Hollywood
-
కదలకుండా కట్టిపడేసే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘క్యారీ ఆన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్లో వెళుతున్నపుడు దాని జోనర్‌ని కమర్షియల్ యాంగిల్లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘క్యారీ ఆన్’ ఆ కోవకు చెందిన సినిమానే. ఇదో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పాచ్చు.ఈ సినిమాకి జేమ్ కలెక్ట్ సేరా దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... భార్యాభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్‌పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టీఎస్ఎలో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్‌పోర్టు పండగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్లు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్‌గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.ఓ అనామకుడు కొపెక్ను బ్లూటూత్ ద్వారా తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న అతని భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ ఆగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్కు సూచనలిస్తుంటాడు. అసలే పండగ కాలం... ఎయిర్‌పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగ రానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ పక్క ఆ లగేజ్‌ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్. ముందుగా తనకు కనపడకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న అతడ్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ ఆగంతకుడితో పాటు బాంబుని కనుక్కున్నాడా? అలాగే తన భార్యని కాపాడుకున్నాడా... ఈ ప్రశ్నలకు సమాధానం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘క్యారీ ఆన్’ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటి నుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యమవుతోంది. ఈ ‘క్యారీ ఆన్’ వర్త్ టు వాచ్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్. – ఇంటూరు హరికృష్ణ -
హంటర్ వస్తున్నాడు
హాలీవుడ్ నటుడు ఆరోన్ టేలర్ జాన్సన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రావెన్: ది హంటర్’. అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్, రస్సెల్ క్రోవ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఈ నెల 13న అమెరికాలో విడుదలైంది. అవి అరద్ , మాట్ టోల్మాచ్, డేవిడ్ హౌస్హోల్టర్ నిర్మించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. అలాగే ‘క్రావెన్: ది హంటర్’ సినిమాను 2025 జనవరి 1న ఇండియాలో ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. కాగా క్రావెన్ రోల్‌కి తాను ప్రిపేర్ అయిన విధానం గురించి టేలర్ జాన్సన్ మాట్లాడుతూ – ‘‘మార్వెల్ కామిక్ బుక్స్‌లో కనిపించే క్రావెన్ క్యారెక్టర్‌నే ఆడియన్స్ అందరూ స్క్రీన్‌పై కూడా చూడాలనుకుంటున్నారు.సో... ఈ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్‌కి తగ్గట్లుగా నా గెటప్‌ను రెడీ చేసుకోవాలనుకున్నాను. ఇందుకు బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ ఇదేమీ అంత సులభమైన పని కాదు. కానీ మేం ఆరు నెలలో చేశాం’’ అని తెలిపారు. ‘‘చాలా చాలెంజ్‌లను ఫేస్ చేశాం. మొబైల్ జిమ్‌ను ఉపయోగించేవాళ్లం. ఎక్కువ ట్రైనింగ్ వల్ల మజిల్ డ్యామేజ్ అవుతుందని, కొన్ని ప్రత్యేకమైన వర్కౌట్స్ మాత్రమే చేశాం’’ అని తెలిపారు ఫిజికల్ ట్రైనర్ కింగ్స్ బరీ.ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రావినోఫ్ (రస్సెల్ క్రోవ్) ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్. కొన్ని పరిణామాల వల్ల క్రావెన్ కూడా కొన్ని క్రూరమైన పరిణామాలతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ప్రపంచంలోనే గొప్ప హంటర్‌గా మారడమే కాకుండా అందరూ భయపడే వ్యక్తిగా ఎలా మారాడు? అన్నదే కథ. -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
జనవరి 1న థియేటర్లలో 'క్రావెన్: ది హంటర్' రిలీజ్
హాలీవుడ్ నుంచి వస్తున్న మరో యాక్షన్ డ్రామా 'క్రావెన్: ది హంటర్'. మరో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాకు ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్‌కి పోలీసులు షోకాజ్ నోటీసు)'కోపం, ఆవేశంతో సెర్గీ.. ఇద్దరు పిల్లలని టీనేజ్‌లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను సులభంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయడు. అందుకు కూడా ఓ జస్టిఫికేషన్ ఉంది. చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు' అని దర్శకుడు చెప్పాడు.ఈ సినిమాలో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ) -
వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో రజినీకాంత్.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్.. గురువారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొందరు మాత్రం టెక్నాలజీ ఉపయోగించి తలైవాని సరికొత్తగా చూపించారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధ్యం కాని వాటిని కూడా ఈ సాంకేతికత ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఇలానే ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు-వెబ్ సిరీసులైన 'పీకీ బ్లండర్స్', 'రాకీ', 'టాప్ గన్', 'గ్లాడియేటర్', 'గాడ్ ఫాదర్', 'స్టార్ వార్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'టైటానిక్', 'మ్యాట్రిక్స్' సినిమాల హీరోల గెటప్స్‌లో రజినీ కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)Mass😍😍😍😍#Thalaivar #ThalaivarBirthday #Superstar #SuperstarRajinikanth #ThalaivarForLife pic.twitter.com/I6lbDKjLqw— Dr.Ravi (@imravee) December 12, 2024 -
ప్రియుడితో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్ : డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్‌పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్‌తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్‌ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ సంబంధాన్ని ధృవీకరించారు. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్‌లాండ్‌లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!
ఈ రోజుల్లో మిలియనీర్ కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉన్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.అయితే యంగ్ షెల్డన్ అనే సిట్కామ్తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ముగిసింది.16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..యంగ్ షెల్డన్లో పాత్రకు గానూ ఇయాన్ ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్కామ్ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్ సిరీస్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. -
OTT Review: నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ ఒకటి. ఈ చిత్రం గురించి...ప్రతి మనిషికీ ఆలోచనలుంటాయి. కానీ కొంతమందికి ప్రత్యేక ఆలోచనలొస్తాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ దర్శకులకు విపరీత ధోరణితో ఆలోచనలొస్తాయి. అవి వాళ్లు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుంచుతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’. ఈ సినిమా సిరీస్‌లో మూడవది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలూ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు వచ్చిన ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ నెల రోజుల క్రితమే ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా పెయిడ్ ఫార్మెట్లో విడుదలవగా... ఈ వారమది అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు ముప్పైఏడేళ్ల క్రితం ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ అనే ప్రత్యేకమైన సినిమా తీశారు. ఒక్క డైలాగ్ లేకుండా చక్కటి కామెడీతో చూడముచ్చటగా ఉంటుందా చిత్రం. దాదాపు అలాంటి కోవకే చెందిన ఇంగ్లిష్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’ చూసేవాళ్లకు చెమటలు పట్టించడం ఖాయం. మాటలు తక్కువున్నా ప్రేక్షకులకు దడ పుట్టిస్తుంది. జాన్ క్రసింస్కీ ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నిటికీ రచయిత. మొదటి రెండు చిత్రాలకు తాను దర్శకత్వం వహించగా తాజా చిత్రానికి మైఖేల్ సర్నోస్కీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా కథ ప్రకారం... న్యూయార్క్‌లో హాస్ స్పైస్ అనే ఫెసిలిటీలో క్యాన్సర్ పేషంట్‌గా ఉన్న సామ్ తన కుక్క పిల్లతో వాలంటీర్ రూబెన్‌తో కలిసి ఓ ప్లే చూడడానికి సిటీలోకి వెళ్తుంది. సామ్‌కి సంగీతం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి వింటుంటుంది. అప్పుడే మాన్హాట్టన్ నగరంపై ఏలియన్స్ దాడి జరుగుతుంది. ఈ ఏలియన్స్ ఎక్కడైనా శబ్దం వస్తే చాలు కనిపించిన మనుషులపై దాడి చేస్తూ ఉంటాయి.నగరమంతా వాటి దాడి వల్ల క్షణాల్లో నిర్మాణుష్యమై΄ోతుంది. అక్కడక్కడా శబ్దం చేయకుండా బ్రతికున్నవాళ్లు ఏలియన్స్ నుండి తప్పించుకుంటూ ఉంటారు. అసలే క్యాన్సర్ బారిన పడిన సామ్ ఈ ఏలియన్స్ దాడిని ఎలా ఎదుర్కొందనేది మిగతా కథ. పైన చెప్పుకున్నట్టు ఈ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సినిమా చూశాక తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ వీకెండ్ చూసెయ్యండి. – ఇంటూరు హరికృష్ణ -
విషాదం.. ఆ స్వీట్ వాయిస్ ఇక వినిపించదు!
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. -
హకునా.. మటాటా... మరో నెలరోజులే అంటోన్న మహేశ్ బాబు!
ది లయన్ కింగ్ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ముఫాసా. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ లయన్ కింగ్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అయితే సూపర్ హిట్ అయిన చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించారు. దీంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ మూవీ తెలుగు ఫైనల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో హకునా.. మటాటా..ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మహేశ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించింది. Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024 -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
వాస్తవ ఘటనతో ఆఫ్టర్ మాత్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఆఫ్టర్ మాత్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటనల్లో కొన్ని మాత్రం మనల్ని అనునిత్యం వెంటాడుతుంటాయి. ఆ సంఘటనకు, మనకు సంబంధం లేకపోయినా వాటి బాధితుల బాధను మనమూ అనుభవిస్తాం. కొంతమంది ఆ బాధను అలా భరిస్తూనే ఉంటారు, మరికొంతమంది ఇంకోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా 2004లో జరిగిన ఓ వాస్తవ ఘటనకు సినిమా రూపమిచ్చారు హాలీవుడ్ దర్శకుడు ఎలియట్ లెస్టర్. 2004లో ఓ రష్యా ఆర్కిటెక్ తన కుటుంబాన్ని ఘోర విమాన ప్రమాదంలో ΄పోగొట్టుకున్నాడు.దానికి ప్రతిగా ఎయిర్ లైన్ ట్రాఫిక్ సిబ్బందిని హత్య చేశాడు. ఈ ఘటన ఆధారంగా ‘ఆఫ్టర్ మాత్’ సినిమా తీశారు. ఈ సినిమా కథపరంగా రోమన్ ఓ కన్స్ట్రక్షన్ వర్కర్. ఫ్లైట్‌లో వస్తున్న తన కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ ΄కోర్టుకి బయలుదేరడంతో ప్రారంభం అవుతుంది సినిమా. ఎయిర్ ΄కోర్టులో అడుగుపెట్టగానే తన భార్య, కూతురు విమాన ప్రమాదంలో మరణించారని రోమన్‌కి తెలుస్తుంది. దాంతో అతను కుంగిపోతాడు. అసలు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయం తెలుసుకునే క్రమంలో ఆ ప్రమాదం వెనక ఉన్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జేక్ బనోస్ అనే విషయం రోమన్‌కి తెలుస్తుంది.ఎలాగైనా సరే రోమన్ జేక్ బనోస్ని కలవాలని ప్రయత్నిస్తాడు. జేక్‌ని కలిశాక రోమన్ ఏం చేశాడన్నదే ‘ఆఫ్టర్ మాత్’ సినిమా. ఈ సినిమా ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్. తన కుటుంబం మొత్తాన్ని ΄పోగొట్టుకుని దానికి కారణమైన వారి మీద పోరాటమన్నది అంత చిన్న విషయం కాదు. ఎన్నో భావావేశాలతో కూడుకున్న చిత్రం ఇది. ముఖ్యంగా రోమన్ ΄పాత్రలో ఓ విశిష్ట నటుడు మనకు కనిపిస్తాడు. దాదాపు రెండు తరాల నుండి హాలీవుడ్ యాక్షన్ రారాజుగా పిలవబడే ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ రోమన్ పాత్రను చేశారు. ఆర్నాల్డ్ ఆ పాత్రను చేశారనే కన్నా జీవించారని చెప్పవచ్చు. సినిమా మొత్తం కాస్త స్లోగా ఉన్నా సినిమా అయిపోయాక కొన్ని గంటలు మనం రోమన్ పాత్రతోనే ప్రయాణం చేస్తాం. ‘లయన్స్ గేట్’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎమోష నల్ రోలర్ కోస్టర్‌ని చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్..
-
యశ్ ‘టాక్సిక్’ కోసం రంగంలోకి ‘అవతార్’ ఫైటర్స్
‘కేజీఎఫ్: చాప్టర్ 1, కేజీఎఫ్: చాప్టర్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మలయాళ నటుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యశ్ సోదరి పాత్రలో నయనతార, యశ్ ప్రేయసిగా కియారా అద్వానీ నటిస్తున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల నయనతార, యశ్‌లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు గీతూమోహన్ దాస్. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకు హాలీవుడ్లో ‘జాన్ విక్: చాఫ్టర్2, ఎఫ్ 9, అవతార్: ద వే ఆఫ్ వాటర్’ వంటి భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలకు పని చేసిన జేజే ఫెర్రీ ‘టాక్సిక్’ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలో వాలిపోయారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని యశ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ తో ΄ాటుగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా చేస్తున్నారు యశ్. -
అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ
విచిత్రమైన సినిమాల లిస్ట్ తీస్తే దాదాపుగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఎందుకంటే భయపెట్టలన్నా, కవ్వించాలన్నా, గ్రాఫిక్స్‌తో మాయ చేయాలన్నా సరే వాళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే భూమిపై ఏం జరగొచ్చే అనే కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ సినిమానే 'ద సైలెన్స్'. 2019లో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? నిజంగా ఇది అంత బాగుందా అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)కథేంటి?ఓ పరిశోధనా బృందం.. 800 అడుగుల లోతున్న ఓ గుహని పగలగొట్టినపుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలిచే కొన్ని వింత జీవులు.. సదరు సైంటిస్ట్లని క్రూరంగా చంపి బయటి ప్రపంచంలోకి వస్తాయి. వీటికి శబ్దం వస్తే నచ్చదు. అలాంటిది బయట ప్రపంచంలో మనుషులు చేసే శబ్దాలకు అల్లకల్లోలం అయిపోతాయి. మనుషుల్ని పీక్కుతింటుంటాయి. మరోవైపు అల్లీ ఆండ్రూస్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది. వెస్ప్ అనే జీవులు అందరినీ చంపేస్తున్నాయని వీళ్ల కుటుంబానికి తెలుస్తుంది. దీంతో సౌండ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అనుకుంటారు. మరి వింత జీవుల నుంచి వీళ్ల తప్పించుకున్నారా? లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తీసింది కల్పిత కథే అయినప్పటికీ 'ద సైలెన్స్' చూస్తున్నంతసేపు మనకు వణుకు పుడుతుంది. ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటా అని భయమేస్తుంది. జస్ట్ గంటన్నర నిడివి ఉండే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు. అలానే ఓ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఒకరికరు ఎలా అండగా నిలబడాలో చూపించారు. ప్రధాన పాత్రధారి ఫ్రెండ్ క్యారెక్టర్‌తో ఫ్రెండ్షిప్ విలువ కూడా చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ప్రస్తుతం మనలో చాలామంది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అడవుల్ని నరికేసి ఎన్నో జీవరాశులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. అవి ఏం చేయలేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అవే గనకు వికృత రూపాల్ని సంతరించుకుని మనుషులపై తిరగబడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఎక్కడో 800 అడుగుల లోతులో వాటి మానాన అవి ఉంటే, పరిశోధనల పేరుతో వాటిని ఇబ్బంది కలిగించడంతోనే వింత జీవులు భూమ్మీదకి వస్తాయి. మనిషికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయి.ఇందులో ప్రధాన పాత్ర కుటుంబంపై ఎప్పటికప్పుడు వింత జీవులు ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ప్రతిసారి వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్, కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా స్టోరీ ఉన్న 'ద సైలెన్స్' మూవీ.. ఈ వీకెండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు. ఇంకెందుకు లేటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి.- చందు డొంకాన -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో ఉచితంగా స్ట్రీమింగ్!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఎక్కడైనా సరే ఫ్యాన్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమానే ఇండియన్ ఫ్యాన్స్‌కు అందుబాటులోకి రానుంది. గత జూలై 26న బాక్సాఫీస్ వద్ద రిలీజైన డెడ్‌పూల్ అండ్ వాల్వరైన్ భారీగా వసూళ్లు రాబట్టింది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్లస్, వుడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.తాజాగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సినిమా నవంబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఇండియాలో ఇంగ్లష్తో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తన వీడియోను షేర్ చేస్తూ వెల్లడించింది. ఈ సినిమాను ఉచితంగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి షాన్ లెవీ దర్శకత్వం వహించారు. -
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ది యూనియన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్ హాట్‌గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్ సినిమా ‘ది యూనియన్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్ వాబర్గ్, మైక్ కాల్టర్ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్ క్రష్ అయిన రోక్సేన్ హాల్ ద్వారా ఎదురవుతుంది. 25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్‌లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్‌కేస్ కోసం ఇరాన్ తీవ్రవాదులు, నార్త్ కొరియా ఏజెంట్లు, రష్యన్ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కోసం యూనియన్ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే పొగొట్టుకుంటుంది. అసలు ఆ బ్రీఫ్‌కేస్‌కి, కథానాయకుడు మైక్‌కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్ ప్రియురాలు రోక్సేన్ హేల్ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్‌లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ ‘ది యూనియన్’.– ఇంటూరు హరికృష్ణ -
షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ
ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు. చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక. అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు. ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు. -
IF Movie Review: ఇఫ్ మూవీ రివ్యూ.. మన ఊహే నిజమైతే!
ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేని ఫ్రెండ్స్ గురించి గొప్పగా ఊహించుకుంటారు. అంటే ఆ ఊహలోని ఫ్రెండ్స్ కి గొప్ప పవర్స్, పవర్ ఫుల్ మేకోవర్ ఉంటాయి. మరి అలాంటి ఊహలు నిజమైతే...అలాంటి థాట్ లోంచి వచ్చిన సినిమానే ఇఫ్ చిత్రం. ఇదో ఫాంటసీ కామెడీ మూవీ. దీనిని జాన్ క్రసింస్కీ తీశారు. ప్రముఖ నటులు రేయాన్ రెనాల్డ్స్ తో పాటు కాలే ఫ్లెమ్మింగ్ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు.ఇఫ్ సినిమా కథేంటంటే...పన్నెండేళ్ళ బీ తన డాడీ ఆపరేషన్ వల్ల గ్రాండ్ మదర్ మార్గరేట్ అపార్ట్ మెంట్ కు వస్తుంది. బీ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. ఓ రోజు రాత్రి బీ తనకు బిల్డింగ్ లో ఎవరో రేర్ క్రియేచర్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత రోజు కూడా ఆ క్రియేచర్ ఓ మనిషితో పాటు వెళ్తున్నట్టు మళ్ళీ కనిపిస్తుంది. ఆ మనిషి ఎవరో కాదు తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ చివరి పై ఫ్లోర్ లో వున్న కాల్ అని తెలుస్తుంది. కాల్ తో వున్న క్రియేచర్ బ్లూ. కాని ఈ సారి బ్లూ తో పాటు సీతాకోకచిలుక రూపంలో వున్న బ్లాసమ్ ని చూడగానే బీ మూర్ఛపోతుంది. ఆ తరువాత కొన్ని రోజులకు బీ కాల్ తో కలిసి ఈ క్రియేచర్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళి తన ఇమేజినేషన్ తో వాటన్నిటిని తనకు నచ్చిన విధంగా మార్చి చూసుకుని ముచ్చటపడుతుంది. అసలు బీకి కనిపించిన ఈ క్రియేచర్స్ ఏంటి, తన ఇమేజినేషన్ తో సృష్టించుకున్న క్రియేచర్స్ తో బీ ఇంకెన్ని మాజిక్స్ చేసిందో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఇఫ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ చాలా బావుంటాయి. మనకు కనిపించే క్రియేచర్స్ ని చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వర్త్ మూవీ ఫర్ కిడ్స్. - ఇంటూరు హరికృష్ణ -
OTT: హాలీవుడ్ మూవీ ‘ట్రబుల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి. ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ -
హాలీవుడ్ టార్జాన్ రాన్ ఎలీ ఇకలేరు
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ (86) ఇకలేరు. ఆయన మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను. నటుడిగా, రచయితగా, కుటుంబంలోని వ్యక్తిగా, కోచ్‌గా, గురువుగా, నాయకుడిగా ఆయన రాణించారు’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్‌లో 1938లో జన్మించారు రాన్ ఎలీ. కెరీర్ ఆరంభంలో ‘సౌత్ పెసిఫిక్’, ‘ది ఫిన్డ్ హూ వాక్డ్ ది వెస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన తర్వాత టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’లో నటించే అవకాశం రాన్ ఎలీకి దక్కింది. టార్జాన్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాన్ ఎలీకి విపరీతమైనపాపులారిటీ వచ్చింది.ఇంకా ‘ప్లే హౌస్ 90, థ్రిల్లర్, ఫేస్ ది మ్యూజిక్’ వంటి సిరీస్‌లలో నటించారు రాన్. అలాగే ‘డాక్ సావేజ్: ది మ్యాన్ ఆఫ్ బ్రాంజ్, వన్స్ బిఫోర్ ఐ డై’ వంటి చిత్రాల్లోనూ నటించారాయన. ‘షీనా’ సిరీస్ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రాన్ ‘ఎక్స్‌పెక్టింగ్ ఆమిష్’ (2014) అనే సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. ఇదే ఆయనకు చివరి సినిమా. ఈ సంగతి ఇలా ఉంచితే... రాన్ ఎలీ ఎప్పుడు మరణించారనే విషయంపై క్రిస్టెన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించారని, మరణ వార్తను క్రిస్టెన్ కాస్త ఆలస్యంగా బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. -
'టార్జాన్' హీరో కన్నుమూత.. నెల రోజులకు ప్రకటించిన కుమార్తె
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాన్ ఎలీ (86) అనారోగ్యంతో మరణించారు. 1966 నుంచి 1968 సమయంలో టార్జాన్ షో NBC టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారం అయింది. ఈ షో అప్పట్లో భారీగా పాపులర్ కావడంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. టార్జాన్ చిత్రంలో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. దీంతో ఆయనకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, రాన్ ఎలీ మరణించారని ఆయన కుమార్తె కిర్‌స్టెన్ ఎలీ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.తన తండ్రి మరణంతో ఆమె ఒక పోస్ట్‌ను కూడా పెట్టారు. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆమె పేర్కొన్నారు. ' నా తండ్రి ఒక రోల్‌మోడల్.. ఆయన్నూ అందరూ హీరోగా పిలుస్తారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతో కష్టపడి తన చుట్టూ ఒక బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణం మాకు తీరని లోటుగా ఎప్పటికీ ఉండిపోతుంది.' అని ఆమె తెలపింది.2001లో తన నటనకు గుడ్‌బై చెప్పిన రాన్ ఎలీ ఆపై రచయితగా మారారు. ఈ క్రమంలో రెండు మిస్టరీ నవలలను ఆయన రాశారు. తన కెరియర్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. 1938లో అమెరికాలోని టెక్సాస్‌లో జన్మించిన ఎలీ.., 1959లో తన స్కూల్మెట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. సెప్టెంబరు 29న కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని లాస్ అలమోస్లోని తన ఇంట్లో ఎలీ మరణించారు. అయితే, ఈ విషయాన్ని ఆయన కుమార్తె చాలా ఆలస్యంగా ప్రపంచానికి తెలిపారు.