Tamil Nadu
-
ఆమె ఆడితే ఆడియన్స్ ఊగాల్సిందే
తమిళసినిమా: సినిమా అన్నది రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతి భావానికీ ఒక్కో కలర్ ఉంటుంది. ముఖ్యంగా అందానికి ప్రేక్షకుల నుంచి ఆనందం అనే భావం వ్యక్తం అవుతుంది. అందుకే సినిమాలో అందమైన నటనకు ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి అందానికి నిలువెత్తు నిదర్శనం నటి తమన్నా భాటియా. అందుకే ఈమెను ఆమె అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. 16 ఏళ్ల ప్రాయంలోనే నటిగా రంగప్రవేశం చేసిన ఈ మహారాష్ట్రీయ భామ నటించిన తొలి చిత్రం చాంద్ సా రోషన్ చేరా. ఈ హిందీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, వెంటనే తెలుగులో శ్రీ అనే చిత్రంలో నటించే అవకాశం ఈమెను వెతుక్కుంటూ వచ్చింది. అలా దక్షిణాదిలో తన నటనకు శ్రీకారం చుట్టిన తమన్నకు ఆ వెంటనే తమిళంలో కేడీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అయితే ఈమెను విజయాల బాట పట్టించిన చిత్రం మాత్రం హ్యాఫీ డేస్ అనే తెలుగు చిత్రం, కల్లూరి అనే తమిళ చిత్రం. ఈ 34 ఏళ్ల మగువకు నటిగా వయసు రెండు దశాబ్దాలు అవుతోంది. ఇప్పటి వరకూ హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో 85 చిత్రాలు చేసి పాన్ ఇండియా కథానాయకిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా తెలుగు,తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఈ బ్యూటీది. ఆరంభంలో అందాలారబోతకే ప్రాముఖ్యత నిచ్చిన తమన్నా, బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో తన నటనా సత్తాను చాటుకున్నారు. నటిగా రెండు దశాబ్దాలకు చేరువలో ఉన్నా నాటౌట్ కాకపోవడం విశేషం. ఇప్పటికీ హిందీ, తెలుగు, తమిళం చిత్రాల్లో కథానాయకిగా నటిస్తూనే ఉన్నారు. ఎన్ని చిత్రాలు చేసినా ఐటమ్ సాంగ్స్‌కు ఈ బ్యూటీ స్పెషల్ అని చెప్పక తప్పదు. చాలా చిత్రాలను ఈమె ఐటమ్ సాంగ్స్ విజయతీరం దాటించాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాట కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. అదేవిధంగా హిందీ చిత్రం సీ్త్ర 2 లో తమన్న స్పెషల్ సాంగ్ ఆ చిత్ర విజయానికి బలంగా నిలిచింది. అలా నటి తమన్న ఆడితే ఆడియన్స్ ఊగిపోతారన్నమాట. ఇకపోతే తమన్న డ్రస్ సెన్స్ గురించి కచ్చితంగా చెప్పుకోవలసిందే. ఈమెకు డ్రస్ అందాన్నిస్తాయా? డ్రస్‌కే తమన్న అలంకారం అవుతుందా? అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. గ్లామరస్ దుస్తులతో కుర్రకారును సన్మోహనం చేసే కిటుకు ఈమె నుంచే నేర్చుకోవాలి. తాజాగా అలాంటి వైరెటీ దుస్తులతో సామాజిక మాధ్యమాల్లో తమన్న హల్చల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సికందర్ కా ముఖద్దర్ అనే హిందీ చిత్రంలోనూ, ఓదెల 2 అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. నటి ఫైర్ చిత్రాన్ని చూసిన మహిళలు, చిత్ర యూనిట్‌తో నటి షకీలా -
కార్తీకదీపానికి ప్రమిదలు సిద్ధం
● బంకమట్టి సేకరణకు ప్రభుత్వం అనుమతివ్వడంపై కుమ్మరుల హర్షం తిరుత్తణి: నవంబర్ 13న కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రమిదల తయారీ ఊపందుకుంది. ఇందుకోసం బంకమట్టిని ఉచితంగా తరలించేందుకు ప్రభుత్వం అనుమతితో కుమ్మరులు రెట్టింపు ఉత్సాహంతో పెద్దసంఖ్యలో ప్రదిమలు తయారు చేసి విక్రయానికి సిద్ధమతున్నారు. కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరుపుకోవడం పరిపాటి. కొండ కార్తీక, ఊరే కార్తీకగా రెండు రోజుల పాటు దీపాల పండుగను మహిళలు వేడుకగా జరుపుకుని తమ ఇళ్ల నిండా ప్రమిదలతో దీపాలు వెలిగించి కాంతి నింపడం పరిపాటి. ఇందుకోసం తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లోని 20 గ్రామాల్లో కుమ్మరులు ప్రమిదలు తయారీ చేసే పనుల్లో నిమగ్నమైయ్యారు. మార్కెట్లో రకరకాల ప్రమిదలు అందుబాటులోకి వచ్చినా కుమ్మరులు బంకమట్టితో చేసే ప్రమిదలకు మహిళల్లో డిమాండ్ భారీ ఉంది. దీంతో ప్రమిదల వ్యాపారం సైతం జోరుగా సాగుతుంది. చిన్నసైజు ప్రమిదలు రూ. 10కి 5 విక్రయిస్తున్నట్లు, పెద్ద సైజు రూ. 20కు 5 విక్రయిస్తున్నట్లు తెలిపారు. బంకమట్టికి ప్రభుత్వం ఉచిత అనుమతి గతంలో బంకమట్టి వినియోగించేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించేది. దీంతో కుమ్మరి కార్మికులు డబ్బులు ఖర్చుపెట్టి బంకమట్టి తీసుకొచ్చి తయారు చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సీఎం స్టాలిన్ కుమ్మరి కులస్తుల బతుకులు బాగుపడాలనే ఆశయంతో బంకమట్టి ఉచితంగా తరలించి మట్టి కుండలు, వినాయకుడి బొమ్మలు, ప్రమిదలు తయారు చేసుకునేందుకు అనుమతితో చాలామంది కుమ్మరి కులస్తులు జీవనోపాధి పొందుతున్నారు. -
చెస్ విజేతకు ట్రోఫీ ప్రదానం
సింగ్స్ గాంబిట్ ఇంటర్నేషనల్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024 పోటీలు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు వేళచ్చేరి గురునానక్ కళాశాలలో జరిగింది. ఇందులో చెంగల్పట్టు జిల్లాకు చెందిన క్రీడాకారుడు ఏఆర్ ఇలంపర్తి టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. టైటిల్ విజేతతో పాటు వివిధ కేటగిరీల వారీగా రూ. ఒక లక్ష, రూ. 75 వేలు , రూ. 60, రూ 50 వేలు చొప్పున నగదు బహుమతులు ట్రోఫీలను సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఎం. శ్యామ్ సుందర్, టోర్నమెంట్ చైర్మన్ మంజిత్ సింగ్ నాయర్ అందజేశారు. –సాక్షి, చైన్నె -
No Headline
సాక్షి, చైన్నె: 2026 ఎన్నికలలో అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ స్పష్టం చేశారు. సంపూర్ణ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగి అధికారం చేజిక్కించుకుంటామని వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం మహానాడు వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తమతో కలిసి వచ్చిపార్టీలకు అధికారంలో వాటా నినాదం రాష్ట్రంలోని రాజకీయ పక్షాలలో విస్తృత చర్చకు దారి తీసింది. అలాగే తమ ప్రత్యర్థులుగా బీజేపీ, డీఎంకేను ఎంపిక చేసుకున్న విజయ్ అన్నాడీఎంకేను పల్లెత్తి మాట్లాడలేదు. దీంతో అన్నాడీఎంకేతో కలిసి ప్రయాణం చేస్తారన్న చర్చ ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా ఓ తమిళ మీడియా ఆదివారం కథనం ప్రచురించింది. అన్నాడీఎంకే, తమిళగ వెట్రి కళగంల మధ్య రహస్య ఒప్పందాలు జరిగి ఉన్నట్టు, ఈ మేరకు 80 స్థానాలలో విజయ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆ కథనంలో వివరించారు. ఇది కాస్త వైరల్ కావడంతో విజయ్ అలర్ట్ అయ్యారు. పొత్తు లేదు.. విజయ్ ఆదేశాల మేరకు తమిళగ వెట్రి కళగం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ కథనాన్ని ఖండించారు. తప్పుడు సమాచారాలు, ఆధార రహిత కథనాలు వద్దని హితవు పలికారు. తమిళగ వెట్రి కళగం రాజకీయ ప్రయాణం పూర్తిగా తమిళనాడు ప్రజల సంక్షేమంతో ముడి పడి ఉందని వివరించారు. మహానాడు వేదికగా తమ నేత చేసిన వ్యాఖ్యలు, సిద్ధాంతాలను గుర్తుచేస్తూ, ప్రజా బలం, మద్దతు ద్వారా సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల రక్షణకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, ఈ సమయంలో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరించ వద్దని సూచించారు. తమిళనాడు ప్రజల ఆదరణ, అభిమానం చూసి ఓర్వ లేకే కొందరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో కూటమికి అవకాశం లేదని, వారితో పొత్తు లేదని పేర్కొంటూ, తమ ప్రయాణం ప్రజలతో అని ముగించారు. -
క్లుప్తంగా
నిషేధిత గుట్కా విక్రయించిన వ్యాపారి అరెస్టు పళ్లిపట్టు: నిషేధిత గుట్కా నిల్వవుంచి విక్రయించిన వ్యాపారిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లాలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయం, అక్రమ రవాణా అరికట్టే విధంగా తిరువళ్లూరు జిల్లా ఎస్పీ శ్రీనవాస పెరుమాళ్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట నిఘావుంచి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పొదటూరుపేటలోని నగరి రోడ్డు మార్గం కన్నికాపురం వద్ద దుకాణంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను నిల్వ వుంచి విక్రయిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పొదటూరుపేట ఎస్ఐ సుగంతి తన సిబ్బందితో దుకాణంలో సోమవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణంలో నిల్వ వుంచిన నిషేధిత 1250 గ్రాముల గుట్కా పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసి షణ్ముగాన్ని అరెస్టు చేశారు. దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం తిరువొత్తియూరు: నెల వారీ పరీక్షలలో తక్కు మార్కులు వచ్చాయని తల్లి మందలించడంతో 11 తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని దోమల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు.. చైన్నె సాలిగ్రామం శివాలయం వీధికి చెందిన యువరాజు (45), ఇతని కుమార్తె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో 11 తరగతి చదువుతోంది. ఈ క్రమంలో పాఠశాలలో నెల వారి పరీక్షలు తక్కువ మార్కులు పొందడంతో విద్యార్థినిని ఆమె తల్లి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. దీంతో ఆ బాలిక ఇంటిలో ఉన్న దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు గుర్తించి ఆస్పత్రి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 7 నెలల పాప గొంతులో చిక్కుకున్న తైలం డబ్బా.. ● చిన్నారికి అస్వస్థత అన్నానగర్: చైన్నె సమీపంలో ఉన్న కాంచీపురం జిల్లా మేట్టుపాళయం గ్రామం మేడు ప్రాంతానికి చెందిన అజిత్, డయానా దంపతులు. వీరికి గుగణేష్ అనే 7 నెలల కుమారుడు ఉన్నాడు. ఇతను ఇంట్లో ఆడుకుంటుండగా తల్లిదండ్రులు గమనించని సమయంలో నేల పై పడి ఉన్న తైలం డబ్బా తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు. పిల్లవాడు డబ్బా ఎలా ఉమ్మివేయాలో తెలియక తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. పిల్లవాడి గొంతులోకి వెళ్లి నొప్పిని భరించలేక ఏడవడం ప్రారంభించాడు. బిడ్డ ఎందుకు ఏడుస్తోందని తల్లిదండ్రులు ఆరా తీయగా, చిన్నారి నోటి నుంచి రక్తం కారుతోంది. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్చిన చిన్నారిని వైద్యులు పరీక్షించి చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత డాక్టర్లు చిన్నారిని మెల్లగా పైకి లేపి గొంతుకు, శ్వాసనాళానికి మధ్య బలంగా ఇరుక్కున్న తైలం డబ్బాను లారింగోస్కోప్తో బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఎస్ఐ సస్పెన్షన్ కొరుక్కుపేట: గుట్కా కేసును సక్రమంగా విచారించకుండా నిందితులకు సహకరించిన సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశించారు. వివరాలు.. కొద్ది రోజుల క్రితం తేని సుబ్బన్ వీధిలోని ఓ గోడౌనన్లో రూ.1. 67 లక్షలు విలువైన నిషేధిత పొగాకు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నాగరాజ్ (55), పాండి (65), అమర్ సింగ్ (33)లను అరెస్టు చేశారు. తేని పళనిశెట్టిపట్టి సబ్ఇన్స్పెక్టర్ ఇద్రిస్‌ఖాన్ నేతృత్వంలో జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టాలనిఎస్పీ శివప్రసాద్ ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించిన వ్యక్తిని విడుదల చేసేందుకు పళనిశెట్టిపట్టి ఎస్ఐ జగన్ తేని సాయుధ పోలీసుగా బదిలీ అయ్యారు. అలాగే కేసును సక్రమంగా విచారించకుండా ఇద్రీస్ ఖాన్ నిందితులతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. నేరగాళ్లకు సహకరిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఎస్ఐ ఇద్రిస్ ఖాన్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించాలని ఎస్పీ ఆదేశించారు. నకిలీ బంగారం నగలు తాకట్టు పెట్టి రూ. 11 లక్షలు మోసం ●నలుగురి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె రెడిల్స్లో తాకట్టు దుకాణంలో నకిలీ బంగారం నగలు తాకట్టు పెట్టి రూ.11 లక్షలు మోసం చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..చైన్నె, రెడిల్స్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తాకట్టు దుకాణంలో నకిలీ బంగారం 25 సవర్లు నగలు తాకట్టు పెట్టి రూ. 11 లక్షల 65 వేలు నగదు తీసుకొని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి రెడిల్స్ సమీపంలోని విలన్‌గాడు చెందిన రాజాజీ నగర్ కు చెందిన శ్రీధర్ (48), ఎన్నూరు సునామీ నగర్ ప్రాంతానికి చెందిన తంగతురై (42), ఇసక్కిదురై (39), కుమార్ (42) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు హాజరపరిచి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
నీటిలో పడి మహిళ మృతి
●స్కూటీ అదుపు తప్పడంతో ప్రమాదం అన్నానగర్: కారైకుడి సమీపంలో ఆదివారం రాత్రి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పై నిల్వ ఉన్న వర్షపు నీటిలో పడి ఓ మహిళ ఊపిరాడక మృతి చెందారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని రాస్తా ప్రాంతానికి చెందిన కలైచెల్వి (50) కారైకుడిలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పని ముగించుకుని స్కూటీ పై ఇంటికి వెళ్తుండగా.. రాస్తా నది వంతెన దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం హెడ్ లైట్ల వెలుగులో రోడ్డు కనిపించలేదు. దీంతో స్కూటీ తప్పి రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీకొట్టింది. గాయాలపాలై స్ఫృహతప్పి పక్కనే ఉన్న కాలువలో నిలిచిన వర్షపు నీటిలో కలైచెల్వి పడిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. పాదచారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గర్భిణి వద్ద నగలు నగదు చోరీ తిరువొత్తియూరు: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి వద్ద నగలు, నగదును చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి పుదురుకు చెందిన కమల (65). ఈమె 8 నెలల గర్భం గర్భిణిగా ఉన్న తన కుమార్తెను తీసుకుని గత 7వ తేదీ చైన్నె తండయార్‌పేట ప్రాంతంలో ఉన్న మహిళా ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఆ సమయంలో గర్భిణి వద్ద ఉన్న ఆరు సవర్ల బంగారు నగలు, వెండి గొలుసులు, వెయ్యి రూపాయలను ఆ మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద చోరీ చేశాడు. దీని గురించి ఆ తల్లి ఆమె తల్లి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సాంకేతిక అంశాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు
సాక్షి, చైన్నె: సాంకేతిక నైపుణ్యాలలతో తమ ప్రతిభను చాటే విధంగా ఇంటర్ కాలేజ్ టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులు దూసుకెళ్లారు. సోమవారం సవీత ఇంజినీరింగ్ కళాశాలలో 15వ జాతీయ ఇంటర్ కాలేజ్ టెక్నికల్ అండ్ మేనేజ్ మెంట్ ఫెస్ట్ –2024 జరిగింది. ఇందులో విద్యార్థులు తమ కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు. నైపుణ్యాలను చాటుకునే దిశగా పోటీలలో ఇండస్ట్రీ5.ఓ నినాదంతో 21వ శతాబ్ధపు అవసరాలలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా పోటీలలో దూసుకెళ్లారు. 60 వర్క్‌షాపులు, 70 ఈవెంట్లు, 700లకు పైగా ఈవెంట్లు, పార్ట్షిఫ్లు, పేపర్ ప్రెజెంటేషన్లు, ప్రాజెక్టు డిస్ ప్లే, హ్యాకథాన్ వంటి అంశాలలో విద్యార్థులు తమ సత్తాను చాటుకునే విధంగా దూసుకెళ్లారు. ప్రతిభ చాటిని వారికి రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు. 36 గంటల పాటు జరిగిన ఈ పోటీల గురించి డైరెక్టర్ డాక్టర్ ఎస్ రాజేష్, ప్రిన్సిపల్ డాక్టర్ర్ వి విజయ చాముండీధ్వరిలు మాట్లాడుతూ, అధ్యాపకులు, అనువజ్ఞులు, పూర్వ విద్యార్థులతో సహా నిపుణులైన న్యాయ నిర్ణేతల మార్గదర్శకంలో ఈ పోటీలు జరిగాయని వివరించారు. అభ్యాసకులకు వాస్తవ ప్రపంచ సమస్య, పరిష్కార వేదిక అందించేందుకు ఈ పోటీ దోహదకరంగా మారిందన్నారు. సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించమే కాకుండా సమస్యలకు పరిష్కారం దిశగా విద్యార్థులు తమ ప్రతిభను ఈ పోటీల ద్వారా చాటుకున్నారని తెలిపారు. -
కలగలప్పు – 3కి సిద్ధం
ఫైర్ చిత్రానికి షకీలా ప్రశంసలుతమిళసినిమా: మనసుల్ని హత్తుకునే, మనుషుల్ని ఆలోచింపజేసే కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. అలాంటి చిత్రం ఫైర్ అంటున్నారు చిత్ర వర్గాలు. నిర్మాత జేఎస్కే ప్రధాన పాత్రను పోషించి, స్వీయ దర్శకత్వంలో జేఎస్కే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిచిన చిత్రం ఫైర్. ఈ చిత్రాన్ని మహిళలకు కోసం ప్రత్యేకంగా స్థానిక ఎన్ఎఫ్డీసీ థియేటర్లో ప్రదర్శించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ఆటోడ్రైవర్లు, వివిధ శాఖల్లో పని చేసే మహిళలు ఈ చిత్రాన్ని చూసినట్లు పేర్కొన్నారు. వారితో పాటు నటి షకీలా, నటి సాక్షీ అగర్వాల్ తదితరులు కూడా ఫైర్ చిత్రాన్ని చూశారట. నేటి సమాజానికీ, ముఖ్యంగా మహిళలకు అవసరం అయిన అంశాలతో రూపొందిన చిత్ర ఫైర్ అని మహిళలు ఎంతగానో అభినందించినట్లు పేర్కొన్నారు. అందులో ఒక మహిళా ఆటోడ్రైవర్ నటుడు బాలాజీ మురుగదాస్ పోషించిన పాత్ర బాగా ఆకట్టుకోవడంతో ఆయన్ని ఉద్రేకంతో గట్టిగా కౌగిలించుకుని, పిచ్చి అవేశంతో ఏదేదో మాట్లాడిందనీ చెప్పారు. ఫైర్ చిత్రాన్ని చూసిన నటి షకీలా ఎంతగానో ప్రశంసించారని, ఈమె పేర్కొంటూ నటుడు బాలాజీ మురుగదాస్‌ను గట్టిగా కౌగిలించుకుని విడవకపోవడంతో ఇది సినిమా అని నచ్చ చెప్పే ప్రయత్నం చేయడానికి చిత్ర వర్గాలు ఎంతగానో ప్రయత్నించి అక్కడ నుంచి పంపినట్లు చెప్పారు. అలా మహిళలను కదిలించడమే ఈ చిత్ర విజయాన్ని నిర్ణయించిందని ఫైర్ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఈ చిత్రం గురించి గొప్పగా మాట్లాడటం పెద్ద కిరీటం చుట్టినట్లు అవుతుందన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్రం ప్రారంభం నుంచి తదుపరి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో కథ సాగుతుందిన ఫైర్ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు చెప్పారు. దర్శకుడు సుందర్.సీ, నటి కుష్బూ తమిళసినిమా: విజయాలకు చిరునామాగా మారిన దర్శకుడు సుందర్.సీ. ఈయన ప్రయాణం దర్శకుడిగా మొదలయినా, ఆ తరువాత కథానాయకుడిగా, నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. జనరంజకమైన చిత్రాలకు కేరాఫ్ ఈయన. అందులోనూ వినోదం, హీరోయిన్లను అందంగా తెరపై చూపించడం సుందర్.సీ స్పెషల్. నటి, నిర్మాత, రాజకీయనాయకురాలు కుష్బూ ఈయన అర్ధాంగి అన్నది తెలిసిందే. కాగా ఇటీవల అరణ్మణై చిత్రాన్ని నాలుగు సీక్వెల్స్ చేసి సక్సెస్ అయిన సుందర్.సీ హార్రర్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో కూడిన కథా చిత్రాలను తెరకెక్కించడంలోనూ సిద్ధహస్తుడని నిరూపించుకున్నారు. కాగా తాజాగా నయనతార ప్రధాన పాత్రలో మూక్కుత్తి అమ్మన్ – 2 చిత్రాన్ని తెరకెక్కింబోతున్నట్లు ఇటీవలే ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. దీన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశన్ నిర్మించనున్నారు. కాగా తాజాగా మరో చిత్రానికి సుందర్.సీ గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఈయన ఇంతకు ముందు కలగలప్పు 1, 2 చిత్రాలను తెరకెక్కించారు. వినోదానికి పెద్దపీట వేసిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో వాటికి మూడో సీక్కెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నటి కుష్బూ సోమవారం తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆమె తన అవ్నీ సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందనీ, ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా కన్నన్ రవి గ్రూప్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా గత చిత్రాల తరహాలోనే కలగలప్పు 3 చిత్రం కూడా వినోదంతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందని భావించవచ్చు. నటి తమన్నా తమిళసినిమా: నటుడు అరుణ్‌విజయ్ కథానాయకుడిగా పటించిన తాజా చిత్రం వణంగాన్. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి.హౌస్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అరుణ్‌విజయ్ దర్శకుడు బాలా గురించి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ‘మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ మీ చిత్రాలు చూస్తున్నాను, మిమ్మిల్ని చూసి ఆశ్యర్యపోని రోజు లేదు. ఒక నటుడిగా మీ చిత్రంలో నటించే అవకాశం రాదా..? అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అలాంటిది ఇప్పుడు వణంగాన్ చిత్రంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో కూడా ఈ చిత్ర కథలోని అనుభూతిని నేను గ్రహించలేకపోయాను. అయితే ఇప్పుడు చిత్రాన్ని వెండితెరపై చూసినప్పుడు నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు చాలడం లేదు. నా తల్లిదండ్రులు సంతోషపడేలా చేసిన మీకు చాలా ధన్యవాదాలు. నా సినీ జీవితంలో వణంగాన్ చాలా ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిత్రంపై ఎంతో నమ్మకం ఉంచి, పక్కా బలంగా నిలిచిన నిర్మాత సురేశ్ కామాక్షీకి కృతజ్ఞతలు. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని త్వరలోనే చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని నటుడు అరుణ్‌విజయ్ వణంగాన్ చిత్రంపై తన ఆనందం వ్యక్తం చేశారు. వణంగాన్ నా కెరీర్లోనే ముఖ్యమైన చిత్రంగా .. -
50 శాతం ఇవ్వాల్సిందే!
డెల్టాలో.. కుండపోత రాష్ట్రాలకు పన్నుల విభజనలో కేంద్రం సమతుల్య విధానం అనుసరించే విధంగా 50 శాతం వాటాను అందజేయాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర నిధుల పంపిణీ తమిళనాడు అభివృద్ధికి అడ్డుగా మారి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు తరపున అందజేసిన నివేదికపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. సాక్షి, చైన్నె : కేంద్ర ప్రభుత్వంపై సీఎం స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వివరాలు.. 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ తమిళనాడు పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఈకమిటీకి చైన్నెలోని ఓ హోటల్లో ప్రభుత్వ తరపున విందు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కమిటీలోని వారిని సీఎం స్టాలిన్ ఆహ్వానిస్తూ సత్కరించారు. సోమవారం ఉదయం అదే హోటల్లో ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులు అజయ్ నారాయణ్, అనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, సీనియర్ మంత్రి దురై మురుగన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, మంత్రులు కేఎన్ నెహ్రూ, ఐ పెరియస్వామి, పొన్ముడి, ఏవీ వేలు, మూర్తి, టీఆర్బీ రాజ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఫైనాన్స్ కమిటీ సెక్రటరీ రిత్విక్ పాండేతో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇందులో సీఎం ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ, రాష్ట్రాల అవసరాలు, అంచనాలను సంతృప్తి పరిచే విధంగా, భారత దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చే రీతిలో ఆర్థిక కమిషన్ సహకారం అందిస్తుందని ఆశిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారత రాజ్యాంగ అధికారాలు బాధ్యతల పంపిణీ ఇప్పటికే జరిగినట్టు గుర్తు చేస్తూ, ఆ మార్గదర్శకాల ప్రకారం తాము అనుసరించే సమాఖ్య తత్వశాస్త్రం గురించి వివరించారు. ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, వ్యవసాయం వంటి రంగాల పురోగతితో పాటు ముఖ్యమైన ప్రాజెక్టుల రూపకల్పన , అమలులో రాష్ట్ర ప్రభుత్వాలే అధికంగా బాధ్యతలు వహిస్తున్నాయని తెలిపారు. ఈ బాధ్యతలన్నింటినీ నెరవేర్చడం కోసం రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కొన్నింటిని గుర్తు చేశారు. దీని ఆధారంగా గత 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేటాయించదగిన పన్ను రాబడి వాటా 41 శాతం పెంపును ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే గత 4 ఏళ్లలో ఈ సిఫార్సుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పన్ను ఆదాయంలో 33.16 శాతం మాత్రమే వస్తున్నట్లు వివరించారు. సగం వాటా ఇవ్వాల్సిందే.. రాష్ట్రాల కోసం అదనపు పన్నులు , సర్‌చార్జీలు పన్ను విభజనలో చేర్చబడ్డాయని, ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వ వాటాలో తమిళనాడు వంటి రాష్ట్రాల నిధులు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని విరించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్ను పంపిణీ తగ్గింపు కారణంగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు పెనుభారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయంలో రాష్ట్రాలకు పన్నుల వాటా 50 శాతం పంపకం చట్టబద్ధం అని, అందరికీ ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. అందుకే తాము 50 శాతం వాటా కు పట్టుబడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు 50 శాతం పన్ను భాగస్వామ్యాన్ని సిఫార్సు చేయడమే కాకుండా నిర్ధారించడంపై దృష్టి పెడుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య పన్నుల విభజన నియంత్రణలో సమతుల్య విధానం అవసరం అని సూచించారు. తమిళనాడులో సుపరిపాలన కొనసాగుతోందని పేర్కొంటూ, ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న పన్ను భాగస్వామ్య విధానం అభివృద్ధికి అవరోధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక వనరులను అందించడం ద్వారా ఆ రాష్ట్రాలు తమ అభివృద్ధిని కొనసాగించడానికి వీలుంటుందన్నారు. రాష్ట్రాలకు నిధులు తగ్గించే సి అభివృద్ధిని ఆశించడం సాధ్యమా?, అభివృద్ధి కుంటుపడకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి నిధుల పంపిణీ వ్యవస్థను, భారత దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. మునుపటి నిధుల కమిటీల సిఫార్సులను జాగ్రత్తగా పరిశీలించాలని, వాటిలో లోపాల వల్ల అనేక రాష్ట్రాల్లో ఆశించిన విధంగా వృద్ధి, పురోగతి జరగలేదని స్పష్టమవుతుందన్నారు. ● నాగై అతలాకుతలం న్యూస్రీల్అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు పన్నుల విభజనలో సమతుల్య విధానం అవసరం కేంద్రం తీరుతో కుంటుపడుతున్న రాష్ట్రాల అభివృద్ధి నివేదికపై ప్రత్యేక శ్రద్ధ చూపండి 16వ ఆర్థిక సంఘం భేటీలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలురాష్ట్రంలో మూడు సమస్యలు.. తమిళనాడు మూడు కీలక సమస్యలను ఎదు ర్కొంటుందని ఈ సందర్భంగా వివరించారు. గత కొన్నేళ్లుగా ప్రకృతి తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పెను విపత్తులను ఎదుర్కొంటు న్నట్లు గుర్తు చేశారు. వరదల కారణంగా ప్రజల జీవితం, ఆస్తి, జీవనోపాధితో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు దెబ్బ తింటున్నాయని వివరించారు. ఈ నష్టాలు అధిగమించేందుకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉందన్నారు. ఇందుకు కేంద్రం నుంచి తగిన నిధులు, సహకారం అన్నది లేకుండా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఇది రాష్ట్ర జనాభా వ్యవస్థలో మార్పునకు కీలకంగా మారిందని వివరించారు. తమిళనాడు ప్రస్తుత జనాభాలో సగటు వయస్సు 36.4 ఏళ్లుగా ఉన్నట్టు గుర్తుచేస్తూ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఇది 38.5 శాతంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు తగ్గ అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, మూడో సమస్య పట్టణీకరణ అని పేర్కొంటూ ఆర్థిక వనరులు, తదితర సవాళ్లను వివరించారు. తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల నమ్మకం, విశ్వాసానికి అనుగుణంగా అభివృద్ధికి భరోసా ఇచ్చే విధంగా ఈ సంఘం సిఫార్సులు చేస్తుందని ఆశిస్తున్నామని , తమిళనాడు ప్రభుత్వం తరపున అందజేసిన నివేదికను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. -
సీజీకాన్ –2024
కాస్మోటిక్ గైనకాలజీ కాంగ్రెస్ ఇన్ సౌత్ ఇండియా ( సీజీకాన్ –2024) సదస్సు చైన్నెలో ఆది, సోమవారాలలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఇందులో సిమ్స్ ఆసుపత్రితోపాటు పలు ఆసుపత్రుల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం గ్రూప్ ఎండీ పద్మప్రియా, తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కె. నారాయణ స్వామి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సంధ్య వాసన్, ఆర్గనైజింగ్ ఛైర్మెన్ డాక్టర్ దీపా గణేష్ పాల్గొన్నారు. – సాక్షి, చైన్నె -
ఆలయ ప్రహరీగోడ కూల్చివేత
● ఆందోళన చేపట్టిన గ్రామస్తులు తిరువళ్లూరు: రోడ్డును ఆక్రమించుకుని ఆలయ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ ప్రైవేటు వ్యక్తి హైకోర్టులో వేసిన పిటిషన్లో భాగంగా ఆలయ ప్రహరీగోడను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన క్రమంలో పుల్లరంబాక్కం గ్రామస్తులు అదివారం రాత్రి హిందూ ప్రజా పార్టీ నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కంలో ప్రసిద్ధి చెందిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీచందన గోపాలకృష్ణ శ్రీసంతాన వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దాదాపు వందేళ్ల క్రితం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన వనితశ్రీధరన్ కుటుంబం నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబానికి, ఆలయ నిర్వాహకులకు మధ్య ఆలయానికి సమీపంలో ఉన్న స్థలంపై వివాదం ఉంది. సంబంధిత స్థల వివాదంపై వనితశ్రీధరన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రోడ్డును ఆక్రమించి ఆలయాన్ని నిర్మించిన క్రమంలో కృష్ణుడి ఆలయాన్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే గత గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆలయాన్ని తొలగించడానికి అధికారులు రాగా వివాదం చెలరేగింది. దీంతో అధికారులు ఆలయానికి వెనుక వున్న గోడను మాత్రం తొలగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో హిందు ప్రజాపార్టీ నేతలతో కలిసి స్థానికులు ఆదివారం రాత్రి ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సెంథిల్ హాజరయ్యారు. -
మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ కృష్ణకుమార్
సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి డి. కృష్ణకుమార్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ డి. కృష్ణకుమార్ కొంత కాలం ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేశారు. కొద్దిరోజుల క్రితం మద్రాసు హైకోర్టుకు సీజేగా శ్రీరామ్ పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుని సీనియర్ న్యాయమూర్తిగా కృష్ణకుమార్ ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయనని మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 2026లో కూటమి పాలనకు నో చాన్స్ ● తిరుమా స్పష్టీకరణ సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడులో కూటమి పాలనకు అవకాశం లేదని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూటమి పాలన అన్న నినాదాన్ని వీసీకే తొలుత తెరమీదకు తెచ్చిందని గుర్తు చేశారు. ఆ దిశగా చర్చలు, సభలు, సమావేశాలు నిర్వహించామని వివరించారు. అప్పటి పరిస్థితులు వేరు అని, ఇప్పటి పరిస్థితులు వేరు అని వ్యాఖ్యలు చేశారు. ప్రసుత్తం తమిళనాడులో కూటమి పాలనకు ఆస్కారం లేదన్నారు. కూటమి పాలన ఏర్పాటు చేస్తామని డీఎంకే, అన్నాడీఎంకేలు ముందుగా ప్రకటించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. అప్పుడే కూటమిలో తమ వాదనను చెప్పేందుకు, వినేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కూటమి పాలనకు అన్నాడీఎంకే ముందుగా బహిరంగ ప్రకటన చేయనివ్వండి ఆ తర్వాత మాట్లాడుకుందామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2026లో తమిళనాడులో కూటమి పాలనకు అవకాశం గానీ, ఆస్కారం గానీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కూటమి పాలన మీద ఇక్కడ అవగాహన అన్నది లేదని, ఈ దృష్ట్యా, కూటమిపాలనకు నో ఛాన్స్ అని చెప్పారు. అదేసమయంలో ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు సైతం సమన్వయం అవశ్యమని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ తెలుగు సదస్సుకు యజ్ఞశేఖరకు ఆహ్వానం కొరుక్కుపేట: ఖతార్ దేశ రాజధాని దోహా నగరంలో ఈ నెల 22 , 23 వ తేదీలలో జరిగే 9వ ప్రపంచ తెలుగు సదస్సుకు మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్కు ఆహ్వానం అందింది. ఆంధ్ర కళావేదిక, ఖతార్ , వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు తమిళనాడు రాష్ట్రం నుంచి సదస్సులో పాల్గొంటున్న ఏకై క తెలుగు ఆచార్యులు శ్రీపురం యజ్ఞశేఖర్ కావడంతో పలువురు తెలుగు ప్రముఖులు ప్రశంసించి అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో ‘‘గురజాడ – మానవతావాదం’’అనే అంశంపై యజ్ఞశేఖర్ ప్రసంగించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. స్థానికులు వ్యతిరేకిస్తే తాళం వేయాల్సిందే..! సాక్షి, చైన్నె: తమతమ ప్రాంతాలలోని టాస్మాక్ మద్యం దుకాణాలను మూసి వేయాలని స్థానిక ప్రజలు గళం విప్పితే వాటికి తాళం వేయాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంగా దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ, టాస్మాక్ దుఖాణాలు తమప్రాంతంలో వద్దంటూ ప్రజలు పోరాడినా, వ్యతిరేకంగా గళం విప్పినా, వాటిని అక్కడి నుంచి తొలగించాల్సిందేనని ఆదేశించారు. ఆ ప్రాంతంలో దుకాణం తొలగించి మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అలాగే లీజు కాలం ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకుండా భవన యజామనులపై ప్రతాపం చూపించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించింది. గంగై కొండంలో సోలార్ ప్యానెల్ ● పర్యావరణ శాఖ అనుమతి సాక్షి,చైన్నె : తిరునల్వేలి జిల్లా గంగై కొండంలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమకు రాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతి మంజూరు చేసింది. రూ.1,260 కోట్ల పెట్టుబడితో 3150 మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సోలార్ సెల్, పీవీ సోలార్ మాడ్యుర్ వంటి ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయనున్నారు. -
క్యారమ్స్‌లో చైన్నె టూ అమెరికా...!
సాక్షి, చైన్నె: ఇన్నాళ్లూ ఉత్తర చైన్నె వీధులలో క్యారమ్స్ ఆడుతూ అందర్నీ అబ్బుర పరిచిన కాశీమా(17) ఇప్పుడు అమెరికా వేదికగా మూడు స్వర్ణాలతో రాష్ట్రంకు తిరిగి రాబోతుండటం గల్లీలోని సహచర క్యారమ్స్ క్రీడాకారుల్నే కాదు ఆమె కుటుంబాన్ని ఆనంద సాగరంలో ముంచింది. అమెరికాలో జరిగిన ప్రపంచ క్యారమ్స్ ఛాంపియ్‌షిప్ పోటీలలో చైన్నెకి చెందిన ఆటో డ్రైవర్ మెహబూబ్ భాషా కుమార్తె కాశీమా (17) మూడు కేటగిరీలలో బంగారు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు గల్లీ వాసులకే తెలిసిన ఈ కాశీమా ప్రస్తుతం రాష్ట్రంలో సెలబట్రీ అయ్యారు. ఇందుకు కారణం క్యారమ్స్‌లో ఆమె సాధించిన ఘనతే. పేద కుటుంబం నుంచి.. ఉత్తర చైన్నెలో న్యూ వాషర్మెన్ పేట షెరియన్ నగర్ రెండవ వీధిలో 21 ఏళ్లుగా మెహబూబ్ భాషా (54) నివాసం ఉన్నారు. ఆయనకు భార్య ముంతాజ్, హసీనా , అబ్దుల్ రహ్మాన్, కాశీమా పిల్లలు. హసీనాకు వివాహం చేశారు. అబ్దుల్ రహ్మాన్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.అందరిలో చిన్నదైన కాశీమా 7వ ఏట నుంచి క్యారమ్స్ మీద దృష్టి పెట్టింది. తన తండ్రి మెహబూబ్ భాషా ఆటో నడుపుకుంటూ జీవనం సాగించడమే కాకుండా, తమ ప్రాంతంలోని విద్యార్థులు,యువతకు క్యారమ్ బోర్డులను కొనుగోలు చేసి ఇచ్చి ఎలాంటి లాభాపేక్ష అన్నది లేకుండా సాయంత్రం వేళలో వీధులలో క్యారమ్స్ శిక్షణ అందిస్తూ వచ్చారు. కాల క్రమేనా ఈ శిక్షణ కోసం ఓ ప్రాంతంలో గదిని కూడా తీసుకున్నారు. 15 సంవత్సరాలుగా మెహబూబ్ శిక్షణ ఇస్తూ వచ్చాడు. తన తండ్రి ద్వారా క్యారమ్స్ మీద పట్టు సాధించిన కాశీమా, 2013–14లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించింది. ఆ తర్వాత జూనియర్, సీనియర్ పోటీలలో పాల్గొంటూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలోకి.. ఆమెలోని ప్రతిభను క్యారమ్స్ అసోసియేషన్ ట్రైన ర్ మరియా గుర్తించారు. కాశీమాను తన వెన్నంటి ఉంచుకుని క్యారమ్స్ శిక్షణలో మెళుకువలను నేర్చించారు. తదుపరి ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలలో జరిగిన పోటీలకు కాశీమాను తీసుకెళ్లి సత్తా చాటే విధంగా ట్రోఫీలతో తిరిగి వచ్చారు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో జరిగిన పోటీలకు తమిళనాడు తరపున కాశీమాతోపాటుగా చైన్నె వ్యాసార్పాడికి చెందిన నాగ జ్యోతి, మదురైకు చెందిన మిత్రాలు ఎంపికయ్యారు. అమెరికా పయనానికి ఆర్థిక భారం అడ్డు వచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. క్రీడల శాఖ తరపున ఈ ముగ్గురు క్రీడాకారులకు ఖర్చులకు గాను తలా రూ. 1.50 లక్షలను అందజేశారు. ప్రభుత్వం నుంచి తనకు అందిన ప్రోత్సహాన్ని పరిగణించి పతకం సాధించాలన్న కాంక్షతో దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ కాశీమా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాలలో తన సత్తాను చాటారు. ఈ కేటగిరీలలో విజేతగా నిలిచి మూడు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కాశీమా గురించి గల్లి వరకే తెలిసిన నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాట క్రీడా సెలబ్రటీగా మారారు. ఏకంగా మూడు స్వర్ణాలను క్యారమ్స్‌లో అమెరికా వేదికగా సాధించడంతో ఆమె కుటుంబ సభ్యులను ప్రశసించే వారు పెరిగాయి. ఇక, తమతో పాటు వీధులలో క్యారమ్స్ ఆడుకున్న కాశీమా అంతర్జాతీయ వేదికపై పతకాలను సాధించడం క్యారమ్స్ క్రీడాకారుల్లో ఆనందం నింపింది. ఇక ఆమె తల్లిదండ్రల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాశీమా గురించి, ఆమె కుటుంబ పరిస్థితి గురించి ప్రస్తుతం తమిళ మీడియా కథనాలను హోరెత్తిస్తుండటం గమనార్హం. కశీమా ఇంట ఆనందోత్సాహాలు చిన్నతనం నుంచే క్యారమ్స్‌లో రాణింపు -
3వ తరగతి చిన్నారికి హెచ్ఎం లైంగిక వేధింపులు
పళ్లిపట్టు: మూడో తరగతి విద్యార్థినిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక వైధింపులకు గురిచేశాడనే ఆరోపణతో సోమవారం విద్యార్థులు పాఠశాల బహిష్కరించి ఆందోళనకు దిగారు. పళ్లిపట్టు పట్టణ పరిధిలోని ఆంజనేయనగర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 15 మంది బాల, బాలికలు చదువుకుంటున్నారు. ఆ పాఠశాల హెచ్ఎంగా చెంగల్వరాయన్(59) విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న ఇరుళ కుటుంబానికి చెందిన చిన్నారిని హెచ్ఎం పాఠశాల మరుగుదొడ్డిలో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే చిన్నారితో పాటు తల్లిదండ్రుల వద్ద పోలీ సులు చేపట్టిన విచారణలో హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడలేదని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారి మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. పాఠశాల హెచ్ఎం మరుగుదొడ్డికి రమ్మని చెప్పి తనను లైంగికంగా వేధించినట్లు చిన్నారి చెప్పడం కలకలం రేపింది. ఈ ఘటనతో చిన్నారులను వారి తల్లిదండ్రులు బడికి పంపకుండా హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. విద్యార్ధులు తరగతుల బహిష్కరణతో విద్యాశాఖ మండల అధికారి కుమరగురుబరన్, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద విచారణ చేపట్టారు. లైంగిక దాడికి పాల్పడ్డ హెచ్ఎంను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని అంతవరకు తమ పిల్లలను బడికి పంపమని స్పష్టం చేశారు. కాగా ప్రారంభంలో హెచ్ఎం విద్యార్థిపై లైంగిక దాడి చేయలేదని, చిన్నారి తల్లిదండ్రులు పేర్కొని తర్వాత.. చిన్నారి వీడియోలో భిన్నంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పాఠశాలను బహిష్కరించిన విద్యార్థులు -
No Headline
సాక్షి, చైన్నె : ఈశాన్య రుతు పవనాల రూపంలో వర్షాలు విస్తృతమయ్యాయి. అయితే ఈ ప్రభావం ఉత్తర తమిళనాడు, డెల్టా జిల్లాల మీదే అధికంగా ఉంది. వివరాలు..పశ్చిమ కనుమలలో మోస్తారుగా వర్షం పడుతుండగా మిగిలిన జిల్లాలో ప్రభావం శూన్యంగా మారింది. 18 జిల్లాలోనే ఈ పవనాలు వర్షాలను కురిపిస్తున్నాయి. మిగిలిన 20 జిల్లాలో అంతంత మాత్రంగానే ఉండడం గమనార్హం. ఈ పవనాల రాకతో ఇప్పటి వరకు తూత్తుకుడి జిల్లాలో 14 సెం.మీ, తెన్ఆకశి జిల్లాలో 19 సెం.మీ, రాణి పేట, పెరంబలూరు జిల్లాలొఓ 23 సెం.మీ, విల్లుపురం జిల్లాలో 26, తిరువణ్ణామలై జిల్లాలో 27, కళ్లకురిచ్చి, విరుదునగర్ జిల్లాలో 28 సెం.మీ చొప్పున వర్షం పడింది. ఇక అత్యధిక వర్ష పాతం మైలాడుతురై జిల్లా 41 సెం.మీ, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో 30 సెం.మీ చొప్పున కురిసింది. చైన్నెలో 55 సెం.మీ వర్షం ఇప్పటి వరకు ఈశాన్య రుతుపవనాల రూపంలో పడింది. ఈ పరిస్థితులలో ఆదివారం రాత్రి నుంచి డెల్టా జిల్లాలో వర్షం తీవ్రత మరింతగా పెరిగింది. నాగపట్నం, వేలాంకన్నీ, వేదారణ్యంలలో కుండ పోతగా వర్షం కురిసింది. నాగపట్నం, వేలాంకన్నీలలో అతి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్ల మీద వరదలు పారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తంజావూరులో కురిసిన భారీ వర్షం కారణంగా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒరత్తనాడులో వరి పొంటలన్ని వరదల ముంచెత్తాయి. నాగపట్నం, వేలాంకన్నీలో అత్యధికంగా 35 సెం.మీ , వేదారణ్యంలో 20 సెం.మీ వర్షం పడింది. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులను శిబిరాలకు తరలించి సహాయక చర్యలను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. డెల్టా జిల్లాలో మరో రెండు రోజుల పాటగుఆ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
మోసం కేసులో బీజేపీ నేత అరెస్టు
అన్నానగర్: విరుదాచలంలో అడ్వొకేట్, అతని తండ్రి నుంచి రూ.కోటి 21 లక్షల మేర మోసం చేసిన బీజేపీ నేతను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని పుదుకుప్పానికి చెందిన బాలకుమారన్ కుమారుడు భాస్కర్(36) న్యాయవాది. విరుదాచలం వాయలూరు ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్(37) బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఆయన పెరియవాడవాడిలో పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఈ స్థితిలో రాజకుమార్ భాస్కర్ కోసం విరుదాచలం ప్రాంతంలో స్థలం కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇందుకోసం రాజ్‌కుమార్‌కు రూ.44 లక్షలు భాస్కర్ అందించాడు. దీని తర్వాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తన పెట్రోల్ బంకును విస్తరించేందుకు రూ.30 లక్షలు అవసరమని కోరాడు. తన అవసరాల కోసం రూ.30 లక్షలు కూడా ఇచ్చాడు. దీంతో భాస్కర్ తాను ఇచ్చిన డబ్బులకు భూమిని తన పేరు మీద పట్టా ఇప్పించాలని కోరాడు. కానీ రాజ్‌కుమార్ ఆ స్థలాన్ని భాస్కర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రూ.65 లక్షలకు వేరొకరికి విక్రయించాడు. అదేవిధంగా భాస్కర్ తండ్రి బాలకుమార్‌ను కూడా మోసం చేసి సుమారు రూ.47 లక్షలు తీసుకున్నాడు. ఈ విషయమై భాస్కర్ పలుమార్లు అడగగా.. పలు కారణాలతో రాజ్ కుమార్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. డబ్బులు ఇవ్వలేనంటూ భాస్కర్‌ను రాజ్‌కుమార్ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్ కడలూరు జిల్లా ఎస్పీ రాజారాంకు ఫిర్యాదు చేశారు. దీంతో క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫిర్యాదులో నిజం ఉందని నిర్ధారించిన పోలీసులు సోమవారం రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
నయనతారపై పిటిషన్‌కు ధనుష్ రెడీ
తమిళ సినిమా: నటి నయనతారను కోర్టు బోనులో నిలబెట్టడానికి నటుడు ధనుష్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. నయనతార తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలతో ఓ డాక్యుమెంట్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే దానికి నయనతార బిహైండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరు నిర్ణయించారు. అందులో నటి నయనతారతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమ, పెళ్లి వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా నయనతార నటించిన పలు చిత్రాలలోని ముఖ్య సన్నివేశాలను పొందుపరిచారు. అయితే నయనతార విగ్నేశ్ శివన్‌ల ప్రేమ చిగురించడానికి కారణమైన చిత్రం నానూ రౌడీదాన్. ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీ వాడుకోవడానికి ధనుష్ ను అనుమతి కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అయినప్పటికీ ఆ చిత్రంలోని సన్నివేశాలను డాక్యుమెంటరీ ట్రైలర్లో వాడారు. ధనుష్ తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడినంతకాలం రూ. 10 కోట్లు నష్టం పరిహారం కోరుతూ నటి నయనతారకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై నయనతార ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌ల డాక్యుమెంటరీని నెట్ ఫిక్స్ సంస్థ సోమవారం స్ట్రీమింగ్ చేసింది. అందులోనూ నానుమ్ రౌడీ దాన్ లోని కొన్ని సన్నివేశాలు చోటు చేసుకోవడంతో ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన వర్గం పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్ర షూటింగ్ కోసం వేరే ఊరిలో ఉన్నారు. ఆయన చైన్నెకి తిరిగి వచ్చిన తరువాత నయనతారపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతారట. అయితే ధనుష్ నటుడుగా దర్శకుడిగా నిర్మాతగా బిజీగా ఉండటంతో ఆయన తరపున ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా నయంతారపై కోర్టులో సిద్ధమవుతున్నట్లు ధనుష్ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని నయనతార పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. -
కిలాంబాక్కం నుంచి పంబకి ప్రత్యేక బస్సులు
తిరువొత్తియూరు: శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం శబరిమల ఎక్స్‌ప్రెస్ బస్సు చైన్నె, తిరుచ్చి, మధురైతో సహా నగరాల నుంచి ప్రారంభించబడింది. అదేవిధంగా అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం మొదట పంౖబ నుంచి కిలాంబాక్కంకు ప్రత్యేక బస్సును విధిగా నడిపారు. ఇక మండల పూజ కోసం శబరిమల అయ్యప్పన్ ఆలయం ఆదివారం తెరిచారు. దీంతో శబరిమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం, తమిళనాడులోని ప్రధాన నగరాల నుంచి ప్రభుత్వ త్వరిత రవాణా సంస్థ ప్రతి సంవత్సరం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 16 వరకు భక్తుల కోసం చైన్నె కోయంబేడు, కిలాంబాక్కం, తిరుచ్చి, మదురై, పుదుచ్చేరి, కడలూరు నుంచి పంబ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించారు. -
ఆక్యుపేషనల్ థెరపీపై అవగాహన
సాక్షి, చైన్నె: ఆక్యుపేషనల్ థెరఫీ గురించి అవగాహన కల్పించే విధంగా శ్రీరామచంద్ర వర్సిటీ విద్యార్థులు వాక్‌థాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. శ్రీరామచంద్ర ఫ్యాకల్టీ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరఫీ విభాగం నేతృత్వంలో చైన్నె బీసెంట్ నగర్లో ఉదయం ఈ వాక్‌థాన్ జరిగింది. ఆ విద్యా సంస్థ అదనపు రిజిస్టార్ డాక్టర్ సెంథిల్మార్, ప్రొఫెసర్ పీ రఘురామ్, డాక్టర్ వి దేవకీ ఈ వాక్ థాన్‌కు జెండా ఊపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రోగికి శస్త్ర చికిత్సలు ఎంత ముఖ్యమో, పునరావాస చికిత్సలు కూడా అంతే ముఖ్యమని వివరించారు.చివరగా డజన్ల కొద్ది రంగు రంగుల హీలియం నింపిన బెలూన్లను గాల్లో వదలి పెట్టి ఆక్యుపేషనల్ థెరఫీ రోగులలో ఆనందం నింపుదామని విద్యార్థులు పిలుపు నిచ్చారు. -
సంచార కులాల స్థలం ఆక్రమణ
● ఆక్రమణల తొలగింపుపై పట్టించుకోని అధికారులు ● రెండు గంటలపాటు రాస్తారోకో తిరువళ్లూరు: సంచార కులాలకు కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తూ దాదాపు 300 మంది రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా సెంగుండ్రం సమీపంలోని ఒరకాడు అల్లినగర్ ప్రాంతంలో మూడువందల మందికి పైగా సంచార కులాలవారు నివాసం ఉంటున్నారు. ఈ స్థలాన్ని 1971వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గోవిందరాజులు నాయుడు ఽభూధానం చేశారు. ఈ స్థలంలోనే చిన్నపాటి గుడిసెలను ఏర్పాటు చేసుకుని సంచార కులాలకు చెందిన కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రధాన జీవనాధారం నల్లపూసలు, ప్లాస్టిక్ పువ్వుల విక్రయమే. అయితే అల్లినగర్ నుంచి తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు నిత్యం వచ్చి రైలులో పూసలు వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో వారందరూ తిరువళ్లూరు, ఆవడి, తిరునిండ్రవూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి తాత్కాలిక నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు ప్రైవేటు వ్యక్తులు సంచార కులాలకు చెందిన గుడిసెలను తొలగించి ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. భాదితులు తమకు చెందిన భూములను సర్వే చేసి అప్పగించాలని కోరుతూ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. -
జోరుగా మత్తుమాత్రల విక్రయం
● 8 మంది అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె ఎంజీఆర్ నగర్ అన్నామె యిన్ రోడ్డులో మత్తుమాత్రలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు అక్కడ చేరుకుని మత్తుమాత్రలు విక్రయిస్తున్న చోళైపళ్లం జాఫర్ ఖాన్ పేట, విరుగంబాక్కం ప్రాంతానికి చెందిన కార్తీక్ రాజా, మణి మారన్, జానకిరామన్, అహ్మద్ బాషా, వెంకటేశ్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 205 మత్తు మాత్రలు, 38 ఇంజక్షన్లు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేకే నగర్లో మత్తు మాత్రలు విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన మురుగేషన్, హరీష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వడపళనిలో గంజాయి విక్రయిస్తున్న అబ్దుల్ తమీం అనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. చిన్నారి గొంతు కోసిన మాంజా దారం ● విద్యార్థి సహా 10 మంది అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె, వ్యాసార్పాడిలో మాంజా దారం తగులుకుని 2 సంవత్సరాల బిడ్డ గొంతు కోసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి విద్యార్థితోసహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొడుంగయూరు ముత్తమిల్ నగర్‌కు చెందిన బాలమురుగన్, భార్య కౌసల్య. వీరి 2 సంవత్సరాల కుమారుడు పుగల్ వేలన్. ఆదివారం బాలమురుగన్ తన భార్య, బిడ్డతో మోటార్ సైకిల్‌పై బేసిన్ బ్రిడ్జి అశోక్ పిల్లర్ మార్గంలో వెళ్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలిలో ఎగురుకుంటూ వచ్చిన మాంజా దారం బిడ్డ పుగల్వేలన్ గొంతుకు తగులుకుంది. బాలమురుగన్ మోటార్ సైకిల్ ఆపేలోపు బిడ్డ గొంతు కోసుకొని రక్తం వెలువడింది. దిగ్భ్రాంతి చెందిన బాలమురుగన్, కౌసల్య కుమారుడిని వెంటనే వ్యాసార్పాడి పాడిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. అక్కడ బిడ్డకు 7 కుట్లు వేశారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీనిపై వ్యాసార్పాడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో తీవ్రంగా నిఘా వేశారు. ఇందులో మాంజా నూలుతో గాలిపటం వదులుతున్న పాఠశాల విద్యార్థులు ఐదుగురిని పట్టుకున్నారు. అలాగే సోమవారం ఉదయం మరో ఐదుగురిని పట్టుకున్నారు. గాలిపటం విక్రయదారులు, మాంజా దారం విక్రయదారులు పట్టుబడ్డారు. వారి వద్ద పోలీసులు మాంజా నూలు, గాలిపటాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 10 మందిని పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేస్తున్నారు. ఆందోళనకారుల అరెస్టు సేలం: ప్రజల్లో ఆందోళన రేకెత్తించినందుకు జాతీయ భద్రతా చట్టం కింద నెల్లైలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. తిరునెల్వేలి జిల్లాలో వేర్వేరు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తించే రీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలను విడుదల చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిపారు. ఆ మేరకు జిల్లా పోలీసులు చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు సామాజిక వర్గాలకు చెందిన కార్యకర్తలను నియమించి 372 గ్రామాలలో ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో సామాజిక ఉద్రికత్తత రేకెత్తించడానికి ప్రయత్నించిన దేవేంద్ర కుల వేలాలర్ ఎళిచ్చి ఇయక్కం అధ్యక్షుడు కన్నబిరాన్ పాండియన్, రాఖీ శివ ఇద్దరిని జిల్లా పోలీసుల సూచన మేరకు జిల్లా కలెక్టర్ కార్తికేయన్ ఉత్తర్వుల మేరకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ ప్రకారం నెల్లై నగర పోలీసు శాఖ కింద 70 మంది, జిల్లా పోలీసు శాఖ కింద 192 మంది గూండా చట్టం కింద అరెస్టు అయ్యి జైలులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. -
గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
అన్నానగర్: మామల్లపురం మత్స్యకార ప్రాంతం వద్ద సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. చైన్నెలోని అన్నానగర్ వెస్ట్ కంబర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్‌కు బట్టల దుకాణం ఉంది. ఇతని కుమారుడు గిరీష్ కేశవ్(20) మొగప్పేర్ ప్రాంతంలోని ఆర్ట్స్ కళాశాలలో బీకాం 3వ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రిజ్వానన్కు బొగ్గుల దుకాణం ఉంది. క్యాటరింగ్ పూర్తి చేసిన కుమారుడు రియాజ్(18) పెళ్లిళ్లు, ప్రత్యేక కార్యక్రమాలకు పార్ట్‌టైమ్ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన వీరిద్దరూ అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు రహషాద్(18), ఆకాష్ (19), యువతి ఆర్య(18)తో కలిసి ఆదివారం మామల్లపురం వచ్చారు. ఐదుగురు మామల్లపురం మత్స్యకార ప్రాంతం వద్దకు వచ్చి అక్కడ సముద్ర స్నానం చేశారు. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా పెద్ద కెరటం తాకడంతో గిరీష్ కేశవ్, రియాజ్ సముద్రం మధ్యలోకి కొట్టుకెళ్లిపోయారు. కోస్ట్ గార్డ్ పోలీసులు, ఈతగాళ్లు, మత్స్యకారుల సాయంతో బోటులో లోతైన సముద్రంలోకి వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితిలో సోమవారం రియాజ్ మృతదేహం మామళ్లపురం సమీపంలోని వేంపురుషం బీచ్ వద్ద, గిరీష్ కేశవ్ మృతదేహం ఉయ్యాలికుప్పం బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బెయిల్ కోసం కోర్టులో కస్తూరి పిటిషన్
● నిద్ర లేక జైలులో అవస్థలు సాక్షి, చైన్నె: బెయిల్ కోసం చైన్నె ఎగ్మూర్ కోర్టులో సినీ నటి కస్తూరి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. పులల్ జైలులో ఆమె నిద్ర లేక, సరిగ్గా ఆహారం తినక అవస్థలు పడుతున్నట్టు అందులో పేర్కొన్నారు. వివరాలు.. తెలుగు వారిని కించపరిచే విధంగాఅనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని పోలీసులు అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టు ఆదేశాలతో రిమాండ్ నిమిత్తం పుళల్ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. ఆదివారం జైలుకు వెళ్లే ముందుగా ఆమె జ్యూస్ , శాండ్ విజ్ తీసుకున్నారు. ఇతర మహిళా ఖైదీలతో పాటు ఓ గదిలో ఆమెను ఉంచారు. రాత్రంతా జైలులో ఆమె నిద్ర పోకుండా బాధ పడుతున్నట్టు తెలిసింది. సోమవారం జైలులో ఉదయం , మధ్యాహ్నం పొంగలి, కిచ్చెడి వంటి ఆహారం అందజేసినా ఆమె వాటిని కొంత మాత్రమే తీసుకుని మిగిలినవి తినకుండా పడేసినట్టు వెలుగు చూసింది. సినీ సెలబ్రటీ కావడంతో ఆమెకు ఏ 1 సౌకర్యాలతో గది కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఆమె దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మూర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
‘దైవానై’ దాడిలో ఇద్దరి మృతి
● తిరుచెందూరు ఆలయంలో విషాదం ● కొన్ని గంటలపాటు ఆలయం మూతసాక్షి, చైన్నె: ఆరుపడ్డై వీడులలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి ఆలయం ఆవరణలో సోమవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఆలయ ఏనుగు దైవానై దాడిలో మావటితో సహా మరొకరు మరణించారు. తిరుచెందూరు ఆలయానికి దేవానై(25) ఆడ ఏనుగు ఉంది. ఈ ఏనుగును భక్తితో పూజిస్తుంటారు. ఉత్సవాల సమయం, ఆలయంలో ఉదయం, సాయంత్రం వేళలో జరిగే పూజల్లో ఈ ఏనుగు పాల్గొంటుంది. ఆలయం సమీపంలోనే ఈ ఏనుగు సంరక్షణ శిబిరం ఉంది. ఈ పరిస్థితులలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దైవానై సంరక్షణ శిబిరంలో అరుపులు కేకలు వినబడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడ దైవానై కాళ్ల కింద నలిగిన స్థితిలో ఓ యువకుడు మరణించి ఉండడాన్ని గుర్తించారు. సమీపంలో ఆ ఏనుగు సంరక్షకుడు మావటి ఉదయకుమార్ రక్తగాయాలతో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో అతడు మరణించారు. దైవానై దాడిలో ఇద్దరు మరణించిన సమాచారంతో తిరుచెందూరులో కలకలం రేగింది. తక్షణం ఆలయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాల అనంతరం మళ్లీ పూజలు మొదలయ్యాయి. దైవానై ఆ ఇద్దర్ని ఎందుకు కొట్టి చంపిందో అన్నది మిస్టరీగా మారింది. ఆడ ఏనుగులకు మదం పట్టే అవకాశం లేని దృష్ట్యా, ఈ సంఘటన ఎలా జరిగిందోనని అక్కడి సీసీ కెమెరాలలలోని దృశ్యాలను పరిశీలించారు. మృతులలో ఉదయకుమార్, అతడి బంధువు శిశుకుమార్గా గుర్తించారు. శిశుకుమార్ దైవానైను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి ఉండవచ్చునని, ఆగ్రహంతో అతడిపై దాడిచేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనిని అడ్డుకునే క్రమంలో ఉదయకుమార్‌పై సైతం దైవానై దాడి చేసి ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అటవీ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకుని దైవానై ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. -
ప్రభుత్వ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్
కొరుక్కుపేట: ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రిజర్వేషన్ వ్యవధిని 60 రోజుల నుంచి 90 రోజుల ముందుకు మార్చినట్లు రవాణా శాఖ ప్రకటించింది. ఈ విధానపరమైన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. తమిళనాడులో, సుదూర నగరాలకు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ బస్సులను నడుపుతోంది. పండుగలు, వారాంతాల్లో రైళ్లలో టికెట్ లభ్యత సులభంగా ఉండదు. తత్కాల్‌కు ముందు కూడా క్షణాల్లో టిక్కెట్లు బుక్ అయిపోతాయి దీంతో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా, ప్రైవేట్ ఓమ్నీ బస్సులు వారాంతాలు, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి తదితర పండుగ రోజులలో విమాన టిక్కెట్లతో సమానంగా వసూలు చేస్తాయి. ఆమ్నీ బస్సుల్లో మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల రిజర్వేషన్ వ్యవధిని 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచినట్లు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది. దీని ప్రకారం నేటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో పొంగల్ బుకింగ్ ప్రారంభమైంది. దీని ప్రకారం, చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి www.tnrtc.in ను చూడవచ్చునని అధికారులు తెలిపారు.