NT Rama Rao
-
రైతు ప్రధానికి సముచిత గౌరవం
పేదవర్గాలకు ఎనలేని సేవలందించిన భారత మాజీ ప్రధానమంత్రి దివంగత చరణ్ సింగ్‌కు ఆయన చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయటం హర్ష ణీయం. అదే విధంగా తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామా రావుకు కూడా భారతరత్న ఇస్తే సముచితంగా ఉంటుంది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించటంలో చరణ్ సింగ్‌ది ప్రధానపాత్ర. వాస్త వానికి 1971 ఎన్నికలలో రాయబరేలీలో ఇందిరమ్మపై పోటీచేసిన రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ వేసి, అలహాబాద్ హైకోర్టులో నెగ్గడం వెనుక కూడా చరణ్‌సింగ్ చాణక్యం లేకపోలేదు. మధు లిమాయే 1977లో ఒక మాటన్నారు: ‘ఉత్తరభారతంలో రామ్ మనోహర్ లోహియా విఫలం కాగా చరణ్ సింగ్ సమర్థంగా వ్యవ సాయ కులాలను, మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను గుదిగుచ్చి మాల తయారు చేయటంలో విజయం సాధించారు.’ 1937లో చరణ్ సింగ్ రెవిన్యూ మంత్రిగా ఉత్తరప్రదేశ్‌లో రైతురుణ విమోచన చట్టం తెచ్చి, రైతాంగాన్ని ఆనాడే అప్పుల బాధ నుండి బయట పడేశారు. 1979లో చరణ్‌సింగ్ ఆర్థికశాఖను చేపట్టి 1979–80 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ సందర్భంలో ఓ రోజు ఉదయం ఫిబ్రవరి మొదటివారంలో చరణ్‌సింగ్‌ను కలుద్దామని తుగ్లక్ రోడ్డుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఉప ప్రధానిగా కూడా ఉన్నారు. చరణ్ సింగ్ ఇంటి ముందు మూడు కార్లున్నాయి. వాటినిండా ఫైళ్ళు మూట గట్టి నింపేస్తున్నారు. వ్యక్తిగత భద్రతాధికారి కర్తార్ సింగ్ నన్ను చూడగానే, ‘చౌధరీ సాబ్ బడ్జెట్ రూపొందించేందుకై హరియాణాలోని సూరజ్‌కుండ్‌కు వెళ్తు న్నారు. నీవు ఇక్కడే ఉండు, చౌధరీసాబ్ బయటకు రాగానే కనపడ’ మని సలహా చెప్పారు. వాకిలి వద్దే నిలుచున్నాను. చౌధరీ బయటకు రాగానే నన్ను చూసి ‘ఏమిటింత ప్రొద్దున్నే వచ్చావు. గొడ్డుచలిలో?’ అని వాకబు చేశారు. ‘రెండు, మూడు సమస్యలున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరచాలి’ అని వివరించాను. కారు ఎక్కమన్నారు. వెనుక సీటులో చౌధరీసాబ్ పక్కన కూర్చున్నాను. ముందు సీటులో కర్తార్ సింగ్ కూర్చున్నారు. రైతులు పండించే పొగాకుపై ఎక్సైజ్ సుంకం రద్దుచేయవలసిన అవసరాన్ని వివరించాను. అదే మాదిరి పేదవారు వాడుకొనే అల్యూమినియం పాత్రలపై కూడా సుంకం తొలగించాలని వివరించాను. దానికి సంబంధించిన వివరాలతో, ముసాయిదా పత్రాన్ని కూడా తయారు చేశానని చెప్పాను. ఆ పత్రాలు లాక్కొని తన ఫైలులో పెట్టుకొన్నారు. ఆ రెంటినీ బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరిచారు. చాలా ఆశ్చర్యమేసింది. అంతకు ముందు బడ్జెట్లు రూపొందించే కసరత్తులో భాగంగా సలహాల కోసం బొంబాయి వెళ్ళి ఆర్థికవేత్తలు, ప్రణాళికా నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వారు, పాలనాదక్షులతో చర్చలు జరిపితే బడ్జెట్ మరింత నాణ్యంగా రూపొందించడానికి ఉపయోగపడగలదని సూచించాను. సరేనన్నారు. బొంబాయి సమావేశంలో పాల్గొన్న పెద్దలు చెప్పినవన్నీ జాగ్రత్తగా రికార్డు చేయించి, ఆ కాగితాలు తీసుకొని ఆ సూచనలలో ప్రతి ఒక్కదానికీ పూర్తి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతిపాద నల్లో చేర్చారు. ‘బొంబాయిలోని వారంతా బడా బాబులు. వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తే, మనం సరైన మార్గంలో ఉన్నట్లు! మనం చేసిన పని బాగుందని వారు కితాబిస్తే మనం ఎక్కడో తప్పు చేశామని అర్థం! అని గీతోపదేశం చేశారు. 1979 జులైలో జనతాపార్టీ చీలిపోయింది. మొరార్జీ స్థానంలో చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కాలంలో లోక్ సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. డీసీఎం అధిపతి అయిన భరత్ రామ్ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షులుగా చరణ్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఎన్నికల నిధి ఇవ్వజూపారు. ఏమిటిదని అడిగారు చరణ్ సింగ్. ‘ఏమీ లేదు – ఇది మామూలే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధానమంత్రు లందరికీ మేము ఇలాగే సమర్పించుకొంటుంటాం. ఇందులో కొత్త ఏమీలేదు. ఇప్పుడు ప్రధాని కుర్చీలో మీరు కూర్చున్నారు గనుక మీకు సమర్పిస్తున్నాం’ అన్నారు. ‘ఏమిటీ నాకు డబ్బులిస్తావా? పోలీసులకు అప్ప జెబుతాను. నేను రైతుల దగ్గరికెళ్ళి రూపాయి – రూపాయి అడుక్కొంటాను గానీ, పారిశ్రామికవేత్తల విరాళాలతో ఎలక్షన్‌కు వెళ్తానా?’ అని కోపగించారు చరణ్ సింగ్. భరత్ రామ్ రాష్ట్రపతి భవన్ కెళ్ళి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని కలిసి ‘భలేవాడిని ప్రధాన మంత్రిగా చేశారు సార్. ఎన్నికల నిధికి ఏదో పదిరూపాయలిద్దామని వెడితే, అరెస్ట్ చేయిస్తానని వెంటబడతాడే మిటి సార్’ అని వాపోయారు. ఎమ్వీఎస్ సుబ్బరాజు, గణపా రామస్వామి రెడ్డి, దొడ్డపనేని ఇందిర జనతాపార్టీ శాసనసభ్యులు, నీలం సంజీవరెడ్డికి ఆత్మీయులు. వారు వాస్తవానికి మానసికంగా లోక్ దళ్‌కూ, చరణ్ సింగ్ భావజాలానికీ దగ్గర. వారిని పిలిపించారు సంజీవరెడ్డి. ‘ఇదెక్కడ గోలయ్యా. తుండు, తుపాకీ లేకుండా యుద్ధానికి వెళతానంటాడు. ఎవరో పెద్దమనిషి పది రూపాయ లిస్తానంటే అరెస్టు చేయిస్తానంటాడు. ఈ సిద్ధాంత మూర్ఖుడితో కూడుగాదు, మీరు కాంగ్రెస్‌లో చేరిపోండి’ అని సలహా ఇచ్చారు. అలాగే చేశారు వారు ముగ్గురూ. ప్రధానమంత్రిగా నుండగా 1979 అక్టోబరులో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ. చౌధరీ సాబ్ ఉపన్యా సాన్ని తెలుగులోకి నేనే తర్జుమా చేశాను. ‘శివాజీ, నా ఉపన్యాసం కన్నా, నీ తర్జుమా మరింతగా శ్రోతలను ఆకట్టుకొంది. లేకుంటే సభ అంత రక్తికట్టేది కాదు’ అని సభానంతరం మనసారా అభినందించారు చరణ్ సింగ్. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక వల్లనే కాంగ్రెస్ నెగ్గు కొస్తున్నదనీ, ఆ పార్టీలన్నీ ఐక్యం అయితే కాంగ్రెస్ పాలన ముగు స్తుందనీ చరణ్ సింగ్ విశ్వాసం. ఆ దిశగా ఆలోచన చేసే 1974 ఆగస్టు 29న భారతీయ క్రాంతిదళ్, సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీలు, ముస్లిం మజ్లిస్, స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, మజ్దూర్ పార్టీ, పంజాబ్ ఖేతీ భారీ జమీందారీ యూనియన్లను విలీనం గావించి భారతీయ లోక్‌దళ్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో నిరంతరం రైతుల కోసం పరితపించిన చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వటం ఎంతో సముచితం. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు. డా‘‘ యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు ‘ 98663 76735 -
'తాతను మరచి ముందుకు సాగిన మనుమడి' పాదయాత్ర!
అనకాపల్లి: జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్‌రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది. పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్‌ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాతను మరచిన మనుమడు లోకేష్ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనితకు అసమ్మతి సెగలు! యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలో పార్టీ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. నారా లోకేష్ సాక్షిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు నిరసన సెగ తగిలింది. అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు జీవీఆర్ నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహం వద్ద అనిత ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర అక్కడకు చేరుకోగానే అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు గమనించిన అనిత వెంటనే అక్కడకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ‘మమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించారు. మేం చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. లోకేష్ వారిని సముదాయించి యాత్ర కొనసాగించారు. బైపాస్ జంక్షన్, ప్రకాష్ కళాశాల, పీఎల్‌పురం, సీతారాంపురం మీదుగా నామవరం చేరుకొని, అక్కడ ప్రైవేటు లేఅవుట్లో రాత్రి బస చేశారు. ఇవి చదవండి: 15న మంత్రివర్గ సమావేశం -
ఆనాడు సీఐడీ ఆఫీసర్‌గా NTR.. చంద్రబాబును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
'నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు..' ఇది సినిమా పాటే అయినా ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అన్నట్లు దొంగపనులు, పాపాలు చేసిన చంద్రబాబు ఆ పాపాలకు మూల్యం చెల్లించుకోకా తప్పదు. దొరికినకాడికి దోచుకున్న బాబు ఇటీవలే కటకటాలపాలైన సంగతి తెలిసిందే! నేడు(సెప్టెంబర్ 23న) ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. అన్యాయాన్ని చీల్చి చెండాడే ఆఫీసర్‌గా ఎన్టీఆర్ సరిగ్గా 58 ఏళ్ల కిందట ఇదే రోజు C.I.D. సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు? ఎన్టీ రామారావు. తాపి చాణక్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీఐడీ ఆఫీసర్ రవి పాత్ర పోషించారు. తండ్రి చలపతిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం హీరోదైతే, దురలవాట్లు, అక్రమాలతో అడ్డదారిలో డబ్బు సంపాదించి జల్సా చేసే తత్వం ఆయన తండ్రిది. C.I.D కథ ఇదీ.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు చలపతి. తాను చనిపోయినట్లు నమ్మించి తర్వాత బాబా అవతారమెత్తి మరెన్నో తప్పులు చేస్తాడు. మరోవైపు అతడి కొడుకు రవి పెద్ద చదువులు చదివి సీఐడీ ఆఫీసర్‌గా మారతాడు. బ్యాంకుకు కన్నం వేసిన బాబా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతాడు. చట్టం కళ్లు తప్పి ఎవరూ తప్పించుకోలేరన్నట్లు చివరకు కొడుకు చేతిలోనే అరెస్ట్ అవుతాడు చలపతి. ఇదీ సీఐడీ సినిమా కథ! అప్పుడు సీఐడీ రిలీజ్.. ఇప్పుడు సీఐడీ విచారణలో బాబు వెనక్కు తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని తప్పులు చేసిన చంద్రబాబు సైతం చివరకు అరెస్ట్ అవక తప్పలేదు. నేడు, రేపు సీఐడీ బృందం చంద్రబాబును విచారించనుంది. ఎన్టీఆర్ సీఐడీ సినిమా రిలీజైన రోజే చంద్రబాబు సైతం సీఐడీ విచారణకు హాజరవడం యాధృచ్చికమే అయినా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..? -
Balayya : బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..?
పేరేమో నందమూరి బాలకృష్ణ.. మా బ్లడ్ వేరు, మా బ్రీడు వేరు అంటూ కామెంట్లు చేస్తూ అందరికంటే తాను మాత్రమే గొప్ప అనుకుంటూ భ్రమలో బతికేస్తుంటాడు బాలయ్య. సినిమాల్లో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులతో అమర్యాదగా వ్యవహిరించినట్లుగా మొన్న యువగళం విజయోత్సవ సభలో ఆయన తీరు కనిపించింది. చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణకు మైక్ ఇచ్చాడు. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టు ఆయన నోటికి పని చెప్పాడు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో యువగళం సభలో మరోసారి బాలయ్య చేష్టలతో రుజువు చేశాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. వాస్తవానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని వైద్యులు ఎప్పుడో ధ్రువీకరించారు. ఆ సర్టిఫికెట్ కూడా ఆయన వద్ద ఇప్పటికీ భద్రంగా తన బీరువాలో ఉంది. అందుకే ఆయన జోలికి ఎవరూ పోరు.. ఎందుకంటే గన్ తీసుకుని ఎవరిని, ఎక్కడ కాల్చిపడేస్తాడో అనే భయం. అంతే కాకుండా ఆయనకు చికిత్స అవసరమని కూడా మెడికల్ సర్టిఫికేట్లో వైద్యులు కూడా ధ్రువీకరించారు. కానీ తన బావ చంద్రబాబు రాజకీయ అండతో ప్రజల్లో తిరుగుతున్నాడు. కాలక్రమేనా రాజకీయ నాయకుడిగా మారిన ఈ నటుడు అభిమానులను శారీరకంగా లేదా అసభ్య పదజాలంతో కొట్టడం సరిపాటిగా జరుగుతున్నది. బాలయ్య మానసిక స్థితి గురించి అభిమానులకు కూడా తెలుసు కాబట్టి వారు కూడా సర్ధుకుపోతున్నారు. బాలయ్య కొట్టినా.. ఇష్టానుసారంగా కామెంట్లు చేసినా ఎగిరి గంతులేస్తూ ఆనందపడుతారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేష్టలు చూసిన వారంత అర్జెంట్‌గా ఆయన ఇంకా పరిణితి చెందాలంటున్నారు. గతంలో ఆయన ఖాతాలో ఇలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి. మహిళలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు గతంలో నారా రోహిత్ సినిమా వేడుకలో మహిళల పట్ల బాలయ్య నోటి నుంచి జారిన అణిముత్యాలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పుకోరు కదా! ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. హీరో నారా రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు.. పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు.’ అని సభ్యసమాజమే సిగ్గుపడే వ్యాఖ్యలు చేశాడు ‘నాదో లోకం.నేను ఎలా వ్యవహరించినా..ఏం మాట్లాడినా తప్పులేదు’ అన్నట్టుగా ఆయన ఇప్పటికీ అలానే ప్రవర్తిస్తున్నాడు. మహిళలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై గొప్పగొప్ప మాటలు చెప్పే బాలయ్య అసలు స్వరూపం ఇదే అని ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడో గ్రహించారు. అందుకే ఆయనకు దగ్గరగా వెళ్లేందుకు ఏ టీడీపీ నాయకుడు కూడా సాహసం చేయడు. బాధ్యాతాయుత ప్రవర్తన కాదది.! చంద్రబాబు బావ జైలుకు వెళ్లాడని ఏపీ అసెంబ్లీలో మీసం మెలేసి తొడ కొడుతున్న బాలయ్యపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. కన్న తండ్రి మీద నాడు చంద్రబాబు చెప్పులేయిస్తుంటే వైస్రాయ్ హోటల్లో కూర్చొని 'అరె బావా ఏక్ పెగ్ లా' అంటూ మ్యాన్షన్ హౌస్ తీసుకుని చిందులేసి నిద్రపోలేకపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడెందుకు తొడ కొట్టలేదు.? ఇదే పౌరుషం అప్పుడెందుకు చూపించలేదంటున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్లో "ఎవడ్రా మా నాన్న గారి జోలికి వచ్చేదని ఎందుకు అడ్డంగా నిలబడలేదు..?" అని ఉంటే వ్యక్తిత్వంలో ఎంతో మిన్నగా ఉండిపోయేవారంటున్నారు. తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలయ్య జీవిత చరమాంకంలో తండ్రిని ఘోరంగా అవమానించి, మానసికంగా వేధించి ఆయన చావుకు ఎన్టీఆర్ వారసులు తలా ఒక చేయి వేశారనే విమర్శలు లేకపోలేదు. ఎన్టీఆర్‌కు పది మంది పిల్లలున్నప్పటికీ ఏ ఒక్కరూ తండ్రి ఆవేదనలో పాలు పంచుకోలేదు. పైగా ఆయన కన్నీళ్లకు కారకులై, తండ్రికి శాశ్వతంగా రుణపడ్దారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు. ఇది చాలదన్నట్టు ఆ రోజు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడాన్ని సమర్థిస్తూ... అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో సమర్థించుకోవడం తనయుడిగా నందమూరి బాలకృష్ణకు నిజంగా సిగ్గుచేటే. తండ్రి కష్టాల్లో ఉంటే కొడుకు ఒక మూల స్థంబంలా నిలబడుతాడు. కానీ బాలయ్యకు ఆ ఆలోచన ఏమాత్రం లేదు. 'ఎన్టీఆర్ కడుపున పుట్టడం మీ అదృష్టం, ఆ పెద్దాయన దురదృష్టం' అని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి పిల్లల వల్లే చంద్రబాబు ఆటలు ఇన్నేళ్లపాటు నందమూరి కుటుంబంలో సాగాయని, మరే నాయకుడికి ఎన్టీఆర్‌కు పట్టిన దుస్థితి రాకూడదని నెటిజన్లు పోస్టులు పెట్టడం గమనార్హం. ఈ పని చేసి చెప్పు నీ బ్లడ్, బ్రీడు గురించి ఏనాడు అసెంబ్లీకి సాధారణంగా రాని బాలయ్య చంద్రం బావ కళ్లలో ఆనందం చూడటానికి మీసాలు తిప్పుతూ తొడలు కొడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. కన్నతండ్రి కంటే.. బావ ఎక్కువయ్యాడా బాలయ్యా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ లేకపోతే బాలయ్య ఎక్కడా..? బాలయ్య అడ్రస్ ఏంటీ..? ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు ఎవడు..? చంద్రబాబు అడ్రస్ ఏంటీ..? జీవితం, రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులేసినప్పుడు నీ పౌరుషాన్ని ఎక్కడ పెట్టుకున్నావు బాలయ్యా..? నీవు నిజమైన ఎన్టీఆర్ బిడ్డవైతే.. టీడీపీని ఇప్పటికైనా చేతిలోకి తీసుకో.. ఎన్టీఆర్ అభిమానులు తొడ గొట్టి, మీసాలు తిప్పేలా చేయ్.. అదీ ఒక వారసుడి లక్షణం.. అప్పుడు చెప్పు నీ బ్లడ్, బ్రీడు గురించి అని అన్నగారి అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ వారసుడిగా మారిన చంద్రబాబు నందమూరి వంశాన్నే కూలదోయాలని రాజకీయ చదరంగం ఆడటం చంద్రబాబు ఎప్పుడో మొదలు పెట్టాడు. అప్పటికే అన్నగారి బిడ్డ అయిన భువనేశ్వరిని పెళ్లి చేసుకుని నందమూరి ఇంట్లోనే రాజకీయ కాపురం చంద్రబాబు పెట్టాడు. అలా ఎన్టీఆర్‌కు అంతగా రాజకీయం గురించి తెలియదని పసిగట్టేశాడు. ఎంతైనా చంద్రబాబుది కాంగ్రెస్ బుర్ర కదా..! చాప కింద నీరులా తన వర్గాన్ని పెంచుకుంటూ వచ్చాడు.. రామోజీ లాంటి మీడియా అధిపతితో 1995 వరకు రహస్య స్నేహం చేసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించారు. నిజానికి ఎన్టీఆర్‌కు కూడా రాజకీయం అంతగా తెలియదు. తెలిసుంటే బాబు చేతికి చిక్కేవారు కాదు. 1980ల్లో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఎన్టీఆర్‌కు కలిసి వచ్చి సీఎం అయ్యారు. 1994లో కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతనే ఆయన మళ్లీ గెలిపించింది. కొన్నిరోజుల తర్వాత ఏపీ రాజకీయాల్లో నందమూరి పోయి నారా బ్రాండ్ వచ్చింది. ఎప్పటికైనా తనకు నందమూరి వారసులు నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని తెలివిగా గ్రహించిన చంద్రబాబు మరో ప్లాన్ వేశాడు. తన కుమారుడు అయిన లోకేశ్‌కు బ్రాహ్మణిని జతకలిపాడు. ఇలా తన రాజకీయ చదరంగంలో బుర్రలేని బాలయ్యతో పాటు నందమూరి వారసులందరూ బలిపశువులు అయ్యారు. -
ఈ యుద్ధం ఓ వరం!
యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు. వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు. అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది. సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి. పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్‌గా మారింది. పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు. చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా? పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం. పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు. వీరి టీమ్‌లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్ కల్యాణ్. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్‌లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్‌ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది. అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం. వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్ ఏరియాలు గేమ్ ఛేంజర్స్‌గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్టీఆర్ కు జరిగిన అవమానాలను నేను ప్రత్యక్షంగా చూశా
-
కథానాయకుని వ్యథ!.. ది పొలిటికల్ ట్రాజెడీ ఆఫ్ ఎన్టీఆర్
ఇదీ కుట్ర జరిగిన తీరు... తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఆయన సొంతవారే ఎలా కూలదోశారు? అన్నది ఆసక్తికరమైన అంశం. ఆనాడు చకచకా జరిగిపోయిన ఘటనలలో ఎన్టీఆర్ నిస్సహాయుడిగా మిగిలిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1994 శాసనసభ ఎన్నికలలో తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి అసాధారణమైన రీతిలో మిత్రపక్షాలతో కలిసి సుమారు 250కి పైగా సీట్లు గెలుచుకున్న ఎన్టీఆర్ చెప్పులు వేయించుకోవడమా? తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చరమాంకంలో కుటుంబ సభ్యుల చేతిలో ఆత్మాభిమానం కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం. 1995 ఆగస్టులో ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు అయిన చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు తరలివెళ్లారు. అది జరుగుతున్నప్పుడే చంద్రబాబు తన సొంత గ్రూప్‌తో విశాఖ డాల్ఫిన్ హోటల్లో ఒక సమావేశం నిర్వహించారు. తదుపరి సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు కలిసిన తీరు సంచలనం అయింది. ఎన్టీఆర్ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టాలని అనుకున్నారు. వాళ్లు ఆయా జిల్లాలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను వైస్రాయికి రావాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తాను అసలు ఎందుకు వైస్రాయ్ హోటల్‌కు వెళ్లానో తెలియదనీ, జిల్లాకు చెందిన ఒక మంత్రి పిలవడంతో వెళ్లాననీ, ఆ తర్వాత కాని విషయం బోధపడలేదనీ అప్పట్లో నాకు చెప్పారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం కూడా చంద్రబాబు వర్గానికి కలిసి వచ్చింది. వైస్రాయ్ హోటల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందనీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా అయినా నియమిస్తారనీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎన్టీఆర్ మరో అల్లుడు, అప్పట్లో ఎంపీగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ రప్పించారు. ఉప ముఖ్యమంత్రి చేస్తామని నమ్మబలికారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని అన్నారు. తామేమీ తప్పు చేయలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ముగ్గురు నేతలు అశోక్ గజపతిరాజు, ఎస్వీ సుబ్బారెడ్డి, దేవేందర్ గౌడ్లను ఎన్టీఆర్ వద్దకు సంప్రతింపుల పేరుతో పంపించారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడును తుని నుంచి హెలికాప్టర్లో రప్పించారు. ఎమ్మెల్యేలతో ఆయన అభిప్రాయ సేకరణ జరిపించినట్లు గవర్నర్‌కు ఒక నివేదిక ఇప్పించారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్‌కు ఒక ప్రముఖ న్యాయవాది అసెంబ్లీని రద్దు చేద్దామన్న సలహా ఇచ్చారు. నిజానికి అది కూడా కుట్రలో భాగమేనని ఆ తర్వాత వెల్లడైంది. అసెంబ్లీని రద్దు చేస్తారని చెబితే ఎమ్మెల్యేలంతా తమ పదవులు పోతాయన్న భయంతో తమ వద్దకు వచ్చేస్తారని చంద్రబాబు ప్లాన్ చేశారు. అది బాగా వర్కవుట్ అయింది. మొత్తం పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు బయల్దేరారు. పరిటాల రవి, దేవినేని నెహ్రూ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన మైకు తీసుకుని ‘తమ్ముళ్లూ వచ్చేయండ’ని ఉపన్యాసం ఇస్తున్న సందర్భంలో హోటల్ గేటు లోపల నుంచి చెప్పులు పడ్డాయి. అది చూసినవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు చంద్రబాబు వర్గం ఎమ్మెల్యేలు ఒక సినిమా థియేటర్లో సమావేశమై ఎన్టీఆర్‌ను పార్టీ పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు, చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన గవర్నర్ కృష్ణకాంత్ అక్కడే రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబుతో సహా ఐదుగురు నేతలను మంత్రి పదవుల నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినా, ఆ కాపీని గవర్నర్‌కు పంపించినా, ఆయన దానిని విస్మరించి చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్నా స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించలేదు. చంద్రబాబుకు సహకరించిన దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి హుళక్కి అయితే, హరికృష్ణను ఆరు నెలల మంత్రిగా మార్చి పరువు తీశారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు టీడీపీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, బ్యాంక్‌లో ఉన్న నిధులను కూడా కైవసం చేసుకున్నారు. ఫలితంగా గుండెపోటుతో ఎన్టీఆర్ కాలం చేశారు. ఆ తర్వాత రోజులలో ఎన్టీఆర్‌ను పొగుడుతూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం ఆరంభించారు. ఎన్టీఆర్ పేరు చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్న చంద్రబాబు వర్గం అదే వ్యూహం అమలు చేస్తోంది. పాపం... ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంది! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అవమానాలకు ఆగిన గుండె! చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ నుండి లాక్కున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీఆర్ ఆ అవమానాల్ని తట్టుకోలేకపోయారు. 1993 జూన్‌లో ఆయనకు పెరాలసిస్ వచ్చినప్పుడు నిమ్స్ డాక్టర్లు ఆయనకు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడిందనీ ఏమాత్రం ఒత్తిడి ఉన్నా అది ఆయన మరణానికి దారి తీస్తుందనీ కుటుంబ సభ్యులందరినీ హెచ్చరించారు. అయినా వాళ్ళెవ్వరూ ఆ మాటలను పట్టించుకున్నట్లే లేరు. మాటిమాటికీ అవమానాలతో వేధించారు. అయినా ఆయన వెనక్కు తగ్గదలుచుకోలేదు. చంద్రబాబు మీద పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు చె΄్పాలనే ఉద్దేశ్యంతో మహారథి, వేల్చూరి వెంకట్రావులచే ‘జామాత దశమ గ్రహః’ అనే క్యాసెట్‌కు స్వయంగా తన పర్యవేక్షణలో రచన చేయించి డి.రామానాయుడు స్టూడియోలో తనే మాట్లాడుతూ ఆడియో రికార్డ్ చేయించారు. ‘తమ్ముళ్లూ ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను’ అని ్రపారంభించి రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన చంద్రబాబు కుట్రనూ మోసాన్నీ బయటపెట్టారు. ఈ క్యాసెట్‌ను విజయవాడలో ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహగర్జన’ సదస్సులో విడుదల చేయాలని సంకల్పించారు. నేషనల్ ఫ్రంట్ నాయకులు ఎన్టీఆర్ లేకపోతే రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమని భావించారు. సంధి ప్రయత్నంలో వీపీ సింగ్, బొమ్మై, దేవెగౌడ, పాశ్వాన్, శరద్ యాదవ్‌లు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి చంద్రబాబుతో కలిసిపొమ్మని నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశారు. ఈ కలహం వలన నేషనల్ ఫ్రంట్‌కు నష్టం వస్తుందనీ, కొంచెం పెద్ద మనస్సుతో ఈ సంధికి అంగీకరించమనీ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి సలహాలివ్వమనీ సూచించారు. ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. చంద్రబాబు మీద పోరాటాన్ని కొనసాగించటానికి ఆయన కోర్టులను కూడా ఆశ్రయించారు. అదే సమయంలో ఆయనకు ఇంకో విషయం తెలిసింది. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి బంధువులు, మరికొంతమంది లిక్కర్ లాబీ వాళ్ళు కోట్లాది రూపాయలు చంద్రబాబుకు అందించారనీ, ఆ డబ్బుతో ఆయన మీడియాతో పాటు న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేసుకుని ఎన్టీఆర్‌ను పదవి నుండి దించేశాడనీ! ఇక్కడ జరిగిందంతా గందరగోళమే. ప్రజలకు వాస్తవాలేంటో తెలియనీకుండా, తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇదే పచ్చ మీడియా ఆనాడు నిర్వహించిన పాత్ర కడు శోచనీయమైనది. ఇదంతా లక్ష్మీ పార్వతి వల్లనే జరుగుతోందని చెప్పటం ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినా అది ప్రజల్లో వ్యతిరేకత కలిగించదనేది వారి వ్యూహం. ఆ పెద్ద కుట్రలో ప్రధాన పాత్ర వారిదే! ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నది. ఒక కన్ను పని చేయటం లేదు. రానురాను మానసికంగానూ, శారీరకంగానూ బలహీనపడుతున్నారు. 1996 ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహ గర్జన’ సదస్సు గురించి చర్చించడానికి దేవినేని నెహ్రూ విజయవాడ నుండి వచ్చారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ఆ సదస్సుకు 30 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పేరుతో ఉన్న పార్టీ ఎకౌంట్ నుండి డబ్బు తీసుకురమ్మని చెక్ రాసి తన పీఏను పంపించారు ఎన్టీఆర్. వెంటనే బ్యాంక్ వాళ్ళు చంద్రబాబుకు మెసేజ్ ఇచ్చారు. చంద్రబాబు మానవత్వాన్ని మర్చిపోయి ఆ డబ్బుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం తనే గనుక సొమ్ము తనకే చెందాలని హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేయించాడు. ఇది జనవరి 17వ తారీఖు జరిగిన సంఘటన. అప్పటికప్పుడే సీజే ప్రభాకర శంకర మిశ్రా ఆదేశం మేరకు హైకోర్టు జస్టిస్ బి. మోతీలాల్ నాయక్ స్టే ఆర్డర్ ఇచ్చేశారు. అంత ఎమర్జెన్సీగా వారు స్పందించారు! సాయంత్రం 5 గంటలకు లాయర్లు వచ్చి విషయం చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన శరీరం అదుపు తప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడబోయి కిందపడబోయారు. అక్కడున్న వాళ్ళు పట్టుకుని ఆపారు. ముఖం, కాళ్లు ఎర్రగా అయిపోయాయి. పెద్దగా కేకలు వేశారు. నెహ్రూ సర్దిచెప్పినా ఆయన పట్టించుకోలేదు. డబ్బు లేకుండా పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన పడ్డారు. ఇదంతా అయ్యేసరికి రాత్రి 7 గంటలయ్యింది. 10 గంటలకు రామానాయుడు ‘జామాత దశమగ్రహః’ క్యాసెట్ ఇచ్చి వెళ్లారు. అయితే సింహగర్జన సదస్సులో ఈ క్యాసెట్ రిలీజ్ చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని గురించి చె΄్పాలనుకున్న ఆయన నోరు శాశ్వతంగా మూగబోయింది. పార్టీ డబ్బు సీజ్ చేసిన 8 గంటల లోపే ఈ అవమానాలు తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది. ప్రత్యర్థులను మట్టి కలపాలనుకునే సమయంలో విధి ఆయనను వెక్కిరించింది. కలల్నీ, కలతల్నీ తనలో కలుపుకొంటూ మృత్యువు ఆయనకు శాశ్వత విశ్రాంతి కల్పించింది. ఇప్పుడు చెప్పండి... దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడి అధికార దాహం వలనే కదా ఆయనకీ అకాల మృత్యువు ్రపాప్తించింది. తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ... అశ్రునయనాలతో సెలవు. -నందమూరి లక్ష్మీపార్వతి,వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం
-
శతజయంతి వేడుకలకు దూరం అసలు కారణం..!
-
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
-
అందరి ముందు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు!: రోజా రమణి
నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమలో రాణించింది రోజా రమణి. బాలనటిగా భక్తప్రహ్లాదతో అబ్బురపరిచిన ఆమె ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గానూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా బిజీ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగు హిట్స్ అయిన ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరో చక్రపాణితో కలిసి నటించింది రోజా రమణి. వీరిద్దరూ కలిసి నటించిన కవి సామ్రాట్ ఉపేంద్ర బంజు అక్కడ పెద్ద హిట్. వీరి స్నేహం ప్రేమగా మారడం, దాన్ని పెద్దలు ఆశీర్వదించడంతో పెళ్లి జరిగిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు తరుణ్ హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన కొంతకాలం వరకు కుటుంబానికే పెద్ద పీట వేస్తూ సినిమాలకు దూరమైంది రోజా రమణి. నటించడం మానేసినా 1984 నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారి స్క్రీన్‌పై తన గొంతు పలికించింది. దాదాపు 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు నందమూరి తారక రామారావు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నందమూరి తారకరామావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆయనతో మొదటిసారి 'తాతమ్మ కల' చేశాను. ఈ చిత్రంలో ఆయన నటించి, దర్శకత్వం వహించడమే కాక స్వయంగా నిర్మించారు. ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను. డ్రైవర్ రాముడు సినిమాలో ఏమని వర్ణించను.. పాట చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో నేను కళ్లు లేని అమ్మాయిగా, ఆయనకు చెల్లిగా నటించాను. ఆ పాట చివర్లో నేను చిన్న బిట్ పాడుతూ ఎన్టీఆర్ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు మమ్మల్ని చూసి ఎమోషనలై కట్ చెప్పకుండా సీన్లో లీనమైపోయారు. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతోంది.. సూసైడ్ చేసుకోవడానికి పరుగెత్తుతున్నాను. నా వెనకాల హరికృష్ణ గారు ఆగు, చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నడిరోడ్డు మీద ఎన్టీ రామారావు డైరెక్షన్ చేస్తున్నారు. వేలాదిమంది జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారు. నేను బ్యారేజీ రెయిలింగ్ దగ్గర కాస్త హైట్ కోసం ఖాళీ క్యాన్ల మీద నిలబడ్డాను. ఆ క్యాన్లు ఊగిపోతుండటంతో రామారావు వెంటనే వచ్చి నేను పడిపోకుండా నా కాళ్లు పట్టుకుని యాక్ట్ చేయమన్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిజంగా అక్కడ సూసైడ్ జరుగుతుందని ఆయన భయపడ్డారు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి వేలాది మంది జనం ముందు ఏమాత్రం ఆలోచించకుండా కాళ్లు పట్టుకున్నారు. ఆయన చేసిన పనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది రోజా రమణి. చదవండి: ఆ హీరోతో డేటింగ్.. మరో హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు క్లారిటీ ఆ ఓటీటీలోకి రానున్న ఏజెంట్.. -
ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం.. కంచు కంఠంతో ఆకర్షించిన కైకాల
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో విషాదచాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారాయన. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఉన్న ఇష్టంతో 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నిండైన రూపం, కంచు కంఠంతో కైకాల అందరి దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది. ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ కూడా ఆయనకు తన సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఇక వీరిద్దరు కలిసి 100సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఆయనతో కలిసి అడుగులేశారు సత్యనారాయణ. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఓ పాత్రకోసం ఎన్టీఆర్కే సవాల్ విసిరారు కైకాల. అప్పటికే విలన్‌గా రాణిస్తున్న కైకాల ఈ చిత్రంలో సెంటిమెంట్ పాత్ర చేయగలడా అని సందేహంతో కైకాలను వద్దని చెప్పారట ఎన్టీఆర్. దీంతో కైకాల.. రెండు రోజులు షూట్ చేయండి, నేను చేసింది నచ్చకపోతే పంపించేయండి అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరారు. ఇక చేసేది లేక ఆ పాత్రని కైకాలతో చేయించిన ఎన్టీఆర్.. ఆ తరువాత కైకాల నటన చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారట. ఇలా ఎన్టీఆర్‌తో కైకాల ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు సినీ విశ్లేషకులు. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న సీనియర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన భగవంతుడిగా వేషం కట్టినప్పుడయితే.. నిజంగానే ఆ దేవుడే ఈయన రూపంలో ఉన్నాడేమో అనేంతగా తేజస్సుతో ఉట్టిపడేవారు. ఎంతోమంది ఆయన్ను దైవంగా కొలిచేవారు కూడా! ఇక సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు బసవతారకం. వీరికి 12 మంది సంతానం. సినిమా షూటింగ్స్ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో లవ్‌లో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఆనాటి వారి ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. 'ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు 11 మంది పిల్లలు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! అయితే వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను' అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది షావుకారు జానకి. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ -
ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు
గుడివాడ టౌన్: ఆంధ్రుల అభిమాన నాయకుడైన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ సొత్తు కాదని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆయన విగ్రహాలకు పసుపు రంగు పులమడం ఎంత వరకు సబబని అన్నారు. గుడివాడ రూరల్ మండలంలో ఎన్టీ రామారావు విగ్రహానికి రంగులు వేసే విషయంలో తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవమని చెప్పారు. ‘1995లో ఎన్టీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దొంగ చంద్రబాబునాయుడు. ఆయన చనిపోయే వరకు పార్టీలోకి రానివ్వని నీచుడు బాబు. కోర్టుకు వెళ్ళి ఎన్టీఆర్‌కు, పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, పార్టీ గుర్తు, పార్టీ కార్యాలయం తనదేనని ఆదేశాలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. ఎన్టీ రామారావును టీడీపీ వ్యక్తిగా ఎలా గుర్తిస్తారు?’ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహాలన్నీ బంగారు రంగులో ఉంటాయని, ఆయనకు పసుపురంగు పులమడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆయనకు ప్రత్యేక రంగులేమీ లేవన్నారు. ఒకడు పచ్చ రంగు వేసుకుంటే మరొకరు నీలి రంగు వేసుకుంటారని, ఎవరి ఇష్టం వారిదన్నారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు. ఇటీవల ఆ దిమ్మెపై ఉన్న తన పేరును తొలగించడంతో ఆ పార్టీ పెద్దలను పిలిచి వివరణ కోరానన్నారు. త్వరలో తిరిగి ఏర్పాటు చేస్తామన్న ఆ నాయకులు ఇప్పటివరకు అంతులేరని తెలిపారు. దీంతో తమ కార్యకర్తలు పార్టీ రంగు వేసుకుంటారని, ఇందులో తప్పేమీ లేదని అన్నారు. చంద్రబాబు ప్రకృతి కూడా సహకరించదని, అందుకే గుడివాడలో ప్రకృతి వర్షాల రూపంలో మినీ మహానాడును అడ్డుకుందని చెప్పారు. -
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు -
ఇలాంటప్పుడు తప్ప ఎన్టీఆర్ గుర్తురారా?
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు నిండిన టీడీపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే వల్లెవేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావమో లేదంటే మçహానాడు కార్యక్రమమో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీ రామారావును చంద్రబాబు ఎందుకు గుర్తుపెట్టుకోరని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, బీసీ డిక్లరేషన్ తీసుకురావడంతోపాటు వారి అభివృద్ధికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం తప్ప ఆయనకు మంచి చేసింది ఏమీలేదని విమర్శించారు. -
భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బాబుకు కొత్తేమీ కాదు!
బంజారాహిల్స్: చంద్రబాబు.. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి రాబట్టుకోవడం ఇదేం కొత్త కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన తరువాత.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు తన భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచిన విషయాన్ని తామెవరూ మరచిపోలేదన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబును టీడీపీలో చేర్చుకోని పక్షంలో.. గర్భవతినైన తాను ప్రసవించేది లేదని భువనేశ్వరి బెట్టు చేసిందని.. అందుకే చంద్రబాబును పార్టీలోకి చేర్చుకున్నానని స్వయంగా ఎన్టీఆర్ తనతో చెప్పారని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, సీఎం జగన్ మాట్లాడిన మాటలను మూడు నాలుగుసార్లు విన్నానని, వారెవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించినట్లు తనకు కనబడలేదు.. వినబడలేదని అన్నారు. గతంలో అప్పుడప్పుడూ చంద్రబాబు తన ఇంటికి వచ్చేవాడని.. ఆ సమయంలో మామను దుర్బాషలాడే వాడని వివరించారు. సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లుగా నిన్నటి ఘటన అనిపించిందన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబును మించినవారు లేరని చెప్పారు. గతంలో టీడీపీకే చెందిన ఓ ఎమ్మెల్యే చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడని.. ఇది సభలో మాట్లాడింది కాదన్నారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఖర్చుల కోసం దాచుకున్న రూ.20 లక్షలు కూడా బ్యాంకు నుంచి ఆయనకు రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఒక రాత్రంతా ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలంటూ బాబు డబ్బులు కూడా పంపించినట్లు విమర్శలున్నాయని నాదెండ్ల చెప్పారు. -
ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్
ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను విస్మరించారు. కనీసం ఆయన విగ్రహాలకు ఎక్కడా పూలమాల కూడా వేయలేదు. తొలుత లోకేశ్ ఎటపాక మీదుగా నెల్లిపాక చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నెల్లిపాక జాతీయ రహదారి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండురోజులుగా స్వాగత బ్యానర్లు కట్టి గజమాల సిద్ధం చేశారు. నెల్లిపాక చేరుకున్న లోకేశ్ కారులో నుంచే అక్కడి వారికి అభివాదం చేసి వెళ్లిపోయారు. పూలమాల వేయలేనంటూ కారుదిగక పోవటంతో కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేయటం గమనార్హం. లోకేశ్ తీరుతో కార్యకర్తలు కొంత నొచ్చుకున్నారు. బతిమిలాడినా కారు కూడా దిగకుండా వెళ్లటం సరికాదని ఆపార్టీ నేతలు ఆవేదన చెందారు. కూనవరం మండలం నర్శింగపేటలో కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. దీనిపైనా పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: నలుగురు బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్) -
మాకూ పింఛన్ ఇవ్వండి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బ్రిటిష్, నిజాం కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు గ్రామాల్లో పట్వారీ, పటేల్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూములకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడుతుండేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1992లో తిరిగి వీరిలో అర్హులైన వారిని వీఏఓలుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్లో రూ.600 గౌరవ వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. చివరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై 2008 జూన్ 30లోగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీసం ఏడేళ్ల సర్వీసు లేదంటూ పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపీలో 2,225 మంది ఉన్నారు. తాము దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య పని చేసిన కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, 1980 ఆర్పీఆర్ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైలు నం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైలుపై అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. ఏపీలో అమలు.. తెలంగాణలో ఎదురుచూపులు! ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైలు 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్ 20న జీవో నంబర్ 388 జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్ వీఆర్వోలు పింఛన్ పొందుతున్నారు. అయితే తెలంగాణలోని 492 మందికి మాత్రం ఆరేళ్లకుపైగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఆర్థిక, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లభించినా ఫైలు మాత్రం ముందుకు కదలలేదు. ఈ జాప్యానికి అధికారులే కారణమని రిటైర్డ్ వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసరావు.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తికి చెందిన ఈయన వీఆర్వోగా పనిచేస్తూ 2008లో రిటైర్ అయ్యారు. పింఛన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల పెరాలసిస్ బారిన పడ్డారు. మందులు కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ..ఇది ఒక్క శ్రీనివాసరావు దీనగాథ మాత్రమే కాదు. 2008 జూన్ 30లోపు ఉద్యోగ విరమణ పొందిన తెలంగాణలోని పలువురు వీఏఓలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఉద్యోగానికి, ఇటు పింఛన్ కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం చేసి 2014లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వారికి పింఛన్ అందుతుండగా.. తెలంగాణలో ఉన్న వారికి మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. పైస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఆరున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతోంది. – డీకే మోహన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం సీఎం దృష్టికి తీసుకుపోనందుకే.. సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు మా సమస్యను తీసుకుని పోకపోవడం వల్లే జాప్యం జరుగుతోంది. ఆయనకు తెలిస్తే మా పింఛన్ ఫైల్‌పై సంతకం చేస్తారనే నమ్మకం ఉంది. – వి.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం చచ్చే వరకైనా పింఛన్ వచ్చేనా? పింఛన్ కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పింఛన్ వస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. మేం చనిపోయే వరకైనా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. – ప్రకాశ్‌రావు, రిటైర్డ్ వీఆర్వో, గజ్వేల్, సిద్దిపేట -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్‌మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్‌కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!
సాక్షి, అమరావతి: దివంగత నేత ఎన్టీ రామారావు పేరు కూడా ఉచ్ఛరించే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పిల్లనిచ్చిన పాపానికి మామకే వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ మరణానికి కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అసాధారణ స్థాయికి ఎదిగి.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. మంత్రి నాని ఇంకా ఏమన్నారంటే.. అఖిలప్రియ అరెస్టుపై మాట్లాడవేం! కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి పది రోజులైనా చంద్రబాబు, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలకు మాట్లాడే దమ్మే లేదు. ఆమె ఏపీలో అరెస్టయి ఉంటే ఇదే చంద్రబాబు నట విశ్వరూపం చూపించేవాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? డీజీపీని ఎందుకు బెదిరిస్తున్నారు? ఊరికి దూరంగా.. సీసీ కెమెరాలు లేని.. దేవదాయ శాఖకు సంబంధం లేని గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చంద్రబాబు నానా రభస చేస్తాడు. జగన్మోహన్రెడ్డి, డీజీపీ, హోంమంత్రి అంతా క్రిస్టియన్లు అంటాడు. 9 ఆలయాల్లో ఘటనలతో టీడీపీ, బీజేపీకి చెందిన వారికి సంబంధం ఉందని చెబితే డీజీపీని బెదిరిస్తారా? 80 గుళ్లపై జరిగిన దాడిలో వాళ్ల ప్రమేయం ఉందని డీజీపీ చెప్పలేదే. డీజీపీని బెదిరించడం వెనుక అసలు కథ వేరు. చంద్రబాబు హయాంలో కాల్‌మనీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డీజీపీ అప్పట్లో విజయవాడ నగర సీపీ. కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రమేయం ఉందని తేల్చాడు. వాళ్ల పేర్లు బయటపెట్టొద్దని డీజీపీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చాడు. వినలేదని ట్రాన్స్ఫర్ చేశాడు. సీనియారిటీ ఉన్నా డీజీపీ పోస్టు ఇవ్వలేదు. తమ ప్రభుత్వం ఆయన అర్హతలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. చంపేసి.. దండేస్తావా బాబూ! ఎన్టీఆర్ పెట్టిన పార్టీనే లాక్కుని, ఆయననే సస్పెండ్ చేసి, ముఖ్యమంత్రి పదవినీ లాక్కున్న దొంగవు నువ్వు. నువ్విప్పుడు ఆయన విగ్రహాలకు దండలేయడం, ఎన్టీఆర్ గురించి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజునో.. జయంతి రోజునో ఆయనకు భారతరత్న ఇవ్వాలంటావు. ఢిల్లీలో చక్రాలు తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పుడేం చేశాడు. ఎందుకు అప్పుడే భారతరత్న ఇప్పించలేదు. వాజ్‌పేయితో ఐదేళ్లు, నరేంద్రమోదీతో మరో ఐదేళ్లు అంటకాగినప్పుడు భారతరత్న విషయం గుర్తుకు రాలేదా? మోసం, దగా, వంచన తెలిసిన చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి. ప్రజలంతా జగన్ వైపే.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అగ్రవర్ణ పేదలతోపాటు 80 శాతం ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండటంతో వారంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే చంద్రబాబు కుట్రపన్ని గుళ్లను కూల్చి మొసలి కన్నీరు కార్చే నీచ రాజకీయాలు చేస్తున్నాడు. విద్వేషాల వెనుక ఎవరున్నా చొక్కా పట్టుకుని బయటకు తీసుకొస్తాం. మతాలను అడ్డుపెట్టుకుని బతకాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదు. వైఎస్ జగన్ మానవతావాది. గుడికెళ్లినా, మసీదుకెళ్లినా, చర్చికెళ్లినా ఆ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి జగన్. ఓట్లకోసం చంద్రబాబు చేసే చిల్లర రాజకీయాలు ప్రజలు నమ్మొద్దు. మతమే అజెండాగా పనిచేసే బీజేపీ ఆటలు ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం సాగవు.