namination
-
లోక్‌సభ ఎన్నికల హడావిడి.. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధులు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ►శుక్రవారం నిజామాబాద్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెండు సెట్ల నామినషన్ దాఖలు చేశారు. బాజిరెడ్డికి వెంట మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. ►పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్లకు చెందిన పసుపు రైతులు ధర్మపురి అర్వింద్ నామినేషన్లో పాల్గొన్నారు. పసుపు రైతులు సమర్పించిన చందాలతో ధర్మపురి అర్వింద్ నామినేషన్ రుసుమును చెల్లించారు. ►కరీంనగర్ జిల్లా బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ తరుపున ఆ పార్టీ నేతలు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల, బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణలు రిటర్నింగ్ అధికారికి బండి సంజయ్ నామినేషన్ పత్రాలను అందించారు. ►మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చల్లా వంశీ నామినేషన్లు పూర్తి అయి కార్నర్ మీటింగ్ ముగిసిన అనంతరం మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ►పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ►నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు. ఆర్ఎస్ ప్రవీవ్ కుమార్ వెంట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, జైపాల్ యాదవ్‌లు పాల్గొన్నారు. ► ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా వినోద్ రావు తాండ్ర నామినేషన్ దాఖలు చేశారు. ►పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేశారు. -
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్: నేడు బండా ప్రకాష్ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బండా ప్రకాశ్‌లో శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సీఎం కేసీఆర్.. పార్టీ నాయకులకు సూచించారు. -
ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
Opposition's Presidential polls candidate Yashwant Sinha.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా.. పార్లమెంట్ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. Opposition's Presidential polls candidate Yashwant Sinha files his nomination at the Parliament in Delhi pic.twitter.com/2BGztPZwmB — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే పవర్ ఇవ్వండి.. న్యాయ శాఖకు ఈసీ వినతి -
ఇద్దరు వనితల ఆస్కార్ చరిత్ర
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే. ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్‌ల్యాండ్’ కు ఆరు నామినేషన్లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం. ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్‌ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు. క్లాస్ రూమ్‌లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్‌లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు. ∙∙ ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్‌ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్లు పొందారు. బెస్ట్ డైరెక్టర్‌తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే. నోమాడ్‌ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్‌లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్‌లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నామినేషన్‌కే 48 ఏళ్లు పట్టింది! తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఆస్కార్‌కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది. ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో. -
నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి!
నందిగ్రామ్/కోల్‌కతా: నందిగ్రామ్ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. ‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు. గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు. నిజానికి, ఆమె బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్నారు. కానీ, ఈ ఘటన జరగడంతో కోల్‌కతా వెళ్లారు. వెంటనే, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లారు. గత రెండు రోజులుగా మమత నందిగ్రామ్‌లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, మమతపై దాడిపై బీజేపీ స్పందించింది. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్ఘియ డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు. గవర్నర్ పరామర్శ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు, సీఎంపై దాడి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది. నందిగ్రామ్ నుంచి నామినేషన్ హల్దియా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఒకప్పుడు ఆమెకి అత్యంత సన్నిహితుడు, నందిగ్రామ్‌లో బాగా పట్టున్న నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల సేకరణకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను నందిగ్రామ్ నుంచి ఎప్పుడూ వట్టి చేతులతో వెళ్లలేదని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి వెంట రాగా మమత 2.కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం హల్దియా సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ‘‘నందిగ్రామ్ నుంచి నా గెలుపు ఖాయం. ఇక్కడి నుంచి సులభంగా నేను విజయం సాధించగలను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నేత ఎవరూ లేకుండా నియోజకవర్గం ఉంది. అప్పుడు సాధారణ ప్రజల ముఖాలు చూసి నేను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దీదీ విలేకరులకు చెప్పారు. నందిగ్రామ్ ఉద్యమ బావుటా నందిగ్రామ్ అన్నది ఒక పేరు కాదు. ఒక ఉద్యమ బావుటా అని మమతా బెనర్జీ ప్రశంసించారు. ‘‘ నేను అందరి పేర్లు మర్చిపోతానేమో, కానీ నందిగ్రామ్ పేరును ఎప్పటికీ మర్చిపోను. ఈ ప్రాంతానికి నేనిచ్చే ప్రాధాన్యత అలాంటిది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తను ఎప్పుడూ ఇక్కడ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగలేదని, తన గెలుపు ఇక్కడ ఖాయమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎవరూ విడగొట్టలేరని అన్నారు. నందిగ్రామ్ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పాల్గొన్నాయని ఆమె గుర్తు చేశారు. ఇన్నాళ్లూ భవానీపూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ చేసిన సవాల్‌తో కేవలం నందిగ్రామ్ నుంచి మాత్రమే పోటీకి దిగారు. ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన ప్రచారాన్ని సాగించనున్నారు. మరోవైపు బీజేపీ అ«భ్యర్థిగా గురువారం నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న సువేందు అధికారి దీటుగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ స్థానికురాలు కాదని, తానే ఈ భూమి పుత్రుడినంటూ ప్రచారం చేసుకోవడం విశేషం. -
నామినేషన్ దాఖలు చేసిన సోలిపేట సుజాత
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్ కేటాయించడం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!) హుజూర్ నగర్ పలితాలే దుబ్బాకలో రాబోతుంది : హరీశ్ కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధకులుగా మారారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అడుగడున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హుజూర్నగర్ ఫలితాలే దుబ్బాకలో రాబోతున్నాయని జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాలేదని, దుబ్బాకలో కూడా అదే ఫలితాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి వెళ్లిన అపూర్వ స్వాగతం లభిస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. -
నామినేషన్ వేసిన పెన్మత్స సురేష్ బాబు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేష్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (విధేయతకు పట్టం) ఈ సందర్భంగా పెన్మత్స సురేష్ బాబు మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పార్టీకి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటానని, చెడ్డపేరు తీసుకురానని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... పెన్మత్స సాంబశివరావు వారసుడుగా సురేష్ బాబు పార్టీకి విధేయుడుగా ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి దివంగత నేత పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్సీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశం కూడా పెద్దగా లేనందున సురేష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. -
బీసీసీఐ ఎన్నికలు ఏకగ్రీవమే!
ముంబై: సుదీర్ఘ విరామం తర్వాత బీసీసీఐలో జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవం కాబోతున్నాయి. ఈ నెల 23న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహిస్తారు. అదే రోజు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్‌లోని ఎనిమిది స్థానాలకు చివరి రోజు సోమవారం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ లేకుండా వీరందరూ ఎన్నిక కావడం ఖాయమైపోయింది. అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా ఎన్నిక కానున్నారు. 23న వీరంతా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. అట్టహాసంగా... చివరి రోజైన సోమ వారమే గంగూలీ, జై షా తమ నామినేషన్లు దాఖలు చేశారు. గంగూలీ వెంట బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, మాజీ కార్యదర్శి నిరంజన్ షాతో పాటు రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. అయితే గంగూలీ వెళ్లిన సమయంలో ఎన్నికల అధికారి ఎన్.గోపాలస్వామి అక్కడ లేరు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన రాకపోవడంతో సౌరవ్ అక్కడి అధికారులకు తమ నామినేషన్ పత్రాలు అందించి వెనుదిరిగారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్ పత్రంలో ఆయన సంతకం చేశారు. ఏసీఏ కోశాధికారి గోపీనాథ్ రెడ్డి, భారత మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు కూడా వీరి వెంట ఉన్నారు. సౌరవ్ గంగూలీ (అధ్యక్షుడు): భారత క్రికెట్ మాజీ కెప్టెన్. కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన అనుభవం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు): ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి. జయేష్ జార్జ్ (సంయుక్త కార్యదర్శి): కేరళ క్రికెట్ సంఘం అధ్యక్షుడు. ఖైరుల్ జమీల్ మజుందార్ (గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు); ప్రభ్‌జోత్ సింగ్ భాటియా (కౌన్సిలర్). బ్రిజేశ్ పటేల్ (ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు): మాజీ క్రికెటర్. భారత్ తరఫున 21 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. కర్ణాటక సంఘం నుంచి ప్రాతినిధ్యం. అరుణ్ సింగ్ ధుమాల్ (కోశాధికారి): కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు. హిమాచల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. జై షా (కార్యదర్శి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, వ్యాపారవేత్త. ఇటీవలి వరకు గుజరాత్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. -
భారత క్రికెట్లో మళ్లీ ‘దాదా’గిరి!
దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సౌరవ్... తదనంతర కాలంలో భారత క్రికెట్ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పుడు కూడా... భారత క్రికెట్ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్‌ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... పూర్వ వైభవం తెస్తా... దేశం తరఫున ఆడి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్ కౌన్సిల్‌లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వారి మ్యాచ్ ఫీజు పెంచాలి... ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా. వారికి లభిస్తున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇదో సవాల్.... ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్లాంటిది ఊహించలేదు... నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్ పటేల్ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్‌లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలు మాట్లాడలేదు... కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. సమర్థుడు కావాలని.... భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం. అదో పెద్ద సమస్య.... పరస్పర ప్రయోజనం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు. -
శివసేనకు పూర్వవైభవం వస్తుందా?
చంద్రయాన్ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ మా సూర్యయాన్ (ఆదిత్య అంటే సూర్యుడు) కచ్చితంగా మంత్రాలయ ఆరో అంతస్తులో (మహారాష్ట్ర సీఎం కార్యాలయం) స్మూత్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఇప్పడు శివసేనలో ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట ఇది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు కంచుకోటైన దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో ఆయననే భవిష్య సీఎంగా కీర్తిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కనుసన్నలతోనే ప్రభుత్వాలను శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆదిత్యను బరిలోకి దింపుతోంది. ► సేన ట్రంప్ కార్డు ఉద్ధవ్ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ ఎల్ఎల్బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత. ఆదిత్య రాసిన కవిత్వం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో . ఉమ్మీద్ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని సమకూర్చడానికి వ్యూహాలు రచించారు. నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాల ని ప్రతిపాదనలు చేశారు. అవి సాకారం కానప్పటికీ మార్పు కోసం అంటూ నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వొర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ► శివసేనకు పూర్వవైభవం వస్తుందా? కొన్నేళ్ల క్రితం వరకు బీజేపీ, శివసేన కూటమిలో సేనదే పై చేయిగా ఉండేది. బాల్ ఠాక్రే జీవించినంత కాలం ఒక పెద్దన్న పాత్రనే పోషించారు. ఎన్నోసార్లు ఆయన బీజేపీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. కమలదళాన్ని కమ్లి అని స్త్రీలింగాన్ని గుర్తుకు తెచ్చే పేరుతో పిలుస్తూ ‘ఆమెను బయటకు పొమ్మని తలుపు చూపించినా కిటికీలోంచే నా వైపే చూస్తూ ఉంటుంది’అని వ్యాఖ్యానించేవారు. కానీ బీజేపీ లో మోదీ, అమిత్ షా హవా పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను కూడా మోదీ, షా ద్వయం తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అం దుకే కూటమిలో పై చేయి సాధించడమే కాదు, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న ఈ యువసేనాని అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమేమీ కాదు కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదిత్య ఉదయం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. ఆదిత్య ఠాక్రే ఆస్తులు 16 కోట్లు వర్లి నుంచి నామినేషన్ దాఖలు ముంబై: ఠాక్రే వంశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అ«ధినేత కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబైలోని వర్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తండ్రి ఉద్ధవ్ ఠాక్రే, తల్లి రష్మి తన వెంట రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు తాత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆదిత్య ఠాక్రే దాఖలు చేసిన అఫడివిట్ ప్రకారం ఆయనకున్న ఆస్తుల విలువ రూ. 16.5 కోట్లు. అందులో చరాస్తులు రూ.11.38 కోట్లని, స్థిరాస్తులు రూ. 4.67 కోట్లుగా చూపించారు. అందులో రూ.10.36కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉంటే, ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దీని ధరని రూ. 6.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక ఆదిత్యకు రూ. 64.65 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. 29 ఏళ్ల వయసున్న ఆదిత్య బీఏ ఎల్ఎల్బీ చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. -
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది. పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్కీర్తన్లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు. తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి. -
అవార్డు వస్తుందా?
‘ది వెడ్డింగ్ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్ టు స్పై’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించి అంతర్జాతీయ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్ ‘ఎమ్మీ’ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్ దక్కించుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ఫస్ట్ సిరీస్‌లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమెకు నామినేషన్ దక్కేలా చేసింది. అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్‌కు మరింత బూస్ట్ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్ నమోదయ్యాయని బాలీవుడ్ సమాచారం. బెస్ట్ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్ గేమ్స్’, నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ‘ది రీమిక్స్’ నామినేషన్స్ దక్కించుకున్నాయట. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
కొంప ముంచిన గాడిద సవారీ
ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు మందీ మార్బలంతో వెళుతుంటారు. కొందరు డజన్ల సంఖ్యలో కార్లతో వెళ్లి నామినేషన్లు వేస్తే మరి కొందరు గుర్రాల మీద, ఎడ్ల బండి పైన వచ్చి నామినేషన్లు వేస్తారు. అయితే, బిహార్‌కు చెందిన మణి భూషణ శర్మ అందరికంటే విలక్షణంగా ఉండాలని, అందరినీ ఆకర్షించాలని ఏకంగా గాడిదపై ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు.అయితే,ఆయన గాడిద సవారీ ఎంత మందిని ఆకట్టుకుందో తెలియదు కాని అధికారులకు మాత్రమే నచ్చలేదు. దాంతో జంతువుని హింసించాడంటూ శర్మపై కేసు పెట్టారు. బిహార్‌లోని హలస్‌నగర్ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల మణిభూషణ్ జెహనాబాద్ నుంచి ఇండిపెండెంట్‌గా లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. ఏడో దశలో అంటే మే 19న పోలింగు జరిగే ఈ నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరిరోజు. ఆ రోజున గాడిదపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయనాయకులు ప్రజల్ని గాడిదల్లా చూస్తున్నారన్న సంగతి తెలియజేయడానికే తాను గాడిదపై వచ్చి నామినేషన్ వేసినట్టు శర్మ చెప్పారు. అయితే, ఎన్నికల అధికారులకు ఈ గాడిద సవారీ నచ్చలేదు. శర్మపై సర్కిల్ అధికారి సునీల్ కుమార్ జంతు హింస నివారణ చట్టం కింద కేసు పెట్టారు. పట్టణ పోలీసు స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. పోనీ విధం చెడ్డా ఫలమైనా దక్కిందా అంటే అదీ లేదు. సాంకేతిక కారణాల వల్ల శర్మ నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు.పేరు కోసం చేసిన పని ప్రయోజనాన్నే నాశనం చేసిందంటూ శర్మ వాపోతున్నారు. స్థానికులు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా పోటీ చేసి ఓడిపోతుంటారని,ఇప్పుడు ఎన్నికలు జరగకుండానే ఓడిపోయారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
సన్నీడియోల్ @ 87 కోట్లు
చండీగఢ్/గురుదాస్‌పూర్: గదర్, ఘాయల్, బోర్డర్ చిత్రాలతో బాలీవుడ్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత సన్నీడియోల్ సోమవారం గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించారు. తన పేరుమీద, తన భార్య పేరు ఉన్న మొత్తం ఆస్తులను రూ. 87.18 కోట్లుగా ప్రకటించారు. రూ. 60.46 కోట్ల చరాస్తులు, రూ. 21కోట్ల స్థిరాస్తులను ఆయన చూపించారు. 2017–18లో ఆదాయాన్ని రూ. 63,82 లక్షలు, 2016–17లో వార్షికాదాయం 96.29 లక్షలు, 2015–16లో వార్షికాదాయం రూ. 2.25 కోట్లుగా ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 26 లక్షలు ఉన్నాయని, తన భార్య లిండా డియోల్ బ్యాంకు ఖాతాలో రూ. 16 లక్షల నగదు ఉందని తెలిపారు. -
రాహుల్ నామినేషన్‌పై ఉత్కంఠకు తెర
అమేథీ (ఉత్తరప్రదేశ్): అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన నామినేషన్‌పై ఉత్కంఠకు తెరపడింది. రాహుల్ నామినేషన్‌ను ఆమెదించినట్టు రిటర్నింగ్ అధికారి సోమవారం వెల్లడించారు. రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై అనుమానాలను బీజేపీ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్‌లాల్ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో కూడా మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ నామినేషన్‌ను పరిశీలించిన తర్వాత ఆమెదించినట్టు అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు. ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. -
అమేథీలో రాహుల్ నామినేషన్
అమేథీ (ఉత్తరప్రదేశ్): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ రోడ్‌షోలో సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి ఇద్దరు పిల్లలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింథియా రాహుల్ వెంట ఉన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్‌షోలో తల్లి సోనియాగాంధీ పాల్గొనలేదు. అనంతరం అమేథీ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో తనయుడు రాహుల్ వెంట ఆమె ఉన్నారు. నామినేషన్ సందర్భంగా అమేథీ పట్టణం కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, రాహుల్, ప్రియాంక కటౌట్లతో నిండిపోయింది. ఎండను సైతం లేక్కచేయని కార్యకర్తలు అమేథీలో రాహుల్, ఆయన కుటుంబసభ్యులకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రహదారికి రెండు వైపులా ఎదురు చూస్తున్న అభిమానులకు రాహుల్ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగగా అభిమానులు ఓపెన్ టాప్ వాహనంలో ఉన్న రాహుల్ తదితరులపై పూలవర్షం కురిపించారు. అమేథీ మాకు పవిత్ర భూమి అమేథీ నియోజకవర్గం తమ తండ్రి(రాజీవ్‌గాంధీ) కర్మభూమి, తమ కుటుంబానికి పవిత్రమైన చోటు అని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ నామినేషన్ అనంతరం ఆమె ట్విట్టర్లో..‘ కొన్ని అనుబంధాలు హృదయపూర్వకమైనవి. మా సోదరుని నామినేషన్ దాఖలు సందర్భంగా మా కుటుంబం మొత్తం హాజరయింది. ఇది మా తండ్రి కర్మభూమి, మాకు పవిత్రమైన ప్రాంతం’ అని తెలిపారు. అమేథీలో ద్విముఖ పోరు ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలపకపోవడంతో రాహుల్‌కు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ బరిలోఉన్నారు. బీజేపీ తరఫున స్మృతి ఇరానీ గురువారం నామినేషన్ వేయనున్నారు. పొరుగునే ఉన్న రాయ్‌బరేలీ సీటుకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గురువారం నామినేషన్ వేయనున్నారు. -
రాహుల్ 10న, సోనియా 11న నామినేషన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానానికి ఈ నెల 10వ తేదీన, ఆయన తల్లి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీలో 11వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు రాహుల్, సోనియాలతోపాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరు కానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా జరిగే భారీ రోడ్‌షోకు కాంగ్రెస్ అగ్రశ్రేణి నేతలతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారని తెలిపాయి. ఈ రెండు నియోజకవర్గాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలపబోమంటూ ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఐక్యతా సందేశమిచ్చేందుకే
కాల్పెట్టా(కేరళ): ‘ భారత దేశమంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వడానికే కేరళ నుంచి పోటీ చేస్తున్నా. తమ సంస్కృతి, ఆచారాలపై ఆరెస్సెస్–బీజేపీలు దాడికి పాల్పడుతున్నాయని దక్షిణాది ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. అందుకే ఉత్తర, దక్షిణ భారత్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నా’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. యూపీలోని అమేథీతో పాటు కేరళలో ఆ పార్టీ కంచుకోట అయిన వయనాడ్ నుంచి ఆయన పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్ తదితరులు వెంటరాగా రాహుల్ గురువారం వయనాడ్ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కల్పెట్టా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడి హంగామా సృష్టించారు. రాహుల్‌ను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన అభిమానులతో కాల్పెట్టా పట్టణ వీధులు కిక్కిరిసిపోయాయి. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన తరువాత రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నాయకులు రోడ్ షో నిర్వహించారు. విమర్శలను సంతోషంగా స్వీకరిస్తా.. వయనాడ్ నుంచి తాను పోటీచేయడం పట్ల సీపీఎం చేస్తున్న విమర్శల్ని స్వీకరిస్తానని, ప్రచారం సందర్భంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడనని అన్నారు. ‘కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు రాజకీయ ప్రత్యర్థులు. ఇరు పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది. సీపీఎం నన్ను ఢీకొనబోతున్న సంగతిని అర్థం చేసుకోగలను. కానీ వారికి వ్యతిరేకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. సీపీఎం చేసే ఎలాంటి ఆరోపణలు, విమర్శలనైనా సంతోషంగా స్వీకరిస్తా’ అని నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత విలేకర్ల సమావేశంలో రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఐదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయని అన్నారు. ‘ రైతులకు భవిష్యత్‌పై నమ్మకం పోయింది. యువకులు ఉద్యోగ అన్వేషణలో రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ రెండు విషయాల్లో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. చౌకీదార్‌గా ఉంటానన్న మోదీనే రూ.30 వేల కోట్లను వైమానిక దళం నుంచి దొంగిలించి అనిల్ అంబానీకి ధారాదత్తం చేశారు’ అని వివాదాస్పద రఫేల్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ఆరోపించారు. వయనాడ్..రాహుల్ జాగ్రత్త: ప్రియాంక తనకు తెలిసిన వారిలో రాహుల్ గాంధీనే అత్యంత ధైర్యశీలి అని ప్రియంక గాంధీ అన్నారు. తన సోదరుడిని జాగ్రత్తగా చూసుకోవాలని వయనాడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వయనాడ్..నా సోదరుడిని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆశల్ని వమ్ము కానీయడు’ అని ప్రియంక ట్వీట్ చేశారు. వయనాడ్‌తో రాహుల్‌కు సంబంధం.. రాహుల్‌కు వయనాడ్‌తో అవినాభావ సంబంధం ఉంది. 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత అస్థికల్ని రాహుల్ ఇక్కడి పాపనాశిని అనే నదిలో నిమజ్జనం చేశారని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత రమేశ్ చెన్నితాలా గుర్తుకుచేసుకున్నారు. ప్రకృతి సోయగాల మధ్య తిరునెల్లి గ్రామంలో నెలవైన మహావిష్ణు ఆలయానికి ఈ నది అనుసంధానమై ఉంది. రాహుల్ ఆస్తులు రూ.15.88 కోట్లు తనకు రూ.15.88 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో రాహుల్ పేర్కొన్నారు. సొంతకారు లేదని, బ్యాంకుల నుంచి రూ.72 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలిపారు. చరాస్తుల విలువ రూ.5.80 కోట్లు, స్థిరాస్తుల విలువ 10.08 కోట్లని వెల్లడించారు. చేతిలో రూ.40 వేల నగదు, బ్యాంకుల్లో రూ. 17.93 లక్షల మేర నిల్వలు ఉన్నట్లు తెలిపారు. బాండ్లు, షేర్లు, డిబెంచర్లలో రూ.5.19 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఎంపీగా వేతనం, రాయల్టీ, అద్దె, పెట్టుబడులపై వస్తున్న వడ్డీ తదితరాలు తన ఆదాయ వనరులని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు, జార్ఖండ్, అస్సాం, ఢిల్లీలో ఒకటి చొప్పున తనపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 1995లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్(డెవలప్మెంట్ స్టడీస్) చేశానని తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ ఆస్తులను రూ.9.4 కోట్లుగా చూపారు. మిల్మా బూత్.. అమూల్ బాయ్! రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తరువాత వయనాడ్‌లో మిల్మా బూ™Œ æ(కేరళ ప్రభుత్వ పాల ఉత్పత్తుల బ్రాండ్) దుకాణం మీదుగా సాగుతున్న కాంగ్రెస్ ర్యాలీ. వయనాడ్‌లో పోటీచేస్తానని ప్రకటించగానే రాహుల్‌ను కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ ‘అమూల్ బాయ్’గా అభివర్ణించిన నేపథ్యంలో తాజాగా పాల దుకాణం పక్క నుంచే రాహుల్ ర్యాలీ కొనసాగడం యాదృచ్ఛికమే. గుజరాత్లో ప్రఖ్యాతిగాంచిన ‘అమూల్’ మిల్క్ బ్రాండ్ సృష్టికర్త వర్గీస్ కురియన్ కూడా కేరళకు చెందిన వ్యక్తే. అమూల్ స్ఫూర్తితోనే మిల్మా బ్రాండ్‌ను కేరళలో ప్రారంభించారు. అమేథీని అవమానించారు అమేథీ/లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకోవడమంటే అమేథీకి అవమానమేనని, అక్కడి ప్రజలను మోసం చేయడమేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. అమేథీ నుంచి స్మృతి బరిలో ఉన్నారు. రాముడు వనవాసం 14 ఏళ్లు చేయగా.. అమేథీ ప్రజలు 15 ఏళ్లుగా వనవాసం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం పర్సాద్పూర్లో ఆమె ప్రచారం చేశారు. ‘వయనాడ్’ పోటీ సంకుచిత నిర్ణయం వయనాడ్: రాహుల్‌ను అమేథీతోపాటు వయనాడ్ నుంచి కాంగ్రెస్ పోటీకి దింపడం ఒక సంకుచిత నిర్ణయం అని సీపీఐ నేత డి.రాజా విమర్శించారు. వామపక్షాల తరపున వయనాడ్ నుంచి పోటీ పడుతున్న పీపీ సునీర్‌ను బరిలో నుంచి తప్పించే అవకాశమే లేదని చెప్పారు. దేశ ఐక్యత కోసం వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్..కశ్మీర్, లక్షద్వీప్ వంటి చోట్ల పోటీచేయాలని హితవు పలికారు. హిందువులు ఎక్కువగా లేని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారని మోదీ విమర్శించినందుకే రాహుల్ అమేథీ నుంచి దూరంగా పారిపోయారని ఎద్దేవా చేశారు. -
నామా గెలుపు చారిత్రక అవసరం
సాక్షి, ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గెలుపు జిల్లాకు చారిత్రక అవసరమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు సందర్భంగా ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను గెలిపించుకొని సీఎం కేసీఆర్ దగ్గర జిల్లా గౌరవాన్ని నిలుపుకోవాలన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి బాటలో నిలిపేందుకు నామా గెలుపు అవసరమని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో టీఆర్ఎస్ గెలుపుకై శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ గెలుపుబావుట ఎగురవేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో జిల్లా పెద్దలతో కలిసి నామ గెలుపుకు పని చేస్తానన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు వచ్చేలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పూజలు చేసి, అమరులకు నివాళులర్పించి.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన స్వగృహంలో ప్రత్యేక పూజలు చేసి, నామినేషన్ పత్రం నింపి ప్రదర్శనగా దాఖలుకు బయలుదేరారు. ముందుగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బైపాస్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి సభాస్థలికి చేరుకొని నాయకులతో కలిసి ప్రసంగించారు. సభా స్థలి నుంచి ప్రదర్శనగా నామినేషన్ దాఖలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. -
మంత్రి కాల్వ నామినేషన్‌పై హై డ్రామా!
