Lingaa
-
రజినీకాంత్ వేలు పెట్టారు.. అందుకే సినిమా ఫ్లాప్: డైరెక్టర్
దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. చిన్న హీరోలకు అయితే చెల్లుబాటు అవుతుంది గానీ పెద్ద హీరోల్లో కొందరు మాత్రం ప్రతి దానిలో వేలు పెడుతుంటారు. హిట్ కొడితే తమ క్రెడిట్ అన్నట్లు చెప్పుకొంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిదే తప్పు అన్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన పని గురించి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ నిజాలు బయటపెట్టారు. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్‌తో 'ముత్తు', 'నరసింహా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. ముచ్చటగా మూడోసారి కలిసి 'లింగా' తీశారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. 2014లో రిలీజైన ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్ర సెకండాఫ్‌లో రజినీకాంత్ వేలు పెట్టారని, ఎడిటింగ్ పూర్తిగా మార్చేశారని అందుకే పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)'ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ చేసేందుకు నాకు టైమ్ కూడా ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తొలగించేశారు. బెలూన్ జంపింగ్ సీన్ జోడించారు. మొత్తానికి 'లింగా'ని గందరగోళం చేశారు' అని కేఎస్ రవికుమార్ తన ఆవేదనని దాదాపు పదేళ్ల తర్వాత బయటపెట్టారు.2016లో ఇదే సినిమా గురించి ఇదే దర్శకుడు మాట్లాడుతూ.. రూ.150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడేమో సినిమాని రజినీకాంత్ గందరగోళం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో 30 శాతం మాత్రమే వసూళ్ల రూపంలో రిటర్న్ వచ్చాయని, దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు తిరిగి డబ్బులిచ్చారని టాక్.ఇకపోతే రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'.. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
రజనీకాంత్‌కు మదురై కోర్టు సమన్లు
మదురై: 'లింగా' సినిమా కథ వివాదంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మదురై కోర్టు మంగళవారం సమన్లు జారీచేసింది. తన కథను చౌర్యం చేసి.. 'లింగా' సినిమా కోసం వాడుకున్నారని రచయిత కేఆర్ రవి రథినామ్ మదురై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రజనీకాంత్‌తోపాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్, చిత్ర రచయిత బీ పొన్‌కుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు కోర్టు సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఏప్రిల్ 30వతేదీలోగా విచారణ పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు మదురై మున్సిఫ్ కోర్టు జడ్జిని ఆదేశించింది. తన స్క్రిప్ట్‌ను దొంగలించి 'లింగ' సినిమాకు వాడుకున్నారని కేఆర్ రవి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన మదురై కోర్టు 2014 డిసెంబర్లో సినిమా విడుదలకు ముందే నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు పలు ఆదేశాలు ఇచ్చింది. డిమాండ్ డ్రాఫ్ట్‌గా రూ. 5 కోట్లు, అదనపు గ్యారంటీగా మరో రూ. 5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
కోర్టుకు ‘లింగా’
చెన్నై : లింగా వ్యవహారం ఆరోపణలు ఆందోళనలు దాటి కోర్టు గుమ్మం తొక్కింది. హత్యా చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆళ్వాతిరునగర్‌కు చెందిన ఆర్ సింగారవడివేలన్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను రజినీకాంత్ నటించిన లింగా చిత్ర తిరుచ్చి, తంజావూర్ ఏరియాల విడుదల హక్కుల్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. లింగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రం విజయం సాధించడం ఖాయం అని అలాకాని పక్షంలో నష్టం వాటిల్లిన బయ్యర్లకు పరిహారం చెల్లిస్తానని రజనీకాంత్ అన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.7.13 కోట్లకు లింగా చిత్రాన్ని కొన్నానన్నారు. అయితే లింగా చిత్రం విడుదలై ఆశించిన విజయం సాధించకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కోన్నారు. దీంతో మరో వైపు నష్టపోయిన థియేటర్ల యాజమాన్యం పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లను అడుగుతున్నారని వివరించారు. దాంతో ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి నిర్మాత, చిత్ర హీరోలపై ఒత్తిడి తీసుకురాగా చివరికి రజినీకాంత్ నష్టపరిహారంగా రూ.12.5 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చారని తెలిపారు. అయితే అందులో ఆరుకోట్లు మాత్రమే చెల్లించారని మిగిలింది అడిగితే కోర్టులో ఉన్న కేసును వాపస్ తీసుకున్న తరువాత ఇస్తామన్నారని అన్నారన్నారు. వారి మాట ప్రకారం కోర్టులో కేసును వాపస్ తీసుకున్నామని... అయినా మిగిలిన రూ. ఆరు కోట్లు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపించారు. అంతే కాకుండా రజినీకాంత్ రెచ్చగొట్టడంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థాను ఇతర నిర్మాతలందరకీ లేఖలు రాసి తనతో సంప్రదించిన తరువాతే సింగర వడివేలన్‌కు చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వాలని చెబుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వాట్స్‌యాప్‌లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయమై గత 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి పీఎన్ ప్రకాష్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషనర్ తరపున జి విజయకుమార్, ఎం సతీష్‌కుమార్ హాజరై వాదించారు. ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రెండు వారాల పాటు కేసును వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మళ్లీ తెరపైకి లింగా వివాదం
-
'ఆ సినిమా'కు ఇంకా ముగింపు కార్డు పడలేదు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్ర సమస్యకు ముగింపు కార్డు పడలేదు. నష్టపరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి పోరుకు తయారవుతున్నారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే. రజనీ కాంత్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియార్కు రూ.12.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేటట్లు మిగిలిన నష్టాన్ని రజనీకాంత్ ...వేందర్ మూవీస్ సంస్థకు తక్కువ కాల్షీట్తో చేసే చిత్రం ద్వారా పొందాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు.. తిరుపూర్ సుబ్రమణియం సూచించారు. దానికి అంగీకరించిన వారంతా అంగీకరించి పోరాటానికి స్వస్తి పలికారు. అయితే రజనీకాంత్ చెల్లిస్తానన్న రూ.12.5 కోట్లు మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు పంచలేదని వారు ఆరోపించారు. ఈ విషయమై లింగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొంటూ నష్టపరిహారంగా చెల్లిస్తానన్న రూ.12.5 కోట్ల రూపాయల్లో మొత్తం రూ. 5.89 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. సినీ సంఘాలు కల్పించుకుని నిర్ణయించిన నష్టపరిహారం విషయంలో తాము మోసపోయామని వాపోయారు. కాబట్టి ఈ వ్యవహారంలో రజనీకాంత్ జోక్యం చేసుకుని రూ.12.5 కోట్లను సమానంగా పంచాలన్నారు. -
‘లింగా’ సమస్య మళ్లీ మొదటికి?
చెన్నై : కొలిక్కి వచ్చిందనుకున్న లింగా చిత్ర సమస్య మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ లింగా చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టపరిహారంగా రూ.10కోట్లు చెల్లించడానికి ముందుకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ డబ్బును నష్టపోయిన వారికి అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లింగా చిత్ర చెంగల్పట్టు ఏరియా డిస్ట్రిబ్యూటర్ మన్నన్, ఉత్తర, దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణమూర్తి, నెల్లై ఏరియా డిస్ట్రిబ్యూటర్ రూపన్ సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్రానికిగానూ చెంగల్పట్టు ఏరియాకు ఏడున్నర కోట్లు, ఆర్కాడు ఏరియాకు నాలుగు కోట్లు, నెల్లై ఏరియాకు రెండున్నర కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని తెలిపా రు. మొదట్లో నష్టపరిహారం చెల్లించాలంటూ బయ్యర్లు గగ్గోలు పెట్టి, ఇప్పుడు కట్ట పంచాయితీ చేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్లతో చర్చించకుండా తిరుపూర్ సుబ్రమణియన్ ఏకపక్ష నిర్ణయాలతో కట్ట పంచాయితీ చేయరాదని సూచించారు. ఇంతకు ముందు రజనీ నటించిన పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆయన కోట్ల రూపాయలు లాభాలు సంపాదించారని తెలిపా రు. అలాంటి వ్యక్తి ఇప్పుడు లింగా చిత్ర నష్టాల్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలనడం ఎంతమాత్రమూ సమంజసం కాదని పేర్కొన్నారు. నష్టపరిహారాన్ని సక్రమం గా పంచాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. -
రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
చెన్నై: రాష్ట్ర ఖజానాకు రూ.21 కోట్లు నష్టం కలిగించిన సూపర్ స్టార్ రజనీకాంత్, 'లింగా' చిత్ర నిర్మాత రాక్‌లింగ్ వెంకటేశ్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరైన్ పిక్చర్స్ భాగస్వామి సింగరవడివేలన్ ఈ పిటిషన్ వేశారు. రజనీ తన పలుకుబడి ఉపయోగించి 'లింగా'కు వినోదపు పన్ను మినహాయింపు ఇప్పించారని, తమిళ సంస్కృతి అభివృద్ధికి దోహదపడే చిత్రాలకు మాత్రమే వినోదపు పన్ను రాయితీ వర్తిస్తుందన్నారు. 'లింగా' చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉన్నందున దీనికి రాయితీ వర్తించదన్నారు. -
రంగంలోకి రజనీ అభిమానులు
లింగా చిత్ర వ్యవహారం రంగులు మారుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటించిన ఈ చిత్రం రజనీ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 12న భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయామంటూ రోడ్డెక్కారు. కోర్టులు, నిరాహారదీక్షలు ఆందోళన బాటపట్టారు. దీంతో రజనీకాంత్ జోక్యం చేసుకోక తప్పలేదు. లింగా వసూళ్లపై దర్యాప్తు చేయించి నివేదికను నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు పంపారు. దీంతో ఆయన 10 శాతం నష్టపరిహారం చెల్లించగలనని తేల్చి చెప్పేశారు. అందుకు సమ్మతించిన డిస్ట్రిబ్యూటర్లు ఇక రజనీకాంత్‌ను నమ్మి ప్రయోజనం లేదని భిక్షాటన చేస్తామంటూ ప్రకటించారు. రజనీకాంత్ ఇంటి నుంచే ఈ భిక్షాటన పోరాటం మొదలెడుతామని వెల్లడించారు. దీన్ని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే తమిళ దర్శకుల సంఘం రజనీకి బాసటగా నిలవగా కొన్ని రాజకీయ సంఘాలు డిస్ట్రిబ్యూటర్లకు వత్తాసు పలకడం విశేషం. దక్షిణ భారత నటీనటుల సంఘం రజనీకే మద్దతు అన్న ప్రచారానికి ఆ సంఘం అధ్యక్షుడు ఖండించారు. ఇప్పటి వరకు ఈ చోద్యం చూస్తూ మౌనం వహించిన రజనీ అభిమానులు ఇప్పుడు రంగంలోకి దిగారు. డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ, నగరంలో పోస్టర్లు అంటించారు. మరో పక్క భిక్షాటన పోరు బాటకు సిద్ధమవుతున్న డిస్ట్రిబ్యూటర్లకు పోలీసులు అనుమతి లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
'లింగా' నష్టాలకు రజనీకాంత్ బాధ్యుడు కాదు
చెన్నై: 'లింగా' సినిమా నష్టాలు రావడానికి రజనీకాంత్ బాధ్యత కాదని తమిళ చిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు రజనీకాంత్ ఇంటిముందు భిక్షాటన చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడం సరికాదని పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'రజనీకాంత్ సినిమాలు చాలా వరకు భారీ విజయం సాధించాయి. రజనీతో సినిమాలు తీసినవారు భారీ లాభాలను పొందారు. లింగా సినిమా పరాజయం కావడానికి రజనీకాంత్ కారణం కాదు. నష్టాలకు ఆయనను బాధ్యుణ్ని చేయడం సరికాదు. పరిహారం కోసం డిస్ట్రిబ్యూటర్లు భిక్షాటన చేయాలని నిర్ణయించడాన్ని ఖండిస్తున్నాం' అని నిర్మాతల మండలి ఓ ప్రకటనలో తెలిపింది. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం పరాజయం కావడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. భారీ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు పరిహారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పరిష్కారం కుదరలేదు. దీంతో పరిహారం కోసం రజనీకాంత్ ఇంటి నుంచి భిక్షాటన చేసి ఆందోళన నిర్వహించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. -
‘లింగా’ కోసం రజనీ
లింగా చిత్ర సమస్యను పరిష్కరించాలనే నిర్ణయానికి ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ వచ్చారు. ఆయన హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన భారీ చిత్రం లింగా. గత నెల 12న ఒక్క తమిళనాడులోనే 750 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కొద్ది రోజుల్లోనే వసూళ్ల శాతం పడిపోయి బయ్యర్లు నిరాహార దీక్షకు అనుమతి కోరుతూ చెన్నై హైకోర్టులో రెండోసారి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ లింగా చిత్ర సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. చిత్రం వసూళ్లపై పూర్తిగా ఆధారాలను సేకరించడానికి కోవైకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన ఇచ్చే నివేదిక ప్రకారం, ఎవరికెంత నష్టపరిహారం చెల్లించాలి అన్న విషయంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. -
సూపర్‌స్టార్ తదుపరి దర్శకుడెవరు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యార న్నది పరిశ్రమ వర్గాల సమచారం. అయితే దర్శకుడెవరన్న విషయంపైనే రకరకాల ప్రచారం జరుగుతోంది. కోచ్చడయాన్ 3డి యానిమేషన్ చిత్రం నిరాశపరచడంతో త్వరితగతిన మరో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న రజనీ ఆలోచనకు తెరరూపమే లింగా చిత్రం. తన ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రం రూపొందించగల దిట్ట కె ఎస్ రవికుమార్ అని భావించి లింగా చిత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ చిత్రం నిర్మాతకు 200 కోట్లు వ్యాపారం చేసిందని సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లే భారీ నష్టాలకు గురయ్యామంటూ దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో నష్టపరిహారానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ తదుపరిచిత్రానికి దర్శకుడెవరన్న అంశంపై నలుగురైదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పి.వాసు, శంకర్, సురేష్‌కృష్ణ, సుందర్ సి, కెఎస్ రవికుమార్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పి.వాసు ఇప్పటికే రజనీతో చంద్రముఖి, కుచేలన్ చిత్రాలు తెరకెక్కించగా వాటిలో చంద్రముఖి అమోఘ విజయం సాధించగా కుచేలన్ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత రజనీతో చంద్రముఖి-2 రూపొందించాలని పి.వాసు ఆశించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. శంకర్ రజనీకాంత్ కలయికలో శివాజీ, ఎందిరన్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా ఎందిరన్-2 ప్రయత్నం తెరపైకి కొచ్చింది. అయితే ఈ విషయమై శంకర్ నుంచి గానీ, రజనీ నుంచి గానీ సరైన క్లారిటీ రాలేదు. అదే విధంగా కెఎస్ రవికుమార్ రజనీతో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. లింగా చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ సుదీప్ హీరోగా నటించే చిత్రంలో బిజీగా ఉన్నారు. అదే విధంగా భాషా, అన్నామలై వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సురేష్‌కృష్ణ రజనీతో భాషా-2 చేయాలని ఆశిస్తున్నారు. దీనికి స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. రజనీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే షూటింగ్ అనేలా ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్‌స్టార్ అరుణాచలం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుందర్‌సి కూడా ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు కోడంబాక్కం టాక్. మరి వీరిలో ఎవరిపై రజనీ దృష్టి పడుతుందో వేచి చూడాల్సిందే. -
కంటతడి పెట్టిన లింగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్
చెన్నై: లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చయవద్దని ఆయన కోరారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు మంచి మిత్రులన్నారు. అందుకే తాను కన్నడ వ్యక్తినైన తనతో సినిమా చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, .లింగా' చిత్రం ద్వారా తాము భారీగా నష్టం పోయామని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రజనీకాంత్ జోక్యం చేసుకుని నిర్మాతలతో మాట్లాడి తమకు డబ్బులు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
లింగా డిస్ట్రిబ్యూటర్ల నిరాహారదీక్షలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కష్టాలు తప్పటం లేదు. కొచ్చడయాన్ నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే లింగా కష్టాలు పంపిణీదారులచే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లింగా సినిమాను విడుదల చేసిన పంపిణీదారులు తాము నిండా మునిగిపోయామంటూ చెన్నైలో ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఏడుగురు పంపిణీదారులు 700 మంది థియేటర్ల యాజమానులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కొక్క పంపిణీదారుడు దాదాపు 7- 10 కోట్ల రూపాయల మేరకు నష్టపోయామని వాపోతున్నారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తమిళుడు కాకపోవటం, ప్రదాన పంపిణీదారుడు వేందర్ సినిమా నష్టాలతో తనకు సంబంధం లేదనటం... పంపిణీదారులు, థియేటర్ యాజమానులను రోడ్డున పడేసేలా చేసింది. లింగా చిత్రం ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా వసూలు చేయలేదని, తాము 75శాతం నష్టపోయామని వారు కన్నీళ్లపర్యంతం అవుతున్నారు. ఈ విషయమై చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ నుంచి హామీ రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. -
'లింగ' థియేటర్లో రజనీ అభిమాని మృతి
మూత్రపిండాల సమస్య ఉన్నా లెక్కచేయకుండా తన అభిమాన నటుడి సినిమా చూడాలని వచ్చిన ఓ వ్యక్తి.. సినిమా థియేటర్లోనే ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) రజనీకాంత్ వీరాభిమాని. అతడు ఎలాగైనా 'లింగ' సినిమా చూడాలని అనుకున్నాడు. తన నరానికి పెట్టిన డ్రిప్ ట్యూబ్ అలాగే ఉంచుకుని మరీ థియేటర్‌కు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో అతడికి చికిత్స జరుగుతోంది. అయినా ఎలాగోలా ఆస్పత్రి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నాడు. సినిమా పూర్తయిన తర్వాత కూడా అతడు ఎంతకీ లేవకపోవడంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూడగా.. అప్పటికే మరణించాడు. పోలీసులు రాజేంద్రన్ మృతదేహాన్ని ఆస్పత్రికి పంపారు. -
'లింగ' వివాదానికి ఇంతటితో తెర దించండి
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రంలో ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై దర్శక, నిర్మాతలు, రచయిత స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. ఆ సన్నివేశాలను, సంభాషణలనూ చిత్రం నుంచి తొలగించారు. నిర్మాత 'రాక్‌లైన్' వెంకటేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా అన్నివర్గాల ప్రేక్షకులు సినిమాకు ముఖ్యులేనని, సినిమా ద్వారా సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, అయితే పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని 'లింగ' చిత్రానికి తెలుగులో సంభాషణలు అందించిన రచయిత శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన చేశారు. పెద్ద మనసుతో 'లింగ' చిత్రంపై వివాదానికి ఇంతటితో తెర దించాల్సిందిగా అన్ని వర్గాలనూ శశాంక్ ఈ సందర్భంగా అభ్యర్తించారు. -
అసత్య ప్రచారమొద్దు
లింగాపై సత్యదూర ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచా రం సాగుతోంది. చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నారుు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది. లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను కేఎస్.రవికుమార్ ఖండించారు. -
'లింగా' పైరసీ సీడీలు సీజ్!
గుంటూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డిసెంబర్ 12న శుక్రవారం విడుదలైన లింగా చిత్రానికి సంబంధించి పైరసీ సీడీలను పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ సంఖ్యలో పైరసీ సీడీలు లభించడం కలకలం రేపింది. సినిమా విడుదలతోనే సీడీలు కూడా బయటకు రావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టించింది. పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో లింగా చిత్రానికి సంబంధించి మూడు వేల సీడీలు లభించగా, రెండు వేలకు పైగా గీతాంజలి సీడీలు, ముఫ్పై వేలకు పైగా ఇంగ్లిష్ మరియు తెలుగు సినిమా సీడీలు దొరికాయి. మొత్తంగా నలభై ఎనిమిది వేలకు పైగా సీడీలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటుగా 22 కంప్యూటర్ మోనిటర్లను, ఆరు ఇన్వెర్టర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హ్యాపీ బర్త్ డే లింగ..!
-
నేడు రజినీకాంత్ 63వ పుట్టినరోజు
-
ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో 'లింగా' విడుదల
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న శుక్రవారం లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు కోలహాలంతో నిండిపోయింది. ఈ సందర్భంగా అభిమానులందరూ బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాండిచ్చేరిలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రం విడుదలైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. -
తెలిసింది గోరంత...తెలియాల్సింది కొండంత!
సినిమా హాలు లోపలికెళ్లగానే తలుపులు మూసేస్తారు. అంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో బొమ్మ పడుతుంది వెండి తెర మీద. బొమ్మ పడగానే చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్లల్లో వెలుగు నిండుతుంది. ఎవణై్నతే చూడాలని వ్యయప్రయాసలకోర్చి వచ్చామో, వాడిని చూడగానే కనిపించే వెలుగు అది. ప్రేక్షకుడు వాడిని చూస్తాడు. వాడిలోని వాడిని చూస్తాడు. వేడిని చూస్తాడు. తన వాడిలో తనని తాను చూసుకుంటాడు. ఆ వెలుగు పంచిన ఆనందంలో కాస్సేపు తన జీవితాన్ని తను మర్చిపోతాడు. అలా చీకటిలో వెలుగును పంచేవాడే రజనీకాంత్. రజని అంటే చీకటి. కాంత్ అంటే వెలుగునిచ్చేవాడు. ఒక సాధారణ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అనడానికి కొలమానం రజనీకాంత్. ఒక అసాధారణ వ్యక్తి ఎంత ఒదిగి ఉండవచ్చు అన్నదానికీ కొలమానం రజనీకాంత్. కింద నుంచి పైకొచ్చినా, పై నుండి కిందికొచ్చినా, తల కిందులుగా తపస్సు చేసినా రజనీకాంత్‌ని కొట్టేవాడు ఈ తరంలో లేడు. ఎందుకంటే రజనీకాంత్ ఎవణై్ననా కొట్టేయగలడు కాబట్టి. ఇదంతా ఎందుకంటే... ఇవ్వాళ రజనీకాంత్ పుట్టిన రోజు. ‘లింగ’గా మరోసారి పుట్టిన రోజు. రజనీ ఒక పుట్టిన రోజే ఎంతో ఘనంగా ఉంటుంది. రెండు పుట్టిన రోజులు ఒకే రోజొస్తే ఇంకెంత ఘనంగా ఉంటుందో? చాలా మంది నటులకి పాత్ర పూనుకుంది అంటాం. వాళ్లు కూడా ఫలానా పాత్ర చాలా కాలం నాలో ఉండిపోయింది, అలాగే బిహేవ్ చేసేవాణ్ణి అనడం వింటాం. ఒక్కసారయినా రజనీ సార్ బాషా లాగో, బాబా లాగో, రోబో లాగో, నరసింహలాగో, ముత్తులాగో, అరుణాచలం లాగో, శివాజీలాగో, లింగాలాగో కొన్ని రోజులుంటే ఎంత బావుణ్ణు. సమాజంలో ఎన్ని వ్యవస్థలు ఆదరాబాదరాగా ప్రక్షాళనై పోయేవి? స్వచ్ఛభారత్ ఎంత తొందరగా సాధ్యమై పోయేది? అనిపిస్తుంటుంది నాకు. ఈయన మరీ డౌన్ టు ఎర్త్ - పాత్ర ఎత్తు ఆకాశమంత హైగా ఉంటుంది. ప్యాకప్ చెప్పగానే మనిషి పాతాళమంత లోతైన భావజాలంతో ఒదిగిపోయి ఉంటాడు. చాలా రోజులు ఆయన్ని ఆయన చూసుకోవడం వల్ల కలిగిన ఇన్సెక్యూరిటీ కారణం అనుకునే వాణ్ణి. కానీ కాదు. ఏ ప్రభావమూ తనపైన పడలేని, పడనీయని యోగ స్థితి అది. సినిమాయే జీవితంగా చెన్నై వచ్చిన బస్ కండక్టర్... సీఎమ్ కాన్వాయ్ వస్తుందని తనని ఇంటికెళ్లనీయకపోతే, కారు దిగి, సీఎమ్‌కే ట్రాఫిక్ జామ్ రుచి చూపించిన సూపర్‌స్టార్. ఒకటి అసలు - ఒకటి నకిలీ. నకిలీని అసలనుకుని భ్రమ పడకుండా, అసలుని నకిలీగా భావించకుండా - ఏ మకిలీ అంటని స్వచ్ఛతని మనసులోను, మెదడులోను, మాటలోను, నడవడిలోను, నిజాయతీలోను నింపుకున్న వ్యక్తి రజనీ మాత్రమే. అందుకే ఆయనలో అంత వెలుగు. అందుకే ఆయన్ని చూసిన ప్రేక్షకుడి కళ్లల్లో మరింత వెలుగు. సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ రిచ్‌నెస్ - అంటే, రజనీకాంత్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఆయన అంత సింపుల్. అలాగే ఆయన ఎన్నో మంచి లక్షణాలకి శాంపిల్. మరెన్నో రుగ్మతలకి పిల్. అశావహ దృక్ఫథం మనిషికి ఆక్సిజన్ లాంటిది. రజనీకాంత్ ఆ ఆక్సిజన్. రజనీ కాంత్ ఒక రెడ్ బుల్. రజనీకాంత్‌ని విశ్లేషించలేము. విసుగొచ్చేదాకా విశేషణాలతో పొగడగలము. జీసస్, బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి... వీళ్లందరినీ మానవుల రూపంలో ఉన్న దేవుళ్లుగా కొలుస్తాం. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే అవకాశం తర్వాతి తరంలో ఎవరికైనా ఉంటే అది రజనీ సార్కే. కమర్షియల్ సినిమా నుంచి ఈ స్థితి సాధించడం మరీ కష్టమైన విషయం. ఆయనకి అందరు హీరోలకీ ఉన్నట్టు ఫ్యాన్స్ లేరు. చాలామంది దేవుళ్లకున్నట్టు భక్తులున్నారు. ఆయనకి గుడి లేదు. కటౌట్లకి పాలాభిషేకాలు, రక్తంతో తిలకాలూ లేవు. ధార్మిక సేవా కార్యక్రమాలున్నాయి. ఆయనకి పబ్లిసిటీ లేదు. ఆయన వెనకే పబ్లిక్ ఉన్నారు. ఆయనకి రాజకీయాలు తెలీదు. రాజకీయాల్లో ఆయనున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, నిలబెట్టగలరు. కానీ దాని జోలికెళ్లరు. డబ్బు సంపాదించాక పక్క వ్యాపారాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న ఎంతోమంది స్టార్లున్నారు. కానీ ఆయన ఏ ఐపిఎల్ టీమ్కీ ఫ్రాంఛైజీ కాదు. ఏ వ్యాపారానికీ అధినేత కాదు. ఆయనకి స్కీముల్లేవు. అందుకే ఏ స్కాముల్లోనూ లేరు. ఆయనకి ఈ రోజు ఎలా బతకాలో తెలుసు. నిన్న తనేమిటో గుర్తు. రేపటి గురించిన ఆలోచన లేదు. అందుకే అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. తన మీద, తన వయసు మీద తనే జోకులేసుకోగలుగుతున్నారు. నటనే జీవితమయ్యాక కూడా, జీవితంలో నటించకుండా ఉండగలుగుతున్నారు. రజనీ ఒక స్ఫూర్తి పాఠం. రజనీ ఒక అతీత శక్తి. రజనీ ఒక జనాకర్షణ యంత్రం. రజనీ ఒక తారకమంత్రం. మనిషి నుంచి మనీషిగా మారే ప్రయాణం రజనీకాంత్. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాడు. రజనీకాంత్ అంటే చీకటిలో వెలుగు నింపేవాడు. అందుకే రజనీకాంత్ - ఒక గురువు. ప్రతి మనిషీ బ్రతకడానికి నేర్చుకోవలసిన తప్పనిసరి పాఠం రజనీకాంత్. ఈ పాఠం చదువుతున్నా, విన్నా, వెండితెర మీద చూసినా ఆనందం. తాదాత్మ్యం. దటీజ్ రజనీ సర్. లాంగ్ లివ్ రజనీ సర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సర్. మీ...వి.ఎన్. ఆదిత్య దర్శకుడు -
లింగాకు పోటీగా....
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగాతో ఢీ కొట్టడానికి చిట్టెలుకల్లాంటి రెండు చిత్రాలు ఇసుమంత కూడా భయపడకుండా రెడీ అవుతుండడం విశేషమే. రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా జంటగా నటించిన అత్యంత భారీ, బ్రహ్మాండ చిత్రం లింగా. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు అంతా కొత్త తారలతో రూపొందిన యారో ఒరువన్, ఇన్నుమా నమ్మైనంబ రాంగ అనే లోబడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కథ, కథనం, మాటలు, దర్శకత్వం, నిర్మాత ఇలా అన్నితానై కెఎన్ పైజు నిర్మించిన చిత్రం యారో ఒరువన్. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని లింగా చిత్రానికి పోటీగా విడుదల చేయడం గురించి కె ఎన్ పైజు మాట్లాడుతూ రజనీకాంత్ చిత్రం చూడటానికి వచ్చి టికెట్లు దొరక్క మిగిలిపోరుున ప్రేక్షకులు తమ చిత్రానికివచ్చినా చాలు యారో ఒరువన్ హిట్ అయినట్లే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఈ చిత్రం చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచరాదని అంటున్నారు. అలాంటి ఆశతోనే ఇన్నుమా నమ్మైనంబరాంగ చిత్ర నిర్మాత దర్శకనిర్మాత ఉన్నారు. మరి లింగా చిత్రం ఈ రెండు చిత్రాల నిర్మాతలను గట్టెక్కిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. -
రజనీ బర్త్‌డే స్పెషల్ : లింగావతారం
-
లింగాపై స్టే కుదరదు
లింగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఆ చిత్రంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఫిర్యాదు చెన్నై హైకోర్టులో విచారణకు వచ్చింది. బాలాజీ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లింగా చిత్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటూ తాము తెలుగులో చిరంజీవి, సోనాలిబింద్రే నటించిన ఇంద్ర చిత్రం తమిళ రీమేక్ హక్కులు పొందామని వెల్లడించారు. ఈ చిత్ర కథ రజనీకాంత్ నటించిన లింగా చిత్ర కథ ఒకేలా ఉన్నాయని తెలిపారు. ఇంద్ర ఇతివృత్తంతోనే లింగా చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. లింగా చిత్రం విడుదలైతే తాము తీవ్రంగా నష్టపోతామని కాబట్టి ఆ చిత్ర విడుదలపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరారు. అదే విధంగా ఒక లా కమిషన్ ఏర్పాటు చేసి లింగా చిత్రాన్ని ఇంద్ర చిత్రాన్ని చూసి కథ గురించి నిర్ణయం వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో లింగా చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగా చిత్రానికి తాను దర్శకుడిని మాత్రమేనని వివరించారు. అయినా లింగా చిత్ర కథకు, తెలుగు చిత్రం ఇంద్ర కథకు సంబంధం లేదన్నారు. భారతదేశం లోని డ్యామ్‌ల ఇతివృత్తాన్ని తీసుకుని కథ, కథనాలను తయారు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్‌దారుడి ఉద్దేశం చూస్తుంటే లింగా చిత్రానికి సంబంధించిన వారందరినీ బెదిరించేలా ఉందని ఆరోపించారు. ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి లింగా చిత్రంపై తాత్కాలిక నిషేధం విధంచడం కుదరదని వెల్లడిస్తూ కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు. -
ఈ వయసులో డ్యూయెట్లు నిజంగా శిక్షే : రజనీకాంత్
‘‘నా మొదటి సినిమా తొలి సీన్ చేస్తున్నప్పుడు పడనంత టెన్షన్ ఈ సినిమా కోసం పడ్డాను. ఆ టెన్షన్‌కి కారణం ఇద్దరమ్మాయిలు’’ ... ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా, జగపతిబాబు కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ‘లింగ’ ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ కాసేపు తమాషాగా, ఇంకాసేపు సీరియస్‌గా ప్రసంగించారు. ఇదో అద్భుతం ‘‘దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత నేను చేసిన చిత్రం ‘లింగ’. మధ్యలో ‘కోచడయాన్’ వచ్చినా అది యానిమేషన్ ప్రధానంగా సాగే సినిమా. ‘లింగ’ పరంగా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఇది చాలా పెద్ద సినిమా. ఇందులో భారీ తారాగణం ఉన్నందువల్ల, భారీ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేయడం వల్ల ఈ చిత్రం పెద్దది అనడం లేదు. ఈ కథ చాలా గొప్పది. స్వాతంత్య్రం రాకమునుపు, ఆ తర్వాత జరిగే కథ ఇది. ప్రధానంగా ఓ ఆనకట్ట నిర్మాణం నేపథ్యంలో సాగుతుంది. దాదాపు 60, 70 సన్నివేశాల్లో వేల మంది నటీనటులు, ఏనుగులు, రిస్కీ ఫైట్స్, పెద్ద పెద్ద సెట్స్.. ఇలా భారీ ఎత్తున ఉన్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ఆ ఘనత టెక్నీషియన్లదే. అలాగే, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్లానింగ్‌ని మెచ్చుకోవాల్సిందే. రాజమౌళితో సినిమా చేస్తా... 30, 40 ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలా? అని కేయస్ రవికుమార్, నేను ఆలోచించాం. ఎంత పెద్ద సినిమా అయినా తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చని యువతరానికి చెప్పాలనుకున్నాం... సాధించాం. ఒక్క విషయం.. నేను ‘బహుబలి’ గురించి ప్రస్తావించడంలేదు. ఆ చిత్రాన్ని రాజమౌళి ఎంతో గొప్పగా తీస్తున్నారు. నేను కూడా షూటింగ్ చూశాను. తప్పకుండా భారతదేశంలో రాజమౌళి నంబర్ వన్ టెక్నీషియన్. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తా. ఈ ఇద్దరమ్మాయిలే కారణం నా మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’ మొదటి సీన్ అప్పుడు పడని టెన్షన్ ఈ చిత్రం అప్పుడు పడ్డాను. దానికి కారణం అనుష్క, సోనాక్షి. అనుష్క చాలా మంచి అమ్మాయి. సోనాక్షి నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఈ ఇద్దరితో డ్యూయెట్స్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఏ ఆర్టిస్ట్‌కైనా భగవంతుడు విధించే శిక్ష ఏంటో చెప్పనా?.. 60 ఏళ్ల వయసులో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడటం. అలాగే, జగపతిబాబు గురించి చెప్పాలి. మేమిద్దరం ‘కథానాయకుడు’లో నటించాం. కానీ, తనేంటో ‘లింగ’ సమయంలో అర్థమైంది. చిత్రపరిశ్రమలో నేను చూసిన జెంటిల్మెన్లో జగపతిబాబు ఒకరు. రజనీ సినిమాలో కథ ఉంటుందా అన్నారు ఈ నెల 12న లింగ’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఈ కథ మాది’ అంటూ చెన్నయ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు కేసు పెట్టారు. దానికి స్పందిస్తూ.. ‘ఏంటీ రజనీ సినిమాలో కథ ఉంటుందా? ఆ కథ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తప్పకుండా ‘లింగ’ చూడాలి’ అని కొంతమంది ట్విట్టర్లో స్పందించారు. ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంది. కానీ, ఆ కథ పొన్కుమరన్ది. ఆ నలుగురిదీ కాదు. నన్ను క్షమించండి హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు చలన చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ చేసిన రోజున రావాలనే అనుకున్నా. కానీ, మా కుటుంబానికి చెందిన రెండు ముఖ్యమైన పెళ్లిళ్లు ఉండటంతో రాలేకపోయా. నన్ను క్షమించండి. హుద్ హుద్ బాధితుల సహాయార్థం నా వంతుగా కొంత ఫండ్ ఇస్తా’’ అని రజనీకాంత్ చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘రజనీతో గతంలో సూపర్ హిట్ సినిమా తీశాను. మేమిద్దరం మరో సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. భవిష్యత్తులో మరో అవకాశం వస్తుందని భావిస్తున్నా’’ అని చెప్పారు. కె. విశ్వనాథ్ మాట్లాడుతూ -‘‘బాపుగారు, బాలచందర్గార్లతో వారం రోజులైనా పని చేయాలనీ, రజనీకాంత్‌తో సినిమా చేయాలనీ ఉండేది. ‘ఉత్తమ విలన్’లో బాలచందర్‌గారితో నటించా. ‘లింగ’లో రజనీతో చేశాను’’ అని తెలిపారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘అతిశయోక్తి కాదు కానీ, రజనీ అంత గొప్ప మనిషి లేరు. ఎవరేమన్నా పట్టించుకోరు.. ఆశీర్వదిస్తారు. అలా ఎలా ఉండగలుగుతున్నారు? అనడిగితే -‘‘ప్రతి రోజూ ఏదో సందర్భంలో నేనో బస్ కండక్టర్ని అనే విషయం గుర్తొస్తుంటుంది’’ అన్నారు. అదీ రజనీకాంత్ అంటే’’ అని చెప్పారు. కేయస్ రవికుమార్ మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు రజనీకాంత్‌గారి బర్త్‌డే సందర్భంగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ ఘనత దక్కించుకున్న మొదటి సినిమా ఇదే. రజనీగారి పుట్టినరోజుకి ఇది మంచి బహుమతి అవుతుంది’’ అన్నారు. రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా చేయడం నా ఏడు జన్మల అదృష్టంగా భావిస్తున్నా’’ అని చెప్పారు. ఈ వేడుకలో రమేశ్ ప్రసాద్, నందు అహుజా, రత్నవేలు, పొన్కుమరన్, బీవీయస్‌యన్ ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి కొర్రపాటి, అనుష్క, సోనాక్షీ సిన్హా, బీఏ రాజు తదితరులు పాల్గొన్నారు. -
'లింగా' ఆడియో సక్సెస్ మీట్
-
సోనాక్షితో డ్యూయెట్ అంటే చెమట్లు పట్టాయి
-
లింగా ఆడియో సక్సెస్ వేడుక Part - 1
-
లింగా ఆడియో సక్సెస్ వేడుక Part - 2
-
‘లింగా’ విడుదల రోజే...
సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం విడుదల రోజే నూతన తారలు నటించిన యారో ఒరువన్ చిత్రం విడుదలవుతోంది. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం యారో ఒరువన్. నవ నటుడు రామ్ హీరోగా నటిం చిన ఈ చిత్రంలో నటి ఆదిర హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. కథ, కథనం, మాటలు చాయా గ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను కేఎన్ పైజూ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, తాను పలు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. యారో ఒరువన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే కనిపించకుండా పోయిన భార్య కోసం గాలించే భర్త రామ్, డిటెక్టివ్ ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనలే చిత్ర ఇతివృత్తం అని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లింగ విడుదలవుతున్న థియేటర్లు కాకుండా మిగిలిన థియేటర్లు తమకు లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ తేదీన మరో చిత్రం ఏదీ విడుదల కావడం లేదని అందువలనే తానీ చిత్రాన్ని విడుదల చేస్తున్నానని వివరించారు. -
కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న లింగా
-
లింగ ... రెండు వేల థియేటర్లల్లో విడుదల
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు లింగ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. లింగా చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ సరిఫ్టికేట్ ఇచ్చారని తెలిపారు. లింగ చిత్రం తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రజనీకాంత్ జన్మదినమైన డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టిలు నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ దర్శకుడు కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో గతంలో రజనీ ముత్తు, నరసింహ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. లింగ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. -
లింగపై ఫిర్యాదు
లింగ చిత్రంపై న్యాయవాది ఒకరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగ. ఈ చిత్రం ప్రారంభం నుంచి సమస్యలను ఎదుర్కొంటూనే ఉండడం గమనార్హం. లింగా చిత్రం వివాదాంశమైన ముల్లై పెరియార్ డ్యామ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం అంటూ కన్నడ భాషా సంఘాలు ఆదిలోనే షూటింగ్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. ఆ సమస్య సద్దుమణిగినా ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుండగా మరో సమస్యను ఎదుర్కొంది. లింగ చిత్రం ముల్లై వనం 999 అనే కథను కాపీ చేశారంటూ మదురై హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి రజనీ బదులు పిటిషన్ దాఖలుచేశారు. ఈ అంశం కోర్టులో ఉండగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది. దీంతో లింగ చిత్రాన్ని రేపు (సోమవారం) సెన్సార్ సభ్యుల ముందు ప్రదర్శనకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితిలో న్యాయవాది నన్మారన్ లింగ చిత్రంపై శనివారం న్యాయబోర్డుకు ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగ చిత్రంలో న్యాయశాఖను, న్యాయవాదులను విమర్శించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తెలిసిందన్నారు. అందువల్ల ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని, లింగ చిత్రాన్ని విడుదలకు ముందు తమకు ప్రదర్శించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లింగ చిత్రంలో న్యాయశాఖను, న్యాయవాదులను విమర్శించే సన్నివేశాలున్నాయని తెలిసిందన్నారు. వాటిని ముందుగా తొలగిస్తే సమస్యలను నివారించవచ్చన్న ఉద్దేశంతోనే ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. -
రాజకీయాల్లోకి రాను : రజనీకాంత్
పనాజీ: తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. గోవా రాజధాని పనాజీలో ప్రారంభమైన 45వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రజనీ మాట్లాడుతూ... రాజకీయాలలో చేరాలని తనను పలు పార్టీలు ఇప్పటికే ఆహ్వానించాయని, అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా తనకు రాజకీయాలంటే భయం మాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవమేనని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ చేతుల మీదగా రజనీ సెంటినరీ అవార్డు ఫర్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. అమితాబ్, మీరు కలసి భవిష్యత్తులో కలసి నటిస్తారా అని విలేకర్లు ప్రశ్నించగా అందుకు రజనీ చిరునవ్వే సమాధానమిచ్చారు. కాగా రజనీ నటించిన తాజా చిత్రం లింగా డిసెంబర్ 12న విడుదల కానుంది -
రజనీకాంత్ ‘ లింగా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ
-
ప్రజలకు సేవ చేస్తా
ప్రజలకు సేవ చే యడమే తన ఏకైక లక్ష్యమని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. లింగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు నాయికలు. టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించారు. ఈరో స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ లింగా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తం గా డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం ఉదయం స్థానిక అన్నాసాలైలోని సత్యం సినిమా థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను రజనీకాంత్ ఆవిష్కరించి తొలి ప్రతిని చిత్ర యూనిట్‌కు అందించారు. రజనీ చూపించిన టైటిల్ లింగా దర్శకుడు కేఎస్ రవికుమార్ లింగా చిత్ర టైటిల్‌ను ఎవరు చూపించాలన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తొలి చిత్రానికి వెంక న్న అనుకున్నామని అయితే రజనీ టైటిల్ కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తోందని, ఇంకొంచెం ఫోర్స్‌గా ఉంటే బాగుంటుందన్నారన్నారు. ఆ తరువాత ఆయనే లింగా టైటిల్‌ను చూపించారని తెలిపారు. సీనియర్ దర్శకుడు ఎస్పి ముత్తురామన్ మాట్లాడుతూ రజనీకాంత్ అనారోగ్యానికి గురై, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు ప్రశాంతతను కలిగించింది ఆయన మనవళ్లు లింగా, యాత్రలేనని తెలిపారు. అందువలన తన మనవడు లింగా పేరు ప్రాచుర్యం పొందాలనే ఈ చిత్రానికి ఆ టైటిల్ నిర్ణయించారన్నారు. లింగా చిత్రాన్ని తాను నిర్మించానంటే ఇప్పటికీ కలగానే ఉందని చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అన్నారు. ఇంతకుముందు ఎన్ని చిత్రాలు చేసినా లింగా చిత్రం అనుభవం మరపురానిదన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ లింగా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందన్నారు. ఈ చిత్రం గురించి పలువురు లింగా చిత్రం డబుల్ పడయప్పలా ఉంటుందని మరికొందరు ఈ చిత్ర స్టిల్స్ చూస్తుంటే శివాజీ చిత్రంలో రజనీ గుర్తుకొస్తున్నారని, ఇంకొందరు లింగా ఎందిరన్ను మించిపోయిందని చెబుతున్నారన్నారు. రజనీ అంటే చాలా ఇష్టం రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ చిత్రంలో నటించిన జగపతిబాబు తెలిపారు. తాను పుట్టి పెరిగింది ఇక్కడే. చిన్నప్పటి నుంచి రజనీ చిత్రాలు చూస్తున్నాను. అందుకే లింగా చిత్రంలో నటించే అవకాశం రావడంతో కథ కూడా వినకుండా నటించడానికి ఒప్పేసుకున్నానన్నారు. రజనీకాంత్ తనకు ఆయన బయోగ్రఫీ పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. తానందుకున్న తొలి బయోగ్రఫీ పుస్తకం ఇదేనన్నారు. సోనాక్షి సిన్హా మాట్లాడుతూ తాను సూపర్‌స్టార్ హీరోయిన్ అంటే ఆనందం పట్టలేక అరిచేశానన్నారు. అంతేకాదు అయామ్ రజనీ ఫ్యాన్ అన్నారు. లుంగీ డాన్స్, లింగా డాన్స్ అంటూ డాన్స్ హమ్ చేస్తూ ఆడేశారు. అనుష్క మాట్లాడుతూ రజనీకాంత్‌తో తొలిసారి నటించాను. చాలా సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి నటించిన అనుభవాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేనన్నారు. జయించడమే ముఖ్యం రజనీకాంత్ మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన తరువాత మళ్లీ నటించగలనా అని చింతించానన్నారు. కొంచెం గ్యాప్ తీసుకుని తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రం కోచ్చడయాన్ చేశానన్నారు. ఆ చిత్రం ఆర్థికంగా లాభించకపోయినా సౌందర్యకు అపార అనుభవాన్ని కలిగించిందన్నారు. అది యానిమేషన్ చిత్రం కావడంతో చాలామంది అభిమానులు చివరిలోనైనా తాను మామూలు నటుడిగా కనిపిం చాలని ఆశించినట్లు తెలిపారన్నారు. దీంతో ఒక కమర్షియల్ చిత్రం వెంటనే చేయాలన్న నిర్ణయమే లింగా అని తెలిపారు. ఈ వేదికపై చాలా మంది రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారన్నారు. అయితే రాజకీయాలంటే తనకేమీ భయం లేదని, వాటి లోతు కూడా తెలుసన్నారు. సినిమా చేయడం సులభమే, అలాగే రాజకీయ రంగ ప్రవేశం కష్టసాధ్యం కాదు. అయితే జయించడమే ముఖ్యం అన్నారు. పలు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నారు. కొన్ని పరిస్థితులే తననీ స్థాయికి నిలబెట్టాయని, అదే విధంగా రేపటి పరిస్థితుల్లో ఏ స్థాయికి చేరుస్తాయో తెలియదన్నారు. అయితే ఖచ్చితంగా తనను నమ్మిన వాళ్లకు సేవ చేస్తానని రజనీ అన్నారు. -
పారితోషికం 60 కోట్లు?
రజనీకాంత్ పారితోషికం 60 కోట్లట. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అంశం ఇదే. ‘లింగా’ చిత్రం కోసమే సూపర్‌స్టార్ ఇంత పారితోషికం తీసుకున్నారట. ఒకవేళ రజనీ ఇంత పారితోషికం తీసుకున్నది నిజమే అయితే.. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి రికార్డ్ ఆయనకే దక్కుతుంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఇప్పటికే భారీ ఎత్తున బిజినెస్ అయ్యిందట. శాటిలైట్, ఆడియో హక్కుల నిమిత్తం నిర్మాతకు భారీ మొత్తమే అందిందని సమాచారం. -
'లింగా' టీజర్ : రజనీ స్టైల్‌గా నడిచొస్తే..!
-
రజనీ నుంచి చాలా నేర్చుకున్నా
రజనీకాంత్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు లింగా చిత్రంలో రజనీకాంత్‌తో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు కోచ్చడయాన్ చిత్ర సమయంలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకునే పేర్కొంది. విశేషం ఏమిటంటే వీరిద్దరూ సూపర్‌స్టార్ చిత్రాల్లోనే కోలీవుడ్‌కు పరిచయమైన భామలు కావడం. లింగా చిత్రంలో సోనాక్షి సిన్హాతో పాటు అందాల భామ అనుష్క కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కర్ణాటకలో జరిగినప్పుడు తన బసకు సరైన సౌకర్యాలు కలిగించలేదంటూ ట్విట్టర్లో పేర్కొని కలకలం సృష్టించిన సోనాక్షి సిన్హా, ఇప్పుడేమో లింగా చిత్రం లో నటించడం మంచి అనుభవం అంటూ పేర్కొంది. ఈ ముంబయి బ్యూటీ మరోసారి ట్విట్టర్లో పేర్కొం టూ లింగా చిత్రంలో నటించడం పూర్తి అయ్యిందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన రజనీ కాంత్‌కు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. లింగా చిత్రంలో పని చేసిన రోజులన్నీ చాలా సంతోషంగా గడిపినట్లు తెలిపారు. అంతేకాకుండా రజనీ కాంత్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ట్విట్టర్లో సోనాక్షి సిన్హా పేర్కొన్నారు. -
సూపర్ స్టారా... మజాకానా!
సినిమాలో నటించడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో ఎత్తు. షూటింగ్ లొకేషన్లో పెదాలు ఎలా అయితే కదిపి మాట్లాడతారో, దానికి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పాలి. లేకపోతే పెదాల కదలికకు, మాటకు సంబంధం ఉండదు. అందుకే, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారు. ఇతర పాత్రల సంగతెలా ఉన్నా.. సినిమా మొత్తం హీరో కనిపిస్తాడు కాబట్టి, ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. పైగా పంచ్ డైలాగ్‌లు, పవర్ఫుల్ డైలాగులకు కొదవ ఉండదు. అందుకే, డబ్బింగ్‌కి కనీసం మూడు నుంచి పదిరోజుల వరకైనా తీసుకుంటారు. కానీ, రజనీకాంత్ ఇటీవల ఒకే ఒక్క రోజులో ‘లింగా’లో తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేసి, ఆ చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచారు. 24 గంటల్లోపే డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసేశారని, ‘సూపర్ స్టారా... మజాకానా?’ అని ఆ చిత్రబృందం రజనీని తెగ పొగిడేస్తోంది. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. రజనీ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ‘లింగా’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
'లింగ'కు రజనీ సూపర్‌ఫాస్ట్ డబ్బింగ్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ వయస్సు.. 63 ఏళ్లు. కానీ ఈ వయసులో కూడా ఆయన మెరుపువేగంతో డబ్బింగ్ చెప్పేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. 'లింగ' చిత్రం కోసం ఆయన తన మొత్తం డబ్బింగ్ పనిని కేవలం 24 గంటల్లో పూర్తిచేయడంతో యూనిట్ అంతా నోళ్లు వెళ్లబెట్టారట. సాధారణంగా హీరో పాత్రధారి తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవాలన్నా కూడా కొన్ని రోజులు పడుతుందని, అక్కడ సీన్ వస్తున్నప్పుడు పెదాల కదలికలకు అనుగుణంగా సరిగ్గా సరిపోయేలా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని, అందుకు రెండు మూడు టేకులు కూడా అవసరం అవుతాయని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కానీ రజనీకాంత్ మాత్రం సింగిల్ టేక్‌లోనే చాలావరకు డైలాగులు డబ్బింగ్ చెప్పేశారన్నారు. 'లింగ' తమిళ వెర్షన్‌కు ఇక రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన షూటింగ్ అంతా పూర్తయింది. ఓ పాట కోసం యూరప్ వెళ్దామని భావిస్తున్నారు. అక్కడ సోనాక్షి సిన్హా, రజనీకాంత్‌ల మీద పాట చిత్రీకరిస్తారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా... రజనీ పుట్టిన రోజైన డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. అనుష్క ఈ సినిమాలో రెండో హీరోయిన్గా చేస్తోంది. -
సూపర్‌స్టార్స్‌తో సింగిల్ సాంగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ప్రతి హీరోయిన్ ఆశ పడుతుంది. హీరోయిన్గా కాకపోయినా సింగిల్సాంగ్లోనూ, సింగిల్ సన్నివేశంలో అయినా నటించే అవకాశం కోసం తహతహలాడుతారు. అలాంటి ఆకాంక్ష నటి త్రిషకు ఉంది. ఈ బ్యూటీ చిత్రరంగ ప్రవేశం చేసి దశాబ్దం దాటింది. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతోంది. అయినా ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సూపర్‌స్టార్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని ఈ బ్యూటీ చాలాసార్లు చెప్పుకుని చింతించారు కూడా. అయితే ప్రతి నటికి ఒక అవకాశం వస్తుందన్నట్లు ఈ అమ్మడికి ఇప్పుడలాంటి చాన్స్ వచ్చిందని సమాచారం. అయితే అది హీరోయిన్ చాన్స్ కాదు ఒక్క పాటలో రజనీతో ఆడే అవకాశం వచ్చినట్లు తెలిసింది. సూపర్‌స్టార్ ప్రస్తుతం లింగా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ చిత్రం కోసం సోనాక్షి సిన్హా, అనుష్కలతో డ్యూయెట్లు పాడుకుంటున్నారు. ఈ చిత్రంలో నటి త్రిష ఒక సింగిల్ సాంగ్‌కు చిందేయనున్నట్లు తెలిసింది. లింగా చిత్రంలో ఈ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందట. ఈ పాటలో రజనీతోపాటు త్రిష నటించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే మొత్తం మీద సూపర్‌స్టార్‌తో సింగిల్ సాంగ్తోనైనా నటించే అవకాశాన్ని త్రిష దక్కించుకున్నారన్నమాట. -
లింగా టాకీ పూర్తి
లింగా చిత్రం మాటల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక పాటల షూటింగ్ మాత్రమే మిగిలింది. చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కోచ్చడయాన్ విడుదల తరువాత లింగా చిత్రంలో నటించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర నేటి తరానికి చెందింది కాగా మరో పాత్ర 1990 కాలానికి చెందినదని సమాచారం. ఇద్దరు రజనీల సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు రొమాన్స్ చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ ముత్తు పడయప్పా చిత్రాల తరువాత రజనీకాంత్‌తో చేస్తున్న మూడో చిత్రం లింగా. కన్నడ నటుడురకలైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ మైసూర్లో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగింది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను కర్ణాటకలోని షిమోకా ప్రాంతంలో నెల రోజులుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర టాకీపార్టు పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చింది. మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపారుు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం రత్నవేల్ సంగీతాన్ని ఏ.ఆర్.రెహ్మాన్ అందిస్తున్నారు. -
సాహసానికి సై!
ఆరు పదుల వయసులోనూ అదిరిపోయే ఫైట్లు చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికెంతో దమ్ము, ధైర్యం ఉండాలి. రజనీకాంత్‌కి ఇవి ఉన్నాయి కాబట్టే, తాను నటిస్తున్న తాజా చిత్రం ‘లింగా’లో ఓ సాహసోపేతమైన ఫైట్‌కి సై అనేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టేకర్ ఆధ్వర్యంలో త్వరలో ఈ క్లయిమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరగనుంది. ఇది భారీ పోరాట దృశ్యం అని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఫైట్ చేయలేదని లీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోరాట దృశ్యానికి సంబంధించిన కసరత్తుల్లో లీ నిమగ్నమయ్యారు. రజనీ స్టయిల్స్, ఫైట్స్‌కి వీరాభిమానులున్నారు. వాళ్లందరినీ ఈ ఫైట్ థ్రిల్‌కి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో ‘రాక్‌లైన్’ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. -
పెళ్లి లేదు...ఏమీలేదు: అనుష్క
చెన్నై : అందాల తార అనుష్క పెళ్లి వార్తలను ఆమె మేనేజర్ ఖండించాడు. అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊపుర్లేనని అనుష్క మేనేజర్ స్పష్టం చేశాడు. ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం అనంతరం ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై అనుష్క మేనేజర్ పైవిధంగా స్పందించాడు. 'బహుబలి' చిత్రం అనంతరం అనుష్క తెలుగులో 'బాగమతి' లో నటించనుంది. ఈ చిత్రానికి ఆమె గతంలోనే సైన్ చేసినట్లు మేనేజనర్ ఐఏఎన్ఎస్కు తెలిపాడు. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ 'లింగా' షూటింగ్‌తో బిజీగా ఉందన్నందున అనుష్క ....కొత్త చిత్రాలను అంగీకరించలేదని పేర్కొన్నాడు. మరోవైపు అజిత్ సినిమాలో నటిస్తున్నదని, అవన్నీ పూర్తి అయ్యేవరకూ కొత్త చిత్రాలు అంగీకరించటం లేదని తెలిపాడు. కాగా ఇటీవల ఓ దర్శకుడు అనుష్కను కలిసి కథ చెప్పారట. కథానాయిక చుట్టూ తిరిగే ఆ కథ అనుష్కకు బాగా నచ్చేసిందట. అయినా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దాంతో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని, ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే స్వీటీ పెళ్లివార్త విని అప్సెట్ అయిన అభిమానులకు అవన్నీ పుకార్లే అని తేలటం వారికి మాత్రం శుభవార్తే. (ఇంగ్లీషు కథనం కోసం) -
క్లైమాక్స్ దశకు చేరుకున్న రజనీ 'లింగా'
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో జరుగుతోంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ వైటేకర్ దర్శకత్వంలో కొన్ని ముఖ్యమైన ఫైటింగ్ సీక్వెన్సులను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వైటేకర్ ప్రస్తుతం ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నారని, సినిమా చాలా బాగా వస్తోందని సినిమా యూనిట్‌కు చెందినవాళ్లు చెప్పారు. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో రెండు వారాలపాటు షూటింగ్ జరుగుతుందని, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బ్రేక్ ఉంటుందని.. అప్పుడు రజనీకాంత్, రవికుమార్ కలిసి శంకర్ తీస్తున్న 'ఐ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరవుతారు. తన సినిమా ఆడియో విడుదలకు రావాల్సిందిగా శంకర్ స్వయంగా లింగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి రజనీకాంత్, రవికుమార్‌లను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈనెల 15న జరగనుంది. సోనాక్షి సిన్హా, అనుష్క నటిస్తున్న లింగాలో.. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. రజనీ పుట్టినరోజైన డిసెంబర్ 12నే ఈ సినిమా విడుదల అవుతుందని భావిస్తున్నారు. -
దటీజ్ రజినీకాంత్
-
రజనీకాంత్ 'లింగా' షూటింగ్ వివాదం
బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కి జలాశయం వద్ద తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగా' సినిమా షూటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదానికి దారితీసింది. రాష్ట్రంలోని అతి పెద్ద జలాశయాలలో ఒకటైన ఈ జలాశయం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. దీంతో ప్రభుత్వం ఆ జలాశయం ఉన్న ప్రదేశాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జలాశయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్రజల ప్రవేశాన్ని ప్రభుత్వం నిషేధించింది. అలాంటి చోట సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదానికి దారితీసింది. సినిమా షూటింగ్లో నిత్యం వందలాది మంది పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో సినిమా చిత్రీకరణకు ఎలా అవకాశం ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నరాఉ. అనుమతి ఎవరు ఇచ్చారో తెలపాలంటూ కర్ణాటక విద్యుత్ కార్పొరేషన్ (కేపీసీ) అధికారులకు కొందరు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇది స్థానిక కేపీసీ అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. -
ఆ దేవుడు ఆశిస్తే... నేను ఆచరిస్తాను!
ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ‘లింగా’ రూపంలో మంచి బహుమతి ఇవ్వడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీ, అనుష్క, సోనాక్షీ సిన్హా నాయకా నాయికలుగా రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం మంగళూరులో చివరి షెడ్యూల్ చేస్తున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు నిరవధికంగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. ‘‘ఈ చిత్రాన్ని నా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని రజనీ ప్రకటించారు. మంగళూరు షెడ్యూల్లో పాల్గొనడానికి ఆయన చెన్నయ్ నుంచి అక్కడికెళ్లారు. అప్పుడు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తనను చుట్టుముట్టిన మీడియాతో రజనీ ఈ విధంగా చెప్పారు. ఓ పాత్రికేయుడు.. ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? అసలు ఎప్పుడు రావాలనుకుంటున్నారు?’ అని అడిగితే - ‘‘ఆ దేవుడి ఇష్టమే నా ఇష్టం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆ దేవుడు ఆశిస్తే.. నేను ఆచరిస్తాను’’ అని తనదైన స్టయిల్లో చెప్పారు రజనీ. ఆరోగ్యం గురించి అడగ్గా... ‘‘ఆ మధ్య అనారోగ్యంపాలయ్యాను. అందులోంచి క్షేమంగా బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. బాగున్నాను’’ అని రజనీ స్పష్టం చేశారు. -
మహోన్నత వ్యక్తి రజనీ
రజనీకాంత్ ప్రతిభను, ఆయన సాధనను, ఆయన అనితర సాధ్యస్థాయిని పొగడని వారుండరు. అయితే వాటికి హద్దులుంటాయి. కానీ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మాత్రం అలాంటి హద్దులను మూటకట్టి అటకెక్కించి వీర లెవల్లో మన సూపర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా లింగా చిత్రంలో రజనీ సరసన నటిస్తున్నారు. ఈమెకు దక్షిణాదిలో మొదటి చిత్రం కూడా ఇదే. లింగా చిత్రంలో రజనీకాంత్‌తో నటిస్తున్న అనుభవం గురించి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ, జీవితంలో కొందరు మహోన్నత వ్యక్తులను కలుసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అలాంటి ఒక మార్పు లింగా చిత్రంలో రజనీకాంత్‌తో కలసి నటిస్తున్నప్పుడు తనలో కలిగిందని తెలిపారు. హిందీలో సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సాహిత్ కపూర్ లాంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించానని చెప్పారు. అప్పుడు తెలియని పలు విషయాలను, రజనీకాంత్‌తో నటిస్తున్నప్పుడు తెలుసుకున్నానని వివరించారు. రజనీ మహోన్నత వ్యక్తి అని, ఆయనో విశ్వవిద్యాలయం అని కూడా చెప్పవచ్చని పొగిడారు. ఇతరులకు తెలియని పలు విషయాల గురించి రజనీ తెలుసుకున్నారని, అసలు ఆయనకు తెలియదంటూ ఏమీ లేదని చెప్పారు. రజనీతో నటించిన ప్రతి రోజు ఎంతో విలువైందన్నారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రజనీ అన్నారు. ఆయన తన అనుభవాలను చాలా తనతో పంచుకున్నారని చెప్పారు. తద్వారా తనకు ఆధ్యాత్మికానికి సంబంధించిన భక్తి భావాన్ని కల్పించారని తెలిపారు. స్థూలకాయం ఆరోగ్యకరం కాదని చాలామంది చెప్పగా విన్నానన్నారు. అయితే రజనీ చెప్పిన విధం చాలా కొత్తగా ఉందన్నారు. ఆయన చెప్పింది వింటున్నప్పుడు దేహం ఒక దే వాలయంలా అనిపించిందని అన్నారు. కెమెరాముందు రజనీకాంత్ కెమెరా వెనుక రజనీకాంత్ వేర్వేరని చెప్పారు. రజనీ కారణంగా తాను చాలా మారిపోయానని సోనాక్షి సిన్హా అంటున్నారు. మొత్తానికి లింగా చిత్రం షూటింగ్‌లోనే రజనీకాంత్ గుణగణాలను అవపోసన పట్టేసినట్లుందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. -
నాలో అనూహ్యమైన మార్పులు కలిగాయి
‘‘కొందరు మహానుభావుల్ని కలిసినప్పుడు మానసికంగా మనలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి మార్పులే నాకు కలిగాయి’’అంటున్నారు సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ రజనీకాంత్ సరసన ‘లింగా’లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనుభవాల గురించి, రజనీకాంత్ సాహచర్యంలో ఎదురైన అనుభూతుల గురించీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో ముచ్చటించారు. ‘‘సల్మాన్, అక్షయ్, అజయ్‌దేవగన్, షాహిద్‌కపూర్... ఇలా చాలామంది స్టార్లతో పనిచేశాను. కానీ... వారి వద్ద నేర్చుకోలేని ఎన్నో విషయాలను ‘లింగా’ సెట్లో నేర్చుకుంటున్నాను. రజనీ సార్‌తో పనిచేసిన రోజులన్నీ నా జీవితానికి చాలా విలువైనవి. ఆయన ఓ యూనివర్శిటీ. ఎంత నేర్చుకున్నా ఇంకా తెలీని విషయాలు ఆయన దగ్గర ఉంటాయి. రకరకాల దశల్ని దాటుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు ఆయన. వాటిలోని కొన్నింటిని చెప్పి... నాలో భక్తిభావానికి పునాదులు వేశారు. అధిక బరువు శరీరానికి మంచిది కాదన్న విషయం నాకు చాలామంది చెప్పారు. కానీ... రజనీ సార్ చెప్పే విధానం వింటే... శరీరాన్ని ఓ దేవాలయంలా భావిస్తారు ఎవరైనా. కెమెరా ముందు రజనీకీ, కెమెరా వెనుక రజనీకీ అసలు పొంతనే ఉండదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారామె. -
రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం
-
రజనీ లింగా షూటింగ్ అడ్డుకునేందుకు యత్నం
అనాజ్‌పూర్ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ సమీపంలో... తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'లింగా' సినిమా షూటింగ్‌ను అడ్డుకునేందుకు గ్రామస్తులు యత్నించారు. షూటింగ్ సందర్భంగా చెరువులో రసాయన పదార్ధాలు కలుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువులో నీరు కలుషితమవుతుందని.. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. మరోవైపు షూటింగ్ జరుపుకునేందుకు ఇరిగేషన్, గ్రామ పంచాయతీ నుంచి సర్టిఫికెట్ తీసుకున్నామని సినిమా సిబ్బంది చెప్తున్నారు. కాగా అంతకు ముందు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి షూటింగ్‌ను అడ్డకుంటామని అనాజ్ పూర్ గ్రామస్తులు యత్నించిన విషయం తెలిసిందే. కాగా రజనీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
'లింగా'లో రజనీకాంత్ డబుల్ రోల్!!
తమిళ యాక్షన్ చిత్రం 'లింగా'లో సూపర్‌స్టార్ రజనీకాంత్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఆ షూటింగులో మహా బిజీగా ఉంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒకటి జిల్లా కలెక్టర్ పాత్ర కాగా, మరొకటి ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర. అయితే ఆ రెండోపాత్ర ఏంటన్న విషయాన్ని మాత్రం రహస్యంగానే ఉంచారని ఆ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో రజనీ పక్కన నటిస్తోంది. తన స్నేహితుడి కుమార్తె కావడంతో ఆమె హీరోయిన్ అనగానే కాసేపు రజనీ కాంత్ సందిగ్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. -
రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజున లింగా చిత్రం తెరపైకి రానుందన్నది తాజా వార్త. కోచ్చడయాన్ తరువాత రజని నటిస్తున్న చిత్రం లింగా. చరిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన అందాలభామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడు దలైన సూపర్‌స్టార్ చిత్రం కోచ్చడయాన్ అభిమానులను పూర్తి సంతృప్తి పరచలేక పోయింది. లింగా చిత్రం ముత్తు, పడయప్ప చిత్రాల తరహాలో పూర్తి కమర్షియల్ చిత్రంగా రూపొందబోతుందని యూనిట్ వర్గాల మాట కాగా, ఈ లింగా చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
అత్యంత వేగవంతమైన కెమెరాతో షూటింగ్
దక్షిణాది మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘లింగా’. సూపర్‌స్టార్‌లోని అసలైన మాస్ యాంగిల్‌ని సరైన రీతిలో ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందనేది ఇండస్ట్రీ టాక్. ముత్తు, నరసింహా చిత్రాలతో రజనీకాంత్‌ని ఎవరెస్ట్ అంత ఎత్తులో చూపించిన కేఎస్ రవికుమార్ ‘లింగా’ దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఊహించనంత ఎత్తుకు చేరాయి. అందుకు తగ్గట్టే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు పాత్రలూ అత్యంత శక్తిమంతంగా ఉంటాయని టాక్. ‘నరసింహా’ను మించే స్థాయిలో ఇందులో రజనీ కనిపించబోతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు పండుగ చేసుకునేలా సూపర్‌స్టార్ గెటప్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీలో నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు ఏకధాటిగా జరుగనుంది. ప్రస్తుతం రజనీకాంత్ పాల్గొనగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ లీ విట్టేకర్ నేతృత్వంలో ఈ పోరాట చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ‘ఫాంటమ్ ఫ్లెక్స్ ఫోర్ కె’ అనే అత్యంత వేగవంతమైన కెమెరాను ఈ ఫైట్ సీక్వెన్స్‌కి ఉపయోగిస్తున్నారు. అయితే... ఈ కెమెరాను ఈ ఒక్క ఫైట్‌కే ఉపయోగిస్తారా! లేక ఇతర సన్నివేశాలకు కూడా ఉపయోగిస్తారా! అనేది తెలియాల్సి ఉంది. భారతీయ సినిమాకు ఈ కెమెరాను ఉపయోగించడం ఇదే ప్రథమం. సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: రత్నవేలు, నిర్మాత: రాక్‌లైన్ వెంకటేశ్. -
ఆయనంటే భయపడ్డా...
దక్షిణాదిలో కాలు మోపుతూనే సోనాక్షి సిన్హా మంచి అవకాశమే సంపాదించింది. రజనీకాంత్ తాజా సినిమా లింగాలో హీరోయిన్గా ఎంపికయింది. దక్షిణాది సూపర్‌స్టార్‌తో నటించాలంటే మొదట్లో చాలా భయమేసిందని చెప్పింది. ‘ఆయన అద్భుతమైన మనిషి. రజిని సినిమాలు నేను ఎక్కువగా చూడలేదు కానీ ‘హమ్’ సినిమా నుంచి ఆయన తెలుసు. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా వినమ్రంగా ఉండడం రజిని గొప్పతనం’ అని వివరించింది. లింగా షూటింగ్ తొలి రోజున సోనాక్షి రజిని కలుసుకొని ‘మీతో కలసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉన్నా.. కాస్త కంగారుగానూ ఉంద’ని చెప్పింది. దీనికి రజనీ నవ్వేసి ‘నీతో నటిస్తున్నందుకు నేను భయపడాలి. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడి (శత్రుఘన్ సిన్హా) కూతురివి’ అంటూ నవ్వేశాడు. దీంతో ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. ఇక సోనాక్షి అప్పటి నుంచి షూటింగులో ఇబ్బందిపడడం లేదు. దక్షిణాది తొలి సినిమాలోనే రజిని సరసన నటించడం కంటే గొప్ప విషయం ఏమీ లేదని ఈ బ్యూటీ చాలా సంబరపడింది. త్వరలో విడుదల కాబోతున్న ‘హాలిడే’ సినిమా ప్రచారం కోసం సోనాక్షి ప్రస్తుతం బిజీగా గడుపుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరో. రజినిలోని వృత్తినైపుణ్యం, వినమ్రత వల్లే ప్రేక్షకులుగా దగ్గర కాగలిగారని చెప్పింది. షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన చుట్టూ అభిమానులంతా గుమిగూడి సందడి చేస్తారని వివరించింది. కేఎస్ రవికుమార్ లింగాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క, జగపతిబాబు, వడివేలు, లారెన్ ఇర్విన్ అనే పాశ్చాత్య నటి ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు. అన్నట్టు. నయనతార కూడా ఒకటి రెండు సీన్లలో మెరిసిపోనుందని లింగా యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు. -
డబుల్ ధమాకా
అదృష్టం నటి అనుష్కను శనిలా వెంటాడుతోంది. శని, పడితే అంత సులభంగా వదలదంటారు. అలాగే ప్రస్తుతం అదృష్టం అనుష్కను తరుముతోంది. సాధారణంగా రెండు భాషల్లో ప్రాచుర్యం పొందిన హీరోయిన్లు తరువాత కాలంలో ఒకే భాషకు పరిమితమవుతుంటారు. అరయితే అనుష్కకు ఇది వర్తించదు. ఎందుకంటే ఈ బ్యూటీ నటించే ప్రతి సినిమా తమిళం, తెలుగు రెండు భాషల్లోను విడుదలవుతుంది. ప్రస్తుతం అనుష్క నటించే చిత్రాలన్నీ అలాంటి భారీ క్రేజీ చిత్రాలే కావడం విశేషం. ఇంతకు ముందు అనుష్క ఏ భాషలో నటించిన చిత్రాలు ఆ భాషకే పరిమితం అయ్యాయి. అయితే అరుంధతి చిత్రం తరువాత పరిస్థితి మారింది. తమిళం, తెలుగు భాషల్లో ఈమె క్రేజీ అనూహ్యంగా పెరిగింది. అనుష్క ఒక్క భాషలో నటించిన చిత్రం కచ్చితంగా మరో భాషలోను విడుదలవుతుంది. ఇక ఇప్పడయితే ఆమె నటిస్తున్న చిత్రాలన్ని ద్విభాషా చిత్రాలే. అలాగే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు హీరోలతో రొమాన్స్ చేసే చిత్రాల్లోనూ నటిస్తూ ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటుకుంటున్నారు. రుద్రమదేవి అనే హిస్టారికల్ మూవీలో రాణి రుద్రమాదేవిగా తన నట విశ్వరూపం ప్రవర్తిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరించనుంది. మరో చరిత్రాత్మక కథా చిత్రం బాహుబలి. ఈ చిత్రంలోను అనుష్క వీరప్రతాపాలను ప్రదర్శించనున్నారు. ఇది కూడా బహుభాషా చిత్రమే. తమిళంలో ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్‌తో తొలిసారి జతకడుతున్న చిత్రం లింగా. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. అనుష్క తొలి సారిగా జతకడుతున్న మరో హీరో అజిత్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో మరో హీరోయిన్గా త్రిష నటించడం గమనార్హం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఇలా అనుష్క ప్రస్తుతం డబుల్ ధమాకాతో యమా ఖుషీలో ఉన్నారు. ఈనాలుగు చిత్రాల్లో తొలుత రుద్రమాదేవి, ఆ తరువాత రజనీకాంత్ లింగా ఆపై అజిత్, ప్రభాస్ చిత్రాలు వరుసగా తెరపైకి రానున్నట్లు సమాచారం. -
రజనీకాంత్‌తో ఐటమ్ సాంగ్
రజనీకాంత్ సినిమాలో తమ పేరు రావడమే అదృష్టంగా భావిస్తుంటారు కథానాయికలు. ఆయన సరసన ఒక్క సినిమాలో నటించినా పంట పండినట్టే... అనుకుంటుంటారు. కానీ... నయనతార మాత్రం సూపర్‌స్టార్‌తో సినిమాల మీద సినిమాలు చేసేస్తూ, ఇటీవలి కాలంలో ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన నాయికగా రికార్డుకెక్కేస్తోంది. నయనతార కెరీర్లో తొలి బ్రేక్ - ‘చంద్రముఖి’. ఆ సినిమాలో రజనీతో జతకట్టి రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది నయన. ఆమెతో కలసి నటిస్తే కలిసొస్తోందని అనుకున్నారో ఏమో కానీ... రజనీ తన తర్వాతి సినిమా ‘శివాజీ’లో కూడా నయనతారతో ఓ పాటలో కాలు కదిపారు. ఆ వెంటనే వచ్చిన ‘కథానాయకుడు’ (తమిళంలో ‘కుచేలన్’)లో కూడా రజనీతో జతకట్టేసింది నయన. సూపర్‌స్టార్‌తో కలిసి ఇన్ని సినిమాలు చేసిన ఘనత నేటి తారల్లో నయనతారది మాత్రమే. ఇప్పుడు ఈ వివరణ అంతా దేనికంటే... త్వరలో మరోసారి రజనీ-నయన తెరపై స్టెప్పులేయనున్నారు. రజనీ సరసన అనుష్క, సోనాక్షీ సిన్హా నాయికలుగా నటిస్తున్న ‘లింగా’ చిత్రంలో ఓ కీలక సన్నివేశంలో వచ్చే ఐటమ్‌సాంగ్‌లో నయన నర్తించనున్నట్లు చెన్నై సమాచారం. ఆమె ఐటమ్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. -
మైసూరులో సూపర్ స్టార్ లింగ
చాముండేశ్వరి కొండపై సినిమా ముహూర్త కార్యక్రమం మైసూరు, న్యూస్‌లైన్ : అక్షయ తృతీయ రోజున బ్రహ్మీ ముహూర్త సమయంలో మైసూరులోని చాముండీకొండపై వెలిసిన చాముండేశ్వరీ మాతను సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సారధ్యంలోని రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీకాంత్ హీరోగా నటించనున్న ‘లింగ’ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని శుక్రవారం మైసూరులో నిర్వహించారు. ఈ ముహూర్త కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్, ఆయన సతీమణి సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ...మండ్య, మేలుకొటే, మైసూరు ప్రాంతాల్లో మే11 వరకు చిత్ర నిర్మాణం జరగనుందని తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు హీరోయిన్లు సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి ఈ షూటింగ్లో పాల్గొననున్నారని వెల్లడించారు. రజనీ సరికొత్త స్టైల్ : గురువారం రాత్రి మైసూరుకు చేరుకున్న రజనీకాంత్ శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో చాముండేశ్వరీ కొండపైకి చేరుకున్నారు. ఎటువంటి మేకప్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా కొండపైకి వచ్చిన రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో పోలీసుల సహాయంతో ఆయన చాముండేశ్వరీ మాత ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం తెల్లటి పంచ, చొక్కా వేసుకొని సన్నపాటి మీసాలు, విగ్‌తో సరికొత్త స్టైల్లో బయటికి వచ్చిన రజనీని చూసిన అభిమానులు ఇదో కొత్త స్టైల్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక సినిమా విజయవంతం అవ్వాలని ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్, సుమలత ఆకాంక్షించారు. -
అనుష్క, సోనాక్షిలతో రజనీకాంత్ 'లింగా'
మైసూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన విక్రమ సింహ (తమిళంలో కొచ్చాడయాన్) ఇంకా విడుదల కాకముందే మరో సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా రజనీ కొత్తసినిమా 'లింగా' ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రజనీతో పాటు సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పాల్గొన్నారు. తెల్ల సిల్కు లుంగీ, తెల్ల చొక్కా వేసుకుని వచ్చిన రజనీకాంత్‌తో పాటు ఆయన స్నేహితుడు, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్, ఆయన సతీమణి సుమలత కూడా పూజా కార్యక్రమానికి వచ్చారు. మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో ఈ పూజలు జరిగాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని సినిమా వర్గాలు తెలిపాయి. సినిమాలో రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క ఇద్దరూ నటించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. -
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ లింగ?
ఎవరెస్ట్ అంత ఇమేజ్ ఉన్న హీరో రజనీకాంత్. ‘నరసింహ’ చిత్రంలో ఆ స్థాయిలో ఆయన పాత్రను ఆవిష్కరించారు దర్శకుడు కేఎస్ రవికుమార్. తర్వాత వారిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ వారిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతుండటం రజనీ అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకునికి కూడా ఆనందం కలిగించే వార్తే. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క కథానాయికలుగా నటించనున్నారు. అయితే... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇందులో రజనీకాంత్ స్వాతంత్య్ర సమరయోధునిగా, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘లింగ’ అనే టైటిల్ బావుంటుందని రజనీ, కేఎస్ రవికుమార్ అనుకుంటున్నారట. స్వతహాగా రజనీ శివభక్తుడు. పైగా ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరు ‘లింగ’. కథ రీత్యా కూడా ఆ పేరు కరెక్ట్‌గా సరిపోతుందని రజనీ, కేఎస్లు భావించారట. అందుకే... ‘లింగ’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కొలవరి’ఫేం అనిరుథ్ సంగీతం అందించనున్నట్లు వినికిడి. మాస్ ప్రేక్షకులకు మెచ్చేలా ఇందులో రజనీ పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. ‘రోబో’కి ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు.