Maharashtra
-
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్‌లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి మృతి మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్ జార్ఖండ్‌లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
సుప్రియా సూలేపై క్రిప్టోకరెన్సీ ఆరోపణలు.. కొట్టిపారేసిన ఎంపీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. అయితే బీజేపీ ఆరోపణలను ఎంపీ సుప్రియా సూలే బుధవారం తోసిపుచ్చారు. బీజేపీ ఎంపీ విలేకరుల సమావేశంలో ప్లే చేసిన ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, అవన్నీ కిలీవని పేర్కొన్నారు.కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్ ఓ డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్‌లను ప్లే చేశారు. క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో వీరికి ప్రమేయం ఉందని, ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం ఇద్దరు నేతలు బిట్‌కాయిన్ మానిప్యులేషన్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా లభించిన నగదును మహారాష్ట్రలో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.#WATCH | Baramati: On allegations against her and Nana Patole, NCP-SCP MP Supriya Sule says "Yesterday, all these voice recordings were sent to me by the media. The first thing I did was to call the Commissioner of Pune and tell him that some fake videos were running and I wanted… pic.twitter.com/vhoNS3vxLr— ANI (@ANI) November 20, 2024బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన సుప్రియా సూలే.. బీజేపీ ఆరోపణలపై స్పందించారు. ‘అది నా వాయిస్ కాదు. ఆ వాయిస్ నోట్స్, మెసేజ్‌లన్నీ నకిలీవి’ అని స్పష్టం చేశారు.. ఆమె మాట్లాడుతూ.. ఇది తన వాయిస్ లేదా నానా పటోలేది కాదని తెలిపారు. తన పేరు మీద నకిలీ వాయస్ సృష్టించారని, దీనికి వెనక ఉన్నవారిని పోలీసులు పట్టుకుంటారని తెలిపారు.‘నేను బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. దాని గురించి తీవ్రమైన సమస్యలను లేవనెత్తిన వ్యక్తిని నేను. వాటికి (బీజేపీ) సమాధానం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పూర్తి పారదర్శకతను విశ్వసించే వ్యక్తిని కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. బీజేపీ అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిపై పుణె కమిషనర్‌కు ఈ ఆడియోలు, వీడియోలు పంపించి.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మహారాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం ఉంది. రుజువు లేకుండా ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరని భావిస్తున్నానని తెలిపారు.సుధాన్షు త్రివేదికి పరువు నష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు.. ‘నా లాయర్ల ద్వారా సుధాన్షు త్రివేదికి క్రిమినల్ పరువు నష్టం నోటీసులు పంపాను. సుధాన్షు త్రివేదిి ఏ ఊరిలో కావాలన్నా, ఏ ఛానెల్లో కావాలన్నా, ఏ సమయంలో కావాలన్నా, ఎక్కడికి పిలిచినా నేను వచ్చి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను లేదు, అబద్ధాలు, ఆరోపణలన్నీ అబద్ధం అని సమాధానం ఇస్తాను’ అని ఆమె అన్నారు. -
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
Maharashtra Assembly elections 2024: నువ్వా.. నేనా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హోరెత్తిన ప్రచారంమహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. 18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్‌తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. పార్టీల కోలాటంమహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. జార్ఖండ్‌లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు. -
ఎప్పుడూ పేరు వినని పార్టీలు సహా మహారాష్ట్ర ఎన్నికల బరిలో 4,136 మంది
దాదర్: హోరాహోరీగా సాగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రచారం ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 158 ప్రధాన, ప్రాంతీయ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 2,050 మంది బరిలో ఉండగా మిగతా 2,086 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అలాగే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐకి చెందిన 31 మంది అభ్యర్థులున్నారు.దీన్ని బట్టి వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకంటే ఇండిపెండెంట్లే అధికంగా బరిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి మొదటి స్థానంలో మాయావతికి చెందిన బీఎస్పీ, రెండో స్థానంలో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వం వహిస్తున్న వంచిత్ బహుజన్ అఘాడీ, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (ఏపీ) తదితర ప్రాంతీయ పారీ్టలున్నాయి. మొత్తం 4,136 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉండటంతో ఓట్లు చీలిపోతాయే భయం ప్రధాన రాజకీయ పారీ్టల అభ్యర్థులకు పట్టుకుంది. ఈ సారి జనాలు ఎప్పుడు పేరు వినని పారీ్టలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపడం గమనార్హం. మొత్తం 288 స్థానాలకు ఈ నెల 20వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఎవరిని అదృష్టం వరిస్తుంది? ఏ పారీ్టకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనేది ఈనెల 23వ తేదీన వెలువడే ఫలితాల్లో స్పష్టం కానుంది. ఎప్పుడూ పేరు వినని పార్టీలు వికాస్ ఇండియా పార్టీ, ఎల్ఘార్ పార్టీ, వీర్ జనశక్తి పార్టీ, సన్మాన్ రాజకీయ పార్టీ, సర్దార్ వల్లభాయి పార్టీ, సంపూర్ణ భారత్ క్రాంతి పార్టీ, నేతాజీ కాంగ్రెస్ పార్టీ, నిర్భయ్ మహారాష్ట్ర పార్టీ, ఓపెన్ పీపుల్స్ పార్టీ, నేషనల్ వరల్డ్ లీడర్ పార్టీ, జయ్ హింద్ జయ్ భారత్ రా్రïÙ్టయ పార్టీ, ఇండియన్ పాలిటికల్ కాంగ్రెస్ పార్టీ, విందు«థలాయి చిరుతెంగల్ పార్టీ, ఎం పాలిటికల్ పార్టీ, భారత్ జోడో పార్టీ ఉన్నాయి. పది మంది కంటే ఎక్కువ అభ్యర్థుల పోటీ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్)–44, మహారాష్ట్ర స్వరాజ్య పార్టీ–32, రైట్ టూ రీకాల్ పార్టీ–18, సంభాజీ బ్రిగేడ్ పార్టీ–19, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇంక్విలాబ్ ఏ మిలాత్–16, జనహిత్ లోక్షాహీపార్టీ–18, బహుజన్ మహాపార్టీ–11, భారతీయ యువ జన్ఏక్తా పార్టీ–12, దేశ్ జనహిత్ పారీ్ట–11, జన్ జనవాదీ పార్టీ–13, రాష్ట్రీయ స్వరాజ్య సేనా–15, వికాస్ ఇండియా పార్టీ–11. అత్యధిక, అతి తక్కువ అభ్యర్థులు పోటీ చేస్తున్న జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో ముంబై, ఉప నగర జిల్లాల్లో అత్యధికంగా అంటే 315 మంది, పుణేలో 303 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే అతి తక్కువ అంటే 17 మంది అభ్యర్థులు సింధుదుర్గ్ జిల్లాలో పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం మహిళా అభ్యర్థుల సంఖ్య 363 ఉండగా ఇందులో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య అధికంగా ఉంది. కాగా, మొత్తం 363 మంది మహిళా అభ్యర్థులున్నప్పటికీ ఇందులో ముంబై, ఉప నగరజిల్లాల్లో అత్యధికంగా అంటే 39 మంది బరిలో ఉన్నారు. హింగోళీ, రత్నగిరి జిల్లాలో అతి తక్కువ అంటే ఇద్దరు చొప్పున బరిలో ఉన్నారు. జల్గావ్, నాందేడ్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున హిజ్రా అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి ఎన్ని ఓట్లు పోలవుతాయనే దానిపై అందరి దృష్టి ఉంది. పార్టీల వారీగా అభ్యర్థుల సంఖ్య బీజేపీ–149, కాంగ్రెస్–101, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–86, శివసేన (శిందే వర్గం)–81, యూబీటీ (శివసేన)–95, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)–59, బహుజన్ సమాజ్ పార్టీ–259, వంచిత్ బహుజన్ అఘాడీ–200, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–125, రాష్ట్రీయ సమాజ్ పార్టీ–93, ఆర్పీఐ (అథవలే వర్గం)–31, ప్రహార్ జనశక్తి–38, ఆజాద్ సమాజ్ పార్టీ–28, రిపబ్లికన్ సేనా–21, బహుజన్ రిపబ్లికన్ స్పెషలిస్టు పార్టీ–22,స్వాభిమాన్ పార్టీ–19, పీడబ్ల్యూపీ–18, ఎంఐఎం–17, భీంసేనా–14, లోక్రాజ్య పార్టీ–10, జనసురాజ్య శక్తి–6, సమాజ్‌వాదీ పార్టీ–9, సమతా పార్టీ–9, రాష్ట్రీయ గోండ్వానా పార్టీ–4, జనతాదళ్ (సెక్యులర్)–4, మార్క్స్‌వాదీ కమ్యూనిస్టు పార్టీ–3. -
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాల్లో తెలుగు నాయకులు, హామీల వర్షం
సాక్షి, ముంబై: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తూ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాత్రి వరకు పెద్ద ఎత్తున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, నాయకులు ఎన్నికల ప్రచారం చేయడంతోపాటు సోమవారం ఎన్నికల ప్రచారపర్వం ముగిసేంత వరకు స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ నేతలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతోపాటు అనేక మంది మంత్రులు ప్రచారాల్లో పాల్గొన్నారు. 16, 17 తేదీల్లో పదుల సంఖ్యలో నిర్వహించిన సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఈ సారి కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శనివారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని ప్రకటించినప్పటికీ ఆయన సోదరుడు మృతి చెందడంతో ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ముంబై, నాసిక్, పశ్చిమ మహారాష్ట్రలోని సోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలతోపాటు మరఠ్వాడాలో లాతూర్, జాల్నా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నాందేడ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, విదర్భలోని నాగ్‌పూర్‌తోపాటు తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్, గడ్చిరోలి తదితర ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ప్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలతోపాటు ముఖ్యంగా ఎన్నికల ప్రచార పాటల తెలుగు పాటలే కావడంతో అనేక మంది తెలుగు ఓటర్లను ఆకట్టుకునేలా చేశాయని చెప్పవచ్చు. హామీల వర్షం.. తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు నాయకులందరూ హామీల వర్షం కురిపించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం తోపాటు తెలుగు వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. వీరి సభలకు తెలుగు ప్రజలు హాజరుకావడంతో తెలుగు నాయకులు కూడా తమ పార్టీలే గెలుస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్న గ్యారంటీలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోపాటు మహారాష్ట్ర వికాస్ అఘాడీ అభ్యర్థులకు ఓటు వేస్తే తనకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. ‘ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థి. హైదరాబాద్‌లో నేను..’ ఇలా ఒక్క ఓటుకు ఇద్దరు సేవలకులం అంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కాంగ్రెస్ తెలిపే అబద్ధపు మాటలను నమ్మొద్దంటూ బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు. తెలుగు ప్రజలతోపాటు అందరికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు వారి సమస్యలు పరిష్కారమయ్యేనా? మహారాష్ట్ర లో నివసించే తెలుగు ప్రజలకు పలు సమస్యలున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు నాయకులు ఇచి్చన హామీలు ప్రతిసారి ఎన్నికల్లో ఇచ్చే హామీల్లాగే మిగిలిపోతాయా? లేదా తమ సమస్యలు ఈ ఎన్నికల తర్వాత పరిష్కారమవుతాయా? అనే విషయంపై తెలుగు ప్రజల్లో చర్చల్లో ప్రారంభమయ్యాయి. అయితే అనేక మంది ఈ సారి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భవనం, తెలుగు పీఠం గురించి పెద్ద రాజకీయ నాయకులెవరూ ప్రచారంలో మాట్లాడకపోయినప్పటికీ మీ సమస్యలేమైనా సరే అన్ని తీరుస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వర్లీ అసెంబ్లీ శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే మాత్రం ముంబై కరీంనగర్ల మధ్య రైళ్లు, తెలుగు భవనం గురించి ప్రస్తావించారు. రైళ్ల సమస్యలు తీరుస్తామని తెలుగు భవనం నిర్మాణం చేస్తామన్నారు. -
Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్‌ముఖ్‌కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అనిల్ దేశ్‌ముఖ్ కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్సీపీ- ఎస్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్ ఆరోపించారు. గాయపడిన అనిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ బెయిల్‌పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్‌పై విడుదలయ్యారు.#BREAKING 🚨 | Former Home Minister Anil Deshmukh was injured in a stone-pelting attack on Katol-Jalalkheda Road after a rally. His vehicle was damaged, and he received emergency treatment.#AnilDeshmukh #AttackonAnilDeshmukh #Katoljalalkhedaroad #attack pic.twitter.com/5WxQrMxGU0— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 18, 2024Credits: Lokmat Times Nagpur288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్‌తో కూడిన ఎన్సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్ -
మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్
సాక్షి,ముంబై: పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని సీఎం రేవంత్ విమర్శించారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ సోమవారం పుణెలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని.. అదే తాము రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు.హామీలు అమలు చేశాం.. వచ్చి చూడండితెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు విషయంలో ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఇచ్చిన హామీలన్నింటిలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను మోదీకి సవాల్ విసురుతున్నాను. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి. మేం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్న వివరాలన్నీ వారికి ఇస్తాం. అవసరమైతే వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన ఖర్చులు కూడా మేమే భరిస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. మంగళవారం బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశంపై వివరాలు అందజేస్తా. అందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమాపణలు చెబుతా..’’ అని చెప్పారు. తమ గ్యారంటీలన్ని ఖచ్చితమైనవని, మోదీలా విఫల హామీలు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా (అబద్ధాల) పార్టీ అని అభివర్ణించారు. -
ఏక్ హై తో మోదీ, అదానీ సేఫ్ హై: రాహుల్ గాంధీ
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు ‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్‌లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్‌కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్‌సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్‌సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్‌పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్‌కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్‌ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్‌తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్‌సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్‌సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
ముంబైలో అలర్ట్.. 53 మంది రౌడీషీటర్ల నగర బహిష్కరణ
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ముంబై పోలీసులు వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను, రౌడీ షీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన కొందరు రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 53 మంది రౌడీ షీటర్లపై నగర బహిష్కరణ వేటు వేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి తోశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముంబై పోలీసు ఉన్నతాధికారులు చెంబూర్, ఆర్సీఎఫ్ నగర్, తిలక్‌నగర్, గోవండీ, శివాజీనగర్, దేవ్నార్, మాన్‌ఖుర్ద్, ట్రాంబే, బాంద్రా, మాహీం, మహ్మద్ అలీ రోడ్, బైకల్లా నాగ్పాడా తదితర ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు. ముంబై పోలీసు కమిషనర్ వివేక్ ఫణ్సాల్కర్, ప్రత్యేక పోలీసు కమిషనర్ దేవెన్ భారతీ, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ్ చౌధరి, అప్పర్ పోలీసు కమిషనర్ మహేశ్ పాటిల్ మార్గదర్శనంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆరో యూనిట్‌కు చెందిన డిప్యూటీ పోలీసు కమిషనర్ నవనాథ్ ఢవలే, ఆయన బృందం పథకం ప్రకారం రౌడీ షీటర్లందరినీ అదుపులోనికి తీసుకుని కొంతమందిపై నగర బహిష్కరణ వేటు వేశారు.రూ. 14.5 కోట్ల బంగారం సీజ్ నాగపూర్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా నాగపూర్‌లో శనివారం పోల్ అధికారులు రూ.14.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్థ ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో ఈ బంగారాన్ని రవాణా చేస్తుండగా ఫ్లయింగ్ నిఘా బృందానికి పట్టుబడిందని ఓ అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని రవాణా చేసేందుకు సీక్వెల్ లాజిస్టిక్స్ ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదు. స్వాదీనం చేసుకున్న బంగారాన్ని అంబజారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోంద’ని ఆ అధికారి పేర్కొన్నారు. -
నాగపూర్ రోడ్ షోలో బీజేపీ జెండాలు.. ప్రియాంక రియాక్షన్ ఇదే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.దీనిని గమనించిన ప్రియాంక గాంధీ.. చిరునవ్వుతో స్పందించారు. బుధవారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్ పవార్) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.गढ़ में घुस कर ललकारना इसे कहते हैं नागपुर में गरजीं @priyankagandhi RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024కాగా బీజేపీ సైద్దాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. దీనిని బీజేపీ కంచుకోటగా పరగణిస్తారు. 2014 నుంచి నాగ్‌పూర్ లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఆరు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఇక మహారాష్ట్ర నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ ఉపఎన్నికతో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20 రోడ్‌షోలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నాగ్‌పూర్ వెస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా.. నాగ్‌పూర్ సెంట్రల్ 2009 నుంచి బీజేపీ చేతిలో ఉంది. -
Maharashtra: ‘వారికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే దిక్కు’
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్నాథ్ షిండ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పై ఆధారపడుతున్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాలక మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపైనే మేము దృష్టి సారించాం. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. శివసేనకు చెందిన బేస్ ఓటు బ్యాంక్ మాకు మద్దతుగా ఉన్నారు. కానీ, యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రేకు మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పైనే వాళ్లు ఆధారపడుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) స్వల్ప విజయానికి సొంత బలం కంటే కాంగ్రెస్ మద్దతు వల్లే విజయం సాధించగలిగారు.బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్రకు సైద్ధాంతిక మూలస్తంభం. ఉద్ధవ్ తన కుమారుడే అయినప్పటికీ, అతను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టాడు. బాలాసాహెబ్ పార్టీతో ఎప్పుడూ సహవాసం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. శివసేన-బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఉద్ధవ్ రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. బాలాసాహెబ్ పేరును ఉపయోగించుకునే అర్హత కూడా అతనికి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. -
మేం 50 వేల కొలువులిచ్చాం.. మీరేమిచ్చారు?: సీఎం రేవంత్
సాక్షి ముంబై: తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇలా ఇవ్వగలిగారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు తన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం విదర్భ ప్రాంతంలోని చంద్రపూర్, రాజురా, దిగ్రాస్, వార్దా, నాగ్‌పూర్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి అభ్యర్థుల తరపున రేవంత్ ప్రచారం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని వివరించారు. రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 25 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని విశ్వసించి అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే తాము రూ.18 వేల కోట్లు ఖర్చుచేసి ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. బందిపోటు ముఠాను తరిమికొట్టండి ముంబైని దోచుకోవాలని చూస్తున్న బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మహారాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. వెన్నుపోటు రాజకీయాలను పాతిపెట్టాలని కోరారు. ముంబైని కొల్లగొట్టేందుకే ప్రధాని మోదీ, అదానీ కలిసి వస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌లు గుజరాత్‌కు గులాంలుగా మారిపోయారని మండిపడ్డారు. ఎంవీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో జరుగుతున్నవి ఎన్నికలు కాదని.. అది ఒక పోరాటమని అభివర్ణించారు. ఈ పోరాటంలో ఎంవీఏను గెలిపించాలని కోరారు. కాగా, ప్రచార సభలు, నాగ్‌పూర్ రోడ్‌షో సందర్భంగా రేవంత్‌రెడ్డికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. రేవంత్ వేదికపైకి రాగానే పెద్దపెట్టున నినదించారు. -
నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు
ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.ఇదీ చదవండి: జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్ -
జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్
ముంబై: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీక జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోదీ తరుచూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్‌మాట్లాడుతూ.. బిడెన్ (81) పొరపాటున ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేసిన సంఘటనను ప్రస్తావించారు.‘ప్రధానిమోదీ ప్రసంగం విన్నట్లు మా సోదరి ప్రియాంక నాతో చెప్పింది. ఆయన ఆ స్పీచ్‌లో కాంగ్రెస్ ఏం మాట్లాడుతుతోందే దానిపైనే మోదీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆయనకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందేమో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తప్పుగా అన్నారు. అతను తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అలాగే మన ప్రధాని కూడా జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. గత ఏడాది కాలంగా నా ప్రసంగాల్లో రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందని చెబుతున్నా.. కానీ కాంగ్రెస్ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహిస్తున్నారని తెలిసి ఇప్పుడు ఆయన నేను రాజ్యాంగంపై దాడి చేస్తున్నాను అని అబద్దాలు చెబుతున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేస్తామని లోక్‌సభలో కూడా చెప్పాను. కానీ మోదీ ఇప్పటికీ రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతున్నారు. అందుకే ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారని అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బీజేపీతో భేటీకి గౌతమ్ అదానీ హాజరు..?: ఫడ్నవీస్ క్లారిటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి ముదురుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజకీయాలు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చుట్టూ తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడానికి అదానీయే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతేగాక 2019లో అదానీ తన ఢిల్లీ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారని, బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరారని శరర్ పవార్ ఆరోపించారు. ఈ సమావేశానికి తనతోపాటు, అమిత్ షా, తన మేనల్లుడు అజిత్ పవార్, అదానీ హాజరైనట్లు తెలిపారు.అయితే ఆ ఆరోపణలను తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. గౌతమ్ అదానీ తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. గతంలో అదానీ తమ సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఫడ్నవీస్, అమిత్ షాలతో సహా బీజేపీ అగ్రనేతలు, శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్సీపీకి చెందిన నేతలంతా అదానీ ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన చర్చల్లో భాగమయ్యారని అజిత్ పవార్ కూడా ఆరోపించారు. -
Video: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్‌లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
మహా ప్రభుత్వంలో విభేదాలు.. అజిత్ పవార్ Vs ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార మహాయుతి ప్రభుత్వంలో విభేదాలు భయపడుతున్నాయి. ఇటీవల హర్యానా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఓ ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే పడిపోతాం) అనే నినాదం చేశారు.ఈ నినాదాన్ని మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహాయుతి కూటమి అన్వయించడాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఘండ్, ఇతర రాష్ట్రాల్లో ఈ నినాదం పనిచేస్తుందేమో కానీ..మహారాష్ట్రలో పనిచేయదని వ్యాఖ్యానించారు.దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్ధం చేసుకోవాలని సూచించారు. అజిత్ పవార్ దశాబ్దాలుగా లౌకిక, హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతోనే ఉన్నారు. సెక్యులరిస్టులుగా చెప్పుకునే వారిలో నిజమైన సెక్యులరిజం లేదు. హిందుత్వను వ్యతిరేకించడమే లౌకికవాదమని భావించే వ్యక్తులతో ఆయన కొనసాగుతూ వచ్చారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికినాయనకు కొంత సమయం పడుతుంది’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.గతంలో మాతో కలిసున్నవారు (ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఉద్దేశించి) దీనిని అర్ధం చేసుకోలేరని విమర్శించారు. ‘ఈ వ్యక్తులు ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేరు లేదా ఈ నినాదం అర్థం చేసుకోలేరు లేదా మాట్లాడేటప్పుడు వారు వేరే ఏదైనా చెప్పాలనుకుంటున్నారు’ అని మండిపడ్డారు. మరోవైపు ఫడ్నవీస్‌తోపాటు ప్రముఖ బీజేపీ నాయకులు పంకజా ముంబే, అశోక్ చవాన్ కూడా ఈ నినాదాన్ని విభేదించారు. దీంతో మోదీ ఈ నినాదాన్ని ‘ఏక్ హై తో సేఫ్ హై’గా మార్చారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో గురువారం నాటి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చశనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా