samaikya andhra movement
-
రెబెల్స్ గెలిస్తేనే సమైక్యాంధ్ర ఉన్నట్టు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ బరిలో ఉన్న కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు గెలిస్తేనే సమైక్యాంధ్ర ఉద్యమం ఉన్నట్టని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. రెబెల్స్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని వారి నామినేషన్లపై సంతకాలు చేసిన వారిని కాంగ్రెస్ నేతలు కోరడాన్ని తప్పుబట్టారు. సంతకాలు వెనక్కి తీసుకోండని ఒత్తిడి చేయడం, గదుల్లో బంధించడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతిస్తే తాము ఇవ్వబోమన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీపరంగా ప్రజలకు ఇచ్చే హామీలు, ప్రణాళికలను రూపొందించేందుకుగాను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించిన ఈ కమిటీకి ప్రొఫెసర్ శేషగిరిరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. -
హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌కు అనుమతి ఇవ్వరా?: ఏవీ పటేల్
విశాఖపట్నం: హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదనడంపై సమైక్యాంధ్ర గెజిటెడ్ ఫోరం అధ్యక్షుడు ఏవీ పటేల్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తాము 15రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగాంగానే త్వరలో ఉద్యమ కార్యాచారణ సిద్ధం చేస్తున్నామని ఏవీ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు అనుమతి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌కు తెలియకుండానే .. రాష్ట్ర విభజనకు సిద్దమవ్వడం దారుణమని ఏవీ పటేల్ పేర్కొన్నారు. -
10 నుంచి ఉవ్వెత్తున ఉద్యమం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం 10న విద్యార్థి, యువకుల ర్యాలీలు.. 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు 12న హైవేల దిగ్బంధం- వంటా వార్పు 14న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సభలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ మేరకు శనివారం తదుపరి కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే ప్రాంతాల్లో డిసెంబర్ 10న విద్యార్థులు, యువకులతో ర్యాలీలు, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీలు, 12న రహదారులతో పాటు హైవేల దిగ్బంధం, అదే రోజు వంటా వార్పు, 14నజిల్లాల్లోని ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు చొప్పున భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది విద్యార్థులు, యువకులు, రైతులే కనుక వారు ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్య లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు అన్ని వృత్తి వర్గాల వారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏకమై ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. విభజన బిల్లు ముసాయిదా కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొంది రాష్ట్రపతికి చేరుకున్నది కనుక ఈ తరుణంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమం ఉధృతం చేయాలని, ఈ తరుణంలో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా విభజన వల్ల నష్టపోతున్న ప్రాంతాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొనాలని జగన్ కోరారు. 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నా రాష్ట్రాన్ని చీల్చాలని చూడ్డం నిరంకుశత్వం అని ఆయన అన్నారు. పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీల నేతలను జగన్ కలుసుకుని విభజనకు వ్యతిరేకంగా వారి అభిప్రాయాన్ని కూడగడుతున్నారని, విభజన బిల్లును పార్లమెంట్లో అన్ని పక్షాలతో కలిసి అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. -
అదే జోరు.. జనోద్యమం @ 122
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 122వ రోజూ శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. సైమైక్యాంధ్ర మ్యాప్ ఆకారంలో కూర్చుని రాష్ట్రాన్ని విభజించవద్దని నినదించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అధికారులతో మంత్రి కాసు కృష్ణారెడ్డి సమైక్యాంధ్ర జిందాబాద్, విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు... అని నినాదాలు చేయించారు. ఇక్కడ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలంటూ గట్టిగా నినాదాలు చేయించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా, తెలుగు వారి ఆశయాలకు అనుగుణంగా తొలిసారిగా రూపుదిద్దుకున్న భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విభజిస్తుంటే చూస్తు ఊరుకోబోమని కృష్ణా జిల్లా కలిదిండి జేఏసీ నాయకులు హెచ్చరించారు. విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద విద్యార్థి సమరభేరి నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల పాదయాత్ర గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం పేరిట పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను, రాష్ట్ర పరిరక్షణకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిర్విరామకృషిని వివరిస్తున్నారు. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కడపలో పాదయాత్రలు జరిగాయి. చిత్తూరులో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. ఇక కృష్ణా, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లాల్లో దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన.. సమైక్య భేరి
సాక్షి నెట్వర్క్: అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటన వచ్చిన దరిమిలా సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 118వ రోజూ సోమవారం కోస్తా, రాయలసీమ ప్రజ సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ వివిధ రూపాల్లో ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండి సెంటరులో జేఏసీ నాయకులు దహనం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నాగాయలంకలో ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విభజనకు అనుకూల ప్రకటనలు చేస్తున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను నెల్లూరులో దహనం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ‘రాష్ట్ర విభజన- విద్యార్థుల భవిష్యత్తు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి శైలజానాథ్‌కు ‘సమైక్య’ సెగ మంత్రి డాక్టర్ శైలజానాథ్‌కు అనంతపురం జిల్లా మండల కేంద్రమైన బత్తలపల్లిలో సోమవారం ‘సమైక్య’ సెగ తగిలింది. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘రచ్చబండ’కు హాజరైన మంత్రిని వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు నిర్విరామపోరు సాగిస్తున్న పార్టీ శ్రేణులు సోమవారం నాడూ వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించాయి. చిత్తూరు, నెల్లూరు , తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలుచోట్ల ప్రారంభించిన దీక్షలు కొనసాగుతున్నాయి. -
విధులు నిర్వర్తిస్తూ.. జనోద్యమం @ 115
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 115వ రోజైన శుక్రవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో కొనసాగింది. పలు జిల్లాల్లో జోరున వర్షం కురుస్తున్నా ఉద్యమం మాత్రం సడలలేదు. ఎన్జీవోలు ఓవైపు కార్యాలయాల్లో విధులకు హాజరవుతూ మరోవైపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చిత్తూరులో న్యాయవాదులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో సాప్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో చేశారు. పుంగనూరులో బీసీ సంఘం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సమైక్య ఉద్యమాన్ని తక్కువచేస్తూ మాట్లాడిన పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ దిష్టిబొమ్మను కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ నాయకులు దహనం చేశారు. అవనిగడ్డలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం భారీవర్షంలోనూ కొనసాగాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగాయి. అనేకచోట్ల గడపగడపకూ వైఎస్సార్పీపీ పేరిట పాదయాత్రలు కూడా నిర్వహించారు. మంత్రి కాసుకు సమైక్య సెగ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి సమైక్య సెగ తగిలింది. రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన కాన్వాయ్‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కాసు కారు దిగి ఆందోళనకారుల వద్దకు రాగా, మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా నినాదాలు చేశారు. విభజనను అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. -
కార్పొరేషన్లో కిరికిరి
= కమిషనర్ తీరుకు నిరసనగా ఉద్యోగుల మూకుమ్మడి సెలవు = అన్ని రకాల ప్రజా సేవలు బంద్ = విజయలక్ష్మి తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు నగర కమిషనర్ విజయలక్ష్మి తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో నగర పాలన స్తంభించింది. గతంలో రెండు నెలల పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రజా సేవలు బంద్కాగా ఇప్పుడు ఉద్యోగుల ఆధిపత్య పోరుతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిత్యం వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం గమనార్హం. రచ్చకెక్కిన విభేదాలు కమిషనర్ విజయలక్ష్మి, ఉద్యోగుల మధ్య కొంతకాలంగా అంతర్గతపోరు సాగుతోంది. చివరకు ఉద్యోగులు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో విషయం రచ్చకెక్కింది. కమిషనర్ తీరు నిరసిస్తూ ఉద్యోగులంతా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. బుధవారం మూకుమ్మడి సెలవులు పెట్టి విధులకు గైర్హాజరయ్యారు. అందరి సంతకాలతో కూడిన సెలవు చీటీని కమిషనర్‌కు అందించి ఒకరోజు సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా అందరూ ఒకేసారి ఎలా సెలవు పెడతారని ఉద్యోగులను కమిషనర్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆమె హెచ్చరించారు. ఉద్యోగుల మూకుమ్మడి సెలవుతో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. కమిషనర్ మాత్రమే విధులు నిర్వహించారు. ఉద్యోగుల్లేకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వివిధ పనులపై వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కమిషనర్ వ్యవహార శైలిపై కార్పొరేషన్ ఉద్యోగులంతా కలెక్టర్ విజయ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె వేధింపులు భరించలేకపోతున్నామని వినతి పత్రం అందించారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్గతపోరుతో అన్ని విభాగాల్లోనూ ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. దీంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కుంటుపడిపోతుండగా కాంట్రాక్టర్లకు చె ల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక ప్రజలు కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇక నిత్యం ఎదురయ్యే పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. చెప్పినా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. దీనికంతటికీ కారణం కమిషనర్ వ్యవహార శైలి అని ఉద్యోగులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులే సక్రమంగా పనిచేయడం లేదని కమిషనర్ మండిపడుతున్నారు. కమిషనర్ వ్యవహారం పూర్తిగా తమను అవమానపరిచే విధంగా ఉందంటూ ఉద్యోగులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఒక్క ఫైల్‌ను కూడా ఉద్యోగులు సక్రమంగా రూపొందించడం లేదని కమిషనర్ చెబుతున్నారు. సక్రమంగా పనిచేయమనడం తప్పా అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరి అంతర్గతపోరుతో చివరికి ఇబ్బంది పడుతోంది సామాన్యులే. చాలాకాలం నుంచి కార్యాలయంలో జరుగుతున్న అంతర్గతపోరును ప్రత్యేకాధికారిగా కలెక్టర్ విజయ్‌కుమార్‌తో పాటు మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు కమిషనర్, ఉద్యోగుల మధ్య వివాదానికి కాంట్రాక్టర్లే కారణమన్న ప్రచారం కూడా జరుగుతోంది. పనులకు సంబంధించి బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండటం, ఆ ఫైళ్లపై కమిషనర్ సంతకాలు చేయకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులను నడిపిస్తున్నారనే విమర్శలు కాంట్రాక్టర్లపై వ్యక్తమవుతున్నాయి. దాదాపు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కార్పొరేషన్ వివాదంపై ఆర్ డీ విచారణ నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, ఉద్యోగులకు మధ్య సాగుతున్న వివాదంపై మున్సిపల్ ఆర్డీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న వివాదంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ బుధవారం ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెడుతున్నారనే సమాచారం అందిందని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ అధికారిగా పంపారని చెప్పారు. ఈ వివాదంపై అటు ఉద్యోగులతో, ఇటు కమిషనర్‌తో ఇద్దరితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటానన్నారు. కమిషనర్, ఉద్యోగుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నాయన్నారు. కార్యాలయంలో అంతర్యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై పూర్తి సమాచారం సేకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా పారిశుధ్య విభాగానికి చెందిన ఉద్యోగులను ఆయన ప్రశ్నించారు. కమిషనర్‌తో ఏమైనా ఇబ్బందులుంటే లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కోరారు. అయితే సదరు ఉద్యోగులు మాత్రం కమిషనర్‌తో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని, కేవలం అసోసియేషన్పరంగా సమావేశం నిర్వహిస్తున్నామంటేనే మంగళవారం సమావేశానికి వచ్చామని సమాధానమిచ్చారు. అయితే బుధవారం ఉద్యోగుల మూకుమ్మడి సెలవులో వీరూ విధులకు గైర్హాజరవడం గమనార్హం. మొత్తం ఎంతమంది సెలవు పెట్టారనే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్డీ శ్రీనివాస్ తెలిపారు. కార్యాలయ విభేదాలపై ఇరుపక్షాలతో మాట్లాడి పూర్తి నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తానని వివరించారు. అనంతరం ఆయన ఉద్యోగులు, కమిషనర్ విజయలక్ష్మితో చర్చలు జరిపారు. -
సీఎం సమైక్యాంధ్ర మోసగాడు : రాఘవులు
బాబు తెలంగాణలో ఓ మాట... సీమాంధ్రలో మరోమాట ఒంగోలు, న్యూస్‌లైన్ : ‘సమైక్యాంధ్ర ఉద్యమ మోసగాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. సొంత వర్గాన్ని కూడగట్టుకుని రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారు. సమైక్య సింహం అనే పుస్తకాన్ని వేయించుకుని రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తెలంగాణలో ఓ మాట, సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఆయన వాదనలో నిజాయితీ లేదు..’ అని దుయ్యబట్టారు. ‘వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిణామాలు’ అనే అంశంపై ఒంగోలులో బుధవారం నిర్వహించిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ వార్ రూంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈ సమైక్య సింహం ఏం చేస్తోందని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించి చంద్రబాబు తప్పు చేశారన్నారు. -
అలుపెరగని జనోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. వరుసగా 98వ రోజూ మంగళవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా ఎగసింది. విశాఖ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ను ఎన్జీవోలు ముట్టడించారు. భీమవరంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డుపై బైఠారుుంచారు. దువ్వలో రైతు జేఏసీ నాయకులు, ఆకివీడులో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, భీమడోలులో వికలాంగులు నిరశన దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సమైక్యవాదులు ధర్నా చేశారు. కాకినాడలో న్యాయవాదుల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ కూడలిలో విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ శపథం చేశారు. కృష్ణాజిల్లా చల్లపల్లి, కలిదిండిలో డ్వాక్రా మహిళలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. మైలవరంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన చేపట్టారు. విజయవాడలో న్యాయవాదులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యార్థులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కుప్పంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, చిత్తూరులో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ర్యాలీ చేశారు. రాయదుర్గంలోని విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలోని కోటిరెడ్డి కూడలిలో వందలాదిమంది విద్యార్థులు భారీ మానవహారం నిర్మించారు. ప్రొద్దుటూరు, బద్వేలు, రైల్వేకోడూరు పట్టణాల్లో విద్యార్థులు మానవహారాలుగా నిలబడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణుల నిర్విరామపోరు జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమిస్తున్న పార్టీ శ్రేణులు మంగళవారం నాడూ ఆందోళనలు చేపట్టాయి. సమైక్య ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దిష్టిబొమ్మలను పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిలో దహనం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఐస్‌లు అమ్మి వినూత్న నిరసన తెలిపారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గుం టూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
చిరంజీవిపై రాళ్లువిసిరిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి చిరంజీవి ఏమంటా వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలు పెట్టారో అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలిలో నిన్న వరద బాధితులు చిరంజీవి తమ వద్దకు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో నాటుపడవ ఎక్కబోతూ కాలుజారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు అతనిపై రాళ్లు విసిరారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన చిరంజీవి కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు. వారితోపాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. నిన్న ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు. కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆ తరువాత కాకినాడ సమీపంలోని తిమ్మాపురంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించే సమయంలో పడవ ఎక్కబోయి కాలుజారి నీటిలో పడ్డారు. అయితే సిబ్బంది వెంటనే ఆయనను పట్టుకొని లేపారు. ఈ విధంగా ఆయన వెళ్లిన ప్రతిచోట ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. -
ఉద్యమంలోకి చొరబాటెలా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కమిటీ గురువారం తొలిభేటీ నిర్వహించనుంది. సీమాంధ్రలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీరు తెన్నులు, పార్టీ శ్రేణులు అందులో భాగస్వాములు కావడం అనే అంశాలపై చర్చించనున్నారు. అంతిమంగా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అధిష్టానం అభీష్టానికి అనుగుణంగా దాని దశదిశలను మార్చడమెలా అన్నదానిపై కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసప్రాంగణం క్లబ్‌హౌస్‌లో గురువారం ఈ భేటీ జరగనుంది. సమైక్య ఉద్యమం నేపథ్యంలో గత రెండు నెలలుగా కాంగ్రెస్ నేతలెవరూ సొంత నియోజకవర్గాల్లో అడుగుపెట్టలేకపోయారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గానికి రెండునెలలుగా ముఖం చాటేయాల్సి వచ్చింది. ఒకటిరెండుసార్లు ఆ ప్రాంతానికి వెళ్లినా ఎవరి కంటా పడకుండా రాత్రికి రాత్రి వెళ్లిరావడంపై పార్టీవర్గాల్లోనే చర్చ సాగింది. ఇటీవలి పై-లీన్ తుపాను పుణ్యమా అని ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెనుంచి ఒకింత వెనక్కు తగ్గడంతో ఇదే అదనుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. సమైక్య ఉద్యమంలోకి తాము, తమ అనుచరులు చొరబడేలా కార్యాచరణ రూపొందించడమే ప్రధాన ఎజెండాగా గురువారం భేటీ కొనసాగనుంది. అధిష్టానం ఆలోచనల మేరకే..: అధిష్టానం ఆలోచనల మేరకే ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స అధికారికంగా ఈ కమిటీ జాబితాపై సంతకం కూడా చేశారు. ఇపుడీ భేటీ కూడా అధిష్టానం సూచనల మేరకే నిర్వహిస్తున్నట్లు సమాచారం. కమిటీలో తమ అభీష్టానికి అనుగుణంగా నడచుకొనే సీనియర్ మంత్రులతో పాటు ఇతర నేతలకు పెద్దపీట వేశారు. సమైక్యవాదాన్ని వినిపించే సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి వంటి వారిని, పార్టీ వైఖరిని విమర్శించే వారిని దూరంగా ఉంచారు. అధిష్టానం మాటను జవదాటని మంత్రులు, నేతలను ఇందులో నియమించడం ద్వారానే కమిటీ వైఖరి స్పష్టమవుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. సమైక్యం అని కాకుండా సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు రక్షించుకోవాల్సి ఉందని ప్రకటిస్తూ వస్తున్న మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి వంటి వారికి కమిటీలో పెద్దపీట వేశారు. ఇక టీజీ వెంకటేశ్, తోటనరసింహం, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, బాలరాజు, అహ్మదుల్లా వంటి వారు అధిష్టానం ఎలా చెబితే అలా నడచుకుంటామని చెబుతుండడంతో గురువారం నాటి భేటీలో చర్చ సమైక్యం అని కాకుండా ప్రజలను విభజన దిశగా ఎలా ఒప్పించాలనే దిశగానే సాగే అవకాశముందని పార్టీనేతలే పేర్కొంటున్నారు. -
పార్టీలతో కేంద్రం చర్చలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో విడివిడిగా లేదా సంయుక్తంగానైనా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల అవసరాల కోసం అవకాశవాదానికి పాల్పడవద్దని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందానికి స్పష్టమైన సూచనలు చేయాలని కోరింది. రెండు రోజుల పాటు జరిగే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితిపై ఆమోదించిన తీర్మానాన్ని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు చెబుతున్న ధర్మం, న్యాయం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే విభజన బిల్లు పెట్టాలంటున్న వెంకయ్య నాయుడు ఇప్పటి దాకా ఆ మాట ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్రకు ఏం కావాలో వెంకయ్య చెప్పాలని నిలదీశారు. అవకాశవాదాన్ని విడనాడాలని, అస్పష్టంగా మాట్లాడవద్దని హితవుపలికారు. సీమాంధ్ర ఉద్యమకారుల సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. తనకు చేతకానప్పుడు ఉద్యమకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రప్రభుత్వం ముందుంచాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభానికి తమ పార్టీ సూచిస్తున్న పరిష్కారం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని చెప్పారు. తాము ఇప్పటికీ భాషాప్రాతిపదిక రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రపతి పాలనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. విజయనగరంలో దాడులు, ఉద్రిక్త పరిస్థితులకు బొత్స, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలే కారణమని పార్టీ అభిప్రాయపడినట్టు వివరించారు. కర్ఫ్యూ అనంతరం అమాయకులు.. బొత్స అంటే గిట్టనివాళ్లపై కేసులు పెట్టి వేధించనున్నారని తెలిపారు. ఢిల్లీలో వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీ నాయకుల్ని కలవడంలో ప్రత్యేకత ఏమీ లేదని, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించినట్టే తమనూ కలిశారని రాఘవులు చెప్పారు. -
కదం తొక్కిన సీమాంధ్ర రైతులు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రం విడిపోతే మొట్టమొదటగా నష్టపోయేది సీమాంధ్ర రైతన్న. సాగునీరు సక్రమంగా అందక భూములు బీడులుగా మారే ప్రమాదం ఉంది. నీటికోసం యుద్ధాలూ జరగవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర రైతు కదం తొక్కారు. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి అనంతరం పెద్దఎత్తున దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దీక్షకు ముందు వందలాది మంది రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాలకొల్లు, తణుకు, భీమవరం, నరసాపురంలలో వివిధ రకాల పంటలు ప్రదర్శిస్తూ దీక్ష చేపట్టారు. జంగారెడ్డిగూడెం, గోపాలపురంలలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన రైతుదీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. కాజులూరులో జరిగిన రైతు దీక్షలో పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. కె. గంగవరంలో జేఏసీతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో రైతుగర్జన నిర్వహించారు. రాజానగరం, కోరుకొండల్లో దీక్షలు చేపట్టారు. పిఠాపురం, రౌతులపూడిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, కాడెడ్లతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రైతుగర్జన పేరిట రిలే నిరాహార దీక్షలు జరిగాయి. శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద జాతీయ రహదారిపై సమైక్యవాదులు ఎడ్ల బళ్లతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో జరిగిన దీక్షలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, అరుకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. మదన పల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. సత్యవేడు, పీలేరులలో దీక్షలు జరుగుతున్నాయి. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దీక్షలు ప్రారంభించారు. గంగాధర నెల్లూరులో పార్టీ జిల్లా కన్వీనర్ కే. నారాయణస్వామి దీక్షలను ప్రారంభించగా, కొత్తపల్లిమిట్టలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్యాపిలి, కొలిమిగుండ్ల, ఆలూరు, ఆళ్లగడ్డ, తుగ్గలిలో ఎడ్లబండ్లతో రైతులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ నాయకుడు వై. సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడువేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి.. 205 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధనరెడ్డి, దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్షలుప్రారంభమయ్యాయి. సైదాపురం, రాపూరు, వెంకటగిరిలో జరిగిన దీక్షల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. నాయుడుపేటలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో రైతు దీక్షల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ పాల్గొనగా, మంగళగిరి, ఉండవల్లి, దుగ్గిరాల మండలాల్లో దీక్షలను పార్టీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కనిగిరి, హనుమంతునిపాడు, మార్కాపురంలలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కందుకూరులో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ దీక్షలను ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు దీక్షలు జరిగాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం మక్కపేట నుంచి వత్సవాయి వరకు ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. -
సీమాంధ్ర జిల్లాల్లో.. సమైక్య శపథం
సాక్షి నెట్వర్క్: సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కోట్లాది గొంతుకలు ఒక్కటై మార్మోగిస్తున్న నినాదం సమైక్యాంధ్రప్రదేశ్. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉంచాలంటూ ప్రతిఒక్కరూ ఆశిస్తూ, స్వాశిస్తూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా 63వ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లాయి. సమ్మెబాట పట్టిన ఆర్ అండ్ బీ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు విజయవాడలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ఒంగోలులో ఆటోలతో భారీర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో బ్రాహ్మణులు రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞయాగాదులు నిర్వహించారు. గుంటూరులో ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం ఎదుట అధ్యాపకులు నడిరోడ్డుపై నమూనా న్యాయస్థానం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విభజన వాదులతో వాద ప్రతివాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో రజకులు ఒంటెద్దు బండ్లతో ర్యాలీ చేపట్టి చాకిరేవు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యమకారులు జోలెపట్టి భిక్షాటన చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కాకినాడ-పిఠాపురం రహదారిపై కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, సోనియా, షిండే మాస్కలను గాడిదలకు కట్టి ఊరేగించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ- ఆంధ్రాకు అడ్డంగా గోడ కట్టి అనంతరం దాన్నిబద్దలు కొట్టి వినూత్న నిరసన తెలిపారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థులు సోనియా, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్ వరకు రెండు జిల్లాలను కలుపుతూ మహా మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నీలమణి దుర్గమ్మ అమ్మవారికి వేలాది మంది మహిళలు ముర్రాటలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పూజలు చేశారు. రాజీనామా చేసి రండి అధికారపార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ సమైక్యవాదులు నిలదీస్తున్నారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలకు అనంతపురం జిల్లా గుంతకల్లులో సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారివురు దీక్షా శిబిరం వద్దకు వెళ్లగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు. కేంద్రమంత్రి పనబాకలకిష్మని కృష్ణాజిల్లా గుడివాడలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పినా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలోని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆమె కార్యాలయంలో నుంచి బయటికొచ్చి, ప్రసుత తరుణంలో రాజీనామాలు అవసరంలేదని, తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటే పదవిలో ఉండాలని వివరించడంతో సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఆందోళనకారులు అక్కడే బైఠాయించి సుమారు మూడు గంటలసేపు నినాదాలు హోరెత్తించారు. పులికాట్ పొలికేక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో పులికాట్ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చారు. కోవూరులో చేపట్టిన రైతుగర్జనకు రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రైతులు ఊక బస్తాలతోర్యాలీ చేసి, అనంతరం ఊకను రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సర్పవరంలో ఐదువేల మందికి పైగా గ్రామస్తులు సకలజన ఘోష పేరిట సమైక్య నినాదం వినిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో రైతు రణభేరిపేరిట నిరసన తెలిపారు. నర్సాపురంలో భవన నిర్మాణ కార్మికులు సమైక్య గర్జన సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’కి సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. సభలో గజల్ శ్రీనివాస్ పాడిన గేయాలు సభికులకు ఉత్తేజాన్నిచ్చాయి. కార్మికులతో ఆర్టీసీ ఎండీ చర్చలు విఫలం బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపబోమన్న నేతలు తిరుపతి, న్యూస్‌లైన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఆర్ఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా సీమాంధ్రలో ఇప్పటికే సంస్థ రూ.630 కోట్లు నష్టపోయిందని ఖాన్ నతెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, ప్రస్తుతం నడుస్తున్న 107 ఆర్టీసీ బస్సులకు అదనంగా 150 బస్సులు నƒ డపాలని సూచించారు. జీతాలకన్నా జీవితాలు ముఖ్యమని, సమ్మెలో సడలింపు ఉండదని కార్మిక నాయకులు తేల్చి చెప్పారు. ఈ నెల 5 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, సమయం ఉంది కాబట్టి పునరాలోచించాలని చివరిగా ఖాన్ సూచించారు. దసరా అడ్వాన్సగా మూడు వేల రూపాయలు ఇప్పించాలని కార్మిక నేతలు కోరగా పరిశీలిస్తానన్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవోతో చర్చలు జరిపారు. కార్మిక నేతలతో మరోమారు చర్చలు జరుపుతామని తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రానున్న 120 కొత్త బస్సులను ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు. -
విరామమెరుగుని సీమాంధ్ర పోరు
సాక్షి నెట్వర్క్: అరవై ఒక్క రోజులుగా అలుపెరుగని సమైక్య ఉద్యమం సీమాంధ్రలో సెలవురోజైన ఆదివారం కూడా ఉద్ధృతంగా సాగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ప్రజలు వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తించారు. కృష్ణాజిల్లా కైకలూరు లో తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడానికి తట్టా, బుట్టలతో ప్రదర్శన చేశారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్రతీరంలో మునిసిపల్ ఉద్యోగులు జలదీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వంద కార్లతో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు అరటి గెలలు కట్టిన సైకిళ్లతో రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన 2వేలమంది రైతులు ఆచంట వరకు పాదయాత్ర నిర్వహించారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో అగ్నిదీక్ష చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు పెట్టుకుని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ఎదుట ఆందోళన చేశారు. బొబ్బిలిలో బొత్స దంపతుల మాస్కులు వేసుకున్న వారు ద్విచక్ర వాహనంపై పరారవుతున్నట్లు నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆర్సీఎం లూర్దుమాత చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలో సహకార సమరం పేరుతో సహకార సంఘాల అధ్యక్షులు, డెరైక్టర్లు, రైతులు డీసీసీ బ్యాంకు ఎదుట సామూహిక దీక్షలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు వద్ద 1,553 మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టగా, సీమాంధ్ర జిల్లాలకు చెందిన 723 మంది సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. అనంతపురంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. 7నుంచి సమ్మెలోకి .. ఇరిగేషన్ లాక్ సూపరింటెండెంట్ల సంఘం అక్టోబర్ ఏడో తేదీ నుంచి నీటిపారుదలశాఖ లాక్ సూపరిం టెండెంట్స సమ్మెబాట పట్టనున్నట్లు లాక్ సూపరింటెండెంట్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఆస్కారరావు, ప్రసాద్‌లు విజయవాడలో తెలిపారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాము కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ సమైక్యహోరు బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదాలతో బెంగళూరు నగరం దద్దరిల్లింది. ఆదివారం ఉదయం ఇక్కడి ఫ్రీడంపార్కలో జరిగిన జై సమైక్యాంధ్ర మహాగర్జనకు వేలాది మంది తరలివచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజా సమతి అధ్యక్షుడు బొందు రామస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. రామస్వామి మాట్లాడుతూ.. రాష్ర్ట విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరుజిల్లా గుమ్మిడిపూండి యూని యన్ పాదిరివేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రూ.24కోట్లు నష్టపోయిన కేఎస్ ఆర్టీసీ: విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె కారణంగా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ ఆర్టీసీ) రూ.24కోట్ల ఆదాయం కోల్పోయిందని ఆ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు. నన్నే రాజీనామా చేయమంటారా..? సమైక్యవాదులపై టీడీపీ ఎంపీ ‘శివ’తాండవం సాక్షి నెట్వర్క: చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీకి చెందిన ఎంపీ డాక్టర్ శివప్రసాద్‌కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. పలమనేరులో ఆందోళనకారులు అడ్డుకోగా, ‘‘నన్నే అడ్డుకుంటారా.. నన్నుమించిన సమైక్య మొనగాడు ఎవరైనా ఉన్నారా’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీగా స్పీకర్ ఫార్మెట్లో ఎందుకు రాజీనామా చేయలేదని, మీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన దానిపై ఎందుకు మాట్లాడరంటూ నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎంపీ.. ఇలా చేస్తే తాను పార్లమెంట్లో నోరెత్తనని, అసలు రాజీనామానే చేయనన్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సమైక్య ఉద్యమం గురించి అసలు పట్టించుకోనని మీరేం చేస్తారో చేసుకోండంటూ విరుచుకుపడ్డారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సమైక్యసభకు వెళ్లివస్తూ విద్యార్థి మృతి గుండెపోటుతో మరో ఉద్యమకారుడు కన్నుమూత సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమంలో చురుకుగా పొల్గొంటున్న ఇద్దరు ఆదివారం అసువులుబాసారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బసిరెడ్డిపాళెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి సుధాకర్‌రెడ్డి (18) వింజమూరులో జరిగిన ‘సమైక్య విజృంభణ’కు హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం తన బైక్‌పై సొంతూరికి బయలుదేరాడు. బొమ్మరాజుచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న మినీటాక్సీని ఢీకొనడంతో సుధాకర్‌రెడ్డి మృతిచెందాడు. అలాగే, పొదలకూరు మండలంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ, దళితగర్జన నిర్వహణ సన్నాహాల్లో నిమగ్నమైన పాణ్యం సురేష్(48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. తోడేరు పంచాయతీ శాంతినగర్‌కు చెందిన సురేష్ బస్టాండ్ సెంటర్లో 35 రోజులుగా జరుగుతున్న రిలేదీక్షల్లో రోజూ పాల్గొనేవాడు. -
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏపీ ఎన్జీవోలు
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి బుధవారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ నాలుకలు కోస్తామంటూ తెలంగాణ నాయకులు చేస్తున్న హెచ్చరికలను ఖండించారు. ‘నాలుకలు కోస్తే మూగవాళ్లం అవుతాం. కాళ్లు విరగ్గొడితే వికలాంగులమవుతాం. కళ్లు పీకేస్తే అంధులం అవుతాం. మేం ఏమైనా, మమ్మల్ని ఏం చేసినా సరే సమ్మెను కొనసాగించి తీరతాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం’ అని స్పష్టంచేశారు. ‘మా నాలుకలు కోయాలంటే మా దగ్గరకు రావాలి. మా దగ్గరకు వస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోం’ అని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలూ దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. హిందూపురం సభలో తమ మాటలను వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ అందరిదీ అనే అర్థంలోనే తాము మాట్లాడామన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రాంతం అంటే తమకు ప్రేమ ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారని, తెలంగాణ నోట్ వచ్చే సమయంలో తాము కూడా దేశ రాజధానికి తరలివెళ్లి ధర్నా చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెల 27న ముట్టడించనున్నట్లు ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ వెల్లడించారు. గన్‌ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆ రోజున ముట్టడిని పోలీసులు అడ్డుకుంటే 28న జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామన్నారు. -
మరింత ఉధృతంగా ఉద్యమం : వైఎస్ విజయమ్మ
ఆ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయమ్మ ఉద్బోధ సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఈ బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వారికి ఉద్బోధించారు. సీమాం ధ్ర ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయమ్మ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల వైఖరిని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. సమైక్యాంధ్ర విషయంలో అవి రెండూ నాటకాలాడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ‘‘వారి వాలకం చూస్తూంటే హఠాత్తుగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించేలా ఉంది. కనుక అలా జరగకుండా ఉండేందుకు, ‘కాంగ్రెస్, టీడీపీ నేతలు ముందే పదవులకు రాజీనామాలు చే యాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి’’ అన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే రాజకీయ సంక్షోభం సృష్టించడం తప్పనిసరి. అందుకోసం సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజీనామా చేయాలి. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయనతో పాటు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘ఆంటోనీ కమిటీ వేశాం, సమస్యలు చెప్పుకోండి అని కాంగ్రెస్ పార్టీ ఓ వైపు చెబుతూ.. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతుందంటోంది. కేంద్ర హోంమంత్రి షిండే నోట్ తయారైందంటున్నారు. ఇలాంటి సమయంలో సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంది’ అని వైఎస్సార్సీపీ నేతలకు వివరించారు. రాజశేఖరరెడ్డి నినాదమే పార్టీ విధానమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అదే స్ఫూర్తి, బాధ్యతతో 2014 ఎన్నికల్లో పని చేయాలని కోరారు. వైఎస్ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు: విజయమ్మ రాష్ట్రంలోని ఏ జిల్లా, ఏ గ్రామమైనా ఓటు అడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని విజయమ్మ అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి తాను చేసిన మంచి పనుల వల్ల అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన తన హయాంలో ఏనాడూ ప్రాంతాలు, మనుషులను వేరుగా చూడలేదు. అందరినీ ప్రేమించారు. సంతృప్త స్థాయిలో అన్ని ప్రాంతాలు, వర్గాల వారికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండా దేశ చరిత్రలోనే లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేసే పనులు వైఎస్ ఏనాడూ చేయలేదు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ తనవారే అనుకొని మూడున్నర దశాబ్దాల పాటు ప్రజలకు అండగా ఉన్నారు’’ అని గుర్తు చేశారు. సమైక్యమే జగనన్న అభిమతం: షర్మిల సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీ శ్రేణులు మరింత ఉధృతంగా పాల్గొనాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపు నిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారని అభినందించారు. ‘‘రాష్ట్ర విభజన జరగరాదనేది, అప్పుడే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నది జగనన్న ప్రగాఢ అభిమతం. అందుకు అనుగుణంగా పార్టీ రూపొందించిన ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా ఒకే రోజున ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని జగనన్న చెప్పమన్నారు. అందుకే నెల రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను పార్టీ ప్రకటిస్తోంది. విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీల నేతలే మళ్లీ ప్రజల్లోకి వచ్చి సమైక్యాంధ్ర అంటున్నారు. వారి ద్వంద్వ వైఖరిని ఎండగట్టండి. భేటీలో పీఏసీ కోఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ముఖ్య నేతలు భూమా శోభానాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జూపూడి ప్రభాకరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, దాడి వీరభద్రరావు తదితరులు మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కన్వీనర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ‘సమైక్య’ తీర్మానం శనివారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం పలు డిమాండ్లతో కూడిన తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించినట్టు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. అవి... - తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. - విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన సీఎం కిరణ్, తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆలపించడం కంటితుడుపే. ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేదాకా కేబినెట్ నోట్ రాదంటూ ఇంతకాలం కాలయాపన చేసిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం రాజీనామాలు చేసి విభజనను అడ్డుకోవాలి. - రాష్ట్ర విభజనకు అనుకూలంగా బ్లాంక్ చెక్ మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి.ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం విడిపోకుండా చూడాలి. - విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో పెల్లుబికిన ప్రజా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వివిధ రాజకీయేతర జేఏసీలకు పార్టీ అభినందనలు తెలపాలి. సమైక్యాంధ్రపై స్పష్టత ఇవ్వకుండా డ్రామాలాడుతున్న పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా వైఖరిని మార్చుకునేలా జేఏసీలు మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీల ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేలా ఒత్తిడి చేయాలి. - నిర్బంధంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బయటకు రాలేని పరిస్థితుల్లో 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిలకు, ఆమెతో పాటుగా అడుగులో అడుగు వేసి నడిచిన నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అభినందనలు తెలియజేస్తోంది. -
సమైక్యాంధ్ర సాధనే ఊపిరిగా
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ ఆందోళనలు శుక్రవారంతో 52వ రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండో రోజు వరుసగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఒంగోలు నగరంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓల ఉద్యమంతో నగరంలోని బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు రెండవ రోజు తలుపులు తెరుచుకోలేదు. అలాగే గురువారం ఒంగోలు వచ్చిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యవహరించిన తీరుకు, సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు పనబాక లక్ష్మి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కింద మంట పెట్టిన పెద్ద పాత్రల్లో కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు 500 అడుగుల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు దీక్షా శిబిరం వద్ద రోడ్డుపై ఆటలు ఆడి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని, అంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండో రోజూ తెరుచుకోని కార్యాలయాలు, బ్యాంక్‌లు: ఉద్యోగుల ఉద్యమంలో వరుసగా రెండో రోజు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. అద్దంకిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. అనంతరం ఆర్టీసీ, ఎన్జీఓ జేఏసీ నాయకులు మూతికి నల్లబ్యాడ్జీలు కట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు, మేదరమెట్ల - నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై మానవహారం, రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బంగ్లారోడ్‌లో చేపట్టిన ఉద్యోగుల రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఇక రాష్ట్ర విభజనను నిరసిస్తూ అద్దంకిలో ముస్లింలు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. కొరిశపాడు మండలం రావినూతలలో సమైక్యాంధ్ర కోసం విద్యార్థులతో ర్యాలీ, ఆంధ్రప్రదేశ్ ఆకారంలో మానవహారం నిర్వహించారు. బల్లికురవలో ఉపాధ్యాయుల నిరసన దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇక చీరాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 24వ రోజుకు చేరాయి. మాలమహానాడు ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నాయిబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. మార్టూరు మండలంలోని కోలలపూడిలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా వరినాట్లు వేసి నిరసన తెలిపారు. యద్దనపూడిలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు మానహారం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో గిద్దలూరు మండలంలోని క్రిస్టియన్ సమైక్యాంధ్ర అసోసియేషన్ సభ్యులు దీక్షలు చేపట్టారు. కంభంలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. జేఏసీ నాయకులు అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు, టెలిఫోన్ కార్యాలయాలను మూయించారు. కొమరోలులో ఆర్య మరాఠీలు భారీ ర్యాలీ, వంటావార్పు, వివిధ వేషధారణల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు తెలిపారు. కందుకూరులో వరుసగా రెండవ రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. టంగుటూరులో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. శింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెం గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కనిగిరిలో జన చైతన్యయాత్ర: కనిగిరిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్య ఆరో గ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది రిలే దీక్షలో కూర్చున్నారు. పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగి పాఠశాలలు మూయించడం, సమైక్యాంధ్రకు మద్దతుగా పం చాయతీల్లో తీర్మానాలు చేయించడం, ప్రజలను చైతన్యం చేసేందుకు జన చైతన్య యాత్రను చేపట్టారు. గ్రామీణ ఆటో కార్మికులు రాష్ట్ర విభజనకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ రిలే దీక్షలు పదో రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు 12వ రోజు కొనసాగాయి. హనుమంతునిపాడులో సమైక్యాంధ్రకు మద్దతు జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి, బ్యాంక్‌లు మూయించారు. సీఎస్ పురం మండలం డీజీపేటలో ఉపాధ్యాయులు రోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేపట్టారు. పామూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేశారు. పొదిలి చేరిన ఆత్మఘోష పాదయాత్ర: ఆర్యవైశ్యులు చేపట్టిన ఆత్మఘోష పాదయాత్ర పొదిలి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ దోర్నాలలో ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రెడ్డి సామాజిక వర్గం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సమైక్య నినాదాలతో హోరెత్తించారు. దాదాపు 130 ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. -
మళ్లీ కలసి విన్నవిద్దాం: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లటానికి సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఆ పార్టీ ఎంపీలు సాహసించటంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగినా అంతా సోనియా దయకే వదిలేయాలని నిర్ణయించారు. సమైక్య ఉద్యమంపై ఇప్పటికే అనేకసార్లు కలసి వివరించినప్పటికీ మరోసారి అదే విషయాన్ని సోనియా ముందు విన్నవిద్దామని తీర్మానించారు. శనివారం మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో జరిగిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు సమావేశంలో.. పదవులకు రాజీనామా చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ మెజారిటీ సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. పదవులు వదులుకుంటే అధిష్టానంతో మాట్లాడేందుకు అవకాశం కోల్పోతామని, అందువల్ల రాజీనామాల జోలికి వెళ్లొద్దన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తామంతా ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలసి.. ఆంటోనీ కమిటీనీ సీమాంధ్రలో పర్యటింపచేయటం, ఆ తరువాత నివేదిక రూపకల్పన, ఆ నివేదికను పరిశీలించి సాధ్యాసాధ్యాలను చర్చించాకనే తెలంగాణపై ముందుకు వెళ్లాలని కోరటం వంటి అంశాలపై సమాలోచనలు జరిగాయి. సోనియాను కలసిన తర్వాత ఆమె సూచనలేమిటో విన్న తర్వాత ముందుకు వెళ్లాలన్న భావనకు మంత్రులు, ఎంపీలు వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో తాజా పరిస్థితులపై రాజకీయ కోణంలోనే సాగినట్లు తెలుస్తోంది. సమావేశానికి కేంద్రమంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీలు కె.వి.పి.రామచంద్రరావు, అనంతవెంకటరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, ఎస్.పి.వై.రెడ్డి, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, బొత్స ఝాన్సీ హాజరయ్యారు. మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి గైర్హాజరయ్యారు. ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, చింతామోహన్, రత్నాబాయి, సుబ్బరామిరెడ్డి హాజరుకాలేదు. నేదురుమల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోగా మరో ఎంపీ సబ్బంహరి కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు తొలినుంచి దూరంగానే ఉంటున్నారు. మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆ తర్వాత కావూరికి ఫోన్‌చేసి సమావేశానికి తాను రాలేకపోయినా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తాను కూడా కలసి ఉంటానని చెప్పినట్లు సమాచారం. అది నన్ను ఉద్దేశించే అన్నట్లుంది: చిరు ఈ సమావేశంలో మంత్రి చిరంజీవి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజనకు కొంతమంది సీమాంధ్ర మంత్రులు సహకరిస్తున్నారని లగడపాటి ఇటీవల చేసిన ప్రకటన, గుంటకాడ నక్కల్లా ముఖ్యమంత్రి పదవికోసం కాచుక్కూర్చున్నారంటూ వస్తున్న విమర్శల గురించి చిరంజీవి సమావేశంలోనే ప్రస్తావించి.. ఇది కేవలం తననుద్దేశించి చేసిన ప్రకటనగానే కనిపిస్తోందంటూ లగడపాటిపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. తనకు అలాంటి ఉద్దేశం లేదని లగడపాటి బదులిచ్చినట్లు సమాచారం. -
ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్ : లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు సమైక్య దెబ్బ తగిలింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్రలో ‘తెలుగుతేజం’ పేరుతో పర్యటన ప్రారంభించిన జేపీకి తొలిరోజే సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రం వెనుకబడిపోతుంది. రాష్ట్రం విభజన జరిగినా, జరగకపోయినా... మన ప్రాంతం, ప్రజల గురించి ఆలోచించకుండా ఆందోళనలు చేయడం వల్ల నష్టం మనకే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమైక్య వాదులను రెచ్చగొట్టాయి. విభజన అనివార్యమైతే రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చేసిన సూచన కూడా ఆందోళన కారులకు రుచించలేదు. దీంతో దాదాపు రోజంతా ఆయన బస చేసిన రాష్ట్ర అతిథిగృహం వద్ద ఆందోళన నిర్వహించి రాత్రి వరకు ఆయనను దాదాపుగా నిర్బంధించినంత పని చేశారు. ఉదయం 9 గంటలకు కర్నూలుకు వచ్చిన జేపీ ఓ ప్రైవేట్ పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై ఆయన తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ముఖం బాగోలేదని ముక్కు కోసుకుంటామా? రాష్ట్ర విభజన జరిగిందని సమ్మెలు చేస్తూ, విద్యార్థులను రోడ్లపైకి తేవడం, స్కూళ్లు, కళాశాలలు మూసేయడం, విద్యుత్ సమ్మె నిర్వహించడం వల్ల నష్టం మనకే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ ఆజ్యం పోస్తే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన జరిగితే ప్రత్యేక ప్యాకేజీతో రాయలసీమను కోరతాం.’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కూడా ఇదే తరహాలో మాట్లాడటంతో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. మైకులు, సౌండ్‌బాక్సులు లాగేసి జేపీ డౌన్‌డౌన్ నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బంద్‌లు, సమ్మెలు చేయడం మూర్ఖత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు కర్నూలు జనం ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యోగులు జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన తాను బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ఉద్యమకారులు అక్కడకు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఉద్యమకారులు తమదే నైతిక విజయం అంటూ వెళ్లిపోవడంతో జేపీ అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. కాగా, సాయంత్రం 3 గంటల సమయంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో ‘రాష్ట్ర విభజన- సమస్యల పరిష్కారం’ పేరుతో నిర్వహించదలచిన రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమకారుల ఆందోళనలతో రద్దయింది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో కశాశాల యాజమాన్యమే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజకీయ పార్టీల వికృత క్రీడ ఇది: జేపీ తమ పార్టీ నుంచి తనను ఒక్కరినే గెలిపించారని, 30 సీట్లు ఇచ్చి ఉంటే చరిత్ర మార్చేవాడినని జేపీ అన్నారు. 2004 వరకు రాష్ట్రంలో 5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్, టీడీపీలు రెచ్చగొట్టాయని జేపీ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం 2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం టీ ఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ వాదాన్ని బలోపేతం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కూడా ఓట్లు, సీట్ల కోసమే రాక్షస రాజకీయ క్రీడ ఆడుతోందన్నారు. ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న ఉద్యోగ జేఏసీ చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రవుణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వాహనాలను ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు వూట్లాడుతూ తామూ సమైక్యాంధ్ర వుద్దతుదారులమేనని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నావున్నారు. చిరంజీవిని ఘెరావ్ చేసిన ‘విశాలాంధ్ర’ కార్యకర్తలు మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేస్తున్న కోట్లాది మంది సామాన్య తెలుగు ప్రజలతో నడవాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు శనివారం కేంద్ర మంత్రి చిరంజీవిని ఘెరావ్ చేశారు. ఆయన ఇంటిని ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద, బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ సముదాయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర సమైక్యతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు చిరంజీవి ఇంటి వద్ద బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లోలేని చిరంజీవి విషయం తెలుసుకుని విశాలాంధ్ర నేతలకు ఫోన్ చేశారు. తాను మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తున్నానని, అక్కడ కలవాల్సిందిగా సూచించారు. దీంతో కార్యకర్తలంతా అక్కడకు చేరుకున్నారు. మార్గమధ్యంలో కారు ఆపి వారి వద్దకు వచ్చిన చిరంజీవిని ఘెరావ్ చేస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడతానని చిరంజీవి ఎంత కోరినా వినిపించుకోలేదు. రాజీనామా చేసి తమతో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకుంటే ఇక్కడికిక్కడే రాజీనామా చేసి మీ చేతికి ఇస్తానంటూ ఆయన ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. డ్రామాలు కట్టిపెట్టాలంటూ నిలదీశారు. సమైక్య ఉద్యమానికి సానుభూతి అవసరం లేదని, మీ పదవీ త్యాగం కావాలంటూ నినాదాలు చేశారు. చేయని పక్షంలో రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన పత్రం అందజేశారు. దీంతో చిరంజీవి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. మంత్రి శత్రుచర్లకూ... అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జేఏసీ, ఏపీ ఎన్జీఓ ప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఓడించేందుకు ఓటు ఉండాలని, ఉద్యమకారులు కొంత సమన్వయం పాటించాలన్నారు. సీఎం కిరణ్ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని,తాను కూడా అదే నినాదానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అంతకు ముందు బొబ్బిలిలో కూడా సమైక్యవాదులు మంత్రిని అడ్డుకున్నారు. రాయపాటికీ సమైక్య వేడి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీ రాయపాటి సాంబశివరావు వస్తున్నారని తెలుసుకున్న సమైక్మవాదులు వారిని అడ్డుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎంపీ రాయపాటి ఒక్కరే వచ్చారు. ముందుగానే సమాచారం అందుకున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి వందగజాల దూరంలోనే ఆందోళనకారులను అడ్డుకుని వెనక్కు పంపించగా రాయపాటి రిబ్బన్ కత్తిరించి పోలీస్ బందోబస్తు మధ్యవెళ్లిపోయారు. అటు తరువాత సాయంత్రం ఎవరూలేని సమయంలో వచ్చిన మంత్రి డొక్కా గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. -
జిల్లావ్యాప్తంగా జోరుగా సమైక్య ఉద్యమం
సాక్షి, రాజమండ్రి : ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని నిర్విరామంగా నినదిస్తూనే ఉన్నారు జిల్లావా సులు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రగులుకున్న ఆగ్రహం ఆ నిర్ణయం రద్దుతోనే చల్లారుతుం దంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నానాటికీ బలోపేతమవుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. బుధవారం ఏలేశ్వరంలో మహిళా శక్తి సంఘాలకు చెందిన సుమా రు 5000 మంది మహిళలు విభజనవాదులారా ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. తొలుత ర్యాలీ జరిపి, అనంతరం బాలాజీ చౌక్‌కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తామని, విభజనవాదుల కుయుక్తులను తిప్పి కొడతామని ముక్త కంఠంతో నినదించారు. రాజమండ్రిలో వివిధ ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేశారు. కంబాలచెరువు సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సీబీఎం పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేసి, కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. సోనియాకు మంచి బుద్ధి కలగాలని సీబీఎం విద్యాసంస్థ చైర్మన్ ఎం.రత్నకుమార్ ప్రార్థన చేశారు. జగన్నాథపురం వద్ద విద్యార్థినులు సైకిల్ ర్యాలీ చేశారు. కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్వంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు వంటావార్పూ చేపట్టారు. డీఈఓ కార్యాలయం వద్ద విద్యాశాఖ ఉద్యోగులు దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రిలో ఐసీడీఎస్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. యూటీఎఫ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు రాజమండ్రి మోరంపూడి సెంటర్లో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలుత జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ఎన్జీఓలు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. అమలాపురంలో కోనసీమ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం గడియారస్తంభం సెంటర్లో సమైక్య నినాదాలు చేస్తూ వివిధ ఆటలు ఆడారు. వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పప్పుల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్లు నక్కా చిట్టిబాబు, బండారు రామ్మోహన్రావు, తాతాజీ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. అల్లవరం మండలం లో అంగన్ వాడీ వర్కర్లు రిలే దీక్షలు ప్రారంభించారు. అమలాపురం గడియారస్తంభం సెంటర్లో కొనసాగుతున్న రిలే దీక్షల్లో చల్లపల్లి పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ ముట్టడిపై జేఏసీ నేతలు సమీక్ష చేశారు. డప్పు వాయించిన ఎమ్మెల్యే ముమ్మిడివరం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన 72 గంటల దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తిరిగి వస్తూ తెలంగాణ వాదుల దాడులకు గురైన ఉద్యోగులను రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆత్రేయపురంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎమ్మార్పీస్ నేతల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విమర్శిస్తున్న వారు ఆ ధోరణి మానుకోక పోతే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు. ఆయన అదే గ్రామంలో మిఠాయి దుకాణంలో స్వీట్లు తయారు చేసి, డప్పు వాయించి నిరసన తెలిపారు. వెయ్యిమీటర్ల జాతీయ జెండా.. సమైక్యాంధ్రకు మద్దతుగా మలికిపురంలో ఆక్వారైతులు వెయ్యిమీటర్ల సమైక్య జెండాతో ర్యాలీ నిర్వహించారు. రాజోలులో న్యాయవాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. పిఠాపురంలో కొనసాగుతున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు మద్దతు తెలిపా రు. సామర్లకోటలో రజకులు రోడ్డుపై దుస్తులు ఉతికారు. రోడ్డు పైనే బండ్లు పెట్టి, ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్, పట్టణ, రూరల్ మండలాల కు చెందిన 300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సామర్లకోట తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పెద్దాపురంలో చాచా విద్యానికేతన్, బ్యాంకు కాలనీ మహిళలు, జేఏసీ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా భజన మానండి.. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెపుతున్న కేంద్ర మంత్రులు సోనియా భజనతో కాలం వెళ్లబుచ్చుతున్నారని, ప్రజల గోడు పట్టించుకోవడం లేదని చాటుతూ రామచంద్రపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొందరు కేంద్ర మంత్రుల మాస్కులు ధరించి సోనియా మాస్క్ ధరించిన వ్యక్తి చుట్టూ కూర్చుని భజనలు చేశారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో వంటా వార్పూ జరిగింది. కె.గంగవరం మండలం బాలాంతరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో విద్యార్థులు ర్యాలీ చేసి ప్రధాన రహదారి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. విడిపోతే రాష్ట్రం ఎడారే.. పచ్చని చేలతో కళకళలాడే రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని తాను రూపొందించిన కళాకృతి ద్వారా చాటారు అయినవిల్లి మండలం వెలవలపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కాకర శ్రీనివాస్. విభజనకు ముందు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉన్నట్టుగా ఒక చిత్రం, విభజన తర్వాత సీమాంధ్ర ఎడారిగా మారినట్టు మరో చిత్రం థర్మోకోల్‌తో రూపొందించి అందరినీ ఆలోచింపజేశారు. కాగా పచ్చగా కళకళలాడే రాష్ట్రంలో సోనియా గాంధీ, కేసీఆర్ కలుపు మొక్కల్లా తయారయ్యారని, వారిని ఏరివేయాలని నినాదాలు చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మామిడికుదురులో పొలాల్లో కలుపుమొక్కలు తొలగించారు. అనంతరం బస్టాండు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. పాశర్లపూడి కొండాలమ్మచింత సెంటర్లో ట్రాక్టర్ల నిర్వాహకుల సంఘం ఆధ్వర్వంలో సమైక్య వాదులు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంచి అర్ధనగ్నంగా ధర్నా చేశారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో గ్రామస్తులు వంటావార్పూ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ అధికారులపై తమకు మమకారం తప్ప ద్వేషం లేదని చాటి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ 50వ డివిజన్ నాయకుడు గుత్తుల మురళీధర్ ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లశాఖ డీఐజీ నరసింహ, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ న్యూటన్, ఆరుగురు జైలర్లను పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ‘తెలంగాణ , సీమాంధ్రవాసుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు సోదరభావంతో మెలగాలని విజయలక్ష్మి పిలుపు నిచ్చారు. ఉద్యోగులు, ప్రజలు కలిసి మెలసి ఉండాలని డీఐజీ ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో జరుగుతున్న నిరాహార దీక్షల్లో ఏపీ పేపరు మిల్లు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మామిడికుదురులో 23వ రోజు దీక్షల్లో భాగంగా అప్పనపల్లికి చెందిన మహిళలు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే గ్రామంలో ఆక్వారైతులు నిర్వహించిన ర్యాలీకి పార్టీ కో ఆర్డినేటర్లు చింతపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాశ్ మద్దతు పలికారు. పెద్దాపురం, సామర్లకోట జేఏసీ దీక్షా శిబిరాలను వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు అలమండ చలమయ్య ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రధానరహదారిలో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేసి బాలాజీ చౌక్‌లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. -
వేర్పాటుపై తిరుగుబాటు
సాక్షి నెట్వర్క్ : తెలుగుజాతి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై సీమాంధ్ర ప్రజానీకం తిరుగుబాటు ఉధృతంగా సాగుతోంది. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం 38వరోజైన శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉవ్వెత్తున ఎగసింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మహిళలు 101 బోనాలెత్తుకుని రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పూజలు చేపట్టారు. పట్టణంలోని జేఏసీ శిబిరాన్ని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరులో బ్రాహ్మణులు శాంతి హోమం నిర్వహించారు. దేవనకొండలో సమైక్యంధ్రను కోరుతూ 990 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కళాకారుల ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక్కరోజు దీక్షలో కూర్చున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వ్యాపారుల సంఘం బంద్ పాటించింది. నెల్లూరులో రైతులు ట్రాక్టర్లతో తడ తహశీల్దార్ కార్యాలయం నుంచి బజారుసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన, మానవహారం జరిగాయి. పొదలకూరులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కవితా గర్జన ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా గ్రంథాలయం ఎదుట కవులు, రచయితలు తమ గళం, కలాలతో కవితా గర్జన నిర్వహించి సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించారు. ఉలవపాడు ఎంఈవో శ్రీమన్నారాయణ ఆమరణ దీక్షకు ఎంపీడీవోలు, తహసీల్దార్లు సంఘీభావం పలికారు. అద్దంకిలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, పొక్లయిన్లతో భారీ ర్యాలీ జరిగింది. సమైక్యాంధ్ర కోరుతూ గుంటూరు, చిలకలూరిపేటలో ముస్లింలు భారీ శాంతి ప్రదర్శన నిర్వహించారు. బాపట్లలో మున్సిపల్ ఉద్యోగులు అర్ధనగ్నప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా జగయ్యపేటలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. విజయవాడలోని కెనాల్ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్యోగ సంఘాలు సర్వమత ప్రార్ధనలు నిర్వహించాయి. పాత బస్టాండ్ వద్ద దేవాదాయశాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో 10 వేల మంది రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో రోడ్డుపైనే పరీక్షలు రాసి విద్యార్థులు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు ఆధ్వర్యంలో వందలాది మంది చెవిటి, మూగ, వికలాంగులు అనపర్తి దేవీచౌక్‌లో ధర్నా చేపట్టారు. రాజమండ్రిలో 190 మంది రక్తదానం చేసి తెలంగాణలోని ఆస్పత్రులకు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గంపేటలో గృహిణులు జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. బొత్స దంపతులపై బొబ్బిలిలో ఫిర్యాదు పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ దంపతులు కనిపించడంలేదంటూ బార్ అసోసియేషన్ సభ్యులు విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌లో సమైక్యవాదులు ఫిర్యాదు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బ్రాహ్మణులు రోడ్డుపై విశ్వశాంతి యోగం నిర్వహించి 72 గంటల దీక్షను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలపగా, టెక్కలిలో రోడ్లు ఊడ్చారు. విశ్రాంత ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాయం ఆవరణలో వంటావార్పు చేపట్టారు. పాలకొండలో ఎన్.కె.రాజపురం గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆఫీసుపై టమాటాలతో దాడి కర్నూలు : రాష్ట్ర విభజనకు ముందుగానే బ్లాంక్ చెక్ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు బస్సు యాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు ముందుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించి టమాటాలతో దాడిచేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీ తెలుగు ప్రజల కోసమే పుట్టిందని టీడీపీ కార్యకర్తలు చెప్పగా, అది ఎన్టీఆర్ ఉన్నప్పటి మాట అని, చంద్రబాబు వచ్చాక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చిందన్న ధైర్యంతో కేంద్రం రాష్ట్ర విభజనకు బరితెగించిందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉపాధ్యాయులు వెనుదిరుగుతూ ముందుగానే తెచ్చుకున్న టమాటాలను టీడీపీ కార్యాలయంపైకి విసిరారు. కలిసే ఉందాం.. మార్మోగిన లక్ష గొంతుకల సమైక్య భే రి సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో లక్షలాదిమంది ప్రజ రోడ్లపైకి వచ్చి సమైక్య భేరి మార్మోగిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన లక్షగళ సమైక్యభేరిలో ఉద్యమకారులు గర్జించారు. వేర్పాటువాదాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన లక్ష జనగళ ఘోషతో పట్టణమంతా జై సమైక్యాంధ్ర నినాదం పోటెత్తింది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రెడ్ల సంఘం ఆధ్వర్యంలో 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. వంగపండు ఉష ఆటాపాటతో సమైక్య వాదుల్లో ఉత్తేజాన్ని నింపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర పరిధిలోని విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు కంబాలచెరువు సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాజులూరు నుంచి గొల్లపాలెం వరకు ఐదువేల మందికి పైగా సమైక్యవాదులు 20 కిలోమీటర్ల మేరపాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర గర్జన వినిపించారు. మార్టూరులో వేలాదిమంది విద్యార్థులు జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్వహించిన ‘సింహగర్జన’ బహిరంగసభలో వేలాదిమంది విద్యార్ధులు పాల్గొని సమైక్యనినాదాలు హోరెత్తించారు. రోజా దీక్ష చిత్తూరు : నగరి టవర్‌క్లాక్ కూడలిలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్కే రోజా శుక్రవారం ఒకరోజు దీక్ష చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో వికలాంగులు, మదనపల్లెలో బుద్ధిమాంద్యం విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. పెనుమూరులో క్రైస్తవులు వంటావార్పు, కుప్పంలో వన్నెకుల క్షత్రీయులు హోమం నిర్వహించారు. పుంగనూరులో ఉపాధ్యాయులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. -
సమైక్యహారం.. అపూర్వ మానవహారం
చేతులు కలిశాయి.. సత్తా చూపాయి.. కలిసికట్టుగా సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటాయి. శ్రీకాకుళం జిల్లా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమైక్యభావం వెల్లివిరిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)పై శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సుమారు 176 కిలోమీటర్ల పొడవునా అపూర్వ మానవహారం నిర్మించారు. పల్లె, పట్టణం.. ఉద్యోగులు, సామాన్యులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉదయం 9 గంటలకే జాతీయ రహదారిపై చేరుకొని 10 నుంచి 11 గంటల వరకు చేతులు కలిపి మానవహారంగా ఏర్పడ్డారు. సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ అలుపెరుగని పోరు సాగుతున్న పోరు శనివారం నాటికి 32రోజులకు చేరింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమకారులు హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలరేవు ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర అర్చక సమాఖ్య శాంతి హోమం నిర్వహించింది. కృష్ణా జిల్లా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో విదార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరువూరులో సమైక్య జనగళం పేరిట వేలాది మంది జనం నదించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో బల్లకట్టుపై రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మూడు వేల మంది ఉద్యోగులు సోనియా గాంధీకి ఉత్తరాలు రాశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు పోలీసు ఐలండ్ సెంటర్లో హోమం చేశారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు 48గంటల జిల్లా బంద్ రెండోరోజు శనివారం కూడా విజయవంతమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. డోన్‌లో కురువ సంఘం ఆధ్వర్యంలో ఒంటెలతో ర్యాలీ చేపట్టారు. ఏపీఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిర్వహించిన సకల జనుల గళం విజయవంతమైంది. విశాఖపట్నంలో ముస్లీం జేఏసీ ఆధ్వర్యంలో ఒంటెలు, గుర్రాలతో ర్యాలీ చేపట్టి జీవీఎంసీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరంలో శనివారం సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా కరెంటు వినియోగం నిలిపివేశాయి. సమైక్య విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వీధి దీపాలను కూడా రెండు గంటల పాటు ఆర్పివేయడంతో జిల్లా మొత్తం అంధకారం అలముకుంది. సీతానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 15కిలోమీటర్ల మేర మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో 30 మంది విశ్రాంత ఉద్యోగులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరఘట్టంలో 20 వేల మందితో ఉపాధ్యాయ, ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో సకలజనగళం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్తరాలకు గంజి కూడా దొరగదంటూ అనంతపురం జిల్లా కణేకల్లులో గంజి పంపిణీ చేసి ఎన్జీఓలు నిరసన వ్యక్తం చేశారు. మార్మోగిన కడప కడప, న్యూస్‌లైన్ : సమైక్య నినాదంతో కడప నగరం మార్మోగింది. సమైక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు వైఎస్సార్ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు నగరాన్ని దిగ్బంధించినా సమైక్యవాదులు లెక్కచేయలేదు. ప్రతిఒక్కరూ సమైక్యనినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వేదిక వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో జేఏసీ నేతలు ఆగ్రహంతో ఊగి పోయారు. ఓ దశలో కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిపై చేయి చేసుకున్నంత పనిచేశారు. పోలీసులు మైదానాన్ని వదలివెళ్లాలని నినాదాలు చేశారు. డీఎస్పీ, ఎస్పీ ఇళ్లకు విద్యుత్, నీరు కట్‌చేయడంతో పాటు పారిశుద్ధ్ద్యాన్ని కూడా నిలిపి వేస్తామని హెచ్చరిం చారు. పోలీసు అధికారులు చివరికి దిగివచ్చారు తామేమీ ఆటంకం కలిగించబోమని ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, చల్లా ప్రవీణ్‌కుమార్ ఉద్యమకారులకు సర్దిచెప్పారు. సభలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటం కోసం దేనికేనా సిద్ధమేనని ప్రకటించారు. 12 నుంచి అంధకారమే ఉద్యమాన్ని తీవ్రం చేయాలని విద్యుత్ ఉద్యోగుల నిర్ణయం ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : సమైకాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు 12 నుంచి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ఏ కాలనీలో శనివారం సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల (జేఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు చెందిన జెన్కో, డిస్కం, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్లకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ సీమాంధ్రలో ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే 12 నుంచి సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 4 వరకు వర్క్‌టూరూల్, 5న మూకుమ్మడి సెలవులు, 6న పెన్‌డౌన్, టూల్‌డౌన్, 7న ఛలో హైదరాబాద్ విద్యుత్ సౌధ, 8, 9, 10 తేదీలలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. 11న సిమ్‌కార్డులను యాజమాన్యాలకు అప్పగించి 12 నుంచి సమ్మెలోకి దిగుతామన్నారు. తాము ఉద్యమంలో పాల్గొంటే రాష్ర్టంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అంధకారం నెలకొంటుందన్నారు. 2 నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
3 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి ఉన్నత విద్యామండలి ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చేనెల 3 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారంతో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని సహాయక కేంద్రాలు పనిచేయలేదు. దీంతో శనివారం నుంచి వచ్చేనెల 3 వరకు నాలుగు రోజులు ప్రత్యేకంగా షెడ్యూలు పొడిగించారు. ఈ కొత్త షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారు ఇప్పుడు హాజరుకావొచ్చు. ఒకవేళ మూడో తేదీలోగా కూడా హాజరుకాలేకపోయిన వారు 12వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు సీమాంధ్రలో 37 సహాయక కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు పనిచేయలేదు. శుక్రవారం నుంచి 36 కేంద్రాలు పనిచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్కేయూలోని సహాయక కేంద్రం మినహా అన్ని కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహాయక కేంద్రాలు తెరిచేందుకు అధ్యాపకులు అంగీకరించారని వివరించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై శుక్రవారం రాత్రి మండలిలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ పాల్గొన్నారు. మరో 15 వేల మంది హాజరయ్యే అవకాశం.. ఆగస్టు 19 నుంచి శుక్రవారం వరకు జరిగిన సర్టిఫికెట్ల తనిఖీకి మొత్తం 2.17 లక్షలకు గాను 1.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, గ తేడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చైర్మన్ తెలిపారు. శుక్రవారం సీమాంధ్రలో 35 కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో 5,034 మంది, తెలంగాణలో 22 కేంద్రాల్లో 5,552 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనిఖీకి హాజరుకావాలని ఇప్పటికే ఒకసారి మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపించామని, శుక్రవారం రాత్రి మరోసారి పంపించనున్నామని తెలిపారు. మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకావొచ్చని అంచ నా వేస్తున్నట్టు పేర్కొన్నారు. హాజరుకాలేకపోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో శనివారం 1 నుంచి 50 వేల వరకు, సెప్టెంబర్ 1న 50 వేల నుంచి లక్ష వరకు, 2వ తేదీన లక్ష నుంచి 1.5 లక్షల వరకు, 3వ తేదీన 1.5 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావొచ్చని వివరించారు. 3వ తేదీ నాటికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయిన వారు 4 నుంచి 12లోగా సహాయక కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది అక్కడే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఇక ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు (ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడాకారులు, వికలాంగులు తదితర కేటగిరీలవారు) మాత్రం హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. 9న సహాయక కేంద్రాలకు సెలవు విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 9న మాత్రం వినాయక చవితి పండుగ నేపథ్యంలో సహాయక కేంద్రాలు పనిచేయవు. ఇంటర్నెట్ సెంటర్ నుంచి నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ 13, 14ల్లో మార్చుకోవచ్చు. 13న 1 నుంచి 1 లక్ష వరకు, 14వ తేదీన 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు. బీ-కేటగిరీపై నేడు కాలేజీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ సమయంలో ఒకే విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సీట్లు పొందినప్పుడు ఎదుర య్యే సమస్యకు పరిష్కారం వెతికేందుకు ఉన్నత విద్యామండలి శనివారం దాదాపు 30 కళాశాలలతో సమావేశం కానుంది. బీ- కేటగిరీ సీట్ల భర్తీని జీవో 66, 67 ఆధారంగా సింగిల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త నోటిఫికేషన్‌కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో సీట్లు పొందితే సీట్లు బ్లాక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ సమస్యపై పిటిషన్‌దారులైన కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 30 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యామండలి భేటీ కానుంది. కళాశాలల సూచనలు పరిగణనలోకి తీసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందిస్తామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు. -
31రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున సమైక్యోద్యమం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 31వ రోజుకు చేరింది. రాష్ర్ట విభజన కోరుతూ ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో 20వేల మందికిపైగా సమైక్యవాదులు ప్రజాగర్జన పేరుతో విజయనగరం-సాలూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్ కోటలో రహదారిపై, అలాగే తూర్పుగోదావరి జిల్లా రమణయ్యపేట వద్ద జాతీయ రహదారిపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం ఆవరణలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఆర్యవైశ్య సింహగర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించి పట్టణంలో బంద్ చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయానికి విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు తాళాలు వేసి నిరసన తెలిపారు. అనంతపురంలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు కాగడాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో 10వేల మందికిపైగా మహిళలు క్రాస్ రోడ్డు వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద విద్యార్థులు రహదారిని దిగ్బంధించారు. విజయవాడ రామవరప్పాడు రింగ్సెంటర్లో సమైక్యవాదులు భారీ మానవహారం చేపట్టారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు జిల్లా బంద్ విజయవంతమైంది. బాపట్లలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 30వేల మంది ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు శతసహస్ర సమైక్యస్వరాగం పేరిట గర్జించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలో విద్యార్థులు విభజన వద్దు అంటూ అక్షర రూపంలో కూర్చోగా.. పాలకొండలో విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ చిత్రపటం రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. సమైక్యాంధ్ర సమరభేరి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన సమైక్యవాదులతో పట్టణ రహదారులు కిక్కిరిసిపోయాయి. ఐదు నిమిషాలపాటు ముక్తకంఠంతో జైసమైక్యాంధ్ర అంటూ గర్జించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో రజక వృత్తి సంఘం ఆధ్వర్యంలో కర్నూలు-గుంటూరు రహదారిపై దుస్తులు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. విశాఖలో విద్యార్థులు లాంగ్‌మార్చ్ నిర్వహించారు. ఉద్యమంలో తామూ పాల్గొంటున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రెవిన్యూ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి ప్రకటించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో కొనసాగుతున్న ఉద్యోగుల రిలే దీక్షల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ రజని పాల్గొన్నారు. దీంతో సహఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలి సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని చూపించని జాతీయ న్యూస్ ఛానళ్ల ప్రసారాలను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవోల నేత ఎ. విద్యాసాగర్ విజయవాడలో ప్రకటించారు. దీనిపై ఆయా చానళ్ల ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లతో కూడా మాట్లాడుతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలూ.. గోబ్యాక్ సాక్షి నెట్వర్క్ : అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై సమైక్యవాదుల ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లింగారెడ్డిని అడ్డుకుని రాజీనామా ఆమోదింపజేసుకుని రావాలంటూ నినదించారు. బద్వేలులో జరిగిన ఆర్యవైశ్య సింహగర్జనలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కమలమ్మ రాగా, సమైక్యవాదులు అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానంటూ రాజీనామా చేస్తున్నట్లు సంతకం పెట్టి చూపించినప్పటికీ సమైక్యవాదులు శాంతించలేదు. దీంతో పోలీసుల సహకారంతో ఆమె అక్కడనుంచి వెనుతిరిగారు. శ్రీకాకుళంలో సభలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడేందుకు సిద్ధంకాగానే సమైక్యవాదులు అడ్డుకుని ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు ధర్నా చేపట్టగా, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను రాజీనామా చేయాలని ఓ ఉద్యోగి నిలదీశారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలేదీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌బాబును సమైక్యవాదులు గోబ్యాక్ అంటూ అడ్డుకున్నారు. కదం తొక్కిన టీటీడీ ఉద్యోగులు వేలాది మంది టీటీడీ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో గర్జించారు. తిరుపతిలో శుక్రవారం సద్భావన శాంతి ర్యాలీ చేపట్టారు. గోవిందనామ స్మరణ, న ృత్యాలు, డప్పు వాయిద్యాలు, విద్యార్థుల సమైక్య నినాదాలతో నగరవీధులు దద్దరిల్లాయి. అన్ని స్థాయిల వారూ ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా టీటీడీ వేదపండితులు ఉద్యమంలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. డాలర్ శేషాద్రి మాట్లాడుతూ తెలుగోడిపై ఢిల్లీ లొల్లి ఏంటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమల ఆలయంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారి పూజా కైంకర్యాలు యథావిధిగా కొనసాగాయని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు.