Amaravati
-
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్ చేసే కాగ్ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్ ఓవర్ అకౌంట్స్) పదే పదే అబద్ధాలా? ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్ ఓవర్ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం. ఇలా సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. మేమిచ్చినవీ ఊడగొట్టారుమెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు. ఆర్థిక విధ్వంస కారుడు బాబే..» ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితికి మించి 2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.» చంద్రబాబు హయాంలో కోవిడ్ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి. అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) తక్కువగానే ఉంది. నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. » నాన్ గ్యారంటీ అప్పులు బడ్జెట్లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది. » చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు. ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్‌తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్‌తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. అదే 2019–24 మధ్య కోవిడ్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది. మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్‌కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్‌కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 2023–24లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు. మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా? నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం. పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది. 32.79 లక్షల మందికి ఉద్యోగాలు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది. మేనిఫెస్టోతో మోసం..చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్ క్రైమ్‌ను ఉపయోగించారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవన్లలో అతి చిన్న అంశాలు! కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. ఇవన్నీ సూపర్ సిక్స్‌లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే! రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్‌కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా? -
తీరిగ్గా ‘మీడియం’ మార్పు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కారు ఒక్కొక్కటీ రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్‌ను, ఇంగ్లిష్ ప్రావీణ్య శిక్షణ టోఫెల్‌ను రద్దు చేసిన ప్రభుత్వం... తాజాగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసే విధానంలో మార్పులు చేసింది.2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగు మీడియంలో కూడా రాయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఇప్పుడు మీడియం మార్పు చేయడం వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే దాదాపు 4.20లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.మీడియం ఎంచుకుని.. నామినల్ రోల్స్ పంపిన తర్వాత ఇలా...ఈ నెల మొదటి వారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన దాదాపు 4 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. నామినల్ రోల్స్ పంపించినప్పుడు ఎంచుకున్న మీడియంలోనే పరీక్షలు రాయాలి. ఫీజు చెల్లించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఇంగ్లిష్ మీడియంనే ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ‘మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్’లో ‘తెలుగు’ మార్చుకునేందుకు ఎడిట్ అవకాశం కల్పించాలని అన్ని పాఠశాలల హెచ్ఎంలను బుధవారం విద్యాశాఖ ఆదేశించింది.గత ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దాదాపు 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తున్నారు. మిగిలిన వారు ఈ విద్యా సంవత్సరం (2024–25) ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. దేశంలో సగటున 37.03 శాతం మంది మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 2.23 లక్షల మంది స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు తెలుగు మీడియం పరీక్ష విధానం తెరపైకి తేవడంపై తల్లిండ్రులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థులు కోరుకున్న ఇంగ్లిష్ మీడియం విద్యను రద్దు చేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా దిగజార్చుతూ నిర్వీర్యం చేసే దిశగా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ఉన్నత విద్యలో యువతుల హవా
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు. దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతుల అధిక సంఖ్యలో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో 2017–18 నుంచి యువకులను యువతులు అధిగవిుంచారు. యువకుల జీఈఆర్ 28.4శాతం ఉండగా.. యువతుల జీఈఆర్ 28.5శాతంగా నమోదైంది. 2017–22 మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)–డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక–2024 వెల్లడించింది. సీఐఐ–డెలాయిట్ సంయుక్తంగా 2017–22 మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యా రంగం తీరుతెన్నులను విశ్లేషించాయి.ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ....» దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో దేశంలో 39,050 కాలేజీలు ఉండగా 2022 నాటికి 42,825కు పెరిగాయి.» ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే ‘గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. 2017–18లో జీఈఆర్ 24.6శాతం ఉండగా... 2021–22 నాటికి 28.4శాతానికి పెరగడం విశేషం.» ఉన్నత విద్యా సంస్థల్లో యువతుల జీఈఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం. యువతుల జీఈఆర్ 2017–18లో 25.6శాతం ఉండగా 2021–22నాటికి 28.5శాతానికి పెరిగింది. » ఉన్నత విద్యా సంస్థల్లో యువకుల జీఈఆర్ 2017–18లో 24.6శాతం ఉండగా, 2021–22నాటికి 28.4 శాతానికి చేరింది. ఈ ఐదేళ్లలోను యువతుల జీఈఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.» ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో ఇది సాధ్యపడింది. 2017–18లో 25 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా... 2021–22 నాటికి 23 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. » ఇక దేశంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2017–18లో దేశంలో మొత్తం 1,61,412 మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరారు. 2021–22లో ఏకంగా 2,12,522 మంది పీహెడ్డీ కోసం ఎన్రోల్ చేసుకోవడం విశేషం. » పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సుల్లో 2017–18లో 29.40 లక్షల మంది విద్యార్థులు చేరగా... 2021–22 విద్యా సంవత్సరంలో 37.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2017–18లో 2.64 కోట్ల మంది విద్యార్థులు చేరగా, 2021–22 విద్యా సంవత్సరంలో 3.07కోట్ల మంది ప్రవేశంపొందారు. -
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్‌ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్‌ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్‌కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్‌ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
కాంట్రాక్టర్లకు మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. » లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు. » ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. » దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. » కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం.. » యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. » ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. » అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. » నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు. అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్‌గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. -
పాఠశాల విద్యలో పైరవీల రాజ్యం!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో మరోసారి అక్రమ బదిలీలకు తెర తీశారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను రికమండేషన్ల లేఖలతో ఓపెన్ స్కూల్ కంట్రోలర్లుగా బదిలీ చేయడం విస్మయం కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగు చూసింది. పలు జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల లేఖలతో ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్ద క్యూ కట్టడంతో వారికి ఓపెన్ స్కూల్ జిల్లా స్థాయి పోస్టులు ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో కీలకంగా మారిన సిఫారసు లేఖలు ఇప్పుడూ పని చేస్తున్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలకు వెళ్లడం.. అందుకు ఎమ్మెల్యేలు సహకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకే పోస్టుకు ఎమ్మెల్యే, మంత్రి చెరొకరిని సిఫారసు చేయడం.. దాన్ని విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవడం.. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఆరు జిల్లాలకు మెమో..ఆరు జిల్లాలకు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లుగా కూటమి నాయకులు సిఫారసు చేసిన ఉపాధ్యాయుల పేర్లతో మంగళవారం మెమో విడుదల కావడం చర్చకు దారితీసింది. హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని వైఎస్సార్ కడప జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌గా నియమించాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి లేఖ ఇవ్వగా... ఇదే పోస్టు మరో ఉపాధ్యాయుడికి ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి లేఖ ఇచ్చారు. విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ పోస్టుకు ఆ జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రకాశం జిల్లా పోస్టుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, అనంతపురం పోస్టుకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అన్నమయ్య జిల్లా పోస్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి లేఖలతో ఉపాధ్యాయులకు ఆయా పోస్టులు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేటప్పుడు ఆయా పోస్టుల వివరాలు, అర్హతలను బహిరంగ పరచాలి. విధివిధానాలతో దరఖాస్తులు ఆహ్వానించాలి. కానీ ఇవేమీ లేకుండానే నేతల సిఫారసు లేఖలకు విద్యాశాఖ అధికారులు తలొగ్గడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
వీఓఏల పోరుబాట
సాక్షి నెట్వర్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దుచేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖç³ట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల రాష్ట్ర సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది. -
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్‌చార్జ్ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా? చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి.. ఈ రోజు ప్రజలు రోడ్డెక్కితే పన్నుల వాత పెడతామని చెబుతున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేయిస్తాం.. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారు. సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే విద్యుత్ చార్జీలు.. యూజర్ చార్జీలు, టోల్ చార్జీలతో బాదడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడే ఇందుకు నిదర్శనమన్నారు. భావితరాల కోసం గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన విలువైన సంపద మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కామ్‌ల కోసం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? అత నిలదీశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి విషయంలోనూ బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయన్నారు. ‘మద్యంలో స్కామ్.. ఇసుకలో స్కామ్.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులతో స్కామ్.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే నియోజకవర్గాల్లో పనులు సాగని దుస్థితి.. ఎటు చూసినా నాకింత.. నీకింత! అని దోచుకోవడం.. పంచుకోవడమే! ఓవైపు సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు.. మరోవైపు ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు’ అని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో ఇంకో స్కామ్, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఎక్కడ పరిశ్రమలు, నిర్మాణాలు జరుగుతున్నా.. మైనింగ్ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే పనులు సాగని పరిస్థితి. అదానీ వాళ్లు ప్లాంట్ కడుతుంటే కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు ప్రోద్బలంతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో నాకింత.. నీకింత అని దోచుకోవడం.. పంచుకోవడమే జరుగుతోంది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, విద్యుత్ చార్జీలు, రోడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ, అప్పులు, రాష్ట్ర ప్రగతి, ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు.. ఇవన్నీ గాక తల్లి, చెల్లి అంటూ నా కుటుంబం మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నాడు.సూటిగా ఆయన్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. నీకూ కుటుంబం ఉంది. మా కుటుంబంలో విబేధాలు ఉండొచ్చు. నువ్వు పెట్టే పోస్టులు కానీ, క్రూరమైన రాజకీయాలు కానీ, ఎవరూ చేయరు. నీలాంటి దుర్మార్గుడైతే తప్ప. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో అధికారిక ప్రతినిధితో నన్ను ‘బోస్డికే’ అని తిట్టించాడు. అది దుర్మార్గం కాదా? నా చెల్లెలు షరి్మల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది, లోకేశ్ మామ బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్ నుంచి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేయలేదా? హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలలేదా? స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే, నిందితులను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? ఈడీ వాళ్ల ప్రాపర్టీస్‌ను అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్ నుంచే ఆ డబ్బులన్నీ వెళ్లడంతో పక్కాగా స్కామ్ అని తేలడంతోనే వాళ్లను ఈడీ అరెస్ట్ చేసింది. అలాంటప్పుడు ఈ కేసులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి కదా? డబ్బులు ఇచ్చింది చంద్రబాబే కదా? వాళ్లు ‘వివేకం’పేరిట ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తే తప్పు లేదు. రాంగోపాల్ వర్మ సినిమా తీసి సెన్సార్ బోర్డు అనుమతితో రిలీజ్ చేస్తే ఆ సినిమాలో తమను కించపరిచారంటూ ఆయనపై కేసులు పెడుతున్నారంటే వీళ్లను ఏమనాలి? సెన్సార్ బోర్డు అప్రూవల్తో విడుదలైన సినిమాను అడ్డం పెట్టుకొని ఆయన్ని పిలిపించే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ కాదా? సెన్సార్ బోర్డులు ఎందుకున్నట్టు?సూమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్ లెన్సర్ విస్కీ, ట్రోపికానా వీసా బ్రాందీ, షార్ట్ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవన్నీ రూ.99 అని చెబుతున్నారు. నాణ్యతను తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ రూ.85కే దొరుకుతుంది. చంద్రబాబు మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. నాణ్యత తగ్గించిన మద్యాన్ని వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఉండే బ్రాండ్లు ఎమ్మార్పీ ఇప్పటికీ రూ.120నే. కానీ, ఎక్కడా ఆ ధరకు అమ్మట్లేదు. – వైఎస్ జగన్ఉద్యోగులకు ఐఆర్ ఎక్కడ?చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకటవ తేదీనే జీతం అన్నారు. ఈ నెలలో మూడు వారాలు అయిపోతున్నా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఐఆర్ ఊసే ఎత్తట్లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. మరి కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించాలా లేదా? మరో వైపు వలంటీర్లు, బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలను పీకేశారు. 104, 108 ఉద్యోగులను పీకడానికి రెడీ అవుతున్నారు. హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు.తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి, చంద్రబాబు తన వద్ద కూర్చో బెట్టుకున్నారు. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్ చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీస విచారణ లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోర్టులకు కూడా హాజరు పర్చడం లేదు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు హెబియస్ కార్పస్ పిటీషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వారి వద్దే పెట్టుకుని, కళ్లకు గంతలు గట్టి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాదు.. వీడియోలు తీసి పైనున్న ఈ జట్టు అధికారులకు పంపుతున్నారు. – వైఎస్ జగన్వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు..మాపై బండవేసే ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు నుంచే వలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ అప్రూవల్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతుందా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇస్తారా? ఈయనేమో హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటారు. అయ్యా చంద్రబాబూ.. హెడ్ ఆఫ్ అకౌంట్లో 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటైల్డ్ హెడ్, 293 అబ్జెక్ట్ హెడ్.. ఇవన్నీ వలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ నంబర్లు. ఇన్నేళ్లూ ఈ హెడ్ల కిందే జీతాలు ఇస్తున్నారు. ఫైనాన్స్ కాంకరెన్స్తో.. బడ్జెట్లో పెట్టి.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు జీతాలు ఇస్తున్నా కూడా.. వలంటీర్లకు ఇచ్చిన హామీని ఎగరగొట్టి అబద్ధాలు, దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. ఇదీ చంద్రబాబు పరిపాలన.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనం వివరాలు వలంటీర్లపై దిక్కు మాలిన అబద్ధాలాడుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు 2023లోనే.. అంటే మా హయాంలోనే ‘ప్రస్తుతం వలంటీర్లు ఎవ్వరూ పని చేయట్లేదు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు’ అని చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న ప్రశ్నకు మాత్రం రూ.277 కోట్లు అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా! ఎన్నికలప్పుడు వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది వాస్తవం కాదా బాబూ? వలంటీర్ల వ్యవస్థ ఉనికిలోనే లేదని.. వారికి గౌరవ వేతనం పెంపు అన్నది ఉత్పన్నమే కాదని తేల్చిచెప్పిన సర్కార్.. పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే⇒ పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టాక.. గోదావరి నదికి అడ్డంగా 2.5 కి.మీల పొడవునా ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రం వాల్ వేసి, ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి.⇒ కానీ.. కాంక్రీట్ పనుల్లో కమీషన్లు ఎక్కువగా రావని.. మట్టి పనుల్లో అయితే ఎక్కువ కమీషన్లు వస్తాయని స్పిల్ వే పునాది స్థాయిలో ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ వేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్ వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా 400 మీటర్లు, 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కి.మీల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద.. కుంచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ⇒ మేం అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మురమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతానికి మరమ్మతులు చేసి, యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కట్టాలా అన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. ⇒ ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొత్త డయా ఫ్రం వాల్ వేసి, ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్ మాదిరిగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్లకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయతగ్గ ముఠా మా దగ్గర లేదు.ఐదేళ్లలో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చావా? ⇒ చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? మేము 30.60 లక్షల కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 9.02 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల జగనన్న కాలనీల్లో ఏకంగా ఊళ్లే తయారవుతున్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తయితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చంద్రబాబు హౌసింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో సిమెంట్, స్టీలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై, ఇసుకను ఉచితంగా ఇచ్చే వాళ్లం. ఇవి కాకుండా రూ.35 వేలు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చే వాళ్లం. రూ.1.80 లక్షల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే వాళ్లం. అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిలిపి వేసినందుకు నిరుపేదలందరూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో.. ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వీళ్లకే తెలీదు.బినామీలకు దోచిపెట్టేందుకే అసైన్డ్‌పై దుష్ప్రచారం⇒ అసైన్డ్ భూములపై నిస్సిగ్గుగా అబద్ధాలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాక ముందు పేరుకే దళితులకు భూమి ఉండేది. దానిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా, వారసుల పేరుపైకి బదిలీ చేయాలన్నా అగమ్య గోచర పరిస్థితి ఉండేది. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో శనక్కాయలకు.. పావలాకు, పది పైసలకు వేరే వాళ్లు కొనుక్కొని అనుభవించే వారు.⇒ మేము అధికారంలోకి వచ్చాక పేదల జీవితాలు మార్చాలని ఆలోచించాం. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూమి ఉన్న వారికి చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తూ సొంత భూములుగా మార్చాం. ఆ సొంత భూములను అమ్ముకుంటారా? వాళ్ల పిల్లలకు ఇచ్చుకుంటారా? వాళ్ల ఇష్టం. ఈ లోగా ఎవరైనా భూములు కొనుగోలు చేసి ఉంటే కూడా అవన్నీ ఒరిజినల్ అసైనీలకు వెళ్లిపోతాయి. వాళ్ల పేరుతోనే పట్టా వస్తుంది. కొన్న వాళ్లకు పట్టా రాదు. ఇలా హక్కులిచ్చి 15.21 లక్షల మంది రైతులకు, పేదలకు మంచి చేస్తే కూటమి నాయకులు నిస్సిగ్గుగా బురద వేస్తున్నారు. మళ్లీ పేదల దగ్గర నుంచి హక్కులు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారి హక్కులను రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అవే భూములను పెత్తందార్లు 10 పైసలకు, 20 పైసలకు కొనుక్కోవచ్చు. వీళ్లకు మాత్రమే మంచి రేటు ఉండాలి. పేదలకు మాత్రం మంచి రేటు రాకూడదు.⇒ చంద్రబాబు ఇచ్చిన ఒక మెమో ద్వారా 2.06 లక్షల ఎకరాలను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టారు. 98 వేల మంది రైతులను నానా కష్టాలకు గురి చేస్తున్నారు. మేము నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించి.. రైతుల భూమిపై చంద్రబాబు చేసిన దాష్టీకం నుంచి విడుదల చేశాం. వారి భూములపై సర్వ హక్కులు కల్పించాం. అది తప్పంటున్నారు. ⇒ ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి 22వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఇది మరో విప్లవం. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి ఏకంగా 1.07 లక్షల మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. 33 వేల ఎకరాల షరతుల భూములపై 22 వేల మంది రైతులకు సర్వ హక్కులు కల్పించాం. ఇదంతా వాళ్లు తప్పంటున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలు అందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు.. ఇప్పుడు డెప్యూటీ సీఎం ఊగిపోయాడు. వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఐదేళ్లలో 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్లంతకు వాళ్లే చెప్పారు. గతంలో 30 వేల మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వలంటీర్లపై వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్స్టాప్ కాదా? – వైఎస్ జగన్కేవలం 46 మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని తేల్చిన కూటమి సర్కార్ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా?సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్సెవెన్లు లేవు.. మరో వైపు అన్ని రకాలుగా రాష్ట్రం వైఫల్యం చెందింది. ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే చాలు దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రైవేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ నిర్బంధాలు (ఇల్లీగల్ డిటెన్షన్) చేస్తున్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.⇒ కొట్టాం.. వీడియోలు తీశాం.. చూసి ఆనందించండి.. అని స్థానిక పోలీసులు పై వాళ్లకు పంపిస్తూ శాడిజం ప్రదర్శిస్తున్నారు. పైగా థర్డ్ డిగ్రీ దెబ్బలు చూపిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల కోసం బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్ అయిన వారిని న్యాయవాదులు కష్టపడి బెయిల్‌పై బయటకు తీసుకొస్తుంటే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.⇒ చంద్రబాబు అరాచకాలు ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చివరకు సినీ దర్శకులపై కూడా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ ప్రోద్భలంతో సీఐ ద్వారా నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేశారు. తోటలో పని చేస్తున్న 55–60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని కొట్టి ఒప్పించే కార్యక్రమం చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట తన దెబ్బలు చూపించి, జరిగిన విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ సీఐని మేజిస్ట్రేట్ తిట్టి పంపించిన ఘటన వారం రోజుల క్రితం జరిగింది. తుదకు సినీ దర్శకులను కూడా వదలడం లేదు. వాళ్లేమో ఇష్టానుసారం సినిమాలు తీయొచ్చట.⇒ రాష్ట్రంలో పేకాట జరుగుతుందని, తన నియోజకవర్గంలో నడుస్తోన్న పేకాట క్లబ్‌ను ఉదాహరణగా చూపుతూ పోస్టు పెట్టినందుకు మా ఎమ్మెల్యే చంద్రన్నపై కూడా కేసు పెట్టారు. ఆయనపై ఇప్పటి వరకు 8 కేసులు పెట్టారు. మరో దళిత ఎంపీ నందిగాం సురేష్‌పై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఆ రోజు ఆయన అసలు ఊళ్లోనే లేడు. అయినా అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్‌పై బయటకొచ్చేలోగా మరో కేసు పెడుతున్నారు. అన్నీ దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, మాజీ ఎంపీ.. 70 రోజులుగా జైలులో ఉన్నాడు. మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాలపై కూడా ఇష్టానుసారం కేసులు పెట్టారు.⇒ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఒక వైపు కేసులు పెట్టడం, మరొక వైపు ఎవరైనా మాట్లాడితే అన్యాయంగా దూషించడం. ఇంకొక వైపు దుష్ప్రచారాలు చేయడం. ఇది చంద్రబాబు నైజం. టాపిక్ డైవర్షన్, తప్పుడు ప్రచారం, అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అసాస్నేట్) చేయడంలో ప్రసిద్ధుడు. లక్ష్మీపార్వతితో మొదలు నా వరకు ఎలా ప్రచారం చేశారో చూశాం.నా చెల్లిపై దుష్ఫ్రచారం చేసింది చంద్రబాబే ⇒ చంద్రబాబు తప్పుడు ప్రచారంపై గతంలో నా చెల్లెలు షర్మిల ఏమన్నారో చూడండి. (వీడియోను ప్రదర్శిస్తూ..) ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. ‘ఎన్బీకే బిల్డింగ్ నుంచి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్‌ను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఈ వెబ్సైట్లన్నీ ప్రొ టీడీపీ ప్రమోట్ చేసినవే. ప్రత్యర్థులను కించపరిచేవి. ఈ పోస్టింగ్‌లన్నీ బాలకృష్ణ బిల్డింగ్ నుంచి, ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయంటే బాలకృష్ణకు సంబంధం లేదని నేను ఎలా అనుకోవాలి? సంబంధం ఉంది కనుకే బాలకృష్ణ నా మీద నింద వేశారని, పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నా. బాలకృష్ణ ఇలా దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే చెప్పాలి’ అన్నారు.⇒ మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి పేరిట ఐ టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను, మా చెల్లెలిని తిట్టించాడు. వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్‌ను ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తాడు. వాళ్ల సానుభూతిపరులతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయించి, వాళ్లతో మన వాళ్లను తిట్టిస్తాడు.మద్యం, ఇసుక అంతా స్కామ్..⇒ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు దోచుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నారు. మద్యం రేటు తగ్గిస్తానన్నారు. ఆశ్చర్యం ఏమంటే.. గతంలో చంద్రబాబు హయాంలో అవే డిస్టిలరీలు.. మా హయాంలో అవే.. ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలు. మద్యం ఆదాయంలో చీప్ లిక్కర్ నుంచే 85 శాతం వస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లో నాణ్యత తగ్గించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఎప్పుడూ మనం వినని, చూడని బ్రాండ్లు అవి.⇒ అన్ని చోట్లా బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో బెల్టు షాపునకు.. ఒక్కో గ్రామంలో పోటీ పెట్టి వేలం వేస్తున్నారు. రూ.2 లక్షలకు పాడుకున్న వాడికే ఇస్తున్నారు. ఇలా మాఫియా రాజ్యం నడుస్తోంది. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకోవాలంటే పోటీ ఎందుకు? ఎమ్మెల్యేలు మనుషులను ఎందుకు కిడ్నాప్ చేయించాలి.. ఎందుకు ఎవరినీ పాడనివ్వకుండా చేయాలి? వేరేవాళ్లకు వచ్చినా షాపులు నడుపుకోలేని పరిస్థితికి ఎందుకు నెట్టేయాలి? ఎమ్మార్పీ ప్లస్ మాఫియాకు కమీషన్ రావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇసుక పరిస్థితి కూడా అంతే. హామీ ఇచ్చినట్లు ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. -
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు లాంటి క్రూర రాజకీయాలు ఎవరూ చేయరంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒక వైపు కేసులు. మరోవైపు దుష్ప్రచారం. టాపిక్ డైవర్ట్ చేయడంలో, తప్పుడు ప్రచారం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో, మోసాలు చేయడంలో, వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు ఎంత ప్రసిద్దుడో అందరికీ తెలుసు. లక్ష్మీపార్వతితో మొదలుపెడితే నా వరకు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, విద్యుత్ మీద, రోడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, పరిశ్రమల మీద, పారిశ్రామికవేత్తల మీద.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూల మీద దుష్ప్రచారం. ఇవన్నీ గాక, తల్లీ చెల్లీ అంటే నా కుటుంబంపై ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నాడు.’’‘‘చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. నీకు కుటుంబం ఉంది. మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నీవు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయరు. నేను చంద్రబాబును ఒకటే అడుతున్నాను. నేను సీఎంగా ఉన్నప్పుడు, ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీస్‌లో తన పార్టీ అఫీషియల్ ప్రతినిధితో నన్ను ఏమని తిట్టించాడు.. బోస్డీకే అని. అది ధర్మమేనా?’’‘‘ఇదే చంద్రబాబునాయుడు నా చెల్లెలు షర్మిల మీద, హైదరాబాద్, జూబిలీహిల్స్ రోడ్ నెం.36లో ఆయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ తన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి తప్పుడు వార్తలు రాయించలేదా? పోలీసుల దర్యాప్తులో అది తేలలేదా?’’‘‘ఇంకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఆయనకు చెందిన ఐ–టీడీపీ సభ్యుడు ఉదయ్‌భూషణ్ అనే వాడు ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, దాని ద్వారా మా అమ్మను, మా చెల్లిని తిట్టించాడు. దీంతో వర్రా రవీందర్‌రెడ్డి కేసు పెడితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు ఉదయ్భూషణ్ను ఆధారాలతో సహా అరెస్టు కూడా చేశారు.’’‘‘చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవ్వరిమీద అయినా సరే, వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఆయనే మన సానుభూతిపరుడు ఎవరైనా ఉంటే, వారి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయిస్తాడు. వారితోనే మనల్ని తిట్టిస్తాడు. మనం తిట్టించామని బయట ప్రచారం చేస్తాడు.ఇటువంటి మనిషి ప్రపంచంలో అరుదుగా పుడతాడు.’’ఏనాడైనా నీ తల్లిదండ్రులను పట్టించుకున్నావా?‘‘నేను చంద్రబాబును సూటిగా ఒకటే అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపావా? మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. నీ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు చూపించావా? వారితో కలిసి ఎప్పుడైనా ఉన్నావా?. రాజకీయంగా నీవు ఎదిగిన తర్వాత నీ ఇంటికి తీసుకొచ్చి రెండు పూటలు భోజనం పెట్టి, వారిని సంతోషంగా పంపించావా? వారిద్దరూ కాలం చేస్తే, కనీసం తలకొరివి అయినా పెట్టావా?’’‘‘ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డి అయినా తింటాడు. ఏ అబద్ధం అయినా ఆడతాడు. మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.’’ అని అన్నారు..రామ్ గోపాల్ వర్మపై ‘‘రామ్ గోపాల్ వర్మపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. సెన్సార్ బోర్డ్ అనుమతితోనే సినిమాలు రిలీజ్ చేశారు. వర్మకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఉంది. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా?’’ ‘‘న్యాయం కోసం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. దళితుడు మాజీ ఎంపీ, నందిగం సురేష్ మీద కేసులు మీద కేసులు పెట్టారు. నందిగం సురేష్ 70 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ప్రశ్నించిన దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్‌పై 8 కేసులు పెట్టారు. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారిని అక్కడే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వీడియోలు తీసి పై వాళ్లకు పంపిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టి పీఎస్‌లకు మారుస్తున్నారు. అరెస్టైన వారు జడ్జీల దగ్గర దెబ్బలు చూపిస్తున్నారు’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పని జరగడం లేదు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడా చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయని.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక స్కామ్‌లే కనిపిస్తున్నాయి.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు కప్పం కట్టనిదే ఏ పని జరగడం లేదు. ఈ ప్రభుత్వంలో దోచుకోవడం.. పంచుకోవడమే.’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చి దండుకుంటున్నారు.. క్వాలిటీ తగ్గించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. స్కామ్‌ల కోసం ఈరోజు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు అమ్మేయడం సంపద సృష్టా? సంపద సృష్టిస్తానని.. కరెంట్ బిల్లులు బాదుడే బాదుడు. కరెంటు బిల్లులు బాదుడే రూ.18 వేల కోట్లు. ట్రూ అఫ్ఛార్జీల పేరుతో చంద్రబాబు బాదుడే బాదుడు. సంపద సృష్టి పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రోడ్ల నిర్మాణం కోసం 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. పోర్టులు నిర్మిస్తేనే రాష్ట్రానికి సంపద సృష్టి అవుతుంది. గ్రామీణ రోడ్లపై టోల్ వసూలు చేయడం సంపద సృష్టి అవుతుందా?. అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పిచంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అసైన్డ్ భూములపై అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లపై కూడా తప్పుడు ప్రచారం చేశారు. దళితుల వద్ద నుంచి పెత్తందారులు అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.2.06 లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22ఏలో పెట్టారు. 98 వేల రైతులను నిషేధిత జాబితాలో పెట్టారు. మా హయాంలో 15 లక్షల మంది పేదలకు మంచి చేశాం. అసైన్డ్ భూములపై పేదలకు సర్వహక్కులు కల్పించాం. మరో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాం. 1.07 లక్షల మంది రైతుల సమస్య పరిష్కరించాం. బాబు హయాంలో పేదలకు సెంటు స్థలం ఇచ్చారా?. మా హయాంలో 30.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. 9 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు నిర్మాణాల్లో ఉన్నాయి. 17 వేల జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాం. ఇళ్లు కాదు.. ఊళ్లే నిర్మాణంలో ఉన్నాయి. ఈ రోజు ఇళ్ల నిర్మాణాలనే ఆపేశారు. పేదలంతా చంద్రబాబును తిట్టుకుంటున్నారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అబద్ధాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మోసాలు, అరాచకాలను నిలదీశారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని.. ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు.‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్ ఆలస్యం చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నారు.. కాగ్ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేసింది. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా?. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయనను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ’’బాబు దిగిపోయే నాటికి రూ.42,183 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.680 కోట్లు బకాయిలు పెట్టారు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. రూ. 28,457 కోట్లు పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు ఆర్థిక విధ్వంకారులో ఈ లెక్కలే సాక్ష్యం. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే. మా హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే వైఎస్సార్సీపీ హయాంలో 4 శాతం అప్పులు తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు.’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘బాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63 శాతం. మా హయాంలో 13.57 శాతం మాత్రమే. మా హయాంలో కోవిడ్ రాష్ట్రాన్ని పీడించింది. దేశ వృద్ధి రేటు కూడా 9.28 శాతానికి తగ్గిపోలేదా? మా హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 12.61 శాతం పెరిగింది. బాబు హయాంలో 11.92 శాతం మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు. బాబు హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తే మా హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం’’ అని వైఎస్ జగన్ వివరించారు.ఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలేఅప్పులపై అదే దుష్ప్రచారం:బడ్జెట్ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు. అలాగే 2024లో వైయస్సార్సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు. అది బడ్జెట్లోనే కాకుండా, 2023–24లో కాగ్ రిపోర్ట్ (పేజీ నెం.18. 20)లో చూపారు. అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా, అబద్ధాల చెప్పడం ధర్మమేనా? రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. చివరకు ఎన్నికల నాటికి రూ.14 లక్షల కోట్లు అని చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే దుష్ప్రచారం చేస్తూ. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ (వ్యవస్థీకృత నేరం) చేశారు.అది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు పెట్టారు?:చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకుని, ప్రజలకు చెప్పాలి. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగమంతా ఆయన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లో ఉన్న అధికారులతోనే బడ్జెట్ తయారు చేయించి, సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్ కూడా ధృవీకరించింది. ఆ తర్వాత కూడా నీ హయాంలో, నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్, నీ లెక్కలను కాగ్ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత కూడా.. ఈ అప్పుల గురించి, మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే.. ఇక అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?. చెప్పే అబద్ధాలకు ఒకటే బొంకు. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు?మీరు రూ.42 వేల కోట్లు ఎగ్గొట్టి పోయారు: స్పిల్ ఓవర్ అక్కౌంట్స్ మీద కూడా అదే దుష్ప్రచారం. అవి ఏటా ఉంటాయి. ప్రతి బడ్జెట్ నుంచి, మరో బడ్జెట్‌కు స్పిల్ ఓవర్ బిల్స్ ఉంటాయి. అలా 2019లో చంద్రబాబు దిగిపోతూ మాకు పెట్టిపోయిన బిల్లులు ఏకంగా రూ.42,183 కోట్లు. బహుషా ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో గిఫ్ట్‌లు ఇవ్వదు. అయినా మేము చిరునవ్వుతో చెల్లించాం.బాబు హయాంలో పరిమితికి మించి అప్పు: 2014–19 మధ్య ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. అది కాగ్ నివేదికలోనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో కూడా ఉంది. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. ఆ విధంగా చూస్తే.. మా హయాంలో చేసిన ఎక్కువ అప్పు కేవలం రూ.1647 కోట్లు మాత్రమే. మరి ఎవరు ఆర్థిక వి«ధ్వంసకారుడు. ఎవరు క్రమశిక్షణతో నడిచారు అన్నది ఈ డేటా చూస్తే అర్థమవుతుంది.ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:చంద్రబాబు హయాంలో కోవిడ్ వంటి మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు ఆ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చూస్తే.. – చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 నాటికి అది రూ.3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పులు ఏటా సగటున 19.54 శాతం పెరిగాయి. అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు కాగా, ఆ పెరుగుదల (సీఏజీఆర్) 15.61 శాతం మాత్రమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలో 4 శాతం తక్కువ. అలాగే నాన్ గ్యారెంటీ అప్పులు కలిపి చూసినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8600 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.77వేల కోట్లకు చేరాయి. అదే మా హయాంలో ఆ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించాం. అంటే మేము దిగిపోయేనాటికి నాన్ గ్యారెంటీ అప్పులు రూ.75వేల కోట్లు. ఆ మేరకు చంద్రబాబు హయాంలో నాన్ గ్యారెంటీ అప్పులు 54.98 శాతం పెరిగితే, మా హయాంలో అది –0.48 శాతం.వృద్ధిరేటుపై అసెంబ్లీ చంద్రబాబు:తన హయాంలో 2014–19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతం ఉంటే, అది 2019–24 మధ్య మా హయాంలో 10.6 శాతానికి పడిపోయిందని చెప్పారు. అయ్యా, చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేదు. ఆ టైమ్‌లో దేశ వృద్ధి రేట్ చూస్తే.. కోవిడ్ వల్ల, దానికి ముందు 5 ఏళ్లతో పోల్చి చూస్తే.. అన్ని రాష్ట్రాల్లో అది తగ్గింది. అలాగే దేశంలో కూడా చూస్తే.. 10.97 శాతం నుంచి 9.82 శాతానికి వృద్ధిరేటు తగ్గింది.ఇతర రంగాల్లో గణనీయ పురోగతి: 2019–24 మధ్య వృద్ధి రేటు మందగించినా.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే.. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో అది సగటున 11.92 శాతం ఉంటే, 2019–24 మధ్య అది 12.61 శాతం నమోదైంది. అది సోషియో ఎకనామిక్స్ రిపోర్ట్‌లోనే ఇది స్పష్టంగా ఉంది. 2018–19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో జీవీఏ 1,88,601 కోట్లు అయితే, 2023–24 లో అది రూ.3,41,485 కోట్లు. అలాగే పారిశ్రామిక ఉత్పత్తి విలువలో 2014–19 మధ్య దేశంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మన హయాంలో 2023–24 నాటికి 8వ స్థానానికి వచ్చాం. అదే సమయంలో జీవీఏ పోల్చి చూస్తే, ఏపీ ఉత్పత్తి విలువ 12.6 శాతం ఉంటే, దేశ సగటు అది 8.17 శాతమే. అంటే 4 శాతం ఎక్కువ.ఉద్యోగావకాశాలు, తలసరి ఆదాయాల పోలిక:ఎంఎస్ఎంఈ సెక్టర్లో చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కేవలం 8,67,537 ఉద్యోగావకాశాలు వస్తే.. 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగావకాశాలు వచ్చాయి. అలాగే భారీ, అతిభారీ పరిశ్రమల రంగం ద్వారా మా హయాంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.154,031 కాగా, మా హయాంలో అది రూ.2,42,470. చంద్రబాబు హయాంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే, మా హయాంలో 15వ స్థానానికి ఎదిగింది. వాస్తవాలు ఇలా ఉంటే, తన హయాంలో కంటే, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీ పడిపోయిందని మాత్రమే చెబుతాడు. మిగిలిన అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పడు. తన హయాంలో కోవిడ్ లేదని చెప్పడు. పెరిగిన ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పడు.సూపర్‌సిక్స్ అమలు లేదు:సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు. దాంట్లో చాలా చిన్న అంశం గ్యాస్ సిలిండర్ పంపిణీ. అందులో పెద్దవి ఏమిటంటే.. చిన్నపిల్లలకు నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో అత్త కనిపిస్తే నీకు రూ.48 వేలు.. సంతోషమా? ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.20 వేలు అనేవారు. అవన్నీ పెద్దవి. అందులో మోసం చేశారనుకుంటే.. చిన్నవైనా గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు. సిలిండర్లపై ఒక్కొ క్కరు ఒక్కోమాట. రాష్ట్రంలో యాక్టివ్ సిలిండర్లు 1.55 కోట్లు. ఆయిల్ కంపెనీల డేటా ఇది. ఆ లెక్కన ఒక్కోటి రూ.895. ఏటా మూడు సిలిండర్లు. మొత్తం కలిపితే రూ.4200 కోట్లు. బడ్జెట్లో పెట్టింది రూ.895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా రూ.1400 కోట్లు కావాలి. కానీ ఆ కేటాయింపు లేదు. అది దారుణ మోసం. -
ఏపీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు.. అనవసర ప్రసంగాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తప్పుడు లెక్కలతో, అసత్య ఆరోపణలతో, అనవసరమైన ప్రసంగాలతో ఎనిమిదో రోజుకి చేరింది. ఓవైపు వైఎస్సార్సీపీ బహిష్కరణతో శాసనసభ ఏకపక్షంగా నడుస్తుండగా.. శాసనమండలిలోనైనా కనీసం వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు పొంతన లేని వివరణలతో నెట్టుకొస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా.. ఇవాళ.. అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు.ఏపీ అప్పులపై మండలిలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆ వెంటనే..ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘ ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెప్తున్నారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తాం. అంతే కానీ ఈ ఆరోపణలు సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’’ బొత్స మండిపడ్డారు.నేను బుడమేరు బాధితుడ్నే: ఎమ్మెల్సీ రుహుళ్లశాసన మండలి బుడమేరు వరదల పై మండలి లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. బుడమేరు కి 4 సార్లు వరద వస్తే 3 సార్లు చంద్రబాబు హయాంలో నే వచ్చింది. బుడమేరు ఆధునికీకరణ కోసం 2014 నుండి 2019 వరకు ఏమైనా ఖర్చు చేశారా?. బుడమేరు వరదల పై కేంద్ర బృందాలు ఎంత నష్టం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, ఎంత ఖర్చు చేశారు..?ఆపరేషన్ బుడమేరు నెల రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలి?. నష్టపరిహారం సక్రమంగా చేస్తే బాధితులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాహుళ్ల ప్రసంగిస్తూ.. నేను కూడా వరద బాధితుడిని. వరద వచ్చేముందు ప్రజలు కనీసం ప్రజలను అప్రమత్తం చెయ్యలేదు. అధికారులు ఏం చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రజలను ముంచేశారు. మజీద్ వెళ్లి వచ్చే లోపే మా ప్రాంత ప్రజలంతా ముంపుకి గురయ్యారు అని అన్నారు.అయితే బుడమేరు పరిధిలో ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ పవర్ ప్లాంట్ ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఏది?శాసన మండలి.. ప్రభుత్వ ఉద్యోగ ల భర్తీ పై మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ‘‘గత ప్రభుత్వం లో లక్ష 34 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం.2014 నుండి 2019 మధ్య లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రంలో అన్ని శాఖల ఖాళీల పై.మదింపు చేస్తున్నాం. ఇంకా ఖాళీల వివరాలు రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ వాకౌట్శాసన మండలి ట్రూ అప్ చార్జీల భారంపై వాడీవేడీ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం వేయం అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ట్రూ అప్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు? అని ఎమ్మెల్సీ రవిబాబు ప్రశ్నించారు. దానికి మంత్రి మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిస్తూ.. ఈఆర్సీ ఆమోదించిన మేరకు ట్రూ అప్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. అయితే..ప్రజలకు చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఈఆర్సీలో అఫిడవిట్ వెయ్యొచ్చు కదా అని ప్రశ్నించిన బొత్స.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. ప్రజల పై విద్యుత్ చార్జీలు మోపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.హామీలపై సమీక్షలు జరుపుతున్నాం: చంద్రబాబుగత ప్రభుత్వం అప్పులు.. ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఇచ్చిన హామీలపై అనునిత్యం సమీక్షలు జరుపుతున్నాం. ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు’’ అని అన్నారాయన. అలాగే.. అధికారం తనకేం కొత్త కాదని.. సీఎం పదవి అంతకంటే కొత్త కాదని చెబుతూ.. నాలుగోసారి సీఎం కావడం అరుదైన అనుభవమని చెప్పారు. గత ప్రభుత్వమే రోడ్లకు గుంతలు పెట్టి వెళ్లిపోయిందని, దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం గేమ్ ఛేంజర్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. బాబు పాలనపై సంతృప్తి: పవన్విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు.. ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. చంద్రబాబు 150 రోజుల పాలన సంతృప్తిగా ఉంది. చంద్రబాబు పాలనపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్ అచ్చెన్న!
అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు... గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు. -
‘‘వలంటీర్ వ్యవస్థే లేదు’’.. భగ్గుమన్న శాసనమండలి
సాక్షి, అమరావతి: వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది. ‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి. మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.వలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది. -
నీళ్లున్నా కన్నీరే
తలాపున కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతున్నప్పటికీ ఇక గ్రేటర్ రాయలసీమకు కన్నీళ్లు తప్పవా? కళ్లెదుటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా వరద జలాలు కడలిలో కలుస్తున్నా సరే గ్రేటర్ రాయలసీమకు చుక్క నీటిని విడుదల చేయరా? విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పదో పేరా ద్వారా కేంద్రం అనుమతి ఇచ్చిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. నీటి పారుదల రంగ నిపుణులు. సాక్షి, అమరావతి : దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ(ఆపరేషన్ రూల్స్)పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షి ఏకే గోయల్ అక్టోబర్ 18న దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక.. 2013 నవంబర్ 29న తుది నివేదిక ఇచ్చాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను కేంద్రం అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపు చేసే బాధ్యతను విభజన చట్టం ద్వారా కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కే అప్పగించింది. విభజన చట్టంలోని మార్గదర్శకాలు, కేంద్రం గతేడాది అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి తెలుగు గంగ (29 టీఎంసీలు కృష్ణా జలాలు + 30 టీఎంసీలు పెన్నా జలాలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ ప్రాజెక్టు (43.5 టీఎంసీలు)ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కు మూడు దశాబ్దాలుగా, 11 ఏళ్లుగా గాలేరు–నగరి, .. 12 ఏళ్లుగా హంద్రీ–నీవాకు నీరు విడుదల చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచడమే తరువాయి. శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చు. కానీ.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణపై కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తన తరఫు సాక్షి అయిన ఏకే గోయల్ ద్వారా దాఖలు చేయించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరిలతోపాటు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారిందని నీటి పారుదల రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. సముద్రంలో కలిసినా సరే.. ⇒ గత ఆరేళ్ల తరహాలోనే కృష్ణాకు ముందుగా అంటే జూలై, ఆగస్టులో వరదలు ప్రారంభమై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండి.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నా సరే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన ప్రాజెక్టుల కింద 811 టీఎంసీల నికర జలాలు (75 శాతం లభ్యత) వాడుకుని, శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద నిల్వ చేశాకే ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2130 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లు దక్కే అవకాశాలు కనిష్టంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాలే ⇒ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలు కలుపుకుంటే 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. అంతకంటే అదనంగా ఉన్న జలాలు అంటే.. మిగులు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచి్చంది. ⇒ కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీల నికర జలాలను యథాతథంగా కొనసాగిస్తూనే.. 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసింది. దాంతో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 907, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీలు దక్కాయి. తద్వారా కేడబ్ల్యూడీటీ–2 మొత్తం 2,578 టీఎంసీలను కేటాయించింది. అంతకంటే ఎక్కువ లభ్యత ఉన్న నీటిని అంటే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కేటాయించింది. ఈ నీటి కేటాయింపులు రాష్ట్రాలకు దక్కేలా చేయడం కోసం బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని సూచించింది. ⇒ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీల్లో.. 76–65 శాతం మధ్య లభ్యతగా ఉన్న 49 టీఎంసీలు (జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, క్యారీ ఓవర్ కింద 30, పర్యావరణ ప్రవాహాలు 6 టీఎంసీలు), 65 శాతం సగటు ప్రవాహాల మధ్య లభ్యతగా ఉన్న 145 టీఎంసీలు (తెలుగు గంగకు 25, క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలు) కేటాయించింది. ⇒ కేడబ్ల్యూడీటీ–2 తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలన్నీ 2,578 టీఎంసీలను వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో కలిపి కృష్ణా బోర్డును ఏర్పాటు చేసి.. అన్ని రాష్ట్రాలకు వాటా జలాలు అందేలా చూడాలని చేసిన సూచనను కేంద్రం అమలు చేయలేదు. ఇప్పుడు కూడా కృష్ణా బోర్డును అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకపోతే.. 2,578 టీఎంసీలను వినియోగించుకున్నట్లు తేల్చేదెవరని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 2,578 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ⇒ ఇక కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన నీటిని గంపగుత్తగా వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదించలేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించినా సరే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయని తేల్చి చెబుతున్నారు.తుంగభద్రలో పూడికతో ‘సీమ’కు నష్టం తుంగభద్ర డ్యాంను 133.5 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచారు. ఆ డ్యాం ఒకటిన్నరసార్లు నిండుతుందని.. దాని వల్ల ప్రాజెక్టులో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. రాయలసీమకు 66.5 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 24, కేసీ కెనాల్ 10), తెలంగాణ(ఆర్డీఎస్)కు 6.51 టీఎంసీలు కేటాయించింది. కానీ.. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో నీటి నిల్వ 105 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 25 టీఎంసీల నిల్వ తగ్గినట్లు స్పష్టమవుతోంది. డ్యాం ఒకటిన్నర సార్లు నిండుతుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నేపథ్యంలో పూడిక వల్లే.. 37 టీఎంసీలు, నీటి ఆవిరి రూపంలో 5.. వెరసి 42 టీఎంసీలను రాయలసీమ కోల్పోవాల్సి వచి్చంది.ఆ నీళ్లన్నీ తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. నీటి లభ్యత తక్కువగా ఉందని చూపుతూ దామాషా పద్ధతిలో తుంగభద్ర నీటి కేటాయింపులు చేస్తోంది. దాంతో తుంగభద్ర డ్యాం నుంచి రాయలసీమకు గరిష్టంగా 40 టీఎంసీలు కూడా దక్కడం లేదు. దాంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల రాయలసీమ కోల్పోతున్న వాటా జలాలను వినియోగించుకునే ప్రాజెక్టులు నిరి్మంచడంపైనా రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక సాయం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యార్థులకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయడంలేదని మంత్రి లోకేశ్ ఓ పక్క స్పష్టంగా చెబుతున్నారు. పోనీ, 2019–24 మధ్య గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఎటువంటి మేలు జరిగిందో చెప్పడానికి కూటమి సర్కారుకు నోరు రావడంలేదు. అసలు సమాధానం చెప్పడానికే అంగీకరించలేదు. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరిది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి.విరూపాక్షి, డాక్టర్ దాసరి సుధ, ఎం. విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సభలో చర్చించనేలేదు.రాతపూర్వకంగా సమాధానమిచ్చి ‘చెప్పినట్టే’ భావించాలని పేర్కొన్నారు. 2019–24 మధ్య కాలంలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలు, విడుదల చేసిన మొత్తం ఎంతో చెప్పాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగానూ వివరాలు ఇవ్వలేదు. ‘ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శాసన సభకు వివరించారు. తల్లికి వందనం అనే కొత్త పథకాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు.గత ప్రభుత్వంలో డ్వాక్రాకు రూ.3,541.27 కోట్లుగత ఆర్ధిక సంవత్సరంలో సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు చేసే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. అంతకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి ఏప్రిల్ నెలలో వడ్డీ డబ్బులు జమ చేసేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ వడ్డీ డబ్బులు చెల్లించలేదు.దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం చెప్పకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. వడ్డీ లేని రుణాల అమలుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.950 కోట్లు సమకూర్చినట్టు చెప్పారు. 2019–24 మధ్య ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.3,541.27 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి 2023–24లో రూ.1,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుదల కాలేదన్నారు.అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిపై రెండు కమిటీలు: మంత్రి పయ్యావుల కేశవ్అంతర్ రాష్ట్ర ఉద్యోగుల మార్పిడిలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇరు రాష్ట్రాల సీనియర్ అధికారులు, మంత్రులతో రెండు కమిటీలు వేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వన్ టైం చర్యలో భాగంగా అంతర్ రాష్ట్ర బదిలీ కోసం తెలంగాణ ప్రభుత్వ సమ్మతి కోరామని, స్పందన రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు ఏపీకి వచ్చేందుకు విల్లింగ్ ఇచ్చారని, ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942 మంది అంగీకరించగా, అక్కడి స్థానికత గలవారు 1,042 మంది ఉన్నట్టు చెప్పారు.రూ.284 కోట్లతో కాల్వల నిర్వహణ: జలవనరులశాఖ మంత్రి నిమ్మలగత ఐదేళ్లలో ప్రాజెక్టులు, డ్రెయిన్స్ సరిగా నిర్వహించలేదని, విధ్వంసం జరిగిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సాగు నీటి కాల్వలపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. రిపేర్లు, అత్యవసర గండ్లు పూడ్చడం, గట్లు బలోపేతం చేపట్టలేదని, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోయాయని, అన్నమయ్యప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 42 మంది ప్రాణాలు పోయాయన్నారు. లస్కర్లకు ఏడాది నుంచి జీతాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 1,040 లిఫ్టు పథకాలు ఉంటే 450 మూతపడ్డాయన్నారు.వీటి నిర్వహణకు ఏడాదికి రూ.983 కోట్లు కేటాయించాలని ప్లానింగ్ కమిషన్ సూచిస్తే ఐదేళ్లలో రూ.125 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 2014–19 మధ్య క్యాపిటల్ హెడ్, మెయింటెనెన్స్ ఇతరత్రాకు రూ.5,091 కోట్లు కేటాయిస్తే గత ఐదేళ్లలో రూ.1,340 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రూ. 284.04 కోట్లతో సాగునీటి కాల్వల నిర్వహణ చేపడతామని తెలిపారు. అడవిపల్లి రిజర్వాయర్‌పై ప్రాజెక్టు పూర్తయిందని, కానీ, రిజర్వాయర్‌కు నీటిని తీసుకొచ్చే కాల్వల పనులను గత ప్రభుత్వం చేపట్టలేదని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.గిరిజన డ్వాక్రా సంఘాలకు బకాయిల్లేవు : మంత్రి సంధ్యారాణిఐటీడీఏల పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు 2019–24 మధ్య ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్‌రాజు, డాక్టర్ వాల్మీకి పార్థసారధి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం గిరిజన యువతకు శిక్షణ ఇవ్వలేదని, కాఫీని ప్రోత్సహించలేదని అన్నారు.భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు: మంత్రి వాసంశెట్టి సుభాష్రాష్ట్రంలోని 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వీరి నుంచి రూ.100 చొప్పున కార్మిక సంక్షేమ మండలికి చెల్లిస్తారని, ప్రస్తుతం బోర్డులో రూ.40.89 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2007నుంచి క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నాయని, రూ.7.38 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని పరిశీలించి ఇవ్వాలన్నారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీఅమలు చేస్తాం: మంత్రి సవితగత ఐదేళ్లలో చేనేత కార్మికుల పరిస్థితి బాగాలేదని, కొన్నిచోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చెప్పారు. చేనేత కార్మికులకు నూలు, విద్యుత్, ఇంధనం, షెడ్ల నిర్మాణానికి రాయితీలు, శిక్షణ, ముడి సరుకు సరఫరా, అమ్మకాలు, మార్కెటింగ్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. చేనేతకు గత టీడీపీ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. 2019 తర్వాత వైఎస్ జగన్ నేతన్నలను మోసం చేశారన్నారు. 86 వేల మందికి నేతన్న నేస్తం అందించారని, అవన్నీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారన్నారు.ఆక్వాకు ఇంధన సబ్సిడీ ఇవ్వలేం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ఆక్వా రైతులకు షరతుల్లేకుండా విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసే ప్రతిపాదన ఏదీ లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 కే విద్యుత్ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, ప్రస్తుతం డిస్కంలు రూ.1.12 లక్షల కోట్ల అప్పులతో ఉన్నాయని తెలిపారు. 2019 నుంచి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఆక్వా రైతుల నుంచి అందనంగా డబ్బులు వసూలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జీవోలతో గందరగోళం సృష్టించిందన్నారు. డిస్కంలకు రూ.1,990 కోట్లు బాకీ పెట్టారని చెప్పారు. 2018–19లో 46,329 మంది రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తే.. 2022–23లో 31 వేల మందికి తగ్గిపోయిందన్నారు.మీరు కట్టింది ఏ చీర?ఎమ్మెల్యేని ఆరా తీసిన డిప్యూటీ స్పీకర్ చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలపై మంత్రి సవిత సమాధానం చెప్పిన అనంతరం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అనుబంధ ప్రశ్నపై మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉందని, ముడి సరుకుల ధరలు పెరిగిపోయాయని, ఉత్పత్తుల ధరలు పెరగట్లేదని అన్నారు. 50 శాతం మగ్గాలు మూతపడ్డాయన్నారు. నేతన్నలకు నెలకు నికర ఆదాయం రూ.10 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముడిసరుకుపై సబ్సిడీ పెంచాలని, నేత కార్మికుల షెడ్లకు బడ్జెట్ ఇవ్వాలంటూ పలు సూచనలు చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వారిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో సూచనలు ఇవ్వొద్దని అన్నారు. ఇప్పటికే ఎక్కువ చేశారంటూ అడ్డుకున్నారు. నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు వేసుకునేలా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సూచనలు చేయాలని మాధవి సూచించగా.. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ‘మీరు సభకు ఇప్పుడు చేనేత వేసుకున్నారా? మీ శారీ చేనేతేనా?’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ‘చేనేతే’ అని బదులివ్వడంతో ‘సంతోషం’అంటూ నిట్టూర్చారు.ఎంతమంది పిల్లలున్నా సహకార ఎన్నికల్లో పోటీ! ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), జిల్లా సహకారం కేంద్రం బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్) ఎన్నికల్లో పోటీకి అర్హత కలి్పస్తూ ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం శాసన సభలో ప్రకటించారు. అదే విధంగా సహకార చట్టంలో రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసినట్లు వివరించారు. ఈ సవరణలకు సంబంధించిన ఏపీ సహకార సంఘాల సవరణ బిల్–2024ను శాసన సభలో అచ్చెన్న ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా ఏపీ ఎక్సైజ్ సవరణ బిల్–2024, ఏపీ(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ట్రేడ్ రెగ్యులేషన్) సవరణ బిల్–2024, ఏపీ మద్య నిషేధ సవరణ బిల్–2024ను అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టారు. -
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
2027లోగా పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారనే వాదనలో వాస్తవం లేదని.. 45.72 మీటర్ల ఎత్తుకు ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 13 మంది ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జనవరి నుంచి పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, రూ.70 వేల కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. తీరంలో పోర్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1941లోనే ప్రతిపాదన వచి్చందన్నారు. రామపాద సాగర్ పేరుతో భూమిని ఎంపిక చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును అస్తవ్యస్థం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టడం వల్లే కేంద్రం వాటిని ఏపీలో కలిపిందని చెప్పారు. అలా కలపకపోయి ఉంటే.. తెలంగాణ ఒప్పుకోకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చిందని, 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందన్నారు. 2020లో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింటే దానిని వెంటనే గుర్తించలేకపోయారన్నారు.కొత్త వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. 2019 నాటికి 71.93 శాతం ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం హయాంలో 3.84 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు. పర్సంటా, హాఫ్ పర్సంటా అని గత ప్రభుత్వంలో ఓ మంత్రి అవగాహన రాహిత్యంతో అవహేళన చేశారని, ఆయన పోయి మరో మంత్రి వచ్చారని, ఆయనకు టీఎంసీకి, క్యూసెక్కుకి తేడా తెలియదన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని.. అంతకుముందు సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1,040 ఎత్తిపోతల పథకాల్లో 450 మూతపడ్డాయన్నారు. నీటి వనరుల నుంచి లబ్ధి పొందే రైతులపైనా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ భారం వేయాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సలహా ఇచ్చారు. -
Andhra Pradesh: అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం.. చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్‌లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత.... ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్‌లేనంటూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!! కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.వృద్ధికి ఊతం..⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది. ⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి. పొదుపు మహిళకు ‘‘ఆసరా’’రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.పారిశ్రామిక విప్లవం.. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి. ⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు. ⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు. ⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.ఆర్బీకేలు.. పెట్టుబడి సాయందేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది. రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం -
ప్రజారోగ్యంతో చెడుగుడు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజారోగ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 104, 108 నిర్వహణను అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా అంబులెన్స్‌లను మూలన పడేయగా.. బీమాను తెరపైకి తెచ్చి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను అతలాకుతలం చేయడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా జిల్లా, బోధనాస్పత్రులకు మందులు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది. ఆస్పత్రులకు అత్యవసర మందులు సరఫరా కోసం గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసింది. డీ–సెంట్రలైజ్డ్ బడ్జెట్‌తో అత్యవసర మందులను ఆస్పత్రులే స్థానికంగా కొనుగోలు చేసే పాత విధానాన్ని పునరుద్ధరించింది. కేంద్రీకృత విధానంతో జవాబుదారీతనం జిల్లా, బోధనాస్పత్రులకు మందుల కొనుగోలు కోసం కేటాయించే మొత్తం బడ్జెట్లో 80 శాతం మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం బడ్జెట్‌ను అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. 2022 జూలైలో అత్యవసర మందుల సరఫరాకు కేంద్రీకృత విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. టెండర్లలో శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఎంఆర్పీలో 35.6 శాతం రాయితీపై మందులు సరఫరా చేస్తూ వచ్చింది. అత్యవసర మందులతో పాటు కొన్ని సందర్భాల్లో 80 శాతం బడ్జెట్లోని ఎసెన్షియల్ డ్రగ్స్‌లో అందుబాటులో లేని మందులను సరఫరా చేసేలా అనుమతులు ఇచ్చారు.తద్వారా లోకల్ టెండరింగ్‌లో నడిచే అవినీతి అక్రమాలతో పాటు ఆస్పత్రుల్లో మందుల కొరతను అరికట్టేలా చర్యలు తీసుకుంది. దీంతో గతంలో ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తే అంతా ఖర్చైందని అదనపు బడ్జెట్ కోసం అడిగే పరిస్థితుల నుంచి రోగులకు మందుల కొరత లేకుండా ప్రజాధనం ఆదా అయ్యేలా పరిస్థితులు మెరుగయ్యాయి. 2022–23 నుంచి ఇప్పటి వరకు అత్యవసర మందుల కొనుగోళ్ల కోసం రూ.84 కోట్లు కేటాయించగా అందులో రూ.37.09 కోట్ల మేర ప్రజాధనం ఆదా అయింది. ఈ విధానంలో ఆస్పత్రుల్లో మందులకు ఇండెంట్ పెట్టిన దగ్గర నుంచి సరఫరా సంస్థకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దశలో ఉన్నతస్థాయి పర్యవేక్షణతో పాటు జవాబుదారీతనం ఉంటుంది.అవినీతికి గేట్లు ఎత్తిన సర్కార్రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరతో ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షణలో పారదర్శకంగా మందులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా మందులు కొనుగోలు చేసే పాత విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి సర్కారు అవినీతికి గేట్లు తెరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కొందరు వైద్యులతో తమకున్న పరిచయాలతో కమీషన్ ఆశ చూపిన సంస్థలకు మందులు సరఫరా చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఈ విధానంలో మందుల ధరల్లో ప్రతి జిల్లాకు వ్యత్యాసం ఉంటుంది. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బోధనాస్పత్రుల సంఖ్య, మందుల వినియోగం, బడ్జెట్ భారీగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.ఆస్పత్రుల్లో గందరగోళంఅత్యవసర మందుల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్లకు గత వారంలో డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నఫళంగా ప్రస్తుత విధానాన్ని రద్దు చేశారు. స్థానికంగా కొనుగోళ్లకు సరఫరా సంస్థలను ఎంపిక చేసే వరకూ జన్స్టోర్స్లో ఎంఆర్పీపై మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే బోధనాస్పత్రులకు అవసరమైన మందులు ఈ స్టోర్స్‌లో అందుబాటులో లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మందులు ఆ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆస్పత్రులకు అవసరమైన స్థాయిలో సరఫరా చేయలేమని నిర్వాహకులు తేల్చిచెప్పినట్టు తెలిసింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి 80 శాతం బడ్జెట్‌కు సంబంధించి 608 రకాల మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఎక్కడ చూసినా 100 నుంచి 200 మేర మందులు అందుబాటులో ఉండటం లేదు. ఈ కొరత ఉన్న మందులను సైతం ఆస్పత్రులు అత్యవసర మందుల సరఫరా సంస్థ నుంచే పొందుతున్నాయి. ఉన్నఫళంగా సరఫరా వ్యవస్థను రద్దు చేయడంతో గుంటూరు, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ సహా చాలా ఆస్పత్రుల్లో ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబిలిన్స్, క్రిటికల్ కేర్, థియేటర్, ఎమర్జెన్సీ డ్రగ్స్ కొరత నెలకొంది. దీంతో రోగుల చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పలువురు సూపరింటెండెంట్లు స్థానికంగా సరఫరాదారులను ఎంపిక చేసే వరకు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖ కూడా రాసినట్టు సమాచారం. -
పల్లె రోడ్లపై పన్నుల మోత!
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల తరహాలో రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్ చార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్ చార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకు వాహనంతో వచి్చనా యూజర్ చార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవుగానీ.. ఇలాంటి వినూత్న ఆలోచనలు మాత్రం చాలా ఉన్నాయని, వాటి ద్వారా సంపద సృష్టిస్తానని పేర్కొన్నారు. మంత్ర దండాలేం లేవు.. ప్రజలను ఒప్పించండి వచ్చే జనవరి కల్లా రాష్ట్రంలోని రహదారులపై అన్ని గుంతలు పూడ్చేయాలని, జనవరిలో పండుగ సందర్భంగా రాష్ట్రానికి వచ్చే వారికి మెరుగైన రహదారులు కనిపించాలనే లక్ష్యంతో మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని సీఎం చెప్పారు. లక్షల సంఖ్యలో గుంతలు పడ్డాయని, అయితే వాటిని పూడ్చేందుకు అయ్యే ఖర్చు మొత్తం స్థానిక ప్రజల నుంచే వసూలు చేయాలనుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తొలుత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రోడ్ల నిర్వహణను జాతీయ రహదారుల మాదిరిగా టెండర్ పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు.ఆ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను ఒప్పించగలిగితే వెంటనే పనులు ప్రారంభిస్తామని, అలా కాకుండా గుంతల రోడ్డులోనే తిరుగుదామంటే నాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ‘గోతులు పూడ్చడానికి డబ్బులు లేకపోయినా అన్నీ నువ్వే చేయాలంటారు. నా దగ్గర మంత్ర దండాలేవీ లేవు’ అని సీఎం పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూలును కూడా తొలుత వ్యతిరేకించారని, ఇప్పుడు కూడా వ్యతిరేకత వస్తుందని, అయినా ముందుకే వెళతామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై చేతులు ఎత్తి సమ్మతి తెలియచేయాలని సీఎంకోరడంతో కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు. తమ జిల్లాల్లో వెంటనే దీన్ని అమలు చేయాలని వారంతా కోరారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో మలేషియా ఉపరితల రవాణా మంత్రి స్వామివేలును రప్పించి చెన్నై నుంచి నెల్లూరు వరకూ డబ్బులివ్వకుండా మలేషియా కంపెనీతో కలిసి రోడ్డు వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.