nitish kumar
-
Video: ప్రధాని మోదీ కాళ్లు మొక్కబోయిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్‌కు కరచాలనం అందించారు.అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్‌లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లుBihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNewsFollow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024 -
ముఖ్యమంత్రి చేతులు జోడించి వేడుకున్నా.. మరోసారి ఆ తప్పు చేయం
బీహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీష్ కుమార్.. బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీపై తేజస్వీ యాదవ్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.నితీష్‌కుమార్‌కు విశ్వసనీయత లేదు. ఆయన చర్మిషా తగ్గింది. ఇప్పటికే మద్దతు కోరి రెండుసార్లు మా వద్దకు వచ్చారు. సపోర్ట్ చేయమని చేతులు జోడించి వేడుకున్నారు. మద్దతు ఇచ్చాం. కానీ ఈ సారి ఆ తప్పు చేయం’అని చెప్పారు. భవిష్యత్తులో నితీష్ కుమార్‌తో చేతులు కలిపే అవకాశం గురించి అడిగినప్పుడు పార్టీ మరోసారి ఆ తప్పు చేయదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : ట్రంప్ దేశాన్ని అమ్మేశారుబీహార్లో నితీష్ కుమార్ విశ్వసనీయత, ప్రభావం ముగిసింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వాటిని నిర్మూలించే సామర్ధ్యం సీఎం నితీష్ కుమార్లో లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తరచూ పొత్తులు మారుతున్నారని యాదవ్ విమర్శించారు. నితీష్ ఆర్జేడీతో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీలో ఉన్నప్పుడు ఆర్జీడీని విమర్శిస్తారు. ఇవేం రాజకీయాలు. ఫలితమే అతని విశ్వసనీయత నాశనం అయ్యిందని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. తేజస్వీయాదవ్‌తో నితీష్ కుమార్ భేటీపైతేజస్వీయాదవ్తో నితీష్ కుమార్ భేటీపై బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది. అందులో ఎలాంటి రాజకీయాలు లేవని వెల్లడించింది. -
జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా
పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. -
నితీశ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: జనతాదళ్(యునైటెడ్)పార్టీ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 29(గురువారం) ఈ ఫిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీయూ మాజీ సభ్యుడు గోవింద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని, అంతర్గత పార్టీ మార్పులపై కోర్టు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణం లేదని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ అన్నారు. ‘‘ఈ పిటీషన్‌ను విచారించే మెరిట్ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 అధికార పరిధికి సంబంధం లేకుండా ఉంది.పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ఢిల్లీ కోర్టు పేర్కొంది. 2016, 2019, 2022 సంవత్సరాల్లో జేడీయూ నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని ప్రకటించాలని గోవింద్ యాదవ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ జేడీయూ పార్టీలోని ఒక వర్గం లేవనెత్తగా.. 2017లో ఎన్నికల సంఘం నితీశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని హైకోర్టు పరిశీలించింది. -
సీఎం నితీశ్ ఆఫీసు పేల్చేస్తా.. మెయిల్ పంపిన వ్యక్తి అరెస్టు
పాట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆఫీసును బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నితీశ్‌కుమార్ ఆఫీసు పేల్చేస్తామని అల్‌ఖైదా పేరుతో శనివారం బెదిరింపు మెయిల్ వచ్చిందని, తనిఖీలు చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. మెయిల్ పంపిన వ్యక్తి బిహార్ జిల్లాలోని బెగుసరాయ్‌కి చెందిన మహ్మద్ జాహెద్‌గా గుర్తించారు. జాహెద్ కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ఇతడు నితీశ్‌కుమార్‌కు ఎందుకు బెదిరింపు మెయిల్ పంపాడన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల బిహార్‌లో స్కూళ్లకు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్లు ఎక్కువయ్యాయి. -
సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు మాత్రం సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్ సవరణలు రాజ్యాంగ సమానత్వ నిబంధనలను ఉల్లంఘించేవని పట్నా హైకోర్టు జూన్ 20 నాటి తీర్పులో వెల్లడించింది. వెనకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ నిలుపుదల తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటాన్ని నిరాకరించింది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
ముగిసిన నీతిఆయోగ్ భేటీ.. ప్రధాని స్పీచ్ హైలైట్స్..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్ కట్ చేశారని నీతిఆయోగ్ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. -
నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ డుమ్మా.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. వికసిత్ భారత్-2047 అజెండాగా సాగుతున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.అయితే ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. కేవలం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవ్వగా.. ఆమెకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదని, మైక్ కట్ చేశారంటూ ఆరోపిస్తూ మమతా సైతం ఈ భేటీ నుంచి వాకౌట్ చేశారు.ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు. బిహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. అయితే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు ప్రత్యేక మోదాఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధానిగా అవతరించడంతో నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా వ్యవహరించింది. అయినప్పటికీ తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించడంతో నిరసనగా.. బిహార్ సీఎం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన్నట్లు సమాచారం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విభాగమైన నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రిని చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను సభ్యులుగా ఉంటారు. -
ఆయనతో పోలిస్తే చంద్రబాబు మరీ అంత వీకా?
మీడియా చేతిలో ఉంటే చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టగలిగినవారే దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజదాని నిర్మాణానికి కేంద్రం పదిహేనువేల కోట్ల రూపాయల సాయం చేయడానికి ముందుకువచ్చింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంద్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయతలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ.. అసలు విషయం తెలిశాక..ఇందులోనూ ఇంత మతలబు ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అమరావతికి కేంద్రం గ్రాంట్ గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర,రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే ఇందులోను గ్యారంటీ లేదన్న మాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించినందుకే టీడీపీ, జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవాడలకు ఇచ్చే రాయితీలు గురించి మాట వరసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్దిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహో,ఓహో అంటూ ఊదరగొట్టాయి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి. బీహారు రాష్ట్రానికి మాత్రం కేంద్రం నేరుగా 58,900 కోట్ల రూపాయల ఆర్దిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇవ్వదలచింది. అంటే అదంతా గ్రాంట్ అన్నమాట. రూపాయి అప్పుగా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోదీ ప్రభుత్వం నిలబడడం కష్టం. అయినా నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అంతకు మించిన సాయాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పుకు సాయం చేస్తామని అన్నారు. ఎక్కడ ఉంది బలహీనత. కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా?లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా?. 2014-19 టరమ్ లో తొలుత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఆనాటి ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. దానిని చంద్రబాబు స్వాగతించారు. ఆ తర్వాత కాలంలోమళ్లీ ప్రత్యేక హోదానే కావాలన్నారు. అది వేరే సంగతి.ప్యాకేజీ కూడా అప్పట్లో రుణసాయం కిందే ఇవ్వచూపారు. దానికే చంద్రబాబు అప్పట్లో అంగీకరించడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా అదేరీతిలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే అది అప్పే అని తేల్చి చెప్పారు. జనం అంతా ఏపీకి పప్పన్నం లాంటి సాయం వచ్చిందని అనుకుంటే అది కాస్త అప్పన్నం అని తేలిపోయింది. ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడింగ్ పెట్టిందో చూడండి. ‘‘రాజధానికి రాజసం’’ అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకున్నారు. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ‘‘హ్యాపీ ఏపీ’’ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టం అయితే ఇలా..అదే జగన్ ప్రభుత్వం చేస్తే అప్పుల చిప్ప అని హెడింగ్ పెట్టేవారు. అయితే ఇక్కడ చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనదే. పదిహేనువేల కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా ,ముప్పై ఏళ్లతర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అంటే అప్పటివరకు ఏపీ ప్రజల నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా!. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే ఈ అప్పులకు కేంద్రం పూచికత్తు ఇస్తుందని అన్నారు. నిజానికి ఏ విదేశీరుణానికి అయినా కేంద్రం గ్యారంటీలు ఇస్తుందన్నది తెలిసిందే.గతంలో ప్రపంచ బ్యాంక్ ఇదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నో చెప్పింది.దానికి కారణం అది పర్యావరణ నియమాలకువ్యతిరేకంగా ఉండడం,కొందరు రైతులు నిరసనలు తెలుపుతుండడం. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు ఉవాచ. మరి జగన్ ప్రభుత్వంపై తెగ ఆడిపోసుకున్నారు కదా? అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్ని అయినా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కునిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట.అంటే అది ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తెల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏమి చేయాలి!. పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా?అదేమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ నిర్మలా సీతారామన్ అనడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని ఆయన అంటు్నారు.చంద్రబాబు వీటన్నిటిపైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం,పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన అభివృద్దికి దృష్టి సారించినందుకు మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏమి సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు. .. దీనిని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్దం అవుతుంది.ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు.వారు ఇచ్చిందే మహా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కాకపోతే ఏపీ ప్రజలను తనకు ఉన్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి మాత్రం యత్నించారు. అబద్దపు వాగ్దానాలనువిని ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా? అన్నది వారి విశ్వాసం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
బీహార్ కు స్పెషల్ స్టేటస్ పై కేంద్రం క్లారిటీ..!
-
బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్ అధికార పార్టీ జేడీయూకి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, అలాగే ఒడిశా కోసం బీజేడీ డిమాండ్ చేశాయి.The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration. The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz— ANI (@ANI) July 22, 2024అయితే సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్లో స్పందించింది. ఈ సందర్భంగా బిహార్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. దీంతో బిహార్‌కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.ఇక పంజక్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే..👉పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.👉తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.👉అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి 👉ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి 👉అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది. -
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్‌కు పార్టీ నేత విజ్ఞప్తి
శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్‌కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు. ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు. -
‘కావాలంటే కాళ్లు మొక్కుతా’.. ఇంజనీర్‌పై బిహార్ సీఎం అసహనం
పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా 4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్ తీవ్ర అసహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ ఇచ్చారు. దీంతో సీఎం నితీష్ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK— IANS (@ians_india) July 10, 2024 ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినట్లు బిహార్ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. -
నితీష్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు: జేడీయూ
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భూజాలపై వేసుకొని నడిపించారని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.నితీష్ రాజకీయాల్లో పడిపోతున్నారని అనుకున్న ప్రతీసారి అతను తన అద్భుతమైన పనితనంలో పునరాగమనం చేసి అందరిని ఆశ్యర్యపరుస్తుంటారని తెలిపారు. నితీష్‌పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని చెప్పేందేకు లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్'గా అవతరించారు.'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్రతిపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు.మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'. ఆయన అన్నారు. -
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 17 రోజుల్లో 12వ ఘటన
పాట్నా: బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి పోటీపడి మరీ కుప్పకూలిపోతున్నాయి. గత 17 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వంతెనలు కుప్పకూలగా.. తాజాగా మరో బ్రిడ్జి కూలింది.గురువారం సరన్ జిల్లాలోనని గ్రామాలను- సివాన్ జిల్లాను కలుపుతూ గండకి నదిపై ఉన్న 15ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల డీసిల్టింగ్ పని జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా సరన్ జిల్లాలో గత 24 గంటల్లో మూడు వంతెనలు కూలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. గత 17 రోజుల్లో మొత్తం 12 వంతెనలు కూలిపోయాయి,ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అన్ని పాత వంతెనలను గుర్తించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వేకు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. వంతెన నిర్వహణ విధానాలను మెరుగుపరచాలని రహదారుల నిర్మాణం, గ్రామీణ పనుల శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు. -
నీట్ పేపర్‌లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
పాట్నా: నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌లీక్‌లో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.పేపర్‌లీక్‌లో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వియాదవ్ పీఏకు పరిచయం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ నితీష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. అసలు నీటి పేపర్ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమారే అన్నారు. బీజేపీ బిహార్‌లో పవర్లోకి వచ్చినప్పుడల్లా పేపర్‌లీక్‌లు జరుగుతున్నాయన్నారు. నీట్ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ‘ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లీక్ వెనుక అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్లే’అని తేజస్వి ఆరోపించారు. -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
ఆ ఇంక్ ఏంటి ?
-
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
విలువల జాడేది?!
వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్‌వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -
‘మోదీ 1/3 పీఎం మాత్రమే’.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది. -
నాడు చావే శరణ్యం.. నేడు బీజేపీతోనే ప్రయాణం
బీహార్ సీఎం నితిష్ కుమార్ మౌనం వీడారు. ఎన్డీయే కూటమి వెంటే నడుస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో క్రితం బీజేపీ కూటమిలో చేరడం కంటే చావే మేలంటూ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల విడుదలైన 542 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే (బీజేపీ) కూటమి 240 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా (కాంగ్రెస్) కూటమి 243 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అందుకే ఎన్డీయే,ఇండియా కూటమిలు ఇరు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి.ఎన్డీయే కూటమికి కటిఫ్ అంటూఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్.. ఇండియా కూటమికి మద్దతు పలికే తేజస్వీతో కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంతో నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఎన్డీయే కూటమికి గుడ్‌బాయ్ చెప్పనున్నారంటూ జాతీయ మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి.మీ వెంటే నేనుంటాఅయితే నితీష్ కుమార్ మాత్రం తాజా ఎన్డీఏ సమావేశంలో మీ వెంటే నేనుంటా నంటూ మోదీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోదీతోనే ఉంటానని అని అన్నారు.బీజేపీతో పొత్తంటే.. చావే శరణ్యంఅంతవరకు బాగానే కూటముల్ని మార్చడంలో పేరున్న నితిష్ కుమార్ గతంలో బీజేపీ కూటమికి కటిఫ్ చెప్పి.. కాంగ్రెస్ చెంతన చేరారు. ఆ సమయంలో నితిష్ మాట్లాడుతూ.. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోను. అలా పెట్టుకోవడం కంటే చావే శరణ్యం. 2017లో కమలంతో పొత్తు పెట్టుకునే పెద్ద తప్పే చేశాను అని వ్యాఖ్యానించారు. తాజా బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో నాడు నితిష్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. -
చంద్రబాబు, నితీశ్‌కు అందరూ స్నేహితులే: సంజయ్‌రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.