Tollywood
-
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్‌కు ధనుష్ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్‌తో ఆమె సౌత్ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్‌కు మద్ధతుగా ధనుష్‌పై ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబ్ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్‌గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్‌తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే.. మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స మండి పడుతున్నారు. ధనుష్‌పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.ధనుష్ నిర్మాతగా ఉన్న 'నానుమ్ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్‌పై కాపీరైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. -
క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!
నిఖిల్ మళయక్కల్.. గోరింటాకు సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇదే ధారావాహికలో అతడికి జోడీగా నటించింది కావ్య శ్రీ. సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ, వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది. ఇంకేముంది.. ప్రతి ఫంక్షన్లోనూ, షోలోనూ, ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఇద్దరి మధ్య దూరంవీళ్ల యవ్వారం చూసిన జనాలు ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్‌కు ఎదురైతే.. కావ్య మంచి అమ్మాయి.. పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింటిచ్చాడు. తర్వాత ఏమైందే ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశారు. కొట్టినా, తిట్టినా పడతా..ఇక నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్‌స్టోరీ చెప్తూ ఎమోషనలయ్యాడు. ఆరేళ్ల ప్రేమ.. విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్‌బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు. నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా.. అని ఏడుస్తూ చెప్పాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. మోసపోవద్దుమాస్కు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేవరకు ఎదురుచూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్‌ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్- కావ్య మళ్లీ కలుస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాట్నాలో పుష్ప-2 ఈవెంట్.. చరిత్రలోనే తొలిసారి అలా!
మరికొన్ని గంటల్లో పుష్ప రాజ్ సందడి చేయనున్నాడు. బిహార్‌లోని పాట్నాలో నిర్వహించే భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నార్త్ స్టేట్‌లో ఇంత భారీఎత్తున ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. నగరంలోని గాంధీ మైదానంలో ఈవెంట్ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు.అయితే ఈవెంట్‌ను అక్కడి ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని కేటాయించింది. అయితే ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బిహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. దీన్ని బట్టి చూస్తే పాన్ ఇండియా స్టార్‌కు నార్త్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పాట్నా నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. -
‘కేరాఫ్ రవీంద్రభారతి ’ హిట్ కావాలి: మామిడి హరికృష్ణ
‘తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. గత 64 ఏళ్ల నుంచి ఓ సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ.. ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కళా ప్రదర్శన చేయాలని తపన పడతాడు. లక్షలాది కళాకారులకి వేదికగా నిలిచిన రవీంద్ర భారతి నేపథ్యంలో ‘కేరాఫ్ రవీంద్రభారతి ’సినిమా తెరకెక్కడం సంతోషంగా ఉంది’ అన్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కేరాఫ్ రవీంద్రభారతి’.జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఓ మంచి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ..మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా కేరాఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ను నిర్మిస్తున్న టి. గణపతిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు జీవన్. ‘ఓ మంచి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అని హీరోయిన్ నవీన అన్నారు. -
గ్రూప్-3 పరీక్షలో ఆస్కార్, జాతీయ అవార్డ్స్‌పై సినిమా ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్B) ఆట్టంC) బ్రహ్మాస్త్ర D) కాంతార2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?A) ఆర్. మహదేవన్B) నిఖిల్ మహాజన్C) కార్తికి గొన్సాల్వ్స్D) నిషా పహుజాఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
పాట్నాలో ఐకాన్ స్టార్.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పాట్నాలో ఏర్పాటు భారీ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.Pushpa Raj aka @alluarjun is arriving in style to rule Patna! 💥Get ready for the MASSIVE #Pushpa2TheRuleTrailer Launch Event at Gandhi Maidan! ❤️🔥Watch Live Here 👇 https://t.co/JTQseKpgjQEvent by @MediaYouwe#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/HPG6eegYUJ— YouWe Media (@MediaYouwe) November 17, 2024 -
నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) -
Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్ బ్యూటీ
ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్' విజేతగా నిలిచారు. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్‌లలో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు. 2023 మిస్ యూనివర్స్ విన్నర్ 'షెన్నిస్ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు. 'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ బ్యూటీకి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు. -
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
టెన్నీస్ ఆడి పాతాళభైరవి సినిమాకు సెలక్టైన ఎన్టీఆర్..!
పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. (చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. - అలిపిరి సురేష్ -
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్
'పుష్ప 2' ట్రైలర్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం రిలీజ్ కానుంది. బిహార్‌లోని పాట్నాలో గ్రాండ్ ఈవెంట్ ఉంది. అయితే ఊరు కాని ఊరులోనూ 'పుష్ప' క్రేజ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ట్రైలర్ ఈవెంట్ పాసుల కోసం బిహారీలు ఎగబడుతున్నారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ, పాటలు పాడుతూ తెగ సంబరపడిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్)మరికొందరైతే 'పుష్ప' మూవీకి గన్నులు పేల్చి మరీ స్వాగతం పలుకుతామని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే చాలామంది బాలీవుడ్ హీరోలకు సాధ్యం కాని విధంగా నార్త్‌లోనూ బన్నీ క్రేజ్ సంపాదించాడనిపిస్తోంది.ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కే ఈ రేంజ్ రచ్చ జరుగుతుందంటే.. ఇక సినిమా వస్తే నార్త్ ఆడియెన్స్ ఇంకా ఏమేం చేస్తారో అనిపిస్తోంది. సాయంత్రం 6:03 గంటలకు 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు టాక్.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్)A mataki ah maata North Audience mathram movie ni gattiga ne own cheskunnaru and dhaniki taggatte team kuda promotions manchiga plan cheskunnaru, north lo mathram bhAAi @alluarjun esari gattiga ne kottela vunnadu..#AlluArjun #Pushpa2TheRuleTrailer #Pushpa2 #Pushpa2TheRule pic.twitter.com/ZMHzojospb— poorna_choudary (@poornachoudary1) November 16, 2024Orey 😂😹 #Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/c1FGxVmRsP— Race Gurram (@racexgurram) November 16, 2024idhi AAdi Range 🥵💥 Ap TS Daatithey Okkadu Dekadu 🐕 ni , Lanj*dka*llara , miru AA ni anadam #Pushpa2TheRule #Pushpa2 #Pushpa2Trailer #AlluArjun𓃵 @alluarjunpic.twitter.com/GrioVKCBBn— ..... (@Icon_Sanjuu) November 16, 2024 View this post on Instagram A post shared by BUSTARD_BABAI_ (@bustard_babai) -
SSMB 29: మహేశ్‌కి జోడీగా హాలీవుడ్ భామ.. ఎవరీ నవోమీ?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బి 29’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్‌కు చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకోనున్నారాయన. అందులో భాగంగా మహేశ్‌బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమీ స్కాట్‌ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవోమీకి భారత మూలాలుగతంలో ‘ఎస్ఎస్ఎమ్బి 29’ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమీ స్కాట్‌ని ఎంపిక చేయనున్నారని భోగట్టా. ఇంగ్లాండులో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండుకు వలస వెళ్లారట. ‘ది మార్షియన్, అల్లాద్దీన్, ఛార్లీస్ ఏంజెల్స్, స్మైల్, విజర్డ్స్’ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. షూటింగ్ ఎప్పుడంటే..?‘ఎస్ఎస్ఎమ్బి 29’లో నటించే విషయంపై ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి... మహేశ్‌బాబుకి జోడీగా నవోమీ స్కాట్ ఖరారు అయినట్టేనా? అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. -
తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు
హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. కాంబో రిపీట్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. నవీన్‌తో నెక్ట్స్ సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. బిజీ బిజీ ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు. ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా. ‘జైలర్’ దర్శకుడితో...ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు. కథ విన్నారా? రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహాభారతం దర్శకుడితో... హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. జీబ్రా తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. ఆదివారం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బిహార్‌లో ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ టీమిండియా జట్టు వరకు చేరింది. లేటెస్ట్ సెన్సేషన్ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన తిలక్ వర్మ హీరో అయిపోయాడు. దీంతో ఇతడిని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇంటర్వ్యూ చేశాడు. నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను, నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటి? ఈ హెయిర్‌ను చూసి అందరు అల్లు అర్జున్.. అల్లు అర్జున్ అని అంటున్నారు.. ఏంటి అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అని సూర్య అడిగాడు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)దీనికి సమాధానమిచ్చిన తిలక్ వర్మ.. ఏం లేదు, ఈ హెయిర్ స్టైల్‌ని ఇప్పుడే మొదలుపెట్టా. అప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. చాలామంది ఆయనలానే కనిపిస్తున్నావ్ అని అంటున్నారు. నాకు లాంగ్ హెయిర్ బాగా అనిపించింది. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మస్త్ అనిపిస్తుంది. అందుకే ఇలా పెంచాను అని చెప్పాడు.ఏంటి మరి 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? అని సూర్య అడగ్గా.. అలాంటిది ఏం లేదు, నా పని బాల్, బ్యాట్‌తో ఆడటం మాత్రమే. గ్రౌండ్లో ఆడాలి.. బయటకెళ్లి ఎంజాయ్ చేయాలి. మిగతాది ఆ దేవుడు చూసుకుంటాడు అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' కోసం శ్రీలీల రెమ్యునరేషన్.. ఒక్క పాట కోసం అన్ని కోట్లా..!)Nicee @alluarjun @TilakV9 🧡 pic.twitter.com/q708J77eiY— Yash 🪓🐉 (@YashR066) November 16, 2024 -
కోటిన్నర కారు తల్లికి గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో
తెలుగు యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే సరైన హిట్ పడటం లేదు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ ఉన్నాడు. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న ఇతడు.. ఇప్పుడు తన తల్లికి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఆ విషయాన్నే చెబుతూ తెగ మురిసిపోయాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్)'మా అమ్మకు బర్త్ డేకి ముందే గిఫ్ట్ ఇస్తున్నా. ఇప్పటికీ అమ్మ.. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేందుకు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనివ్వమని అడిగింది. ఇప్పుడు అది నెరవేర్చా. చిన్న కానుకలే బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి' అని సందీప్ కిషన్ రాసుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఈ రేంజ్ రోవర్ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.2010లో 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'మజాకా' అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ పండక్కి చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ మూవీస్ విడుదల కానున్నాయి. సందీప్ మూవీ కూడా అదే టైంకి అంటే కష్టమే.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మహేశ్‌బాబుకి ట్రైలర్ బాగా నచ్చింది: అర్జున్ జంధ్యాల
‘‘దేవకి నందన వాసుదేవ’ సినిమా మంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఈ మూవీలో చాలా కీలకం. అలాగే పూర్తి వాణిజ్య అంశాలు ఉంటాయి. మా చిత్రం కుటుంబ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ అర్జున్ జంధ్యాల తెలిపారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.ఈ సందర్భంగా అర్జున్ జంధ్యాల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గుణ 369’ డైరక్టర్ ప్రశాంత్ వర్మగారికి నచ్చింది. ఆయన రాసిన ‘దేవకి నందన వాసుదేవ’ కథకు నేనైతే న్యాయం చేయగలనని భావించి, దర్శకత్వ బాధ్యతలను నాకు అప్పగించారు. ఫైనల్ సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యారాయన. అశోక్ గల్లాగారు తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మానసది బలమైన పాత్ర. దేవ్ దత్తాగారు కంసరాజ్ పాత్రని అద్భుతంగా చేశారు.సాయి మాధవ్ బుర్రాగారు సినిమాలోని భావోద్వేగాలు, కథకి తగ్గట్టుగా మాటలందించారు. నేపథ్య సంగీతం, మ్యూజిక్‌తో ఈ సినిమాకిప్రాణం పోశారు భీమ్స్. బాలకృష్ణగారు ఈ కథకి కావల్సినవన్నీ సమకూర్చి గ్రాండ్‌గా నిర్మించారు. హీరో మహేశ్‌బాబుగారికి మా సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. ఆయన మా టీమ్‌ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’’ అని తెలిపారు. -
ఎస్ఐ యుగంధర్ ఆరంభం
ఆది సాయికుమార్ హీరోగా ‘ఎస్ఐ యుగంధర్’ సినిమా ఆరంభమైంది. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా మేఘలేఖ, విలన్‌గా రాకేందు మౌళి నటిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇవ్వగా, నటుడు సాయికుమార్ స్క్రిప్ట్ అందించారు.ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘కథని నమ్మి ‘ఎస్ఐ యుగంధర్’ చేస్తున్నాం. ప్రదీప్‌గారు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్. ఈ నెల 18న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘2025లో విడుదలయ్యే ‘ఎస్ఐ యుగంధర్’ ఆదికి, టీమ్‌కి మంచి సక్సెస్ ఇవ్వాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అని యశ్వంత్ తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ప్రదీప్ జూలూరు. -
ప్రేమలో భిన్న కోణం
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్‌గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్‌కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్. -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్‌స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్‌గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్‌గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్‌గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్‌బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్‌లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్‌తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్‌బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నాడు గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలిస్తున్నారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. తెలుగువారు ఎవరు?అలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. పోలీసుల గాలింపుకానీ అప్పటికే ఆమెపై కేసులు నమోదవగా పోలీసులు తనకోసం గాలింపు చేపట్టారు. కేసుల భయంతో కస్తూరి పరారీ అయినట్లు పోలీసులు భావించారు. మరోవైపు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.చదవండి: నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్ -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్‌లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్‌లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్‌తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
జాగ్రత్త అంటూ.. నయనతారకు మద్ధతుగా స్టార్ హీరోయిన్స్
ధనుష్‌పై ఆరోపణలు చేస్తూ నటి నయనతార ఈరోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, కోలీవుడ్ నుంచి చాలామంది స్టార్స్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్లు కూడా నయన్‌కు మద్ధతు తెలిపారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మాతగా నేనూ రౌడీనే అనే చిత్రం తీసిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలైంది.నయనతార జీవిత చరిత్ర డాక్యుమెంటరీలో ధనుష్ అనుమతి లేకుండా నేనూ రౌడీనే సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నారు. దీంతో కాపీ రైట్స్ చట్టం కింది తనకు రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ నోటీసులు పంపారు. దీంతో నయన్ ఫైర్ అవుతూ ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేసింది. చాలాకాలంగా తమపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపిస్తున్నావ్ అంటూ ధనుష్‌పై మండిపడింది. "నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది.' అంటూ ఫైర్ అయింది.నయనతారకు మద్ధతుగా స్టార్స్నయనతార చేసిన ఆరోపణలకు చాలామంది స్టార్స్ మద్ధతు ఇస్తున్నారు. ఆమె షేర్ చేసిన పోస్ట్‌కు శ్రుతిహాసన్, నజ్రియా, ఏక్తాకపూర్, ఐశ్వర్య లక్ష్మి, దియా మీర్జా, శిల్పారావు లైక్ కొట్టి తమ సపోర్ట్ తెలిపారు. తంగలాన్ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన మలయాళ నటి పార్వతీ తిరువొత్తు కూడా నయన్‌కు సపోర్ట్ చేసింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ.. నయన్ ధైర్యాన్ని మెచ్చుకుంది. స్మృతి కిరణ్ అనే దర్శకురాలు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయింది. ఈ సంఘటన చాలా బాధాకరం అంటూనే నయన్‌ను అభినందించింది. ఇలాంటి విషయాలు బయటపెట్టినప్పుడు పలు ఇబ్బందులు రావచ్చని కూడా సూచించింది. అయితే, ధనుష్‌కు భారీగా ఆయన ఫ్యాన్స్ మద్ధతు తెలుపుతున్నారు. వివాదాలు ఉంటే ఇలా ఒక అగ్ర హీరో గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారంటూ నయన్‌పై మండిపడుతున్నారు.