Bipasha Basu
-
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్‌ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్‌కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్‌లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT -
'షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?
లాక్డౌన్ కారణంగా సినీ ప్రముఖులు జిమ్‌లకు వెళ్లలేని పరిస్థితి. అయితేనేం? ఇంట్లో ఉంటూ కూడా వర్కవుట్స్ చేయవచ్చు అని నిరూపిస్తున్నారు. దీని కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఫిట్నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఆ మధ్య రకుల్‌ప్రీత్‌సింగ్ టీషర్ట్ ఛాలెంజ్ విసరగా, తాజాగా షూ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. నటి బిపాషా బసు ఈ ఛాలెంజ్‌ని పూర్తిచేసింది. దీని ప్రకారం.. ఒక కాలిపై షూని ఉంచి అది పడిపోకుండా వర్కవుట్ చేయాలి. డీన్ పాండే విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఎంతో ఈజీగా పూర్తిచేసేసింది బిపాసా. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ. "హేహే..నేను కూడా ట్రాక్‌లో ఉన్నాను, షూ ఛాలెంజ్" అంటూ క్యాప్షన్ జోడించారు. టాలీవుడ్‌లోనూ ఛాలెంజ్‌ల హవా నడుస్తోంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సామాన్యుల్లాగా ఇంటి పనులు చేస్తూ అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేశారు. లాక్‌ఢౌన్ అయిపోయే లోపు ఇంకెన్ని కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తాయో చూడాలి మరి. -
పీఎన్బీ స్కాం: ఇద్దరు టాప్ హీరోయిన్లు
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగా స్కాంకు సంబంధించిన వార్తల్లోకి తాజాగా బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, బిపాసా వచ్చి చేరారు. ఇప్పటివరకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరు ఈ స్కాంలో మారు మోగితే.. ఇపుడు ఈ కోవలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, బ్యూటీ క్వీన్ బిపాసా నిలిచారు. రూ.11, 400 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీ మామ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ తమకు సొమ్ము ఎగ్గొట్టాడంటూ ఆరోపించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గీతాంజలి జెమ్స్ కంపెనీ ఒప్పందంలో భాగంగా తమ రెమ్యునరేషన్ పూర్తిగా చెల్లించలేదని, భారీ ఎత్తున బకాయి పడిందని కంగనా ఆరోపించారు.. గీతాంజలి బ్రాండ్ నక్షత్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంగనా ఒప్పందం ప్రకారం పూర్తి సొమ్ము చెల్లించలేదని ఆరోపించారని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. 2016నుంచి ఈ బకాయిలు చెల్లించలేదని కంగనా తెలిపింది. కాగా కంగనాకంటే ముందు ఈ కంపెనీకి ఐశ్వర్య, కత్రినా కైఫ్ ప్రచారకర్తలుగా ఉన్నారు. మరోవైపు గీతాంజలికే చెందిన మరో బ్రాండ్ గిలికు అంబాసిడర్‌గా ఉన్న బిపాసా కూడా మెహుల్ చోక్సీపై ఆరోపణలు గుప్పించారు. 2008లో కాంట్రాక్టు ముగిసిన తరువాత తన ఫోటోలను వార్తాపత్రికల్లో వాడుకున్నారని బిపాసా ఆరోపించారు. ఈ విషయంలో తన మేనేజర్ కంపెనీని సంప్రదించినప్పటికి ప్రయెజనం లేదన్నారు. దీని మూలంగా అనేక జ్యుయలరీ ఎండార్స్మెంట్లను తాను కోల్పోయానని పేర్కొన్నారు. ప్రస్తుతం గిలి బ్రాండ్‌కు క్రితి సనన్ ప్రచార కర్తగా ఉన్నారు. కాగా కుంభకోణం నేపథ్యంలో గత ఏడాది ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన ప్రియాంక చోప్రా నీరవ్‌మోదీ డైమండ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రియాకంతో పాటు ప్రకటనల్లో కనిపించిన మరో నటుడు సిద్దార్థ మల్హోత్రా కంపెనీతో తన కాంట్రాక్టు గత ఏడాదే ముగిసినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రెండు జీన్స్ కొంటే.. ఒక బొచ్చె ఫ్రీ!
ముంబై : తొంగ్ జీన్స్.. ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న నయా ట్రెండ్. టోక్యో ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ వింత మోడల్ జీన్స్‌పై దేశదేశాల సెలబ్రిటీలు భిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు బిపాషా బసూ, మలైకా అరోరా, సీనియర్ నటుడు రిషీ కపూర్లు తమదైన శైలిలో చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. నేకెడ్ జీన్స్ : డెనిమ్ అంటే తనకెంతో ఇష్టమన్న బిపాషా.. ఫ్యాషన్ పేరుతో జీన్స్ పరువు తీయకండంటూ డిజైనర్లను వేడుకున్నారు. ‘ఇది చాలా బాధాకరం. అసలక్కడ ఏముంది? నెకెడ్ జీన్స్ కాకుంటే!’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశారు. మరో నటి మలైకా అరోరా.. బిప్స్ కామెంట్లను సమర్థించారు. రెండు కొంటే ఒక బొచ్చె ఫ్రీ : సెటైరికల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలిచే సీనియర్ యాక్టర్ రిషీ కపూర్‌ను సైతం తొంగ్ జీన్స్ స్పందించేలా చేశాయి. ‘‘ఇలాంటివి రెండు జీన్స్ కొంటే అడుక్కుతినడానికి ఒక బొచ్చె ఫ్రీ.. త్వరపడండి!’ అంటూ రిషీ చేసిన ట్వీట్ వేల సార్లు రీట్వీట్ అయింది. తొంగ్ జీన్స్ పేరుతో డిజైనర్ మెయికో బాన్ రూపొందించిన ఈ దుస్తులను ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్ పుట్టించిన తొంగ్ జీన్స్.. అప్పటి నుంచీ వార్తల్లో ఉంటూవస్తోంది.. -
భర్తతో హీరోయిన్ హాట్ యోగాసనాలు!
బాలీవుడ్ దంపతులు బిపాషా బస్సు-కరణ్ సింగ్ గ్రోవర్‌కు ఫిట్నెస్ మీద ఫోకస్ ఎక్కువ. నిత్యంలో ప్రేమలో మునిగిపోయే ఈ జంట తాము ఫిట్నెస్ కోసం చేసే వర్కౌట్స్‌ను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు. అంతర్జాతీయ మూడో యోగా దినోత్సవం సందర్భంగా బిపాషా-కరణ్ జంటగా కొన్ని ప్రత్యేక ఆసనాలు వేశారు. ఇద్దరూ కలిసి జోడీగా చేసిన ఈ ఆసనాలు ఫొటోలు ఒకింత హాట్‌గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. మీరూ ఓ లుక్ వేయండి. -
ఎండాకాలమ్... ఎంజాయ్ చేద్దామ్...
సమ్మర్ అనగానే భయపడేవారే గానీ ఇష్టపడేవారుంటారా? అంటే మేమున్నాంగా అంటున్నారీ స్టార్స్. సమ్మర్ సీజన్లో కొద్దిపాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే చాలు... వేడి కాలానికి హాయిగా వీడ్కోలు చెప్పేయవచ్చు అంటున్నారు. ఎండా కాలాన్ని ఆరోగ్యకరంగా ఆనందించేందుకు ఉపకరించే తమ లైఫ్‌స్టైల్ ఛేంజెస్‌ను ఇలా వివరిస్తున్నారు. తలకు క్యాప్... గోవా ట్రిప్ వేసవి సీజన్‌ని నేను బాగా ఎంజాయ్ చేస్తా. నా యాన్యువల్ బీచ్ హాలిడేస్ టైమ్ అదే. ఈ టైమ్‌లో గోవా నేను ఎంచుకునే అత్యంత ప్రధానమైన డెస్టినేషన్. సన్‌బ్లాక్, సమ్మర్లో ఫెడొరా/బ్యాండేనా (తలకు పెట్టుకునే క్యాప్/ బ్యాండ్) లేకుండా బయటకు అడుగుపెట్టను. డీ హైడ్రేషన్ రాకుండా గ్రీన్ జ్యూసెస్, మంచి నీళ్లు అధికంగా తీసుకుంటాను. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోను. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దానిమ్మ... బాగా తీసుకుంటాను. – బిపాసా బసు రోజ్ వాటర్స్ప్రే.. బ్రౌన్‌రైస్ ఈ సీజన్లో లూజ్ ట్రెండీ క్లోత్స్ హ్యాపీగా ధరించవచ్చు. సమ్మర్లో ఫ్యాషన్ అంటే లూజ్ క్లోత్స్, లినెన్, కాటన్ వంటి సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్స్, షార్ట్ డ్రెస్సులు, ఫ్లోయీ స్కర్ట్స్, ఎక్కువ వైట్ కలర్‌వి వార్డ్రోబ్ నుంచి బయటకు తీస్తాను. నుదుటి మీద హెయిర్ పడితే చాలా చికాకుగా ఉంటుందీ సీజన్లో. అందుకని బొహెమెయిన్ హెయిర్ బ్యాండ్/ హెడ్ గేర్ ధరిస్తాను. స్పైసీ, ఆయిలీ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెడతాను. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు రోటీస్, బ్రౌన్ రైస్ వాడతాను. కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, కోల్డ్ వాటర్ మిలన్ సలాడ్ వంటివి తీసుకుంటాను. తరచుగా ముఖాన్ని శుభ్రమైన నీళ్లతో కడుగుతాను. అలోవెరా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తాను. రోజ్‌వాటర్ స్ప్రే చేసుకుంటే ఓహ్... ఎంత రిఫ్రెషింగ్! నా బ్యాగ్‌లో స్కిన్వైప్స్ (చర్మాన్ని శుభ్రపరచుకునేవి) తప్పకుండా ఉంటాయి. – రియా చక్రవర్తి నాన్ స్పైసీ ఫుడ్... కాటన్ డ్రెస్ వింటే మరీ విపరీతంగా అనిపిస్తోందేమో కానీ నేను వేసవి కాలాన్ని బాగా ఆస్వాదిస్తాను. అవుట్ డోర్ షూటింగ్ ఉంటే మన మేకప్ సామాన్లు సర్దుకోవడం, విభిన్న రకాల దుస్తులు ధరించడం వగైరా చికాకులు ఉంటాయి. అదేమీ లేకపోతే మాత్రం సమస్య లేదు. మామూలుగానే నేను కాటన్ దుస్తులు ధరిస్తా కాబట్టి... ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ మార్చనక్కర్లేదు. అలాగే ఎప్పుడూ తక్కువ ఆయిల్, నాన్ స్పైసీ డైట్ మాత్రమే తీసుకుంటాను. సో... డైట్ కూడా మార్చే అవసరం లేదు. అయితే ఎప్పటికన్నా ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటాను. అలాగే మంచినీరు క్వాంటిటీ పెంచుతాను. – కత్రినాకైఫ్ సలాడ్... హోమ్ ఫుడ్ ఎస్! హాట్ హాట్ సమ్మర్‌ని ఎంజాయ్ చేయాలంటే కూల్ కూల్ మార్పులు చేసుకుంటే సరి. నేనైతే ఈ సీజన్లో లేవగానే బొప్పాయి పండును నిమ్మరసం పిండుకుని తింటాను. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఆహారంలో చిరుధాన్యాలు, కూరగాయల వాడకం పెంచుతాను. మామూలుగా అయితే రోజూ వర్కవుట్ చేస్తా. కాని ఈ సీజన్లో పిలాటిస్, డ్యాన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడూ వాటర్ సిప్పర్ నాతోనే ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా తేలికపాటి దుస్తులు లేదా వైట్ షర్ట్, జీన్స్‌నే ధరిస్తాను. – జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -
నేను తల్లిని కావట్లేదు బాబోయ్..: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు త్వరలోనే తల్లి కాబోతోంది అంటూ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయం ఆ నోట, ఈ నోట బిపాషా వరకు కూడా వెళ్లింది. కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకున్న బిపాషా.. ఈ వార్తలను గట్టిగా ఖండించింది. ఈ విషయమై ఆమె వరుసపెట్టి మూడు ట్వీట్లు చేసింది. తాను గర్భవతిని అవ్వాలని చాలామందికి చాలా ఆత్రుతగా ఉందని, వాళ్ల ఆశాభావం బాగానే ఉంది గానీ, తనకు చికాకు కలిగిస్తోందని చెప్పింది. తాను గర్భం దాల్చాలని తొందర పడుతున్న వాళ్లను నిరాశ పర్చుతున్నందుకు సారీ అని తెలిపింది. ప్రస్తుతానికి తాము పిల్లలను కనాలని ఏమీ ప్లాన్ చేసుకోవడం లేదని, ఒకవేళ అనుకుంటే అది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తాము తమ శ్రేయోభిలాషులతో కూడా తప్పకుండా పంచుకుంటామని చెప్పింది. అయితే ప్రతిసారీ తాను గర్భవతిని అవుతున్నానంటూ గెస్ చేయడం మాత్రం సరికాదని, తాను బాగా ముక్కుసూటిగా ఉండే మనిషిని కాబట్టి ఏమైనా ఉంటే చెప్పేస్తానని అంది. అందువల్ల ఈ విషయమై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని చెబుతూ అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేసింది. The curiosity about me being pregnant...is sweet and a tad annoying. I am sorry to disappoint the ppl who are so eager for this to happen. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 We are not planning to have a baby right now.When we do plan..it will be joyous news which we will share with our well wishers then. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 The constant guessing game is tiring..as am more than straightforward person.So pls do not believe anything that gets written.Thank you all. — Bipasha Basu (@bipsluvurself) 28 March 2017 -
సిమ్ కార్డులను విసిరికొట్టిన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించిందని ఫ్యాషన్ షో నిర్వాహకులు ఆరోపించారు. ముందుగా తమ దగ్గర డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో షోలో పాల్గొనకుండా డుమ్మా కొట్టిందని వాపోయారు. ఇండియా పాకిస్తాన్ లండన్ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు తమకు ఎన్నో షరతులు పెట్టినా ఒప్పుకున్నామని చివరకు బిపాసా గైర్హాజరైందని షో నిర్వాహకులు రోణిత శర్మ రేఖీ వాపోయారు. 'బిపాసా తనతో పాటు భర్త కరణ్ ను లండన్ తీసుకురావాలని కోరడంతో ఒప్పుకున్నాం. అంతేకాదు లండన్ లో ఉండేందుకు మేఫెయిర్ హోటల్ లో ఆమెకు గదులు కూడా బుక్ చేశాం. అయితే షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు ఉండడంతో మరో ఫైవ్ స్టార్ హోటల్ లో గదులు బుక్ చేయాల్సి వచ్చింది. ఆమెకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశాం. బిపాసాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. లండన్ లో దిగిన వెంటనే రెండు లోకల్ సిమ్ కార్డులు అందజేశాం. వాటిలో ఐదు పౌండ్లు మాత్రమే రీచార్జి ఉందన్న కారణంతో సిమ్ కార్డులను మా ముఖంపై విసిరికొట్టింది. మా చుట్టూ 20 మంది ఇదంతా చూశారు. మేము ఇవన్నీ మర్చిపోయి షోకు రావాలని ఆమెను బతిమాలినా వినిపించుకోలేదు. ర్యాంప్ నడిచేందుకు ససేమీరా అంది. ఆమె కారణంగా నిర్వాహకులకు 7800 పౌండ్ల నష్టం వాటిల్లింది. దీంతో పాటు ప్రయాణ ఖర్చులకు నగదు రూపంలో ఎయిర్ పోర్టులో ఆమెకు ఇచ్చాం. ఈ డబ్బును హనీమూన్ మనీగా వాడేసుకుంది. మాకు అన్నివిధాలా నష్టం కలిగించిన బిపాసాపై పోరాడతామ'ని రోణిత వాపోయారు. ఈ ఆరోపణలను బిపాసా తోసిపుచ్చారు. 15 ఏళ్ల తన కెరీర్ లో ఎప్పుడూ అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించలేదని వివరణయిచ్చింది. -
జాన్ హ్యాండ్సమ్
→ జాన్ అబ్రహం రాత్రి తొమ్మిదింటికి నిద్రపోతాడు. ఉదయం నాలుగు Výæంటలకి లేచి ఎక్సర్సైజులు చేస్తాడు. → జాన్‌కు తల్లి మీద అభిమానం ఎక్కువ. అనుక్షణం ఆమె తన వెంట ఉండాలని కోరుకుంటాడు. → జాన్ ప్రతి 2 గంటలకు ఒకసారి భోజనం చేస్తాడు. ‘మద్రాస్ కెఫె’ చిత్రం కోసం కేరళలో షూటింగ్లో ఉండగా బ్రేక్‌ఫాస్ట్‌లో 26 ఆప్పవ్ులు తినేసేవాడు. ఏ క్షణమైనా సరే రెండు కిలోల కాజూ బర్ఫీ ఒక్క దమ్మున తినేయగలడు. → జాన్ అంటే సల్మాన్‌ఖాన్‌కు ఎందుకనో సదభిప్రాయం లేదు. → జాన్ ఆల్కహాల్ ముట్టడు. డ్రగ్స్ వాడడు. మాంసాహారం కూడా అప్పుడప్పుడే. → జాన్ ‘పెటా’ సభ్యుడు. మూగజీవాలపై హింసను వ్యతిరేకిస్తాడు. జాన్ అబ్రహం సెట్‌కు రాగానే సాధారణంగా ప్రతి డైరెక్టర్ అరిచే అరుపు– ‘జాన్... ముందు ఆ చొక్కా విప్పి పడేయ్’... ఎస్. జాన్ చొక్కా విప్పేయాలి. కండలు చూపించాలి. నలుగురిని చావబాదాలి. ప్యాకప్ చెప్పి వెళ్లిపోవాలి. ‘ఒరి వెధవా. నాక్కూడా బుర్రుందిరా. చదువుంది. జ్ఞానం ఉంది. విషయ పరిజ్ఞానం ఉంది. నన్నొక మనిషిగా చూడవా నువ్వూ.’ 1991 మే 21న రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. అందుకు కారకులెవరో తేల్చడానికి ఆ తర్వాత జస్టిస్ జైన్ ఆధ్వర్యంలో కమిషన్ నియుక్తమైంది. కమిషన్ విచారణ చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత 3000 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. దానిని ఎంతమంది చదివారో లేదో కానీ జాన్ అబ్రహం చదివాడు. రాజీవ్ గాంధీ మరణం ఒక సాధారణ మరణం కాదు. దేశాన్ని మలుపు తిప్పిన మరణం. దీనిని వార్తా పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. కాని పాపులర్ మీడియా అయిన సినిమాలో కూడా ఈ ఉదంతం రికార్డ్ చేయాలి. దీనిని సినిమాగా తీయాలి. జైన్ కమిషన్ ఆధారంగా జాన్ అబ్రహం ఈ సినిమా తీయాలనుకున్నాడు. తనే హీరోగా అంటే సినిమాలో విచారణ అధికారిగా నటించాలనుకున్నాడు. స్క్రిప్ట్ తయారైంది. స్టూడియోలకు ఎక్కే గడప దిగే గడపగా తిరగడం మొదలుపెట్టాడు. ‘ఇదేం స్క్రిప్ట్’ అని ఒకరు, ‘ఇందులో మసాలా ఏముంది’ అని ఒకరు, ‘ఇందులో నువ్వు చొక్కా విప్పవు కదా ఏం ఆడుతుంది’ అని ఇంకొకరు, ‘చివరలో నువ్వు చచ్చిపోతావా? అయితే వేస్ట్’ అని మరొకరు – ఇలా జాన్‌ను ఛీ కొట్టారు. జాన్ మాత్రం ఆ సినిమా తీయాలని పట్టుబట్టాడు. చివరకు తీశాడు. ‘మద్రాస్ కెఫే’. జాన్‌ను నిర్మాతగానే కాదు బుర్రున్న ఒక మనిషిగా, నటుడిగా కూడా ఈ సినిమా నిలబెట్టింది. అరె.. జాన్ పుట్టింది కేవలం చొక్కా విప్పడానికి కాదా అని ఒకరిద్దరు పాత డైరెక్టర్లు ఆశ్చర్యపోయారు. దీనికి ముందు కూడా జాన్‌కు బుర్ర ఉందని నిరూపితం అయ్యింది. ఒక కథ. ఏమిటంటే ఒక కుర్రాడు తన వీర్యాన్ని అమ్ముతూ ఉంటాడు. దాని వల్ల నిజ జీవితంలో సమాజ పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు అనేది చూపించాలి. దీనిని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అసలు వీర్యం అనే మాటను సినిమాలో ఎలా పలకడం. కాని జాన్ అబ్రహం ధైర్యం చేశాడు. తానే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చాడు. సినిమా తయారైంది. పేరు– ‘విక్కీ డోనర్’. చిల్లర డబ్బుతో తీసిన ఆ సినిమా కోట్లు సంపాదించింది. ఇటీవల తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ కూడా అయ్యింది. జాన్ మీద తండ్రి ప్రభావం ఎక్కువ ఉంది. ఆయన మలయాళీ. ముంబయ్‌లో ఆర్కిటెక్ట్‌గా చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. అక్కడే ఒక జొరాష్ట్రియన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. జాన్ పెద్ద కొడుకు. తల్లి అతడికి ఫర్హాన్ అనే పేరు పెట్టుకుంది. తండ్రి జాన్ అని పెట్టుకున్నాడు. చివరకు జాన్ అబ్రహంగా స్థిరపడింది. చిన్నప్పుడు జాన్ క్లాస్‌లో బుద్ధిగా చదువుకునేవాడు. చూట్టానికి బాగుండేవాడు. కాని కాలేజీ వయసుకు వచ్చేసరికి ముఖమంతా మొటిమలే. వాటిని వదిలించుకోలేక సిగ్గుపడేవాడు. అద్దం చూసుకోవడానికే భయం. కానీ తెర మీద ఎలా చూసుకోగలిగాడు? ఒకసారి ఒక సినిమా వచ్చింది. హాలీవుడ్ సినిమా. అందులో హీరో యమాగా ఉన్నాడు. తీర్చిదిద్దిన కండలతో ఉన్నాడు. మనిషి కూడా గొప్ప అందగాడు. రాకెట్ లాంచర్ పేల్చాడంటే విలన్ డెన్ తుక్కు తుక్కు కావాల్సిందే. జాన్ కాలేజీ చదువుతుండగా ఆ సినిమా వచ్చింది. వెళ్లి థియేటర్లో చూశాడు. చూశాక ఏమనిపించిందంటే ఇప్పటికిప్పుడు ఆ హీరోలా తయారవ్వాలని. హాలు నుంచి బయటకు వస్తే అరటిపండ్ల బండి కనిపించింది. వెంటనే వెళ్లి ఒక డజను పండ్లు తినేశాడు. అరటి పండ్లు తింటే కండలొస్తాయి మరి. కండలు రాలేదు కాని మనసులో హీరో కావాలనే కోరిక మాత్రం పుట్టింది. ఆ తర్వాత నిజంగానే హీరో అయ్యాడు. అందుకు అతడు ఆ హాలీవుడ్ హీరోకు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. అతడి పేరు – సిల్వర్‌స్టర్ స్టాలెన్. జాన్‌ది తండ్రి పోలిక. చూడటానికి చక్కగా ఉంటాడు. ఫొటోలకు సరిపడినట్టుగా ఆ ముక్కు ఉంటుంది. ‘గ్లాడరాక్స్’ అనే మేగజీన్ ఏదో కుర్రాళ్ల పోటీ పెడితే అందులో జాన్ పాల్గొన్నాడు. ఫొటోలు బయటికొచ్చాయి. ఒక ఏజెన్సీ వాళ్లు చూసి ‘లెవీ జీన్స్’ కోసం పేపర్ యాడ్ చేయమంటే చేశాడు. పెద్ద హిట్. ఆ తర్వాత అలాంటివే చాలా యాడ్స్ వచ్చాయి. ఫ్యాషన్ షోస్... ర్యాంప్ వాక్స్. అయితే ఏ వృత్తిలో అయినా ఆ వృత్తికి సంబంధించిన చీకాకులు ఉంటాయి. ఒకసారి ఢిల్లీలో ర్యాంప్ వాక్ ఉందని కబురు చేశారు. మరో మోడల్ డినో మోరియాతో కలిసి వెళ్లాడు. ర్యాంప్ వాక్కు సిద్ధమయ్యాక తెలిసింది అదో అండర్ వేర్ కంపెనీకి సంబంధించిన వాక్ అనీ... అండర్ వేర్ ధరించి అందరి ముందు నడవాలనీ. సిగ్గుతో చచ్చి సున్నమయ్యాడు. అయితే అలా నడిచినా సరే... అతడు గ్రీకు శిల్పంలా ఉన్నాడని మార్కులు పడ్డాయి. హాలీవుడ్లో ఆల్రెడీ ఒక కండల వీరుడు ఉన్నాడు.... సల్మాన్ ఖాన్. మరో యాక్షన్ హీరో ఉన్నాడు.... అక్షయ్ కుమార్. రొమాంటిక్ హీరోలు... షారుఖ్, ఆమిర్ ఉన్నారు. జాన్ లాంటి కొత్త హీరోలకు చోటు లేదు. కాని తను హీరో కావాలనుకున్నాడు. ఎలా? ఇండస్ట్రీలో ఏ అండా లేని వారికి భట్ కుటుంబమే అండ. మహేశ్ భట్, అతని కుమార్తె పూజా భట్ కలిసి నిర్మిస్తున్న సినిమా– ‘జిస్మ్’ (2003)లో ఛాన్స్ వచ్చింది. ఆడవాళ్లంటే పడి చచ్చే ఒక తిరుగుబోతు పాత్ర అది. ఒక వివాహితతో సంబంధం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకొనే పాత్ర. ఆ పాత్ర హిట్ అయ్యింది. అందులోని ‘జాదూ హై నషా హై’... పాట కూడా. అయితే ఆ వెంటనే వచ్చిన అవకాశాలు పెద్దగా లాభించలేదు. లాభం ఏదైనా ఉంటే అది బిపాషా బసూయే. ఆమె ‘జిస్మ్’ హీరోయిన్. అప్పుడే అయిన తాజా పరిచయం. జాన్ అబ్రహంను, బిపాషా బసును ఇండస్ట్రీలో ‘సూపర్ కపుల్’ అని పిలిచేవారు. వారి అనుబంధం, ‘లివ్ ఇన్ రిలేషన్’ ఇవాళ ఉండి, రేపు పోయేది కాదు. దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. ‘ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇక మీదట కూడా కలిసే ఉంటాం. మేం విడిపోయే సమస్యే లేదు’ అని బిపాష ఒక సందర్భంలో అంది. కాని ఆమె నమ్మకం తప్పని తేలింది. 2011లో వాళ్లిద్దరూ విడిపోయారు. ఇండస్ట్రీలో పెద్ద గోల అయ్యింది. ఎందుకు ఎందుకు... అని అందరూ ఆరా తీశారు. కాని జాన్ అబ్రహం నోరు మెదపలేదు. తన జీవితంలో 8 ఏళ్ల పాటు కలిసి జీవించిన జీవితాన్ని ఇచ్చిన స్త్రీని గౌరవించాలని అతనికి తెలుసు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇప్పటికీ. ఎక్కడా. ఆమె కూడా సంయమనం పాటించింది. చాలా మర్యాదకరంగా వారిరువురూ విడిపోయారు. ఆ తర్వాత జాన్ ఫైనాన్స్ అనలిస్ట్ అయిన ప్రియా రుచల్ను (2014)లో, బిపాషా టీవీ నటుడైన కరణ్ సింగ్ గ్రోవర్ (2016)ను వివాహం చేసుకున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్‌కు ఇదివరకే రెండు సార్లు పెళ్లయ్యిందనేది కేవలం అదనపు సమాచారం. జాన్ అబ్రహంకు బైక్ అంటే తెగ పిచ్చి. మన ఇళ్లల్లో బైక్స్ ఎప్పుడైనా గమనించారా? 100 సిసి, 125 సిసి ఇలా ఉంటాయి. జాన్ దగ్గర ఉన్న బైక్ కేవలం 1700 సిసి మాత్రమే. అలాంటి బైక్ తీసుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టని సమయంలో రాత్రి పూట అతడు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఇలాంటి బైక్ పిచ్చే అతడికి యశ్‌చోప్రా ‘ధూమ్’లో అవకాశం ఇచ్చింది. ఆ సినిమా కలెక్షన్లలో దుమ్ము రేపింది. రాత్రికి రాత్రి జాన్ పెద్ద స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ దర్వకత్వంలో వచ్చిన ‘గరం మసాలా’ (2005), నానా పటేకర్‌తో నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) జాన్‌ను బాలీవుడ్లో స్థిరమైన హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘దోస్తానా’ (2008) జాన్‌ను కథకు అనుగుణమైన పాత్రలు వేసే హీరో ఇమేజ్ వచ్చింది. దోస్తానాలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహమ్ తమ పొట్ట కూటి కోసం ‘గే’ అవతారాలెత్తి నవ్వులు పండిస్తారు. పురుషుల కండల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగి కరణ్ జోహార్ ఈ సినిమాలో జాన్‌ను అరమరికలు లేకుండా చూపించి, అభిమానులకు కనువిందు చేయించాడు. 2016లో జాన్ అబ్రహంవి 3 సినిమాలు వచ్చాయి. ‘రాకీ హ్యాండ్సమ్’, ‘డిషూమ్’, ‘ఫోర్స్ టు’. మొదటిది ఒక మోస్తరుగా ఆడినా మిగిలిన రెండు పెద్ద హిట్టయ్యాయి. ఇంకా చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హీరోగా, నిర్మాతగా, ఫుట్‌బాల్ టీమ్ యజమానిగా జాన్ చాలా పనుల్లో ఉన్నాడు. సినిమా అతడి జీవితంలో ఒక భాగం మాత్రమే. మనిషిగా బాధ్యత గల పౌరుడిగా ఉండటమే ముఖ్యమని అతడు భావిస్తాడు. జాన్ డిఫరెంట్. ఆ సంగతి కాలం గడిచే కొద్దీ అందరికీ అర్థమైంది. మిగిలిన హీరోల్లా అవార్డు ఫంక్షన్లకు వెళ్లడు. పార్టీలకు వెళ్లడు. డబ్బున్న వాళ్ల పెళ్లిళ్లకు వెళ్లి చిల్లర కోసం డాన్సులు చేయడు. పెద్దగా కాంట్రవర్సీల్లో ఇరుక్కోడు. తను.. తన పని.. అంతే. ఒకప్పుడు జాన్ వచ్చిన వెంటనే డైరెక్టర్ ‘జాన్... చొక్కా విప్పెయ్’ అనేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ వెండితెరకు కొత్త సంస్కారాన్ని కుట్టే పాత్ర కోసం జాన్‌ను ఎంచుకుంటున్నారు.జాన్– ఇప్పుడు ఒక రెస్పెక్టబుల్ హీరో.రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. రెస్పెక్ట్ ఊరికనే మాత్రం రాదు. – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
కోడిగుడ్ల కోసం అప్పు చేశా: హీరోయిన్
పెద్ద నోట్లు రద్దు చేయడంతో సామాన్యుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కష్టాలంటే ఏంటో ఒక్కసారిగా తెలిసొచ్చాయి. సాధారణంగా పది రూపాయల నోట్లతో అవసరం కూడా పడని సినిమా హీరోయిన్లకు.. 500, 1000 రూపాయల నోట్లు చెల్లవు అనేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసుది కూడా ఇదే పరిస్థితి. ఆమె కోడిగుడ్లు వండుకోవాలని అనుకుంది. కానీ ఇంట్లో గుడ్లు లేవు. పోనీ తెప్పించుకుందాం అని చూస్తే.. తన దగ్గర వెయ్యి, 500 తప్ప వేరే నోట్లు ఏమీ లేవు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితులలో తాను అప్పు చేసినట్లు బిపాషా బసు ట్వీట్ చేసింది. స్టార్‌వరల్డ్ రాకీ వద్ద నుంచి తాను డబ్బులు అప్పు తీసుకున్నట్లు చెప్పింది. ఎలాంటి రోజు వచ్చింది దేవుడా అంటూ బాధపడింది. మరోవైపు.. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యం కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రమైన గొంతునొప్పితో బాధపడుతున్నట్లు కూడా ఆమె చెప్పింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి అత్తవారింటికి ఢిల్లీ వెళ్లడంతో.. అక్కడి కాలుష్యం బారిన పడి గొంతునొప్పి తెచ్చుకుంది. తిరిగి ముంబై చేరుకునేసరికి తనకు భరించలేని గొంతునొప్పి వచ్చిందని తెలిపింది. ఢిల్లీలో బయటి పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెప్పిందీ భామ. Just borrowed money from @RockyStarWorld to buy eggs what a day! — Bipasha Basu (@bipsluvurself) 9 November 2016 Help! #delhismog ! Came back from Delhi with a horrible throat pain! It's really scary the… https://t.co/QVvjJFfGB7 — Bipasha Basu (@bipsluvurself) 8 November 2016 -
'ఇవ్వకుండానే ఇచ్చారంటే ఎలా'
బాలీవుడ్ డస్కీ బ్యూటి బిపాషా బసు మరోసారి మీడియాపై ఫైర్ అయ్యింది. బిప్స్ పెళ్లి మొదలు...ఏదో ఒక సందర్భంలో మీడియాలో వస్తున్న వార్తలు, ఈ హాట్ బ్యూటీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ల పెళ్లి సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై స్పందించిన బ్లాక్ బ్యూటీ ఈ మధ్య కాలంలో తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇలాంటి గిఫ్ట్ ఎవరిచ్చినా తాను తీసుకోనంటూ తేల్చి చెప్పింది. గిఫ్ట్ ఇవ్వకుండా ఇచ్చారంటూ ప్రచారం చేస్తే ఎలా అంటూ సీరియస్ అయ్యింది. మరి బిపాషా స్టేట్ మెంట్‌తో అయినా ఈ రూమర్స్‌కు తెరపడుతుందేమో చూడాలి. This is the biggest hogwash that I have ever read. Why would I take a gift like this ever from anyone?!?? https://t.co/Et1ccoNeUE — Bipasha Basu (@bipsluvurself) 16 June 2016 -
ఫ్యాన్స్ తో పాటు ఆమె భర్త పరీక్ష పెట్టాడు..
ముంబయి: ఇటీవల పెళ్లి చేసుకున్నారన్న వార్తలతో బాలీవుడ్ జోడీ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఏప్రిల్ 30న బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసబసు, హీరో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు కొన్ని రోజుల పాటు హనీమూన్ కు వెళ్లి, అక్కడ దిగిన ఫొటోలను నెట్ లో పెట్టి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పాపులర్ కామెడీ ఈవెంట్ 'ద కపిల్ శర్మ షో' లో నూతన దంపతులు పాల్గొన్నారు. అయితే బిపాసకు సగటు భార్య చేసే పనులు ఏవైనా తెలుసా.. లేదా అని ఆడియన్స్ ఆమెకు పరీక్ష పెట్టారు. వారితో పాటు భర్త కరణ్ కూడా ఆమెను కాస్త ఆటపట్టించాడు. ఇంట్లో ఏమేం పనులు చేస్తారని అభిమానులు అడగగా వాటికి సమాధానం చెప్పింది. ఆ తర్వాత మీ భర్త షర్ట్ కు ఎప్పుడైనా బటన్ కుట్టారా అని మరో ప్రశ్న సంధించారు. తన భర్తకే కాదు ఎవరి డ్రెస్ కు బటన్స్ కుట్టను. ఎందుకంటే స్టిచింద్ వర్క్ రాదని అసలు విషయాన్ని చెప్పింది. అభిమానుల ఇచ్చిన ఉత్సాహంతో బిపాసను కరణ్ కూడా టెస్ట్ చేశాడు. టై కట్టమని ఆర్డర్ వేయగా, బిపాస మొత్తానికి భర్తకు టై అడ్జస్ట్ చేసింది. భార్య టై కడుతున్నప్పుడు దర్జాగా హోదాలో ఉన్నట్లుగా ఫీలవుతూ కరణ్ కాసేపు నవ్వుకున్నాడు. దీంతో ఫ్యాన్స్, భర్త బిపాసకు పరీక్ష పెట్టినట్లయింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఓ స్క్రీన్ మీద కనిపించడం ఇదే తొలిసారి. -
హీరోహీరోయిన్లకు చెత్త అవార్డులు
ముంబై: 'దిల్ వాలే' నటనకు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 2016 ఘంటా అవార్డుల్లో వరస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చెత్త సినిమాగా నిలిచింది. ఏడాది కాలంలో బాలీవుడ్ లో విడుదలైన వాటిలో చెత్తవాటికి ఘంటా అవార్డులు ఇస్తుంటారు. సూరజ్ బరజాత్య దర్శకత్వం వహించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' అత్యధిక చెత్త అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన సోనమ్ కపూర్ చెత్త నటిగా ఎంపికైంది. టైటిల్ ట్రాక్ కూడా వరస్ట్ సాంగ్ గా నిలిచింది. సల్మాన్ సోదరుడిగా నటించిన నితిన్ ముఖేశ్ చెత్త సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. షాహిద్ కపూర్-అలియా భట్ సినిమా 'షాందార్'ను తెరకెక్కించిన వికాస్ బహల్ చెత్త దర్శకుడిగా ఎంపికయ్యాడు. సూరజ్ పంచోలి కొత్తగా పరిచయమైన చెత్త నటుడిగా నిలిచాడు. 'బాంబే వెల్వెట్' లో కరణ్ జోహార్ విలన్ గా నటించడాన్ని వరస్ట్ మిస్ కాస్టింగ్ గా తేల్చారు. 'అలోన్' డ్యుయల్ రోల్ చేసిన బిపాసా బసు వరస్ట్ కఫుల్ అవార్డు దక్కించుకుంది. -
హనీమూన్: రాళ్లలో, ఇసుకల్లో..
'రాళ్లలో ఇసకల్లో రాసాము ఇద్దరిపేర్లు.. కళ్ళు మూసి తిన్నగ కలిపి చదువుకో ఒక్కసారి' అని జాలీగా పడుకుంటూ హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది బిపాసా బస్సు, కరణ్ సింగ్ గ్రోవర్ జంట. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట మాల్దీవుల్లో ప్రస్తుతం హనీమూన్‌లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సముద్రం కెరటాల్లో, ఇసుక తిన్నెల్లో, సంధ్యసాయంత్రాల్లో హాయిహాయిగా గడిచిపోతున్న తమ హనీమూన్ గురించి ఎప్పటికప్పుడు ఈ కొత్త జంట సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తోంది. ఆ ఫొటోలనూ పంచుకుంటోంది. వారి డ్రీమీ ఫొటోలు అభిమానుల్ని కూడా బాగానే అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ జంట ఇసుకలో రాళ్లతో తమ పేరు రాసుకొని మురిసిపోయింది. నీలిసముద్ర తీరంలో తెల్లని గులకరాళ్లతో 'మంకీ లవ్ <3' అని రాసి ఆ వీడియోను తాజాగా బిపాసా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇంతకు మంకీ అంటే తెలియదా? 'మంకీలవ్' హ్యాష్‌ట్యాగ్‌తోనే తమ పెళ్లిఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మంకీ' అనేది ఈ జంట నిక్‌నేమ్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో బిపాసా అందమైన హనీమూన్ ఫొటోలను, హాట్ బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
'హనీమూన్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటా'
హనీమూన్ ఎలా చేసుకుంటే మీకెందుకని కొత్త పెళ్లి కూతురు బిపాసా బసు రుసరుసలాడుతోంది. ఎవరి లైఫ్ తో వాళ్లు సంతోషంగా ఉంటే మంచిది సలహా కూడా ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే... భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బిపాసా హనీమూన్ కు వెళ్లింది. అక్కడితో ఆగకుండా మేమంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూడంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిపై నెగెటివ్ కామెంట్లు రావడంతో కొత్త పెళ్లి కూతురికి కోపం వచ్చింది. తమ ఫొటోలపై కొంతమంది చేసిన కామెంట్లు హాస్యాస్పదంగా ఉన్నాయని ఈ బెంగాలీ బ్యూటీ మండిపడింది. 'ఇలాంటి కామెంట్లు చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తారో తెలియదు. నేను పోస్ట్ చేసిన ఫొటోల్లో బ్యూటీఫుల్ టవల్ ఆర్ట్ ను ఎందుకు గుర్తించరు. హౌస్ కీపింగ్ ప్రతిభకు టవల్ ఆర్ట్ అద్దం పడుతోంది. ఏదీ మారాలి. నాకు పెళ్లైంది కాబట్టి టవల్ ఆర్ట్ ను ఇష్టపడకూడదా? ఇది హాస్యాస్పదం. ఇతరుల జీవితాల్లో తప్పులు వెదికొద్దు. మీ జీవితంతో మీరు సంతోషంగా ఉండండి. మరిన్ని టవల్ ఆర్ట్ ఫొటోలు పోస్టు చేస్తా. ఎందుకంటే ఐ లవ్ ఇట్. ఇలాంటి ప్రతిభను అభినందించే వాళ్లు చాలా మంది ఉన్నారని భావిస్తున్నానని' బిపాసా క్లాస్ పీకింది. -
హనీమూన్: నా భార్య దేవత అంటున్న హీరో
'నా భార్య దేవత' అంటూ బాలీవుడ్ నటి బిపాషా బస్సును ఆమె భర్త కరణ్‌సింగ్ గ్రోవర్ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ కొత్తజంట ఇప్పుడు హనీమూన్‌లో మునిగితేలుతోంది. అందమైన సముద్రతీరమైన మాల్దీవుల్లో తమ వైవాహిక జీవితపు తొలినాళ్లను ఎంజాయ్ చేస్తున్నది. సముద్ర ఒడ్డున ఇసుకలో తమ హనీమూన్ సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నది ఈ జంట. తాజాగా కరణ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భార్య బిపాషా ఫొటోను పెట్టి.. 'నా భార్య దేవత. నేను అదృష్టవంతుడిని కాక మరేమిటి' అంటూ కామెంట్ పెట్టాడు. దీనిని రీపోస్టు చేసిన బిపాషా.. 'థాంక్యూ హాటీ.. బోథ్ గాట్ లక్కీ' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందమైన సముద్రం ఒడ్డున హనీమూన్‌లో సేదదీరుతున్న ఈ జంట తమ అనుభూతులకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పడు అభిమనులతో పంచుకుంటున్నారు. -
ఇక ఎలోన్ కాదు
శుభముహూర్తంలో చేసే పనులన్నీ శుభంగా జరుగుతాయంటారు. బహుశా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ముహూర్తం బాగుండి ఉంటుంది. ఎందుకంటే ఇక ఎప్పటికీ వాళ్లు ఎలోన్ కాదు. జాన్ అబ్రహాంతో సహజీవనం చేసి, విడిపోయాక బిపాసా ఒంటరి జీవితం గడిపారు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్ నుంచి విడిపోయి, జెన్నిఫర్ వింగెట్‌ను పెళ్లి చేసుకుని, ఆమె నుంచి విడాకులు తీసుకుని కరణ్ కూడా ఎలోన్‌గా మిగిలిపోయారు. ఈ ఒంటరితనమే బిపాసా, కరణ్‌లను దగ్గర చేసి ఉంటుంది. త్వరగానే ప్రేమలో పడ్డారు. అంతే త్వరగా విడిపోతారని చాలామంది ఊహించారు. కానీ, తమ బంధం చాలా గట్టిదని నిరూపిస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముంబైలో వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట రిసెప్షన్‌కి మాత్రం అందర్నీ ఆహ్వానించారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్, సుస్మితాసేన్, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా, జెనీలియా, ఆమె భర్త రితేష్, మాధవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నట్లు.. బిపాసా బసు తెలుగులో ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. -
నవ దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీల విషెష్
ముంబై: నవ దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసులకు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. కరణ్-బిపాసా శనివారం సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అదే రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు సినిమా తారలు హాజరయ్యారు. రిసెప్షన్ కు వెళ్లలేకపోయిన వారు ట్విటర్ ద్వారా విషెష్ చెప్పారు. ప్రియాంక చోప్రా: కంగ్రాట్యులేషన్స్ బిపాసా-కరణ్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. మీకు వివాహ శుభాకాంక్షలు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలిసుండాలని ఆకాంక్షిస్తున్నాను. అభిషేక్ బచ్చన్: బిపాసా-కరణ్ లకు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఒక్కటవడం ఆనందదాయకం. వివాహితుల క్లబ్ లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా. శిల్పాషెట్టి: పరస్పర విశ్వాసం, ప్రేమ, స్నేహం, సెలబ్రేషన్ తో బిపాసా-కరణ్ వైవాహిక జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. మధు బండార్కర్, షమితా షెట్టి, ఫరాఖాన్, విశాల్ పాండ్యా, రమేశ్ తౌరణి తదితరులు బిపాసా-కరణ్ దంపతులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
మాజీ భర్తకు పెళ్లి విషెష్ చెప్పిన నటి
తన మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లిపై బాలీవుడ్ నటి జెన్నిఫర్ వింగెట్ మౌనం వీడింది. హారర్ క్వీన్ బిపాసా బసును పెళ్లాడబోతున్న కరణ్ కు ఆమె విషెస్ చెప్పింది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది. బిపాసా, కరణ్ శనివారం(ఏప్రిల్ 30) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాసా-కరణ్ పెళ్లి గురించి జెన్నిఫర్ ను అడగ్గా... 'ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనసులు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వారికి దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమ అనేది ఓ అద్భుతం. ఎవరిపైన అయిన మనకు ప్రేమ పుడితే అది గొప్ప విషయమే' అని బదులిచ్చింది. కాగా, జెన్నిఫర్ ను పెళ్లి చేసుచేసుకుని తప్పు చేశానని కరణ్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన అతడు ఇప్పుడు బిపాసాతో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యాడు. -
పెళ్లి గురించి అడిగితే మైక్ విసిరికొట్టిన హీరో
ప్రేమలు పలు విధములు. వ్యక్తీకరణలు(ఎక్స్ ప్రెషన్స్) బహువిధములు. మనసు దోచిందనో, మాయ చేసిందనో, మోసంతో వంచన చేసిందనో లేక విధికి తలవంచి వీడిపోయిందనో.. మాజీ ప్రియురాళ్లపై ప్రియులు లేదా మాజీ ప్రియులపై ప్రియురాళ్లు అప్పుడప్పుడూ నోరుపారేసుకోవటం లేదంటే ఆగ్రహం వ్యక్తం చేయటం(నిజానికి ఇవి కూడా ప్రేమ వ్యక్తీకరణలే) లాంటివి చేస్తుంటారు. ఇప్పడు వంతు బాలీవుడ్ హ్యండ్సమ్ హీరో జాన్ అబ్రహామ్ ది. ఏళ్లకిందటే ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్(వైవాహికంగా) అయిపోయిన జాన్.. మాజీ ప్రేయసికి సంబంధించిన ప్రశ్నను ముల్లులా భావించాడు. 'బిపాషా బసూ పెళ్లి చేసుకోబోతోందికదా.. మీ అభిప్రాయం ఏమిటి?' అని అడిగిన పాపానికి విలేకరిపై అంతెత్తు ఎగిరిపడ్డాడు. కోపంగా మైక్ విసిరికొట్టి, ఆగ్రహంతో వెళ్లిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన జరిగింది. హీరో ప్రదర్శించిన అసహనం అఅక్కడున్న కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొంత మంది మాత్రం 'ప్రేమ పలు విధములు.. వ్యక్తీకరణలు బహువిధములు..' అనుకున్నారట! 'డ్రీమ్ కపుల్'గా ముద్రపడ్డ జాన్ అబ్రహాం, బిపాషా బసులు తొమ్మిదేళ్లపాటు డేటింగ్ చేసి, ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జాన్ అబ్రహాం.. తన స్నేహితురాలు ప్రియా రాంచల్ను ప్రేమ వివాహం చేసుకోగా, ఇప్పుడు బిపాషా తన సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి పెళ్లాడబోతుంది. ఏప్రిల్ 30వ తేదీన వీరి వివాహం జరుగనుంది. వివాహానికి సంబంధించిన వేడుకల్లో మునిగి తేలుతుంది పెళ్లికూతురు. మొహమాటానికైనా జాన్‌కు ఇన్విటేషన్ పంపలేదట బిపాషా బసు. ఇదిలాఉంటే బిప్స్ మరో మాజీ ప్రేమికుడు డినోమారియా మాత్రం 'తను పిలవకపోయినా బిపాషా పెళ్లికి వెళతాను'అని మరో తరహా ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
పిలువకున్నా పెళ్లికెళ్తానంటున్న బాయ్ ఫ్రెండ్!
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు, టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ల వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మరో 17 రోజుల్లో నా వివాహం అంటూ పేద్ద లవ్ కోట్‌ను కూడా బిపాసా గురువారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒక్క జాన్ అబ్రహంతో తప్ప తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరితోనూ ఇప్పటికీ మంచి రిలేషన్‌ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. ఈ వివాహా ఉత్సవానికి వీరిని ఆహ్వానించి కరణ్ మనసు నొప్పించాలనుకోవడంలేదట. అయినప్పటికీ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ డినో మోరియా మాత్రం పెళ్లికి వెళ్తానని మంకు పట్టు పడుతున్నాడు. బిప్స్ పిలువకపోయినా సరే వెళ్లి ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెప్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుందో ఏమో బిపాసానే డినోను ఆహ్వానించినట్లు తెలిసింది. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలకు వెళ్లడానికి డినో ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ నందితా మెహతాని కూడా సిద్ధమౌతోందట. కరణ్ సింగ్ గ్రోవర్ కూడా తన ఈ మూడో పెళ్లి వేడుకలకు అతని మాజీ భార్యలైన శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ వింజెట్లను ఆహ్వానించడం లేదటలెండి. -
ముందు రిసెప్షన్, తర్వాత పెళ్లి
బాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్టు ఉంది. అసిన్, ప్రీతి జింటా, ఊర్మిళ.. ఇప్పుడు బిపాసా బసు. గత కొన్ని రోజులుగా బిపాసా బసు.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లాడబోతుందంటూ వినిపించిన వార్తలు త్వరలో నిజం కానున్నాయి. బిపాసా, కరణ్‌ల వివాహం ఏప్రిల్ 30వ తేదీన జరుగనుందని అధికారిక సమాచారం. అయితే పెళ్లి వధూవరులకు అత్యంత సన్నిహితులైనవారి మధ్య జరగనుంది. 2015లో రిలీజ్ అయిన హారర్ సినిమా 'ఎలోన్'లో కలిసి నటించినప్పటి నుంచి బిపాసా, గ్రేవర్ డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అప్పటి నుంచి వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 28న మెహందీ ఫంక్షన్, 29న రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులను, స్నేహితులను ఆహ్వానించనున్నారు. పెళ్లికి మాత్రం అత్యంత సన్నిహితులే హాజరయ్యే అవకాశం ఉంది. కాగా బిపాషా పెళ్లి వార్త తెలియగానే మరో బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్నేహితురాలికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. I'm truly so happy for my friend @bipsluvurself n her handsome bridegroom to be @Iamksgofficial Ure a golden heart..u deserve so much n more — PRIYANKA (@priyankachopra) 7 April 2016 -
స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట
బాలీవుడ్‌కు ఇది బ్రేకప్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ నుంచి కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీకి అనుష్కా శర్మ దూరమై, వార్తల్లో నిలిచారు. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా కూడా తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. విడిపోయాం కానీ, విడాకులు తీసుకోలేదని ఇద్దరూ పేర్కొన్నారు. ఈ బ్రేకప్ లిస్ట్‌లో ప్రేమపక్షులు కరణ్‌సింగ్ గ్రోవర్-బిపాసా బసులు కూడా ఉంటారని చాలా మంది భావించారు. గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరి లవ్ లైఫ్‌లో కూడా ఏవో చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు వచ్చాయి. బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్‌తో వివాహబంధాన్ని తెంచుకున్న కరణ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం, అది కూడా బిపాసా బసును పెళ్లాడటం అతని తల్లికి ఇష్టం లేదని టాక్. ఒకవేళ బిప్స్‌ని పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పారట కూడా. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పెళ్లి కష్టమేనని చాలా మంది అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా కరణ్ గ్రోవర్- బిప్స్ తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో బెంగాలీ స్టయిల్లో వచ్చే నెల 29న వీళ్లిద్దరి పెళ్లి జరగనుందట. ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఈ పెళ్లి జరగనుందని భోగట్టా. రిసెప్షన్‌కు మాత్రం సినిమా రంగానికి చెందినవారిని ఆహ్వానించారట. -
పెళ్లి వార్తలపై స్పందించని హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు తన బాయ్‌ఫ్రెండ్, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించలేదు. ఏడాదిగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బిపాసా, కరణ్‌కు నిశ్చితార్థం అయిందని, ఏప్రిల్ 30న ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన బిపాసాను మీడియా ప్రతినిధులు పెళ్లి విషయంపై ప్రశ్నించగా.. పెళ్లి ఎప్పుడు జరిగితే, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పింది. కాగా కరణ్ గతంలో రెండు వివాహాలు చేసుకున్నాడు. -
ఏప్రిల్ 30నే ఆమె పెళ్లి?
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ప్రియుడు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ముంబైలో ఓ ప్రముఖ హోటల్లో పెళ్లాడబోతున్నట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. కరణ్ తల్లి ఈ డస్కీ బ్యూటీని కోడలుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వారి వివాహ తేదీ, వేదికలను ధ్రువీకరించినట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 30న ముంబైలోని సబర్మన్ హెటల్లో అంగరంగ వైభవంగా జరగనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు అందరూ పెళ్లిబాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సొట్టబుగ్గల సుందరి, ప్రీతి జింటా, ఊర్మిళ పెళ్లిచేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇపుడు బిపాసా కూడా నెలరోజుల్లోనే రియల్ లైఫ్‌లో పెళ్లికూతురుగా అవతరించబోతోందన్నమాట. ఇటీవల బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమ్యాయి. వాళ్లిద్దరికి ఎంగేజిమెంట్ కూడా అయిపోయిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో బిపాసా, కరణ్‌ల వ్యవహారం పెళ్లిపీటల వరకు వెళ్లిందని బీ టౌన్ లో వార్తలు హల్చల్ చేశాయి. ప్రియుడి పుట్టిన రోజును గోవాలో సెలబ్రేట్ చేసిన భామ ఆ ఫొటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఇవన్నీ గాసిప్స్ అని బిపాసాబసు గతంలో కొట్టిపారేసింది. ఈ వ్యవహారాన్ని హాట్ టాపిక్‌గా మార్చొద్దంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులను రిక్వెస్ట్ చేసింది. కాగా కరణ్ సింగ్ గ్రోవర్ ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొన్నాడు. మరి ఈ సస్సెన్స్‌కు తెరపడాలటే... బిపాసా బసు నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.