Nawaz Sharif
-
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్‌లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్‌ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్‌లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్‌గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్‌గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్‌కౌన్సిల్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. -
సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిన తీర్పు
పాకిస్తాన్ తర్వాతి ప్రధానిగా మరోసారి షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. నాలుగోసారి ప్రధాని అవుతారని భావించిన నవాజ్ షరీఫ్ ఉన్నట్టుండి తన సోదరుడు షెహబాజ్ పేరును ముందుకు తెచ్చారు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఇక, ఈ ఎన్నికలు పాక్‌లో సైన్యం ప్రాబల్యం తగ్గిందని సంకేతిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. ఆ దేశంతో మన సంబంధాలు సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండవు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ మనకు చాలా కీలకం. ఇస్లామిక్ రిపబ్లిక్ గమ్యానికి మధ్యవర్తిగా తన ప్రాబల్యాన్ని పాకిస్తాన్ సైన్యం రాను రానూ కోల్పోతోందని ఇటీవలే ముగిసిన ఆ దేశ ఎన్నికలకు చెందిన ఆశ్చర్యకరమైన ఫలితాలు సూచిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశాన్ని వాస్తవంగా నడిపిన మయన్మార్ సైన్యం... ఇప్పటి వరకూ ప్రజాస్వామ్య, వేర్పాటువాద శక్తులకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడుతూ వచ్చినప్పటికీ వెనుకపట్టు పడుతోంది. మన దేశ తూర్పు సరిహద్దులలో జరుగుతున్న దానితో పోలిస్తే పాకిస్తాన్ పరిణామాలు కూడా మరీ భిన్నమైనవేమీ కాదు. ప్రస్తుత తరుణంలో రాబోయే కాలంలో పాక్ రాజకీయాలు ఎలా రూపుదిద్దుకుంటాయో చెప్పడం కష్టమే. నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్– నవాజ్’(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’(పీపీపీ) కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్’ (పీటీఐ) మద్దతు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చినందున, పాలనా సామర్థ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్యలు అలాగే ఉంటాయి. ఇమ్రాన్ పార్టీని అణిచివేసేందుకు ఉద్దేశించిన చర్యలను ఆ పార్టీ నామినీలు అధిగమించి అత్యుత్తమ పనితీరు కనబరిచారు. అసమానతలకు వ్యతిరేకంగా వారు ప్రదర్శించిన పోరాట పటిమ మన దేశ ప్రతిపక్షానికి కూడా ప్రేరణగా ఉపయోగపడుతుంది. ఎన్నికల ఫలితాలను చూస్తే పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున పట్టు కోల్పోయిందని చెప్పవచ్చు. 2023 మే 9న ఇమ్రాన్ అరెస్టు తర్వాత, ఆయన పార్టీ మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, పాకిస్తాన్ పంజాబ్‌లోని సైనిక స్థావరాలపై కూడా దాడి చేసిన సంఘటనలను గుర్తు చేసుకోండి. ఈ పరిణామాలన్నీ భారత్‌కు ముఖ్యమైనవే. పాకిస్తాన్ ప్రభు త్వంతో మన సంబంధాలు తీవ్రమైన సుప్తావస్థలో ఉండవచ్చు. కానీ అవి ఎప్పటికీ అలాగే ఉండలేవు. పాకిస్తాన్ తనకుతాను మునిగిపోనీ లేదా తేలియాడనీ అని భావించేవారు నిజంగానే భ్రమలో ఉన్నారు. ఏ రకమైన ప్రపంచ శక్తిగా ఎదగడానికైనా సరే, ఉపఖండ శాంతి, ఆర్థిక ఏకీకరణ అనేవి మన భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. భారత్, పాకిస్తాన్ సంబంధాలు ఇటీవలి కాలంలో ఆసక్తికరమైన దశలో ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ జిహాదీల చొరబాట్లు, వారి దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి చేరువ కావడానికి ప్రయత్నించింది. ఈలోగా, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’(ఎఫ్ఏటీఎఫ్) ఒత్తిడితో, హఫీజ్ సయీద్(లష్కర్–ఎ–తైయబా సహ వ్యవస్థాపకుడు)కు పాక్ 31 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే (లష్కర్–ఎ–తైయబా మరో వ్యవస్థాపకుడు) జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి కూడా వరుసగా మూడు ఐదేళ్ల జైలు శిక్షలు విధించారు. ఇక, 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మీర్‌ను కూడా పాకిస్తాన్ ‘దొరికించుకుని’ దోషిగా నిర్ధారించింది. 2023 జనవరిలో, అప్పటి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీఫ్ తమ్ముడు) దేశంలో అంధకార స్థితి మధ్య ‘మేము మా గుణపాఠం నేర్చుకున్నాము. మా నిజమైన సమస్యలను పరిష్కరించు కోగలిగితే, మేము భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము’ అని ప్రకటించారు. కానీ మరుసటి రోజే, కశ్మీర్ రాజ్యాంగ హోదాను భారతదేశం పునరుద్ధరించనంత వరకూ ఎటువంటి సంభా షణా సాధ్యం కాదని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ తర్వాత, భారత ప్రభుత్వం ఆమోదించిన ఆర్టికల్ 370 రద్దును మన సుప్రీం కోర్ట్ సమర్థించింది. జమ్మూ – కశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కూడా పిలుపునిచ్చింది. కానీ అది కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లేని కొత్త సరిహద్దులను కలిగి ఉంటుంది. వాస్తవానికి, పుల్వామాలో సైనికులపై దాడి, ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ముందే, రెండు దేశాలు ఐఎస్ఐ(పాకిస్తాన్ గూఢచార సంస్థ) మాజీ డిప్యూటీ చీఫ్‌తోనూ, భారతీయ ఇంటెలిజెన్ ్స అధికారితోనూ తెరవెనుక సంభా షణను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. తర్వాత, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఒకానొక గల్ఫ్ దేశంలో అప్పటి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను కలిశారు. 2021లో ప్రధాని మోదీ పాకిస్తాన్ పర్యటనకూ, సింధ్‌లోని హింగ్లాజ్ మాతా ఆలయాన్ని సందర్శించడానికీ ప్రణాళికలు రూపొందాయి. కానీ అంతలోనే పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2022లో, ఆయన పదవి నుండి తొలగించబడ్డారు. మోదీ, నవాజ్ షరీఫ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఆ సంబంధాల సూత్రాలను ఎంచుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. 2015లో ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ మాతృమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు భారత ప్రధాని లాహోర్‌లో దిగి నప్పటి నుంచీ చాలా పరిణామాలే జరిగాయి. ముఖ్యంగా, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, తీవ్రవాద దాడి జరిగినప్పుడు పాక్‌పై దాడి చేయడానికి న్యూఢిల్లీ వెనుకాడదని స్పష్టంగా సూచించింది. భారత్ కంటే పాకిస్తాన్‌కే ఇప్పుడు శాంతియుత సరిహద్దు అవసరం. దాని ఆర్థిక పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది; జిహాదీ తీవ్రవాద ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది; అంతర్జా తీయ సమాజం దాని పగ్గాలను బిగించడానికి ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ను ఉపయోగిస్తోంది. పైగా, అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అధికార స్వీకారం నుండి ఆశించిన ప్రయోజనాలు కార్యరూపం దాల్చలేదు. బదులుగా ఇరాన్ తో పాకిస్తాన్ ప్రమాదకరమైన గొడవకు దిగింది. అమెరికా, చైనా తమ సొంత కారణాల వల్ల, పాకిస్తాన్ లో ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా, అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక ఆరోగ్యం చాలా అవసరం. కాబట్టే, ఈ రెండు దేశాలూ, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను మాత్రమే కాకుండా, పాక్–అఫ్గాన్ ప్రాంతం తీవ్ర వాదులకు పుట్టిల్లు కాకుండా ఉండే వాతావరణాన్ని కోరుకుంటు న్నాయి. తన బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్) పెట్టుబడులు ఉన్నప్పటికీ, తాను మాత్రమే పాకిస్తాన్ ఆర్థిక శ్రేయస్సుకు హామీ ఇవ్వలేననీ, ఇతర దేశాలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలనీ చైనా గ్రహించింది. అమె రికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉన్నదనీ, వాషింగ్టన్ కూడా పాక్‌లో లోతైన ప్రయోజనాలను కలిగి ఉందనీ కూడా చైనీయులకు తెలుసు. ఇస్లామిక్ స్టేట్ బలపడుతున్న అఫ్గాని స్తాన్‌లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి అమెరికాకు పాకిస్తాన్ ఒక ముఖ్యమైన సాధనం. సైనిక కోణంలో భారత్ విషయానికొస్తే, భారతదేశ చర్యలు గత మూడేళ్లలో పాకిస్తాన్ నుండి చైనా వైపు దృష్టిని మరల్చినట్లు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దును ప్రశాంతంగా ఉంచడం భారతదేశ ప్రయోజనాలలో భాగం. పాకిస్తాన్ మూలంలోనే పూర్తిగా గడబిడ ఉంటుంది. ఒక ఉన్నత స్థాయి బ్యాక్ ఛానల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి చర్చలు ప్రారంభించడమే మార్గం. ప్రబలమైన ఘర్షణను తగ్గించడం, రెండు దేశాల మధ్య సంబంధాలకు గానూ కొత్త విధానాన్ని రూపొందించడం తదుపరి కర్తవ్యం. మనోజ్ జోషీ వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్ షరీఫ్ (72)ను నామినేట్ చేశారు. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు తన ఎక్స్(ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. తమ అధినేత నవాజ్ షరీఫ్ షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మరియం తెలియజేశారు. అలాగే.. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. پاکستان مسلم لیگ (ن) کے قائد جناب محمد نوازشریف نے وزیراعظم اسلامی جمہوریہ پاکستان کے عہدے کےلئے جناب محمد شہبازشریف کو نامزد کر دیا ہے جبکہ وزیراعلی پنجاب کے عہدے کےلئے محترمہ مریم نوازشریف کو نامزد کیا ہے۔ جناب محمد نوازشریف نے پاکستان کے عوام اور سیاسی تعاون فراہم کرنے والی… — Marriyum Aurangzeb (@Marriyum_A) February 13, 2024 وزیر اعظم شہباز شریف وزیراعلیٰ مریم نواز pic.twitter.com/kW3MbqmRCv — Badar Shahbaz 🇵🇰🇵🇸 (@BSWarraich) February 13, 2024 పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto) నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. అయితే బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని పదవి ఆశిస్తున్నారని, ఇరు పార్టీలు ప్రధాని పదవిని పంచుకోవాలని వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో పాక్ ప్రధాని పదవి రేసు నుంచి పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో తాజాగా వైదొలిగినట్లు ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే.. ‘పీఎంఎల్-ఎన్’ ప్రధాని అభ్యర్థికి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదీ చదవండి: ప్రభుత్వంలో చేరబోం ఈ క్రమంలో షరీఫ్ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 265 స్థానాలున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్-ఎన్ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది. -
ప్రభుత్వంలో చేరబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుఖాయమైన వేళ బిలావల్ భిన్నమైన ప్రకటన చేశారు. తాము ప్రభుత్వంలో చేరట్లేదని, బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘‘ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు పొందటంలో మేం విఫలమయ్యాం. గెలిచిన సీట్ల సంఖ్యలో మేం మూడోస్థానానికే పరిమితమయ్యాం. అందుకే ప్రభుత్వంలో చేరొద్దని, ఏ మంత్రి పదవులూ స్వీకరించవద్దని మా పార్టీ నిర్ణయించింది. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని మేం కోరుకోవట్లేదు. దేశంలో రాజకీయ సుస్థిరతే మాకు ముఖ్యం’’ అని పార్టీ అత్యున్నత కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తర్వాత బిలోవల్ మీడియాతో చెప్పారు. దీంతో నవాజ్ షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి ప్రధా ట కావడం ఖాయమైంది. మరోవైపు కేంద్రంలో, రెండు ప్రావిన్సుల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఇమ్రాన్ నేతృత్వంపీటీఐ ప్రయత్నిస్తోంది. ఎండబ్ల్యూఎం పార్టీతో కలసి కేంద్రంలో, పంజాబ్ ప్రావిన్స్‌లో.. జమాతే ఇస్లామీ పార్టీతో కలిసి ఖైబర్–పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయతి్నస్తామని పీటీఐ పేర్కొంది. -
ఇంకా వుంది!
ఎక్కడైనా ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం. పాకిస్తాన్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోని ఇటీవలి 12వ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి, తాజా ఫలితాలు చూస్తే... ఎన్నికలు ముగిశాయి కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రమేమిటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లు ఇరువురూ ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవడం! ఇక, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్‌కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది. పోలింగ్‌కు ముందూ, తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్‌కు పాల్పడి ఎన్నికలను ప్రహస నంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని, ‘హైబ్రిడ్’ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్‌లో రిగ్గింగ్ సాగకుంటే, జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఇమ్రాన్‌కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ గద్దెనెక్కినా, కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది. ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒకపక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి, కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా, ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ)కు ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీతో జతకడితే తప్ప... సాంకేతికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడక పోవడం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టు వార్త. వేరొకపక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసి, జాతీయ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ... పాకిస్తాన్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు, చివరకు వాటి పర్యవసానాలు ఏమైనప్పటికీ... ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయడంలో పేరుమోసింది గనక ఎన్నికలు తూతూమంత్రమనీ, ప్రధాని ఎవరు కావాలన్నది మిలటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది. అందుకు తగ్గట్టే, గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్‌కు తరలివచ్చారు. వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి, ప్రస్తుతం దాని కరుణాకటాక్షాలకు దూరమైన ఇమ్రాన్, ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్‌లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. ఇమ్రాన్‌ను పోటీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్నా సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ, ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో నవాజ్ షరీఫ్ ‘పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ – నవాజ్’ (పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ) నిలిచాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడినా ప్రజాతీర్పు ఇమ్రాన్ వైపుందనేది స్పష్టం. దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. పీటీఐ సైతం తమ సమర్థనతో గెలిచినవారంతా పార్లమెంట్లో కలసి కట్టు కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా, ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగుదేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగడం వాంఛనీయం కాదు. రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో పీఎంఎల్, పీపీపీల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేర సారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది! ‘గులామీ న మంజూర్’ (బానిసత్వాన్ని సమర్థించబోము) అని వినిపిస్తున్న నినాదాల్నీ, మంగళవారం నుంచి పీటీఐ చేపట్టదలచిన నిరసనల్నీ కొట్టేయలేం. ‘ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైం’దన్న విమర్శల్ని నిజం చేస్తే అంత కన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం... పాకిస్తాన్ ప్రజల పాలిట శాపం. సరిహద్దు సమస్యలు, మరోమారు తలెత్తిన మతపరమైన హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికరంగ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్ కథ సశేషమే! -
Pakistan Elections 2024: సంకీర్ణం దిశగానే పాక్...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి. 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు. పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం. సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు. -
పాక్‌లో ఎన్నికల కౌంటింగ్.. ఈసీ కీలక నిర్ణయం
పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ పలు పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతోపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు సుమారు 93 స్థానాల్లో విజయం సాధించగా ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ఇప్పటి వరకు 256 స్థానాల్లో ఈసీ ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీల్లో సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్‌లో సంకీర్ణం..! -
పాక్‌లో సంకీర్ణం..!
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటికి కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రే పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు పీఎంఎల్, పీపీపీ అంగీకారానికి వచ్చాయి. మెజారిటీ సాధనకు 28 స్థానాల్లో నెగ్గిన చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం శనివారమంతా జోరుగా మంతనాలు సాగాయి. నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. అయితే ప్రధానిగా బిలావల్కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది! కాకపోతే సైన్యం దన్ను నవాజ్‌కు కలిసొస్తుందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపుకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం విశేషం. ‘‘రాజకీయ సుస్థిరత పాక్‌కు తక్షణావసరం. అందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని శనివారం ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు! నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్‌కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. యథేచ్ఛగా అక్రమాలు! మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
పాక్ ప్రధాని పదవికి నవాజ్ రెండు ప్లాన్లు?
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక అంచనాకు వచ్చాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులకు భారీ ప్రజా మద్దతు లభించింది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 99 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ‘నూన్ లీగ్’గా పేరొందిన నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’కి చెందిన 71 మంది ఎంపీల విజయంతో ఇది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పాక్‌లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితులు తలెత్తడంతో నవాజ్ షరీఫ్ తాజాగా రెండు ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ ‘ఏ’ నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన సోదరుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను సహాయకునిగా నియమించారు. ఇతను ఇప్పటికే ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టోతో మంతనాలు జరిపారు. వీరు లాహోర్‌లోని షరీఫ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు. దీనితోపాటు నవాజ్ షరీఫ్ మరికొన్ని పార్టీలతో మ్యాజిక్ ఫిగర్ రాబట్టేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్లాన్ ‘బి’ మరోవైపు నవాజ్ షరీఫ్ 60 మంది స్వతంత్ర ఎంపీలతో టచ్‌లో ఉన్నారని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎంపీలు తెలిపారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు నవాజ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. -
Pakistan General Elections 2024: పాకిస్తాన్లో హంగ్
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో హంగ్ నెలకొంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టికీ స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు. పోరు ఏకపక్షమేనని, సైన్యం దన్నుతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) విజయం ఖాయమని వెలువడ్డ ముందస్తు అంచనాలన్నీ తలకిందులయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్థాపించిన పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం రాత్రికల్లా ఫలితాల సరళి దాదాపుగా ముగింపుకు వచ్చింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. మరో 27 స్థానాల ఫలితాలు వెల్లడవాల్సి ఉంది. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 336 కాగా 266 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. మహిళలకు, మైనారిటీలకు రిజర్వు చేసిన 70 సీట్లను పార్టీలు గెలుచుకునే స్థానాల ఆధారంగా వాటికి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మృతి నేపథ్యంలో ఈసారి 265 స్థానాల్లో పోలింగ్ జరగ్గా ఇప్పటిదాకా 238 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారులే ఫలితాలను పీఎంఎల్‌కు అనుకూలంగా మార్చేస్తున్నారని పీటీఐ దుమ్మెత్తిపోస్తోంది. లాహోర్ స్థానంలో చాలాసేపటిదాకా వెనకబడి ఉన్న నవాజ్ చివరికి మంచి మెజారిటీతో నెగ్గినట్టు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాహోర్‌లోని మరో మూడు స్థానాల్లో ఆయన కూతురు, సోదరుడు, మరో బంధువు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే మరో స్థానంలో మాత్రం పీటీఐ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో నవాజ్ ఓటమి చవిచూడటం విశేషం. ఈ నేపథ్యంలో పీటీఐ ప్రదర్శనను షరీఫ్ అభినందించడం విశేషం. కాకపోతే పీఎంఎల్ అత్యధిక స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టిగా అవతరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. పీటీఐ చైర్మన్ గోహర్ ఖాన్ మాత్రం ఏ పార్టితోనూ పొత్తు పెట్టుకోబోమంటూ కుండబద్దలు కొట్టారు. స్వతంత్రులుగా నెగ్గిన ఆ పార్టీ అభ్యర్థులకు ఎర వేసి లాక్కునేందుకు పీఎంఎల్ జోరుగా ప్రయతి్నస్తోందని వార్తలొస్తున్నాయి. -
నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల వేళ నెలకొన్న గందరగోళం నడుమ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చారు. అశేష సంఖ్యాక మద్దతుదారుల నడుమ.. తమ పార్టీ పీఎంఎల్-ఎన్(పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్) ఘన విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. అయితే.. పాక్ ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయకముందే.. షరీఫ్ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాదు.. అత్యధిక స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుందని తెలిపిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం లేదని, సంక్షోభంతో గాయపడ్డ పాక్‌ను పునరుద్ధరించేందుకు మిగతా పార్టీలు ముందుకు రావాలని.. ప్రభుత్వ ఏర్పాటులో సహకరించాలని కోరడం గమనార్హం. ఇందుకోసం పీపీపీ(Pakistan Peoples Party) నేత పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారినీ సైతం ఆయన ఆహ్వానించారు. అంటే పాక్ ఎన్నికల ఫలితాలు దాదాపు హంగ్ అనే సంకేతాను షరీఫ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రపంచంతో సంబంధాలు బలోపేతం కోసం త్వరలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారాయన. #WATCH | Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "...We want our relations with the world to be better...We will improve our relations with them and resolve all our issues with them..." (Video: Reuters) pic.twitter.com/MJbxcV2Dox — ANI (@ANI) February 9, 2024 Lahore | Former Pakistan PM and Pakistan Muslim League (N) leader Nawaz Sharif says, "We congratulate you all because, with God's blessings, Pakistan Muslim League (N) has emerged as the largest party...We respect the mandate given to every party...We invite them to sit with us… pic.twitter.com/im2DqIDeRG — ANI (@ANI) February 9, 2024 కానీ, ఎన్నికల్లో పీఎల్‌ఎం-ఎన్ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందనేది షరీఫ్ స్పష్టంగా చెప్పలేదు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు రావాలి. అయితే.. పాక్ ఈసీ ప్యానెల్లో మాత్రం పీఎంఎల్-ఎన్ 61 స్థానాల దగ్గరే ఉందని తెలుస్తోంది. అయితే పాక్‌లో ఎన్నికల ఫలితాలపై.. ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం ఒక స్పష్టత రావొచ్చు. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ పీటీఐ మద్దతుదారులు(స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి) అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నట్లు రోజంతా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ మాత్రం ఇటు షరీఫ్ ప్రకటనను.. అటు ఇమ్రాన్ మద్దతుదారుల ప్రకటనను దేనిని ధృవీకరించకపోవడం గమనార్హం. సంబంధిత వార్త: నెట్ కట్ చేస్తే.. ట్విస్టులు.. ఝలక్‌లు -
పాక్ కౌంటింగ్ వేళ.. ట్విస్టులు, ఝలక్‌లు!!
పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వినియోగించకుండా అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్‌కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ వెనుకంజలో ఉందని(షరీఫ్ మాత్రం గెలిచారు).. ఖాన్ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్-ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. Social media is flooded with hundreds of such rigging videos. What other evidence could there be than a present on-duty police officer involved in rigging? #ElectionResultspic.twitter.com/eps8QWQ9WX — Usama Butt 🇵🇰 🇬🇧 (@OsamaAhmedButt) February 9, 2024 పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. I have never seen visuals like these in Bahawalpur in my whole life - not even on 9th May.#ElectionResults pic.twitter.com/yU0fumVsEM — نورالہدی 🇵🇰 (@raqsyjunoon) February 9, 2024 ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. یہ توقع نہیں تھی کہ ہماری فوجی جوان اس ناکارہ عمل کا کھلم کھلا حصہ بنے گے pic.twitter.com/sp8yWUuyfC — Sabir Shakir ARY 𝓯𝓪𝓷𝓼 (@ARYSabiirShakir) February 9, 2024 కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్‌టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్‌లో ఇదీ పరిస్థితి అంటూ నెట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత అనుకూల వైఖరి గెలిపించేనా?
అనుకున్నట్టే జరిగితే, 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగాలి! ఇప్పుడున్న అంచనా ప్రకారం, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. ప్రధానిగా మూడు దఫాలు కూడా పదవీకాలం ముగియకుండానే ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో చెబుతున్న షరీఫ్ ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు కూడా ఆయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా కాదు. మిలిటరీ, న్యాయవ్యవస్థ రెండూ కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని ఎలా పడదోశాయో వివ రిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో ఉన్న పరిస్థితులు, 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్ ) పార్టీని దృష్టిలో పెట్టుకుంటే ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. ఇంకో రెండు నెలల్లో, అంటే 2024 ఫిబ్రవరిలో అక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు మిలిటరీ, ఇటు నవాజ్ షరీఫ్ అంగీకరిస్తున్న విషయం ఏదైనా ఉందీ అంటే అది మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలన్నది! భారత్‌లోనే ఎక్కువ ఆసక్తి ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, షరీఫ్ ప్రకటనలకు పాక్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించడం. ఎందుకిలా? పాకిస్తాన్లో అధికార పక్షానికి భిన్నంగా చేసే వ్యాఖ్యలు, వార్తలు సెన్సార్‌కు గురవుతాయి కాబట్టి అని కొందరు అంటారు. అయితే, పాకిస్తాన్ లో చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. మీడియా కూడా వాటిని జనానికి చేర్చుతుంటుంది. కానీ ప్రధాన మీడియా వర్గాలు ముట్టుకోకూడదనుకున్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. బహుశా మనం దూరం నుంచి పాక్ వ్యవహారాలను గమనిస్తూంటాం కాబట్టి... మన దృష్టంతా అక్కడ మిలిటరీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న వివాదాలపైనే ఉంటుంది. నవాజ్ షరీఫ్ ఇలాంటి విషయాల్లో పాతికేళ్లుగా కేంద్ర బిందువుగా నిలిచారు. ప్రధానిగా ఉన్న మూడు దఫాలు కూడా పదవీ కాలం ముగి యకుండానే వేర్వేరు కారణాల వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. మిలిటరీ కుట్రలు లేదా మిలిటరీ–న్యాయవ్యవస్థ కుమ్మక్కులతో అన్నమాట! పాకిస్తాన్లో షరీఫ్ ఇటీవలి ప్రకటనలను కొంచెం భిన్నమైనదృష్టితో చూస్తారేమో. నవాజ్ షరీఫ్ నడిపే రాజకీయాలకు ఇలాంటి ప్రకటనలే ఆధారం. ఇందులో సందేహం ఏమీ లేదు. మిలిటరీ వ్యతి రేకతను ఒక అంశంగా నిత్యం ఉంచుతారు ఆయన. కానీ రాజకీయ వైచిత్రి ఏమిటంటే, ఇప్పుడు మిలిటరీతో కలిసిపోయి అధికారంలోకి వచ్చేందుకు షరీఫ్ ప్రయత్నిస్తూండటం! ఇమ్రాన్ ఖాన్ తప్పటడు గులు, అతడి అనుచరుల చేష్టల పుణ్యమా అని షరీఫ్, మిలిటరీ మధ్య రాజీ కుదిరిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం షరీఫ్ ఒక రకమైన ఇబ్బందికరమైన స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఒకవేళ ప్రజల్లో మిలి టరీపై వ్యతిరేకత అంటూ ఉంటే దాని ఫలాలు అనుభవించేది ఇమ్రాన్ ఖానే అవుతాడు కానీ షరీఫ్ కాదు. ఈ నేపథ్యంలోనే భారత్‌తో సంబంధాల విషయమై షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగాకొంత ప్రాధాన్యం ఏర్పడుతోంది. అలాగని షరీఫ్ గద్దెనెక్కగానే అంతా సమూలంగా మారిపోతుందని కూడా ఏమీ కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎన్నికల సీజన్ , అంతే! మార్పులపై తీవ్రమైన అంచనాలు! పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏవో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలైతే బల పడుతున్నాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే పాక్‌లోనూ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. ఇప్పు డున్న సాధారణ అంచనా ప్రకారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్ ) మెజారిటీ సాధిస్తుంది. షరీఫ్‌ను నాలుగోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమైందని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే జైల్లో ఉన్న ఈ మాజీ ప్రధానికి చెందిన పార్టీ ముక్కలు ముక్కలై ఉంది. పార్టీలో ఒకప్పుడు దిగ్గజాలుగా ఉన్నవారు ఇప్పుడు మాకేంసంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరు గతంలో ఇమ్రాన్ వైపు మొగ్గిన సందర్భంలోనూ మిలిటరీకి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. వీరిని మినహాయిస్తే మిగిలిన మద్దతు దారులు అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎందరు ఎన్నికల్లో పోటీకి దిగుతారన్నది కూడా అనుమానమే. ఇంకోపక్క ఈ వాదనకు ప్రతివాదనలు రెండు వినిపిస్తున్నాయి. ఏవీ కొట్టిపారేసేవి కాదు. అవేమిటంటే... ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందన్న అంశం మొదటిది. ఆయన ఆశీస్సులున్న నేతలు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారన్నది రెండో విషయం. నవాజ్ షరీఫ్ చరిత్రను తరచి చూస్తే అతడేమంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆర్మీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవి చాలాకాలంగా ఉన్నవే. గతంలో ఇమ్రాన్ ఖాన్ కు చేసినట్లే ఇప్పుడు కూడా నవాజ్‌కు అడ్డంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ తొలగిస్తే గతానుభ వాలు మళ్లీ ఎదురు కావన్న గ్యారెంటీ ఏమిటని ఆర్మీ వర్గాల్లో కొందరు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది చెబుతున్నదేమిటంటే... వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ రాదూ, హంగ్ ఏర్పడుతుందీ అని! తద్వారా పగ్గాలు ఆర్మీ ఆధీనంలోనే ఉంటాయని భావిసు ్తన్నారు. ఆసక్తికరమైన ఇంకో విషయం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ రెండు వాదనలకు బలం చేకూరుతూండగానే... అసలు ఎన్నికలే జరగవన్న మూడో వాదన కూడా మొదలైంది. ఒకవేళ జరిగినా అవి ఫిబ్రవరిలో కాకుండా, బాగా జాప్యం తరువాతేనని అంటున్నారు. అసలు విషయాలు వేరే... ఇప్పటివరకూ చెప్పుకొన్న అంచనాలు ఎన్నికలు జరిగేంతవరకూ కొనసాగడం గ్యారెంటీ. కానీ వీటిన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎదు ర్కోవాల్సిన సవాళ్లు ఇవి. దయనీయ స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వీటిల్లో ఒకటైతే, అంతర్గత భద్రత రెండోది. అఫ్గానిస్తాన్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతూండటం కూడా పాక్‌కు ఒక సవాలే. వచ్చే ఏడాది పాక్ భవిష్యత్తును నిర్ణయించేవి ఈ మూడు అంశాలే అన్నా అతిశయోక్తి లేదు. నవాజ్ షరీఫ్ ప్రకటనల్లో భారత్ ప్రస్తావన తరచూ వస్తోంది. పైగా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి కాదు. సానుకూలంగా ఉన్నవే. భారత్‌తో కనీస స్థాయి సంబంధాలు కలిగి ఉండాలన్న వాదన వినిపించే భారమిప్పుడు ఈయనే మోస్తున్నారని చెప్పాలి. ఇది షరీఫ్ బలమని కొందరి నమ్మకం. కొందరు బలహీనతగానూ చూస్తున్నారు. ఈ చర్చలో మనమూ భాగస్వాములం కాగలమా? ఎన్నికల ఫలితాల తరువాత కానీ అర్థం కాదు. భారత్, పాక్ సంబంధాలిప్పుడు కీలక దశలో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈసారి ఉగ్రవాదం, కశ్మీర్, వ్యూహాత్మకంగా ఇరుదేశాల మధ్య ఉన్న అపనమ్మకం వంటివి మును పటిలాగానే సమస్యను పీటముడి స్థాయికి తీసుకొచ్చాయి. ఇరువైపుల నుంచి చొరవ, చేతలు రెండూ ఉంటేగానీ ఈ పీటముడి విడిపడదు. ఒక్కటైతే నిజం. ఈ పీటముడి పూర్తిగా విడిపోకపోయినా, కనీసంకొంత వదులుగానైతే తప్పకుండా మారాలి. ఈ దిశగా భారత దేశమే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. దక్షిణాసియా రాజకీయాల్లో, భారత పాకిస్తాన్ చరిత్రలోనూ ఇదేమీ తెలియని అంశమైతే కాదు. - టి.సి.ఎ. రాఘవన్ వ్యాసకర్త పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట: పోటీకి మార్గం సుగమం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వచ్చే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం అయినట్లుగా కనిపిస్తోంది. గతంలో అల్-అజీజియా కేసులో ఆయనకు పడ్డ ఏడు సంవత్సరాల జైలు శిక్షను అక్కడి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో మూడు అవినీతి కేసుల్లో రెండు ప్రత్యేక కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. బ్రిటన్‌లో నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం ఆయన తాజాగా స్వదేశం తిరిగి రావడం తెలిసిందే. ఏడాది ఎన్నికలలో నిలబడాలనేది ఆయన లక్ష్యం. దీని వెనక సైన్యం మద్దతుందని వార్తలొచ్చాయి. అల్–జజీజియా కేసులో 2018లో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల శిక్ష పడింది. మూడేళ్ల జైలు జీవితం తర్వాత చికిత్స కోసమని లండన్ వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. దాంతో ఆయనను పారిపోయిన ఖైదీగా ప్రకటించారు. -
పాకిస్తాన్‌కు షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (73) నాలుగేళ్ల స్వీయ ప్రవాసం అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. జనవరిలో సాధారణ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో శనివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ నుంచి బయల్దేరి ఇస్లామాబాద్ చేరుకున్నారు. కోర్టుకు సమరి్పంచాల్సిన బెయిల్ పత్రాలపై సంతకం తదితరాల అనంతరం అదే విమానంలో లాహోర్ వెళ్లి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. తన తల్లి, భార్య రాజకీయాలకు బలయ్యారని గుర్తు చేసుకుంటూ భా వోద్వేగానికి లోనయ్యారు. వారి చివరిచూపుకూ నోచుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
'భారత్ చంద్రున్ని చేరితే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోంది'
ఇస్లామాబాద్: భారత్ చంద్రమండలంపైకి వెళ్తుంటే.. పాక్ పక్క దేశాలను అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌ను పాలించిన గత ప్రధానులు అవినితీకి పాల్పడి.. దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేశారని ఆరోపించారు. ' పాకిస్థాన్ ప్రధాని నిధులు సమకూర్చండని పక్క దేశాలను అడుక్కుంటున్నారు. మన పక్కనే ఉన్న భారత్.. చంద్రమండలంపైకి వెళ్లింది. జీ20 వంటి ప్రపంచ సమ్మిట్లకు వేదికగా మారింది. పాక్ ఎందుకు సాధించలేదు. ఈ దుస్థితికి కారణం ఎవరు..? వాజ్‌పేయీ కాలంలో భారత్ వద్ద నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. అదే ప్రస్తుతం వారి నిల్వలు 600 బిలియన్ డాలర్ల వరకు చేరాయి.' అని లాహోర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుంచి మాట్లాడారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దిగజారిపోతోంది. పేద ప్రజలకు తిండి పెట్టలేని దుస్థితికి చేరింది. ద్రవ్యోల్భణం రెండంకెల సంఖ్యకు చేరింది. పాకిస్థాన్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జులైలో ఐఎంఎఫ్‌కు 1.2 బిలియన్ అమెరికా డాలర్లను సమకూర్చింది. నవంబర్ 2019లో, నవాజ్ షరీఫ్‌కు అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. వైద్య కారణాలతో దేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21న ఆయన పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. లాహోర్‌కు రాకముందే ఆయనకి రక్షిత బెయిల్ మంజూరు చేస్తామని PML-N పార్టీ చెబుతోంది. యూకే నుంచి తిరిగి వచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించనున్నారని పార్టీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
మా పార్టీ గెలిస్తే మా అన్నే పీఎం: షెహబాజ్
ఇస్లామాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్–ఎన్) మరోసారి విజేతగా నిలిచిన పక్షంలో తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడతారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. లండన్‌లో గడుపుతున్న నవాజ్ çస్వదేశానికి త్వరలో వస్తారన్నారు. సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా తటస్థుడిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేస్తామన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయమై భాగస్వామ్య పార్టీలతోపాటు, పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపాక నిర్ణయిస్తామని తెలిపారు. -
స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..
పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. చట్ట సభ్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం. ఇదీ చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. బ్రిటన్‌లో నవాజ్ షరీఫ్.. అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్‌పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మళ్లీ రాజకీయాల్లోకి.. గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్ -
నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల కోసం పార్టీ తరపున ప్రచారాన్ని ముందుండి నడిపించాలని, అంతేగాక నాలుగోసారి పాక్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పీఎంఎల్ఎన్ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తన అన్నయ్య నవాజ్ షరీఫ్ రాక కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. పాక్‌కు తిరిగి వచ్చి పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ఎన్నిక ప్రచారానికి నాయకత్వం వహించాలని కోరారు. PML-N అధ్యక్షుడి బాధ్యతలను తిరిగి అతనికి అప్పగిస్తానని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ పాక్‌కు తిరిగి వచ్చాక రాజకీయాల మ్యాప్ మారుతుందని తెలిపారు. కాగా పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సుప్రీంకోర్టు రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ అండ్ ఆర్డర్స్ యాక్ట్ 2023పై సంతకం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ షెహబాజ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇది 60 రోజుల్లోగా నవాజ్ షరీఫ్ తనజీవితకాల అనర్హతలకు వ్యతిరేకంగా అప్పీల్ హక్కును వినియోగించుకోవడానికి మొదటి దశను క్లియర్ చేస్తుంది. ఈ కొత్త చట్టం ద్వారా ఆర్టికల్ 184(3) ప్రకారం కేసుల్లో కోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయవచ్చు. గతంలో ఇచ్చిన తీర్పులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ పనామా షరీఫ్‌పై పేపర్ల కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు జూలై 28, 2017న అనర్హత వేటు వేసింది. అతడిని జీవితకాలం ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఏడాది తర్వాత,ఎన్నికల చట్టం 2017ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును ప్రకటిస్తూ.. ఆర్టికల్ 62, 63 ప్రకారం అనర్హత వేటు పడిన ఏ వ్యక్తి కూడా రాజకీయ పార్టీ అధినేతగా పనిచేయలేరని కోర్టు పేర్కొంది. దీంతో PML-N అధ్యక్షుడిగా షెహబాజ్ షరీఫ్ చేపట్టారు. కాగా ఆరోగ్య కారణాల రీత్యా నవాజ్ షరీఫ్ నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
భారత వ్యతిరేకతే రాజకీయ అస్త్రం
భారత్‌తో రెండుసార్లు యుద్ధం జరిగేందుకు ఓపికగా ఎదురుచూసిన, మిలిటరీ జనరళ్లతో కలిసి కుట్రలు పన్నిన జుల్ఫికర్ అలీ భుట్టో ఆ తరువాతి కాలంలో మన దాయాది పాకిస్థాన్ అధ్యక్షుడు అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పుడు 51 ఏళ్ల తరువాత ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి, జుల్ఫికర్ అలీ భుట్టో మనుమడు బిలావల్ భుట్టో జర్దారీ కూడా అచ్చం అలాంటి కుట్రలే పన్నుతున్నట్లుగా కనిపిస్తోంది. భారత ప్రధానిని ‘గుజరాత్ కసాయి’గా బిలావల్ విమర్శించినప్పటికీ అది సొంతింటి శక్తులపై ఎక్కుపెట్టిన అస్త్రంగానే చూడాలి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ, భుట్టో–జర్దారీల పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండూ కలిసి పాకిస్తాన్‌ను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు... ఈ రెండు పార్టీలూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తగిన సంబంధాలు ఏర్పరచుకున్నాయి. కార్గిల్ యుద్ధంతో చెలరేగిన ఘర్షణపూర్వక వాతావరణాన్ని కొద్దిగానైనా తేలికపరిచేందుకు ఈ సంబంధాలు ఉపయోగపడతాయని ఆ రెండు పార్టీలూ భావిస్తూండవచ్చు. నరేంద్ర మోదీ బహూకరించిన తల పాగాతో నవాజ్ షరీఫ్ తన కుటుంబ వివాహంలో కనబడటం ప్రాచుర్యం పొందిన అంశమే. పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీర్ ఈ మధ్యే పదవీచ్యుతుడైన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పట్ల సానుకూలత కలిగిన వాడని అటు అక్కడి కిందిస్థాయి అధికారులతోపాటు భారతీయ నిఘా వర్గాలూ భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మునీర్ స్వయంగా ఖండించినప్పటికీ ఇమ్రాన్‌కు సంబంధించిన సెక్స్ టేపులు సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడం ఒక సందేశమనే అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా, షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కూలిపోయే స్థితిలో ఉందనీ తెలుసు. షాబాజ్‌ను తప్పించడం సైనిక జనరళ్లకు పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే ఆయన స్థానంలో నవాజ్, ఆయన కుమార్తె మరియం పాక్ రాజకీయాల్లో ప్రధాన భూమిక వహించే ప్రమాదం ఉంటుంది. భారత్‌తో సంబంధాలు, భద్రత విషయాల్లో సైన్యంతో తగవు పెట్టుకున్నందుకే నవాజ్ పదవి పోయిందన్నది బహిరంగ రహస్యం. అలాగే మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్‌ను జైలుకు పంపించేందుకు నవాజ్ చేసిన ప్రయత్నాలను కూడా సైన్యం అంత సులువుగా క్షమించలేకపోతోంది. వీటన్నింటి సారాంశం ఒక్కటే... పాకిస్తాన్లో అధికారం తమ చెప్పుచేతుల్లో ఉండే వ్యక్తికి అందాలి. ఈ అవకాశాన్ని వాడుకునే లక్ష్యంతోనే బిలావల్ భుట్టో తన తాత జుల్ఫికర్ అలీ భుట్టో ఆడినట్లుగానే జాతీయవాదాన్ని తలకెత్తుకుంటున్నారు. తద్వారా సైన్యానికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు. వెయ్యేళ్ల యుద్ధం? 1965 భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారత సేనలు లాహోర్‌కు కిలోమీటర్ల దూరంలో ఉండగా, జుల్ఫికర్ అలీ భుట్టో ఐరాస భద్రతా సమితిలో ఓ భారీ ప్రసంగం చేశారు. ‘‘భారత్‌తో వెయ్యేళ్ల యుద్ధం చేస్తాం’’ అని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రసంగం పాక్ ప్రజలను ఉత్తేజపరిచింది. పాక్ అప్పటికే ఓడి పోయిందనీ, భవిష్యత్తు గెలుపు కలనే మంత్రి రేడియో రూపంలో అందిస్తున్నారనీ పాపం ప్రజలకు తెలియరాలేదు. అయితే ప్రధానిగా జుల్ఫికర్ అలీ భుట్టో కొత్త అవతారం ఎత్తాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య వాదిగా మారినట్లు కనిపించడం ద్వారా ఆయన 1965, 1971 యుద్ధాల ఓటమిని ప్రజలు మరచిపోయేలా చేయగలిగారు. పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు ఉన్న అవకాశం కాస్తా 1958 నాటి మిలిటరీ కుట్రతో తుడిచిపెట్టుకుపోయింది. దీని వెనుక కూడా జుల్ఫికర్ హస్తముందని అంచనా. హుసేన్ సుహ్రావర్దీ (1956 – 57 ప్రధానమంత్రి) లాంటి తూర్పు పాకిస్తాన్ నేతలు ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకున్నారని జుల్ఫికర్ అప్పట్లో వాదించారు. రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనే విప్లవం పుట్టుకొచ్చిందనీ, అన్నిం టినీ చక్కదిద్దాల్సి వచ్చిందనీ మిలిటరీ కుట్రను సమర్థించుకున్నారు. 1965లో కశ్మీర్ విషయంలో భారత్‌తో యుద్ధానికి జనరల్ అయూబ్‌ను రెచ్చగొట్టింది కూడా జుల్ఫికరే. కోవర్టు దళాల ద్వారా భారత్‌పై దాడి చేస్తే అది సంప్రదాయ పద్ధతుల్లో తిప్పికొట్ట లేదని జనరల్ అయూబ్‌కు నూరిపోశారు. ‘‘అస్సాంలోని నాగాలు, లుషియాలను, పంజాబ్‌లోని సిక్కులనూ రెచ్చగొట్టి యుద్ధానికి దిగాలి’’ అని కూడా జుల్ఫికర్ చెప్పుకున్నారు. ఇది కాస్తా అయూబ్‌పై ప్రభావం చూపింది. అయితే యుద్ధంలో ఈ అంచనాలన్నీ తారు మారవడంతో జుల్ఫికర్ దీనివెనుక అమెరికా హస్తముందన్న కొత్త రాగం అందుకున్నారు. ఆ తరువాత 1966 ప్రాంతంలో జుల్ఫికర్ కుట్రలు బట్టబయలయ్యాయి. ఉద్యోగమూ పోయింది. జైల్లో బంధింపబడ్డారు. అయితే జైల్లో అష్టకష్టాలు పడ్డానని చెప్పుకోవడం జుల్ఫికర్ను ప్రజల దృష్టిలో హీరోను చేసింది. తూర్పు పాకిస్తాన్ సంక్షోభం మిలిటరీ ప్రభుత్వపు రీతులతో విసుగు చెందిన పాక్ ప్రజలు జుల్ఫికర్ రూపంలో ఓ హీరోను చూసుకున్నారు. అందుకే 1970లో జుల్ఫికర్ మావో టోపీ, గ్రీన్ జాకెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశారు. ఇస్లాం, సోషలిజం రెండింటినీ కలగలిపి పాకిస్తాన్‌ను రక్షిస్తామని ప్రచారం చేశారు. ముల్లాలను సంతృప్తి పరిచేందుకుగానూ ఇస్లాం కోసం ‘జిహాద్’కు దిగుతామనీ, పాకిస్తాన్లో మాత్రమే కాకుండా... ప్రపంచ అంతటా ఇది సాగుతుందనీ నమ్మబలికారు. ‘‘భారత్‌లో ముస్లింల రక్తం చిందుతూంటే చేతులు కట్టుకుని ఉండం’’ అని ప్రకటించారు. ఫీల్డ్ మార్షల్ అయూబ్ స్థానంలో అప్పటికి ఏడాది క్రితమే జనరల్ యాహ్యాఖాన్ అత్యున్నత పదవిలోకి చేరారు. జనరల్ యాహ్యాఖాన్ కూడా ‘‘దేశం మళ్లీ ప్రజాస్వామ్యం పట్టాలెక్కడం చూడాలని కుతూహలంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. అయితే, తూర్పు పాకిస్తాన్లో జనాభా ఎక్కువ. అక్కడ ఎన్నికల్లో విజయం సాధించడం అధికారాన్ని మరింత దగ్గర చేస్తుంది. 1970లో షేఖ్ ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ ఏకంగా 160 సీట్లు సాధించగా, జుల్ఫికర్ పార్టీ 81 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ అధికారం కోల్పోయేందుకు జుల్ఫికర్ ఏమాత్రం అంగీకరించలేదు. సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందా మని ప్రతిపాదించారు. తద్వారా తాను పశ్చిమ పాకిస్తాన్ ప్రధానిగా కొనసాగవచ్చునని ఆశించారు. జనరల్ యాహ్యాఖాన్ ఈ వాదనను వ్యతిరేకించారు. జుల్ఫికర్ ప్రతిపాదనను అంగీకరిస్తే తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లకు అధికార పంపిణీ చేయాల్సి ఉంటుందని భావించారు. ముజీబ్‌కు అధికారాన్ని నిరాకరించడం ద్వారా జుల్ఫికర్ జనరల్ యాహ్యాఖాన్ ఆందోళనను నిజం చేశారు. తూర్పు పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగడం, భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు పెరగడంతో ముజీబ్ వ్యతిరేకి నూరుల్ అమీన్‌కు పగ్గాలు అప్పగించి, జుల్ఫికర్ను డిప్యూటీ ప్రధానిని చేశారు. పదమూడు రోజుల కాలానికి జల్ఫికర్ మిలిటరీ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ అధికారం చేపట్టారు. ఈ ముచ్చట ఎక్కువ కాలం నిలవకపోగా పాకిస్తాన్ రెండుగా చీలిపోయేందుకు కారణమైంది. ఇప్పుడు కూడా జుల్ఫికర్ తనను తాను రక్షకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘హిమాలయాల కంటే పొడవైన వాణ్ణి నేను’, ‘నాక్కొంచెం సమయం ఇవ్వండి’ అంటూ పాకిస్తాన్ ప్రజలతో గొప్పలుపోయారు. యుద్ధంలో ఓటమికి జనరల్ యాహ్యా ఖాన్ కారణమనీ, అతడి తాగుడు, తిరుగుబోతుతనం వల్లే భారత్‌తో ఓడామనీ ప్రచారంలో పెట్టారు. ఢాకా న్యాయవాది హుస్నా షేఖ్‌తో తన సొంత వ్యవహారాన్ని మాత్రం కప్పిపుచ్చారు. నెహ్రూ సోదరి విజయ లక్ష్మీ పండిట్ కుమార్తె రీటా దార్ పట్ల జుల్ఫికర్ చేసిన, ప్రజాబాహుళ్యంలోకి ఎక్కువగా రాని అసభ్య వ్యాఖ్యలను స్టాన్లీ వోల్పెర్ట్ గ్రంథస్తం చేశారు. జుల్ఫికర్ అలీ భుట్టో పిచ్చి చేష్టలు చాలానే ఉన్నాయి. జనరల్ జియా ఉల్ హక్‌ను విదేశీ అతిథుల ముందు ‘నా కోతి’ అని వ్యాఖ్యా నించి హేళన చేయడం వాటిల్లో ఒకటి. వీటి ఫలితమే ఆర్థి కంగా దేశం చితికిపోయిన సందర్భంలో ఆ ‘కోతి’ కాస్తా జుల్ఫికర్ను ఉరికొయ్య లకు వేలాడదీసేలా చేసింది. తన తాత మాదిరిగానే ఇప్పుడు బిలావల్ కూడా జాతీయవాదం, మిలిటరీ జనరళ్ల కృపా కటాక్షాల ఆధారంగా రాజకీయంగా పైమెట్టుకు ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల ఒరిగే ఒక ఫలితం ఏమిటంటే, పాకిస్తాన్ రాజకీయ యవనికపై మిలటరీ పట్టు మరింత బిగుసుకోవడం! వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’
Imran Khan wanted to clean sweep the entire opposition leadership: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఖాన్ 15 ఏళ్లు తానే పాలన సాగించేలా ఫాసిస్ట్ ప్లాన్లు వేస్తున్నారని పాక్ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిరి ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అహ్సాన్ ఇక్బాల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీతో సహా మొత్తం ప్రతిపక్ష నాయకత్వాన్నే ఇమ్రాన్ ఖాన్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఇమ్రాన్ ఖాన్ కూడా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులను వేగవంతం చేసేందకు సుమారు 100 మంది న్యాయమూర్తి నియమిస్తానని బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ దేశం పై దాడి చేసేలా ఫాసిస్ట్ ప్లాన్లు కలిగి ఉన్నందునే సంకీర్ణం ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు పాక్ మాజీ మంత్రి అలీ హైదర్ జైదీ స్పందిస్తూ...రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కుట్ర ద్వారా తొలగించినట్లు ఖుర్రం దస్తగిర్ బహిరంగంగానే అంగీకరించాడని చెప్పారు. అవినీతి కేసుల నుంచి ప్రతిపక్షాలను కాపాడేందుకు ఇలా చేశారు. ఈ దుండగులు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేయాలని చూస్తుండటం బాధాకరం అన్నారు. అంతేకాదు ఖాన్ కూడా రష్యా, చైనా మరియు అఫ్గనిస్తాన్‌ల స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తాను ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓటమిని ఎదుర్కొన్నానని అన్నారు. పైగా ఖాన్ ఇది యూఎస్ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దిగుమతి చేసుకున్నదని, పాకిస్తాన్‌కి ఆయన నిజమైన ప్రతినిధి కాదంటూ ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. (చదవండి: ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్ ప్లాంట్ భారీ పేలుడు...ఒకరు మృతి) -
ఇమ్రాన్ ఖాన్‌పై మరియం షరీఫ్ సంచలన ఆరోపణలు.. చివరి క్షణం వరకూ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తను పదవిలో ఉన్న చివరి నిమిషం వరకు పాకిస్థాన్ ఆర్మీని వేడుకున్నాడని అన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు. అవిశ్వాసంపై ఓటింగ్‌ను వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్ అన్నారు. లాహోర్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్‌కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ తిరిగి వస్తే ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్ క్రికెట్ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్‌తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు. చదవండి👉 పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి కాగా మూడుసార్లు పాకిస్థాన్‌కు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌షరీఫ్ కూతురే మరియం షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో నవాజ్‌పై అనేక అవినీతి కేసులు పెట్టించాడు. అయితే లాహోర్ హై కోర్టు అనుమతితో 2019 నవంబర్‌లో చికిత్స కోసం లండన్ వెళ్లారు. ప్రస్తుతం పాక్‌లో అధికారంలోకి వచ్చిన పీఎమ్ఎల్ ప్రభుత్వం నవాజ్‌కు కొత్త పాస్‌పోర్టు అందించి అతన్ని దేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం చేసింది. కాగా 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌కు షెబాష్ షరీఫ్‌కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా నిలిచారు. చదవండి👉 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో.. -
అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలి!
Nawaz Sharif Allegedly Attacked in UK: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ కుట్రకు వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో ఆందోళన చేయాలని పాకిస్తాన్ యువతని కోరారు. మరోవైపు యూకెలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దాడి జరిగింది. షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్త దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ మీడియా శనివారం వెల్లడించింది. దీంతో నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకురాలు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ ఖాన్ని అవిశ్వాస తీర్మానానికి ముందే అరెస్టు చేయాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి అని అన్నారు. ఆదివారం ఇమ్రాన్‌ఖాన్ ప్రభత్వం పై జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందే నవాజ్ షరీఫ్ పై దాడి జరగడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా దానికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముడిపెట్టాడని విమర్శించారు. తమ పార్లమెంట్ కమిటీ కూడా ఆ పత్రాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ట్విట్టర్లో.. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ అన్ని హద్దులు అతిక్రమంచింది. శారీరక దాడిని సహించం. నవాజ్ షరీఫ్ పై జరిగిన దాడిలో ఆయన బాడీగార్డు గాయపడ్డాడు. నిందితులను సత్వరమే పట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి. (చదవండి: అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?) -
పాక్ మాజీ ప్రధానికి షాక్.. బ్రిటన్ విడిచి వెళ్లాల్సిందే
లండన్ : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. వీసా పొడిగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే హోం ఆఫీస్ తిరస్కరించింది. అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉంటున్నారని, నవాజ్ షరీఫ్ బ్రిటన్ విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, 71 ఏళ్ల నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్ వైద్య చికిత్స కోసం లాహోర్ కోర్టు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వచ్చారు. ఇక అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. అయితే, ఇతర దేశాల వారు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం బ్రిటన్‌లో ఉండటానికి వీలు లేదు. వీసా గడువును వంతుల వారీగా పెంచుకుంటూ ఆయన అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీసా గడుపు పొడిగింపు తిరస్కరణపై షరీఫ్ తరపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. లండన్‌లో ఆయన చికిత్సను కొనసాగించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామన్నారు. బ్రిటీష్ ఇమిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లామని తెలిపారు. -
నవాజ్ షరీఫ్‌కు బిన్ లాడెన్ ఆర్థిక సాయం
ఇస్లామాబాద్: అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆర్థిక సాయం అందిస్తుండేవాడని అమెరికాలో పాక్ మాజీ రాయబారి సయీదా అబిదా హుస్సేన్ తాజాగా బయటపెట్టారు. ఆమె గతంలో నవాజ్ షరీఫ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ‘‘అవును, లాడెన్ ఒక విషయంలో నవాజ్ షరీఫ్‌కు మద్దతిచ్చాడు. అదొక సంక్లిష్టమైన కథ. అంతేకాకుండా నవాజ్ షరీఫ్‌కు లాడెన్ తరచుగా ఆర్థిక సాయం అందిస్తుండేవాడు’’ అని సయీద్ అబిదా హుస్సేన్ ప్రైవేట్ న్యూస్ చానెల్ జీయో టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011 మేలో పాకిస్తాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. -
బాత్రూమ్లోనూ కెమెరాలు : మాజీ పీఎం కుమార్తె
ఇస్లామాబాద్ : తనను నిర్భందించిన జైలు గది సహా బాత్రూమ్లోనూ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ గతేడాది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలె పాకిస్తాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..తాను రెండుసార్లు జైలు జీవితం గడిపానని,ఈ సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించింది. ఓ మహిళగా తనతో ఎలా వ్యవహరించారు అన్నదానిపై మాట్లాడితే, వారికి ముఖాలు చూపించే ధైర్యం కూడా ఉండదంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ ) ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని (పిటిఐ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లేదా మరెక్కడైనా మహిళలు బలహీనులు కాదన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుత పిటిఐ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగిస్తే, రాజ్యాంగ పరిధిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు. తాను వ్యవస్థలకు వ్యతిరేకం కాదని, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పిడిఎం) వేదిక ద్వారా చర్చలకు సిద్ధమని పునరుద్ఘాటించింది. మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. (మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు -
ఇమ్రాన్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. తక్షణమే ఆయన రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో 'పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్' అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు ఆదివారం ప్రకటించాయి. ఈ మేరకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నిర్వహించిన ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ (ఏపీసీ) 26 పాయింట్ల ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్తాన్ ముస్లిమ్స్ లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), జామియాత్ ఉలేమా-ఈ-ఇస్లాం ఫాజల్ (జేయూఐ-ఎఫ్)తో పాటు అనేక ఇతర పార్టీలు దీనిలో పాలుపంచుకున్నాయి. అనంతరం విలేకరుల సమావేశంలో జామియాత్ ఉలేమా-ఈ-ఇస్లాం(జేయూఐ-ఎఫ్) చీఫ్ మౌలానా ఫజ్ల్-ఉర్-రెహమాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికైన ప్రధానమంత్రి ఇమ్రాన్ అహ్మద్ నియాజీని వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. వీటిలో న్యాయవాదులు, వ్యాపారులు, కార్మికులు, రైతులు పౌర సమాజం పాల్గొనడం జరుగుతుంది’ అన్నారు. (చదవండి: ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు) అంతేకాక ‘మొదటి దశలో, అక్టోబర్‌లో సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, పంజాబ్‌లలో ర్యాలీలు జరుగుతాయి. రెండవ దశలో, డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరుగుతాయి. ఇక మూడవ దశలో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో ఇస్లామాబాద్ వైపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం’ అని రెహామాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించటానికి, ఉమ్మడి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం, పార్లమెంటు రాజీనామాలతో సహా అన్ని వ్యూహాలను ఉపయోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావాల్ భుట్టో జర్దారీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీల మార్గదర్శకత్వం, మద్దతుతో ప్రతిపక్షాలు ముందుకు వెళ్తాయని నొక్కి చెప్పారు. అయితే, ఉద్యమ నాయకుడిని ఇంకా నిర్ణయించలేదన్నారు బిలావాల్. (చదవండి: ఇమ్రాన్ లాడెన్‌ను కీర్తిస్తారా..!) అంతకుముందు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్‌లో వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీల పోరాటం ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదని తనలాంటి "అసమర్థ" వ్యక్తిని అధికారంలోకి తెచ్చిన వారిపైన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘మా పోరాటం ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా కాదు. తనలాంటి అసమర్థ వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడానికి (2018 లో) ఎన్నికలను తారుమారు చేసి దేశాన్ని నాశనం చేసినవారిపై మా పోరాటం’ అని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో శక్తివంతమైన పాక్ సైన్యం ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని, జాతీ పితా ముహమ్మద్ అలీ జిన్నా రాజ్యాంగాన్ని, దూరదృష్టిని అనుసరించడానికి అవకాశం కల్పించాలని కోరారు. అవసరమైతే ఆర్మీతో యుద్ధానికి సైతం వెనకాడమన్నారు షరీఫ్. పాకిస్తాన్ సైన్యం దాదాపు 70 సంవత్సరాలకు పైగా దేశాన్ని ఏలుతోంది. అంతేకాక దేశ భద్రత, విదేశాంగ విధానం వంటి విషయాలలో గణనీయమైన స్థాయిలో అధికారం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. -
నవాజ్ షరీఫ్‌కు అరెస్టు వారంట్
ఇస్లామాబాద్: లండన్‌లో వైద్యకోసం ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ప్రభుత్వం అరెస్టు వారంట్లు జారీ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు పాక్ ప్రభుత్వం.. లండన్‌లోని పాక్ హైకమిషనర్‌కు వీటిని పంపింది. హైకమిషనర్ వీటిని ఈనెల 22వ తేదీలోగా నవాజ్‌కు అందజేయాల్సి ఉంటుంది. అల్ అజీజియా మిల్స్ కేసులో 2018లో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆయనకు 8 వారాలపాటు లండన్ వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చింది. అయితే, ఆయన గడువు పొడిగించాలంటూ పెట్టుకున్న అర్జీని ఇటీవల కోర్టు తోసిపుచ్చింది. ఆయన్ను ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.(చదవండి: నవాజ్ షరీఫ్ ఫొటోలు లీక్!) -
నవాజ్ షరీఫ్ ఫొటోలు లీక్!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లండన్‌లో కుటుంబ సమేతంగా టీ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో లీకయింది. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే లండన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతున్న దృష్యాన్ని చూసి షరీప్ అనారోగ్యం కారణం చూపి లండన్ వెళ్లారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి సలహాదారుడు షాహబాద్ గిల్ విమర్శించారు. ఆరోగ్యంగానే ఉన్నా విదేశాల్లో గడుపుతూ.. నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. షరీఫ్ ప్రజలను ముర్ఖులుగా భావిస్తున్నారని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన వెంటనే పాకిస్తాన్‌కు వచ్చి దర్యాప్తు సంస్థలకు సహరించాలని డిమాండ్ చేశారు. షరీఫ్ మద్దతుదారులు తమ నాయకుడి ఆరోగ్యం బాగుందంటూ సంతోషంగా ఉన్నారని.. మరి దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి షరీప్ ఎందుకు సంకోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా షరీఫ్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. కొందరు షరీఫ్‌ను అవమానించాలనే ఆయన ఫోటోలను విడుదల చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. షరీప్ తీవ్ర గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారిని.. పాక్ ప్రభుత్వ వైద్యుల సూచన మేరకే లండన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఆయనకు జరగాల్సిన ఆపరేషన్ వాయిదా పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం -
మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసేందుకు పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) డైరెక్టర్ జనరల్ షహ్జాద్ సలీం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్‌తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్‌తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు ఈ రెండు కేసులను ఎన్ఏబీ లాహోర్ ఛైర్మన్ జస్టిస్ (ఆర్) జావేద్ ఇక్బాల్ అనుమతి కోసం పంపనున్నుట్లు అధికారులు తెలిపారు. ‘షరీఫ్ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసులు ఎన్ఏబీ చైర్మన్ ఆమోదం పొందిన తరువాత వచ్చే వారం లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయబడతాయి’ అని ఒక అధికారి పీటీఐకి చెప్పారు. ‘జియో’ గ్రూప్ గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు ట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. -
నవాజ్ షరీఫ్‌కు బెయిల్
లాహోర్: అనారోగ్యంతో బాధపడుతున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆయన రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య ప్రమాదకర స్థా యికి తగ్గడంతో సోమవా రం రాత్రి ఆయనను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూ రో(ఎన్ఏబీ) కార్యాల యం నుంచి లాహోర్‌లోని సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత అయిన నవాజ్ షరీఫ్ అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సోదరుడు షాబాజ్ పెట్టుకు న్న పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం రూ.రెండు కోట్ల విలువైన రెండు సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. నగదు అక్రమ చెలామణీ కేసులో షరీఫ్ ఎన్ఏబీ అదుపులో ఉన్నారు. -
నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
లాహోర్ : పనామా పేపర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లాహోర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ పర్మిటెన్స్ కింద నవాజ్ షరీఫ్‌కు లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు అధికారులు షరీఫ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్‌కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
మరో అవినీతి కేసులో షరీఫ్‌కి ఏడేళ్ల జైలు శిక్ష
-
నవాజ్ షరీఫ్‌కు మరో ఏడేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్(69)కు మరో ఏడేళ్ల జైలు శిక్ష పడగా మరో కేసులో నిర్దోషిగా బయటపడ్డారు. షరీఫ్‌పై మిగిలి ఉన్న చివరి రెండు అవినీతి కేసుల్లో ఈ నెల 19వ తేదీతో వాదనలు పూర్తి చేసిన జవాబుదారీ న్యాయస్థానం(అకౌంటబిలిటీ కోర్టు) సోమవారం తీర్పు చెప్పింది. ‘అల్ అజీజియా కేసులో షరీఫ్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. దుర్వినియోగమైన ప్రభుత్వ ధనం ఏమయిందో ఆయన చెప్పలేకపోయారు. దీంతో ఆయనకు రూ.17.50 కోట్లు జరిమానా విధిస్తున్నాం’ అని జడ్జి ముహమ్మద్ అర్షద్ మాలిక్ తన తీర్పులో పేర్కొన్నారు. 2017 నుంచి అకౌంటబిలిటీ కోర్టుల్లో కొనసాగుతున్న విచారణకు నవాజ్ షరీఫ్ సుమారు 165సార్లు హాజరైనట్లు డాన్ పత్రిక తెలిపింది. -
మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలు శిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక న్యాయస్థానం సోమవారం షాకిచ్చింది. అల్అజీజియా మిల్స్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్లు జైలు శిక్షతో పాటు 25 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేక పోయారని కోర్టు పేర్కొంది. -
చైనా సాయంతో ఆరు నెలల్లో...
ఇస్లామాబాద్ : యూటర్న్లు తీసుకున్న వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలా చేయనందువల్లే హిట్లర్, నెపోలియన్ లాంటి మహామహులు సైతం ఓటమిని చవిచూడక తప్పలేదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. చైనాతో తమ దేశానికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు చైనా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఇమ్రాన్ తెలిపారు. తమకు విడుదల చేస్తున్న నిధుల గురించి బయటి ప్రపంచానికి చెబితే సాయం కోసం మిత్ర దేశాలన్నీ చైనాపై మరింత ఒత్తిడి చేస్తాయని పేర్కొన్నారు. అందుకే ఈ విషయాలేవీ వెల్లడించడం లేదన్నారు. తన చైనా పర్యటన గురించి ప్రస్తావిస్తూ... జిన్‌పింగ్‌ను కలవడం ద్వారా పాక్- చైనా బంధం మరింత బలపడిందని పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధానులెవరూ సాధించలేనిది తాను సాధించానని.. చైనా సాయంతో వచ్చే ఆరు నెలల్లో తమ దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. బ్రిటన్, స్విట్జర్లాండ్లతో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. మంచి జరగుతుందంటే తాను యూటర్న్ తీసుకోవడానికి వెనుకాడబోనని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లాగా తనకు అబద్ధాలు చెప్పే స్వభావం మాత్రం లేదన్నారు. ఓ క్రికెటర్‌గా మైదానంలో ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి వారిని చిత్తు చేసేందుకు ఎటువంటి పంథాను అనుసరించారో.. రాజకీయాల్లో కూడా అదే విధానాన్ని అవలంబించి విజయం సాధిస్తానని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. -
షరీఫ్ కోర్టుకు రావాల్సిందే
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఊరట పొందిన షరీఫ్‌ను.. లాహోర్ హైకోర్టు రాజద్రోహం కేసులో అక్టోబర్ 8వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఓ ఇంటర్వ్యూలో ముంబై దాడుల గురించి మాట్లాడినందకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో ఆయన డాన్ పత్రికతో మాట్లాడుతూ.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని పరోక్షంగా అంగీకరించారు. దాడులకు పాల్పడింది పాక్ ఉగ్రవాదులేనని తెలిపారు. పాక్‌లో ఉగ్రవాదులు కదలికలు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై అమీన్ మాలిక్ అనే మహిళ కోర్టును ఆశ్రయించారు. ‘2017లో సుప్రీం కోర్టు షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. అయినా ముంబై దాడులో పాక్ ప్రమేయం ఉందని మాట్లాడి షరీఫ్ దేశద్రోహానికి పాల్పడ్డాడ’ని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన లాహోర్ హైకోర్టు ఈ కేసులో డాన్ జర్నలిస్టు సిరిల్ ఆల్మైడాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కానీ అతడు కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 8న అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పంజాబ్ డీఐజీని ఆదేశించింది. షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంపై కూడా ఆయన న్యాయవాది నాసిర్ భుట్టోను ప్రశ్నించింది. దీనికి నాసిర్ ఆయన తదుపరి వాయిదాకు హాజరవుతారని తెలిపారు. భార్య చనిపోవడం వల్ల ఆయన బాధలో ఉన్నట్టు వివరించారు. అక్రమాస్తులు కేసులో శిక్షలు అనుభవిస్తున్న షరీఫ్‌తోపాటు, ఆయన కుటుంబసభ్యులకు విధించిన జైలు శిక్ష రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు గతవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. -
నవాజ్ జైలు శిక్ష రద్దు : పాక్ కోర్టు తీర్పు
ఇస్లామాబాద్: అవినీతిలో కేసులో జైలుపాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. అవెన్‌ఫీల్డ్ కేసులో జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ హై కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత వారం, లండన్‌లో కాన్సర్‌తో చనిపోయిన షరీఫ్ భార్య, కుల్సోంకు అంత్యక్రియల నిమిత్తం నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె 5 రోజుల పెరోల్ మీద విడుదలయ్యారు. తాజా తీర్పుతో వీరిద్దరితోపాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్దార్ విడుదల కానున్నారు. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ కోర్టు రద్దు చేసింది. వీరు చట్టాల్ని ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి ఎలాంటి రుజువు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్లు, మరియం నవాజ్‌కు 8 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. అల్లుడు కెప్టెన్ సఫ్దార్ కూడా ఈ కేసులో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రూ.5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న ముగ్గుర్ని రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ ఏడాది జూలై ఆరో తేదీన అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్‌లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది. -
కుల్సుమ్ ఒక్కసారి కళ్లు తెరవవా
-
ఒక్కసారి కళ్లు తెరు: మాజీ ప్రధాని భావోద్వేగం
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుమ్ నవాజ్ (68) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో గడిపిన చివరి క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంత దేశ ప్రధాని అయినా ఒకరికే భర్తేకదా.. నవాజ్ షరీఫ్ భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియోలో తన భార్య కోసం ‘కుల్సుమ్ ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు.. ఆ అల్లా నీకు శక్తిని ప్రసాదించాలి’ అంటూ ఉర్దూలో ఆయన మాట్లాడిన చివరి మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై 11 ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో లండన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో చివరిసారిగా మాట్లాడారు. లభించిన పెరోల్.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నవాజ్‌కు 12 గంటల పెరోల్ లభించింది. అక్రమాస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న నవాజ్ భార్య మరణం విషయం తెలిసి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అనుమతినిచ్చింది. రావల్పిండిలోని అదియాల జైలులో నవాజ్‌తో పాటు శిక్షను అనుభవిస్తున్న ఆయన కుమార్తె మర్యం నవాజ్, అల్లుడ సప్ధర్‌లకు కూడా పెరోల్ లభించింది. అక్కడి నుంచి వీరిని అంత్యక్రియల జరిగే జతి ఉమ్రాకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. కుల్సుమ్ మరణవార్తతో పాకిస్తాన్‌లోని నవాజ్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని సైతం లండన్ నుంచి ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు తరలించారు. -
పాకిస్తాన్ మాజీ ప్రధాని భార్య మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సుమ్ షరీఫ్ మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. 2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఈ మేరకు పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ ప్రెసిడెంట్ షహాబాజ్ షరీఫ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 1950లో పాకిస్తాన్లో జన్మించిన కుల్సుమ్ 1971లో నవాజ్ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్, ఆమె కుమార్తె మరియమ్ రావాల్పిండిలోని అదిలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతికి పలువురు పాకిస్తాన్ జాతీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. -
షరీఫ్ ఓటమిని భరించలేని భారత గ్రామం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించాలని భారత ప్రభుత్వం కోరుకుందంటూ కాబోయే పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో నిజమెంతుందో తెలియదుగానీ భారత్‌లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం మనస్ఫూర్తిగా నవాజ్ షరీఫ్ పార్టీ విజయాన్ని కోరుకున్నారు. అదే పంజాబ్ రాష్ట్రంలోని టార్న్ తరణ్ జిల్లా, జటి ఉమ్రా గ్రామం. నవాజ్ షరీఫ్ పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు. దేశ విభజనకు ముందు షరీఫ్‌లు ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. గ్రామంలోని షరీఫ్‌ల ఇల్లు గురుద్వార్‌గా మారింది. నవాజ్ షరీఫ్ తాత మియాన్ ముహమ్మద్ బక్ష్ సమాధి ఇప్పటికీ ఈ గ్రామంలో ఉంది. నవాజ్ షరీఫ్ పూర్వీకులతో ఈ గ్రామానికి ప్రత్యక్ష సంబంధం ఉండడంతో భారత్ రాజకీయాలతో పాటు పాక్ రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఈ గ్రామం అభివృద్ధిలో షరీఫ్‌ల పాత్ర ఉండడమే అందుకు కారణం కూడా. నవాజ్ షరీఫ్ తమ్ముడు, పాక్ పంజాబ్ రాష్ట్రం ముఖ్యమంత్రి షాహ్బాజ్ షరీఫ్ 2013లో ఈ గ్రామన్ని సందర్శించారు. గ్రామం పరిస్థితిని చూసి ఆయన బాధ పడ్డారు. గ్రామం అభివద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా మన పంజాబ్ రాష్ట్రం అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు పాక్ పంజాబ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కూడా ప్రకాష్ సింగ్ బాదల్ సిద్ధమయ్యారు. అది వివాదాస్పదం అవడంతో మానుకున్నారు. అయితే షాహ్బాజ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలోని అన్ని రూట్లకు రోడ్డు వేశారు. నవాజ్ షరీఫ్ తాత సమాధి వద్దకు వెళ్లేందుకు వీలుగా కూడా ఓ ప్రత్యేక రోడ్డు వేశారు. మురుగునీరు పోయేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నైట్ షెల్టర్, ఓ మినీ స్టేడియంను కూడా గ్రామంలో నిర్మించారు. షరీఫ్ కుటుంబానికి చెందిన గల్ఫ్ కంపెనీల్లో ఈ గ్రామానికి చెందిన దాదాపు 25 మంది యువకులకు కూడా ఉద్యోగాలిచ్చారు. మళ్లీ గ్రామం బాగోగుల గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో అప్పుడేసిన రోడ్లు పాడయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. నవాజ్ షరీఫ్ సమాధి శిథిలమయింది. ఆ ప్రాంతంలో అంతా గడ్డి మొలచింది. గ్రామం అభివృద్ధికి నిధులను కేటాయించకపోవడమే ఈ దుస్థితికి కారణమని గ్రామ పెద్ద దిల్బాగ్ సింగ్ సాంధు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధిస్తే ఆయన మరోసారి తమ గ్రామాన్ని సందర్శిస్తారని, తద్వారా తమకు మంచి రోజులు రావచ్చని టార్న్ తరణ్ ప్రజలు ఆశించారు. పాపం వారి ఆశలు అడియాశలయ్యాయి. -
ఎన్నికల ఫలితాలపై నవాజ్ షరీఫ్ స్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. ప్రస్తుతం అడియాలా జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ఎన్నికలు దొంగిలించి బడ్డాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మలినమైన ఫలితాల్ని చూడాల్సి వచ్చిందన్నారు. తాజా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో చెడు సంకేతాలకు నిదర్శమన్నారు. అడియాలా జైల్లో నవాజ్ షరీఫ్‌ను పరామర్శించడానికి వచ్చిన అభిమానులతో ముచ్చటించిన ఆయన ఎన్నికలు జరిగిన తీరును మొదలుకొని, ఫలితాల వరకూ తనదైన విశ్లేషించారు. అసలు ఎన్నికలే సరిగా జరగలేదన్న షరీఫ్.. ఫైసలాబాద్, లాహోర్, రావల్పిండిల్లో తమ అభ్యర్థులు అత్యంత నిలకడను ప్రదర్శించినా చివరకు ఓటమితో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరొకవైపు పీటీఐఈ మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. చదవండి: పాక్ ఫలితాలు: ఈసీ అధికారిక ప్రకటన -
ముమ్మాటికీ రిగ్గింగే..! పీఈసీపై సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్: తీవ్ర ఉద్రిక్తలు, ఘర్షణల మధ్య ముగిసిన పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓవైపు పాకిస్తాన్‌తో సహా పొరుగుదేశం భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇమ్రాన్‌ఖాన్ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ (పీటీఐఈ) మినహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నాయి. రిగ్గింగ్.. రిగ్గింగ్..!! నవాజ్ షరీఫ్ జైలుపాలు కావడంతో అతని తమ్ముడు షాబాజ్‌ఖాన్ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’ (పీఎంఎల్-ఎన్) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి పీఎంఎల్-ఎన్ను అధికారంలోకి తేవడమే కాకుండా జైలుపాలైన నవాజ్ షరీఫ్‌కు ఊరట కలిగిద్దామనుకున్న షాబాజ్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాత్రి లాహోర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పీటీఐ పార్టీ మెరుగైన స్థానంలో ఉండడానికి కారణం రిగ్గింగేనని చెప్తున్నారు. నిస్సిగ్గుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి అధికారంలోకి వచ్చే పీటీఐతో దేశం మరో ముప్పయ్యేళ్లు వెనక్కి పయనిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెంట్లు లేకుండా ఎలా..! పోలీంగ్ బూత్‌ల నుంచి తమ పార్టీ ఏజెంట్లు బలవంతంగా బయటకు గెంటేశారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మండిపడింది. ఓట్ల లెక్కింపులో సైతం అక్రమాలు చోటుచేసుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేసింది. చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలు నమ్మేట్టుగా లేవని అంటున్నాయి. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. మరోవైపు 111 పైగా స్థానాల్లో మంచి ఆధిక్యంలో నిలిచిన పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ పగ్గాలు చేపట్టడం ఖాయమని ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
కెప్టెన్ సెన్సేషన్.. ప్రత్యర్థులు విలవిల
ఇస్లామాబాద్: సానూభూతి గాలి పని చేయలేదు.. అధికారంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఊహించని రీతిలో సత్తా చాటుతున్న పీటీఐ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులేస్తోంది. పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 272 స్థానాలకుగానూ ఎన్నికలు జరగ్గా.. దాదాపు 120 సీట్ల ఆధిక్యంతో పీటీఐ దూసుకుపోతోంది. ఇమ్రాన్ దెబ్బకు పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎమ్‌లు విలవిలలాడిపోతున్నాయి. ఇమ్రాన్ ఘనత.. ఇదిలా ఉంటే ఫలితాల్లో మాజీ క్రికెట్ స్టార్ ఇమ్రాన్‌ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించారు. మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆయన ఘన విషయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా పీఎంఎల్-ఎన్ పార్టీ కంచుకోటగా ఉన్న రావల్పిండిలో ఇమ్రాన్ జెండా ఎగరేయటం చర్చనీయాంశంగా మారింది. అధికారం దిశగా ఫలితాలు పీటీఐకు అనుకూలంగా వస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సయీద్‌కు షాక్.. గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. సయీద్ ‘అల్లాహో అక్బర్‌తెహరిక్ పార్టీ’ని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈ పార్టీ మద్ధతుదారులు కొందరు ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా, వాళ్లు మాత్రం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. NA-3 స్వాట్‌లో షరీఫ్ సోదరుడు, పీఎంఎల్-ఎన్ ప్రెసిడెంట్ షెబాజ్ షరీఫ్ ఓటమి పాలయ్యాడు. అక్కడ పీటీఐ అభ్యర్థి సలీం రెహమాన్ జయకేతనం ఎగరవేశాడు. NA-200 లార్కానా లో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో వెనకంజలో ఉన్నారు. ఎంఎంఏ రషీద్ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బిలావల్ తండ్రి అసిఫ అలీ జర్దారీ NA-213 నవాబ్షా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మొత్తం 272 స్థానాలకు గానూ ఎన్నికలు జరగ్గా, మ్యాజిక్ ఫిగర్ 137. ఒకవేళ పీటీఐకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే మాత్రం.. ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఫలితాలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అవకతవకల ఆరోపణలపై స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి ముహమ్మద్ రాజా వాటిని ఖండించారు. ఫలితాలు ఆలస్యం కావటం వెనుక ఎలాంటి ఒత్తిడి లేదని.. కేవలం సాంకేతిక సమస్యల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. సాయంత్రంకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. -
పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ దూకుడు
-
పాక్ ఎన్నికల ఫలితాలు: అప్డేట్స్
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రదాడుల నడుమ కొనసాగిన పాకిస్తాన్ ఎన్నికలు ముగిశాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్’, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మేజిగ్ ఫిగర్ 172 సీట్లు సాధించిన పార్టీ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అధికారం పీఠం అధిరోహించనుంది. ఇక ఈ రెండు పార్టీలకు తగిన మెజార్టీ రానిపక్షంలో బిలావల్ భుట్టో జర్దారీ ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. కాగా, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. పాకిస్తాన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో.. ఏ పార్టీ పరాజయం వైపు పయనిస్తుందో.. ఎప్పటికప్పుడు ఇవిగో వివరాలు...! పార్టీలు: ఆధిక్యం+ గెలుపు ఇమ్రాన్‌ఖాన్: పీటీఐ 120 నవాజ్ షరీఫ్: పీఎంఎల్-ఎన్ 61 అసిఫ్ అలీ జర్దారీ: పీపీపీ 40 స్వతంత్రులు, ఇతరులు 51 చిత్తుగా రాసిచ్చారా..!! ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పుకొంటున్న పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫారం 45పై ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాల్సిందిపోయి అధికారులు చిత్తు కాగితంపై రాసిచ్చారు. ఒక స్టాంపు వేసి ఆ కాగితాన్ని అధికారికం చేసేశారు. ఈ వార్త ఎన్నికల అధికారుల పనితీరుకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #PakistanElections2018 As per rules,Election Commission of Pakistan(ECP)officials are bound to provide results on Form 45,instead results were handed out on plain paper in Khi&Hyderabad. As per latest unofficial trends on ARY news,PTI leading on 114 seats,PMLN-63 seats& PPP on 42 pic.twitter.com/rxFEosfG1p — ANI (@ANI) July 26, 2018 ఫలితాలు ఆలస్యం.. పాక్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి సర్దార్ ముహమ్మద్ రజాఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అన్నారు. ముందుగా అనుకున్న సమయానికి ఫలితాలను వెల్లడించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 47 శాతం ఓట్ల లెక్కింపు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఇంతకుముందు ఆయన పేర్కొనడం గమనార్హం. చదవండి: పాక్ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు భారత్‌కు మున్ముందు ముప్పే! ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే పక్కలో తుపాకే! -
‘నటులనే మించిన నటుడు మాజీ ప్రధాని’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా బాగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు ఫిల్మ్ స్టార్స్ కూడా పనికిరారని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఒక్క అమెరికా డాలర్ మన 5 రూపాయలకు సమానం. ఇప్పుడు 130 పాక్ రూపాయలైంది. కానీ షరీఫ్ కుటుంబం మాత్రం దేశాన్ని దోచుకుని విదేశాలకు వెళ్లిపోయిందని’ పేర్కొన్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు మెరుగు పడాలంటే పీటీఐకి ఓట్లేసి విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ఎన్నికల నేపథ్యంలో తాను అమాయకుడినని తెలియ జెప్పేందుకు నవాజ్ షరీఫ్ చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదియాలా జైల్లో తమను దోమలు కుడుతున్నాయని షరీఫ్, ఆయన కూతురు మర్యమ్ చెబుతున్నారని.. ఏసీల సౌకర్యం లేకపోతే వారు ఉండలేరని ఈ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారిద్దరూ చాలా బాగా నటిస్తున్నారని, సినిమాల్లో సైతం మనం ఇలాంటి నటనను చూడలేమన్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌ల కంటే కూడా కైబర్ కనుమలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కైబర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని, 9 వేల మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. 50 కొత్త కాలేజీలు, 10 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణలు రావడం, పీఎంఎల్–ఎన్ నేత షరీఫ్ జైల్లో ఉండటం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికా బానిస కొడుకులకు, మోదీ స్నేహితులకు..
‘‘అమెరికా బానిస కొడుకులకు, నరేంద్ర మోదీ స్నేహితులకు ఓటేయాలని నిర్ణయించుకున్నట్టయితే, మీ గొయ్యిని మీరు తవ్వుకున్నట్టే’’ అంటూ ఓటర్లను హెచ్చరిస్తున్నాడు ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్! రాజకీయ ముసుగేసుకుని ఈ నెల 25న జరిగే పాకిస్తాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఇతగాడు.. 265 మందిని పోటీకి పెట్టాడు. ‘‘అమెరికా మద్దతు ఉన్న అఫ్గానిస్తాన్‌లో భారత్ తిష్టేసింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌ను చీల్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోంది’’ అంటూ విషప్రచారం సాగిస్తున్నాడు. నిషేధిత/ఉగ్ర గ్రూపుల ప్రతినిధులు పాక్‌లో భారీగా పోటీకి దిగారు. సైన్యం మద్దతుతో పెట్రేగిపోతున్నారు. భారత్‌తో శాంతి సంబంధాల గురించి మాట్లాడుతున్న పీఎంఎల్ (ఎన్)ను పక్కకు తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారి పాత్రధారీ సైన్యమే. పాకిస్తాన్‌తోపాటు భారత్‌కూ అత్యంత అపాయకరమైన ఈ పరిణామాలపై ఓ పరిశీలన. ఔరంగజేబ్ ఫరూకీ.. పాకిస్తాన్లో మతం పేరిట హింసను ప్రేరేపిస్తున్న ఓ నిషేధిత ఉగ్రవాద గ్రూపు నాయకుడు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా షియా కార్యకర్తల హత్యలకు కారకుడయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో ఇతడు పోటీ చేస్తున్నాడు. ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపులతో సంబంధ బాంధవ్యాలున్న అనేక మంది అభ్యర్థుల్లో ఫరూకీ కూడా ఒకడు. మిలిటెంట్లతో ఫరూకీ గ్రూపునకు సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఓ కోర్టు అతడి పోటీకి అనుమతించింది. ఫరూఖీ సహా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు ఉగ్రవాద నిఘా జాబితా (ఉగ్ర నిరోధక చట్టంలోని ఫోర్త్ షెడ్యూల్)లో ఉన్నారు. జనసమూహాల్ని కలిసేందుకు, కొన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు, బ్యాంకు అకౌంట్లు వాడేందుకు చట్టం అనుమతించనప్పటికీ వారు ఎన్నికల బరిలో నిలిచారు. 2013 ఎన్నికల్లో కేవలం 202 ఓట్లతో ఓడిపోయిన ఫరూకీ.. ప్రస్తుతం కరాచీలో ఓ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. అతడు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనే మాటలు వినబడుతున్నాయి. సైన్యం ప్రమేయంతోనే ఇలాంటి గ్రూపుల ప్రతినిధులు చట్టపరమైన అడ్డంకుల నుంచి బయటపడగలుగుతున్నారని చెబుతున్నారు పరిశీలకులు. వీరు గనుక జాతీయ అసెంబ్లీకి ఎన్నికైతే విధాన నిర్ణయాల్లో సైన్యానికి తోడుగా ఉంటారనడంలో సందేహం లేదు. లష్కరే తొయిబా విభాగమైన జమాత్–ఉద్–దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ‘మిల్లీ ముస్లిం లీగ్’ పార్టీ స్థాపించి తన కొడుకు, అల్లుడితో సహా 265 మంది అభ్యర్థుల్ని బరిలోకి దింపాడు. వీరిలో 80 మంది జాతీయ అసెంబ్లీకి, 185 మంది ప్రొవిన్షియల్ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ తన పార్టీ నమోదుకు నిరాకరించడంతో అల్లాహో అక్బర్ తెహరీక్ (ఏఏటీ) అనే పార్టీ పేరిట హఫీజ్ రంగంలోకి దిగాడు. పాక్ రాజకీయ నాయకుల్ని భారత్–అమెరికాల కీలుబొమ్మలుగా వర్ణిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. ముత్తాహి–ఇ–మజ్లిస్ (ఎంఎంఏ) అనే ఐదు ఛాందస పార్టీల కూటమి కూడా పోటీలో ఉంది. మరోవైపు ఇస్లాంను దూషించే వారిని శిక్షిస్తానంటున్న తెహ్రీక్–ఇ–లబ్బైక్ అనే పార్టీ ఈ నెలలో అధికారిక ఆమోదం దక్కించుకుని పోటీకి దిగింది. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపిన ఖాద్రి ఈ గ్రూపునకు చెందిన వాడే. తర్వాతి కాలంలో అతణ్ణి ఉరి తీశారు. పాకిస్తాన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సైన్యం మద్దతు ఉన్న ఈ జిహాదీ గ్రూపులు కొన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా ఎన్నికల చట్టబద్ధత... ఉగ్ర ప్రతినిధులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంపై పాక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మత విద్వేషపూరిత ప్రసంగాలు చేసేందుకు ఈ గ్రూపుల అభ్యర్థుల్ని అనుమతించడం, ప్రచారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పీపీపీ, అవామీ వర్కర్స్ పార్టీల అభ్యర్థులపై భద్రతా బలగాలు వేధింపులకు పాల్పడటం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యల నేపథ్యంలో ఎన్నికల చట్టబద్ధతనే ఆ సంస్థ ప్రశ్నిస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీపై సైనిక నేతల గురి... పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్య ఎజెండాగా పెట్టుకున్నారు సైనిక నేతలు. విదేశాంగ విధాన సంబంధిత విషయాల్లో ప్రత్యేకించి భారత్ విషయంలో తమతో విభేదించిన ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పట్ల వారు కంటగింపుగా ఉన్నారు. పనామా పత్రాల కుంభకోణాన్ని ఉపయోగించుకుని ఆయన్ను పదవి నుంచి తప్పించగలిగారు. న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని షరీఫ్‌నూ, ఆయన రాజకీయ వారసురాలైన కుమార్తెను జైలుకు పంపారు. ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించారు. ఈ చర్యలన్నీ షరీఫ్ పార్టీని తప్పించాలనే మిలటరీ వ్యూహంలో భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు. సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్’ (పీటీఐ)ని గెలిపించేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక నేత గతంలో కంటేæ ఇప్పుడు బలం పుంజుకున్నాడు. ఇమ్రాన్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చునని లేదంటే స్వల్ప ఆధికత్యతో బయటపడవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం నవాజ్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ హోదా సంపాదించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
గాడిదలపై రాజకీయ దాడులు.. ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : జూలై 17వ తేదీ, కరాచీ నగరంలో గుర్తుతెలియని దుండగులు ఓ గాడిదను చిత్ర హింసలకు గురిచేశారు. ఇష్టమొచ్చినట్లు ముష్ఠి ఘాతాలు తగిలించారు. ముక్కు రంధ్రాలను గట్టిగా చిదిమారు. పక్క టెముకలు విరిగేలా తన్నారు. కన్ను కింద రక్తం కారేలా గీరారు. దాని శరీరంపై ‘నవాజ్’ అని అక్షరాలు రాసివెళ్లారు. రోడ్డుపక్కన పడిపోయి ఆ గాడిద బాధను భరించలేక మెలితిరిగి పోతుంటే చూసిన ఓ బాటసారి దాన్ని ఎలాగైనా ఆదుకోవాలనుకున్నారు. ఎలా ఆదుకోవాలో తెలియలేదు. దాన్ని ఫొటోలుతీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి చేతనైన వాళ్లు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తికి స్పందించి.. ‘అయేషా చుండ్రిగర్ ఫౌండేషన్ (ఏసీఎఫ్)’ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ కార్యకర్తలు ఆ గాడిదను వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. కాస్త కోలుకున్నప్పటికీ ఇప్పటికీ అది నిలబడలేక, నడవలేక పోతోంది. ఈ నెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికలకు ఈ గాడిదకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దేశ ప్రధాని పదవి కోసం ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్ ఖాన్, తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన నవాజ్ షరీఫ్ మద్దతుదారులను ఏమీ తెలియని గాడిదలని, మూర్ఖులని, వెదవలని తిట్టారు. అంతే, ఆ రోజు నుంచి గాడిదల మీద దాడులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ‘తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడుతున్నారని నవాజ్ షరీఫ్‌కు చెందిన ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్)’ పార్టీ కార్యకర్తలు ఆరోపించగా, తమకు ఈ దాడులతో సంబంధం లేదని, సానుభూతి కోసం నవాజ్ షరీఫ్ కార్యకర్తలే ఈ దాడులు జరిపి తమ మీద ఆరోపణలు చేస్తున్నారని ఖాన్ కార్యకర్తలు వాదిస్తున్నారు. తాము దాడులు చేస్తే గాడిదపై ‘నవాజ్’ అని పేరు కూడా ఎందుకు రాస్తామని షరీఫ్ పార్టీ కార్యకర్తలు వాదిస్తున్నారు. అందులోనే సానుభూతి ఉందని అవతలి వారంటున్నారు. ఇందులో ఏ పార్టీ వారు ఒకరికొకరు తీసిపోరు. గాడిదలపై దాడులు చేసే మూర్ఖత్వం వారిది. ఈ నెల 25వ తేదీన నాలుగు ప్రాంతీయ అసెంబ్లీ స్థానాలతోపాటు జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువగా ఉంది. బిల్వాల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి ప్రజల మద్దతు అంతగా కనిపించడం లేదు. నవాజ్ షరీఫ్ పార్టీయే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తుండగా, అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ, సైన్యం కుట్ర పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘మొహమ్మద్ అలీ జిన్నా’ వారసులం తామంటే, ‘అల్లమా ఇక్బాల్’ వారసులమని తామని, అక్బర్ వారసులమంటే తాము బాబర్ వారసులమంటూ ఇరు పార్టీల వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వారు ఎవరి వారసులైనా ప్రజల వారసత్వం మాత్రం వారికి అసలే లేదు. వాస్తవానికి ఇరు పార్టీల వారికి ప్రజలంటే ప్రేమగానీ, ఓటర్లంటే గౌరవంగానీ బొత్తిగా లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వారి హక్కనుకుంటారు. గెలిపించడం ప్రజల ఖర్మ అంటారు. గెలిస్తే ప్రధాని పదవిలో వెలగబెడతాం అంటారు. ఓడిపోతే ఏ సౌదీ అరేబియాకో, మరో దేశానికి వెళ్లి వచ్చే ఎన్నికలకు వస్తామంటారు. వారు ప్రజలను నిజంగా గాడిదలనుకుంటారు. అలాగే చూస్తారు. 2009లో తాలిబన్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలు కట్టి అఫ్ఘానిస్థాన్లోని సైనిక శిబిరంలోకి పంపించారు. ఆ పేలుడులో ఆ గాడిద వెంటనే చచ్చి పోయింది. అంతటి భాగ్యం కూడా పాకిస్థాన్ గాడిదలకు లేదు. (పాక్ ఎన్నికలపై లాహోర్ మానవ హక్కుల కార్యకర్త రిమ్మెల్ మొహిద్దిన్ అభిప్రాలకు అక్షరరూపం) -
ఎన్నికలు ముగిసేదాకా జైల్లోనే షరీఫ్
ఇస్లామాబాద్: అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్, అల్లుడు మహ్మద్ సఫ్దర్‌లకు ఇస్లామాబాద్ హైకోర్టు షాకిచ్చింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను జూలై చివరి వారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే తమకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది. అప్పీలు పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. అనంతరం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాల్సిందిగా నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు నోటీసులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదలై రానున్న ఎన్నికల(25వ తేదీ)కు తమ పార్టీ (పీఎంఎల్–ఎన్) తరఫున ప్రచారం చేయాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు, ఆయన కుమార్తె మరియమ్‌కు 7 ఏళ్ల జైలు, అల్లుడు సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. -
జైల్లో షరీఫ్‌కు బీ–క్లాస్ వసతి
ఇస్లామాబాద్: అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్‌లకు రావల్పిండిలోని అదియాలా జైలులో బీ–క్లాస్ వసతులు కల్పించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. లాహోర్ విమానాశ్రయంలో దిగగానే వీరిద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు విమానంలో రావల్పిండికి తరలించారు. తర్వాత షరీఫ్, మరియమ్లను అదియాలా జైలుకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న వైద్యులు షరీఫ్, మరియమ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరు ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. శనివారం ఉదయం అల్పాహారంలో భాగంగా వీరిద్దరికి ఎగ్ఫ్రై, పరోటా, టీని జైలు అధికారులు ఇచ్చారు. ఉన్నతస్థాయి విద్యావంతులు, ధనికులు తదితరులకు జైలులో బీ– క్లాస్ వసతిని కల్పిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం బీ–క్లాస్ ఖైదీల గదిలో ఓ మంచం, కుర్చీ, లాంతరు, ఓ అల్మారా తదితర సౌకర్యాలుంటాయి. ఖైదీల ఆర్థిక స్థోమతను బట్టి జైలు గదిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, వార్తాపత్రికలు సమకూర్చేందుకు జైళ్ల శాఖకు అధికారాలున్నాయి. ప్రస్తుతం బీ–క్లాస్ వసతులు అనుభవిస్తున్న షరీఫ్, మరియమ్‌లకు సీ–క్లాస్‌లోని నిరక్షరాస్యులైన ఖైదీలకు చదువు చెప్పే బాధ్యతను అప్పగించే అవకాశముంది. పంజాబ్ ప్రావిన్సులో ఘర్షణలు.. షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ అరెస్టులను నిరసిస్తూ వారి స్వస్థలమైన పంజాబ్ ప్రావిన్సులో పలుచోట్ల మద్దతుదారులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మంది షరీఫ్ మద్దతుదారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు. కాగా, శుక్రవారం షరీఫ్ రాక నేపథ్యంలో అరెస్ట్‌చేసిన 370 పీఎంఎల్–ఎన్ నేతల్ని, కార్యకర్తల్ని విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. -
అంతా అనుకున్నట్లే జరిగింది...
లాహోర్: అవెన్ ఫీల్డ్ కేసులో జైలు పాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యమ్‌లు అప్పుడే ఒకరోజు జైలు జీవితం గడిపేశారు. లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లోనే నవాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా రావల్పిండిలోని అదియాలా జైల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఆయనకు బీ క్లాస్ ట్రీట్మెంట్ను అందిస్తున్నట్లు సమాచారం. బీ క్లాస్ వసతులు.. పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్మెంట్ అందుతుంది. అయితే ఏ క్లాస్ కాకుండా బీ క్లాస్ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు. అయితే మరియమ్‌కు మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు. పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్ షరీఫ్(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్ భార్య అనారోగ్యం కారణంగా లండన్‌లోనే కుటుంబం ఎక్కువగా గడుపుతోంది. అయితే జూలై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన, మర్యమ్‌లు తిరిగి శుక్రవారం స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితుల మధ్య అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందే షరీఫ్ తనపై చేస్తున్న కుట్రను వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయటం తెలిసిందే. -
షరీఫ్ అరెస్ట్: పాకిస్థాన్‌లో ఘర్షణలు
లాహోర్ : పనామా పత్రాల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కూతురు మరియమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం రాత్రి స్వదేశంలో అడుగుపెట్టగానే వీరిద్దరిని పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్ట్ చేశారు. షరీఫ్, మరియమ్‌ల అరెస్ట్‌తో శుక్రవారం రాత్రి లాహోర్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన కార్యకర్తలను లాహోర్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా బలగాలను మొహరించారు. చాలా చోట్ల ఆ పార్టీ శ్రేణులను అడ్డగించడంతో వారు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మంది పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు కాగా, మిగతా 20 మంది పోలీసులు ఉన్నారు. షరీఫ్‌ను చూడటానికి లాహోర్‌లో గుమిగూడిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాహోర్‌లోని రవి బ్రిడ్జ్, బుట్ట చౌక్‌తో పాటు, విమానాశ్రయానికి 5కి.మీ దూరంలోని జోరే పుల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు పీఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. అంతకు ముందే పాక్‌లో అడుగుపెట్టగానే షరీఫ్‌ను, ఆయను కూతురిని అరెస్ట్ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు శుక్రవారం ఉదయం నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. షరీఫ్‌కు ఘన స్వాగతం పలికేందుకు లాహోర్ విమానాశ్రయానికి వెళ్లాలని భావించిన కొందరు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. వీరిలో 370 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలపై పీఎంఎల్-ఎన్ పార్టీ అధికార ప్రతినిధి మరియుమ్ ఔరంగజేబు మాట్లాడుతూ.. వేలాది మంది తమ పార్టీ కార్యకర్తలు లాహోర్‌కు రాకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నవాజ్, మరియమ్‌కు స్వాగతం పలికేందుకు బయలుదేరిన తమ శ్రేణులను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లాహోర్ ర్యాలీలో పాల్గొని అరెస్టయిన 370 మంది పీఎంఎల్-ఎన్ కార్యకర్తలను విడుదల చేయాలని హైకోర్టు కూడా శుక్రవారం ఆదేశాలు జారీచేసిందని అన్నారు. కాగా అరెస్ట్ అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటు చేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. -
నవాజ్ షరీఫ్ అరెస్ట్
లాహోర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్ హౌజ్‌కు తీసుకెళ్లారు. లాహోర్‌లో ఉత్కంఠ.. పాక్‌కు రాగానే షరీఫ్‌ను అరెస్ట్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా షరీఫ్ సోదరుడు షాబాజ్ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. లాహోర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. లండన్ నుంచి పాకిస్తాన్‌కు బయల్దేరిన షరీఫ్, మరియమ్‌లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్ చేరుకున్నారు. లండన్ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్‌ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే.. అంతకుముందు, నవాజ్ షరీఫ్ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్ ట్వీట్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్‌కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు. నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్‌పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్ పోస్ట్ చేశారు. -
లండన్‌లో నవాజ్ షరీఫ్ మనవళ్లు అరెస్ట్
-
జైలుకే తీసుకెళ్తారని నాకూ తెలుసు.. వైరల్
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు యూఏఈలోని అబుదాబి ఎయిర్‌పోర్టులో బయలుదేరిన అనంతరం షరీఫ్ ఓ వీడియోను షేర్ చేశారు. జైలుశిక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో విమాన ప్రయాణ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నన్ను నేరుగా జైలుకు తీసుకెళ్తారని తెలుసు. పాక్ ప్రజల కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నా. వచ్చే తరాల వారి భవిష్యత్తు కోసం త్యాగాలు చేశాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. పాక్ భవితవ్యాన్ని మనందరం కలిసి తేల్చాలంటూ’పాక్ ప్రజలకు నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. బ్రిటన్ నుంచి బయలుదేరిన షరీఫ్, మర్యమ్‌లను శుక్రవారం ఉదయం అబుదాబి ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడినుంచి ఇతిహాద్ ఈవై 243 విమానంలో లాహోర్‌కు చేరుకోనున్నారు. కాగా, లండన్‌లోని ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ లాహోర్‌లో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. నేటి సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. -
జైలుకే తీసుకెళ్తారని నాకూ తెలుసు.. వైరల్
-
నిరసనకారులపై మాజీ ప్రధాని మనవళ్ల జులుం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవళ్లను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన అపార్ట్మెంట్ వద్ద ఓ వ్యక్తిపై భౌతికదాడికి దిగి అతడిని గాయపరిచాడన్న కారణంగా పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. షరీఫ్ కుమారుడికి లండన్ లోని పార్క్‌లేన్‌లో ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ వద్ద ధర్నాకు దిగి షరీఫ్ మనవళ్లు జునైద్ సఫ్దార్, జకారియా షరీఫ్‌లపై విమర్శలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో తిట్టారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ తమను విమర్శిస్తున్న ఓ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాగి దాడి చేశారు. షరీఫ్ కూతురు మర్యమ్ కుమారుడు జునైద్, కాగా షరీఫ్ కుమారుడు హుస్సేన్ తనయుడు జకారియా అన్న విషయం తెలిసిందే. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న లండన్ పోలీసులు జునైద్, జకారియాలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. ఓ వ్యక్తి మాపై దాడి చేసేందుకు చూడగా అతడిని అడ్డుకునేందుకు యత్నించామని, తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని షరీఫ్ మనవళ్లు పోలీసులను ప్రశ్నించారు. -
అడుగు పెట్టగానే అరెస్ట్!
లాహోర్: పాకిస్తాన్లో రాజకీయం మరింత ముదిరింది. ఎవన్‌ఫీల్డ్ అపార్ట్మెంట్ కేసులో పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఏడేళ్ల జైలుశిక్ష ఎదుర్కొంటున్న ఆయన కుమార్తె మర్యమ్ శుక్రవారం దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాహోర్‌లో అల్లర్లు తలెత్తకుండా పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) పార్టీకి చెందిన 300 మంది నేతలు, కార్యకర్తల్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నేడు సాయంత్రం 6.15 గంటలకు నవాజ్, ఆయన కుమార్తె మర్యమ్ బ్రిటన్ నుంచి లాహోర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో వీరిద్దరిని ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్ట్ చేయాలని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) చైర్మన్ జావేద్ ఇక్బాల్ ఆదేశించారు. అరెస్టుచేసి వీరిద్దరినీ రావల్పిండిలోని అదియాలా జైలుకు తరలించాలని చూస్తున్నారు. అరెస్ట్ సందర్భంగా నగరంలో అల్లర్లు తలెత్తకుండా 10,000 మంది పోలీసుల్ని అధికారులు మోహరించారు. -
పాక్ కోర్టు అత్యుత్సాహం
పాకిస్తాన్లో వ్యవస్థలు దిగజారడం, విశ్వసనీయత కోల్పోవడం కొత్త కాదు. తాజాగా పనామా పత్రాల వ్యవహారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్)–ఎన్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు, ఆయన కుమార్తె మరియంకు ఆదరా బాదరాగా జైలుశిక్షలు విధిస్తూ వారి పరోక్షంలో అక్కడి కోర్టు వెలువరించిన తీర్పు దానికి కొనసాగింపే. పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు షరీఫ్‌కు పదేళ్లు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్లు జైలు శిక్షలు విధించింది. అంతక్రితం మాటెలా ఉన్నా 2007లో ఆనాటి మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికర్ మహమ్మద్ చౌధురిని, మరో 60మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి అరెస్టు చేసిన ప్పుడు అక్కడి న్యాయవ్యవస్థ పోరాడిన తీరు దాని ప్రతిష్టను అమాంతం పెంచింది. ఆయనను, ఆయన సహచర న్యాయమూర్తులను 2009లో తిరిగి నియమించే వరకూ ఆ పోరాటం సాగింది. కానీ క్రమేపీ న్యాయవ్యవస్థ పాత ధోరణిలోకి తిరోగమించడం మొదలుపెట్టింది. గతంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు అత్యుత్సాహంతో వ్యవహరించింది. 2012లో పీపీపీకి చెందిన ప్రధాని యూసఫ్ రజా గిలానీని కోర్టు ధిక్కారం కింద పదవినుంచి తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రధానిని సైతం ముప్పుతిప్పలు పెట్టింది. అక్రమార్జనతో లండన్‌లోనూ, ఖతార్‌లోనూ షరీఫ్ కుటుంబం విలాసవంతమైన భవనాలు, ఇతర ఆస్తులు సమకూర్చుకున్నదని, పరిశ్రమలు స్థాపించిందని 2016లో వెల్లడైన పనామా పత్రాలు బట్టబయలు చేశాయి. అయితే వీటిల్లో నవాజ్ షరీఫ్ పేరు లేదు. ఆయన కుమార్తె మరియం, కుమా రులు హుస్సేన్, హసన్‌ల ప్రస్తావన ఉంది. ఈ ఆస్తులెలా వచ్చాయో షరీఫ్ కుటుంబం, ప్రత్యేకించి నవాజ్ షరీఫ్ సంజాయిషీ ఇవ్వాల్సిందే. అయితే అలా సంజాయిషీ ఇవ్వాల్సిన జాబితాలో ముషా ర్రఫ్ అగ్రస్థానంలో ఉంటారు. సైన్యంలో ఇప్పుడు అగ్ర స్థానాల్లో కొనసాగుతున్నవారూ, ఇంతక్రితం పనిచేసి రిటైరైనవారూ కూడా ఉంటారు. వారందరి విషయంలోనూ ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన న్యాయవ్యవస్థ నవాజ్ షరీఫ్ దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శించింది. ఆయన పేరు నేరుగా లేకపోయినా, అసలు కేసులు నమోదై దర్యాప్తు సాగకముందే, వాటిపై న్యాయ స్థానాల్లో విచారణ జరగకముందే నవాజ్ షరీఫ్ ప్రజాప్రతినిధిగా అనర్హుడవుతారని పాక్ సుప్రీంకోర్టు «నిర్ణయానికొచ్చింది! ఆ తర్వాత కేసు దర్యాప్తు, అకౌంటబిలిటీ కోర్టులో విచారణ కూడా చకచకా సాగిపోయాయి. తమకు మరికాస్త సమయం కావాలన్న వినతిని న్యాయస్థానం పట్టించుకోకపోవ డంతో ఈ కేసుల వకాల్తాను వదులుకుంటున్నట్టు షరీఫ్ న్యాయవాదులు ఇటీవల ప్రకటించారు. అయినా ఆ కోర్టు నదూరూ బెదురూ లేకుండా విచారణ కొనసాగించి జైలు శిక్షలు విధించింది. షరీఫ్‌పై ఇంత త్వరగా తీర్పు ఎందుకు వెలువడిందో, ఇది ఎవరికి అవసరమో పాక్ ప్రజలకు బాగా తెలుసు. ఈ నెల 25న జరగబోయే పాకిస్తాన్ ఎన్నికల్లో షరీఫ్ పార్టీ పీఎంఎల్–ఎన్ పరువుతీసి దాని విజయావకాశాలను దెబ్బతీయడం, పాకిస్తాన్ సైన్యం ఆశీస్సులున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్(పీటీఐ)ను గద్దెనెక్కించడం ఈ తీర్పు పరమావధి. పాక్ రాజకీయాల్లో కొద్దో గొప్పో ప్రాబల్యం ఉన్న పార్టీ నవాజ్ షరీఫ్‌దే. బేనజీర్ భుట్టో మరణించాక ఆ సానుభూతితో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) విజయం సాధించినా అవినీతి ఆరోపణలవల్లా, నాయకత్వ లేమివల్లా పూర్తిగా చతికిలబడింది. షరీఫ్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా ఇమ్రాన్‌ఖాన్‌ను రూపొందించాలని సైన్యం తెరవెనక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు షరీఫ్‌కు జైలు శిక్ష విధించి, ఆయన పార్టీకి నాయకత్వం లేకుండా చేస్తే జనం ఇమ్రాన్‌నే ఎంచు కుంటారని సైన్యం భావిస్తోంది. నిజానికి నవాజ్ షరీఫ్‌తో అక్కడి సైన్యానికి వేరే తగవులున్నాయి. ఇతర పాలకులతో పోలిస్తే సైన్యం ఆటలు ఆయన పెద్దగా సాగనీయలేదు. మన దేశంతో మెరుగైన సంబంధాల కోసం షరీఫ్ ఎంతగానో ప్రయత్నించారు. వాటన్నిటినీ సైన్యం వమ్ము చేసింది. ఇరు దేశాల మధ్యా చర్చల తేదీలు ఖరారు కాగానే సరిహద్దుల్లో సైన్యం ఆగడాలకు పాల్పడటం, ఇరు దేశాల మధ్యా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి ఆ చర్చలు వాయిదా పడేలా చేయటం దానికి రివాజు. సైన్యం వ్యవహారశైలి వల్ల అంతర్జాతీయ వేదికల్లో ఏకాకులవుతున్నామని, దీన్ని సరిచేయా లని షరీఫ్ భావించారు. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ప్రకటించినవారికి అండదండలెలా అంది స్తారని 2016లో ఒక సమావేశంలో సైన్యాన్ని ఆయన గట్టిగా నిలదీశారు. ఇది మీడియాలో వెల్లడి కావడంతో సైన్యం ఆయనపై కక్ష పెంచుకుంది. దీనికితోడు 1999లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు సైనిక కుట్రతో తనను అధికారం నుంచి తొలగించిన ముషార్రఫ్‌పై కేసు నమోదు చేసి విచారణ జర పాలని షరీఫ్ నిర్ణయించారు. ఇది కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించింది. అందుకే పనామా పత్రాల కేసు ఇంత శరవేగంతో కదిలింది. ఈ కారణాలన్నిటివల్లా సైన్యానికి షరీఫ్‌పై ఆగ్రహం ఉండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ దాని ప్రయోజనాలు నెరవేర్చడం కోసం న్యాయవ్యవస్థ తన విశ్వసనీయతను పణంగా పెట్టడమే ఆశ్చ ర్యకరం. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలొచ్చినప్పుడు ఆ కేసుల్ని విచారించడం తప్పేమీ కాదు. కానీ ఆ విచారణ క్రమం పారదర్శకంగా, సందేహాతీతంగా ఉండాలి. తీర్పు ప్రామాణికంగా ఉండాలి. కానీ న్యాయవ్యవస్థ వాటి విషయంలో పట్టింపు లేనట్టు వ్యవహరించింది. ఇప్పుడు విధించిన శిక్షలపై షరీఫ్ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న షరీఫ్, ఆయన కుమార్తె దేశం తిరిగొచ్చి దీనిపై పోరాడతామంటున్నారు. మంచిదే. వ్యవస్థలపై పాక్ సైన్యం పట్టు బిగుసుకుంటుండటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగించే అంశం. ఇక ఈనెల 25న జరిగే ఎన్ని కలు ఎంత సవ్యంగా ఉంటాయో చూడాల్సి ఉంది. -
‘నేను దొంగను కాదు.. తిరిగి వస్తా’
ఇస్లామాబాద్ : పనామా పేపర్స్ కుంభకోణం కేసులో పదేళ్లు జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీర్పు అనంతరం తొలిసారి స్పందించారు. తాను తప్పించుకొవాడానికి దొంగను కానని, శిక్షను ఎదుర్కొవడానికి పాక్ తప్పనిసరి వస్తానని తెలిపారు. పనామా పేపర్స్ కేసులో షరీఫ్, అతని కుమార్తె మరియం నవాజ్‌కు శిక్షవిధిస్తూ ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం లండన్‌లో ఆయన కుమర్తెతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టుపై తనకు గౌరవం ఉందని, శిక్షను అనుభవించడానికి తప్పకుండా పాక్ వస్తానని పేర్కొన్నారు. తన భార్యకు క్యాన్సర్ కారణంగా ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, కొంత సమయం తరువాత కోర్టుకు హాజరవుతానని తెలిపారు. పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. పనామా పేపర్స్ కుంభకోణంలో షరీఫ్‌ను నిందితుడిగా పేర్కొంటు పాక్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గత ఏడాది జూలై 25న ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఆయన సోదరుడు షహాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ను బాధ్యతలను స్వీకరించనున్నారు. -
నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కుంభకోణంలో ఓ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాక్‌లో ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) పార్టీకి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ కానుంది. షరీఫ్‌తోపాటు ఆయన కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా షరీఫ్, మరియంతోపాటు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్కు కూడా చెరో ఏడాది జైలు శిక్ష పడింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలవనున్నందున షరీఫ్ పదేళ్లు, మరియం ఏడేళ్లపాటు మాత్రమే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు, భారీ భద్రత నడుమ రహస్యంగా ఈ తీర్పును వెలువరించింది. అనంతరం తీర్పు వివరాలను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) న్యాయవాది మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ తీర్పును వారంపాటు వాయిదా వేయాలంటూ షరీఫ్ కుటుంబసభ్యులు కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. గతేడాది పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాజా తీర్పులో ఆయన కూతురు, అల్లుడికి జైలు శిక్ష పడినందున వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ తీర్పుపై వారు 10 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఏబీ న్యాయవాది చెప్పారు. అసలు కేసు ఏంటి? పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ కుటుంబంపై మొత్తం 3 కేసులుండగా, అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం తీర్పు వెలువడింది. 1990ల్లోనూ నవాజ్ షరీప్ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అవినీతి సొమ్మును కూడబెట్టి లండన్‌లోని పార్క్‌లేన్‌లో ఉన్న అవెన్‌ఫీల్డ్ హౌస్ అనే భవంతిలో ఖరీదైన నాలుగు ఫ్లాట్లను షరీఫ్ కుటుంబ సభ్యులు కొన్నారు. 1993 నుంచీ ఈ ఫ్లాట్లు వారి పేరనే ఉన్నాయి. గతేడాది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్ఏబీ ఈ కేసులో విచారణ చేపట్టింది. షరీఫ్‌తోపాటు ఆయన కొడుకులు, కూతురు, అల్లుడిని కూడా ఎన్ఏబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 9 నెలలకు పైగా విచారించిన అనంతరం కోర్టు షరీఫ్, ఆయన కూతురిని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది. పాకిస్తాన్‌కు తిరిగొస్తారా? కేన్సర్‌కు చికిత్స పొందుతున్న తన భార్యకు తోడుగా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో ఆయన తన కూతురితో కలసి అవెన్యూఫీల్డ్లోని ఫ్లాట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, శిక్ష విధించడంతో షరీఫ్, మరియంలు పాక్‌కు తిరిగొచ్చి జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్నందున వారు దేశానికి తిరిగొచ్చి జైలుకు వెళితే సానుభూతితో పీఎంఎల్–ఎన్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దొంగను కాదు.. తిరిగొస్తా: షరీఫ్ పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన లండన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు ఉన్న 70 ఏళ్ల చరిత్ర గతిని తాను మార్చాలనుకున్నందుకు, ఓటుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే తనకు ఈ శిక్ష పడిందని నవాజ్ షరీఫ్ అన్నారు. తానేమీ దొంగను కాదనీ, పాకిస్తాన్‌కు తెరిగి వెళ్తానని స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు పాకిస్తానీలను బంధించడమనే ప్రక్రియ ఆగిపోయేంత వరకు, కొందరు ఆర్మీ జనరళ్లు, న్యాయమూర్తులు పాకిస్తానీలకు విధిస్తున్న బానిసత్వం తొలగిపోయేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని షరీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్–ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా తమ వాళ్లను కోర్టు దోషులుగా తేల్చడాన్ని తిరస్కరించారు. కోర్టు నవాజ్ షరీఫ్, మరియంలను దోషులుగా తేల్చడం అన్యాయమనీ, రాజకీయ దురుద్దేశం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. జూలై 25న ప్రజా న్యాయస్థానంలో తమ వాళ్లు నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. -
నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష
ఇస్లామాబాద్ : అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా కుంభకోణంలో బయటపడ్డ షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. షరీఫ్‌పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్ అవెన్ఫీల్డ్లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. కాగా, తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది. శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్ షరీఫ్ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పాకిస్తాన జాతీయ పత్రిక డాన్ పేర్కొంది. కోర్టు ప్రసారాలను లండన్ నుంచి షరీఫ్ ఫ్యామిలీ లైవ్‌లో తిలకించినట్లు రిపోర్టులు కూడా వస్తున్నాయి. -
మరణశయ్యపై మాజీ ప్రధాని భార్య
లండన్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్(68) పరిస్థితి విషమించింది. లండన్‌లోని హర్లే స్ట్రీట్ క్లినిక్‌లో ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ‘ఆమె పరిస్థితి బాగా విషమించింది. పరిస్థితులు చేజారిపోయాయి’ అని వైద్యులు మంగళవారం ఉదయం ప్రకటించారు. షరీఫ్ కుటుంబ సభ్యులంతా లండన్‌కు చేరుకుంటున్నట్లు జీయో టీవీ ఓ కథనం ప్రచురించింది. గొంతు కాన్సర్(లింపోమా)తో బాధపడుతున్న కుల్సూమ్‌ను కుటుంబ సభ్యులు లండన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 2017 ఆగష్టు నుంచి ఆమెకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, ఏప్రిల్ నుంచి ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తోంది. జూన్ 14న తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం పరిస్థితి బాగా విషమించటంతో వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.కాగా, కుల్సూమ్ అనారోగ్యం నేపథ్యంలో భర్త నవాజ్, కుమార్తె మరయమ్ నవాజ్‌లు లండన్‌లోనే ఉన్నారు. పనామా పేపర్ల వ్యవహారంతో గతేడాది పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ గద్దె దిగిపోగా.. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎన్ఏ-120 నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కుల్సుమ్ నవాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనారోగ్యంతో ఆమె రాజకీయ వ్యవహారాలను కూతురు మరయమ్ చూసుకుంటున్నారు. వచ్చేనెల 25న జరగబోయే పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుల్సూమ్ నవాజ్ పోటీ చేయాల్సి ఉంది. -
షరీఫ్ కూతురి కామాలు, ఫుల్‌స్టాపులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరయమ్ నవాజ్‌పై జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. అవన్‌ఫీల్డ్ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసింది. అయితే ఆమె ప్రకటన చదివి వినిపిస్తున్న సమయంలో కామాలు, ఫుల్స్టాపులను కూడా చదువుకుంటూ పోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి వాటిని వదిలేసి ఉన్న మ్యాటర్ చదవాలంటూ ఆమెను కోరారు. అయినా మరయమ్ మాత్రం అలానే చదువుకుంటూ వెళ్లారు. వెటకారం చేస్తున్నారా? అంటూ ఒకానోక దశలో జడ్జి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫుల్‌స్టాపులు, కామాలు చదవకపోతే మొత్తం అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా చదివి వినిపిస్తున్నా’ అంటూ ఆమె ప్రశాంతంగా బదులిచ్చి కూర్చున్నారు. ఈ కేసులో జడ్జి అడిగిన మొత్తం 128 ప్రశ్నలలో 46కు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరయమ్ కంటే ముందు నవాజ్ షరీఫ్‌ను కూడా జడ్జి ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
షరీఫ్ పేల్చిన బాంబు!
అందరికీ తెలిసిన కథే. తొమ్మిదేళ్లక్రితం అమెరికా పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పిన సంగతే. ముంబై మహా నగరంపై 2008 నవంబర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడి 166మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని ప్రపంచ దేశా లన్నిటికీ అర్ధమైన విషయమే. అయిదు రోజులక్రితం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పరోక్షంగా అదే చెప్పారు. ఎన్నాళ్లు పాక్ గడ్డపై ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ పొరుగుదేశంపై దాడులకు పంపుతామని ఆయన ప్రశ్నించారు. అంతే...అక్కడ వ్యవస్థలన్నీ వణికిపోతున్నాయి. సొంత పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎంఎల్)–ఎన్తో సహా అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో షరీఫ్ స్వరం మార్చి తన మాటల్ని మీడియా వక్రీకరించిందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాని షహీద్ ఖాకాన్ అబ్బాసీని హడావుడిపెట్టి జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. షరీఫ్ అపార్ధం చేసుకుని ఉండొచ్చు లేదా ఆయనకు దురభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చునని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలి షరీఫ్ మాటల్ని ఖండించ లేదని, మీడియా వక్రీకరించిందని మాత్రమే అభిప్రాయపడిందని పీఎంఎల్–ఎన్ చెబుతోంది. నవాజ్ షరీఫ్ తన మాటల్లో ఎక్కడా సైన్యం గురించి నేరుగా మాట్లాడలేదు. ఉగ్రవాద సంస్థలకు సైన్యం తోడ్పాటునిస్తున్నదని చెప్పలేదు. అయినా ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ పాక్ సైన్యానికి కంగారు ఎక్కువైంది. బహుశా తనకూ, సైన్యానికీ మధ్య విభేదాలు రాకుండా ఉంటే షరీఫ్ ఇంత బాహాటంగా పాక్ తప్పిదాన్ని అంగీకరించేవారు కాదేమో! ఆయన ప్రధానిగా ఉండగా ముంబై దాడుల ప్రస్తావన వస్తే తమకేమీ సంబంధం లేదనే చెప్పేవారు. పైగా ఆ దాడులపై పాక్‌లో సాగుతున్న విచారణకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, ఆ తర్వాత అనర్హత వేటు వేయడానికి సైన్యం లోపాయికారీగా సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చిన తీరు చూశాక ఆయన ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పని చేశారు కాబట్టి ఆయనకు మొదటి నుంచీ సైన్యం వేస్తున్న వేషాలన్నీ తెలుసు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద ముఠాలకు డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న తీరు గురించిన సమస్త సమాచారమూ ఆయన వద్ద ఉంటుంది. కారణాలేమైనా కావొచ్చుగానీ షరీఫ్‌కూ, సైన్యానికీ మొదటినుంచీ పడటం లేదు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ తర్వాత ఖైదు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సౌదీ అరేబియా వెళ్లిపోతానని హామీ ఇచ్చాకే ఆయనకు విముక్తి లభించింది. 2013లో షరీఫ్ తిరిగి ప్రధాని కాగానే ముషార్రఫ్ పాలనాకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారు. 1999నాటి సైనిక కుట్ర గురించి కూడా విచారించి అందుకు ఆయన్ను శిక్షించాలని పట్టుబట్టారు. ఇదంతా సైన్యానికి నచ్చలేదు. పాకిస్తాన్లో మూడు అధికార కేంద్రాలుంటాయి. అవి సమాంతరంగా, స్వతంత్రంగా పని చేస్తుంటాయి. అందులో మొదటిది పౌర ప్రభుత్వం. రెండోది సైన్యం. మూడోది సుప్రీంకోర్టు. ఏ దేశంలోనైనా సైన్యం పౌర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. అది తీసుకునే నిర్ణయాలకూ, రూపొందించే విధానాలకూ కట్టుబడి ఉంటుంది. కానీ పాకిస్తాన్లో దీనికి విరుద్ధంగా జరుగు తుంది. సైన్యం స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటుంది. ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తుంది. అదును దొరికితే దాన్ని చాప చుట్టి తానే ఏలాలని చూస్తుంది. పాకిస్తాన్ అవతరణ నాటినుంచి ఆ దేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే నడిచింది. పదేళ్లుగా సైన్యం ఇలాంటి కుట్రలకు దూరంగా ఉన్నా తెరవెనకనుంచి పౌర ప్రభుత్వాలను శాసించే ధోరణి మానుకోలేదు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) వంటి పార్టీల ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తూనే ఉంది. నాలు గేళ్లక్రితం నవాజ్ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ పార్లమెంటును ముట్టడించిన ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యమే అండదండలిచ్చింది. ఆయనకు జనంలో అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ ముట్టడి కార్యక్రమం నవ్వులపాలైంది. ఈలోగా 2016లో పనామా పత్రాలు వెల్లడై అందులో నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యుల పేర్లున్నాయని తెలిశాక సైన్యం ఆయన అడ్డు తొలగించుకునే పని మొదలుబెట్టింది. సుప్రీంకోర్టును ప్రభావితం చేసి ఆయనపై విచారణ తంతు నడిపించి ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఆ తర్వాత రాజకీయాలకే ఆయన అనర్హుడంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిణామాల పర్యవసానంగానే నవాజ్ షరీఫ్ గళం విప్పారు. పరోక్షంగా సైన్యం సాగిస్తున్న కుట్రలను ప్రపంచానికి వెల్లడించారు. పాకిస్తాన్లో సాగుతున్న అంతర్గత కుమ్ములాటల మాట అలా ఉంచి ఉగ్రవాదానికి అక్కడి సైన్యం అందిస్తున్న తోడ్పాటుపై అమెరికా మాత్రమే కాదు... చైనా, సౌదీ అరేబియా వంటి సన్నిహిత దేశాలు సైతం అసహనంతో ఉన్నాయి. ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఈ గండం నుంచి గట్టెక్కుదామని ప్రయత్నిస్తుండగా షరీఫ్ ఉన్నట్టుండి ఈ బాంబు పేల్చడంతో సైన్యానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఈ ఉలికిపాటు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఉగ్రవాద ముఠాలకు తోడ్పాటునిస్తున్న ధోరణులపై సాక్షాత్తూ మాజీ ప్రధానే మాట్లాడటం ఒక రకంగా మంచిదే. ప్రపంచం నలుమూలలనుంచీ పాక్‌పైఒత్తిళ్లు పెరుగుతాయి. సైన్యం కుటిల ధోరణులకు కళ్లెం పడేందుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంలో పౌర ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. ఇరు దేశాల మధ్యా సామరస్య సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. -
అయ్యో.. నేను అలా అనలేదు
ఇస్లామాబాద్ : 26/11 ముంబై దాడులకు పాల్పడింది పాకిస్థానేనని అంగీకరిస్తూ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో షరీఫ్ మాట మార్చారు. ముంబై దాడులపై తన వ్యాఖ్యలను మీడియా పూర్తిగా వక్రీకరించి.. తప్పుగా ప్రచురించిందని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని నవాజ్ షరీఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజ్యేతర శక్తులైన ఉగ్రవాద మూకలను సరిహద్దులు దాటించి.. ముంబైలో ప్రజల్ని చంపేందుకు ఉసిగొల్పారని తన పరోక్షంగా పాక్ ప్రభుత్వం ప్రమేయముందని పేర్కొన్నారు. ముంబై దాడుల నేపథ్యంలో పాక్ తనకు తానే ఏకాకి అయిందని ఆయన అన్నారు. ‘నవాజ్ షరీఫ్ ప్రకటనను భారత మీడియా పూర్తిగా తప్పుగా వ్యాఖ్యానిస్తూ ప్రచురించింది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌లోని ఓ సెక్షన్ మీడియా, సోషల్ మీడియా కూడా భారత మీడియా చేసిన దురుద్దేశపూరిత ప్రచారాన్ని నమ్మి.. అదే నిజమైనట్టు ప్రచారం చేశారు. ఆయన ప్రకటనలోని నిజానిజాలు పట్టించుకోలేదు’ అని షరీఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాక్ జాతీయ భద్రత విషయంలో దేశ అత్యున్నత రాజకీయ పార్టీ అయిన పీఎంఎల్‌ఎన్‌కుగానీ, ఆ పార్టీ అధినేత షరీఫ్‌కుగానీ ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 6/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని ఇటీవల డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ షరీఫ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. -
మేం తలచుకుంటే ఆపగలిగేవాళ్లం
లాహోర్: పాకిస్తాన్ తలచుకుని ఉంటే 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నివారించగలిగి ఉండేదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. పాక్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని ఆయన తొలిసారి బహిరంగంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వేతర శక్తులు సరిహద్దు దాటి వెళ్లి ముంబైలో మారణహోమం సృష్టించేందుకు అవకాశం కల్పించిన పాక్ విధానాలను షరీఫ్ ప్రశ్నించారు. ప్రధానిగా ఉండిన షరీఫ్‌ను పనామా పేపర్ల కేసులో దోషిగా తేల్చిన పాక్ సుప్రీంకోర్టు.. ఆయన ఇకపై ఎప్పటికీ ఆ పదవి చేపట్టకూడదంటూ ఆదేశాలివ్వడం తెలిసిందే. డాన్ పత్రికతో షరీఫ్ తాజాగా మాట్లాడుతూ ‘మనంతట మనమే ఏకాకులమయ్యాం. త్యాగాలు చేస్తున్నా మన మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు. దీనిని మనం పరిశీలించుకోవాలి’ అని అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్ ఉద్ దవా, మరో ఉగ్రవాది మసూద్ అజర్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల పేర్లను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ‘పాక్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వారిని ప్రభుత్వేతర శక్తులని పిలవచ్చు. సరిహద్దు దాటి వెళ్లి ముంబైలో 150 మందికిపైగా అమాయకులను చంపేందుకు మనం వారిని అనుమతించాలా? నాకు సమాధానం చెప్పండి. పదేళ్లయినా మనం విచారణను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నాం’ అని నవాజ్ షరీఫ్ అన్నారు. -
ముంబై దాడులపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
ముంబై దాడులపై నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని అంగీకరించారు. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. అయితే, ఆ ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వంతో ప్రమేయం లేదని, పాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రతండాలు రాజ్యేతర శక్తులని ఆయన ‘డాన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2008 నవంబర్ 26న పాక్ ఉగ్రవాదులు పదిమంది.. భారీ ఆయుధాలు, బాంబులతో విరుచుకుపడి.. ముంబైలో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భయానక ఉగ్రవాద దాడిలో తొమ్మిదిమంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సజీవంగా చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో.. అతన్ని ఉరితీశారు. ముంబైలో జరిగిన ఈ ఉగ్రదారుణంపై భారత్ ప్రభుత్వం ఎన్ని ఆధారాలు సమర్పించినా.. పాక్ మాత్రం తమ ప్రమేయం లేదని బుకాయిస్తూ వచ్చింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హజీఫ్ సయీద్ అని స్పష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించినా పాక్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించింది. ఇప్పుడు మాజీ ప్రధానమంత్రే 26/11 ముంబై దాడులు తమ పనేనని అంగీకరించడం పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. -
భారత్‌కు రూ.490 కోట్లు తరలించిన షరీఫ్..!!
వాషింగ్టన్, అమెరికా : పనామా పత్రాల వ్యవహారంలో పదవి కోల్పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌కు 490 కోట్ల రూపాయలు హవాలా రూపంలో తరలించినట్లు మంగళవారం రిపోర్టులు వెలువడ్డాయి. దీనిపై పాకిస్తాన్ అవినీతి నిరోధక సంస్థ, జాతీయ అకౌంటబిలిటీ బ్యూరలో విచారణకు ఆదేశించాయి. ప్రపంచబ్యాంకు మంగళవారమే రెమిటెన్సెస్ అండ్ మైగ్రేషన్ రిపోర్టు - 2016ను విడుదల చేసింది. దీని ఆధారంగానే షరీఫ్ భారత్‌కు హవాలా రూపంలో వందల కోట్ల రూపాయలు తరలించారంటూ పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రచురించింది. కాగా, మీడియా కథనాలను ప్రపంచబ్యాంకు బుధవారం ఖండించింది. ప్రపంచంలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి(దేశాల మధ్య) ఎన్నిసార్లు మారుతోందన్న విషయంపై మాత్రమే బ్యాంకు అధ్యాయనం చేస్తుందని వివరించింది. రిపోర్టులో హవాలాకు సంబంధించిన ఎలాంటి వివరాలను ప్రచురించలేదని వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్(ఎస్బీపీ) రూ. 490 కోట్లు 2016 సెప్టెంబర్ 21న పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివెళ్లాయని పేర్కొంది. తమ రిపోర్టును ఎస్బీపీ తప్పుగా అర్థం చేసుకుందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. -
‘కొత్త పాకిస్తాన్‌ను పరిచయం చేసేవాడ్ని’
ఇస్లామాబాద్: తనను ప్రధాని పదవి నుంచి తప్పించకపోయి ఉంటే పాకిస్తాన్‌ను తాను ఉన్నతస్థితికి తీసుకెళ్లేవాడినని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఏఆర్వై మీడియాతో సోమవారం మాట్లాడుతూ షరీఫ్ పలు విషయాలను ప్రస్తావించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, కానీ ప్రస్తుతం పాక్‌లో అలాంటివేం లేవన్నారు. మరికొంత కాలం తనకు అధికారం అప్పగించి ఉంటే కొత్త పాకిస్తాన్‌ను ప్రపంచానికి పరిచయం చేసేవాడినంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అలాంటి అవకాశం లేదని, జీవితకాలం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనపై మాట్లాడుతూ భారత్-పాక్ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై మాజీ ప్రధాని షరీఫ్ నిప్పులు చెరిగారు. ఇటీవల పీటీఐ చీఫ్ ఇమ్రాన్ 11 పాయింట్ల ఎజెండా (విద్య, వ్యవసాయం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థికరంగం, పోలీసు వ్యవస్థ, మహిళా విద్య మొదలైనవి) తన లక్ష్యమని ప్రకటించగా.. అది తన ఎజెండా అన్నారు. ఇమ్రాన్ ఇతరుల లక్ష్యాలను కాపీ కొడుతూ, తాను దేశానికి సేవ చేయాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాడని షరీఫ్ విమర్శించారు. కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్ సుప్రీం బెంచ్ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. షరీఫ్‌తో పాటు పీటీఐ సెక్రటరీ జనరల్ జహంగీర్ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. -
కీలక తీర్పు; సుప్రీంకోర్టు జడ్జిపై కాల్పులు
లాహోర్: మాజీ ప్రధాని నవాజ్ షరీప్ అవినీతి కేసులను విచారిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై హత్యాయత్నం పాకిస్తాన్లో తీవ్ర కలకలంరేపింది. లాహోర్‌లోని మోడల్ టౌన్లో నివసిస్తోన్న జస్టిస్ ఇజాజ్ ఉల్ ఎహసాన్ ఇంటిపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదు. జస్టిస్ ఎహసాన్.. నవాజ్‌తోపాటు ఆయన కుటుంబీకులపై నమోదైన కేసులను విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తుది తీర్పు వెలువడనుండగా ఒక్కసారే కాల్పులు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చినట్లైంది. విషయం తెలుసుకున్న వెంటనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షకీబ్ నిసార్.. కాల్పులు జరిగిన జడ్జి ఇంటికి వచ్చి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన.. దీని వెనకున్న కారణాలను కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. జస్టిస్ ఎహసాన్ ఇంటి గేటు వద్ద ఒక బుల్లెట్‌ను, కిచెన్ డోర్‌కు తగిలిన మరో బుల్లెట్‌ను సేకరించారు. జడ్జిల నివాస సముదాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కాల్పుల వ్యవహారం ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్నది. దుండగులను పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ప్రధాని అబ్బాసీ చెప్పగా, ఈ ఘటన దేశంలో దిగజారిన పరిస్థితులకు నిదర్శనమని విపక్షాలు మండిపడ్డాయి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సైతం ఈ ఘటనను ఖండించింది. నవాజ్ కేసుల్లో ఆ జడ్జి కీలకం: నవాజ్ ప్రధాని పదవి కోల్పోవడంలోనూ జస్టిస్ ఎహసాన్ పాత్ర ఉండటం గమనార్హం. నవాజ్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ‘పనామా పేపర్ల లీకేజీ’లో వెల్లడికావడంతో, ఆయనపై విచారణ చేపట్టి, గద్దెదిగాలని తీర్పిచ్చిన జడ్జిల బృందంలో జస్టిస్ ఎహసాన్ కూడా ఒకరు. ఆ తర్వాత నవాజ్, ఆయన కుమారులు హస్సేన్,హుస్సేన్, కుమార్తె మరియం, అల్లుడు మొహమ్మద్ సఫ్దార్లపై నమోదైన అక్రమాస్తుల కేసులను విచారిస్తున్నది కూడా జస్టిస్ ఎహసానే. ఆయా కేసుల తుది తీర్పులు వచ్చే వారం వెలువడే అవకాశంఉంది. -
నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ
-
నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవితకాలం ఆయన ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని పాక్ సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ దేశ అత్యున్నత న్యాయస్ధానం వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనర్హత వేటు వంటి చర్యలు అవసరమని చారిత్రక తీర్పును వెలువరిస్తూ కోర్టు పేర్కొంది. నవాజ్ షరీఫ్‌తో పాటు పాకిస్తాని తెహ్రీక ఇన్సాఫ్ (పీటీఐ) సెక్రటరీ జనరల్ జహంగీర్ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్ సుప్రీం బెంచ్ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పాక్ మాజీ ప్రధాని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
నవాజ్ షరీఫ్‌కు షూ దెబ్బ!
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.