hospital
-
Jhansi Hospital Fire: ముగ్గురు చిన్నారులను కాపాడి.. సొంత కుమారుడు ఏమయ్యడో తెలియక..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’ -
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
సికింద్రాబాద్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్త నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో సోదాలు చేపట్టారు. జీవీ సలూజా ఆసుపత్రిలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్ చేశారు.మౌలాలీలోని నేహా భగవత్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు నార్కోటిక్ డగ్ర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేహా భగవత్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.పెద్దమొత్తంలో సలూజా ఆసుపత్రిలో మత్తుమందును యాజమాన్యం నిల్వచేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా మత్తు మందుని దిగుమతి చేసి ఆసుపత్రి యాజమాన్యం విక్రయిస్తోంది. మహారాష్ట్రకు చెందిన నేహా భగవత్ సాయంతో మత్తు మందులు విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
ప్రాణం నిలిపి.. ప్రాణాలకు తెగించి
మన్షిదా బాను మంగుళూరులోని కద్రి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఈమధ్యే కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్టోబర్ 23 తెల్లవారు జామున 3.40 కి ఆ స్టేషన్ కి కాల్ వచ్చింది. అక్కడికి దగ్గర్లోని పాలిటెక్నిక్ కాలేజీ సెంటర్లో పెద్ద ఆక్సిడెంట్ అయింది. పికప్ వెహికల్, కంటైనర్ ట్రక్కు డీ కొట్టుకున్నాయి. ఇదీ ఆ కాల్. వెంటనే మన్షిదా తన స్కూటీ పై ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె వెళ్ళేటప్పటికి ఆ వాహనాలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తపు మడుగులో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. ఆ రెండు వాహనాలలో ఒకదాని క్లీనర్ అతను. మన్షిదా అతడి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని అతి కష్టమ్మీద లేపి, తన స్కూటర్ పై నేరుగా ఆ దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి మోసుకెళ్లారు. అతడి ప్రాణాలని నిలబెట్టగలిగారు.ఆమె టైమ్ సైన్స్ ఆమె వేగం, ఆమె ధైర్యం, ఆమెలోని కారుణ్యం, ఆమె యూనిఫామ్.. అన్నీ పంచభూతాల్లా ఒకటై ఆ వ్యక్తి ్రపాణాలను కాపాడాయనే అనుకోవాలి. అదే కనుక.. పోలీస్ కాకుండా ఒక మామూలు వ్యక్తి ఎవరైనా అంతలా గాయపడిన వారిని తీసుకెళితే ప్రైవేటు హాస్పిటల్స్ చేర్చుకుని ఉండేవా?! ‘మేం అడ్మిట్ చేసుకోడానికి లేదు. ఇది పోలీస్ కేస్..‘ అని ఉండేవి.‘వాయు వేగంగా స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కద్రి స్టేషన్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ మన్షిదా బానుకు‘ అభినందనలు అంటూ తెల్లారగానే మంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ట్వీట్ పెట్టారు. మంగుళూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా మన్షిదాకు ప్రశంసలు అందాయి.డ్యూటీ మైండెడ్ మాత్రమే అయి ఉంటే ఘటనా స్థలానికి వెళ్ళగానే ఫార్మాలిటీస్ లో పడి ఉండేవారు మన్షిదా. కానీ ఆమె అలా చేయలేకపోయారు. ఆమెలోని మానవతా హృదయం.. ఉద్యోగ విధి విధానాలను దాటి మరీ స్పందించింది. అందుకు ‘తగిన శిక్ష‘ ఏదైనా ఉందంటే.. అది ప్రమోషనో, ప్రశంసాపత్రమో తప్ప మరొకటి అవుతుందా?! మన్షిదా మాత్రం.. ‘నేను చేసింది ఏముందీ..!‘ అని చిరునవ్వుతో అంటున్నారు.. తనపై కురుస్తున్న అభినందనల జల్లులలో తడిసి ముద్ద అవుతూ.సాహసాన్ని వెన్నెముకగా ధరించే వాళ్లకు అసాధ్యం ఉండదు. హై–రిస్క్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మరోసారి అక్షరాలా నిరూపించింది పైలట్ రీనా వర్గీస్. అడవిలో, అత్యంత ప్రతికూల పరిస్థితులలో ప్రాణాపాయంలో ఉన్న జవాన్‌ను ఆస్పత్రికి తరలించింది. రీనా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన కొత్తలో... 2009లో సీనియర్ పోలీసు అధికారులను తీసుకు వెళుతున్న హెలికాప్టర్‌ను మావోయిస్ట్‌లు కూల్చివేశారు. తాను చేస్తున్న ఉద్యోగం ఎంత రిస్క్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ సంఘటన రీనాకు ఉపయోగపడింది.తాజా విషయానికి వస్తే...మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కమాండోలు, మావోయిస్ట్‌లకు మధ్య ఎనిమిది గంటల పాటు జరిగిన భీకరమైన ఎదురుకాల్పుల్లో ఒక కమాండో తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్ట్‌ల రాకెట్ దాడులకు అవకాశం ఉన్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో గాయపడిన కమాండోను అక్కడి నుంచి తరలించడం అంటే ్రపాణాలను పణంగా పెట్టడమే. ఉన్నతాధికారుల నుంచి సమాచారాన్ని అందుకున్న రీనా వర్గీస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హన్స్ హెలికాప్టర్‌తో రంగంలోకి దిగింది. కో–పైలట్‌కు కమాండ్స్ అందజేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో హెలికాప్టర్‌ను వీలైనంత వరకు దించి కిందికి దూకింది.తాడు సహాయంతో గాయపడిన కమాండోను హెలికాప్టర్లోకి తీసుకువచ్చింది. 30 నిమిషాలలో గడ్చిరోలికి అక్కడి నుండి నాగ్‌పూర్ తరలించింది. మూడు బుల్లెట్లు తగిలిన కమాండోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన రీనా వర్గీస్ గతంలో ఎన్నో ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులను లక్షద్వీప్ నుంచి కొచ్చికి తరలించే రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొని ప్రశంసలు అందుకుంది. -
డాక్టర్ లేరు.. వైద్య పరికరాలూ లేవంట!
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఆందోళన..ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వైరల్: ఆసుపత్రిలో కలకలం.. కాటేసిన పామునే మెడలో వేసుకుని..
భాగల్పూర్: తనను కాటేసిన పాము నోటిని గట్టిగా పట్టుకుని ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బీహార్‌లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురైన ప్రకాశ్ మండల్.. పాముని మెడలో వేసుకుని ఆస్పత్రికి వైద్యం కోసం రావడంతో అక్కడ వారంతా షాక్ అయ్యారు. భయంతో పరుగులు తీశారు.ఈ సమయంలో పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రి అంతా తిరుగుతూ కొంతసేపు నేలపై పడుకున్నాడు. అతని ఎడమ చేతికి పాము కాటు వేయగా, అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అతని దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోయారు. పామును పట్టకుని ఉంటే వైద్యం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేసిన తర్వాత ప్రకాశ్ మండల్‌కు చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.बिहार के भागलपुर में एक शख्स को सांप ने काट लिया, जिसके बाद आदमी सांप पकड़कर अपने साथ अस्पताल ले आया. pic.twitter.com/jwoxj1N1sM— Priya singh (@priyarajputlive) October 16, 2024 ఇదీ చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..! -
ఆరు నెలల పాపకు ప్రాణం పోసిన అంకురా హాస్పిటల్ ..
స్త్రీ, శిశు ఆరోగ్యంలో ప్రత్యేక సేవలందించే ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకురా ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ ఆస్పత్రి అరుదైన ఘనతను సాధించింది. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల పాపకు ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ వైద్య బృందం సదరు శిశువుకి అత్యాధునికి చికిత్స అందించి పెరిటోనియల్ డయాలసిస్ చేయించారు. తద్వారా ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించడమే గాక తల్లిదండ్రులలో కొండంత ఆశను నింపారు.చిన్నారిని అంకురా హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పుడు..వివిధ అనారోగ్యాలతో తీవ్రమైన స్థితిలో ఉంది. వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన నిర్జలీకరణం, మూడు నుంచి నాలుగు నెలల వరకు బరువు పెరగకపోవడం, పొటాషియం స్థాయిలు తక్కువగా ఉండటం, శరీరంలో ఆమ్లం పెరగడం వంటి సమస్యలతో ఉంది. అత్యవసర పరిస్థితిని గుర్తించిన అత్తాపూర్ అంకురా ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఖలీల్ ఖాన్ వెంటనే చిన్నారిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా, శిశువు మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు తేలింది.అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంకుష్ కొమ్మవార్ మాట్లాడుతూ.. "క్లినికల్ పరీక్ష ఫలితాల ఆధారంగా, రోగి మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించాము. శిశువుకు మూత్రం, మూత్రపిండాలు రావడంలో ఇబ్బంది ఉంది. రోగికి పెరిటోనియల్ డయాలసిస్ అనేది సాధారణంగా పని చేయడం లేదు. కాబట్టి ఈ ప్రక్రియ గురించి పిల్లల తల్లిదండ్రులతో చర్చించి, వారి ఆమోదం పొందిన తర్వాత, డాక్టర్ రవిదీప్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ మార్గదర్శకత్వంలో వైద్య బృందం అత్యంత సున్నితమైన, కష్టతరమైన ప్రక్రియను నిర్వహించింది. తల్లిదండ్రుల సహాకారంతో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల మార్గదర్శకత్వంలో చికిత్స అందించారు. ఫలితంగా శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. బరువు పెరిగింది. అలాగే ఇంటరాక్టివ్ వయస్సు తగిన విధంగా మైలురాళ్లను చేరుకుంది. చిన్నారిని విజయవంతంగా డిశ్చార్జి చేశారు.ఈ మేరకు హైదరాబాద్‌లోని అంకురా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. "అంకురా హాస్పిటల్లో ప్రాణాలను కాపాడటం, రోగుల శ్రేయస్సును నిర్ధారించడం మా లక్ష్యం. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మా వద్ద ఉంది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్లో ఆ శిశువుకి అందించిన అపూర్వమైన సంరక్షణ ఇందుకు నిదర్శనం. అంకురా హాస్పిటల్లో ఖచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యంతో కూడిన బృందం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రోగులకు సేవలందిస్తోందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
కోల్‌కతా: పేషెంట్ కుమారుడిపై దాడి.. భద్రతపై జూడాల ఆందోళన
కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌లోని ఓ రోగి కుమారుడిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఇవాళ(ఆదివారం) ఉదయం ఆస్పత్రిలోకి చొరబడి ఒక రోగి బంధువుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా, డాక్టర్ల భద్రతా చర్యల గురించి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.‘‘ఉదయం 8 గంటల సమయంలో 10-15 మంది వ్యక్తులు మోటారుబైక్‌లపై వచ్చి ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్‌కు చొరబడి, ఈ రోజు డిశ్చార్జ్ కావాల్సిన బంకురాకు చెందిన రోగి కుమారుడు సౌరవ్ మోదక్పై దాడి చేశారు. మోదక్‌కు తీవ్రగాయాలవడంతో అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు’’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.Mob attack on patient's relatives at Trauma Care Centre of SSKM Hospital, Kolkata. Police once again mere spectators! This is the state of security and healthcare safety in a top government medical college like SSKM. Shame! What will the political slaves of TMC say now? Or are… pic.twitter.com/E71IpS34aq— Dr. Abhinaba Pal (@abhinabavlogs) October 13, 2024 జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో.. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేశామనే సీఎం మమమతా ప్రభుత్వ భరోసాపై ఈ దాడి ఘటన తీవ్ర అనుమానాలకు తావిస్తోందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యానికి ఈ ఘటన స్పష్టమైన ఉదాహరణ అని ఓ జూనియర్ డాక్టర్ అన్నారు. ఎస్ఎస్కేఎం వంటి పెద్ద ఆసుపత్రిలో ఇటువంటి దాడి సంఘటన జరిగితే.. భద్రతను కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నిబద్ధతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని తెలిపారు.ఇక.. ఈ దాడిలో గాయపడిన వ్యక్తి ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిపై జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముక పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) ఇక లేరు. అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి ఆయన మరణించారు.1937 డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. గత కొంత కాలంగా రతన్ టాటా అనారోగ్యంతో బాదపడుతున్నారు. రతన్ టాటా మరణించినట్టు టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. -
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ .. డాక్టర్ని కాల్చి చంపిన టీనేజర్లు
ఢిల్లీ : గాయమైన తన కాలుకి వైద్యం చేసిన ఓ డాక్టర్‌ను ప్రిస్క్రిప్షన్ అడిగి మరీ ఓ ఇద్దరు టీనేజర్లు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతుంది. ఢిల్లీ పోలీసు వివరాల మేరకు.. ఢిల్లీలోని జైత్పూర్ ప్రాంతంలో జావేద్ అక్తర్ యునాని వైద్యుడిగా చెలామణీ అవుతున్నారు. నిమా ఆస్పత్రి పేరుతో ప్రాచీన వైద్యాలుగా పేరుగాంచిన యునానీ వైద్య పద్ధతుల ద్వారా పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.జావెద్ అక్తర్ రెండ్రోజుల క్రితం కాలికి గాయమైన ఇద్దరు టీనేజర్లకు ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆ ఇద్దరు టీనేజర్లు మరోసారి బుధవారం అర్థరాత్రి 1.30గంటల సమయంలో కాలికి డ్రెస్సింగ్ చేయాలని కోరారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారికి డ్రెస్సింగ్ చేశారు. అనంతరం ప్రిస్క్రిప్షన్ కావాలంటూ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు. వెళ్లిన క్షణాల్లోనే క్యాబిన్ నుంచి కాల్పులు శబ్ధం వినపడింది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్ క్యాబిన్‌ను పరిశీలించగా.. డాక్టర్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీశారు. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రెండ్రోజుల క్రితం ఆ ఇద్దరు టీనేజర్లు ఆస్పత్రి భయట రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్.. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ సార్ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్ విడుదల చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டு குணமடைந்து வரும் சூப்பர் ஸ்டார் திரு. @rajinikanth sir அவர்கள் விரைவில் பூரண உடல்நலத்துடன் வீடு திரும்ப வேண்டும் என்று உளமார இறைவனை வேண்டுகிறேன்.— TVK Vijay (@tvkvijayhq) October 1, 2024 -
HYD: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్ -
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ
బెగుసరాయ్: బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.వివరాల్లోకి వెళితే బెగుసరాయ్‌లోని లోహియా నగర్‌కు చెందిన నందనీ దేవి డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి -
దీప్‌వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్‌తో అలరించారు. -
ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే దీపికా పదుకొణె రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్లోనూ నటించనుంది. -
ఆర్జీ కర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి!
బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు. శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
రూ. 5 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం.. పదేళ్లలో రాని ఒక్క రోగి.. కారణమిదే!
ఎక్కడైనా ఆసుపత్రులను నిర్మించడం పెద్ద సవాలుతో కూడుకొని ఉంటుంది. నిధుల సేకరణ, బిల్డింగ్‌ను కట్టడం, వైద్య పరికరాలు అమర్చడం, వైద్యులను నియమించడం, వసతులు కల్పించడం ఇలా ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉంటాయి. కానీ అదే ఆసుపత్రిని కట్టడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనేక జబ్బులను నయం చేయవచ్చు. ఇప్పుడిదంతా ఎందుకంటే..బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కోట్లాది రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని అయితే నిర్మించారు కానీ గత పదేళ్లుగా అక్కడ ఒక్క రోగి కూడా వైద్యం అందలేదు. ఇందుకు ఇంకా ఆ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయకపోవడమే కారణం. అవును నిజమే..చాంద్ పురా ప్రాంతంలో ఆరు ఎకరాల్లో 30 పడకల ఆసుపత్రిని 2015లో రూ.5 కోట్లతో నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. కానీ ప్రారంభోత్సవం చేయకుండానే వదిలేయడంతో పొలం మధ్యలో శిథిలావస్థకు చేరుకుని దొంగలు, మందుబాబులుగా అడ్డాగా మారింది. అక్కడ ఒక్క రోగికి కూడా వైద్యం అందకపోవడంతో వైద్య పరికరాలు పాడైపోయాయి. ఆసుపత్రిని నిర్మించి పదేళ్లు కావస్తున్నా దీనినివైద్యారోగ్య శాఖ ఆధీనంలోకి తీసుకోలేదని, ఈ సౌకర్యాల గురించి అసలు తమకు తెలియదని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఈలోపు దొంగలు ఆసుపత్రి కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్బోర్డ్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. దీంతో ఆసుపత్రి ఓ అస్థిపంజరంలా మిగిలిపోయింది. ఆసుపత్రి క్యాంపస్‌లో మూడు భవనాలు ఉండగా.. ఆరోగ్య కార్యకర్తల నివాసం, పరీక్షా కేంద్రం, ప్రధాన భవనాలుగా నిర్మించారు.#Bihar Hospital Abandoned for 10yrs Becomes Haven for Thieves Government hospital in #Muzaffarpur Bihar built in 2015 at cost of ₹5 Crs, has never been inaugurated or opened for patients. The 30-bed hospital, equipped with modern facilities, has been left to deteriorate, with… pic.twitter.com/In9CAFQZW3— Nabila Jamal (@nabilajamal_) September 6, 2024ఆసుపత్రి నానాటికీ క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం నగరవాసులు నగరానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు లక్ష జనాభా నివాసం ఉంటుంది. ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు, దాని గొప్పతనాన్ని చూసి, చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇకపై నగరానికి 50 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు నగరానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ షెరియాను ఆరా తీయగా.. ఆసుపత్రి గురించి తనకు తెలియదని, పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. సివిల్ సర్జన్, సర్కిల్ అధికారి వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని చెప్పారు. -
ఆస్పత్రిలో బాలీవుడ్ భామ.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన చేతి వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. "నా కోసం ప్రార్థించండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. అయితే చిన్న గాయానికే ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఎర్రటి గులాబీలతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన డైహార్డ్ ఫ్యాన్స్ లక్ష గులాబీలు పంపించారంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.కాగా.. చివరిసారిగా గుస్పైథియా అనే చిత్రంలో ఊర్వశి రౌతేలా నటించింది. అంతకుముందు తెలుగులో వాల్తేరు వీరయ్య, అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్‌పై దాడి
ఢిల్లీ: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లకు 11 రోజుల పాటు సమ్మె చేసి ఇటీవల విరమించారు. సమ్మె విరమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓ రెసిడెంట్ డాక్టర్, మెడికల్ డ్రెస్సర్‌పై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని కర్కర్దూమాలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బాధిత డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘శనివారం అర్ధరాత్రి 1 గంటలకు తలపై గాయంతో ఓ వ్యక్తి హాస్పిటల్‌కు వచ్చాడు. గాయానికి కుట్లు వేయటం కోసం డ్రెసింగ్ రూంలోకి పేషెంట్‌ను తీసుకువెళ్లాను. నేను గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో పేషెంట్ ఒక్కసారిగా నాపై దుర్భాషలాడు. రూంకి బయట ఉన్న.. పేషెంట్ కుమారుడు వెంటనే లోపలికి నా ముఖంపై దాడి చేశాడు. తర్వాత ఇద్దరూ నన్ను దుర్భాషలాడారు’’ అని బాధిత రెసిడెంట్ డాక్టర్ తెలిపారు. పేషెంట్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డాక్టర్ తెలిపారు. ఢిల్లీలోని వందలాది రెసిడెంట్ డాక్టర్లు ఆగస్టు 23న తమ సమస్యలను పరిష్కరించి, రక్షణ కల్పించాలని సమ్మె చేపట్టారు. అయితే సుప్రీంకోర్టు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనుసరించి విధుల్లో చేరారు. రెసిడెంట్ డాక్టర్లు.. ఆగస్టు 12న ప్రారంభించిన సమ్మె కారణంగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. -
డైరెక్టర్ వివి వినాయక్‌కు మేజర్ సర్జరీ
ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కొన్ని నెలలుగా కాలేయానికి సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. కాలేయానికి సంబంధించి వినాయక్‌కు మేజర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన ఆయన నుంచి రాలేదు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడుతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్సీపీ ధర్నాకు దిగుతుంది. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, విశాఖపట్నం/తుమ్మపాల/అనకాపల్లి: ఒకవైపు కాలిన గాయాలు.. మరోవైపు సర్కారు నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులను అండగా నేనున్నానంటూ ఓదార్చారు. తృటిలో ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో తల్లడిల్లుతున్న క్షతగాత్రుల్ని ఊరడించి కన్నీళ్లు తుడిచారు. ఆత్మీయ స్పర్శతో కొత్త ఊపిరి అందించారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తున్నా ప్రభుత్వం అందించలేని ప్రేమ పూర్వక భరోసాని వైఎస్ జగన్ అందించారు. ఎవరూ అధైర్యపడొద్దు.. మీరంతా క్షేమంగా ఇంటికి చేరుకుంటారు.. నిబ్బరంగా ఉండాలంటూ ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. చికిత్స అనంతరం అందరూ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా మేం అండగా నిలిచి పోరాడతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భరోసానిచ్చారు. ఎవరికి, ఎలాంటి సమస్య ఎదురైనా మా పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని, వెంటనే వారి దృష్టికి తేవాలని సూచించారు. ఆస్పత్రి అంతా కలియతిరిగి..విశాఖ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో అనకాపల్లి వచ్చారు. ఉషా ప్రైమ్ హాస్పిటల్‌కు 11 గంటలకు చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రుల్ని పరామర్శించారు. సుమారు గంటన్నరకుపైగా ఆస్పత్రిలో గడిపారు. మూడు ఫ్లోర్లలో ఐసీయూ, ఇతర వార్డుల్లో కలియతిరిగి చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది..? వైద్యం ఎలా అందుతోందని ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి బాధని తెలుసుకుంటూ.. సమస్యలను వింటూ సావధానంగా ఆలకించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులను పలకరించారు. ప్రతి ఒక్కరినీ పేరుతో పలుకరిస్తూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని వాకబు చేశారు. క్షతగాత్రులంతా 22 నుంచి 45 ఏళ్లు లోపు వారే ఉన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పరిహారం వచ్చే వరకూ పోరాడతామని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు. రెండో ఫ్లోర్లో క్షతగాత్రుడు జె.వర్థన్‌ను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. మీ భరోసాతో గాయాలు మానిపోయినట్లుగా ఉందని వర్థన్ ఆత్మస్థైర్యంతో చెప్పాడు.» అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం ఇప్పుడు.? » ఇప్పుడు ఫర్వాలేదు సర్. కాస్త బాగుంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా..?» ఏమో సర్.. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. నేను ‘ఏ’ షిఫ్ట్‌లో పని చేస్తున్నా. మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తున్న టైమ్‌లో పెద్ద పేలుడు శబ్ధం వచ్చింది. నేను పడిపోయా. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కాలిన గాయాలు, దెబ్బలతో నరకం చూశా. ఇప్పుడు కాస్త కోలుకున్నా.» ఏం భయం లేదన్నా.. ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా ఉంటే త్వరగా నయమవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం చూస్తాం. జాగ్రత్తన్నా. అనంతరం పక్కనే చికిత్స పొందుతున్న వెంకటాపురం గ్రామానికి చెందిన జి.రాజారావు దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్ ఆరా తీశారు.» ఇప్పుడెలా ఉందన్నా..? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు.?» సార్.. మీరు బాగున్నారా సర్. ఇప్పుడు కొంత ఫర్వాలేదు సర్. నిన్నటిమీద కొంచెం మెరుగుపడింది. నేనప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. బ్లాస్ట్ అయిన వెంటనే భయంతో అక్కడి నుంచి దూకేశా. కాలు విరిగిపోయింది. కదల్లేకపోయా. నా పక్కనే ఉన్న మరో ఇద్దరు మాత్రం ప్రమాదంలో చనిపోయారు (విలపిస్తూ).» వైఎస్ జగన్ ఆయన్ను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, మీకు తోడుగా మేం ఉంటామంటూ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న సోమలింగపాలెం ప్రాంతానికి చెందిన కె.రామ్మెహర్బాబుని పరామర్శించిన వైఎస్ జగన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు.» అన్నా.. ట్రీట్మెంట్ బాగా జరుగుతోందా? ఇప్పుడెలా ఉందన్నా?» జగనన్నా.. నమస్తే.. దేవుడి దయతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఏమైందో తెలుసుకునే లోపు గాయాలపాలయ్యా. తల, మెడ, కాలికి దెబ్బలు తగిలాయి. డాక్టర్లు బాగానే చూసుకుంటున్నారు.» మీరేం దిగులు పడకండన్నా. అమ్మా..! రామ్‌మెహర్ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా మేం పోరాడతాం... అంటూ బాధితుడి భార్యకు జగన్ భరోసానిచ్చారు.అక్కడి నుంచి మూడో ఫ్లోర్లో చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన డి.అప్పారావును వైఎస్ జగన్ పలకరించారు.» అన్నా ఎలా ఉన్నారు? వైద్యం బాగా అందుతోందా?» నమస్తే జగనన్నా.. ఇప్పుడు బాగానే ఉంది. వైద్యం బాగానే అందుతోంది.» ప్రమాదం ఎలా జరిగిందన్నా.? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు..?» అన్నా.. కంపెనీలో నేను ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లా. నేను పైకి వెళ్తున్న సమయంలో ఏ–షిఫ్ట్ వాళ్లంతా కిందకి వస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చిందన్నా.. అద్దాలు పగిలిపోయాయి. అందరం కిందపడిపోయాం. నా తలకు బలంగా ఓ అద్దం ముక్క తగిలింది. కాసేపటికి కొందరు వచ్చి నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. » అయ్యో.. జాగ్రత్తన్నా.. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా..?» ఇంకా లేదన్నా.. ఇస్తామని చెప్పారు. నా భార్య సత్యవతి, మా ఇద్దరు పాపలు నా జీతం మీదే ఆధారపడి బతుకుతున్నారు. నేను ఉద్యోగానికి వెళ్లకపోతే ఇల్లు గడవదన్నా.» మరేం ఫర్వాలేదన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. మీకు రావాల్సిన పరిహారం వచ్చేలా మేం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం.పక్కనే చికిత్స పొందుతున్న యలమంచిలికి చెందిన ఎ.పరమేశ్ని వైఎస్ జగన్ పరామర్శించారు. » అన్నా.. ఎలా ఉంది ఆరోగ్యం..?» నమస్తే అన్నా.. ఏదో బయటపడ్డాం అన్నా. ప్రమాదం జరిగిన క్షణాల్లో తల, చెవి, చేయి కాలిపోయింది. ఆస్పత్రికి వచ్చి ట్రీట్మెంట్ అందేవరకూ కాలిన గాయాలతో నరకం చూశా. నా కుటుంబం దగ్గరకు చేరుకుంటానా లేదా అనే ఆందోళనే నాలో ఎక్కువైపోయిందన్నా..» బాధ పడొద్దన్నా.. మీరు త్వరగా కోలుకుంటారు. జాగ్రత్త అంటూ ఆత్మీయంగా పరామర్శించారు.దేశ పాత్రుని పాలెం ప్రాంతానికి చెందిన కె.షణ్ముఖరాజుని జగన్ పరామర్శించారు.» అన్నా.. కంటికి గాయమైందా.? ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారన్నా.?» నమస్తే సర్.. నేను ప్రొడక్షన్లో పనిచేస్తున్నా. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్నా. ఆ శబ్దానికి తూలిపోయి కిందపడ్డా. కంటిమీద, మొహం మీద బాగా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు బాగానే ఉంది కానీ పైనుంచి పడిపోవడం వల్ల.. ఒళ్లంతా నొప్పిగా ఉందన్నా.. కదల్లేకపోతున్నా.» తగ్గిపోతుందన్నా.. మీరు ధైర్యంగా ఉండండి. ట్రీట్మెంట్కు సహకరిస్తే.. అంతా మంచే జరుగుతుంది. పరిహారం కచ్చితంగా అందేలా నేను చూసుకుంటానంటూ ధైర్యాన్నిచ్చారు.బాధితుడు ప్రభాత్ యాదవ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.» అన్నా.. ఎలా ఉంది ఇప్పుడు..? కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు.?» నాది హైదరాబాద్ బ్రాంచ్. నెల రోజుల ట్రైనింగ్ కోసం ఇక్కడికి ఈ నెల 18న వచ్చా. ఆ రోజు నాతోపాటు ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరు కలిసి మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్తున్నాం. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత చూసే సరికి.. ముగ్గురం రక్తాలు కారుతూ వేర్వేరు చోట్ల పడి ఉన్నాం. నా పక్కన ఉన్న వాళ్లిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. » అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నా. మీరు జాగ్రత్తగా ఉండండి... మీకు పరిహారం అందేలా చూస్తామంటూ జగన్ భరోసా ఇచ్చారు.మరో వార్డులో చికిత్స పొందుతున్న ఉమ్మలాడకు చెందిన యామినిని వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు.» తల్లీ ఎలా ఉంది ఇప్పుడు.? ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నావు?» నమస్తే జగనన్నా.. నేను ఏడాది క్రితం నుంచి ఎసైన్షియాలో కెమిస్ట్రీ ల్యాబ్‌లో పనిచేస్తున్నా. » ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్నావా తల్లీ.?» అవునన్నా.. కంపెనీ డిపో పక్కనే ఉన్న ల్యాబ్‌లో పనిచేస్తున్నా. ఇంతలో పెద్ద బాంబు పేలినట్లుగా శబ్దం వచ్చింది. పై నుంచి కిందకు పడిపోయా. ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను తీసుకెళ్లడం గుర్తుంది. తలకు దెబ్బతగిలింది. తుంటి ఎముక విరిగిపోయింది.» భయపడొద్దు తల్లీ.. ఆరోగ్యం జాగ్రత్త. పాప క్షేమంగా ఇంటికి వస్తుంది. మీరేం కంగారు పడకండమ్మా.. అంటూ యామిని తల్లిదండ్రులకు జగన్ భరోసా ఇచ్చారు.