Vikarabad District News
-
సమయపాలన.. మందులు కరువు
పెద్దేముల్: పెద్దేముల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సమయపాలన పాటించడం లేదు. శుక్రవారం ఉదయం 9గంటలకు ‘సాక్షి’ ఆస్పత్రి విజిట్‌కు వెళ్లగా 9.30గంటల తర్వాత డాక్టర్ వెంకట్‌సాయి, పలువురు సిబ్బంది వచ్చారు. అప్పటి వరకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) డాక్టర్ ప్రమోద్‌కుమార్ రోగులను పరీక్షించారు. ఇంజక్షన్లు, సిరప్లు, ఐరన్ మాత్రలు కొరత ఉన్నట్లు తెలిసింది. రోజుకు వందకు పైగా ఓపీ వస్తుందని డాక్టర్ ప్రమోద్‌కుమార్ తెలిపారు. మందుల కోసం ఇండెంట్ పంపించామన్నారు. -
నూతన భవనం.. అధునాతన వైద్యం
మోమిన్‌పేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు బయటి రోగులు 120నుంచి 150వరకు వస్తున్నారు. సీజనల్ జ్వరంతో భాదపడుతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. వెంటనే రక్తపరీక్ష చేసి అవసరమైన మందులు ఇస్తున్నారు. టైఫాయిడ్, డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ముగ్గురు ఉండాల్సిన వైద్యులలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 5గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారని రోగులు తెలిపారు. ఇజ్రాచిట్టంపల్లికి నుంచి వచ్చిన రోగులు సంగీత, రుక్కిభాయిలకు టైఫాయిడ్ రావడంతో ఇక్కడే చికిత్స చేశారన్నారు. సైలెన్లు పెట్టారని చెప్పారు. డాక్టరులు బాగానే చూస్తున్నారన్నారు. నూతన భవనం కావడంతో అన్ని రకాల వసతులు కల్పించారు. విధుల్లో ఒక్కరే.. కుల్కచర్ల: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున రోగులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. రోజు సుమారుగా 80మందికి పైగా ఓపీ చెకప్‌నకు వస్తున్నారు. సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో 120మందికిపైగా వస్తున్నారు. ప్రస్తుతం కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. మరొక మెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. రాత్రి ఏఏన్ఎం మాత్రమే ఉంటున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఒకింత ఇబ్బంది పడుతున్నారు. -
నర్సులతోనే వైద్య సేవలు
బంట్వారం: బంట్వారం, కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాల్సి ఉన్నప్పటికీ సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా వచ్చి పోతున్నారు. కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలకే తాళం వేసి వెళ్లిపోతున్నారు. బంట్వారం, కోట్‌పల్లి పీహెచ్సీలో సమయపాలన లేదు. దీంతో రోగులు ఆస్పత్రులకు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కింది స్థాయి సిబ్బందే వైద్యం చేసి పంపిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లిన రోగులకు మొదటగా డాక్టర్ పరీక్షించి చీటీ రాసాకే సిబ్బంది అవసరమైన ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కాని డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సులే రోగులకు వైద్యం చేస్తున్నారు. కోట్‌పల్లి పీహెచ్సీలో శుక్రవారం ఉదయం 11:15 గంటలు దాటినా డాక్టర్ కుర్చీ ఖాళీగానే కనిపించింది. విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు రోగులకు వైద్యం చేసి పంపించింది. బంట్వారం పీహెచ్సీలో డాక్టర్ మానస విధుల్లో కనిపించింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నప్పటికి ప్రభుత్వ ఆస్పత్రు్లో మాత్రం రోగులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
48 మంది సిబ్బంది.. 500 ఓపీ
పరిగి: పట్టణ కేంద్రంలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో రోగులకు సరిపడా మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో మొత్తం 48 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా పది మంది డాక్టర్లు, 16 మంది నర్సులు, ఐదుగురు కార్యాలయ సిబ్బంది, 17 మంది పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ప్రతీ రోజు 500 మంది వరకు ఓపీ వస్తున్నారు. తమకు సరైన వైద్యం అందడం లేదని పలువురు రోగులు ఆరోపించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ఎక్కువ శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారని పులువురు వెల్లడిస్తున్నారు. కనీసం తాగునీటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు వస్తున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తెలిపారు. -
డాక్టర్ డబ్బుతో ఇంజెక్షన్లు
దౌల్తాబాద్: దౌల్తాబాద్ పీహెచ్సీలో వైద్యం దయానీయంగా మారింది. ప్రతీ రోజు సుమారు వంద మంది వరకు ఓపీ వస్తుంది. ఇక్కడ ఇద్దరు వైద్యులే అందుబాటులో ఉండడంతో వారు షిఫ్ట్‌లవారీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా ఇంజక్షన్ల సరఫరా లేకపోవడంతో ఇక్కడ పని చేసే డాక్టర్ సొంత డబ్బు వెచ్చించి చికత్సలు అందిస్తున్నారు. స్టాఫ్ నర్స్ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రసవాలకు ఇబ్బంది తలెత్తుతోంది. సిబ్బంది సరిగా లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేసి సిబ్బందిని పెంచి సరైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. -
ఫార్మసిస్ట్‌గా స్టాఫ్‌నర్స్
తాండూరు టౌన్: పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచాలనే ఉద్దేశ్యంతో పాత తాండూరులో బస్తీ దవాఖాన, ఇందిరానగర్‌లో అర్బన్ పీహెచ్సీ ఏర్పాటు చేశారు. బస్తీ దవాఖానలో వైద్యుడు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై డాక్టర్లు వస్తున్నారు. నిత్యం 150మంది వరకు రోగులు వస్తుంటారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల అనంతరం డాక్టర్లు రాసే మందులు లభించడం లేదు. ఫార్మసిస్ట్ ఉండరు, స్టాక్ అందుబాటులో ఉండదు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్‌కు ఫార్మసిస్ట్ బాధ్యతలు అప్పగించారు. సరైన వెద్యం అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఫీవర్ బాధితులే ఎక్కువ వర్షాలు ఎక్కువగా కురియడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్‌తో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చాను. అందుబాటులో ఉన్న మందులు, ఇంజక్షన్లు రోగులకు ఇస్తున్నాం. నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. – డాక్టర్ అక్షయ్, బస్తీ దవాఖాన, పాతతాండూరు శాశ్వత వైద్యుడు లేడు కొన్ని నెలలుగా ఇక్కడ శాశ్వత వైద్యుడు లేడు. ఎవరో ఒకరు వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో మందులు, ఇంజక్షన్లు లేవు. అక్కడ అందుబాటులో ఉన్న నాలుగైదు రకాల గోళీలనే అందరికీ ఇస్తున్నారు. అధికారులు స్పందించి మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. – అబ్దుల్ నయీమ్, పాత తాండూరు -
‘సీజనల్’.. కిటకిట
శనివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ పాలకులు పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో దవాఖానాల్లో రోగుల రద్దీ తీవ్రమైంది. ఇందుకు తగ్గట్టు వైద్యులు, సిబ్బంది, మందులు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. 10లోuఅరకొర వైద్యం! తాండూరు: పేదలకు వైద్యం అందించే విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వారికి కూర్చునేందుకు కుర్చీలు లేవు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపీలో వైద్యం అందించాల్సిన వైద్యులు ఉదయం 10గంటలకు వచ్చి మధ్యాహ్నం 12గంటలకే వెళ్లిపోతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి, మాతాశిశు ఆస్పత్రులను శుక్రవారం సాక్షి విజిట్ చేసింది. ఉదయం 10 గంటల తర్వాత వచ్చిన వైద్యులు రోగిని ముట్టుకోకుండానే మందులు రాసి పంపించారు. మరోవైపు పలు విభాగాలకు చెందిన వైద్యులు విధులకు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లా ఆసుపత్రిలోని ఓ విభాగంలో 12 గంటల సమయంలో వైద్య సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందించకుండా ఒకే చోట చేరి సెల్ ఫోన్లు చూస్తూ ముచ్చటించడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలో బిజీగా కనిపించారు. ఓపీ క్లోజ్ చేయడంతో అత్యవసర వైద్య విభాగం ఎదుట రోగులు వైద్యం పొందేందుకు క్యూ కట్టారు. నేలపై కూర్చుని పడిగాపులు మాతా శిశు ఆసుపత్రి వైద్య సేవలు దారుణంగా కనిపించాయి. ఎంసీహెచ్‌లో వైద్యులు ఓపీ సేవలను త్వరగా క్లోజ్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైరల్ ఫీవర్, పలు రకాల జబ్బులతో పసి పిల్లలతో వచ్చిన తల్లి బిడ్డలకు వైద్య సేవలను అందక ఇబ్బందులు పడ్డారు. పసి పిల్లలతో వచ్చిన తల్లులకు కూర్చునేందుకు కుర్చీలు అందుబాటులో లేక నిల్చోవడం.. నేలపై కూర్చొని పడిగాపులు కాశారు. చిన్నారులకు వైద్య సేవలు అందించే డ్యూటీ డాక్టర్ తల్లి బిడ్డలను నిలబెట్టి వైద్యం అందించారు. ఓపీలకు భారీగాపెరిగిన రద్దీ న్యూస్రీల్మధ్యాహ్నం 12 గంటలలోపే ఓపీ క్లోజ్ -
No Headline
ధారూరు: ధారూరు, నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులున్నా.. వైద్యులు కరువయ్యారు. డాక్టర్ల స్థానంలో రెండు పీహెచ్సీలలో ఎంహెచ్ఎల్పీలు వైద్యులుగా కొనసాగుతున్నారు. ధారూరు వైద్య దంపతులు బదిలీపై వెళ్లగా.. నాగసమందర్ డాక్టర్ సెలవులో ఉన్నారు. కాగా ఆస్పత్రికి వచ్చిన రోగులు డాక్టర్ వస్తారా.? లేదా అని సిబ్బందిని నిలదీశారు. శుక్రవారం ధారూరు పీహెచ్‌సీని పరిశీలించగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ 10:32 గంటలకు వచ్చారు. సిబ్బంది సైతం అదే సమయాన్ని పాటించారు. వీరు వచ్చేవరకు ల్యాబ్ టెక్నీషియన్, నేచురోపతి ఆస్పత్రి అటెండర్లు మాత్రమే ఉన్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు డాక్టర్ల మాదిరిగానే రోగులకు సేవలందిస్తున్నారు. టైఫాయిడ్‌తో బాధపడుతున్న బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన స్టాఫ్‌నర్స్ లేకపోవడంతో వంతుల వారిగా సబ్ సెంటర్ల ఏఎన్ఎంలు వచ్చి వెళ్తున్నారు. ఐదేళ్లుగా నీటి కొరత ధారూరు పీహెచ్సీలో ఐదేళ్లుగా నీటి కొరత ఉందని రోగులు వాపోయారు. ఇక్కడ వాష్‌రూం వినియోగం లేదని, కనీసం తాగేందుకు నీరు లేకపోవడం, సిబ్బంది తెప్పించుకుంటున్న బబుల్ వాటర్‌ను కొద్దిగా ఇస్తే తాగుతున్నామన్నారు. ల్యాబ్ టెక్నీషియన్‌కు అవసరమైన నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. నాగసమందర్ పీహెచ్సీలో సిబ్బందిని నిలదీస్తున్న మహిళలు -
300మందికి పైగా ఓపీ
కొడంగల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 300 మందికి పైగా రోగులు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువగా సీజనల్ వ్యాధులతో ఓపీ పెరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రప్రియ తెలిపారు. వైద్యులు, సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటున్నారని దగ్గు, జ్వరం, కడుపునొప్పి, జలుబు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రిలో చిన్న పిల్లల డాక్టర్ జయదీప్‌రెడ్డి, అనస్తీషియా డాక్టర్ సాకేత్, డాక్టర్లు మైమూనా, పూజ, శ్రావణి, శివ తదితరులు ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజిస్టు లేనందున సిజేరియన్లు చేయడం లేదు. -
రేపు అథ్లెటిక్స్ సెలక్షన్స్
తాండూరు టౌన్: వికారాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న తాండూరులో జూనియర్ విభాగంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మధు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరులోని పాత శాలివాహన కళాశాల మైదానంలో ఉదయం 8 గంటల నుంచి అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు 100, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే తహసీల్దార్ జారీ చేసిన ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 8978234447, 6304089217 నంబర్లలో సంప్రదించాలన్నారు. నేవీ రాడార్ ఏర్పాటును విరమించుకోవాలి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తాండూరు టౌన్: నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటును విరమించుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దామగుండం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం అమానుషం అన్నారు. 12లక్షల వృక్షాలను నరికి జీవజాతులకు నీడ లేకుండా చేయడం సరికాదన్నారు. ఈ స్టేషన్ ఏర్పాటుతో వంద కిలోమీటర్ల మేర రేడియేషన్ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని రక్షించాల్సిన వారే ప్రమాదకర స్టేషన్లు ఏర్పాటుకు అనుమతులివ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్, టీవీవీ నాయకుడు రామకృష్ణ, స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బుగ్గప్ప, షుకూర్, వెంకటేష్, దత్తాత్రేయ, బసంత్, బస్వరాజ్, సురేష్, రమేష్, లక్ష్మణాచారి పాల్గొన్నారు. వయోధికుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి టీఏఎస్‌సీఏ జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు అనంతగిరి: ప్రభుత్వం ప్రత్యేక వయోధికుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్(టీఏఎస్‌సీఏ) జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు కోరా రు. ఈ మేరకు ఆయన సంఘం సభ్యులతో కలిసి అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఏజెన్సీతో నడుపుతున్న 14567కు బదులుగా 100, 104 మాదిరిగానే ప్రభుత్వ హెల్ప్‌లైన్ ఏర్పాటు చే యాలన్నారు. పురుష వయోధికులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం కల్పించాలని కోరారు. ప్రతీ జి ల్లా కేంద్రంలో భవన నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలన్నారు. అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో వయోధికుల ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పటి వరకు దివ్యాంగుల శాఖ చేపట్టే నామ మాత్రపు కార్యక్రమాలకు దూరంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జుకారెడ్డి, కోశాధికారి జీవన్‌కుమార్, శ్రీహరి, మొగులయ్య, విఠోబా, నారాయణరెడ్డి, మల్ల య్య, మల్లారెడ్డి, దయానంద్స్వామి, విఠల్, నర్సింహారెడ్డి, బుచ్చయ్య పాల్గొన్నారు. ధ్యానంతో ప్రశాంతత నందిగామ: ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమ్లేష్ పటేల్ (దాజీ) అన్నారు. కన్హా శాంతి వనంలో శుక్రవారం కమ్లేష్ పటేల్ 69వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీలంక దేశానికి చెందిన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అదనపు సెక్రటరీ జనరల్, దలైలామా ప్రతినిధి దమింద పోరగే హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాలు, రాష్ట్రాలకు చెందిన వేలాది మంది అభ్యాసీల సమక్షంలో సామూహిక ధ్యానం చేశారు. -
మర్రి చెట్టు.. ఆహ్లాదం పంచేట్టు
దౌల్తాబాద్: మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ మర్రిచెట్టు ఊడలు భూమిని తాకుతున్నాయి. ఈ వృక్షానికి సుమారు 110 ఏళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. చెట్టుకింద ఓ దర్గా ఉండడంతో ఏటా గంధాలతో పాటు జాతర నిర్వహిస్తుంటా రు. అప్పుడప్పుడు పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి గంటల తరబడి మర్రి ఊడలపై ఊగుతూ సంతోషంగా గడుపుతుంటారని స్థానికులు తెలిపారు. పని చేస్తుండగా ఫిట్స్.. కార్మికుడి దుర్మరణం నందిగామ: పరిశ్రమలో పనిచేస్తున్న ఓ కార్మికుడికి ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మేకగూడలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ కథనం ప్రకారం.. మేకగూడ శివారులోని ఏరోలైట్ పరిశ్రమలో కరుణాకర్‌రెడ్డి లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కార్మికులు అవసరం ఏర్పడి ఈ నెల 20న సికింద్రబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నలుగురు కార్మికులను తీసుకొని పరిశ్రమలో పనిలో పెట్టుకున్నాడు. అందులో మధ్యప్రదేశ్‌కు చెందిన జస్విందర్ సింగ్ భరాట్(30) ఉన్నాడు. గురువారం ఆయన పరిశ్రమలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ రావడంతో కిందపడిపోయాడు. దీంతో పరిశ్రమ యాజమాన్యం, తోటి కార్మికులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంట్రాక్టర్ కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పరిగి: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మోమిన్‌పేట: ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలో ఉపాధి మస్టరులో హాజరు వేయడంలో నిర్లక్ష్యం, జాబ్ కార్డులో ఉన్న సభ్యులలో ఒకరికి బదులు ఇంకొకరు పనులు చేయడం వంటి చర్యలకు రూ.73 వేలు జరిమానా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో 2023–24 సంవత్సరానికిగాను ఉపాధిహామీలో చేసిన పనులకు 15వ విడత సామాజిక తనిఖీ రాత్రి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 28 గ్రామ పంచాయితీల్లో నిర్వహించిన ఎన్ఆర్ఈజీఎస్ కింద 716 పనులలో కూలీలకు చెల్లించిన మొత్తం రూ.6.97 కోట్లు కాగా మెటీరియల్ చెల్లింపులకు రూ.12.2 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. కూలీల హాజరులో అవకతవకతలకు పాల్పడిన పంచాయతీ కార్శదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.73 వేలను జరిమానా విధించామన్నారు. అదేవిధంగా ఒక దగ్గర చేయాల్సిన పనికి ఇంకో దగ్గర చేయడం, జాబ్ కార్డులో ఉన్న సభ్యులలో ఒకరికి బదులు ఇంకొకరు హాజరు కావడం వంటి వాటికి రూ.4.33 లక్షలు రికవరీ చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి ద త్తు, ఎంపీడీఓ విజయలక్ష్మి, సామాజిక తనిఖీ ఎస్ఆ ర్పీ రమేశ్, ఎంపీఏ యాదగిరి, ఏపీఓ శంకర్, ఈసీ, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సామాజిక తనిఖీలో రూ.73వేల జరిమానా డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ -
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే
మోమిన్‌పేట: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం మోమిన్‌పేటలో పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను ప్రపంచ దేశాధినేతలే ప్రశంసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలువలేకపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయలేక పోతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలలకే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, వివేకానందరెడ్డి, వడ్ల నందు, శ్రీధర్‌రెడ్డి, పాండు, భుజంగారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమలం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ -
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యాది కీలక పాత్ర
బషీరాబాద్: తెలంగాణ సాధనలో తెలుగు సాహిత్యం కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. కవులు, రచయితలు, కళాకారులు తమ సాహిత్యం ద్వారా సమాజాన్ని జాగృతం చేశారన్నారు. గొట్టిగఖుర్ధు పాఠశాలలో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు వడిచర్ల సత్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ‘గొట్టిగఖుర్ధు మణిపూసలు’ పుస్తకావిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు మాధవరెడ్డి, బాల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్ పాల్గొన్నారు. పెట్రోల్ పంపు తనిఖీ పెట్రోల్‌లో నీళ్లు వస్తున్నాయి వార్తకు స్పందన పెద్దేముల్: కందనెల్లి శివారులోని ఎస్సార్ బంకులో పెట్రోల్‌తో పాటు నీళ్లు వస్తున్నాయని సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు సివిల్ సప్లయి అధికారులు స్పందించారు. శుక్రవారం ఏఎస్ఓ ఆర్టీ నాయక్, డీటీ ఆసీస్, డీటీసీఓ గణపతిరావుతో పాటు పెద్దేముల్ తహసీల్దార్ కిషన్‌తో పాటు పలువురు అధికారులు పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ రెక్టిఫై చేసిన అనంతరమే ఈ బంకు కొనసాగుతుందన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు బంకును బంద్ చేసి ఉంచాలన్నారు. దీనికి స్పందించిన బంకు యాజమాన్యం వర్షానికి నీళ్లు వచ్చాయని అధికారులతో వారు చెప్పుకున్నారు. గ్రామంలో లేని ఓటర్లను తొలగించండి బషీరాబాద్: రెండు దశాబ్దాలుగా గ్రామంలో లేని 89 మంది ఓటర్లు జాబితా నుంచి తొలగించాలని క్యాద్గీరా గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలోనూ వారు గ్రామానికి రారని, అలాంటిది వారి పేర్లను ఓటరు జాబితాలో ఎలా కొనసాగిస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇదే విషయమై పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన బీఎల్ఓలు స్పందించలేదని అన్నారు. ఇప్పటికై నా విచారణ జరిపి వారిపేర్లను తొలగించాలని గ్రామస్తులందరు తీర్మానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు నాగేంద్రయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. ఎట్టకేలకు చిక్కాడు నందిగామ: అధిక వడ్డీ ఆశ చూపి, రూ.2.60 కోట్లు వసూలు చేసి.. తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని నందిగామ పోలీసులు రిమాండ్ తరలించారు. ఎస్ఐ గోపాల కృష్ణ వివరాల ప్రకారం.. మేకగూడకు చెందిన మారేపల్లి మధుసూదన్ 2018 నుంచి గ్రామస్తులు, తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకున్నాడు. వీరికి బాండ్లు, నోట్లు రాయించి ఇచ్చాడు. కొంత కాలం పాటు క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లించడంతో మిగిలిన వారు కూడా నమ్మారు. ఇలా 22 మంది నుంచి సుమారు 2.60 కోట్లు తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత చెల్లింపులు ఆపేశాడు. డబ్బు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో నగరంలోని ఛత్రినాఖకు మఖాం మార్చాడు. బాధితుల్లో ఒకరైన ప్రతాప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లోనే మధుసూదన్‌పై కేసు నమోదైంది. తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
No Headline
పరిగి: ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా రూ.55 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కొంత మందికి కొన్ని కారణాలతో మాఫీ కాలేదని, వ్యవసాయ అధికారులు వారి వివరాలను సేకరించారని, త్వరలోనే వారికి సైతం మాఫీ అవుతుందన్నారు. భూ సమస్యల కొరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేస్తుందన్నారు. త్వరలోనే ధరణి స్థానంలో భూమాత వస్తుందన్నారు. భూ సమస్యలు ఏవైన ఉంటే వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీడీఓ ఖరీం, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ముదిరాజ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, మండల అధ్యక్షుడు పరశురాంరెడ్డి ఆయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి సరిపడా కుర్చీలు లేకపోవడంతో కొందరు అధికారులు నిలబడడం గమనార్హం. గ్రామాల అభివృద్ధికి కృషి కుల్కచర్ల: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో రెండేళ్లుగా కొనసాగుతున్న సీసీరోడ్డు రెండో విడత పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పార్టీ బ్లాక్–బి అధ్యక్షుడు భరత్‌కుమార్, నాయకులు ఆంజనేయులు, గోపాల్‌నాయక్, హరినాథ్‌రెడ్డి, ఆనందం, వెంకటేష్, వెంకటయ్య, శ్రీనివాస్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఆదర్శం వివేకానందుడు
కొడంగల్ రూరల్: వివేకానందుడు యువతకు ఆదర్శప్రాయుడని, ప్రపంచస్థాయిలో భారతదేశ కీర్తిని ప్రసరింపజేసిన మహనీయుడని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువజన, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజ్ఞాన మేళా నిర్వహించారు. ఇందులో 35 పాఠశాలల విద్యార్థులు ఎక్స్ బిట్స్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన పాఠశాలల విద్యార్థులకు బహుమతులు అందించారు. క్లాసికల్ విభాగంలో మొదటి బహుమతి కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ చౌడాపూర్కు, రెండో బహుమతి జెడ్పీహెచ్ఎస్ నెంబర్ వన్ పరిగికి, మాడ్రన్ విభాగంలో మొదటి బహుమతి అక్షర హైస్కూల్ తాండూర్‌కు, రెండో బహుమతి జెడ్పీహెచ్ఎస్ బాలికల కొడంగల్‌కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, ఎంఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, జీజేసీ ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి -
దూషించిన వారిని అరెస్టు చేయాలి
యాలాల: కులం పేరుతో ఓ దళిత వ్యక్తిని దూషించి, దాడికి దిగిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని నాగసముందర్లో నెలరోజుల క్రితం జరిగిన ఘటనపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వ్యకాస జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప శుక్రవారం మాట్లాడారు. గ్రామానికి చెందిన మాల వెంకటప్ప తన పొలంలో సర్వే చేయించి హద్దురాళ్లు వేయిస్తుండగా, అదే గ్రామానికి చెందిన జోగు మల్లప్ప, జోగు వెంకటప్ప, జోగు రాములు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని లేనిపక్షంలో వచ్చే నెల 10న డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజు, శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
గుంతల దారి.. ప్రయాణానికి వేసారి!
అధ్వానంగా దౌల్తాబాద్–బిచ్చాల రహదారి ● కొట్టుకుపోయిన కల్వర్టు, కోతకు గురైన దారి ● వాహనదారులకు తప్పని తిప్పలు దౌల్తాబాద్: అడుగడుగునా ఏర్పడిన గుంతలతో దౌల్తాబాద్–బిచ్చాల రోడ్డు అధ్వానంగా మారింది. అందులో వర్షం నీరు నిలిచి మరింత దారుణంగా దాపురించింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గంపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దౌల్తాబాద్, గుముడాల, తిమ్మాయిపల్లి గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ద్విచక్రవాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాకపోకలు సాగిస్తున్న కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. మూడేళ్ల నుంచి వెతలు పదేళ్ల క్రితం దౌల్తాబాద్ నుంచి బిచ్చాల వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించారు. మూడేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు గుముడాల–తిమ్మాయిపల్లి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టులు కొట్టుకుపోయి రోడ్డు కోతకు గురైంది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సదరు మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిలిచిన ఆర్టీసీ సేవలు దౌల్తాబాద్ నుంచి బిచ్చాల వరకు ఆర్టీసీ బస్సు నడిచేది. అయితే వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడడం, కోతకు గురికావడంతో ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలన్నా ఇబ్బందులుపడుతున్నామని వాపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత లేక విద్యార్థులకు బడికి పంపలేకపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు తక్షణం స్పందించి రోడ్డు, కల్వర్టులకు మరమ్మతులు చేయించాలని స్థానికులు వేడుకుంటున్నారు. పట్టించుకోవడం లేదు మా పిల్లలు నిత్యం చదువుకోసం దౌల్తాబాద్ వెళ్తారు. అయితే నెల రోజులుగా బస్సు బంద్ అయింది. దీంతో ఆటోలు, బండ్లపై వెళ్తున్నారు. రోడ్డు పాడైతే ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అత్యవసరమైతే చాలా ఇబ్బంది ఎదురవుతోంది. – నర్సమ్మ, స్థానికురాలు నిత్యం ప్రమాదాలు గుముడాల, తిమ్మాయిపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు అధ్వానంగా తయారైంది. కల్వర్టు కొట్టుకుపోయి కోతకు గురైంది. దీన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రమాదవశాత్తు వాహనదారులు అదుపు తప్పి పడిపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలి. – వీరారెడ్డి, స్థానికుడు -
అటవీ భూములు హాంఫట్!
● మైల్వార్ రిజర్వ్ ఫారెస్టు సరిహద్దులో కబ్జాల పర్వం ● 326 ఎకరాల్లో కన్నడ రైతుల అక్రమ సాగు ● 411 ఎకరాల్లో తెలంగాణ రైతుల పాగా బషీరాబాద్: అంతర్రాష్ట్ర సరిహద్దులోని మైల్వార్ రిజర్వ్ ఫారెస్టు భూములు రోజురోజుకూ అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు సుమారు 5 వేల ఎకరాల్లో దట్టంగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ప్రస్తుతం మూడు వేల ఎకరాలకు కుంచించుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన రైతులు, స్థానికులు సుమారు 737 ఎకరాల ఫారెస్ట్ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నట్లు సర్వేలో బయటపడింది. అధికారుల సర్వే జిల్లా సరిహద్దులోని బషీరాబాద్ మండలం కర్ణా టకకు సరిహద్దుగా ఉంది. మండలంలోని మైల్వార్ రిజర్వు ఫారెస్టు కింద ఉన్న అటవీ భూముల్లో పరిసర గ్రామాల, తండాల రైతులు చెట్లను నరికి యథేచ్ఛగా భూములు సాగుచేస్తున్నారు. మండలంలోని జలాల్పూర్, నీళ్లపల్లి, ఇస్మాయిల్‌పూర్, మైల్వార్ గ్రామాల పరిధిలోని సర్వేనంబర్ 69, 35, 20, 218, 235లలోని మొత్తం 737 ఎకరాలను ఆక్రమించినట్లు వారం రోజులుగా రెవెన్యూ అధికారులు నిర్వహించిన క్రెడెస్టల్ మ్యాప్ సర్వేలో వెల్లడైంది. ఇందులో తెలంగాణ రైతులు 411 ఎకరాలు సాగు చేస్తుండగా, కర్ణాటకలోని పలుగు కుచ్చతండా, కరోబార్తండా, గోప్యానాయక్‌తండా, బొందంపల్లితండా, ఇందిరానగర్, బీమ్లాతండా, హజార్తండా, బోయిన్పల్లి తండాకు చెందిన సుమారు వంద మంది రైతులు మిగిలిన భూములను ఆక్రమించినట్లు తేలింది. అయితే గతంలో ప్రభుత్వాలు అసైన్డ్ కింద అటవీ భూముల పంపిణీ ద్వారా 1,190 ఎకరాలను రైతులకు పట్టాలు ఇచ్చినట్లు రెవెన్యూ అధికారులు నివేదికలో తెలిపారు. కుదరని లెక్కలు మైల్వార్ రిజర్వు ఫారెస్టులో 5 వేల ఎకరాలకు గాను 1,053 ఎకరాలు ఫారెస్టు భూములు ఉన్నట్లు రెవెన్యూ నివేదికలో తెలిపారు. కానీ కబ్జాకు గురైన 737 ఎకరాలు, పంపిణీ చేసిన 1,190 ఎకరాలు కలిపితే 1,927 ఎకరాలు అవుతుంది. ఈ లెక్కన 2020 ఎకరాల భూములు ఏమైనట్లో అంతు చిక్కడం లేదు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సర్వే చేస్తే తప్ప భూముల లెక్కలు తేలవని రైతులు అభిప్రాయ పడుతున్నారు. 17 మందిపై కేసు ఇటీవల మైల్వార్ అటవీ భూముల్లో చెట్లు నరుకుతున్న సమాచారం వచ్చింది. అక్కడ వెళ్లి చూడగా మైల్వార్ తండాకు చెందిన 17 మంది భూములు సాగు చేయడానికి చెట్లు నరికివేసినట్లు గుర్తించాం. వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. ఎవరైనా అటవీ భూముల్లో చెట్లు నరికిన, కబ్జాకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – స్నేహశ్రీ, ఫారెస్టు సెక్షన్ అధికారి -
రెవెన్యూ శాఖలోకి తీసుకోండి
తాండూరు రూరల్: గత ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసిన తమని మళ్లీ రెవెన్యూ విభాగంలోకి తీసుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తాండూరు తహసీల్దార్ తారాసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నంబర్ 85 ప్రకారం వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిందన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలను మళ్లీ రెవెన్యూ విభాగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ నెల 29న రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై తహసీల్దార్ల అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చంద్రప్ప, మున్నెప్ప, నర్సమ్మ, మహేష్, శరణమ్మ, రుక్మమ్మ, నర్సిములు, స్వప్న, రాజేశ్వరి పాల్గొన్నారు. తహసీల్దార్‌కు వీఆర్ఏల వినతి -
సేంద్రియం ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం చేయండి దోమ: ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ రైతులకు సూచించారు. విషతుల్యమైన పంటలతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ ముప్పు నుంచి బయట పడాలంటే రైతులు ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలని అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన రైతులు శ్రీనివాస్, అంజిలయ్య, రాములు, కృష్ణ, నవ్వయ్య సేంద్రియ విధానంలో సజ్జ, పెసర, కొర్ర, కంది, బెంబెర్లు, మినుము, మంచి నువ్వులు, మొక్కజొన్న, వరి వంటి పంటలు సాగు చేశారు. బుధవారం కలెక్టర్, వాసన్ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్లు భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ అఖిల్, అరక రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులతో కలిసి సేంద్రియ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసిన రైతులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగిలిన రైతులు కూడా ఆర్గానిక్ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందును పంటలకు వాడే క్రమంలో రైతులు, విషతుల్య ఆహారాన్ని తీసుకునే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. సేంద్రియ సాగుతో దీన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి మొక్కలు నాటి నీరు పోశారు. బాస్పల్లి రైతు సేవా కేంద్రంలో.. మండలంలోని బాస్పల్లిలోని సుస్థిర వ్యవసాయ రైతు సేవా కేంద్రంలో వివిధ రకాల చిరుధాన్యాలు, వ్యవసాయ పనిముట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ప్రతి రైతుకూ చిరుధాన్యాలు అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు. మార్కెట్లో ఈ తరహా పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. దోమ, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద గోదాంలు నిర్మించుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేశ్‌బాబు, తహసీల్దార్ పురుషోత్తం, మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్‌రావు, మండల విద్యాధికారి వెంకట్, ఏపీఓ దస్తయ్య, మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు. పరిగి: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం మండలంలోని నజీరాబాద్‌తండాలో ఆయా గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయనాలతో పండించిన పంటలు తినడం వల్ల వ్యాధులు కొని తెచ్చుకోవడమే అన్నారు. జీవన విధానంలో అనేక రోగాల బారిన పడుతున్నాంటే వాటికి మూలం రసాయన ఎరువులేనని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న పంటలకు అతివృష్టి, అనావృష్టిని తట్టుకోవడమే కాకుండా భూమిలోని జీవరాశిని, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటిని తినడం వలన ఆరోగ్య సమస్యలు రావని, ఒకవేళ వచ్చినా వాటిని అధిగమించవచ్చని తెలిపారు. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ దోర్నాల్పల్లిలో సేంద్రియ పద్ధతిలోసాగు చేసిన పంటల పరిశీలన -
రైతుల నుంచి సేకరించిన ధాన్యం
వికారాబాద్: ప్రస్తుత సీజన్(వానాకాలం)లో సన్న వడ్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే రెండింతలయ్యింది. ఇప్పటి దాకా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తూ వస్తోంది. త్వరలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో ఏటా వరి సాగులో 10 శాతం మాత్రమే సన్న రకం వడ్లను సాగు చేసేవారు. వీటిని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించే వారు. త్వరలో చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రైతుల నుంచి సన్న వడ్లు సేకరించడం తప్పని సరిగా మారింది.1,30,000 ఎకరాల్లో వరి సాగుజిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 93వేల ఎకరాలు కాగా ప్రస్తుత సీజన్లో అంతకుమించి సాగు చేశారు. 1,30,000 ఎకరాల్లో వరి పంట వేశారు. పరిగి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 46,876 ఎకరాల్లో పంట సాగు చేయగా.. కొడంగల్ డివిజన్లో 45,137 ఎకరాల్లో, తాండూరు డివిజన్లో 29,964 ఎకరాల్లో, వికారాబాద్ డివిజన్లో 8,023 ఎకరాల్లో వరి పంట వేశారు. జిల్లాలో 20 మండలాలు ఉండగా 12 మండలాల్లో వెయ్యి నుంచి ఐదు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. గతేడాది జిల్లాలో ఇదే సీజన్లో 14వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 30వేల ఎకరాల్లో పంట వేశారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఆ పంట వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. క్వింటాలు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమైంది.జిల్లాలో 2,41,622 రేషన్ కార్డులుజిల్లాలో 2,41,622 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఏడాదికి 56,076 మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 30 వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు సాగు చేస్తున్నారు. యాసంగిలో మరో 30 వేల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ రెండు సీజన్లలో లక్ష నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్డు వచ్చే అవకాశం ఉంది. వీటిని మిల్లింగ్ చేయిస్తే 65 నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం సమకూరే అవకాశం ఉంటుంది. జిల్లా రైతులు పండించిన సన్న రకం వడ్లను మొత్తం సేకరిస్తేనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. -
భూ కుంభకోణాల ఘనత ఆనంద్‌దే
ధారూరు: బీఆర్ఎస్ హయాంలో అధికార బలంతో భూ కుంభకోణాలకు పాల్పడమే కాకుండా.. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందేనని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ధారూరులోని శుభం ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు తదితరులు మాట్లాడారు. మర్పల్లిలో జరిగిన చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారని ఆరోపించారు. మచ్చలేని నాయకుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చవకబారు విమర్శలు చేయడం ఆనంద్ దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన స్వగ్రామంలోని 70 ఎకరాల అసైన్డ్ భూములను 40 మంది రైతులు సాగు చేసుకుంటుండగా.. కేవలం తన తల్లి పేరున మూడెకరాలకు పట్టా పొంది, ఇతర రైతులకు మొండిచేయి చూపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లుగా నిజాం వారసురాలి భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇప్పించాల్సింది పోయి 73 ఎకరాల భూమిని ఓ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. బూర్గుగడ్డలో 36 ఎకరాల భూమిని ఇతరులకు అమ్మించారని ఆరోపించారు. బినామీ పేర్లతో వందల ఎకరాలు అన్యాక్రాంతం చేసిన వ్యక్తి ఆనంద్ అని విమర్శించారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు విషయంలో తహసీల్దార్‌ను బెదిరించడం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతారెడ్డి వాహనంపై దాడి వంటి దుశ్చర్యలకు పాల్పడింది నీవు కాదా అని ప్రశ్నించారు. పదవి పోయిన విషయాన్ని విస్మరించి.. ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్.అశోక్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు పాండునాయక్, బుజ్జయ్యగౌడ్, రాంరెడ్డి, హన్మయ్య, మల్లారెడ్డి, బసప్ప, వాణి, రాజేందర్, రమేశ్‌కృష్ణ, లాల్ అహ్మద్, టి.మల్లేశం, అమరేశ్వర్‌రావు, కృష్ణారెడ్డి, ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు. దాడులతోపాటు అక్రమ కేసులు పెట్టించిందీ ఆయనే మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజు ఆమనగల్లు: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు త ప్పవని రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) డాక్టర్ రాజు అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రోగులకు మెరుగై న వైద్య సేవలు అందించాలని వైద్యులు, సి బ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వైద్యు లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అంతకుముందు నిర్మాణంలో ఉ న్న ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రోగుల కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళల కోసం త్వరలోనే గైనకాలజిస్ట్‌ను నియమించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పరీక్షిత్ నరేందర్, నాగరాజు, మైమూనా, సి బ్బంది ఏసుమణి, అలివేలు, జ్యోతి, సంపూర్ణ, మునీర, ఇందిర, దేవేందర్, వేణు ఉన్నారు. కమ్యూనిటీ ఆస్పత్రిలో..షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని బుధవారం రాష్ట్ర వైద్య విధాన పరిష త్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలోని ల్యాబ్‌ను పరిశీలించారు. -
చెత్త తొలగింపు
గురువారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024● సత్వరం పూర్తవ్వాలి 8లోuదుద్యాల్ మండలం కుదురుమల్ల జెడ్పీహెచ్ఎస్లో మూత్రశాలలు లేక విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం సాక్షి దినపత్రికలో నిర్మించినా.. ప్రారంభించరా..? శీర్షికన ప్రచురితమైన కథనానికి డీఈఓ రేణుకాదేవి స్పందించారు. పాఠశాలలో 90 మంది బాలికలు, 95 మంది బాలురు ఉన్నారని తెలిపారు. మన ఊరు – మన బడి పథకంలో భాగంగా మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 80శాతం పనులు పూర్తయ్యాయని, 20శాతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. దసరా సెలవులు పూర్తయ్యే నాటికి మూత్రశాలలను అందుబాటులోకి తేవాలని పాఠశాల హెచ్ఎంకు సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు స్కూల్ ఆవరణలోని ప్రాథమిక పాఠశాల మూత్రశాలలను విద్యార్థినులు వినియోగించుకునేలా చూడాలని హెచ్ఎంకు సూచించారు. – దుద్యాల్ న్యూస్‌రీల్