Russia
-
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
కలకలం.. ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో రష్యా దాడి!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్‌పై 5వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను తుదముట్టించగల ఖండాంతర క్షిపణిని రష్యా ప్రయోగించింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ నిర్ధారించింది.గురువారం తెల్లవారుజామున జరిగిన దాడిలో డ్నిప్రో నగరాన్ని క్షిపణి లక్ష్యంగా చేసుకున్నట్లు వైమానిక దళం తెలిపింది. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఈ ఆయుధాన్ని మోహరించడం ఇదే తొలిసారి అని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఖండాంతర క్షిపణలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అత్యధికంగా ఆ మిస్సైళ్లు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అయితే తాజా అటాక్ సమయంలో.. ఆరు కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. డిప్రో సిటీపై జరిగిన దాడిలో భారీ నష్టం సంభవించింది. పలు భవనాలు కూలిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్‌తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
టెన్షన్..టెన్షన్: హాట్‌లైన్‌పై రష్యా సంచలన ప్రకటన
మాస్కో:అమెరికా-రష్యా మధ్య అత్యవసర కమ్యూనికేషన్‌కు కీలకమైన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా,రష్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే రెండు దేశాల అధ్యక్షులు చర్చించేందుకు ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని,ఇది వీడియో కూడా ప్రసారం చేయగలదని పెస్కోవ్ గతంలో చెప్పారు.అయితే ప్రస్తుతం ఇది వినియోగంలో లేదని తాజాగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిచ్చారు. కాగా,రష్యాపై అమెరికా తయారీ లాంగ్రేంజ్ మిసైల్స్ వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వడంతో యూరప్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.దీనికి ప్రతిగా అణ్వాయుధాల ప్రయోగంపై నిబంధనలను రష్యా సరళతరం చేసింది.ఈ పరిణామాల నడుమ మంగళవారం(నవంబర్ 19) కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి.ఇందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు దాడి చేయవచ్చనే భయాలు పెరిగిపోయాయి. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఖాళీ చేసింది.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా,రష్యా మధ్య హాట్‌లైన్ వాడకంలో లేదన్న వార్త మరింత భయాందోళనలకు కారణమవుతోంది. -
ఉక్రెయిన్‌లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ గ్రీన్‌సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
వెయ్యి రోజుల యుద్ధం
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నేటికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణగా రూపుదిద్దుకుంది. పలు నివేదికలలోని వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఒక మిలియన్(10 లక్షలు)కు పైగా జనం మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.2022లో ప్రారంభమైన 21వ శతాబ్దపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి నిరంతరం హృదయాన్ని కదిలించే వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ఆ దేశం ఎంతో బలహీనంగామారింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం యుద్ధంలో 80 వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారు. నాలుగు లక్షల మందికి పైగా సైనికులు గాయపడ్డారు. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన వివరాల ప్రకారం రష్యన్ సైనికుల మరణాల గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివేదికలలో మరణించిన సైనికుల సంఖ్య సుమారు రెండు లక్షలు, గాయపడిన వారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలుగా పేర్కొన్నారు. రెండు దేశాల జనాభా ఇప్పటికే క్షీణించింది. యుద్ధానికి ముందే ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధం కారణంగా సంభవించిన భారీ మరణాల ప్రభావం ఇరు దేశాల జనాభా గణాంకాలపై కనిపిస్తోంది.మరణించిన సైనికుల డేటా గోప్యం?ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌లో ఆగస్టు 2024 నాటికి 11,743 మంది పౌరులు మరణించారు. 24,614 మంది గాయపడ్డారు. ముఖ్యంగా మారియుపోల్ వంటి రష్యన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఈ మరణాలు సంభవించాయి. ఇదేకాకుండా ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 589 మంది చిన్నారులు కూడా మరణించారు. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, గ్రౌండ్ దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. జాతీయ భద్రత కోసం యుద్ధంలో మరణించిన తమ సైనికుల డేటాను ఇరుపక్షాలు గోప్యంగా ఉంచాయని, పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఇచ్చిన అంచనాలలో చాలా తేడా ఉందని ఒక ఈ మీడియా నివేదిక పేర్కొంది. సైనిక ప్రాణనష్టం విషయంలో కూడా రష్యాకు భారీ నష్టం వాటిల్లిందనే అంచనాలున్నాయి ఈ భీకర యుద్ధంలో ఒక్క రోజులో వెయ్యి మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ 2024, ఫిబ్రవరిలో 31 వేలకు పైగా ఉక్రేనియన్ సైనికులు మృతిచెందారని తెలిపారు.ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం మృతియుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఉక్రెయిన్‌లో దాదాపు నాలుగు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు మిలియన్లకు పైగా ఉక్రేనియన్ పౌరులు విదేశాల్లో ఆశ్రయం పొందారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ జనాభా 10 మిలియన్లకు పైగా తగ్గింది. ఇది అక్కడి జనాభాలో నాలుగింట ఒక వంతు. అంటే ఉక్రెయిన్ జనాభాలో 25 శాతం తుడిచిపెట్టుకుపోయింది. యుక్రేనియన్ ప్రభుత్వం యుద్ధంలో రోజువారీ ఖర్చు 140 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ అని అంచనా వేసింది. ఉక్రెయిన్ 2025 ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ కోసం 26 శాతం అంటే 53.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంయుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33 శాతం క్షీణించింది. 2023లో ఈ పరిస్థితి కాస్త మెరుగుపడి నష్టం 22 శాతానికి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్‌లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది.ఉక్రెయిన్‌లో కొంతభాగం రష్యా స్వాధీనంరాయిటర్స్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌లో ఐదవ వంతును రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతాలను తన అదుపులో ఉంచుకుంది. ఈ భాగం గ్రీస్ దేశ పరిమాణంతో సమానం. రష్యన్ దళాలు 2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌లోని ఉత్తర, తూర్పు, దక్షిణ భాగాలలో దాడి చేసి, ఉత్తరాన కీవ్ శివార్లకు చేరుకుని, దక్షిణాన డ్నిప్రో నదిని దాటాయి. రష్యా దాదాపు ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని, దక్షిణాన అజోవ్ సముద్ర తీరాన్ని స్వాధీనం చేసుకుంది.పుతిన్‌కు గిట్టని ఉక్రేనియన్ గుర్తింపు ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లేనని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లక్షలాది మంది ప్రాణాలను బలిగొనడమే కాకుండా ఇరు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి కూడా దారితీసింది. ఇది కూడా చదవండి: భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై దృష్టి పెడతామని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!
ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్‌లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది. ఆ విషయమై పిటిషన్‌ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం. దయచేసి బెడ్రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. ఇతర దేశాల్లో..దక్షిణ కొరియాఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్‌లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్‌గా పొందొచ్చు. జపాన్జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.చైనాచైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?) -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
Tony Radakin: రోజుకు 1,500!
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు. ‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి. పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కిమ్’ సైనికులు కొందరు చనిపోయారు: జెలెన్స్కీ
కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.తమపై యుద్ధానికి కుర్స్క్లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు. కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ఉన్కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
ట్రంప్‌తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్‌తో మాట్లాడు తూ.. పుతిన్‌తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్‌ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
పాశ్చాత్య ఆధిపత్యం ముగిసేనా?
మొత్తం ప్రపంచపు ఆర్థిక నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున ‘బ్రిక్స్’ కూటమి చేయగలిగిందేమీ లేదన్నది గతంలో పాశ్చాత్య దేశాల ధీమా. కజాన్(రష్యా) కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందుకే పట్టించుకోలేదు. కానీ బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం పాశ్చాత్య దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. అదే సమయంలో ఇండియా భాగస్వామిగా గల బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు వర్ధమాన దేశాల్లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచమనీ, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమనీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిక్స్ కూటమి కజాన్ డిక్లరేషన్ అక్టోబర్ 23న విడుదలైన తర్వాతి పరిణామాలను గమనించినపుడు ప్రధానంగా కనిపిస్తున్నవి రెండున్నాయి. ఒకటి – వర్ధమాన దేశాలన్నిటా ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం. రెండు – పాశ్యాత్య ప్రపంచంలో కలవరపాటు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, కరీబియన్లతో పాటు యూరప్‌లోని సాధారణ స్థాయి ప్రభుత్వాధినేతలు, ఇతర నాయకులు, మేధావులు, యాక్టివిస్టుల అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు, ప్రకటించిన కార్యక్రమం అందరికీ తమ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కల్పించటమే అందుకు కారణం. దానితో ఉన్నట్టుండి అందరూ బహుళ ధ్రువ ప్రపంచమని, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమని మాట్లాడుతున్నారు.మరొక వైపు పాశ్చాత్య ప్రపంచ స్పందనలను గమనించండి. మొదట బ్రిక్‌గా ఉండిన కూటమి ఆ తర్వాత బ్రిక్స్‌గా మారి కజాన్ కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించింది. కానీ ఆ కూటమిని అంత సుదీర్ఘ కాలంలో కూడా పాశ్చాత్య దేశాలు గానీ, వారి ఆధిపత్యాన నడిచే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గానీ, అక్కడి నిపుణులు, మేధావులు గానీ లెక్క చేయలేదు. కజాన్ సమావేశం కన్నా ముందువరకు అందులో ఇండియా, చైనా (ఆసియా నుంచి), రష్యా (యూరప్ నుంచి), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా నుంచి), బ్రెజిల్ (దక్షిణ అమెరికా నుంచి) ఉండేవి. అయిదు కూడా భౌగోళిక వైశాల్యం, జనాభా, ఆర్థికశక్తి, సైనిక బలం రీత్యా ప్రముఖమైనవే. వాటి ఉమ్మడి బలాలు మొత్తం యూరప్ కన్నా, కొన్ని విషయాలలో యూరప్‌తో పాటు అమెరికాను కలిపినా ఎక్కువే. అయినప్పటికీ పాశ్చాత్య కూటమికి తక్కిన ప్రపంచం పట్ల మొదటి నుంచి గల చులకన భావంతో వారటువంటి వైఖరి తీసుకుంటూ వచ్చారు.ఈ దృష్టికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇతర దేశాలు ఏమి మాట్లాడి, ఏమి చేసినా, మొత్తం ప్రపంచపు ఆర్థిక, ద్రవ్య నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున బ్రిక్స్ చేయగలిగిందేమీ లేదన్నది వారి ధీమా. ఇందుకు ఒక కీలకం అమెరికన్ డాలర్; అంతే కీలకమైనవి ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ (బిఐఎస్), ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్; అదేవిధంగా, బ్రిక్స్‌తో సహా అత్యధిక దేశాల నగదు నిల్వలు పాశ్చాత్య కరెన్సీలలో ఉండటం, వారి అస్తులు కూడా అనేకం పాశ్చాత్య దేశాలలో ఉండటం; అన్నిదేశాల ఎగుమతి దిగుమతులు, పరస్పర చెల్లింపులు డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీల ద్వారా జరగటం. ఈ ఆర్థిక ప్రాబల్యాలు పాశ్చాత్యులకు రాజకీయ, సైనిక ప్రాబల్యాలను కూడా సహజంగానే తెచ్చిపెడుతున్నాయి.ఈ వలయంలో చిక్కుకున్న బ్రిక్స్గానీ, మరొకటిగానీ చేయగలిగిందేమిటి? అందువల్లనే 2006 నుంచి 2024 కజాన్ డిక్లరేషన్ సమయం వరకు అమెరికా, యూరప్ బ్రిక్స్‌ను పట్టించుకోలేదు. అటువంటిది ఈ డిక్లరేషన్‌తో మొదటిసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అందుకు కారణం బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం. ఇది వాస్తవ రూపంలో జరిగేందుకు మరికొన్ని సంప్రదింపులు అవసరమైనా, ఆ నిర్ణయం సూత్రరీత్యా జరగటమే పాశ్యాత్య కరెన్సీలకు పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం. ఈ చెల్లింపులు ఇప్పటికే కొన్ని దేశాల మధ్య మొదలయ్యాయి కూడా! బ్రిక్స్ దేశాల డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఇప్పటికే ఏర్పడి పనిచేస్తున్నది. భవిష్యత్తులో బ్రిక్స్ సొంత కరెన్సీ ఆలోచన కూడా ఉంది. ఈ నిర్ణయాలపై కజాన్ అనంతరం పాశ్చాత్య దేశాలు అధికారిక ప్రకటనలైతే ఇంకా చేయలేదు. కానీ, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ అన్నిటికీ నాడీ కేంద్రం వంటి బిఐఎస్ అధికారుల స్పందనను గమనిస్తే రహస్యం తెలిసిపోతుంది. ఆ చెల్లింపులు ఇప్పటి వలె డాలర్ల రూపంలో గాక బ్రిక్స్ నిర్ణయించినట్లు స్థానిక కరెన్సీలలో జరగటం అంతటా మొదలైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పు కాగలదని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు వారు. దాని అర్థాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే, డాలర్ ప్రపంచం తలకిందులవుతుందన్నమాట! చమురును భారీగా ఉత్పత్తి చేసే నైజీరియా ఇక నుంచి డాలర్‌కు బదులు తమ కరెన్సీ నైరాలో విక్రయించాలని ఈ వ్యాసం రాసే సమయానికి నిర్ణయించటం విశేషం.మనం చేసే పనిలోని మంచిచెడులను గ్రహించాలంటే మన ప్రత్యర్థి స్పందనలను గమనించాలంటారు. కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌లు యథాతథంగానే వర్ధమాన దేశాలన్నిటా తక్షణ ఉత్సాహాలకు, ఆశాభావాలకు కారణమయ్యాయి. పైన పేర్కొన్న బిఐఎస్ అధికారుల వ్యాఖ్యలు, కొందరు పాశ్చాత్య మేధావుల వ్యాఖ్యలను బట్టి, ఈ డిక్లరేషన్‌లోని ఆర్థికపరమైన ఆలోచనలు ఏ విధంగా వర్ధమాన దేశాలను పాశ్చాత్యుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయగల అవకాశం ఉందో వారికి బాగా అర్థమవుతున్నది. డాలర్ శక్తి, ఆర్థిక లావాదేవీల నియంత్రణ, వర్ధమాన దేశాల ముడి సరుకుల ధరల తగ్గింపు, అక్కడి మార్కెట్లలో తమ ఉత్పత్తుల ధరల పెంపు, ఆ యా దేశాల కరెన్సీ విలువల కుదింపు, తమ మాట వినని వారిపై ఆంక్షలు, తమ బ్యాంక్‌లలోని ఆ యా దేశాల నిధుల స్తంభన వంటివన్నీ పాశ్చాత్య దేశాలకు ఒక క్రీడగా మారి యథేచ్ఛగా సాగుతూ వస్తున్నాయి. ఇపుడిక క్రమంగా వీటన్నిటికి బ్రేకులు పడగలవన్నది వర్ధమాన దేశాలకు ఒక కొత్త ఆశాభావం అవుతుండగా, పాశ్చాత్య రాజ్యాలకు అదే గుబులు పుట్టిస్తున్నది. అందుకే, సౌదీ అరేబియా తన చమురును చైనాకు యువాన్‌లో కాక డాలర్లలో విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తాజావార్తలు చెప్తున్నాయి.కజాన్ డిక్లరేషన్‌లో ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు, సంబంధాలతో నిమిత్తం గల పేరాగ్రాఫ్‌లు, వర్ధమాన దేశాల మధ్య వివిధ సహకారాలు, ఇతర సంస్కరణల గురించిన ప్రస్తావనలు కూడా వర్ధమాన దేశాలంతటా సానుకూల స్పందనలకు కారణమవుతున్నట్లు ఈ వారం రోజుల కథనాలు చెప్తున్నాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాలకు అణగిమణగి ఉంటాయనే భావన గల పలు దేశాలు సైతం నెమ్మదిగా ధిక్కార స్వరంతో మాట్లాడుతూ బ్రిక్స్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నాయి. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా జరగాలనే అవగాహన ఉన్నందున, సభ్యదేశాల సంఖ్య వేగంగా పెరిగితే అందుకు చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్తవారిని ఆచితూచి తీసుకోనున్నారు. కజాన్ దరిమిలా ప్రపంచంలో ఎన్నడూ లేని కొత్త మార్పునకు ఆరంభం జరుగుతున్నదని పలువురు పాశ్చాత్య మేధావులు సైతం భావిస్తున్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, కజాన్ డిక్లరేషన్ అమలులో తగినన్ని సాధక బాధకాలున్నందున జాగ్రత్తగా ముందడుగులు వేయవలసి ఉంటుందనే గుర్తింపు బ్రిక్స్‌లోనూ ఉంది.పోతే, అమెరికాతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా భారతదేశం 2006 లోనే బ్రిక్స్‌లో చేరి, ఈ కజాన్ డిక్లరేషన్‌లోనూ సాహసవంతమైన విధంగా భాగస్వామి కావటం గమనించదగ్గది. ఏ అవసరాల కోసం అమెరికాకు సన్నిహితంగా ఉన్నా, తన మౌలికమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం తక్కిన వర్ధమాన దేశాలతో కలిసి నడవటమే సరైనదన్న గుర్తింపు ఉండటమే అందుకు కారణమనాలి, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరచుగా తన ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో చెప్తున్న మాటలు వినేవారికి ఇది స్పష్టమవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు