kharif crop
-
50 రకాల విత్తనాలను ప్రదర్శించిన మహిళలు
-
AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే
సాక్షి, విజయవాడ: ఖరీఫ్ సీజన్ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో నీటి కొరత లేదు ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని.. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని. పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నాని చెప్పారు. ‘పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదు. దివంగత వైఎస్సార్, సీఎం జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యింది. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటాం. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి సీఎం జగన్’ అనిపేర్కొన్నారు. చదవండి: 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయానికి కృషిచేద్దాం నెల రోజుల ముందే నీటి విడుదల రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో దేవుడు కరుణించాడని.. వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని తెలిపారు. రైతులకు పంటలు పండి మంచి దిగుబడి వచ్చిందన్నారు. నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారని చెప్పారు. ‘వైఎస్ హయాంలో పులిచింతల పనులు పూర్తిచేశారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు నిల్వ చేసుకున్నాం. కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ఇస్తున్నాం. పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారు. 12,900 కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించగలిగారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుంది. ఢిల్లీ వెళ్లి ఏం చేశారన్న వారు జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. -
రెండో పంటకూ నీరు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంట కాలం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికీ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వాడ కాల్వ రిజర్వాయర్ మినహా నీటి నిల్వ చేసే జలాశయాలు లేవు. వాటి సామర్థ్యం కూడా 3.65 టీఎంసీలే. ఆ రిజర్వాయర్లలో 3.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం, సీలేరులలో లభ్యత ఆధారంగా గోదావరి డెల్టాలో రెండో పంటకు ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల, గాజులదిన్నె, భైరవానితిప్ప ప్రాజెక్టులలో 586.21 టీఎంసీలకుగాను 506.97 టీఎంసీలు (86.48%) నిల్వ ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారడిన ప్రాజెక్టులతోపాటు కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు డిసెంబర్ 6న త్రిసభ్య కమిటీ నీటి పంపకాలు చేయనుంది. పులిచింతలలో 45.77 టీఎంసీలకుగానూ 45.31 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్‌లోని ఆయకట్టుకు రెండో పంటకు కూడా నీరందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్నా ప్రధాన పాయపై అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకూ అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. ఈ జలాశయాల నిల్వ సామర్థ్యం 238.75 టీఎంసీలు. ప్రస్తుతం 195.55 టీఎంసీలు ఉన్నాయి. ఈ బేసిన్‌లోని సోమశిల, కండలేరు, పెన్నా డెల్టాలో పంటలకు నీటిని విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏలేరు, వంశధార, నాగావళి బేసిన్లలోనూ.. ఏలేరు, వంశధార, నాగావళి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 154.87 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో 114.36 టీఎంసీలు (73.86 శాతం) ఉన్నాయి. ఏలేరు, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టుల కింద నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ(నీటిపారుదల సలహా మండలి) సమావేశాలలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్‌కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
ఖరీఫ్ సాగు భళా..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. ప్రాజెక్టులు నిండటం.. కేసీ కెనాల్‌కు నీరు రావడంతో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఖరీ‹ఫ్ సీజన్‌కు సంబంధించి సాధారణం కంటే అధికశాతంలో పంటలు సాగయ్యాయి. కొన్ని పంటలు వందశాతం, మరికొన్ని రెండువందల శాతం, ఇంకొన్ని మూడువందలశాతంపైగా కూడా సాగయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సోయాబీన్ పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగై రికార్డు సృష్టించింది. జిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 91991 హెక్టార్లు ఉండగా ఖరీఫ్ ముగిసే ఆక్టోబర్ 15వ తేదీ నాటికి జిల్లాలో 1,10,514 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ పంటలు సాగు చేశారు. సాధారం కంటే ఈ ఏడాది 18,523 హెక్టార్లలో అధికంగా పంటలు సాగై 120.14 శాతం నమోదైంది. దీంతోపాటు ఈ క్రాపు, ఈకేవైసీ నమోదులోనూ రాష్ట్రంలోనే వైఎస్సార్‌జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అత్యధికంగా సాగైన సోయాబీన్ ఈ ఏడాది జిల్లాలో సోయాబీన్ పంటను అత్యధికంగా సాగు చేశారు. పొద్దుటూరు, పులివెందుల, పెద్దముడియం, జమ్మలమడుగు, వేముల, వేంపల్లి, వీఎన్పల్లెతో పాటుపలు మండలాల్లో ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లాలో సోయాబీన్ సాధారణ సాగు 63 హెక్టార్లు కాగా ఈ ఏడాది 3,753 హెక్టార్లలో సాగు చేశారు. గతంలో మెట్టప్రాంతంలో ఏ పంటను సాగు చేయకుండా ఏగిలి పెట్టుకుని రబీ ప్రారంభం కాగానే శనగ సాగు చేసుకునేవారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం, పంటదిగుబడి కాలం 70 నుంచి 80 రోజులు కావడంతో ఎక్కువ మంది సోయాబీన్ ఖరీఫ్‌లో సాగు చేసుకున్నారు. తగ్గిన వరి విస్తీర్ణం జిల్లాలో ఈ ఏడాది వరి సాగు తగ్గింది. సాధారణం కంటే కూడా తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు 32,741 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 27,058 ఎకరాల్లో మాత్రమే సాగైంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్నా చాలా మంది ఆరుతడి పంటలవైపే మొగ్గుచూపారు. వరి సాగుకు ఖర్చులు పెరగడం, తెగుళ్లు ఎక్కువగా ఉండటం, పంట దిగుబడి సమయానికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది చాలా మంది రైతులు సాగు తగ్గించారు.కొందరు రెండోపంటగా వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కూడా సాగు విస్తీర్ణం తగ్గిందనే చెప్పాలి. రెండో పంట దిగుబడి సమయానికి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల బెడద తగ్గుతుంది.అందువల్ల రైతులు ఆ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తగ్గిన వేరుశనగ..పెరిగిన మినుము సాగు విస్తీర్ణం... జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గింది. సాధారణ సాగు 7,454 హెక్టార్లు ఉండగా ఈ ఏడాది 3,787 హెక్టార్లలో మాత్రమే సాగైంది. గత ఖరీఫ్‌లో జిల్లాలో 22,503 హెక్టార్లలో సాగైంది. మినుముకు సంబంధించి 1268 హెక్టార్లో సాధారణ సాగు ఉండగా 3838 హెక్టార్లలో సాగైంది. ఇతర పంటల సాగు వివరాలు ఇలా... జిల్లాలో పత్తి 17,303 హెక్టార్లలోసాగు చేయాల్సి ఉండగా 46,263 హెక్టార్లలో సాగై 267.37 శాతంగా నమోదైంది కుసుమ పంట 4 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 11 ఎకరాల్లో సాగైంది. పొద్దుతిరుగుడు పంట 874 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1870 హెక్టార్లలో సాగై 206.75 శాతం, టమాటా 1246 హెక్టార్లకుగాను 2041 హెక్టార్లలోసాగై 136 శాతం, ఉల్లి 3603 హెక్టార్లకుగాను 3690 హెక్టార్లలో సాగై 109.91 శాతం, రాగి 4 ఎకరాలకుగాను 7 ఎకరాల్లో సాగై 175 శాతం, ఆముదం 534 హెక్టార్లకుగాను 1031 ఎకరాల్లోసాగై 193.07 శాతం సాగయ్యాయి. çసజ్జలు, మొక్కజొన్న, కందులు, మిరప పంటలు సాధారణం కంటే తక్కువ హెక్టార్లలో సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది ప్రాజక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఖరీఫ్ సీజన్లో పంటలసాగు ఆశాజనకంగా ఉంది. సాధారణం కంటే అధికంగా సాగైంది. ఈ ఏడాది ఈ క్రాపు, ఈకే వైసీని కూడా వందశానికి మించి చేసి రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లా ప్రథమస్థానంలో నిలిపాం. చాలా సంతోషంగా ఉంది. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి -
Andhra Pradesh: రైతన్నలకు రూ.92,000 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: వర్షాలు, తుపాన్ల బారిన పడి రైతన్నలు పంటలు నష్ట పోరాదనే ఉద్దేశంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను ఆర్బీకేల ద్వారా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తోంది. మరోవైపు ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.71,000 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలుగా మరో రూ.21,000 కోట్లను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలవారీగా బ్యాంకర్ల కమిటీ సమావేశాలను నిర్వహించి లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందించాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసింది. ఈ ఏడాది 5.8 లక్షల మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్బీకేల వారీగా కౌలు రైతులను గుర్తించి సీసీఆర్ కార్డులను జారీ చేయడంతోపాటు ఇ–క్రాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. గోదావరి డెల్టాకు విడుదలైన సాగునీరు ఖరీఫ్‌లో ముందస్తు సాగునీటి విడుదలకు సంబంధించి ఆయకట్టు వారీగా తేదీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు విడుదల చేసేలా సాగునీటి శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే గోదావరి డెల్టాకు సాగునీటిని ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందస్తు సాగునీటి విడుదలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆర్బీకేల స్థాయిలో ఈ నెలలో తొలి శుక్రవారం, మండల స్థాయిలో రెండో శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం వ్యవసాయ సలహా మండలి సమావేశాలను విధిగా నిర్వహించాలని పేర్కొంది. పంటల ప్రణాళికలను ఖరారు చేసి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్బీకేల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నాణ్యత పరీక్షలు నిర్వహించిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 84,542 క్వింటాళ్ల పచ్చి ఎరువు విత్తనాలు, 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1,71,234 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 19.02 లక్షల టన్నుల ఎరువులను ఖరీఫ్‌లో పంపిణీ చేయనున్నారు. -
ఏపీ: ఖరీఫ్‌కు సన్నద్ధం
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2022 సీజన్ మొదలు కానుంది. మే నుంచే రైతులు సేద్యపు పనులు ప్రారంభించనున్నారు. జూన్ నుంచి సెపె్టంబర్ మధ్య నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు సాగులోకి రానున్నాయి.æ ప్రణాళిక, వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో 6,52,741 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. అనంతపురం జిల్లాలో 3,76,810 హెక్టార్లు సాగు అంచనా వేశారు. 2,43,578 హెక్టార్లలో వేరుశనగ జిల్లాలో ప్రధానపంట వేరుశనగ 2,43,578 హెక్టార్లలో సాగవనుంది. ఇందులో గుంతకల్లు మండలంలో అత్యధికంగా 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గంలో 14 వేల హెక్టార్లు, కూడేరు, గుత్తిలో 13 వేల హెక్టార్లు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, కుందురి్ప, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల్లో 10 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో వేరుశనగ వేయనున్నారు. తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో మాత్రమే వెయ్యి హెక్టార్లలోపు సాగు చేసే పరిస్థితి నెలకొంది. ట పెద్దవడుగూరు మండలంలో పత్తి ఏకంగా 16 వేల హెక్టార్లు సాగు అంచనా వేశారు. ఆ తర్వాత పామిడి, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, గుత్తి, వజ్రకరూరు, విడపనకల్లు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, శింగనమల మండలాల్లో పత్తి సాగులోకి రానుంది. టపుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంటుంది. ట ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, గార్లదిన్నె మండలాల్లో ఆముదం పంట ఎక్కువగా సాగు చేయనున్నారు. ట గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, గుత్తి, రాప్తాడు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కంది అధికంగా సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు ఖరీఫ్ సమీపిస్తుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా విత్తన వేరుశనగ, కంది తదితర విత్తనాల సేకరణ, అవసరమైన ఎరువుల సరఫరాపై వ్యవసాయశాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్బీకే వేదికగానే రైతులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) బి.చంద్రానాయక్ తెలిపారు. ఇది కూడా చదవండి: వైద్య శాఖలో బయోమెట్రిక్ తప్పనిసరి -
AP: సాగు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమయ్యే నాటికి గోదావరి డెల్టా రైతుల నీటి కష్టాలను కడతేర్చే దిశగా ముందస్తు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.43 కోట్లపై చిలుకు విలువైన 275 పనులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఏటా రబీ సీజన్ ముగియగానే కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా పంట కాలువలకు నీటిని నిలుపు చేస్తారు. తిరిగి ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాను ప్రారంభిస్తారు. కాలువలు మూసివేసి, తిరిగి తెరిచే లోగా వాటి పటిష్టత, పూడికతీత, ఔట్‌ఫాల్ స్లూయిజ్‌ల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు చేపడుతుంటారు. వీటిని క్లోజర్ పనులని అంటారు. ఈ పనుల ద్వారా ఖరీఫ్ సాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారు. గతంలో పంట కాలువలు మూసేసినప్పటికీ సకాలంలో ఆమోదించకపోవడం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో క్లోజర్ పనులు పూర్తయ్యేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ అధికారులు క్లోజర్ పనులపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోనసీమ జిల్లాలో అత్యధికం ఈసారి మొత్తం క్లోజర్ పనుల్లో మూడు వంతులు పైగా కోనసీమ జిల్లాలోనే చేపట్టనున్నారు. అక్కడే ఆయకట్టు ఎక్కువగా ఉండటంతో అందుకు తగ్గట్టు పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటికీ కలిపి రూ.43,09,77,000 మంజూరు చేస్తే ఇందులో కోనసీమ జిల్లాకు అత్యధికంగా రూ.34,93,32,000 కోట్లు కేటాయించారు. మిగిలినది తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు కేటాయించారు. అమలాపురం ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో బెండా కెనాల్, జనుపల్లి హెడ్ స్లూయీజ్‌కు నడిపూడి గ్రామ పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నారు. చెయ్యేరు చానల్ – గున్నేపల్లి బ్రాంచి కెనాల్స్, అల్లవరం చానల్, కౌశిక చానల్, అమలాపురం చానల్ నుంచి చిందాడగరువు చానల్, పి.గన్నవరం కెనాల్ నుంచి అమలాపురం కెనాల్ వరకు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పలు కాలువలను అభివృద్ధి చేయనున్నారు. కోనసీమలో అత్యధికంగా రాజోలు నియోజకవర్గంలో 52 పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తాం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తాం. దీనిపై అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక పనులు వేగవంతం చేస్తాం. – బి.రాంబాబు, ఎస్ఈ,ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రైతులకు లబ్ధి డెల్టా కాలువలకు నీటిని నిలిపివేసిన అనంతరం చేపట్టే ఓ అండ్ ఎం పనులతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికతీతతో పాటు గేట్ల మరమ్మతులు తదితర పనులు చేపట్టడం ద్వారా శివారు ప్రాంతాలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు చేరుతుంది. ఈ పనులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా నిలిచింది. – జిన్నూరి వెంకటేశ్వరరావు,వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు గోదావరి -
ఖరీఫ్‌కు ముందే భరోసా
మచిలీపట్నం: ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే రైతు భరోసా నగదు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన రైతులందరికీ డాక్టర్ వైఎస్సార్ భరోసా పథకం మంజూరు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2021–22లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3,26,326 మంది రైతులు ఈ పథకం కింద ప్రయో జనం పొందారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మే నెలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అర్హుల జాబితాల తయారీపై అధికారులు దృష్టి సారించారు. పథకం రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే, వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే, వారి కుటుంబంలో మరొకరు సాయం అందుకునేలా పేరు మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అర్హులందరికీ అందించేలా.. కౌలు రైతులకు కూడా భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి వారికి పథకం మంజూరు కోసం కౌలు గుర్తింపు కార్డులు అందజేసేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సహాయకులు, సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గ్రామాల్లోని రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన అర్హుల జాబితాలాను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. రైతులంతా జాబితాను పరిశీలించుకునేలా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సాగుకు భరోసా.. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 ప్రభుత్వం సాయంగా అందిస్తోంది. దీనిలో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపిక చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత సాయం రూ.7,500 నేరుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్ సాగుకు ముందుగానే భరోసా డబ్బులు అందించేలా జరుగుతున్న ఏర్పాట్లతో రైతుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టమొచ్చినా, ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమాతో రైతులు సాగుకు సై అంటున్నారు. గతంలో సంభవించిన తుపానులతో పంట నష్టపోయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1,52,368 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105.30 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. సున్నా వడ్డీ సైతం సకాలంలో జమ చేస్తుండటంతో రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పేర్లు లేని వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం లబ్ధిదారుల జాబితాలను జిల్లాలోని అన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. వాటిని రైతులు పరిశీలించుకోవాలి. జాబితాలో పేర్లు లేని వారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన రైతులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకం అందించేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – మనోహర్‌రావు, కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి -
సకాలంలో ధాన్యం డబ్బుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2.96 లక్షల మంది రైతుల నుంచి 21.04 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 1.42 లక్షల మంది రైతులకు రూ.1,969 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా రైతు పొలం ముంగిట నుంచే ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ఆధార్ ఆధారిత నగదు జమ పద్ధతులను అవలభిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతులకు కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో ఐదు వేల టన్నుల సేకరణ లక్ష్యం కాగా.. 376 మంది రైతుల నుంచి 2,748 టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. 46 మంది రైతులకు రూ.60 లక్షలు జమ చేసినట్టు వివరించారు. అయితే కొన్ని పత్రికలు(సాక్షి కాదు) వాస్తవాలు గ్రహించకుండా రైతులకు చెల్లింపులు జరపట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇలాంటి వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వీరపాండియన్ హెచ్చరించారు. -
రెచ్చిపోతున్న విత్తన మాయగాళ్లు
-
Mirchi Seeds: ఊళ్లోనే 'మిరప' విత్తనం
సాక్షి, అమరావతి: మిర్చి రైతులకు విత్తన కష్టాలు తీరనున్నాయి. ఖరీఫ్‌లో అపరాల తర్వాత అత్యధికంగా సాగయ్యే మిరప విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడేవారు. మోసపోయేవారు. ఇన్నాళ్లు విత్తన కంపెనీలు, వ్యాపారసంస్థలపై సరైన నియంత్రణ లేకపోవడంతో కృత్రిమ కొరత సృష్టిస్తూ రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునేవి. మరోవైపు మార్కెట్లోకి వచ్చే నాసిరకం విత్తనాల బారినపడి రైతులు ఏటా తీవ్రంగా నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాయితీ విత్తనం మాదిరిగానే నాన్ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాన్ని కూడా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో 1,79,891 హెక్టార్లలో మిరప సాగవుతోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 80,264, ప్రకాశంలో 35,031, కర్నూలులో 24,538, కృష్ణాలో 15,860, అనంతపురంలో 5.536, విజయనగరం జిల్లాలో 4,989 హెక్టార్లలో రైతులు సాగుచేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో 1.97 లక్షల హెక్టార్లలో మిరపసాగు లక్ష్యంగా నిర్ణయించారు. నాన్ సబ్సిడీ కేటగిరీలో పంపిణీ రాయితీ విత్తనాల మాదిరిగానే నాన్ సబ్సిడీ కేటగిరీకి చెందిన మిరప విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వాదేశాల మేరకు 20 సీడ్ కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ ఒప్పందం చేసుకుంది. ఈనెలాఖరు నుంచి జూన్, జూలై నెలల్లో విడతల వారీగా అవసరమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు కృష్ణాజిల్లాకు 511, గుంటూరుకు 1,823, ప్రకాశం జిల్లాకు 578 కిలోల ఆర్మోర్ రకం హైబ్రిడ్ విత్తనాలను సరఫరా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,339 కిలోల ఆర్మోర్ సీడ్ సరఫరాకు అంగీకరించిన నున్‌హెమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ కంపెనీ ఇప్పటికే 697 కిలోలు జిల్లాలకు పంపింది. పారదర్శకంగా పంపిణీ సాధారణంగా తొలకరి మొదలైన జూన్‌లో విత్తన విక్రయాలు మొదలవుతాయి. ఈసారి కరోనా బూచి చూపి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించకుండా కట్టడి చేయడంతోపాటు ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరా పారదర్శకంగా చేపట్టే లక్ష్యంతో విత్తన పంపిణీ, అమ్మకందార్లతో అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సాగుకు ఇంకా సమయం ఉన్నందున దళారీల ఉచ్చులోపడి అధిక ధరలకు కొనకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఒకే కంపెనీ విత్తనాలు కొనాలని చూడకుండా అదే సెగ్మెంట్లో ఉన్న ఇతర కంపెనీలకు చెందిన మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న విత్తనాలు, ధరల వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. సాగయ్యే మిర్చి రకాలు సాధారణంగా మిర్చి సాగువిస్తీర్ణంలో 40 శాతం ప్రీమియం (ఓపెన్ పాలినేటెడ్ (ఓపీ) వెరైటీస్), 60 శాతం హైబ్రిడ్ రకాలు సాగవుతుంటాయి. ప్రీమియం రకాలు: ఎల్‌సీఎ–334, 341, 273, 2222, రెడ్‌హాట్, రోమి, గిని, సూపర్–10,20, రూబే, వజ్ర, అమరావతి, జై కిసాన్. హైబ్రిడ్ రకాలు: ఆర్మోర్, తేజశ్విని, యశస్విని, యూఎస్–341, బంగారం, వండర్‌హాట్, యూఎస్–4884, రెడ్‌హాట్, ఇందమ్–5, హెచ్‌పీహెచ్–5531, హెచ్‌పీహెచ్–2043, వీఎన్ఆర్–577. హెక్టార్‌కు హైబ్రిడ్ విత్తనం 300 గ్రాములు, ప్రీమియం విత్తనం 650 గ్రాములు అవసరం. బ్లాక్ మార్కెట్‌కు చెక్‌పెట్టేందుకే.. ప్రాచుర్యం గల మిర్చి విత్తనాలను ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్, అధిక ధరల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించాం. నిర్ణీత ధరల కన్నా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పష్టం చేశాం. వారినుంచి స్వాధీనం చేసుకున్న విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి -
ఏపీ పంటల ప్రణాళిక
ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు సిద్ధం కావాలి. రాష్ట్రంలోని 10,641 ఆర్బీకేలలో ఈ ఏర్పాట్లుండాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కోసం ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు ► రైతులు పండించిన పంటల్లో 30 శాతం కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచి, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుంది. మిగిలిన 70 శాతం పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేయాలి. ► ఇందుకోసం ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలి. దీనిపై పంటలను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యం. దీనికోసం గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి సదుపాయాలు కల్పించాలి. ► ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం విజయవంతమవ్వాలంటే రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం ముఖ్యం. వీటిపై సమర్థవంతమైన ఆలోచన చేయాలి. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏయే పంటలు వేయాలనే దానిపై ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నారన్న దానిపై ఇ–క్రాపింగ్ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారు చేయాలన్నారు. వాటిని రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి. పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యాపింగ్ చేయాలి ► వీలైనంత త్వరగా పంటల ప్రణాళిక, ఇ– క్రాపింగ్‌పై విధి విధానాలను రూపొందించాలి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏ పంటలు వేయాలనే దానిపై మ్యాపింగ్ చేయాలి. ► జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే.. రైతులకు నష్టం కలుగుతుంది. పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలి. ► ఇ– క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)లను వెంటనే తయారు చేయాలి. ఇ– క్రాపింగ్ విధివిధానాలను సచివాలయాల్లో, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి. విధివిధానాలు వివాదాలు లేకుండా, పారదర్శకంగా ఉండాలి. గ్రేడింగ్, ప్యాకింగ్ జనతా బజార్లకూ ఉపయోగం ► వచ్చే సీజన్లో ఏర్పాటు చేయదలచిన జనతా బజార్లకూ గ్రేడింగ్, ప్యాకింగ్ విధానాలు దోహద పడతాయి. తర్వాత దశలో గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు కావాలి. ► అధికారులు వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని, ఈ మేరకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించి తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రశ్నార్థకంగా ఖరీఫ్!
సాక్షి, మహబూబ్‌నగర్ : ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఎన్నో ఆశలతో రైతులు ఖరీఫ్‌లో వరిసాగు చేసి భంగపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా చెప్పుకోదగ్గ పెద్ద వర్షం కురవనేలేదు. చెరువులు, కుంటలు కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. బోరు బావుల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇదివరకే వేసిన వరి పొలాలు నెర్రెలుబారి కనిపిస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరదలు వచిచనా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అవుతుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగులుతోంది. సాంకేతిక కారణాలతో పంపింగ్ నిలిచిపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 8 వేల హెక్టార్లలో వరిసాగు వర్షాకాలం ప్రారంభంలో జిల్లాలో దామరగిద్ద, నారాయణపేట, మద్దూరు, కోస్గి, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. మరికల్, ధన్వాడ, నర్వ మండల్లాలో వర్షాపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా జూలై, ఆగస్టు మాసాల్లో ఇప్పటివరకు 8 వేల హెక్టార్లకు పైగా వరినాట్లు వేశారు. కానీ వర్షాలు కురవక.. కోయిల్‌సాగర్ సాగునీరు రాక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బోరుబావుల్లో కూడా నీరు తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే వరినాట్లు వేసిన రైతుల బోర్లలో నీళ్లులేక ట్యాంకర్లు తెప్పించుకుని నారును తడుపుతున్నారు. ఎరువులు, కూలీ ధరలు పెరిగి పెట్టుబడి ఖర్చు అధికమైందని రైతులు ఆందోళన చెందుతుంటే నీళ్లను కొనుక్కుని వేయడం వారికి అదనపు భారంగా మారింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తే కొంతవరకైనా పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని రైతులు వారం రోజుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారిగోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం బోర్లు ఉన్న రైతులు మాత్రమే కేఎస్పీ ఆయకట్టు కింద వరినాట్లు వేస్తున్నారు. మిగితా రైతులు ప్రాజెక్టు నీటిపై ఆధారపడి నీటి విడుదల కోసం వేచి ఉన్నారు. సాంకేతిక లోపం రైతులకు శాపం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. జూరాల నుంచి వరదనీరు తన్నుకు వస్తున్నా తీలేర్ పంపింగ్ వద్ద ఎత్తిపోతల మోటార్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆది వారం అర్ధరాత్రి మళ్లీ రెండు పంపులు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఇంజనీర్లు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పంపులు ప్రారంభమైన 11 రోజుల వ్యవధిలోనే ఇలా ఆటంకా లు ఎదురు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా గతంలో ఇలాగే సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఉంద్యాల, తీలేర్ పంపుహౌస్‌ల వద్ద కేవలం ఒకటీరెండు రోజుల్లో సరిచేసేవారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ కంపెనీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండిం గ్ బకాయిలు రాకపొవడంతో వారు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నెలరోజుల క్రితం కోయిల్‌సాగర్ ఎత్తిపోతల బాధ్యతలను పవర్ సెల్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. మోటార్లకు సంబంధించిన టెక్నిషన్ సమస్యలు వారికి కొత్త కావడంతో నీటి పంపింగ్‌కు బ్రేక్ పడుతోంది. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ నాగిరెడ్డి వివరణ ఇస్తూ రాత్రి వరకు రెండు పంపులను సరిచేసి ప్రారంభిస్తామన్నారు. చెరువులను నింపండి తీలేర్ పంపుహౌస్ నుంచి వస్తున్న నీటితో పూర్తి స్థాయిలో చెరువులను నింపితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉంది. రూ.30 వేల పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశాను. బోరులో ఇంకిపోవడంతో నీళ్లు పట్టే పరిస్థితి లేదు. పొలమంతా నెర్రెలు విచ్చింది. కనీసం కోయిల్‌సాగర్ నీటితోనైనా చెరువులను నింపితే పంటలను కాపాడుకుంటాం. – గొల్ల రాజు, కౌలు రైతు, మరికల్ -
గుండెల్లో దా‘వాన’లం
ఖరీఫ్‌కి కష్టకాలం దాపురించింది. జూన్, జూలై నెలల్లో వర్షాలు ముఖం చాటేయడంతో పంటచేలు చుక్కనీటి కోసం నోరెళ్లబెట్టాయి. నారుమళ్లు, నాట్లకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా అన్నదాతల గుండెల్లో దావానలం రగులుతోంది. సాక్షి, కొవ్వూరు(పశ్చిమ గోదావరి): రెండు నెలల నుంచి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. ఫలితంగా ఖరీఫ్ సాగు నిరాశాజనకంగా సాగుతోంది. వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే ఎన్నడూలేని విధంగా రైతులు ఒడిదుడుకులను చవిచూస్తున్నారు. జూన్ నెలలో సాధారణం కంటే తక్కువగా నమోదైతే జూలై నెలలోనూ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు వారాలు గడుస్తున్నా ఇంత వరకు చెప్పుకోదగిన వర్షం కురవలేదు. జూలైలో ఇప్పటి వరకు సాధారణం కంటే 47.7 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రైతులు అల్పపీడనంపైనే ఆశలు పెట్టుకున్నారు. రానున్న నాలుగు రోజుల్లో ఓ మెస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో రైతులు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది జూలై 18 నాటికి జిల్లాలో దాదాపు సగం ఆయకట్టులో నాట్లు వేస్తే ఇప్పుడు 30 శాతం కుడా నాట్లు వేయలేదు. రుతు పవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో జిల్లాలో ఖరీఫ్ సాగు జాప్యమైంది. జూలైలోనూ లోటు వర్షపాతం! ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం రికార్డయితే జూలై నెలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 48 మండలాలు ఉంటే జూన్‌లో 30 మండలాల్లోనూ, జూలైలో 18 మండలాల్లో తీవ్ర వర్షభావ çపరిస్థితులు నెలకొన్నాయి. మరో 21 మండలాల్లోనూ వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ వర్ష పాతం కంటే 60శాతం పైగా తక్కువ కురిసిన మండలాలను తీవ్ర వర్షాభావ మండలాలుగా పరిగణిస్తారు. 20 నుంచి 60 శాతంలోపు వర్షపాతం తక్కువగా నమోదైన మండలాలను వర్షభావ మండలాలుగా ప్రకటిస్తారు. ఇరవై శాతం తక్కువగా వర్షపాతం రికార్డుయిన మండలాలను సాధారణ మండలాలుగా పరిగణిస్తారు. జూలైలో కేవలం తొమ్మిది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం (20శాతం వ్యత్యాసం) నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఇప్పటి వరకూ వర్షపాతం ఇలా.. నల్లజర్లలో 86.8 శాతం, ద్వారకాతిరుమలలో 78.9, భీమడోలులో 83.5, ఆకివీడులో 81.8 శాతం, పెనుమంట్రలో 80.8 శాతం, అత్తిలిలో 79.2 శాతం, చాగల్లులో 77.2, నిడదవోలులో 72.3, నిడమర్రులో 75.0, గణపవరంలో 72.6, దెందులూరులో 73.9 శాతం చొప్పున సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. వేలేరుపాడు, కుక్కునూరు, కొయ్యలగూడెం, మొగల్తూరు తదితర మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే కేవలం పది శాతంలోపు వ్యత్యాసంతో వర్షం కురిసింది. 1,313 హెక్టార్లలో పూర్తికాని నారుమళ్లు ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో ఇంకా నారుమళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. వర్షాలు ఆలస్యం కావడమే ఇందుకు ప్రధాన కారణం. జిల్లాలో 11,452 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉండగా ఇంతవరకు 10,139 హెక్టార్లలో మాత్రమే వేశారు. ఇంకా 1,313 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. గత ఏడాది ఇదే సమయానికి నారుమళ్ల ప్రక్రియ పూర్తి కావడమే కాకుండా నాట్లు కూడా 50 శాతం పూర్తి చేశారు. గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది 8,528 హెక్టార్లలో నారుమళ్లు వేయాల్సి ఉండగా 7,692 మాత్రమే వేశారు. ఇంకా 836 హెక్టార్లలో పోయాలి. మెట్ట ప్రాంతంలో 2,923 హెక్టార్లకు గాను 2,447 హెక్టార్లలో పోశారు. ఇంకా 476 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ప్రస్తుతం డెల్టాలో 90శాతం, మెట్టలో 84శాతం నారుమళ్లు పోశారు. నీరు సమృద్ధిగా లేకపోవడం, మెట్ట ప్రాంతంలో చెరువులు, ప్రాజెక్టులలో పూర్తిస్థాయిలో నీరు చేరకపోవడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా నారుమళ్ల ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మందకొడిగానే నాట్లు జిల్లాలో గత ఏడాదితో పొలిస్తే ఖరీఫ్ వరినాట్లు మందకొడిగానే సాగుతున్నాయని చెప్పవచ్చు. గత జూలైలో ఇదే సమయానికి 1.09,429 హెక్టార్లలో నాట్లు వేస్తే ఇంత వరకు 63,993 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. జిల్లాలో 2,29,030 హెక్టార్ల వరిసాగు సాధారణ విస్తీర్ణం కాగా, దీనిలో డెల్టాలో 1,70,567 హెక్టార్లు ఉంటే 63,993 హెక్టార్లు, మెట్టలో 58,463 హెక్టార్లుకి గాను 16,923 హెక్టార్లలో నాట్లు వేశారు. జిల్లాలో సరాసరి 27.9 శాతం ఆయకట్టులో నాట్లు పడ్డాయి. జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 2,55,469 హెక్టార్లు ఉంటే ప్రస్తుతం 73,729 హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. పత్తి 6,512 హెక్టార్లకు 1,274 హెక్టార్లలో వేశారు. చెరుకు పంట 12,178 హెక్టార్లకు గాను 8,144 హెక్టార్లలో పంట వేశారు. -
అన్నదాతా దుఃఖీభవ!
ఆకివీడు: సమస్యలు పరిష్కరించకుండా, సంక్షేమం గురించి పట్టించుకోకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా కేవలం ఎన్నికలు ఉన్నాయి కదా అని కంటితుడుపుగా రూ.పదివేలు చేయూతనందిస్తామని టీడీపీ సర్కారు చెప్పడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు అడుగడుగునా దగా చేస్తోందని మదనపడుతున్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు డబ్బులేవీ..! ఖరీఫ్‌లో కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యం తాలూకు డబ్బులు ఇప్పటివరకూ రైతుల ఖాతాలకు చేరలేదు. జిల్లాలో ఈ బకాయిలు రూ.150కోట్లు పైనే ఉంటాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల బకాయిలు ఉంటాయని చెబుతున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్నా.. ఈ బకాయిలపై సర్కారు, ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 12.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 169 డ్వాక్రా సంఘాలు, 145 సహకార సొసైటీలు మొత్తం 314 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకూ 11,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. దీనికి చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇంకా రైతులకు రూ.150 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులు ధాన్యం తోలిన రెండుమూడు రోజుల్లోనే సొమ్ము వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పోతున్న ప్రభుత్వం ధాన్యం అమ్మి నెలదాటుతున్నా.. సొమ్ములు ఇవ్వలేకపోతోంది. దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రవాణా ఇతరత్రా చార్జీల నిమిత్తం మిల్లర్లుకు రూ.80 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. రుణమాఫీ అంతంతే..! గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీని ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రైతులను నిండాముంచింది. అనేక ఆంక్షలతో రైతులను అవస్థలపాల్జేసింది. ఐదు విడతలుగా సొమ్ము చెల్లిస్తామన్న సర్కారు నాలుగు, ఐదు విడతలకు సంబంధించిన సుమారు రూ.550కోట్ల చెల్లింపులు నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తాలకు గతంలో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన సర్కారు గత ఏడాదిలోనే ఆ చెక్కులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తూ.. వచ్చింది. రైతులు మొదట్లో వడ్డీలు చెల్లించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీకి కూడా సర్కారు మంగళం పాడింది. పరికరాల పంపిణీలోనూ అన్యాయం సన్న, చిన్నకారు రైతులకు పరికరాల పంపిణీలోనూ అన్యాయం జరిగింది. చిన్న రైతుల పేరిట బడా రైతులు పరికరాలను అందిపుచ్చుకున్నారు. వీరిలో అధికారపార్టీ బినామీలే ఎక్కువ మంది ఉన్నారు. రైతు రథం పథకంలోనూ ఎన్నో అవకతవకలు జరిగాయి. రైతులకు న్యాయం జరగలేదు. జిల్లాలో సుమారు రూ. 220 కోట్ల మేర యంత్ర పరికరాల పంపిణీ జరిగింది. అడ్రస్సులేని నష్టపరిహారం గతంలో వచ్చిన రెండు తుపాన్లకు సంబం ధించిన నష్టపరిహారం కూడా ఇప్పటికీ రైతులకు అందలేదు. జిల్లావ్యాప్తంగా ఇలా రూ.170 కోట్ల బకాయిలు ఉన్నాయని సమాచారం. గత ఏడాది భారీ వర్షాలకు ఖరీఫ్, రబీ పంట తాలూకూ నష్ట పరిహారం రూ.20 కోట్ల మేర విడుదలైనా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఖరీఫ్సొమ్ము జమకాలేదు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సొమ్ము ఇప్పటికీ మా ఖాతాల్లో జమ కాలేదు. రబీ సాగుకు పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందిగా ఉంది. సకాలంలో ధాన్యం సొమ్ము జమ చేయాలి. రైతుకు లాభసాటి ధర ప్రకటించినప్పుడే ఆర్థికంగా గట్టెక్కుతాడు. – మంతెన వెంకట కృష్ణంరాజు, రైతు, చినకాపవరం రైతుకు ఏమీ అందలేదు రైతుకు రుణమాఫీ పూర్తిగా అందలేదు. గతంలో వచ్చిన రెండు తుపాన్ల తాలూకూ నష్టపరిహారమూ ఇవ్వలేదు. వ్యవసాయ పరికరాలూ సరిగా అందడం లేదు. ఖరీఫ్ ధాన్యం సొమ్ములు జమ కాలేదు. ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి. – అడ్డాల నాగరాజు, రైతు, సిద్ధాపురం -
కుంటిసాకులు!
మహబూబ్‌నగర్ రూరల్: సంక్షేమ పథకాల అమలులో భాగంగా రైతులకు అందించే పంట రుణాలు జిల్లా వ్యాప్తంగా సగం మందికే అందడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రైతులకు పంట రుణాలు సకాలంలో ఇవ్వాలని ఉన్నతాధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నా అమలు కావడంలేదు. గత ఖరీఫ్‌లో పంట రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్ మాసం వరకు రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చారు. అలాగే రబీ రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం ఐదు శాతానికి కూడా మించలేదు. దీనికి బ్యాంకర్లు అనేక కారణాలు చెబుతున్నారు. రెన్యూవల్‌కు వెనుకంజ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు తాము అధికారంలోకి వస్తే రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటికే రుణాలు తీసుకున్న రైతులు రెన్యూవల్ చేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. బ్యాంకులు, రైతుల మధ్య వారధిగా ఉండి పంట రుణాలు సకాలంలో మంజూరీ విషయంలో ప్రముఖపాత్ర పోషించే లీడ్ బ్యాంకు అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందాయి. ఖరీఫ్ లక్ష్యం రూ.1,410 కోట్లు కాగా జూన్ నాటికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నా వీరి వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో రుణాల మంజూరీపై స్పష్టత కనిపించడం లేదు. లక్ష్యం మంచిదే కానీ.. ఖరీఫ్‌లో జిల్లా వార్షిక రుణ లక్ష్యం రూ.1,410 కోట్లు. అయితే ఇందులో ఇచ్చింది రూ. 250 కోట్లు మాత్రమే. అంటే సగం లక్ష్యాన్ని కూడా చేరలేదు. ఇక రబీలో రుణ లక్ష్యం రూ.940 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం 5 శాతానికి కూడా మించలేదు. అంటే రైతులు ఈసారి రుణాల కోసం బ్యాంకులకు కూడా వెళ్లలేదన్న మాట. గతంలో మాదిరిగా కనీసం రెన్యూవల్ కూడా చేసుకోలేదు. దీంతో లక్ష్యం నీరుగారిపోతుంది. రుణమాఫీ ప్రకటనలే కారణమా? అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయించారు. తాజా ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ప్రకటించడంతో పంట రుణాలు చెల్లించేందుకు చాలామంది రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఏకంగా రూ. రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ మాఫీ అంశాన్నే ప్రచారం చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ సైతం రుణ మాఫీని మరోసారి వర్తించనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో రైతులు రుణం చెల్లించేందుకు కనీసం రెన్యూవల్ చేయించుకునేందుకు ముందుకురావడం లేదని సమాచారం. ఇదిలాఉండగా ప్రధాన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు రబీలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాల్సి ఉండగా రుణాలు చెల్లించేందుకు గానీ, రీ షెడ్యూల్ చేసుకునేందుకు గానీ రైతులెవరూ ముందుకు రావడం లేదు. రబీలో జిల్లాలో రూ. 940 కోట్లు రుణం ఇవ్వాలని లక్ష్యం ఉండగా అందులో 5 శాతం కూడా పూర్తి కాలేదు. అయితే ఇండియన్ బ్యాంకు, కొటక్ మహేంద్ర బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు టార్గెట్లు పెట్టుకున్నప్పటికినీ ఖరీఫ్ సీజన్లో జీరో శాతం కూడా పంట రుణాలు ఇవ్వలేదు. మాఫీ కలిసి వస్తుందా? వాస్తవంగా బ్యాంకుల్లో పంట రుణం తీసుకుంటే ప్రభుత్వం పంట రుణాన్ని మాఫీ చేసినప్పుడు మాఫీ వర్తిస్తుంది. రుణాన్ని రీ షెడ్యూల్ చేసినా వర్తిస్తుంది. ఈ విషయంలో రైతులకు అవగాహన ఉండదు. అందుకే రీ షెడ్యూల్‌కు ముందుకు రావడం లేదు. జిల్లాలోని రైతుల్లో దాదాపు 80 శాతం మంది రైతులు రూ. లక్షలోపు రుణం తీసుకున్న వారే ఉన్నారు. పంట రుణం రీ షెడ్యూల్ చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ సక్రమంగా రాకపోవడంతో బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వడ్డీతో పాటు ఇన్సూరెన్స్, బ్యాంకు ఖర్చులు ఇలా బ్యాంకులు ఇచ్చే లక్ష రుణానికి రూ.10వేలు అవుతున్నాయి. ఎలాగో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రుణమాఫీ వాగ్ధానాలు ప్రకటించగా వడ్డీతో సహా అధికారంలోకి వచ్చిన పార్టీలే చెల్లిస్తాయని రైతులు భరోసాతో ఉన్నారు. దీంతో బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ వసూలు చేసినా రుణం రూ.2 లక్షల మించి వెళ్లదని రైతులు బ్యాంకర్లకే చెప్పే పరిస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయి బ్యాంకు అధికారులు గ్రామాలకు వెళ్లి వడ్డీ చెల్లించి రుణాన్ని రీ షెడ్యూల్ చేసుకోమంటే గతంలో రుణం చెల్లించని వారికి మాఫీ అయ్యాయని, రెగ్యులర్‌గా చెల్లించిన వారికి మాత్రం మాఫీ కాలేదంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ ముగిసే వరకు ఆగాలని బ్యాంకర్లను రైతులు బతిమిలాడుతున్నారు. బ్యాంకులు ససేమిరా ఇప్పటికే బ్యాంకుల నుంచి పంట రుణం తీసుకున్న వారు ఎన్నికల వాగ్ధానాలతో చెల్లించేందుకు ససేమిరా అంటుంటే ఇదే సమయంలో బ్యాంకులు సైతం పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడం లేదు. నాబార్డు ప్రతిపాదించినట్లు రుణ పరిమితికి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ప్రతి బ్యాంకు పంట రుణాన్ని పెంచి ఇవ్వాలని, వరికి ఎకరానికి రూ. 32వేల నుంచి రూ. 33వేలు, మొక్కజొన్నకు రూ, 22 వేల నుంచి రూ. 23వేలు ఇలా ప్రతి పంటకూ పెంచి ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. కానీ బ్యాంకర్లు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేవంటూ దాటవేస్తున్నారు. రైతులు రావడం లేదు పంట రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. రుణాలను రీ షెడ్యూల్ చేసుకోమంటే కూడా రుణం మాఫీ అవుతుందంటూ వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లకు రకరకాల కారణాలు చెబుతున్నారు. దీంతో రైతులపై ఒత్తిడి చేయకలేపోతున్నాం. – ప్రభాకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
ఎరువు.. ‘ధర’వు..
సాక్షి, కరీంనగర్: వర్షాభావం.. నీరందక ఎండిపోతున్న పైర్లు.. బతికి బట్టకట్టిన పంటలకు తెగుళ్లు.. ఖరీఫ్ సీజన్లో దిగుబడి లేక దిగాలు పడుతున్న రైతులకు రబీ సీజన్లో కూడా కష్టాలే ఎదురుకానున్నాయి. రబీకి రైతన్నలు సిద్ధం కాకముందే ఎరువుల రూపంలో ప్రతికూలతలు ఎదురయ్యాయి. డీజిల్ ధరలు పెరగడంతో సాగు వ్యయం పెరిగి గిట్టుబాటు కాని వ్యవసాయం చేసే రైతులకు ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ప్రతీ ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గతేడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత దాదాపు 10 రోజులపాటు వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నష్టపోయారు. దీనికితోడు ఎరువుల ధరలను అయా కంపెనీలు పెంచేశాయి. ఇక పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.95 నుంచి రూ.170 వరకు పెంచాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది. పెరుగుతున్న ఎరువుల వాడకం.. జిల్లాలో 2.1 లక్షల హెకార్ల సాగు విస్తీర్ణం కాగా.. లక్షా 25 వేల హెక్టార్లలో పత్తి సాగు, 20 వేల హెక్టార్లలో సోయా, 15 వేల హెక్టార్లలో కందులు, 7 వేల హెక్టార్లలో జొన్న, 3 వేల హెక్టార్లలో చిరుధాన్యాలు, 2 వేల హెక్టార్లలో పెసరి పంటలు సాగు చేశారు. అయితే.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 14 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాష్, 20 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి. ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడంతో సంతోషంలో ఉన్న రైతులకు పురుగుల మందుల ధరలు, ఎరువుల ధరలు పెరగడంతో మోయలేని భారంగా మారింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచారు. దీంతో ఎరువుల సమతూల్యత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
ఈ సారి భారీ దిగుబడి
ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. కాస్త ముందుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం వచ్చేనెల 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నిజామా బాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం మార్కెట్లో కి వస్తుందని అధికార యంత్రాంగం అం చనా వేసింది. సుమారు ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కే్రందాలకు రావచ్చంటున్నారు. గతే డాది కంటే రెం డున్నర రేట్లు అధికంగా ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయి. ప్రైవేటు కొనుగోళ్లు తక్కువే.. ఈసారి కనీస మద్దతు ధర పెరగడంతో రైతులు ప్రైవేటులో విక్రయించే బదులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ఎక్కువ గా ధాన్యం తీసుకువస్తారని భావిస్తు న్నా రు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి కనీస మద్ద తు ధర గత ఏడాది కంటే క్వింటాలుపై సుమారు రూ.180 పెరిగింది. కామన్ రకానికి కూడా క్వింటాలుకు రూ.200 పెం చారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.1,770 పెట్టి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఎక్కువగా ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఎన్నికల ఏడాది కావడం.. పైగా రైతులకు సంబంధించిన అంశం కావడంతో అధికా ర యంత్రాంగం ఈసారి కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముంద స్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. రైతుల నుంచి పెద్ద ఎ త్తున డిమాండ్ వస్తుండటంతో ఈ కేం ద్రాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ముందస్తుగా ధాన్యం.. ఏటా నవంబర్ మాసంలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే ఈసా రి కాస్త ముందస్తుగానే ధాన్యం రాక ప్రారంభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. బోధన్, వర్ని తదితర ప్రాంతాల్లో రైతులు ముందుగా వరినాట్లు వేసుకున్నారు. దీంతో ఇక్కడ ముందుగానే వరి కోతకొచ్చే అవకాశాలున్నాయి. అక్టోబర్ రెండో వారం నుంచే ధాన్యం మార్కెట్లోకి రానుందని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించారు. మంత్రి పోచారం సమీక్ష ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం అక్టోబర్ 1 నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తా మని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, అనుమతి వచ్చిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. సమీక్షలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎంఆర్ఎం రావు, సత్యనారాయణ, మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులకు జలకళ
జైనథ్(ఆదిలాబాద్): ఓ పక్క భారీ వర్షాలతో జిల్లాలో ఖరీఫ్ పంటలు నాశనం కాగా, మరో పక్క సాగు నీటి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీళ్లు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగు నీటి ప్రాజెక్టుల్లో చేరిన జలసిరి రైతులకు కొంత భరోసానిస్తోంది. ఖరీఫ్ నష్టాన్ని కొంతలో కొంతనైనా వచ్చే రబీ సీజన్లో భర్తీ చేసుకునేందుకు భరోసా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లో భారీ నీటి ని ల్వలు చేరాయి. దీంతో రబీ సీజన్లో ఆదిలాబాద్, జైనథ్, బే ల, తాంసి మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండడంతో వచ్చే రబీ సీజన్‌కు సాగు నీటి ఇబ్బందులు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాత్నాలలో 1 టీఎంసీ నీటి నిల్వ.. జిల్లాలో 24 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సాత్నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. 286.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 1.24టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సాత్నాలలో ప్రస్తుతం వరద నీళ్లు భారీగా వచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా రావడంతో పలుమార్లు గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం మొత్తం 4.042 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటి వరకు గేట్లు, స్పిల్‌వే ద్వారా 3.038 టీఎంసీల నీళ్లను వదిలారు. ప్రస్తుతం 285.5మీటర్ల ఎత్తులో 1.004టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా 507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా సాత్నాల పరిధిలో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిండుకుండలా లక్ష్మీపూర్ రిజర్వాయర్.. సాత్నాల ప్రాజెక్టు వృథా నీటిని ఒడిసిపట్టేందుకు 2008లో రూ. 56 కోట్ల లక్ష్మీపూర్ గుట్ట కింద రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇటీవలే సాత్నాల ఆధునికీకరణ పనుల్లో భాగంగా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు రూ.30 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 250.6 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.153 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న లక్ష్మీపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు చేరాయి. 0.153 టీఎంసీ నీళ్లు చేరడంతో మాకోడ వైపు ఏర్పాటు చేసి బ్రీచ్ నుంచి బెల్లూరి వాగులో నీళ్లు పారుతున్నాయి. దీని కుడి కాలువ కింద మాకోడ, బెల్లూరి, బెల్గాం, ఉమ్రి, ఖాప్రి, ఆవల్పూర్ గ్రామాల్లో 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువల కింద జైనథ్, మాకోడ, దీపాయిగూడ, కుతుంపూర్, ఖాప్రి, బెల్గాం, కూర గ్రామాల్లో 4800 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. మత్తడి వాగుకు జలకళ.. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం జలకళ సంతరించుకుంది. 277.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.57టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 277.05 మీటర్ల ఎత్తులో 0.50 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాలువ కింద వడ్డాడి, జామిడి, కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చెర, ఈదుల సావర్గామ, గోట్కూరి, భీంసరి, నిపాని, జందాపూర్, చాంద తదితర గ్రామాల్లో 8500 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. రబీ సాగుకు చింత లేదు.. ఈ సంవత్సరం వర్షాలకు ఖరీఫ్‌లో పత్తి, సోయా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ పోయినట్లే అనిపిస్తోంది. కాకపోతే రబీలో ఈ నష్టాన్ని కొంత పూడ్చవచ్చనే ఒక అశ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో నీళ్లు భారీగా చేరడంతో రబీలో శనగ పంట వేసుకోవచ్చు. ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. – కామ్రే ఆనంద్‌రావు, యువరైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం -
ఖరీఫ్ సాగుకు కరువు పోటు
ఖరీఫ్ సాగు రైతులను కుంగదీస్తోంది. ఇటీవల ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. మరోవైపు వేడి గాలులు పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో ఇప్పటికే కొన్ని బోర్లలో నీరు రావడం లేదు. మరికొన్ని బోర్లలో నీరు వస్తున్నా వరి పొలాలు తడారిపోతున్నాయి. దీంతో ఖరీఫ్‌లో పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగుచేసినా చేతికందుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరుణుడు కరుణించపోతాడా అన్న చివర ఆశతో ఆకాశం వైపు రైతులు ఎదురుచూస్తున్నారు. డక్కిలి (నెల్లూరు): ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు కరువు పోటు తప్పడం లేదు. వరిపంటను సాగుచేసిన రైతులను వాతావరణ పరిస్థితులు నష్టాలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పంటల సాగు రైతులకు ప్రశ్నార్థకంగా మారింది. డక్కిలి మండలంలో నెల్లూరు మసూర 34449, ఎంటీయూ–1010 రకం వరి పంటను సుమారు 800 హెక్టార్లలో ఖరీఫ్ కింద సాగు చేశారు. బోర్లు, ఏర్లను ఆధారం చేసుకొని వరి పంటను సాగుచేసిన రైతులకు ప్రస్తుతం పంటలు చేతికందుతాయా అన్న ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో తొలకరి వర్షాలు కురుస్తాయి. అయితే ఈ ఏడాది రైతులను తొలకరి వర్షాలు పలకరించకపోవడంతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పొందేందుకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది రైతులు అయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పంపింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏర్లు, కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటితో వరి పంటకు ఆరుతడులు కడుతూ పంటను సంరక్షించుకుంటున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న వరి రెండు నెలల క్రితం బోర్లలో, ఏరుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో రైతులు ఖరీఫ్ కింద తమకున్న పొలాల్లో వరి పంటను సాగు చేశారు. గత 10 రోజుల వరకు సాగునీటి కొరత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం బోర్లు, ఏరుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సాగునీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కొరతతో తమ కళ్లెదుటే పంట ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పంటను ఎలానైనా రక్షించుకోవాలన్న ఆశతో బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నష్టపోతున్న పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని పలు గ్రామాల రైతులు వ్యవసాయశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. భగీరథ యత్నం డక్కిలి మండలంలో ప్రధానంగా నాయుడుపాళెం, చాకలపల్లి, పాతనాలపాడు, భీమవరం, కొత్తనాళ్లపాడు, లింగసముద్రం, దగ్గవోలు, మోపూరు, దందవోలు, ఆల్తూరుపాడు, తీర్థంపాడు, ఆముడూరు, శ్రీపురం, మాటుమడుగు తదితర గ్రామాల్లో ఖరీఫ్ కింద వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట వెన్ను దశ, చిరుపొట్ట దశలో ఉంది. మరో నెల రోజులు సాగునీరు అందితే రైతులకు పంట చేతికందుతుంది. ఇప్పటికే రైతులు ఎరువులు, పురుగుమందులు, కూలీలు, దుక్కుల కోసం ఎకరాకు రూ.30 వేలు ఖర్చు చేశారు. మరోవైపు సాగునీటి కొరతను తీర్చుకునేందుకు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యయ ప్రయాసాలకు లోనైనా మరో వారం రోజుల్లో వరుణుడు కరుణించకపోతే డక్కలి మండలంలో సాగవుతున్న 90 శాతం వరి పంట ఎండిపోయే అవకాశం ఉందనే ఆందోళనతో రైతులు ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులకు ఆర్జీలు ఇచ్చారు. ఎండిపోయిన డ్యామ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డక్కిలి మండలంలోని చాకలపల్లి సమీపంలో ఉన్న అలపలేరు డ్యామ్ పూర్తిగా ఎండిపోయింది. ఈ ప్రాంతంలో డ్యామ్‌లో నీరు ఉండడం వల్ల పరిసర గ్రామాల్లోని బోర్లలో నీరు బాగా వచ్చేది. అయితే ఈ ఏడాది డ్యామ్ ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లలో చుక్కనీరు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ఈ ప్రాంత రైతులు చెబుతున్నారు. పంటను రక్షించుకునేందుకు డ్యామ్ నుంచి కొంతమంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో ఆయిల్ ఇంజిన్లు, విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేకుంటున్నా మరో రెండు రోజులు మాత్రమే నీరు వస్తుందని చాకలపల్లి, యల్లావజ్జలపల్లి గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి గత 10 రోజుల నుంచి సాగునీటి కొరత ఎదుర్కొంటున్నాం. ఏర్లు, బోర్లలో నీరు అడుగంటడంతో అలపలేరు డ్యామ్ నుంచి ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీరు పొలాలకు అందిస్తున్నాం. ప్రతి రోజూ ఆయిల్ ఇంజిన్లు నడిపేందుకు బాగా ఖర్చవుతోంది. డ్యామ్‌లో కూడా నీరు అడుగంటింది. – ఎం.వెంకటేశ్వర్లు, చాకలపల్లి, రైతు రూ.వేలు ఖర్చు చేయాల్సివస్తుంది ఖరీఫ్ కింద ఐదెకరాల్లో వరి పంట సాగు చేశా. బోర్లలో నీరు రాకపోవడంతో అలపలేరు డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసుకునేం దుకు పైప్‌ల కోసం రూ.20 వేలు ఖర్చు చేశాను. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఎండిపోయిన పంటలకు బీమా వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మధు, చాకలపల్లి, రైతు -
కృష్ణమ్మ వస్తోంది..
రైతులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో సాగర్‌వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుండడంతో దిగువకు 2లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో ఆశల సాగరం నిండనుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ (నల్గొండ) : శ్రీశైలం జలాశయం ఆరుగేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ వైపుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువనుంచి శ్రీశైలం జలాశయానికి 3,08,217 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో విద్యుదుత్పాదన కేంద్రాలతో పాటు ఆరుగేట్ల ద్వారా 2,32,912 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కోగేటును నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునేందుకు మరో మూడు అడుగులు మాత్రమే ఉంది. సాగర్ జలాశయం నీటిమట్టం శనివారం ఏడుగంటలకు 532.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. గత రెండు రోజులతో పోలిస్తే జలాశయ నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. కృష్ణాపరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. అదనంగా వచ్చే ప్రతినీటి బొట్టును దిగువకు వదులుతున్నారు. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్రతో పాటు శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ఎగువనుంచి అన్ని ప్రాజెక్టులకు సగటున నిత్యం లక్షన్నర క్యూసెక్కులకు పైచిలుకు నీరు వచ్చి చేరుతుండగా అంతేమోతాదులో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి గత యేడాదితో పోలిస్తే ముందస్తుగానే నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం సాగర్‌లో 172.4730 టీంసీల నీరుంది. గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటే జలాశయంలో 312.24టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవాలంటే మరో 140టీఎంసీల నీరు వచ్చి చేరాల్సి ఉంటుంది. నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు 8రోజులపాటు వస్తే సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. జాలరులు, రైతులు అప్రమత్తంంగా ఉండాలి జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయంతీరం వెనుకభాగంలో ఉండే జాలరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరిస్తున్నారు. జలాశయంలో నీరు లేని సమయంలో రైతులు పంటలు వేస్తారు. నీటిగుంతల్లో మోటార్లు పెట్టి నడుపుతారు. ఒకేసారి నీరు పెరగడంతో పంటచేలు మునగడంతో పాటు మోటార్లు నీటిమునగనున్నాయి. వాటిని వెంటనే ఒడ్డుకు చేర్చుకోవాలని అధికారులు హెచ్చరించారు. అలాగే జాలరులు నీటికి అడ్డంగా వలలు వేయ వద్దని కొట్టుకుపోయే అవకాశలున్నాయని, నివాసాలను జలాశయంలోనుంచి ఒడ్డుపైకి మార్చుకోవాలని సూచించారు. ఏదిఏమైనా శ్రీశైలం గేట్లు ఎత్తడం.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22నుంచి నీటి విడుదల ఖరీఫ్ పంటల సాగుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. ఆరు విడతలుగా 69 రోజులపాటు మొదటి, రెండో జోన్లకు విడుదల 40 టీఎంసీల నీరు కేటాయింపు మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలు వకు 2018 ఖరీఫ్ పంటల సాగుకు గాను విడతల వారీగా నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్ఎస్పీ మిర్యాలగూడ ఒ అండ్ ఎం సర్కిల్ ఎస్ఈ నర్సింహ వెల్లడించారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్‌లో నీటి లభ్యత ఆధారంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఎడ మ కాలువకు 40 టీఎంసీల నీటిని కేటాయించినట్లు తెలిపారు. మిర్యాలగూడ, ఖమ్మం సర్కిల్ పరిధిలో మొత్తం 6.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, నల్లగొండ జిల్లాలో 1,45,720 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2,29,961 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌లో విడుదల చేసే నీరు మొదటి జోన్, రెండో జోన్‌కు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 510 అడుగుల కంటే తక్కువగా నీరుంటే సాగు అవసరాలకు ఇవ్వవద్దని ఉన్నందున ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం సాగర్ జలాశయంలో 531.30 అడుగుల మేర 170.696 టీఎంసీ నీరుందన్నారు. దాంతో ఖరీఫ్‌లో ఎడమ కాలువకు సాగు అవసరాలకు గాను 40 టీఎంసీలు కేటాయించామని, ఆరు విడతలుగా నీటిని 69 రోజుల పాటు విడుదల చేయనున్నట్లు వివరించారు. నవంబర్ 28 వరకు.. ఈ నెల 22వ తేదీనుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఆరు విడతలుగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు ఎస్ఈ నర్సింహ పేర్కొన్నారు. మొదటి విడుతలో వరినాట్లు వేసుకునే వీలు కోసం 24రోజుల పాటు నిరంతరంగా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు నీటిని నిలిపివేసి తొమ్మిది రోజులపాటు విడుదల చేయనున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడానికి గాను నీటి పారుదల శాఖ అధికారులు టెయిల్ టు హెడ్ పద్ధతి ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతికి రైతులంతా సహకరించాలని ఆయన కోరారు. కాలువకు గండ్లు పెట్టకుండా నీటిని వినియోగించుకోవాలని, నీటిని వృథా చేసి చివరి దశలో ఇబ్బందులు పడవద్దని కోరారు. 20న సమావేశం.. సాగర్ ఎడమ కాలువకు ఖరీఫ్ నీటి విడుదల ప్రణాళికపై వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్పీ ఎస్ఈ నర్సింహ తెలిపారు. 20వ తేదీన మధ్యాహ్న రెండు గంటలకు లక్ష్మి కల్యాణమండపంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్లు, మాజీ డీసీ, నీటి వినియోగదారుల సంఘ సభ్యులు పాల్గొనాలని కోరారు. -
పత్తి పైనే ఆసక్తి
జిల్లాలో రైతులు ఈసారి కూడా పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 72,123 హెక్టార్ల (63 శాతం)లో వివిధ పంటలు వేశారు. అయితే.. కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 50,499 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న, మిగతా ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రైతులు ఈ ఖరీఫ్‌లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా పత్తిసాగే కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రాజెక్టులు, చెరువులకు నీరు రాకపోవడం కూడా వరిసాగుకు ప్రతికూలంగా మారిందని, అందుకే ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను ఇంకా 5 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేశారని అంటున్నారు. వ్యవసాయశాఖ అంచనా ఇదీ.. ఇప్పటికి సాగు 63 శాతమే.. గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2017 ఖరీఫ్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,123 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. అయితే.. 36,347 హెక్టార్లకు కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 47,523 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యానికి ఇప్పటికే 50,499 హెక్టార్ల (106 శాతం)లో పత్తి పంట వేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న వేయగా, మిగతా 1,204 హెక్టార్లలో ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 898.3 మిల్లీమీటర్లు కాగా, గతేడాది జూలై 31 వరకు 347.90 మిల్లీమీటర్లు నమోదైతే, ఈసారి 252 మి.మీటర్లుగా ఉంది. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమై రెండు నెలలు కావస్తుండగా ఇప్పటికీ జిల్లాల్లో సగటు సాగు 63 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా ఆయకట్టుకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్ఎండీలకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన నీరు చేరలేదు. దీంతో వరి రైతులు పొలాలు, నారుమళ్లు, వరినారు సిద్ధం చేసుకున్నా.. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రబీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆచీతూచీ సేద్యం వైపు కదులుతున్నారు. ఈ ఖరీఫ్‌లో తొలకరి జల్లులు కొన్ని మండలాల్లో ఆశాజనకంగానే ఉన్నా.. ఇప్పటికీ ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చిచూస్తే వర్షాలు పడుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి తదితర పంటలకు స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వరిసాగుపై వేచిచూసే ధోరణితో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. -
పత్తి సాగు 98 శాతం
సాక్షి, హైదరాబాద్: పత్తి సాగు గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు 98 శాతం పత్తి పంట సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుపై వ్యవసాయశాఖ బుధవారం నివేదిక విడు దల చేసింది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 40.99 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపింది. అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 77.65 లక్షల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం... 7 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ నివేదిక తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో లోటు నమోదైందంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లోనైతే ఏకంగా 33 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లో 32 శాతం, సంగారెడ్డి జిల్లాలో 31 శాతం, యాదాద్రి జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే 194 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అలాగే 6 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఇక ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రకారం 115 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. మిగిలిన 20 జిల్లాల్లో(269 మండలాల్లో) సాధారణ వర్షపాతం రికార్డు అయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 320.9 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 311.7 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్ నెలలో 14 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు 14 శాతం లోటు కనిపించడం గమనార్హం. -
తగ్గిన ఖరీఫ్ వరి దిగుబడి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2017–18 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెండో ముందస్తు అంచనా నివేదిక విడుదల చేసింది. 2 లక్షల టన్నులకుపైగా వరి ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే, 4 లక్షల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గాయి. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేర లేకపోవడంతో రబీపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 44.72 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుందని సర్కారు తాజా నివేదికలో అంచనా వేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే, రబీలో వరినాట్లు కేవలం 87 శాతానికే పరిమితం కావడం గమనార్హం. -
బ్యాంకుల తీరుపై సర్కారు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: పంటరుణాల మంజూరులో బ్యాంకర్ల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రుణ లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ఖరీఫ్ పంటల రుణ ప్రణాళిక లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా, బ్యాంకులు రూ.21,025 కోట్లు మాత్రమే ఇచ్చాయి. లక్ష్యంలో 88 శాతం రుణాలిచ్చాయి. రుణాలను సకాలంలో ఇవ్వకపోవడమే కాకుండా ఆయా జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిపై ప్రజాపద్దుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా బ్యాంకర్ల కమిటీలు, జిల్లాస్థాయి రుణ సమీక్ష కమిటీల సమావేశాలు నిత్యం జరగకపోవడం వల్లే ఈ వ్యత్యాసముందని భావించింది. ఆయా కమిటీల సమావేశాలు సక్రమంగా జరపాలని, రబీలో మార్పు తీసుకురావాలని కోరుతూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. 10 జిల్లాల్లో 65 శాతం లోపే పెద్దపల్లి జిల్లాలో రైతులకు కేవలం 48 శాతం రుణాలిచ్చాయి. ఆ జిల్లా ఖరీఫ్ పంటరుణ లక్ష్యం రూ.638 కోట్లు కాగా, రూ.308 కోట్లు మాత్రమే అందజేశాయి. 10 జిల్లాల్లో కేవలం 65 శాతం రుణాలే ఇచ్చారు. మంచిర్యాల జిల్లా 50, వనపర్తి 53, నిజామాబాద్ 54, కొమురంభీం 55, జయశంకర్ 56, మహబూబ్‌నగర్ 58, జోగులాంబ 63, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలు 64 శాతం చొప్పున రుణాలిచ్చాయి. ఇంత తక్కువ రుణాలివ్వడానికి అధికారులకు, బ్యాంకర్లకు మధ్య సమన్వయలోపమే కారణ మని వ్యవసాయశాఖ అంచనా వేసింది. మరో పది జిల్లా ల్లో బ్యాంకులు 100 శాతానికిపైగా రుణాలిచ్చి రికార్డు సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో 172, భద్రాద్రి జిల్లాలో 162, రంగారెడ్డి 136, యాదాద్రి 134, మహబూబాబాద్ 132, రాజన్న సిరిసిల్ల 128, మెదక్ 125, కరీంనగర్ 117, ఖమ్మం జిల్లాలో 110 శాతం చొప్పున పంటరుణాలు అందించాయి. దీర్ఘకాలిక రుణాలు 25 శాతమే ఇవ్వడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపైనా దృష్టి సారించాలని వ్యవసాయశాఖ కలెక్టర్లను కోరింది. -
ఎన్నాళ్లీ వర్ష విరామం!
రెండు వారాలైనా జాడ లేని చినుకు.. ► మరో 15 రోజులపాటు వర్షాభావ పరిస్థితులు: స్కైమెట్ అంచనా ► అదే జరిగితే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం ► సీజన్లో వరుసగా నెలపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదు: శాస్త్రవేత్తలు ► ఆగస్టు 15 తర్వాత వర్షాలకు అనుకూల వాతావరణమని వెల్లడి సాక్షి నాలెడ్జ్ సెంటర్ వారమైంది.. రెండు వారాలైంది.. చినుకమ్మ జాడే లేదు.. విత్తు వేసిన రైతు ఆశగా నింగివైపు చూస్తున్నా వరుణుడు కనికరించడం లేదు! జూలై రెండో వారం వరకు మురిపించిన వర్షాలు ఆ తర్వాత నుంచి ముఖం చాటేశాయి. మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాల సీజన్ మధ్యలో కొంత విరామం రావడం సహజమే అయినా ఇప్పటివరకూ అది గరిష్టంగా ఏడెనిమిది రోజులు మాత్రమే ఉండేదని.. దాదాపు నెలరోజులపాటు వర్షాల్లేకపోవడం చాలా అరుదని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌కు చెందిన శాస్త్రవేత్త మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మరో రెండు వారాలపాటు.. అంటే ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని ఆయన తెలిపారు. ‘‘2009లో రుతుపవనాలకు కొంత విరామం వచ్చి.. ఆ తర్వాత పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదు. ఆగస్టు 15 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం వంటి వాతావరణ వ్యవస్థలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాలయ పర్వత సానువుల వద్ద స్తంభించిపోయిన రుతుపవన మేఘాలకు పశ్చిమ దిక్కు నుంచి వీచే గాలుల మద్దతు లభిస్తున్నా బంగాళాఖాతం నుంచి తేమను మోసుకొచ్చే వ్యవస్థలు లేక వెనక్కు మళ్లలేకపోతున్నాయి. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడా చెదురుమదురుగా జల్లులు పడేందుకు అవకాశం ఉంది’’అని మహేశ్ వివరించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితి కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులేవీ ఉండవని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 1న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత కొంత స్తబ్దుగా ఉండిపోయాయి. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా దేశమంతా విస్తరించాయి. తొలి నెలలో చెప్పుకోదగ్గ వర్షాలే కురిశాయి. జూలై రెండో వారం వరకూ ఈ అనుకూల వాతావరణం కొనసాగినా.. ఆ తర్వాత అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. 15 రోజుల నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విత్తునాటిన రైతులు, నాట్లకు సిద్ధమైన రైతులు ఆందోళనలో మునిగిపోయారు. -
ఖరీఫ్ కళకళలాడాలి
1.08 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యం - 2017–18 కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయ శాఖ - గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాలు పెరగనున్న వరి - ఖరీఫ్, రబీ విత్తన సరఫరా లక్ష్యం 10 లక్షల క్వింటాళ్లు - గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యల ఏర్పాటుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: గతేడాది కంటే ఖరీఫ్ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2017–18 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వ అనుమతి కోసం పంపిం చారు. అక్కడ్నుంచి ఆమోదం రాగానే ప్రకటించనుంది. తాజా వ్యవసాయ ప్రణాళిక ప్రకారం 2017–18 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. 2016–17లో ఖరీఫ్‌లో 1.02 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. 2017–18 ఖరీఫ్‌లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. అంటే గతేడాది కంటే 6 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందులో వరి 2016–17 ఖరీఫ్‌లో 22.15 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈసారి ఖరీఫ్‌లో 24.65 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అదనంగా రెండున్నర లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయించాలని, ఆ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అలాగే 2017–18లో మొత్తం 90.6 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రానుందని అంచనా వేసింది. గతేడాది అధిక వర్షాలు, మిషన్ కాకతీయతో చెరువులు నిండిపోవడం వంటి కారణాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణాన్ని ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు పెం చారు. ఇక రబీ పంటల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచాలని నిర్ణయించారు. 2016–17లో రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు కాగా.. 2017–18 రబీలో 33.75 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రచారం కారణంగా గతేడాది పత్తి సాగు విస్తీర్ణం సాధారణం కంటే గణనీయంగా తగ్గింది. అయితే మార్కెట్లో పత్తికి భారీగా ధర పలికింది. దీంతో రైతులు అనేకమంది ఈసారి పత్తి వైపు మరలుతారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంతో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పడిపోతుందని భావిస్తున్నారు. 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఈ ఏడాది ఖరీఫ్, రబీలకు 10 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యం గా నిర్దేశించుకుంది. అందులో ఖరీఫ్‌లో 6 లక్షల క్వింటాళ్లు, రబీలో 4 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. 2016–17లో రెండు సీజన్లకు కలిపి 7.5 లక్షల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. ఈసారి అదనంగా రెండున్నర లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేయనున్నారు. అయితే ఎరువుల వాడకాన్ని ఈసారి కాస్తంత తగ్గించాలని నిర్ణయించారు. 2016–17 ఖరీఫ్‌లో 17.30 లక్షల టన్నులు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే, 2017–18 ఖరీఫ్‌లో 16.20 లక్షల టన్నులే సరఫరా చేయాలని నిర్ణయించారు. గత రబీలో 12.50 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఈసారి రబీలో 12 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఎరువులను గణనీయంగా తగ్గించడం వల్ల రైతులకు సాగు ఖర్చు తగ్గనుంది. దీనివల్ల రైతు ఆదాయం కూడా పెరుగుతుంది. ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ ఏడాదే సమాఖ్యల ఏర్పాటు వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను గుర్తించే పనిని ప్రభుత్వం గ్రామ రైతు సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు రైతులు తాము పండించిన పంటకు సరైన ధర ఇప్పించే పని కూడా రైతు సంఘాలకే కల్పించారు. అందుకోసం ఈ ఏడాదిలోనే గ్రామ రైతు సంఘాలు, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రస్తావించింది. అందుకు త్వరలో మార్గదర్శకాలు ఖరారు చేసి సమాఖ్యలను ఏర్పాటు చేస్తారు. -
పంటకు ఊపిరి
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు - ఊపిరిపీల్చుకున్న అన్నదాత సాక్షి, హైదరాబాద్: ఆలస్యంగానైనా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం వచ్చింది! ఎండిపోతున్న అనేక పంటలకు ఈ వానలు ఊపిరి పోశాయి. ఇప్పటికే ఎండిపోయి న మొక్కజొన్న మినహాయిస్తే మిగిలిన పంటలకు తాజా వర్షాలతో ఉపయోగం ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. ప్రధానంగా కంది, పత్తి పంటలకు ఈ వర్షాలు ప్రాణదాతగా నిలుస్తాయని అంచనా వేసింది. సమయం మించిపోయినందున ఇప్పుడు ఖరీఫ్ వరి నాట్లు వేయడం కష్టమేనని.. అందుకే రైతులు ముందస్తు రబీకి వెళ్లడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆశలు వదులుకోవాల్సిందే రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు. ఇందులో 90 లక్షల ఎకరాల్లో (84%) సాగు జరిగింది. అత్యధికంగా పత్తి 30 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 14.32 లక్షల ఎకరాల్లో వేశారు. సాధారణం కంటే 118 శాతం అధికంగా ఈ పంటను సాగు చేశారు. అలాగే కంది 10.64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సోయాబీన్ 7.36 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, కంది, మొక్కజొన్న తదితర పంటలు వేయాలని సర్కారు సూచించడంతో రైతులు అనేక మంది ఈ పంటలను ఎంచుకున్నారు. అయితే ఆగస్టు చివరి వరకు పెద్దగా వర్షాల్లేకపోవడంతో మొక్కజొన్న దాదాపు 75 శాతం వరకు ఎండిపోయింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయినట్టు అంచనా వేశారు. మిగిలిన 25 శాతం పంటకు ఈ వర్షాలు కొంతమేర ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కందికి మాత్రం ఈ వర్షాలు నూటికి నూరు శాతం ప్రయోజనం చేకూర్చనున్నాయి. వరి ఖరీఫ్‌లో 24.35 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా... ఇప్పటివరకు 15.04 లక్షల ఎకరాల్లో(62%) నాట్లు పడ్డాయి. ముంచెత్తుతున్న వానలు రెండు మూడ్రోజులుగా వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు పొంగుతున్నాయి. చెరువులు నిండడంతో భూగర్భజల మట్టం పెరిగి బోర్లపై ఆధారపడ్డ రైతులకు ఉపశమనం కలుగనుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం 8.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో 22 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. అదే జిల్లా పరిగిలో 21, గాండీడ్లో, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 13 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. జూన్ 1 నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 584.3 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా... బుధవారం నాటికి 549 మి.మీ. (6 శాతం లోటు) కురిసింది. కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులలో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా వారి ఉత్పత్తులను యార్డుల్లోని షెడ్లలో నిల్వ చేయాలన్నారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు పుంజుకోవడంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 120 మిల్లీమీటర్లు గరిష్ట వర్షపాతం కురిసింది. -
ముంచెత్తిన వాన
విశాఖలో భారీ వర్షం.. 14 సెం.మీ. నమోదు జిల్లాలోనూ ఆశాజనకంగా వర్షం ఖరీఫ్ పంటలకు మేలు విశాఖపట్నం: బంగాళాఖాతంలో ద్రోణులు, ఆవర్తనాలు, ఈశాన్య రుతుపవనాల కరుణతో వర్షాలు కుమ్మరిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ఆదివారం కూడా కొనసాగాయి. భారీ వర్షాలకు వరసగా రెండు రోజులూ రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో వర్షపాతం నమోదయింది. శనివారం ఉదయం వరకు 7 సెం.మీ.ల వర్షం కురవగా ఆదివారం ఉదయం వరకు 14 సెం.మీ.ల వాన కురిసింది. ఆదివారం రాత్రికి విశాఖలో 6 సెం.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఎడతెరిపిలేని వానకు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జిల్లాలోనూ రెండు రోజులుగా వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఆదివారం పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి, తగరపువలస, భీమిలి, పెందుర్తి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం, చోడవరం, మాడుగులతో పాటు మన్యంలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంబరపడుతున్నారు. ఇప్పటికే వరి పంట వెన్ను, పొట్ట దశలోను, చెరకు ఎదిగే దశలోనూ ఉన్నాయి. వీటితో పాటు ఇతర పంటలకు ఇవి ప్రాణం పోశాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానలకు రిజర్వాయర్లలోనూ వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇది కూడా భవిష్యత్తులో సాగునీటి ఎద్దడి లేకుండా చేస్తుందని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా వర్షాభావ పరిస్థితులేర్పడిన నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంటలకు మళ్లీ జీవం పోసినట్టయిందని వీరు ఊరట చెందుతున్నారు. ఆవ ప్రాంతంలో వరిపైరు నీటమునిగింది. పలు చోట్ల ఈదురు గాలులకు చెరకుతోటలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలయిన మునగపాక బీసీ కాలనీ, నాగులాపల్లి జగ్గయ్యపేట అగ్రహారం, పల్లపు ఆనందపురం, యాదగిరిపాలెం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవ స్థలకు గురయ్యారు. ఈ వర్షాలు వరికి మేలు చేస్తాయని వ్యవసాయాధికారి పావని తెలిపారు. ఎక్కడైనా వరి ముంపునకు గురైతే సాధ్యమైనంత త్వరగా బయటకు పోయేలా చూడాలని రైతులకు సూచించారు. విశాఖలో... :విశాఖలోని పూర్ణామార్కెట్, వెలంపేట, స్టేడియం రోడ్డు, రామకృష్ణా జంక్షన్, పండావీధి ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. గాజువాక ప్రాంతం మసీదు రక్షణ గోడ, కొత్తగాజువాక, కాకతీయనగర్లలో గోడలు కూలిపోయాయి. పాతగాజువాకను జాతీయ రహదారి ముంచెత్తింది. పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీ, కుంచమాంబ కాలనీ, కూర్మన్నపాలెం సాయిరాంనగర్ కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. తెరపినివ్వకుండా కురిసిన వానకు జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. వీటికి గాలులు కూడా తోడవడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఆదివారం కావడంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. చిరువ్యాపారులు పూర్తిగా దుకాణాలు తెరవడం మానేశారు. సాయంత్రానికి వర్షాలు తెరపినిచ్చాయి. సోమవారం కూడా వర్షాలు కొనసాగుతాయని, తర్వాత తగ్గుముఖం పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. మేహాద్రిలో పెరిగిన నీటిమట్టం : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మేహాద్రి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఇన్స్పెక్టర్ సుబ్బరాజు రిజర్వాయర్ పరిస్ధితిని అంచనా వేశారు. 58.50 అడుగుల నుంచి 60అడుగులకు నీటిమట్టం పెరిగినట్టు ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ముందస్తుగా ఒక గేటు ఎత్తి 1045 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు వరి, మొక్కజొన్నకు అనుకూలం వర్షాలు వరి, మొక్కజొన్న పంటలకు మేలు చేశాయి. కొంత కాలంగా వర్షాభావ పరిస్థితులతో ఆలస్యంగా వేసిన వరినాట్లు ఎండిపోతున్నాయి. ఈ దశలో వర్షాలతో కళకళలాడుతున్నాయి. రబీ మొక్కజొన్న నాట్లు వేసినవారికి, ఇంకా విత్తనాలు జల్లాలనుకున్న రైతులకు ముసురుపట్టిన వాతావరణం మేలు చేకూర్చింది. ఖరీఫ్‌లో ముందస్తుగా నాట్లు వేసినచోట వరి పొట్టదశలో ఉంది. అది వాలిపోకుండా రైతులు తాటిఆకులతో కట్టలుగా కట్టి నిలబెడుతున్నారు. కూరగాయల పంటకు కూడా వర్షం అనుకూలం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరుగుడు నాట్లు పనుల్లోనూ రైతులు నిమగ్నమయ్యారు. కాగా పూలతోటలు, ఇటీవల మిరపనారు వేసినచోట్ల మడులలో నీరు నిల్వ ఉండటంతో ఇవి కుళ్లిపోయే ప్రమాదం ఉందని మెట్టప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనబ, దొండ, చిక్కుడు, ముల్లంగి పంటలు ఊట పట్టే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. -
మామిడిపై ‘ఆకు తేళ్లు’ అవుట్!
* ఆకు జల్లెడ గూడు పురుగు నుంచి మామిడి తోటలకు విముక్తి * తొలిసారి అంతర్ధానమైన ఆకు జల్లెడ గూడు పురుగు * పముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డా. ఎం. సుగుణాకర్‌రెడ్డి వెల్లడి ఈసారి ఖరీఫ్ పంటలను చావు దెబ్బ తీసిన తీవ్ర కరువు.. మామిడి తోటలకు ఒక రకంగా మేలు చేసిందా? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మామిడి తోటలకు ఆకు జల్లెడ గూడు పురుగు (Orthaga exvinacea : Leaf Skeletoniser and webber) ఆశిస్తూ, 10-15 శాతం మేరకు దిగుబడి నష్టాన్ని కలిగిస్తున్నది. అయితే, ఈ ఏడాది ఈ పురుగు ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిందని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. మహాకళ సుగుణాకర్ రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. మామిడి తోటలపై గత ముప్పయ్యేళ్లుగా తిష్టవేసి నష్టపరుస్తున్న ఈ పురుగు ఈ ఏడాది అనూహ్యంగా నాశనమైందని ఆయన తెలిపారు. ఆకు జల్లెడ గూడు పురుగు లార్వా ఆకుల ఈనెల మధ్యనున్న కణజాలాన్ని పూర్తిగా తినేసి, ఆకుల్ని జల్లెడలాగా చేసి ఈనెలను దగ్గరకు చేర్చి గూడును ఏర్పరచుకుంటుంది. ఇది ఆశించిన చెట్టు ఆకులు బాగా రాలిపోతాయి. ఈ పురుగు పూత దశలో పూలను, పూ మొగ్గలను ఆరగించి.. తర్వాత పూగుత్తుల్ని గూడుగా ఏర్పరుస్తుంది. క్వినాల్ఫాస్ తదితర మందులను పంట కాలంలో 3-4 సార్లు ట్రాక్టరుకు అమర్చిన స్ప్రేయర్ ద్వారా హైజెట్ నాజిల్‌తో పిచికారీ చేయాలి. అయినా, పూర్తిగా పోకుండా 10-15 శాతం వరకు పంట నష్టం కలిగిస్తుంటుంది. పూత దశలో ఈ పురుగులు సోకితే దిగుబడి మరింత నష్టం కలుగుతుంది. దీన్ని రైతులు ‘ఆకు తేళ్లు’ అని పిలుస్తుంటారని, తమ మామిడి తోటల్లోనూ ఇది ముప్పయ్యేళ్లుగా ఉందని, ఈ ఏడాది ఆశ్చర్యకరంగా పోయిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ పురుగు పోయిందని రైతులు తనతో చెప్పారన్నారు. ‘ఆకు తేళ్లు’ పూర్తిగా పోవడానికి గల కారణాలను శోధించాలని డా. సుగుణాకర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నాటి ‘ఆకు తేళ్ల’ సిల్కు వస్త్రం! 1997లో తమ మామిడి తోటను పూర్తిగా ఆకు జల్లెడ గూడు పురుగు పూర్తిగా జల్లెడ పట్టేసిందని డా. సుగుణాకర్‌రెడ్డి తెలిపారు. అప్పుడు చెట్ల మీద ఒక్క ఆకూ మిగల్లేదని, వరుసగా రెండేళ్ల పాటు మామిడి దిగుబడిని పూర్తిగా నష్టపోయామన్నారు. ఈ పురుగు చెట్టు మీద నుంచి నేల మీదకు పాకుతూ దిగుతుంది. ఆ క్రమంలో పురుగు వదిలే సన్నని సిల్కుదారం చెట్టు కొమ్మలపై సున్నపు పూత మాదిరిగా కనిపించిందని, ఆ సిల్క్ పోగులన్నీ కలిసి ఒక పల్చని వస్త్రంలా ఏర్పడిందన్నారు. ఆ వస్త్రాన్ని డా. సుగుణాకర్‌రెడ్డి జాగ్రత్తగా సేకరించి, అప్పట్లోనే (1997-98) ఉద్యాన నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు. ఆకు తేళ్ల బెడద అంత ఎక్కువగా ఉంటుందన్న విషయం అంతకు పూర్వం తెలియదని డా. సుగుణాకర్‌రెడ్డి (94416 77401) తెలిపారు. బత్తాయి, ఆరెంజ్ తోటల్లో ప్రకృతి సేద్యంపై అధ్యయన యాత్ర తక్కువ నీటితో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా బత్తాయి, నారింజ తోటలను సాగు చేయాలనుకునే తెలుగు రైతుల కోసం అక్టోబర్ 8-11 తేదీల్లో అధ్యయన యాత్రతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామభారతి ప్రధాన కార్యదర్శి పి. కరుణాకర్ గౌడ్ తెలిపారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్వయంగా వెంట ఉండి మహారాష్ట్రలోని కాటోల్ జిల్లాలో ఈ పద్ధతిలో సాగయ్యే బత్తాయి, నాగపూర్ నారింజ తోటలను అక్టోబర్ 8,9 తేదీల్లో చూపిస్తారు. ఈ తోటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడంపై నాగపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని కాటోల్ పట్టణంలో 10,11 తేదీల్లో పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగు రోజులకు రవాణా వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరు రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు కాటోల్కు చెందిన మనోజ్ జనాన్లాల్ (098225 15913) లేదా హేమంత్ చౌహాన్ (075886 90688)ను లేదా హైదరాబాద్‌లోని కరుణాకర్ గౌడ్ (94404 17995)ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతుల్లో శాశ్వత వ్యవసాయం (పర్మాకల్చర్) ఒకటి. శాశ్వత వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న వారు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. శాశ్వత వ్యవసాయంపై అంతర్జాతీయ మహాసభ (సెప్టెంబర్ 7-17) లండన్‌లో జరుగుతున్నది. తదుపరి అంతర్జాతీయ మహాసభను 2017లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా పర్మాకల్చర్ అంతర్జాతీయ సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణకు చెందిన పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు హైదరాబాద్ మహాసభ (నవంబర్ 15-23, 2017) నిర్వహణ బాధ్యతను లండన్ సభలో స్వీకరించారు. అంతర్జాతీయ మహాసభకు ముందే వచ్చే ఫిబ్రవరి 5-7 మధ్య పర్మాకల్చర్ జాతీయ మహాసభను నిర్వహించనున్నామని నరసన్న తెలిపారు. భారతీయ శాశ్వత వ్యవసాయ విభాగానికి తెలుగునాట డా. వెంకట్ తదితరులు పునాదులు వేసి 30 ఏళ్లవుతున్నది. ఈ పూర్వరంగంలో పర్మాకల్చర్ జాతీయ, అంతర్జాతీయ మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుండడం విశేషం. వివరాలకు.. permacultureindia.org వెబ్సైట్ చూడొచ్చు. -
ఏపీలో కమ్ముకొస్తున్న కరువు
-
ఎండిపోయిన ‘ఖరీఫ్’
♦ 11 లక్షల హెక్టార్లలో పంట నష్టం ♦ 2014 కన్నా దారుణమైన పరిస్థితి ♦ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అధికారులు సాక్షి, ముంబై : రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో లక్షల హెక్టార్ల పంట నాశనమైంది. జొన్నలు, సజ్జలు, పెసర్లు, మొక్కజొన్న, మినుమలు లాంటి పంటలు 70 శాతం ఎండిపోయాయి. జూన్ నెలలో వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 లక్షల హెక్టార్లలో రైతులు విత్తనాలు నాటారు. అయితే వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. 2014 కంటే కూడా ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందని అధికారులు అంటున్నారు. తిరిగి ఖరీఫ్ పంట వేయాలన్నా పరిస్థితులు అనుకూలించలేదని పేర్కొన్నారు. పంట దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 144 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంట సాగు చేస్తారని, అయితే ఇప్పటివరకు 123 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటగా వర్షాభావ పరిస్థితుల వల్ల 11 లక్షల హెక్టార్ల పంట నాశనమైందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మినుములు, పెసర్లు, సోయాబీన్, సజ్జలు పప్పు ధాన్యాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు అంటున్నారు. పెసర్లు, సోయాబీస్ అధికంగా పండించే మరాఠ్వాడా ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటుంది. రబీ సీజన్ సమీపిస్తుండటంతో పాడైపోయిన పంటల స్థానంలో తిరిగి విత్తనాలు వేసినా లాభం ఉండదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పుణే జిల్లాలోని ఇందాపూర్, బారామతి, శిరూర్, దౌండ్లలో పంటలు ఎండిపోయాయని, నాసిక్, జల్గావ్, షోలాపూర్, సాంగ్లీ, అహ్మద్‌నగర్‌లలో పరిస్థితి మరింతగా దారుణంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పుణే జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంట ఎండిపోయిందని, అధికమొత్తంలో పంట పనికి రాకుండా పోయిందని చెబుతున్నారు. పుంధర్, బారామతి, ఇందాపూర్, దౌండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నెల రోజుల నుంచి వర్షాలు కురవలేదని, దీంతో 15 వేల హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు
♦ లో ఓల్టేజీతో మొరాయిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు ♦ సకాలంలో అందక సాగునీటి మళ్లింపునకు కష్టం ♦ కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం 4,500దరఖాస్తులు ♦ మంజూరు వెయ్యి మాత్రమే పాలమూరు : వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. ఖరీఫ్ పంటల సాగుకోసం సిద్ధపడిన రైతన్నలను ఓవైపు అయోమయానికి గురి చేస్తుండగా.. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల రిపేరు బేజార్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులు చేపట్టడంలో తీవ్రజాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల రిపేరు కోసం అన్నదాతలు నానా తంటాలు పడాల్సి వస్తోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండటంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. జిల్లాలో మొత్తం 6.5లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా దాదాపు 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. వీటి ఏర్పాటులో విద్యుత్‌శాఖ తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వంలో కూడా రైతుల ట్రాన్స్ఫార్మర్ కష్టాలు కడతేర డం లేదు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్‌లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు లోఓల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతుండటంతో అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతం. కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ సమస్యను 48గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 4,500ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండగా.. అందులో వెయ్యి ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. కొత్తవాటిని సకాలంలో ఏర్పాటు చేయాలని, తరుచూ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోవడానికి గల కారణాలను తెలుసుకుని విద్యుత్‌శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వైర్లు కలిసి కాలిపోయింది కొడంగల్ సబ్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉంది. కొడంగల్, కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు, బొంరాస్‌పేట మండలాల్లో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను ఇక్కడ బాగు చేస్తారు. మాకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ వైర్లు కలిసి కాలిపోయింది. మరమ్మతు కోసం కొడంగల్‌కు తీసుకొచ్చాం. లో ఓల్టేజీ సమస్య, కరెంటు సరఫరాలో హెచ్చు తగ్గుల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. - శ్రీనివాస్‌రెడ్డి, వడిచర్ల(బొంరాస్‌పేట) -
గతి తప్పిన రుతురాగం
ఈ ఏడాది ‘తూర్పు’ ముంగిట రుతురాగం సరిగా పల్లవించలేదు. సరైన వర్షాలు కురిపించకుండానే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయగా.. ఈశాన్య రుతుపవనాలు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఖరీఫ్‌లో ఇక్కట్ల పాలైన రైతులు.. రబీలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. * ‘తూర్పు’ను కరుణించని వరుణుడు * దయచూపని నైరుతి.. * ఈశాన్య రుతుపవనాలదీ అదే గతి! * ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం * అడుగంటుతున్న భూగర్భ జలాలు * బోర్ల కింద రబీ సాగుకు ఇబ్బందులు అమలాపురం : అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాలు.. దానివెంట వచ్చే వాయుగుండాలు, తుపాన్లతో భారీ వర్షాలు కురిసి, ఖరీఫ్ పంట నీట మునిగి, రైతు నష్టపోవడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. పోనీ అలాగని ఖరీఫ్ దక్కిందనడానికీ లేదు. సరైన వర్షాలు లేక వరిపై తెగుళ్లు విజృంభించి రైతును ముంచేశాయి. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకూ 38.2 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 983.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 608.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అక్టోబర్ నెలలో సగటు 214.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 109.4 మిల్లీమీటర్లు (49 శాతం తక్కువ) నమోదైంది. నవంబర్ ఆరు వరకూ 18.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ సున్నా శాతం నమోదైంది. బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల రెండు రోజులుగా చెదురుమదురు జల్లులు పడుతున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ రెండు నెలల్లో కూడా చెప్పుకోదగ్గ వర్షం లేకపోవడం రైతులను ఆందోళన గురి చేస్తోంది. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో వరి చేలు కోతలకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో వానలు పడకూడదని రైతులు సాధారణంగా కోరుకుంటారు. అయితే అసలు దుక్కు వర్షం కూడా పడకపోవడం వారిని కలవరపెడుతోంది. ఇక్కడ మరీ దారుణం కొన్ని మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేవీపట్నంలో 61 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తాళ్లరేవు 59.1, ప్రత్తిపాడు 58.3, బిక్కవోలు 55.5, గండేపల్లి 54.1, కరప 53.1, అయినవిల్లి 51.4, సామర్లకోట 48, కాకినాడ రూరల్ 47.4, రాయవరం 46.3, కె.గంగవరం 45.5, సీతానగరం 45.4, మండపేట 45.2, ఆలమూరు 45.1, అనపర్తి 42.5, కొత్తపల్లి 42.4, పెదపూడిలో 40.8 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అడుగంటిన భూగర్భ జలాలు వర్షపాతం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. డెల్టాలో సగటున ఐదడుగులు, మెట్ట, ఏజెన్సీల్లో ఏడు నుంచి తొమ్మిదడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వచ్చే రబీలో బోర్ల కింద సాగు చేసే రైతులు నీటి కోసం అల్లాడే పరిస్థితి ఏర్పడనుంది. ముఖ్యంగా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడి సాగు చేయడం ఇబ్బందేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే వచ్చే రబీకి గోదావరిలో నీటి ఎద్దడి ఏర్పడనున్న దృష్ట్యా తూర్పు డెల్టాలో రైతులు సాగునీటి అవసరాలకు చాలావరకూ బోర్లపైనే ఆధారపడతారు. డెల్టాలో మోటార్లపై కొబ్బరి, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు సైతం నీటి ఇక్కట్లు తప్పకపోవచ్చు. -
‘ఉపాధి’ ఎండమావే!
తీవ్ర దుర్భిక్షంతో 57 మండలాల్లో ఖరీఫ్ పంటలకు నష్టం సేద్యం పడకేయడంతో గ్రామాల్లో ఉపాధి దొరకని దుస్థితి ఉపాధిహామీ కింద పని కల్పించడంలో సర్కారు వైఫల్యం పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తున్న గ్రామీణులు వరుసగా ఐదో ఏటా జిల్లాను కరవు కాటేసింది. దుర్భిక్షంతో సేద్యం పడకేసింది. రైతులే కూలీలుగా మారిపోవడంతో పల్లెల్లో పని దొరకని దుస్థితి నెలకొంది. ఉన్న ఊళ్లో చేతినిండా ఉపాధి కల్పించి.. వలసల నివారణకు చేసిన ఉపాధి చట్టాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పని కల్పించకపోవడంతో రెక్కాడితేగానీ డొక్కాడని రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదీ మన జిల్లా గ్రామీణ చిత్రం..! సాక్షి ప్రతినిధి, తిరుపతి/బి.కొత్తకోట: జిల్లా లో పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడాదికి జిల్లాలో 918.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని దుర్భిక్షం కాటేసింది. ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటలను సాగుచేసిన రైతులను వరుణుడు చిన్నచూపు చూశాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 439.4 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 217.4 మీమీల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌లో 1.38 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలమట్టం 17.68 మీటర్లకు పడిపోయింది. భూగర్భజలమట్టం పడిపోవడంతో 60 వేలకుపైగా బోరుబావులు ఎండిపోయాయి. అటు మెట్ట భూముల్లోనూ.. ఇటు బోరు బావుల కింద సాగుచేసిన ఆరు తడి పంటలు ఎండిపోవడంతో ఖరీఫ్ రైతులను నట్టేట ముంచింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 395.4 మీమీల వర్షపాతం నమోదవ్వాలి. ఇప్పటికి 105.7 మిమీ. కురిసింది. నైరుతి, ఈశాన్య రుతపవనాల ప్రభావం వల్ల ఇప్పటికి 545.1 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. 317.5 మిమీలు కురిసింది. అంటే.. సాధారణ వర్షపాతం కన్నా 42 శాతం తక్కువ కురిసినట్లు స్పష్టమవుతోంది. వర్షపాతం.. పంటల పరిస్థితిని ఆధారంగా తీసుకుంటే జిల్లాలో 57 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్న ట్లు అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ఖరీఫ్ పంట లు నష్టాల దిగుబడులను మిగల్చడంతో రబీ సాగు పై రైతులు ఆసక్తి చూపడం లేదు. రబీలో జిల్లాలో 59,970 హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉండ గా.. ఇప్పటికి కేవలం 883 హెక్టార్లలోనే పంటలు సాగుచేయడమే అందుకు తార్కాణం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పడకేయడంతో పల్లెల్లో చేయడానికి పని దొరకని దుస్థితి నెలకొంది. రైతులే కూలీలుగా మారడంతో రైతు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలతోపాటూ రైతులూ వలసబాట పట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు వలస వెళ్లారు. కొందరైతే ముసలివాళ్లను, పిల్లలను ఇళ్లల్లో ఉంచి.. భార్యాభర్తలు ఇద్దరూ వలస వెళ్లారు. మరి కొందరైతే ఇంటికి తాళం వేసి.. కుటుంబం మొత్తం వలస వెళ్లారు. వలసలతో గ్రామాలన్నీ బోసిపోయాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆలనాపాలనా లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ ఉపాధి హామీ..? ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించడం కోసం 2005లో కేంద్రం ఉపాధి చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద 66 మండలాల్లోని 1,380 పంచాయతీల్లో 11,580 గ్రామాల్లోని 6.38 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 5.07 లక్షల మంది సభ్యులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటుచేశారు. ఏడాదికి గరిష్టంగా వంద పని దినాలు కల్పించాలని నిర్ణయించారు. పని కల్పించమని అడిగిన వారంలోగా పని కల్పించకపోతే సంబంధిత జాబ్‌కార్డ్ లబ్ధిదారునికి పరిహారం చెల్లించేలా నిబంధన పెట్టారు. కానీ.. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. అడిగిన తక్షణమే పని కల్పించకుండా.. వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.13 కోట్లకు చేరుకోవడమే అందుకు తార్కాణం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కో కుటుంబానికి సగటున 48.95 పని దినాలు కల్పించారు. వంద రోజులు పని దినాలు కేవలం 22,492 మందికి మాత్రమే కల్పించడం గమనార్హం. ఉపాధిహామీ కింద పని కల్పించకపోవడంతో రైతులు, రైతు కూలీలు కన్నతల్లి వంటి ఉన్న ఊళ్లను వదిలి వలస వెళ్తోండటం గమనార్హం. వంద రోజులు పని కల్పించలేని ప్రభుత్వం.. కరవు నేపథ్యంలో ఉపాధిహామీ పని దినాలను 150కి పెంచాలని ఇటీవల లేఖరాయడం కొసమెరుపు. పనిలేక ఖాళీగా ఉన్నాం మా ఊళ్లో వీరాంజనేయ, అమరేశ్వర గ్రూపుల్లో 27 మంది కూలీలు కరువు పనులకు వెళ్లేవాళ్లము. జూన్ నెల లో చెరువులో మట్టి పనులు చేసినాం. అప్పటి నుంచి పనుల్లేక ఇళ్లకాడ ఖాళీ గా ఉండాము. కరువు పనికి పోదామని ఉన్నా పనులు చేయమని చెప్పే వాళ్లే లేరు. ఆఫీసర్లు గూడా వచ్చి కరువు పనులు చేసుకోమని ఎవ రూ చెప్పలే. ఈసారి పంటలు పండకపోయా. ఇట్లే ఉంటే బెంగళూరుకు వెళ్లిపోవాల్సిందే. -వేమనారాయణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లి ఇంతవరకు బిల్లులేదు ఈ ఏడాది జూన్‌లో మా గ్రూపులోని 12 మంది కూలీలు కలసి కొత్తచెరువులో మట్టి తవ్వే పనికిపోయాం. పొలాలకు తోలిన 300 ట్రాక్టర్ల మట్టిని చల్లాం. సగం బిల్లులు మాత్రం ఇచ్చారు. ఇంకా రూ.20 వేలు ఇవ్వాలి. పోస్టాఫీసుకు పోతే మా అకౌంట్లో బిల్లులు పడలేదంటున్నారు. -రమణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లె -
పైరుకు ప్రాణం
గద్వాల/ధరూరు: జూరాల ఆయకట్టులోని పంటలు ఇక కళకళలాడనున్నాయి. ఎగువప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో మంగళవారం కుడి, ఎడమ ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ పంటలకు నీటిని వదిలారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను దాటి కృష్ణానది పరవళ్లు రాష్ర్టంలోకి అడుగుపెట్టాయి. బుధవారం సాయంత్రం జూరాల రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో చేరనుంది. కాగా, ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో 15 క్రస్టుగేట్లను ఒక మీటరు ఎత్తి దిగువనదిలోకి 72,298 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుక ఇన్‌ఫ్లో 68,252 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్టస్థాయికి చేరడంతో 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువనదిలోకి 36,478 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి విడుదలైన భారీ వరద ప్రవాహం బుధవారం జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరు టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ జరిగితే కృష్ణమ్మ పరవళ్లు గురువారం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చేరడం ప్రారంభం కానుందని అధికారులు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం: జెడ్పీచైర్మన్ భాస్కర్ రాష్ట్రప్రభుత్వం రైతుల ప్రయోజనాలు, సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జూరాల ప్రధానకాల్వల ద్వారా ఖరీఫ్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా నిర్మితమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కృష్ణా, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించే పనులను పూర్తిచేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. కొత్త ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి లక్షలాది ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించడంతో పా టు జిల్లాలో భూగర్భజలాల అభివృద్ధి, తాగునీ టి సమస్యను తీర్చేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, శాంతి, జెడ్పీటీసీ సభ్యుడు పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు సీసల వెంకట్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే సమయం లో ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలన్న ప్రొటోకాల్ తెలియదా? అని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ జూరాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రధానకాల్వకు నీటి విడుదలను ఎమ్మెల్యే అరుణ ప్రారంభించారు. ఆమెతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కాదని, ప్రజలకు సేవలందించడం ద్వారానే గుర్తింపు వస్తుందన్న వాస్తవాన్ని గమనించాలన్నారు. రైతులకు సేవలందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సాధనలో తాము ముందున్నామన్నారు. పోటాపోటీగా..! జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమైన 18ఏళ్ల తరువాత మొదటిసారి ప్రధానకాల్వ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను ఒకేరోజు వేర్వేరు సమయాల్లో ఇద్దరునేతలు ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం 3గంటలకు జెడ్పీచైర్మన్ జూరాల ప్రాజెక్టుకు చేరుకొని కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేసే గేట్లకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అక్కడికి సాయంత్రం 4గ ంటలకు చేరుకున్నారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకుండానే ప్రారంభించడంపై అక్కడున్న అధికారులపై ఎమ్మెల్యే అరుణ మండిపడ్డారు. ప్రారంభించిన కాల్వగేట్లకు మరోసారి పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. స్థానికులు ఇదేమిటని చర్చించుకున్నారు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
ఖరీఫ్ గడువు: తెలంగాణలో 10, ఏపీలో 15 వరకు! భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్ డా. ఎస్. అయ్యప్పన్, ప్రొ. ఎమ్మెస్ స్వామినాథన్, వ్యవసాయ విశ్వవి ద్యాలయ ఉపకులపతి డా. ఎ. పద్మరాజు, ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇటీవల హైదరాబాద్‌లో సమావే శమై దేశంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమీక్షించారు. అదను, పదను చూసుకొని విత్తుకోవడం, పశుగ్రాసాల కొరత నివారణ చర్యలు, తక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఈ సూచనలతో పోస్టర్లను ముద్రించి వ్యవసాయ శాఖ ద్వారా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి రైతులకు మేలు చేకూర్చడానికి కృషి జరుగుతున్నది. తెలంగాణలో జూలై 10వ తేదీ వరకు, జూలై 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఖరీఫ్ పంటలను విత్తుకోవచ్చు. నేల బాగా పదునైన తర్వాతే విత్తుకోవాలి. అరకొర పదునుతో విత్తుకోకూడదు. పెసర పంటను జూలై 30వ తేదీ తర్వాత విత్తుకోకూడదు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, బెండ, కంది, తీగజాతి కూరగాయలు, చిక్కుడు తదితర పంటలను విత్తుకోవచ్చు. వంగ, టమాట, మిరప వంటి కూరగాయ పంటల ను ఎత్తయిన మడులపై పెంచుకో వాలి. అలసంద, జొన్న, మొక్క జొన్న, సజ్జ వంటి పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవాలి. ప్రస్తుతం వేసుకోదగిన అంతర పంటలు: వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి అంతర పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి. పత్తి- సోయాబీన్, పత్తి-అపరాలు, జొన్న-సజ్జ, కంది-సోయాబీన్, మొక్కజొన్న-కంది, వేరుశనగ-కంది, వేరుశనగ-ఆముదం, ఆముదం -పెసలు, ఆముదం-అలసంద, ఆముదం-వేరుశనగ, ఆముదం- మినుములు, ఆముదం-కంది, పసుపు-ఆముదం, పసుపు- మొక్కజొన్న మొదలైన పంటలను కలిపి సాగు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది. పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, పెరటి కోళ్లు, కుందేళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పశు సంపదకు బీమా రక్షణ పాడి పసువు ధర జాతిని బట్టి రూ. 15 వేల నుంచి రూ. 45 వేల వరకు పలుకుతోంది. స్థానిక, విదేశీ, సంకరజాతి పశువులకు బీమా చేయొచ్చు. 2-10 ఏళ్ల ఆవులకు, 3-10 ఏళ్ల గేదెలకు బీమా చేయొచ్చు. వీటి ఖరీదులో 5% మేరకు బీమా ప్రీమియం ఉంటుంది. బీమా చేసిన పశువుకు చెవిపోగు వేస్తారు. చెవిపోగు ఊడిపోతే ఏజెంట్‌కు చెప్పి వెంటనే వేయించుకోవాలి. బీమా ఉన్న పశువు మరణిస్తే ఏజెంట్‌కు చెప్పి, కళేబరాన్ని ఫోటో తీయించాలి. పశువుల వైద్యునితో పోస్టుమార్టం చేయించి, ఆ నివేదికతోపాటు చెవిపోగును అధికారులకు ఇచ్చి పరిహారం పొందాలి. సబ్సిడీపై కొన్న పశువు చనిపోతే పాల సహకార సంఘం అధ్యక్షుడితో సంతకం చేయించి బ్యాంకు ద్వారా బీమా పరిహారాన్ని పొందాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా చేపల రైతులు పాటించాల్సిన అదనపు జాగ్రత్తలు వానాకాలం అయినప్పటికీ తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఫలితంగా మార్కెట్ సైజుకు పెంచే చేపల చెరువుల్లో నీటి లోతు దాదాపు సగానికి (6 అడుగుల నుంచి 3 అడుగులకు) తగ్గిపోయింది. అంటే.. చేపలకు సాధారణంగా లభించే నివాస స్థలం సగానికి తగ్గి.. చెరువుల్లో చేపల సాంద్రత రెట్టింపవుతుందన్నమాట. ఇటువంటప్పుడు చెరువు నీటిలోని మొత్తం ఆక్సిజన్ పరిమాణం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది. పైగా తీవ్ర వేడిమి వల్ల నీటికి ఆక్సిజన్‌ను పట్టి ఉంచే సామర్థ్యం తగ్గిపోతుంది. సేంద్రియ పదార్థం కుళ్లడం వల్ల ఏర్పడే కాలుష్యం సాంద్రత కూడా పెరుగుతుంది. చేపలు, ముఖ్యంగా రోహు చేపల పెరుగుదల తగ్గిపోవచ్చు. కాబట్టి రోజువారీ వాడే మేత పరిమాణాన్ని తగ్గించి వాడాలి. తెల్లవారుజామున, ఉదయం పూటల్లో ఆక్సిజన్ లోటుతో చేపలు చెరువు పై భాగానికి వస్తుంటాయి. చెరువులోకి మళ్లీ నీరు తగినంత తోడుకునే వరకు రైతులు మేత, ఎయిరేషన్ విషయంలో అదనపు జాగ్రత్తలు పాటించాలి. మార్కెట్ సైజుకు వచ్చిన చేపలను పట్టేయడం మంచిది. - డా. రావి రామకృష్ణ (98480 90576) సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు రొయ్య అనాలోచితంగా గుల్లకొట్టదు! రొయ్యల్లో పెరుగుదల మోల్టింగ్(నిర్మోచనం) అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. దీన్నే గుల్లకొట్టడం అంటారు. రొయ్య తన శరీర పరిమాణం పెంచుకోవాలనుకున్నప్పుడు, గాయాలైనప్పుడు, ప్రత్యుత్పత్తి సమయంలోనూ సహజంగానే గుల్లకొడుతుంది. ఆడరొయ్య గుల్లకొట్టిన సమయంలోనే కలయిక జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి లేనప్పుడు.. రైతులు రసాయనాల వాడకం ద్వారా బలవంతంగా గుల్లకొట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. గుల్లకొట్టడం అనే జీవ ప్రక్రియ రొయ్యకు పునర్జన్మ వంటిది. అటువంటి సంక్లిష్ట ప్రక్రియను రొయ్య అనాలోచితంగా చేసే సమస్యే లేదు. చెరువు యాజమాన్య ప్రక్రియ సక్రమంగా ఉంటే రొయ్యల పెరుగుదల ఆగే సమస్యే లేదు. - ప్రొఫెసర్ పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
న(అ)మ్మకాన్ని వంచించారు!
ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు.. అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు. ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు. -
ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు!
* వెల్లడించిన భారత వాతావరణ విభాగం * జూన్ 5న కేరళలో ప్రవేశించే అవకాశం ఈ ఏడాది తొలకరి జల్లులు నాలుగు రోజులు ఆలస్యంగా దేశాన్ని పలకరించనున్నాయి. జూన్ ఐదున నైరుతి పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం గురువారం తెలిపింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలకరి జల్లులు నాలుగు రోజులు ఆలస్యంగా దేశాన్ని పలకరించనున్నాయి. జూన్ ఐదున నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం గురువారం తెలిపింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. ఇది నాలుగు రోజులు అటూ ఇటూ అవుతుంటుంది. గతేడాది రుతుపవనాలు జూన్ 3న ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేయగా.. జూన్ 1 కల్లా కేరళలో వర్షాలు ప్రారంభమైయ్యాయి. అంతక్రితం ఎడాది జూన్ 5న రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగాన్ని తాకాయి. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీంతో ఖరీఫ్ పంటలకు కీలకమైన నైరుతి రుతుపవనాలు నిరాశపరిస్తే వరి, పత్తి, సోయా, మొక్కజొన్న లాంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం పొంచి ఉంటుందని ఆ విభాగం భావిస్తోంది. భూమధ్య రేఖ వద్ద గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో అండమాన్ దక్షిణ తీరానికి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని వాతావరణ విభాగం తన ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులుగా అక్కడ వర్షాల్లో క్రమేపీ పెరుగుదల కనిపిస్తోందనిపేర్కొంది. అవి బలపడి జూన్ 5న కేరళకు చేరతాయని చెప్పింది. అయితే పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతంలో వానలు తక్కువగా పడతాయని సౌత్ ఆసియా పసిఫిక్ అవుట్‌లుక్ ఫోరమ్ తెలిపింది. తూర్పు ప్రాంతంలోని తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో సాధారణ వర్షాలు పడతాయని చెప్పింది. ‘స్కైమెట్’ ఏమిచెబుతోందంటే.. సాక్షి, హైదరాబాద్: సాధారణం కంటే రెండు రోజులు ముందుగా మే 28న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ అంచనా వేస్తోంది. అయితే ఆ తరువాత మాత్రం కొంచెం భిన్నంగా వాటి విస్తరణ ఉంటుందని ఆ సంస్థ శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మే నెల 28న కేరళ తీరాన్ని తాకిన తరువాత మేఘాలు పశ్చిమ తీరం వెంబడి ఎగబాకి జూన్ 7-8 తేదీలకల్లా ముంబైని తాకుతాయని, ఈ క్రమంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమల్లోనూ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. జూన్ 16కు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆవరిస్తాయని ఆయన తెలిపారు. జూన్ 18 తర్వాత దేశం మొత్తం విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 24 నాటికి ఢిల్లీకి చేరతాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇదంతా రుతుపవనాల ప్రభావమని చెప్పలేమని స్కైమెట్ శాస్త్రవేత్త తెలిపారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మూడు రోజులపాటు వరుసగా వానలు కురిసినప్పుడు మాత్రమే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. -
మిగులు మట్టే - నీటముంచిన బ్రిజేశ్ ట్రిబ్యునల్
కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు పాతర మిగులు జలాల్లోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా కంటితుడుపుగా 4 టీఎంసీల అదనపు కేటాయింపు నీటి వాడకంపై పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు దాని నిర్ణయాలపై సమీక్షకు అథారిటీ 2050 దాకా అమల్లో ఉండేలా తుది తీర్పు ఈ దెబ్బతో కృష్ణా డెల్టా ఇక ‘కృష్ణార్పణమే’ వర్షాభావముంటే రాష్ట్రానికి కృష్ణా జలాలు సున్నా సాక్షి, న్యూఢిల్లీ: భయపడ్డంతా అయింది. కృష్ణా జలాల పంపకంలో మనకు తీరని అన్యాయం జరిగింది. ఊరట దొరకవచ్చన్న ఆశ అడియాసగా మిగిలింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ సారథ్యంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ప్రకటించిన తుది తీర్పు నామమాత్రపు సవరణలకే పరిమితమైంది. గత తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన కొండంత అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఏమాత్రమూ సవరించలేదు. జలాల సక్రమ పంపిణీ ఆవశ్యకతపై రాష్ట్రం చేసిన ఆక్రందనలు, ట్రిబ్యునల్ లోగడ వెలువరించిన తీర్పుపై చెప్పిన తీవ్ర అభ్యంతరాలు, ఎగువ రాష్ట్రాల దాష్టీకాలను ఎత్తిచూపుతూ సాగించిన వాదనలు ఏవీ పని చేయలేదు. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై రాష్ర్టం చేసిన విన్నపాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా గతంలో ఇచ్చిన తీర్పులో కేవలం కొద్ది మార్పులకే ట్రిబ్యునల్ పరిమితమైంది. కర్ణాటకకు గతంలో కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలు కోత విధించి, వాటిని రాష్ర్టంలోని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వకు కేటాయించడం, వివిధ డిపెండబిలిటీల వద్ద రాష్ట్రాలు జలాల్ని ఏ తీరున వినియోగించుకోవాలనేది స్పష్టంగా నిర్దేశించడం, కృష్ణా బేసిన్ పరిధిలోని సబ్ బేసిన్ల మధ్య నీటి బదిలీ కుదరదని మహారాష్ట్రకు తెగేసి చెప్పడం, కృష్ణా జలాల నిర్ణయం అమలు బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) ఏర్పాటు, దాని నిర్ణయూలపై అభ్యంతరాలుంటే సమీక్షకు రివ్యూ అథారిటీ ఏర్పాటు, వరదలపై హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు... ట్రిబ్యునల్ తుదితీర్పులో చేసిన ప్రధాన సవరణలు ఇవే. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు, సకాలంలో నీటి విడుదల తదితర అంశాలపై రాష్ట్రం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల విషయంలో మనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించిన మీదట దాదాపు మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలపై వాదనలు వింటూ వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, సవరణలతో తాజాగా వెలువరించిన తుది తీర్పు మనకు తీరని అన్యాయమే చేసింది. దాంతో ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టులో మన రాష్ట్రం పోరాటం కొనసాగించడం అనివార్యమైంది. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు గత తీర్పులో అనుమతించిన ట్రిబ్యునల్, దాన్ని తుది తీర్పులో సవరించలేదు. కేవలం అనుమతుల విషయమై పెట్టిన నిబంధనను మాత్రం సవరించింది. కర్ణాటక తనకు లభించినట్టు చెబుతున్న అనుమతులన్నింటినీ సంబంధిత సంస్థలు, విభాగాల ముందుంచాలని, అవి సరిపోతాయా లేక మళ్లీ తాజా అనుమతులు తీసుకోవాలా అనేది ఆ విభాగాలు, సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొంది. ఈ సవరణతో ఆలమట్టి విషయంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఈ తీర్పు 2050 దాకా అమల్లో ఉంటుంది. అయితే ఈ తుది తీర్పును అధికారికంగా ప్రచురించొద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించడమొక్కటే మన రాష్ట్రానికి కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు. పావుగంటలో ముగిసింది... జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ చైర్మన్‌గా, జస్టిస్ డి.కె.సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తుది తీర్పును ప్రకటించింది. ట్రిబ్యునల్ తరఫున జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తుది తీర్పును వెలువరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వర్తించే ప్రధానాంశాలను వరుస క్రమంలో చదివారు. ఇదంతా మొత్తం పావుగంటలోపే పూర్తరుుంది. తుదితీర్పు ప్రకటన పూర్తయిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారిమన్, అంద్యార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తీర్పు సంతృప్తికరంగా ఉందంటూ హర్షం వెలిబుచ్చారు. ట్రిబ్యునల్ పని పూర్తయింది... కృష్ణా జలాల విషయమై మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్... సుదీర్ఘ విచారణ అనంతరం అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 5(2) కింద 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులోని అంశాలపై అభ్యంతరాలు చెబుతూ సవరణల కోసం 2011లో మూడు రాష్ట్రాలు, కేంద్రం చేసిన దరఖాస్తులపై ట్రిబ్యునల్ దాదాపు మూడేళ్ల పాటు పరిశీలన సాగించి, అన్ని పక్షాల వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ఆ మీదట గత తీర్పునకు సవరణలతో తాజాగా తుది తీర్పును ప్రకటించింది. చట్టంలోని సెక్షన్ 5(3) కింద ఇచ్చిన ఈ తుది తీర్పుతో ట్రిబ్యునల్‌కు అప్పగించిన పని సంపూర్ణంగా పూర్తయింది. చేసిన సవరణలివీ... 65 శాతం డిపెండబిలిటీ వద్ద కర్ణాటకకు కేటాయించిన జలాల్లోంచి 4 టీఎంసీలను తొలగించి వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు కేటాయించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర, ఎగువ తుంగ నుంచి ఒక్కో టీఎంసీ, సింగత్లూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల చొప్పున మొత్తం 4 టీఎంసీలకు కోతపెట్టారు. వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు తొలిసారిగా కేటాయించారు. దాంతో మన రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు 1005 టీఎంసీలకు పెరిగాయి. వివిధ డిపెండబిలిటీల వద్ద జలాలను మూడు రాష్ట్రాలు ఏ తీరున వినియోగించుకోవాలో స్పష్టపరిచారు. 75 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలు పూర్తిగా వాడుకున్నాకే 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులకు సిద్ధపడాలి. అలాగే, 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలూ వినియోగించుకున్న తర్వాతే సగటు జలాల కేటాయింపుల వాడకానికి దిగాలి. నికర జలాల వినియోగం పూర్తయ్యూక వాడుకోవాల్సిన మిగులు జలాల వినియోగం విషయుంలో... దిగువ, అతి దిగువ రాష్ట్రాల జల వినియోగం జరిగాకే ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపులను వినియోగించుకోవాలి. అన్ని రకాల కేటారుుంపుల మేరకు జలాల వినియోగం తర్వాత ఏమైనా జలాలు మిగిలితే వాటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. అయితే, చట్టం కింద ఏర్పాటయ్యే ఏదైనా సంబంధిత ప్రాధికార సంస్థ చేపట్టే తదుపరి సమీక్ష, పరిశీలన వరకే ఆంధ్రప్రదేశ్ ఇలా వాడుకోగలుగుతుంది. అంతే తప్ప మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి హక్కూ సంక్రమించదు. ఆలమట్టిపైనా ఊరట లేదు! ప్రస్తుతం ఆలమట్టి డ్యాం ఎత్తుకు 519.6 మీటర్ల వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వాడకానికి అనుమతి ఉంది. అయితే తాజా తీర్పు తర్వాత దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యమూ పెరగుతుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆలమట్టి ద్వారా కర్ణాటక నీటి వాడ కం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులపైనా మన రాష్ట్రం అభ్యంతరాలు తెలిపింది. తుదితీర్పు ప్రకారం క్లియరెన్స్‌లకు సంబంధించిన పత్రాల్ని కర్ణాటక రాష్ట్రం సంబంధిత అధికార విభాగా ల ముందుంచాలి. సదరు క్లియరెన్స్‌లు, ఇప్పటికే ఇచ్చినవి అయితే, ఇప్పటికీ వర్తిస్తాయా లేదా అనేది సంబంధిత విభాగాలు తేల్చాలని ట్రిబ్యునల్ పేర్కొంది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల్లో ఒక సబ్ బేసిన్ నుంచి మరో సబ్ బేసిన్‌కు, అంటే కోయ్నా సబ్ బేసిన్ నుంచి బీమా సబ్ బేసిన్‌కు జలాలను బదిలీ చేసుకోవడానికి మహారాష్ట్ర అనుమతి కోరగా ట్రిబ్యునల్ నిరాకరించింది. అలాగే కొన్ని పరిమితులకు లోబడి కేటాయింపులన్నింటినీ వాడుకునేందుకు అనుమతించింది. -
రాష్ట్రానికి గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదని, తీర్పునిచ్చిన రోజు రాష్ట్రానికి ఒక దుర్దినమని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిబ్యునల్ తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. తక్షణమే దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని లేకుంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ఇదే ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తాత్కాలిక తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఆదేశించినా ట్రిబ్యునల్ తుది తీర్పులో అన్యాయాన్ని ఏ మాత్రం సరిదిద్దలేదని మైసూరారెడ్డి ఆరోపించారు. ఒక నదిలో నీటి లభ్యతను 75 శాతం తీసుకుంటారని, బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతమే తీసుకుందన్నారు.ట్రిబ్యునల్ తాజా తీర్పు వల్ల ఎగువ రాష్ట్రాలు నీటినంతా వాడుకున్నాక దిగువ రాష్ట్రానికి వచ్చేది ఏమీ ఉండవన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అరకొరగా మాత్రమే నీరు వస్తున్నాయన్నారు. కృష్ణలో కర్ణాటకకు 171, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ అదనంగా కేటాయించాక ఇక మన రాష్ట్రానికి అదనంగా నీరు ఎక్కడినుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన వాటికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా నాలుగైదు టీఎంసీల నీరే దక్కిందని చెప్పారు. మిగులు జలాలు తమకు అక్కర లేదని దివంగత వైఎస్ లేఖ రాసినందువల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందని టీడీపీ చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని జరుగుతున్నపుడు అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో బురద జల్లడం సరికాదన్నారు. వైఎస్ లేఖ రాసిన సందర్భం వేరని ఈ అంశంపై ఆయన బతికి ఉండగానే అసెంబ్లీలో చర్చకు వస్తే సవివరమైన సమాధానం ఇచ్చారని మైసూరా గుర్తు చేశారు. జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను తక్షణం నిలిపి వేయాలని కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ మిగులుజలాల వాడకానికి సంబంధించి గతంలో బచావత్ 6సి కింద పొందుపర్చిన సారాం శాన్నే తెలియజేస్తూ లేఖను రాశారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కూడా కోరారన్నారు. టీడీపీ వారు పూర్వాపరాలు తెలియకుండా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిజేశ్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే ప్రధాన ప్రతిపక్షంగా దానిని విమర్శించకుండా ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు హయాంలో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అల్మట్టి లాంటి అక్రమ ప్రాజెక్టులను ఇపుడు బ్రిజేశ్ ట్రిబ్యునల్ క్రమబద్ధం చేసిందన్నారు. బాబు పాలనలో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలు కడుతుంటే నిర్లక్ష్యం వహించారని, కృష్ణా ఆయకట్టు రైతులను ఇక మెట్టపంటల వైపు మళ్లించాలని బాబు చెప్పారని మైసూరా గుర్తు చేశారు. వీటికి సంబంధించి బాబు అనుకూల పత్రికలో వచ్చిన అప్పటి వార్తల క్లిప్పింగ్‌లను ఆయన ప్రదర్శించారు. టీడీపీ హయాంలో వేసిన రాజారావు కమిటీ కృష్ణాలో 268 టీఎంసీల మిగులు జలాలున్నాయని నివేదిక ఇచ్చిందని ఇదే ఎగువ రాష్ట్రాల వాదనలకు ప్రాతిపదిక అయిందని మైసూరా విమర్శించారు. ఆ నివేదిక రూపొందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించారని ధ్వజమెత్తారు. -
మిగులు కృష్ణార్పణం
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని నష్టం మనకు దక్కాల్సిన మిగులు జలాలు ఎగువ రాష్ట్రాలకు పంపిణీ కొంపముంచిన 65 శాతం డిపెండబిలిటీ విధానం కృష్ణా పరిధిలో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే.. రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదయ్యే సమయాల్లో రాష్ట్రానికి కృష్ణా నీరు వస్తుందా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమే! కొత్త తీర్పు అమల్లో లేని సమయాల్లోనే కృష్ణా బేసిన్లో తీవ్ర నీటి కొరత నెలకొంటోంది. మిగులు జలాలు కాదు కదా.. నికర జలాలు రావడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త తీర్పు ప్రకారం మిగులు జిలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే.. దిగువన ఉన్న మనకు తీరని నష్టం వాటిల్లనుంది. భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 65 శాతం డిపెండబిలిటీతో నష్టం ఇలా.. ఇప్పుడు అమలవుతున్న పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే... అదనంగా మరో 254 టీఎంసీలు అంటే... మొత్తం 1,573 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేర దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీటి ప్రవాహం తగ్గనుంది. ఈ 254 టీఎంసీలు అంటే... మన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిమాణంతో సమానం. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పటివరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మాత్రమే సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయి. అంతకుముందు వరుసగా సాగర్, డెల్టా ఆయకట్టు రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపుల్ని పెంచడానికి వీలుగా ట్రిబ్యునల్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. నదుల్లో నీటి లభ్యతలను అంచనా వేయడానికి వీలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలవుతున్న పద్ధతి 75 శాతం డిపెండబిలిటీ మాత్రమే. అంటే వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన ప్రవాహాన్ని సరాసరిగా తీసుకుని నీటిని అంచనా వేస్తారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీని పరిగణనలోకి తీసుకుంది. అంటే వందేళ్లలో 65 ఏళ్లల్లో వచ్చిన నీటిని సరాసరిగా పరిగణిస్తారు. దాంతో నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పద్ధతిన కర్ణాటకకు 61 టీఎంసీలు, మహారాష్ట్రకు 43 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే 112 ఏళ్లల్లో వచ్చిన సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకోవాలని మనం కోరితే.. ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల్లో వచ్చిన వరదను సరాసరి నీటిగా పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల కూడా మనకు తీరని అన్యాయం జరిగింది. ‘మిగులు’ను పంచేసిన ట్రిబ్యునల్.. గత బచావత్ ట్రిబ్యునల్... మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన మనకు ఇచ్చింది. కరువొచ్చినా... వరదలు వచ్చినా నష్టపోయేది దిగువ రాష్ర్టమేనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసేసింది. మొత్తం 285టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని ఆధారం చేసుకునే మన రాష్ర్టంలో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. అలాగే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల కూడా దిగువకు సకాలంలో నీరు రాదు. ఇప్పటివరకు 173 టీఎంసీల వాడకమే ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాడకం భవిష్యత్తులో 303 టీఎంసీలకు పెరగనుంది. అంటే దిగువకు రావాల్సిన 130 టీఎంసీల నీరు కర్ణాటక వాడుకోవడానికి అవకాశం ఏర్పడనుంది. దాంతో మన ప్రాజెక్టుల పరిధిలోని ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. -
తట్టుకోలేని నష్టాలతో తల్లడిల్లుతున్న రైతులు
అమలాపురం, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలతో గడిచిన ఐదేళ్లలో జిల్లా రైతులు నాలుగుసార్లు ఖరీఫ్ పంట ను కోల్పోయారు. ఒక్క 2011లో మాత్రమే ఖరీఫ్సాగు పండగా ఆ ఏడాది సాగు సమ్మె చేయడం వల్ల కోనసీమలో 13 మండలాల్లో 90 వేల ఎకరాల్లో సాగు చేయక రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారు. మిగిలిన నాలుగేళ్లు అక్టోబరు, నవంబరు నెలల్లో వస్తున్న భారీ వర్షాలు, తుపానుల వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాబట్టుకోలేక పోతున్నారు. తాజాగా ఈ ఏడాది హెలెన్ తుపాను వల్ల 2.80 లక్షల ఎకరాల్లో, అంతకుముందు భారీ వర్షాల వల్ల 1.60 లక్షల ఎకరాల్లో వెరసి జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినడంతో రైతులు అంచనాలకు అందని రీతిలో నష్టపోయారు. వరుస ఖరీఫ్ నష్టాలతో కుదేలైన రైతులకు ప్రభుత్వ పరిహారం సైతం అందడంలేదు. గత ఏడాది నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఏడాది తర్వాత హెలెన్ తుపాను విరుచుకుపడే సమయానికి సైతం పూర్తిగా చెల్లించకపోవడం వారిపై ప్రభుత్వానికున్న దారుణమైన నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. నీలం నష్ట పరిహారంగా మూడున్నర లక్షల మంది రైతులకు రూ.167 కోట్ల పెట్టుబడి రాయితీ అందాల్సి ఉండగా ఇప్పటివరకు వందకోట్లు మాత్రమే విడుదల చేశారు. మరో రూ.30 కోట్లు త్వరలో విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నష్టం నమోదుకు సవాలక్ష నిబంధనలు, పరిహారం పంపిణీకి నెలలపాటు ముఖం వాచేలా ఎదురు చూసేలా చేస్తున్న కిరణ్ సర్కారు తీరు రైతుల సహనానికి అగ్నిపరీక్షలా మారింది. మళ్లీ మళ్లీ చావుదెబ్బలు ఇదే నేపథ్యంలో హెలెన్ విరుచుకుపడి, మరోసారి అన్నదాతను చావుదెబ్బ కొట్టింది. పంట దక్కలేదన్న నిరాశ, ప్రకృతిని ఎదురించలేని నిస్సహాయత, ప్రభుత్వ సహకారం లేదనే ఆక్రోశం.. వెరసి రైతుల గుండెల్లో సుడిగుండాలు రేగుతున్నాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ‘అడుక్కునే వాళ్లలా కనిపిస్తున్నామా?’ అని అధికారులపై విరుచుకుపడే వారు కొందరైతే.. చేతులారా పెంచిన చేలను కోయకుండానే దున్నించేస్తున్న వారు కొందరు. కరప, ఉప్పలగుప్తంలలో ఆది, సోమవారాల్లో జరిగిన సంఘటనలే హెలెన్ తుపాను రైతులను ఎంతగా కలచి వేసిందో, వారి దిటవుగుండెలను ఎంతగా అవిసిపోయేలా చేసిందో నిదర్శనం. తీరప్రాంత మండలాల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ముంపునీరు దిగే అవకాశంలేకపోవడం, పంటకోత కోసినా కూలీల ఖర్చులు కూడా చేతికి వచ్చే అవకాశం లేదనే ఆక్రోశంతో కరప గ్రామానికి చెందిన కౌలు రైతు మేడిశెట్టి రామచంద్రరావు ఆదివారం తన వరి చేనును ట్రాక్టర్‌తో దున్నించేశాడు. ప్రకృతిని వికృతంగా చేస్తున్న దాడిని ఎదిరించలేని అసహాయత, ప్రభుత్వం ఆదుకోదనే నిస్పృహతోనే ఆ రైతు ఈ చర్యకు దిగాడు. ప్రతి కంకినీ కంటికి రెప్పలా చూసుకునే రైతే.. ఏకంగా చేనునే దున్నించేశాడంటే జిల్లాలో అన్నదాతల అంతరంగాల్లో చెలరేగుతున్న బాధల తుపాను ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ‘ముష్టివాళ్లమనుకుంటున్నారా..?’ ఇక ప్రభుత్వం తమ పట్ల కనబరుస్తున్న ఉపేక్ష కూడా రైతులను కోపోద్రిక్తులను చేస్తోంది. ఉప్పలగుప్తానికి చెందిన సుమారు 300 మంది రైతులు సోమవారం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని నీలం నష్ట పరిహారమే ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో ఇవ్వలేదని విరుచుకు పడ్డారు. హెలెన్‌తో కలిగిన నష్టానికి పరిహారం ఎప్పుడిచ్చేదీ స్పష్టం చేయాలని పట్టుబట్టారు. ఆగ్రహంతో పాటు ఆవేదన తన్నుకు రాగా ‘పరిహారం అడిగితే బిచ్చగాళ్ల కంటే హీనంగా కనిపిస్తున్నామా?’ అని గద్గద స్వరాలతో ఆక్రోశించారు. తహశీల్దారు జె.సింహాద్రి వారిని అనునయించారు. ఆకలి తీర్చే రైతులు శోకిస్తే ఏ రాజ్యానికీ శ్రేయస్కరం కాదని పాలకులు గుర్తించాలి. అన్నదాతల కృషి కాలయమునితో చెలగాటంగా మారిపోవడం యావత్తు సమాజానికీ చేటని గుర్తించాలి. వారిని ఆదుకోవడానికి సమస్త శక్తియుక్తులూ వినియోగించాలి. లేదంటే వారి కన్నీరే ఉప్పెనై.. ఆ ఉప్పెనలో వ్యవసాయమనే వృత్తే కొట్టుకుపోయే ముప్పు ఉంది. అదే జరిగితే మన మాగాణాలు బీళ్లవుతాయి. మనం ప్రతి గింజనూ దిగుమతి చేసుకోవలసిన ‘పరాన్నజీవుల’మవుతాం. -
అసలుకు ఎసరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోంది. రైతులందరికీ వడ్డీ లేని రుణాలిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న సర్కార్.. అసలు రుణాలకే ఎసరు పెడుతోంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించకుండా.. కాగితాల్లో పురోగతిని చూపిస్తూ మాయ చేస్తోంది. ఫలితంగా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి భారీగా నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ఏడాదీ జిల్లాలో సీజన్ ముగిసేనాటికి ఖరీఫ్ రుణ లక్ష్యం, పురోగతిని చూస్తే అసలు గుట్టు స్పష్టమవుతోంది. భారీ లక్ష్యం జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం రూ. 438.15 కోట్ల పంట రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి రుణాల మంజూరు ప్రక్రియకు తెరలేపింది. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతులు నూతనోత్సాహంతో పంటల సాగు పనులకు శ్రీకారం చుట్టారు. రుణాల కోసం బ్యాంకులకు పరుగెత్తారు. బ్యాంకులు ఎప్పటిలాగే ఉదాసీనత ప్రదర్శించడంతో లక్ష్యసాధన నీరుగారింది. కేవలం రూ.355.14 కోట్ల మేర రుణాలిచ్చారు. మిగతా రూ.83 కోట్లు రైతులకు అందలేదు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం పురోగతి సాధించినట్లు వ్యవసాయశాఖ గణాం కాలు చెబుతున్నాయి. సీజన్ ముగియడంతో ఇక మిగిలిపోయిన ఖరీఫ్ రుణా లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాకి లెక్కలు పంట రుణాలపై బ్యాంకులు కాకి లెక్కలు చూపిస్తున్నాయి. వాస్తవంగా రైతులకిచ్చిన రుణాల కంటే రెన్యువల్ చేసినవే అధికభాగం ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 355.14 కోట్లు పంట రుణాలు పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నా.. వాస్తవంగా అందులో రూ.225.5 కోట్ల మేర రెన్యువల్ చేసినవే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రెన్యువల్ చేయడంతో ప్రభుత్వం నుంచి వచ్చే వడ్డీ రాయితీ వర్తింపు అనుమానమే. సాధారణంగా పంట రుణం తీసుకున్నప్పటి నుంచి నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లింపులు చేస్తేనే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఎలాంటి చెల్లింపులు చేయకుండా రెన్యువల్ చేస్తే అందుకు సంబంధించి రావాల్సిన వడ్డీ రాయితీ వర్తించదు. బ్యాంకర్లు లక్ష్యసాధనలో భాగంగా రైతులకు వడ్డీ రాయితీపై స్పష్టత ఇవ్వకుండా రెన్యువల్ చేయడంతో రైతులు నష్టపోతున్నారని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. రబీ రుణ లక్ష్యం రూ.268 కోట్లు ప్రస్తుత రబీ సీజన్లో జిల్లాలోని రైతులకు రూ.268 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం రబీ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు ఎరువులు, విత్తనాల కోసం కార్యాలయాలకు వస్తున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నారు. నిర్దేశించిన రబీ లక్ష్యాన్ని ఈ సీజన్లో ఏమేరకు సాధిస్తారో.. రైతులకు ఎంతమేరకు రుణాలు అందుతాయో వేచిచూడాల్సిందే. -
కౌలు రైతులకు అప్పు తిప్పలు
ఇంకొల్లు, న్యూస్‌లైన్: ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ వస్తున్నా.. జిల్లాలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలివ్వక వారి పరిస్థితి దయనీయంగా మారింది. బయట అప్పులు పుట్టక కౌలు రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు తెచ్చయినా పంటలు కాపాడుకునేందుకు రుణ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులిచ్చే దిక్కులేదు. బ్యాంకర్లు మాత్రం కార్డులు లేనిదే రుణాలివ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. జిల్లాలో 1.50 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నారు. వారు 3 లక్షల ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. ఈ ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు పైగా పత్తి, మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తుండటంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. పైర్లను కాపాడుకునేందుకు ఎరువులు కొనేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అప్పు తీసుకొని చెల్లించిన కౌలు రైతులకు కూడా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపుకార్డులివ్వాలని, గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన వారికి కార్డులతో నిమిత్తం లేకుండా రుణాలివ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 11న జిల్లా కేంద్రంలో ధర్నా చేసి సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 12వ తేదీన బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కౌలు రైతుల సంఘ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గతంలో అప్పు తీసుకొని తిరిగి చెల్లించిన కౌలు రైతులందరికీ కార్డులతో నిమిత్తం లేకుండా వెంటనే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లను ఆదేశించారు. అయినా బ్యాంకర్లు వ్యవసాయాధికారుల, వీఆర్వోల సంతకాలు కావాలని కౌలు రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది. గురువారం జే పంగులూరులో జిల్లా సదస్సు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. పాత రుణాలు చెల్లించాం: నల్లపు రంగారావు, కౌలు రైతు, ఇంకొల్లు మూడేళ్లుగా 2 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. పత్తి ఎకరం, మిర్చి ఒక ఎకరం వేశాను. గత ఏడాది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 30 వేలు రుణం తీసుకున్నాను. పంట చేతికి రాగానే రుణం తిరిగి చెల్లించాం. ఈ ఏడాది ఇంకా రుణాలివ్వలేదు. అధికారుల సంతకాలపేరిట బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 50 వేలు వరకు పెట్టుబడి పెట్టాను. బలం మందులు వేయాల్సి ఉంది. తక్షణం రూ. 50 వేలు వరకు అవసమమవుతాయి. అప్పుల కోసం ఎదురు చూస్తున్నాం : గట్టుపల్లి యహోషువా, కౌలు రైతు ఇంకొల్లు అప్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఏడాది ఒక ఎకరం పత్తి, ఒకటిన్నర ఎకరా మొక్కజొన్న, రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాను. ఇప్పటికి పెట్టుబడి రూ. 1.5 లక్షలు పెట్టాను. గత ఏడాది బ్యాంకు రుణం రూ. 30 వేలు తీసుకున్నాను. తిరిగి చెల్లించాం. కానీ ఇప్పుడు కౌలు రుణాలు ఇవ్వలేదు. సమ్మె మాపాలిట శాపంగా మారింది: బేతాల ఆనందరావు, కౌలురైతు ఇంకొల్లు ఉద్యోగుల సమ్మె మాపాలిట శాపంగా మారింది. సమ్మె కారణంగా రుణాలు సకాలంలో పొందలేక పోతున్నాం. ఈ ఏడాది 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. 5 ఎకరాల్లో పత్తి, ఒక ఎకరంలో మిర్చి వేశాను. ఇప్పటి వరకు ఖర్చు రూ. 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత ఏడాది రూ. 30 కౌలు రుణం తీసుకుని తిరిగి చెల్లించా. కానీ ఈ ఏడాది ఇప్పటికీ ఇవ్వలేదు. రుణాల కోసం ఎదురు చూస్తున్నాం. అధికారులు స్పందించి రుణాలిచ్చి ఆదుకోవాలి. -
గణాంకాల గారడీ!
సాక్షి, కొత్తగూడెం: రైతులకు పంట రుణాల పంపిణీ ప్రహసనంగా మారుతోంది. కాగితాలలో లక్ష్యం పూర్తయినట్లు కనపడుతున్నప్పటికీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. కొత్త రుణాలు ఇవ్వకుండా గతంలో రైతులు తీసుకున్న వాటిని రెన్యువల్ చేస్తూ బ్యాంకర్లు లక్ష్యం సాధించినట్లు రికార్డులు చూపుతుండడం గమనార్హం. ఏటా ఇదే రీతిలో రుణ పంపిణీ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 889.90 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు కాగితాల్లో చూపిస్తుండగా ఇందులో 711.92 కోట్లు పాతవే రెన్యువల్ చేయడం గమనార్హం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే రుణాలలో 74 శాతం పురోగతి సాధించినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు పంట రుణాలు అందలేదు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సీజన్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. పెట్టుబడి పెట్టే పరిస్థితి లేని ఈ తరుణంలో రుణమిచ్చి అండగా నిలవాల్సిన సర్కారు.. పాత రుణాలనే తిరగరాస్తుండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బ్యాంకు రికార్డుల్లో కొత్తగా రుణం తీసుకున్నట్లు గణాంకాలు కన్పిస్తున్నప్పటికీ... చేతికి మాత్రం చిల్లిగవ్వ రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. వేల మంది రైతులు రుణం కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పాతవే రెన్యువల్ చేసి టార్గెట్ పూర్తి చేశాం అనేరీతిలో వ్యవహరిస్తుండడంతో మాకేమి ఉపయోగం అంటూ ఆవేదన చెందుతున్నారు. కాగితాల్లో గారడీ.. 2013 ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతాంగానికి 1,199 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రుణ మంజూరుకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు రెండు లక్షల మంది రైతులకు 889.90 కోట్ల రూపాయలు పంట రుణాల కింద పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 74 శాతం పురోగతి సాధించినట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇవన్నీ కొత్తగా పంపిణీ చేసిన రుణాలు కాదు. గతంలో పెండింగ్‌లో ఉన్న రుణాలను ఈ ఏడాది భారీగా రెన్యువల్ చేశారు. ఇప్పటివరకు అలా సాధించిన పురోగతిలో 80 శాతం రెన్యువల్ చేసినవేనని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన చూస్తే మంజూరు చేసిన 889.90 కోట్ల రుణాల్లో 711.92 కోట్లు తిరగరాసినవే. కేవలం 178 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే కొత్తగా రైతులకు మంజూరు చేశారు. కౌలురైతులపై కనికరం ఏదీ..? అష్టకష్టాల కోర్చి పంట సాగుకు సిద్ధమవుతున్న కౌలురైతులపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు. కౌలు రైతులకు పంట రుణాలిస్తామంటూ చెప్పిన సర్కారు బ్యాంకర్లతో రుణాలు మంజూరు చేయించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 68,906 మంది కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది కౌలు రైతులున్నా ఇప్పటి వరకు 20 వేల మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు మంజూరు చేశారు. వీరిలో కేవలం 3,001 మందికి రుణాలు మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 ఖరీఫ్, రబీలో కౌలు రైతులకు 20 కోట్ల రూపాయలు రుణం లక్ష్యంగా పెట్టుకోగా నేటికి 8.63 కోట్లు మంజూరు చేశారు. రుణ అర్హత కార్డులు మంజూరైనా రుణం అందకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి అప్పుచేసి.. చివరకు పంట నష్టపోయి, చేసిన అప్పుకు వడ్డీకి పెరిగి కౌలు రైతులు అత్యహత్యలకు పాల్పడుతున్నారు. అయినా సర్కారులో చలనం లేదు. -
ఊరటనిచ్చిన వర్షం
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మెట్టలో నత్తనడకన సాగుతున్న ఖరీఫ్ వరి సాగుకు ఊతమిస్తున్నాయి. వాతావరణం మార్పులతో మెట్ట ప్రాంతంలో జగ్గంపేట, ఏజెన్సీలో రంపచోడవరం మినహా కోనసీమ, రాజమండ్రి, కాకినా డ, తుని, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఒక మోస్త రు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొంతకాలంగా వేసవిని తలపించే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షాలతో సేద తీరారు. ఈ వర్షాలు వరితో పాటు అన్ని రకాల పంటలకు ఉపయోగకరమయ్యాయి. ముఖ్యంగా మెట్టలో సేద్యానికి ఎక్కువగా మేలు చేశాయి. సరైన వర్షాలు లేక తుని, జగ్గంపేట, కోరుకొండ సబ్డివిజన్లలో సాగు ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా వర్షాలు లేక, చెరువులు నిండక సాగే లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందారు. వేసవి స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వరి నారుమడులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో జగ్గంపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు చెరువులు నిండడం, వాతావరణం సానుకూలంగా మారడంతో నాట్లు జోరందుకుంటున్నాయి. తునిలో చెరువులు నిండడంతో తాండవ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను పూర్తిగా తగ్గించి వేశారు. ఈ ప్రాంతంలో తాండవతో పాటు, పంపా ఆయకట్టు పరిధిలో నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే కోరుకొండ సబ్ డివిజన్ పరిధిలో రాజానగరం పరిసర ప్రాంతాల్లో సైతం చెరువులు నిండుకున్నాయి. వరితోపాటు మిగిలిన పంటల సాగుకు సైతం వర్షాలు ఊతమిచ్చాయి. ముఖ్యంగా కూరగాయ పంటల సాగు జోరందుకోనుంది. మెట్టలోనే కాక డెల్టాలో రైతులకు సైతం వర్షాలు మేలు చేస్తున్నాయి. వరిని ఆశించిన సుడిదోమ, నల్లి, ఇతర తెగుళ్లు కొంత వరకు తగ్గుతాయని రైతులు ఆశిస్తున్నారు. కొబ్బరికి కూడా వర్షాలు మేలు చేశాయి. హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల సఖినేటిపల్లి, మలికిపురం, ఆత్రేయపురం, తాళ్లరేవు, జగ్గంపేట మండలాల్లో కొబ్బరితోటల్లో ఆకుతేలు, నల్లముట్టి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ వర్షాల వల్ల అది కొంత వరకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. అరటి, కంద వంటి వాణిజ్య పంటలకు సైతం వర్షం వల్ల మేలు జరుగుతుందంటున్నారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదలకు ప్రణాళిక
వరంగల్, న్యూస్‌లైన్ : ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిల్వ ఉండడం, ఇప్పటికే రెండో దశకు నీటిని విడుదల చేస్తుండడంతో.. మొదటి దశకు నీటి విడుదల ఖరారు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈసారి చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందించనున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆన్ ఆఫ్ పద్ధతిని పాటించనున్నారు. గతంలో ఆన్ ఆఫ్ పద్ధతి సరిసమానంగా ఉండేది. కానీ ఇప్పుడు నీరు నిల్వ ఉండడంతో.. ఆఫ్ పద్ధతిని తగ్గించారు. 9 రోజులు ఆన్.. 6 రోజులు ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. అవసరమైన మేరకు చెరువులు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు సైతం నీటిని అందించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని నీటిపారుదల శాఖ భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే ఎస్సారెస్పీ మొదటి దశ కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, నేటి నుంచి రెండో దశ నీటి విడుదలకు బ్రేక్ వేస్తారు. అయితే అత్యవసర సందర్భంలో రెండో దశకు నీటిని విడుదల చేసేందుకు కూడా ప్రణాళిక వేశారు. మొదటి దశకు విడుదల చేసిన అనంతరం ఆఫ్ రోజుల్లో రెండో దశకు ఇస్తారు. దిగువ ఎల్ఎండీ పరిధిలో ఆదివారం నుంచి ఎస్సారెస్పీ జలాలు విడుదల కానున్నాయి. డీబీఎం-31 వరకు ఈ నీటిని అందించనున్నారు. రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ ప్రధాన కాల్వ, ఉప కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 23 వరకు ఎస్సారెస్పీ నీటిని మొదటి దశకు అందిస్తున్నారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులో వరి నార్లు పూర్తి చేశారు. పొలాల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశకు నీటి విడుదల ప్రణాళిక ఖరారు కావడంతో సాగు మరింత పెరగనుంది. -
నేటి నుంచి పల్లెల్లో పగటివేళ విద్యుత్ సరఫరా బంద్
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో ఇక కోతలు ఉండవని భావించిన ప్రజలకు, రైతాంగానికి ట్రాన్సకో నిర్ణయం ఆశనిపాతంలా మారింది. శనివారం నుంచి పల్లెల్లో పగటి పూట సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు శుక్రవారం ట్రాన్సకో అధికారులు ప్రకటించారు. దీంతో ఖరీఫ్ సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్న ట్రాన్స్‌కో నిర్ణయంతో ఆందోళనకు గురవు తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో మంచి వర్షాలు కురిసాయి. ఖరీఫ్ సీజన్‌పై రైతులు భారీగా ఆశలు పెంచుకున్నారు. ఈసారీ వరి పంట విస్తీర్ణం సాధారణ స్థాయికన్నా పెరిగింది. బోర్లు, బావులు నిండుగా వున్నాయి. ముందు ముందు ఆశించిన వర్షాలు కురువకున్నా బోర్ల ద్వారా పంటలకు సాగు నీరు అందించాలని భావిస్తున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతకాలం నుంచి సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా 24 గంటల పాటు ఉండడంతో రైతులు విశ్వాసంగా ఉన్నారు. అయితే తాజాగా పట్టణాలు, మండల కేంద్రాలు మినహా శనివారం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే సింగిల్ ఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని పల్లెసీమల్లో పగటి పూట విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. పల్లెల్లోని సామాన్య జీవనానికి ఈ 12 గంటల సింగిల్ ఫేజ్ విద్యుత్ కోత తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా పంటలకు సైతం ఆశించిన నీటిని సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. సహకరించక తప్పదు.. మెరుగైతే పెంచుతాం విద్యుత్ డిమాండ్ పెరగడంతో సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను పల్లె ప్రాంతాలకు పగటి వేళ నిలిపివేయాల్సి వస్తోంది. ప్రజలు సహకరించాలి. విద్యుత్ సరఫరా పెరిగినా, డిమాండ్ కొంచం తగ్గినా సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరాను తప్పక మెరుగుపరుస్తాం. - రాములు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి -
రైతులందరికి ఏదీ ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, నల్లగొండ: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది అధికారుల పరిస్థితి. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినా అధికారుల తప్పిదాల వల్ల రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఫలితంగా రెండేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకౌంట్ నంబర్లలో తప్పులు, బ్యాంకు బ్రాంచ్‌ల పేర్లలో పొరపాట్లు దొర్లడం తదితర కారణాల వల్ల ఇప్పటికీ వేల సంఖ్యలో రైతులు ఇన్పుట్ సబ్సిడీకి నోచుకోలేదు. వీటిని సరిచేయాల్సిన అధికారులు మొద్దునిద్ర వీడడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ బాధ్యత తమది కాదంటే కాదు అని చేతులెత్తేస్తున్నారు. ఇదీ పరిస్థితి.... 2011 ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 3.82 వేల మంది రైతులకు సంబంధించి 2.40 లక్షల హెక్టార్లలో వరి, పత్తి తదితర పంటల నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నల్లగొండను కరువు జిల్లాగా ప్రకటిం చారు. రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.129.75 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు రూ.118 కోట్లు మాత్రమే రైతులకు అందాయి. మిగిలిన దాదాపు రూ.12 కోట్లు మరికొందరు రైతులకు అందాల్సి ఉంది. వీటికోసం నెలలుగా తిరుగుతున్నా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. గతేడాది ఖరీఫ్‌లో మళ్లీ సంభవించిన కరువు కారణంగా పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 52,689 హెక్టార్లలో వివిధ పంటలు చేతికి రాకుండాపోయాయి. దాదాపు రూ.89 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకిగాను ఇప్పటివరకు రూ.55 కోట్లను మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. పట్టించుకోని అధికారులు.. ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పంటనష్టం జరిగిన రైతుల ఖాతానంబర్లను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. అయితే చాలామంది రైతులకు సంబంధించి బ్యాం కు ఖాతా నంబర్లు తప్పుగా నమోదు చేసుకున్నారు. అంతేగాక బ్యాంకు బ్రాంచ్ పేర్లుగా సరిగా పేర్కొనలేదు. ఒక బ్రాంచ్‌కు బదు లు ఇంకో బ్రాంచ్ పేరు రికార్డుల్లో నమోదైంది. దీనికితోడు పదేళ్ల క్రితం కొందరు రైతులకు బ్యాంకులో ఖాతాలున్నాయి. ఈ ఖాతాలకు సంబంధించిన నంబర్లు ఇప్పటికీ ఆన్లైన్ కాలేదని సమాచారం. ఇది కూడా ఇన్పుట్ సబ్సిడీ అందకపోవడానికి ఒక కారణమని తెలిసింది. ఇలాంటి తప్పిదాల వల్ల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా పోతోంది. వీటిని సరిచేయాలని రైతులు బ్యాంకర్లు, అధికారుల చుట్టూ తిరుగుతు న్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.ఒకరి పేరు చెప్పి మరొకరు తప్పించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి తమకు పెట్టుబడి రాయితీ అం దేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏడాది నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా.. నాకు మంజూరైన ఇన్పుట్ సబ్సిడీ తీసుకునేందుకు ఏడాది నుంచి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. అయినా బ్యాంకోళ్లు నా ఖాతాలో డబ్బు జమ కాలేదని చెబుతున్నారు. గతేడాది వేసిన పంటా నష్టపోయా. నాకు ఆ పోయినేడు రూ.8 వేలు, గతేడు రూ.10 వేలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. కానీ బ్యాంకులో జమ కావడం లేదు. బ్యాంకు వారు మాత్రం ఎందుకు రావడం లేదో చెప్పడం లేదు. దీంతో రెండేళ్లు కలపి రూ.18 వేలు అందకుండా పోతున్నాయి. అవి వస్తే పంట సాగుకు చేసిన అప్పు తీర్చుకుంటా. - వనం శ్రీశైలం, చొల్లేడు, మునుగోడు అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు చేసుకున్నారు.. వర్షాలు కురవక 3 ఎకరాల 10 గుంటల భూమిలో పత్తి పంట దిగుబడి రాలేదు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగుచేసిన. అయితే నష్టపోయిన నాకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు వీఆర్ఓ భూమి వివరాలు, బ్యాంకు ఆకౌంట్ నంబర్ రాసుకోని పోయాడు. నాకు రూ. 10 వేల పరిహారం మంజూరు అయినట్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో పెట్టారు. కానీ నేటికి ఆ డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమకాలేదు. అదేంటని స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే అకౌంట్ నంబర్ తప్పుగా ఉందని చెప్పుతున్నారు. అధికారులు చేసిన తప్పుకు నాకు డబ్బులు రాకుండా పోయాయి. ఇప్పటికైనా తిరిగి నా అకౌంట్ నంబర్ సరిగా రాసుకొని డబ్బులు ఇస్తే బాగుండు. - కట్టెకుంట్ల సైదులు, గుండ్లోరిగూడెం, మునుగోడు -
ఖరీఫ్ పంటలు ఖతమే!
ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో ఖరీఫ్ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇక పంటలు అయిపోయినట్టేనని రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో కురిసిన తొలకరి వర్షాలకు సంతృప్తి చెంది రైతులు సాగుకు ఉపక్రమించారు. విత్తనాలు, ఎరువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. ధర్నాలు, ఆందోళనలు చేసి విత్తనాలు పొంది సాగు చేపట్టినా ప్రస్తుతం పంట దక్కేట్లు లేదు. మొలకలు ఎదిగి పెసర పంట కొన్ని ప్రాంతాల్లో పూత, కాత దశల్లో ఉన్న తరుణంలో వర్షాలు కురువడంతో చేలల్లో నీరు నిలిచి మొలకలు ఎర్రబారి కుళ్లిపోతున్నాయి. చేలల్లో కనీసం కలుపుతీసేందుకు కూడా కూలీలు వెళ్లలేకుండా చేలు బురదమయంగా మారాయి. ఇదిలాఉండగా సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. వర్షం ఏకబిగిన పడడంతో చేలు చెరువులను తలపించాయి. అంతేకాదు వరదనీటి కారణంగా చేలల్లో మట్టి కొట్టుకువచ్చి ఇసుకమేటలు వేశాయి. నష్టం అంచనావేయని అధికారులు నారాయణఖేడ్ వ్యవసాయ డివిజన్ పరిధిలో పెసర పంటను 2,200హెక్టార్ల లో, మినుము 4,200, మొక్కజొన్న 2,500, కంది 4,300, సోయాబిన్ 4,830, పత్తి 4,800హెక్టార్లలో రైతులు సాగుచేశారు. ఈ పంటల్లో పెసర పంట దాదాపు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కాత, పూత దశలో ఉన్న పంటకు చేలల్లో నీరు నిలవడంతో కుళ్ళిపోతుంది. మినుము, పత్తి పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. కంది పంటకూడా ఎందిగే అవకాశం లేదని రైతులంటున్నారు. ఈ పంటలు చేతికిరావడం కష్టమేనని రైతులు చెబుతున్నారు. సాగుచేసిన పంటలో 80 శాతం పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకా పంటనష్టంపై ఓ అంచనాకు రాలేదు. పెట్టుబడులు పోయినట్టే ఖరీఫ్ సీజన్లో పంటసాగుకు రైతులు పెట్టిన పెట్టుబడులు పోయినట్టే. దుక్కిదున్ని, విత్తనాలు విత్తడం, కలుపుతీతలు, పురుగుమందు పిచికారీ, యూరియా వేయడం తదితరాలకు ఒక్కో పంటకు రైతుకు సరాసరి రూ.10 వేల పైగానే పెట్టుబడులు అయ్యాయి. వర్షంతో పంటకుళ్లిపోయి ఈ పెట్టుబడులు చేతికందవని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పంటనష్టంపై అంచనావేసి పరిహారం ఇస్తేనే తేరుకునే పరిస్థితి ఉంది. దాదాపు అన్ని పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమకు సాయమందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.