Kakinada District
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు. -
చంద్రబాబు రైతు ద్రోహి.. సెజ్‌పై విచారణ చేయాల్సిందే: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట.. అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్‌కు అనుకూలంగా ఒక మీడియా దర్మార్గమైన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు...2003లో పరిశ్రమల కోసం భూములను సేకరించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఈజడ్ కోసం 10 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 8,150 ఎకరాల్లో జీఎంఆర్ ఈ భూములు సేకరించింది. సెజ్‌లో రైతులు దీనిని వ్యతిరేకించారు. ఉద్యమం ప్రారంభించిన సేకరణ ఆగలేదు. 2012లో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా చంద్రబాబు మాటలు నమ్మింది. 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అపరిచితుడులా మారిపోయారు.రైతుల భూములను, ఎస్సైన్ లాండ్లను తిరిగి తీసేసుకుని సెజ్‌కి ఇచ్చేశారు. పోరాట కమిటీ నాయకులను పోలీసులతో వేధించి అక్రమ కేసులు పెట్టారు. 2018లో సెజ్ ఉద్యమం తీవ్రమైంది. సెజ్ పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో బాత్ రూమ్‌లు రైతులతో కడిగించారు. భూములు ఇవ్వాలని రైతులపై తీవ్రమైమ ఒత్తిడి తెచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. సెజ్‌కు భూములు ఇవ్వని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పాదయాత్రలో జగన్ పోరాట కమిటీ ఇచ్చారు. 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేయాలని నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తీర్మానం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్పా.. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా. చంద్రబాబు ఒక్కడే నీతి మంతుడిలా మీడియా చూపిస్తుందిరైతులను దారుణంగా వేధించారు: దాడిశెట్టి రాజామాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, తన బినామీ అయినా కేవీరావు ద్వారా 2003లోనే చంద్రబాబు సెజ్‌లో భూ సేకరణ చేశాడు. మొట్ట మొదటిగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు. దీంతో రైతులు కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. సెజ్ భూసేకరణ ద్వారా లాభపడింది యనమల రామకృష్ణుడు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే దీవిస్ వంటి రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. దీవీస్ కోసం పోరాడిన రైతులను పోలీసులతో దారుణంగా వేధించాడు. 2180 ఎకరాల భూములను సెజ్ నుండి రైతులకు వైఎస్ జగన్ తిరిగి ఇచ్చారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చిన జగన్ మంచివారా.. భూములు ఇవ్వాలని రైతులను హింసించిన చంద్రబాబు గొప్పవాడా?. 2003 నుండి జరిగిన భూ సేకరణ పై విచారణ చేయాలి. సెజ్‌లో జరిగిన అవకతవకలు బయట పెట్టాలి’’ ఆయన డిమాండ్ చేశారు.రైతులను చంద్రబాబు అవమానించారు.. జగన్ గౌరవించారు: వంగా గీతవంగా గీతా మాట్లాడుతూ.. సెజ్ గురించి 2003 నుంచి 2024 ఏం జరిగిందని రికార్డెడ్‌గా ఉంది. సెజ్‌లో భూముల కోసం పోరాడిన రైతులు ఉన్నారు. ఏరువాక చేసి సెజ్ భూములు వెనక్కి వస్తాయని చంద్రబాబు మోసం చేశారు. సీఎం అయిన వెంటనే రైతులను బెదిరించి చంద్రబాబు అవమానించారు. ఇప్పుడు మళ్లీ సెజ్ నుంచి ఏం ఆశించి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమాన్ని వైఎస్ జగన్ గౌరవించారు.సెజ్‌లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండేలా చేశారు. 2180 ఎకరాల్లో చాలా భూములు రైతులకు తిరిగి వెళ్లిఫొయాయి. మిగిలిన భూములు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వద్ద నిలిచిపోయాయి. వాటిని చంద్రబాబు సర్కార్ క్లీర్ చేసి ఆ భూములను వెనక్కి ఇవ్వాలి. సెజ్ మీద మళ్లీ ఎందుకు అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. సెజ్ మీద ఏదో కుట్ర కోణం ఉంది?. సెజ్‌పై విచారణ వేయాలి. 2003 నుంచి 2024 నుంచి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సెజ్ రైతుల సెంటిమెంట్‌ను వైఎస్ జగన్ గౌరవించారు. సెజ్‌ను రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి -
మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘సీజ్ ది షిప్’ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిస్ ప్లయినరీ కమిటీతో స్టెల్లా ఎల్ వన్ నౌకలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో తమ అనుకూల మీడియాకు మాత్రమే కూటమి సర్కార్ అనుమతిస్తోంది.పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే అంతర్జాతీయ షిప్‌ను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జనభజర్జన పడుతున్నారు. ఐదు రోజుల క్రిందట "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సముద్రంలో ఉన్న కెన్ స్టార్ నౌకను పరిశీలించకుండా పవన్ వచ్చేశారు.ఇదీ చదవండి: డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తాతమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారంటూ పట్టాభి అగ్రో ఫుడ్ అధినేత కే.వి.కృష్ణారావు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. తాజాగా కాకినాడ పోర్టు నుండి పట్టాభి అగ్రో ఫుడ్ చెందిన రా రైస్ (పచ్చి బియ్యం) విదేశాలకు ఎగుమతి అవుతోంది. "బిరస్ బుల్లోగ్" ప్యాకింగ్‌తో పచ్చి బియ్యాన్ని ఎంవీడీడీఎస్ మరీనా నౌకలోకి ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియాకు 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని పట్టాభి అగ్రో ఫుడ్ సంస్థ ఎగుమతి చేస్తోంది.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
ఎమ్మెల్యే కొండబాబు అలక.. శంకుస్ధాపనకు డుమ్మా
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అలక బూనారు. బయో మెథనేషన్ ప్లాంట్ శంకుస్ధాపనకు డుమ్మా కొట్టారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరుకాగా, ఎమ్మెల్యే కొండబాబు రాకపోవడంతో శంకుస్ధాపన, భూమి పూజకు ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు లేకుండానే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్ భావన ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్లాంట్‌కు మున్సిపల్ కార్పొరేషన్ రెండెకరాల స్ధలం కేటాయించింది. ప్లాంట్‌కు మున్సిపల్ కమిషనర్ భావన భూ కేటాయింపు చేయడంపై ఎమ్మెల్యే కొండబాబు గుర్రుగా ఉన్నారు. ‘‘నాకు తెలియదు.. నన్ను పిలవకండీ" అంటూ కొండబాబు చెప్పారంటూ చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మున్సిపల్ కమిషనర్ భావన, సిటీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ కొనసాగుతోంది. -
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడికాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
మరోసారి దాతృత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాశీవారి పాకలు గ్రామానికి చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలకు వెళ్లిన వైఎస్ జగన్‌ను కలిసిన బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్.. బాధితులకు ఆర్థిక సాయంతో పాటుగా వారి పక్షాన న్యాయ పోరాటం కోసం లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా చెక్కులు అందజేశారు.ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
కాకినాడ జిల్లాను ముంచెత్తిన ఏలేరు
-
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
ప్రత్తిపాడు సర్కిల్ అ‘ధర’హో
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ‘త్రీ స్టార్’ రేటింగ్ అదిరిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేలం వేసి మరీ పోస్టులు ఖాయం చేశారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ సర్కిల్ పోస్టు అర కోటికి ఖరారు కాగా.., ఇప్పుడు ప్రత్తిపాడు సర్కిల్ రూ. 30 లక్షలకు బేరం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు సర్కిల్ హాట్ సీటు. ఈ సర్కిల్ కోసం కొందరు ‘త్రీ స్టార్’లు ఓ నాయకుడి చుట్టూ నెల రోజులుగా తిరగ్గా.. గురువారం పోస్టు భర్తీ అయ్యింది. ప్రత్తిపాడుతో పాటు తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో త్రీ స్టార్ రేటింగ్ అదిరిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి చూడలేదని పోలీసులే విస్తుబోతున్నారు.సర్వం షాడో ఎమ్మెల్యేనే..ఇటీవలి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించి, ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న నాయకుడే పోలీసు బదిలీలు అన్నింటినీ ఫైనల్ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఒక సర్కిల్ పోస్టును రూ.అర కోటికి ఖాయం చేశారు. ఈ పోస్టు కోసం ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. చివరకు తన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే పనిచేసిన ఓ ‘త్రీ స్టార్’ అడిగినంతా ఇచ్చుకుని పోస్టు ఎగరేసుకుని పోయారు. ఇప్పుడు ప్రత్తిపాడుకు రూ. 10 లక్షల నుంచి మొదలై రూ.30 లక్షలకు ఖరారైంది. అందుకే అంత ధర!నాలుగు స్టేషన్లు ఉన్న ప్రత్తిపాడు సర్కిల్ అధికారులకు ఆయిల్ మాఫియా నుంచి నెల నెలా రూ.లక్షల్లో రాబడి వస్తుంది. మిగతా ఆదాయమూ పెద్దగానే ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తూ కల్తీ ఆయిల్ వ్యవహారంలో రూ.లక్షలు లంచం తీసుకొని ట్యాంకర్‌ను వదిలేసి, సస్పెండైన ఓ పోలీసు అధికారి, గుప్త నిధుల వ్యవహారంలో దొంగ సొమ్మునే దోచేసి చివరకు అసలు నిందితుడు పట్టుబడడంతో 2020లో సస్పెండైన మరో అధికారి కూడా ప్రత్తిపాడు కోసం ప్రయత్నించారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో మూడు, రూరల్‌లో రెండు, పెద్దాపురం నియోజకవర్గంలో ఒక సర్కిల్ పోస్టుకు ఒక్కో దానికి రూ.20 లక్షలు పైనే బేరం పెట్టినట్లు సమాచారం. -
కాకినాడ జిల్లాలో మందుబాబు హల్చల్
-
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
కాకినాడ, సాక్షి: టార్గెట్ వైఎస్సార్సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్లైన్ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు. -
రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు. -
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని తొలగిస్తాం
కాకినాడ రూరల్: కాకినాడ నగరం 49వ డివిజన్లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 452(1) అండ్ 461(1) ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్ 89 (1అండ్2), రెడ్ విత్ సెక్షన్ 82, 90(1) ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడీఏ యాక్ట్–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు. తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొన్నారు. కన్నబాబు లేదా ఆయన అనుమతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కడియాల శ్రీరమ్య డిజిటల్ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్ అవ్వలేదన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. -
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్‌కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్‌లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
ఉప్పాడలో ‘అల’జడి
కొత్తపల్లి : రెమాల్ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది.కెరటాల తాకిడికి యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కడలిలో కలిసిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల తాకిడికి జియోట్యూబ్ రక్షణ గోడ రాళ్లు సైతం గ్రామంలోకి వచ్చి పడ్డాయి. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది.