womens T20 world cup
-
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్‌గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్‌లో (పాక్‌పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్‌లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్‌కు ఈ మ్యాచ్‌కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్‌లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
T20 World Cup 2024: 3836 రోజుల తర్వాత దక్కిన విజయం..!
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. ఈ గెలుపుతో బంగ్లా ఆటగాళ్లు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టడంతో పాటు 3836 రోజుల సుదీర్ఘ విరామానంతరం ఓ టీ20 వరల్డ్‌కప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 10 ఏళ్ల అనంతరం వరల్డ్‌కప్‌లో లభించిన విజయం కావడంతో బంగ్లా కెప్టెన్ నిగార్ సుల్తానా కన్నీరు పెట్టుకుంది. బంగ్లాదేశ్ చివరి సారి 2014 టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. నాడు బంగ్లాదేశ్ ఐర్లాండ్‌పై 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ వరుసగా 16 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఓడింది. నాలుగు ఎడిషన్లలో (2016, 2018, 2020, 2023) ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు.An emotional win 💯Bangladeshi skipper Nigar Sultana reacts after a streak breaking victory 🙌 👇https://t.co/aarEGSWApL— Cricket.com (@weRcricket) October 3, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టీ20 వరల్డ్‌కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. షార్జా వేదికగా నిన్న (అక్టోబర్ 3) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చదవండి: బోణీ బాగుండాలి -
ఫాతిమా ఆల్‌రౌండ్ షో
షార్జా: కెప్టెన్ ఫాతిమా సనా ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది.ఫాతిమా (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... నిదా దర్ (23; 1 సిక్స్), ఉమైమా సోహైల్ (18; 1 ఫోర్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, ప్రబోధిని, సుగంధిక తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి ఓడిపోయింది.విష్మి గుణరత్నె (20), నీలాక్షిక సిల్వా (22) రెండంకెల స్కోరు చేయగా... కెపె్టన్ చమరి ఆటపట్టు (6) విఫలమైంది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా 3... ఫాతిమా, ఉమైమా, నష్ర తలా రెండు వికెట్లు తీశారు. ఫాతిమా సనాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
టీ20 వరల్డ్‌కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో భారత జట్టు అదరగొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్ధులను భారత్ చిత్తు చేసింది. మంగళవారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
మంచి తరుణం
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారత టాపార్డర్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ పేర్కొంది. ఈసారి అందుకు తగ్గ అనుకూలతలు ఉన్నాయని...కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణమని ఆమె వెల్లడించింది. ప్లేయర్లందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్న జెమీమా... మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో టీమిండియా సమతూకంగా ఉందని... ఆ్రస్టేలియా వంటి ప్రత్యర్థులపై కూడా విజయాలు సాధించగలమనే నమ్మకముందని పేర్కొంది. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టి20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ పంచుకున్న వివరాలు ఆమె మాటల్లోనే...తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ చేజిక్కించుకోవడానికి భారత జట్టుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే పెద్ద ఘనత ఏదీ లేదు. వరల్డ్‌కప్ బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టులో ప్రస్తుతం అందరి పరిస్థితి ఇదే. జట్టుకు అవసరమైన సమయంలో రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. నా వరకైతే టీమిండియాకు ఆడే సమయంలో సర్వశక్తుల ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. జట్టు గెలవడమనే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్‌కప్ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. ప్రత్యేకంగా ఒక బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. పరిస్థితులపై పైచేయి సాధించాలనుకుంటున్నా. ఎవరిని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాలి... ఎలాంటి బంతులను గౌరవించాలి అనే దానిపై సాధన చేశా. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటా. సమతూకంగా జట్టు... అటు అనుభవజు్ఞలు ఇటు యంగ్ ప్లేయర్లతో జట్టు సమతూకంగా ఉంది. రిచా ఘోష్, షఫాలీ వర్మతో పాటు నాకూ గతంలో ఐసీసీ ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉంది. మేము యువ క్రీడాకారిణులమే అయినా... అవసరమైనంత అనుభవం ఉంది. ఇక జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన రూపంలో ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. వారికి ప్రపంచకప్‌లలో ఆడిన అపార అనుభవం ఉంది.ఆటగాళ్లంతా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాం. జట్టు సమావేశాల్లో ఎక్కువ శాతం చర్చ దీని గురించే జరుగుతుంది. 2020 ప్రపంచకప్ ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఇప్పుడు తొమ్మిదో ఎడిషన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకముంది. వార్మప్ మ్యాచ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. ప్రధాన పోటీలకు ముందు చక్కటి ఇన్నింగ్స్ ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆటకు నేను అభిమానిని. మొదటిసారి అండర్–19 క్యాంప్‌లో ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంలో సోఫీ డివైన్ వరుసగా ఐదు బంతుల్లో సిక్సర్లు బాదింది. ఆ సందర్భాన్ని మరవలేను. ఆమె కోసం మా బౌలర్ల వద్ద ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో పోటీని ఆస్వాదిస్తా... ఈ నెల 13న ఆ్రస్టేలియాతో మ్యాచ్ ఆడనున్నాం. ఆసీస్‌తో ఆడటాన్ని ఎంతో ఆస్వాదిస్తా. మెరుగైన ప్రత్యరి్థతో తలపడ్డప్పుడు అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాన్నాళ్లుగా కంగారూ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఈసారి మైదానంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తాం. జట్టు వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఆటను బాగా అర్థం చేసుకుంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ఆటతీరును మార్చుకుంటుంది. అందుకే గొప్ప ప్లేయర్‌గా ఎదిగింది. అవసరమైనప్పుడు చక్కటి సలహాలు ఇస్తుంది. ఇక కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద మ్యాచ్‌ల్లో మెరుగ్గా రాణిస్తుంది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడాలో ఆమె ఆట ద్వారా నేర్చుకున్నా. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలోనూ హర్మన్‌ప్రీత్ పాల్గొంది. ఈ టోర్నీ ఆమెకు ఎంత ముఖ్యమో జట్టులో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంతో పాటు ఆమె కోసం కప్పు గెలవాలని అనుకుంటున్నాం. ఆమె ట్రోఫీ చేజిక్కించుకోవడం చూడాలని ఆశిస్తున్నా. -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్‌కప్‌లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్‌లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్‌ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్‌కప్‌లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్‌లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్‌డౌన్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్‌ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
ఈసారి టీ20 వరల్డ్‌కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్‌తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్‌కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్ -
టీ20 వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టులో శేషనీ నాయుడు
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా లారా వోల్వార్డ్ట్ ఎంపికైంది. వోల్వార్డ్ట్ కెప్టెన్‌గా ఇది తొలి వరల్డ్‌కప్. గత టీ20 ప్రపంచకప్‌లో సూన్ లస్ సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది. ఆ టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్ వరకు చేరింది. అనంతరం సూన్ లస్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వోల్వార్డ్ట్ సౌతాఫ్రికా టీ20 జట్టు పగ్గాలు చేపట్టింది. రానున్న వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సూన్ లస్, అయాబొంగా ఖాకా, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్ వంటి సీనియర్లతో పాటు అయాండా హ్లూబి, అన్నరీ డెర్క్సెన్ వంటి యువ ప్లేయర్స్ కూడా చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా వరల్డ్‌కప్ బృందంలో 18 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ శేషనీ నాయుడు కూడా చోటు దక్కించుకుంది. అండర్-19 స్థాయిలో అద్భుత ప్రదర్శనల కారణంగా శేషనీ నాయుడు వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చింది. ఇదే జట్టు వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగే మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 16-20 వరకు జరుగనుంది.వరల్డ్‌కప్ విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికా గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.సౌతాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్సెన్, మైకే డి రిడర్, అయాండా హ్లూబి, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, సూన్ లస్, నాన్కులుకెకు మ్లాబా, శేషనీ నాయుడు, తుమీ సెఖుఖునే, క్లో ట్రయాన్ట్రావెలింగ్ రిజర్వ్: మియాన్ స్మిట్స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్‌కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల స్కాట్లాండ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా కేథరీన్ బ్రైస్ ఎంపికైంది. వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 3న మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.స్కాట్లాండ్: కేథరీన్ బ్రైస్ (కెప్టెన్), క్లో ఏబెల్, అబ్బి అయిట్కెన్ డ్రమ్మండ్, ఒలీవియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియానాజ్ ఛటర్జీ, కేథరీన్ ఫ్రేసర్, సస్కియా హార్లీ, లోర్నా జాక్ బ్రౌన్, ఐల్సా లిస్టర్, అబ్తహా మక్సూద్, మెగాన్ మెక్‌కోల్, హన్నా రెయినీ, రేచల్ స్లేటర్పాకిస్తాన్: ఆలియా రియాజ్, సదాఫ్ షమాస్, ఇరమ్ జావెద్, సిద్రా ఆమీన్, ఒమైమా సొహైల్, నిదా దార్, గుల్ ఫెరోజా, మునీబా అలీ, ఫాతిమా సనా (కెప్టెన్), సష్రా సంధు, డయానా బేగ్, సయెదా అరూబ్ షా, తుబా హసన్, తస్మియా రుబాబ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, తహిల మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, ఎల్లిస్ పెర్రీ, అన్నాబెల్ సథర్‌ల్యాండ్, గ్రేస్ హ్యారిస్, జార్జియా వేర్హమ్, అలైసా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షట్, తైలా వ్లేమింక్ఇండియా: స్మృతి మంధన, దయాళన్ హేమలత,జెమీమా రోడ్రిగెజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, ఎస్ సజనా, పూజా వస్త్రాకర్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, యస్తికా భాటియా, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ఇంగ్లండ్: మైయా బౌచియర్, డేనియెల్ వ్యాట్, అలైస్ క్యాప్సీ, హీథర్ నైట్ (కెప్టెన్), సోఫీ డంక్లీ, డేనియెల్ గిబ్సన్, ఫ్రేయా కెంప్, నాట్ సీవర్ బ్రంట్, బెస్ హీత్, ఆమీ జోన్స్, లారెన్ బెల్, చార్లోట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, లిన్సే స్మిత్వెస్టిండీస్: నెరిస్సా క్రాఫ్టన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), డియాండ్రా డొట్టిన్, జైదా జేమ్స్, స్టెఫానీ టేలర్, ఆలియా అలెన్, చినెల్ హెన్రీ, అష్మిని మునీసర్, షెమెయిన్ క్యాంప్‌బెల్, చెడీన్ నేషన్, అఫీ ఫ్లెయర్, కరిష్మ రామ్హరాక్, మ్యాండీ మంగ్రూ, క్వియానా జోసఫ్, షమీలియా కాన్నెల్ -
టీ20 వరల్డ్‌కప్ కోసం విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం వెస్టిండీస్ జట్టును నిన్న (ఆగస్ట్ 29) ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్‌కు చోటు కల్పించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తిరిగి జట్టులో చేరింది. మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు డొట్టిన్ పేరిట ఉంది. విండీస్ జట్టుకు హేలీ మాథ్యూస్ సారథ్యం వహించనుంది. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన జట్టులో నాలుగు మార్పులు చేశారు విండీస్ సెలెక్టర్లు. డొట్టిన్తో పాటు అష్మిని మునిసర్, మ్యాండీ మంగ్రూ, అన్క్యాప్డ్ ప్లేయర్ నెరిస్సా క్రాఫ్టన్లను కొత్తగా జట్టులోకి వచ్చారు. శ్రీలంక టూర్లో ఆడిన చెర్రీ ఫ్రేసర్, రషాదా విలియమ్స్, షబిక గజ్నబీ, కేట్ విల్మాట్ స్థానాల్లో వీరికి అవకాశం లభించింది.కాగా, 2016 ఎడిషన్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్.. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్‌కప్‌లో గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. విండీస్.. అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది.వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్, ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్, చెడీన్ నేషన్, చినెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కరిష్మా రామ్‌హారక్, మ్యాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్, క్వియానా జోసఫ్, షమీలియా కానెల్, స్టెఫానీ టేలర్, జైదా జేమ్స్ -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్‌లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో హర్మన్ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్‌లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్‌లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో...
అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనుభవజు్ఞలు, యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా... ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్య పరాజయంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత జట్టు నుంచి ఉమా ఛెత్రీ తప్ప మిగిలిన ప్లేయర్లందరూ టి20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. ఆసియా కప్ సందర్భంగా వేలికి గాయమైన స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌తో పాటు మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న వికెట్ కీపర్ యస్తిక భాటియాను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే వీరిద్దరూ ఫిట్నెస్ సాధిస్తేనే యూఏఈకి వెళ్లనున్నారు. టాపార్డర్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానుండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. దీప్తి శర్మ, ఆశ శోభన, రాధ యాదవ్ రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండగా... రేణుక సింగ్, అరుంధతి రెడ్డి పేస్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పూజ వస్త్రకర్ జట్టులో చోటు దక్కించుకుంది. ‘ఇది సమతూకమైన జట్టు. యస్తిక, శ్రేయాంక గాయాల నుంచి కోలుకొని టోర్నీ ఆరంభానికి సిద్ధమవుతారు’ అని భారత మాజీ కెపె్టన్ డయానా ఎడుల్జీ పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసీస్ అడ్డంకిని అధిగమిస్తేనే! ఐసీసీ టోరీ్నల్లో టైటిల్ నెగ్గలేకపోతున్న భారత జట్టు ఈసారైనా అడ్డంకులు అధిగమించి ముందడుగు వేయాలని భావిస్తోంది. 2020 టోర్నీ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్...తుది పోరులో ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తే... అందులో ఆరుసార్లు ఆస్ట్రేలియానే జట్టు విజేతగా నిలిచిందంటే ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి హర్మన్ బృందం చాంపియన్‌గా నిలవాలంటే ముందుగా లీగ్ దశలో ఆసీస్‌ను ఓడించాలి. తుది పోరులోనూ ఆ జట్టుపై పైచేయి సాధించాలి. భారత టి 20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా, రిచా ఘోష్, యస్తిక , పూజ , అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక, సజన. ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ, తనూజ కన్వర్, సైమా ఠాకూర్. -
వేదిక మార్పు మా ఆటపై ప్రభావం చూపదు: దీప్తి
ముంబై: మహిళల టి20 ప్రపంచకప్ వేదిక మార్పు తమ సన్నాహాలపై ప్రభావం చూపదని భారత జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చింది.ఈ నేపథ్యంలో దీప్తి మాట్లాడుతూ.. ‘టోర్నీ ఎక్కడ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే మా లక్ష్యం. వేదిక మార్పు వల్ల సన్నద్ధతపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ట్రోఫీ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నా. యూఏఈలోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే దానిపై కొంచెం అవగాహన ఉంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండాఆటను ఆస్వాదిస్తున్నా’ అని దీప్తి పేర్కొంది. ఇక ఇటీవల లండన్‌లో జరిగిన హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దీప్తి... సీజన్ ఆసాంతం రాణించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుదిపోరులోనూ సత్తా చాటిన దీప్తి భారీ సిక్సర్‌తో లండన్ స్పిరిట్ జట్టుకు తొలి హండ్రెడ్ టైటిల్‌ను కట్టబెట్టింది. -
యూఏఈలో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగగా... ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్ జరగనుంది. ‘మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చి0ది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టి20 వరల్డ్‌కప్ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్‌కప్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డైస్ తెలిపారు. -
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్‌కప్..!?
బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్‌లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్‌లో భారత్‌లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది.అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. -
BCCI: ప్రపంచకప్ నిర్వహణకు ‘నో’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ తిరస్కరించింది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, హింసాయుత వాతావరణం వల్ల వేదిక మార్పు అనివార్యమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇచి్చన ఆఫర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నో చెప్పింది. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. దీంతో పాటు ఈ అక్టోబర్ నెల వరకు వర్షాకాలం తీవ్ర స్థాయిలో ఉంటుంది. వరుస వరల్డ్‌కప్‌లతో పాటు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ‘మహిళల మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సిందిగా ఐసీసీ మమ్మల్ని కోరింది. అయితే ఇది సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పాం’ అని జై షా చెప్పారు. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సిన మెగా ఈవెంట్ కోసం ఐసీసీ ప్రత్యామ్నాయ వేదికలపై దృష్టిసారించింది. శ్రీలంక లేదంటే యూఏఈలలో ఒక వేదికను ఈ నెల 20వ తేదీకల్లా ఖరారు చేసే అవకాశముంది. బంగ్లాలో కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలతో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ అమ్మాయిల ప్రపంచకప్‌ను సురక్షితంగా నిర్వహించడం ఐసీసీకి క్లిష్టతరం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎప్పటికప్పుడు బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడి తాజా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తోంది. బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించాల్సి ఉంది. బంగ్లా ప్రస్తుతం పాకిస్తాన్ టూర్లో ఉంది. అక్కడ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఈ నెల 21న మొదలవుతుంది. అనంతరం వచ్చే నెల భారత పర్యటనలో రెండు టెస్టులతో పాటు మూడు మ్యాచ్‌ల టి20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటుంది. -
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి
వెస్టిండీస్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విండీస్ మహిళ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంది. వెస్టిండీస్ క్రికెట్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు డాటిన్ తెలిపింది. కాగా 2022లో జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ అంతర్జాతీయ విడ్కోలు పలికింది.అయితే ఈ ఏడాది ఆక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా.. డాటిన్ తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంది. "అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగానే భావిస్తాను. క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ డాక్టర్. కిషోర్ షాలోతో చర్చలు అనంతరం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. తిరిగి విండీస్ జెర్సీని ధరించేందుకు సిద్దమయ్యాను. మళ్లీ జట్టులో తిరిగి చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.వెస్టిండీస్ మహిళల జట్టుకు అన్ని ఫార్మాట్లలో నా వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తాను. నా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని డాటిన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్‌లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి.