Guntur Elections
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
గుంటూరు, సాక్షి: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో.. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. ఈసారి వాళ్ల నుంచి పూర్తిస్థాయి వివరణ తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. ఫిబ్రవరి 5వ తేదీలోగా ఈ నోటీసులకు స్పందించాలని స్పీకర్ కార్యాలయం కోరింది. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ అయిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజులకు నోటీసులు పంపించారు. ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్న తర్వాతే ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ వారిని కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై సోమవారం స్పీకర్ తమ్మినేని విచారణ జరిపారు. అయితే ఇందులో స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూడుసార్లు టైం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు కూడా. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. -
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడే తీర్పు.?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ జరిపారు. నిన్న స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ చదవండి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సాక్షి ప్రతినిధి, గుంటూరు, పొన్నూరు/చేబ్రోలు: టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం. బొడ్డు వర్గం నిరసన.. కింద పడబోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో జరిగిన సభలో రాజానగరం టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించడం తగదని బాబు ప్రసంగిస్తున్నంత సేపూ నినాదాలు చేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని నిరసనకు దిగారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో చంద్రబాబు కిందకు పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. బాబు తిరిగి వెళ్తుండగానూ బొడ్డు వర్గం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించింది. దీంతో ఆగ్రహించిన బాబు అసమ్మతి నేతలను, బొడ్డు వెంకట రమణ చౌదరిని బస్సులోకి పిలిపించి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుతోనూ మంతనాలు జరిపినట్టు తెలిసింది. వేషాలు మార్చే మారీచుడు జగన్ : చంద్రబాబు రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరు సభల్లో మాట్లాడిన చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ వేషాలు మార్చే మారీచుడని విమర్శించారు. వైఎస్సార్ సీపీలో తిరుగుబాటు మొదలైందని, టీడీపీ గేట్లు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. తాను ఐటీని ప్రోత్సహిస్తే, జగన్ ఐదువేలకు వలంటీర్ ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. అమరావతిపై కులం ముద్ర వేసి నాశనం చేశారని పేర్కొన్నారు. ఇది దేవతల రాజధాని అని, దీనిని జగన్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. జగన్ సిద్ధం అంటుంటే ప్రజలు ఆయనను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తనపై అమరావతి, రింగ్‌రోడ్డు లాంటి ఎన్నో కేసులు వేశారని, జగన్‌కు ఎంతో నమ్మకస్తుడైన ఆయనే ఇప్పుడు తిరగబడ్డారని చంద్రబాబు విమర్శించారు. మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ సభలకు వచ్చిన కార్యకర్తలకు నిర్వాహకులు మద్యం, డబ్బు, పలావ్ పంపిణీ చేశారు. బాబు ప్రసంగం జరుగుతుండగానే పొన్నూరు సభా ప్రాంగణంలో కొందరు మద్యం సేవించడంతో మహిళా నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. సభకు వాహనాల్లో తీసుకువచ్చి ముగిసిన తర్వాత వదిలేశారని, డబ్బులిస్తామని ఇవ్వలేదని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థతగల నేత జగన్ : ఆలపాటి రాజా పొన్నూరు సభలో టీడీపీ నేత ఆలపాటి రాజా చంద్రబాబును పొగడబోయి సమర్థత, సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. బత్తులపై బాబు ఆగ్రహం చంద్రబాబు జనసేన రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ సభ వద్దకు వచ్చిన బత్తుల వర్గీయులు జై జనసేన నినాదాలు చేశారు. దీంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. బత్తులను పక్కకు తోసేయమని తన సిబ్బందిని ఆదేశించారు. పిచ్చివేషాలు వెయ్యొద్దంటూ హెచ్చరించారు. దీంతో బత్తుల చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డంగా వెళ్లి మరీ అనుచరులతో నినాదాలు చేయించారు. -
రాజ్యసభకు మోగిన నగారా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్‌ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది. అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్సీపీకే.. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు. ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు.. మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. -
క్లీన్‌స్వీపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్ర్సీపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ అవసరమైన అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇప్పటికే 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. క్లీన్‌స్వీపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కార్యకర్తలతో సమావేశమై.. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో తొలుత ఉత్తరాంధ్ర ప్రాంత కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈనెల 25న సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇలా ఐదుచోట్ల కార్యకర్తల సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంక్షేమాభివృద్ధి, సంస్కరణలతో విప్లవాత్మక మార్పు.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం సీఎం జగన్ అమలుచేశారు. ఇప్పటికి 99.5% హామీలు అమలుచేశారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో సహా వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ వెరసి రూ.4.13 లక్షల కోట్ల లబ్ది చేకూర్చారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. సంక్షేమాభివృద్ధి, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఆ మార్పును గుర్తుచేసి.. మరింత మేలుచేయడానికి ఆశీర్వదించాలని కోరుతూ 2022, మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇంటింటా ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పైపైకి.. ఇక ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పు కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80% ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
చంద్రబాబుకి అది అలవాటే: రాయపాటి రంగారావు
గుంటూరు, సాక్షి: టీడీపీని వీడినా.. చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టినా రాయపాటి రంగారావు కోపం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా ఆయన మరోసారి టీడీపీ అధినేత, ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని.. ఇప్పుడు తన కుటుంబంపై పడ్డారంటూ ఆగ్రహం వెల్లగక్కారాయన. ‘‘చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్.. కరప్షన్ కింగ్. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్. ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు’’ అని రంగారావు ఆరోపించారు. ఇదీ చదవండి: చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకే పవన్.. శైలజకు ఘాటు కౌంటర్ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు అలవాటేనని.. ఈ క్రమంలోనే రాయపాటి శైలజతో తనపై విమర్శలు చేయిస్తున్నారని రంగారావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికే రాయపాటి శైలజ తో నా మీద ఆరోపణలు చేయిస్తున్నాడు. అసలు రాయపాటి శైలజకు పార్టీలో సభ్యత్వం ఉందా?.. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాయో అంతా నాకు తెలుసు. రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ శైలజకు రంగారావు హితవు పలికారు. -
చంద్రబాబు, లోకేశ్ దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఇదేం పద్ధతని, లోకేశ్ ఏమైనా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
తెలుగుదేశంలో గందరగోళం
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడం, పొత్తుల నేపథ్యంలో శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించడం టీడీపీ అధిష్టానం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలంటేనే అభ్యర్థులు వెనుకాడుతున్నారు. మెజార్టీ ఎంపీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఎన్నికలకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించేవారు. ఈ ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసేవారు. ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఆ హడావుడి ఏమీ కనిపించడం లేదు. మరోవైపు పొత్తుల వల్ల నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దశలో జనసేన–టీడీపీ మధ్య సీట్ల పంపకం కత్తిమీద సాములా మారనుంది. దీనికితోడు బీజేపీతోనూ పొత్తు కోసం బాబు తహతహలాడుతున్న నేపథ్యంలో స్థానాల కేటాయింపు మరింత సంక్లిష్టంగా మారే ఆస్కారం ఉందనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సీఎం జగన్ ఎత్తుగడలతో కలవరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ఎత్తుగడలు టీడీపీని కలవరపెడుతున్నాయి. సీఎం చకచక వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించడంతోపాటు సామాజిక సమతూకం పాటిస్తుండడం, కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి త్వరగా వెళ్లేలా చూడడం వంటి చర్యలు టీడీపీని సతమతం చేస్తున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం సొంత సోషల్ మీడియా, ఎల్లో మీడియా, నోటి ప్రచార వ్యూహాలతో బలంగా ఉన్నట్టు కలరింగ్ ఇచ్చుకునేందుకు యతి్నస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగోలేవని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆత్మరక్షణగా తొలి జాబితా విడుదలకు యత్నం ! బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు, క్యాడర్‌ను సమాధానపరిచేందుకు టీడీపీ ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది. పొత్తులతో సంబంధం లేకుండా ఇబ్బందులేమీ లేవని భావిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి వంటి కొన్ని స్థానాలను గుర్తించి 25 మందితో తొలి జాబితాను ప్రకటించాలని చూస్తోంది. సంక్రాంతికి ఈ జాబితా విడుదలకు యతి్నస్తున్నా.. అది ఎంతవరకూ సాధ్యమనే అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. బాబు పక్కచూపులు టీడీపీ నుంచి పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీలోని అసంతృప్తుల వైపు చంద్రబాబు చూస్తున్నారు. అక్కడ చోటు లేక బయటకు వచ్చేవారిని చేర్చుకుని సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికార పార్టీలో సీటు దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయనకు పెనమలూరు లేదా నూజివీడు సీటు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా చాలాచోట్ల వైఎస్సార్సీపీ సీటు నిరాకరించిన నేతలను చేర్చుకుని అభ్యర్థుల కొరత తీర్చుకోవాలని బాబు చూస్తున్నారు. దీన్నిబట్టి ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతోందనే వాదన రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. -
టీడీపీ దిక్కుమాలిన పార్టీ: రాయపాటి రంగారావు
సాక్షి, గుంటూరు: టీడీపీ దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు.. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని.. ఒక వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు. మా కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది టీడీపీ.. గత ఎన్నికల్లో 150 కోట్లు మా నుంచి తీసుకున్నారు. లోకేష్, చంద్రబాబు మా దగ్గర ఎంత తీసుకున్నారో లెక్కంతా ఉంది. మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానంటూ రంగారావు సవాల్ విసిరారు. కియా కంపెనీ తానే తెచ్చారని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చంద్రబాబు, లోకేష్ ఎక్కడ పనిచేయనివ్వలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడని, తాము అన్ని కులాలకు పని చేస్తామని రాయపాటి రంగారావు అన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. చంద్రబాబు విధానాలు నచ్చక ఆ నేతలు సైకిల్ దిగారు. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పగా, నేడు రాయపాటి రంగారావు రాంరాం చెప్పారు. మరో నేత లింగమనేని శివరామ ప్రసాద్ కూడా రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అందులో ఉన్న లింగమనేని.. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. అదే బాటలో మరికొందరు సీనియర్ నేతలు నడవనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: టీడీపీలో కొత్త ట్విస్ట్.. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి! -
CM Jagan: రాష్ట్రవ్యాప్తంగా పర్యటన.. వైఎస్సార్సీపీ కేడర్‌తో భేటీ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకోసం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా.. తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే వైఎస్సార్సీపీ పలు మార్పులతో కూడిన జాబితాల్ని సిద్దం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇక నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. “Message to YSRCP Cadre” పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని "5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్"లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. 4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి,… — YSR Congress Party (@YSRCParty) January 12, 2024 -
‘అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: అప్పులపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మండిపడ్డారు. పార్లమెంట్లో పలు సార్లు కేంద్ర ఆర్దిక మంత్రి,తో పాటు ఆర్బీఐ, కాగ్ అప్పులపై గణాంకాలను వెల్లడించినా సరే ఆ గణాంకాలను కాదని లేని అప్పులున్నట్లు ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో చంద్రబాబు, ఎల్లో మీడియా చెపుతున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎల్లో మీడియా వాస్తవాల గురించి వివరణలు తీసుకోకుండా అన్యాయంగా తప్పుడు వార్తలు రాస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అప్పులతో పాటు అన్ని అనర్దాలకు చంద్రబాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. మనసులో మాట పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగులకు, సబ్సిడీలకు వ్యతిరేకంగా రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఇస్తానంటూ ప్రజలను మోసం చేసే ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘మోసం నేర్చెన్’.... అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదనే పాటలా బాబు వ్యవహారం ఉందని ఆర్దిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. అప్పులపైన గణాంకాలతో పాటు, చంద్రబాబు గత నిర్వాకాలను ఆధారాలతో సహా గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్దిక మంత్రి బుగ్గన వివరించారు. ఆయన మాటల్లోనే.. అప్పులపై నిరాధార ఆరోపణలు: రాష్ట్ర ప్రభుత్వం రూ.7 లక్షల అప్పు చేసిందని ఒకరు.. రూ. 8 లక్షల అప్పు చేసిందని మరొకరు ఇష్టానుసారం ఆరోపిస్తున్నారు. నిజానికి మీరంతా (టీడీపీ నేతలు) గతంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ఇలా ఇష్టానుసారం ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? ‘రుణకంఠుడు’ అంటూ.. సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెచ్చిన అప్పులు రూ. 7.34 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబు, మా ప్రభుత్వం రూ. 13 లక్షల అప్పు చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదే మాట మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంటున్నారు. అందుకు ఏ ఆధారాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదని గతంలో నేను స్పష్టంగా చెప్పాను. అందు కోసం కేంద్రం ఇచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు కూడా చూపాను. పార్లమెంటులో కొందరు సభ్యులు వేసిన ప్రశ్నలకు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా, స్పష్టంగా సమాధానం చెప్పింది. అయినా ఇక్కడ మీడియా దారుణంగా దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడా వాస్తవాలు రాయడం లేదు. ఇది చాలా అన్యాయం. రాజకీయంగా ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే.. అందులో వాస్తవాలను మీడియా బేరీజు వేసుకోవాలి కదా? అప్పటి కంటే ఇప్పుడు బెటర్ చంద్రబాబు పాలన కంటే మా ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెటర్. ఎందుకంటే అప్పటి కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. అప్పు శాతం కూడా వారి కంటే తక్కువే చేశాం. అయితే రావాల్సినంత ఆదాయం కోవిడ్ వల్ల రాలేదు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. వాస్తవాలు మర్చి నిందలు: ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల అప్పు చేసిందని ఆరోపించారు. రుణకంఠుడు సీఎం అంటూ రాసిన స్టోరీలో ఆ ఫిగర్ వేశారు. కానీ ఆ స్టోరీలో రాసిన మొత్తం అప్పు చూస్తే.. అ మొత్తం కేవలం రూ. 7,68,641 కోట్లు మాత్రమే. మరి రూ. 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇంకా పెండింగ్ బిల్లులు రూ. 1.70 లక్షల కోట్లు ఉన్నాయని రాశారు. ఆ లెక్కలు మీకు ఎవరు చెప్పారు? ఏ ఆధారాలతో మీరు అది రాశారు? ఇంకా డిపాజిట్లు, ఇతర మొత్తాలు కలిపి రూ. 28,286 కోట్లు అని రాశారు. అది ఎవరు చెప్పారు? ఇలా అన్నీ చూపుతూ.. తప్పుడు ఫిగర్ చెబుతున్నారు. ఆ అప్పుల్లో మీరు చేసినవే ఎక్కువ: మీ ప్రకారం లెక్క వేసుకున్నా.. మీరన్నట్లు రూ. 3.76 లక్షల కోట్లు బహిరంగ రుణాలు ఉంటే.. అందులో పాత రుణం రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి కదా? 2019, మే నాటికే ఆ అప్పు ఉంది కదా? అదే విధంగా ఉదయ్ బాండ్స్. రూ. 8,256 కోట్లు అన్నారు. అది తీసుకుంది 2016లో కదా? ఇంకా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల (ఈఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 33,118 కోట్ల రుణం. పాత ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుల కింద అందులో రుణం తీసుకుంది కదా? నాన్ గ్యారెంటీ లోన్ çపవర్ సెక్టర్లో రూ. 95 వేల కోట్ల రుణం అన్నారు. అందులో రూ. 69,596 కోట్ల రుణం.. పాత ప్రభుత్వం తీసుకున్నదే కదా? అ రుణం 2019, మే నాటికే ఉంది. సీఆర్డీఏ బాండ్స్ రూ. 1500 కోట్లు. ఆ అప్పు చేసింది మీరు కాదా? పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ. 50 వేల కోట్ల అప్పు అంటున్నారు. కానీ నిజానికి అందులో రూ. 22 వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణమే. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ. 50 వేల కోట్ల రుణం తీసుకున్నారని రాశారు. కానీ నిజానికి ఆ రుణ మొత్తం రూ. 36 వేల కోట్లు మాత్రమే. ఇతర కార్పొరేషన్ల ద్వారా రూ. 1.45 లక్షల కోట్ల అప్పు అని రాశారు. ఆ మొత్తంలో పవర్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణం రూ. 95 వేల కోట్లు కూడా ఉంది. మరోవైపు ఆ రుణాన్ని కూడా వేరుగా చూపారు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 95 వేల కోట్లలో కూడా దాదాపు రూ. 70 వేల కోట్ల అప్పు గత ప్రభుత్వ హయాంలో చేసిందే. నిజానికి రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 7 లక్షలకు అటు ఇటుగా ఉంటే.. దాన్ని దారుణంగా పెంచి రూ. 10 లక్షల కోట్లు అని రాయడం అంత కంటే తప్పు. ఇంకా చెప్పాలంటే ఆ రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో కూడా దాదాపు రూ. 4 లక్షల కోట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినవే. అయినా అన్నీ కప్పి పుచ్చి, మొత్తం అప్పును ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. రుణకంఠుడు సీఎం అంటూ రాయడం చాలా దారుణం. కనీసం జర్నలిజం విలువలు పాటించాలి కదా? ఎంత అన్యాయం? రాష్ట్ర అప్పు అప్పటికి రూ.4.28 లక్షల కోట్లు: గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. ‘ఎ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్’ అని చెప్పి 15 ఏళ్ల డేటాతో ఆర్బీఐ ఒక్కోసారి డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ)తో పాటు, వివిధ కేంద్ర రంగ సంస్థల నుంచి తీసుకున్న వివరాల (డేటా) ఆధారంగా ఆర్బీఐ ఆ డాక్యుమెంట్ (బుక్) రిలీజ్ చేస్తుంది. ఆ బుక్‌లో 15 ఏళ్ల డేటా ఉంటుంది. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 2023 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పు రూ. 4,28,715 కోట్లు. ఆ బుక్‌లో ఉన్న వివరాల ప్రకారం 2019, మార్చి 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ. 2,64,512 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే నాటికి.. అంటే మార్చి 2019 తర్వాత రెండు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అప్పు రూ. 7,346 కోట్లు. అంటే గత ప్రభుత్వం దిగి పోయే నాటికి.. అంటే 2019, మే చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 2,71,797 కోట్లు. మరి 2023, మార్చి 31 నాటికి ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 4,28,715 కోట్లలో.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు రూ. 2,71,797 కోట్లు తీసేయాలి కదా? బాబు హయాంలోనే ఎక్కువ అప్పులు వాస్తవాలు ఇలా ఉంటే.. మొత్తం అప్పులను ఈ ప్రభుత్వానికి ఆపాదించి రాయడం అత్యంత దారుణం. ఇక గత ప్రభుత్వ హయాంలో.. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ అప్పు ఎలా పెరిగింది? ఆ తర్వాత 2019 నుంచి నాలుగేళ్లలో ఎంతెంత పెరిగిందని చూస్తే.. -2014లో రాష్ట్ర విభజన నాటికి ఉన్న ప్రభుత్వ అప్పు రూ. 1,53,346 కోట్లు కాగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి.. అంటే 2019 మే చివరి నాటికి ఆ రుణం రూ. 4,12,288 కోట్లకు చేరింది. అదే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలో ప్రభుత్వ అప్పు రూ. 6,38,217 కోట్లు అంటే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ప్రభుత్వ వార్షిక అప్పు 21.8 శాతం పెరగ్గా.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా పెరిగిన అప్పు కేవలం 12 శాతమే. అది కూడా కోవిడ్ వంటి మహమ్మారి ఉన్నా కూడా.. చేసిన అప్పు తక్కువే. ప్రతి దానికి లెక్క. అన్నీ డాక్యుమెంట్లలో..: మా ప్రభుత్వంలో కార్పొరేషన్ల పేరుతో చెప్పకుండా రుణాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. ప్రతి దానికి అక్కౌంట్స్, చెకింగ్స్ ఉంటాయి. బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రభుత్వ అప్పులను ఫారమ్ డీ-4లో చూపుతాం. అది పబ్లిక్ డాక్యుమెంట్. మరోవైపు 5వ వాల్యూమ్‌లో అప్పుల గురించి పూర్తి వివరాలు చెబుతాము. ఇది ప్రభుత్వ విధి నిర్వహణలో ఒక భాగం. ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అప్పు తీసుకునేది ఆర్థిక సంస్థల నుంచే కదా? అది ఆటోమేటిక్‌గా బ్యాంక్ బుక్స్‌లో కూడా ఉంటుంది. పీఏసీ బుక్స్‌లో కూడా ఉంటాయి. ఇంకా డిబెంచర్ల రూపంలో రుణాలు సేకరించాలంటే.. బహిరంగంగానే చేయాలి. ఇందులో ఎక్కడా గోప్యత ఉండదు. ఏదీ రహస్యం కాదు. అప్పులో గోప్యత అసాధ్యం నిజానికి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగితే.. కేంద్ర ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అయినా దాన్ని రాయరు. చెప్పరు. ఆర్బీఐకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, సీఏజీకి తెలియకుండా, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎక్కడైనా అప్పు చేయడం సా«ధ్యమేనా? బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు కోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేశాం. ఆ అప్పును ఎలా వినియోగిస్తామో కూడా అందులో స్పష్టంగా చెప్పాం. మహిళలు, రైతులకు సంబంధించిన నాలుగు పథకాల కోసం అని చెప్పడం జరిగింది. జీడీపీతో పోల్చినా.. అప్పుడే ఎక్కువ అప్పులు -ఇక మన స్థూల ఉత్పత్తి (రాష్ట్ర జీడీపీ)తో పోల్చి గత ప్రభుత్వ హయాంలో చేసిన, పెరిగిన అప్పు చూస్తే..గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో చేసిన అప్పు రూ. 2.59 లక్షల కోట్లు. అది రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే 7.45 శాతం . అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 2.26 లక్షల కోట్లు. దాన్ని రాష్ట్ర జీడీపీతో పోల్చి చూస్తే అది కేవలం 5.2 శాతం మాత్రమే. వాస్తవాలు ఇలా ఉంటే.. దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ బాండ్లు చాలా గొప్పవని చెబుతారు. అవి ఒకటిన్నర శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయంటారు. అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బెవరేజెస్ బాండ్స్ 4.5 శాతం ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా.. దాని గురించి రాయరు. చెప్పరు. అనుమతి లేకుండానే నిధుల వినియోగం టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా రూ. 1,10,599 కోట్లు ఖర్చు చేసిందా అని ఆయన అడిగితే.. కేంద్రం ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాసనసభ అనుమతి లేకుండా రూ. 1.62 లక్షల కోట్లు ఖర్చు చేశారని సమాధానం చెప్పారు. అయినా దాని గురించి రాయరు. నోటికి ఏది వస్తే..అదే మాట్లాడతారా? మరో ఎంపీ రాష్ట్ర అప్పుల గురించి సభలో అడిగితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన సమాధానం.. 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం.. ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లు అని చెప్పారు. అదే 2022 రివైజ్డ్ ఎస్టిమేషన్నే తీసుకుంటే, అప్పు రూ. 3,93,718 కోట్లు మాత్రమే. ఆ మేరకు 2023 బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసినా, ప్రభుత్వ అప్పు కేవలం రూ. 4.42 లక్షల కోట్లు మాత్రమే అయినా.. ప్రభుత్వ అప్పు రూ. 10 లక్షల కోట్లు అని, రూ. 13 లక్షల కోట్లు అని.. నోటికి ఎంత వస్తే అంత మొత్తం చెబుతున్నారు. ఎంత దారుణం ఇది? -చంద్రబాబు తన పరిపాలన బ్రహ్మాండం అంటారు. ఆయన పరిపాలన హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి సగటు రూ. 6.95 లక్షల కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలో సగటు స్థూల ఉత్పత్తి రూ. 10.84 లక్షల కోట్లు. రెండింటి మధ్య తేడా చూడండి. స్థూల ఉత్పత్తి పెరిగితే రెవెన్యూ కూడా పెరగాలి అంటారు కదా?. దానికి సమాధానం. రెవెన్యూ రాబడి-వాస్తవాలు చంద్రబాబు గతంలో మంత్రిగా, సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకు చూస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ రాబడి 12.4 శాతం పెరిగింది. అదే 2004 నుంచి 2009 వరకు వైయస్సార్‌గారి హయాంలో 21.6 శాతం.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14.4 శాతం పెరగ్గా.. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు రెవెన్యూ రాబడి కేవలం 6 శాతమే పెరిగింది. అదే మన ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి 16.7 శాతం పెరిగింది. ఇవన్నీ లెక్కల్లో స్పష్టంగా ఉంటాయి కదా? ప్రభుత్వానికి ఎలా ఏ రూపంలో ఆదాయం వచ్చిందనేది ఉంటుంది కదా? చంద్రబాబు పాలన బాగుంటే, రెవెన్యూ రాబడి ఎందుకు పెరగలేదు? ఇప్పుడు ఉద్యోగులు పెరిగారు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు.ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే.. 2018-19లో 44.86 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే.. 2022-23 నాటికి ఆ సంఖ్య ఏకంగా 60.75 లక్షలకు పెరిగింది. అంటే ఉద్యోగుల సంఖ్య పెరిగితేనే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు పెరుగుతాయి కదా? చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు దాదాపు 20 లక్షల ఉద్యోగులు పెరిగినట్లే కదా? రాష్ట్రంలో నిరుద్యోగులపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఏం చెప్పిందంటే.. రాష్ట్రంలో 2018-19లో నిరుద్యోగ శాతం 5.3 ఉంటే.. అది 2022-23 నాటికి అది 4.1 శాతానికి తగ్గిందని. అంటే చంద్రబాబు హయాంలో కంటే, ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. ఇవన్నీ పార్లమెంటులో భూపేందర్‌సింగ్ హుడా, కపిల్ సిబల్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానాలు. బాబు మాటలు-నీటి మూటలు 2014లో సీఎం అయిన చంద్రబాబు, ప్రజలను మభ్య పెట్టేందుకు కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు.. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, బెంగళూరు పారిశ్రామిక వాడ, టెక్నాలజీ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంట్ పరిశ్రమ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, సోలార్ అండ్ విండ్ పవర్ స్టేషన్లు.. విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల పరిశ్రమ.. వీటిలో ఒక్కటైనా ఏర్పాటు చేశారా? ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ తప్ప. ఎందుకంటే వ్యవసాయానికి తగిన భూములు లేవు కాబట్టి. అది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పంప్డ్ స్టోరేజీ కింద అంత కంటే బాగా చేశాం. విమానాశ్రయాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవుకులో రామ్‌కో సిమెంట్ కంపెనీ ఇటీవలే ఏర్పాటైంది కదా? ఇప్పుడు మేము కదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. అంటే, ఆనాడు మీరు ఏమీ చేయకపోగా.. ఇంకా ఏం చెప్పారు. ఆలూరులో జింకల పార్కు. శ్రీశైలంలో పులుల పార్క్.అవి కూడా ఏర్పాటు చేయలేదు. చంద్రబాబు తన విధానాలు, ఆయన అనైతిక రాజకీయాల వల్ల ఇష్టానుసారం అప్పులు చేశారు. అందుకోసం ఏమేమో చేస్తామని చెప్పారు. బాబు దిగజారుడు మాటలు: ఇప్పుడు ఏవేవో పర్యటనలు చేస్తున్న చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలకు ఒక్కో పేరు పెడుతున్నారు. మరి మేము కూడా ఆ పని చేయలేమా? నీకు, నీ కుమారుడికి కూడా పేరు పెట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. అందుకే మేము నీలా దిగజారి మాట్లాడం. నీతి లేని నాయకుడు చంద్రబాబు చంద్రబాబు రాజకీయ జీవితం చూస్తే.. ఎక్కడైనా విలువలకు కట్టుబడి ఉన్నాడా? ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు దగ్గరయ్యాడు కదా? 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత వాజ్‌పేయి వేవ్‌లో గెల్చాడు. 2001లో మోదీని గుజరాత్ సీఎంగా దింపాలన్నాడు. 2004 వచ్చే సరికి మళ్లీ యూటర్న్. బీజేపీతో కలిసి ఎన్నికల్లో నిలబడి, ఓడిపోయిన తర్వాత ఓడిపోవడంతో.. తనది హిస్టారికల్ మిస్టేక్ అన్నాడు. మళ్లీ 2009 వచ్చే సరికి మరోసారి యూటర్న్. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంతో మహాకూటమి. ఎన్నికల్లో పోటీ. అప్పుడు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై నిశిత విమర్శలు చేశాడు. దానిపై ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్.. చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. 2014 వచ్చే సరికి మళ్లా బ్యాక్. బీజేపీ, జనసేన. కాంగ్రెస్‌పై నిశిత విమర్శలు. మన్మోహన్సింగ్ను ఏకంగా సోనియాగాంధీ పెంపుడు కుక్క అన్నాడు. 2016 వచ్చే సరికి డీమోనిటైజేషన్. తానే మోదీకి సలహా ఇచ్చానని అన్నాడు. అది బూమరాంగ్ కావడంతో.. అది చరిత్రాత్మక తప్పిదం అన్నాడు. 2018 వచ్చే సరికి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాడు. 2019 ఎన్నికలు వచ్చే సరికి మోదీకో హఠావో.. దేశ్‌కో బచావో అన్నాడు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో.. మోదీ వంటి నేత దేశానికి అవసరం అన్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం ఒక్క వైయస్సార్ కాంగ్రెస్‌తో తప్ప.. అన్ని పార్టీలతో రాయబారాలు జరుపుతున్నాడు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌తో కూడా మాట్లాడుతున్నాడు. బాబు ఊసరవెల్లి రాజకీయాలపై పాట చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై రూపొందించిన ఒక పాట వీడియో ప్రదర్శించి చూపారు.‘మోసం నేర్చెను.. అసలు తానే మారెను.. అయినా మనిషి మారలేదు. అతడి కాంక్ష తీరలేదు’.. అన్న పాట. బాబు మనసులో మాట ఇంకా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశాడు. ‘అది మనసులో మాట’. ఆ బుక్‌లో పేజీ నెం.117లో ఏముందంటే.. మనం అవసరానికి మించి ఎక్కువ మందిని పనిలో పెట్టుకుంటున్నాం. 119వ పేజీ. ఎన్టీఆర్ కిలో బియ్యం రూ. 2 చేశారు. నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఖర్చు భరించరానిదిగా భావించి మళ్లీ రూ. 3.50 చేశాను. సబ్సిడీ ఇవ్వడం అంటే పులి మీద స్వారీ మాదిరిగానే. సబ్సిడీ ఇచ్చినా ఎన్టీ రామారావు, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఓడిపోయింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న అకాళీదల్ ఎన్నికల్లో ఓడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఉద్యోగుల యొక్క, ఉద్యోగుల చేత, ఉద్యోగుల కోసం అన్నట్లుగా మారాయి. పేజీ నెం.124. విద్యుత్ మాత్రమే కాక, ఇతర సబ్సిడీలు కూడా ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో ఎక్కువ భాగం తింటున్నాయి. పేదలకు సబ్సిడీ ఇళ్లు. ఖరీదైన పథకం. కొన్ని వర్గాలకు ఉచిత ప్రయాణం సరికాదు. మరి అదే ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిదీ ఫ్లిప్‌ఫ్లాప్. పేజీ నెం.62. ఉద్యోగుల్లో అవినీతి పెరిగింది. వివిధ శాఖల్లో అవినీతి పరులైన ఉద్యోగులు చాలా మంది పెరిగారు ఉద్యోగులు, వారి జీతభత్యాలు. పెన్షన్లు పెరుగుతున్నాయి. దాని కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక విష వలయం. స్వార్థ రాజకీయాలు: చంద్రబాబు రాజకీయ పొత్తులు చూస్తుంటే.. హాలీవుడ్ యాక్టర్ ఎలిజబెత్ టేలర్ గుర్తుకు వస్తుంది. ఆమె ఏడుసార్లు పెళ్లి చేసుకుంది. అందులో ఒకరిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. చంద్రబాబు రాజకీయ పొత్తులు కూడా అలాగే ఉన్నాయి. కాంగ్రెస్. ఆ తర్వాత బీజేపీ. మళ్లీ కాంగ్రెస్. మళ్లీ బీజేపీ. జనసేన. ఇంకా వామపక్షాలు. నిజానికి ఆ పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వేరు. కానీ చంద్రబాబు మాత్రం అందరితో చర్చలు. విభజనలోనూ చంద్రబాబు అనైతిక రాజకీయాలు: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ. దీనికి చంద్రబాబు కూడా కారణం కాదా? 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశాడు. ఆ తర్వాత 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పాటు చేయొచ్చు కదా అన్నారు. 2012లో మరో లేఖ రాసి, తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాడు. రెండు కళ్ల సిద్ధాంతం చెప్పాడు. రాష్ట్రం విడిపోతే, తమ పార్టీ జాతీయ పార్టీ అవుతుందని అన్నాడు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకించాడు. ఇటు తెలంగాణ ఏర్పాటు చేయాలని కూడా కోరాడు. ఇన్నిసార్లు ఐడియాలజీ మార్చుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఏనాడైనా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాడా? రాష్ట్ర అప్పులకు ఆయన కాదా కారణం. ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానన్నా, తామే కడతామని తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానన్నాడు. కంప్యూటర్ కనిపెట్టానని చెప్పాడు. రాష్ట్ర విభజన సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కదా? విభజన తర్వాత మనకు అన్యాయం జరిగింది. స్థూల ఉత్పత్తిలో సేవా రంగం (సర్వీస్ సెక్టర్) 45 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వ్యవసాయ రంగం 33 నుంచి 38 శాతానికి పెరిగింది. హైదరాబాద్ మనకు లేకుండా పోవడం వల్ల మనకు దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల ఆదాయం పోయింది. అవన్నీ మీకు తెలియదా? మీరు నిపుణులు కాదా? అప్పులనేమో జనాభా ప్రాతిపదికన చేశారు. కానీ ఆస్తులను లొకేషన్ ప్రకారం విభజించారు. దాని వల్ల హైదరాబాద్ పోయింది. ఇక్కడ జనాభా ఎక్కువ కావడం వల్ల అప్పులు పెరిగాయి. విద్యుత్ రంగానికి వచ్చే సరికి, వినియోగం ఆధారంగా విభజించారు. దాని వల్ల తెలంగాణకు 54 శాతం, ఆ«ంధ్రప్రదేశ్కు 46 శాతం ఇచ్చారు. అంత అన్యాయంగా విభజన చేశారు. మీరు, కాంగ్రెస్ కలిసి చేశారు. రాష్ట్రానికి నష్టం, అన్యాయం చేశారు. మీ లక్ష్యం ఒక్కటే. జగన్‌గారిని ఇబ్బంది పెట్టాలి. విభజన తర్వాతా బాబు అన్యాయమే..: విభజన తర్వాత కూడా మీరు రాష్ట్రానికి అన్యాయం చేశారు. హోదా వద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారు. వెనకబడిన ప్రాంతాల నిధి కూడా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున సాధించలేకపోయారు. 2014-17 మధ్య రెండేళ్లు ఆ నిధి తెచ్చుకోలేకపోయారు. ఆ నిధిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించుకుంది. పోలవరం ప్రాజెక్టును 2014-15 నాటి ధరలకు అనుగుణంగా ఎలా పూర్తి చేస్తామని తెచ్చుకున్నారు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తోంది. మీరు ప్రాజెక్టును ప్రొటోకాల్ ప్రకారం చేయలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం స్పిల్‌వే పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్‌లు కట్టారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారు. దాని వల్ల పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. రెవెన్యూ లోటు. దాన్ని కూడా మీరు సాధించలేదు. కానీ మేము రూ. 12 వేల కోట్లు తెచ్చుకున్నాం. మేము వచ్చాకనే రామాయపట్నం, కడప స్టీల్ ప్లాంట్ కడుతున్నాం కదా? పౌరసరఫరాల శాఖ అప్పుల్లో తెలంగాణ తన వాటా రూ.600 కోట్లు కట్టకపోతే.. ఎస్బీఐ కొంపల్లి శాఖలో ఖాతా ఫ్రీజ్ అయితే, మేము వచ్చాక ఆ డబ్బులు కట్టించి, మన వాటా తెచ్చుకున్నాం. ఇది వాస్తవమా? కాదా? ఇప్పుడు వచ్చి ఏదేదో చేస్తామంటున్నారు. మేము కేంద్రంతో మాట్లాడి అన్నీ సాధిస్తే.. కుమ్మక్కు అయ్యామంటారు. మీరు చేయలేదు. మేము చేస్తే.. విమర్శలు. ఇన్ని అనర్థాలకు కారణం బాబే..: ఈరోజు రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అంటే.. ప్రధాన కారకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు.. ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఆయన చర్యలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు. అన్నీ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించేవే. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. ఉద్యోగుల భవిష్యత్తు కోసమే..: ఉద్యోగులకు సంబంధించి రాబోయే 30 ఏళ్లలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, నిర్ణయాలు తీసుకున్నాం. ఓపీఎస్ గురించి నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్తులో అది మరింత భారమై, ఉద్యోగులకే నష్టం చేస్తుంది. ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే జీపీఎస్ అమలు చేస్తున్నాం. దాన్ని కేంద్రం కూడా ఆమోదిస్తోంది. మేము వచ్చాకే కొత్త ఉద్యోగాలు: మా ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎందరిని భర్తీ చేశాం. సచివాలయాల ద్వారా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియడం లేదా? చంద్రబాబు మనసులో మాట పుస్తకం ద్వారా ఉద్యోగులపై తన మాట చెప్పాడు. ఇప్పుడు ఆయనే మళ్లీ ఉద్యోగాలు ఇస్తామంటున్నాడు. అందుకే చంద్రబాబు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతారు. మీ లీడర్ చెబితే చేయాలంటారు,..మా లీడర్ చెప్పడమే తప్ప చేయడం ఉండదని టీడీపీ నేతలే అన్నారు. -
చంద్రబాబు మోసగాడని తెలుసు, కానీ..: కేశినేని నాని
సాక్షి, గుంటూరు: విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారాయన. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్ పెట్టించి తనను తిట్టించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని పేర్కొన్నారు. టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది నాకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని నా భుజస్కందాలపై నడిపించా. పార్టీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టా. సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని పని చేశా. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు వదులుకున్నా. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డా అని నాని తెలిపారు. విజయవాడ మేయర్‌గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని.. ఆయన మూడు రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ప్రెస్‌మీట్ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతురాలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలి. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పాను. వద్దు నువ్వు ఉండాల్సిందే అని బాబు నాతో చెప్పారు. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్ కావాలి అది ప్రోటోకాల్. నా విషయంలో టీడీపీ ప్రొటోకాల్ మరిచిపోయింది. సీఎం కార్యక్రమాలకు బాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికీ రాని వ్యక్తి. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా అమోదం పొందగానే వైఎస్సార్సీపీలో చేరుతా. విజయవాడ అంటే ప్రాణం ఏమైనా చేస్తా. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ. 100 కోట్లైనా ఇచ్చాడా. విజయవాడ కోసం నేను చేశా. షాజహాన్ తాజ్‌మహాల్ కట్టాడు, నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చేశారు. విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఒక కల. నేను బాబును ఎప్పుడూ టికెట్ అడగలేదు.. ఇప్పుడు సీఎం జగన్‌ను కూడా అడగను. ఇప్పుడు జగన్‌తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుంది.’ అని చెప్పారు. -
మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకోండి
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో వచ్చే మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకుని తిరగాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గోదావరి నుంచి 350 టీఎంసీలు రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని, నంద్యాల జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దోపిడి దొంగలుగా మారారని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదని అది మోసాలయాత్ర అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో విత్తన సరఫరా యూనిట్‌ను, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ ధ్వంసం చేశారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం ఎక్కడ తిరుగుతోందని వైఎస్ షర్మిలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. -
లోకేశ్ ‘రెడ్‌బుక్’ బెదిరింపులపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరింది. చంద్రబాబు, లోకేశ్ ప్రభుత్వ అధికారులకు.. ప్రధానంగా పోలీసు అధికారులకు రాజకీయ దురుద్దేశాలు అంటగడుతూ వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో సామరస్యపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ విప్ మార్గాని భరత్‌తో కూడిన వైఎస్సార్సీపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌తో విజయవాడలో మంగళవారం సమావేశమైంది. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేశ్ అప్రజస్వామిక విధానాలపై కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వారు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతూ చేసిన ప్రసంగాలు, బహిరంగ సభల్లో చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాలు, మీడియా, సోషల్ మీడియాలో టీడీపీ దు్రష్పచారానికి సంబంధించిన ఆధారాలను కూడా ఫిర్యాదుతోపాటు సమర్పించింది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవీ.. ♦ 2019 ఎన్నికల్లో అఖండమైన ప్రజా మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కుట్రలు పన్నుతోంది. టీడీపీ అధికారం కోల్పోయిందన్న దుగ్దతో చంద్రబాబు, లోకేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో సామరస్య పూరిత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మనసులను కలుషితం చేయాలన్న కుట్రతో సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ♦ చంద్రబాబు జిల్లాల పర్యటనలో, లోకేశ్ పాదయాత్రలోనూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగంపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారుల పేర్లను ఓ రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, అధికారంలోకి వస్తే వారి సంగతి తేలుస్తానని లోకేశ్ బహిరంగ సభల్లో హెచ్చరించారు. మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలోనూ రెడ్‌బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తుండటం అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. బదిలీ అయి వెళ్లిపోతామని అధికారులు భావిస్తే పొరపాటేనని, వారు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టేదేలేదంటూ రెడ్‌బుక్‌ను చేతిలో పట్టుకుని చూపిస్తూ మరీ లోకేశ్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ♦ సమర్థవంతమైన పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు పూర్తి స్వేచ్ఛతో, సంతోషంగా, సమర్ధవంతంగా విధులను నిర్వర్తిస్తున్నారు. పోలీసు అధికార యంత్రాంగం పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలు, సామరస్య పూరిత వాతావరణాన్ని పరిరక్షిస్తోంది. అటువంటి ఉన్నతాధికారులు, ప్రత్యేకించి పోలీసు అధికారులపై చంద్రబాబు, లోకేశ్ నిరాధార ఆరోపణలు చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి మరీ కుట్రపూరిత విధానాలతో పోలీసు అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఆటంకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు. పోలీసు అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు ఇప్పిస్తూ, అనుకూల మీడియాలో వారిపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీకి కొమ్ము కాసే పత్రికలు, ఛానళ్లలో అధికారులపై తీవ్రస్థాయిలో విష ప్రచారం చేస్తూ వారిని బెదిరిస్తున్నారు. ♦ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు, లోకేశ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిద్దరినీ కట్టడి చేయాలని కోరుతున్నాం. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమాజంలో సామరస్యపూరిత పరిస్థితులను టీడీపీ దెబ్బతీస్తోంది. ప్రజాస్వామ్య ప్రమాణాలను ధ్వంసం చేసేలా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. -
కోర్టు ద్వారా లోకేశ్‌కు నోటీసులు ఇవ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై నమోదైన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నారా లోకేశ్‌కు నోటీసులు అందించాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మంగళవారం కోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించడం కలకలం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదు’ కాగా.. ఈ కేసులకు సంబంధించి గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. కాగా.. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు లోకేశ్ అందుబాటులోకి రాలేదు. రెండుసార్లు ఆయన నివాసానికి వెళ్లినా అధికారులను కలిసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఈ విషయాన్ని సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. లోకేశ్ ఉద్దేశపూర్వకంగానే నోటీసులను తీసుకోవడం లేదని వివరించారు. ఈ అంశంపై తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లోకేశ్‌కు స్వయంగా నోటీసులు అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. -
బల్క్ ఫిర్యాదులు చంద్రబాబు కుట్రే
సాక్షి, అమరావతి: విపక్ష నేత చంద్రబాబునాయుడి జీవితమంతా మోసం, కుట్ర, కుతంత్రాలతో నిండిపోయిందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. లక్షల ఓట్లను తొలగించాలంటూ కోనేరు సురేష్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు బల్క్ ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. కోనేరు సురేష్ ఇచ్చిన అబద్ధపు బల్క్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేశామన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ ఓట్లను టార్గెట్ చేసిందన్నారు. మరోవైపు దొంగ ఓట్ల చేర్పునకూ టీడీపీ పాల్పడుతోందన్నారు. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’ పేరుతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా అర్హుల ఓట్లు తొలగించేందుకు, దొంగ ఓట్ల చేర్పుకు చంద్రబాబు భారీ కుట్ర చేశారని చెప్పారు. ఓటరు కులం, రాజకీయ ప్రాధాన్యత అడిగే హక్కు బాబుకెవరిచ్చారు? అని నిలదీశారు. ‘వన్ సిటిజన్.. వన్ ఓట్’ అనేది తమ పార్టీ సిద్ధాంతం అని తెలిపారు. ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం అని చెప్పారు. మొత్తం ఆరు అంశాలపై సీఈసీని కలిశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులను కలిసిన అనంతరం మంగళవారం విజయవాడలోని నోవోటెల్ హోటల్ వద్ద ఆయన ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... గుర్తింపులేని జనసేనకు అవకాశమా? గుర్తింపులేని పార్టీ జనసేన. సాధారణంగా గుర్తింపు ఉన్న పార్టీలకే ఎన్నికల సంఘాన్ని కలిసి వారి అభ్యంతరాల్ని చర్చించే అవకాశం ఉంటుంది. టీడీపీతో పాటు జనసేన పార్టీకి కూడా సీఈసీని కలిసే అవకాశమిచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపులేని జనసేనకు సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇవ్వగలిగారని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాము. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన అపాయింట్మెంట్ రిక్వెస్టులో జనసేన పార్టీ తమ అలయెన్స్‌గా చెప్పి ఆపార్టీని కూడా అనుమతించాలని కోరింది. ఇప్పటి వరకు జనసేన పార్టీ బీజేపీ అలయెన్స్ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. జనసేన బీజేపీకి పార్టనరా? టీడీపీకి పార్టనరా? అనేది స్పష్టం చేయాల్సిన అవసరముందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. రెండు వేర్వేరు పార్టీలతో అలయెన్స్ పెట్టుకున్న గుర్తింపులేని పార్టీ జనసేనను ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎలా అనుమతించారనేదే మా వాదన. జనసేన పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతోంది. అలాంటి, గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్‌గా ఉన్న గాజుగ్లాసు గుర్తును కేటాయించడం కూడా చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు రెండో అంశంగా నివేదించాం. బోగస్ ఫిర్యాదుదారుడు కోనేరు సురేష్‌పై చర్యలేవి? టీడీపీకి చెందిన కోనేరు సురేష్ ఆపార్టీ ఎలక్టోరల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్, బోగస్ ఓట్లంటూ ఓ బల్క్ కంప్లయింట్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాడు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్‌గా ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని సీఈసీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని 175 స్థానాల్లో 10 లక్షల ఓట్లకు సంబంధించి బల్క్ కంప్లయింట్ ఎలా ఇవ్వగలుగుతారు? దాన్ని ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్వీకరిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. టీడీపీ వ్యక్తి ఇచ్చిన బల్క్ కంప్లయింట్ ఆధారంగా ఎన్నికల అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తుందా? అని మేము అడుగుతున్నాం. ఆ ఫిర్యాదుపై విచారణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలొచ్చాయి. అయితే, ఆ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఏమాత్రం నిజం లేదని తేలింది. దీన్నిబట్టి కోనేరు సురేష్ ఎన్నికల కమిషన్ సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్థం చేసుకోవాలి. ఈ రకంగా టీడీపీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి, విలువైన ఎన్నికల సంఘం సమయాన్ని వృథా చేయడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాలని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. కోనేరు సురేష్ ఫిర్యాదు బోగస్ అని తేలింది కాబట్టి అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరాం. ఓటర్ ప్రొఫైలింగ్ మాల్‌ప్రాక్టీస్ తీరిది ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్డులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని టీడీపీకి చెందిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటర్ పేరు, ఊరు, ఇతర చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నంబర్ వంటి వివరాలున్నాయి. రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరుచేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. టీడీపీ సేకరించిన ఓటర్ డేటా అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ వద్ద స్టోర్ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం, అప్పట్లో ఆ యాప్‌పై ఎన్నికల సంఘం ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమంపై 120(బి), 379, 420, 188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద యాక్షన్ తీసుకోవాలని ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరాం. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు రాబోయే ఐదేళ్లలో టీడీపీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనే లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులందజేతను ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లే టార్గెట్ ఓటర్ల జాబితాలపై టీడీపీ రోజుకో అబద్ధంతో అటు ఓటర్లనూ, ఇటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవబట్టిస్తోంది. కోనేరు సురేష్ ఫిర్యాదుపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి మూడు జిల్లాల సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం. ♦ కర్నూలు జిల్లాలో సురేష్ ఫిర్యాదు ప్రకారం 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయి. అయితే, వీఆర్వోలు వెరిఫై చేశాక వాటిల్లో 59,054 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. అంటే, 87 శాతం నిజమైనవి. మిగతా ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం పరిధిలోకి మారిన వారివిగా గుర్తించారు. ♦ అన్నమయ్య జిల్లాలో 40,358 బోగస్ ఓట్లు ఉన్నట్టు ఫిర్యాదు చేస్తే, వాటిలో 25,097 మంది ఓటర్లు స్థానికంగానే నివాసం ఉంటున్నట్లు తేలింది. అంటే, 62 శాతం ఓట్లుకు సంబంధించి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు అబద్ధం. ♦ విశాఖపట్నం జిల్లాలో 38,872 ఓట్లు బోగస్‌వి అని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వాటిలో 26,123 ఓట్లు జెన్యూన్‌గా ఉన్నట్లు తేలింది. అంటే 67 శాతం ఓట్లు వాస్తవమైనవే. ♦ ఒకే వ్యక్తి ఇచ్చే బల్క్కంప్లయింట్లు స్వీకరించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాం. అసభ్య పదజాలం వాడుతున్న తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలి చంద్రబాబు చేపడుతున్న టీడీపీ కార్యక్రమాల్లోనూ, లోకేశ్ యువగళం పాదయాత్రలోనూ వైఎస్సార్సీపీపైన, మా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైన అసభ్యకర పదజాలం వాడుతూ దూషించడాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. ఆ తండ్రీకొడుకులపై ఇండియన్ పీనల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కూడా కోరాం. లోకేశ్ ఓ ఎర్రబుక్కు చూపిస్తూ, ‘టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అధికారుల పేర్లు ఈ ఎర్రబుక్కు (రెడ్‌బుక్)లో ఎక్కించి.. అధికారంలోకి రాగానే వారిని జైళ్లకు పంపుతాను’ అంటూ బెదిరిస్తున్నారు. ♦నిజానికి ప్రభుత్వ అధికారులు ఏ పొలిటికల్ పార్టీకి పనిచేయరు. అధికారులెప్పుడూ బ్యాలెన్సింగ్‌గానే పనిచేస్తారు. అలాంటి అధికారులను జైళ్లకు పంపుతానంటూ భయభ్రాంతులకు గురిచేయడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. పార్లమెంట్ ఎన్నికలు ఉభయరాష్ట్రాల్లో ఒకేరోజు జరపాలి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ఓటర్ల జాబితాల సవరణల్లో టీడీపీ చాలా దొంగపనులు చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకొచ్చిన ప్రతీసారి మోసపూరిత, కుట్రపూరితమైన విధానాలతోనే ఎన్నికల ప్రక్రియను నడిపించారు. ఇప్పుడు అలాంటి దొంగపనులకు శ్రీకారం చుట్టాడు కాబట్టే మేం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేస్తున్నాం. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ వైఎస్సార్సీపీ తరఫున మేం 14 డిసెంబర్ 2023న కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాం. ఓటరు కులమేంటి? మతం ఏంటి? గతంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు? రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు? అని అడిగే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు. టీడీపీ మాత్రం ఈ విధమైన ఓటర్ ప్రొఫైలింగ్‌కు పాల్పడుతుందనే విషయాన్ని గతంలోనే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చాం. 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం ఓటర్ల పేర్లలో చిన్న అక్షరాలు మార్చి స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లుగా జాబితాలో ఓట్లను చేర్చే కార్యక్రమం టీడీపీ చేస్తోంది.తండ్రిపేరు లేదా భర్త పేరు మార్చి డూప్లికేట్ ఓట్లను ఆ పార్టీ తయారు చేయడానికి తెగించింది. తెలంగాణలో ఉన్న ఓట్లను కూడా ఏపీ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 4,36,268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి, వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాం. తెలంగాణ ఓట్ల నమోదుకు టీడీపీ ప్రత్యేక శిబిరాలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున, అక్కడున్న ఏపీ సెటిలర్స్‌తో ఆంధ్రా ఎన్నికల్లో ఓటు వేయించేందుకు టీడీపీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఓట్ల చేర్పులు జరుగుతున్నాయి. టీడీపీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఏపీలో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. -
ఎన్నికలకు ముందే బాబు, పవన్ అస్త్ర సన్యాసం
సాక్షి, అమరాతి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కళ్యాణ్.. వారిద్దరూ కలిసి వైఎస్సార్సీపీని ఏం చేయగలరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని పవన్‌ను నిలదీశారు. ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారని, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఐదేళ్ళు అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తరిమికొడతారని ఆయనకు తెలిసిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. ఒక రోజు లక్షల ఓట్లు తొలగించారని, మరో రోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అసలు 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ... దళితులను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, చేసే మేలేమీ ఉండదని విమర్శించారు. దళితులపై పవన్ ఆరోపణలు సరికాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందుగానే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఎల్లో మీడియా వక్రీకరించింది
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్యావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులనైతే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు సీఎం జగనన్న దగ్గరకు వెళ్తే పనులు అవుతున్నాయనడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అదే వీడియోలో జగనన్న స్ఫూర్తితో తామంతా ముందుకెళ్తున్నామని చెప్పానని, మరి వాటిని ఎల్లో మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని నిలదీశారు. దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని రామోజీని ప్రశ్నించారు. తప్పుడు రాతలు ఆపకుంటే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చించివేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తా రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో తానేదో భారీ స్థాయిలో భవిష్యత్తు ఊహించి రాలేదని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలని కోరుకున్నట్లు చెప్పారు. జగనన్న తనను సొంత చెల్లెలు మాదిరిగా చూసుకున్నారని తెలిపారు. జగనన్న ఆదేశిస్తే ఎలాంటి పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని, తన సీటును వదులుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రకటించారు. దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా ఎస్సీలకు సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే పని చేస్తానని తెలిపారు. తనను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు చేస్తే ఏ స్థాయి వ్యక్తికైనా తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలతో దిగజారిపోతున్నారని విమర్శించారు. -
AP: బీసీల అభివృద్ధికి సీఎం జగన్ తపన : సజ్జల
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడేలా చేసేందుకు తపన పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్‌ల నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో సజ్జల పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రజక కార్పోరేషన్ చైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వివిధ స్కీమ్‌లను పరిశీలిస్తే నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో 5,600 కోట్ల రూపాయలు వేశాం. నాన్ డీబీటీలను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు ఇచ్చాం. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలో బీసీలు సీఎంలుగా ఉన్న ఏపీలో ఇచ్చినన్ని నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలి. రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగానే చూశాయి. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టాడు. బీసీల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే అవమానించారు. మళ్లీ ఇప్పుడు మాత్రం జయహో బీసీ అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బీసీలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరు. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు సీఎం జగన్ రజకుల అభివృద్ధి కోసమే పథకాలు తీసుకువచ్చారు’ అని సజ్జల వివరించారు. రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల అభివృద్దికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానన్నారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇదీచదవండి..పార్టీ ఫిరాయించిన వారితో వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా -
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేతో వెళ్ళి దొంగ ఓట్లపై ఫిర్యాదా?: మంత్రి అంబటి
సాక్షి, గుంటూరు: దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే నమ్మకం ఉండేదని మండిపడ్డారు. ఇలాంటివి చేసే ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్ళి(ఉండవల్లి శ్రీదేవిని ఉద్ధేశిస్తూ) దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ బాబుపై మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడింది బాబే కదా అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పలు అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు ఇంకా మంత్రి అంబటి మాట్లాడుతూ.. ‘గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మనవద్ద జరిగేలా కాస్ట్లీ ఎన్నికలు ఎక్కడా ఉండవు. దీనికి కారణం చంద్రబాబే. ఎన్టీఆర్‌ను దించిన తర్వాత తాను గెలవడం కోసం ఓటర్లను కొనేందుకు విపరీతంగా ఖర్చు పెట్టింది చంద్రబాబే. ఇలాంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు. అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటానికి చంద్రబాబుకి బుద్దుందా? తెలంగాణ నుంచి నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావో మర్చిపోయావా బాబూ..? ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్‌గా పట్టుబడటం వల్లే కదా నువ్వు ఏపీ పారిపోయి వచ్చావ్..? కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మన అంధ్రప్రదేశ్‌కు వచ్చారు. రాజకీయ పార్టీలను కలిసి వారి ఫిర్యాదులను విని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పక్షాలతో సమావేశం అయ్యారు. దీనిలో చిత్రంగా శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. మేము అప్రజాస్వా మేము అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రొత్సహిస్తున్నామని మాట్లాడారు. వాళ్లను కూడా తీసుకెళ్తే బాబు బండారం బయటపడేది ఆయనతో పాటు వైఎస్సార్సీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటు వేసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి మరో దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లడం విడ్డూరం. వైఎస్సార్సీపీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచి.. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి.. చంద్రబాబు చెప్పినట్లుగా ఓటు వేసిన శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్లి మాపై ఫిర్యాదు చేస్తున్నాడు. ఈయన ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్లు నటిస్తున్నాడు. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా వెంటబెట్టుకుని వెళితే ఆయన బండారం ఇంకా బయటపడేది. దొంగ ఓట్లపై గెలుస్తున్న దొంగ చంద్రబాబు గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే బాబు గెలిచాడు. నేడు ఆ దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం. దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబునాయుడు ఓడిపోవడం గ్యారెంటీ. దొంగ ఓట్లతోనే రాజకీయం చేసిన దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు. మాకెందుకు దొంగ ఓట్లు..? ఐదేళ్లు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన ప్రభుత్వం మాది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్ గారిని అన్ని వర్గాల వారు గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే పరిస్థితి ఉంది. మాకు అసలు దొంగ ఓట్లతో పనేంటి? 175కి 175 స్థానాలూ గెలిచే పరిస్థితి మాకుంది. మేం మానిప్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు..ఆ లక్షణమే మాకు లేదు. గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు చాలా ప్రమాదకరం అన్నాడు. వాటివల్లే మేం ఓడిపోయాం అన్నాడు. 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంలలో సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్‌కి పడింది అని చెప్పాడు. ఇవాళ ఆ మాటలు ఏమయ్యాయి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయలేదేం? గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి సీఈవోగా ఉన్న దివ్యేది గారిని ముఖ్యమంత్రిగా ఉండి బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయంతో ఓడిపోతానని తెలిసినప్పుడు చంద్రబాబు ఇలాంటి వేషాలు వేయడం కొత్తేమీ కాదు. పవన్ కల్యాణ్ నీకెందుకు గ్లాసు గుర్తు..సైకిల్ గుర్తుపైనే పోటీ చెయ్..! శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్తే వెళ్లాడు..పవన్‌కల్యాణ్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. బహుశా గుర్తింపు లేని పార్టీకి అనుమతి లభించదని, చంద్రబాబు చెంచాగా వెళ్లాడేమో..ఎందుకయ్యా..పవన్ కల్యాణ్ నీకు గ్లాసు గుర్తు..? సైకిల్ గుర్తుపైనే పోటీ చేయవచ్చు కదా? నీ పార్టీని విలీనం చేసేయ్...కావాలంటే కొంచెం ప్యాకేజీ పెంచండి అని అడిగితే బాగుండేది. దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడు. చెప్పిన మాట చెప్పకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయనకు తానా తందానా అనే పత్రికలు ఉన్నాయి..వారి రాతలు చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చి కూర్చున్నట్లే ఉంటుంది. వైఎస్సార్సీపీ పని అయిపోయింది...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూర్చుంది అన్నట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తూనే ఉంటాయి. షర్మిల వస్తే జగన్ ఏదో అన్నాడని రాధాకృష్ణ రాతలు రాశాడు. రాధాకృష్ణ బల్లకింద ఉన్నాడా? బాత్రూమ్లో ఉన్నాడా? మీరు ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినా తిరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డినే ముఖ్యమంత్రి. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకునే క్రమంలో జగన్ పరిపాలన చేశారు. వైఎస్సార్సీపీ 175+25 టీం రెడీ.. ఎన్నికల కమిషన్ వచ్చింది కదా అని దత్తపుత్రుడు, దత్తతండ్రి ఇద్దరూ వెళ్లి వినతులిస్తే సరిపోదు. అసలు విషయం వదిలేసి కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు. కలిసి తిరిగితే తిరిగారు. మాకు అభ్యంతరం లేదు. ఇంకా మీరు సీట్లు పంచుకునే కార్యక్రమమే ప్రారంభం కాలేదు. సీఎ జగన్ టీం 175+25 టీం రెడీగా ఉంది. త్వరలో టీంను ప్రకటించబోతున్నారు. మేం ఎవర్ని మారిస్తే మీకేంటి బాధ..? సమయాన్ని బట్టి మార్చుకుంటాం..వారితో సర్ధుకుంటాం. ఆయన్ను మార్చారు.. ఈయన్ని మార్చలేదు అంటాడు...నువ్వు చెప్పినట్లు మార్చాలా? నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. మొసలి కన్నీరు ఎందుకు.? అంబటి రాయుడు టీ20కి దుబాయ్‌లో ఆడటానికి వెళ్లాడు.. రాజకీయాల్లో ఉండకూడదు కాబట్టి పార్టీకి రాజీనామా చేశాడు. దాన్ని ఈనాడు మొదటి పేజీ వార్త రాసింది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని, ఆయన కుమార్తె, కార్పొరేటర్ శ్వేత రాజీనామా చేస్తే ఈనాడులో ఆఖరు పేజీ వార్త. ఇలా ఏదో ఒక విధంగా మానిప్యులేట్ చేసి చంద్రబాబును గొప్పగా చూపాలని, జగన్‌ను చిన్నగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్ధం అయ్యాయి. మీరు కక్కే విషం స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతోంది. రాష్ట్ర ప్రజలు మీ తీరును పూర్తిగా అర్ధం చేసుకున్నారు. మీ పత్రిక.. మీ ఇష్టం.. మీరు రాసుకోండి.. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. న్నికలకు వెళ్లబోతున్నాం..అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళుతున్నాం. ఎవరినీ కలుపుకునేది లేదు..సింగిల్‌గానే వెళ్తున్నాం..175+25 మొత్తం కొట్టుకుని తిరిగివస్తాం. మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం. మీరెంత మంది కలిసి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక చంద్రబాబు పని అయిపోయింది..ఈ ఎన్నిక తర్వాత చాప సర్ధుకుని హైదరాబాద్ స్వగృహానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేయకూడదు బాబూ..!: హైదరాబాద్‌లో ఉంటే ఇక్కడ ఓటు ఉండకూడదా? అంటున్నాడు. ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఉండొచ్చు..సందేహం లేదు. అయితే అక్కడ ఒక ఓటు..ఇక్కడో ఓటు ఉండకూడదు బాబూ.. అయితే హైదరాబాద్‌లో మొన్న ఓటు వేసి మళ్లీ ఇక్కడకు వచ్చి ఓటు వేస్తామంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది..? చంద్రబాబుకు అక్కడా..ఇక్కడా ఓటు కావాలట..అది అప్రజాస్వామికం బాబూ.. ప్రతి ఓటరుకు ఒక ఓటే ఉండాలి..రెండు చోట్ల నమోదు కావాలి. టీడీపీ వాళ్లకు కాస్త పిచ్చెక్కువ..అందుకే నా మీద విమర్శలు చేస్తుంటారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ నా మీద చాలా మాట్లాడుతుంటాడు. ఆయన ఒక పార్టీకి కన్నం వేయడం వేరే పార్టీలో చేరడం అలవాటు. ప్లీడర్లు వాదించినట్లే కన్నా కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తరఫున కూడా వాదిస్తాడు. ’ అని మండిపడ్డారు అంబటి -
అసంతృప్తి ‘కన్నా’లెన్నో!
సాక్షి, నరసరావుపేట: ఎన్నో ఆశలతో రాజకీయ బద్ధశత్రువు, టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ చేశారు. వంగవీటి రంగా తర్వాత కాపు సామాజికవర్గంలో తానే కీలక నేతనని ఆయన భావిస్తుంటారు. అలాంటి కన్నా... వంగవీటి రంగా హత్యకు కారణమైన టీడీపీలో చేరడంతో రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పంచన చేరిన తర్వాత కన్నాకు పార్థిలో అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. తనకు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఆయన కోరినా బాబు వినకుండా సత్తెనపల్లికి పంపారు. అక్కడ అప్పటికే పార్టీ క్యాడర్ మూడు గ్రూపులుగా విడిపోయి ఉంది. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, అబ్బూరి మల్లి వర్గాలు పరస్పరం కత్తులు నూరుతున్నాయి. ఇందులో అబ్బూరి మల్లి కొంత కన్నాకు సహకరిస్తున్నా, వైవీ ఆంజనేయులు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు కోడెల శివరాం పల్లె నిద్ర పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. శివరాంను నిలువరించే యత్నం టీడీపీ అధిష్టానం చేయడం లేదని కన్నా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టీడీపీ టికెట్ ఇస్తుందని, ఒకవేళ ఇవ్వని పక్షంలో కోడెల శివప్రసాదరావు ఆశయ సాధన కోసం స్వతంత్ర అభ్యర్థి గా అయినా పోటీ చేస్తానని శివరాం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండటం గమనార్హం. కన్నాకు వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న ‘బొర్రా’ కాపు సామాజికవర్గం బలంగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, జనసేనకే ఇక్కడ పొత్తులో సీటు ఖరారవుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ ఇన్చార్జి బొర్రా వెంకట అప్పారావుకు గానీ, మరో నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కు గానీ అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు. బొర్రా అప్పారావును దూరం పెడుతున్నారు. దీంతో ఆర్థిక, అంగబలం ఉన్న బొర్రా అప్పారావు నియోజకవర్గంలోని కాపు నేతలను ఏకం చేసి జనసేన వైపు ఉండేలా చూస్తున్నారు. జనసేనకు టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యం ఉంటుందని, టీడీపీ తరఫున కన్నా గెలిచినా పెత్తనం ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. జనసేనతోపాటు టీడీపీలోని గ్రూపులు కన్నాకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. దీంతో తనకు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పైగా కాపు సామాజికవర్గంలో బలమైన నేతనైనా తనకన్నా పవన్ కళ్యాణ్‌కే పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తుండడం ఆయనకు రుచించడం లేదని సమాచారం. టీడీపీలో చేరి తప్పు చేశారనే భావన కన్నా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా సత్తెనపల్లి సీటును జనసేనకు కేటాయించేందుకే సుముఖంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఎంపీ అభ్యర్థులు కావలెను
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబువి అన్నీ ఢాంబికాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే.. రాజధాని ప్రాంతం, మాకు పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం పార్టీ తలలు పట్టుకుంటోంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఇందుకు కారణం. దీంతో ఎన్ఆర్ఐలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ వరసగా రెండుసార్లు గెలిచినా ఇప్పుడు పోటీచేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం.. పైగా ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గల్లా జయదేవ్ 2019లో గెలిచిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గాలేరు. ఆయన గుంటూరులో అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. మళ్లీ పోటీచేయబోనని అధిష్టానానికి తెగేసి చెప్పేశారు. దీంతో గుంటూరులో పోటీచేసే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషిస్తున్నా ఫలితం ఉండడంలేదు. మాజీమంత్రి ఆలపాటి రాజా, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోటీచేయాలని అడిగినా వారు ససేమిరా అంటున్నారు. దీంతో గుంటూరులోని ఒక విద్యాసంస్థల చైర్మన్‌ను పోటీచేయాలని కోరినట్లు కూడా సమాచారం. నిజానికి.. 2019లో పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చినా అధిష్టానం అప్పట్లో ఆయన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చి కొంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ తాను పోటీచేయబోనంటూ ఆయన తప్పుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్ఆర్ఐల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నరసరావుపేట, బాపట్లకూ ససేమిరా.. ఇదిలా ఉంటే.. నరసరావుపేట లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థి దొరకలేదు. 2014లో చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరా>వుకు టిక్కెట్ ఇచ్చారు. 2019లో రాయపాటి వద్దంటున్నా బలవంతంగా ఇచ్చారు. ఇప్పుడాయన వయస్సు రీత్యా పోటీకి సిద్ధంగాలేరు. దీంతో ఇక్కడ పోటీచేసేవారి కోసం వెతుకుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన కూడా అంత ఆసక్తి చూపడంలేదని సమాచారం. ఇక బాపట్ల ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభ్యర్థి దొరకడం టీడీపీకి తలనొప్పిగా మారింది. 2014, 2019లో పోటీచేసిన మాల్యాద్రి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడం, పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం వెతుకుతోంది. ఇక్కడ నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను పోటీచేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో బాపట్ల ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ బుర్ర బద్దలుకొట్టుకుంటోంది. రూ.వంద కోట్లు చూపిస్తేనే.. మరోవైపు.. ఒక్కో ఎంపీ అభ్యర్థి పోటీ చేయాలంటే కనీసం రూ.వంద కోట్లు చూపించాలని లోకేశ్ అడుగుతున్నారని, అందుకెవ్వరూ ముందుకు రావడంలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.