సాక్షి, అనంతపురం : మంత్రి కాల్వ శ్రీనివాస్ నామినేషన్‌పై హై డ్రామా నెలకొంది. రాయదుర్గం టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కాలువ శ్రీనివాస్.. ఒక పేజీలో కొట్టివేతలతోపాటు అసంపూర్తిగా సమాచారం ఇచ్చారు. దీంతో కాలువ శ్రీనివాస్ నామినేషన్‌ను తిరస్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి ఎన్నికల అధికారిని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర అసహనానికి గురైన మంత్రి కాలువ రాయదుర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హల్చల్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిపైకి దౌర్జన్యానికి దిగారు. అభ్యంతరాలపై సమాధానం దాటవేస్తూ సాక్షి మీడియాపై అక్కసును వెళ్లగక్కారు. నామినేషన్ పరీశీలన కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆయన.. నామినేషన్ ఆమోదించేలా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక జిల్లాలోని వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. గుంతకల్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామి రెడ్డి , కళ్యాణ దుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీమతి ఉష శ్రీచరణ్, మడకశిర అభ్యర్థి తిప్పేస్వామి, తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, హిందూపురం అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్‌ల నామినేషన్లు ఆమోదం పొందాయి. -
దేవెగౌడ నామినేషన్
బెంగళూరు: జనతాదళ్(సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(85) సోమవారం కర్ణాటకలోని తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జేడీఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. పొత్తుల్లో భాగంగా తుముకూరు సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన జేడీఎస్‌కు కేటాయించింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. కాంగ్రెస్ కండువా ధరించి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చివరి నిమిషంలోనైనా తనకే కాంగ్రెస్ టికెట్ లభిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. రాజన్న అనే మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తుముకూరు నుంచి నామినేషన్ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులు విభేదాలను వీడి, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాల్లోని కూటమి అభ్యర్థులను గెలిపించాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. పొత్తుల్లో భాగంగా జేడీఎస్ 8, కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దేవెగౌడ ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్న హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి తన మనవడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ పోటీ చేస్తున్నారు. దేవెగౌడ పోటీ చేస్తున్న తుముకూరు లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతోపాటు జేడీఎస్ కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జేడీఎస్‌లో దేవెగౌడ కుటుంబానికి మాత్రమే అధిక ప్రాధాన్యత లభిస్తోందని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేవెగౌడ గెలుపు అంత సులువు ఏమీ కాదని పరిశీలకులు భావిస్తున్నారు. -
కోర్టులో బాబు ప్రమాణం.. ఫక్కున నవ్వారు
విజయవాడ లీగల్ : నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి వద్ద చేయాల్సిన ప్రమాణాన్ని సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ యు.ఇందిరా ప్రియదర్శిని ఎదుట చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు.. శుక్రవారం అక్కడ తనవారితో నామినేషన్ దాఖలు చేయించారు. అయితే నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో రిటర్నింగ్ అధికారుల వద్ద ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఆయన శనివారం విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై ఈ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ పత్రాన్ని.. నామినేషన్ దాఖలు చేసిన 48 గంటల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. కరకట్టను ‘కర్ణాటక’ కట్టగా మార్చేసిన చంద్రబాబు మేజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేసేటప్పుడు చంద్రబాబు తన ఇంటి అడ్రస్ అయిన కరకట్టను కాస్తా ‘కర్ణాటక కట్ట’ అంటూ చదివారు. ఆ తర్వాత మళ్లీ సరిదిద్దుకొని కరకట్టగా పలికారు. ఈ సందర్భంలో కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది ఒక్కసారిగా నవ్వేశారు. -
తిలక్ నామినేషన్‌కు ఉప్పొంగిన జనతరంగం
సాక్షి, టెక్కలి/టెక్కలి రూరల్: నేల తల్లి ఈనేలా.. నింగి ఒంగి చూసేలా.. ప్రత్యర్థుల గుండెలు అదిరేలా.. ఇన్నాళ్లు అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు విసిగిన ప్రజలంతా ఒక్కసారిగా జై జగన్.. జైజై తిలక్ అంటూ మిన్నంటిన నినాదాలతో జనతరంగం ఉప్పొంగింది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ గురువారం చేపట్టిన నామినేషన్ కార్యక్రమానికి టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల నుంచి ఊరు.. వాడా కదిలింది. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి రావడంతో పట్టణం నలుమూలలు కిక్కిరిసిపోయాయి. ముందుగా తిలక్ స్థానిక మెళియాపుట్టి రోడ్ జంక్షన్‌కు చేరుకోగానే ప్రజలంతా డప్పు వాయిద్యాలతో పూల దండలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలతో చేరీవీధిలోని కిల్లి పోలమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. పేరాడ, ఆయన భార్య భార్గవితో పాటు పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల జోష్ కిల్లి పోలమ్మతల్లి ఆలయం నుంచి టెక్కలి మెయిన్ రోడ్ మీదుగా అశేష ప్రజానీకం నడుమ వారి ఆశీస్సులు అందుకుంటూ తిలక్ ర్యాలీ ముందుకు సాగింది. జై జగన్.. జైజై తిలక్.. జైజై దువ్వాడ అంటూ దారి పొడవునా నినాదాలు మిన్నంటాయి. డప్పు వాయిద్యాలతో, డీజే శబ్ధాలతో కొనసాగిన ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులు చేస్తూ హోరెత్తించారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి తిలక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించి, నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి యర్ర చక్రవర్తి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన అధ్యక్షుడు పి.రాజేంద్ర, నందిగాం జెడ్పీటీసీ సభ్యుడు కె.బాలకృష్ణ, పలాస జెడ్పీటీసీ సభ్యురాలు పి.భార్గవి, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు బలగ ప్రకాశ్, కె.జగన్నాయుకులు, నాయకులు రొక్కం అచ్యుతరావు దొర, బోయిన నాగేశ్వర్రావు, టి.జానకీరామయ్య, గురునాథ్ యాదవ్, దువ్వాడ వాణి, సింగుపురం మోహనరావు, ఎన్.శ్రీరామ్ముర్తి, కె.సతీష్, బి.హరి, టి.కిరణ్, చిన్ని జోగారావు, కె.నారాయణమూర్తి, చింతాడ గణపతి, ఎస్.ఉషారాణి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏరా.. పోరా.. నాయకుడు అవసరమా? ‘ఏరా.. మీరు నాకేమైనా ఓటు వేశారా? మీకెందుకు నేను పనిచేయాలి’ అంటూ ప్రజలపై విరుచుకుపడే అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు మనకు అవసరమా? అని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తిలక్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజలను, అధికారులను ఏరా.. పోరా అంటూ తిట్టే అచ్చెన్న లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, జిల్లాలో ఇసుక మాఫీయాకు అచ్చెన్నాయుడే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. ఇటువంటి అవినీతి పాలనకు చరమగీతం పాడాలని దువ్వాడ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడుతూ... వైఎస్ జగన్ అంటే కార్యదీక్ష అని అటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు. ప్రజలను రోడ్డున పడేశారు.. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ... రోడ్డు విస్తరణ పేరుతో కోట్లాది రూపాయలు కాజేసిన అచ్చెన్నాయుడు పేద ప్రజలను నడిరోడ్డున పడేశారని గుర్తుచేశారు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మినీస్టేడియం, 100 పడకల ఆస్పత్రి, మహిళా కళాశాల, హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా టీడీపీ నాయకులకు లాభం చేకూర్చే పనులపైనే దృష్టి పెట్టారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా ఉండాలంటే యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని తిలక్ కోరారు. -
వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా భరత్‌రామ్ నానినేషన్
-
నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటే చేసే పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం శాసనసభ స్థానానికి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేశారు. గంగాధరనెల్లూరు నుంచి నారాయణస్వామి, గుడివాడ నుంచి కొడాలి నాని, కమలాపురం నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసుదన్ రెడ్డి, రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డి నామినేషన్లు సమర్పించారు. వైఎస్సార్ సీపీ నాయకుల నామినేషన్ల కార్యాక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నామిషన్ దాఖలు చేశారు. అనందభారతీ మైదానంలో సర్వమత ప్రార్ధనల అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన నామిషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతా, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సాయి ప్రసాద్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు బుట్టా రేణుక పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీఓ కార్యాలయంలో సూళ్లురుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలు దువ్వూరు బాలచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మార్వో కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నామినేషన్ వేశారు. వైఎస్సార్ సీపీ రాజాంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డి తరఫున ఆయన తల్లి స్వర్ణలత నామినేషన్ సమర్పించారు. వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ వేశారు. తొలుత పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నాని అనంతరం నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో గుడివాడ జనసంద్రంగా మారింది. -
కిరాయి కార్యకర్తల కోసం అన్వేషణ!
సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వం మొదలైంది. పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లాలంటే.. కనీసం వందమంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలి. అక్కడ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు క్రమం తప్పకుండా ప్రచారం చేయాలి. నామినేషన్ల తర్వాత కిరాయి కార్యకర్తలు దొరకడం కష్టం అవుతుంది. వేసవి కావడంతో భవన నిర్మాణాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే ఎండలకు భయపడి కార్యకర్తలు రెట్టింపు డబ్బులు ఇస్తే కాని రారు. అందువల్ల నెల రోజులకు జీతానికి కార్యకర్తలను మాట్లాడుతున్నారు. నెల రోజులపాటు తమ వెంట ఉండేందుకు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. నెలకు మాట్లాడుకున్నప్పటికీ వారానికి ఓసారి డబ్బులు తీసేసుకుంటున్నట్టు కిరాయి కార్యకర్తలను సరఫరా చేసే వన్ టౌన్‌కు చెందిన బ్రోకర్ ఒకరు తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 50 మంది కిరాయి కార్యకర్తలను తమ వెంట ఉండే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాగా పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విధంగా కార్యకర్తలను సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఏ డివిజన్ లేదా గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ లోకల్‌గా పనిచేసే కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులతోపాటు చీరలు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అదనంగా సరఫరా చేస్తున్నారు. నాయకుడి మంచితనాన్ని బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే తమ కార్యకర్తల్ని మధ్యవర్తులు రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ నుంచి కార్యకర్తలు.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా కిరాయి కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి ప్రచారం చేయడానికి వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులు అక్కడ కార్యకర్తలకు ఇచ్చే రేట్ల గురించి వాకబు చేశారు. ఇక్కడ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ చెల్లించాల్సి వస్తోంది. అదే తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కార్యకర్తలు రూ.400కే వస్తుండటంతో విజయవాడ నగరానికి చెందిన ఓ అభ్యర్థి అక్కడ నుంచి సుమారు వందమందిని కిరాయికి పిలిపించారు. వారికి స్థానికంగా షెల్టర్ ఏర్పాటు చేశారు. ఉదయం పూట టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి ఖర్చులు మాత్రం కార్యకర్తలే పెట్టుకోవాల్సి ఉంటుందని తెలంగాణ నుంచి కార్యకర్తలను తీసుకువచ్చిన బీమ్లా నాయక్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 500 మంది కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చారని వివరించారు. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఎన్నికల రోజుకు వెళ్లిపోతామని వారు అన్నారు. వ్యవసాయ కూలీలను వదలడం లేదు.. తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ చెరకు, పత్తి వంటి పంట పొలాల్లో పనిచేసి తిరిగి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన వార్ని నెల రోజులపాటు ఉండి తమకు ప్రచారం చేయమని కోరుతున్నారు. కూలికి వచ్చినవారికి రూ.300 నుంచి రూ.400 మాత్రమే చెల్లిస్తే.. ఉదయం, సాయంత్రం ప్రచారానికి తిరుగుతారని ముఠా మేస్త్రీలు చెబుతున్నారు. టికెట్ కేటాయింపుపై అనుమానాలున్న అభ్యర్థులు కూడా చివర నిమిషంలో టికెట్ లభిస్తే ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
గురుడి బలముండాలి.. శుక్రుడు అనుకూలించాలి
సాక్షి, అమరావతి : ‘తిథి, వార, నక్షత్రాలు కలసిరావాలి.. గురుడు బలంగా ఉండాలి.. శుక్రుడు అనుకూలించాలి.. చంద్రుడు చల్లగా చూడాలి.. చివరకు రాజయోగం సిద్ధించాలి’ ఎన్నికల్లో టిక్కెట్లు దాదాపు ఖరారైన, కచ్చితంగా టిక్కెట్టు దక్కుతుందనుకుంటున్న అభ్యర్థులు, ఆశావహుల మనోగతం ఇది. సీటు రావాలంటే అధిష్టానం కరుణించాలి. అందుకు రాజకీయ సమీకరణలు అనుకూలించాలి. ఇక గెలవాలంటే ప్రజలు ఆదరించాలి. ఓట్లేయాలి. ఈ రెండింటి మధ్యలో మరో ముఖ్య ఘట్టం ఉంది. అదే నామినేషన్ల దాఖలు. సీటు సాధించడానికి ఎంతగా ప్రయత్నిస్తారో.. నామినేషన్లు వేసేందుకు మంచి ముహూర్తానికీ అంతగా ప్రాధాన్యమిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువులోనే తమకు అనుకూలించే మంచి ముహూర్తం చూసుకోవాలి. ఆ రోజులకే ప్రాధాన్యం ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. నామినేషన్లు వేసేందుకు 25వరకు గడువు ఉంది. అంటే 7 రోజులు సమయం ఉంది. మంచి ముహూర్తంలో నామినేషన్ వేయాలని భావిస్తున్న వారు ఇప్పటికే పురోహితులను సంప్రదిస్తున్నారు. వారు పంచాగాలు తిరగేస్తూ అభ్యర్థులు, ఆశావహుల జన్మ నక్షత్రాలు, లగ్నాలు, జాతక చక్రాలను పరిశీలిస్తున్నారు. 19, 22, 25 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ప్రాధాన్యం ఎందుకంటే.. ఆ మూడు రోజులకే ఎక్కవ ప్రాధాన్యం ఎందుకని పురోహితులను సంప్రదించగా వారు చెప్పిందేమిటంటే.. 19వ తేదీ నామినేషన్లకు మంచిదట. ఆ రోజు త్రయోదశి మంగళవారం, మఖ నక్షత్రం. త్రయోదశి జయ తిథి కాబట్టి జయానికి కలసి వస్తుంది. మంగళవారం కుజుడు రోజు కావడంతో అదృష్టం కలసి వచ్చే అవకాశం ఉంది. మఖ నక్షత్రం రాజయోగానికి అనుకూలం. చాలామంది ఆ రోజు నామినేషన్లు వేయాలని భావిస్తున్నారు. 22న అన్నిటికంటే ముహూర్తం బాగుందని పురోహితులు చెబుతున్నారు. ఆ రోజు విదియ శుక్రవారం. హస్త, చిత్త నక్షత్రాలు ఉన్నాయి. విదియ కూడా జయ తిథి కాబట్టి జయానికి దోహదపడుతుంది. శుక్రవారం శుక్రుడు బలం కలిసొస్తుంది. ఆ రోజు ఉదయం 11గంటల వరకు హస్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. చం ద్రుడు రాజయోగ కారకుడు. ఇక 22న ఉదయం 11గంటల నుంచి చిత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. అత్యంత యోగకారకుడు. దాంతో ఈ నెల 22 అన్నివిధాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు. ఎవరికైనా ఆ రోజు కలిసొస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఆ రోజు అన్నిపార్టీల అగ్రనేతలతోపాటు అత్యధికులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఈ నెల 25న కూడా మంచి ముహూర్తం ఉంది. అభ్యర్థుల జన్మ లగ్నాలను బట్టి ఆరోజు నామినేషన్లు వేయడం కలసి వస్తుందంటున్నారు. వృషభ, మకర, తుల, కుంభ లగ్నాల్లో జన్మించిన వారికి ఆ రోజు యోగకారకమని చెబుతున్నారు. -
ఎన్నికల రథసారథులు..
సాక్షి, ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎన్నికల వేడి జోరందుకుంది..ఇప్పటికే భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..దీనికి తోడు ఎన్నికల ప్రచారాలు, సన్నాహాలు, నాయకుల విమర్శలు వాతావరణాన్ని మరింత వేడిసెగలు కక్కేలా చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసి అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తుండగానే.. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల విధులు నిర్వహించే రథసారధులు వారి బాధ్యతలు సమర్థంగా పూర్తి చేస్తేనే చివరి ఓటరు వరకు ఓటుహక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఎన్నికల తంతును విజయవంతంగా ముగించడంలో బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల కృషి విశేషంగా ఉంటుంది. ఏ ఒక్కరూ వారి విధులను సక్రమంగా నిర్వర్తించకున్నా పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు వెల్లడించే వరకు ప్రతీ సందర్భాన్ని అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎన్నికల నిర్వహణలో అధికారుల విధులు ఏవిధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించి ప్రధాన ఎన్నికల అధికారిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధికారం ప్రధాన ఎన్నికల అధికారికి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ, నియంత్రణకు లోబడి ప్రతీ జిల్లాకు ఒక ఎన్నికల అధికారి ఉంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ ఈ బాధ్యతను నిర్వహిస్తూ జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికలు నిర్వహించడంలో కీలక భూమిక పోషిస్తారు. రిటర్నింగ్ అధికారి శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నియామకం, శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి అన్ని రకాల పనులు ఆర్ఓ పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ఆయా నియోజవర్గాల పరిధిలోని రెవెన్యూ డివిజినల్ అధికారి లేదా జేసీ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సెక్టోరల్ ఆఫీసర్ ఎనిమిది నుంచి పది కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సెక్టోరల్ అధికారిని నియమిస్తారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు, అవసరమైనచోట 144 సెక్షన్ విధించే అధికారం సెక్టోరల్ అధికారికి ఉంటుంది. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ బూత్‌లు గుర్తించి అక్కడ బందోబస్తు ఏర్పాటుకు సిఫార్సు చేయడం వంటి విధులు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి ఉంటాడు. ఆయన పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, పోలింగ్ అనంతరం సీల్ వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు వచ్చే వరకు ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యత వహిస్తారు. ఇతడికి సహాయకుడిగా మరో అధికారి ఉంటారు. పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని కార్యకలాపాలు ఆయన పర్యవేక్షణలోనే నడుస్తాయి. ఫ్లయింగ్‌స్క్వాడ్ మూడునాలుగు మండలాలకు ఒక ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందం ఉంటుంది. ఈ బృందం తమకు కేటాయించిన మండలాల పరిధిలో మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం వీరి బాధ్యత. ఓటరు నమోదు అధికారి ఓటర్ల జాబితా తయారు చేయడం ఈ అధికారి ప్రధాన బాధ్యత. ఓటును నమోదు చేసుకునే వారు జాబితాల్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించవచ్చు. ఈయన పర్యవేక్షణలో మరికొందరు అధికారులు ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. పోలింగ్ ఏజెంట్లు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని నేరుగా పరిశీలించే అవకాశం ఉండనందున ప్రతీ పోలింగ్ కేంద్రంలో తన పక్షాన ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. ఈయనే పోలింగ్ ఏజెంట్. ఇతను ఓటు వేసేందుకు వచ్చిన వారి వివరాలను ఓటర్ల జాబితాలో సరి చేసుకుని అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబుతారు. దీంతో దొంగ ఓట్లు పడకుండా చూడవచ్చు. పోలింగ్ ఏజెంట్ సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు అయి ఉండాలి. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిర్వహణ జరిగిన తీరుపై నివేదిక రూపొందించి జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పంపించడంలో మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరిస్తారు. బూత్‌లెవల్ అధికారులు కొత్తగా ఓటు నమోదు చేసకునే వారికి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేయడం. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఓటరు జాబితాల ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పు తదితర అంశాల్లో బూత్‌లెవల్ అధికారులు సేవలందిస్తారు. -
కల్వకుర్తిలో బోణీ..
సాక్షి, కల్వకుర్తి :అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం మొదలైంది. మొదటిరోజు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కల్వకుర్తి మినహా ఎక్కడా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేదు. కల్వకుర్తిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ తరుఫునా నామినేషన్ వేశారు. మొదటి సెట్ కావడంతో ఇరువురు నాయకులు సాదాసీదాగా వచ్చి నామినేషన్ పత్రాలు అధికారులకు అందించి వెళ్లారు. కల్వకుర్తిలో రెండు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా నామినేషన్ల దాఖలు హడావిడి కనిపించలేదు. కానీ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మొదటి రోజే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, టీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేష్‌కుమార్‌కు అందజే«శారు. ఇరువురు మొదటి సెట్ మాత్రం అందజేసి వెళ్లిపోయారు. మరోరోజు భారీ ర్యాలీలతో మరోసారి నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జైపాల్ యాదవ్ తన నామినేషన్ పత్రాన్ని మధ్యాహ్నం 1.15 గంటలకు పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, బాలాజీసింగ్, విజితారెడ్డిలతో కలిసి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. రెండో విడత పత్రాలను మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ ముఖ్యనాయకులతో కలిసి మరోమారు నామినేషన్ వేసేందుకు రానున్నారు. మెదటి సెట్ నామినేషన్ పత్రాల్లో ఎడ్మ కిష్టారెడ్డి.. జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి మధ్యాహ్నం 12.15 గంటలకు తన కుటంబ సభ్యులతో కలిసి వచ్చి మొదటి సెట్ నామినేసన్ పత్రాలను దాఖలు చేశారు. తండ్రి రాంరెడ్డి, తల్లి శోభారెడ్డిలతో పాటు భార్య ఆశ్లేషారెడ్డి, కూతురు మహాక్షారెడ్డిలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. రెండో విడతలో సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డితో రానున్నట్లు తెలిసింది. వంశీచంద్‌రెడ్డి భార్య ఆశ్లేషారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. నాగర్‌కర్నూల్‌లో నిల్.. నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయగా మొదటిరోజు సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడానికి రాలేదు. స్థానిక ఆర్డీఓ (రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించేందుకు అందుబాటులో ఉన్నారు. కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా ఉదయం 11గంటలకు నామినేషన్ పత్రాల స్వీకరణకు ముందే బాంబ్ స్క్వాడ్‌తో కార్యాలయ ఆవరణ మొత్తం తనిఖీలు నిర్వహించారు. అచ్చంపేటలోనూ నిల్ అచ్చంపేట: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టమైన నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభించగా మొదటిరోజు ఏ అభ్యర్థి కూడా దాఖలు చేయలేదు. ప్రచారంలో మునిగి తేలు తున్న అభ్యర్థులు నామినేషన్లకు ముహూర్తాలను వెతుక్కుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఆర్భాటంగా ఈనెల 14న నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మహాకూటమి అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ కా>ంగ్రెస్ పార్టీ నుంచి భీఫామ్ ఇంకా అందుకోలేదు. అలాగే బీజేపీ అభ్యర్థి మల్లేశ్వర్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేయాలని చూస్తున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ నర్సింహులు మొదటిరోజు రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐలు పరుషరామ్, రమేష్ బందో బస్తును పర్యవేక్షిస్తున్నారు. -
‘వైఎస్ జగన్ నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు’
సాక్షి, అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తాను అభిమానిని అని, వైఎస్ఆర్ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ‘ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారు. 40 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ కచ్చితంగా గెలుస్తుంది. ఏ పార్టీ వాళ్లు అయినా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ఆయన ఎంత గొప్ప నాయకుడో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ చనిపోయారు. కానీ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించారు. ఎన్నికష్టాలు ఎదురైనా జగన్ ప్రజల కోసం ధృడంగా నిలబడ్డారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు.’ అని అన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న వేమిరెడ్డి
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
ఆర్కే నగర్ బరిలో తమిళ హీరో విశాల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా 4వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు, డీఎంకే అభ్యర్థులను ప్రకటించాయి. -
నంద్యాలలో న్యాయం గెలిచింది: శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల : నంద్యాలలో న్యాయం గెలిచిందని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా టీడీపీ ఎన్ని అభ్యంతరాలు, కుట్రలు చేసినప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రలను ప్రోత్సహిస్తున్నారు. బూత్‌ల వారీగా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీదే విజయం... శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై వైఎస్ఆర్ సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...‘నంద్యాలలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా టీడీపీ కుట్రలు పన్నిందని, ఎన్నికల నిబంధనల మేరకే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నంద్యాలలో వైఎస్ఆర్ సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిగ్గుంటే 21మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పతనం ప్రారంభం.. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ... ‘ ఇవాళ్టి నుంచే నంద్యాలలో టీడీపీ పతనం ప్రారంభం. రిటర్నింగ్ అధికారి నిర్ణయం టీడీపీకి చెంపపెట్టు. అభ్యంతరాల పేరుతో టీడీపీ విష ప్రచారం చేసింది. ఓటమి భయంతోనే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. చిన్న విషయాన్ని ఎల్లో మీడియా చిలువలు పలువలు చేసింది. నామినేషన్ ఆమోదం కష్టమేనంటూ టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. నామినేషన్ల సమయంలోనే టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. విష ప్రచారంతో నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారు. చివరకు న్యాయమే గెలిచింది. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. నంద్యాలలో ఎంతకైనా దిగజారేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు ఆటలను సాగనివ్వం. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి ఎదురే లేదు. .’ అని అన్నారు. -
నంద్యాలలో న్యాయం గెలిచింది
-
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. నోటరీ రెన్యువల్ అంశాన్ని, స్టాంప్ పేపర్‌పై అదనపు అఫిడవిట్ ఇవ్వలేదంటూ టీడీపీ మెలికపెట్టినప్పటికీ వాటిని.. ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రెండు గంటలపాటు టీడీపీ మీడియా దుష్ప్రచారానికి ఈసీ పుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది. కాగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు కుట్రలకు ఎన్నికల కమిషన్ చెంపపెట్టులా సమాధానం ఇచ్చినట్లు అయిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని ఎల్లో బ్యాచ్ ఆలోచనలకు ఈసీ బ్రేక్ వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. నామినేషన్ల దగ్గర కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. ధైర్యంగా పోరాటం చేయలేక టీడీపీ సాకులు వెతుకుతుందని అంబటి విమర్శించారు. నంద్యాలలో గెలవడానికి వెయ్యి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ కూడా ఈసీ ఆమోదించింది. -
శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన తన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్సార్సీపీ తరఫున శిల్పా మోహన్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కూడా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సిద్ధం శివరాం, కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, ముస్లిం మైనార్టీ నాయకుడు ఇసాక్, కానాల విజయశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి
-
నేడు శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్
-
రాజ్యసభకు అమిత్ షా నామినేషన్ దాఖలు
గాంధీనగర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అమిత్‌షా గుజరాత్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ,బల్వంత్ సిన్హా రాజ్‌పుత్ కూడా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్, బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 9 మంది సభ్యుల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. వీరిలో స్మృతీ ఇరానీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులున్నారు. -
నాలుగో సెట్ నామినేషన్ దాఖలు చేసిన కోవింద్
న్యూఢిల్లీ: : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం మరో దఫా నామినేషన్ దాఖలు చేశారు. నాలుగో సెట్ నామినేషన్ పత్రాలను ఆయన తరఫున బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గత శుక్రవారమే రాష్ట్రపతి ఎన్నికల కోసం కోవింద్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. వెంకయ్య నాయుడు ఈరోజు ఆఖరి సెట్‌ను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి హాజరయ్యారు. నాలుగోసెట్ నామినేషన్ పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ అన్ని విధాలా అర్హుడన్నారు. అత్యధిక మెజార్టీతో రామ్‌నాథ్ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
నామినేషన్ దాఖలు చేసిన మీరా కుమార్
న్యూఢిల్లీ: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ కార్యదర్శికి.. మీరా కుమార్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినాయకులతోపాటు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, సీతారాం ఏచూరి, కనిమొళి తదితరులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 17 విపక్ష పార్టీలు మీరాకుమార్‌కు మద్దతు పలుకుతున్నాయి. కాగా నామినేషన్ వేసేందుకు ముందుగా మీరా కుమార్ ...ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్ సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. -
గౌరు వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు
కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు గంగుల ప్రభాకర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కాగా అధికారపార్టీ నుంచి ఇప్పటివరకూ అభ్యర్థి ఖరారు కాలేదు. మరోవైపు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరు ఖరారు అయింది. -
వైఎస్ జగన్‌ను కలిసిన విజయ సాయిరెడ్డి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి విజయ సాయిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఆయనకు పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు విజయ సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), టీజీ వెంకటేష్ (టీడీపీ), సురేష్ ప్రభు (బీజేపీ), విజయ సాయిరెడ్డి (వైఎస్ఆర్ సీపీ) నామినేషన్లు వేశారు. అలాగే తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. -
కేఎల్లార్ రెడీ!
శాసనమండలి పోరుకు సన్నద్ధం నామినేషన్ దాఖలుకు రంగం సిద్ధం ఆయనతోపాటు తెరపైకి మరో నలుగురి పేర్లు అభ్యర్థుల ఖరారుపై నేడు కాంగ్రెస్, టీడీపీ కీలక సమావేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో కదన కుతూహలం కనిపిస్తోంది. శాసనమండలి సమరానికి ససేమిరా అనడమే కాకుం డా... షరతులు విధించిన సీనియర్లు తాజాగా మెట్టు దిగి పోటీకి సై అంటున్నారు. పోటీ చేయడానికి తొలుత అయిష్టత కనబరిచిన నాయకులు ఇప్పుడు మాత్రం నామినేషన్ల దాఖలుకు రెడీ అవుతున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్‌లో శాసనమండలి బరిలో దిగడానికి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ముఖ్యనేతలు రమేశ్, ధారాసింగ్, బాలేష్‌లు శనివారం నామినేషన్ ఫారాలను సేకరించడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. వాస్తవానికి కౌన్సిల్‌కు పోటీచేసేందుకు ముఖ్యనేతలు ముందుకురాలేదు. బలవంతంగా బరిలో దింపినా.. భవిష్యత్తుపై భరోసా ఇస్తేనే పోటీ చేస్తామని షరతులు పెట్టారు. ఈ క్రమంలోనే జిల్లా నాయకత్వం మాజీ మంత్రులు సబిత, ప్రసాద్, చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు కేఎల్లార్, సుధీర్‌రెడ్డి పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీకి పంపింది. ఈ మేరకు ఏకాభిప్రాయంతో జాబితాను పంపిన అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే మండలిలో పోటీకి వెనుకాడుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ కదనరంగంలోకి దిగాలని నిర్ణయించారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఆయన మొగ్గు చూపినప్పటికీ, సుధీర్ వెనుకంజ వేస్తున్న తరుణంలో కాలయాపనతో ప్రత్యర్థులకు అవకాశమివ్వకుండా తానే పోటీ చేయాలనే అభిప్రాయానికొచ్చారు. ఈ కోణంలో సంఖ్యాబలం, పాతమిత్రుల మద్దతుపై అంతరంగికులతో కూడికలు, తీసివేతలపై కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా తన సహాయకుడి ద్వారా నామినేషన్ ఫారాలను తెప్పించారు. తనతోపాటు మరో నలుగురు అభ్యర్థులను కూడా తెరమీదకు తెచ్చిన ఆయన.. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేస్తున్నారు. కేఎల్లార్ ఐతే ఒకే..! శాసనమండలి రేసులో కేఎల్లార్ పేరును మాజీ మంత్రి సబిత ప్రతిపాదించారు. మొన్నటివరకు వైరివర్గాలు ఈ వ్యవహరించిన ఈ ఇరువురు నేతల మధ్య ఇటీవల వైరం తగ్గినట్లు కనిపిస్తోంది. అప్పట్లో ఒకరి పేరును మరొకరు ప్రతిపాదించినా.. పోటీకి మాత్రం నిరాకరించారు. ఈ క్రమంలోనే ఇటీవల మేడ్చల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఎల్లార్ నివాసానికి సబిత వెళ్లడం.. ఇటీవల నవాబ్‌పేట ఉప ఎన్నికలో ఒకే ప్రచార వాహనంపై ప్రసంగించడం కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు కొంత మేర సద్దుమణిగేలా చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్లార్ మండలి బరిలో నిలవడానికి ఉత్సాహం కనబరుస్తున్నట్లు ఆర్థమవుతోంది. సబిత మద్దతుగా నిలిస్తే ప్రత్యర్థిని నిలువరించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే నామినేషన్ దాఖలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుండగా, అభ్యర్థుల ఖరారుపై ఆదివారం కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు పాల్గొనే ఈ సమావేశంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఖరారు కానుంది. అనంతరం చెరో సీటుకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి.. అధిష్టానాలకు పంపే అవకాశం ఉంది. -
ఏపీ అసెంబ్లీకి రానున్న నిర్మల
-
నామినేషన్ వేసేందుకే హైదరాబాద్ వచ్చా
హైదరాబాద్ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ (స్వతంత్ర) మంత్రి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు నామినేషన్ వేసేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా నిర్మలా సీతారామన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసబ స్థానానికి ఎంపిక చేస్తూ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్న టీడీపీ నిర్మల అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. దాంతో ఆమె ఎన్నిక దాదాపు ఏకగ్రీవమైనట్లే. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. -
స్పీకర్ మధుసూదనాచారి
అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవమైన ఎన్నిక నేడు అధికారిక ప్రకటన...అనంతరం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతిగా వరంగల్ జిల్లా భుపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్థిగా సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా విపక్షాల ఫ్లోర్‌లీడర్లు ఆయనకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. మంగళవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే మధుసూదనాచారి స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రకటిస్తారు. ఆ తరువాత సీఎం సహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లంతా మధుసూదనాచారిని స్పీకర్ స్థానం వరకూ గౌరవంగా తీసుకెళతారు. అనంతరం స్పీకర్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమంతో సభ మరుసటిరోజుకు వాయిదా పడుతుంది. ఫలించిన టీఆర్ఎస్ మంతనాలు: శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు టీఆర్ఎస్ నేతలు గత రెండ్రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు శని, ఆదివారాల్లో కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఫ్లోర్‌లీడర్లను కలసి స్పీకర్ ఎన్నికపై మాట్లాడారు. మధుసూదనాచారిని స్పీకర్ అభ్యర్ధిగా బరిలో దింపుతున్నందున మద్దతివ్వాలని కోరారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడంతో అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. -
గంగామాత పిలుపుతోనే..
కాశీలో పోటీచేస్తున్నా: మోడీ అట్టహాసంగా నామినేషన్ దాఖలు కాషాయమయమైన వారణాసి వీధులు వారణాసి/న్యూఢిల్లీ: వేలాది మంది మోడీ, మోడీ అని నినదిస్తూ అనుసరించిరాగా.. వారణాసి లోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన మూడు కిలోమీటర్లు రోడ్‌షో నిర్వహించారు. వేలాది మంది అభిమానులు ఆయనకు మద్దతు తెలపడానికి రావడంతో ఆ మూడు కిలోమీటర్ల రోడ్‌షోకు మూడు గంటల సమయం పట్టింది. కాషాయ వస్త్రధారులైన కార్యకర్తలు, అభిమానులతో కాశీ వీధులు కిక్కిరిసిపోయాయి. ఓపెన్ టాప్ ట్రక్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ మోడీ ముందుకుసాగారు. కొన్ని ప్రాంతాల్లో ఆయనకు మైనార్టీలు కూడా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్నెవరో పంపితేనో, నా అంతట నేనో ఇక్కడికి రాలేదని అనుకుంటున్నాను. గంగామాత పిలవడం వల్లే ఇక్కడికి వచ్చాను. తల్లి ఒడిలో చిన్న పిల్లాడి అనుభవం కలుగుతోంది. ఈ పట్టణానికి సేవ చేయడానికి శక్తినివ్వమని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు. గంగానదిని ప్రక్షాళన చేస్తా..: రోడ్‌షోకు ముందు బనారస్ హిందూ యూనివర్సిటీని సందర్శించి అక్కడ మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి మోడీ నివాళులు అర్పించారు. తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన.. గంగానదిని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. అనంతరం వారణాసిలో ప్రజలు చూపిన అభిమానాన్ని మాటల్లో వర్ణించలేనిదని ట్వీట్ చేశారు. పురాతన ఆధ్యాత్మిక నగరమైన కాశీని ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తన వెబ్సైట్లో పేర్కొన్నారు. దేవుడే పంపాడు..: ‘‘కొన్ని క్లిష్టమైన పనులు నెరవేర్చడానికి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. క్లిష్టమైన పనులు పూర్తి చేసేవాడిని దేవుడు మెచ్చుకుంటాడు. నన్ను దేవుడు అందుకే ఎన్నుకున్నాడని అనుకుంటున్నాను. నాకు మీ ఆశీర్వచనాలు ఇస్తే క్లిష్టమైన పనుల్ని సున్నితంగా పూర్తి చేస్తాను’’ అని త్రీడీ టెలికాస్ట్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పారు. తందూరీ పొయ్యి సంగతి ఏంటి..: మహిళా సాధికారతపై తనను ఉద్దేశించి కాంగ్రెస్ విమర్శలు చేయడంపై ఆ టెలికాస్ట్‌లో మండిపడ్డారు. 1990లో తందూరీ పొయ్యలో మహిళను కాల్చివేసిన కేసులో కాంగ్రెస్ నేత హస్తాన్ని ప్రస్తావించారు. ప్రత్యర్థి పార్టీ నేతలు లాతూర్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ చేయడంపై ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై నేరాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. దేవుడే అయితే ఓటింగ్ ఎందుకు..: దేవుడే తనని ఎన్నుకున్నాడని మోడీ చెప్పడంపై కాంగ్రెస్ మండిపడింది. అదే నిజమయితే ఫలితాల కోసం ఎదురుచూడడం ఎందుకని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద శర్మ ప్రశ్నించారు. మోడీ తనకు తానే దేవుడిగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఈసీని డిమాండ్ చేశారు. కాగా, వడోదరలో వెల్లడించిన ఆస్తుల కన్నా మోడీ ఆస్తులు రూ. 14. 34 లక్షలు పెరిగాయి. ఎన్నికల ఖర్చు కోసం ఆయనకు పార్టీ నిధులు మళ్లించడం వల్లే ఆస్తుల్లో పెరుగుదల కనిపించిందని బీజేపీ శ్రేణులు చెప్పాయి. ఆయన ఇక్కడ సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులను రూ. 1.65 కోట్లుగా పేర్కొన్నారు. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైకోర్టు నోటీసు
హైదరాబాద్: నల్లగొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్లో అవాస్తవాలు పొందుపరిచారని, దీనిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు స్పందిం చింది. బీఈలో ఉత్తీర్ణత సాధించకపోయినా, సాధించినట్టు పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది . నామినేషన్ పత్రాల్లో బీఈ ఉత్తీర్ణులైనట్టు వెంకటరెడ్డి పేర్కొన్నారని, అయితే ఆయన ఉత్తీర్ణులు కాలేదని ఆధారాలను చూపినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని టీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాక నరసింహారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, 2009 ఎన్నికల నామినేషన్ పత్రాల్లో కూడా వెంకటరెడ్డి బీఈ ఉత్తీర్ణుైడైనట్టు పేర్కొన్నారని, దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెప్పించుకున్నామని కోర్టుకు నివేదించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, ఒకవేళ ఇదే నిజమైతే వెంకటరెడ్డిపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశాలిస్తామన్నారు. -
కొత్తపల్లి గీత నామినేషన్ సక్రమమే..
పాడేరు : అరకు లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ పత్రాలు సక్రమమేనని అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆమెపై పోటీచేస్తున్న కొందరు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. రిటర్నింగ్ అధికారి వి. వినయ్‌చంద్ దీనిపై సోమవారంవిచారణ జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగల మండ ల రెవెన్యూ అధికారులను కూడా వాకబు చేసిన అనంతరం కొత్తపల్లి గీత ఎస్టీ ధ్రువపత్రం సక్రమమేనని అధికారులు ప్రకటిస్తూ ఆమె నామినేషన్‌ను ఆమోదించారు. కొత్తపల్లి గీతను వాల్మీకి కులస్తురాలుగా గుర్తించి 2002లో హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఫిర్యాదు చేయడంపై స్థానికంగా నిరసన వ్యక్తమైంది. తమకున్న ప్రజాదరణ, కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కొత్తపల్లి గీత విజయం ఖాయమనే భావన జీర్ణించుకోలేక ఇలాంటి తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని గిరిజన వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
'యామిని బాల నామినేషన్‌పై అభ్యంతరం'
అనంతపురం : అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. యామిని బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపణలు చేశారు. కాగా ఆర్వో రామ్మోహన్ ఆమె నామినేషన్ ఆమోదించటంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకట రమణ నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. టీడీపీ నేతల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. -
సీమాంధ్రలో నేడు నామినేషన్ల పరిశీలన
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించే(స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం జరుగుతుంది. ఆయా నామినేషన్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. సక్రమంగా లేనివాటిని తిరస్కరించడంతోపాటు పోటీలో ఎంత మంది మిగిలింది ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగుస్తుంది. అసెంబ్లీకి 4,173, లోక్‌సభ స్థానాలకు 573 నామినేషన్లు ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 4,173 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 573 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం అన్ని జిల్లాలనుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 513 మంది, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 123 మంది నామినేషన్లు దాఖలు చేశారని సీఈవో కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. -
సార్లొస్తారొస్తారా..?
అన్నీ ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి... ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటనలు, అలకలు, బుజ్జగింపులు, నామినేషన్ల దాఖలు, పరిశీలనలు, ఉపసంహరణలు... ఇలా సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో ఒక్కో అంకానికి తెరపడుతోంది. ఇక ఇప్పుడు మిగిలిందల్లా రెండే ప్రధాన ఘట్టాలు. ఈ పదిరోజుల పాటు విస్తృత ప్రచారం.. 30న పోలింగ్ కార్యక్రమం. ఈ రెండు పూర్తయితే సార్వత్రిక ఎన్నికలు దాదాపు అయిపోయినట్టే. ఒక్క ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలిపోతుంది. ఈ సమయంలో జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. డప్పుచప్పుళ్లలో, పూలవానలు కురిపించుకుంటూ ప్రజలను కలుస్తున్నారు. ప్రచార పర్వంలో అభ్యర్థులు వెళ్లి ఓట్లడగడం ఒక ఎత్తయితే... ఆ అభ్యర్థుల తరఫున ఆయా పార్టీలకు చెందిన అగ్రనేతలు, ప్రచార తారలు వచ్చి ప్రచారం నిర్వహించడం మరో ఎత్తు. ఈ స్టార్ క్యాంపెయినర్ల కోసమే ఇప్పుడు జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఒక్క వైఎస్సార్సీపీ మినహా ఏ పార్టీకి ఇప్పటి వరకు ప్రచార క్యాంపెయినర్లు జిల్లాకు రాలేదు. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐలతో పాటు బీజేపీ నేతలు తమ పార్టీల అగ్రనేతలు వస్తారేమోనని ఎదురుచూస్తున్నా రు. అయితే, ప్రచారానికి ఇక పదిరోజులు మా త్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంకా అగ్రనేతల షెడ్యూల్ కూడా ఖరారు కాకపోవడంతో స్టార్ క్యాంపెయినర్లు ఈసారి జిల్లాకు రావడం అనుమానమేనని, ఎవరైనా వచ్చినా జిల్లాలో ఎక్కడోచోట బహిరంగ సభ నిర్వహించి వెళ్లిపోతా రే తప్ప రోజుల తరబడి ప్రచారం నిర్వహిం చే అవకాశం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. అమ్మ రాదు... యువరాజయినా వస్తారా? కాంగ్రెస్ విషయానికి వస్తే.... తెలంగాణ తామే ఇచ్చామని చెప్పేందుకు కూడా అగ్రనేతలు జిల్లాకు రారేమోననే భయం స్థానిక నాయకత్వానికి పట్టుకుంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పటికే తెలంగాణలో ఓ దఫా పర్యటించారు. మరోమారు పర్యటించే అవకాశం ఉన్నా జిల్లాకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యువరాజు రాహుల్నయినా జిల్లాకు తీసుకురావాలని జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన పర్యటన తేలలేదు. రాహుల్ నల్లగొండ జిల్లాకు మాత్రమే వస్తారని టీపీసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరిని పక్కనపెడితే కనీసం రేణుకాచౌదరి కూడా ఇంకా ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక తమకు తామే స్టార్క్యాంపెయినర్లమనే భావనకు వచ్చారు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థులు. ‘బాబు’ను తీసుకురావాలని... మరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఒక్కడే స్టార్‌క్యాంపెయినర్. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలలో పార్టీ తర ఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు కానీ ఈసారి ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక, లోకేశ్ బాబు కేవలం సీమాంధ్ర జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో మాత్రమే ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబును జిల్లాకు తీసుకురావాలని స్థానిక నాయకత్వం ప్రయత్నిస్తున్నా...వర్గపోరు నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ఆయన సభ పెట్టాలనేది నిర్ణయించడం కష్టమవుతోందని తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని జిల్లాలోని పినపాక ఒక్క స్థానంలోనే పోటీచేస్తున్న బీజేపీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలెవరూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కావడంతో పాటు హైదరాబాద్‌కు చాలా దూరంలో ఉండడంతో అక్కడకు వచ్చేందుకు అగ్రనేతలెవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా పార్టీ నాయకత్వం కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. సీపీఐ విషయానికి వస్తే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శే ఇక్కడ స్వయంగా బరిలో ఉన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీచేస్తున్న నారాయణ తరఫున స్టార్‌క్యాంపెయినర్లు అవసరం లేదని, ఆయనే పెద్ద స్టార్‌క్యాంపెయినర్ అని ఆ పార్టీ శ్రేణులంటున్నాయి. అయితే, బర్ధన్ లేదా సురవరం సుధాకర్‌రెడ్డి ప్రచారానికి రావచ్చని చెపుతున్నారు కానీ తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కూడా ఇంతవరకూ పెద్దనేతలు ఎవరూ ప్రచారానికి జిల్లాకు రాలేదు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 22నజిల్లాలోని పలుప్రాంతాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల రాకతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం స్టార్‌క్యాంపెయినర్లు రాక పలు ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి అలా ఉంటే.... ఎన్నికల అవగాహన కుదుర్చుకుని వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థులు మాత్రం ఫుల్‌జోష్‌తో ముందుకెళుతున్నారు. ఆ రెండు పార్టీల పక్షాన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విసృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని పది నియోజకవర్గాలను నాలుగు రోజుల్లో చుట్టొచ్చిన ఆమె పర్యటనకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అడుగడుగునా నీరాజనం పలికిన జనం వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థులు గెలుపునకు భరోసా ఇచ్చారు. షర్మిల పర్యటనతో జిల్లాలోని రెండు పార్టీల శ్రేణుల్లోనూ ఉత్సాహం తొణికిసలాడుతోంది. ముఖ్యంగా ఆమె పర్యటన ప్రారంభించిందీ... ముగించిందీ కూడా ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న సీపీఎం అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లోనే. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఇరుపార్టీల అభ్యర్థుల విజయం కోసం అలుపెరగని శ్రమ చేస్తున్నారు. కాగా, సీపీఎం అగ్రనేతలు కూడా జిల్లాలో పర్యటించి వైఎస్ఆర్సీపీ, సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 24న సీతారాం ఏచూరి, 28న బృందాకారత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాకు రానున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ, సీపీఎం శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. -
ఇంతకీ ఆయన ఏ పార్టీ!
-
ఇంతకీ ఆయన ఏ పార్టీ!
ఏలూరు : ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు. మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.... నిన్నటి వరకూ బీజేపీలో ఉన్న ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురువారం నరసాపురం ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి తెలుగు దేశం తరపున, రెండోది బీజేపీ తరపున వేశారు. పొత్తుల వ్యూహాల్లో భాగంగా ఆయన ఇలా రెండు పార్టీల తరపున నామినేషన్లు వేసినా ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి రాజీనామా చేయలేదు... అలాగని తెలుగుదేశం పార్టీలోనూ చేరలేదు. అయినా రెండు పార్టీల తరపున ఎలా నామినేషన్ వేశారోనని ఆయన అనుచరులే అయోమయంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నదీ ఆయనకే తెలియదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న రఘురామ కృష్ణంరాజు చివరకు సీటు కూడా దక్కించుకోలేకపోయారు. ఏపార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారని ఆయన పక్కనున్న వారే చెవులు కొరుక్కుంటున్నారు. -
విశాఖ లోక్‌సభకు విజయమ్మ నామినేషన్
-
విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటా: విజయమ్మ
విశాఖ : విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీ అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో అభిమాన తరంగాలు ఎగిసిపడ్డాయి. అంతకు ముందు విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న విజయమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు కుమార్తె షర్మిలతో నగరానికి చేరుకున్న మహానేత కుటుంబ సభ్యులకు జిల్లా వాసులు అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్ సందర్భంగా పట్టణంలోని ప్రతి వీధి జన సంద్రమైంది. ర్యాలీగా బయలుదేరిన విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు ఎదురేగి స్వాగతాలు పలికారు. మహిళలు హారతులిచ్చి దీవెనలిందించారు. జోహార్ వైఎస్ఆర్ , జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పార్లమెంట్ స్థానానికి గెలిచిన తర్వాత విశాఖ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అలాగే విశాఖను గ్రీన్ సిటీ, కాలుష్యరహిత నగరంగా చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుతామన్నారు. పేదల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని, ప్రజలకు వైఎస్ఆర్ లేని లోటు తీరుస్తారని విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయిదు సంతకాలు చేస్తారని విజయమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని ఆమె తెలిపారు. -
జనోత్సాహం మధ్య నామినేషన్ వేసిన జగన్
-
తొలిసారి శాసనసభకు వైఎస్ జగన్ పోటీ
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్‌తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం 2011లో వైఎస్ఆర్ సీపీని స్థాపించడం.. మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ జగన్‌కి 5,45,043ఓట్ల భారీ మెజార్టీని అందించడంతో దేశస్థాయిలోనే ఆయన పేరు మారుమోగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభంజనం వీస్తున్న నేపథ్యంలో పులివెందుల నుంచి వైఎస్ జగన్ సీఎం అభ్యర్థిగా శాసన సభకు పోటీ చేస్తున్నారు. ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం కానున్నారు. ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో చర్చించనున్నారు. 18వ తేదీన జగన్ కడప పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం చేస్తారు. -
బాలయ్య ఆస్తులు రూ.424 కోట్లు
అఫిడవిట్లో వెల్లడి.. హిందూపురంలో నామినేషన్ ధర్మవరం టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరికి అవమానం హిందూపురం,అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకు రూ. 424.18 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతకుముందు హిందూపురం సమీపంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో బాలకృష్ణ కుటుంబసభ్యులతో కలసి పూజలు చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, పూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి టీడీపీ నాయకులు, అభిమానులతో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. బాలకృష్ణ.. తనతో పాటు భార్య, కుమారుడు పేరిట సుమారు రూ. 424.18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. తన పేరున రూ. 170.47 కోట్ల ఆస్తులు, భార్య వసుంధరాదేవి పేరిట రూ. 130.78 కోట్ల ఆస్తులు, కుమారుడు మోక్షజ్ఞ పేరున రూ. 122.92 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను ఆదరించిన విధంగా తననూ గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ధర్మవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరికి బాలకృష్ణ తీరుతో అవమానం ఎదురైంది. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో తన వెంట రావద్దంటూ సూరిని బాలకృష్ణ గట్టిగా హెచ్చరించారు. ‘మళ్లీ చెప్పాలా... పక్కకు వెళ్లు...’ అంటూ బాలయ్య హూంకరించడంతో చేసేది లేక సూరి వెనుదిరిగారు. -
తడబడితే ఇబ్బందే
ఎంపీ, ఎమ్మెల్యే నామినేషన్ల్లకు నిబంధనలివే ఫారం26 పూర్తి చేయకపోతే తిరస్కరణే గతంలో నామినేషన్‌తో పాటు అభ్యర్థుల అప్పులు, ఆస్తులతో పాటు నేరాభియోగాలకు సంబంధించిన అఫిడివిట్‌ను విడివిడిగా దాఖలు చేసేవారు. ఈ ఎన్నికల్లో కొన్ని మార్పులు చేశారు. రూ. 10 బాండ్ పేపరుపై నోటరీ చేసిన ఫారం 26ను సమర్పించాల్సి ఉంది. నామినేషన్ చివరి రోజు 3 గంటల వరకు దాఖలు చేసే అవకాశం ఉంది. ఖాళీలు వదిలినా, డాష్(-) రాసిన నామినేషన్‌ను తిరస్కరిస్తారు. వాటిల్లో లోటు పాట్లపై రిటర్నింగ్ అధికారి అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తారు. నామినేషన్లు ఉపసంహరణ గడువుకు ముందు సరిచేసి ఇస్తే సరిపోతుంది. నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా లో నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు 10 అసెం బ్లీ స్థానాలకు మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్ విడుద లైంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం పార్లమెంటు, అసెం బ్లీకి పోటీ చేసే అభ్యర్థులు పలు సూచనలు పాటించాల్సి ఉంది. తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తి కావాలి. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఓటరుగా నమోదై ఉండాలి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 25 వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ. 12,500 చెల్లిస్తే సరిపోతుంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ. 10వేలు డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీలు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చే యాలి. నామినేషన్లు సమయంలో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రతిపాదకులుగా నియోజకవర్గానికి చెందిన వారు ఒకరుంటే సరిపోతుంది. గుర్తింపు పొంద ని పార్టీలకు 10 మంది ప్రతిపాదులుగా ఉండాలి. లోక్‌సభ నామినేషన్‌కు ఫారం 2ఏ పూర్తి చే యాలి. అసెంబ్లీ నామినేషన్‌కు ఫారం 2బీ భర్తీ చేయాలి. లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షలకు ఖర్చు మించరాదు. నామినేషన్ ముందే బ్యాంకు ఖాతా తెరవాలి ఈ సారి ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన విధించింది. లోక్‌సభ, అసెంబ్లీకి పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందే విధిగా జాతీయ బ్యాం కులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్ డిపాజిట్ మొదలుకుని ఏ ఖర్చులైనా ఈఖాతా ద్వారానే జరపాల్సి ఉంటుంది. రూ. 20 వేలుకు మించిన ఖర్చుకు తప్పని సరిగా చెక్కులు ఇవ్వాలి. ఒకే సారి రూ. 20 వేలు వరకు డ్రా చేసుకుని చిల్లర ఖ ర్చులు పెట్టవచ్చు. ఆయా ఖర్చులకు సంబంధించి బిల్లులు లెక్కలు మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. -
నగరం కదిలింది
నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ శనివారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. తొలుత అనిల్ గాంధీబొమ్మ సెంటర్ నుంచి నామినేషన్ వేయనున్న మున్సిపల్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కనకమహల్ సెంటర్, ములుముడి బస్టాండ్, చిన్నబజారు, పెద్దబజారు, అలంకార్‌సెంటర్ మీదుగా సాగింది. ర్యాలీకి ముందు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. అనిల్ నామినేషన్ కార్యక్రమానికి సిటీ నియోజకవర్గం నుంచి జనం వేలసంఖ్యలో తండోప తండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు మండే ఎండను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో హాజరుకావడం విశేషం. ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, బొమ్మ హెలికాప్టర్లు ఆకట్టుకున్నాయి. బాణసంచాతో నగరం మార్మోగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌తో పాటు జియాఉద్దీన్, పులిమి శైలజ, ముక్కాల ద్వారకానాథ్, దువ్వూరు శరశ్చంద్ర, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పడవల సుధాకర్, పుట్టా రామకృష్ణారెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్ జలీల్, ఎ.బాలకోటేశ్వరరరావు, రాజశేఖర్, ఎండీ ఖలీల్ అహ్మద్, ముప్పసాని శ్రీనివాసులు, మునీర్‌సిద్దిక్, లెక్కల వెంకారెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్కే సుభాన్, అతహర్, షఫీ, సుధీర్‌బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం వైఎస్సార్సీపీదే: ఎంపీ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో జనం వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారన్నారు. తిరిగి వైఎస్సార్ పాలన రావాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని జనం భావిస్తున్నారని మేకపాటి చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల సంగతి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అన్నీ చేస్తానంటూ కపట నాటకాలు ఆడుతున్నారని మేకపాటి విమర్శించారు. అనిల్‌తో పాటు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశమివ్వండి: అనిల్ ‘కుట్రలు, కుతంత్రాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 90 ఓట్ల తేడాతో ఓటమి చెందాను. కష్ట నష్టాల కోర్చి ఐదేళ్లుగా మిమ్మల్నే నమ్ముకుని పనిచేస్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం సాగిస్తున్నా.. వైఎస్సార్ దీవెనలు, జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో పాటు మీరందరూ ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి’ అని శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా నామినేషన్ వేసిన డాక్టర్ పి.అనీల్‌కుమార్ యాదవ్ నెల్లూరు సీటీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ అనంతరం అనిల్ మాట్లాడారు. వైఎస్సార్ మరణించిన తర్వాత చీకటి పాలనతో విసిగిపోయారన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందన్నారు. అందుకే వైఎస్సార్సీపీని గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భా రీ మెజార్టీతో తనను గెలిపించాలని అనిల్ కోరారు. ప్రజల రుణం ఉంచుకోనని, జగన్ నాయకత్వంలో మంచిపరిపాలన కోసం శ్రమిస్తామన్నారు. -
అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
అమేథీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అమేథీ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో పాటు తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకా, రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. గౌరీగంజ్ కలెక్టర్ కార్యాలయంలో రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ అమేథీ తన కుటుంబం లాంటిదని అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, మరోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని రాహుల్ అన్నారు. కాగా నరేంద్ర మోడీ వివాహ అంశంపై విలేకర్లు ప్రశ్నించగా మోడీ వ్యక్తిగత విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు. కాగా అంతకు ముందు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేశారు. దాదాపు అయిదు వందల టన్నుల పూలతో పాటు, రాహుల్ వచ్చే దారి మొత్తం పూల బాటగా మార్చేశారు. నామినేషన్ దాఖలు చేయటానికి ముందు రాహుల్ అమేథీలో రోడ్ షో నిర్వహించారు. -
వడోదర నా కర్మభూమి: మోడీ
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి అంతకుముందు భారీ రోడ్ షో గైక్వాడ్ల పాలనపై మోడీ ప్రశంసల జల్లు వడోదర(గుజరాత్): బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లాంఛనంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దూకారు. అట్టహాసంగా వడోదర స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా కలెక్టరేట్‌కు చేరుకుని తంతు ముగించారు. కిరణ్ మహిదా అనే టీ వ్యాపారి, ఒకప్పటి బరోడా(వడోదర) సంస్థానాన్ని పాలించిన గైక్వాడ్ వంశానికి చెందిన శుభాంగినీదేవీ రాజే గైక్వాడ్ తదితరులు మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్మానని మోడీ చెబుతుండడం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు మోడీ వడోదర వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలతో రోడ్లు కిక్కిరిశాయి. రోడ్‌షో ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా సాగినప్పుడు ఆ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో మోడీని పలకరించడం కనిపించింది. నామినేషన్ అనంతరం మోడీ విలేకర్లతో మాట్లాడారు. గైక్వాడ్ల పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘సుపరిపాలన, ప్రజాసంక్షేమానికి కృషి చేసిన గైక్వాడ్ల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. వడోదర నా కర్మభూమి. నాకు ఘనస్వాగతం పలికినందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. వడోదరలో గైక్వాడ్‌లు ఏర్పాటు చేసిన సంస్థల నుంచి లబ్ధి పొందానని, వారు స్థాపించిన బడిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. తాను జన్మించిన వాద్నగర్ గైక్వాడ్ల రాజ్యంలో భాగంగా ఉండేదని, నామినేషన్ వేసిన చోటుకి 200 అడుగుల దూరంలోనే నివసించానని చెప్పారు. మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచే అవకాశం రావడంపై టీ వ్యాపారి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రధాని అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు నాలాంటి సామాన్యుడినిగుర్తు చేసుకోరు. ఒక్క మోడీ మాత్రమే గుర్తు చేసుకున్నారు’ అని అన్నారు. వడోదర బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలకృష్ణ శుక్లా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నెల 30న వడోదరలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీపై మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా, మెకానికల్ ఇంజనీర్ సునీల్ కులకర్ణి ఆమ్ ఆద్మీ పార్టీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచీ లోక్‌సభకు పోటీ చేస్తుండడం తెలిసిందే. ‘దేశం కాంగ్రెస్‌ను నమ్మదు’ షోలాపూర్/లాతూర్(మహారాష్ట్ర): కాంగ్రెస్‌పై, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శల వాడిని పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్‌ను దేశం నమ్మదని దుయ్యబట్టారు. మోడీ బుధవారం షోలాపూర్, లాతూర్‌లలో ఎన్నికలసభల్లో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్లపై నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీలోని యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలో ఒక్క కారణం చెప్పగలరా? సుశీల్, పవార్లు మీకి చ్చిన హామీలు తుంగలో తొక్కలేదా?’ అని ప్రజలతో అన్నారు. ‘షిండేజీ! మీరు హోం మంత్రి. షోలాపూర్ చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే యూనిఫారాలను పోలీసులకు అందించి, వారికి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచన మీకెందుకు రాలేదు? ఆయన (షిండే) మేడంను(సోనియా గాంధీ) ఎలా సంతోషంగా ఉంచాలో రేయింబవళ్లు ఆలోచిస్తుంటారు. వీరంతా ఒకే కుటుంబ (గాంధీ కుటుంబ) భక్తులు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పేదరికాన్ని పర్యాటకంలా చూస్తోందని, ఆగర్భశ్రీమంతుడైన రాహుల్‌కు పేదరికమంటే ఏంటో తెలియదని మోడీ విమర్శించారు. -
రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె
నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదు. దాంతో మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ....కుటుంబానికి ఒకే సీటు అనే వాదన తెరపైకి రావడంతో ఆశావాహులకు నిరాశే ఎదురైంది. గతంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు మునుగోడు టిక్కెట్ స్రవంతిదేనని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మునుగోడును అంటుపెట్టుకోని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపించారు. మరోవైపు దేవరకొండలో రెబల్ బరిలో ఎమ్మెల్యే బాలూ నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఖరారైన గుడిపాటి నర్సయ్యను మార్చి ఆయన స్థానంలో అద్దంకి దయాకర్‌కు టికెట్ ఖరారు చేయటంతో పార్టీ నేతలు అలకబూనారు. -
నేడు లోక్‌సభకు ‘వంద’ నామినేషన్లు
గల్ఫ్ బాధితులు, రైతుల నిరసన స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి.. ఆర్మూర్, ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగిపోయేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో, లోక్‌సభ ఎన్నికలలో తమ నిరసన తెలపడానికి గల్ఫ్ బాధితులు, రైతులు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకొని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక, పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో సుమారు వంద మంది బాధితులు బుధవారం నామినేషన్ వేయబోతున్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.25వేల నామినేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 నామినేషన్ ఫీజును గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, గల్ఫ్ బాధితుల సంఘాలు సమకూర్చుకుంటున్నాయి. -
రాయ్‘బరి’లో సోనియా నామినేషన్
హోమం నిర్వహించిన కాంగ్రెస్ అధినేత్రి కంచుకోటలో ఘనస్వాగతం తల్లి కారుకు డ్రైవర్‌గా రాహుల్ రాయ్‌బరేలి/న్యూఢిల్లీ: కుమారుడు రాహుల్ గాంధీ తోడురాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కంచుకోట రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారికి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడు సతీశ్ శర్మ, సోనియా ప్రతినిధి కేఎల్ శర్మ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో సంక్షిప్తంగా మాడ్లాడిన సోనియా.. ఇక్కడి ప్రజలు అపారమైన అనురాగాన్ని చూపిస్తూ తమలో ఒకరిగా తనను భావిస్తున్నారని చెప్పారు. ఈ సారి కూడా తనకు విజయాన్ని కట్టబెడతారన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సోనియా, రాహుల్ స్థానిక పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. కాగా, ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన సోనియాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. సోనియా ప్రయాణించిన వాహనానికి రాహుల్ డ్రైవర్‌గా వ్యవహరించారు. అదో పెద్ద జోక్: ముస్లిం వర్గాన్ని ప్రభావితం చేసి గంపగుత్తగా ఓట్లు సాధించేందుకే ఢిల్లీలో జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీని కలిశారని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఓ పెద్ద జోక్‌గా సోనియా అభివర్ణించారు. తనకు అలాంటి అలవాటు లేదని, ఓట్లను ఆకర్షించే ఆటలు కూడా ఆడనని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత సోనియా ముస్లిం మత పెద్దలను కలిశారు. అయితే అలా మత పెద్దలను కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని బీజేపీ మండిపడింది. మరికొంత మంది ప్రముఖులు కూడా.. 2జీ స్కాంలో ప్రధాన నిందితుడు ఎ.రాజా నీలగిరి లోక్‌సభ స్థానానికి నామినేషన్ సమర్పించారు. రాజా తన ఆస్తులను రూ. 1.77 కోట్లుగా చూపారు. ముంబై వాయవ్య స్థానానికి ఎంఎన్ఎస్ తరఫున దర్శకుడు మహేశ్ మంజ్రేకర్, కేంద్ర మంత్రి నమోనారాయణ్ మీనా దౌసా స్ధానానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఆరు రెట్లు పెరిగిన ఆస్తులు నామినేషన్‌తోపాటు ఆస్తులకు సంబంధించి సోనియా ఇచ్చిన అఫిడవిట్లో తనకు రూ. 9 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. దీంట్లో స్థిరాస్తులు రూ. 6. 47 కోట్లు, చరాస్తులు రూ. 2.81 కోట్లుగా చూపించారు. 2009లో పేర్కొన్న తన ఆస్తి రూ. 1.37 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆస్తుల విలువ ఆరు రెట్లు పెరిగింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇస్తూ.. గతంలో పుస్తక విలువ ఆధారంగా, ఈసారి మాత్రం మార్కెట్ విలువల ఆధారంగా చూపడం వల్ల ఆస్తులు పెరిగాయన్నారు. ఈ అఫిడవిట్లో తన పేర ఒక్క కారు కూడా లేదని సోనియా చెప్పారు. ఈ తన ఆదాయం రూ. 14.21 లక్షలని, రాహుల్‌కు రూ. 9 లక్షలు అప్పుగా ఇచ్చానని చెప్పారు. చరాస్తుల్లో నగదు రూ. 85 వేలు, బ్యాంకుల్లో రూ. 66 లక్షలు, బాండ్లు రూ. 10 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్ రూ. 82.20 లక్షలు, పీపీఎఫ్ రూ. 42.49 లక్షలు, నగలు రూ. 62 లక్షలుగా చూపార -
నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ
రాయ్‌బరేలీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. యూపీఏను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పట్టుదలగా ఉన్న ఆమె తన సొంత నియోజకవర్గమైన రాయబరేలి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీకి సిద్ధం అయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్ గాంధీ సమక్షంలో సోనియాగాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
జేబులో ధనం..వెనుక జనం
ఎన్నికలంటే ఎక్కువగా అంగబలం ఉన్న నాయకులను వెతికి అభ్యర్థిగా అవకాశం కల్పించే వారు. కానీ అది పాతపద్ధతి. ప్రస్తుతం రోజులు మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో అంగబలం ఒక్కటే ఉంటే కుదరదని ఆయా పార్టీ నాయకులు తేల్చేసి ‘అర్థ’బలం ఉన్న వారికే సీటు కేటాయించాయి. ఆ ఏముందిలే ఒకటి, రెండు లక్షలు వెచ్చిస్తే ఎంచక్కా కౌన్సిలర్ కావొచ్చని డబ్బున్న అభ్యర్థులు తేలిగ్గా తీసుకున్నారు. కానీ బరిలోకి దిగాక వారికి తెలిసింది ఖర్చు తడిసిమోపెడు అవుతుందని. నామినేషన్‌కు ముందు రోజు నుంచి చేతిచమురు వదలడం ప్రారంభమైంది. ముందు రోజు రాత్రి మందు, విందుకు డబ్బు వెచ్చించారు. ఇక నామినేషన్ వేసిన రోజు ఆయా వార్డుల్లోని మంది మర్బాలాన్ని వెనకేసుకు వెళ్లడంతో మందు, విందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది. పోటీ అంటే ఏమో అనుకున్నాం గానీ నామినేషన్ రోజుకే రూ. 50వేలకు పైగా ఖర్చు అయ్యాయని ఓ వార్డుకు చెందిన అభ్యర్థి అందరి వద్ద వాపోయారు కూడా. నామినేషన్లు వేయడం, పరిశీలన కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారానికి బయలుదేరారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడమే కదా! అనుకుంటే పొరపాటే. ప్రచారం కోసం ఆయా వార్డుల్లోని తన మద్దతుదారులను వెనకేసుకు వెళ్లాలి. వారికి ఉదయం, మధ్యాహ్నం భోజనంతోపాటు ఓ క్వార్టర్ సీసాకు డబ్బు చెల్లించాలి. ఇలా ప్రచారం ముగిసేలోపు రూ.2 లక్షల వరకు జేబు ఖాళీ అవుతుందేమోనని అభ్యర్థులు బెంగపడుతున్నారు. ఈనెల 28తో ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో ఓటర్లకు ఏర వేసేందుకు అభ్యర్థులు భారీ గానే డబ్బును సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఓటుకు రూ.200 చొప్పున పంచాల్సి వస్తుందని అభ్యర్థులు అంచనా వేసుకుంటున్నారు. ఓటర్లు తక్కువగా ఉన్న వార్డుల్లో రూ.3 నుంచి 4 లక్షలు, అత్యధికంగా ఓటర్లు ఉండే వార్డుల్లో 7 లక్షల దాకా పంపిణీ చేయాల్సి వస్తోందని ఓ అంచనా. పట్టణంలో అత్యల్పంగా 20వ వార్డులో 1391 మంది ఓటర్లు ఉండగా, అత్యధికంగా 24వ వార్డులో 3494 మంది ఉన్నారు. 24వ వార్డుకు చెందిన అభ్యర్థులకు అందరి కన్నా చేతిచమురు అధికంగా వదలనుంది. ఇక కొన్ని చోట్ల కొంత మంది అభ్యర్థులు ప్రత్యర్థులు ఎక్కువగా డబ్బు పంచితే వారికన్నా ఎక్కువగా పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో ఎన్నికల గోదాలోకి దిగారు కాబట్టి పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులు తాపత్రాయం పడుతూ డబ్బును నీళ్లలా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయకూడాదని నిర్ణయించుకున్నార -
వైఎస్సార్సీపీ బోణీ కొట్టింది!
గూడూరు పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీ బోణీ కొట్టింది. ఎన్నికల నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. 33 వార్డుకు వైఎస్సార్సీపీ తరపున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆ పార్టీ బోణీ కొట్టినట్లుగా చెప్పవచ్చు. పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న 33వ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తాళ్ల సుబ్బమ్మ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు డమ్మీ అభ్యర్థిగా రామాబత్తిన వాసవి నామినేషన్ దాఖలు చేసింది. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం ఆ వార్డు నుంచి తాళ్ల సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించడం లాంఛనమే. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆ వార్డు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. -
2,601/12
పురపాలక సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. చివరి రోజు జిల్లాలోని 12 పురపాలక సంఘాల్లో 1884 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 12 పురపాలక సంఘాల పరిధిలో 371 వార్డుల్లో పోటీ చేసేందుకు మొత్తం 2,601 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలించనున్నారు. 18వ తేదీలోపు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. ఈ నెల 30న ఎన్నికలు, అవసరమైతే ఏప్రిల్ 1న రీపోలింగ్, ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. మాచర్లలో 29 వార్డులకు కేవలం మూడింటిలో మాత్రమే నామినేషన్లు వేయడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. ఇక జిల్లాలోని పురపాలక సంఘాల వారీగా దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే.... తెనాలి పురపాలక సంఘం నుంచి మొత్తం 265 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ 74, టీడీపీ 86, కాంగ్రెస్ 47, ఇండిపెండెంట్లు 37, లోక్‌సత్తా 7, సీపీఐ 2, బీజేపీ 12. నరసరావుపేటలో మొత్తం 319 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 90, టీడీపీ 100, కాంగ్రెస్ 59, ఇండిపెండెంట్లు 64, ఇతరులు 1, లోక్‌సత్తా 2, సీపీఐ 1, బీజేపీ 2. చిలకలూరిపేటలో 193 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 67, టీడీపీ 75, కాంగ్రెస్ 14, ఇండిపెండెంట్లు 27, లోక్‌సత్తా 5, సీపీఎం 2, బీజేపీ 1, ఇతర పార్టీల నుంచి ఇద్దరు. బాపట్లలో మొత్తం 212 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 55, టీడీపీ 64, కాంగ్రెస్ 30, ఇండిపెండెంట్లు 52, సీపీఐ 2, బీజేపీ 6, బిఎస్పీ 2, ఇతరపార్టీలు1. పొన్నూరులో 226 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 110, టీడీపీ 74, కాంగ్రెస్ 22, ఇండిపెండెంట్లు 13, బీజేపీ 1, బీఎస్పీ 5. రేపల్లెలో 134 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్సీపీ 48, టీడీపీ 43, కాంగ్రెస్ 29, ఇండిపెండెంట్లు 13, సీపీఐ 1 . మాచర్లలో 202 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 103, టీడీపీ 81, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్లు 22, ఇతర పార్టీలు 2, సీపీఎం 3, సీపీఐ 6, బీజేపీ 3, బీఎస్పీ 2. మంగళగిరిలో 246 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 50, టీడీపీ 65, కాంగ్రెస్ 51, ఇండిపెండెంట్లు 34, లోక్‌సత్తా 1, సీపీఎం 10, సీపీఐ 16, బీజేపీ 18, ఇతరులు 1. సత్తెనపల్లిలో మొత్తం 206 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 70, టీడీపీ 73, కాంగ్రెస్ 37, ఇండిపెండెంట్లు 13, సీసీఎం 3, సీపీఐ 1, బీజేపీ 7, బీఎస్పీ 1, ఇతర పార్టీ 1. వినుకొండలో మొత్తం 169 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 56, టీడీపీ 29, కాంగ్రెస్ 32, ఇండిపెండెంట్లు 20, లోక్‌సత్తా 1, సీపీఎం 6, సీపీఐ 10, బీజేపీ 15. పిడుగురాళ్లలో 194 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ 79, టీడీపీ 68, కాంగ్రెస్ 17, ఇండిపెండెంట్లు 20, సీపీఎం 4, సీపీఐ 2, బీజేపీ 1, బీఎస్పీ 2, ఇతర పార్టీ 1. తాడేపల్లిలో 212 మంది నామినేషన్లు దాఖలు చేయగా వైఎస్సార్ సీపీ 42, టీడీపీ 48, కాంగ్రెస్ 43, సీపీఎం 44, సీపీఐ 4, లోక్‌సత్తా 1, ఇండిపెండెంట్లు 30. -
అభ్యర్థులు కరువు
చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మదనపల్లె, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాల్టీల్లో మొదటి రోజు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కనామినేషన్ కూడా వేయలేదు. రెండవ రోజు చిత్తూరులో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు వేశారు. ఆరు మున్సిపాల్టీల్లో 169 వార్డులకు, చిత్తూరులో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ టిక్కెట్లకు డిమాండ్ ఉంది. ఈ రెండు పార్టీల్లో టిక్కెట్లు దొరకని వారు స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్టు కోసం ఎవరూ ఆసక్తి చూపటం లేదు. పత్తాలేని మున్సిపల్ కో-ఆర్డినేటర్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మున్సిపాల్టీ ఎన్నికల కోసం నియమించిన కో-ఆర్డినేటర్లు ఇప్పటి వరకు పత్తాలేరు. కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చిత్తూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సీకే.బాబు రాజీనామా చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ చుక్కానిలేని నావలా మారింది. మదనపల్లె మున్సిపాల్టీలో షాజహాన్‌బాష వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల మైనార్టీలు ఆసక్తి చూపడం లేదు. ఇక శ్రీకాళహస్తి, పుత్తూరు, పుంగనూరు మున్సిపాల్టీల్లో సరేసరి. బీజేపీకి గడ్డు పరిస్థితి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడి ఫీవర్‌తో నెట్టుకురావాలని చూసిన బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. చిత్తూరు కార్పొరేషన్లో అన్ని డివిజన్లకు అభ్యర్థులను పెట్టగలిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మున్సిపాల్టీల్లోనూ అక్కడక్కడా ఒకటీ అరా నామినేషన్లు వేయడం మినహా ఇంతవరకు బీజేపీ అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు ఎవరూ పరుగులు దీయడం లేదు. బీజేపీ తరపున నిలబడితే ఉపయోగం లేకపోగా, తామే ఆ పార్టీ ప్రచారానికి ఉపయోగపడాల్సి వస్తుందని అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు.