Controversial comments
-
మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా
రామచంద్రపురం: స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ‘‘భవిష్యత్ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. ఆది నుంచీ వివాదాస్పదమే.. సీఐ అశోక్ కుమార్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్ కుమార్ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
నావల్లనే ప్రాబ్లమ్ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్‌బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है। ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024 -
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని, దాన్ని నిర్మూలించాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకుగానూ స్థాలిన్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా యన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్దతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు.‘మహిళలను చదువుకోవడానికి అనుమతించ లేదు వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను’ అని ఉదయనిధి పేర్కొన్నారు. -
ఇంకా సద్దుమణగలేదు!
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. ఈ మేరకు కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాష నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేష్, నాని, విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. నాగార్జున పరువునష్టం దావా..మంత్రి సురేఖపై సినీనటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... సీఎం రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
ఎందుకీ సుద్దపూస కబుర్లు.. ఆ విషయం మర్చిపోయావా రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా ఉంది. ఆయన కొంతమంది జర్నలిస్టులను ఉన్మాదులుగా పోల్చడం బాగోలేదు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలలో పనిచేస్తున్నకొందరు పాత్రికేయులు ఉన్మాదంగా మారి ప్రెస్ మీట్లలో లేదా జరుగుతున్న కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలలో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్ని చోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాలలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా కొందరు పాత్రికేయులు అడిగే ప్రశ్నలు, ఇచ్చే కథనాలు ఆయనకు నచ్చకపోవచ్చు. లేదా కొన్ని పత్రికలపట్ల ఆయనకు వ్యతిరేకత ఉండవచ్చు. అంతమాత్రాన వారిని ఉన్మాదులతో ఎలా పోల్చారో అర్ధం కాదు.రాజకీయ నేతల భాష గురించి పక్కనబెట్టి, పాత్రికేయుల భాష గురించి హితవు చెప్పిన రేవంత్ ఇలా మాట్లాడడం సమంజసమేనా అన్నది చూడాలి. అలా అని మీడియా అంతా వృత్తి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పడం లేదు. ఏ రంగంలో అయినా అన్ని రకాలవారు ఉంటారు. అలాగే జర్నలిజంలో కూడా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు పత్రికలు స్థాపించడం గురించి రేవంత్ ప్రస్తావించారు. గతంలో వామపక్షాలు పత్రికలు పెట్టుకున్న విషయాన్ని చెప్పి వాటిలో పనిచేసే జర్నలిస్టులను గౌరవంగానే మాట్లాడారు. బహుశా ఒక వామపక్షం తమకు మిత్రపక్షంగా ఉన్నందున ఆయన జాగ్రత్తపడి ఉండవచ్చు. పైగా ఒక సిపిఐ నేతకు పదవి కూడా ఇచ్చారు.మిగిలిన మీడియా సంస్థలలో ఏవి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నవో ఆయన వివరించలేదు కాని, ప్రధానంగా ఆయన ఆగ్రహం అంతా బీఆర్ఎస్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక గురించి అయి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్ల గురించి అయి ఉండాలి.బీజేపీ మీద కంటే ఆయన దృష్టి అధికంగా బీఆర్ఎస్ మీదే ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. రాజకీయ నాయకులకు సహజంగానే తమపై నెగిటివ్ వార్తలు రాసే పత్రికలన్నా, సంబంధిత జర్నలిస్టులన్నా కాస్త కోపమే ఉంటుంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ మీడియానే లేదనట్లుగా ఆయన మాట్లాడడం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధిక మీడియా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లే లెక్క. వెలుగు దినపత్రిక యజమాని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేనే. ఆ యజమాని కుటుంబం తొలుత కాంగ్రెస్ తదుపరి బీఆర్ఎస్, ఆ పిమ్మట బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. వారు ఎటు ఉంటే దానికి అనుగుణంగా మీడియాలో కొంతవరకు వార్తలు ఇచ్చే మాట నిజమే.అలాగే ఇతర పార్టీలకు కొంత వ్యతిరేకం అనిపించే స్టోరీలు ఇస్తుండవచ్చు. అంతమాత్రాన అది ఉన్మాదం అయిపోతుందా?. ఏ మీడియా అయినా వాస్తవాలు రాయాలని చెప్పాలి. ఒకవేళ పనికట్టుకుని అసత్యాలు రాస్తే ఖండనలు ఇస్తారు. మరీ తీవ్రమైన స్థాయిలో కల్పిత గాధలు రాస్తే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవడం కొత్త కాదు. కొందరు మీడియా యజమానులు కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం, ఆ పార్టీల ద్వారా ప్రయోజనాలు పొందడం, వారు ఆశించిన పని జరగకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇదీ చదవండి: మరకే మంచిదంటున్న చంద్రబాబు!వారిలో ఒకరిద్దరితో ఈయనకు సత్సంబంధాలే ఉన్నాయని అంటారు. అందరూ అలా చేస్తున్నారని కాదు. మీడియా రంగంలో ఒకప్పుడు కొంతైనా నిష్పక్షపాతంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కాని రానురాను, అవి తమకు నచ్చిన పార్టీలను భుజాన వేసుకుంటుండంతో రాజకీయ పార్టీలు, లేదా నేతలు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. వామపక్షాలైన సిపిఐ, సిపిఎం లకు ఎప్పటి నుంచో పత్రికలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. తెలుగులో కూడా కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి కొన్ని పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ మాజీ ఎంపీ కెఎల్ ఎన్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి పత్రికను స్థాపించారు. మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.చంద్రశేఖరరెడ్డి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలను నిర్వహించారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రికకు సారధ్యం వహిస్తున్నారు. ఉదయం పత్రికను స్థాపించిన దాసరి నారాయణరావు తదుపరి కాంగ్రెస్ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. "వార్త పత్రిక యజమాని గిరీష్ సంఘీ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఈనాడు దినపత్రికను జలగం వెంగళరావు సహకారంతో ఆరంభించారు. ఆ తర్వాత కాలంలో ఆయన తనది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పడం విశేషం. తొలుత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాక చంద్రబాబును భుజాన వేసుకున్నారు.దీనితో పాటు మరో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా కొత్త యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు అనుకూల పత్రికగా మారింది. ఈ రెండు పత్రికల ఎజెండాను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు కూడా పత్రిక ఉండాలని భావించి తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, టివిలను ఆరంభించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ బొమ్మను సాక్షి పత్రిక, టివిలలో ప్రముఖంగా వేసుకుని నడుపుతున్నారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగు దేశం జెండా గుర్తు వేసుకోకుండా లేదా చంద్రబాబు మద్దతు దారులమని ప్రకటించకుండా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టు ఇస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులపై ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై నీచమైన స్థాయిలో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుంటాయి.చంద్రబాబుకు భజన చేసుకుంటే పర్వాలేదు కాని వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్మాదంగా వైఎస్సార్సీపీపై అధికారంలో ఉన్నప్పుడే కాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా అదే ధోరణిలో వెళుతున్నాయి. చిత్రం ఏమిటంటే ఈ రెండు మీడియాలు మరికొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్‌కు, ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమిని భుజాన వేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఈ మీడియాల యజమానులతో రేవంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియా అధిపతి వద్దకు స్వయంగా రేవంత్ వెళ్లి వినయంగా వ్యవహరించిన ఘట్టం విమర్శలకు గురి అయ్యింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక టివి, చానల్ రేవంత్ అనుచరుడిది అని చెబుతారు. నిజానికి రేవంత్ పైకి వచ్చింది మీడియా సహకారంతో అన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆయన మీడియాకు సుద్దులు చెప్పే దశకు చేరుకున్నారు .ఆలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక యూ ట్యూబ్ చానల్ లు నిర్వహించడం ...అప్పట్లో కేసిఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కధనాలు నడపించడంతో పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు .ప్రధాన మీడియా అయినా, యూ ట్యూబ్ చానల్ లు అయినా తమ పరిధులలో ఉండాలని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కాని చంద్రబాబు ,రేవంత్ రెడ్డి వంటి నేతలు తాము అధికారంలో ఉంటే మీడియా ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండాలని కోరుకోవడంతోనే సమస్యలు వస్తాయి.గత కేసిఆర్ ప్రభుత్వం సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టిన మాట నిజమే. అందువల్ల ఆయనకు అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు రేవంత్ అలాంటి అంక్షలు లేవని అనడం ఆహ్వనించదగ్గదే. కాని కొంత మంది జర్నలిస్టులపై ఉన్మాద ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్మాద పత్రికల యజమానులతో ఆయన స్నేహ సంబంధాలు నడుపుతున్న విషయం మర్చిపోవద్దు.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. స్మితా సబర్వాల్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పూజా ఖేద్కర్ వ్యవహారం నేపథ్యంలో.. దివ్యాంగులపై ఆ మధ్య ఆమె చేసిన ఎక్స్ పోస్టులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌లను తొలగించాలని, దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తేలుస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ఊరట లభించినట్లైంది.గతంలో స్మిత సబర్వాల్ ఏం మాట్లాడారు?ఈ ఏడాది జులై నెలలో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా అని పేర్కొన్నారు.సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. -
బొలిశెట్టి నోటి దురుసు.. మళ్లీ అల్లు అర్జున్‌పై కామెంట్స్
పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్‌కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు. -
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?.... ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.సాక్షితో స్మితా సబర్వాల్ఇదిలా ఉంటే.. తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె. -
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు
గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post -
మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో విద్వే షం, ఉగ్రవాద శక్తులను శాంతి సామరస్యా లు ఓడించాలని ఆకాంక్షించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీటైన సమాధానమిచ్చారు. ‘చౌదరి సాహిబ్, నేను, మా దేశ ప్రజలకు సమస్యల్ని పరిష్కరించుకునే సమర్థత ఉంది. మీ ట్వీట్ అవసరం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. మీ దేశం సంగతి చూసుకోండి. ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న పాకిస్తాన్ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోం’అని హెచ్చరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అభిప్రాయాలపై చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందించారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులతో సంబంధంలేదు. పాక్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. మెరుగైన సమాజం కావాలనే ఎవరైనా కోరుకుంటారు’అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై బీజేపీ స్పందించింది. ‘ఆప్ నేత అవినీతి రాజకీయాలకు పాక్ నుంచి కూడా వంతపాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ పాక్ నుంచి స్పందిస్తుంటారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్ అంటకాగుతున్నారనడానికి ఇదే రుజువు’ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పేర్కొన్నారు. -
నేను గెలుస్తానో లేదో..
సాక్షి,విశాఖపట్నం/పాలకొండ/వీరఘట్టం: విశాఖ ఎన్నికల సభలో జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. యువత గుండెల్లో నిప్పంటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడు కూడా గుర్తుకు రాడంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని.. పదవి వస్తుందో రాదోనని కూడా అనుమానం వ్యక్తంచేశారు. తాను నటుడిని కాకపోతే సాయుధ పోరాటంలోకి వెళ్లేవాడినన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అంతా అవగాహన చేసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలని, అందుకే తాను గత ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో ఓడిపోయినా బాధపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, ఆయనలో ఏముందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి జగదాంబ జంక్షన్లో కూర్చోబెడతానని, తొక్కేస్తానని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకపక్క ఆవేశంతోను, మరోవైపు నిర్వేదంతో ప్రసంగించిన పవన్ చెప్పిన అంశాలనే పదేపదే ప్రస్తావించి సభికులకు బోరు తెప్పించారు. పవన్ వచ్చిన కాసేపటికే జనం తిరుగు ముఖంపట్టారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపెద్ద పోస్టర్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. -
బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రభుత్వం అతి పెద్ద గూండా! అది వైఎస్సార్ సీపీ అయినా.. టీడీపీ ప్రభుత్వమైనా అంతే..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విశాఖ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్. ఈయన నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు కూడా. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రభుత్వంతో పని చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ పోట్లాడలేరు. చేసిన పనులకు బిల్లు పెండింగులో ఉంటే కోర్టు కెళ్తే వస్తుందనుకుంటున్నారా? రాదు.. వెయ్యి కండిషన్లు పెడతారు. ఏదో లోపం వెతుక్కుంటూ పోతారు. అందుకే ప్రభుత్వాలపై నాకు నమ్మకం కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టే వారి దగ్గరకే ఎక్కువ మంది జనం చేరతారన్నారు.‘ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలన్నా.. వారికి చేరువకావాలన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కార్యకర్తలు రాజకీయ నాయకుడి దగ్గరకు విద్య, వైద్య, ఆరోగ్య అవసరాల కోసం వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అంటూ వస్తారు. నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను’ అని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా పోటీ చేయాలని ఎంచుకున్నట్లు చెప్పారు. ఎంపీ అయితే డబ్బుల విషయంలో నేరుగా జోక్యం(డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్) ఉండదన్నారు. ఎంపీ అభ్యర్థయితే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదని, తన లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థులే అవన్నీ భరిస్తారని కుండబద్దలు కొట్టారు.ఇప్పటికే శ్రీభరత్ ఎన్నికల ఖర్చుల విషయంలో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులపైనే భారాన్ని మోపారన్న విషయం తేటతెల్లమవుతోందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కోట్లకు అధిపతి అయిన శ్రీభరత్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యతను తమపైకి నెట్టేయడమేమిటని అసెంబ్లీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. మొత్తం మీద శ్రీభరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. -
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
Kolkata: ‘దీదీ’పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీపై బీజేపీ నేత దిలీప్‌ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మమత గోవా వెళ్లి గోవా బిడ్డనంటుంది. త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి’ అని ఘోష్ వ్యాఖ్యానించారు.ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో దుర్గా మాతపై, ఇప్పుడు మమతా బెనర్జీపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. కాగా, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వాడిన ‘బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్’ నినాదం బాగా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం సాధించింది. ఇదీ చదవండి.. అందుకే వరుణ్‌గాంధీని బీజేపీ పక్కకు పెట్టింది -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించిన ఆయన వేసిన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది కోర్టు. ఆ సమయంలో ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలా మాట్లాడడం ఏంటని? ప్రశ్నించింది. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలపై నమోదైన కేసులన్నింటిని(ఎఫ్ఐఆర్)లను ఒకే చోట విచారించేందుకు అనుమతించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. స్టాలిన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్.. ఉదయనిధి స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19(1)(a)ను(వాక్ స్వాతంత్ర్యం-భావ వ్యక్తీకరణ) మీరే అగౌరవపర్చుకున్నారు. అలాగే.. ఆర్టికల్ 25(మత స్వేచ్ఛా హక్కు)ను కూడా మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు.. మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32( తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం) ప్రకారం కోర్టును ఆశ్రయిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియందా?.. మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మందలించింది ధర్మాసనం. ఎఫ్ఐఆర్లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి బెంచ్ సూచించింది. అయితే.. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పటికే ఆయా హైకోర్టులను ఆశ్రయించామని.. గతంలో ‘‘అమిష్ దేవగన్, అర్నాబ్ గోస్వామి, నుపూర్ శర్మ, మొహమ్మద్ జుబెర్’’ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరట ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను పరిశీలిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఏమన్నారంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీలతో పోల్చిన జూనియర్ స్టాలిన్, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు రాజకీయంగా బీజేపీ.. ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. తనపై విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని.. సమాజంలో దుష్టశక్తులెన్నో పెరిగిపోవడానికి సనాతన ధర్మం ఒక కారణం అవుతోందనే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు.. న్యాయపరమైన పోరాటానికి తాను సిద్ధం అంటూ ప్రకటించారాయన. -
నాకు ఓటేయకుంటే తిండి మానండి
ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి. -
జస్టిస్ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ దొనడి రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇలాంటి అసంబద్ధ, పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈమేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏం జరిగిందంటే...? మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేశ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా..? రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణను గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకోవాలంటూ (రెక్యూజ్) జస్టిస్ రాకేష్ కుమార్‌ను కోరింది. ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బ తిన్నది. తనను విచారణ నుంచి తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ రాకేష్ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలీజియంపై తీవ్ర వ్యాఖ్యలు సర్వ సాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీల తీర్పు వెలువరుస్తూ మిషన్ బిల్డ్‌పై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించని అంశాలతోపాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, వెబ్సైట్లలో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్రెడ్డి గురించి తనకు తెలియదని, తరువాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ ఓ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్‌లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఈ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవీ విరమణ చేసి ఇంటికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనను పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ‘సుప్రీం’ విస్మయం.. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళనకు గురి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. సుప్రీంకోర్టు కొలీజీయంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనపరంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వివాదాస్పదుడు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయమూర్తిగా మారిన జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందారు. బిహార్ మహాదళిత్ వికాస్ మిషన్ ఫండ్ నిధుల విషయంలో ఐఏఎస్ అధికారి రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. అయితే కింది కోర్టు రామయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుబడుతూ సుమోటోగా విచారణ జరిపారు. తాను బెయిల్ నిరాకరించిన వ్యక్తికి కింది కోర్టు బెయిల్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. పాట్నా హైకోర్టులో అవినీతి బహిరంగ రహస్యమంటూ ఓ తీర్పే రాశారు. అవినీతి విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ తీరును పాట్నా హైకోర్టు న్యాయమూర్తులందరూ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాహీ నేతృత్వంలో 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పును రద్దు చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ తీరుపై ఆ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను కేసుల విచారణ బాధ్యత నుంచి తప్పించారు. అటు తరువాత సుప్రీంకోర్టు జస్టిస్ రాకేష్‌ను 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నమంటూ రభస ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాక కొద్ది రోజులు మౌనం పాటించిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తరువాత నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హెబియస్ కార్పస్‌పై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛినం జరిగిందంటూ విచారణ చేపట్టారు. పలు సందర్భాల్లో డీజీపీని ఆక్షేపించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై తీర్పు రాసే అవకాశం కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మిషన్ బిల్డ్ కేసును ఎంచుకున్నారు. బహుమానంగా ఎన్సీఎల్ఏటీ పదవి.. పదవీ విరమణ అనంతరం జస్టిస్ రాకేష్ కుమార్‌కు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జుడీషియల్ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఎన్సీఎల్ఏటీ పదవి దక్కిందన్నది న్యాయవ్యవస్థలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్సీఎల్టీలో కూడా ఆయన వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఉల్లంఘించారు. తనకు కావాల్సిన విషయం విచారణ చేపట్టారు. ఫినోలెక్స్ కేబుల్ వార్షిక సర్వసభ్య సమావేశం ఫలితాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనపై కన్నెర్ర చేసి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాకేష్ కుమార్ తీరు వల్ల ఎన్సీఎల్ఏటీ కుళ్లిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ బాగోతం దేశమంతా తెలిసిపోవడంతో గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జుడీషియల్ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు.