wolf
-
ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్ డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.బహ్రాయిచ్ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రాయిచ్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
ఆపరేషన్ తోడేలు సక్సెస్
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాను కొన్ని నెలలపాటు వణికించిన తోడేళ్ల కథ ముగిసింది.ఆపరేషన్ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా తాజాగా శనివారం(అక్టోబర్5) ఆరో తోడేలును గ్రామస్తులు మట్టుబెట్టారు. మేకను వేటాడుతుండగా గ్రామస్తులు ఆరో తోడేలును కొట్టి చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.ఐదో తోడేలు పట్టుబడ్డాక 24 రోజులుగా ఆరో తోడేలు ఒక్కతే తప్పించుకు తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలుపెట్టింది. అయితే గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు మ్యాన్ఈటర్ అని చెప్పలేమని అటవీ అధికారులు అన్నారు.గత కొన్ని నెలలుగా బహ్రెయిచ్‌లో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. తోడేళ్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు. ఆపరేషన్ భేడియా సక్సెస్ కావడంతో బహ్రెయిచ్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ చదవండి: నెత్తురోడుతున్న బస్తర్ అడవులు -
13 ఏళ్ల బాలునిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం ఆగడం లేదు. అటవీశాఖ అధికారులు ఐదవ తోడేలును పట్టుకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన ఆరవ తోడేలు ఆహారం కోసం నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా ఇంటి టెర్రస్‌పై నిద్రిస్తున్న 13 ఏళ్ల అర్మాన్ అలీపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు గాయపడ్డాడు. బాధిత బాలునికి బహ్రాయిచ్‌లోని మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.అటవీ శాఖ అన్ని రకాలుగా తోడేళ్లను పట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మహసీ ప్రాంతంలో తోడేళ్ల దాడుల కారణంగా సుమారు 110 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మహసీ, శివపూర్‌లోని 110 గ్రామాల్లో అటవీశాఖ, పోలీసులు, పీఎస్సీ సిబ్బంది, జిల్లా ఉద్యోగులు వంతుల వారీగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ తోడేళ్ల దాడులు ఆగడం లేదు.బహ్రాయిచ్‌లోని మహసీ తహసీల్‌లో గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. తోడేళ్లు ఇప్పటివరకు 60 మందిని గాయపరిచాయి. ఆరు తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించామని, వాటిలో ఐదు తోడేళ్లను పట్టుకున్నామని అటవీ శాఖ పేర్కొంది. ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలి ఉందని, దానిని పట్టుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అయితే అటవీ శాఖ సమాధానానికి గ్రామస్తులు సంతృప్తి చెందడం లేదు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు? -
ఆగని తోడేళ్ల దాడులు.. వృద్ధురాలి గొంతు కొరికి..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో ఐదు తోడేళ్లను పట్టుకున్న తర్వాత కూడా నరమాంస భక్షక తోడేళ్ల బెడదకు అడ్డుకట్టపడలేదు. మంగళవారం రాత్రి రెండు వేర్వేరు గ్రామాల్లో బాలికలపై దాడి చేసిన తోడేళ్లు బుధవారం రాత్రి కూడా ఒక వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ వృద్ధురాలు నిద్రిస్తుండగా, ఇంటిలోకి దూరిన తోడేలు ఆమె గొంతుకొరికి, మంచంపై నుంచి కిందికి లాగి పడేసింది. ఈ దాడిలో వృద్దురాలి మెడకు బలమైన గాయమైంది. ఈ దాడి నేపధ్యంలో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఖైరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియన్ పూర్వా తప్రా గ్రామంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పుష్పాదేవి అనే వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో తోడేలు ఆమెపై దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో ఆమె కోడలు వచ్చి, తోడేలును తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టుపక్కలవారు రావడంతో ఆ తోడేలు పారిపోయింది. బాధితురాలికి తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి, ఆ తరువాత బహ్రయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.గత రెండు రోజుల్లో నరమాంస భక్షక తోడేళ్లు దాడి చేయడం ఇది మూడోసారి. ఇలా తోడేళ్లు వరుస దాడులకు పాల్పడటం గురించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) చీఫ్ ఎస్పీ యాదవ్ మీడియాకు పలు వివరాలు తెలిపారు. ఆ తోడేళ్లు రేబిస్ బారినపడటం లేదా వాటికి కెనైట్ డిస్టెంపర్ వైరస్ సోకడమో కారణంగా అవి ఇలా ప్రవర్తిస్తున్నాయన్నారు. తోడేళ్ల వరుస దాడులు అసాధారణ అంశమని, గత పదేళ్లలో ఈ తరహా ఘటనలు జరగడం ఇదే మొదటి సారి అని అన్నారు. దీనిపై అటవీ శాఖ సర్వేలు నిర్వహిస్తోందన్నారు. దాడులకు పాల్పడుతున్న తోడేళ్ల నమూనాలను విశ్లేషించడం ద్వారా వాటి దాడుల వెనుకనున్న కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని యాదవ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
Bahraich: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 11 ఏళ్ల బాలికపై..
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 11 ఏళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో బాధిత బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ దాడి అనంతరం స్థానికుల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. బహ్రయిచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాల్లో నరమాంస భక్షక తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ అటవీశాఖ ఐదు తోడేళ్లను పట్టుకుంది. ‘ఆల్ఫా’ అనే తోడేలు కోసం వెదుకులాట సాగిస్తోంది. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఇంకా ఒక తోడేలును పట్టుకోవాల్సి ఉందని అన్నారు. అంతకుముందు ఆగస్టు 29న అటవీ శాఖ బృందం నాలుగో తోడేలును పట్టుకుంది. గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు.ఇది కూడా చదవండి: తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు -
బహ్రయిచ్‌లో పట్టుబడిన ఐదో తోడేలు
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. #WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024 -
Uttar Pradesh: నక్కను తోడేలు అనుకొని..
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం తోడేళ్ల వేటలో పడింది. తాజాగా రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఓ యువకుడు నక్కను తోడేలుగా భావించి చంపేశాడు. ఈ ఘటన సిధౌలీ తహసీల్‌లోని అసోధన్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ యువకుడిపై నక్క దాడి చేసింది. ఆ యువకుడు దానితో పెనుగులాడాడు. ఈ దాడిలో ఆయువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ నక్కను తోడేలుగా భావించిన యువకుడు దానిని కాళ్లతో తన్నిచంపేశాడు.యువకుని కేకలు విన్న గ్రామస్తులు కర్రలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు టార్చ్ లైట్ వెలుగులో దానిని చూసి, అది తోడేలు కాదని, నక్క అని గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడిని ఇంటికి పంపించారు. -
UP: తోడేళ్ల దాడులు.. కుక్కను చంపిన గ్రామస్తులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తోడేళ్ల వరుసదాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో తోడేళ్లు కనిపిస్తే చంపేసేందుకు గస్తీ కాస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి మహ్సీ తహసీల్‌లోని ఓ గ్రామంలో తోడేలు అనుకుని కుక్కను చంపారు గ్రామస్తులు.చనిపోయిన కుక్క ముగ్గురిపై దాడి చేసిందని చెబుతున్నారు. గ్రామంలోని పలువురిపై తోడేలు దాడి జరిగిందని సమాచారమందడంతో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే గ్రామస్తులు తమపై దాడి చేసిన జంతువును చంపేశారు. ఫారెస్ట్ అధికారులు వెళ్లి చూసి చనిపోయిన జంతువు కుక్క అని తేల్చారు. మరోవైపు కుక్కదాడిలో గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహ్సీ, బహ్రెయిచ్‌లో ఈ ఏడాది మార్చ్ నుంచి జరుగుతున్న తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 30 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 20 మందిదాకా తీవ్రంగా గాయపడ్డారు. -
యూపీలో ఆగని తోడేళ్ల బెడద.. బాలుడిపై దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో తోడేళ్ల దాడులు ఆగడం లేదు. కనిపిస్తే కాల్చేసేందుకు తుపాకులు పట్టుకుని షూటర్లు తిరుగుతున్నా అవి వెనక్కు తగ్గడం లేదు. తాజాగా గురువారం(సెప్టెంబర్ 5) రాత్రి ఓ తోడేలు పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. కొత్వాలీ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై తోడేలు విరుచుకుపడింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. తోడేళ్ల వరుస దాడులతో భయం గుప్పిట్లో బతుకుతున్న బహ్రెయిచ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాజా దాడితో మరింత భయాందోళనలకు గురవుతున్నారు. బహ్రెయిచ్‌లో ఇప్పటివరకు జరిగిన తోడేళ్ల దాడుల్లో 8 మంది దాకా మరణించగా 35 మంది గాయప డ్డట్లు తెలుస్తోంది . తోడేళ్ల దాడులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయడానికి షూటర్లను రంగంలోకి దింపింది. అయితే వాటి పిల్లలపై దాడి చేసినప్పుడు, అవి ఏర్పరుచుకున్న ఆశ్రయాలను ధ్వంసం చేసినపుడు మాత్రమే తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగుతాయని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిచ్‌లో తోడేళ్లు మనుషులపై వరుస దాడులకు దిగడానికి ఇదే కారణమయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే తోడేళ్లది దాడికి పాల్పడే స్వభావం కాదని నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఇదీచదవండి.. రక్తం మరిగిన తోడేళ్లు -
తోడేలులా ప్రవర్తిస్తున్న యువకుడు
ముజఫర్‌నగర్: యూపీలోని బహ్రయిచ్ తోడేళ్ల దాడులతో వణికిపోతోంది. తాజాగా ముజఫర్ నగర్లోనూ ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ దాడులకు పాల్పడుతున్నది ఏ తోడేలో, కుక్కనో కాదు.. ఒక యువకుడు. వినడానికి విస్తుపోయేలా ఉన్నా ఇది నిజం.వివరాల్లోకి వెళితే యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ యువకుడు నరమాంస భక్షకునిగా మారి, పలువురిని కరుస్తునాడు. అతను సృష్టిస్తున్న భీభత్సానికి స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. ఆ యువకుడు ఓ మహిళతో పాటు ఓ బాలికను గట్టిగా కరిచాడు. అతని దాడి నుంచి బాధిత మహిళను బాలికను ఆ దారినపోతున్నవారు అతికష్టం మీద కాపాడారు.ఆ యువకుడు కుక్కల వెంట పరిగెడుతూ, వాటిని భయపెట్టడంతో పాటు దారినపోయినవారిని కొరుకుతూ గాయపరుస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. -
తోడేళ్ల పగ.. దడ పుట్టిస్తున్న నిజాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు అంత్యంత ఆశ్యర్యకర విషయాన్ని వెల్లడించారు. నిజానికి తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగే జంతువులని, బహుశా గతంలో మనుషులు.. తోడేలు పిల్లలకు చేసిన హానికి ప్రతీకారంగా అవి ఇలా దాడులకు దుగుతుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.బహ్రయిచ్‌లోని మహసీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలు గత మార్చి నుంచి తోడేళ్ల భీభత్సాన్ని ఎదుర్కొంటున్నారు. జూలై నెల నుండి ఇప్పటివరకూ ఈ దాడుల కారణంగా ఏడుగురు పిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సహా దాదాపు 36 మంది తోడేలు దాడులలో గాయపడ్డారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి, బహ్రయిచ్ కతర్నియాఘాట్ వన్యప్రాణుల విభాగం అటవీ అధికారి జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తోడేళ్ళు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటాయని, గతంలో వాటి పిల్లలను మనుషులు చంపేశారని అన్నారు. వాటికి ఏదో ఒక రకమైన హాని జరిగినందుకే అవి ప్రతీకారంగా దాడులకు దిగుతున్నాయని అన్నారు.పదవీ విరమణ తర్వాత ‘వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’కు సలహాదారుగా పనిచేస్తున్న సింగ్ తన అనుభవాన్ని ప్రస్తావిస్తూ 20-25 ఏళ్ల క్రితం జౌన్పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లోని సాయి నది ఒండ్రుమట్టిలో తోడేళ్ళు కనిపించేవి. ఈ నేపధ్యంలో కొందరు పిల్లలు తోడేళ్ల గుహలోకి ప్రవేశించి అక్కడున్న తోడేలు పిల్లలను చంపినట్లు ఆనాడు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ తోడేళ్లు ప్రతీకార దాడులకు దిగాయి. వాటి దాడుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు.బహ్రైచ్‌లోని మహసీ తహసీల్ గ్రామాల్లో జరుగుతున్న తోడేలు దాడులకూ వాటి ప్రతీకారమే కారణం కావచ్చని సింగ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో బహ్రయిచ్‌లో రెండు తోడేళ్ల పిల్లలు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాయి. దీంతో తోడేళ్లు దాడికి దిగడం మొదలుపెట్టాయి. అప్పడు అటవీ అధికారులు దాడి చేసిన తోడేళ్లను పట్టుకుని 40-50 కిలోమీటర్ల దూరంలోని చకియా అడవిలో వదిలిపెట్టారు. అయితే చకియా అడవి తోడేళ్లకు సహజ నివాసం కాదు. ఈ తోడేళ్లు చకియా నుండి ఘఘ్రా నది ఒడ్డున ఉన్న తమ గుహలోకి తిరిగి వచ్చి, ప్రతీకార దాడులకు పాల్పడూ ఉండవచ్చన్నారు. బహ్రయిచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ “సింహాలు, చిరుతపులులు ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవు. కానీ తోడేళ్లుకు ఆ స్వభావం ఉంటుంది. తోడేళ్లు వాటి పిల్లలకు మనుషుల నుంచి ఏదైనా హాని జరిగినా, అవి మనుషులను వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాయని అన్నారు. -
మళ్లీ తోడేలు దాడి.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
బహ్రయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలోని 35 గ్రామాలు నరమాంస భక్షక తోడేళ్ల దాడులతో వణికిపోతున్నాయి. ప్రతిరోజూ తోడేళ్ల దాడులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఇద్దరు చిన్నారులపై నరమాంస భక్షక తోడేలు దాడి చేసింది.ఈ ఘటన బహ్రయిచ్‌లోని మహసీ ప్రాంతంలోని గిర్ధర్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి నరమాంస భక్షక తోడేలు ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాలిక గాయపడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతోంది.ఐదేళ్ల బాలిక తన అమ్మమ్మతో కలిసి ఇంట్లో మంచంపై నిద్రిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో తోడేలు ఆమెపై దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో ఆ తోడేలు అక్కడి నుంచి పారిపోయి, మరో ఇంట్లోని చిన్నారిపై దాడి చేసింది. ఆ చిన్నారి కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మహసీ తహసీల్ ప్రాంతంలోని పాంధుయా గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా రాత్రివేళ నరమాంస భక్షక తోడేళ్లు దాడులకు దిగుతున్నాయి. -
వెంకూర్లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్..!!
ఆదిలాబాద్: మండలంలోని పాత వెంకూర్ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
ప్రభుదేవా కోసం విజయ్ సేతుపతి పాట
సినిమాల్లో ఇప్పుడు హీరోలు పాడటం సర్వసాధారణం అయ్యింది. నటుడు విజయ్, ధనుష్, శింబు ఇలా చాలా మంది నటనతో పాటు పాటలను కూడా పాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి నటుడు విజయ్‌సేతుపతి చేరారు. ఈయన నటుడిగా తమిళం దాటి తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. పాత్రలో వైవిధ్యం ఉందనుకుంటే హీరో, విలన్ అంటూ చూడకుండా నటించేస్తున్నారు. ఇకపోతే నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉల్ఫ్. ఇది ఈయన నటిస్తున్న 60వ చిత్రం. ఇందులో నటి అంజు కురియన్ నాయకిగా నటిస్తుండగా పుష్ప చిత్రం ఫేమ్ అనసూయ భరద్వాజ్, రాయ్ లక్ష్మీ, శ్రీగోపిక, రమేశ్ తిలక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుళ్విన్సెంట్ చాయాగ్రహణం, అమ్రేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సైకిలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రానికి సిండ్రిల్లా చిత్రం ఫేమ్ వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం నటుడు విజయ్ సేతుపతి ఒక పాట పాడటం విశేషం. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్‌లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi — Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023 (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
ఇదేం ఖర్మ.. ఆ తిక్కకు ఓ లెక్కంటూ లేదా?
వైరల్: పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. వెరైటీ పేరిట చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విపరీతమైన ఆదరణ తెచ్చిపెడుతుంటాయి. కానీ, ఆ ప్రయత్నం అతిగా ముందుకెళ్తే? మనిషికి తిక్క ఉండొచ్చు. కానీ, దానికి ఓ లెక్కంటూ లేకపోతేనే సమస్య మొదలయ్యేది.. ఈ తిక్కకు ఓ లెక్కంటూ లేదా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. జపాన్‌లో ఆ మధ్య ఒకడు కుక్కలా బతకాలని ఉందంటూ లక్షలు పోసి.. కుక్క కాస్టూమ్ను తయారు చేయించుకున్నాడు. రాత్రికి రాత్రే వైరల్ అయిపోయాడు. అయితే.. ఈ మధ్య ఓ బ్రిటన్ టాబ్లాయిడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోకో అనే ఆ వ్యక్తి.. కుక్కలా బతకడం వల్ల ఇంట్లోవాళ్లు, స్నేహితులు ఏం అనుకుంటారో అని తెగ ఫీలైపోతున్నాడు. త్వరలోనే ఆ వేషానికి ముగింపు వేయాలని అనుకుంటున్నాడట. ఈ వ్యవహారం మరిచిపోక ముందే.. #WATCH: Ever wanted to know what it would be like to live life as a dog? One #Japanese man actually has an answer to this question. Toco spent a whopping two million Yen on a realistic #Collie breed costume. @zeppetJP (🎥 via @toco_eevee)https://t.co/025Pbky6qZ pic.twitter.com/e5WCMNmJkd — Arab News Japan (@ArabNewsjp) May 27, 2022 అదే జపాన్‌లో మరొకడు తోడేలులా కనిపించేందుకు డబ్బు కుమ్మరించాడు. ఈసారి ఇంకా ఎక్కువే ఖర్చు చేశాడు. మన కరెన్సీలో ఆ విలువ రూ. 19 లక్షల దాకా ఉంటుంది. కుక్క కోసం టోకో ఆశ్రయించిన జెప్పెట్ కంపెనీనే.. ఇతని కోసం సూట్ తయారు చేసింది. అయితే నిజమైన తోడేలులాగా నడిచేందుకు అతనికి కాస్త కష్టంగా ఉందంట. అందుకే రెండు కాళ్లతో నడుస్తూ.. తన తోడేలు కల నెరవేరిందని సంతోషిస్తున్నాడు. ఇది చూసి నెటిజన్స్.. ఒకరిని చూసి మరొకరు ఇలా తయారు అవుతున్నారంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆ కంపెనీకి మరిన్ని జంతువుల ముసుగులు కావాలంటూ ఆర్డర్లు పెడుతున్నారంట ఇదంతా చూస్తున్న వాళ్లు. View this post on Instagram A post shared by 特殊造型ゼペット (@zeppet_jp) -
రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది. -
ఇంతకీ ఈ వింత జంతువు పేరేంటి!
అవును.. ఇదేంటి? ఒక్కొక్కరూ ఒక్కోటి చెప్తారు.. చూడ్డానికి నక్కలా ఉందని కొందరు.. కుక్కలా ఉందని మరికొందరు.. ఇవన్నీ కాదహే.. అని ఇంకొందరు.. ఇది తిమింగళం అని మేమంటాం? మీరేమంటారు? ఎర్రగడ్డ నుంచి డిశ్చార్జి అయి ఎన్ని రోజులైంది అని అనేగా.. అచ్చంగా ఇది తిమింగళమే.. అవును.. అవి ఒకప్పుడు నాలుగు కాళ్లపై నడిచేవట. మనిషి కోతి నుంచి పుట్టాడు అంటారు.. ఒక్కో జంతువు.. ఒక్కో జంతువు నుంచి పరిణామం చెందాయనేది కూడా తెలిసిందే. తాజాగా వేల్స్ విషయం చూసుకుంటే.. అవి ఎలా పరిణామం చెందాయనే దానిపై పరిశోధనలు జరిగాయి. ఈ జలచరాలు.. జింకల మాదిరిగా చెంగుచెంగున భూమిపై గంతులు వేసేవనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని నార్త్ ఒహియో మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. లిటిల్ డీర్స్ అనే ఇండోహయస్ జంతువుల నుంచి ఈ వేల్స్ పరిణామం చెందాయని వివరించారు. సీటేషియన్స్ జాతికి చెందిన జంతువుల (హిప్పోపోటమస్, వేల్స్ వంటివి) జీవ పరిణామం గురించి అధ్యయనం చేస్తుండగా, పాకిస్తాన్లో 4.7 కోట్ల సంవత్సరాల కిందటి లిటిల్ డీర్‌కు సంబంధించిన శిలాజం లభించింది. ఇది ఓ నక్క పరిమాణంలో ఉండి, పొడవాటి శరీరం, తోక కలిగి ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ జీవిలోని పలు ఎముకల నిర్మాణం వేల్స్ ఎముకలతో పోలి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ జంతువులు ఆహారం కోసం వెతుకుతూ.. శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు సముద్రం దగ్గరికి వెళ్లి దాచుకునేవని, అలా కాలక్రమేణా నీటిలో జీవించే జీవనాన్ని అలవరుచుకున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఇండోహయస్, వేల్స్ రెండింటి కపాలం, చెవుల నిర్మాణాలు ఒకేలా ఉన్నాయని తెలిసింది. మొసళ్ల మాదిరిగా ఆహారం కోసం ఒడ్డున ఎదురుచూసేవని, చివరికి ఆ నీళ్లలోనే జీవనం అలవాటు చేసుకున్నాయని చెబుతున్నారు. -
40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..
సైబీరియా : 40 వేల ఏళ్ల నాటి ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుతో సహా రాకాసి తోడేలు తలలోని ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ రాకాసి తోడేలు తల పరిమాణము ప్రస్తుత మున్న తోడేళ్ల తల కంటే పెద్దదిగా ఉంది. మామూలు తోడేళ్ల తల 9 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో దీని కనుగొన్నారు. రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ మాట్లాడుతూ.. ‘’ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసార’’ని అన్నారు. టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ నావోకీ సుజుకి మాట్లాడుతూ.. ఆ రాకాసి తోడేలు తలలోని కండరాళ్లు, వివిధ భాగాలు, మెదడు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తోడేళ్ల జాతితో, సింహాలతో రాకాసి తోడేళ్లను పోల్చిచూసి వాటి శక్తి సామర్థ్యాలను బేరీజువేస్తామ’’ని చెప్పారు. -
మిమ్మల్నే మహారాజా!
మృగరాజు ముసలిదైపోయింది. చూపు తగ్గింది. వేటాడే ఓపిక సన్నగిల్లింది. దాంతో ఓ ఉపాయం ఆలోచించింది. తోడేలును పిలిచి, ‘‘నేను పెద్దవాడినయి పోయాను. వేటాడలేక పోతున్నాను. కాబట్టి ఏదో ఒక జంతువును నా దగ్గరకు తీసుకొస్తుండు. నీకూ వాటా ఇస్తాను. అన్నట్లు ఇప్పుడు నాకు దుప్పి మాంసం తినాలనుంది. బాగా బలిసిన దుప్పినొకదాన్ని తీసుకురా’’ అని ఆజ్ఞాపించింది. తోడేలు అందుకు ఒప్పుకుంది. వెంటనే బయల్దేరి ఒక దుప్పి దగ్గరకెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా! కులాసానా?’’ అంటూ పలకరించింది. తనను కాదనుకుని అటూ ఇటూ చూడసాగింది దుప్పి. ఈ సారి ఇంకాస్త వినయంగా ‘‘మిమ్మల్నే మహారాజా’’ అంది నక్క. దాంతో అది పిలుస్తున్నది తననే అని నిర్ధారించుకుని, ‘‘ఊ! మేము బాగానే ఉన్నాం. ఏమిటి సంగతి?’’ అనడిగింది దుప్పి అప్పటికే తాను మహారాజయిపోయినట్లు! ‘‘మీకు తెలియందేముంది రాజా! మన మృగరాజుగారు పెద్దవారయ్యారు కదా. తన స్థానంలో మిమ్మల్ని రాజును చెయ్యాలని తీర్మానించుకున్నారు. మిమ్మల్ని సగౌరవంగా పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆయన మనసు మార్చుకోకముందే బయల్దేరండి’’ అంటూ తొందర చేసింది. దుప్పికి తన బలంమీద, తెలివి తేటలమీద బాగా నమ్మకం. తోడేలు మాటలు నిజమేనని నమ్మింది. ముందు వెనకలు ఆలోచించకుండా కొమ్ములు దువ్వుకుంటూ వెంటనే బయల్దేరింది. తోడేలు దాన్ని సింహం ఉన్న గుహదాకా తీసుకొచ్చింది. తటపటాయిస్తున్న దుప్పితో, ‘‘మృగరాజు దగ్గరకు వెళ్లండి. మీకు కిరీటం తొడిగి, మీరు ఏమేం పనులు చేయాలో చెబుతారు’’ అంది తోడేలు. దుప్పి సింహం దగ్గరకు వెళ్లి తలవంచి నిలబడింది. సింహం ఒక్కసారిగా తన పంజా విసిరి దాని మెడ చీల్చి చంపేసింది. అది తినగా మిగిలిన మాంసంతో తోడేలు విందు చేసుకుంది. నక్క వినయాలు నిజమేననుకోవడం, అవతలివారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరం. –డి.వి.ఆర్. -
మూడు పంది పిల్లలు – తోడేలు
అనగనగా ఒక అడవి. అడవి ప్రక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో మూడు పంది పిల్లలు వాళ్ళ అమ్మనాన్నలతో హాయిగా జీవించేవి. అవి పెద్దవయ్యాక వాళ్ళ ఇల్లు సరిపోకపోవడంతో తల్లిదండ్రులు వాటిని వేరేగా మంచి ఇల్లు కట్టుకుని ఉండమన్నాయి. అప్పుడవి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళాయి. ఒక రావి చెట్టు దగ్గర మంచి ప్రదేశం చూసుకున్నాయి. అక్కడ ఇల్లు ఎలా కట్టుకోవాలా అనుకుంటుండగా ఆ దారినే పోతున్న ఒక ఒంటె ఈ పంది పిల్లలని చూసి సంగతేంటని అడిగింది. ‘‘మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఇల్లు దేనితో కట్టుకోవాలో తెలియడంలేదు’’ అన్నాయవి. అప్పుడా ఒంటె ‘‘ఏమీ దిగులు పడకండి. నాకు ఇటుకల బట్టీ ఉంది. బాగా కాల్చిన ఇటుకలు ఇస్తాను. వాటితో కట్టుకోండి’’ అంది. అవి ఒంటెకి ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి కావలసినన్ని ఇటుకలు తెచ్చుకుని, ఇల్లు కట్టుకుని అక్కడ ఉండసాగాయి. ఒకరోజు ఈ మూడు పందులని గమనించిన ఒక తోడేలు ఎలాగైనా వాటిని పట్టి తినాలనుకుంది. అది పందులున్న ఇంటి దగ్గరకొచ్చి ‘‘ఏయ్, మురికి పందులూ, నన్ను లోపలకి రానివ్వండి’’ అంది. ‘‘నిన్ను మేము రానివ్వం. రానిస్తే మమ్మల్ని తింటావని మాకు తెలుసు’’ అన్నాయి పందులు. ‘‘మీరు రానివ్వకపోతే మీ ఇల్లు ఊదేస్తాను, ఇంటిని పీకేస్తాను, మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’‘ అని అరిచాయి లోపల నుండి పందులు. తోడేలు ‘హఫ్, హుఫ్, హఫ్, హుఫ్’ అని ఊదింది. ఇటుకలని పీకడానికి ప్రయత్నించింది. ‘‘అబ్బ! ఈ ఇల్లుగట్టిగా ఉందే’’ అని, ‘‘సరే ఇçప్పుడు చీకటి పడింది కాబట్టి వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం సుత్తితో వస్తాను. తలుపు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది. ‘‘వద్దు, వద్దు. మా ఇంటినేం చేయొద్దు’’ అరిచాయి పందులు. తెల్లవారింది. మూడు పందులకి ఏం చేయాలో పాలుపోక ఏడుçస్తూ కూర్చున్నాయి. అప్పుడు ఆ దారిలో పోతున్న నిప్పు కోడి విషయం తెలుసుకుని.. ‘‘ఏడవకండి, నా దగ్గర పట్టుకుంటే షాక్కొట్టే తాళాలు ఉన్నాయి. వాటిని బిగించండి. ఆ తోడేలు వచ్చినప్పుడు స్విచ్ వేయండి. పట్టుకుంటే షాక్కొట్టి అల్లంత దూరాన పడుతుంది. ఇక మీ జోలికిరాదు’’ అంది. మూడు పందులూ నిప్పుకోడికి కృతజ్ఞతలు చెప్పుకుని కరెంటు తాళాలు తెచ్చి తలుపులకు బిగించాయి. సాయంత్రమైంది. సుత్తితో తోడేలు వచ్చింది. ‘‘ఏయ్, మురికి పందులూ.. మీ తాళాన్ని పీకేస్తాను, తలుపులని పగలగొట్టి, లోపలకొచ్చి మిమ్మల్ని పట్టి తినేస్తాను’’ అంది తోడేలు. ‘‘వద్దు, వద్దు’’ అని అరిచి గబగబా స్విచ్చి వేశాయి. స్విచ్చి వేయగానే తాళాలన్నీ ఎర్రగా మండసాగాయి. తోడేలు సుత్తి తీసుకుని తాళం పగలగొట్టబోయింది. షాక్కొట్టి ఎగిరి అవతలపడింది. ‘‘ఓ, కరెంటు తాళాలు వేశారా, సరే రేపు వస్తాను, డ్రిల్లింగ్ మిషిన్ తెస్తాను, తాళాలు పగలగొట్టి లోపలకి వస్తాను’’ అంది కోపంగా. ‘‘వద్దు, వద్దు.’’ అరిచాయి పందులు. తెల్లవారింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాయి పందులు. అప్పుడా దారిలో పోతున్న సీతాకోకచిలుకల గుంపు ఈ పందుల దగ్గర వాలి ‘‘ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాయి. విషయం చెప్పగానే ‘‘మేము చెప్పినట్లు చేయండి. ముందుగా అదిగో ఆ ప్రక్కనున్న చెరువులో స్నానం చేసిరండి’’ అంది ఒక తెల్లని సీతాకోకచిలుక. అవి స్నానం చేసి వచ్చాయి. ‘‘ఇంటి ముందు పూల చెట్లతో అలంకరించండి’’ అన్నాయి ఎరుపు, నలుపు, నీలం రంగు సీతాకోక చిలుకలు. మూడు పందులూ గబగబా రకరకాల రంగుల పూల చెట్లను తెచ్చి నాటాయి. ‘‘ఇంటిపైకి పాకేలా పూల తీగలని నాటండి’’ అన్నాయి పసుపు సీతాకోక చిలుకలు. పందులు పూల తీగలను తెచ్చి ఇంటి పైకి పాకించాయి. ఇల్లు అందంగా తయారయింది. ‘‘ఆహా! మీ ఇల్లు ఎంత బాగుంది?’’ అంటూ సీతాకోక చిలుకలన్నీ ఇంటి ముందు పుప్పొడితో రంగవల్లులు వేసి వెళ్ళిపోయాయి. పందులు సీతాకోక చిలుకలకి వీడ్కోలు పలికాయి. ‘‘ఆహా! మన ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకున్నాయవి. అలిసిపోయిన అవి హాయిగా పడుకుని నిద్రపోయాయి. సాయంత్రమయింది. తోడేలు డ్రిల్లింగ్ మిషెన్తో వచ్చింది. ‘‘పందులుండే ఇల్లు ఇది కాదే, దారితప్పానా?’’ అనుకుంది. సరిగ్గా చూసింది. ‘‘ఆహా! ఇదే కాని ఈ ఇల్లు ఎంత బాగుంది?’’ అనుకుంటూ వచ్చి ‘‘పందులూ, శుభ్రంగా ఉన్న పందులూ మీ ఇల్లు ఎంత బాగుంది, ఎంత సువాసనగా ఉంది? నన్ను లోపలకి రానివ్వండి’’ అని చిన్నగా అడిగింది. ‘‘రానిస్తాం, కాని నువ్వు మమ్మల్ని ఎందుకు తినాలనుకుంటున్నావ్? మా దగ్గర బోలెడన్ని దుంపలు, తేనె ఉంది. నీకు అవి ఇస్తాం. నువ్వు మాతో స్నేహం చేస్తే నీకు చాలా ఆటలు కూడా నేర్పుతాం!’’ అన్నాయవి. ‘‘ఓ! అలాగే, నేను మీతో స్నేహం చేస్తాను. మీరు పెట్టినవే తింటాను, మీతో ఆటలాడతాను, లోపలకి రానివ్వండి. మీ ఇంటిని చూస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంతకు ముందు మిమ్మల్ని తింటానని బెదిరించినందుకు క్షమించండి’’ అంది తోడేలు. ‘‘ఇప్పుడు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ పందులు తలుపు తీశాయి. తోడేలు లోపలకి వెళ్ళింది. శుభ్రంగా ఉన్న పందులనీ, ఇంటినీ చూసి చాలా ఆనందపడింది. అన్నీ చక్కగా చేతులు కడుక్కుని దుంపలుతిని, తేనెని తాగాయి.ఇంటి వెనుకనున్న తోటలో అవన్నీ కలసిమెలసి సంతోషంగా ఆటలాడుకున్నాయి. రావిచెట్టు మీద వాలి ఇదంతా చూస్తున్న సీతాకోక చిలుకలు కిలకిలా నవ్వాయి. – రాధ మండువ -
నక్క బావ కథ కంచికేనా!
అంతరిస్తున్న నక్క, తోడేలు, మచ్చల జింక ► ప్రమాదంలో 150 వృక్ష, జంతుజాతుల మనుగడ ► 95 జాతుల జాబితాను రూపొందించిన జీవ వైవిధ్య బోర్డు ► మచ్చల కందుల జాడ లేదు.. పేలాల జొన్నల ఊసు లేదు.. ► పులి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటు, రాబందులకూ పొంచి ఉన్న ప్రమాదం.. కళ్లు తెరవకుంటే కనుమరుగే సాక్షి, హైదరాబాద్: ‘అనగనగా ఓ తోడేలు.. ఓ అడవిలో నక్క ఉండేది..’ చిన్నతనంలో బామ్మ చెప్పిన కథలన్నీ ఇలాగే మొదలయ్యేవి! చందమామ, బాలమిత్ర పుస్తకాల కథల్లోనూ చాలావరకు ఇవే కనిపించేవి. కానీ పరిస్థితులు చూస్తుంటే మున్ముందు ఈ జంతువుల ఉనికి ఇక కథలకే పరిమితమయ్యేలా ఉంది. భావి తరాలు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వీటితోపాటు అనేక జంతు, వృక్ష, పక్షి, ఉభయచర, సరీసృపాల జాతుల మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అవన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ జాబితాలో సుమారు 150 జాతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు గుర్తించింది. ప్రస్తుతానికి 95 జాతుల జాబితాను రూపొందించింది. మరో 55 జాతుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అరుదైన వృక్ష, జంతు జాతులను పరిరక్షించుకోకుంటే భావి తరాలకు ఇవన్నీ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబంధులు.. మచ్చల కందులేవీ? వినువీధిలో రాబంధుల రెక్కల చప్పుడు క్రమేణా కనుమరుగవుతోంది. తెలంగాణ సంప్రదాయ పంట మచ్చల కందులు మాయమౌతున్నాయి. రాష్ట్రానికే తలమానికమైన అరుదైన వృక్ష, జంతుజాతులు మాయమై జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన పంటలు కూడా అంతరించిపోతున్నాయి. తాతలనాటి నుంచి వంశపారంపర్యంగా> వస్తున్న ఎర్రమచ్చల కందులు.. పేలాల జొన్నలు, వాయునౌక జొన్నలు వంటి పంటలు అంతర్ధానమవుతున్నాయి. అడవుల నరికివేత, వేటలతో మన్ననూరు గేదె వంటి అరుదైన జంతు జాతులూ అంతరించిపోయే జాబితాలో చేరాయి. అంతరించిపోతున్న వృక్ష, జంతుజాతులివే.. పర్యావరణపరంగా అరుదు(రేర్), ఎన్డేంజర్డ్ (అంతరించిపోతున్న దశ), థ్రెటన్డ్(అంతిమ దశ) అన్న విభాగాల్లో సుమారు 150 వృక్ష, జంతు జాతులున్నట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గుర్తించింది. వాటి వివరాలివీ.. వృక్ష జాతులు(25): ఎర్రమచ్చల కందులు, పేలాల జొన్నలు, వాయునౌక జొన్న తదితరాలు జంతువులు(23): నక్క, తోడేలు, మన్ననూర్ గేదె, అడవి కుక్క, చిరుత, హైనా, మచ్చల జింక, బురద మచ్చల పిల్లి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటి, పులి వంటివి.. పక్షులు(27): తెల్ల రాబంధు, పొడవు ముక్క రాబంధు, ఎర్రతల రాబంధు, ఈజిప్షియన్ రాబందు, పెద్దమచ్చల గద్ద, కొంగ(బ్లాక్నెక్డ్ స్టార్క్) తదితరాలు సరీసృపాలు(9): మగ్గర్ మొసలి, కొండచిలువ వంటివి.. చేపలు(10): క్లైంబింగ్ పెర్క్, దక్కన్ వైట్ కార్ప్, దక్కన్ నంగ్రా వంటివి.. అరుదైన పంటలు ఎందుకు కనుమరుగవుతున్నాయంటే.. – వాతావరణ మార్పులు – సంప్రదాయ వంగడాలను పరిరక్షించుకునే దిశగా రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడం – రైతులు వాణిజ్య పంటలకే మొగుచూపడం. విత్తనాలు విరివిగా లభించకపోవడం – మార్కెటింగ్ వసతులు లేకపోవడం, నిల్వచేసేందుకు స్టోరేజీ సదుపాయాలు లేకపోవడం – విత్తనాల లభ్యత లేకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం – సాగు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడం – నీటి సౌకర్యం లేకపోవడం – చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందులు భారమవడం జంతుజాతుల ఎందుకు ప్రమాదంలో పడుతున్నాయి? – వన్య మృగాల వేట – అడవుల నరికివేత. వాస్తవానికి రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులుండాలి. కానీ మన రాష్ట్రంలో 23 శాతమే ఉన్నాయి – అటవీ ప్రాంతాల్లో మైనింగ్, వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలు – అడవుల్లో సహజసిద్ధ వాతావరణం కనుమరుగుకావడం – జంతు జాతుల సంతానోత్పత్తి దిశగా ప్రయోగాలు చేయకపోవడం పరిష్కారం ఏంటి? – అంతరించిపోతున్న జీవజాలం వీర్యం, అండాలను సేకరించి ప్రయోగశాలల్లో కృత్రిమ ఫలదీకరణ చేయడం ద్వారా ఆయా జాతులను పరిరక్షించవచ్చు – అరుదైన పంటలు, వృక్షజాతుల విత్తనాలు సేకరించి, మరింత అభివృద్ధిపరచి రైతులకు అందజేయడం అవగాహన కల్పిస్తున్నాం: డాక్టర్ సి.సువర్ణ, సభ్య కార్యదర్శి, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు అరుదైన వృక్ష, జంతుజాలం పరిరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అరుదైన పంటల పరిరక్షణ ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయవచ్చని అందరూ గుర్తించాలి. సంప్రదాయ పంటల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. ఈ పంటలతో అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది. అంతరించిపోతున్న జంతు జాతులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటి పరిరక్షణకు అందరూ చర్యలు తీసుకోవాలి. -
ముగ్గురమ్మాయిలతో..
కంటికి కనపడేదంతా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు అబద్ధం నిజంలా రంగుపూసుకుని, నిజానికన్నా మరింత అద్భుతంలా కనిపించవచ్చు. అప్పుడు కూడా మనం అందులోని అబద్ధాన్ని కనిపెట్టేప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మాత్రం అబద్ధమే బాగుందనుకుంటాం. ఈ తోడేలు బొమ్మ(నిజానికి దీన్ని తోడేలు ఫొటో అనాలి) అలాంటి ఓ నిజమైన అబద్ధమే. ఇందులో ఏం ఉంది? అని గట్టిగా అడిగితే ముగ్గురు యువతులు నగ్నంగా ఉన్నారని చెప్పక తప్పదు మరి! ఇటలీకి చెందిన యువ బాడీపెయింటర్ జొహానెస్ స్కాటర్ తపనకు రూపమే ఈ అద్భుతమైన తోడేలు రూపం. నూలుపోగైనా ధరించని ముగ్గురు మహిళల ఒంటిపై పెయింటింగ్ వేసి, వాళ్లను తోడేలు ఆకారంలో కదలకుండా కూర్చోబెట్టి తీసిన ఫొటో ఇది. ఈ ఒక్క ఫొటో తీయడానికి స్కాటర్ కు దాదాపు ఎనిమిది గంటలు పట్టింది. ఆరు గంటలు బాడీ పెయింటింగ్ కు పోగా, రెండు గంటలకు వాళ్లను సరైన పొజిషన్ లో కూర్చోబెట్టడానికి పట్టిందట. 2012 నుంచి ఈ రూపం కోసం ఎన్నెన్నో స్కెచ్ లు గీసుకుని, చివరికి విజయం సాధించాడు. ఈ ఫొటో విడుదలైనప్పటి నుంచి స్కాటర్ కు ప్రశంసలే ప్రశంసలు. అన్ని గంటలు శ్రమకోర్చి ఒంటిపై పెయింటింగ్ వేయించుకుని, అచ్చం తోడేలులా పోజుపెట్టిన ఆ ముగ్గురు వైల్డ్ ఉమన్ కు కూడా లక్షల సంఖ్యలో గ్రీటింగ్స్ అదుతున్నాయి. -
మానవ తోడేలు వ్యాధి!
మెడిక్షనరీ ఈ వ్యాధి ఉన్నవారిలో తోడేలు రోమాల్లా అనిపించే కేశాలు ముఖం నిండా లేదా ఒంటి నిండా పెరుగుతాయి. గ్రీకు జానపదగాథల్లో ‘మానవ తోడేలు’ అని పిలిచే ఒక ఊహా జంతువు ఉంది దాని పేరే ‘వెరెవూల్ఫ్’. దాని పేరు మీద ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. హిమాలయాల్లో నరవానరం (బిగ్‌ఫుట్) అని పిలిచే నరవానరం ఉందని మన దేశంలో కొందరు నమ్మినట్లే, యూరోపియన్ దేశాల్లో వెరెవూల్ఫ్ అని పిలిచే మానవతోడేలు ఉందని మరికొందరు నమ్ముతారు. వీళ్లలో కోరలు ఉంటాయనీ... ప్రతి పున్నమి రోజున ఈ మానవతోడేళ్లు పూర్తిగా ‘వెరెవూల్వ్స్’గా మారిపోతాయని పాశ్చాత్యదేశాల్లో కొందరి నమ్మకం. కోరలు తప్ప ముఖం నిండా రోమాలు మొలిచే ఈ వ్యాధి ఉండే కండిషన్‌ను ‘హ్యూమన్ వెరెవూల్ఫ్ సిండ్రోమ్’ అని అంటారు. దీన్నే వైద్యపరిభాషలో హైపర్ట్రైకోసిస్ అని అంటారు. కొందరికి ఈ జబ్బు పుట్టుకతోనే (కంజెనిటల్గా) ఉండవచ్చు. ఆ తర్వాతి దశలోనూ (అక్వైర్డ్) కొందరికి రావచ్చు. అవాంఛిత రోమాలకు చికిత్స చేసినట్లే చర్మవ్యాధి నిపుణులు ఈ వ్యాధికీ ట్రీట్మెంట్ అందిస్తారు. -
తోడేలు దాడిలో 8 గొర్రెలు మృతి
అనంతపురం (రాయదుర్గం) : రాయదుర్గం పట్టణంలోని ముత్తరాసి కాలనీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గొర్రెలపై ఓ తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో 8 గొర్రెలు మృతిచెందాయి. సుమారు రూ.70 వేలు నష్టం వాటిలినట్లు గొర్రెల యజమాని మారెక్క తెలిపారు. అటవీశాఖాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గొర్రెలను పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టారు.