Space
-
సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్‌మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది! -
Sunita Williams: సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్
పట్నా: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) తొమ్మిది నెలల తరువాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగివచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె అంతరిక్ష ప్రయాణాన్ని వర్ణిస్తూ బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన కుందన్ కుమార్ రాయ్ అద్భుత రీతిలో మిథిలా పెయింటింగ్ రూపొందించారు.కుందన్ కుమార్ రాయ్(Kundan Kumar Roy) మిథిలా పెయింటింగ్‌లను తీర్చిదిదద్డంలో ఎంతో పేరు గడించారు. ఆయన తాజాగా రూపొందించిన పెయింటింగ్‌లో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులు కూడా ఉన్నారు. వారంతా ఒక చేప లోపల ఉన్నట్లు కుందన్ రాయ్ చిత్రీకరించారు. సునీతా విలియమ్స్ గౌరవార్థం రూపొందించిన ఈ పెయింటింగ్ కారణంగా కుందన్ రాయ్ మరోమారు వార్తల్లో నిలిచారు. టోక్యో ఒలింపిక్ సమయంలో కుందర్ రాయ్ రూపొందించిన భారతీయ క్రీడాకారుల చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి.కుందర్ రాయ్ కలర్ బ్లైండ్నెస్ బాధితుడు. అయితే అతని కళాభిరుచికి ఈ లోపం అతనికి అడ్డుకాలేదు. సాధారణంగా మిథిలా పెయింటింగ్‌లో నలుపు, తెలుపు రంగులనే వినియోగిస్తుంటారు. అయితే కుందన్ రాయ్ ఇతర వర్ణాలను కూడా వినియోగిస్తూ ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈయన రూపొందిన చిత్రాలు పలు ప్రదర్శనల్లో ప్రదర్శితమయ్యాయి. తాజాగా ఆయన రూపొందించిన సునీతా విలియమ్స్ పెయింటింగ్ అందరి అభినందనలను అందుకుంటోంది.ఇది కూడా చదవండి: Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్‌ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్‌మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
ఖగోళ యుద్ధంలో శనిదే ఘన విజయం
‘చంద్ర సైన్యం’ (మూన్స్ ఆర్మీ) సంఖ్యాపరంగా రారాజు శనిని కొట్టే గ్రహం ఇక దరిదాపుల్లో లేదు, ఉండబోదు! శని గ్రహానికి నిన్నటిదాకా 146 చంద్రుళ్లు ఉండేవి. అవి కాకుండా కొత్తగా మరో 128 చందమామలు శని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. దీంతో శని గ్రహపు మొత్తం మూన్స్ సంఖ్య 274కి చేరింది. ఈ పరిశోధనను అంతర్జాతీయ ఖగోళ సంఘం కూడా గుర్తించింది. మన సౌరకుటుంబంలో శని తర్వాత పెద్ద సంఖ్యలో మూన్స్(More Moons) కలిగిన గ్రహం గురుడు (బృహస్పతి). గురుడికి 95 మూన్స్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ రెండు గ్రహాలకు కొత్త చంద్రుళ్లను కనుగొంటూ వస్తుండటంతో చంద్రుళ్ళ సంఖ్యాపరంగా నువ్వా? నేనా? అన్నట్టు గురుడు, శని మధ్య దశాబ్దాల తరబడి యుద్ధం కొనసాగింది. అయితే..శనికి తాజాగా ఒకేసారి భారీగా శతాధిక చంద్రుళ్లను కనుగొనడంతో ఈ రేసులో గురుడు ఓడిపోయాడనే చెప్పాలి. శని(Saturn)కి సంబంధించి కొత్తగా కనుగొన్న 128 చంద్రుళ్లలో 63 చంద్రుళ్లను 2019-2021 మధ్య కాలంలోనే చూచాయగా గుర్తించారు. మిగతావాటిని 2023లో వరుసగా మూడు నెలలపాటు పరిశీలించి కనుగొన్నామని అకడెమియా సిన్సియా (తైవాన్) ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆస్టన్ వెల్లడించారు. అయితే ఈ 128 కొత్త మూన్స్ మన భూగ్రహపు(Earth) చంద్రుడు ఉన్నంత పరిమాణంలో లేవు. పైగా మన చంద్రుడిలా గోళాకారంగానూ లేవు. అవి చిన్న సైజులో బంగాళదుంపల్లా వంకరటింకర ఆకృతిలో ఉన్నాయి. సౌరకుటుంబం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఈ చిన్నపాటి ఖగోళ వస్తువుల సమూహాన్ని శని కక్ష్యలోని గురుత్వాకర్షణ శక్తి బంధించి ఉంటుందని, అనంతరం అవి ఎన్నోసార్లు ఢీకొని అంతిమంగా బుల్లి చంద్రుళ్లుగా మారి ఉంటాయని భావిస్తున్నారు. ఇలా చిట్టచివరిగా, లేటెస్టుగా అవి ఢీకొన్న సంఘటన 10 కోట్ల ఏళ్ల క్రితం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.శని గ్రహ ప్రత్యేకతలు తెలుసా?👉274 చంద్రులతో గ్రహాల్లో కింగ్ ఆఫ్ మూన్స్గా లేటెస్ట్ ఫీట్ సాధించిన శని👉2,80,000 కి.మీ కంటే ఎక్కువ వ్యాసంలో విస్తరించినప్పటికీ.. సన్నగా ఉండే వలయాలు అద్భుతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి👉బాప్రే.. టబ్‌లో తేలుతుందంట!గ్రహాల్లో కెల్లా అత్యంత తేలికైన గ్రహం ఇది. ప్రధానంగా హైడ్రోజన్, హీలియంతో నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. తగినంత పెద్ద టబ్ దొరికితే, శని నిజానికి దానిలో తేలుతుందట!👉ప్రచండ గాలులకు కేరాఫ్శని గ్రహం మీద గంటకు 1,800 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంట! 👉అది అంతుచిక్కని రహస్యమేషడ్భుజి Hexagon రహస్యం.. శని గ్రహంపై ఉత్తర ధ్రువం వద్ద 30,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో ఓ నిర్మాణం కనిపిస్తుంది. అయితే ఆరు వైపుల నిర్మాణం ఎలా ఏర్పడిందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. :::జమ్ముల శ్రీకాంత్(Credit: Science Alert) -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్‌లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లనే స్పేస్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్‌గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్‌సెట్‌తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్‌ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్‌ను స్పేస్ స్టేషన్‌కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్‌నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్‌లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్‌లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్‌కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్‌తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్‌తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
గుడ్‌బై ఐఎస్ఎస్
కేప్ కెనవెరాల్: తొమ్మిది నెలలకు పైచిలుకు అంతరిక్షవాసానికి తెర పడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు నాసాకు చెందిన మరో వ్యోమగామి బచ్ విల్మోర్ మంగళవారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమికి బయల్దేరారు. గత సెప్టెంబర్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు నిక్ హ్యూస్, అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా వారితో పాటు తిరిగొస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.30 తర్వాత వ్యోమనౌక ఐఎస్ఎస్ నుంచి విడివడింది. కాసేపటికి భూమివైపు 17 గంటల ప్రయాణం ప్రారంభించింది.వాతావరణం అనుకూలిస్తే బుధవారం తెల్లవారుజామున 2.41కి అది భూ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ క్రమంలో వాతావరణంతో రాపిడి వల్ల పుట్టుకొచ్చే విపరీతమైన వేడికి క్యాప్సూల్ మండిపోకుండా అందులోని హీట్‌షీల్డ్ రక్షణ కవచంగా నిలుస్తుంది. కాసేపటికి వ్యోమనౌకలోని నాలుగు ప్యారాచూట్లు తెరుచుకుని దాని వేగాన్ని బాగా తగ్గిస్తాయి. చివరికి క్యాప్సూల్ గంటకు కేవలం 5 కి.మీ. వేగంతో తెల్లవారుజాము 3.27 గంటలకు అమెరికాలో ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో దిగుతుంది. ఆ వెంటనే నలుగురు వ్యోమగాములను ఒక్కొక్కరుగా అందులోంచి బయటికి తీసుకొస్తారు. అనంతరం తదుపరి పరీక్షల నిమిత్తం నేరుగా నాసా కేంద్రానికి తీసుకెళ్తారు.సునీత బృందం తిరుగు ప్రయాణం సందర్భంగా ఐఎస్ఎస్లో భావోద్వేగపూరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ఎదురయ్యే విపరీతమైన పీడనం, ఒత్తిళ్లను తట్టుకునేందుకు అనువైన స్పేస్ సూట్, హెల్మట్, బూట్లు తదితరాలు ధరించి వారంతా చివరిసారిగా ఐఎస్ఎస్లో కలియదిరిగారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఆదివారం ఐఎస్ఎస్కు చేరుకున్న వ్యోమగాములతో ఫొటోలు, సెల్పిలు దిగుతూ సందడి చేశారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.అనంతరం సునీత బృందానికి వారు వీడ్కోలు పలికారు. ‘‘మిమ్మల్ని ఎంతగానో మిస్సవుతాం. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలి’’ అని నాసా ఆస్ట్రోనాట్ అన్నే మెక్‌క్లెయిన్ ఆకాంక్షించారు. సునీత తదితరులు తమ వస్తువులతో వ్యోమనౌకలోకి చేరుకోగానే దాని ద్వారాన్ని మూసేశారు. రెండు గంటలపాటు పూర్తిస్థాయి పరీక్షలు చేసి అంతా సరిగానే ఉందని నిర్ధారించారు. అనంతరం డ్రాగన్ భూమికేసి బయల్దేరింది. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ తొలి మానవసహిత ప్రయోగంలో భాగంగా సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లారు. ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీలుపడలేదు.మా హృదయాల్లో ఉన్నారు: మోదీ భారత్ రావాలంటూ సునీతకు లేఖసునీతా విలియమ్స్ సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతను, ఆమె తండ్రి దివంగత దీపక్ పాండ్యాను కలిశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లతో భేటీ అయినప్పుడు కూడా ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.‘‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అది్వతీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది’’ అంటూ సునీతకు లేఖ రాశారు. దీనిపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పూర్వీకుల గ్రామంలో ప్రార్థనలుమెహసానా: సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఆమె గ్రామం ఝులాసన్లో అంతా ప్రార్థనలు చేశారు. పలువురు గ్రామస్తులు ఒక రోజు ముందునుంచి అఖండ జ్యోతులు వెలిగించారు. బుధవారం సునీత క్షేమంగా దిగేదాకా అవి వెలుగుతూనే ఉంటాయని ఆమెకు సోదరుని వరసయ్యే నవీన్ పాండ్యా వివరించారు. ‘‘ఆ తర్వాత భారీ ఎత్తున వేడుకలకు కూడా సర్వం సిద్ధమైంది.సునీత ఫొటోలు పట్టుకుని స్కూలు నుంచి ఆలయం దాకా ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. స్థానిక స్కూలు విద్యార్థులైతే 15 రోజులుగా ప్రార్థనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ చెప్పారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2006, 2013ల్లో సునీత ఝులాసన్ వచి్చవెళ్లినట్టు ఆమె బంధువులు గుర్తు చేసుకున్నారు. తనను మరోసారి ఆహా్వనిస్తామని చెప్పారు. -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్‌స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్‌తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్‌తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్‌తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్‌తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
వాషింగ్టన్: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలున్నాక తిరిగి భూమికి వస్తున్న తరుణంలో వారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోనున్నారనేది కీలకంగా మారింది. ప్రధానంగా వారు ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టి లోపం మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్నందున పలు మానసిక రుగ్మతలను కూడా చవిచూడనున్నారు.అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తున్నారు. వారు అంతరిక్షంలోకి ఎనిమిది రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లారు. కానీ అక్కడే చిక్కుకుపోయారు. సునీతతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు మార్చి 19న తెల్లవారుజామున 3:27 గంటలకు డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా తీరంలో దిగుతారు. తొమ్మిది నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోనున్నారనే విషయానికి వస్తే..1. నడక మర్చిపోవచ్చుమనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణ(Gravity)కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెలా ఎముక సాంద్రత దాదాపు ఒక శాతం తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఈ వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు.2. నిలబడేందుకూ ఇబ్బందిమన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడెమేరీ స్టెఫానిషిన్-పైపర్ 12 రోజుల అంతరిక్షంలో ఉండి, ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.3. వస్తువులను గాలిలో వదిలేస్తారుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచినప్పుడు, అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం కొనసాగుతుంది.4. అంధత్వం వచ్చే ప్రమాదంఅంతరిక్షం(Space)లో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా, శరీర ద్రవం తల వైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ (ఎస్‌ఏఎన్‌ఎస్) అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వారి కళ్లు ప్రభావితమవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు.ఈ వ్యాధులు మాత్రమే కాదు.. ఎముక బలహీనత, అధిక రేడియేషన్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ ముప్పు, డీఎన్ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం,ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. ఇది కూడా చదవండి: Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు -
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
Kalpana Chawla: రెండు పుట్టిన రోజుల వ్యోమగామి
కల్పనా చావ్లా(Kalpana Chawla).. అంతరిక్షానికి వెళ్లిన తొలి భారతీయ మూలాలు కలిగిన మహిళగా పేరొందారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆమె పుట్టిన రోజు విషయంలో విరుద్ధ వాదన వినిపిస్తుంది. ఆమె పుట్టిన తేదీ 1962 మార్చి 17 అని కొందరు.. కాదు కాదు 1961, జూలై ఒకటి అని కొందరు చెబుతుంటారు. ఇంతకీ దీనిలో ఏది సరైనది?కల్పనా చావ్లా హర్యానా(Haryana)లోని కర్నాల్‌లో 1962, మార్చి 17న జన్మించారు. బాల్యంలో ఆమె విమానాలన్నా, విమాన ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి చూపేది. ఈ ఆసక్తితోనే ఆమె తన తండ్రితో పాటు స్థానిక ఫ్లయింగ్ క్లబ్‌కు తరచూ వెళుతుండేది. అక్కడి విమానాలను చూసి మురిసిపోతుండేది. తరువాత ఆమె అమెరికా చేరుకుని, 1991లో అమెరికా పౌరసత్వం పొందింది.మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమె 1962, మార్చి 17న జన్మించింది. అయితే కల్పనా మెట్రిక్ పరీక్షకు హాజరయ్యే సమయానికి ఆమె వయస్సు సరిపోకపోవడంతో ఆమె తండ్రి ఆమె పుట్టిన తేదీని 1961, జూలై ఒకటిగా అధికారికంగా మార్పించారు. దీంతో ఆమె మెట్రిక్ పరీక్ష(Matriculation examination)కు హాజరు కాగలిగింది. అమెరికాలోని రికార్డులలో ఆమె పుట్టిన తేదీ 1961 జూలై ఒకటిగానే ఉంటుంది. నాసా అధికారిక రికార్టులలోనూ ఆమె పుట్టినరోజు జూలై ఒకటి అని కనిపిస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు ఆమె పుట్టినరోజును మార్చి 17నే నిర్వహించుకుంటారు.కల్పనా చావ్లా పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ(Punjab Engineering College) నుంచి ఎయిరోనాటిక్ ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1982లో అమెరికా చేరుకుని, అక్కడి యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎయిరోస్సేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1986లో ఆమె మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తరువాత పీహెచ్డీ చేశారు. 2023, జనవరి 16న కల్పనా చావ్లా.. నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు. తరువాత ఆమె భూమికి తిరిగి రాలేకపోయారు. కల్పనా ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక 2023 ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి వస్తుండగా, కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కల్పనా చావ్లాతో పాటు మొత్తం ఏడుగురు వ్యోమగాములు మృతి చెందారు. ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం -
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025 -
సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!
మూణ్ణాలుగు రోజుల్లో సునీతా విలియమ్స్ ఈ నెల 19న లేదా 20న ‘దివి’ నుండి దిగి వస్తారన్న ఆశతో ఈ భూగోళమంతా విశ్వాంతరాళంలోకి వెన్నెల కన్నులతో ఎదురు చూస్తోంది! ఒకవేళ ఇప్పటికే ‘నాసా’ ఆమెను భూమి మీదకు చేర్చి ఉంటే కనుక ఆ సంబరాలకు... రేపు కల్పనా చావ్లా జన్మదినమైన మార్చి 17 కూడా తోడవుతుంది. కల్పన అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కాగా, సునీత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాల కారణంగా సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా పైనే ఉండిపోతే, ఇరవై రెండేళ్ల క్రితం – భూమి పైకి తిరిగొస్తుండగా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పన కలలా మిగిలారు. సునీత ఇప్పుడు క్షేమంగా భువికి దిగి రావటమంటే సునీతే కాదు, కల్పన కూడా మళ్లీ పుట్టినట్లే!వారం అనుకున్నది...!సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12న లేదా 15న భూమి మీదకు తిరిగి రావాలి. కానీ రాలేదు! భూకక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! ‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. మార్చి 19న సునీతను, విల్మోర్ను భూమిపైకి తేవాలని ‘నాసా’ ప్రయత్నం. యాదృచ్ఛికం ఏమిటంటే – స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా పరీక్షించటానికి వెళ్లిన సునీత, విల్మోర్ అదే స్టార్‌లైనర్ పని చేయకపోవటంతో అక్కడే చిక్కుకుపోవటం!బరువు తగ్గి.. బుగ్గలు పీక్కుపోయినా.. నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల సునీత ఆరోగ్యం క్షీణించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఫొటోలలో బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి పోయి, బాగా బక్కచిక్కినట్లుగా సునీత కనిపిస్తున్నారు. అంతరిక్షంలో ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికన్ వైద్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నవారికి ‘స్పేస్ ఎనీమియా’ వస్తుందని, ‘మైక్రో–గ్రావిటీ’కి గురవుతున్నప్పుడు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కన్నా, వాటి క్షీణత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే వైరల్ అవుతున్న ప్రతి ఫొటోలో కూడా సునీత ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో కనిపిస్తుండటం విశేషం! సునీత అంతరిక్షంలోకి వెళ్లటం ఇది మూడోసారి.రెండు దశాబ్దాల క్రితం 2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లి, రెండు వారాల తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నప్పుడు ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పనా చావ్లా కన్ను మూశారు. ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కల్పన తొలిసారి 1997 నవంబర్ 19న అంతరిక్షానికి బయల్దేరి, తిరిగి పదహారు రోజుల తర్వాత డిసెంబర్ 5న భూమి పైకి తిరిగి వచ్చారు. తర్వాత ఐదేళ్లకు రెండోసారి అదే స్పేస్ షటిల్లో ఆరుగురు క్రూ మెంబర్స్‌తో కలిసి అంతరిక్ష పరిశోధనలను ముగించుకుని వస్తూ.. భూమికి చేరువవుతుండగా జరిగిన ఆ ఘోర దుర్ఘటనలో తక్కిన వ్యోమగాములందరితో పాటు ప్రాణాలు కోల్పోయారు. వారి వ్యోమ నౌక 84,000 ముక్కలైంది. భారతీయుల గుండెలు కోట్ల తునాతునకలయ్యాయి.సునీత అంతరిక్షంలో చిక్కుకుపోయిప్పటి నుండీ ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు కల్పనే గుర్తుకు వస్తున్నారు. ఈ సమయంలో సునీత క్షేమంగా భూమి పైకి తిరిగి రావటం అంటే తనొక్కరే రావటం కాదు. తన రూపంలో కల్పన ఆత్మను భౌతికంగా సాక్షాత్కరింప జేయడం కూడా.పాలపుంత పౌరులుసునీతా విలియమ్స్ 1965లో యు.ఎస్.లో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లోవేనియన్ మహిళ. సునీత ఫిజిక్స్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో డైవింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ‘నాసా’ వ్యోమగామి అయ్యారు.కల్పనా చావ్లా 1962లో హరియాణాలో జన్మించారు. తండ్రి బనారసీ లాల్ చావ్లా టైర్ల ఉత్పత్తి కంపెనీ యజమాని. తల్లి సంజోగ్తా ఖర్బందా. కల్పన ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ చేశారు. అనంతరం స్పేస్ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడి నుంచి నాసాకు వెళ్లారు. -
ఇల్లు, ఆఫీసులే కాదు.. గోడౌన్లూ కష్టమే..!
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లు వేర్‌హౌస్‌లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్‌హౌస్ అద్దెలు పటాన్చెరు పారిశ్రామిక క్లస్టర్లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరోగతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్‌కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు.శంషాబాద్ హాట్ ఫేవరేట్.. గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్‌ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్లో వేర్‌హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.మేడ్చల్, పటాన్‌చెరుల్లో.. మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లలోనూ వేర్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్చెరు క్లస్టర్లో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.డిమాండ్ ఎందుకంటే? వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్‌వర్క్‌లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్‌కు మరో కారణం. -
అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు..
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు, కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ... తను, విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడార్ రిట్రీవర్స్తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్స్‌లో మార్పు కారణంగా ఇప్పుడు మరో రెండు వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనను విలియమ్స్ తోసిపుచ్చారు. ‘ఇప్పుడు కీలకమై న సమయంలో ఉన్నాం. ఐఎస్ఎస్ ని్రష్క మణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను.’అని విలియమ్స్ అన్నా రు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా.. తాము తిరిగి భూమిమీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్మస్ వేడుకల ఫొటోలను విల్మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తొందరగా తీసుకురావాలంటూ స్పేస్ఎక్స్ చీఫ్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తానని తెలిపారు. అయితే మస్క్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్్కపై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. ‘మేం దేశానికి మద్దతునిస్తాం. దేశాధినేతలకు మద్దతునిస్తాం. వారికి కృతజ్ఞతలు’అని ప్రకటించారు. జనవరిలో ఇద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు. -
జాబిల్లిపై ల్యాండర్ల సందడి!
చంద్రుడిపై ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆదివారం సాఫీగా దిగింది. ఈ ల్యాండర్ సృష్టికర్త, ఆపరేటర్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఫైర్ ఫ్లై ఏరోస్పేస్’. 1972లో అపోలో-17 మానవసహిత మిషన్ తర్వాత చంద్రుడిపై అమెరికా వ్యోమనౌక ఒకటి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ కావడం ఇది రెండోసారి. అమెరికన్ ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ప్రయోగించిన ‘ఒడిస్సియస్’ ల్యాండర్ (ఐఎం-1) సైతం నిరుడు ఫిబ్రవరిలో జాబిల్లి దక్షిణ ధృవంపై ఓ బిలంలో దిగింది. 1972లో చివరిసారిగా చంద్రుడిపై ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు దిగి నడయాడిన 50 ఏళ్ల అనంతరం ‘ఒడిస్సియస్’ తొలి సాఫ్ట్ ల్యాండింగ్ ఘనత సాధించింది. అయితే దిగుతూనే ఓ కాలు విరిగి ల్యాండర్ ఒక పక్కకు ఒరిగినప్పటికీ దాన్ని కూడా సాఫ్ట్ ల్యాండింగ్ గానే శాస్త్రవేత్తలు పరిగణించారు. మనకు కనిపించే చంద్రుడి (ఇవతలి వైపు) ఈశాన్య ప్రాంతంలో ఘనీభవించిన లావాతో నిండిన ఓ ప్రాచీన, సువిశాల బిలం ‘మేర్ క్రిసియం’ ఉపరితలంపై నాలుగు కాళ్లతో ‘బ్లూ ఘోఃస్ట్’ ల్యాండర్ ఆదివారం దిగింది. కారు సైజులో ఉన్న ఈ ల్యాండర్ నిర్మాణానికి ‘నాసా’ నిధులు అందించింది. దీని జీవిత కాలం రెండు వారాలు. ఈ వ్యవధిలో అది చంద్రుడి ఉపరితలంపై నాసా నిర్దేశించిన సుమారు పది శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేపడుతుంది. ఇళ్లలో మనం వాడే వాక్యూమ్ క్లీనర్ తెలుసు కదా. అలాంటి ‘వాక్యూమ్’తో చంద్రధూళిని లోపలికి పీల్చుకుని ల్యాండర్ విశ్లేషిస్తుంది. చంద్రుడి ఉపరితలంపై పది అడుగుల లోతు వరకు డ్రిల్ చేసి ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. ‘ఒడిస్సియస్’, ‘బ్లూ ఘోస్ట్’ రెండూ ప్రైవేటు సంస్థల ల్యాండర్లు కావడం మరో విశేషం. చంద్రబిలం చీకట్లోకి దూకనున్న ‘గ్రేస్’ హోపర్!‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ గత నెల 26న ప్రయోగించిన మరో ల్యాండర్ ‘అథీనా’ (ఐఎం-2) కూడా ఈ నెల 6న చంద్రుడి దక్షిణ ధృవం చెంత దిగబోతోంది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ రాకెట్ ఫాల్కన్-9తో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ‘అథీనా’తోపాటే ‘లూనార్ ట్రైల్ బ్లేజర్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ‘లాక్ హీద్ మార్టిన్’ సంస్థ తయారుచేసిన 200 కిలోల ఈ బుల్లి ఉపగ్రహం చంద్రుడికి దగ్గరగా ధ్రువకక్ష్యలో పరిభ్రమిస్తూ నీటి వనరుల మ్యాపింగ్ పనిలో నిమగ్నమవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ‘మాన్స్ మౌటన్’ వద్ద దిగనున్న 15 అడుగుల ల్యాండర్ ‘అథీనా’లో... మినీ రోవర్ ‘మాప్’ (మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్), ‘గ్రేస్’ హోపర్ ఉన్నాయి. కంప్యూటర్ సైంటిస్టు గ్రేస్ హోపర్ పేరు దానికి పెట్టారు. చంద్రుడిపై ల్యాండర్ దిగిన పరిసరాల చుట్టూతా ఓ మైలు వ్యాసార్ధం పరిధిలో ‘గ్రేస్’… హైడ్రజీన్ ఇంధనం నింపిన తన థ్రస్టర్స్ సాయంతో గెంతుతూ అన్వేషిస్తుంది. ల్యాండర్ దిగే ప్రదేశానికి 400 మీటర్ల దూరంలో... ఎన్నడూ సూర్యకాంతి సోకని, శాశ్వతంగా చీకటిగా ఉండే 65 అడుగుల లోతైన ‘హెచ్ బిలం’లోకి ‘గ్రేస్’ లంఘించబోతోంది. గడ్డ కట్టిన నీటి కోసం బిలంలోని నేల ప్రాంతాన్ని శోధించడం దాని ప్రధాన లక్ష్యం. ఎందుకంటే ఈ పనిని చక్రాలతో కదిలే రోవర్ చేయలేదు! ‘గ్రేస్’ రోబో మూడు అడుగుల పరిమాణంలో ఉంటుంది. పరిసరాలు, పరిస్థితులను నిశితంగా పరిశీలించి, నిర్ణయం తీసుకుని, కార్యోన్ముఖం చేయగల (సిచ్యువేషనల్ అవేర్నెస్) కెమెరా, లిడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్), నక్షత్రాల స్థానాన్ని గుర్తిస్తూ ముందుకు కదలడానికి ఉపయోగపగే ‘స్టార్ ట్రాకర్’ సాయంతో ‘గ్రేస్’ ఒక చోట నుంచి మరో చోటికి గెంతుతుంది. మొదట 20, తర్వాత 50, ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ మూడు గెంతుల్లో బిలం చేరుకుని దాని నేలపై వాలుతుంది. గడ్డకట్టిన నీటి ఆనవాళ్ల కోసం అన్వేషిస్తుంది. ముప్పావు గంట సేపు అక్కడ ఉండి, ఫొటోలు తీశాక మళ్లీ ‘గ్రేస్’ ఉపరితలంపైకి వస్తుంది. చంద్రుడిపై హోపర్ ప్రయోగం ఇదే ప్రథమం. రోవర్లు చేయలేని పనులను సుసాధ్యం చేసేందుకు తలపెట్టిన సాంకేతిక ప్రదర్శన ఇది. చైనా వచ్చే ఏడాది ‘చాంగే-7 మిషన్’తో చంద్రుడిపైకి ఇలాంటి హోపర్ పంపనుంది. ‘పెర్సెవరెన్స్’ రోవర్ వెంట అరుణగ్రహం అంగారకుడిపైకి నాసా పంపిన ‘ఇంజెన్యుటీ’ హెలికాప్టర్ ఆ గ్రహ వాతావరణంలో ఎగురుతూ పరిశోధనలు చేసిన సంగతి తెలిసిందే. చందమామపై ‘అథీనా’ ల్యాండర్ పనిచేసేది పది రోజులే. ‘నాసా’ రూపొందించిన పది శాస్త్రీయ పరికరాలను అందులో అమర్చారు. వీటిలో ఎక్కువ పరికరాలు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో గడ్డకట్టిన నీరు, ఇతర వనరుల జాడను కనుగొనడానికి ఉద్దేశించినవి. ఈ అన్వేషణలో నీటి ఆధారాలేవైనా బయల్పడితే వాటిని చంద్రుడిపై భవిష్యత్తులో నిర్మించే మానవ ఆవాసాలకు వినియోగించుకోవాలనేది నాసా ఆలోచన. 14న చంద్రగ్రహణానికి ప్రత్యక్ష సాక్షులు!పరిస్థితులన్నీ సవ్యంగా సాగితే... ఈ నెల 14న చంద్రగ్రహణానికి ‘బ్లూ ఘోస్ట్’, ‘అథీనా’ ల్యాండర్లు ప్రత్యక్ష సాక్షులవుతాయి. గ్రహణ వేళలో భూమి ఛాయ చంద్రుడిని క్రమంగా కప్పివేయడాన్ని ల్యాండర్లు రెండూ వీక్షిస్తాయి. ఆ తర్వాత మరో రెండు రోజులకు చంద్రుడిపై ల్యాండర్లు దిగిన ప్రాంతంలో ‘14 రోజుల రాత్రి కాలం’ మొదలై క్రమంగా చీకట్లు ముసురుకుంటాయి. అప్పుడిక ల్యాండర్లు పనిచేయడానికి సౌరశక్తి ఉండదు. పైగా అక్కడ అతి శీతల వాతావరణం నెలకొంటుంది. అంటే... ల్యాండర్లు రెండూ డెడ్ అవుతాయి. 2030 కల్లా చంద్రుడిపైకి అమెరికన్లు!తమ ‘ఆర్టెమిస్’ కార్యక్రమంతో ఈ దశాబ్దం చివరికల్లా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా యోచిస్తోంది. వాస్తవానికి ‘ఐఎం-2 మిషన్’ను నాసా రూ.550 కోట్లకు కొనుగోలు చేసింది. ‘బ్లూ ఘోస్ట్’, ఐఎం-1, ఐఎం-2... ఇవన్నీ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సీఎల్పీఎస్)లో భాగం. 2028 వరకు ఇలాంటి మిషన్స్ చేపట్టడానికి నాసా రమారమి రూ.25 వేల కోట్లు కేటాయిస్తోంది. ప్రైవేటు సంస్థలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ శాస్త్ర సాంకేతికతను వృద్ధి చేస్తోంది. (Credits: Sky News, NASASpaceflight.com, Space Intelligence, The Hindu, India Today, Space.com, Gizmodo, Scientific American, CNN)-జమ్ముల శ్రీకాంత్ -
సునీతా విలియమ్స్ రాకపై ఉత్కంఠ
-
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
సునీతా విలియమ్స్ ను త్వరగా తీసుకురావాలని ఇలాన్ మస్క్ ను కోరిన ట్రంప్
-
Sunita Williams: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!
గతేడాది జూన్ 14వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్లు భూమ్మీదకి ఎప్పుడు అడుగుపెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండటంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? అనే సందేహాలు సర్వత్రా లేవనెత్తాయి. అయితే వాటన్నింటికీ చెక్‌పెడుతూ గతంలో సునీతా తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్ తాజాగా తాను ఆ సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ.. బాంబు పేల్చింది. దీంతో ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా..? అనే సందేహం అందిరిలోనూ రేకెత్తింది. ఇంతకీ విలియమ్స్ ఏం చెప్పారు..? భవిష్యత్ మిషన్ల పరిస్థితి ఏంటీ అంటే..సునీతా విలియమస్స్(Sunita Williams) ఏడు నెలలుగా అంతరిక్షంలోనే(space) ఉండిపోవడంతో నడక(Walk) ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండటంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది అన్నట్లుగా ఉన్నాయి విలియమ్స్ మాటలు చూస్తే. నెలల తరబడి గురత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండటం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేదు, పడుకోలేదు, అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్‌గా భావించిన సునీతాకు అదికాస్తా ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైనా.. వారితో టచ్‌లో ఉండేలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడతున్నట్లు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు కూడా పరీక్షగా మారింది. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల(Astronauts) కుటుంబ జీవితాన్నే గాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్ పరిశోధనల కోసం వ్యోమగాములకు త్యాగాలు తప్పవనే విషయాన్ని నొక్కి చెబుతోంది. అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. కాగా, మార్చి చివరలో లేదా ఏప్పిల్‌లో స్పేస్ఎక్స్ క్రూ-10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్‌ని కోరినట్లు సమాచారం. (చదవండి: ఆ ఇద్దరి కోసం ట్రంప్ సాయం అడిగారు: మస్క్) -
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025 -
సునీత స్పేస్‌వాక్ చూశారా?
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఈమె గురువారం ఐఎస్ఎస్ వెలుపలికి వచ్చి స్పేస్‌వాక్ చేశారు.ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్(Space Walk). నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఐఎస్ఎస్కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్ఎస్ తుర్క్మెనిస్తాన్కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతకుముందు కూడా పలుమార్లు ఐఎస్ఎస్లోకి వచి్చన సునీతకు తాజా స్పేస్‌వాక్ ఎనిమిదోది కావడం గమనార్హం.గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం పాటు మాత్రమే వారు అక్కడ గడపాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే వారం సునీత, విల్మోర్ను తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. The rate gyro assembly that helps maintain station orientation has been replaced. @AstroHague will soon work on the NICER X-ray telescope while @Astro_Suni will replace navigation hardware. pic.twitter.com/EfqNDF8ZAI— International Space Station (@Space_Station) January 16, 2025🚀 జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. -
Rakesh Sharma Birthday: రాకేష్‌శర్మ అంతరిక్షంలో ఎన్ని రోజులున్నారు?
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పుట్టినరోజు నేడు(జనవరి 13). ఆయన 1949 జనవరి 13న జన్మించారు. భారతదేశ చరిత్రలో తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సాగించిన అంతరిక్ష ప్రయాణం దేశానికి గర్వకారణంగా నిలిచింది.1949, జనవరి 13న పంజాబ్‌లోని పటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ(Rakesh Sharma), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)మాజీ పైలట్, వ్యోమగామి. రాకేశ్‌శర్మ 1984లో 7 రోజుల, 21 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్ష యాత్ర చేశారు. 1984లో సోవియట్ అంతరిక్ష నౌక సోయుజ్ టీ-11లో ఆయన చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఆయనను జాతీయ హీరోగా చేయడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ వేదికపై భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది.నాటి అంతరిక్ష మిషన్ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉందని శర్మను అడిగినప్పుడు ఆయన ‘సారే జహాన్ సే అచ్ఛా" (ప్రపంచమంతటి కంటే మెరుగ్గా) అని సమాధానమిచ్చారు. ఈ దేశభక్తి భావన లక్షలాది మంది భారతీయులతో ప్రతిధ్వనించింది.దేశ సమిష్టి జ్ఞాపకంలో శాశ్వతంగా నిలిచిపోయింది.రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత, శర్మ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఏరోస్పేస్ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్ తరాల కలలను సాకారం చేసేందుకు, సైన్స్, అంతరిక్ష పరిశోధనలలో మరింత ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలిచింది.ఇది కూడా చదవండి: కెనడా అమ్మకానికేం లేదు!.. ట్రంప్‌కు ఘాటు హెచ్చరిక -
స్కై స్టార్స్: ఇస్రోలో పనిచేయకుండానే స్పేస్ స్టారప్ కంపెనీ..!
మనసు పెడితే, కష్టపడితే ‘కచ్చితంగా నిజం అవుతాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ కాజల్, హితేంద్రసింగ్. ‘స్పాన్ట్రిక్(SpanTrik)’ స్టార్టప్‌తో తమ కలను నిజం చేసుకున్నారు... రాకెట్‌ను ప్రయోగించే ప్రక్రియలో కాలంతో పాటు ఎంతో పురోగతిని చూస్తున్నాం. దీనికి సరికొత్త చేర్పు...స్పాన్ట్రిక్. రీయూజబుల్ రాకెట్ లాంచ్ వెహికిల్స్ కోసం కాజల్ రాజ్జర్, హితేంద్రసింగ్ ‘స్పాన్ట్రిక్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు.పునర్వినియోగ రాకెట్(Reusable rockets) లాంచ్ వెహికిల్స్‌ను స్పాన్ట్రిక్ అభివృద్ధి చేస్తుంది. అంతరిక్ష పరిశోధనలను అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మేము దీన్ని ఫెడెక్స్ టు స్పేస్ అని పిలవడానికి ఇష్టపడతాం’ అంటున్నారు కాజల్, హితేంద్రసింగ్. ఢిల్లీ(Delhi) కేంద్రంగా మొదలైన ‘స్పాన్ట్రిక్’ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ గ్రాంట్లను పొందింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్ ‘టెక్ 30’ జాబితాలో చోటు సాధించింది.చిన్నప్పుడు పిల్లలు ఏవో కలలు కంటారు. అయితే ఆ కలలు అన్నీ నిజం కాకపోవచ్చు. చిన్న వయసులోనే ‘నేను పెద్దయ్యాక స్పేస్(space) కంపెనీ నడపాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పింది కాజల్. అంతేకాదు ‘సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేస్తాను’ అని తన డైరీలో కూడా రాసుకుంది. తన లక్ష్యసాధనలో భాగంగా చెన్నైలోని ఎస్ఆర్ఎంలో చేరింది. అక్కడ ఫిజిక్స్ చదువుకున్న కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని నడిపేది. కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల గురించి అందులో రాసేది. ఈ క్రమంలో కాజల్‌కు అహ్మదాబాద్‌లో చదువుకుంటున్న హితేంద్ర సింగ్‌తో పరిచయం అయింది. కాజల్‌లాగే సింగ్ కూడా చిన్నప్పుడు ఎన్నో కలలు కనేవాడు.సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన కాజల్, హితేంద్రసింగ్లు సైన్స్‌కు సంబంధించి బోలెడు విషయాలు మాట్లాడుకునేవారు. అలా ‘స్పాన్ట్రిక్’ కోసం స్కెచ్ వేశారు. ఆస్ట్రోఫిజిక్స్, కాస్మోలజీలో మాస్టర్స్ చేయడానికి గుజరాత్‌లోని ‘చరోతార్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ చేరారు. తమ భవిష్యత్ లక్ష్యమైన ‘స్పాన్ట్రిక్’ కోసం కాలేజీ వదిలి పెట్టారు. కంపెనీ స్థాపించడానికి ముందు మానవ రహిత వైమానిక వాహనాలను (ఏరియల్ వెహికిల్స్) అభివృద్ధి చేయడం నుంచి యువిసి రోవర్ తయారీ వరకు ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ‘స్పాన్ట్రిక్’ వడివడిగా అడుగులు వేయడానికి ఉపయోగపడింది. రీసైకిల్ చేయదగిన రాకెట్ల డిమాండ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు, ఇస్రో సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. నిజానికి పునర్వినియోగ రాకెట్ కాన్సెప్ట్ కొత్త కాదు. రష్యా, అమెరికా, జర్మనీలాంటి దేశాలు దశాబ్దాలుగా ఈ కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఖర్చు హద్దులు దాటేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఖర్చు కాని, ఎక్కువ సార్లు ఉపయోగించే రాకెట్లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కాజల్–సింగ్ బృందం వర్టికల్ టేకాఫ్ వర్టికల్ ల్యాండింగ్(విటివిఎల్)ను నిర్మిస్తోంది. వ్యవస్థల పునర్వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది.అయినా సరే...చాలామంది స్పేస్ స్టార్టప్ వ్యవస్థాపకులు ఇస్రోలో పనిచేశారు. లేదా ఏదో ఒక హోదాతో సంస్థతో టచ్‌లో ఉన్నారు. మేము ‘ఇస్రో’లో పనిచేయలేదు. ‘ఇస్రో’లో పనిచేయని ఫౌండర్లకు సంబంధించిన స్టార్టప్ మాది. కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టాం. ప్రసిద్ధ సంస్థలకు చెందని వ్యక్తులు కూడా సాంకేతిక స్టార్టప్‌లకు సంబంధించి ముందుకు వెళ్లగలరని నిరూపించాలనుకుంటున్నాం. ఇది ఎంతో మంది ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతోంది కాజల్.(చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..) -
స్పేస్ డాకింగ్ 9కి వాయిదా
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట: రోదసీ పరిశోధనల్లో మరో మైలురాయిని అధిగమించేందుకు ఇస్రో సమాయత్తమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట రెండు ఉపగ్రహాలను భూకక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగం 7న జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఈ నెల 9కి ఇస్రో వాయిదా వేసింది. డాకింగ్ ప్రక్రియకు గ్రౌండ్ సిమ్యులేషన్ ద్వారా మరిన్ని పరీక్షలు అవసరమైనందునే రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్ష రంగంలో దేశం మరింత ఎత్తుకు, మరో మెట్టుకు ఎదిగేందుకు ఇస్రోకు డాకింగ్ ప్రయోగం ఎంతో కీలకం. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే స్పేస్ డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసుకోగలిగాయి. ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతమైతే భారత్ నాలుగో దేశంగా నిలుస్తుంది. -
విత్తనాలకు రెక్కలొచ్చాయ్!
సూళ్లూరుపేట: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన ప్రయోగంతోపాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్లో ఇస్రో చేపట్టిన ప్రయోగం మలి దశలోనూ విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తగలవా? మొలకెత్తితే పూర్తిస్థాయిలో ఆకుల స్థాయిని సంతరించుకోగలవా? అని తెల్సుకోవడంతోపాటు ఆక్సిజన్, కార్భన్ డయాక్సైడ్ స్థాయిలను కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టిన విషయంతెల్సిందే. స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) కోసం నింగిలోకి పంపిన జంట ఉపగ్రహాలతోపాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)పేరిట ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెల్సిందే. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచగా అవి ఇటీవల మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలు తాజాగా ఆకులను సంతరించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆకులు వచ్చిన సమయంలో మాడ్యూల్లో ఆర్ర్థత, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ తదితరాలను అందులో అమర్చిన కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచామని ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించిన పరిశోధనలకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడిందని వెల్లడించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చే చెట్ల పెంపకం, ఆ చెట్లు సూక్ష్మ గురత్వాకర్షణ స్థితిలోనూ ఏ మేరకు ఆకులు, ఫలాలను అందివ్వగలవు, ఎంత మేరకు నీరు అవసరం తదతర అంశాలపై శోధనకూ తాజా ప్రయోగం సాయపడిందని ఇస్రో పేర్కొంది. -
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.అమిత్ బెనర్జీ గురించి..దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్‌లో టేబుల్ స్పేస్‌ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్‌గా అందుబాటులోకి వచ్చింది.పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌కు బాధ్యత వహించారు.వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్‌ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.టేబుల్ స్పేస్ గురించి..గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్‌హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్‌లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.టేబుల్ స్పేస్ వెబ్సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్‌స్పేస్‌లలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.వరుస విషాదాలుస్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్‌లో బైకింగ్ ట్రిప్‌లో గుండెపోటుతో మరణించారు. -
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో కనువిందైన దృశ్యం కనిపించింది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, భారీ వలయంతో కూడిన గ్రహం శని మన చందమామకు చాలా చేరువలో కనిపించాయి. శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ అద్భుతాన్ని జనం వీక్షించారు. ఇండియాతోపాటు యూకే, అమెరికా, చైనా, తుర్కియే తదితర దేశాల్లో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే ఇది కంటికి కనిపించడం విశేషం. బైనాక్యులర్స్ లేదా టెలి స్కోప్ ఉన్నవారు మరింత స్పష్టంగా చూడగలిగారు. ముఖ్యంగా శని గ్రహం చుట్టూ ఉన్న వలయాన్ని ఆసక్తిగా గమనించారు. అంతరిక్షంలో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని సైంటిస్టులు చెప్పారు. ఈ నెల 18వ తేదీన మళ్లీ ఇలాంటి దృశ్యం వీక్షించవచ్చని సూచించారు. -
‘ఇస్రో’ రోబో హస్తం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్ హస్తం అంతరిక్షంలో తన కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే దిశగా స్పేడెక్స్(స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్) మిషన్‌లో భాగంగా ఈ రిమోట్ రోబోటిక్ చెయ్యిని అంతరిక్షంలోకి పంపించారు. శ్రీహరికోటలోని షార్ నుంచి గత నెల 30వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లింది. మన దేశానికి చెందిన మొట్టమొదటి రోబోటిక్ హస్తం రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిప్యులేటర్–టెక్నాలజీ డెమాన్ర్స్టేటర్(ఆర్ఆర్ఎం–టీడీ) కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇది మనకు గర్వకారణమని ఇస్రో వెల్లడించింది. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఎం–టీడీని నడిచే రోబోటిక్ హస్తంగా పరిగణిస్తారు. ఇండియాలో ఇలాంటిది అభివృద్ధి చేయడంలో ఇదే మొదటిసారి. ఇందులో ఏడు జాయింట్లు ఉన్నాయి. అవి అన్ని వైపులా కదులుతాయి. అంతరిక్షంలోని స్పేడెక్స్ మిషన్‌లో భాగమైన పీఎస్4–ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్(పోయెం–4) ఫ్లాట్‌పామ్‌పై చురుగ్గా నడవగలదు. నిర్దేశించిన చోటుకు వెళ్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మర చెయ్యిని రూపొందించారు. ఇందులో కంట్రోలర్లు, కెమెరాలు, అడ్వాన్స్డ్ సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. భారతీయ అంతరిక్ష స్టేషన్(బీఏఎస్) పేరిట సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి భారత్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఏఎస్ నిర్మాణం, నిర్వహణకు రోబోటిక్ టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీని స్వయంగా అభివృదిచేసుకొనే దిశగా రోబోటిక్ హస్తం కీలకమైన ముందడుగు అని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. -
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది. -
‘అంతరిక్ష అనుసంధానత’ను పరీక్షించనున్న ఇస్రో
న్యూఢిల్లీ: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానత (డాకింగ్), విడదీత (అన్‌డాకింగ్) ప్రక్రియలను విజయవంతంగా పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం ఉపయోగించే రెండు ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనుంది. దీనికి శ్రీహరికోటలోని ప్రయోగవేదిక సిద్ధమైంది. సోమవారం రాత్రి ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్‌డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలివారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్(స్పేడెక్స్)ను చేపడతామని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ సాంకేతికతను సాధించాయి. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరక్ష స్టేషన్ ఏర్పాటు, చందమామపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారనుందని ఇస్రో పేర్కొంది. -
భారీ స్థాయిలో ఆఫీస్ వసతుల నిర్మాణం
పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.ఈ రంగాల నుంచి డిమాండ్..ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్అండ్డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు. ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుసవాళ్లు ఇవే..ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. -
అంతరిక్షంలో క్రిస్మస్
-
మనం సెలవులు తీసుకోవడానికి కుదరదా చంద్ర!?
-
సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం!
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది.వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతికత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్మోర్లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి సమస్యలు తలెత్తాయి.NASA again delays return of two astronauts stranded on space station.Veteran astronauts Butch Wilmore and Suni Williams arrived at the ISS in June aboard Boeing's Starliner spacecraft, and were due to spend eight days on the orbiting laboratoryhttps://t.co/1ZIsWApfvX pic.twitter.com/AyFR5ifJdd— AFP News Agency (@AFP) December 18, 2024 స్టార్ లైనర్‌లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పేస్‌లో చిక్కుకున్న వీరిద్దరిని భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్‌లోకి పంపింది. క్రూ-9 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇదే క్రూ-9 మిషన్‌లో సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాదిలో రానున్నట్లు నాసా వెల్లడించింది. -
హైదరాబాద్‌లో రిటైల్ స్పేస్‌కు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.హైదరాబాద్‌లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్‌ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు. -
నింగిలోకి కృత్రిమమేధ ప్రయోగశాల
పలు విజయవంతమైన ప్రయోగాలతో అంతరిక్షరంగంలో తనదైన ముద్ర వేసిన భారత్ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ సాహసోపేత కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్షరంగ సంస్థ కీలక భాగస్వామిగా ఉండటం విశేషం. భారత్‌లో తయారుచేసిన కృత్రిమమేధ పరిశోధనశాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టేక్మీటూస్పేస్ సంస్థ తయారుచేసిన ‘మై ఆర్టిటార్ ఇన్ఫ్రాస్టక్చర్– టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ (ఎంఓఐ–టీడీ)’ ల్యాబ్‌ను నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ కృత్రిమమేధ ల్యాబ్‌ను ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి ఇది ఉపగ్రహం అయినప్పటికీ పూర్తిస్థాయి పరిశోధనశాలలాగా పనిచేయగల సత్తా దీని సొంతం. అందుకే అంతరిక్షంలో పనిచేయనున్న భారత మొట్టమొదటి కృత్రిమమేధ ల్యాబ్‌గా ఇది చరిత్ర సృష్టించనుంది. డిసెంబర్ నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ప్రయోగకేంద్రం నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. కక్ష్యలో తిరుగుతూ ఎప్పటికప్పుడు డేటాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చే ఉద్దేశంతో ఏఐ ల్యాబ్‌ను పంపుతున్నారు. ప్రైవేట్, విదేశీ ఉపగ్రహాల ప్రయోగ బాధ్యతలను చూసుకునే భారత ప్రభుత్వ మరో విభాగమైన ‘ఇన్–స్పేస్’ వారి టెక్నాలజీ సెంటర్ నుంచి ఎంఓఐ–టీడీకి కీలకమైన సాయం అందింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఇన్–స్పేస్ సంస్థ ఎంఓఐ–టీడీ టెస్టింగ్ తదితర బాధ్యతలను చూసుకుంది. అత్యంత భారీ డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి భూమి మీదకు పంపడం ఉపగ్రహ కార్యక్రమాల్లో పెద్ద సవాల్‌తో కూడిన వ్యవహారం. ప్రస్తుతం ఏదైనా శాటిలైట్ గరిష్టంగా రోజుకు 1 పెటాబైట్ డేటాను మాత్రమే సంగ్రహించగలదు. ప్రస్తుతం ‘క్లౌడ్ కవర్’ దృగ్విషయం కారణంగా 40 శాతం ఉపగ్రహ సమాచారం నిరుపయోగం అవుతోంది. వచ్చిన డేటాను ప్రాసెస్ చేయడానికి వారాల తరబడి వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏఐ ల్యాబ్‌ను రంగంలోకి దించారు. అత్యంత వేగంగా డేటా ప్రాసెసింగ్‌కు ఈ ఏఐ ల్యాబ్ సుసాధ్యం చేయనుంది. అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకు..రియాక్షన్ వీల్స్, మ్యాగ్నటార్కర్స్, ఏఐ యాక్సిలిరేటర్లు, అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్‌తో ఏఐ ల్యాబ్‌ను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఏఐ ల్యాబ్ త్వరగా ‘కౌడ్ డేటా’ వంటి అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకూ బాటలువేయనుంది. ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలను ద్విగుణీకృతం చేయడమేకాకుండా అంతరిక్ష ఆధారిత కంప్యూటింగ్ టెక్నాలజీల అభివృద్ధికి ఇదొక వేదికగా అక్కరకు రానుంది. ల్యాబ్‌కు అదనంగా సౌర ఫలకాలను అమర్చారు. ఇవి భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రాబోయే శాటిలైట్ల ఇంధన అవసరాలను తీర్చగలవు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా–3 మిషన్‌లో భాగంగా డిసెంబర్లో ప్రయోగించే పీఎస్ఎల్వీ–సీ60 రాకెట్‌లోనే ఏఐ ల్యాబ్‌నూ అమర్చుతున్నారు. ఎన్నెన్నో ఉపయోగాలుఅక్కడి శాటిలైట్లు సేకరించే సమాచారాన్ని ఈ ఏఐ ల్యాబ్ వేగంగా ప్రాసెస్‌చేసి సంబంధిత యూజర్లకు అనువుగా అందిస్తుంది. దీంతో పర్యావరణంపై పర్యవేక్షణ తో పాటు అడవుల నరికివేత, హరితఉద్గారాల పరిమాణం తదితర ఎన్నో అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందొచ్చు. దీంతో భిన్న రంగాలకు సంబంధించిన పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారాన్ని ఆర్బిట్ల్యాబ్ నుంచి నేరుగా సంప్రతింపులు జరిపి పొందొచ్చు. వేర్వేరు అప్లికేషన్లకు సంబంధించిన కృత్రిమమేధ మాడ్యూళ్లను అప్లోడ్ చేసి ఈ వెబ్ ఆధారిత కన్సోల్‌తో అనుసంధానం కావచ్చు. ఇప్పటికే మలేసియా విశ్వవిద్యాలయంతోపాటు భారతీయ విద్యార్థుల బృందమొకటి ఇందుకోసం తమ పేర్లను నమోదుచేసుకుంది. ఎక్కువ మంది యూజర్లు పెరిగేకొద్దీ ఆయా పరిశోధకులయ్యే ఖర్చు సైతం భారీగా తగ్గనుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అంతరిక్షంలో చేపలు పెంచారు!
చైనా వ్యోమగాములు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు. నవంబర్ 4న ముగిసన షెన్ఝౌ–18 స్పేస్ మిషన్‌లో భాగంగా వాళ్లు ఈ ఘనత సాధించారు. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను ఎంచుకున్నారు. వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేశారు. చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. 43 రోజుల జీవనచక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనుగడ సాగించగలవన్న దానిపై ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచి్చందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక అంతరిక్ష రంగంలో కొంతకాలంగా చైనా సాధిస్తున్న పైచేయికి ఇది తాజా నిదర్శనమని కూడా చెబుతున్నారు. జీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలుంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు. భూమికి ఆవల శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ‘‘దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచి్చంది. అంతరిక్షంలో స్వయంపోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది’’ అని చైనా పేర్కొంది. -
స్పేస్‌లో సునీతా విలియమ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ చెక్ పెట్టారు. తాజాగా, తన ఆరోగ్యంగా బాగుందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం సునీతా విలియమ్స్ బక్కచిక్కిన ముఖం కనిపించారు. ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో విలియమ్స్ ముఖంలో మార్పులు కనిపించాయి. ఆరోగ్యం సైతం కుదుట పడినట్లు అర్ధమవుతుంది. అంతరిక్షంలోని బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లారు. పని పూర్తి చేసుకుని కొన్ని రోజుల వ్యవధి తర్వాత తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.కానీ వ్యోమగాముల్ని తీసుకెళ్లిన బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాలు వచ్చే ఏడాది వరకు స్పేస్‌లో ఉండనున్నారు.అయితే స్పేస్‌లో మైక్రోగ్రావిటీ కారణంగా సునీతా విలియమ్స్ శరీరంలో ఎర్రరక్తకణాలు క్షీణించాయి. దీంతో సునీతా విలియమ్స్ ముఖం బక్కిచిక్కపోవంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తిరిగి సాధారణ స్థితికి రావాలంటే పౌష్టికాహారం తప్పని సరి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సునీతా విలియమ్స్ అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా ఆహారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఆరోగ్యం కుదుట పడి సాధారణ స్థితికి వచ్చారు.తాజాగా, సునీతా విలియమ్స్ షేర్ చేసిన ఫొటోతో ఆమె ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలకు పులిస్టాప్ పడింది. -
సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు. మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు. (చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?) -
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన
-
నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
వాషింగ్టన్: అత్యంత కఠినమైన లోహాలతో రూపొందిన కృత్రిమ ఉపగ్రహాలు కాలంచెల్లాక కక్ష్యల్లో స్పేస్‌జంక్‌గా పోగుబడుతున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా కలపను భవిష్యత్తులో వాడే ఉద్దేశ్యంతో జపాన్ శాస్త్రవేత్తలు కలపతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారైన ‘లిగ్నోశాట్’ఉపగ్రహం అమెరికాలోని నాసా వారి కెన్నడీ అంతరిక్షప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ లో నింగిలోకి దూసుకుపోయి ందని క్యోటో వర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ మంగళవారం ప్రకటించింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఈ బుల్లిశాటిలైట్ను తయారుచేశారు. ఒక కంటైనర్‌లో అమర్చి పంపారు. త్వరలో ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోంది. కొద్దిరోజుల విరామం తర్వాత దీనిని ఐఎస్ఎస్ బయట ప్రవేశపెట్టనున్నారు. ఆరునెలలపాటు ఇది తన కక్ష్యలో తిరగనుంది. శూన్యంలో రోదసీ వాతావరణంలో కలప ఏ మేరకు మన్నికగా ఉంటుందనే విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రతి 45 నిమిషాలకు ఇది రోదసీలో చీకటి మొదలు తీక్షణమైన సూర్యరశ్ని దాకా అంటే మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 100 డిగ్రీ సెల్సియస్దాకా భిన్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సి ఉంటుంది. కలపను దహించే ఆక్సిజన్ వంటి వాయువులు శూన్యంలో ఉండవుకాబట్టి అక్కడ కలప ధృఢంగా ఉండగలదని జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయ అటవీశాస్త్ర ప్రొఫెసర్ కోజీ మురాటా వాదిస్తున్నారు. ఖడ్గం పిడి, ఒరగా వాడే మంగోలియా జాతి హొనోకీ చెట్టు కలపను ఈ శాటిలైట్ తయారీలో వాడారు. జపాన్ సంప్రదాయక కళతో ఎలాంటి నట్లు, బోల్ట్‌లు, జిగురు వాడకుండానే లిగ్నోశాట్‌ను సిద్ధంచేశారు. కాలం చెల్లిన శాటిలైట్ తిరిగి భూవాతావరణంలోకి వచ్చేటపుడు ప్రమాదకర అల్యూమినియం ఆక్సైడ్ అణువులను వెలువరుస్తుంది. అదే కలప శాటిలైట్‌తో పర్యావరణానికి, కమ్యూనికేషన్ కక్ష్యలకు ఎలాంటి సమస్యలు ఉండవని క్యోటో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట కలపశాటిలైట్ మన్నిక బాగుందని తేలితే భవిష్యత్తులో చంద్రుడు, మార్స్‌పై వ్యోమగాముల ఆవాసాలకు కలపను విరివిగా వాడే అవకాశముంది. ఐఎస్ఎస్ నుంచి సరకుల రాకపోకల్లోనూ కంటైనర్లకు కలపను వాడే వీలుంది. -
సోలార్ పవర్ డైరెక్టుగా స్పేస్ నుంచే
కరెంటు లేనిదే కాసేపైనా ఉండలేం.. మరి కరెంటు ఉత్పత్తి చేయాలంటే.. ఎన్నో తిప్పలు. నానాటికీ బొగ్గు కరువై థర్మల్ విద్యుత్ ఆగిపోయే పరిస్థితి. నదుల్లో నీళ్లు పారినంత సేపే జల విద్యుత్ వస్తే.. సౌర విద్యుత్ పగటి పూట మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో 24 గంటలూ సౌర విద్యుత్ పొందగలిగేందుకు బాటలు పడుతున్నాయి. పర్యావరణానికి నష్టం లేకుండా, ఇటు 24 గంటలూ కరెంటు అందించేందుకు.. అందమైన ఐస్‌ల్యాండ్ దేశం రెడీ అవుతోంది. అదెలాగో తెలుసుకుందామా..ఆకాశంలోనే అడ్డా వేసి..భూమ్మీద అయితే పగటి పూట మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి సాధ్యం. అందులోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాల ధాటి తక్కువగా ఉండటం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నా, సోలార్ ప్యానెల్స్ దుమ్ముపట్టినా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా.. నేరుగా ఆకాశంలోనే ఉపగ్రహాల్లా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల 24 గంటలూ సూర్య కిరణాలు పూర్తి స్థాయిలో ప్రసరిస్తాయి. దుమ్ము పట్టడం వంటి సమస్యేదీ ఉండదు. వచ్చిన చిక్కు ఏమిటంటే.. అక్కడ ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదికి తేవడం ఎలాగనేదే!1. స్పేస్‌లోని సోలార్ ప్యానళ్లపై సూర్య కిరణాలు పడతాయి.2. వాటితో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రేడియో వేవ్స్‌గా మార్చి భూమి మీదకు పంపుతారు.3. భూమిపై గ్రౌండ్ స్టేషన్ రేడియో వేవ్స్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చి ఇళ్లకు సరఫరా చేస్తుంది.రేడియో తరంగాల రూపంలో పంపుతూ..ఆకాశంలో ఏర్పాటు చేసే ప్యానల్స్ వద్ద ఉత్పత్తి అయిన కరెంటును భూమ్మీదకు తెచ్చే టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఆ కరెంటును నిర్ణీత ఫ్రీక్వెన్సీలో రేడియో తరంగాలుగా మార్చి.. భూమ్మీద ఎంపిక చేసిన ప్రదేశంలో కేంద్రీకృతమయ్యేలా ప్రసారం చేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక యాంటెన్నాలు, పరికరాలు వాటిని గ్రహించి.. తిరిగి కరెంటుగా మారుస్తాయి. ఈ కరెంటును ఇళ్లకు, ఇతర అవసరాలకు ప్రసారం చేస్తారు. ఇటీవలే ‘కాల్టెక్’ అనే సంస్థ అంతరిక్షం నుంచి రేడియో తరంగాల రూపంలో పంపిన విద్యుత్‌ను భూమ్మీద ఒడిసిపట్టి.. తిరిగి విద్యుత్‌గా మార్చగలిగింది కూడా. అది ప్రయోగాత్మక పరిశీలన కాబట్టి కొన్ని మిల్లీవాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఐస్‌ల్యాండ్‌లో పూర్తిస్థాయిలో మెగావాట్ల మేర విద్యుత్‌ను అంతరిక్షం నుంచి ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నారు.‘స్పేస్ సోలార్ విద్యుత్’ లాభాలెన్నో..24 గంటలూ సౌర విద్యుత్ సరఫరాకు చాన్స్.. మిగతా పునరుత్పాదక వనరులతో పోలిస్తే తక్కువ ధర ఈ స్పేస్ సోలార్ విద్యుత్ వల్ల పెద్దగా కాలుష్యం ఉండదు. ఇళ్లకు మాత్రమేగాకుండా వాహనాలు,పరిశ్రమల్లోనూ ఈ విద్యుత్ వినియోగిస్తే.. శిలాజ ఇంధనాలతో వెలువడే కాలుష్యం ముప్పు తగ్గుతుంది. ఒకసారి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే సుదీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు త్వరగానే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోవచ్చు.మూడు కంపెనీలు కలసి.. యూకేకు చెందిన స్పేస్ సోలార్ సంస్థ, ఐస్‌ల్యాండ్‌కు చెందిన రేక్జావిక్ ఎనర్జీ కంపెనీ, ఐస్‌ల్యాండిక్ సస్టెయినబిలిటీ ఇనిíÙయేటివ్ ట్రాన్సిషన్ ల్యాబ్స్ సంస్థలతో కలసి.. అంతరిక్ష సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలుత 2030 సంవత్సరం నాటికి.. 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారు 3వేల ఇళ్లకు ఆ విద్యుత్‌ను సరఫరా చేయాలని భావిస్తున్నారు.భవిష్యత్తులో గిగావాట్ల స్థాయిలో..స్పేస్ సోలార్ సంస్థ భవిష్యత్తులో భారీ స్థాయిలో ‘స్పేస్ విద్యుత్’ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ‘కాస్సియోపియా’ పేరిట ప్రాజెక్టును చేపట్టనుంది. భారీ సోలార్ ప్యానళ్లతో కూడి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి.. ఒక నెట్‌వర్క్‌గా రూపొందించాలని.. దాని నుంచి 2036 నాటికి గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘‘స్పేస్ సోలార్ ప్రాజెక్టు వల్ల తక్కువ ధరకే 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుంటుంది. దీనిపై రేక్జావిక్ ఎనర్జీ సంస్థతో కలసి ముందుకు వెళ్తున్నాం. సుస్థిర భవిష్యత్తుకు ఇది బాటలు వేస్తుంది..’’ అని స్పేస్ సోలార్ సంస్థ కో–సీఈవో మార్టిన్ సోల్టూ పేర్కొన్నారు. - సాక్షి సెంట్రల్డెస్క్ఏర్పాటు, వాడకంలో ఇబ్బందులూ ఉన్నాయి?⇒ అంతరిక్షంలో ఉపగ్రహాలు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు చాలా వ్యయంతో కూడుకున్నది. ⇒ అంతరిక్షం నుంచి పంపే రేడియో వేవ్‌ల వల్ల మనుషులు, ఇతర జీవజాలంపై,⇒ వాతావరణంపై పడే ప్రభావం ఏమిటన్నది పూర్తిగా తేలాల్సి ఉంది. ⇒ ప్రస్తుతమున్న టెక్నాలజీలతో ట్రాన్స్మిట్ అయ్యే కరెంటు తక్కువ. ఇది గణనీయంగా పెరగాల్సి ఉంది. ⇒ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు రేడియో వేవ్‌ల ప్రసారం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ⇒రేడియో తరంగాలు గ్రౌండ్ స్టేషన్‌పైనే కాకుండా.. ఇతర ప్రాంతాలపైకి ఫోకస్ అయితే ప్రమాదాలు జరగవచ్చనే ఆందోళన ఉంది. -
తారను మాయం చేయనున్న జాబిల్లి
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది. భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్ష చెత్త.. అమాంతం పైపైకి
మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర భాగాలు అలాగే పేరుకుపోయి కొత్త కృత్రిమ ఉపగ్రహాలకు ‘అంతరిక్ష బాంబుల్లా’ తయారయ్యాయి. పాడైపోయిన పాత ఉపగ్రహాల శిథిలాల స్పేస్‌జంక్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయోగాలకు పెద్ద అవరోధంగా మారింది. పేలిపోయిన ఇంటెల్‌శాట్ 33ఇ యూరప్, మధ్య ఆఫ్రికా, పశి్చమాసియా, ఆ్రస్టేలియా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలందిస్తున్న ఇంటెల్‌శాట్ 33ఇ ఉపగ్రహం నాలుగు రోజుల క్రితం పనిచేయడం మానేసింది. 2016 ఆగస్ట్‌లో బోయింగ్ సంస్థ ఈ శాటిలైట్‌ను డిజైన్ చేసింది. పనిచేయడం మానేసిన కొద్దిసేపటికే అది పేలి 20 ముక్కలుగా కక్ష్యలో చెల్లాచెదురుగా పడిందని యూఎస్ స్పేస్ ఫోర్సెస్ స్పేస్(ఎస్4ఎస్) సంస్థ ధృవీకరించింది. ఇలా అనూహ్యంగా ఉపగ్రహాలు అంతరిక్ష చెత్తలా మారితే సమీప ఉపగ్రహాలకు మరణశాసనం రాసినట్లే. శాటిలైట్ ముక్కలు వేగంగా భ్రమిస్తూ కక్ష్యదాటి సమీప శాటిలైట్లను ఢీకొట్టి వాటికి భారీ నష్టం చేకూరుస్తాయి. దీంతో ఇతర శాటిలైట్లు కూడా పాడయ్యే ప్రమాదముంది. ఇలా గొలుసుచర్య జరిగితే పెద్ద ఉపద్రవమే సంభవిస్తుంది. అక్కడ సమీప శాటిలైట్లన్నీ ధ్వంసమై భూమిపై సమాచార, ప్రసార వ్యవస్థలు స్తంభించిపోతాయి. భవిష్యత్తులో ఆ ఎత్తుల్లోని ఆ కక్ష్యలను కొత్త ఉపగ్రహాల కోసం వాడుకోలేని పరిస్థితి దాపురిస్తుంది. భూమి నుంచి కొంత పరిధిలోని ఎత్తుల్లో మాత్రమే శాటిలైట్లను ప్రవేశపెట్టగలం. అవి మాత్రమే మానవాళి అవసరాలకు పనికొస్తాయి. సుదూరాల్లో శాటిలైట్లను ప్రవేశపెట్టలేం. అందుబాటులో ఉన్న కక్ష్యలను అన్ని దేశాలకు అత్యంత విలువైన అంతరిక్ష వనరులుగా చెప్పొచ్చు. ఇప్పుడీ అంతరిక్ష చెత్తతో ఆ వనరులను భవిష్యత్తులో మానవుడు ఉపయోగించుకోలేని దురవస్థ రావొచ్చు. ఎందుకిలా జరుగుతోంది? సౌర తుపాన్లు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. శక్తివంతమైన సౌర తుపాన్ల ధాటికి శాటిలైట్ల పనితీరు దెబ్బతిని అవి నియంత్రణ కోల్పోతున్నాయి. గతంలోనూ ఇలా కొన్ని శాటిలైట్లు హఠాత్తుగా పనిచేయడం ఆగిపోవడం, కొన్ని ఢీకొనడం, ఇంకొన్ని నియంత్రణ పరిధి ఆవలికి వెళ్లిపోవడం జరిగాయి. లక్షలాది ముక్కలు యూరోపియన్ స్పేస్‌ఏజెన్సీ గణాంకాల ప్రకారం 10 సెంటీమీటర్లకన్నా పెద్ద పరిమాణంలో ఉన్న ముక్కలు 40,000దాకా అంతరిక్షంలో పోగుబడ్డాయి. ఇక 1 సెంటీ మీటర్ కన్నా చిన్నసైజు ముక్కలు 13 కోట్లదాకా ఉంటాయని తెలుస్తోంది. మనిషి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు, రాకెట్ల కారణంగా అంతరిక్షంలో దాదాపు 13,000 టన్నుల మేర చెత్త పేరుకుపోయింది. ఇది 90 భారీ తిమింగలాల బరువుతో సమానం. ఇందులో 4,300 టన్నుల చెత్త కేవలం రాకెట్ నుంచి విడిపోయిన విడిభాగాల కారణంగా పోగుబడింది. తాజాగా ముక్కలైన ఇంటెల్‌శాట్ 33ఈ ఉపగ్రహం ఏకంగా 35,000 కి.మీ.ల ఎత్తులో పరిభ్రమించేది. ఇంత దూరంలో ఉన్న ముక్కలను లెక్కబెట్టడం కూడా చాలాకష్టం. ఈ ఏడాది జూన్‌లో రెసర్స్–పీ1 ఉపగ్రహం 480 కి.మీ.ల ఎత్తులో భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ హఠాత్తుగా బద్దలై 100 ముక్కలైంది. తిరిగే క్రమంలో ఇవి మరింతగా ముక్కలై చిన్నవిగా సమస్యను మరింత జఠిలతరం చేస్తాయి. జూలైలో గడువు ముగిసిన రక్షణ, వాతావరణరంగ 5డీ–2ఎఫ్8 వ్యోమనౌక ముక్కలైంది. ఆగస్ట్‌లో లాంగ్‌మార్చ్6ఏ(సీజెడ్–6ఏ) రాకెట్ సైతం చిధ్రమైంది. అందుబాటులోకి డీకమిషన్ ఆధునిక సాంకేతికత చెత్త మరీ ఎక్కువగా పేరుకుపోకుండా ఏదైనా శాటిలైట్ జీవితకాలం ముగుస్తుందనిపించిన వెంటనే దానిని సురక్షితంగా భూకక్ష్యలోకి తీసుకొచ్చి మహాసముద్రాల్లో పడేసే ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచి్చంది. గతంలో స్కైల్యాబ్ వంటి ఘటనలతో జనం బెంబేలెత్తిపోయినా ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పాలి. గత నెలలో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ క్లస్టర్–2 సల్సా శాటిలైట్‌ను ఇలాగే జాగ్రత్తగా డీకమిషన్ చేశారు. భారీ వస్తువును అంతరిక్షంలోకి పంపితే అంతమేర చెత్తను పంపినట్లు లెక్కించాలి. దశాబ్దాలపాటు సేవలందించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఒకవేళ కక్ష్యలో ముక్కలైతే 22 కోట్ల ముక్కలుగా మారుతుందని ఓ అంచనా. అందుకే దీనిని సురక్షితంగా లాగుడుబండి లాంటి వ్యోమనౌకతో లాక్కొచ్చి మహాసముద్రంలో పడేయాలని అమెరికా ఇప్పటికే ఒక భారీ ప్రణాళిక సిద్దంచేసింది. ఈ బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ప్రైవేట్ అంతరిక్షసంస్థకు అప్పజెప్పింది. తొలగించాల్సిన బాధ్యత ఎవరది? ఏ దేశానికి చెందిన శాటిలైట్ ముక్కలైతే వాటిని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆ దేశానిదే. అంతరిక్ష వస్తువుల కారణంగా చెత్తగా మారిన కక్ష్యలను మళ్లీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 1972లో అంతర్జాతీయ ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతరిక్ష చెత్త పెరగడానికి కారకులయ్యారంటూ తొలిసారిగా గత ఏడాది మాత్రమే జరిమానా విధించారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఈ జరిమానా విధించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్..అచ్చం లగ్జరీయస్ హోటల్..!
మాములుగా అంతరిక్ష కేంద్రాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అవి వారి పరిశోధనకు అనుగుణంగా ఉంటాయి. అలా కాకుండా భూమ్మీద ఉండే అత్యంత విలాసవంతమైన హోటల్ మాదిరిగా ఉంటే..ఆ ఊహా అబ్బా అనిపిస్తోంది కదూ. అలాంటి ఆలోచనకే అంకురార్పణ చేసింది అమెరికా కొత్త స్టార్టప్ స్పేస్ టెక్ కంపెనీ వాస్ట్. ఈ కంపెనీ స్పేస్ ట్రావెల్ కొత్త శకానికి నాంది పలికింది. సాంప్రదాయ అంతరిక్ష కేంద్రాలకు స్వస్తి చెప్పి అత్యంత ఆధునాత లగ్జరియస్ హోటల్‌లా తీర్చిదిద్దనుంది. ఆగస్ట్ 2025లో ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్ పాల్కన్ 9 రాకెట్లో హెవెన్ -1 అనే పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో వ్యోమగాములకు రిసార్ట్ లాంటి వాతావరణాన్ని అందించనుంది. పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ హెవెన్-1ని చెక్కతో అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, తెల్లటి గోడలు, హై ఎండ్ హోటల్‌కు సరిపోయే సౌకర్యాలతో అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దారు.pic.twitter.com/6VD6XrJg8P— VAST (@vast) October 10, 2024 అంతేగాదు ఇందులో అత్యాధునిక జిమ్ కూడా ఉంటుందట. సందర్శకులు సున్నా గురుత్వాకర్షణలో చూసేలా వీలు కల్పిస్తోంది. ఇది అచ్చం భూమిపై ఉన్న హోటల్ మాదిరి అనుభూతిని అందిస్తుంది. అంతేగాదు ఈ హేవెన్ 1కి సంబంధించిన తుది డిజైన్‌ను స్పేస్ కంపెనీ వెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని పీటర్ రస్సెల్ క్లార్ట్, వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్ రూపొందిస్తున్నారు. ఇందులో వ్యోమగాములు హాయిగా గదుల్లో ఉండేలా సౌకర్యం ఉటుంది. అలాగే మెరుగైన నిద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ వంటివి కూడా ఉంటాయి. అంతేగాదు గుండె, ఎముకల ఆరోగ్యం కోసం ఆన్‌బోర్డ్ ఫిట్నెస్ సిస్టమ్ వంటి ఆధునాత సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను 2025లో ప్రారంభించనుండగా, అందులోని ఈ హెవెన్1 చెల్లింపు కస్టమర్లు మాత్రం 2026 నుంచి మొదలవుతారని వెల్లడించారు పరిశోధకులు. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Today, Vast unveiled the final design for Haven-1, the world’s first commercial space station, setting a new standard. Guided by visionary designer Peter Russell-Clarke and astronaut Andrew Feustel, we’re pushing the boundaries of life in space with human-first design led by… pic.twitter.com/xDdMzNFnuF— VAST (@vast) October 10, 2024(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
ఆకాశమంత కల
‘పిల్లల రేపటి భవిష్యత్ కోసం ఈ రోజు త్యాగం చేద్దాం’ అన్నారు అబ్దుల్ కలాం. ఆయన పుట్టిన రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో పుట్టిన శ్రీమతి కేశన్కు ఆ క్షిపణి యోధుడి మాటలు అక్షరాలా సరిపోతాయి. ఎంత ప్రతిభ ఉన్నా సరే పెళ్లయిన తరువాత ‘ఇక చాలు’ అని చదువుకు పుల్‌స్టాప్ పెట్టే మహిళలు ఉన్నారు. చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా సరే ఇంటిపనులకే పరిమితమై నిరుత్సాహంలో మునిగిపోయేవారు ఉన్నారు. ఇలాంటి మహిళలకు శ్రీమతి కేశన్ స్ఫూర్తి. పద్దెనిమిది సంవత్సరాలు గృహిణిగా ఇంటికే పరిమితం అయినప్పటికీ ‘ఇప్పుడు చదువు ఏమిటి!’ అనుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతరిక్ష రంగం వైపు అడుగులు వేసింది.‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ ద్వారా ఎంతో మంది పిల్లలను శాస్త్రరంగానికి దగ్గర చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటుంది...శ్రీమతి పుట్టింది తమిళనాడులో అయినా పెరిగింది, చదివింది మాత్రం హైదరాబాద్‌లో. తమిళనాడుకు చెందిన కేశన్తో వివాహం తరువాత 18 సంవత్సరాలు గృహిణిగా ఇంటికే పరిమితమైంది. అయితే చదువుకోవాలనే తపన ఆమెను డిగ్రీ పూర్తి చేసేలా చేసింది. ఓపెన్ వర్సిటీ ద్వారా ఎంబీఏ చేసింది. ముంబైలోని తన స్నేహితురాలు రీమా కోరిక మేరకు ఒక సైన్స్ సెమినార్‌కు హాజరైంది. ఈ సదస్సుకు హాజరు కావడం తన జీవితానికి టర్నింగ్‌పాయింట్ అనుకోవచ్చు. క్రమంగా శ్రీమతి ఆసక్తి అంతరిక్ష పరిశోధనల వైపు మళ్లింది. ఎన్నో వర్క్‌షాప్‌లకు హాజరైంది. ఎంతోమంది పిల్లలను సొంత డబ్బులతో ‘నాసా’కు తీసుకువెళ్లింది.శాస్త్రవేత్తలుగా ఎదగాలనే తపనతో ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు బాసటగా నిలవడం కోసం 2011లో చెన్నై కేంద్రంగా ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’కు శ్రీకారం చుట్టింది. ఏడుగురు హైస్కూల్ విద్యార్థులతో కలిసి 64 గ్రాముల బరువుతో అబ్దుల్ కలాం శాటిలైట్ తయారుచేసి చేసి ‘నాసా రాకెట్ కాంపిటీషన్’కు పంపించింది. ఈ శాటిలైట్‌కు ‘నాసా’ గుర్తింపు ఇచ్చి ప్రయోగించింది. ఈ ఉత్సాహంతో టెక్సాస్‌లోని ఓ స్పేస్ సంస్థ కోసం మరో శాటిలైట్ తయారు చేశారు. 2019లో ఇస్రో ఇచ్చిన అవకాశంతో తమిళనాడులోని ప్రభుత్వ బడులలోని ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి ఆరు రోజుల వ్యవధిలో ఒక శాటిలైట్ తయారు చేశారు. గత ఏడాది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వపాఠశాలలోని 750 మంది విద్యార్థినులను ఎంపికచేసి, శిక్షణ ఇచ్చి ‘ఆజాది శాటిలైట్’ తయారు చేశారు. 75వ భారతస్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో ద్వారా దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. అక్టోబరు 4న మొదలై 10వ తేదీ వరకు జరిగే ‘వరల్డ్ స్పేస్ వీక్’ సందర్భంగా భారత్, శ్రీలంకలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ‘స్పేస్ కిడ్జ్జ్’తో కలిసి ఓ శాటిలైట్ తయారు చేయనున్నారు.మొదట్లో ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టినా నాలుగేళ్లుగా ఒక సంస్థ అందించిన సహకారంతో విద్యార్థులతో కలిసి శాటిలైట్ పరిశోధనలను వేగవంతం చేసిన శ్రీమతి త్వరలో ప్రపంచంలోని హైస్కూల్ స్థాయి విద్యార్ధినులను ఒకే తాటిపైకి తెచ్చే ‘సైంటిఫిక్ ఒలింపిక్’కు సిద్ధమవుతోంది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది విద్యార్థినులను ఎంపిక చేసి వారి ద్వారా సరికొత్త శాటిలైట్ తయారుచేసి నింగిలోకి ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందించుకున్నారు.‘దశాబ్దకాలంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ప్రతి సవాలును విజయంగా మలుచుకున్నాను. నింగిలో భారతనారీ శక్తి దేదీప్యమానంగా వెలగాలనేదే నా విజన్, మిషన్. స్పేస్ రీసెర్చ్పార్కు, స్పేస్ యూనివర్సిటీ భారత్‌లో రావాలని కోరుకుంటున్నాను’ అంటుంది శ్రీమతి.సైన్స్‌లో ప్రతిభ ఉన్నవారే ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తి చూపుతారనేది అపోహ మాత్రమే అని నిరూపించింది శ్రీమతి కేశన్. డాక్టర్ కావాలనేది ఆమె కల. అయితే ఇంటర్మీడియెట్‌లో సైన్స్‌లో తక్కువమార్కులు రావడంతో బీకామ్‌లో చేరాల్సి వచ్చింది. అలా అని కామ్‌గా ఉండలేదు. శాస్త్రరంగంపై తన ఆసక్తికి ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’గా నిర్మాణాత్మక రూపం ఇచ్చింది. ఇప్పుడు ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ అనేది ఆమె కలల రూపం మాత్రమే కాదు సైంటిస్ట్ కావాలని కలలు కనే ఎంతోమంది పేద విద్యార్థుల ఆత్మీయ నేస్తం... దారి చూపే దీపస్తంభం. – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నైఆ దృశ్యం మరచిపోలేను!చెన్నై వేళచ్చేరిలోని పేదకుటుంబంలో పుట్టిన కుష్భు అనే అమ్మాయి ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’తో కలిసి అడుగుల వేసింది. ఇప్పుడు ఖుష్బు ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తి ఇస్తోంది. ఇస్రో ద్వారా ‘ఆజాది శాట్’ ప్రయోగించిన అనంతరం ఢిల్లీలో డీఆర్డీఓ నిర్వహించిన కార్యక్రమం లో ఖుష్బు ప్రసంగం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలాంటి అమ్మాయిల ప్రతిభను కళ్లారా చూసినప్పుడు మరింత కష్టపడాలనిపిస్తుంది. ‘ఆజాది శాట్’ నింగిలోకి ఎగిరిన క్షణంలో అమ్మాయిల కంట్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ దృశ్యాన్ని ఎప్పటికీ మరవలేను. – శ్రీమతి కేశన్ ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ ఫౌండర్, సీఈవో -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!
ఇంతవరకు పలనా పర్యటన చేశామని గొప్పగా చెప్పుకునే వాళ్లుం. ఇక నుంచి స్పేస్‌గా వెళ్లమని గొప్పలు చెప్పుకుంటామేమో..!. ఇక ముందు అలాంటి రోజులే ఉంటాయేమో కాబోలు. ఈ జాబితాలో చేరిపోయింది 21 ఏళ్ల కర్సెన్ కిచెన్. 21 ఏళ్ల ఈ ఆస్ట్రానమీ స్టూడెంట్ ఇటీవలే బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో భాగమైంది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ స్పేస్ ఔత్సాహికురాలి ఎవరూ..? ఆ ఛాన్స్ ఎలా లభించింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.చాపెల్ హిల్‌లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుతున్న కర్సెన్ కిచెన్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఆమెతో పాటు నాసా ప్రాయోజిత ఏరోస్పేస్ శాస్త్రవేత్తతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మొత్త ఆరుగురు సభ్యుల సిబ్బంది ఆగస్టు 29న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు వెస్ట్ టెక్సాస్ సైట్ ఉప కక్ష్యలోకి దాదాపు 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయ్యారు. భూమి ఉపరితలాన్ని దాటి భార రహిత స్థితిలో సుమారు మూడు నిమిషాలకు పైగానే గడిపింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది కిచెన్.‘అంతరిక్షంలోకి వెళ్లాలన్న నా కల నెరవేరింది. రోదసీ నుంచి భూమి అందాల్ని చూసి ముగ్ధురాలినయ్యా. ఇంత అందమైన గ్రహంపై జీవించడం నా అదృష్టంగా ఫీలయ్యా. ఇలా ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నేనే పిన్న వయస్కురాలిని కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ యాత్రలో భాగంగా కొన్ని వేల మైళ్ల వేగంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం, అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడడం, చీకటిగా ఉన్న ఆకాశం, అక్కడ్నుంచి నీలం రంగులో కనిపించే భూమి.. ఇలా ప్రతిదీ మర్చిపోలేని మధురానుభూతే!’ అంటూ తన అంతరిక్ష యాత్ర అనుభవాల్ని గూర్చి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలా తన కుటుంబంలో స్పేస్‌లోకి వెళ్లోచ్చిన తొలి వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె తండ్రి కూడా అంతరిక్ష ఔత్సాహికుడే. అతను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంపై ఆసక్తితో ఎప్పటికైనా స్పేస్ టూర్‌కి వెళ్లాలనుకున్నారాయన. ఆయనకు ఆ అవకాశం 2022లో వచ్చింది. ఆ సమయంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన ‘ఎన్ఎస్-20 మిషన్’లో రోదసీలోకి వెళ్లారాయన. ఇలా తన తండ్రి కల నెరవేరడంతో తానూ అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తిని పెంచుకుంది కిచెన్. (చదవండి: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?) -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్‌ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్‌లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
స్పేస్ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్23న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.ఈ ఏడాది థీమ్ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది Chandrayaan-3 Mission:Updates:The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom— ISRO (@isro) August 23, 2023 -
ఘనంగా ‘స్పేస్ డే’ వేడుకలు
సాక్షి,హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్ర పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విభాగం ఉద్యోగులు రెండ్రోజుల పాటు నేషనల్ స్పేస్డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్ధులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్ని పుస్కరిచుకొని తొమ్మిది పాఠశాలల విద్యార్ధులను ఆహ్వానించారు. వారికి మోడల్ మేకింగ్ పోటీ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలతో సహా అనేక రకాల పోటీలను నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రదర్శించిన వాహనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వాహనంలో స్పేస్‌కి సంబంధించిన కీలక అంశాలను ఇందులో ప్రదర్శించారు. ఎన్ఆర్ఎస్సి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను కోఆర్డినేట్ చేయగా.. విద్యార్థులు, ఎన్ఆర్సీఐ ఉద్యోగులు,యువ సైంటిస్ట్‌లు వీక్షించారు. ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్.విజయ్ విజేతలకు బహుమతులు అందించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు ప్రశంసా పత్రంగా ‘స్పేస్ ఎన్సైక్లోపీడియా’ పుస్తకాలను బహుమతిగా అందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పాపియా బిశ్వాస్,డాక్టర్ సంజయ్ ధాగే, మనీష్ తక్,డాక్టర్ నవీన్, ఎం.చవాన్, ఎన్.అపర్ణరావు,ఎం.ఇళయరాజా, ఎన్.అరుణ,ఎం.ఆర్.రెంజు,రీ డి.రమేష్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్పేస్ అనీమియా అంటే..? సుదీర్ఘకాలం ఉంటే ఏం జరుగుతుంది..?
ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా.. స్పేస్ టూర్ కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5 వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోరీతో కలిసి.. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14 నే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉంది. వారు వెళ్లిన స్టార్ లైనర్స్ లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా అన్ని రోజులు ఉండిపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది..?అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కళ్లు, హృదయనాళ వ్యవస్థ, ఎముకల సాంద్రత, అభిజ్ఞా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకశాం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యోమగాముల డీఎన్ఏ ముప్పు గురించి మాట్లాడుతున్నారు. స్పేస్ రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి అయ్యితే ఎర్ర రక్త కణాలు నాశనమయ్యిపోతాయని చెబుతున్నారు. అంతరిక్షం శరీరంలోని ఎర్ర రక్తకణాలను సెకనుకు మూడు మిలియన్లు చొప్పున నాశనం చేస్తుందట. అంటే ఆరు నెలల అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల శరీరాలు సెకనుకు మూడు మిలియన్లు ఎర్రరక్తకణాలను కోల్పోతుందట. అదే భూమ్మీద సెకను రెండు మిలియన్ల ఎర్ర రక్తకణాలను సృష్టించి, నాశనం చేస్తుందట. అలాగే శరీర ద్రవాల మార్పులు, ఆర్బీసీలలో మార్పులు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల వ్యోమగాములు తమ రక్తనాళాలలో 10% వరకు ద్రవాన్ని కోల్పోతారు. వ్యోమగాములు అతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్తకణాల నాశనం లేదా హిమోలిసిస్ జరుగుతూనే ఉంటుంది. అంతేగాక 1998 నుంచి 2001 జరిపిన అధ్యయనంలో 13 రోజుల మిషన్‌కు వెళ్లిన 14 మంది వ్యోమగాములు రక్త నమునాలను నాసా విశ్లేసించింది. ప్రయోగానికి పది రోజుల ముందు తీసుకున్న రక్త నమునాలతో మిషన్ ల్యాండింగ్ అయిన తర్వాత సేకరించిన రక్త నమునాలలోని తేడాలను గుర్తించినట్లు తెలిపారు. ల్యాండింగ్ అయిన మూడు రోజుల తర్వాత ఫ్రీ-ఫ్లోటింగ్ మైటోకాన్డ్రియల్ డీఎన్ఏ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇది స్పేస్ ప్రయాణానికి ముందు కంటే 355 రెట్లు ఎక్కువని అన్నారు. అందువల్ల డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ప్రమాదకరమని చెప్పారు వైద్యులు. దీనిపై మరింతగా పరిశోధనలు చేస్తే మిషన్ వెళ్లే ముందు, తదనంతరం ఎదురయ్యే ఒత్తిడి, వాపుల నుంచి వ్యోమగాములను రక్షించగలమా..? లేదా? అనేది తెలుస్తుంది. (చదవండి: కంగారు కేర్ గురించి విన్నారా..? తల్లులు తప్పక తెలుసుకోవాల్సింది..!) -
అంతరిక్షం నుంచి అంతుచిక్కని రేడియో సిగ్నల్స్
అంతరిక్షం నుంచి వెలువడుతున్న వింత రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న రేడియో సిగ్నల్స్‌ను గుర్తించారు. మరి వీటి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..రేడియో సిగ్నల్స్ గురించి ఇప్పటికే కొన్ని సిద్దాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కనిపించిన వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తల ముందు మరిన్ని సవాళ్లను ఉంచాయి. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ)రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్ 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగులను విరజిమ్ముతోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి.దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలేబ్ మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండటం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు. దక్షిణాఫ్రికాలోని మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విభిన్న సంకేతాలను ఉత్పత్తి చేస్తున్న రేడియో సిగ్నల్ వెనుక ఏమి ఉందనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుండి వెలువడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిగ్నల్కున్న విచిత్రమైన లక్షణాలు ఇప్పటివరకూ ఉన్న భౌతిక శాస్త్ర వివరణలకు అందని విధంగా ఉన్నాయి.న్యూట్రాన్ నక్షత్రాలు, వైట్ డ్వార్ఫ్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవి రెండూ భారీ నక్షత్రాల నుండి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం . వైట్ డ్వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది న్యూట్రాన్ నక్షత్రం కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాగా అంతరిక్షం నుంచి పునరావృతమయ్యే ఇటువంటి రేడియో సిగ్నల్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరడచం ఇదేమీ మొదటిసారికాదు. కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సిగ్నల్స్‌ను గుర్తించారు. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుండి వచ్చినదా, లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చినదా అనేది మరిన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం సాగిస్తున్నారని డాక్టర్ మనీషా కాలేబ్ తెలిపారు. -
స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు: నిజమెంత?
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(58)తన సహోద్యోగితో కలిసి మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లింది.ఇద్దరూ బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సునీతా విలియమ్స్ స్టార్‌లైనర్ యాత్ర జూన్ 5న ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ద్వారా ఈ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాత్రలో విలియమ్స్‌తో పాటు తన సహచరుడు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. కానీ, వివిధ కారణాల వల్ల బోయింగ్ స్టార్‌లైనర్ విమానానికి పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో జూన్ 14కి తిరిగి రావాల్సిన వారు కాస్తా జూన్ 26కి తిరిగి రావాల్సి వచ్చింది. సుమారు తొమ్మిది రోజులు ఆలస్యం అవ్వడమే గాక ఎక్కువి రోజుోల అంతరిక్షంలో ఉండిపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని పలు ఛానెళ్లు ఊదరగొట్టాయి కూడా. వారంతా అన్నట్టుగానే సునీతా చాలా రోజులు అంతరిక్షంలో ఉండిపోవడంతో ఆస్టియోపోరోసిస్‌కి గురయ్యింది. దీని వల్ల ఎముకలు సాంద్రత కోల్పోతాయి. దీన్ని బోలు ఎముకల వ్యాధి అని కూడా అంటారు. ఇక్కడ ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయేందుకు దారితీస్తుంది. అంటే ఇక్కడ వ్యోమగాములు ఎక్కువ రోజులు స్పేస్‌లో ఉంటే ఆరోగ్య ప్రమాదాల బారిన పడతారనే సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకీ అక్కడ ఎలాంటి ఫుడ్ తింటారు. అది వారికి ఆయా మిషన్లలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దామా..!అంతరిక్షంలో ఆహారంమిషన్లలో వ్యోమగాములను ఫిట్‌గా, చురుగ్గా ఉండేందుకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి మిషన్లలో ఆహారాన్ని నాసా క్షణ్ణంగా విశ్లేషిస్తుంది కూడా. నాసా వ్యోమగాములకు భూమిపై తయారు చేసిన రెసిపీలే ఇస్తారు. అంతేగాదు అంతరిక్ష వాతావరణానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల కలిగిన ఆహారాన్నే సిఫార్సు చేస్తోంది నాసా. ఐతే ఇవన్నీ పొడిగా ఉంటాయి. మంచి నిల్వచేసేలా ప్యాక్ చేస్తారు. రుచి, వాసన, ఆకృతి పరంగా రేట్ చేసి మరి ప్యాక్ చేయడం విశేషం. అలాగే ఫుడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ మెరుగైన అంతరిక్ష ఆహారాన్ని రూపొందించడం కోసం వ్యోమగాముల రేటింగులను ఉపయోగిస్తుందట.ప్రారంభ రోజుల్లో స్పేస్ ఫుడ్నాసా నివేదిక ప్రకారం, ప్రారంభ రోజులలో పూర్తి రోజు భోజనం అవసరం లేదు. తరువాత అంతరిక్ష ఆహారం అభివృద్ధి కావడంతో అల్యూమినియం టూత్‌పేస్ట్-పరిమాణ ట్యూబ్లలో ఎండిన ఆహారాలు, సెమిలిక్విడ్లు అభివృద్ధ చేసింది. అయితే ఈ ఆహారాలు ఆకలిని కలిగించవని చెబుతున్నారు. నాసా ప్రకారం, వ్యోమగాములను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఎనిమిది రకాల స్పేస్ ఫుడ్ ఉన్నాయి. అవేంటంటే..రీహైడ్రేటెడ్ ఫుడ్: నీటిని తొలగించి నిల్వ చేస్తారు. ఈ నిర్జలీకరణ ప్రక్రియని ఫ్రీజ్ డ్రైయింగ్ అని కూడా పిలుస్తారు. అంటే..ఇక్కడ ఆహారం తినే ముందు వాటిలో నీరు భర్తీ చేయడం జరుగుతుంది. థర్మోస్టాబిలైజ్డ్ ఫుడ్: థర్మోస్టాబిలైజ్డ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసినట్లుగా వేడిని సూచిస్తాయి. కాబట్టి వీటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. చాలా పండ్లు, చేపలు (ట్యూనా ఫిష్) క్యాన్లలో థర్మోస్టాబిలైజ్ చేస్తారు. స్థానిక కిరాణా దుకాణంలో కొనుగోలు చేయగల పండ్ల కప్పుల మాదిరిగానే సులభంగా-ఓపెన్ పుల్ ట్యాబ్‌లతో క్యాన్లు తెరవబడతాయి. అలాగే, పుడ్డింగ్లను ప్లాస్టిక్ కప్పులలో ప్యాక్ చేస్తారు.ఇంటర్మీడియట్ తేమ ఆహారం: నాసా ప్రకారం, మృదువైన ఆకృతిని నిర్వహించడానికి తగినంతగా వదిలివేసేటప్పుడు ఉత్పత్తి నుంచి కొంత నీటిని కోల్పోయి ఇంటర్మీడియట్ తేమతో సంరక్షించబడతాయి. ఈ ఆహారాలలో ఎండిన పీచెస్, బేరి, ఆప్రికాట్లు మరియు మాంసం ఉన్నాయి.సహజమైన ఆహారం: ఈ ఆహారాలు సౌకర్యవంతంగా ప్యాక్ చేసి ఉంటాయి. సహజ ఆహారాలలో గింజలు, గ్రానోలా బార్లు, కుకీలు ఉన్నాయి. రేడియేటెడ్ ఫుడ్: మీట్ స్టీక్, స్మోక్డ్ టర్కీ మాత్రమే వికిరణ ఉత్పత్తులు. ఈ ఉత్పత్తులను ఫ్లెక్సిబుల్ ఫాయిల్ పౌచ్‌లలో వండి ప్యాక్ చేస్తారు. అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా క్రిమిరహితం చేస్తారు. తద్వారా వాటిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు.ఘనీభవించిన ఆహారం: పేరు సూచించినట్లుగా, పెద్ద మంచు స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి ఈ ఆహారాలు త్వరగా స్తంభింపజేయబడతాయి. ఇది ఆహారం అసలు ఆకృతిని నిర్వహిస్తుంది. తాజా రుచిని అందిస్తుంది. ఉదాహరణకు, క్విచెస్, క్యాస్రోల్స్ .తాజా ఆహారం: ఈ ఆహారాలు ప్రాసెస్ చేయరు లేదా కృత్రిమంగా సంరక్షించలేం. ఉదాహరణకు ఆపిల్, అరటిపండ్లు.రిఫ్రిజిరేటెడ్ ఫుడ్: ఈ ఆహారాలు చెడిపోకుండా చల్లని ఉష్ణోగ్రతలో స్టోర్ చేస్తారు. అటువంటి ఆహారాలకు ఉదాహరణలు క్రీమ్ చీజ్, సోర్ క్రీం (చదవండి: హైలెట్‌గా వినేష్ ఫోగట్ ఓవర్‌నైట్ వర్కౌట్లు..ఇలా చేస్తే బరువు తగ్గగలమా!) -
టిక్.. టిక్.. టిక్... మిగిలింది 19 రోజులే
వాషింగ్టన్: బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికే (ఐఎస్ఎస్) పరిమితమైన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వారు మరో 19 రోజుల్లో వారం అక్కడి నుంచి బయల్దేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపివేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎందుకీ ఆందోళన? విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత, విల్మోర్ జూన్ 5న ఐఎస్ఎస్కు బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలోనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. సరీ్వస్ మాడ్యూల్లో ఐదు చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్ కంట్రోల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమై జూన్ 13న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్‌లైనర్‌లో వెనక్కు రావాలి. కానీ దానికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయల్దేరలేని పరిస్థితి! మరోవైపు స్పేస్ఎక్స్ ‘క్రూ–9 మిషన్’లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ఐఎస్ఎస్కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. ఐఎస్ఎస్ నుంచి స్టార్‌లైనర్ వెనక్కి వస్తే తప్ప ‘క్రూ–9’ను పంపలేని పరిస్థితి! దాంతో ఏం చేయాలో అర్థంకాక నాసా తల పట్టుకుంటోంది. దీనికి తోడు ఐఎస్ఎస్లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం. స్టార్‌లైనర్ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావొచ్చు. -
Sunita Williams: వచ్చేస్తాగా..!
సాహసం అంటే సునీతకు సరదా! అంతరిక్షంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ... ‘డ్యూటీ’ చేయటం ఆమెకొక విహారం. ఇక స్పేస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా ఆమె వ్యాయామం ఆపలేదు! ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఎక్సర్సైజ్లే అన్నీ. మానసికంగా శక్తినిచ్చే సాధనకు సైతం ఏనాడూ ఆమె విరామం ఇవ్వలేదు. ఆ సాధనే... అనుదిన భగవద్గీత పఠనం. ప్రస్తుతం సునీత ఆ అంతరిక్షంలోనే చిక్కుబడిపోయారు. భూమిపై అందరూ ఆమె కోసం భయాందోళనలు చెందుతూ ఉంటే ఆమె మాత్రం... చిరునవ్వుతో... ‘‘వచ్చేస్తాగా...’’ అని తనే రివర్స్‌లో నాసాకు, భారతీయులకు నమ్మకం ఇస్తున్నారు!సునీతా విలియమ్స్ గత 53 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతను, సహ వ్యోమగామి బచ్ విల్మోర్ను భూకక్ష్యకు 400 కి.మీ ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఐ) విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడికి చేర్చాక చేతులెత్తేసింది. జూన్ 5న వాళ్లు వెళ్లారు. తిరిగి జూన్ 12కి, కనీసం జూన్ 15 కి వారు భూమి పైకి రావలసింది. స్టార్‌లైనర్‌లోని రాకెట్ మోటార్లు (థ్రస్టర్స్) మొరాయించటంతో విల్మోర్తో పాటుగా సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరోవైపు నాసా టీమ్ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా అని ప్రత్యక్షంగా పరీక్షించేందుకు వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. వారు ఎప్పటికి తిరిగొస్తారు అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం లేదు. తాజాగా చిన్న ఆశ మినుకుమంది! థ్రస్టర్స్‌ని మండించి చూసిన నాసాకు అవి పని చేయబోతున్న సంకేతాలు కనిపించాయి. ఇది గుడ్ న్యూస్. నాసాకే కాదు, సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న యావత్భారతావనికి కూడా. ‘‘స్టార్‌లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది’’ అని సునీత భూమి పైకి సందేశం పంపారు. ‘‘ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు’’ అని సహ వ్యోమగామి విల్మోర్ ఆమె గురించి గొప్పగా చె΄్పారు.అంతరిక్షంలో డాన్స్!విల్మోర్ చె΄్పారనే కాదు.. సునీతా విలియమ్స్ గట్టి అమ్మాయి. భూమి మీద ఉండి మనం ఆమె గురించి భయపడుతున్నాం కానీ.. అంతరిక్షంలో ఆమె ఉల్లాసంగా గడుపుతున్నారు. నాసా వారు ఇచ్చిన వీక్ ఆఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతున్నారు కూడా. ఇంకా.. మైక్రో గ్రావిటీలో మొక్కలు నీటిని ఎలా సంగ్రహిస్తాయో సునీత పరీక్షిస్తున్నారు. నిజానికి రోదసీయానం సునీతా విలియమ్స్‌కి ఇదే మొదటిసారి కాదు. 2006లో, 2012లో ఐఎస్ఎస్కి వెళ్లారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం కలిపి 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది కూడా. సునీతకు అంతరిక్ష యాత్ర ఇదే తొలిసారి కాకున్నా.. బోయింగ్ స్టార్ లైనర్‌తో మానవ సహిత యాత్రను నిర్వహించటం నాసాకు మొదటిసారే. కన్నవారి కలకల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లొవేనియా మహిళ. సునీత ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో కొన్నాళ్లు డైవింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. వ్యోమగామి కావాలన్నది మాత్రం తల్లిదండ్రుల కల. ఆ కల నెరవేరటానికి కూడా కారణం అమ్మానాన్నే అంటారు సునీత. సునీత త్వరగా భూమిపైకి తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. -
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!
తినడం అనేది దృష్టి, వాసన, రుచి, వినికిడి స్పర్శతో కూడిన బహుళ-ఇంద్రియ అనుభవం. భూమిపై అద్భుతమైన రుచి కలిగిన ఆహారం కక్ష్యలోకి వెళ్లగానే టేస్ట్ మారిపోతుంది. వ్యోమగాములు తినేందుకు చాలా కష్టపడతారు. అక్కడ భోజనం బోరింగ్‌గా, టేస్ట్ లేకుండా చప్పగా ఉంటుందట. అంతేగాదు తరుచుగా చాలామంది వ్యోమగాములు అంతరిక్షంలో తినే ఆనందం పోతుందని చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక వ్యక్తి వాసన,ఆహార అనుభవాన్ని అంతరిక్ష ప్రయాణం ఎలా ప్రభావితం చేస్తుందని అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన ఫలితాలు భవిష్యత్తులో స్పేస్ మెనూలను రూపొందించడంలో సహాయపడతాయట. ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్ష యాత్రికులు రుచిని భిన్నంగా ఎందుకు అనుభవిస్తారు అనేదానిపై అధ్యయనం చేయగా.. అందుకు కారణం గురత్వాకర్షణ లేకపోవడమని గుర్తించారు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడంతో స్పేస్‌లో ఉండే వ్యోమగాములు శరీరంలోని ద్రవాలు పాదాల వైపుకి గాకుండా రివర్స్‌లో తల వైపుకి ఒత్తడిని చూపిస్తాయి. ఫలితంగా ముక్కు మూసుకపోయిన ఫీలింగ్ వస్తుంది. అచ్చం జలుబు చేసినప్పుడు మనం ఎలా అయితే వాసనను కోల్పోతామో అలా ఉంటుంది మన పరిస్థితి. అందులోనూ అంతరిక్షం మన భూమ్మీద ఉండే పర్యావరణం మాదిరిగా ఉండదు, ఆహారం పట్ల అవగాహనను ఇవ్వగలిగేది కూడా కాదు. పైగా స్పేస్‌క్రాఫ్ట్ పరిమిత పరికరాలతో చుట్టుముట్టబడిన గాలి చొరబడిన కంటైనర్‌లో తినడం తదితర కారణాల వల్ల రుచిగా ఉండదని అంటున్నారు పరిశోధకులు. చెప్పాలంటే మనం ఇంటి వద్ద ప్రశాంతంగా అమ్మ వడ్డిస్తే హాయిగా తింటున్న దానికి..ఆఫీస్‌లో డెస్క్ వద్ద హడావిడిగా తిన్న దానికి చాలా తేడా ఉంటుంది. అలానే ఇది కూడా అని వివరించారు పరిశోధకులు. అందుకోసం అని దాదాపు 54 మందికి భూమ్మీదే వీఆర్ సెటప్ ద్వారా అంతరిక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఆ స్పేస్ వాతారణంలో వివిధ సువాసనలను ఎలా గుర్తిస్తున్నారనేది గమనించారు. అంతరిక్షం లాంటి వాతావరణంలో నిర్దిష్ట సుగంధ సమ్మేళనాలు మాత్రమే విభిన్నంగా గుర్తించబడతాయని అధ్యయనంలో తేలింది. ప్రతిఒక్కరి అభి రుచులు వేరుగా ఉంటాయి కాబట్టి వారందరి అనుభవాల ద్వారా రుచికరంగా భోజనాన్ని ఎలా అందించాలి, వారిని ఇష్టంగా ఎలా తినమని ప్రొత్సహించచ్చో తెలుస్తుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలు భూమిపై నివశించే వ్యక్తులకు, నర్సింగ్ హోమ్‌లో ఉండేవాళ్లకు, ఆర్మీలో ఉండేవాళ్లకు, జలాంతర్గామి సిబ్బందికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమయ్యింది. (చదవండి: అనంత్ రాధికల పెళ్లిలో సందడి చేసిన లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..) -
షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ (దుకాణాలకు సంబంధించి స్థలం)కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎనిమిది ప్రముఖ నగరాల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ 15 శాతం వృద్ధి చెంది 6.12 లక్షల చదరపు అడుగులకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో డిమాండ్ 5.33 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఎనిమిది నగరాల్లోని ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 13.89 లక్షల చదరపు అడుగులుగా ఉందని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ డిమాండ్ 13.31 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రేడ్ ఏ, బి షాపింగ్ మాల్స్, ప్రముఖ వీధుల్లోని రిటైల్ వసతుల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో అద్దెలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రధాన వీధుల్లో మరింత డిమాండ్.. రిటైల్ లీజింగ్‌లో ముఖ్యంగా ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ విభాగం తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నట్టు కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. కొత్త మాల్స్ పరిమితంగా ప్రారంభం కావడం, అధిక నాణ్యత కలిగిన వసతులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. ప్రముఖ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై లీజుకు రిటైలర్లు ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్–జూన్ కాలంలో మొత్తం లీజింగ్‌లో 70 శాతం ప్రధాన వీధులకు సంబంధించే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో గ్రేడ్ ఏ మాల్స్, ప్రధాన వీధుల్లోని (రహదారులపై) రిటైల్ స్పేస్‌కు బలమైన డిమాండ్ కొనసాగింది. దేశీయ రిటైల్ మార్కెట్ చైతన్యాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధాన వీధుల్లో అద్దెలు కూడా చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. గ్రేడ్ ఏ విభాగంలో త్వరలో రానున్న 45 లక్షల చదరపు అడుగుల స్పేస్‌తో మధ్య కాలానికి అద్దెల ధరలు స్థిరతపడతాయని అంచనా వేస్తున్నాం. ఇది డిమాండ్–సరఫరా పరస్థితులను మారుస్తుంది. అయితే, ప్రధాన వీధుల్లో రిటైల్ స్పేస్ లీజు కార్యకలాపాలు ఆరోగ్యకరంగా ఉంటాయన్నది మా అంచనా. లీజింగ్ పరిమాణంలో 53 శాతం వాటా ఆక్రమించే ప్రముఖ బ్రాండ్లు, ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ (ఎఫ్అండ్బీ) బలమైన పనితీరు చూపిస్తుండడం దేశంలో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్ ప్రాధాన్యతను గుర్తు చేస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ హెడ్ సౌరభ్ తెలిపారు. -
నీ రాక కోసం.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీత
సునీతా విలియమ్స్. పరిచయమే అవసరం లేని పేరు. భారత మూలాలున్న ఈ నాసా వ్యోమగామి మరో సహచరునితో కలిసి ఇటీవలే ముచ్చటగా మూడో అంతరిక్ష యాత్ర చేపట్టి మరోసారి వార్తల్లోకెక్కారు. తీరా అంతరిక్ష కేంద్రానికి చేరాక వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుబడిపోయి నెలకు పైగా రోజూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు. వ్యోమ నౌకకు నాసా తలపెట్టిన మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయి, సునీత ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి ఎప్పటికి తెర పడుతుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు...ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత రోదసీ యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ 6న స్టార్‌లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది.నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ (సీఎఫ్‌టీ). షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావుడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యమని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ సమస్యలు ఏమిటి?⇒ స్టార్‌లైనర్ వ్యోమ నౌకలో ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇది పెను సమస్య. దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయిన్‌టెయిన్ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరూ బాగా దెబ్బ తింటుంది. ⇒ దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి.⇒ ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది.⇒ వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలూ బయటపడ్డాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.⇒ ఈ సమస్యలను సరి చేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. నెవెడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి...బోయింగ్ స్టార్‌లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే? సునీత, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా, లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు.ఐఎస్ఎస్లోనే మకాంసునీత, విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు, ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఏడుగురుతో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు.నేను, మీ సునీతను...!అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్ తమ తాజా అంతరిక్ష యాత్ర గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ఉంటుంది. నాసా టీవీ, నాసా యాప్, సంస్థ వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్‌లో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్‌ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని రెడ్ హిల్‌లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్‌లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్‌స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
నిజంగానే ఆకాశానికి నిచ్చెన!
ఆకాశానికి నిచ్చెన వేయటం అనే మాటను మనం చాలా సార్లు యాథాలాపంగా వాడుతూంటాం. ఇప్పుడు జపాన్ దేశం అదే అంశంపై దృష్టి పెట్టింది. అంతరిక్షానికి ఎలివేటర్ నిర్మించే సన్నాహాల్లో ఉంది. అదీ అక్షరాలా వంద బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో. ఈ ఎలివేటర్ ఎలా నిర్మిస్తారు? అసలు అది ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం మీకక్కరలేదు. ఎయిరో స్పేస్ అన్వేషణలో జపాన్ అగ్రగామిగా ఉంది. అలాగే రోబొటిక్స్, బయోమెడికల్ రీసెర్చి, నేచురల్ సైన్స్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి చెందిన ఒబాయషీ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థ ఎలివేటర్ నిర్మాణ బాధ్యతను స్వీకరించింది. దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను ఆ సంస్థ ప్రకటించింది. ‘భూవాతావరణం నుంచి రికార్డు వేగంతో మనుషులను అంతరిక్షంలోకి పంపవచ్చు. అంగారక గ్రహం మీదకు వెళ్లటానికి ఇప్పటి మాదిరిగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అక్కరలేదు. కేవలం 40 రోజుల్లోనే అక్కడకు చేరగలుగుతామని సంస్థ చెబుతోంది. ఇంత పెద్ద భారీ నిర్మాణం చేపట్టటానికి తగినంత స్టీల్ అందుబాటులో లేదు. పైగా వాతావరణంలో ఒత్తిళ్లను తట్టుకోగలిగినంత దృఢత్వం ఉన్న మెటీరియల్ అవసరం అవుతుంది. అందుకే ఒబాయాషీ కార్పొరేషన్ ‘కార్బన్ నానో ట్యూబ్’ లను ఎంచుకుంది. అవి చుట్టచుట్టిన గ్రాఫైట్ లేయర్లు. స్టీలు కంటే గ్రాఫైట్ లేయర్లు తక్కువ బరువు ఉంటాయి. అవి విరిగిపోయే అవకాశాలు తక్కువ. కార్బన్ నానో ట్యూబ్‌ల వ్యాసం మీటరులో బిలియన్ వంతు ఉంటుంది. ఇంత వరకూ ఎవరూ కూడా రెండడుగుల కంటే పెద్ద నానో ట్యూబ్‌ను రూపొందించలేదు. ఇప్పుడు నానో ట్యూబ్‌ల ఆధారంగానే ఎలివేటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.ఎలివేటర్లో నానో ట్యూబ్ 60 వేల మైళ్ల పొడవున ఉంటుంది. వీల్ లిఫ్ట్‌ల ద్వారా అది మనుషులను, సామగ్రిని రవాణా చేయగలుగుతుంది. వాటిని ‘క్లైంబర్స్’గా పిలుస్తారు. భూమి నుంచి 22 వేల మైళ్ల ఎత్తులో స్పేస్ షిప్‌కు కార్బో నానో ట్యూబ్‌ను అమరుస్తారు. థ్రస్టర్ దాని కొసకు జోడించబడుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ భూమికి దూరంగా జరుగుతుంది. సంస్థ వేస్తున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల తర్వాత కార్బన్ నానోట్యూబ్ భూమి ఉపరితలానికి చేరుతుంది. అదే సమయంలో స్పేస్ షిప్ తన తుది గమ్యం 60 వేల మైళ్లకు చేరుకుంటుంది. అది ట్యూబ్‌కి కౌంటర్ వైట్‌గా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబ్ ద్వారా పైకి వెళ్లి కేబుళ్లతో బలోపేతం చేస్తారు. ఇందుకోసం ముందుగా ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ)లో స్పేస్ షిప్ నిర్మిస్తారు. ఇందుకోసం రాకెట్ల ద్వారా నిర్మాణ సామగ్రి పంపుతారు. అక్కడ నుంచి స్పేస్ షిప్ ఎలక్ట్రికల్ ప్రొపల్షన్లను ఉపయోగించుకుని కదులుతుంది. జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జీఈఓ)కు చేరే వరకూ అది కొనసాగుతుంది.భూమి మీద ఎర్త్ పోర్టును రెండు భాగాలుగా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి ఈక్వేటర్ దగ్గర, మరొకటి సముద్రం దగ్గర. ఈ రెండూ సముద్రం దిగువన టన్నెల్‌తో అనుసంధానమయి ఉంటాయి. ఎర్త్ పోర్ట్ నుంచి పైకి పాకేవాళ్లు సుమారు గంటకు 93 మైళ్ల వేగంతో కార్బో నానో ట్యూబ్ అధిరోహిస్తారు. వాళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని రెండున్నర గంటల్లో చేరతారని సంస్థ ప్రకటించింది.జపాన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే, దీనివల్ల తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇందులో ఇంధన వినియోగం లేదు. ఇదంతా సౌరశక్తి ఆధారంగా సాగుతుంది. భారీగా సోలార్ ప్యానళ్లతో జియో స్టేషన్ నిర్మిస్తారు. మానవుల పరంగా కానీ, వాతావారణ పరంగా కానీ ఎలివేటర్లకు ఉండే ముప్పుల గురించి సంస్థ ఇంకా అధ్యయనం చేపట్టలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రారంభం కావాలి. ప్రస్తుతం ఆర్ అండ్ బీ పైనా, పార్ట్నర్షిప్ బిల్డింగ్, ప్రమోషన్లపైనా దృష్టి పెట్టారు. ఇందుకు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక రోజున మానవాళి ఈ ఎలివేటర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెడుతుంది. అందుకు జపాన్ను మనం తప్పకుండా అభినందించి తీరాలి. డా‘‘ పార్థసారథి చిరువోలు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్ బగ్’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(59) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షింతగా అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్‌తో సహా 8 మంది సిబ్బందికి ‘స్పేస్ బగ్’ రూపంలో ఇబ్బంది వచ్చిపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని ‘సూపర్ బగ్’గా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ స్పేస్ బగ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిన ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అంతరిక్ష కేంద్రం.. కదిలే అంతరిక్ష శిధిలాల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఒకరి నుంచి మరోకరి వ్యాపించే ‘స్పేస్ బగ్’ గత కొన్ని ఏళ్ల నుంచి అభివృద్ధి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొటుంన్నారు. వ్యోమగాములు అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్యపరంగా సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం కోసం ‘స్పేస్ బగ్’ ప్రభావాన్ని, ప్రతికూలతలను అంతరిక్ష కేంద్రం త్వరగా అంచనా వేయటం కీలమని పేర్కొంటున్నారు.సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ యూజీన్ బుచ్ విల్మోర్ జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే వారు వారం రోజులు పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి.. అనంతరం భూమిపైకి తిరిగి వస్తారు. -
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
సునీతా విలియమ్స్ అరుదైన ఘనత
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59) అరుదైన ఘనతను సాధించారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్) చేరుకున్నారామె. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISSలో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఐఎస్ఎస్లో వీళ్లిద్దరికీ ఘన స్వాగతం లభించింది. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను సునీత, బుచ్ విల్మోర్లు ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. That feeling when you're back on the station! 🕺@NASA_Astronauts Butch Wilmore and Suni Williams are greeted by the @Space_Station crew after @BoeingSpace #Starliner's first crewed journey from Earth. pic.twitter.com/fewKjIi8u0— NASA (@NASA) June 6, 2024ఐఎస్ఎస్లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఈ విధంగా డ్యాన్స్ చేసి వేడుక చేసుకున్నానని తెలిపారామె. కాగా, బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. స్టార్‌లైనర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్, విల్మోర్. వీళ్లిద్దరూ అక్కడ వారం గడుపుతారు. ఈ యాత్ర ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇవాళ ఉదయం కూడా హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్ఎస్తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్ఎస్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్ సంస్థ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన రైడ్‌షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్ఎక్స్, పీఎస్ఎల్వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది. -
స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
నాసా స్టార్‌లైనర్ క్యాప్సుల్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అవుతున్నట్లు గమనించామని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని నాసా వర్గాలు వెల్లడించాయి.అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, బోయింగ్‌తో కలిసి స్టార్‌లైనర్ క్యాప్యుల్ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు అంతరిక్ష సిబ్బందిని, కార్గోను చేరవేస్తారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొద్దికాలంగా ఈ ప్రయోగం వాయిదా పడుతోంది. మే7న ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రయోగం ప్రారంభంకానున్న కొన్నిగంటల ముందు అట్లాస్ బూస్టర్‌లో సమస్య గుర్తించారు. దాంతో మొదట వాయిదాపడింది. ఈ అట్లాస్ రాకెట్‌ను యునైటెడ్ లాంచ్ అలయన్స్, బోయింగ్‌కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్తంగా తయారుచేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లుఇటీవల అన్ని సమస్యలు పరిష్కరించామని ప్రకటించిన ఇరు సంస్థలు తాజాగా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి హీలియం లీక్ అవ్వడాన్ని గుర్తించారు. దాంతో రెండోసారి ఈ ప్రయోగం పోస్ట్‌పోన్ అవుతున్నట్లు నాసా ప్రకటించింది. ఈ సందర్భంగా నాసా ప్రతినిధులు మాట్లాతుడూ..‘ప్రొపల్షన్ సిస్టమ్‌లో హీలియం లీక్ అయినట్లు గుర్తించాం. సిస్టమ్ పనితీరు, రిడెండెన్సీని అంచనా వేస్తున్నాం. మిషన్ అధికారులు సమస్యను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. తదుపరి ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని చెప్పారు. -
అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగోడు
-
రోదసీలోకి తెలుగు తేజం (ఫొటోలు)
-
అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు
వాషింగ్టన్: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడో హ్యూమన్ ఫ్లైట్ ‘ఎన్–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు. 60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్ మాజీ కెపె్టన్ ఎడ్‌డ్వైట్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ ‘ఎన్–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్డ్వైట్ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు. -
ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్‌హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్‌లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
వసంతపు వెలుగులు
సరిగ్గా సగ భాగం చీకట్లో, మరో సగం ఉదయపు కాంతుల్లో నిండుగా వెలిగిపోతూ కనిపిస్తున్న భూమిని చూస్తున్నారుగా! వసంత విషువత్తు (స్ప్రింగ్ ఈక్వినాక్స్) సందర్భంగా బుధవారం అంతరిక్షం నుంచి భూ గ్రహం ఇలా కని్పంచింది. అచ్చెరువొందించే ఈ ఫొటోను యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ మెటరోలాజికల్ శాటిలైట్స్ (ఈయూఎంఈటీఎస్ఏటీ) విడుదల చేసింది. సంవత్సరంలో రెండు రోజులు భూమిపై రాత్రింబవళ్ల నిడివి సమానంగా ఉంటుంది. ఆ రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఉండటమే ఇందుకు కారణం. వీటినే విషువత్తులుగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. మొదటిదైన వసంత విషువత్తు ఏటా మార్చి 20కి అటూ ఇటుగా వస్తుంది. ఆ రోజుతో ఉత్తరార్ధ గోళం అధికారికంగా శీతాకాలం నుంచి వసంత కాలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడినుంచి ఆ ప్రాంతంలో పగటికాలం, ఉష్ణోగ్రతలు పెరుగుతూ రాత్రుళ్ల నిడివి తగ్గుతూ వస్తాయి. రెండోదైన శరది్వషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) సెపె్టంబర్ 22కు ఇటూ ఇటుగా వస్తుంది. విషువత్తులకు జ్యోతిశ్శాస్త్రంలో చాలా ప్రాధాన్యముంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
కులశేఖరపట్నం నుంచి నేడు ఇస్రో తొలి ప్రయోగం
సూళ్లూరుపేట: ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్ పోర్టును సిద్ధం చేస్తోంది. అక్కడి పోర్టు నుంచి బుధవారం రోహిణి సౌండింగ్ రాకెట్–200ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేయనున్న ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, ఎస్ఎస్ఎల్వీలాంటి చిన్నతరహా రాకెట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది. ఐదారేళ్ల క్రితమే తూర్పుతీర ప్రాంతంలో రెండో స్పేస్ పోర్టు నిర్మించాలనే ఉద్దేశంతో స్థలాన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాగాయలంకను పరిశీలించారు. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం వద్ద భూములను పరిశీలించారు. వెంటనే స్థలసేకరణ జరిపారు. స్పేస్ పోర్టు ఏర్పాటు చేసేటపుడు ముందుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసి అక్కడ గ్రావిటీ పవర్, సముద్రపు వాతావరణం, భూమికి అతితక్కువ దూరంలో వాతావరణంలో తేమలాంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. కులశేఖరపట్నం నుంచి రోహిణి సౌండింగ్–200 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు సూళ్లూరుపేటలోని శ్రీహరికోట సెంటర్ నుంచి 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తరలి వెళ్లారు. -
NASA: సౌర రేడియేషన్‌తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్ స్టార్టప్‌లకు కొత్త జోష్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడంతో స్పేస్ స్టార్టప్‌లకు మరింత ఊతం లభించగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాల తయారీ, అసెంబ్లింగ్ మొదలైన విభాగాల్లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం దక్కగలదని పేర్కొన్నారు. అలాగే, భారతీయ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష రంగ సరఫరా వ్యవస్థల్లో మరింతగా భాగం అయ్యేందుకు కూడా ఇది తోడ్పడగలదని డెలాయిట్ పార్ట్నర్ శ్రీరామ్ అనంతశయనం, నాంగియా ఆండర్సన్ ఇండియా డైరెక్టర్ మయాంక్ ఆరోరా తదితరులు చెప్పారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్రం సడలించిన సంగతి తెలిసిందే. వీటి ప్రకారం ఉపగ్రహాల సబ్–సెక్టార్‌ను మూడు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు. ఉపగ్రహాల తయారీ.. కార్యకలాపాలు, శాటిలైట్ డేటా ఉత్పత్తులు మొదలైన వాటిలో 74 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో, అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. అలాగే, లాంచ్ వెహికల్స్, వాటికి సంబంధించిన సిస్టమ్‌లు మొదలైన వాటిలో 49 శాతం వరకు పెట్టుబడులకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అది దాటితే ప్రభుత్వ ఆమోదం ఉండాలి. శాటిలైట్ల కోసం విడిభాగాలు, సిస్టమ్స్ మొదలైన వాటిలోకి 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంటుంది. గణాంకాల ప్రకారం దేశీయంగా స్పేస్ విభాగంలో దాదాపు 200 పైచిలుకు స్టార్టప్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష ఎకానమీలో భారత ప్రైవేట్ స్పేస్ రంగం వాటా కేవలం రెండు శాతంగా ఉంది. 2040 నాటికి ఇది 10 శాతానికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయి. -
Isro: గగన్‌యాన్..ఇస్రో కీలక అప్డేట్
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో అప్డేట్ ఇచ్చింది. క్రయోజెనిక్ ఇంజిన్ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో దీనిని వాడనున్నారు. ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్వీఎం3 జీ1 లాంచ్ వెహికిల్‌లో వాడేందుకు పరీక్షలు పూర్తయ్యాయి’ఇస్రో అని పేర్కొంది. కాగా, గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను నింగిలో 400 కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలోకి పంపి మళ్లీ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈప్రయోగం ఇస్రో 2030లో చేపట్టనుంది. Mission Gaganyaan: ISRO's CE20 cryogenic engine is now human-rated for Gaganyaan missions. Rigorous testing demonstrates the engine’s mettle. The CE20 engine identified for the first uncrewed flight LVM3 G1 also went through acceptance tests.https://t.co/qx4GGBgZPv pic.twitter.com/UHwEwMsLJK — ISRO (@isro) February 21, 2024 ఇదీ చదవండి.. భావి భారతం గురించి నీకేం తెలుసు -
SPACE DEBRIS: అంతరిక్ష వీధిలో ట్రాఫిక్ జామ్!
అంతరిక్ష వీధి ఉపగ్రహాలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర రాజ్యాలు మొదలుకుని చిన్నాచితకా దేశాల దాకా కొన్నేళ్లుగా ఎడాపెడా ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతున్నాయి. స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రైవేట్ ఏజెన్సీలు కూడా వీటికి తోడయ్యాయి. దాంతో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతూ వస్తోంది. అలా అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది. దాంతోపాటే ఉపగ్రహ సంబంధిత వ్యర్థాల పరిమాణమూ నానాటికీ పెరిగిపోతోంది. ఈ ధోరణి అంతరిక్ష సంస్థలతోపాటు సైంటిస్టులను ఇప్పుడు బాగా కలవరపెడుతోంది... 2023లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలెన్నో తెలుసా? ఏకంగా 2,917! అప్పుడెప్పుడో 1957లో అమెరికా తొలిసారిగా స్పుతి్నక్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి 1987 దాకా 30 ఏళ్లలో జరిగిన మొత్తం అంతరిక్ష ప్రయోగాల కంటే కూడా ఒక్క 2023లో విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యే చాలా ఎక్కువట! ప్రస్తుతం అంతరిక్షంలో ఏకంగా 12,930 ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి! ఇవిగాక అంతరిక్షానికి చేరాక విఫలమైనవి, కొంతకాలం పాటు పని చేసి చేతులెత్తేసినవి, కాలపరిమితి తీరి భూమితో లింకులు తెగిపోయినవి కనీసం 24 వేల పై చిలుకే ఉంటాయట! ఇవన్నీ కూడా భూమి చుట్టూ అలా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తమ్మీద యాక్టివ్ ఉపగ్రహాలు, వ్యర్థాలూ కలిపి 10 సెంటీమీటర్ల కంటే పెద్ద ‘అంతరిక్ష వస్తువుల’ మొత్తం సంఖ్య 2023 చివరికల్లా ఏకంగా 37 వేలు దాటిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి! అంతకంటే చిన్నవాటి సంఖ్యకైతే అయితే లెక్కాపత్రం లేదు. మొత్తమ్మీద అంతరిక్షంలో ఇలాంటి వ్యర్థాల పరిమాణం 2020 చివరికే 8 వేల టన్నులు దాటిపోయిందట! వీటితో ప్రమాదాలెన్నో... ► అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదాలు ఇన్నీ అన్నీ కావు... ► భూ కక్ష్యలో తిరుగుతున్న యాక్టివ్ ఉపగ్రహాలను ఇవి ఢీకొనే ముప్పుంటుంది. అదే జరిగితే అత్యంత వ్యయప్రయాసలతో ప్రయోగించిన ఉపగ్రహాల ఆయువు అర్ధాంతరంగా తీరిపోతుంది. ► 1981లో కాస్మోస్ 1275 ఉపగ్రహం ఇలాగే అంతరిక్ష వ్యర్థాలను ఢీకొని పేలిపోయింది. ► 1996లో ఫ్రాన్స్‌కు చెందిన బుల్లి ఉపగ్రహం సెరీస్ను కూడా 1986లో పేలిపోయిన ఏరియన్ ఉపగ్రహపు శకలాలు ఢీకొన్నాయి. ► 2006లో రష్యా ఉపగ్రహం ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తు తెలియని శకలం దెబ్బకు శాశ్వతంగా మూగబోయింది. ► 2009లో టెరా, 2010లో ఆరా 2013లో జియోస్ వంటి పలు ఉపగ్రహాలు ఇలాగే బుల్లి శకలాల బారినపడ్డాయి. ► 2009లోనైతే 950 కిలోల బరువున్న కాస్మోస్ 2251, 560 కిలోల ఇరీడియం33 ఉపగ్రహాలు పరస్పరం ఢీకొని పేలిపోయాయి. వినువీధిలో రెండు భారీ ఉపగ్రహాలు గుద్దుకోవడం అదే తొలిసారి! ► అంతరిక్ష వ్యర్థాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే కొన్నాళ్లకు భూ దిగువ కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపడమే అసంభవంగా మారవచ్చు. ఐఎస్‌ఎస్‌కూ ముప్పే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు కూడా ఈ వ్యర్థాలతో పెను ముప్పే పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. 2019 నాటికే ఐఎస్ఎస్ను 1,400కు పైగా బుల్లి వ్యర్థాలు ఢీకొట్టాయట. వీటి బారినుంచి కాపాడుకునేందుకు షీల్డింగ్ వ్యవస్థ ఐఎస్ఎస్లో ఉంది. కానీ ఐఎస్ఎస్ తాలూకు బయటి భాగాలకు మాత్రం ఆ రక్షణ లేదు. పైగా వాటిని వ్యర్థాలు ఢీకొనే ముప్పు మరింత ఎక్కువ! వ్యర్థాలు ఢీకొట్టనున్నాయన్న హెచ్చరికలతో ఐఎస్ఎస్ సిబ్బంది ఇప్పటిదాకా మూడుసార్లు సమీపంలోని సూయజ్ క్యాప్సూల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచి్చంది! రోజుకొకటి చొప్పున భూమిపైకి... ► ఈ అంతరిక్ష వ్యర్థాలు కక్ష్య నుంచి జారి క్రమంగా భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తుంటాయి. ► చిన్నవైతే భూమిదాకా చేరకుండానే గాల్లోనే మండిపోతాయి. ► పెద్దవి మాత్రం భూమిపై పడుతుంటాయి. ► అలా గత 50 ఏళ్లుగా సగటున రోజుకు కనీసం మూడు వ్యర్థాలు కక్ష్య కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయట. ► వాటిలో కనీసం ఒక్కటైనా భూమిపై పడుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి! ► ఓజోన్ పొర దెబ్బ తినేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. ► పైగా ఈ వ్యర్థాల దెబ్బకు సౌర తుఫాన్లు, కాస్మిక్ రేడియేషన్ బారినుంచి భూమిని కాపాడే మాగ్నెటోస్పియర్ కూడా దెబ్బ తింటోందని తాజా అధ్యయనంలో తేలింది. ► ఈ అంతరిక్ష వ్యర్థాల కట్టడికి ఇప్పటిదాకానైతే అంతర్జాతీయంగా ఎలాంటి చట్టం గానీ, దేశాల మధ్య ఒప్పందాలు గానీ లేవు. ► అయితే ఈ దిశగా ఐరాస తాలూకు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్ కమిటీ 2007లో కొన్ని నిర్దేశాలు రూపొందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి
అవరోహణలో అదుపు తప్పి వేగంగా కిందికి దూసుకెళ్లలేదు. పట్టు తప్పి ధడేల్మని పడిపోలేదు. కూలిపోలేదు... ధ్వంసమవలేదు. చంద్రుడి ఉపరితలంపై దిగడానికైతే సాఫీగానే దిగింది ‘స్లిమ్’ ల్యాండర్. కానీ... తూలిపోయింది! తన ఐదు కాళ్లపై తాను సొంతంగా నిలబడలేకపోయింది. స్వతంత్రంగా నిలదొక్కుకోలేకపోయింది. షియోలీ బిలం వాలులో కిందికి దిగగానే దొర్లి తల కిందికి పెట్టి కాళ్లు పైకెత్తింది. శీర్షాసనం భంగిమలో ఉండిపోయింది. ‘మూన్ స్నైపర్’ దిగీ దిగగానే నెమ్మదిగా పూవు రెక్కల్లా విచ్చుకుని ఆకాశంలోని సూర్యుడిని చూస్తూ కరెంటు తయారుచేసి శక్తినివ్వాల్సిన ల్యాండర్ పై భాగంలోని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్).. ల్యాండర్ తలకిందులవటంతో జాబిలి నేలవైపు ఉండిపోయాయ్. సౌరశక్తి అందే మార్గం మూసుకుపోయింది. ఇక.. ‘స్లిమ్’ ల్యాండరులోని ఆన్‌బోర్డ్ (ఇన్ బిల్ట్) బ్యాటరీ కొన్ని గంటలు పనిచేసి ఈపాటికి ‘డెడ్’ అయివుంటుంది. ‘మూన్ స్నైపర్’ తనంతట తాను పైకి లేచి నిటారుగా నిలబడే ఏర్పాటు, అవకాశం లేవు. అంటే... పవర్ కోల్పోయిన ల్యాండర్ ఈసరికే మూగబోయి శాశ్వత నిద్రలోకి జారుకుని వుంటుంది. మిషన్ కథ ఇక ఇక్కడితో పరిసమాప్తం. జపాన్ సాధించింది పరిపూర్ణ విజయమా? పాక్షిక విజయమా? కనీస విజయమా? అని ప్రశ్న వేసుకుంటే... అది తన ప్రయత్నంలో విఫలం మాత్రం కాలేదనే చెప్పాలి. తమ ‘స్లిమ్’ వ్యోమనౌక అధ్యాయం ముగిసిందనే వార్తను జపాన్ అంతరిక్ష సంస్థ ఈ రోజు కాకపోతే రేపైనా, కొంచెం ఆలస్యంగానైనా అటు స్వదేశంలోనూ, ఇటు బాహ్య ప్రపంచానికి అధికారికంగా ప్రకటించాల్సివుంటుంది. సరిగ్గా తన ల్యాండింగ్ సమయంలో చంద్రుడి మీదికి ‘మూన్ స్నైపర్’ జారవిడిచిన రెండు (LEV-1 & 2) లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్స్... భూమికి ఏం సమాచారం ప్రసారం చేశాయో పరిశీలించాల్సివుంది. దిగేటప్పుడు ల్యాండరును ఈ జంట రోవర్లు తీసిన చిత్రాలు, వీడియో వెల్లడికావలసివుంది. జంట రోవర్లు పంపిన డేటాను ప్రాసెస్ చేశాక ‘జాక్సా’ ఏం చెబుతుందో వేచిచూద్దాం. -జమ్ముల శ్రీకాంత్ చదవండి: అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు! -
గురి తప్పని జపాన్. బుల్లెట్ దింపిన మూన్ ‘స్నైపర్’!
టోక్యో: తమ మానవరహిత అంతరిక్ష నౌక చంద్రమండలంపై దిగిందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటల సమయంలో దిగిందని పేర్కొంది. తాజా విజయంతో చంద్రుడిపైకి విజయవంతంగా అంతరిక్ష నౌకను పంపిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది. అయితే.. ఆపరేషన్ సక్సెస్... కానీ పేషెంట్ డెడ్? చంద్రుడిపై సాఫీగానే దిగిన జపాన్ ‘మూన్ స్నైపర్’. భూమ్మీది గ్రౌండ్ స్టేషనుతో సంబంధాలూ బాగానే ఉన్నాయ్. చావు కబురు చల్లగా తెలిసిందేమంటే... ల్యాండరులోని సౌరఘటాలు (సౌరఫలకాలు/సోలార్ ప్యానెల్స్) పనిచేయడం లేదట. అవి విద్యుదుత్పత్తి చేయడం లేదట. ప్రస్తుతం ‘స్లిమ్’ తన సొంత బ్యాటరీపైనే ఆధారపడుతోంది. ల్యాండర్ డేటా భూమికి ప్రసారమయ్యేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ‘జాక్సా’ సిబ్బంది. ‘స్లిమ్’ సొంత బ్యాటరీలో శక్తి అయిపోతే, ఈలోగా సౌరవిద్యుత్ అందుబాటులోకి రాకుంటే... ల్యాండర్ చెల్లుకున్నట్టే! మిషన్ సఫలమా? విఫలమా? అనే విషయం పక్కనపెడితే... ‘మూన్ స్నైపర్’ ల్యాండింగులో జపాన్ వాడిని మెచ్చుకుని తీరాల్సిన అంశం ఒకటుంది. “రాజీపడి ఎక్కడపడితే అక్కడో, సులభంగా ఎక్కడో ఒకచోటనో దింపే టైపు కాదు జపాన్ వాడు. ఎక్కడ దిగాలనుకుంటాడో వాడు అక్కడే దిగుతాడు”. సాధారణంగా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు శాస్త్రవేత్తలు ముందుగా నిర్దేశించిన ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్ల వైశాల్యంలో వీలునుబట్టి, సురక్షితం అనుకున్న ఎక్కడో ఒకచోట దిగుతాయి. మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండరుకు సైతం ఇస్రో 4 కి.మీ. X 2.4 కి.మీ. విస్తీర్ణమున్న ప్రదేశాన్ని ఎంపిక చేసింది. అంటే... అంత పెద్ద ఏరియాలో అది ఎక్కడో ఒకచోట దిగిందన్నమాట. కానీ ఇప్పుడు జపాన్ అలా కాదు. చుక్కపెట్టి గురి తప్పకుండా కొట్టింది. చంద్రుడిపై జపాన్ కేవలం 100 మీటర్ల వ్యాసంతో ఓ గిరి గీసింది. కచ్చితంగా అదే గిరిలో ల్యాండరును క్షేమంగా దింపింది. ఇదే ప్రెసిషన్ ల్యాండింగ్. పిన్ పాయింట్ ల్యాండింగ్. అంతరిక్షంలో ఇలాంటివి అనితర సాధ్యం. ప్రపంచవ్యాప్త వార్తాసంస్థలు, ఇతర పత్రికలు మనకేల? తమ అంతరిక్ష విజయం గురించి అని పట్టించుకోకపోపయినా.. ‘The Japan Times’ పత్రిక ఏం రాసిందో చూద్దాం. చంద్రుడి ఉపరితలంపై దిగేటప్పుడు జపాన్ ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ ఏమీ దెబ్బతినలేదు. కనుక... బహుశా దాని సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) సైతం పాడవకుండా భేషుగ్గానే ఉండి ఉంటాయి. కాకపోతే... తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల సౌరశక్తిని వ్యోమనౌక వినియోగించుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డ్ బ్యాటరీపై అది ఆధారపడుతోంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఆ బ్యాటరీ పవర్ అందించగలదు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఓ ఆశ మిణుకుమిణుకుమంటోంది! ‘మూన్ స్నైపర్’ సౌర ఫలకాలు సూర్యుడి దిశగా లేవని ‘జాక్సా’ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడి దిశ (కోణం) మారగానే అవి సౌర విద్యుత్ తయారు చేస్తాయనేది వారి వాదన. ఒకసారి సోలార్ ప్యానెల్స్ సరిగా పని చేయడమంటూ మొదలైతే ల్యాండర్ కొన్ని రోజులపాటు జీవించి అప్పగించిన విధులు నిర్వర్తిస్తుంది. అనంతరం కొన్ని రోజులకు సోలార్ ప్యానెల్స్ పాడవుతాయి. ఎందుకంటే... చంద్రుడిపై పగటి వేళలో నమోదయ్యే 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు అవి క్రమంగా నాశనమవుతాయి. ఏదేమైనా ఈ ల్యాండింగ్ జపాన్ అంతరిక్ష కార్యక్రమానికి గొప్ప ఊపు, ఉత్తేజాలనిచ్చింది. -జమ్ముల శ్రీకాంత్ -
'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం!
అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్‌లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. పైగా భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. ఇలా స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం కష్టంగా ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు పలుపరిశోధనలే చేశారు. ఆ సమస్యకు చెక్ పెడుతూ ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఉండేలా మంచి ఆహారాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఆ ఆహారం ప్రత్యేకత ఏంటీ? తదితర విశేషాలు తెలుసుకుందాం!. స్పేస్ ట్రావెలర్స్ అంతరిక్షంలో అన్ని రోజులు ఉంటే వారి ఆరోగ్యంపై పలు ప్రభావాలు ఉంటాయని విన్నాం. అయితే ఇప్పటి వరకు వారికి సరైన ఆహారం అందించడంలో శాస్త్రవేత్తలు విఫలమవుతూ వస్తున్నారు. ఇంతవరకు వారికి ప్రిజర్వేటడ్ ప్యాక్ చేసిన ఆహారాలను మాత్రమే ఇస్తున్నారు. అయితే అవి స్పేస్‌లోకి వెళ్లాక చప్పగా అయిపోవడం జరగుతోంది. దీంతో ఈ వ్యోమగాములకు సరైన పోషకాలతో కూడిన ఆహారం అందక పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఆ సమస్యకు చెక్‌పెడుతూ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ "ఆప్టిమల్ స్పేస్ మీల్" అనే శాఖాహార సలాడ్ని కనిపెట్టింది. ఇది అక్కడ ఉండే వ్యోమగాములకు అన్ని రకాల పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. నిజానికి స్పేస్‌లో ఉండే వ్యోమగాములకు భూమిపై ఉండే మానువుల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. జీరో మైక్రోగ్రావిటీలో ఎక్కువ సేపు గడుపుతారు కాబట్టి వారికి కాల్షియం వంటి అదనపు సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. వారికీ ఈ ప్రత్యేకమైన ఫుడ్ ఆ లోటుని భర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్ మిషన్‌లో ఉండేవారికి మంచి ఆహారాన్ని అందించేలా నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భోజనాన్ని తయారు చేశారు. దీనిలో తాజా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వారికి అందించే శాకాహార పంటలను తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండించాలని అన్నారు. పరిశోధకులు ఈ "స్పేస్ మీల్"ని సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి వాటితో తయారు చేశారు. ఈ శాకాహార భోజనంతో వ్యోమగాములకు గరిష్ట పోషాకాలు అందడమే గాక సమర్థవంతమైన సమతుల్య ఆహారమని చెబుతున్నారు పరిశోధకులు. ఈ భోజనాన్ని భూమిపై ఉన్న వారికి ఇవ్వగా చక్కటి ఫలితం వచ్చిందని అన్నారు. అందువల్ల స్పేస్‌లో ఉండే వారికి ఇది మంచి మీల్ అని నమ్మకంగా చెప్పొచ్చు అని అన్నారు. (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్‌సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్‌కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్‌ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్‌సెల్‌ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్‌గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్‌పోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్‌రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్‌రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్‌పీఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Roundup 2023: దూసుకెళ్లిన ఇస్రో
సాక్షి, న్యూఢిల్లీ : 2023కి గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది. పాత జ్ఞాపకాలను తనలో దాచుకుని.. కొత్త ఏడాది వైపు వేగంగా పరుగులు తీస్తోంది టైమ్ మెషీన్. 2023లో భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ సరికొత్త శిఖరాలను అందుకుంది భారత్. ఘనమైన విజయాలతో.. ఇస్రో గగన ప్రయాణంలో అత్యంత ప్రత్యేకంగా నిలిచిందీ సంవత్సరం. 2023 సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఒక మైలురాయి. అందని చందమామను అందుకోవడమే కాదు అనేక కీలక అచీవ్‌మెంట్స్‌ను ఖాతాలో వేసుకుంది ఇస్రో. ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఒకప్పుడు చిన్నచూపు చూసిన నాసా లాంటి సంస్థలు..కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపేలా అంతరిక్ష పరిశోధనల్లో సత్తా చాటింది. భారత ప్రభుత్వం..1969లో ఇస్రోను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో అనేక అపజయాలు, అపహాస్యాలు చూసిందీ సంస్థ. నిధుల్లేక ప్రయోగాలు నిలిచిపోయిన ఉదంతాలెన్నో. అలాంటి పరిస్థితి నుంచి వరుస విజయాలు, కీలక మైలురాళ్లతో స్పేస్ సెక్టార్లో ఉవ్వెత్తున ఎగసింది ఇస్రో. ఈ గగన విజయంలో 2023 ఏడాది అత్యంత కీలకం. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో తనదైన స్టైల్లో సత్తా చాటింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటివరకు ఎవరికి సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంచలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోకు.. 2023 బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ప్రయోగాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడంతోపాటు గొప్ప గొప్ప రికార్డులు ఇస్రో అకౌంట్లో పడ్డాయి. చంద్రయాన్ - 2 పాక్షిక విజయంతో 2019లో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. 2023లో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతరిక్ష దిగ్గజాలుగా పేరొందిన దేశాలకు సైతం అందని ద్రాక్షగా మిగిలిపోయిన చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసి.. ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా.. సౌత్ పోల్‌పై ల్యాండింగ్ చేయలేక పోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం, అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఇస్రో. ఇక చంద్రయాన్ - 3 విజయయోత్సాహంలో ఉన్న ఇస్రో.. నెలల వ్యవధిలోనే మరో చరిత్రాత్మక ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ 1ను నింగిలోకి పంపింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. 2023లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. అన్నీ ఘనవిజయాలే. అందుకే ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 ఏడాది చాలా ప్రత్యేకంగా మారింది. PSLV, GSLV, LVM3 లాంటి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న లాంచ్ వెహికల్స్ భారత్ వద్ద ఉన్నాయి. ఇక చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV రూపొందించింది ఇస్రో. 2022లోనే దీన్ని ప్రయోగించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది ఇస్రో. ఇస్రో పరిశోధనలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా దీనిపై దృష్టిపెట్టింది. ఇన్‌స్పేస్ ద్వారా స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ వ్యక్తులకు తలుపులు తెరిచిన మోదీ సర్కార్.. ఆ దిశగా కీలక పురోగతి సాధిస్తోంది. ఇతర దేశాల శాటిలైట్లను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది ఇస్రో. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇప్పటివరకు 4వేలకోట్లకుపైగా సంపాదించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే స్పేస్‌టెక్ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేస్తోంది ఇస్రో. ఇప్పటికే మనవద్ద 200కి పైగా స్టార్టప్ కంపెనీలు స్పేస్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2023 విజయాల స్ఫూర్తితో భవిష్యత్ లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకుంది ఇస్రో. 2025 ప్రారంభంలో గగన్‌యాన్ మిషన్ చేపట్టనుంది. మానవరూప మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని సంబంధించి.. గగన్‌యాన్ ఫ్లైట్ టెస్ట్, క్రూ మాడ్యూల్ టెస్టులను ఇటీవలే విజయవంతంగా పూర్తిచేసింది. అలాగే వచ్చే నాలుగేళ్లలో చంద్రయాన్ -4 చేపట్టి.. చంద్రుడిపై నుంచి శిలలు భూమిపైకి తెచ్చే శాంపిల్ రిటర్న్ మిషన్‌కు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోవడంతోపాటు 2040లో చంద్రుడిపైకి మనిషిని పంపాలని ఇస్రోకు బిగ్ టార్గెట్స్ ఇచ్చారు ప్రధాని మోదీ. మరోవైపు 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ మిషన్.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని పేర్కొంటున్నాయి ఇస్రో వర్గాలు. మొత్తానికి 2023 సంవత్సరం భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఇది మరింత ముందుకు సాగాలని.. ఇస్రో సమున్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు దేశ ప్రజలు. ఇదీచదవండి..చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ -
దివిలో దివ్యంగా క్రిస్మస్ ట్రీ!
ఆకాశం అనే కాన్వాస్ అద్భుత చిత్రాలకు వేదిక. తాజా అద్భుతం విషయానికి వస్తే... అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘నాసా’ ఒక చిత్రాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. నాసా వారి ‘చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ’ కాప్చర్ చేసిన ఈ ఫోటోలో అంతరిక్షంలో క్రిస్మస్ ట్రీ కనువిందు చేస్తోంది. భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర సమూహం తాలూకు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కాంతి క్రిస్మన్ టీ ఆకారంలో దర్శనమిస్తోంది. పాలపుంత లోపల ఉన్న ఈ నక్షత్ర సమూహాన్ని ‘ఎన్జీసీ 2264’ అని పిలుస్తారు. దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ బెంగళూరులో ఉంది. వంద అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్రిస్మస్ చెట్టు సబ్రీ నగర్‌లోని ‘ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా’ పరిసరాల్లో ఉంది. ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా మారింది. మరో విశేషం ఏమిటంటే మూడుసార్లు గ్రామీ అవార్డ్ గెలుచుకున్న మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ ఈ ట్రీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా లైవ్ మ్యూజిక్ షో చేశాడు. బెంగళూరులో దేశంలోనే పెద్దదైన క్రిస్మస్ ట్రీ -
మన ఆస్ట్రోశాట్ గ్రేట్!
అంతరిక్షంలో జరిగిన అతి శక్తిమంతమైన గామా కిరణ పేలుడు (గామా రే బరస్ట్–జీఆర్బీ)ను ఇస్రో ఆస్ట్రోశాట్ టెలిస్కోప్ తాజాగా మరోసారి గుర్తించింది. జీఆర్బీ 231122బి గా పిలుస్తున్న ఇది ఆస్ట్రోశాట్ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఆర్బీలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారి తీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకన్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ జీఆర్బీల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. ఈ పేలుళ్లను లోతుగా అధ్యయనం చేయగలిగితే విశ్వచాలనాన్ని నియంత్రించే మౌలిక భౌతిక నియమాలను మరింతగా అర్థం చేసుకునే ఆస్కారముంటుంది. దుమ్ము రేపుతున్న ఆస్ట్రోశాట్ 2015 సెపె్టంబర్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన తొలి మల్టీ వేవ్ లెంగ్త్ అంతరిక్ష టెలిస్కోపే ఆస్ట్రోశాట్. నాటినుంచి భారత అంతరిక్ష పరిశోధనలకు మూలస్తంభంగా నిలిచింది. ఇది గరిష్టంగా ఐదేళ్ల పాటు పని చేస్తుందని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ అద్భుతంగా పని చేస్తూ ఇస్రో సామర్థ్యానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది. అంతరిక్షంలో సంభవించే అరుదైన దృగ్విషయాలైన గామా పేలుళ్లను ఆస్ట్రోశాట్ ఇట్టే ఒడిసిపడుతూ పలు అంతర్జాతీయ పరిశోధనలకు ఆలంబనగా నిలిచింది. అదిప్పటిదాకా ఏకంగా 600 జీఆర్బీలను గుర్తించడం నిజంగా గొప్ప విషయమేనని నాసా సైంటిస్టులు అంటున్నారు. ఆస్ట్రోశాట్‌లోని కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ (సీజెడ్‌టీఐ)దే ఈ ఘనతలో ప్రధాన పాత్ర అని ఐఐటీ బాంబే పరిశోధకులు వివరించారు. హై ఎనర్జీ, వైడ్ ఫీల్డ్ ఇమేజింగ్ సీజెడ్‌టీఐ ప్రత్యేకత. త్వరలో తెరపైకి ‘దక్ష’... ఆస్ట్రోశాట్ సాధిస్తున్న ఘనతలు నిజంగా సాటిలేనివని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ వరుణ్ భలేరావ్ అన్నారు. ఈ స్ఫూర్తితో అంతరక్ష రంగంలో ఇస్రో కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అత్యాధునిక జీఆర్బీ టెలిస్కోప్ దక్షను తయారు చేయనున్నట్టు వెల్లడించారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు సంయుక్తంగా ఈ మిషన్‌లో పాల్గొంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని జీఆర్బీ టెలిస్కోప్ల్లోకెల్లా దక్ష అత్యంత అధునాతనంగా ఉండనుందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ..
తిరువనంతపురం: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ.3.30 లక్షల కోట్ల)కు చేరుకోనుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఏకేడీ వంటి కొన్ని విదేశీ సంస్థలైతే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు కూడా చేరుకోవచ్చని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇది ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఒక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విభాగంలో యూరప్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మరో 180 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించగలిగామని శనివారం ఆయన పీటీఐకి చెప్పారు. నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, అనుసంధాన్‌ను నెలకొల్పాక అంతరిక్ష పరిశ్రమల ఏర్పాటు వేగంపుంజుకుందని తెలిపారు. -
అంతరిక్ష పర్యాటకం! అక్కడే విందు విలాసం..!
అంతరిక్ష పర్యాటకం ఇటీవలి కాలంలోనే మొదలైన ధోరణి. సంపన్న పర్యాటకులను భూమికి సుదూరంగా వ్యోమసీమలో విహారయాత్రలకు తీసుకుపోయేందుకు పలు అంతరిక్ష పర్యాటక సంస్థలు పోటాపోటీగా విలాసాలను కల్పిస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన అంతరిక్ష పర్యాటక సంస్థ ‘జెఫాల్టో’ అంతరిక్ష పర్యాటకుల కోసం వ్యోమసీమలో విందువిలాసాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘జెఫాల్టో’ సంస్థ తన పర్యాటకులను బెలూన్ ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకుపోనుంది. ఇది భూమికి 25 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించనుంది. అంతరిక్షంలోకి చేరుకోగానే, బెలూన్‌లోనే పర్యాటకులకు విందు ఏర్పాటు చేయనుంది. పర్యాటకులు అంతరిక్షం నుంచి భూమిని తిలకిస్తూ విందు ఆరగించవచ్చు. తొలుత ఈ యాత్రను 2025లో ప్రారంభించాలని తలపెట్టినా, పర్యాటకుల నుంచి స్పందన బాగుండటంతో 2024 చివర్లోనే ఈ యాత్రను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ‘జెఫాల్టో’ తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు యాత్రికులను అంతరిక్షానికి తీసుకుపోవడానికి బుకింగ్‌లు ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టిన సంస్థలేవీ తమ యాత్రికులకు అంతరిక్షంలో విందువిలాసాలను కల్పించలేదు. ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న తొలి సంస్థగా ‘జెఫాల్టో’ రికార్డులకెక్కనుంది. ఈ యాత్రకు వెళ్లడానికి టికెట్టు ధర 1.20 లక్షల యూరోలు (రూ.1.07 కోట్లు) మాత్రమే! (చదవండి: దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు !) -
ఇంఫాల్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం
ఇంఫాల్: గగనతలంలో డ్రోన్లు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్‌వే పరిసరాల్లో ఎగురుతూ కని్పంచినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. విమానాల రాకపోకలను కూడా నిలిపేశారు. రెండు విమానాలను దారి మళ్లించగా అక్కణ్నుంచి బయల్దేరాల్సిన మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. మూడు గంటల విరామం అనంతరం సేవలను పునరుద్ధరించారు. తూర్పున మయన్మార్‌తో మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. -
అంతరిక్షంలోకి స్నేక్ రోబో.. నాసా ఆవిష్కరణలో భారత మేధస్సు
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త రోబోను తయారుచేసింది. చంద్రుడు, అంగారక గ్రహంపై జీవం పుట్టుక ఆనవాళ్లను పసిగట్టడానికి ఈ రోబో ఉపయోగపడనుంది. సరిగ్గా పాములాగే కనిపించే ఈ రోబో ఎలాంటి ప్రతికూల ప్రదేశాలకైన ప్రయాణించగలదు. అయితే.. దీని తయారీ వెనక ఓ భారతీయ కుర్రాడి ప్రతిభ దాగి ఉంది. నాగ్‌పుర్‌లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రోహణ్ టక్కర్ నాసాలో పనిచేస్తున్నారు. ‘ఎగ్జోబయోలజీ ఎక్స్టంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్)’ పేరుతో పిలుస్తున్న ఈ రోబోను టక్కర్ కనిపెట్టాడు. పైథాన్‌లా ప్రయాణించే ఈ రోబో ఎలాంటి గరుకైన ప్రదేశాలకైన వెళ్లగలదు. కొండలు, గుహల్లోనూ సునాయసంగా ప్రయాణించగలదు. ఇతర గ్రహాలపైనా జీవం పుట్టుకను కూడా ఇది అన్వేషించగలదు. విపత్తు నిర్వహణల్లోనూ ఇది ఉపయోగపడనుంది. నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన టక్కర్.. నాసా కోసం మార్టిన్ హెలికాప్టర్‌ను రూపొందించారు. ఐఐటీ చదివిన బాబ్ బలరామ్ నుండి ప్రేరణ పొందినట్లు పంచుకున్నారు. తను ఐఐటీ సాధించడంలో విఫలమయ్యానని అయినప్పటికీ నాసాలో విజయం సాధించానని చెప్పారు. చంద్రయాన్ 3 విజయం భారత్‌కు గర్వకారణం అని అన్నారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్‌వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్‌వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్‌తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్‌లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్‌లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్‌లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్‌కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్‌లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ స్పేస్‌లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్‌లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
టీడీపీ నేతల గ‘లీజు’ దందా
చిత్తూరు అర్బన్: మునిసిపల్ స్థలాన్ని కొట్టేసేందుకు బినామీ పేరుతో టీడీపీ నేతలు సాగించిన గలీజు దందాకు అడ్డుకట్ట పడింది. మంగళవారం చిత్తూరులోని ఎంఎస్ఆర్ మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ కమిషనర్ అరుణ, అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 2016లో చిత్తూరుకు చెందిన టీడీపీ కార్పొరేటర్, ఓ క్రియాశీలక నేత.. జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న మునిసిపల్ ఖాళీ స్థలంపై కన్నేశారు. ఇందులో భాగంగా కమలహాసన్ అనే వ్యక్తి పేరుతో అప్పటి మేయర్‌కు లేఖ రాశారు. తనకు ఎలాంటి ఆసరా లేదని, మునిసిపల్ స్థలం లీజుకు ఇస్తే బతుకుదెరువు చూసుకుంటానని అందులో పేర్కొన్నారు. ఆ వెంటనే మునిసిపల్ కౌన్సిల్ రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఏటా రూ.15 వేలు చెల్లించేలా మూడేళ్ల పాటు లీజుకిచ్చింది. ఆ వెంటనే టీడీపీ నేతలు చిత్తూరులోని ఎంఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పరిధిలో.. ఏడు దుకాణాలు నిర్మించారు. వాటిని ఏటా రూ.70 వేల వరకు అద్దెలకు ఇచ్చారు. అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారు. మూడేళ్ల లీజు పూర్తయినా స్థలాన్ని మునిసిపాలిటీకు అప్పగించకుండా రూ.లక్షలు దండుకున్నారు. ఇదే సమయంలో లీజు పొడిగించాలంటూ హైకోర్టుకు వెళ్లగా.. కొన్నాళ్ల పాటు స్టే ఇచ్చింది. తాజాగా న్యాయస్థానం స్టేను డిస్మిస్ చేయడంతో రూ.కోట్ల విలువైన స్థలాన్ని, వాణిజ్య సముదాయాన్ని మునిసిపల్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
శాట్‌కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్
Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్ నుంచి వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనుమతి కోరింది. వన్‌వెబ్, జియో శాటిలైట్, ఎలాన్‌మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌లింక్ వంటి ప్రాజెక్ట్లకోవలోకి అమెజాన్ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్‌లింక్ జీఎంపీసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్‌వెబ్ ఈ జీఎంపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్స్టెలేషన్ ఆపరేటర్లకు వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు. అయితే కంపెనీలు ఇన్‌స్పేస్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. -
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
గగన్‌యాన్‌లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్‌ల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్–1(టీవీ–డీ1)ను ప్రయోగించనుంది. మానవ రహిత ప్రయోగాలతో సామర్థ్య నిర్ధారణ చేస్తే మానవసహిత ప్రయోగాలకు సోపానం కానున్నాయి. గగన్‌యాన్ మిషన్‌లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను తిరిగి భూమిపైకి సురక్షితంగా దిగడానికి క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుంది. డీవీ–డీ1ను ప్రయోగించడంలో పీడన రహిత క్రూ మాడ్యుల్ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్ వ్యవస్థలతో కూడిన పేలోడ్లను రాకెట్ సా యంతో నింగిలోకి ప్రయోగిస్తారు. తిరిగి వ చ్చినప్పుడు భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో వ్యోమనౌక నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. అక్కడ్నుంచి వ్యోమగాములు పారాచూట్ల సాయంతో శ్రీహరి కోటకు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళఖాతం తీరంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. ఎల్వీఎం3 రాకె ట్ ద్వారా మొదటిసారిగా క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి దానిని మళ్లీ బంగాళాఖాతంలోకి సురక్షితంగా దించే ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత నావికా దళం సాయంతో క్రూ మాడ్యుల్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. గగన్‌యాన్ సన్నద్ధతలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన ఘట్టంగా ఇస్రో పేర్కొంది. -
ఆ తార అస్తమయం వెనక...!
అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్6946– బీహెచ్1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది! మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. కృష్ణబిలం మింగింది.. కాదు... ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది. బీహెచ్1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్ వెబ్ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా
వాషింగ్టన్: అంతరిక్షంలో చెత్తను వదిలేసినందుకు డిష్ నెట్వర్క్ కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) 1,50,000 డాలర్ల(రూ.1.24 కోట్లు) జరిమానా విధించింది. అంతరిక్షంలో ప్రమాదకరమైన చెత్త వదిలినందుకు ఇలా జరిమానా విధించడం అమెరికాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. డిష్ నెట్వర్క్ కంపెనీ 2002లో ఎకోస్టార్–7 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేరుకున్న ఈ ఉపగ్రహం కాలపరిమితి 2022లో ముగిసింది. నిరుపయోగంగా మారిన ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి 299 కిలోమీటర్ల దూరం పంపించాల్సి ఉంది. 122 కిలోమీటర్లు వెళ్లాక ఇంధనం నిండుకోవడంతో అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం భూమిచుట్టూ పరిభ్రమిస్తోంది. ఇతర ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారింది. అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలను చెత్తగానే పరిగణిస్తారు. 1957 నుంచి ఇప్పటిదాకా 10 వేలకుపైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించారు. వీటిలో సగం శాటిలైట్లు పనిచేయడం లేదు. -
అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు?
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు వేడివేడి కాఫీని ఎలా తాగుతారో చూపించారు. వీడియోలో క్రిస్టోఫోరెట్టి ఒక ప్యాకెట్లోని కాఫీని ఒకచిన్న బాటిల్లో పోయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తారు. అయితే గురుత్వాకర్షణలేమి కారణంగా కాఫీ బయటకు రాదు. ఆ తర్వాత ఆమె ప్రత్యేకంగా రూపొందించిన ‘స్పేస్ కప్’ను బయటకు తీసి, అందులో కాఫీ పోస్తారు. దీంతో ఆమె హాయిగా కాఫీ తాగగలుగుతారు. 2,85,000కు మించిన వీక్షణలు, 2 వేలకు పైగా లైక్‌లను అందుకున్న ఈ వీడియో అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలను తెలియజేస్తుంది. ‘స్పేస్ కప్’ వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోగ్రావిటీ కప్పులు అంతరిక్షంలో ద్రవపదార్థాలను తాగేందుకు రూపొందించారు. స్పేస్ కప్ అనేది ద్రవాన్ని నిష్క్రియాత్మకంగా కప్పు పైభాగానికి చేరవేస్తుంది. దీని రూపకల్పనకు పరిశోధకులు ఉపరితల ఉద్రిక్తత, చెమ్మగిల్లే పరిస్థితులు,కప్పు నిర్దిష్ట జ్యామితి మొదలైనవాటిని పరిశీలిస్తారు. ప్రక్రియను చూసేందుకు కప్పును పారదర్శకంగా రూపొందిస్తారు. ఇది కూడా చదవండి: చైనా ‘జియాన్-6’తో భారత్‌పై నిఘా పెట్టిందా? How do you like your coffee?☕️ Our astronaut @AstroSamantha demonstrates how she has her morning coffee in space! #InternationalCoffeeDay pic.twitter.com/UKA1Hy0EWW — ESA (@esa) October 1, 2023 -
చంద్రుడిపై మానవ నివాసం.. ఇళ్లు కట్టేది ఎవరంటే?
ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..చంద్రుడిపై ఇళ్లను నిర్మించే యోచనలో నాసా ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో 17 మిషన్‌లో భాగంగా ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లో సుమారు 72 గంటల పాటు గడిపారు. భవిష్యత్‌లో అంతకంటే ఎక్కువ సేపు గడిపేలా ఆ దిశగా నాసా ప్రయోగాల్ని ముమ్మరం చేసింది. అమెరికాలోని డజన్ల మంది ఆస్ట్రోనాట్స్ చెప్పిన వివరాల ఆధారంగా 2040 నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నాసా భావిస్తోంది. ఇందుకోసం ముందుగా చంద్రుడిపై 3డి ప్రింటర్‌ను పంపి, ఆపై నిర్మాణాలను నిర్మించాలనేది నాసా ప్రణాళిక. ఈ 3డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణ చేపట్టనుంది. NASA is now plotting a return to the moon. This time, the stay will be long-term. To make it happen, NASA is going to build houses on the moon that can be used not just by astronauts, but by ordinary civilians as well. Here’s how they plan to do it. https://t.co/SbG282kIpZ pic.twitter.com/3O6y5YMUPb — The New York Times (@nytimes) October 2, 2023 ఇందుకోసం నాసా అత్యాధునిక సాంకేతికత కోసం యూనివర్సిటీలు, ప్రైవేట్ కంపెనీలతో చేతులు కలపనుంది. ఈ సందర్భంగా మేం ఉమ్మడి లక్ష్యంతో సరైన సమయంలో సరైన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చాం. అందుకే మేము అక్కడికి చేరుకుంటామని నేను భావిస్తున్నాను’ అని నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్ నిక్కీ వర్కీసర్ తెలిపారు. -
ఒక తార పేలిన వేళ...
సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది. ► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. ► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు. ► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి. ► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి. ► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి. ► కానీ ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు. ► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు. ► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
అంతరిక్షం టూ భూలోకం.. ఏం గుట్టు విప్పుతుందో?
వాషింగ్టన్: అల్లంత దూరాన అంతరిక్షంలో సేకరించిన ఆస్టరాయిడ్ తాలూకు తొలి శాంపిల్‌ను అమెరికా భూమి మీదికి తీసుకొచ్చింది. ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక భూమికి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరం నుంచి విసిరేసిన శాంపిల్ క్యాప్సూల్ 4 గంటల ప్రయాణం తర్వాత ఆదివారం అమెరికాలోని ఉటా ఎడారిలో సైనిక భూభాగంలో దిగింది. నమూనాను సోమవారం హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అనంతరం వాటిమీద పరీక్షలు, పరిశోధనలు చేస్తారు. అక్కడ గతంలో తెచ్చిన చంద్ర శిలలున్నాయి. వాటిని 50 ఏళ్ల క్రితం అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదికి వెళ్ళిన అంతరిక్ష యాత్రికులు తీసుకొచ్చారు. తాజా క్యాప్సూల్ లో కనీసం పావు కేజీ పరిమాణంలో ఆస్టరాయిడ్ తాలూకు శకలాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి ఎలా రూపొందిందో, దానిపై జీవం ఎలా వికసించిందో అర్థం చేసుకోవటానికి అవి మరింతగా ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటిదాకా జపాన్ ఒక్కటే ఆస్టరాయిడ్ శకలాలను భూమికి తెచ్చింది. Today's #OSIRISREx asteroid sample landing isn't just the end of a 7-year, 3.9-billion-mile journey through space. It takes us 4.5 billion years back in time. These rocks will help us understand the origin of organics and water that may have seeded life on Earth.… pic.twitter.com/sHLRrnWqAg — NASA (@NASA) September 24, 2023 ఏడేళ్ల ప్రయత్నం... ఆస్టరాయిడ్లపై పరిశోధన నిమిత్తం నాసా 2016లో 100 కోట్ల డాలర్ల ఖర్చుతో ఓసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. రెండేళ్ల అనంతరం అది బెన్నూగా పిలిచే ఆస్టరాయిడ్ ఉపరితలంపై దిగింది. 2020లో దాని మీదినుంచి స్వల్ప పరిమాణంలో శకలాలను ఒక క్యాప్సూల్ లోకి సేకరించి వెనుదిరిగింది. అప్పటికే అది కోట్లాది కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున్న బెన్నూ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 8.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది 2182 సంవత్సరంలో భూమికి అతి సమీపంగా వస్తుందని, అప్పుడది బహుశా మనను ఢీకొనే ప్రమాదమూ లేకపోలేదని అంచనా. ఓసిరిస్ ఎక్స్ ప్రస్తుతం అపోఫిస్‌గా పిలిచే మరో ఆస్టరాయిడ్ వైపు పయనిస్తోంది. బెన్నూ రైట్ ఛాయిస్ సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం శాస్త్రవేత్తల వద్ద ఉన్న ఉల్క పదార్థాల నమూనాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. దీన్ని శోధించడం ద్వారా 450 కోట్ల ఏళ్ల కిందట సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావొచ్చు. బెన్నూ.. కర్బన పదార్థాలు పుష్కలంగా ఉండే కార్బనేషియస్ తరగతి గ్రహశకలం. ఇలాంటి ఖగోళ వస్తువులు గ్రహాల నిర్మాణంలో ‘ఇటుకల్లా’ పనిచేసి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీనిపై సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఖగోళశాస్త్రంలో నేడున్న అతిపెద్ద ప్రశ్న.. జీవానికి ప్రధాన కారణమైన నీరు, సేంద్రియ పదార్థాలు భూమి మీద పుష్కలంగా ఉండటానికి కారణమేంటి? వందల కోట్ల ఏళ్ల కిందట బెన్ను వంటి గ్రహశకలాలు వీటిని భూమికి చేరవేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గుట్టును ఒసైరిస్-రెక్స్ నమూనాలు విప్పే అవకాశం ఉంది. చాలా గ్రహశకలాలు.. అంగారకుడు, గురుడు మధ్య ఉన్న గ్రహశకల వలయంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బెన్నూ మాత్రం ఆరేళ్లకోసారి భూమికి చేరువగా వచ్చి వెళుతుంటుంది. అందువల్ల ఆ గ్రహశకలం వద్దకు వ్యోమనౌకను పంపి, భూమికి తిరిగి రప్పించడం చాలా సులువు. ఉత్కంఠ ప్రయాణంలో.. రోదసిలో దాదాపు మూడేళ్ల ప్రయాణం తర్వాత ఒసైరిస్-రెక్స్.. భూమికి చేరువైంది. భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సూల్ విడిపోయింది. ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించాక క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అనంతరం 13 నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు 44,500 కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది. గాలి రాపిడి వల్ల చెలరేగిన 3వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఉష్ణ రక్షణ కవచం సాయంతో తట్టుకోగలిగింది. పారాచూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి. అమెరికాలోని యూతా ఎడారిలో అది సురక్షితంగా దిగింది. హెలికాప్టర్లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి, సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్‌లోకి తరలించాయి. ఆ తర్వాత హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు పంపుతారు. 50 ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకొచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి. ఒసైరిస్-రెక్స్.. తన ఏడేళ్ల ప్రస్థానంలో.. సుమారు 620 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. -
6 పాయింట్లలో సునీతా విలియమ్స్ లైఫ్ స్టోరీ!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ 1965,సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. 1 సునీతా విలియమ్స్ కుటుంబం సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్. పాండ్యా ఆయన భారతదేశంలోని గుజరాత్‌కు చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా.. స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్ఏలోని బోస్టన్‌కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్‌కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జెని వివాహం చేసుకున్నారు. అతను సునీతా విలియమ్స్ క్లాస్మేట్. 2 ప్రాథమిక విద్య సునీతా విలియమ్స్ మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. 3 అంతరిక్ష ప్రయాణ శిక్షణ సునీతా విలియమ్స్ 1987లో యూఎస్ నేవీలో చేరారు. ఆరు నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీతా విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. 4 195 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. 5 సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు సునీతా విలియమ్స్ 1998, జూన్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ (1998) మిషన్ ఎస్టీఎస్ 116, ఎక్స్‌పెడిషన్ 14, ఎక్స్‌పెడిషన్ 15, ఎస్టీఎస్ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 6 పద్మభూషణ్‌తో సత్కారం సునీతా విలియమ్స్‌కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదేకాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్‌లను అందుకున్నారు. ఇది కూడా చదవండి: జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు? -
2030 నాటికి ఇస్రో నుంచి స్పేస్ టూరిజం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–3, సూర్యయాన్ వంటి ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి ప్రస్తుతం గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు 2030 నాటికి స్పేస్ టూరిజానికి కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది. గగన్‌యాన్ ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాలను, అనంతరం మానవ సహిత ప్రయోగాలను నిర్వహించనుంది. మానవ సహిత ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన వెంటనే స్పేస్ టూరిజం వైపు అడుగులు వేయనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో వెబ్సైట్లో గురువారం వివరాలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రయోగాల్లో మానవ సహిత ప్రయోగాల్లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకువచ్చిన తర్వాత ఇస్రో స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ చేపడుతుందని సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే పర్యాటకులకు ఒక్కో టికెట్ ధర రూ.ఆరు కోట్లు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరడం ఖాయమవుతుందని తెలిపారు. కాగా యువత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ బీవీ సుబ్బారావు సూచించారు. సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అంతరిక్ష రాకెట్ ప్రయోగాలు’ అనే అంశంపై గురువారం సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బీవీ సుబ్బారావు మాట్లాడుతూ భారత అంతరిక్ష యాత్ర.. నేడు చంద్రుడు, సూర్యుడిపై అధ్యయనం కోసం గ్రహాంతర ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే స్థాయికి చేరిందని వివరించారు. -
వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు
Shivon Zilis:వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్, టెస్లా ,స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా తన ప్రత్యకతను చాటు కుంటున్నారు జిలిస్. అయితే బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ పుస్తకం రిలీజ్ కాబోతున్న తరుణంలో జిలిస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని జిలిస్ నివాసంలో తీసిన రైటర్ వాల్టర్ ఐజాక్సన్ కవల పిల్లలతో మస్క్ ,జిలిస్ ఫోటోలను షేర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలన క్రియేట్ చేసింది.అయితే ఈ జంట ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి (ఐవీఎఫ్) ద్వారా 2021లో నవంబరులో వీరికి జన్మనిచ్చారు. ఈ కవలల పేర్లు స్ట్రైడర్ (కొడుకు), అజూర్ (కుమార్తె) గా ఇటీవల వెల్లడైంది. దీంతో మస్క్ సంతానం తొమ్మిదికి చేరింది. ఏప్రిల్ 2022లో, కవలల పేర్లను మార్చాలని మస్క్, జిలిస్ ఒక పిటిషన్‌ను మే 2022లో టెక్సాస్ న్యాయమూర్తి ఆమోదించారు. మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. వీరితోపాటు సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే పిల్లలున్నారు. (రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?) షివోన్ జిలిస్ ఎవరు? ఎలాన్ మస్క్, జిలిస్ సంబంధం, అలాగే జిలిస్ గురించి చాలామందికి పెద్దగా తెలియదు. జిలిస్ కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో కె ఫిబ్రవరి 8, 1986న పంజాబీ భారతీయ తల్లి శారద , కెనడియన్ తండ్రి రిచర్డ్‌కి జన్మించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం IBMలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. 2015లో మస్క్ సహ-స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ OpenAIతో జిలిస్ మస్క్ మధ్య పరిచయం ఏర్పడింది. పలు మస్క్ కంపెనీలలో సీనియర్ పాత్రలలో పనిచేశారు. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016 జూలైలో మస్క్ స్థాపించిన న్యూరాలింక్, ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్ ఫేస్‌లను అభివృద్ధి చేసే న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పేరు పొందారు.ప్రస్తుతం న్యూరాలింక్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ OpenAI బోర్డు మెంబర్‌గాఉన్నారు. జిలిస్ ప్రత్యేకతలు ♦ 2015లో వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30కి ఎంపికయ్యారు. ♦ అవర్ లేడీ పీస్ అనే కెనడియన్ రాక్ బ్యాండ్ ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషీన్స్ అనే పుస్తకం తనకు ప్రేరణ అంటారు. కంప్యూటర్లు, మానవ మేథస్సును అథిగమిస్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మానవాళి , భవిష్యత్తు గురించి తనకు తెలిపిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా జిలిస్ తెలిపారు. అప్పటి నుండే కృత్రిమ మేధస్సు అధ్యయనంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. ♦ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్-టైమ్ బెస్ట్. ఆమె గిటార్ , డ్రమ్స్ కూడా ప్లే చేసేది. ♦ అంతేకాదు మస్క్ తండ్రి తండ్రి ఎర్రోల్ షివోన్పై ప్రశంసలు కురిపించాడు. 2022లో ఒక ఇంటర్వ్యూలోఆ ఆమో IQ 170 అని ప్రకటించడం విశేషం. కాగా స్టీవ్ జాబ్స్ , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ రాసిన మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మరి మస్క్ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. -
నాడే విడుదల వీర శూర సూర్యచిత్ర
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్బుక్లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది. ‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది. ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది. -
ఇస్రో అదుర్స్.. మానవరహిత గగన్‌యాన్ మిషన్!
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్ మానవరహితమనే ప్రకటన వెలువడింది. ఇందుకోసం ప్రత్యేక మహిళా రోబోట్ 'వ్యోమిత్ర'ను పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అక్టోబర్ రెండవ వారంలో ట్రయల్ స్పేస్ ఫ్లైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. తదుపరి మిషన్‌లో మహిళా రోబో "వ్యోమిత్ర"ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా గగన్‌యాన్ ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పారు. రెండో మిషన్‌లో భాగంగా పంపే మహిళా రోబోట్ మానవునితో సమానంగా మాట్లాడుతుందని చెప్పారు. అంతా సవ్యంగా సాగితే ముందుకు వెళతామని అన్నారు. చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరడం ఎంతో ఉపషమనం కలిగించిందని చెప్పారు. ప్రయోగాన్ని దగ్గర నుంచి చూసినవారు ఆందోళనకు గురయ్యారు. భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్యకు ప్రయోగం చేరినప్పుడు తాను మొదటిసారి ఆందోళన చెందినట్లు చెప్పుకొచ్చారు. అంతరిక్ష రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ చేయూతనిచ్చారని అన్నారు. దాదాపుగా 2019 వరకు శ్రీహరికోట సందర్శనార్థం మూసి ఉండేది.. కానీ ప్రస్తుతం మీడియాకు, విద్యార్థులను ఆహ్వానిస్తోందని చెప్పారు. ఆ సంపద ఈ దేశ ప్రజలదని పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మొదటి దేశం భారత్ అని అన్నారు. గగన్‌యాన్ ఉద్దేశం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇందులో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు సభ్యులను మూడు రోజులపాటు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. ఎల్వీఎం3ని లాంచ్ వెహికిల్‌గా ఉపయోగించనున్నారు. ఇదీ చదవండి: PM Modi Gets Emotional: చంద్రయాన్ 3 విజయోత్సవాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం.. -
మూన్ మూడ్: చంద్రయాన్–3 షేర్లు జిగేల్
చంద్రయాన్–3 చంద్రుడిపై విజయవంతం నేపథ్యంలో అంతరిక్షం, రక్షణ రంగ కంపెనీల కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బీఎస్ఈలో సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 15 శాతం దూసుకెళ్లగా.. స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్నాలజీస్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 5.5–3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. చంద్రయాన్–3 మిషన్‌కు సెంటమ్ 200కుపైగా కీలక మాడ్యూల్స్‌ను సరఫరా చేసింది. ఇక ఈ బాటలో భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎల్అండ్టీ 3–1.5 శాతం మధ్య ఎగశాయి. వీటిలో కొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలకు చేరడం గమనార్హం! చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. ఈ విజయంతో భారత్.. అంతరిక్ష రంగంలో చైనా, రష్యా, అమెరికా సరసన చేరింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
ఉపగ్రహం మీ నెత్తిన పడితే..
సపోజ్.. ఫర్ సపోజ్.. ఉపగ్రహం లేదా దానిలోని ఓ భాగం మీ నెత్తిన పడితే ఏం చేస్తారు? పోనీ.. మీ నెత్తిన కాదు.. మీ ఇంటిపై పడితే ఏం చేస్తారు?పిచ్చిలేచిందా.. ఇదేం తిక్క ప్రశ్న అనేగా మీ ఫీలింగు.. మీ ఫీలింగును మేము ఫీలయ్యేలోపు.. ఓసారి ఈ ఫొటో చూడండి.. ఇది భూమి కక్ష్యకు సంబంధించి నాసా రూపొందించిన కంప్యూటర్ జనరేటెడ్ ఫొటో... ఇక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో భూమి చుట్టూ వేగంగా తిరుగుతున్నాయే.. వీటిల్లో పనిచేస్తున్న ఉపగ్రహాలు మినహాయిస్తే.. మిగతాదంతా కేవలం చెత్త.. అంటే అంతరిక్ష వ్యర్థాలు.. ప్రస్తుతం ఇక్కడ ఉన్నదాంట్లో 95% అదే.. ఇవి అడపాదడపా.. అక్కడక్కడా వచ్చి పడుతుంటాయి... గత నెల్లో భారత్‌కు చెందిన అంతరిక్ష శిథిలం ఒకటి ఆస్ట్రేలియాలో పడింది కూడా.. ఈ నేపథ్యంలో అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏమిటి? పడితే పరిహారంలాంటిది చెల్లించాలా? అసలు దీనికి సంబంధించిన అంతర్జాతీయ చట్టాలేం చెబుతున్నాయి? లాంటి పెద్ద విషయాలతోపాటు అస లు మన నెత్తిన లేదా ఇంటిపై పడే చాన్సుందా.. పడితే.. మనకూ పరిహారం లాంటిదేమైనా ఇస్తారా వంటి చిన్నపాటి వివరాలు కూడా తెలుసుకుందాం.. అంతరిక్ష వ్యర్థం అంటే.. ♦ స్పేస్‌లో మిగిలిపోయిన, పనికి రాని భాగాలు.. అది కాలపరి మితి ముగిసిన ఉపగ్రహం కావచ్చు లేదా రాకెట్ ప్రయోగ దశలోని భాగాలు కావచ్చు. వ్యోమ గాములు వాడిన గ్లవ్స్లాంటివి కావచ్చు. లక్ష్యాలను పూర్తిచేసు కుని పనికిరానివిగా మిగిలిపోయి నవి ఏవైనా కావచ్చు. ♦ నాసా లెక్క ప్రకారం ఒక మిల్లీమీటర్ కంటే చిన్నవున్న అంతరిక్ష వ్యర్థాలు 10 కోట్లు ఉంటే.. సాఫ్ట్ బాల్ సైజు కన్నా పెద్దవిగా ఉన్నవి 23 వేలు ఉన్నాయి. కొన్నిటిని శాస్త్రవేత్తలే ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నియంత్రిత పద్ధతిలో సము ద్రంలో కూలేలా చేస్తుంటారు. ఒకవేళ అలా కాకున్నా.. సాధా రణంగా ఎక్కువ శాతం వ్యర్థాలు సముద్రంలో పడి పోతుంటాయి. ఎందుకంటే.. భూమ్మీద నీటి శాతమే ఎక్కువ గనుక.. కొన్ని ఎడారులు, అడవుల్లాంటి నిర్మానుష్య ప్రదేశాల్లో పడుతుంటాయి. చిన్నసైజు వ్యర్థాలు భూ వాతావరణంలోకి రాగానే మండిపోతాయి. కొంచెం పెద్దగా ఉండేవి కిందకు వస్తాయి. ఒకవేళ అలా వస్తే.. పైసా నికాలో.. అంతరిక్ష వ్యర్థాల వల్ల పర్యావరణానికి లేదా భూమిపై పడినప్పుడు ఆ ప్రదేశంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దాన్ని ప్రయోగించిన దేశం(లాంచింగ్ కంట్రీ) బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ, 1972 నాటి స్పేస్ లయబి లిటీ కన్వెన్షన్ ప్రకారం.. నష్టం జరిగిందని బాధిత దేశం కోరితే.. పరిహా రం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఎవరైనా చెల్లించారా? ఒక్కసారి జరి గింది. 1978లో కెనడా అప్పటి సోవి యట్ యూనియన్ నుంచి పరిహారాన్ని కోరింది. సోవియట్ ఉపగ్రహ భాగం కెన డాలో పడింది. అది కొంచెఅణు ధార్మికత వెదజల్లిందంటూ కెనడా పరిహా రాన్ని డిమాండ్ చేసింది. కొంచెం ఎక్కు వే అడిగినప్పటికీ.. సోవి యట్ యూనియన్రూ.18 కోట్లే(ప్రస్తుత లెక్క ప్రకారం) చెల్లించింది. మన దేశం విషయానికొస్తే.. పశ్చిమ ఆస్ట్రేలియాలో పడిన అంతరిక్ష వ్యర్థం పీఎస్ఎల్వీ రాకెట్ మూడో స్టేజ్‌కు సంబంధించినదని ఇస్రో నిర్ధారించింది. అది సముద్రంలో పడి.. తర్వాత కొంత కాలానికి తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని తేల్చారు. ఈ సంఘటనలో ఆస్ట్రేలియా పరిహారం కోరితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. తొలుత దీని నుంచి ఏమైనా విష రసాయనాలు లీకై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమైనా.. తర్వాత అలాంటిదేమీ జరగలేదని శాస్త్రవేత్తలు తేల్చారు. దీన్ని బట్టి.. మన దేశం ఎలాంటి పరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే.. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ ఎఫైర్స్ ప్రకారం.. తమ దేశంలో పడ్డ..విదేశీ అంతరిక్ష భాగాన్ని యాజమాన్య దేశానికి తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారణంగా మిషన్ అనాలసిస్ కోసం వీటిని తిరిగి తీసుకుంటారు. అయితే.. ఇక్కడ ఈ పరికరం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ప్రతినిధి చెబుతున్నారు. భారత్‌కు ఇది అక్కర్లేకుంటే.. స్కైల్యాబ్ ఉంచిన.. మ్యూజియంలోనే దీన్ని కూడా పెడతామని చెబుతున్నారు. స్కైల్యాబ్ గుర్తుందిగా.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం. 1979లో ఇది కూలిపోతుందని చెప్పి.. ఇక ప్రపంచం అంతమే అన్నట్లు.. అదే ఇక చివరి రోజు అన్నట్లు ఆస్తులు అమ్మి విందులు వినోదాలు చేసుకున్నారు.. చాలామందికి స్కైల్యాబ్ పేరిట పిల్లలకు పేర్లు కూడా పెట్టారు. ఆ మధ్య తెలుగులో సినిమా కూడా వచ్చింది. ఆ స్కైల్యాబ్ భాగాలు కూడా పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలోనే కూలాయి. ఇక మన విషయానికొస్తే... ♦నిజంగానే మన మీదో లేక మన ఇంటి మీదో పడిందనుకోండి.. మనమేమీ చేయనక్కర్లేదు. మన తరఫున మన దేశమే.. అది ఏ దేశానిదైతే.. ఆ దేశం నుంచి పరిహారాన్ని కోరుతుంది. ఇప్పిస్తుంది కూడా.. అయితే.. ఇప్పటివరకూ ఏ లెక్క ప్రకారం చూసినా.. అలా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయినా.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. ఎగిరి కింద పడనూవచ్చు.. న్యూటన్ చెప్పింది గుర్తుందిగా.. పైకి వెళ్లే ప్రతీది కిందకు రావాల్సిందే.. బీ కేర్‌ఫుల్ మరి.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అంతరిక్ష యుద్ధంలో చల్లగా చావు దెబ్బ
అంతరిక్ష యుద్ధంలో చైనా నానాటికీ దూసుకుపోతోంది. ఇంధన ఆయుధ పరిజ్ఞానంలో అతి గొప్ప పురోగతి సాధించినట్లు చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక కూలింగ్ సిస్టం ఒకదాన్ని కనిపెట్టినట్టు చంగ్ షాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత హెచ్చు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్లను పెద్దగా వేడెక్కనేయకుండా, నిరంతరం శక్తివంతంగా, ఎంతటి పెను దాడికైనా నిత్యం సిద్ధంగా ఉంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని వర్సిటీ వర్గాలను ఉటంకిస్తూ సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ విధానం సఫలమైందన్న వార్త నిజమైతే చైనా అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు అతి శక్తివంతమైన లేజర్ కిరణాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా ప్రయోగించగలవు. అప్పుడిక యుద్ధం తీరు తెన్నులే సమూలంగా మారిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేíÙంచాయి. పరిశోధన వివరాలను చైనీస్ జర్నల్ ఆక్టా ఆప్టికా సైనికాలో ప్రచురితమయ్యాయి. వేడే అసలు శత్రువు ఇలాంటి అతి శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో భరించలేనంత వేడి ఉద్భవిస్తుంది. ఇది సదరు ఆయుధాలకే తీవ్రంగా నష్టం చేస్తుంది. దీంతో ఆయుధం పాడవకుండా ఉండేందుకు ఆ వేడిని సంపూర్ణంగా తట్టుకునే కూలింగ్ వ్యవస్థను కనిపెట్టినట్టు చైనా చెబుతోంది. లేజర్ ఆయుధాల అభివృద్ధిలో ఇలా వాటిని చల్లబరచడమే అతి పెద్ద సాంకేతిక సవాలు. అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... ఇలాంటి అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థల తయారీలో అమెరికా చాలాకాలంగా ఎంతో ముందుంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రా రెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రయోగించినప్పుడు అద్భుతాలు చేశాయి. శబ్ద వేగాన్ని మించి దూసుకుపోగల సూపర్ సానిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసి చూపించాయి. అయితే భారీ పరిమాణం, బరువు కారణంగా వాటిని అటకెక్కించారు. పైగా వాటి పరిధి మహా అయితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ లేజర్ కాంతి పుంజం విధ్వంసక శక్తిని ఎన్నో రెట్లు పెంచినట్లు లేజర్ కాంతిపుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ బృందం చెబుతోంది. స్పేస్ ఎక్స్ పైకీ ప్రయోగం? కూలింగ్ సిస్టమ్ సాయంతో పనిచేసే ఈ అధునాతన లేజర్ క్షిపణి వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే చాలా చవకైనది. ఎంతో ప్రభావవంతమైనది కూడా. పైగా దీన్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే స్పేస్ ఎక్స్ తాలూకు స్టార్ లింక్ వంటి ఉపగ్రహ వ్యవస్థల పైకి ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించే యోచనలో చైనా ఉన్నట్టు చెబుతున్నారు. హెచ్ యు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధాల ప్రయోగం విషయంలో ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు –లేజర్ కాంతి పుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ షెంగ్ ఫు –సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లే పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యం: ఇస్రో
-
హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. 2023 ఆర్ధిక సంవత్సరంలో నగరంలో 51 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. అయితే 2022 ఆర్ధిక సంవత్సరంలోని 54 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్), ఈ–కామర్స్ సంస్థల లావాదేవీలలో తాత్కాలిక మందగమనమే ఈ క్షీణతకు ప్రధాన కారణమని పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్‌మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్‌హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన గిడ్డంగుల లీజుల మాన్యుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మేడ్చల్ క్లస్టర్లో వేర్‌హౌస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2022 ఆర్ధిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2023 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. నగరంలోని ప్రధాన గిడ్డంగుల క్లస్టర్లు ఇవే మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, షామీర్పేట్, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. -
రిటైల్ స్పేస్ లీజింగ్‌లో జోరు! హైదరాబాద్ వాటా..
ముంబై: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో మంచి పనితీరు చూపించింది. లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 24 శాతం పెరిగి 2.87 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో రిటైల్ లీజ్ పరిమాణం 2.31 చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 15 శాతంతో పోలి్చనా, ఈ ఏడాది ప్రథమార్ధంలో మంచి పురోగతి కనిపించింది. రిటైల్ స్పేస్ సరఫరా మాత్రం ఈ ఎనిమిది పట్టణాల్లో 148 శాతం పెరిగి 1.09 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సరఫరా 0.44 చదరపు అడుగులుగా ఉంది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సలి్టంగ్ కంపెనీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢీల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్ కొత్త రిటైల్ లీజింగ్‌లో 65 శాతం వాటా ఆక్రమించాయి. 2023 జనవరి – జూన్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 0.8 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ 0.7 మిలియన్ చదరపు అడుగులు, చెన్నై, అహ్మదాబాద్ 0.4 చదరపు అడుగుల చొప్పున, ముంబై, హైదరాబాద్ మార్కెట్లు 0.2 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతా 0.06 చదరపు అడుగులు, పుణె 0.12 చదరపు అడుగుల రిటైల్ లీజింగ్‌ను నమోదు చేశాయి. డిమాండ్‌లో వృద్ధి షాపర్ల నుంచి మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పట్టణాల్లో మాల్స్ నిర్మాణంలో 8 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్ల వాటా 59 శాతంగా ఉంది. విడిగా చూస్తే బెంగళూరు 35 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ మార్కెట్ 24 శాతం, చెన్నై 14 శాతం, హైదరాబాద్ మార్కెట్ వాటా 11 శాతం చొప్పున నమోదైంది. ఫ్యాషన్, వ్రస్తాల విభాగం నుంచి 38 శాతం, ఫుడ్, బెవరేజెస్ నుంచి 18 శాతం, లగ్జరీ, హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్ విభాగాల నుంచి 11 శాతం డిమాండ్ కనిపించింది. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్ లీజులో 7 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎనిమిది మార్కెట్లలో రిటైల్ లీజ్ పరిమాణంలో దేశీయ సంస్థల వాటా 75 శాతంగా ఉంది. రానున్న త్రైమాసికాలకు సంబంధించి రిటైల్ లీజింగ్ ఆశావహంగా కనిపిస్తున్నట్టు సీబీఆర్ఈ సౌత్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. సెకండరీ లీజింగ్ మరింత జోరుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా. -
అందీ అందని చందమామ
చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ‘చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అని వ్యాఖ్యానించాడు. చంద్రుడిని చేరుకోవాలనేది మనిషి చిరకాల స్వప్నం. వీలుంటే చంద్రలోకంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. చంద్రుడిపై కాలుమోపిన మనిషి ఇంతవరకు అక్కడ కాళ్లూనుకోలేదు.అందీ అందకుండా ఊరిస్తున్న చందమామపై దేశదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలను మానుకోలేదు. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో గత ఏడాది తొలిసారిగా అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి రెండో అంతర్జాతీయ చంద్ర దినోత్సవం సందర్భంగా చందమామ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఈసారి అంతర్జాతీయ చంద్ర దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ఎంచుకున్న అంశం ‘చంద్రునిపై అన్వేషణలో సమన్వయం, సుస్థిరత’. చంద్రునిపై అన్వేషణలోను, పరిశోధనల్లోను వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సమన్వయం, పరిశోధనల్లో సుస్థిరత కోసం ఐక్యరాజ్య సమితి ఈ అంశాన్ని ఎంపిక చేసుకుంది. మనిషి చంద్రుడిపై కాలుమోపడం నిజంగానే మానవాళికి ముందడుగు. చంద్రుడి ఆనుపానులు పూర్తిగా తెలుసుకోవాలంటే మరిన్ని అడుగులు మునుముందుకు వేయాలి. శాస్త్రవేత్తలు ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఒక్కో అడుగు ముందుకు వేసినప్పుడల్లా చంద్రుడి గురించి కొత్త కొత్త విశేషాలను తెలుసుకుని, మానవాళికి వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి ముందు చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. మానవాళికి ముందడుగు చంద్రుణ్ణి అందుకోవాలనే తపన మనుషుల్లో చాన్నాళ్లుగానే ఉంది. తొలి రోజుల్లో అమెరికా, సోవియట్ రష్యా చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాల్లో పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టాయి. తప్పటడుగుల దశలో జరిపిన దాదాపు అరడజను ప్రయోగాలు విఫలమైన తర్వాత తొలిసారిగా సోవియట్ రష్యా చంద్రుడి మీదకు 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో అదే ఏడాది సెప్టెంబర్ 12న సోవియట్ రష్యా ప్రయోగించిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రుణ్ణి చేరుకుంది. ఇక అప్పటి నుంచి చంద్రుడి విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలను సాగిస్తూనే ఉన్నాయి. తొలి దశాబ్దకాలంలో ఈ ప్రయోగాల్లో వైఫల్యాలు ఎక్కువగా ఉన్నా, ఆ తర్వాతి నుంచి ప్రయోగాలలో వైఫల్యాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969 జూలై 16న ‘అపోలో–11’ ప్రయోగం చేపట్టింది. దీని ద్వారా ఇద్దరు వ్యోమగాములు– నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపైకి చేరుకున్నారు. జూలై 20న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు మోపి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు ‘నాసా’ 1968 డిసెంబర్ 20న ముగ్గురు వ్యోమగాములతో ‘అపోలో–8’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి మీదకు మనుషులతో చేరుకున్న తొలి వ్యోమనౌక ఇదే. ఇందులో ఫ్రాంక్ ఎఫ్ బోర్మన్–ఐఐ, జేమ్స్ ఏ లవల్ జూనియర్, విలియమ్ ఏ ఆండ్రెస్ చంద్రుడి మీదకు వెళ్లారు. అయితే వారెవరూ చంద్రుడిపై అడుగు మోపకుండానే తిరిగి వచ్చేశారు. తొలి ప్రయోగాలు విఫలం చంద్రుడి కక్ష్యలోకి చేరుకునే తొలి ప్రయత్నాన్ని అమెరికా చేసింది. ‘నాసా’ ఏర్పాటుకు కొద్దికాలం ముందే అమెరికన్ వైమానికదళంలోని బాలిస్టిక్ మిసైల్స్ విభాగం 1958 ఆగస్టు 17న ‘పయోనీర్–0’ ప్రయోగాన్ని చేపట్టింది. భూ కక్ష్యను దాటి ఒక వస్తువును అంతరిక్షంలోకి పంపేందుకు చేసిన తొలి ప్రయోగం ఇది. థోర్ మిసైల్ ద్వారా ‘పయోనీర్–0’ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ఈ ప్రయోగం జరిపారు. అయితే, టర్బోపంప్, గేర్‌బాక్స్‌లలో తలెత్తిన లోపాల వల్ల ఇది భూమి నుంచి 16 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగానే అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. ఈ వైఫల్యానికి కొద్దిరోజుల ముందే 1958 జూలై 29న ప్రత్యేకంగా స్వయంప్రతిపత్తి గల అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ను నెలకొల్పింది. ‘పయోనీర్–0’ వైఫల్యం తర్వాత అమెరికా చేపట్టిన ప్రయోగాలన్నీ ‘నాసా’ ద్వారానే జరిగాయి. అమెరికాతో పాటే అప్పటి సోవియట్ రష్యా కూడా 1958 సెప్టెంబర్ 23న ‘లూనా ఈ–1 నం:1’ ప్రయోగాన్ని చేపట్టింది. అప్పటి సోవియట్ రాకెట్ తయారీ సంస్థ దీనిని రూపొందించింది. సోవియట్ రష్యా చేపట్టిన ఈ తొలి ప్రయోగం కూడా విఫలమైంది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయని శాస్త్రవేత్తలు అక్కడితో ఆగిపోలేదు. పట్టువదలకుండా ప్రయోగాలను సాగిస్తూ, మొత్తానికి చంద్రుణ్ణి చేరుకున్నారు. సాహిత్యంలో చంద్రయానం పలు ప్రాచీన నాగరికతల్లో చంద్రుడి ఆరాధన కనిపిస్తుంది. కొన్ని పురాణాల్లో చంద్రలోక వర్ణన కూడా కనిపిస్తుంది. ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలో గాని మనిషి చంద్రుణ్ణి చేరుకోవడం సాధ్యం కాలేదు. అయితే, చంద్రుణ్ణి చేరుకోవాలనే ఆశ మాత్రం మనిషిలో శతాబ్దాలుగా ఉంది. ప్రాచీన సాహిత్యం ఈ ఆశకు అద్దం పడుతోంది. ప్రాచీన గ్రీకు రచయితలు ఆంటోనియస్ డయోజనీజ్, లూసియన్ ఆఫ్ సమాసతా వంటి వారి రచనల్లో చంద్రయానానికి సంబంధించిన కల్పనలు ఉండేవని చెబుతారు. ఆ రచనలు కాలగతిలో అంతరించడంతో వాటిని సాధికారికమైన ఆధారాలుగా పరిగణించలేం. జర్మన్ ఖగోళవేత్త, రచయిత జోహాన్నెస్ కెప్లర్‘సోమ్నియమ్’ అనే నవలలో మనిషి చంద్రుడిపైకి ఎగిరి వెళ్లడం గురించి రాశాడు. కెప్లర్ మరణానంతరం ఈ నవల 1634లో వెలుగులోకి వచ్చింది. దాదాపు అదేకాలంలో ఇంగ్లిష్ చరిత్రకారుడు, రచయిత ఫ్రాన్సిస్ గాడ్విన్ ‘ది మ్యాన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. గాడ్విన్ మరణానంతరం ఇది 1638లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వివిధ భాషల్లో చంద్రయానం గురించి చాలా కాల్పనిక రచనలు వెలువడ్డాయి. కాలం గడిచే కొద్దీ ఈ రచనల్లోని కల్పనలు వాస్తవానికి దగ్గరవుతూ రావడం విశేషం. రిచర్డ్ ఆడమ్స్ లాక్ ‘గ్రేట్ మూన్ హోక్స్’ను 1835లో న్యూయార్క్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ఆరు భాగాలుగా ప్రచురించింది. లాక్ ఈ వ్యంగ్యరచనలో చంద్రునిపై జీవజాలాన్ని, నాగరికతను సర్ జాన్ హెర్షల్ కనుగొన్నట్లు ఎద్దేవా చేస్తూ రాశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ 1865లో ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’ నవల రాశాడు. ఇందులో భూమి నుంచి చంద్రునిపైకి చేరుకోగల సాధనాన్ని తయారుచేసే ప్రక్రియను కొంత శాస్త్రీయంగా వివరించాడు. ఫిరంగి ద్వారా చంద్రునిపైకి ఒక వస్తువును పంపే యత్నాన్ని ఇందులో ప్రస్తావించాడు. దీనిని బట్టి తీవ్రమైన పేలుడుతోనే చంద్రుని వరకు చేరుకోవడం సాధ్యం కాగలదనే విషయంపై అప్పటికే జనాలకు అర్థమైందని అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంగ్లిష్ రచయిత హెచ్.జి.వెల్స్ 1901లో ‘ది ఫస్ట్ మెన్ ఇన్ ది మూన్’ నవల రాశాడు. ఇందులో గురుత్వాకర్షణ పరిధిని అధిగమించగల పదార్థాన్ని తయారు చేసేందుకు ఒక శాస్త్రవేత్త పాత్ర సాగించే ప్రయత్నాలను వివరించాడు. అదే ఏడాది మరో ఇంగ్లిష్ రచయిత జార్జ్ గ్రిఫిత్ ‘ఎ హనీమూన్ ఇన్ స్పేస్’ నవల రాశాడు. భూమి నుంచి చంద్రుని వరకు సాగిన ప్రణయయాత్రకు చెందిన కాల్పనిక నవల ఇది. గ్రిఫిత్ ఇందులో స్పేస్‌సూట్ గురించి వర్ణించాడు. శాస్త్రవేత్తలెవరూ అప్పటికి స్పేస్‌సూట్‌ను ఇంకా తయారు చేయలేదు. వెండితెరపై చంద్రయానం ఇంకా టాకీలు రాక మునుపే చంద్రయానం అంశంగా ఒక సినిమా వచ్చింది. ఫ్రెంచి ఇంద్రజాలికుడు, దర్శకుడు జార్జెస్ మెలీస్ 1902లో ‘లె వోయేజ్ దాన్స్ లా లూన్’ పేరిట మూకీ చిత్రం తీశాడు. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న్ నవలలు ‘ఫ్రమ్ ది ఎర్త్ టు ది మూన్’, ‘అరౌండ్ ది మూన్’ ఆధారంగా తీసిన ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ ప్రాచుర్యం ఉన్న ప్రాంతాల్లో ‘ఎ ట్రిప్ టు ది మూన్’ పేరుతో విడుదల చేశారు. తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించిన ఈ చిత్రానికి అప్పట్లోనే కలరైజేషన్ కూడా చేశారు. మెలీస్ చిత్రరంగం నుంచి తప్పుకున్నాక ఈ చిత్రం ప్రింట్ కనిపించకుండా పోయింది. దీనిని 1930 ప్రాంతంలో కొందరు గుర్తించారు. కలరైజ్ చేసిన దీని ఒరిజినల్ ప్రింట్‌ను 1993లో గుర్తించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దానిని 2011లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే పదివేల ఫ్రాంకులు ఖర్చయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం ఇది భారీ బడ్జెట్ చిత్రం కిందే లెక్క. దీని తర్వాత టాకీల కాలం వచ్చాక 1950లో అమెరికన్ దర్శకుడు, నటుడు ఇర్వింగ్ పిషెల్ ‘డెస్టినేషన్ మూన్’ చిత్రాన్ని తీశాడు. ఇందులో మనుషులు చంద్రునిపైకి చేరుకున్న దృశ్యాలను దాదాపు వాస్తవ దృశ్యాలను తలపించేలా చిత్రించడం విశేషం. ఇలాంటి సినిమాలు భారత్‌లో ఆలస్యంగా వచ్చాయి. చంద్రుని మీదకు యాత్రకు సంబంధించి భారత్‌లో విడుదలైన తొలిచిత్రం ‘చాంద్ పర్ చఢాయీ’. టి.పి.సుందరం దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం 1967లో విడుదలైంది. చందమామ నానాటికీ దూరం మన భూమి నుంచి చంద్రుడు నానాటికీ దూరం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు ఇలా దూరం జరగడాన్ని వారు ‘లూనార్ రెసిషన్’గా పేర్కొంటున్నారు. భూమి నుంచి చంద్రుడు ఎంత వేగంగా దూరం జరుగుతున్నాడో తేల్చేందుకు ఇటీవల శాస్త్రవేత్తలు కచ్చితమైన లెక్క కట్టారు. వారి లెక్క ప్రకారం చంద్రుడు ఏడాదికి 1.5 అంగుళాలు (3.8 సెం.మీ.) చొప్పున భూమి నుంచి దూరం జరుగుతున్నాడు. చంద్రుడు భూమి నుంచి దూరం జరగడం వల్ల భూమిపై రోజు స్వల్పంగా పెరుగుతుంది. కోట్లాది సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే కాలంలో భూమిపై రోజు పదమూడు గంటలే ఉండేది. భూమిపై జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులకు చంద్రుడే కారణమనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రెండు ప్రయోగాలు.. రెండు విజయాలు చంద్రుడిపైకి చేరుకునే ప్రయోగాలను అమెరికా, రష్యాలు పోటాపోటీగా గడచిన శతాబ్దిలోనే చేపడితే, భారత్ ఈ ప్రయోగాలను ఆలస్యంగా మొదలుపెట్టింది. తొలిసారిగా 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా పంపిన ‘చంద్రయాన్–1’ వ్యోమనౌక చంద్రుని ఉపరితలంపై నీటి జాడను గుర్తించింది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, చంద్రునిపై వాతావరణ వివరాల సేకరణ వంటి పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీని తర్వాత ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని 2019 జూలై 22న చేపట్టింది. మొదట ఈ ప్రయోగాన్ని 2013లోనే చేపట్టాలని భావించినా, ల్యాండర్ తయారీని రష్యా సకాలంలో పూర్తి చేయకపోవడంతో జాప్యం జరిగింది. రెండేళ్లు గడిచినా తాత్సారం చేస్తూ వచ్చిన రష్యా చివరకు చేతులెత్తేయడంతో భారత్ ఈ ప్రయోగాన్ని పూర్తిగా స్వయంగా అభివృద్ధి చేసుకున్న సాంకేతికతతోనే చేపట్టాలని నిశ్చయించుకుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగంలో పంపిన ఎల్వీఎం–3 రాకెట్ విజయవంతంగా ‘చంద్రయాన్–2’ వ్యోమనౌకను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే, దీని ద్వారా పంపిన ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి చేరుకోకుండానే గల్లంతైంది. ల్యాండర్ విఫలమైనా, చంద్రుని కక్ష్యలోకి చేరుకున్న ఆర్బిటర్ చంద్రునికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తోంది. ఇది ఏడున్నరేళ్లు పనిచేస్తుందని అంచనా. చంద్రునిపైకి చేరుకునే ప్రయోగాలను భారత్ ఆలస్యంగా చేపట్టినా, తొలి రెండు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. చంద్రునిపై ఆవాసాలు! చంద్రుడి వాతావరణం, ఉపరితలంలోని విశేషాలు తెలుసుకోవడానికి దేశ దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తుంటే, ఇంకొందరు చంద్రునిపై ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడంపై కలలు కంటున్నారు. చంద్రలోక నివాసం ఆలోచన మనుషుల్లో శతాబ్దాలుగా ఉంది. ఇంగ్లిష్ తత్త్వవేత్త, మతబోధకుడు జాన్ విల్కిన్స్ పదిహేడో శతాబ్దిలోనే చంద్రునిపై మానవుల నివాసాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆలోచనను వెలిబుచ్చాడు. సోవియట్ రష్యా చంద్రునిపై జరిపిన ప్రయోగం 1959లో విజయవంతం కావడంతో చంద్రునిపై నివాసాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలపై ఆశలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో చంద్రునిపై మనిషి అడుగు మోపడం మాత్రమే సాధ్యమైంది గాని, నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడిక ప్రకారం గ్రహాంతరాలలోని ప్రదేశాలపై గుత్తాధిపత్యం చలాయించడం కుదరదు. దేశాలు గాని, వ్యక్తులు గాని, సంస్థలు గాని చంద్రుడు లేదా ఇతర గ్రహాలపైనున్న స్థలాలతో వ్యాపార లావాదేవీలు సాగించడం చట్టవిరుద్ధం. అయినా, కొన్నేళ్లుగా చంద్రుడిపై ఉన్న స్థలాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. తొలిసారిగా 1936 జూన్ 15న డీన్ లిండ్సే అనే అమెరికన్ ఆసామి అంతరిక్షంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తనకే చెందుతాయని ప్రకటించుకున్నాడు. వెర్రిమాలోకాలైన కొందరు జనాలు వాటిని అతడి వద్ద నుంచి కొనుక్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. జనాల్లోని ఈ వేలంవెర్రిని గమనించే అమెరికన్ రచయిత రాబర్ట్ హీన్లీన్ 1949లో ‘ది మ్యాన్ హూ సోల్డ్ ది మూన్’ కథను రాశాడు. అంతర్జాతీయ అంతరిక్ష ఒడంబడికను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లూనార్ రిజిస్ట్రీ’ అనే సంస్థ ఎడాపెడా చంద్రుడిపై స్థలాలను కారుచౌకగా అమ్మిపారేస్తోంది. కొందరు ఔత్సాహికులు చంద్రుడిపై స్థలాలను ఈ సంస్థ వద్ద కొంటున్నారు. ఈ సంస్థ ఇచ్చే స్థలాల పట్టాలను సన్నిహితులకు కానుకలుగా కూడా బహూకరిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–1’, ‘చంద్రయాన్–2’ ప్రయోగాలు రెండూ విజయవంతమైన నేపథ్యంలో భారత్ ముచ్చటగా మూడోసారి ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపడుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ఈ ప్రయోగాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’తో కలసి చేపడుతోంది. ఈ ప్రయోగం చేపట్టడానికి జూలై 14వ తేదీ అనుకూలంగా ఉన్నట్లు ‘ఇస్రో’ అధినేత సోమనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్–3 వ్యోమనౌకను ఎల్ఎంవీ–3 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని సన్నాహాలనూ పూర్తి చేశారు. ‘చంద్రయాన్–3’ ద్వారా చంద్రుని దక్షిణధ్రువంలో ల్యాండర్‌ను సాఫ్ట్‌ల్యాండింగ్ చేయడానికి ఈ ప్రయోగం చేపడుతున్నారు. ల్యాండర్ చంద్రుని ఉపరితలం మీదకు చేరుకున్నాక, దీనికి అనుసంధానమైన రోవర్ ల్యాండర్ నుంచి విడవడి చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. దీని ద్వారా చంద్రుని ప్రకంపనలను గుర్తించే సెస్మోమీటర్ వంటి పరికరాలను పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, వాతావరణం, రసాయనాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై ఇప్పటివరకు ఎవరూ చేరుకోని ప్రదేశానికి ల్యాండర్‌ను పంపుతున్నందున ఈ ప్రయోగం భారత్‌కు మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే కీలకంగా నిలుస్తుంది. ఏ మీరిది చదివేసరికి ఈ ప్రయోగం పూర్తయివుంటుంది. చదవండి : భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
పరువు దక్కించుకునే ప్రయాణమా?
భారత్ సొంతంగా ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. అలాంటప్పుడు ‘నాసా’ ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమిటి? యూఏఈ, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారు. మన వ్యోమగాములను కూడా పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది. ఏదోలా మానవుడిని అంతరిక్షంలోకి పంపటం మన ప్రాధమ్యం కాదు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని మోదీ 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేరలేదు. దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా బహుశా ఇలా మన వ్యోమగామిని అక్కడికి పంపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన ఒప్పందాలు చాలానే జరిగాయి. వాటిల్లో అంతరిక్ష రంగానికి సంబంధించినవి కూడా రెండు ఉన్నాయి. ఒకటేమో శాంతి యుత ప్రయోజనాల కోసం అంతరిక్ష అన్వేషణకు ఉద్దేశించిన ‘ఆర్టి మిస్ అకార్డ్స్’. (ఆర్టిమిస్ అనేది ఒక గ్రీకు దేవత పేరు.) అమెరికాలో భారతీయ రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. వాషింగ్టన్‌లోని ఓ హోటల్లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నీల్సన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండో ఒప్పందం... 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) పంపే భారతీయ వ్యోమగామికి అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రాయోజకత్వం వహించడం! భారత్, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందాలు దౌత్యపరంగా, సైన్స్ పరంగా చారిత్రాత్మకమైన వని వర్ణిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న 2008 నాటి భారత్– అమెరికా అణు ఒప్పందంతో వీటిని పోలుస్తు న్నారు. అయితే వాస్తవం దీనికి చాలా భిన్నం. భారత్ సొంతంగానే ఓ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కార్యక్రమం ఒకవైపు నడుస్తూండగానే అమెరికా ప్రాయోజకత్వంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగామిని పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి నిర్వహించిన విలేఖరుల సమా వేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ– ‘‘ఆర్టిమిస్ అకార్డ్స్‌లో భాగం కావాలన్న నిర్ణయం ద్వారా అంతరిక్ష సహకారంలో నేడు మేలిమి ముందడుగు వేశాం. క్లుప్తంగా చెప్పాలంటే భారత్ – అమెరికా భాగ స్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదు’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ‘‘మనం నర్సరీ రైమ్స్ పాడుకుంటున్న సమయంలోనే జాబిల్లి ఉపరితలంపై మనిషి కాలిడేలా చేసిన అమెరికా లాంటి దేశం జాబిల్లిపై ప్రయోగాల విషయంలో మన నుంచి సమాచారాన్ని, నైపుణ్యాన్ని ఆశిస్తోందంటే అంతకంటే గర్వకారణమైన విషయం ఇంకోటి ఉంటుందా?’’ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, అంతరిక్ష, అణుశక్తి రంగాల పర్యవేక్షకులైన జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. అంతేకాదు, ఆర్టిమిస్ ఒప్పందం అంతరిక్ష రంగానికి సంబంధించిన కీలక టెక్నాలజీల దిగుమతిపై ఉన్న నియంత్రణలు తొలగేందుకు మార్గంగా మారతుందని కూడా ఆయన అన్నారు. ఫలితంగా భార తీయ కంపెనీలు అమెరికా మార్కెట్ల కోసం కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సత్తా సంపాదిస్తాయని చెప్పారు. ఆర్టిమిస్ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందం లేదా ట్రీటీ, ప్యాక్ట్ కాదు. ఆర్టిమిస్ కోసం భారతీయ నైపుణ్యాన్ని, సమాచారాన్ని కూడా కోరడం లేదు. జాబిల్లిపై ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం ఆర్టిమిస్ లక్ష్యం. కీలక టెక్నాలజీల దిగుమతిపై నియంత్రణలు తొలగించే ప్రస్తా వన కూడా ఆర్టిమిస్ ఒప్పందంలో లేదు. నాసా వెబ్సైట్లో, జూన్ 23 నాటి నాసా పత్రికా ప్రకటనలో ఉన్న సమాచారం ప్రకారం... అంత రిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం అన్వేషించడం, ఈ అన్వే షణకు సంబంధించి కొన్ని సాధారణ నియమ నిబంధనలు మాత్రమే ఉన్నాయి. పారదర్శ కత, అంతరిక్షంలో సిబ్బందికి సహకారం, ఖగోళ వస్తువుల నమోదు, శాస్త్ర సమాచారాన్ని విడుదల చేయడం, అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సుస్థిర పద్ధతుల్లో అంతరిక్షాన్ని వాడు కోవడం వంటివి. మంత్రి చెప్పిన ప్రకారం, ఒకవేళ నాసా భారత్ సహ కారాన్ని కోరుతున్నా... లేక దిగుమతులపై నిబంధనలను సడలించిందన్నా... నైజీరియా, రువాండా, బెహ్రాయిన్, కొలంబియా, ఈక్వడార్ వంటి దేశాలతో కూడా నాసా ఇదే తరహా ఒప్పందాలు చేసుకుంది. భారతదేశం ఆర్టిమిస్ అకార్డ్‌లో భాగమైన 27వ దేశమన్నది గుర్తుంచుకోవాలి. పైగా ఈ ఒప్పందాలన్నీ స్వచ్ఛందమైనవే. ఆర్టిమిస్ అకార్డ్ ఉద్దేశం బయటకు కనిపిస్తున్న దానికంటే చాలా భిన్నమైంది. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మరోసారి అమెరికా ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దీన్ని సృష్టించిందనాలి. చైనాతోపాటు ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలు అనేకం మనుగడలోకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందం ఒకటి అవసరమైంది. ఈ ఒప్పందాల ద్వారా అంతరిక్ష రంగానికి సంబంధించిన కొత్త నియమ నిబంధనలను రూపొందించేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్ష రంగానికి సంబంధించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో రూపొందిన చట్టాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఈ కాలానికి తగ్గ ట్టుగా మార్చాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశాలను ముందుగానే పసి గట్టిన చైనా, రష్యా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటివి ఆర్టి మిస్కు దూరంగానే ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆర్టిమిస్ ఒప్పందంలో పదాలను చాలా తెలివిగా ఉపయోగించారు. ఔటర్ స్పేస్ ట్రీటీకి (ఐక్యరాజ్య సమితి సిద్ధం చేసింది. 1967 జనవరి 27వ తేదీ నుంచి దేశాల ఆమోద ముద్రను ఆహ్వానిస్తున్నది) కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెబుతూనే కొన్ని కొత్త విష యాలను ఇందులోకి చేర్చారు. ఈ ఒప్పందంలో వ్యోమగాముల రక్షణ వంటి విషాయల్లో ఐక్యరాజ్య సమితి ఒప్పందంతోపాటు ఖగోళ వస్తువుల వల్ల కలిగే నష్టానికి బాధ్యులపై 1972లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందానికీ కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కానీ... ఆర్టిమిస్‌లో అంతరిక్ష వారసత్వాన్ని కాపాడటం, సహజ వనరుల వినియోగానికి సురక్షిత ప్రాంతాల ఏర్పాటు (ఐక్యరాజ్య సమితి ఒప్పందాలకు భిన్నంగా) వంటి ఆలోచనలను జొప్పించారు. ఆర్టిమిస్ అకార్డ్ భవిష్య త్తులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి చేసే అంతరిక్ష ఒడంబడికలోని ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఉద్దేశించిన ట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బహుముఖీన సిద్ధాంతాలను తోసి రాజన్నారు. భారత్ ఇవేవీ ఆలోచించకుండా దౌత్యపరమైన వలలో చిక్కుకుంది. దేశీయంగా ఎలాంటి చర్చ జరపకుండా, అంతరిక్ష చట్టం ఏదీ చేయకుండా ‘ఊ’ కొట్టేసింది. అమెరికాతో కుదిరిన అంతరిక్ష ఒప్పందాల్లో ఇంకోటి వచ్చే ఏడాది నాసా భారతీయ వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడం. ఇది కూడా చాలా చిత్రమైందనే చెప్పాలి. ఎందుకంటే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ ఇప్పటికే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నలుగురు వ్యోమగాములు రష్యాలో శిక్షణ కూడా పొందుతున్నారు. అమెరికా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమ గాములను పంపాలని అనుకుని ఉంటే ఆ పని ‘ఇస్రో’ ఎప్పుడో చేసి ఉండేది. ఎందుకు చేయలేదంటే, మానవుడిని అంతరిక్షంలోకి పంపటం ఇస్రో ప్రాధమ్యం కాదు కాబట్టి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇప్పటివరకూ 21 దేశా లకు చెందిన 269 మంది వ్యోమగాములు అక్కడికి వెళ్లారు. అమెరికా, యూరోపియన్ దేశాలను మినహాయించినా యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్, సౌదీ అరేబియా, మలేసియా వ్యోమగాములు కూడా ఇక్కడకు వెళ్లారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు భారత్ సొంతంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడికి వ్యోమగామిని పంపేందుకు తొందర పడటం ఎందుకు? భారత్ స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అయ్యే సమయానికి భారతీయ వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 2018లో ప్రకటించారు. ఈ అతిశయోక్తి హామీ నెరవేర లేదు. అందుకే దానికొక అల్ప ప్రత్యామ్నాయంగా, పరువు దక్కించు కోవడానికి బహుశా ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమ గామిని పంపనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..
అంతరిక్షయాత్రలు, వ్యోమగాముల గురించిన కథనాలు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంటాయి. అలాంటి వ్యోమగాములలో ఒకరే వాల్దిమిర్ మిఖాయిలోచివ్ కొమారోవ్. రష్యా వ్యోమగామి అయిన ఈయన అంతరిక్షయాత్రలోనే కన్నుమూసిన తొలివ్యక్తి. 1967, ఏప్రిల్ 24న తన రెండవ అంతరిక్షయానం నుంచి తిరిగివస్తున్న సందర్బంలో స్పేస్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో కన్నుమూశారు. సోవియట్ టెస్ట్ పైలెట్, ఎయిర్‌ఫోర్స్ ఇంజినీరు, కాస్మోనాట్ అయిన వ్లాదిమిర్ 1964లో అధిక సిబ్బందిని మోసుకువెళ్లే మొదటి వ్యోమనౌక వోస్కోడ్ -1కు.. సారధ్య బాధ్యతలు నిర్వహించారు. కొమారోవ్ ముగ్గురు సభ్యుల అంతరిక్ష నౌక వోస్కోడ్ను 16 సార్లు భూ మండలం చుట్టూ నడిపారు. సోయుజ్- 1కు సోలో పైలట్‌గా ఎంపికైనప్పుడు అతను రెండుసార్లు అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యోమగామిగా నిలిచారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అనుభవం, అంతరిక్షయానంలో శిక్షణ పొందిన 18 మందిలో ఒకరైన కొమారోవ్ 1964 అక్టోబరు 12న అంతరిక్షయానంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. రష్యా సమాచార సంస్థ టీఏఎస్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం సోయుజ్-1కు సంబంధించిన కక్ష్య విన్యాసాలు,సిస్టమ్ పరీక్షలతో కూడిన విమాన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దీని తరువాత 1967 ఏప్రిల్ 24న ఈ అంతరిక్షనౌకను భూమికి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోయుజ్-I 23,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఒక పారాచూట్‌ని వినియోగించాల్సి ఉంది. ఇది కొమరోవ్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈలోపు పారాచూట్ లైన్ చిక్కుకుపోయింది. ఆ సమయంలో బ్యాకప్ పారాచూట్ లేదు. పారాచూట్ తెరుచుకోవడంలో విఫలం కావడంతో విమానం 4.5 మైళ్లు (7.24 కిమీ) ఎత్తునుంచి భూమి మీద పడిపోయింది. ది గార్డియన్ వెలువరించిన రిపోర్టు ప్రకారం ఈ ఘటనపై రష్యా స్పందిస్తూ ‘ప్రాథమిక నివేదికల ప్రకారం పారాచూట్‌లోని ప్రధాన భాగం ఏడు కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకున్న సమయంలో పారాచూట్ పట్టీలు ముడుచుకుపోయాయి. ఇంతలో వ్యోమనౌక వేగంగా భూమిపై పడిపోయింది. ఈ దుర్ఘటన కొమరోవ్ మరణానికి దారితీసింది’ అని పేర్కొంది. సోయుజ్-1 మునుపటి రష్యన్ క్రాఫ్ట్ కంటే అధిక బరువు కలిగి ఉందని, ఇందులో సాధారణం కన్నా రక్షణ మార్జిన్లు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. -
సమయం ఆదియందు... మెల్లిగా సాగెను...!
ఎంతకూ రాని బస్సు కోసం అసహనంగా ఎదురు చూస్తున్నప్పుడో, చేస్తున్న పని పరమ బోరుగా అనిపిస్తున్నప్పుడో ఎలా ఉంటుంది? టైం అస్సలు సాగడం లేదని అనిపిస్తుంది. కదూ! కానీ ఆదియందు, అంటే బిగ్ బ్యాంగ్ జరిగి, ఆ మహా విస్ఫోటనం నుంచి ఈ మహా సృష్టి పురుడు పోసుకుంటున్న తొలినాళ్లలో సమయం నిజంగానే నింపాదిగా సాగేదట! ఎంతగా అంటే, ఇప్పటి వేగంలో అది కేవలం ఐదో వంతు మాత్రమేనని అంతరిక్ష శాస్త్రవేత్తలు తాజాగా సూత్రీకరించారు...! సృష్టి తొలినాళ్లలో సమయ విస్తరణ (టైం డైలేషన్) తీరుతెన్నులపై సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అధ్యయనం జరిపారు. కాసర్స్ అని పిలిచే సృష్టిలోకెల్లా అతి తేజోమయమైన, అత్యంత చురుకైన బృహత్ కృష్ణబిలాల సమూహాలను లోతుగా పరిశీలించారు. దాదాపు 1,230 కోట్ల ఏళ్ల క్రితం కాలం ఇప్పుడు సాగుతున్న వేగంలో కేవలం ఐదో వంతు వేగంతో నడిచేదని తేల్చారు. ఇలా చేశారు: పరిశోధక బృందం తమ అధ్యయనానికి కాసార్స్ను కాలమానినిగా మార్చుకుంది. బిగ్ బ్యాంగ్ తరువాత దాదాపు 150 కోట్ల ఏళ్ల కాల పరిధిలోని మొత్తం 190 కాసర్స్ నుంచి వెలువడే దురి్నరీక్ష్య కాంతులను పరిశోధనలో వాడుకుంది. పలు తరంగధైర్ఘ్యాల్లో వాటి ప్రకాశాన్ని నేడు ఉనికిలో ఉన్న కాసర్స్తో సరిపోల్చారు. కాల ప్రవాహ గతిలో చోటు చేసుకునే కీలక నిర్దిష్ట మార్పుల్లో కొన్ని నేటితో పోలిస్తే అప్పట్లో కేవలం ఐదో వంతు వేగంతో జరిగేవని తేల్చారు. కోటి సూర్య సమప్రభలు... కాసర్స్ అని పిలిచే కాంతిపుంజ సమూహంలోని ఒక్కో కృష్ణ బిలం పరిమాణం అత్యంత భారీగా ఉంటుంది. ఎంతగా అంటే, కొన్ని కృష్ణ బిలాలు సూర్యుని కంటే ఏకంగా కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవి! అవి తమ పరిధిలోకి వచ్చిన ఎంతటి పదార్థాన్ని అయినా అనంత ఆకర్షణ శక్తితో లోనికి లాగేసి అమాంతంగా మింగేస్తాయి. ఆ క్రమంలో లెక్క లేనన్ని వెలుతురు పుంజాలను సృష్టి మూలమూలలకూ వెదజల్లుతుంటాయి. చుట్టూ అనంత కాంతి వలయాలతో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. ‘కాలమనే కాన్సెప్ట్ మనకింకా పూర్తిగా అర్థమే కాలేదని చెబితే అతిశయోక్తి కాబోదు. కాలం తీరుతెన్నులు, పరిమితులు తదితరాల గురించి కూడా మనకు తెలిసింది బహు స్వల్పం. అందుకే టైం ట్రావెల్ ( భూత, భవిష్యత్తులోకి వెళ్లగలగడం) వంటివి సాధ్యం కాదని చెబితే అది తొందరపాటే అవుతుంది‘ – గెరైంట్ లెవిస్, అధ్యయన బృంద సారథి, సిడ్నీ యూనివర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో నేపథ్య గానం!
పారిస్: అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తున్న శబ్దాలకు సంబంధించిన విశేషాలను ఖగోళ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. గురుత్వాకర్షణ తరంగాల నుంచి ఉద్భవిస్తున్న ధ్వనులపై ఒక ప్రకటన చేశారు. అంతరిక్షంలో వినిపిస్తున్న శబ్దాలకు సంబంధించిన నేపథ్య(బ్యాక్‌గ్రౌండ్) స్వరాలను గుర్తుపట్టినట్లు తెలియజేశారు. ఈ ప్రయోగంలో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సైతం కీలక పాత్ర పోషించడం విశేషం. పుణెలో ఉన్న రేడియో టెలిస్కోప్‌కు ఆ ధ్వని తరంగాలు చిక్కాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆ డేటాను సేకరిస్తున్నారు. అంతరిక్షంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆ లయబద్ధమైన శబ్దాలు(హమ్మింగ్) వస్తున్నట్లు తేల్చారు. నార్త్ అమెరికన్ నానోహెట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషన్ వేవ్స్ బృందం ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఇండియా, కెనడా, యూరప్, చైనా, ఆ్రస్టేలియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. పల్సర్స్ అనే మండిన నక్షత్రాల నుంచి గురుత్వాకర్షణ తరంగాలు వస్తున్నట్లు గుర్తించారు. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ శబ్దాలను సృష్టిస్తున్నట్లు తేల్చారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు శతాబ్దం క్రితమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించారు. -
అంతరిక్షంలో వన్డే ప్రపంచకప్!
వన్డే ప్రపంచకప్‌కు మరో 100 రోజుల సమయం ఉంది. భారత్‌లో జరిగే ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐ సంయుక్తంగా కొత్త తరహాలో ప్రచారాన్ని మొదలు పెట్టాయి. వరల్డ్ కప్ ట్రోఫీని ఏకంగా అంతరిక్షంలోకి పంపించి టోరీ్నపై ఆసక్తిని మరింతగా పెంచే ప్రయత్నం చేశాయి. బిస్పోక్ బెలూన్‌తో జత చేసిన ట్రోఫీ భూమి నుంచి 1 లక్షా 20 వేల అడుగుల ఎత్తులో ఉన్న ‘స్ట్రాటోస్ఫియర్’ను చేరింది. అక్కడ ఉన్న ట్రోఫీని 4కె కెమెరాతో కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ నేలకు దిగి నేరుగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరింది. నేటినుంచి జరిగే వరల్డ్ టూర్లో భాగంగా ట్రోఫీ 18 దేశాలకు ప్రయాణిస్తుంది. ఇందులో ప్రపంచ కప్‌లో భాగం కాని కువైట్, బహ్రెయిన్, మలేసియా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలు కూడా ఉన్నాయి. నేడు ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
దిగంతారా రూ.82 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక రంగంలోని అంకుర సంస్థ దిగంతారా తాజాగా రూ.82 కోట్ల నిధులను అందుకుంది. సిరీస్-ఏ1 రౌండ్లో పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, కలారీ క్యాపిటల్, గ్లోబల్ బ్రెయిన్స్, క్యాంపస్ ఫండ్‌తోపాటు ఐఐఎఫ్ఎల్ వెల్త్ వ్యవస్థాపకులు ఈ మొత్తాన్ని సమకూర్చారు. స్పేస్-మిషన్ అష్యూరెన్స్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాలను ఈ నిఘా ఉపగ్రహాలు గుర్తిస్తాయని వివరించింది. త్వరలో కంపెనీ వీటిని ప్రవేశపెట్టనుంది. (హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు) కాన్ ఫిన్ హోమ్స్ నిధుల సమీకరణ గృహ రుణ సంస్థ కాన్ ఫిన్ హోమ్స్ రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ లేదా రైట్స్ ఇష్యూ ద్వారా మరో రూ. 1,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. పీఎస్ యూ కెనరా బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీ బోర్డు నిధుల సమీకరణ ప్రణాళికలకు సోమవారం ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. మారి్పడిరహిత డిబెంచర్లు తదితర రుణ సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 4,000 కోట్లు, క్విప్ లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లేదా రైట్స్ ద్వారా మరో రూ. 1,000 కోట్లు అందుకోవాలని భావిస్తోంది. బీఎస్ఈలో 0.6 శాతం నీరసించి రూ. 745 వద్ద ముగిసింది. (WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) -
నక్షత్రాకాశం మాయం కానున్నదా?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు. నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు. కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత ‘ మొబైల్: 9849062055 -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
మొదటిసారిగా అంతరిక్షంలోకి పౌర వ్యోమగామిని పంపిన చైనా
బీజింగ్/జియుక్వాన్: చైనా మంగళవారం మొదటిసారిగా ఒక పౌర వ్యోమగామి సహా ముగ్గురు వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌కు పంపించింది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములతో కూడిన షెంజౌ–16ను లాంగ్ మార్చ్–2ఎఫ్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పది నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన షెంజౌ–16 నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా మానవసహిత అంతరిక్ష సంస్థ(సీఎంఎస్ఏ) తెలిపింది. ఈ మిషన్ పూర్తిగా విజయవంతంగా పూర్తయిందని పేర్కొంది. ‘షెంజౌ–16 అనంతరం టియాంగాంగ్ కోర్ మాడ్యూల్తో అనుసంధానమైంది. షెంజౌ–16లోని ముగ్గురు వ్యోమగాములు కోర్‌మాడ్యూల్ తియాన్హెలో ఉన్న ఇప్పటికే ఉన్న ముగ్గురు వ్యోమగాములను కలుసుకున్నారు. ఆ ముగ్గురు త్వరలోనే భూమికి తిరిగి వస్తారు’అని తెలిపింది. మంగళవారం పంపిన ముగ్గురిలో ఒకరు పేలోడ్ స్పెషలిస్ట్‌గా పేరున్న గుయి హయిచావో. ఈయన బీజింగ్‌లోని బీయిహంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. మిగతా ఇద్దరు పీపుల్స్ లిబరేషన్ ఆర్మికి చెందిన వారు. 2030కల్లా చంద్రునిపైకి మనుషులను పంపే మానవ సహిత యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంఎస్ఏ సోమవారం ప్రకటించింది. -
కెమెరా కంటికి చిక్కిన సూపర్నోవా
సువిశాలమైన అంతరిక్షం.. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలం. అంతరిక్షంలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో కొన్ని అంతరించిపోతుంటాయి. తారల జీవితకాలం ముగియగానే వాటిలోని ఇంధనం మండిపోయి, అదృశ్యమైపోతుంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది? అంతమయ్యే ముందు ఏం జరుగుతుంది? నక్షత్రాలు మృత తారలుగా మారడానికి ముందు పరిణామాలేంటి? ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తి ఉన్నప్పటికీ మన కంటికి కనిపించవు. నక్షత్రాలు మన భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే ఇందుకు కారణం. తారల కేంద్ర భాగం(కోర్)లో అణు విచ్ఛిత్తి జరిగి పేలిపోతుంటాయి. నక్షత్రాలు పేలిపోయి, అంతం కావడాన్ని సూపర్నోవా అంటారు. ఇలాంటి ఒక సూపర్నోవాను ప్రముఖ అస్ట్రో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాలో చక్కగా బంధించారు. పిన్‌వీల్ లేదా ఎం10 అనే పాలపుంత(గెలాక్సీ)ని ఆయన తన టెలిస్కోప్‌తో నిశితంగా పరిశీలించారు. ఆ పాలపుంతలో కాలం తీరిన ఒక నక్షత్రం పేలిపోయి, అంతమైపోవడాన్ని టెలిస్కోప్ ద్వారా కొన్ని ఫ్రేమ్‌లను తన కెమెరాలో బంధించి, దృశ్యబద్ధం చేశారు. దీన్ని ఒక యానిమేషన్‌గా మార్చారు. మృత నక్షత్రాన్ని చిత్రీకరించడానికి ఆ గెలాక్సీకి సంబంధించిన కలర్ డేటాను ఉపయోగించానని ఆండ్రూ మెక్‌కార్తీ చెప్పారు. నక్షత్రానికి చెందిన 10 నిమిషాల ఎక్సపోజర్తో యానిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఎరుపు, తెలుపు వర్ణాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. మరో విశేషం ఏమిటంటే.. సూర్యుడు తన జీవితకాలమంతా వెలువరించే శక్తి కంటే ఎక్కువ శక్తి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సంభవించే సూపర్నోవాలో వెలువడుతుందట! కాంతి, వేడి, రేడియేషన్ రూపంలో ఈ శక్తి ఉద్గారమవుతుంది. సూపర్నోవా గాఢమైన ప్రభావం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పిన్‌వీల్(ఎం10) పాలపుంత(మిల్కీవే) ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత కంటే 70 శాతం పెద్దది. దాని వ్యాసం 1,70,000 కాంతి సంవత్సరాలు. మన భూమి నుంచి 21 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్!
యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపించే అర్టెమిస్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భారీ నాసా కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో బెజోస్ ఏరో స్పెస్ కంపెనీ బ్లూ ఆరిజన్ని స్థాపించిన విషయం తెలిసింది. తాజాగా నాసా ‘ఆర్టెమిస్ వి’ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లూ ఆరిజన్ సంస్థ ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదికి (మూన్ సర్ఫేస్) పంపే స్పేస్‌క్రాఫ్ట్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే విషయాన్ని నాసా చీఫ్ అధికారికంగా ప్రకటించారు. నాసా నిర్ణయంతో రెండో ప్రాజెక్ట్‌పై బ్లూ ఆరిజన్ పనిచేయనుంది. ఇప్పటికే అర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఆస్ట్రోనాట్స్ లూనార్ సర్ఫేస్‌లోకి అడుగు పెట్టేలా స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. 2021లో అదే స్టార్‌షిప్ స్పేస్ క్రాప్ట్ సాయంతో లూనార్ సర్ఫేస్‌లోకి ఆస్ట్రోనాట్స్ విజయ వంతంగా కాలు మోపారు. దాదాపూ పదేళ్ల తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్ విజయవంతంమైంది. దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 24,850 కోట్లు. బ్లూ ఆరిజన్ ప్రాజెక్ట్ విలువ రూ.28,150 కోట్లు ఇక తాజాగా జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజన్ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్ విలువ అక్షరాల 3.4 బిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్ చీఫ్ జిఫ్ ఫ్రీ తెలిపారు. సంతోషంగా ఉంది. నాసా ప్రాజెక్ట్ దక్కించుకోవడంపై బెజోస్ ట్వీట్ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. Honored to be on this journey with @NASA to land astronauts on the Moon — this time to stay. Together, we’ll be solving the boil-off problem and making LOX-LH2 a storable propellant combination, pushing forward the state of the art for all deep space missions. #Artemis… pic.twitter.com/Y0zDhnp1qX — Jeff Bezos (@JeffBezos) May 19, 2023 2029లో ప్రారంభం కానున్న ప్రయోగం నాసా కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్ 50 అడుగుల పొడవైన ‘బ్లూమూన్’ అనే స్పేస్ క్ట్రాఫ్ట్ను తయారు చేయనుంది. తయారీ అనంతరం ఈ స్పేస్ క్రాప్ట్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ప్రయాణించి మూన్ సర్ఫేస్‌లో అడుగు పెట్టనున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! -
అరుదైన అంతరిక్ష శిల అరుదెంచె..
న్యూజెర్సీ: సువిశాలమైన అంతరిక్షంలో వింతలు విడ్డూరాలకు అంతు లేదు. మనకు తెలియని ఎన్నెన్నో విశేషాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడుతుంటాయి. ఇలాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతుల్లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాన్‌డ్రైట్ అంతరిక్ష శిల(గ్రహ శకలం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్వెల్ టౌన్షిప్లో ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలప గచ్చు కొంత ధ్వంసమయ్యింది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొకలోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు ‘ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ’ సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌తో క్షుణ్నంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల (దాదాపు ఒక కిలో) బరువు ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ ఫిజిక్స్ డిపార్టుమెంట్ చైర్మన్ నాథన్ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు. -
కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కాలం చెల్లిన జీశాట్–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. 2011 జులై 15న పీఎస్ఎల్వీ సీ17 రాకెట్ ద్వారా జీశాట్–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. శుక్రవారంతో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది. -
ఆ గ్రహంపై బంగాళ దుంప పిండి, ఉప్పుతో ఇళ్లు కట్టుకోవచ్చు.. అసలు మ్యాటర్ ఇదే!
భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం అంగారకుడు (Mars). మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇలా అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని సైంటిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే దృఢమైన ఇటుకలను ఇటీవల మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటి తయారీకి వారు వాడిన పదార్థాలను తెలుసుకుంటే, ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణ కాంక్రీట్ దారుఢ్యం గరిష్ఠంగా 70 ఎంపీఏ వరకు ఉంటే, మాంచెస్టర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఇటుకల దారుఢ్యం 72 ఎంపీఏ వరకు ఉండటం విశేషం. అంతరిక్ష ధూళి, బంగాళ దుంపలు, ఉప్పు సహా వివిధ పదార్థాల సమ్మేళనంతో తయారు చేసిన కాంక్రీట్ తరహా పదార్థాన్ని ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేశారు. ఇటుకల తయారీకి ఉపయోగించిన ఈ పదార్థానికి వారు ‘స్టార్‌క్రీట్’గా నామకరణం చేశారు. దీనిని ‘కాస్మిక్ కాంక్రీట్’గా కూడా అభివర్ణిస్తున్నారు. అత్యంత దృఢమైన కాంక్రీట్ తయారీలో భాగంగా వీరు చంద్రుడి ధూళిని ఉపయోగించి తయారు చేసిన ఇటుకల దారుఢ్యమైతే ఏకంగా 91 ఎంపీఏ పైగానే ఉంది. తమ ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కాంక్రీట్‌ను రూపొందించగలమని మాంచెస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల
అంతరిక్షంలో పర్యటించాలనుకునే భారతీయుల కల నెరవేరనుంది. ఈ కల సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని.. దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం సొంతంగాఒక మాడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలిపారు.టికెట్ ధర రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సబ్ ఆర్బిటలా.. ఆర్బిటలా... అంతరిక్ష పర్యటన ఆర్బిటల్గా ఉంటుందా లేక సబ్ ఆర్బిటల్గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. టికెట్ ధర రూ.6 కోట్లు అంటున్నారు కాబట్టి.. ఇది సబ్ ఆర్బిటల్ పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే వేగాన్ని బట్టి ఆర్బిటల్ పర్యటనా.. సబ్ ఆర్బిటల్ పర్యటనా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్.. ఆర్బిటల్ వెలాసిటీ (కక్ష్య వేగం)తో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్ క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో (గాల్లో తేలియాడేలా) ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత (అమెజాన్ వ్యవస్థాపకుడు) జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. పర్యాటక మాడ్యూల్ కోసం ప్రయత్నాలు సబ్ ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి జితేంద్రప్రసాద్ రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు. అంతరిక్ష పర్యాటక మాడ్యూల్‌ను తయారు చేసేందుకు నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్–స్పేస్) ద్వారా ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఘనత టిటోదే అంతరిక్ష పర్యాటకం చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్ స్పేస్ టూరిజాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్ మిలియనీర్ డెన్నిస్ టిటో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ టూరిస్ట్ ఆయనే. కానీ.. 2010లో రష్యన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయడంతో అంతరిక్ష పర్యాటకం అక్కడితోనే ఆగిపోయింది. అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ ఉంది. అందుకే అంతర్జాతీయంగా వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్ స్పాన్, బోయింగ్, స్పేస్ అడ్వెంచర్స్, జీరో టు ఇన్ఫినిటీ వంటి ప్రైవేట్ స్పేస్ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్ ఫ్లైట్స్‌ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. రష్యన్ స్పేస్ ఏజెన్సీ నిలిపివేసిన స్పేస్ టూ రిజం కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆ ప్రయత్నంలో జెఫ్ బెజోస్ విజయం సాధించారు కూడా. వర్జిన్ గెలాక్టిక్ తన స్పేస్ ఫ్లైట్ వీఎస్ఎస్ యూనిటీని 2018లో పరీక్షించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ స్పేస్ టూరిస్టులు వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. వాళ్లంతా డిపాజిట్లు కట్టి పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో వాటి సరసన మన ఇస్రో స్పేస్ రాకెట్లు కూడా ఉండే అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి -
ఇక.. అంతరిక్ష విద్యుత్
సాక్షి, అమరావతి: అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టడమంటేనే ఒకప్పుడు అత్యంత అద్భుతంగా భావించేవారు. కానీ విజ్ఞాన ప్రపంచం విశ్వమంతా వ్యాపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసాధ్యమనుకున్నవాటిని సుసాధ్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆవిష్కరణే అంతరిక్ష సౌరవిద్యుత్ (స్పేస్ సోలార్ పవర్ – ఎస్ఎస్పీ). నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. భూమి మీద వివిధ పద్ధతుల ద్వారా, అనేక వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గురించే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ.. తాజా ఆవిష్కరణ వాటికి విభిన్న విధానం. అంతరిక్షంలో పగలు, రాత్రి, రుతువులు, మేఘాల కవచం వంటి కాలచక్రాలతో సంబంధం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విద్యుత్‌ను భూమి మీదకు తీసుకొచ్చే పరిశోధనలు 2011లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకుపడింది. నాలుగు శాతమే వాడుతున్నాం సౌరవిద్యుత్‌ను 1800 సంవత్సరం చివరి నుంచి వాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోని విద్యుత్‌లో నాలుగు శాతం (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శక్తినివ్వడంతోపాటు) మాత్రమే సౌరవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, నీటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నీటివనరులు ఇప్పటికే చాలావరకు తగ్గిపోగా.. బొగ్గు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమం ప్రపంచ దేశాల్లో మొదలైంది. దీంతో అపారంగా ఉన్న సౌరశక్తిని వాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. దీన్లో భాగమే ఈ ప్రయోగం. భవిష్యత్‌లో దీనిద్వారా భూమి మీదకు వైర్లెస్ విధానంలో సౌరవిద్యుత్ ప్రసారం చేయగలమని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ఏమిటీ ప్రయోగం సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమనుకున్న అనేక విషయాలను నేడు శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. ఆ కోవలో మొదలైనదే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌పీపీ). ఇదొక అంతరిక్ష పరిశోధన. ఈ పరిశోధన కోసం గత నెలలో కాలిఫోర్నియా నుంచి స్పేస్ సోలార్ పవర్ డెమాన్స్ట్రేటర్ (ఎస్ఎస్పీడీ)ను అంతరిక్షంలోకి పంపారు. ట్రాన్స్పోర్టర్–6 మిషన్‌లో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా మోమెంటస్ విగోరైడ్ అంతరిక్షనౌక 50 కిలోల బరువున్న ఎస్ఎస్పీడీని అంతరిక్షానికి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యరశ్మిని సేకరించి, దాన్ని విద్యుత్తుగా మార్చే మాడ్యులర్ స్పేస్‌క్రాఫ్ట్ సముదాయాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఇది విద్యుత్తును చాలా దూరం వరకు వైర్లెస్ రూపంలో ప్రసారం చేస్తుంది. కొన్ని పరిణామాల అనంతరం చివరికి పవర్ స్టేషన్‌గా ఏర్పడుతుంది. 32 రకాల ఫోటోవోల్టాయిక్‌లు అంతరిక్ష వాతావరణంలోని సౌరకణాలను విద్యుత్‌గా మార్చేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తాయి. మైక్రోవేవ్ పవర్ ట్రాన్స్‌మీటర్ ద్వారా వైర్లెస్ విధానంలో విద్యుత్‌ను ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ సెటప్ అంతా అంతరిక్షంలో అమర్చగానే భూమిపై ఉన్న కాల్టెక్ బృందం తమ ప్రయోగాలను ప్రారంభించింది. కొన్ని కెమెరాలు ప్రయోగం పురోగతిని పర్యవేక్షిస్తూ, భూమికి సమాచారం పంపిస్తున్నాయి. కొద్దినెలల్లోనే ఎస్ఎస్పీడీ పనితీరుపై పూర్తి అంచనా వేయగలమని ఎస్‌ఎస్‌పీపీ బృందం భావిస్తోంది. -
కృష్ణబిలం పుట్టింది!
అంతరిక్షంలో ఒక అరుదైన దృగ్విషయం సైంటిస్టుల కంటబడింది! రెండు న్యూట్రాన్ నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి కిలోనోవాగా పేర్కొనే భారీ పేలుడుకు దారి తీయడమే గాక, చూస్తుండగానే శక్తిమంతమైన కృష్ణబిలంగా రూపొంతరం చెందాయి. ఇటీవలి కాలంలో అంతరిక్షంలో చోటుచేసుకున్న అత్యంత శక్తిమంతమైన పేలుడు ఇదేనని నాసా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు తారలూ కలిసిపోయి కొద్దిసేపు ఒకే తారగా మారి అలరించాయట. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ నుంచి సైంటిస్టులు సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. ఇదంతా మనకు 1.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్జీసీ4993 గెలాక్సీలో చోటుచేసుకుందట. -
పండోరా క్లస్టర్
అంతరిక్షంలో మనకు సుదూరంలో ఉన్న ‘పండోరాస్ క్లస్టర్’ తాలూకు అద్భుత దృశ్యాలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తొలిసారిగా తన అత్యాధునిక నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా సాయంతో ఇలా అందంగా బంధించింది! మూడు భారీ గెలాక్సీల సమూహాలు పరస్పరం కలసిపోయి ఒక మెగా క్టస్టర్‌గా ఏర్పడ్డ తీరును నాన్ని కూడా ఈ క్లస్టర్లో గమనించవచ్చని నాసా చెబుతోంది. అంతేగాక ఈ కలయిక వల్ల పుట్టుకొచ్చిన అతి శక్తిమంతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల పండోరాకు ఆవల మరింత సుదూరాల్లోని గెలాక్సీలను కూడా పరిశీలించడం జేమ్స్ వెబ్‌కు సులువుగా మారిందట! పండోరా క్లస్టర్‌ను భూమి నుంచి ఇంత స్పష్టంగా వీక్షించగలగడం ఇదే తొలిసారి. -
సౌదీ స్పేస్ మిషన్‌లో లింగ సమానత్వం.. మహిళా వ్యోమగామికి చోటు
రియాధ్: సౌదీ అరేబియా తమ తొలి మహిళా వ్యోమగామి, పురుష వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఈ మిషన్ చేపట్టనుంది. వ్యోమగాములు రేయానా బర్నావి, అలీ అల్కార్నీ AX-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న రెండో పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్ ఇదే. మానవ జాతికి సేవ చేయడం, అంతరిక్షం అందించే ప్రయోజనాలు పొందడం కోసం మానవ అంతరిక్షయానంలో సౌదీ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యం అని అని సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఈ మిషన్ అమెరికా నుంచి ప్రారంభం కానుంది. సౌదీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు మరియం ఫర్దౌస్, అలీ అల్గామ్డిలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. సౌది చేపడుతున్న ఈ అంతరిక్ష యాత్ర చారిత్రాత్మకమైనది. ఎందుకంటే ఒకే దేశానికి చెందిన ఇద్దరు వ్యోమగాములను ఒకేసారి ఐఎస్ఎస్కు తీసుకెళ్లిన ప్రపంచంలోని అది కొద్ది దేశాల్లో సౌదీ ఒకటిగా నిలుస్తుంది. ఇదిలాఉండగా సౌదీ యువరాజు, సౌదీ స్పేస్ కమిషన్ మొదటి ఛైర్మన్ సుల్తాన్ బిన్ సల్మాన్ అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అరబ్, ముస్లిం, రాయల్‌గా అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. మాజీ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఈయన జూన్ 17, 1985న పేలోడ్ స్పెషలిస్ట్‌గా అమెరికన్ STS-51-G స్పేస్ షటిల్ మిషన్‌లో ప్రయాణించారు. చదవండి: ప్రతి నెల 14న ప్రేమికుల రోజు జరుపుకొనే దేశమేదో తెలుసా? -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్ఎస్లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు! -
Asteroid: మిస్సైల్ కంటే వేగంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
వాషింగ్టన్: భూమికి సమీపంగా రోజూ ఎన్నో గ్రహశకలాలు వెళ్తుంటాయి. కొత్తవాటిన్నెంటినో గుర్తిస్తుంటారు కూడా. అయితే.. భూమికి అత్యంత సమీపంగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు చెబుతుంటారు. ఎందుకంటే వాటిలో ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి కాబట్టి. అలాగే.. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఓ భారీ గ్రహశకలం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 వైజీ5.. భూమి వైపు దూసుకొస్తోందట. డిసెంబర్ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా హెచ్చరిస్తోంది. గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. విశేషం ఏంటంటే.. ఆస్టరాయిడ్ 2022 వైజీ5ను డిసెంబర్ 24 తేదీనే గుర్తించింది నాసా. ఇది అపోలో గ్రూప్ గ్రహశకలాలకు చెందిందని, సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే గ్రహశకలాలు, అందునా భూమిని ఢీ కొట్టే సంభావ్యత ఉన్న వాటిని దారి మళ్లించడం, లేదంటే అంతరిక్షంలోనే నాశనం చేసే ఉద్దేశ్యంతో ‘డార్ట్’ పేరిట ప్రయోగం చేపట్టి.. విజయం సాధించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. అయితే.. ముందస్తు హెచ్చరికలు, సమయం ఉంటేనే దూసుకొచ్చే వాటిని ఢీ కొట్టడానికి స్పేస్షిప్లను ప్రయోగించడానికి వీలవుతుంది. డార్ట్ బరువు 570 కేజీలు ఉంటుంది. వాస్తవానికి గ్రహశకలాలను, భూమి వైపు దూసుకొచ్చే మరేయితర వస్తువులను నాశనం చేయడం డార్ట్ ఉద్దేశం కాదు.. కేవలం దారి మళ్లించడం మాత్రమే లక్ష్యం. కానీ, ప్రయోగంలో శకలాలు నాశనం అవ్వొచ్చని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. మరోవైపు చైనా కూడా గ్రహశకలాలను నుంచి తమ భూభాగాల్ని, ఉపగ్రహాల్ని.. అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని రక్షించుకునేందుకు సొంతంగా ఇలాంటి రక్షణ వ్యవస్థను సిద్ధంగా చేసుకుంటోంది. 2025లో ప్రయోగాత్మకంగా గ్రహశకలాల మళ్లింపును పరీక్షించాలని భావిస్తోంది. -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
మార్మిక వృత్తాల గుట్టు వీడింది
వాషింగ్టన్: అంతరిక్షంలో సుదూరాల్లో అప్పుడప్పుడూ తళుక్కుమనే మార్మిక వృత్తాల గుట్టును భారత జెయింట్ మీటర్వేవ్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ) తాజాగా ఛేదించింది. భారత్‌తో పాటు పలు ఇతర దేశాలకు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం జీఎంఆర్టీ సాయంతో వీటిపై లోతుగా పరిశోధనలు చేసింది. ఆడ్ రేడియో సర్కిల్స్ (ఓఆర్సీ)గా పిలిచే ఇవి థర్మో న్యూక్లియర్ సూపర్నోవా తాలూకు అవశేషాలు అయ్యుంటాయని అత్యంత శక్తిమంతమైన రేడియో టెలిస్కోప్‌ల సాయంతో తేల్చింది. విశ్వంలో సంభవించే అతి పెద్ద పేలుళ్లను సూపర్నోవాగా పిలుస్తారన్నది తెలిసిందే. ఈ ఓఆర్సీల నుంచి నిరంతరం భారీగా రేడియో ధార్మికత వెలువడుతూ ఉంటుంది. వీటిలో కొన్ని ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటారు. అంతేగాక అసంఖ్యాక గ్రహాలకు నిలయమైన మన పాలపుంత కంటే కూడా 10 రెట్లు పెద్దవట! ఈ పరిశోధనకు నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఏఆర్ఐఈఎస్) సైంటిస్టు డాక్టర్ అమితేశ్ ఒమర్ సారథ్యం వహించారు. పాలపుంతల్లో ఏదైనా తార అతి భారీ కృష్ణబిలాల సమీపానికి వెళ్లినప్పుడు దాని అనంతమైన ఆకర్షణశక్తి ప్రవాహాల ధాటికి ముక్కచెక్కలుగా విచ్ఛిన్నమై నశిస్తుంది. ఆ క్రమంలో దాని తాలూకు సగం శక్తిని ఊహాతీత వేగంతో కృష్ణబిలం సుదూరాలకు చిమ్ముతుంది. దాంతో సూపర్నోవా పేలుడును తలపిస్తూ భారీ పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. హఠాత్తుగా పుట్టుకొచ్చే ఈ శక్తే భారీ వలయాల రూపంలో కనువిందు చేస్తుంటుందని పరిశోధన తేల్చింది. ఇది రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్‌లో పబ్లిషైంది. -
తోకచుక్కగా భ్రమించారు.. చివరకు అగ్ని-5గా తేల్చారు!
న్యూఢిల్లీ: భారత్‌లో పలు ప్రాంతాల్లో గురువారం ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతి దర్శనమిచ్చింది. వేగంగా కదులుతున్న ఈ వెలుగు రేఖను చూసి తోకచుక్క కావొచ్చని జనం భావించారు. కొందరు అంతరిక్షం నుంచి జారిపడిన గ్రహశిలగా భ్రమించారు. మరికొందరు ఫ్లయింగ్ సాసరని బల్లగుద్ది మరీ చెప్పారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. చివరికి అది మన ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5 అని అధికారులు స్పష్టం చేసి ఊహాగానాలకు తెర దించారు! దాన్ని ఒడిశా తీరం నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు. 1.5 టన్నుల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3, అగ్ని–4 మిస్సైళ్ల పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3,5000 కిలోమీటర్లు కాగా, మూడు దశల సాలిడ్ రాకెట్ ఇంజన్‌తో కూడిన అగ్ని–5 పరిధి ఏకంగా 5,000 కిలోమీటర్లు కావడం గమనార్హం. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని సైనిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక లాంగ్–రేంజ్ మిస్సైల్ కావడం విశేషం. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు. చైనా ఉత్తర ప్రాంతంతో సహా మొత్తం ఆసియా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది. ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలు సైతం అగ్ని–5 స్ట్రైకింగ్ రేంజ్లో ఉన్నాయి. క్షిపణి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని అధికార వర్గాలు తెలియజేశాయి. అగ్ని–5 త్వరలోనే భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.