్ధగయలో జరిగిన అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ చార్లెస్ థామ్సన్ చిన్నారి నృత్యం చూసి అభినందించారు. రిహాన్షి జనగామ: జనగామ పట్టణానికి చెందిన ఐదేళ్ల బుడతడు ప్రపంచంలోని కార్ల బొమ్మలు చూపిస్తే ఠక్కున వాటి పేర్లు చెప్పేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. జనగామ పట్టణం గీతానగర్‌కు చెందిన పృధ్వీసాగర్రెడ్డి–సింధుజ దంపతుల కుమారుడు రొండ్ల హర్షద్ రాంరెడ్డి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఇతడికి మూడేళ్లు ఉన్నప్పటి నుంచే ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు 80 రకాల కార్లు, ద్విచక్రవాహనాల బొమ్మలు కొనిచ్చారు. తరచూ కార్లు, బైక్‌ల బొమ్మలు చూపిస్తుండడంతో అతడు ప్రపంచంలోని అన్ని కార్లను, ద్విచక్రవాహనాల పేర్లు చెబుతున్నాడు.రొండ్ల హర్షద్ రాంరెడ్డివండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకుంటున్న చిన్నారి (ఫైల్)నృత్యం, పద్య పఠనం, సాహసం, నూతన ఆవిష్కరణలు వారి సొంతం ● తమకంటూ ప్రత్యేక గుర్తింపు ● నేడు బాలల దినోత్సవం నాన్ స్టాప్ నర్తనన్యూస్రీల్విభిన్న రంగాల్లో మన్ననలు పొందుతున్న బాలలు -
19న హనుమకొండకు సీఎం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ఈనెల 19వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళో జీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం బాలసముద్రంలోని ప్రజాభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళోజీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ స్వామిచరణ్, నాగరాజు, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, సంపత్ పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 56 లక్షలు కాజీపేట అర్బన్: 31వ డివిజన్ పరిధి నందిహిల్స్ కాలనీలో 20 రోజుల్లోనే అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.56 లక్షల నిధులు కేటాయించినట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. నందిహిల్స్ కాలనీలో సీసీరోడ్డు నిర్మాణానికి బుధవారం కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్లరాజు, నాయిని లక్ష్మారెడ్డి, కాలనీ అధ్యక్షుడు రావుల శ్రీధర్, సుబ్బరాజు, జగన్‌మెహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మల్లయ్య, మోహన్‌రావు, జనార్దన్‌రెడ్డి, దుర్గారావు, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రజాభవన్‌లో కాళోజీకి ఘన నివాళి -
ప్రశ్నలే.. సమాధానాల్లేవ్
హన్మకొండ అర్బన్: మూడునెలలకోసారి జరగాల్సి న హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం.. ఎన్నికలు, ఇతర ఆటంకాలతో ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో జరిగింది. చైర్పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు ఏ ఒక్క అధికారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యేలతోపాటు చైర్పర్సన్ కడియం కావ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కావ్యకు కలెక్టర్ సర్దిచెప్పారు. వచ్చే సమావేశం నాటికైనా పూర్తి సమాచారం, ముందస్తు ప్రణాళికలు(డీపీఆర్)లతో రావాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పడకేశాయి : ఎమ్మెల్యే నాయిని నగరంలో ఏడాదికాలంగా పారిశుద్ధ్య పనులు పూర్తిగా పడకేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. కొన్ని కాలనీల్లో రెండు నెలలుగా చెత్త కుప్పలు తరలించకుండా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం బద్నాం అవుతుందని తెలిపారు. నల్లాల లీకేజీల విషయంలో పదే పదే చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. స్పెషల్‌డ్రైవ్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు. రోడ్ల మరమ్మతు చేయాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భట్టుపల్లి, కడిపికొండ ఇందిరమ్మకాలనీల్లో సీసీ రోడ్లు లేవని, వీధిలైట్లు వెలగడం లేదని ఈవిషయంలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడంలేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.. అధికారులను నిలదీశారు. భట్టుపల్లి రోడ్డులో ఎస్ఆర్ కాలేజీ వద్ద కల్వర్టు కుంగిన చోట వారంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. చింతగట్టు కెనాల్‌పై హసన్‌పర్తి రోడ్డులో ఉన్న బ్రిడ్జి పూర్తి ఇరుకుగా మారిందని, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కిట్స్కాలేజీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని, రోడ్ల మరమ్మతు ఎవరు చేశారని ప్రశ్నించారు. దీనికి అధికారులనుంచి సరైన సమాధానం రాలేదు. శిక్షణ ఎవరు, ఎక్కడ ఇస్తున్నారు? మేయర్ సుధారాణి హైండ్లూమ్స్, టెక్స్ టైల్ ఆధ్వర్యంలో నేతకార్మికులకు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న అధికారులు ఎక్కడ, ఎవరికి ఇచ్చారని, తమకు కనీస సమాచారం లేదని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కాగా, దీనిపై తనకు సమగ్ర సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. సమాచారం లేనప్పుడు ఎందుకు చదువుతున్నావ్ : ఎంపీ కడియం కావ్య జిల్లాలో కేంద్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో సిబ్బంది ఇంటింకి వెళ్లి కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడంతో గుర్తించిన వారిని ఎంతమందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారని దిశ కమిటీ ౖచైర్‌పర్సన్, ఎంపీ కడియం కావ్య డీఎంహెచ్ఓను అడిగారు. సరైన సమాచారం లేనప్పుడు జాబితా ఎందుకు చదువుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, వచ్చే సమీక్ష నాటికి పక్కా లెక్కలతో రావాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిస్వార్థంగా పనిచేయాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు తీసుకురావాలన్నారు. ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలలు వసతి గృహాల్లోని విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, వారిపై దృష్టిసారిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలపై నీళ్లు నమిలిన అధికారులు ‘దిశ’ మీటింగ్‌కు మొక్కుబడిగా రావడంపై చైర్పర్సన్, ఎంపీ కావ్య అసహనం సర్దిచెప్పిన కలెక్టర్.. వచ్చే సమావేశానికి మార్పు రావాలన్న ఎంపీ -
సిర్రగోనె ఆడిన.. ఈతకు వెళ్లిన
జనగామ: చిన్ననాటి జ్ఞాపకాల అనుభూతి మరువలేనిది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇంట్లో ఉంటే అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులు. బయటకు వెళ్తే స్నేహితులు. వారితో కలిసి ఆటలు ఆడుకునే వాళ్లం. స్కూల్‌కు సెలవొస్తే సిర్రగోనె, లింగోచ్ ఆడిన తర్వాత ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లేవాడిని. స్కూల్లో పోటీలు పెడితే ఆ రోజంతా పండగలా అనిపించేది. సాయంత్రం 6 గంటల వరకు టీవీ చూడనిచ్చేవారు కాదు. నవోదయ గురుకులానికి వెళ్లిన తర్వాత వారానికి రెండు సార్లు తెలుగు సినిమాలు చూపించేవారు. ఇప్పటి పిల్లలు క్రమశిక్షణతో కూడిన ఎంజాయ్ చేస్తూనే.. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. – రాజమహేంద్ర నాయక్, డీసీపీ, జనగామ●ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశా..ఆంధ్రలోని ఒంగోలులోనే పాఠశాల చదువులు పూర్తి చేసుకున్నా. ఉమ్మడి కుటుంబం కావడంతో ఎక్కువగా ఇంట్లో గడిపేటోళ్లం. ఇంటి పక్కనే స్కూల్ కావడంతో ఒకరోజు కూడా సమయం తప్పలేదు. సాయంత్రం ఇంటికి రాగానే గంటసేపు ట్యూషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత, బుక్స్ పక్కన పడేసి, రాత్రి వరకు ఫ్రెండ్స్‌తో క్రికెట్, అనేక రకాల ఆటలతో ఎంజాయ్ చేశా. రోజులో టీవీ గంట సేపు కూడా చూసేటోళ్లం కాదు. బాలల దినోత్సవం రోజు బడిలో పోటీలు నిర్వహించి, బహుమతులు వస్తే ఆ రోజంతా సంతోషమే. నేటితరం యువత, పిల్లలు కష్టపడి చదువుకుని, తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. – షేక్ రిజ్వాన్ బాషా, కలెక్టర్, జనగామ● -
విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్‌పాండే దామెర: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్‌పాండే అన్నారు. మండల కేంద్రం క్రాస్‌వద్ద నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ బాలుర ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతోపాటు తరగతి గదులు, కిచెన్ రూం, టాయిలెట్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆమెతో విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. నీటి కొరతతో బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని, 20 మంది విద్యార్థులు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నీటి సమస్యతో బహిర్భూమికి బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైతే సరైన మందులు ఇవ్వకపోవడంతో తరగతులకు హాజరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్‌సెల్ అథారిటీ సెక్రటరీ క్షమాదేశ్‌పాండే మాట్లాడుతూ ఇటీవల పాఠశాలను తరలించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, త్వరలో పరి ష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీటీడీఓ ప్రేమలత, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి, స్టాఫ్ ఇన్చార్జ్ సమ్మయ్య రాథోడ్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపిక
వరంగల్ క్రైం: కేంద్ర ప్రభుత్వం అందజేసే అతి ఉత్కృష్ట సేవా పతకాలకు కేయూసీ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లారెడ్డి, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.మహేశ్ ఎంపికయ్యారు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై న దామెర మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన మల్లారెడ్డి 1990లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. గూడూరు, కొత్తగూడ, సంగెం, సుబేదారి పోలీస్స్టేషన్లలో పనిచేస్తూ జిల్లా అధికారుల నుంచి పలు రివార్డులు, ప్రశంసపత్రాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవ, ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. అలాగే, హనుమకొండ జిల్లా ఉప్పల్ కమలాపూర్ ప్రాంతానికి చెందిన మహేశ్ 1996లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరారు. సీసీఎస్, మిల్స్‌కాలనీ, జనగామ పోలీస్స్టేషన్ల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పోలీస్ అధికారుల నుంచి రివార్డులతోపాటు కలెక్టర్ నుంచి ప్రశంసపత్రం అందుకున్నారు. అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైన మల్లారెడ్డి, మహేశ్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. శబరిమలకు ఆర్టీసీ బస్సు హన్మకొండ: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందని ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ ఆర్ఎం మాధవరావు తెలిపారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్లో శబరిమల ప్రత్యేక బస్సు కరపత్రాలను డిపో మేనేజర్లతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎం మాట్లాడుతూ అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఆర్టీసీ బస్సు డిపోలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్ నాజియా సుల్తానా, సిబ్బంది మహమ్మద్ గౌస్ మొహినుద్దీన్, మహమ్మద్అలీ, కేవీ.రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ గిఫ్ట్ స్కీం విజేతల ఎంపిక హన్మకొండ: హనుమకొండ–హైదరాబాద్ రూట్లో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం ప్రవేశపెట్టిన గిఫ్ట్ స్కీం విజేతలను మంగళవారం ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్లో ప్రయాణికులతో డ్రా తీసి డిప్యూటీ ఆర్ఎం మాధవరావు విజేతలను ప్రకటించారు. ఎం.రమ (7981314836), చేతి లత (9652250322), ఎం.పద్మ (9014072550) విజేతలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎం మాట్లాడుతూ డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికులను ప్రోత్సహించడానికి గిఫ్ట్ స్కీం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు బస్సు దిగే ముందు టికెట్‌పై పేరు, ఫోన్ నంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని సూచించారు. ప్రతి 15 రోజులకు డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరంసింగ్, వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, నాజియా సుల్తానా పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి కాజీపేట అర్బన్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీటీసీ (డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్) పుప్పాల శ్రీనివాస్ సూచించారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రహదారిపై ఏమరుపాటుతో డ్రైవింగ్ చేయకూడదని, రాంగ్ రూట్, సిగ్నల్ బ్రేక్ చేయొద్దని కోరారు. సదస్సులో బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి, రీజియన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వేణుగోపాల్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవీ.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మేయర్ గుండు సుధారాణివరంగల్ అర్బన్: గడువులోగా అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేసి, రీకాల్ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం ఇంజనీర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులు, ఫ్లడ్ డ్యామేజ్, గ్రీన్ ఫండ్స్, ఎస్సీ సబ్‌ప్లాన్, స్మార్ట్‌సిటీ పనులపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ వరంగల్ ట్రైసిటీతోపాటు విలీన గ్రామాల్లోని పనులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. జంక్షన్లు, శ్మశానవాటికల్లో మౌలిక వసతులు, రోడ్లు, సైడ్ డ్రెయినేజీల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇచ్చి దశలవారీగా పూర్తిచేయాలని సూచించారు. కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయడంతో పాటు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వెంటనే టెండర్ పూర్తిచేసి ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సీఏంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, మహేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నియామకం
కాళోజీ సెంటర్: వరంగల్ మట్వాడ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కన్నం అరుణను జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్‌గా నియమిస్తూ డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పనిచేసిన ఏసీ డీపీసీ నరసింహారావు అక్టోబర్ 31న పదవి విరమణ పొందినందున ఆయన స్థానంలో అరుణను నియమించారు. నియమిత పోస్టుకు ఎలాంటి అదనపు జీతం లేదా ఇతర చెల్లింపులు లేకుండా హెచ్ఎంగా ఏసీగా పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో 59,948 గృహాల్లో సర్వే పూర్తివరంగల్: వరంగల్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కులగణన సర్వే కొనసాగుతోంది. మంగళవారం నాటికి ఎన్యుమరేటర్లు 59,948 (20.9శాతం) గృహాల్లో పూర్తి చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36,593 గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 23,355 గృహాల్లో సర్వే పూర్తి అయినట్లు తెలిపారు. -
పట్టణీకరణ వైపు పరుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జోడించి నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీలైనన్నీ మేజర్ గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడై మున్సిపాలిటీలుగా మారనున్నాయి. అదే విధంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధి కూడా విస్తరించనుంది. ఈ క్రమంలోనే ఆగస్టు మాసంలో ‘కుడా’ విస్తరణతోపాటు ఉమ్మడి జిల్లాలో ఐదు రెవెన్యూ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలంటూ ప్రజాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు పురపాలకశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే మున్సిపాలిటీలు, కుడాలో విలీనమయ్యే గ్రామ పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఇటీవలే పూర్తి కాగా.. పురపాలక శాఖ ఆ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌లో ఒక నగరపాలక సంస్థ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్), 14 మున్సిపాలిటీలు కానున్నాయి. 281 గ్రామాలు, 2800 చ.కి.మీటర్లకు ‘కుడా’ విస్తరణ.. కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ (కుడా) విస్తరణ ప్రక్రియ అధికారికంగా తుదిదశకు చేరింది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు అభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కుడా విస్తరణ ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం కుడా పరిధి 1,805 చదరపు కిలోమీటర్లు ఉండగా, దానిని 2,800 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ‘కుడా’ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు,181 గ్రామాలుండగా, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట జనగామ పట్టణాలతో పాటు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని హుస్నాబాద్, హుజూరాబాద్‌ను కూడా తీసుకువస్తున్నట్లు చేసిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపించాలని గ్రామ పంచాయతీలకు కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన సర్క్యులర్లకు సానుకూల స్పందన రాగా... హుస్నాబాద్, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ ఎమ్మెల్యేలు కూడా ‘కుడా’ విస్తరణపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. పరిధి పెంపు వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుండగా.. తమ ఆదాయం తగ్గిపోతుందని విలీనాన్ని కొన్ని జీపీలు మొదట వ్యతిరేకించాయి. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేయడం అధికారులకు సులువుగా మారి.. ‘కుడా’ విస్తరణకు మార్గం సుగమమైంది. కొత్తగా ఐదు మున్సిపాలిటీలు1. ఆత్మకూరు: తిరుమలగిరి, ఆత్మకూరు, గూడెప్పాడ్, కామారంతోపాటు నీరుకుళ్ల, పెంచికలపేట, దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామాలు. 2. నెక్కొండ: వరంగల్ జిల్లాలోని నెక్కొండ, గుండ్రపల్లి, అమీర్‌పేట, నెక్కొండ తండా పరిపాక టీకే తండా. 3. కేసముద్రం: కేసముద్రం టౌన్, కేసముద్రం విలేజ్. అమీనాపురం, ధనసరి గ్రామాలు. 4. స్టేషన్‌ఘన్‌పూర్: ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లి గ్రామ పంచాయతీలు. 5. ములుగు: ములుగు, బండారుపల్లి, జీవంత రావుపల్లి గ్రామాలు. ఇప్పుడున్న పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి, జనగామ మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఐదింటితో మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరనుంది. మరో ఐదు మున్సిపాలిటీలకు గ్రీన్‌సిగ్నల్ ఉమ్మడి వరంగల్‌లో 14కు చేరనున్న సంఖ్య ‘కుడా’ విస్తరణ ఫైలుకు పచ్చజెండా.. 2,800 చ.కి.మీటర్లకు పరిధి పురపాలకశాఖకు పంచాయతీల లేఖలు.. మున్సిపాలిటీల ఏర్పాటుకు పూర్తయిన ప్రక్రియ -
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
హన్మకొండ అర్బన్: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా ప్రభుత్వం చట్టప్రకారం శిక్షించాలని కోరారు. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం బాధ్యులు మురళీధర్‌రెడ్డి, ట్రెసా బాధ్యులు భాస్కర్, డీఆర్ఓ వైవీ.గణేశ్, కలెక్టరేట్ ఏఓ గౌరీశంకర్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి రాజేశ్, కేంద్ర సంఘం నాయకులు శ్యాంసుందర్, రామునాయక్, సారంగపాణి, మోయిజ్, లక్ష్మీప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ప్రవీణ్, అన్వర్, శ్రీనివాస్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేతలు నాయక్, రాజు, పెన్షనర్ల సంఘం నాయకులు శంకర్, నారాయణచారి, నేతలు రాజమౌళి, సురేశ్ అశోక్, రాజీవ్, అనూప్ పాల్గొన్నారు. -
ఉన్నతీకరణ పనులు పూర్తిచేయాలి
హన్మకొండ అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నతీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అంగన్వాడీల అభివృద్ధి పనులపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బోర్డులు బాగా కనిపించేలా, చిన్నా రులకు టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఉంచాలని పేర్కొన్నారు. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. పనులు పూర్తయిన వాటి బిల్లులను డీడబ్ల్యూఓకు సమర్పిస్తే వెంటనే పేమెంట్ చేస్తామని తెలిపారు. డీడబ్ల్యూఓ జయంతి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, టీజీడబ్ల్యూఐడీసీ డీఈ నరేందర్‌రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు ధాన్యం తరలింపులో అలసత్వం వద్దు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించడంలో జాప్యం వద్దని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపు అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో 48 ఐకేపీ, 109 పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. 31 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. జియోట్యాగింగ్‌తో ధాన్యం అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లులకు తరలిస్తారని వివరించారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఏఈఓలు టోకెన్లు అందజేయాలన్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వారం రోజుల్లో పూర్తిచేయాలని మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, డీసీఎస్ఓ దేవరాయి కొమరయ్య, డీఏఓ రవీందర్‌సింగ్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఉప్పునూతుల మహేందర్, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై సమీక్ష -
బాహుపేట క్రాస్‌రోడ్డులో చోరీ
హసన్‌పర్తి: ఎల్లాపురం శివారు బాహుపేట క్రాస్‌రోడ్డులోని ఓ ఇంటిలో చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదుతోపాటు 3.5 తులాల బంగారం మాయమైంది. బాధితుడి కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం సోమదేరవపల్లికి చెందన పోలు రాజేశ్ కలప వ్యాపారి. ఇటీవల హసన్‌పర్తి మండలం బాహుపేట క్రాస్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన బావమరిది అనారోగ్యానికి గురికావడంతో వారం రోజుల క్రితం రాజేశ్ దంపతులు బాహుపేటకు వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికి వెళ్లగా బీరువా ధ్వంసమై ఉంది. అందులో ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈమేరకు బాధితుడు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, కాజీపేట ఏీసీపీ తిరుమల్, హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎల్కతుర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ రమేశ్ సందర్శించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రూ. 10 లక్షల నగదు, 3.5 తులాల బంగారం అపహరణ హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు -
చనిపోయిన వారు ఉపాధి పనులకు!
హసన్‌పర్తి: చనిపోయిన వారు ఉపాధి హామీ పనులు చేసినట్లు చూపి, డబ్బులు డ్రా చేశారనే ఆరోపణలపై అన్నాసాగరం గ్రామస్తులు గ్రీవెన్స్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం డీఆర్డీఏ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణ అధికారులు ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌కు స్థానికుడు రామంచ మధుకర్ అక్రమాలపై ఫిర్యాదు చేశాడు. చనిపోయిన రామంచ వజ్రమ్మ, రామంచ భాస్కర్ ఉపాధి పనులకు వెళ్లినట్లుగా డబ్బులు డ్రా చేశారని చెప్పాడు. గ్రామంలో లేని కేతమ్మ, ఓప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న వారు కూడా కూలికి వెళ్లినట్లు మస్టర్లు ఉన్నాయని విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫీల్డ్అసిస్టెంట్ తన ఇంటి పనులు చేయించుకుని ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినట్లు మస్టర్లు రాశాడని పేర్కొన్నాడు. ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని కోరాడు. చనిపోయిన వారు ఎలా కూలి పనులు పనిచేస్తారు, వారికి డబ్బులు ఎలా చెల్లిస్తారని స్థానికులు విచారణాఽఽధికారులను ప్రశ్నించారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆరోపణలపై గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తేలితే సదరు ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఓ విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి కల్పన పాల్గొన్నారు. -
అధికారులు స్పందించకపోతే చెప్పండి
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకాశిబుగ్గ/ఖిలా వరంగల్/కాజీపేట అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించకపోతే తనకు చెప్పాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ఓ సిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో రోజు మంగళవారం మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రేటర్ 34వ డివిజన్ శివనగర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.35లక్షల నిధులతో కమ్యూనిటీహాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా 31వ డివిన్ పరిధిలోని దోనే గుట్టలో మంగళవారం కార్తీకమాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని పేర్కొన్నారు. పురాతన దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. న్యూశాయంపేటలోని శ్రీ త్రివేదాద్రి సంతోషలక్ష్మీనరసింహస్వామి దేవా లయ అభివృద్ధికి బల్దియా జనరల్ నిధుల నుంచి రూ.54 లక్షలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీపద్మ, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్రీరాం రాజేశ్, వడ్నాల మ ల్లయ్య, మంచాల కృష్ణమూర్తి, చింతం యాదగిరి, బుధారపు భాస్కర్, ఆడెపు సాంబమూర్తి, రాజమౌళి, బత్తుల నవీన్, పగడాల సతీశ్, లావణ్య, మోహన్‌రావు, కృష్ణ, వేణు, యాదగిరి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
సమాధానం చెప్పకుండా ఎదురుదాడి
మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ముందుగా దాస్యం మాట్లాడుతూ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగితే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తానని అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే..సీఎం రేవంత్ బుల్డోజర్ ఎక్కిస్తానని, ఏవేవో శాపనార్థాలు పెట్టాడని..ఇదేనా మీ సంస్కృతి అని ప్రశ్నించారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..పత్తి ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలున్నా ఇప్పటివరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక్క కిలో పత్తి కొనిపించారా? అని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు పులి రజనీకాంత్, బొంగు అశోక్ యాదవ్, కుసుమ లక్ష్మీ నారాయణ, నయీముద్దీన్, కృష్ణ, జానకి రాములు పాల్గొన్నారు. -
అబుల్ కలాం ఆజాద్ కృషి మరువలేనిది
హన్మకొండ అర్బన్: దేశంలో విద్యారంగాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి మరువలేనిదని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలాం జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఐఐటీ, సీఎస్ఐఆర్ సంస్థలు అన్ని ఆయన కృషి ఫలితమేనన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వైవీ గణేశ్, డీఎండబ్ల్యూఓ మురళీధర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
వేగం పుంజుకోని కొనుగోళ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఈసారి అరిగోస పడుతున్నారు. ఓ వైపు పత్తి రైతులను ‘తేమ’ గండం వెంటాడుతుంటే.. మరోవైపు వరి సాగు చేసిన రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం భారీగా తరలివస్తుండగా.. జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరికోతలు ఊపందుకున్నాయి. సీజన్ ఆరంభంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) శాతం (ఔట్ టర్న్)ను 67 నుంచి 58 శాతానికి తగ్గిస్తేనే ధాన్యం దించుకుంటామని రైస్ మిల్లర్లు అభ్యంతరాలు చెప్పారు. ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘాలతో చర్చలు జరిపినా చాలాచోట్ల మిల్లర్లు ఇంకా ముందుకు రావడం లేదు. ఆ మెలిక అలాగే.. ఉమ్మడి జిల్లాలో సాగైన 9,02,233 ఎకరాలకుగాను ఈసారి రైతులు సుమారు లక్ష ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకాలు వేయగా.. 90 శాతం వరకు సన్నరకాలే వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో వాతావరణ ప్రభావం కారణంగా క్వింటాకు 67 శాతం బియ్యం సీఎంఆర్ ఇవ్వలేమని మొదటి నుంచి చెబుతున్న రైస్ మిల్లర్ల పేచీ ఇంకా అలాగే సాగుతోంది. దీనికి తోడు ఈసారి మిల్లింగ్ నిబంధనలు సడలించి క్వింటాకు కొంత పరిహారం కస్టోడియన్, మిల్లింగ్, రవాణా చార్జీలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌కు వరంగల్ రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం లేఖ రాసింది. మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా.. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రా రైస్, పారాబాయిల్డ్ రైస్‌మిల్లుల సంక్షేమ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు కోరాయి. ఇప్పటికే పలు దఫాలు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ తరలింపులపై రైస్‌మిల్లర్ల సంఘాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల సంస్థ అధికారులు సంప్రదింపులు జరిపారు. తాజా డిమాండ్లను కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్న హామీతో మిల్లర్లు ధాన్యాన్ని దింపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. వరి సాగు విస్తీర్ణం (అంచనా): 8.10 లక్షల ఎకరాలు సాగైన విస్తీర్ణం: 9,02,233 ధాన్యం కొనుగోలు లక్ష్యం: 12.25 లక్షల మె.టన్నులు ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలు: 1,128 ఇప్పటి వరకు ప్రారంభించినవి: 672 కొనుగోలు చేసిన ధాన్యం: 2.32 లక్షల మె.టన్నులు ఉమ్మడి జిల్లాలో 1,128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు వాటిలో ప్రారంభించినవి 672 ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 2.32 లక్షల మెట్రిక్ టన్నులే.. -
సమగ్ర సర్వేపై కమిషనర్ అసంతృప్తి
వరంగల్ అర్బన్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమై మూడు రోజులైనా ఆశించిన పురోగతి లేదని, ప్రతీ రోజు నగర వ్యాప్తంగా 20 వేల కుటుంబాల వివరాలు సేకరించి, నమోదు చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్లు, ఇతర విభాగాల అ ధికారులతో సర్వేపై సమీక్షించారు. మూడు రో జులుగా కాజీపేట సర్కిల్ పరిఽధిలో 11,535 కాగా, కాశిబుగ్గ సర్కిల్లో 13వేలకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సర్కిల్‌వారీగా రోజుకు 10 వేల కుటుంబాల చొప్పున వివరాలు సేకరించాలని సూచించారు. సర్వేపై సందేహాలు వద్దు: వరంగల్ కలెక్టర్ సర్వేపై పౌరులకు సందేహాలు అవసరం లేదని, వి వరాలు గోప్యంగా ఉంటాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం సాయంత్రం 24వ డి విజన్‌లోని పాటక్ మొహల్లా, ఎల్లంబజార్‌లో కొనసాగుతున్న సర్వే తీరునును ఆమె పరిశీలించారు.