General Elections 2024
-
డేటా మటాష్.. స్లిప్‌లు ‘బర్న్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలి తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచిన బాక్సు తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే ఉంది. బ్యాటరీ స్టేటస్‌పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీ– వెరిఫికేషన్ ప్రక్రియలో.. కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజూ అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చిచెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని (ఎరేజ్).... అంతేకాకుండా వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని, రీ–వెరిఫికేషన్ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడటం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీ–వెరిఫికేషన్‌లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రస్తుత టెక్నికల్ నిబంధనల్లో (ఎస్వోపీ) బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి అభ్యర్థి బెల్లాన నిరాకరించినందున మంగళవారం పరిశీలన జరగలేదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.21 రోజుల తరువాత 99 శాతం బ్యాటరీ స్టేటస్..విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకూ మాక్ పోలింగ్ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్ పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం స్టేటస్ చూపించింది. అంటే 20 శాతం తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం చూపించడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్ల లెక్కింపుతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈవీఎంకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50 శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. పోలింగ్ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం తెరచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబర్ 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ తెలియచేయాలని, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చి లెక్కించాలని, ఆయా పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్‌ను కోరారు. అందుకు అవసరమైన రుసుము వారిద్దరూ చెల్లించారు. అయితే దీని పరిశీలనకు నెల్లిమర్ల ఈవీఎం గోదాం వద్దకు వెళ్లగా... ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని బెల్లానకు అధికారులు వివరించారు. దీంతో ఆయన రీ–వెరిఫికేషన్‌కు నిరాకరించారు.డేటా అంతా ఖాళీయే...ఫిర్యాదుదారులు కోరినట్లు వెరిఫికేషన్ చేయడానికి వీలుకాదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని (ఎరైజ్), వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని అధికారులు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకూ భద్రపరచాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ ఈవీఎంల్లో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులను అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.బ్యాటరీ స్టేటస్ గుట్టు రట్టు...వెరిఫికేషన్ కోరిన పెదకాద పీఎస్ నంబర్ 20కు సంబంధించిన ఈవీఎంను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బయటకు తీసి దానికి సంబంధించిన బ్యాటరీని అధికారులు సీజ్ చేశారు. ఆ బ్యాటరీకి బదులు మరో కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్‌ను సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగించారు. పార్టీ గుర్తులు లోడ్ చేయకుండా మరేవో గుర్తులు లోడ్ చేసి సుమారు 1,400 ఓట్లు మాక్ పోలింగ్ చేశారు. ఇది ముగిసిన తర్వాత బ్యాటరీ స్టేటస్ పరిశీలిస్తే 80 శాతం నమోదు కావడం గమనార్హం. అలాంటప్పుడు పోలింగ్ రోజున ఈవీఎం, వీవీ ప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్ 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కౌంటింగ్ రోజున తెరిచేసరికి 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తాము తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. కేవలం మాక్ పోలింగ్‌లో బ్యాటరీ స్టేటస్ ఎంత ఉందో మాత్రమే చెబుతామని అధికారులు సమాధానమిచ్చారు. పాత బ్యాటరీ స్టేటస్ గుట్టు ఏమిటో వెల్లడించాలనేదీ తమ డిమాండ్ అని, అంతేకానీ మాక్ పోలింగ్ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ను మెయిల్ ద్వారా పంపించారు.ట్యాంపరింగ్ అయినట్లుంది...కౌంటింగ్ రోజు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ 99 శాతం చూపించిందని ఎన్నికల ఏజెంట్లంతా చెప్పారు. దీంతో జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. దాదాపు 12 గంటలకు పైగా పోలింగ్ కొనసాగడమే గాక 21 రోజుల పాటు స్టాండింగ్ మోడ్‌లో ఉన్నా కౌంటింగ్ రోజున తెరిచేసరికి బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎలా ఉందనేది మా ప్రశ్న. కానీ అధికారులు మేము కోరినట్లు కాకుండా కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తామన్నారు. దీన్ని మేం వ్యతిరేకించాం. ఆ బ్యాటరీ స్టేటస్ ఇప్పుడు చూసినా 99 శాతం ఎందుకు కనిపిస్తోంది? ఉపయోగించిప్పుడు తగ్గిపోవాలే కానీ పెరగడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఈసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని నాకు అనిపిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నాం.– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరంకౌంటింగ్ రోజే ప్రశ్నించాం..ఈవీఎం బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఉండటాన్ని కౌంటింగ్ రోజే మా పార్టీ ఏజెంట్లు గుర్తించారు. అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నారు. జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పెదకాద పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ దాదాపు 1,400 ఓట్ల పోలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో బ్యాటరీ స్టేటస్ తగ్గాలి కానీ 21 రోజుల తర్వాత కౌంటింగ్ రోజు కూడా 99 శాతం ఉండటం సందేహాలకు తావిస్తోంది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తే బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గింది. దీనిపై సందేహాలను నివత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారని.. ఇలా పలు చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి.– బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరంనిలిచిన ఈవీఎం పరిశీలననెల్లిమర్ల ఈవీఎం గోదాంలో ఈవీఎం పరిశీలన ప్రక్రియ నిలిచిపోయినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ పర్సంటేజ్‌ను అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అడిగారని, అయితే ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీలో బ్యాటరీ పర్సంటేజ్ లేదని బెల్ ఇంజనీర్లు, అధికారులు ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన నిరాకరించడంతో ఈవీఎం పరిశీలన జరగలేదన్నారు. -
యూపీలో బీజేపీ వెనుకంజ అందుకే.. యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి నమ్మకమే పార్టీ కొంప ముంచిందన్నారు. లక్నోలో ఆదివారం(జులై 14) జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో యోగి మాట్లాడారు. ‘ఎన్నికల్లో కొన్ని ఓట్లు, సీట్లు కోల్పోయాం.దీంతో గతంలో మన చేతిలో ఓడిపోయిన ప్రతిపక్షం ఎగిరెగిరి పడుతోంది. అంత మాత్రానా బీజేపీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. మనమెన్నో మంచి పనులు చేశాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజల కోసం పోరాడాం. అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు పటిష్టం చేశాం. యూపీని మాఫియా రహితంగా చేశాం’అని యోగి అన్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ కేవలం 33 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ సమాజ్‌వాదీ(ఎస్పీ) 37 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది. -
ఢిల్లీలో ‘ఆప్’ వల్లే ఓడాం: కాంగ్రెస్ బ్లేమ్‌గేమ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీపై(ఆప్) బ్లేమ్‌గేమ్ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్‌దత్ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.#WATCH | Delhi: Congress leader Abhishek Dutt says, "When we exposed excise scam, we demanded the then government to conduct a proper investigation. ED and CBI didn't take any action, even after 18 months of filing the case. But, just 1 month before the Lok Sabha polls, they… pic.twitter.com/9TYjbifIce— ANI (@ANI) June 29, 2024 ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. భారీ వర్షం పడి ఢిల్లీ స్తంభించి పోవడానికి ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మరో కాంగ్రెస్ నేత దేవేందర్‌యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆప్ స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని, వాటి మధ్య చీలికలు మంచివి కావని ఆప్ నేత సౌరభ్‌భరద్వాజ్ సూచించారు. -
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమైంది..?
ఏ పార్టీకైనా సొంతగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందా? లేదా? ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్ బ్యాంక్‌గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గులాబి బాస్ కేసీఆర్‌కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్‌గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్‌ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యారు.మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
అధిర్ రంజన్ చౌదరి రాజీనామా
కోల్‌కతా: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అధిర్ రంజన్ ఛౌదరి తన పదవికి శుక్రవారం(జూన్21) రాజీనామా చేశారు.పార్టీ పేలవ ప్రదర్శనకు గల కారణాలపై పీసీసీ భేటీలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధిర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 5సార్లు గెలుపొందిన అధిర్ లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన బెంగాల్లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. అధీర్ తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమైందనే వాదన ఉంది. ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అదీర్ రాజీనామాతో మాల్దా-దక్షిణ్ నుంచి గెలుపొందిన ఇషాఖాన్ చౌధరికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
మోదీ 3.0 కేబినెట్ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే..
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీ బుధవారం(జూన్18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. -
‘వయనాడ్’కు రాహుల్ రాజీనామా..?
సాక్షి,ఢిల్లీ: రాహుల్‌గాంధీ తాను గెలిచిన రెండు ఎంపీ సీట్లలో ఏ సీటును వదులుకుంటారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సీట్ల నుంచి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సీటు వదులుకుంటారనేది సోమవారం(జూన్16) సాయంత్రం జరిగే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 24 న ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాహుల్ ఏ సీటు వదులుకోవాలనేదానిపై పార్టీ నిర్ణయించనుంది. కాగా, రాహుల్ వ్యూహాత్మకంగా కేరళలోని వయనాడ్ సీటునే వదులుకోవచ్చని తెలుస్తోంది. -
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది. -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి
నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో కూడా మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాలి.2024 లోక్‌సభ ఎన్నికలు ఆధునిక భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పోకడను సూచిస్తాయి. దీనిపై విశ్లేషించడానికి, వేడుక జరుపుకోవడానికి చాలా ఉంది కానీ, ఒక రంగంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి వేశాం. 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. 74 మందితో కూడిన ఈ మహిళా బృందంలో కచ్చితంగానే అనేక మంది శక్తిమంతమైన, చిత్తశుద్ధిగల, కష్టపడి పనిచేయగల ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతంగా మాత్రమే ఉన్నారు. ఈ వాటా దారుణంగా వక్రంగా ఉండటమే కాకుండా, 2019 ఎన్నికల్లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.2024 ఎన్నికలు జరిగిన సందర్భాన్ని పరిశీలిస్తే, మహిళా పార్లమెంటరీ ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ అభివృద్ధిని నమోదు చేసి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును భారతదేశం ఆమోదించిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికలు ఇవి. ఈ బిల్లు అమలులోకి వచ్చాక మహిళల సీట్లు వారికే కేటాయించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సరిపోదు!గత ఏడాది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడమే కాకుండా, ఈ చారిత్రాత్మక పరిణామంలో తమకూ పాత్ర ఉందని ప్రకటించుకున్నాయి. పైగా, ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమైన ఓటర్లుగా ఉన్నారు. పార్టీల మేనిఫెస్టోలు, అగ్ర నాయకుల ప్రచార ప్రసంగాల నుండి మహిళల ఓటింగ్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం వరకు, సుదీర్ఘకాలం సాగిన ఎన్నికల సీజన్లో భారతీయ మహిళ చాలా స్పష్టంగా (కొంతవరకు సమస్యాత్మకంగా) తన ఉనికిని కలిగి ఉంది.అయితే ఈ ఊహాగానంలో మహిళలు ఓటర్లు, లబ్ధిదారుల పాత్రకే పరిమితమయ్యారు, రాజకీయ సోపానక్రమాలలో సమానమైన భాగస్వామ్యానికి అర్హులైన మహిళా నాయకులు, ప్రతినిధులు లేకుండాపోయారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంకలనం చేసిన డేటా ప్రకారం, ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు (పార్టీ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థుల్లో మహిళలు 11 శాతం మంది). అభ్యర్థులలో మహిళల వాటా తొమ్మిది శాతంగా ఉన్న 2019 సంవత్సరం నుండి చూస్తే ఇది చాలా కొద్ది మెరుగుదల మాత్రమే అని చెప్పాలి. పైగా పుండుపై కారం జల్లినట్టుగా, ఎన్నికల్లో పోటీ చేసిన అనేక మంది మహిళలు తమ తోటివారి నుండి స్త్రీద్వేష వ్యాఖ్యలను, అపహాస్యాన్ని ఎదుర్కొన్నారు.ఈ విధంగా కొద్ది మంది మహిళలే ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికైనవారిలో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పార్లమెంట్లు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం దాని సహచర పార్లమెంట్ల కంటే చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు, 2023లో, ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాయి. వీటిలో సగటున, 27.6 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని, ఇంటర్–పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) డేటా చెబుతోంది. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా, ప్రస్తుతం ఉన్న మొత్తం ఎంపీలలో మహిళలు 26.9 శాతం ఉన్నారు. 18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఐపీయూ డేటా ప్రకారం, ఈ పరామితిలో మొత్తం 185 దేశాలలో భారతదేశం 143వ స్థానంలో ఉంది. కొత్త పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యంలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో, మన దేశ ర్యాంకింగ్ మరో ఐదు లేదా ఆరు స్థానాలు పడిపోయే అవకాశం ఉంది.మెక్సికో నుండి ఒక ఉదాహరణభారతదేశంలో ఎన్నికల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు, ప్రపంచంలోని మరొక భిన్నమైన ప్రాంతంలో మరో చారిత్రక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రాజ్యాంగ పదవులకు ప్రతినిధులను ఎన్నుకోవడానికి మెక్సికోలో సాధారణ ఎన్నికలు జరిగాయి. అక్కడ క్లాడియా షీన్బామ్ అత్యున్నత పదవికి చక్కటి మెజారిటీతో ఎన్నికయ్యారు. మెక్సికో అధ్యక్షురాలిగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. కానీ పురుషులకే పరిమితమైన దుర్బేధ్యమైన కంచుకోట బద్దలవడం ఒక ఉల్లంఘన కాదు, మెక్సికో తన రాజకీయాలను మరింత ప్రాతినిధ్యంగా మార్చే ప్రయాణంలో ఇదొక తార్కికమైన తదుపరి దశ మాత్రమే.గత కొన్ని దశాబ్దాలుగా, అట్టడుగు స్త్రీవాద ఉద్యమాల ద్వారా ముందుకు సాగిన మెక్సికో, తన రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి చట్టబద్ధమైన సంస్కరణల సమితిని ప్రవేశపెట్టింది; అమలు చేసింది కూడా. చట్టం ప్రకారం ప్రతిదానిలో, అంటే ప్రభుత్వంలోని అన్ని రంగాలలో సమానత్వం అవసరం. అలాగే ఎన్నికలలో లింగ సమానత్వంతో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఉంచాలని ఆదేశించింది. ఈ సంస్కరణల ఫలితంగా, మెక్సికో అనేక ముఖ్యమైన రాజకీయ ఉన్నత పదవులను ఆక్రమించిన మహిళలతో పాటు, దాని పార్లమెంటు ఉభయ సభలలో స్త్రీ పురుష సమానత్వాన్ని కలిగి ఉంది. 2024లో, అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి ఇద్దరు అభ్యర్థులు మహిళలు కావడం, ఆ దేశ చరిత్రలో దేనితోనూ పోల్చలేని అరుదైన పరిణామం.అయినంతమాత్రాన మెక్సికోలో సమస్యలు లేవని చెప్పలేం. అక్కడ రాజకీయ, లింగ ఆధారిత హింస తీవ్రమైన సమస్యగా ఉంది. అయితే లింగ నిర్ధారిత నిబంధనలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకమైన, ఆలోచనాత్మకమైన సంస్కరణల ద్వారా పురోగతి సాధ్యమవుతుందని ఇది చూపిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా తమ రాజకీయాలను, పార్లమెంట్లను మరింత ప్రాతినిధ్యంగా ఉంచుతూ, సమానంగా మహిళలను కలుపుకుపోయేలా, లింగపరమైన సున్నితత్వంతో మలచడానికి చిన్న, పెద్ద రెండు చర్యలనూ తీసుకున్నాయి.మనమందరం బాధ్యులమే!స్థానిక స్థాయిలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని విస్తరించే విషయంలో భారతదేశం ముందుండి నడిపించింది. రాష్ట్ర, జాతీయ స్థాయులలోని అంతరాలను పరిష్కరించడంలో మనం ఇదే విధమైన నిబద్ధతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి ఎగువ నుండి సంస్కరణ అవసరం. కానీ పురోగతిని నిర్ధారించే అంతిమ బాధ్యత మన రాజకీయ పార్టీల భుజాలపైనే ఉంటుంది. మహిళా ప్రాతినిధ్యంలో ఈ పతనాన్ని చిన్నవిషయంగా చూడకూడదు. మహిళల (ప్రత్యేకించి సాంప్రదాయకంగా అట్టడుగున ఉన్న సమూహాల) భాగస్వామ్యాన్ని ప్రారంభించే విషయానికి వస్తే, పురోగతి చాలా అరుదుగా సరళంగా ఉంటుంది. పైగా దానికి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయంలో శాశ్వతమైన జాగరూకత చాలా అవసరం. అలాగే మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి.అక్షీ చావ్లా వ్యాసకర్త పరిశోధకురాలు, అశోకా యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్’(సీఈడీఏ)లో పనిచేస్తున్నారు -
‘‘వయనాడ్, రాయ్‌బరేలీలో ఏది వదులుకోవాలి’’
తిరువనంతపురం: వయనాడ్, రాయ్‌బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం(జూన్12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్ పర్యటించారు. -
ఉద్ధవ్ థాక్రే నష్టపోయారు: బీజేపీ నేత కీలక కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్‌తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్‌కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భూపేందర్‌యాదవ్‌కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్‌లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్‌పాల్‌సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్‌తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్‌ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్ గుడ్‌బై
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు. -
యూపీలో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అధికారం ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని యూపీలో బరిలోకి దిగిన హస్తం పార్టీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరించింది. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ తీసింది. దీంతో యూపీలో ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయోత్సాహంతో యూపీలో జూన్11నుంచి15 దాకా ధన్యవాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నట్లు తెలిపింది. పార్టీ సీనియర్ నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా సమాజాంలోని పలు వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగం కాపీలను బహుకరించనున్నారు. -
ఎన్డీఏ,‘ఇండియా’ టఫ్ ఫైట్ .. వేలు కోసుకున్న యువకుడు
రాయ్‌పూర్: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడడం సాధారణమే. అయితే ఆయా పార్టీల కరుడుగట్టిన ఫ్యాన్స్‌కు మాత్రం గెలుపు ఓటములను అంత ఈజీగా తీసుకోరు. ఇలాంటి కోవకే చెందిన బీజేపీ అభిమాని ఒకరు ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో తన వేలును కోసి దుర్గామాతకు సమర్పించుకున్నాడు.బలరాంపూర్‌కు చెందిన దుర్గేష్‌పాండే బీజేపీ అభిమాని. జూన్4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో లీడ్‌లోకి రాలేదు. ఒక దశలో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చింది. దీంతో నిరాశ చెందిన దుర్గేష్ పాండే ఫలితాలు చూడడం ఆపేసి దగ్గర్లోని ఖాళీ మాత గుడికి వెళ్లి మొక్కుకుని వచ్చాడు. చివర్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆనందంతో గుడికి వెళ్లి తన వేలును కోసి ఖాళీ మాతకు సమర్పించుకున్నాడు. గాయం తీవ్రమవడంతో దుర్గేష్ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వేలు తెగిపోయి అప్పటికే ఆలస్యమవడంతో డాక్టర్లు దానిని తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేష్ ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఫలితాల ఆరంభంలో కాంగ్రెస్‌కు లీడ్ రావడంతో తట్టుకోలేకపోయానని, అందుకే ఖాళీ మాతకు మొక్కుకుని, ఎన్డీఏ గెలిచాక మొక్కు తీర్చుకున్నానని దుర్గేష్ చెప్పాడు. ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ఇంకా ఆనందపడేవాడినన్నాడు. -
అమాత్య పదవిపై ఆశలు!
కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు అమాత్య పదవులపై కన్నేశారు. మంత్రి పీఠం ఎక్కేందుకు ముచ్చటపడుతున్నారు. దర్జాగా బుగ్గ కారులో తిరిగాలని ఆశపడుతున్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న కూటమి ప్రభుత్వంలో అధికారం అనుభవించాలని తహతహలాడుతున్నారు. కేబినెట్లో చోటు దక్కించుకుని పరిపాలనలో భాగస్వాములు కావాలని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఆశవహులు తమ అధినేతల ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సర్కారులో ఉన్నత స్థానం పొందేందుకు చిత్తూరు ఎంపీ సైతం పోటీపడుతున్నారు.సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కూటమి గెలుపొందింది. త్వరలోనే కేబినెట్ కూర్పు జరగనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. మంత్రి పదవులకు వచ్చేసరికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉంది. జిల్లాలోనే సీనియర్ కావడం, గతంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, చంద్రబాబు, లోకేష్‌తో మంచి సంబంధాలు ఉండడం ఆయనకు కలిసిరానున్నట్లు సమాచారం. ఓసీ కోటా కింద ఒకరికి ఇవ్వాల్సి వచ్చినా.. చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓసీలకు అవకాశం లేదంటే.. ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు పూతలపట్టు నుంచి గెలుపొందిన మురళీమోహన్, మరొకరు గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే థామస్. ఈ ఇద్దరిలో మురళీమోహన్కి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్ట్ కావడమే అందుకు కారణం . నగరి, చిత్తూరు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్, జగన్మోహన్కి మంత్రి పదవి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.తిరుపతి జిల్లా జాబితా పెద్దదేజిల్లాలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి సారి గెలుపొందిన వారి జాబితాలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా విజయశ్రీ ఉన్నారు. మహిళల కోటా కింద మంత్రి పదవి వరిస్తే.. విజయశ్రీకే అవకాశాలు ఉన్నాయి. బొజ్జల సుధీర్‌రెడ్డి విషయానికి వస్తే.. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్‌ని దింపేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఆ కోణంలో ఆలోచిస్తే బొజ్జల సుధీర్‌రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశముంది. సీనియర్లకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురిలో సీనియర్ కురుగొండ్ల రామకృష్ణ. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ల జాబితాలో ఇస్తే గిస్తే వెంకటగిరి ఎమ్మెల్యేనే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఎస్సీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే.. ఆదిమూలం లేదా పాశం సునీల్‌కుమార్.. వీరిలో ఎవరికో ఒకరికి మంత్రి వర్గంలో స్థానం దక్కవచ్చు.జనసేన కోటాలో ఆరణికి అవకాశంకూటమిలో జనసేన పాత్ర కీలకం. ఈ కూటమి ఏర్పడడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కారణం. బీజేపీని ఒప్పించి టీడీపీతో జట్టు కట్టించారు. ఈ మూడు పార్టీలు ఏకమవడంతోనే అధికారం దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో సారి ఎమ్మెల్యే కావడం కూడా ఆయనకు కలిసి రానుంది.కేంద్ర మంత్రి పదవిపైనా కన్ను!చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాద్‌రావు కేంద్ర మంత్రి పదవిపై కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యం కావడంతో ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. -
‘మోదీ మూడో టర్ము’.. భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు
రాయ్‌పూర్: కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బగేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌పూర్‌లో శుక్రవారం(జూన్7) జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో బగేల్ మాట్లాడారు. ‘లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావొచ్చని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బగేల్ పిలుపునిచ్చారు. ‘పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలలు లేదా ఏడాదిలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు. యోగి ఆదిత్యనాథ్ కుర్చీ కదులుతోంది. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కుర్చీ ఊగుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఇప్పటికే రాజీనామా చేస్తానంటున్నారు’అని బగేల్ ఎద్దేవా చేశారు. -
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
మోదీ 3.0.. చిరాగ్‌కు కేబినెట్ బెర్త్ ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్పాశ్వాన్కు ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు. -
చంద్రబాబు, నితీశ్‌కు అందరూ స్నేహితులే: సంజయ్‌రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్ బెనర్జీ సెటైర్లు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్ వేశారు.‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్ బెనర్జీ అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ హవానే కొనసాగడం గమనార్హం. బెంగాల్లో తృణమూల్‌కు 29 ఎంపీ సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి. -
ప్రధాని పదవికి మోదీ రాజీనామా
న్యూఢిల్లీ: మోదీ 2.0 కేబినెట్ చివరి సమావేశం ఢిల్లీలో ముగిసింది. 17వ లోక్‌సభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రధాన పదవికి రాజీనామా లేఖతో పాటు 17వ లోక్‌సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు.ఈ నెల 7న జరిగే బీజేపీ,ఎన్డీఏ సమావేశంలో మోదీని నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 8న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీంతో పాటు కేబినెట్ భేటీలో ఎన్డీఏ 3.0 ప్రభుత్వ ఏర్పాటుపైనా చర్చించిట్లు తెలుస్తోంది. కాగా, ఇవాళ సాయంత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వ కూర్పు, ఫ్రెండ్లీ పార్టీలకు మంత్రిపదవులు, ప్రభుత్వ కామన్ ఎజెండా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు.