injuried
-
సమంతకు గాయాలు, ఫొటో వైరల్
ఇటివలె మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత తాజాగా షూటింగ్లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె తన సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సామ్ వెల్లడించారు. షూటింగ్ గాయపడంతో తన రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతులకు గాయాలైన ఫొటోను ఈ సందర్భంగా సామ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. యాక్షన్ సీన్స్ చేస్తుండగా తన రెండు చేతులకు గాయాలైనట్లు సమంత వెల్లడించారు. చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి గతేడాది యశోద మూవీ చిత్రంతో అలరించిన ఆమె సినిమా రిలీజ్‌కు ముందు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సామ్ ఇటీవల మయోసైటిస్ కోలుకున్నారు. తిరిగి తన మూవీ షూటింగ్స్ ప్రారంభించిన సామ్ మొదట సిటాడెల్ వెబ్ సిరీస్ సెట్లో అడుగుపెట్టింది. దీనిని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రూసొ బ్రదర్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామ్‌పై ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా సమంతకు చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
షూటింగ్లో రోహిత్ శెట్టికి గాయాలు.. ఎల్బీ నగర్ ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ దర్శక-నిర్మాత, స్టంట్ మాస్టర్ రోహిత్ శెట్టికి గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులో జరుతున్న షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. కాగా, బాలీవుడ్లో రోహిత్ శెట్టి యాక్షన్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాలే ఉంటాయి. చదవండి: విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్ -
షూటింగ్లో గాయం, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్
షూటింగ్లో హీరోహీరోయిన్లు గాయపడం సాధారణంగా వింటూనే ఉంటాం. తాజాగా ఓ యంగ్ హీరోయిన్లో షూటింగ్ గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ముఖచిత్రం. శుక్రవారం(డిసెంబర్ 9న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చిత్ర డైరెక్టర్ గంగాధర్ ఆసక్తిర విషయం బయటపెట్టాడు. కాగా చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. అందులో ముంబైకి చెందిన కొత్త నటి అయోషా ఖాన్ ఒకరు. ఈ మూవీతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో హీరోహీరోయిన్లతో పాటు ఇంటర్య్కలో పాల్గొన్న డైరెక్టర్ గంగాధర్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అయోషా షూటింగ్లో గాయపడినట్లు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఓ కారు యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ అయేషాకు తీవ్రంగా గాయపడింది. అనుభవం లేకపోవడం వల్ల తను ఆ సిచ్చువేషన్ను హ్యాండిల్ చేయలేకపోయింది. దీంతో కింద పడటంతో తన నడుము, వెన్నుభాగంలో గాయమైంది. చెప్పాలంటే ఆ గాయాలు చాలా తీవ్రమైనవి. దానివల్ల తను జీవితాంత వీలు చేర్పైనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ తను తక్కువ బరువు ఉండటం వల్ల పెద్దగా ప్రమాదం జరగలేదు. కొద్ది రోజుల్లోనే తను ఈ గాయం నుంచి కోలుకుంది. లేదంటే జీవితాంతం వీల్ చైర్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉండేది’ అంటూ డైరెక్టర్ గంగాధర్ పేర్కొన్నాడు. అనంతరం అయేషా చాలా బాగా నటించిందని, ఈ సినిమాతో తర్వాత తనకు మంచి మంచి అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్ సిరీస్ నటి, వరుడు ఎవరంటే..! -
పెళ్లిలో తలెత్తిన గొడవ...నలుగురు మృతి
అందంగా జరుపుకోవాల్సిన వివాహ వేడుక విషాదంగా మారింది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా చిన్న రగడ మొదలైంది. అది కాస్త తీవ్రంగా పరిణమంచి నలుగు వ్యక్తులు మృతికి దారితీసింది. వివరాల్లోకెళ్తే...స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఓ రెస్టారెంట్లో వివాహం జరగబోతోంది. ఇంతలో ఏమైందో ఏమో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ చోటుచోసుకుంది. అది కాస్త మరింత రసాభాసగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అనుహ్యంగా ఒక కారు పెళ్లికి వచ్చిన అతిథులపైకి దూసుకు వచ్చింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఐతే దాడికి పాల్పడిన కారుని రెస్టారెంట్‌కి 50 కి. మీ సమీపంలోనే పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గరులో ఒకరు తండ్రి, మిగతా ఇద్దరు అతని పిల్లలుగా గుర్తించారు. దీంతో మరోకరు కూడా ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు గాలించడం ప్రారంభించారు. (చదవండి: 9 రోజుల పాటు గనుల్లో చిక్కుకున్న కార్మికులు...కాఫీ ఫౌడర్, నీళ్లే ఆహారంగా..) -
నడవలేని స్థితిలో పూజ.. ఫొటో షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
ప్రస్తుతం పుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఎస్ఎస్ఎమ్బీ28 (SSMB28)తో పాటు బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే అందులో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం ఒకటి. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటుంది. ఇటీవల పూజా షూటింగ్ సెట్లో బర్త్‌డేను కూడా సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పూజా గాయపడినట్లు తెలుస్తోంది. తన కాలు లిగ్మెంట్ టియర్ కావడంతో ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిది. కాలుకు పట్టి కట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లిగ్మెంట్ టియర్ అయ్యిందని ఆమె తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాజాగా ఈ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడనవసరం లేదని, తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని కూడా తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే ఈ గాయం ఎలా అయ్యిందనేది మాత్ర ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా తను గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పూజ ఎస్ఎస్ఎమ్బీ28తో పాటు విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ జనగనమణ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న ఆమె రీసెంట్ మరో చిత్రాలనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆమె రణ్వీర్ సింగ్ సరసన జోడి కట్టనుందట. -
ప్రముఖ సింగర్‌పై హత్యాయత్నం, ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ పంజాబ్ సింగర్‌పై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్య ఘటన మరవకముందే మరో పంజాబీ సింగ్‌పై దాడి జరగడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. శనివారం రాత్రి పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్‌పై హత్యాయత్నం జరిగినట్లు పంజాబీ ర్యాపర్ హనీ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మేరకు అల్ఫాజ్ సింగ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హనీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో అల్ఫాజ్ సింగ్ తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్‌కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ ‘శనివారం రాత్రి నా సోదరుడు అల్ఫాజ్ సింగ్ పై ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారు ఎవరైనా వారిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి నా సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అంటూ హనీ సింగ్ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే అతడి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉందని చెప్పాడు. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సింగర్ అల్ఫాజ్ పై హత్యాయత్నానికి ప్రయత్నించి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అల్ఫాజ్ ని హాస్పిటల్ లో చేర్పించారట. అయితే.. అల్ఫాజ్ పై దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: కె భాగ్యరాజ్‌కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు View this post on Instagram A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh) -
మెగా బ్రదర్ నాగబాబు చేతికి గాయం.. ఆయనకు ఏమైంది?
మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల చేతికి గాయమైంది. నాగబాబు తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా వీడియోలో ఆయన చేతికి కట్టు వేసుకుని కనిపించారు. దీంతో ఆయన చేయి ఫ్యాక్షర్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు ‘ముల్లును ముల్లుతోనే తియాలంటే ఇదేనేమో.. అయితే ఇది ఎవరూ ఇంట్లో ట్రై చేయకండి. నిపుణురాలు డా.నీహారిక పర్యవేక్షణలో జరిగింది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు ఆయన. ఈ వీడియోలో తండ్రితో పక్కనే కూర్చుని ఉన్న నిహారిక సైలెంట్‌గా అల్లరి చేస్తోంది. తండ్రి గడ్డాన్ని నిమురుతూ ‘నొప్పిగా ఉందా నాన్న.. ఆ నొప్పి నేను తీసేయనా’ అంటుండగా.. పెద్ద పెద్ద డాకర్ట్స్ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది అంటాడు నాగాబాబు. చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ ‘నేను తీసేస్తా అంటున్నా కదా.. ఆ నొప్పి తీసేస్తా’ అంటూ నిహారిక తండ్రి చేయి పట్టుకుని గట్టిగా కొరికింది. ఆ నొప్పి భరించలేక నాగబాబు ఒక్కసారిగా గట్టిగా ఆరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ తండ్రి కూతుళ్ల బాండింగ్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు చేతికి ఏమైంది? ఆ గాయం ఎలా అయ్యిందనేది క్లారిటీ లేదు. దీంతో ఆయనకు ఏమైందా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
షూటింగ్లో ప్రమాదం.. హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ చేసే హీరోల్లో విశాల్ ఒకరు. పోరాట సన్నివేశాల కోసం డూప్ లేకుండా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఎంత సహజంగా చిత్రీకరిస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుందని నమ్మే హీరో విశాల్. ఈ క్రమంలో విశాల్ పలుమార్లు షూటింగ్లో గాయపడ్డ సంగతి తెలిసిందే. రీసెంట్గా లాఠీ సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్ కొన్నిసార్లు ప్రమాదానికి గురైన గురయ్యాడు. మరోసారి ఆయన తాజా చిత్రం షూటింగ్లో విశాల్‌కు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'బిగ్‌బాస్-6' కోసం నాగార్జున అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? ఇటివలే లాఠి మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్ను విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ మూవీతో బిజీగా ఉన్నాడు. నేడు గురువారం ఉదయం ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్న విశాల్ భారీ యాక్షన్ సీన్స్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో విశాల్ తీవ్రంగా గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. గాయపడ్డ విశాల్ ప్రథమ చికిత్స అనంతరం షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని, కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకొనున్నాడని సమాచారం. -
డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి షూటింగ్లో గాయపడింది. ప్రస్తుతం తను నటిస్తున్న వెబ్ సిరీస్‌లోని యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘వాళ్లు రోల్ కెమెరా.. యాక్షన్.. బ్రేక్ లెగ్ అన్నారు. అక్షరాల నేను అదే చేశాను. ఫలితంగా 6 వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. చదవండి: విజయ్ అన్న చీజ్ కావాలంట? అంటూ కామెంట్స్, ‘రౌడీ’ రియాక్షన్ చూశారా? కానీ, తొందర్లోనే మరింత శక్తితో తిరిగి షూటింగ్లో పాల్గొంటాను. అప్పటి వరకు నన్ను గుర్తుచేసుకోండి. ప్రార్థనలు ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృతజ్ఞతతో మీ శిల్పాశెట్టి కుంద్రా’ అంటూ రాసుకొచ్చింది. కాగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ పోలీసు ఆఫీసర్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్‌రోల్ పోషిస్తుండగా.. శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించింది. ఇందుకోసం ఇసుకలో పలు భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో శిల్పా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయతే గతంలో ఇదే షూటింగ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సైతం గాయపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్
-
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్
యంగ్ హీరో నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. తాజాగా ఆమె షూటింగ్లో గాయపడింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం ‘క్రీమ్’. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఫైట్ సీన్స్ చేస్తుండగా తన కాలు సరిగా ల్యాండ్ అవ్వకపోవడం మోకాలి దగ్గర బలమైన గాయమైందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఈ సందర్భంగా సంయుక్తి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే తనకు గాయమైనప్పటికీ.. సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్ చూసి ప్రేక్షకులు తనని మెచ్చుకుంటారని పోస్ట్‌లో పేర్కొంది. కాగా ఇటీవల కాలేజ్ కుమార్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె ‘ఆహా’లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘మన్మథ లీలై’లో నటించింది. -
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యంగ్ హీరో, ఆస్పత్రికి తరలింపు
ఇటీవల గోవా పర్యటనకు వెళ్లిన కన్నడ హీరో దిగంత్ మంచలే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన అతడు అక్కడ బీచ్‌లో జంప్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో అతడికి గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! అయితే ప్రమదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ‘వాన’ చిత్రంలో కీ రోల్ పోషించిన దిగంత్‌కు అడ్వెంచర్స్ చేయడం అంటే ఆసక్తి. దీంతో తరచూ అతడు సైకిలింగ్, ట్రెక్కింగ్, సముంద్రంలో స్క్యూబా డైవింగ్ చేస్తుంటాడు. అంతేకాదు ఈ వీడియోలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటాడు. కాగా గాలిపాట, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దిగంత్ ఇటీవల నటించిన గాలిపాట 2 మూవీతో ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ నటించిన ‘ఎవరు’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు. -
సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్..
Shahid Kapoor Opens Up On His Horrific Lip Injury In Jersey Shooting Set: షూటింగ్స్‌లో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటివల్ల కథానాయకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువడా యాక్షన్ చిత్రాల్లో పోరాట సన్నివేశాల సమయంలో హీరోలు గాయపడటం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఇటీవల షూటింగ్ సెట్లో గాయపడినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదవండి: శివన్న అని పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్ హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టిస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు షాహిద్ పేర్కొన్నారు. గ్రౌండ్ క్రికెట్ ఆడుతుండగా తన కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని చెప్పాడు. కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా తాలూకు ప్రయాణం గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షాహిద్ కపూర్ ముచ్చటించాడు. చదవండి: నాగ్ సరసన మెహరీన్ ఈ సందర్భంగా ‘క్రికెటర్ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్ బలంగా తాకడంతో నా క్రింది పెదవి చిట్లింది. 25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నారు. నాని కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ‘జెర్సీ’కి రీమేక్ ఇది. హిందీలో అల్లు అరవింద్ సమర్పణలో దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మిస్తున్నారు. చదవండి: ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్ హీరో View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
అయ్యో..గాయపడ్డాడు!
కెమెరా..రోలింగ్..యాక్షన్.. అన్నారు డైరెక్టర్. అంతే.. వరుణ్‌ధావన్ కో–స్టార్‌పై డోర్‌ను విసిరారు. దెబ్బ తగిలింది మాత్రం వరుణ్‌కే. విసిరేటప్పుడు డోర్ అతని మోచేతికి తగలడంతో గాయపడ్డారట. హీరోగారికి దెబ్బ తగిలిందని తెలియగానే నిర్మాత కరణ్ జోహార్ సెట్స్‌కి వచ్చేశారట. ఇదంతా హిందీ మూవీ ‘కళంక్’ సెట్లో జరిగింది. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్‌వర్మన్ దర్శకత్వంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షి సిన్హా ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. ప్రజెంట్ ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఇది వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాటలోనే డోర్ విసురుతారని సమాచారం. సాంగ్‌లో యాక్షన్ అన్నమాట. -
అదుపు తప్పి.. మదపుటేనుగులా..
రాజోలు : డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పిన కళాశాల బస్సు.. మదపుటేనుగులా విద్యార్థులతో పాటు రోడ్డుపై వెళుతున్న వారిని భీతావహులను చేసింది. 5గురు విద్యార్థులు సహా 8 మందిని తీవ్రంగా గాయపరిచింది. శనివారం ఉదయం 8.30 గంటలకు తాటిపాక నుంచి ఓడలరేవు వెళ్తున్న బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మొదట ట్రాక్టర్‌ను, మోటార్ సైకిల్‌ను, సైకిల్‌ను, తర్వాత రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం ముక్కలై బస్సు మీద పడడంతో విద్యార్థులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కర్రి సత్యనారాయణ, మోటార్‌సైకిల్‌పై కుమారుడిని పదవ తరగతి పరీక్షకు తీసుకు వెళ్తున్న దీపాటి జగదీష్, సైకిలిస్ట్ రుద్రా సత్యనారాయణ, విద్యార్థులు పుచ్చకాయల దుర్గాప్రసాద్, దొడ్డా జ్యోతి శిరీష, మల్లిపూడి రాజేష్, కానూరి నరేష్, ప్రభుతేజ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డ వారిలో కొందరిని స్థానిక ఎంఎస్ ఆస్పత్రికి , కొందరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పి.వి.రమణ, సీఐ క్రిష్టోఫర్, ఎస్సై లక్ష్మణరావు పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. సఖినేటిపల్లి నుంచి ఓడలరేవు బయలుదేరిన బస్సును ప్రారంభం నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, సోంపల్లి, పొదలాడ సమీపంలోనే కొద్దిలో ప్రమాదం తప్పిందని విద్యార్థులు చెప్పారు. రాజోలు, పి.గన్నవరం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది. -
రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు
-
రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలివిజన్ నటి రోహిణి రెడ్డికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పుష్కరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న బెలీనో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డితో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తదితర సీరియల్స్‌లో రోహిణిరెడ్డి నటించారు. -
ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు
బీజింగ్: బాంబు పేలుడుతో చైనాలోని షాంగై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దద్దరిల్లింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2 లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. -
రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి పరిస్థితి విషమం
కుషాయిగూడ(హైదరాబాద్): నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
భువనగిరి అర్బన్: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామం సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డీసీఎం వ్యాన్‌తోపాటు ఓ మహిళను ఢీకొంది. మంగళవారం రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నందనం గ్రామానికి చెందిన భిక్షపతి, మణెమ్మ దంపతులు నడుచుకుంటూ వెళుతుండగా వలిగొండ వైపు వెళుతున్న బైక్ ఆమెను ఢీకొంది. అనంతరం అదే బైక్ ఎదురుగా వస్తున్న డీసీఎంను కూడా ఢీకొంది. దీంతో మణెమ్మతోపాటు బైక్‌పై వెళుతున్న నవీన్‌రెడ్డి, ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు
జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని గాల్లోకి విసిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ గాల్లో నుంచి కిందికి వచ్చే సమయంలో వరుడు పట్టుకోవడంలో విఫలం అవ్వడంతో ఆ అమ్మాయి కింద పడింది. తల కిందులుగా పడటంతో మెదడుకు బలమైన గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న ఆ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో రిటైర్డు ఆర్మీ ఉద్యోగికి తీవ్రగాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలం అప్పినేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పుంగనూరుకు చెందిన ఆర్మీ రిటైర్డు ఉద్యోగి చంద్రశేఖర్‌రాజు(52) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అప్పినేపల్లి మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని, బంధువులకు సమాచారం ఇచ్చి కొన ఊపిరితో ఉన్న చంద్రశేఖర్‌రాజును వెంటనే వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
దుండగుల దాడిలో బీజేపీ నేతకు తీవ్ర గాయాలు
కడప అర్బన్: కడప పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు బండి ప్రభాకర్‌రావుపై ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. నగరంలోని రాజీవ్‌పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. పార్క్ దగ్గర నుంచి బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు ప్రభాకర్‌రావు సిద్ధమవుతున్న సమయంలో 20 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ప్రభాకర్‌రావు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. -
స్కూలు వ్యాను ఢీకొని చిన్నారికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం ఉదయం స్కూలు వ్యాను ఢీకొన్న ఘటనలో చిన్నారి కాలు పోగొట్టుకుంది. మండల కేంద్రం హన్మాన్‌బస్తీకి చెందిన ఓదెలు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె హనీ(3) బుధవారం ఉదయం రోడ్డు పక్కన ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు బస్సు అటుగా వెళుతోంది. ప్రమాదవశాత్తు బస్సు తాకటంతో చిన్నారి కాలు పూర్తిగా నుజ్జయింది. దీంతో ఆమెను ములుగు ఆస్పత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాఠశాల వాహనాల్లో చిన్నారులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలంటూ అధికారులు అవగాహన కల్పించిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.