Prithviraj Shetty
-
నటితో ప్రేమాయణం? క్లారిటీ ఇచ్చిన పృథ్వీ
బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్స్ కామన్. కానీ ఈ సీజన్ విచిత్రంగా అమ్మాయి వెంటపడుతుంటే అబ్బాయి పట్టింపు లేనట్లు కూర్చున్నాడు. ఆ జంటే విష్ణుప్రియ- పృథ్వీ. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అంటూ వీలు కుదిరినప్పుడల్లా అతడిపై ప్రేమను గుమ్మరించింది. ముదొస్తున్నాడంటూ ముద్దులు కూడా పెట్టేది. దర్శిని గౌడతో లవ్అతడు క్యాజువల్‌గా ఏదైనా మాట్లాడినా సో క్యూట్ అంటూ గింగిరాలు తిరిగేది. తనది లవ్ కాదంటూనే అతడిని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పింది. ఆమె ఇంత చేస్తున్నా తనకు మాత్రం ఇంట్రస్ట్ లేదన్నట్లుగానే ఉండేవాడు పృథ్వీ. ఇతడి కోసం ఫ్యామిలీ వీకెండ్లో నాగపంచమి సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజీపైకి వచ్చింది. ఆమె మాటల్ని చూసిన ప్రేక్షకులు వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అని డౌట్ పడ్డారు. క్లారిటీ ఇచ్చిన పృథ్వీసోషల్ మీడియాలో అయితే వీళ్లు కచ్చితంగా ప్రేమికులే అని ముద్ర వేసేశారు. తాజాగా ఈ రూమర్స్‌పై పృథ్వీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దర్శిని నాతో కలిసి నటించింది. ఆమె గొప్ప నటి. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా! సీరియల్స్‌లో మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్‌లో ఉన్నామన్నారు. కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే!' అని క్లారిటీ ఇచ్చాడు.ప్రేమ పెళ్లి చేసుకుంటా..పెళ్లి గురించి స్పందిస్తూ.. 'పెళ్లి కంటే ముందే నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. కెరీర్‌పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్నదాంట్లో ఇంకా పదిశాతం కూడా చేయలేదు. అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్‌లో సెటిలవ్వాలి కదా! సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అది కూడా లవ్ మ్యారేజే' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.ఎలిమినేషన్నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.ప్రాంక్?ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!
నేనే తోపు అని ఎవరికి వారు డప్పు కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఎదుటివారు తమకంటే తక్కువ అని చిన్నచూపు చూడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీ ఇదే చేశాడు. తను టాస్కులు బాగా ఆడతాడు. కానీ తనకు ఎదురొచ్చిన వ్యక్తులను మాత్రం కించపరుస్తాడు, అగౌరవపరుస్తాడు, నోటికొచ్చిన మాటలనేస్తాడు. అంతేకాదు, నువ్వేం చేయగలవన్నట్లు బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఇదే అతడికి పెద్ద మైనస్.కనీసం కంటెండర్ కాలేకపోయాడురోహిణి, తేజ, అవినాష్.. ఈ ముగ్గురిలో ఎవరికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హతే లేదన్నాడు. కానీ ఏం జరిగింది? టాస్కుల వీరుడు నిఖిల్‌తో పోటీపడి మరి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచేశాడు. కనీసం పృథ్వీ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడే కంటెండర్ కూడా కాలేకపోయాడు. ఆ మధ్య నువ్వేం పరిగెత్తగలవంటూ రోహిణిపై దిగజారుడు కామెంట్లు చేశాడు. తీరా ఏమైంది? మెగా చీఫ్ టాస్క్‌లో బలహీనురాలు అనుకున్న రోహిణి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.డబుల్ ఎలిమినేషన్ఇప్పుడేకంగా రోహిణి కంటే ముందే ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ తాజా ప్రోమోలో ప్రకటించాడు. ఈ రోజు తేజను ఎలిమినేట్ చేయగా.. రేపు పృథ్వీని పంపించేసినట్లు తెలుస్తోంది. వైల్డ్‌కార్డ్స్‌ను తక్కువ అంచనా వేసిన పృథ్వీ.. రోహిణి, అవినాష్, గౌతమ్ కంటే ముందే వెళ్లిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హౌస్‌లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్‌లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్‌లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..క్యారెక్టర్‌లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్‌లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్‌కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్‌లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్‌లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్‌పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్‌కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్‌కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్‌బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్‌ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షటప్ గౌతమ్.. నేనేం కంటెస్టెంట్ కాదు: నాగ్ ఫైర్
ఇద్దరు మగవాళ్ల ఇష్యూ గురించి మాట్లాడాలని నాగార్జున అనగానే నేను చెప్తా, సర్ అంటూ అవినాష్ లేచాడు. వాడు, వీడు అని మొదలుపెట్టింది పృథ్వీ.. తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. అప్పుడు పృథ్వీ.. ఛాతీపై వెంట్రుక పీకి పారేశాడు అని జరిగింది చెప్పాడు. ఇక గౌతమ్ గొడవ ఎక్కడ మొదలైందో చెప్పడం ప్రారంభించాడు. అందులో తప్పేముంది?వైల్డ్ కార్డ్స్‌ను నామినేట్ చేయాలని గ్రూప్ గేమ్ ఆడారని చెప్తుండగా.. అందులో తప్పేముందని నాగ్ ప్రశ్నించాడు. అందుకు గౌతమ్.. నా ఉద్దేశంలో తప్పేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? కాదా? అని నాగ్ ప్రశ్నించాడు. ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం గ్రూపిజమా? ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? అని హోస్ట్‌నే తిరిగి ప్రశ్నించాడు గౌతమ్. షటప్ గౌతమ్గ్రూపిజం తప్పని నీ ఉద్దేశ్యమా? అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉండగా గౌతమ్ మధ్యలో కలగజేసుకుంటూ ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగ్.. నేను మాట్లాడుతున్నప్పుడు షటప్.. నువ్వు మధ్యలో కలుగజేసుకోవడానికి నేనేమీ హౌస్‌మేట్ కాదు అని హెచ్చరించాడు. చదవండి: బిగ్‌బాస్ నుంచి యష్మి ఎలిమినేట్ -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్‌బాస్ పలుమార్లు కిచెన్‌లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్‌నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్‌ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్‌లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్‌కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్‌బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్‌గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్‌లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్‌మేట్స్‌లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యష్మి సంచాలక్‌గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్‌లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్‌బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్‌లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్‌బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్‌కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ షోలో మెకానిక్ రాకీ.. గౌతమ్‌పై రౌడీలా దూసుకొచ్చిన పృథ్వీ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మెకానిక్ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్ గేట్ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ ఇలా ఆటోలో హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్ప్రైజ్ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్‌గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్ చేశాడు. చివరగా హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్, రోహిణిలలో ఒకర్ని కంటెండర్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై భారం వేశాడు. ఈ సందర్భంగా గౌతమ్.. చాలామంది హౌస్మేట్స్ కలిసి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు అంటూ వైల్డ్ కార్డ్ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్‌తో నామినేషన్ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి
ఫ్యామిలీ వీక్‌తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్ 14) ఎవరెవరు హౌస్‌లోకి వచ్చారో చూసేద్దాం..స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్?మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.అతడి వల్లే ఉండగలుగుతున్నాఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్‌లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.అన్యాయం చేశావిష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.పృథ్వీతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్‌లోనే.. గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు.విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లిఅనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది.ఇన్ని రోజులు ఉంటావనుకోలేదుఅందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్‌బాస్ మంచి ఛాన్స్. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్‌లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.ప్రేరణకు భంగపాటుఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్‌లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్‌ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.నిన్ను టార్గెట్ చేయరుఅనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్‌మనీలో యాడ్ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరికంటే విష్ణుప్రియ ఎక్కువ ఇష్టం: పృథ్వీ తల్లి
కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ హౌస్‌లో అడుగుపెట్టేకొద్దీ మిగతావారంతా తమవారి కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ గేటు వైపు ఆశగా చూస్తున్నారు. ఈ రోజు విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి అడుగుపెట్టగా పృథ్వీ తల్లి, గౌతమ్ సోదరుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు.పృథ్వీ తల్లి సత్యభామ అలా ఇంట్లో అడుగుపెట్టగానే తన తల్లి గుర్తొచ్చి తేజ విలవిలా ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తున్నారు, మా అమ్మను కూడా పంపించండంటూ బిగ్‌బాస్‌ను కన్నీటితో వేడుకున్నాడు. ఇకపోతే పృథ్వీ తల్లి అందరిలోకెల్లా తనకు విష్ణు అంటే ఇష్టమంది. ఆమెకు ప్రేమగా గోరుముద్దలు సైతం తినిపించింది. విష్ణుప్రియ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. అటు గౌతమ్ సోదరుడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలాంటివి వద్దు, అందరికీ ఇంటిసభ్యుల నుంచి ఇన్పుట్స్ వెళ్లాయి కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడమని తెలిపాడు. -
యష్మి, నిఖిల్‌ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్‌లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీనే కొట్టాలనుకున్న విష్ణు.. యష్మి ఎంత పని చేసింది?
డంబ్.. ఈ ఒక్కమాటతో విష్ణుప్రియ పృథ్వీపై కోపం పెంచుకుంది. లాగి పెట్టి కొట్టాలన్నంత కోపమొచ్చింది. అతడికి ఆ మాట అన్నాడని కూడా గుర్తు లేదట.. అయినా సారీ చెప్పడంతో విష్ణు ఇట్టే కరిగిపోయింది. తాను కూడా ఏమైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ మళ్లీ అతడి మాయలోనే పడింది. మరి హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తప్పులో కాలేసిన యష్మిబిగ్బాస్ చిట్టచివరగా స్క్రూను తిప్పు-కంటెండర్ పట్టు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియను ఓడించి యష్మి విజేతగా నిలిచి కంటెండర్ బ్యాడ్జ్ ధరించింది. అయితే పొరపాటున యష్మి.. తన సూట్‌కేస్‌కు బదులు విష్ణు సూట్‌కేస్ తెచ్చి ఓపెన్ చేసింది. అందులో ఉన్న రూ.75 వేలున్నాయి. అంతలోనే తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్న యష్మి.. తప్పయిపోయింది బిగ్‌బాస్ అంటూ తన ఒరిజినల్ సూట్‌కేస్ ఓపెన్ చేసింది. అందులో రూ.1,84,000 ఉన్నాయి. కానీ బిగ్‌బాస్ దానికి ఒప్పుకోకుండా ముందుదాని ప్రకారం రూ.75 వేలను ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు.పృథ్వీ, విష్ణు మధ్య దూరంమరోవైపు పృథ్వీ ప్రవర్తనకు విష్ణుకు చిర్రెత్తిపోయింది. నన్ను డంబ్ అన్నాడు. నన్ను హర్ట్ చేసి తను మాత్రం సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకొద్దు. ఫస్ట్ టైమ్ అతడికి పంచ్ ఇవ్వాలనిపించింది అని తన కోపాన్ని, బాధనంతా యష్మి ముందు కక్కేసింది. ఇంతలో పృథ్వీ అటుగా రావడంతో యష్మి.. వీరిద్దరికీ సయోధ్య కుదర్చాలని ప్రయత్నించింది. ఆమెకు సారీ చెప్పమని అడిగింది. మనసులో స్థానం కోల్పోయాడంటూ భారీ డైలాగ్స్అతడు నో అనేసరికి నేనేమీ సారీ అడగలేదని విష్ణు అంది. అది విన్న పృథ్వీ.. నేను నీతో మాట్లాడట్లేదు అని సీరియస్‌గా అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కోపం వల్లే అతడు తన మనసులో స్థానం కోల్పోయాడని విష్ణు నిఖిల్‌తో చెప్పింది. చివరకు పృథ్వీ సారీ చెప్పడంతో విష్ణు ఆవేశమంతా చప్పున చల్లారింది. బిగ్‌బాస్ ఓ ఫన్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అవినాష్ ఫేమస్ డైరెక్టర్, రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.ఏబీసీ.. సినిమావీరిద్దరూ ఆడిషన్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారు. ఇంకేముంది.. హౌస్మేట్స్ తమ కళలు చూపిస్తూ ఛాన్స్ పొందాలని ప్రయత్నించారు. ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా.. అక్కా బావ ఎక్కడ? అనేది క్యాప్షన్ అన్నాడు అవినాష్. సినిమా పేరుకు తగ్గట్లే ఓ రియల్ సీన్ చేసి చూపించారు నిఖిల్, యష్మి, గౌతమ్. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అని పిలిస్తే నిఖిల్ వద్దని వారించాడు. యష్మిని అక్కా అని పిలుస్తావా?దీంతో గౌతమ్.. సరే నేను పిలవను, మరి నువ్వు యష్మిని అక్కా అని పిలుస్తావా? అని ప్రశ్నించాడు. ఈ మాటతో అక్కడున్న అందరూ పడీపడీ నవ్వారు. ఇలా ఫన్ టాస్క్ ద్వారా కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటలు జమైంది. పృథ్వీ తనకు అక్కర్లేదన్న విష్ణుప్రియ చివరకు అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పి మళ్లీ అతడి మైకంలోనే పడిపోయింది.మూట ముఖ్యం బిగిలు మెగా చీఫ్ కంటెండర్లు రోహిణి, ప్రేరణ, నబీల్, పృథ్వీ, యష్మిలకు మూట ముఖ్యం బిగిలు అన్న గేమ్ ఇచ్చాడు. ఎవరు చీఫ్ కాకూడదని కోరుకుంటున్నారో వారి డబ్బాలో హౌస్మేట్స్ మూటలు వేయాలన్నాడు. అలా మొదటి రౌండ్లో యష్మి, రెండో రౌండ్లో నబీల్ ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ప్రేరణ మెగా చీఫ్ అయినట్లు సమాచారం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాపై ఎవరూ ఇంత సీరియస్ అవలేదు.. నాకు పృథ్వీ వద్దు: విష్ణు
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెండర్‌షిప్ బ్యాడ్జ్ కోసం పోటీలు జరిగాయి. అందులో భాగంగా ఓ గేమ్‌లో విష్ణును బురిడీ కొట్టించి పృథ్వీ గెలిచాడు. ఆ తర్వాత పృథ్వీ, విష్ణు మధ్య ఏదో వాదులాట జరిగినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ వెనకపడుతూ ఉంటే అలుసైపోతున్నానని భావించిన విష్ణు.. అతడితో మాట్లాడటమూ మానేసింది.సారీ చెప్పువేరేవాళ్లను హర్ట్ చేసేసి అతడు మాత్రం చాలా కూల్‌గా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వద్దు అని తన బాధను యష్మితో పంచుకుంది. దీంతో యష్మి.. పృథ్వీని పిలిచి సారీ చెప్పమని అడిగింది. అంతలోనే విష్ణు కలగజేసుకుంటూ నేనేమీ సారీ అడగలేదు అనగా పృథ్వీ కోపంగా నేను నీతో మాట్లాడట్లేదు అన్నాడు.ఇకపై పృథ్వీకి దూరంగా?ఎందుకంత కోపం? కూర్చుని మాట్లాడుకుందాం అని యష్మి చెప్తుంటే కూడా మళ్లీ వస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనపై అంత కోపం చూపించడంతో హర్టయిన విష్ణు.. ఎవరూ నాపై ఇంత సీరియస్ అవలేదు.. ఇకపై ఈ వ్యక్తే లేడనుకుంటాను అని పృథ్వీని దూరం పెడుతున్నట్లు చెప్పింది.అక్కా అని పిలవకుఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్ టాస్క్‌లో అవినాష్, రోహిణి ఆయా పాత్రల్లో దూరేశారు. డైరెక్టర్ రోల్ చేసిన అవినాష్ ఏబీసీ అనే ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. ఆడిషన్స్‌లో యష్మి, నిఖిల్, గౌతమ్ ఓ సీన్ చేసి చూపించారు. అక్కా అని పిలవకు అని యష్మి అరుస్తుంటే నేను అక్కా అనే అంటాను అని గౌతమ్ వాదించాడు. ఇంతలో నిఖిల్ అక్కా అని పిలవద్దు అంటోందిగా అని మధ్యలో దూరాడు. దీంతో గౌతమ్.. సరే నేను పిలవడం మానేస్తా.. మరి నువ్వు అక్కా అని పిలుస్తావా? అని అడిగాడు. ఈ డైలాగ్‌తో అందరూ నవ్వేశారు. బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి