Mayank Yadav
-
కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..?
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ రాహుల్ స్ట్రయిక్‌రేట్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత మూడు సీజన్లలో జట్టు పేలవ ప్రదర్శనకు రాహుల్ స్ట్రయిక్ రేట్ ప్రధాన కారణమని మేనేజ్మెంట్ భావిస్తుందట.రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్సీ పగ్గాలు నికోలస్ పూరన్‌కు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్ఎస్జీ యాజమాన్యం పూరన్‌తో పాటు మరో ఇద్దరిని రిటైన్ చేసుకోనుందని సమాచారం. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్‌ల కోసం భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. మయాంక్‌కు పారితోషికం కింద దాదాపు రూ. 14 కోట్లు దక్కవచ్చని అంచనా. అన్క్యాప్డ్ ప్లేయర్ల కోటాలో ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను కూడా రిటైన్ చేసుకోనున్నట్లు సమాచారం.కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరిన లక్నో.. ఈ ఏడాది లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డికి బంపరాఫర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో సత్తా చాటిన యువ క్రికెటర్లు మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డిల రాత మారిపోయింది. ఇటీవలే వీరిద్దరు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్, నితీశ్ సెలక్టర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.కివీస్‌తో సిరీస్‌కు...ఈ సిరీస్‌లో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నితీశ్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్(34 బంతుల్లో 74)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికచేశారు సెలక్టర్లు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ వీరికి మరో శుభవార్త అందించాడు. కివీస్‌తో సిరీస్‌లో వీరిని టెస్టుల్లో ఆడించే ఉద్దేశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారో? లేదో?‘‘యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను మేము గుర్తించాం. అయితే, వాళ్లు ఎక్కువగా రెడ్‌బాల్ క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ వారిలోని నైపుణ్యాలకు మరింత పదునుపెట్టేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. అందుకే మరింత నిశితంగా పరిశీలించేందుకు వీలుగా రిజ్వర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాం.తమకు దొరికిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు. టెస్టు క్రికెట్ ఆడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. మా బెంచ్ స్ట్రెంత్‌ను పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.గాయాల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువ బ్యాకప్ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సిరీస్‌లో వారు మాతో పాటే ప్రయాణిస్తారు కాబట్టి.. దగ్గరగా గమనిస్తాం. వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయగలరా? జట్టుకు ఎంతమేర ఉపయోగపడతారు? అన్న అంశాలు పరిశీలిస్తాం.ముఖ్యంగా ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. మా దగ్గర ఇప్పుడు 8- 9 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలోనూ వీలైనంత మంది అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉందివీరిలో చాలా మంది దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ఆడారు. ఇప్పుడు ఈ యువ ఆటగాళ్లను కివీస్‌తో టెస్టులకు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేయడానికి కారణం.. వాళ్లను దగ్గరగా గమనించి ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉండటమే’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.కాగా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, పేసర్ హర్షిత్ రాణా న్యూజిలాండ్ టెస్టులకు ట్రావెలింగ్ రిజర్వులుగా ఉన్నారు. కాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున వికెట్లు పడగొట్టిన మయాంక్ గాయం కారణంగా ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం, జాతీయ క్రికెట్ అకాడమీలో చేరి పునరావాసం పొందాడు. తర్వాత నేరుగా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరడంలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడూ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వగలిగాడు.చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ 💬💬 Our focus is to improve and better our performance.#TeamIndia Captain Rohit Sharma ahead of the #INDvNZ Test series 👌👌@IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/mJMOvVgVDw— BCCI (@BCCI) October 15, 2024 -
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్
ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.కాస్త ఆందోళనగానే ఉన్నాఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్‌కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.డైరెక్ట్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.అందుకే స్లో బాల్స్ వేశానుకాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్‌లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.ఆందోళన చెందకుండా కూల్‌గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20వేదిక: శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)టీమిండియా స్కోరు: 132/3 (11.5)ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(3/14).చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం
బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టి20లు ఆడిన 116వ, 117వ ఆటగాళ్లుగా నిలిచారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చేతుల మీదుగా నితీశ్... టీమిండియా మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ క్యాప్‌లు అందుకున్నారు. వైజాగ్‌కు చెందిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డికి ఎట్టకేలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ఆకట్టుకోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా... చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా నితీశ్ ఆ టూర్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నితీశ్ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల మయాంక్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఐపీఎల్–2024 సీజన్లో తన ఎక్స్‌ప్రెస్ బౌలింగ్‌తో చెలరేగాడు. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో అతను 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. -
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్..
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్ సాధించాడు. -
IND Vs BAN: బంగ్లాతో తొలి టీ20.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్‌లను అందుకున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.తుది జట్లుబంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాంభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్లు వాళ్లే: సూర్య
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో ముందుకు వెళ్లనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. అంతేకాదు.. మయాంక్ యాదవ్ ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.సూర్యకుమార్ సారథ్యంలోకాగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో చెన్నై, కాన్పూర్ టెస్టుల్లో గెలుపొందిన రోహిత్ సేన.. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టీ20లకు సిద్దమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 మ్యాచ్‌కు సరిపోయే పిచ్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికల గురించి వెల్లడించాడు. ‘‘ఈసారి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇక మేము ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. అయితే, వికెట్ మరీ లోగా, స్లోగా ఏమీ లేదు. కొంతమంది మూడు రోజులు కూడా ఇక్కడ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.వికెట్లో ఎవరికీ పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. టీ20 మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ ఇది. అయితే, మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే అనుకుంటున్నాం’’ అని సూర్య తెలిపాడు. ఇక తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తావనకు రాగా.. అతడిని ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా సూర్యకుమార్ అభివర్ణించాడు.అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‘‘ప్రస్తుతం జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఇక మయాంక్ విషయానికొస్తే.. అతడు ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, మయాంక్ ఆట తీరు ఎలా ఉంటుందో అందరూ ఇప్పటికే చూశారు.అతడి రాక వల్ల జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడి ఎక్స్ ట్రా పేస్‌ను మనం చూశాము. కాబట్టి మయాంక్‌పైనే అందరి దృష్టి ఉంది. జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మయాంక్ జట్టుతో చేరడం శుభసూచకం. టీమిండియాకు అతడి వల్లే మేలు జరుగుతుందని భావిస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకునికాగా ఈ ఏడాది ఐపీఎల్-2024లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ఆటలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: ‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’ 🗣️ It's a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o— BCCI (@BCCI) October 5, 2024 -
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు: మయాంక్ యాదవ్
తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.లక్నోకు ఆడిన మయాంక్టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.స్పీడ్‌కు గాయాల బ్రేక్వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మయాంక్‌ను ఎంపిక చేశారు.గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడుఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..నన్ను నేను నిరూపించుకున్నానుఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అరంగేట్రం ఖాయమే!వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే! లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా స్టార్లంతా రెండు నెలలు ఆటకు దూరం -
బంగ్లాతో టీ20లు.. టీమిండియాలోకి పేస్ గన్ ఎంట్రీ!
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్టలక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్‌టాపిక్‌గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు!అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు.టీమిండియా సెలక్టర్ల ఆరాఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.గంభీర్, మోర్కెల్లకు తెలుసుఅయినా.. మయాంక్‌ను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉన్న సమయంలో మయాంక్‌ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్‌తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్ -
అతడు జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు: జై షా
లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం, ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి మరింత సమయం పట్టనుంది. ఐపీఎల్-2024 సీజన్లో తన పేస్ బౌలింగ్‌తో మయాంక్ అందరని ఆకట్టుకున్నాడు. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్.. 6.99 ఏకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో అవకాశమివ్వాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అతడి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారింది. తరచుగా గాయాల బారిన పడుతుండటంతో మయాంక్ అరంగేట్రం ఎప్పడన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మయాంక్ డెబ్యూపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు. అతడి ఎంపికపై తను ఇప్పుడే ఏమి చెప్పలేను అని జైషా తెలిపాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు."మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే మయాంక్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.కానీ అతడొక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం అతడు ఏన్సీఎలో ఉన్నాడు. మా ఫిజియోల పర్యవేక్షణలో అతడు తన పునరావాసాన్ని కొనసాగిస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. -
కోలుకున్న పేస్‌గన్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ శుభవార్త పంచుకున్నాడు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన ఈ యంగ్ పేస్‌గన్.. వరుసగా రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు.రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యూపీ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.అయితే, దురదృష్టవశాత్తూ పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు మయాంక్ యాదవ్. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.వందశాతం ఫిట్నెస్ సాధించాలంటేఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నా చికిత్స పూర్తైంది. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపశమనం లభించింది.పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, వందశాతం ఫిట్నెస్ సాధించాలంటే మరికొంత కాలం ఇక్కడ ఉండక తప్పదని తెలుసు.గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం సానుకూలాంశం. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రీఎంట్రీ అప్పుడే కాగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌పై దృష్టి సారించిన సెలక్టర్లు అతడి పునరాగమనం కోసం వేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీ- 2024 ద్వారా ఈ బౌలర్ రీఎంట్రీ ఇస్తే.. ఆ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో చోటు ఇచ్చే అంశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అరంగేట్రం ఆ తర్వాతే ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘మయాంక్ యాదవ్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఫాస్ట్‌బౌలర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వేర్వేరు ఫార్మాట్లలో ఆడించాలనుకుంటున్నాం.అక్కడ ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే టీమిండియా అరంగేట్రం గురించి స్పష్టత వస్తుంది. అంతేతప్ప హడావుడిగా జాతీయ జట్టులోకి పంపితే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా తదుపరి శ్రీలంకతో తలపడనుంది.చదవండి: అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..! -
భారత క్రికెట్‌కు శుభవార్త.. తిరిగి రంగంలోని దిగిన ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సందర్భంగా గాయపడిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తిరిగి రంగంలోకి దిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అనంరతం మయాంక్ ఇవాళే ప్రాక్టీస్ షురూ చేశాడు. మయాంక్ నెట్స్‌లో సాధన చేస్తున్న దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.Mayank Yadav has been gearing up for the tour against Sri Lanka and Zimbabwe in July. pic.twitter.com/PZ7WS8mFo9— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2024గత సీజన్‌తోనే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ ఆడిన 4 నాలుగు మ్యాచ్‌ల్లో తనేంటో రుజువు చేసుకున్నాడు. తన ప్రధాన అస్త్రమైన పేస్‌తో భారత క్రికెట్లో హాట్ టాపిక్ అయ్యాడు. దాదాపుగా ప్రతి బంతిని 150 కిమీ పైగా వేగంతో సంధించగల సత్తా ఉన్న మయాంక్.. తన పేస్ పదునుతో ప్రత్యర్ధులను గడగడలాడించాడు.తన అరంగేట్రం మ్యాచ్‌లోనే (పంజాబ్‌పై (4-0-27-3)) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మయాంక్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో (4-0-14-3) మరింత రెచ్చిపోచి, వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సీజన్లో ముగిసే లోపు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటాడనుకున్న తరుణంలో మాయంక్ గాయపడ్డాడు. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన మయాంక్.. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అతను తిరిగి బరిలోకి దిగలేదు.తాజాగా గాయం పూర్తిగా నయం కావడంతో మయాంక్ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వచ్చే నెల (జులై) భారత జట్టు శ్రీలంక, జింబాబ్వే పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. భారత సెలెక్టర్లు మయాంక్ పేరును పరిశీలించవచ్చని తెలుస్తుంది. -
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో యష్ ఠాకూర్ వచ్చాడు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది .తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ -
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. ప్రభ్‌సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్‌తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది. -
IPL 2024: లక్నో, ముంబై మ్యాచ్.. సంచలన ఫాస్ట్ బౌలర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లక్నో జట్టులో మరిన్ని మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అర్షిన్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ముంబై విషయానికొస్తే.. లూక్ వుడ్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో ఈ మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ముంబై ప్లే ఆఫ్స్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ -
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఏప్రిల్ 30న ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది.గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షను మయాంక్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు.దీంతో అతడు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు యాదవ్ అందుబాటులో ఉండనున్నాడు. "మయాంక్ యాదవ్ ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు అన్ని రకాల ఫిట్నెస్ టెస్ట్‌లను క్లియర్ చేశాడు. మాకు ఇది నిజంగా గుడ్ న్యూస్. మంగళవారం జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని ఉపయోగించే ఛాన్స్ ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మయాంక్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 155 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను వణికించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మయాంక్ ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు కూడా కలిసిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. మయాంక్‌ను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేసే అవకాశముంది. -
T20 WC: కోహ్లి, హార్దిక్ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్!
ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నోఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.తన జట్టులో రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు.అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్‌లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.ఊహించని ఆటగాళ్లకు చోటుఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్‌కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్ -
Mayank: అభిమానులకు బ్యాడ్‌న్యూస్: ఇప్పట్లో కష్టమే!
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్‌కు లక్నో యుంగ్ స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్‌ను ఫిట్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్‌లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్నెస్గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు. లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్‌లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్!! చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోకు బిగ్ షాక్
ఐపీఎల్ 2024 సీజన్‌తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నారని తెలుస్తుంది. వీరిద్దరు గాయాల బారిన పడినట్లు సమాచారం. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో.. మొహిసిన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఎల్ఎస్జీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా పొత్తి కడుపు నొప్పితో విలవిలలాడిన మయాంక్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మయాంక్‌ను వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. గత మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన మొహిసిన్.. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత సీజన్లో మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి రెండింట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉండగా మయాంక్ గాయపడటం ఎల్ఎస్జీని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు మొహిసిన్ సైతం ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొహిసిన్ ఎల్ఎస్జీ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్, మొహిసిన్ల గైర్హాజరీలో లక్నో తరఫున మరో యువ పేసర్ చెలరేగిపోయాడు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. ఈ ప్రదర్శన కారణంగా యశ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, జట్టులో ప్రతి ఆటగాడు తలో చేయి వేస్తుండటంతో లక్నో ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమి మినహా లక్నో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. లక్నో ఏప్రిల్ 12న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానంలో జరుగనుంది. -
'అతడు బ్యాటర్లను భయపెడుతున్నాడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు'
లక్నో సూపర్ జెయింట్స్ యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మయాంక్.. దురదృష్టవశాత్తు ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి యాదవ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కానిట్లు తెలుస్తోంది. అతడు రాబోయే మ్యాచ్‌ల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన మయాంక్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చేరాడు. మయాంక్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు. "మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్నాడు. అతడి బౌలింగ్ స్పీడ్‌కు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఆడేందుకు ఇబ్బంది పడతున్నాడు. అతడు భవిష్యత్తులో భారత జట్టుకు ముఖ చిత్రంగా మారుతాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పుడు సెలక్టర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు బంతిని షేర్ చేసుకునే మూడో పేసర్ కోసం వెతుకుతున్నారు. కాబట్టి షమీ స్ధానాన్ని వరల్డ్‌కప్ జట్టులో మయాంక్‌తో భర్తీ చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ యాదవ్‌లో ఉన్నాయి. అతడు ప్రస్తుతం ఆడుతున్నది వేరే ఫార్మాట్ అయితే నేను కాస్త ఆలోచించి నా నిర్ణయాన్ని వెల్లడించేవాడిని. కానీ ఐపీఎల్ అనే అనేది ఒక మెగా వేదిక. ఇక్కడ ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. ప్రతి గేమ్‌లో ఒత్తిడి ఉంటుంది. కానీ మయాంక్ మాత్రం ఒత్తడిని తట్టుకుని మరి నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడికి వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తున్నాని" ప్రసాద్ రేవ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మయాంక్‌కు గాయం.. లక్నో హీరోగా యశ్! ఎవరీ యంగ్ పేసర్?
ఒకరి దురదృష్టం.. మరొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో! అరంగేట్రంలోనే సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించి.. రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ పదిహేడేళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్పీడ్‌గన్. బుల్లెట్ వేగంతో బంతులు సంధించే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ లక్నోను గెలిపించి.. హ్యాట్రిక్ అందుకుంటాడని అభిమానులు భావించారు. కానీ దురదృష్టవవాత్తూ పక్కటెముల నొప్పి కారణంగా మయాంక్ యాదవ్ ఒక్క ఓవర్ మాత్రమే పూర్తి చేసి.. ఆ తర్వాత మైదానం వీడాడు. అతడి స్థానంలో వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం దక్కించుకున్న యశ్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్-2024లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి శుబ్‌మన్ గిల్(19), విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12), రాహుల్ తెవాటియా(30), రషీద్ ఖాన్(0) వికెట్లు దక్కించుకున్నాడు. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఎవరీ యశ్ ఠాకూర్? కోల్‌కతాలో 1998లో జన్మించిన యశ్ ఠాకూర్.. దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రైటార్మ్ మీడియం పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు. రూ. 45 లక్షలకు కొనుగోలు ఐపీఎల్-2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యశ్ ఠాకూర్‌ను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి యశ్ 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇది నీ రోజు అని చెప్పాడు ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి యశ్ ఠాకూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. గిల్‌ను అవుట్ చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కేఎల్ రాహుల్ సర్ సలహాలతో వ్యూహాలను సరిగ్గా అమలు చేయగలిగాను. దురదృష్టవశాత్తూ మయాంక్ గాయపడ్డాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ నా దగ్గరికి వచ్చి ఇది నీ రోజు.. ఉపయోగించుకో అని మోటివేట్ చేశాడు’’ అని యశ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు. 5️⃣-fer ✅ Victory ✅ Celebration 🥳✅#LSGvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/21U2dH6t2H — JioCinema (@JioCinema) April 7, 2024 లక్నో వర్సెస్ గుజరాత్ స్కోర్లు: ►వేదిక: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 163/5 (20) ►గుజరాత్ స్కోరు: 130 (18.5). ►ఫలితం: 33 పరుగుల తేడాతో లక్నో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశ్ ఠాకూర్(5/30). చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్ -
ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు.. చాలా సంతోషంగా ఉంది: మయాంక్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మయాంక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన మయాంక్.. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లలో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తమ సొంత గ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ జట్టు అభిమానులు మాత్రం తనను ఎంతగానో సపోర్ట్ చేశారని మయాంక్ తెలిపాడు. "జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా చివరి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. ఆర్సీబీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులు నన్ను సపోర్ట్ చేశారు. నా స్పెల్ తర్వాత, నేను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూ నన్ను ఉత్సాహపరిచారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని" మయాంక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
త్వరలోనే టీమిండియాకు ఆడతాడు.. నాన్ వెజ్ మానేశాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో తనదైన ముద్ర వేస్తున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్. పంజాబ్ కింగ్స్‌తో మ్యాఛ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ ఫాస్ట్‌బౌలర్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన విషయం తెలిసిందే. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించిన ఈ రైటార్మ్ పేసర్.. 3/27తో సత్తా చాటాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు తీయడమే గాకుండా.. ఐపీఎల్లో గంటకు 155 KMPH కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన నాలుగో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. వరుసగా తాను ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతిభను నమ్ముకున్న 21 ఏళ్ల యంగ్ స్పీడ్‌గన్.. టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యం అంటున్నాడు. మయాంక్ యాదవ్ తల్లిదండ్రులు సైతం తమ కుమారుడు ఏదో ఒకరోజు కచ్చితంగా భారత జట్టుకు ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వందకు వంద శాతం.. త్వరలోనే నా కుమారుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేయడమే కాదు.. మెరుగ్గా రాణిస్తాడు కూడా! ఈ విషయంలో నా కంటే మయాంక్ వాళ్ల నాన్న ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మయాంక్ ప్రదర్శన చూసి భారత జట్టుకు ఆడితే బాగుంటుంది అంటున్నారు. కానీ వాళ్ల నాన్న అయితే రెండేళ్ల క్రితమే ఈ మాట అన్నారు. ఒకవేళ మయాంక్ గనుక గాయపడకపోయి ఉంటే కచ్చితంగా వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేవాడని ఆయన అంటూ ఉంటారు’’ అని మయాంక్ తల్లి మమతా యాదవ్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఇక మయాంక్ డైట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గతంలో నాన్ వెజ్ తినేవాడు. అయితే, ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్ మాత్రమే తింటున్నాడు. తన డైట్ చార్ట్‌కు అనుగుణంగా ఏం కావాలని కోరితే అదే తయారు చేసి ఇస్తాం. మరీ అంత ప్రత్యేకంగా ఏమీ తినడు. పప్పు, రోటి, అన్నం, పాలు, కూరగాయలు తన ఆహారంలో భాగం. నాన్ వెజ్ మానేయడానికి మయాంక్ రెండు కారణాలు చెప్పాడు. ఒకటి.. తను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టానన్నాడు. రెండు.. తన శరీరానికి నాన్ వెజ్ పడటం లేదని చెప్పాడు’’ అని మమతా యాదవ్ పేర్కొన్నారు. ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా లక్నో తదుపరి ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా మయాంక్ తిరిగి యాక్షన్‌లో దిగనున్నాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });