Family
-
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
ఆరు నాట్యరీతుల అద్భుత సమాగమం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి) -
ఉపమన్యుడి వృత్తాంతం
ఉపమన్యుడి పసితనంలోనే అతడి తండ్రి వ్యాఘ్రపాదుడు కన్నుమూశాడు. వ్యాఘ్రపాదుడి అకాల మరణంతో అతడి భార్య కొడుకు ఉపమన్యుడితో పాటు పుట్టింటికి చేరుకుంది. మేనమామల ఇంట ఉపమన్యుడికి ఆదరణ కరవైంది. మేనమామల పిల్లలు రుచికరమైన పదార్థాలు భుజిస్తుండేవారు. పుష్కలంగా పాలు తాగుతుండేవారు. ఉపమన్యుడికి ఆకలి వేసినప్పుడు తగినన్ని పాలు కూడా దొరికేవి కాదు. ఉపమన్యుడు మేనల్లుడే అయినా, అతడి తల్లి తమ తోబుట్టువే అయినా, వారు అనాథలు కావడంతో మేనమామలు వారిని తగిన విధంగా ఆదరించేవారు కాదు.ఒకనాడు ఉపమన్యుడు పాలకోసం తల్లి వద్ద మారాం చేశాడు. కొడుకు అవస్థకు కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి తన కన్నీళ్లలోనే కాసింత పేలపిండిని కలిపి, అవే పాలు అని ఇచ్చింది. ఒక్క గుక్క తాగగానే అవి పాలు కాదని గ్రహించిన ఉపమన్యుడు, వాటిని తోసిపుచ్చాడు. పట్టరాని దుఃఖంతో, ఉక్రోషంతో ఏడుపు లంకించుకున్నాడు.నిస్సహాయురాలైన ఆ తల్లి అతడిని రకరకాలుగా లాలించింది. తన పరిస్థితిని వివరించింది. దుఃఖం నుంచి తేరుకున్న ఉపమన్యుడు తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘అమ్మా! నన్ను దీవించి పంపించు. శివుడి కోసం తపస్సు చేసి, పాల సముద్రాన్నే తెచ్చుకుంటాను’ అని ఆవేశంగా పలికాడు. సరేనన్న ఆ తల్లి అతడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది. ‘నాయనా! మన శైవులకు పంచాక్షరి మంత్రమే మహాయుధం. దీనినే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదనైనా తప్పిస్తుంది’ అని చెప్పి, తన భర్త నుంచి సంక్రమించిన విరజా భస్మాన్ని కొడుకు చేతికిచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుమతిస్తూ, శీఘ్రసిద్ధి కలగాలంటూ ఆశీర్వదించి సాగనంపింది.తల్లి అనుమతితో ఇల్లు విడిచిన ఉపమన్యుడు అడవుల బాట పట్టాడు. కాలినడకన కొన్నాళ్లకు ఒక దట్టమైన కీకారణ్యానికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని, పంచాక్షరి జపం మొదలుపెట్టాడు. జపం క్రమంగా ధ్యానంగా మారింది. ధ్యానం తపస్సుగా మారింది. అడవిలో ఉన్న రాకాసి మూక అతడిని భయపెట్టి, తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించింది. ఉపమన్యుడు చలించలేదు. అతడిని జయించలేక రాకాసులందరూ అతడికి కింకరులుగా మారిపోయారు.ఉపమన్యుడి తపస్సు ఊపందుకుంది. నానాటికీ తపస్సులో ఉగ్రత పెరగసాగింది. అతడి తపస్సు వేడిమి స్వర్గం వరకు ఎగబాకింది. దేవతల అరికాళ్లు చుర్రుమన్నాయి. ఈ పరిణామానికి హడలెత్తిన దేవతలు విష్ణువును వెంటబెట్టుకుని, పరమశివుడి వద్దకు చేరుకున్నారు. ‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. నువ్వు జాప్యం చేస్తే, అతడి తపస్సు పుట్టించే తాపానికి మేమంతా తప్తమైపోకుండా కాపాడు’ అని మొరపెట్టుకున్నారు.‘సరే’నని దేవతలకు మాట ఇచ్చాడు శివుడు.అయితే, ఉపమన్యుడిని పరీక్షించదలచాడు. ఇంద్రుని రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘కుమారా! ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.‘నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే, నువ్వొచ్చావేమిటి దేవేంద్రా? నీ వరాలేవీ నాకు అక్కర్లేదు. సాక్షాత్తు పరమశివుడే నా ముందు ప్రత్యక్షం కావాలి. అతడే నా మనోరథాన్ని ఈడేర్చాలి. ప్రయాసపడి వచ్చావుగాని, నువ్వు దయచేయవచ్చు’ అన్నాడు ఉపమన్యుడు.ఇంద్రుడి వేషంలో ఉన్న పరమశివుడు ఉపమన్యుడికి తన పట్ల గల అచంచల భక్తికి పరమానందం చెందాడు. నిజరూపంలో పార్వతీ సమేతంగా సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు తన కళ్లెదుట కనబడగానే ఉపమన్యుడు పారవశ్యంతో తబ్బిబ్బయ్యాడు. అతడికి నోట మాట పెగలలేదు. ఉపమన్యుడు నోరు తెరిచి అడగకపోయినా, పరమశివుడు అతడికి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని ధారాదత్తం చేశాడు. ‘నువ్వు నా బిడ్డవురా!’ అంటూ అతడిని చేరదీసి, ముద్దాడి గణాధిపత్యం కూడా ఇచ్చాడు.‘నాకు మాత్రం బిడ్డ కాడా’ అంటూ పార్వతీదేవి కూడా ఉపమన్యుడిని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించింది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉపమన్యుడికి నిత్య కుమారత్వం సిద్ధించింది.‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. ∙సాంఖ్యాయన -
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
ఈవారం కథ: చాక్లెట్ రాపర్స్
మార్నింగ్ 5:30కి అలారం మోగగానే నిద్రలేచాను. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నేను మామూలుగా పగలు అసలు సూర్యుడినే చూడకూడదు అనుకుంటా! అలాంటిది అంత ఎర్లీగా నిద్ర లేవటానికి కారణం వీకెండ్. నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడటానికి శనివారం మాత్రమే కుదురుతుంది. ఫ్రెండ్స్ అందరినీ అలర్ట్ చేసి ఫ్రెష్ అయి పక్కనే ఉన్న గ్రౌండ్‌కి బయలుదేరాం. మా కాలనీలో ఉన్న డాక్టర్స్ టీమ్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీమ్‌కి ప్రతి శనివారం క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఫీమేల్ ఆడియన్స్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్‌కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్ మ్యాచ్‌కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అందరూ యూత్ అవటంతో క్రికెట్ మ్యాచులు హోరాహోరీగా సాగుతాయి. లాస్ట్ రెండు వారాలు మేం మ్యాచ్‌లు ఓడిపోవటం వల్ల ఈసారి మాకు ప్రెషర్ ఎక్కువ అయింది. మా కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవటంతో ఫీల్డింగ్ చేయటానికి గ్రౌండ్లో దిగాం. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 20 ఓవర్స్‌లో 140/6 చేసింది. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని చేజింగ్ స్టార్ట్ చేశాం. ఓపెనింగ్ బ్యాటర్స్ బాగా ఆడటంతో మ్యాచ్ మా చేతుల్లో ఉన్నట్టే అన్పించింది. 10 ఓవర్స్కి 84/2. ఇంకో 60 బాల్స్‌లో 57 రన్స్ చేస్తే మ్యాచ్ మాదే. కానీ వెంటవెంటనే వికెట్స్ పడటంతో టెన్షన్ ఎక్కువైంది. 16 ఓవర్స్ 108/5. బౌలింగ్ కట్టుదిట్టంగా ఉంది. చూస్తుండగానే మ్యాచ్ ఆఖరి ఓవర్‌కి వచ్చింది. 6 బాల్స్ 10 రన్స్. రెండు టీమ్స్‌లో ఒత్తిడి కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఈలోపు రెండు బాల్స్ డాట్ అయ్యాయి. ఒత్తిడి మొత్తం మా టీమ్ పైనే పడింది. అవతలి వాళ్లు మ్యాచ్ గెలిచేసిన ఆనందంలో ఉన్నారు. 3వ బాల్ బౌండరీ.. 4 రన్స్ వచ్చాయి. ఇంకా 3 బాల్స్‌లో 6 రన్స్.. వికెట్ పడింది. ఓపెనర్‌గా వచ్చి బాగా సెట్ అయి బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మన్ అవుట్ అయిపోయాడు. 2 బాల్స్‌లో 6 రన్స్.. మ్యాచ్ పూర్తిగా వాళ్లవైపే ఉంది. ఒక బాల్ డాట్ అయితే మ్యాచ్ వాళ్లదే. 7వ ప్లేస్‌లో కెప్టెన్, నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ బ్యాటింగ్‌కి దిగాడు. అజయ్ ఏ టైమ్‌లో అయినా కూల్‌గా ఉండగలడు. హిట్టింగ్ బ్యాట్స్‌మన్. ఇలాంటి చాలా సందర్భాల్లో అజయ్ మా టీమ్‌ని గెలిపించాడు. బౌలర్ బాల్ వేయటానికి సిద్ధమయ్యాడు. బాల్ యార్కర్ మిస్ అయి ఫుల్ టాస్ పడింది. అంతే, అజయ్ షాట్ కొట్టగానే బాల్ లాంగ్ ఆన్‌లో గ్రౌండ్ బయట పడింది. అరుపులు కేకలతో మా టీమ్ హోరెత్తించింది. సునాయాసంగా గెలిచే మ్యాచ్ ఓడిపోవటంతో డాక్టర్స్ టీమ్ బాధగా గ్రౌండ్ వదిలింది. మ్యాచ్ గెలిపించిన ఆనందంలో ట్రీట్ ఇవ్వడానికి మా అందరినీ పక్కనే ఉన్న బేకరీకి తీసుకువెళ్లాడు మా కెప్టెన్. ఎవరికి కావలసినవి వాళ్లు తీసుకున్నారు. ఇంతలో మా వాచ్‌మన్ కొడుకు అటుగా వచ్చి ఇవాళ ‘నా బర్త్ డే’ అంటూ చాక్లెట్స్ ఇచ్చాడు. అబ్బాయిని విష్ చేశాను. కానీ ఆ చాక్లెట్ చూస్తే కోపం వచ్చింది. పిల్లాడి ముందు ఏమీ అనక, పక్కకు వెళ్లి దాన్ని విసిరికొట్టి, బేకరీ బిల్ పే చేయటానికి వెళ్లాను. నాలుగు రూపాయలు చేంజ్ లేకపోవటంతో బేకరీ అతను చాక్లెట్లు ఇచ్చాడు. సేమ్ చాక్లెట్స్.. చిర్రెత్తుకొచ్చింది. ఆ చాక్లెట్స్నీ విసిరికొట్టి, షాప్ అతని కాలర్ పట్టుకుని ‘చేంజ్ ఇవ్వటం నేర్చుకో!’ అంటూ విసురుగా అక్కడి నుంచి కదిలాను. కాస్త దూరం నడిచాక.. ఆ షాప్ అన్నతో అలా బిహేవ్ చేసినందుకు బాధపడి తిరిగెళ్లి ‘సారీ’ చెప్పి వచ్చేశాను. నా తీరు చూసి ‘ఏమైంది?’ అడిగాడు నా ఫ్రెండ్ అజయ్. ‘తర్వాత మాట్లాడదాం’ అంటూ మా ఫ్లాట్‌కి వెళ్లిపోయాను.మా ఫ్లాట్‌లో నలుగురం ఉంటాం. అందరం ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం. సాయంత్రం ఎవరి పనుల్లో వాళ్లం ఉండగా ఇంతలో పవర్ కట్ అయింది. చేసేదేం లేక రూమ్మేట్స్ అందరం అపార్ట్మెంట్స్ టెర్రస్ పైకి ఎక్కాం. ఇంక ఎవరి ఫోన్లోనూ బ్యాటరీ పెద్దగా లేకపోవటంతో వెంటనే ఫుడ్ ఆర్డరిచ్చి, ఫోన్స్ పక్కన పడేశాం. లోకంలో జరుగుతున్న విషయాల మీద చర్చ మొదలుపెట్టాం. భిన్నమైన ఇష్టాలు, హాబీలు ఉండటంతో సంభాషణ ఇంట్రెస్టింగ్గా సాగింది. నా రూమ్మేట్ రాకేశ్‌కి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంతలో మా ఫ్రెండ్ విక్రమ్ ‘టైమ్ ట్రావెల్ పాసిబుల్ అయ్యి పదేళ్ల వయసులో ఉన్న పాస్ట్ సెల్ఫ్‌ను మనం కలుసుకోగలిగితే మీకు మీరు ఇచ్చుకునే ఇన్ఫర్మేషన్.. గిఫ్ట్ ఏంటి?’ అని అడిగాడు. ‘నువ్ ఏం చేస్తావో చెప్పు ముందు?’ అని విక్రమ్‌ని అడిగా. ‘ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయమని, ఫ్యూచర్లో ఏ షేర్స్ పేరుగుతాయో.. వాటిని వీలైనన్ని కొనమని డీటైల్స్ ఇస్తా’ అని చెప్పాడు. రాకేశ్‌ని అడిగితే ‘విన్నింగ్ బెట్ డీటైల్స్ ఇస్తా’ అన్నాడు. అజయేమో క్రిప్టో కరెన్సీ అన్నాడు. ఇక అందరూ నా వైపు తిరిగారు.. నేనేం చెప్తానా అని! కింద నుంచి వాచ్‌మన్ కొడుకు ఏడుపు వినపడింది. రాత్రి నిశ్శబ్దంగా ఉండటంతో వాడి ఏడుపు టెర్రస్‌ని చేరింది. ‘ఏమైందిరా.. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు?’ అంటూ అజయ్ వెళ్లబోయాడు. అంతలో రాకేశ్ ‘మార్నింగ్ మనోడు చేసిన ఘనకార్యం గుర్తొచ్చి భయపడి ఏడుస్తున్నాడేమో’అన్నాడు. ఇంతలో అజయ్ ‘మార్నింగ్ ఎందుకురా అలా బిహేవ్ చేశావ్?’ అడిగాడు. నేను జవాబు చెప్పకుండా దాటవేస్తానేమో అని అందరూ ఒక్కటిగా ఏమైందో చెప్పమంటూ వెంటపడ్డారు. ‘చిన్నప్పుడు నన్నొక చాక్లెట్ కంపెనీ కొన్నాళ్ల పాటు మెంటల్ టార్చర్ చేసింది..’ అంటూ ఆగాను. అందరి మొహాల్లో ఉత్సుకత! నా కథ చెప్పడం మొదలుపెట్టాను. ‘మేము కదిరిలో ఉండేవాళ్లం. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, చెల్లి, నేను.. ఇదీ మా కుటుంబం! నాన్న టైలర్. అమ్మ హౌస్‌వైఫ్. నానమ్మ, తాత పళ్ల వ్యాపారం చేసేవాళ్లు. ముగ్గురి సంపాదనతో హ్యాపీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి ఒకరోజు తాత కళ్లు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో చూపిస్తే.. క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకడని చెప్పారు. అప్పటికి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏం చేయాలో తెలియని అయోమయం నుంచి తేరుకోక ముందే తాత చనిపోయాడు. రెండు నెలల తర్వాత తాత మీద బెంగతో నానమ్మ కూడా చనిపోయింది. కన్నీళ్లు ఆకలి తీర్చలేవు కదా! నాన్నే ముందు తేరుకుని పనిలో పడ్డాడు. ఒక్కరి సంపాదనే అవటంతో ఇల్లు గడవటం కొంచెం కష్టమయింది. అమ్మ మిషన్ కుట్టటం మొదలుపెట్టింది. అప్పటికి నేను నాలుగవ తరగతి. సోషల్ టెక్స్›్టబుక్లోని పావర్టీ లెసన్ వింటున్నప్పుడు మా కుటుంబం పేదరికానికి చాలా దగ్గరగా ఉన్నట్టనిపించింది. డబ్బుతో ముడిపడి ఉన్న చిన్నచిన్న కోరికలు, ఆశలను చిన్న వయసులోనే చంపేసుకోవాలని పేదరికం ఒక గొప్ప ఫిలాసఫీ నేర్పిస్తుంది. దాన్ని ఒంటబట్టించుకున్న నేను బట్టలు, బొమ్మల కోసం అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టటం మానేశా. నా పదకొండవ బర్త్ డే అప్పుడు.. ‘ఏం కావాలి?’ అని అడిగారు నాన్న. క్రికెట్ బ్యాట్ అని చెప్పా. మంచి బ్యాట్ ఎంత అవుతుందని అడిగితే, అయిదువందల రూపాయలు అని చెప్పా. రవి ఫ్యాన్సీ స్టోర్‌లో ఎమ్మారెఫ్ క్రికెట్ బ్యాట్.. నేను చాలాసార్లు కొనాలనుకుని.. కొనలేక ఆశను చంపేసుకున్న బ్యాట్.. ఆ బ్యాట్ ఎంతని షాపతణ్ణి ఒక 30 సార్లు అడిగుంటా! నా బర్త్‌డేకి మూడు రోజుల ముందు నుంచి ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు నాన్న. బహుశా ఆ బ్యాట్ కొనటానికేనేమో అనిపించింది. క్రికెట్ బ్యాటే అడగటానికి కారణం లేకపోలేదు. క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్తే బ్యాట్ ఎవరి దగ్గర ఉంటే వాడికే బ్యాటింగ్. మాతో రోజు మొత్తం గ్రౌండ్లో ఫీల్డింగ్ చేయించేవాళ్లు. బౌలింగ్ కూడా ఇచ్చేవాళ్లు కాదు. ఫీల్డింగ్‌తో మేము బాగా అలసిపోయాక మా ముఖాన ఒక ఫోర్ బాల్స్ బ్యాటింగ్ ఇచ్చేవాళ్లు. సో నేను బ్యాట్ కొనగానే నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాటింగ్ ఇవ్వాలని, వేరే వాళ్లలా చేయకూడదని ఫిక్స్ అయ్యా. నా పుట్టినరోజు రానే వచ్చింది. నా ఆలోచనలు అన్నీ ఆ క్రికెట్ బ్యాట్ చుట్టే! ఆ బ్యాట్‌ని గ్రౌండ్‌కి తీసుకెళ్తే నాకొచ్చే రెస్పెక్ట్ గురించే! అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మామూలుగా ఉదయం ఏడయినా నిద్ర లేవని నాకు అయిదున్నరకే తెల్లారింది. లేచి చూస్తే.. మా అత్త, మామ కనిపించారు. ఏదో పని పైన వెళ్లి రిటర్న్‌లో మా ఇంటికి వచ్చారు. అమ్మ పుట్టినరోజు విషెస్ చెప్పింది. అమ్మ చెప్పగానే అందరూ విష్ చేశారు. నేను మాత్రం నాన్న కోసం వెతుకుతూ అమ్మని అడిగితే మార్కెట్‌కి వెళ్లాడని చెప్పింది. వాళ్ల చెల్లి వచ్చిన ఆనందంలో నాన్న నాన్‌వెజ్ వెరైటీస్ అన్నీ తీసుకొచ్చాడు. నాకు అప్పటికే ఏదో తేడా కొట్టింది. ఇక నన్ను చూసి మా నాన్న విషెస్ చెప్పినప్పుడే కన్ఫర్మ్ అయింది బ్యాట్ కొనే ప్రోగ్రామ్ బిస్కట్ అయిందని. ఏడుపు ముంచుకొచ్చింది. భూమి మీద అత్యంత కష్టమైన పని ఏడుపు ఆపుకొని నవ్వు నటించటం. అంత చిన్న వయసులోనే జీవితంపై మొదటిసారి విరక్తి కలిగింది. ఇక వాళ్లని వీళ్లని నమ్ముకుంటే లాభం లేదని నేనే డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యా. నాకు బాగా ఇష్టమైన హాబీ కథలు రాయటం, చదవటం. ఒకసారి వారెన్ బఫెట్ గురించి పేపర్లో చదివా.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడని, పన్నెండేళ్లకే అతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడని, పేపర్ బాయ్‌గా కూడా పని చేశాడని! అది చదివాక వారెన్ బఫెట్‌ను అమ్మేద్దామని ఫిక్స్ అయ్యా! అంటే మా ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లను అమ్మేద్దామని! మా స్కూల్ దగ్గర్లోని గుజిరీ షాపులో ఎంక్వయిరీ చేయగా తెలిసిందేమంటే కేజీ న్యూస్ పేపర్స్‌కి ఆరు రూపాయలని, పన్నెండు ఫుల్ న్యూస్ పేపర్స్ కిలో బరువు ఉంటాయని! మా ఇంట్లో పేపర్స్‌ని ఎవరికీ తెలియకుండా గుజిరీ షాపులో అమ్మేశా. స్కూల్లో నేను బ్రైట్ స్టూడెంట్ను అవటంతో నన్నే క్లాస్ లీడరుగా పెట్టారు. దాంతో క్లాస్‌లో అందరినీ ఉద్దేశించి ఓ ప్రశ్న అడిగా.. ‘ఎంతమంది ఇళ్లల్లో న్యూస్ పేపర్స్ వస్తాయి?’ అని. అరవై మందిలో ముప్ఫై అయిదు మంది చేతులు ఎత్తారు. ‘ప్రిన్సిపాల్ మేడమ్ చెప్పమంది’ అంటూ ఒక్కొక్కరినీ పన్నెండు న్యూస్ పేపర్స్ తీసుకురమ్మన్నాను. మరుసటి రోజు ట్వంటీ మెంబర్స్ న్యూస్ పేపర్స్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆ పేపర్స్‌ని గుజిరీ షాప్‌కి తీసుకెళ్లా. 120 రూపాయలు వచ్చాయి. అంత డబ్బును చూసిందిలేదెప్పుడూ! కొంచెం అమౌంట్‌తో స్నాక్స్ తీసుకున్నా. సాయంత్రం స్టడీ అవర్ బ్రేక్‌లో అందరికీ స్నాక్స్ పంచిపెట్టా. మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు అందులోకి ఎంత ఎక్కువ మందిని లాగితే పనిష్మెంట్ అంత తక్కువ ఉంటుంది. సో అలా నా క్రైమ్‌లో అందర్నీ పార్టనర్స్‌ని చేసేశా. ముందురోజు స్నాక్స్ పంచటంతో పేపర్లను తీసుకొచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. అలాగే నా బ్యాంక్ బాలెన్స్ .. ఐ మీన్ కిడ్డీ బ్యాంక్ బాలెన్స్ కూడా పెరిగింది. బ్యాట్‌కి సరిపోయే డబ్బులు వచ్చేశాయని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు మేటర్ ప్రిన్సిపాల్ మేడమ్‌కి తెలిసింది. ప్రేయర్లో మా గ్యాంగ్‌ని పిచ్చికొట్టుడు కొట్టింది.పరువు పోయింది. అప్పటికీ పరువు కంటే పైసలే ముఖ్యమని గట్టిగా ఫిక్స్ అయ్యా! మేడమ్‌కి నా దగ్గరున్న మనీ గురించి చెప్పలేదు. లక్కీగా నా ఫ్రెండ్స్ అందరూ మాథమేటిక్స్‌లో వీక్. దాంతో నా దగ్గర ఎంత డబ్బున్నదీ ఎవరికీ తెలీలేదు. ‘ఎందుకలా చేశావ్?’ అని అడిగింది ప్రిన్సిపాల్ మేడమ్. ఆ క్షణంలో నా బ్రెయిన్ మెర్క్యురీలా పని చేసింది. ‘ఆ రోజు అల్బర్ట్ ఐన్‌స్టీన్ బర్త్‌డే.. ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియక అలా చేశా’ అని చెప్పా. మా ప్రిన్సిపాల్ ఫిజిక్స్ టీచర్ అవటంతో నన్ను కొట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయింది. కేకు తెప్పించి నాతోనే క్లాస్‌లో కట్ చేయించింది. నేను ఎవరినయినా మేనిప్యులేట్ చేయగలనని తెలిసింది. ఆ రోజు ఈవెనింగ్ డబ్బు లెక్క పెట్టా.. బ్యాట్‌కి సరిపోయేన్ని ఉన్నాయి. అంతే ఫుల్ జోష్ వచ్చింది. ఈలోపు మా చెల్లికి మలేరియా జ్వరమని తేలింది. పండగలు ఏవీ లేకపోవటంతో మా నాన్నకి బిజినెస్ సరిగా జరగలేదు. అసలు డబ్బు లేదు. ఎవర్ని అప్పు అడగాలో తెలియని పరిస్థితి. ఆ టైమ్‌లో నా చెల్లి కంటే నాకేదీ ఎక్కువ కాదనిపించింది. ఉన్న డబ్బు మొత్తంలో అయిదువందలు మా నాన్నకి ఇచ్చేశా. ఆ డబ్బు ఎక్కడిదని అడిగే స్థితిలో లేడు నాన్న. అమ్మ అడిగితే దాచుకున్న డబ్బని చెప్పా. ఆ క్షణంలో అమ్మ, నాన్న నన్ను ఒక హీరోని చూసినట్టు చూశారు. జీవితంలో ఫస్ట్ టైమ్ ఒక హీరోలా ఫీల్ అయ్యా. నా దగ్గర ఇంకా మనీ ఉండటంతో బ్యాట్ కొనటానికి చైనా బజార్‌కి వెళ్లాం. అరవై అయిదు రూపాయలకి మీడియం సైజు చెక్క బ్యాట్ ఇచ్చాడు. హ్యాపీగా ఆదివారం గ్రౌండ్లో తెగ క్రికెట్ ఆడాం. మా దగ్గర వికెట్స్ లేకపోవటంతో వాటి స్థానంలో ఒక బండరాయిని నిలబెట్టాం. మా ఫ్రెండ్ నిఖిల్æఅవుట్ అవగానే బ్యాట్‌ను ఆ బండరాయికి ఒరిగించి వెళ్లబోతుండగా.. ఆ బండ కాస్తా బ్యాట్ మీద పడి బ్యాట్ రెండు ముక్కలయింది. అప్పుడు అర్థమయింది నాకు ఆ షాప్‌కి చైనా బజార్ అనే పేరు ఎందుకు పెట్టారో! నా ఫ్రెండ్ నిఖిల్‌ని ఒక్కొక్కరు ఒక్కో మాటన్నారు. నేను మాత్రం ఏమీ అనలేదు. కళ్లతోనే థ్యాంక్స్ చెప్పాడు నిఖిల్. సెకండ్ టైమ్ హీరోలా ఫీలయ్యా. ఏదైతేనేం ఉన్న కొంచెం సంతోషం కూడా విరిగిపోయింది. ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్ కంపెనీ యాడ్ వచ్చింది.. అజయ్.. మార్నింగ్ నన్ను షాప్‌లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు. రాకేశ్ అండ్ విక్రమ్ కూడా! ‘చాక్లెట్స్ కొంటే ఆ రాపర్స్ వెనుక రన్స్ ఉంటాయని, ఆరయాభై పూర్తిచేసి, చెప్పిన అడ్రస్‌కి కొరియర్ చేస్తే.. సెల్‌ఫోన్, క్రికెట్ బ్యాట్ ఇంకా చాలా గిఫ్ట్స్తోపాటు ధోనీని కలుసుకునే అవకాశం’ అనేది ఆ యాడ్ సారాంశం. అందులో క్రికెట్ బ్యాట్ తప్ప నాకింకేదీ ఇంపార్టెంట్ అనిపించలేదు. మళ్లీ నా మైండ్ మెర్క్యురీలా వర్క్ చేయటం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అందరినీ వీలైనన్ని చాక్లెట్స్ కొనమని చెప్పా. ఆ రాపర్స్ని నేను కలెక్ట్ చేయసాగాను. ఎవరు దేనికి మనీ ఇచ్చినా ఆ చాక్లెట్స్‌నే కొనసాగాను. రాపర్స్ని చూసి ‘అవెందుకు?’ అడిగింది అమ్మ. ఆ యాడ్ చూపించా అమ్మకు. నవ్వుతూ ‘ఇప్పుడు రాపర్స్ కలెక్ట్ చేసి పంపితే బ్యాట్ వస్తుందా’ అని అడిగింది. వస్తుందని చాలా నమ్మకంగా చెప్పా. మొత్తానికి నా ఫ్రెండ్స్, నేను.. అందరం కలిసి యాభై రన్స్ అయితే చేశాం. ఇక నా బాధ చూడలేక అమ్మ ఆ చాక్లెట్ రాపర్స్ అన్నీ ప్యాక్ చేసి వాళ్లు చెప్పిన అడ్రస్‌కి పోస్ట్ చేసింది. నా ఆనందానికి అవధుల్లేవు.. మంచి బ్యాట్ రాబోతోందని! మా పోస్ట్మన్ని రోజూ అడగడమే నాకేమైనా పార్సిల్ వచ్చిందా.. అని! అలా దాదాపు రెండు నెలలు అతని వెంటబడ్డా! నేనతణ్ణి అడిగిన ప్రతిసారీ అతను నన్ను ఏం పార్సిల్ అంటూ ఎదురు ప్రశ్న వేసేవాడు. నేను చెప్పేవాడిని కాదు. ఎందుకంటే దొంగ ఎదుటివారినెప్పటికీ నమ్మడు. నాకు వచ్చే బ్యాట్‌ని అతను తీసేసుకుంటాడేమోనని నా అనుమానం. అలా రెండు నెలలు గడిచాయి. ఎలాంటి రిప్లయ్ రాలేదు. దాంతో నేను రాపర్స్ పంపిన అడ్రస్‌కి వారం వారం లెటర్లు రాయటం మొదలుపెట్టా. ఈలోపు నాన్నకు బిజినెస్ అవకపోటంతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఊరు మారాల్సి వచ్చింది. నా బాధ వర్ణనాతీతం. ఆఖరికి మా ఫ్రెండ్స్‌కి, మా పక్కింటి అక్కకి.. నా పేరు మీద పార్సిల్ వస్తే తీసుకుని పెట్టుకొమ్మని చెప్పా! ఊరు మారిపోయాక కూడా మా పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి.. చాలాసార్లు అడిగా పార్సిల్ ఏమైనా వచ్చిందా అని! ఆ క్రికెట్ బ్యాట్ వస్తుందని నేను చుసిన ఎదురుచూపులు కలిగించిన బాధ మాటల్లో చెప్పలేను. అలా నా బాల్యంలో నన్ను అంతలా ఎమోషనల్ డ్యామేజ్ చేసిన ఆ చాక్లెట్ కంపెనీ పేరు మహాలాక్టో! ఆ సంఘటన తర్వాత జీవితంలో ఆ చాక్లెట్‌ను ముట్టుకోలేదు’ అని చెప్పా.ఇదంతా విన్న మా ఫ్రెండ్స్ కళ్లల్లో నీళ్లు తిరగడం గమనించా. అవతలి వాళ్ల బాధ విని కన్నీళ్లుపెట్టుకునే∙మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అనుకున్నా. ‘కెలెడియోస్కోపిక్ మెమోరీస్’ అంటే మనం ఆ పర్టిక్యులర్ సందర్భంలో చాలా బాధ అనుభవించి ఉంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎవరికైనా ఆ జ్ఞాపకాలు చెప్పినప్పుడు చాలా ఫన్నీవేలో చెప్తాం’ అంటూ మా ఫ్రెండ్స్‌ని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించా. ఈలోపు ఫుడ్ రావటంతో నేను, అజయ్ ఇద్దరం గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లాం. çఫుడ్ తీసుకుని వెనక్కి వస్తుండగా మా అపార్ట్మెంట్ వాచ్‌మన్ కొడుకు టిన్ను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ‘ఎందుకు ఏడుస్తున్నాడు?’ అని మా వాచ్మన్ని అడిగా. ‘ఇవాళ వాడి బర్త్‌డే .. గిఫ్ట్‌గా క్రికెట్ బ్యాట్ కొనివ్వమని ఏడుస్తున్నాడు’ అని చెప్పాడు వాచ్‌మన్. మరుసటిరోజు ఉదయం ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు నా దగ్గరున్న క్రికెట్ బ్యాట్స్‌లో ఒకటి టిన్నుకి గిఫ్ట్‌గా ఇచ్చా. వాడి కళ్లల్లో కనపడిన ఆనందం మాటల్లో చెప్పలేను. వాడు నన్నో హీరోలా చూశాడు. వాడి జీవితంలో నన్నెప్పుడూ హీరోలానే గుర్తుపెట్టుకుంటాడు అనే ఆలోచన నాకూ ఆనందాన్నిచ్చింది. టైమ్ ట్రావెల్లో గతంలోకి వెళ్లి నాకు నేను క్రికెట్ బ్యాట్‌ని ప్రెజెంట్ చేసుకోలేకపోవచ్చు. కానీ టిన్నుకు ఇచ్చి.. ఆ హ్యాపీనెస్‌ని మాత్రం సొంతం చేసుకున్నా! ఒకసారి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక చాక్లెట్ కంపెనీ యాడ్ వచ్చింది.. అజయ్.. మార్నింగ్ నన్ను షాప్‌లో అడిగిన ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతోందని ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు. రాకేశ్ అండ్ విక్రమ్ కూడా!మా కాలనీలో ఉన్న డాక్టర్స్ టీమ్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టీమ్‌కి ప్రతి శనివారం క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఫీమేల్ ఆడియన్స్ మ్యాచ్ చూడటానికి గ్రౌండ్‌కి వస్తూండటంతో మేం ఆడే క్రికెట్ మ్యాచ్‌కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. -
వనరుల బంగారం.. బయ్యారం
బయ్యారం ఊళ్లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే ఆ గుడులు ఇప్పుడు వాడుకలో లేవు.బయ్యారం.. ప్రకృతి వనరుల భాండాగారం..సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమాలకు ఆలవాలం! ఆ ఊరి గురించే ఈ కథనం.. తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో.. మూడు వైపుల నీళ్లు, ఒకవైపు గుట్టలను హద్దులుగా చేసుకుని ఉంటుంది బయ్యారం. ఇక్కడి పెద్దచెరువు కట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్న శిలాశాసనం కాకతీయుల వంశవృక్షాన్ని, వారి పాలనాదక్షతను తెలియజేస్తుంది. కాకతీయ వంశస్థురాలైన మైలమాంబ.. తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజల సంక్షేమార్థం ఈ చెరువును తవ్వించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. సాగునీటి రంగంపై కాకతీయుల పరిజ్ఞానానికి నిదర్శనంగా బయ్యారం చెరువు నిలిచింది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదటగా నీరు నిండి అలుగు పోసేదిగా బయ్యారం పెద్దచెరువు రికార్డులో ఉంది. ఇది 15,000 ఎకరాలకు సాగునీరును అందిస్తోంది. చెరువు మట్టి మహత్యంబయ్యారం చెరువు మట్టి మహిమ అంతా ఇంతా కాదు. గతంలో బెంగుళూరు పెంకులు, ఇప్పుడు అలంకరణ వస్తువులు, టైల్స్ తయారీకి ఈ మట్టే కీలకం. మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోని టైల్స్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే డెకరేటివ్ టైల్స్ మన దేశంలోనే కాకుండా విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నుంచి దట్టమైన అడవులను దాటుకుంటూ వచ్చే వరద నీరు ఈ చెరువులో చేరుతుంది. నీటి ప్రవాహంతోపాటు వచ్చే ఒండ్రు మట్టి చెరువు అడుగుకు చేరి రేగడి మట్టిగా మారుతుంది. దీంతో తయారయ్యే పెంకులు, డెకరేటివ్ టైల్స్ నాణ్యతకు మరోపేరుగా నిలుస్తున్నాయి. అయితే ఆర్సీసీ కప్పుతో పోటీ పడలేక పెంకు ప్యాక్టరీలు మూత పడే దశకు చేరుకున్నాయి. వాటి స్థానంలో డెకరేటివ్ టైల్స్ తయారీ మొదలుపెట్టారు. ఇక్కడ తయారయ్యే జేడీ డచ్, హెచ్‌బీటీ, ఎస్సెమ్మార్, మోడర్న్ బ్రాండ్, ప్లోయింగ్ బిట్స్, సెంటర్ టైల్స్ ఇలా కస్టమర్లు ఏ విధమైన డిజై¯Œ కావాలన్నా ఇట్టే తయారుచేసి ఇస్తారు. బయ్యారం చెరువు మట్టితో తయారు చేసిన పెంకులు, టైల్స్, కటింగ్ డిజైన్లను బొగ్గు, ఊకతో కాలుస్తారు. అప్పుడు ఎర్రటి అందమైన వర్ణం వస్తుంది. వందలు, వేల ఏళ్లు గడచినా ఇది చెక్కు చెదరదు. వీటికి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది.ఇనుపరాతి గుట్టతెలంగాణకే తల మానికంగా బయ్యారం ఇనుపరాతి గుట్ట ఉంది. దాదాపు 42వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ గుట్టలో దొరికే ఇనుపరాతి ముడిసరుకు నాణ్యమైనదిగా చెబుతున్నారు నిపుణులు. ఈ ముడిసరుకును గతంలో పాల్వంచ, విశాఖ ఉక్కు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఖనిజాలుబయ్యారం పరిసరాల్లోని నామాలపాడు, ఇతర ప్రాంతాల్లో ఖనిజవనరులు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా బైరటీస్, డోలమైట్, అభ్రకం, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వానికి గతంలో నివేదిక కూడా పంపినట్లు సమాచారం. ఉద్యమాలకు నెలవునాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ పోరు దాకా.. సామాజిక స్పృహకు, ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు నెలవుగా ఉంది బయ్యారం. 1948లో నిజాం వ్యతిరేక పోరులో ఈ ప్రాంతానికి చెందిన 30 మంది పోరాట వీరులు నిజాం సైన్యం తూటాలకు అసువులు బాశారు. వారి స్మృత్యర్థం స్థూపం కూడా ఉందిక్కడ. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బయ్యారం ముందుంది. మలి దశ ఉద్యమంలోనూ చైతన్య శీలురు, కవులు, కళాకారులతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ∙ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్బండారి వీరన్న, సాక్షి, బయ్యారంమురళీ మోహన్, ఫొటోగ్రాఫర్ -
పిల్లల కథ: విజయపురిలో విశ్వనాథుడు
విజయపురిలో విశ్వనాథుడనే పండితుండేవాడు. ఆయన వద్ద పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన అనేక తాళపత్ర గ్రంథాలుండేవి. ఆయన వాటిని చదవడమేగాక జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. అంతేగాక తను కూడా కావ్యాలను రాస్తుండేవాడు. అయితే పేదరికం ఆయన్ను బాగా పీడిస్తుండేది. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆయనకు అనారోగ్యం చేసింది. పట్టణానికి వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు నాటువైద్యుడు. పట్టణంలో వైద్యం అంటే డబ్బుతో పని. ఆయన భార్యకేమీ పాలుపోలేదు. డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియ లేదు. దిగాలుగా ఉన్న ఆమెతో పక్కింటామె ‘మీ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు బోలెడున్నాయికదా! ఊళ్లో వాటినెవరికయినా అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో పట్టణంలో వైద్యం చేయించవచ్చు’ అన్నది. ‘ఈ ఊళ్లో గ్రంథాలు కొని, చదివే వాళ్లున్నారా?’ అని సందేహపడింది పండితుడి భార్య. ‘అది నిజమేకానీ ప్రయత్నిస్తే తప్పులేదు కదా!’ అంది పక్కింటామె. ఆ ఉపాయం నచ్చి, తాళపత్ర గ్రంథాలను భుజానికెత్తుకుని ఊరంతా తిరిగింది పడింతుడి భార్య. ఒక్కరూ ఒక్క గ్రంథం కొన్న పాపాన పోలేదు. నొప్పి పెడుతున్న భుజాలతో చివరకు ఆ ఊళ్లోని వడ్డీ వ్యాపారి అనంతయ్య ఇంటికి వెళ్లింది. ‘మా ఇంట్లో చదివేవారు ఎవరూలేరమ్మా! అలా అని నేను కాదంటే నీ అవసరం తీరేదెలా? నేనీ పుస్తకాలు కొనను కానీ, తాకట్టు పెట్టుకుంటాను. మీకు ధనం సర్దుబాటు కాగానే నా బాకీ తీర్చి, మీ గ్రంథాలను మీరు తీసుకుపొండి’ అన్నాడు. ఆ మాటకు పండితుడి భార్య సరేనంది. ఆమెకు కావలసిన పైకం ఇచ్చి, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా దాచి పెట్టాడు వడ్డీ వ్యాపారి. ఆ ధనంతో భర్తకు వైద్యం చేయించింది. త్వరలోనే ఆయనకు నయమైంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్నేలే ఆనందవర్ధనుడు.. కొడుకు అలోకవర్ధనుడికి పట్టాభిషేకం చేశాడు. అలోకవర్ధనుడికి గ్రంథపఠనం అంటే మహా ఇష్టం. తన పఠనానికి అనుకూలంగా అంతఃపురంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజ్యమంతటా గ్రంథ సేకరణకు చాటింపు వేయించాడు. గ్రామాల నుంచి పాత తాళపత్ర గ్రంథాలున్నవారంతా రాజధానికి వచ్చి తమ వద్ద ఉన్న గ్రంథాలను ఇవ్వసాగారు. వడ్డీవ్యాపారి అనంతయ్య తన దగ్గరున్న గ్రంథాలను రాజుకు ఇవ్వలేదు. ఆనోటా ఈనోటా ఆ విషయం రాజుగారి చెవిన పడింది. ఆయన భటులను పంపి అనంతయ్యను సభకు రప్పించాడు. గ్రంథాల గురించి అడిగాడు.‘గ్రంథాలు నా దగ్గరున్న మాట వాస్తవమే ప్రభూ! అయితే వాటికి నేను యజమానిని కాదు. అవి ఒక పండితుడివి. అతని వైద్యానికి అవసరం అయితే వాటిని నా వద్ద తాకట్టు పెట్టుకుని ధనం ఇచ్చాను. గ్రంథాలను తాకట్టు పెట్టుకోవడం మీకు కొత్తగా ఉండవచ్చు. నేను అలా ఎందుకు చేశానంటే.. నేనిచ్చే« ధనం వల్ల పండితుడికి వైద్యం లభించడమే కాదు, అలా ఆ గ్రం«థాలను భద్రపరచడం వల్ల అవి భవిష్యత్ తరాలకూ అందుతాయని ఆలోచించాను. అందుకే వాటిని తాకట్టు పెట్టుకున్నాను’ చెప్పాడు వడ్డీవ్యాపారి. అతని పెద్ద మనసుకు రాజు ఎంతగానో సంతోషించాడు. తనకు అవసరం లేకపోయినా భవిష్యత్‌లో చదువరులకు గ్రంథాలను అందించాలన్న ఆలోచనతోపాటు, సాటి మనిషిని ఆదుకోవాలన్న మంచి మనసు కూడా వ్యాపారికుండటం అలోకవర్ధనుడిని ఆనందపరచింది. పండితుడి అప్పును రాజు తీర్చడమేకాక, ఆ వ్యాపారికి ‘గ్రంథమిత్ర’ అనే బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించాడు. తరవాత పండితుడి భార్యనూ సన్మానించి, ఆ పండితుడికి తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు రాజు. ఆ గ్రంథాలన్నింటినీ గ్రంథాలయానికి చేర్చి, జాగ్రత్త చేశాడు. -
చిన్నప్పటి నుంచి ఉంది ప్లానింగ్ ఎలా?
నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సీహెచ్. శరణ్య, గుంటూరుబ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్స్టట్రిషన్ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. ఆ లెవెల్ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మోతాదును చేంజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్ 5ఎమ్జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్ డౌన్ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్ రెటీనోపతి అంటే సుగర్ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్ స్కాన్స్ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్ స్కాన్ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్ చేయాలి. లేకపోతే బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తారు. డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్ అవొచ్చు. అందుకే సీనియర్ నియోనేటాలజిస్ట్స్ ఉన్న చోటే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. సుగర్ డౌన్ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్ చేయించుకుంటూండాలి. డయాబెటిస్ కంట్రోల్లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్ అనామలీస్ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. -
‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’
చరిత్ర మిగిల్చిన చీకటి రోజుల్లో అమెరికా వణికిన రోజు 2001 సెప్టెంబర్ 11. నాడు ఉగ్రవాదులు ట్విన్ టవర్స్‌పై చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. అయితే నిజానికి ఆ విధే పనికట్టుకుని, స్నేహా ఫిలిప్ అనే భారతీయ డాక్టరమ్మ కథను, నాటి అమెరికావాసుల వ్యథలతో ముడిపడేలా ముందే లిఖించింది కాబోలు!అది సెప్టెంబర్ 11, సాయంత్రం 5 అవుతోంది, రోడ్లపై లక్షల్లో జనాలు, వేలల్లో పోలీసులు. ఇంకా అమెరికా షాక్ నుంచి తేరుకోలేదు. ఒకవైపు బాధిత కుటుంబాల రోదనలు, మరోవైపు ఆగకుండా మోగుతున్న అంబులెన్స్ సైరన్లు. ఆ సమయంలో ఎటు చూసినా విలాపమే, ఏం విన్నా విషాదమే! చాలామంది అధికారులు కనిపించకుండా పోయిన వారి వివరాలను నమోదు చేసుకునే పనిలో పడ్డారు. అప్పుడే అన్సు, ఫిలిప్ అనే కేరళ దంపతులు తమ అమెరికన్ అల్లుడు రాన్ లైబర్మాన్ని వెంటబెట్టుకుని కన్నీళ్లతో పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. ‘పేరు స్నేహా ఫిలిప్, భారత మహిళ, ఆమె డాక్టర్, బ్లాక్ హెయిర్, బ్రౌన్ ఐస్, హైట్ 5.6, వయసు 31, గత ఏడాదే పెళ్లైంది, నిన్నటి (సెప్టెంబర్ 10) నుంచి కనిపించడం లేదు’ అంటూ వారు.. ఒక్కొక్కటిగా వివరాలిచ్చారు. స్నేహా కేరళలో పుట్టింది. తన చిన్నప్పుడే, ఆ కుటుంబం న్యూయార్క్‌లో సెటిల్ అయ్యింది. స్నేహా మెడిసిన్ చదువుతున్నప్పుడు రాన్ ఆమెకు జూనియర్‌గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత, అతడి కోసం స్నేహా ఏడాది చదువు ఆపుకుని, రాన్తో కలసి పట్టభద్రురాలైంది. మెడిసిన్ ఇంటర్న్‌షిప్‌కి ఆహ్వానం అందుకోగానే, 2000 సంవత్సరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అదే ఏడాది ట్విన్ టవర్స్‌కి 5 నిమిషాల దూరంలో ఉన్న బ్యాటరీ పార్క్‌లో అపార్ట్మెంట్ కొనుక్కుని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇద్దరూ డాక్టర్స్, కావాల్సినంత డబ్బు, రోజుకో పార్టీ, వారానికో ట్రీట్. ఆనందకరమైన జీవితానికి తామే ఉదాహరణ అన్నట్లుండేది ఆ జంట. డ్యూటీకి వెళ్లాలంటే అరగంటలోపు.. బంధువులు, స్నేహితులతో పాటు ఫిలిప్ ఇంటికి వెళ్లాలన్నా గంటలోపు ప్రయాణం చేస్తే సరిపోయేది. షాపింగ్స్‌కి, పార్టీస్‌కి వెళ్లడాన్ని బట్టి ఎవరిల్లు దగ్గర్లో ఉంటే వాళ్లింట్లో రాత్రుళ్లు ఉండిపోవడం, మరునాడు డ్యూటీస్‌కి అటునుంచే వెళ్లడం స్నేహా, రాన్లకు అలవాటైపోయింది.సెప్టెంబర్ 10న స్నేహా డ్యూటీకి లీవ్ పెట్టింది. ‘ఎల్లుండి మనింట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తా. షాపింగ్ చేస్తా, అందుకే సెలవు పెట్టా’ అని భర్తతో చెప్పింది స్నేహా. ఆ రోజు ఉదయం భర్తతో కలసి బయటికి వెళ్లి, 11 అయ్యేసరికి అతడితో బ్రేక్‌ఫాస్ట్ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరింది. రాన్ అటు నుంచి అటే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే అదే రాత్రి రాన్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి స్నేహా ఇంట్లో లేదు. అత్తింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లుంటుందిలే అనుకున్న రాన్.. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. మరునాడు (సెప్టెబర్ 11) ఉదయం ఆరు గంటలకే లేచి, రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు 8.40 దాటేసరికి వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని నార్త్ టవర్ (ట్విన్ టవర్స్‌లో ఒక బిల్డింగ్)లో ఉగ్రవాదులు విమానాన్ని కూల్చారన్న వార్త అతడ్ని వణికించింది. వెంటనే స్నేహాకు కాల్ ట్రై చేస్తే, కలవలేదు. మరో పావుగంటలో పక్కనే సౌత్టవర్లో మరో విమానం కూలిందని తెలియగానే రాన్‌కు స్నేహా గురించి భయం మొదలైంది. అప్పుడు కూడా స్నేహా ఫోన్ కలవకపోయేసరికి ఆమె కోసం తెలిసినవారికి, అత్తింటివారికి వరసగా కాల్స్ చేశాడు. ముందురాత్రి స్నేహా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారంతా. దాంతో రాన్ కంగారుగా తమ అపార్ట్మెంట్కి వెళ్లాడు. అప్పటికే కుప్పకూలిన ట్విన్‌టవర్స్ నుంచి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో వారిని రిక్వస్ట్ చేసి, అపార్ట్మెంట్ సెక్యూరిటీ సాయంతో బిల్డింగ్ సీసీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. ముందురోజు ఫుటేజ్‌లో సాయంత్రం 5:30కి స్నేహా ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. మరో 2 గంటలకు ట్విన్ టవర్స్ సమీపంలోని డిజైనర్ స్టోర్‌లో స్నేహా తనకోసం షూస్, ఇన్నర్ వేర్స్ కొనుక్కొన్నట్లు పరిచయమున్న సేల్స్‌మన్ ఒకరు రాన్తో చెప్పాడు. ‘నిన్న రాత్రి ఏడున్నరకు స్నేహా మేడమ్ మరో భారతీయురాలితో కలసి మా స్టోర్‌కి వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఆ మహిళను అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు’ అని వివరించాడు. వెంటనే రాన్.. ఫిలిప్స్ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. రాన్ మాటలకు స్నేహా తల్లి అన్సు షాక్ అయ్యింది. ‘అదేంటి నిన్న మధ్యాహ్నం ట్విన్ టవర్స్, హోటల్లో తింటూనే నాతో చాలా సేపు చాటింగ్ చేసిందిగా?’ అంది అయోమయంగా. ‘నిన్న రాత్రి వేరే ఇండియన్ మహిళతో కలిసి షాపింగ్ కూడా చేసిందట ఆంటీ, పోనీ రాత్రి ఆమెతో పాటు ఉందనుకుంటే, మరునాడైనా ఇంటికి రావాలి కదా? ఒకవేళ ట్విన్ టవర్స్ దాడిలో ఇరుక్కుని..?’ మాట పూర్తి చేయలేకపోయాడు రాన్. ఆ అనుమానమే స్నేహా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ దాకా రప్పించింది.స్నేహా డాక్టర్ కాబట్టి.. 11న జరిగిన మొదటి దాడిలో గాయపడిన వారికి సేవలు చేయడానికి వెళ్లినప్పుడు ఇతర దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని చాలామంది నమ్మారు. అయితే ఈ కేసు కోర్టుకెక్కినప్పుడు ఎన్నో అభిప్రాయాలు వినిపించాయి. రాన్తో స్నేహాకున్న పర్సనల్ తగాదాల దగ్గర నుంచి ఆల్కహాల్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయా? అనేంత వరకూ ప్రతిదీ ఆరా తీసిన అధికారులు.. స్నేహా లెస్బియన్ అయ్యుండొచ్చని అనుమానించారు.డిజైనర్ స్టోర్‌లో స్నేహాతో ఉన్న అజ్ఞాత భారతీయ మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పేరు మార్చుకుని, మిస్సింగ్ డ్రామా ఆడుంటుందని భావించిన న్యాయస్థానం 2004లో.. 9/11 మిస్సింగ్ జాబితా నుంచి స్నేహా పేరును తొలగించేసింది. అయితే ఫిలిప్ దంపతులతో పాటు రాన్ కూడా ఆ తీర్పును ఖండించాడు. ‘స్నేహాను వెతికిపెట్టండి’ అనే పోరాటాన్ని పక్కన పెట్టి.. ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ అనే పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. నిజానికి ట్విన్ టవర్స్ దాడిలో కొన్ని వందల మంది క్షణాల్లో కాలి బూడిదైపోయారు. వారిలో చాలామంది వివరాలు నేటికీ తేలలేదు.చివరికి 2008లో న్యూయార్క్ కోర్టు స్నేహాపై వచ్చిన వదంతులను కొట్టి పారేస్తూ, 9/11 దాడుల బాధితురాలిగా స్నేహా పేరును ఆ జాబితాలో చేర్చింది. అయితే నేటికీ ఆమె అవశేషాలు దొరక్కపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్‌కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్‌లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్‌లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్‌కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్‌ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్‌లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్‌ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్‌ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్‌ఫార్మర్‌కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్‌లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్‌లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్‌మన్ వంటి వారు సైతం న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
యోగాంజలి – ఎందుకంటే సినిమా కంటే ధ్యానం ఇష్టం
‘ఔత్సాహికులకు 60 పౌండ్లు మాత్రమే. వెంటనే రిజిస్టర్ చేసుకోండి’ అంటున్న పూర్వ సినీనటి గీతాంజలి యోగా ప్రస్థానం ఆసక్తి కలిగిస్తోంది. ‘గీతాంజలి’ సినిమాతో ఒక వెలుగు వెలిగిన గిరిజా షెట్టార్ యు.కె.లో స్థిరపడింది. 35 ఏళ్ల తర్వాత ఇటీవలే ఒక కన్నడ సినిమాలో సింగిల్ మదర్‌గా నటించిన గిరిజ ‘ఆ పాత్ర స్థితి. నా స్థితి ఒకటే కనుక ఒప్పుకున్నాను’ అని చెబుతోంది. గతంలో పత్రికా రిపోర్టర్‌గా పని చేసిన గిరిజ ఇప్పుడు మనిషికి ఆరు వేల రూపాయల ఫీజుతో యోగా నేర్పిస్తోంది. ఆమె రాబడి ఎలా ఉన్నా యోగా అవసరం గురించి ఆమె చెప్తున్న విషయాలు అందరూ వినదగ్గవి.‘2023 సంవత్సరం మే నెలలో నాకు అనిపించింది ఇక మీదట నేను యోగా, ధ్యాన మార్గాలలో మార్గదర్శిగా నిలవాలని. ఆ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమందికి సాయపడుతున్నాను’ అంటున్నారు గిరిజ. ‘గీతాంజలి’ (1989) సినిమాతో నేటికీ మరపు రాని ఈ నటి చాలా యేళ్లుగా యు.కెలో స్థిరపడినా, రకరకాల ఉద్యోగాలు చేసినా 55 ఏళ్ల వయసులో యోగా టీచర్‌గా నూతన ప్రస్థానం సాగిస్తున్నారు. భారతీయ సినిమాలు చూడటమే మానేసిన గిరిజ అందుకు కారణం ఏమంటారంటే ‘చూశానంటే మనసు పాడవుతుంది. ఆ సినిమాలలో నేను చాలా చేసి ఉండే అవకాశం ఉందప్పుడు. అవన్నీ వదులుకొని వచ్చినందుకు ఒక్కోసారి అది సరైన నిర్ణయం కాదని అనిపిస్తుంది’ అంటారు.2024 సెప్టెంబర్ 5న విడుదల అయిన ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ అనే కన్నడ సినిమా లో సింగిల్ మదర్‌గా నటించారు గిరిజ (ప్రైమ్‌టైమ్‌లో ఉంది). ‘నేను ఉన్న స్థితి ఆ పాత్ర స్థితి ఒక్కటే కనుక నిర్మాత రక్షిత్ శెట్టి అడిగాక అంగీకరించాను’ అంటారామె. అయితే సినిమాల మీద కంటే ఆమె ధ్యాస, ఆసక్తి కేవలం యోగా గురువుగా తాను చేయవలసిన సేవ మీదే ఉన్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.గీతాంజలి గర్ల్తెలుగు మూలాలు ఉన్న కన్నడ తండ్రికి, యు.కె.కు చెందిన క్రిస్టియన్ తల్లికి జన్మించిన గిరిజ తన 17వ ఏట వరకూ యు.కె.లోనే పెరిగారు. ఆ తర్వాత ఇండియా వచ్చి పదేళ్లపాటు ఉన్నారు. ఆ సమయంలోనే గీతాంజలిలో నాగార్జున పక్కన నటించి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందారు. ఆ తర్వాత కేవలం రెండు మూడు సినిమాలు చేసిన గిరిజ వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడ్డారు. కొన్నాళ్లు ఒక బిజినెస్ పత్రికకు, మరికొన్నాళ్లు మరో పత్రికకు రిపోర్టర్‌గా పని చేశారు. సముద్రయాన కార్మికుల మానవ హక్కుల కోసం కూడా పని చేశారు. ఆమె ముందు నుంచి యోగ సాధకురాలు. అంతేకాకుండా యోగాలో పీహెచ్డీ చేశారు. రాజయోగ ను ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వివిధ దేశాలలో యోగాకోర్సులు కూడా చేశారు. వీటన్నింటి భూమికతో ఆమె తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలని ఇప్పుడు యోగా టీచర్‌గా మారారు.ఆమె చెప్తున్న విషయాలు→ మీలో చెడు భావాలు, నెగెటివిటీ ఉన్నాయంటే మీలోని దైవత్వం సుషుప్తి లో ఉన్నట్టే. మీలోని దివ్యత్వాన్ని మీరు మేల్కొలిపితే ఈ మలినాలు పోతాయి.→ మీలోని మంచి లక్షణాలను మీరు తరచూ గుర్తు చేసుకోవాలి. లేకపోతే మీలోని మంచి లక్షణాలను మీరు చూడటం మొదలెడితే ఇతరులలోని మంచి లక్షణాలు కూడా కనిపించడం మొదలెడతాయి.→ మొత్తం మీరే చేయాలేమో అన్న భావనతో అలసిపోవద్దు. మీరు చేయాల్సింది చేయండి మీతోపాటు విశ్వాత్మ కూడా దానికోసం పాటుపడుతుంది. అది గ్రహింపులోకి వస్తే మీరు అలసిపోరు. నేను పత్రికలో పనిచేసేటప్పుడు డెడ్‌లైన్ సమయంలో పేజీలు ఖాళీగా ఉంటే చాలా టెన్షన్ పడేదాన్ని. కాని సమయానికి అన్నీ ఆటోమేటిక్‌గా పూర్తయ్యేవి. అంటే మనతోపాటుగా మన ఆత్మ, విశ్వాత్మ కూడా పని చేస్తున్నాయన్న మాట. → ధ్యానం మీ స్వభావానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆత్మకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మల్ని అనుక్షణం చూసుకునే ఆప్తుని తోడు ఉంటే ఎలా ఉంటుందో యోగ, ధ్యానాలు మీకు తోడైతే అలాంటి భావన కలుగుతుంది.→ చెడు చాలా పరిమితం. మంచి అనంతం. ఆ అనంతమైన మంచిని మనలో నిత్యం జాగృతం చేసుకుంటూ ఉంటే మంచి జీవనం తప్పకుండా మనకు చేరువ అవుతుంది.యోగా ఒక రక్షణ‘నేను కోవిడ్ సమయంలో తీవ్రంగా అనారోగ్యం బారిన పడ్డాను. వైరస్ నా బ్రెయిన్ వరకూ వెళ్లనుందని అర్థమైంది. అయినా, నేను భయపడలేదు. నా యోగతో, ధ్యానంతో కోవిడ్ నుంచి బయటపడ్డాను. శరీరం, మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే చాలా విజయాలు సాధించవచ్చు. యోగా శరీరాన్ని, ధ్యానం మనసును అలజడుల నుంచి కాపాడుతాయి. అంతేకాదు, అంతర్గత శత్రువులను నెమ్మదింప చేస్తాయి. నేను రోజుకు మూడుగంటలు ధ్యానం చేస్తాను. మీరు కనీసం అరగంట అయినా చేయండి. లేదంటే నిద్ర లేవగానే కనీసం పది నిమిషాలు చేయండి. ‘ఓ విశ్వాత్మా... ఈ జగత్తులో నన్ను ఒక సంపదగా గ్రహించు’ అని వేడుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక పట్టాలి... కాలం చాలా గాయాలను మాన్పుతుంది... మీరు దానికి అనుమతిస్తే’ అంటారు గిరిజ. -
ఇథనాల్‌పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
‘మమ్రా’ బాదం గురించి తెలుసా? అంత స్పెషల్ ఏంటో?
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యానికి, రోగ నిరోధకశక్తికి చాలా అవసరం. అయితే బాదం పప్పు రకాల గురించి తెలుసా? అవేంటో తెలుసుకుందామా.!మార్కెట్లో మమ్రా ,కాలిఫోర్నియా బాదంతో సహా వివిధ రకాల బాదంపప్పులు అందుబాటులో ఉన్నాయి. బట్ బాదం ,కార్మెల్ బాదం, నాన్పరెయిల్ బాదం,గుర్బండి బాదం,స్వీట్ బాదం,పీర్లెస్ బాదం, గ్రీన్ బాదం మార్కోనా బాదం ఇలా 14 రకాలు ఉన్నాయి. వవీటిల్లో మమ్రా ,కాలిఫోర్నియా ఆల్మండ్స్ అనే ప్రధానమైనవి. ఈ రెండూ రుచికరమైనవీ, పోషకాలతో నిండి ఉన్నవే. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. మమ్రా బాదం: "రాయల్ బాదం" అని కూడా పిలుస్తారు, మమ్రా బాదం మధ్యప్రాచ్యానికి చెందినది మరియు కొన్ని శతాబ్దాల తరబడి సాగు చేయబడుతోంది. కాలిఫోర్నియా బాదం: ఇది అమెరికాకు చెందినది. కాలిఫోర్నియా బాదంపప్పును 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సాగు చేశారు. అనుకూలమైన వాతావరణం ,ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాలిఫోర్నియాను ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చాయి.రుచి, ఆకృతిలోనూ మమ్రా ,కాలిఫోర్నియా రకాలు మధ్య తేడాలున్నాయిమమ్రా బాదం మంచి సువాసనతో పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనె శాతం కూడా ఎక్కువే. మృదువుగా, విలక్షణమైన రుచితో ఎక్కువ క్రీమీగా ఉంటాయి కాలిఫోర్నియా బాదంపప్పులు చిన్నవిగా ఉంటాయి. నూనె శాతం తక్కువ . అందుకే రుచిలో కొంచెం తక్కువగా, క్రంచీగా ఉంటాయి. ప్రాసెసింగ్ పద్ధతులుమమ్రాం బాదంను చేతితో ప్రాసెస్ చేస్తారు. అందుకే ఇవిఎక్కువ నాణ్యంగా ఉంటాయి. సహజ రుచి ,ఆకృతిని పాడుకాకుండా ఉంటాయికాలిఫోర్నియా బాదం: సాధారణంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. కనుక కొద్దిగా రుచినీ ఆకృతిని కోల్పోతుంది. అయినప్పటికీ, ఇది ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది.పోషక విలువలుమమ్రా , కాలిఫోర్నియా బాదం రెండూ విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులకుఅద్భుతమైన మూలాలు, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి:మమ్రా బాదం పెద్దగా, నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత కలిగి ఉంటాయి. మమ్రా బాదంతో పోలిస్తే కాలిఫోర్నియా బాదంలో పోషక సాంద్రత కొంచెం తక్కువ. ధరలుమమ్రా బాధం ధర కిలో సుమారు రూ. 4000కాలిఫోర్నియా బాదం ధర కిలో సుమారు రూ. 1100 -
క్యారమ్స్ కథ గురించి తెలుసా? ఎక్కడ? ఎపుడు పుట్టింది?
ఏమీ తోచనప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది క్యారమ్స్. ఇద్దరు, నలుగురు కలిసి ఆడే ఈ ఆటంటే అందరికీ ఇష్టం. ఎవరికి ఎక్కువ కాయిన్స్ దక్కుతాయో ఎవరు రెడ్ కాయిన్స్‌ని చేజిక్కించుకుంటారో వారే ఈ ఆటలో విజేతలవుతారు. ఈ క్యారమ్స్ కథేమిటో తెలుసా?క్యారమ్స్ భారతదేశంలోనే పుట్టింది. ఎప్పుడు పుట్టిందనే సరైన లెక్కలు లేకపోయినా వందేళ్ల క్రితమే మన దేశంలోని సంపన్నుల ఇళ్లల్లో కొందరు క్యారమ్స్ ఆడేవారని అంచనా. 1935 నాటికి శ్రీలంక దేశంలో ఈ ఆటకు సంబంధించి పోటీలు ప్రారంభమయ్యాయి. 1958లో శ్రీలంక, భారత్ దేశాలు క్యారమ్స్ ఆటకు అధికారిక ఫెడరేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేశాయి. దీన్నిబట్టి అప్పటికే దేశంలో క్యారమ్స్ పాపులర్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు. 1988లో చెన్నైలో తొలిసారి ‘అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య’ (ఐసీఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ క్యారమ్స్కి సంబంధించి విధివిధానాలు రూపొందించారు. అనంతరం పలు దేశాల్లో ఫెడరేషన్లు ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో జాతీయ ఛాంపియన్ షిప్స్ నిర్వహించడం మొదలు పెట్టారు. (పుట్టింది కెనడాలో... అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!) క్యారమ్స్ ఆడేందుకు శారీరకంగా ఇబ్బందిపడనక్కర్లేదు. బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా కలిసి ఆడుకోవచ్చు. దీంతో ఈ క్యారమ్స్ చాలా ప్రసిద్ధి చెందింది. 2000వ సంవత్సరం నాటికి అనేకమంది ఇళ్లల్లోకి క్యారమ్ బోర్డులు రావడం ఇందుకు ఉదాహరణ. 73.5 సెం.మీల ఎత్తు, 74 సెం.మీల వైశాల్యం కలిగిన ఈ బోర్డు ఆడేందుకు కాకుండా చూసేందుకూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పరిమాణాన్ని అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య నిర్దేశించింది. క్యారమ్స్ ఆడేందుకు 19 కాయిన్స్, స్టైకర్ ఉండాలి. ఈ కాయిన్స్ తెలుపు, నలుపు, ఒకే ఒక్కటి మాత్రం ఎరుపురంగులో ఉంటాయి. బోర్డుపై ఆట సౌకర్యవంతంగా ఉండేందుకు బోరిక్ పౌడర్ వాడతారు. చెన్నైకి చెందిన ‘ఆంథోనీ మరియ ఇరుదయం’ అనే వ్యక్తి మన దేశంలో క్యారమ్స్ ఆటకు ప్రసిద్ధి చెందారు. రెండుసార్లు ప్రపంచ క్యారమ్స్ ఛాంపియన్ షిప్, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా 1996లో ఆయనకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చారు. క్యారమ్స్ కథ విన్నారుగా! ఖాళీ సమయాల్లో ఎంచక్కా ఆడుకోండి మరి! -
అసలైన ముత్యాలను గుర్తించండి : ఇలా భద్రపర్చుకోండి!
ముత్యాల పేరుతో మనకు మార్కెట్లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు. ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి. ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు. ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. --విశేషిణి రెడ్డి, జిఐఏ జెమాలజిస్ట్ -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్‌గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్‌కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్‌కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ
కొన్ని విజయాలను వ్యక్తిగత విజయాలుగా మాత్రమే పరిగణించలేము.రేణు సంగ్వాన్ సాధించిన విజయం అలాంటిదే.సంప్రదాయ విధానాలకు, ఆధునిక సాంకేతికత జోడిస్తే సాధించగల విజయం అది. పెద్దగా చదువుకోకపోయినా కష్టాన్ని నమ్ముకుంటే అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన విజయం అది.హరియాణా రాష్టప్రాం ఝుజ్జర్ జిల్లాలోని ఖర్మన్ గ్రామానికి చెందిన రేణు సంగ్వాన్ డిసెంబర్ 3న న్యూదిల్లీలో ‘కృషి జాగరణ్ మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’ అవార్డ్ అందుకోనుంది. పాడి పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైంది రేణు సంగ్వాన్...తొమ్మిది దేశవాళీ ఆవులతో రేణు పాడిపరిశ్రమ ప్రయాణం పారంభం అయింది. ఇప్పుడు ఆమె ‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ 280కి పైగా ఆవులకు నిలయంగా, సుస్థిర పాడి పరిశ్రమ అంటే ఇలా ఉండాలి అని చెప్పుకునేంతటి ఘన విజయం సాధించింది. మూడు కోట్ల టర్నోవర్‌తో దేశంలోని అత్యుత్తమమైన ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది.సాహివాల్, గిర్, థార్పర్కర్లాంటి స్వదేశీ ఆవు జాతులపై ఆధారపడడం రేణు విజయంలో కీలక అంశం. ఈ జాతులు ఔషధ గుణాలు కలిగిన పాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అంతేకాదు...హైబ్రిడ్ జాతులతో పోల్చితే వాటి ఆలనాపాలనకు అయ్యే ఖర్చు చాలా తక్కువ.‘ఈ ఆవులు స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. వాటి పాలు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇవి హైబ్రిడ్ జాతుల కంటే భిన్నమైనవి. స్వదేశీ ఆవులను ప్రోత్సహించడం ద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు’ అంటుంది రేణు.‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ తయారు చేస్తున్న నెయ్యికి మన దేశంలోనే కాకుండా పప్రాపంచవ్యాప్తంగా 24 దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ ఫామ్ విజయానికి ఆధునిక పద్ధతులు అవలంబించడం కూడా ఒక కారణం. కుమారుడు వినయ్‌తో కలిసి ఫామ్‌లో ఆటోమేటిక్ మిల్కింగ్ యంత్రాలు, అధునాతన క్లీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేసింది రేణు. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)‘గోకుల్ ఫామ్ శ్రీకృష్ణ’ దేశీయ ఎద్దుల వీర్యాన్ని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది.‘దేశవ్యాప్తంగా రైతులు స్వదేశీ ఆవులను దత్తత తీసుకొని, వాటి ఉత్పాదకతను పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి. కేవలం పాలపైనే కాకుండా నాణ్యమైన పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు’ అంటుంది రేణు.సవాళ్లు లేకుండా ఏ విజయం సాధ్యం కాదు.రేణు పప్రాయాణం మొదలు పెట్టినప్పుడు అది నల్లేరుపై నడకలా కొనసాగలేదు. వనరుల కొరతతో సహా రకరకాల అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆవులు ఆరోగ్యంగా ఉండేలా, వ్యాధుల బారి నుంచి వాటిని రక్షించడం కూడా పెద్ద సవాలుగా మారింది. పాడిపరిశ్రమలో వ్యాక్సినేషన్, పరిశుభప్రాత ఎంతో కీలకం’ అంటున్న రేణు ఆవులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం నుంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎంతో సమయాన్ని వెచ్చించింది. ఆవులకు అధిక నాణ్యత గల పశుగ్రాసాన్ని అందించడంపై దృష్టి పెట్టేది. కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో దేశవ్యాప్తంగా రైతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచిన రేణు సంగ్వాన్ పప్రాతిష్ఠాత్మకమైన ‘జాతీయ గోపాల్ రత్న పురస్కార్–2024’ అందుకుంది.విజయం అంటే మైలురాళ్లను చేరుకోవడం, వ్యక్తిగత సంతోషం మాత్రమే కాదు. కలలు కనడానికి, వాటిని సాధించడానికి ఇతరులను ప్రేరేపించడం. – రేణు సంగ్వాన్ -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
Yoga: కొలెస్ట్రాల్‌కు చెక్
రోజూ గంటల తరబడి డెస్క్ జాబ్ చేసేవారికి నడుం నొప్పి, పోట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి విముక్తికి ఈ వక్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ట్విస్టెడ్ పోజ్ అని కూడా అంటారు. పది నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత యోగాసనాలను సాధన చేయాలి.వెన్నెముక బలంగా అవడానికి, మెడ నరాల పనితీరు మెరుగుదలకూ సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల పోట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. నిటారుగా.. నిదానంగా! విశ్రాంతిగా కూర్చొని ఒక కాలును పోట్ట దగ్గర నుంచి రెండవ కాలు మీదుగా తీసుకెళ్లి ఉంచాలి. చేతులను వ్యతిరేక దశలో ఉంచడంతో నడుము భాగం ట్విస్ట్ అవుతుంది. ఎడమచేతితో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను భుజం మీదుగా సాధ్యమైనంత వెనుకకు తిప్పి, దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి. అనంతరం ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేత్తో కుడి మోకాలిని పోట్టవైపు నెడుతూ ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. – జి.అనూషా కార్తీక్, యోగా గురు -
సిక్త్స్ సెన్స్‌పై సర్వే పసి‘గట్’తాం!
శరీర అంతర్గత స్థితిపై మన భావాన్ని ‘ఇంటరోసెప్షెన్’ అంటారు. దీనినే‘సిక్త్స్ సెన్స్’ అని కూడా అంటారు. ‘గట్ ఫీలింగ్’ అనేది మరో పేరు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా భావిస్తారు.అంతశ్చేతన స్థాయి అంటే సబ్ కాన్షియస్ లెవల్లో పెద్ద మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, ఏకీకృతం చేయడానికి మెదడు సామర్థ్యం నుంచి అంతర్దృష్టి్ట ఉద్భవిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. భారతీయ పురాణాల నుంచి ఆధునిక శాస్త్రీయ పరిశోధనల వరకు మన దైనందిన జీవితంలో అంతర్దృష్టి శక్తి అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందో వివిధ కోణాలలో వివరించాయి.నిర్ణయాలు తీసుకోవడం, సంబంధ బాంధవ్యాలు, సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం, క్రియేటివిటీ అండ్ ఇన్స్పిరేషన్.. మొదలైన వాటి విషయంలో ఇది ఉపయోగ పడుతుంది.తాజా విషయానికి వస్తే... ప్రతి పదిమంది మహిళలలో 8 మంది ఆరోగ్యానికి సంబంధించి తమకు సిక్త్స్‌సెన్స్ ఉందని భావిస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. 2000 మంది మహిళలపై జరిపిన ఒక సర్వేలో వారి అంతర్దృష్టి ఎంత బలంగా ఉందో పరీక్షించగా వారిలో సగానికి పైగా తమ అంతర్దృష్టిపై నమ్మకం ప్రదర్శించారు.తమ ఆరోగ్య లక్షణాలకు సంబంధించి వివరాల కోసం 38 శాతం మంది మహిళలు ఆన్లైన్లో శోధిస్తున్నారు. 37 శాతం మంది గృహవైద్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి తమ ఆందోళనను వైద్యులు తోసిపుచ్చినప్పుడు పదిమందిలో నలుగురు ‘మెడికల్ గ్యాస్‌లైటింగ్’ అనుభవించామని చెబుతున్నారు. వైద్యపరీక్షలకు దూరంగా ఉండడానికి లేదా వాయిదా వేయడానికి కారణం ‘ఖర్చు భయం’ అంటున్నారు 24 శాతం మంది. 23 శాతం మందిలో ‘రోగ నిర్దారణ భయం’ ఉంది. జీవితంలో ముఖ్యనిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆరోగ్య విషయంలో తమలోని ‘సిక్త్స్‌సెన్స్’ను ఉపయోగిస్తున్నారు.అమెరికాకు చెందిన హెల్త్ కంపెనీ ‘ఎండీలైవ్’ కోసం టాకర్ రిసెర్చ్ ఈ సర్వేను నిర్వహించింది.‘అసాధారణ నొప్పి, శ్వాస ఆడక΄ోవడం, గుండెదడ లాంటి సాధారణ లక్షణాలు అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి ఆరంభ సంకేతాలు కావచ్చు. ఆరోగ్యపరమైన ఆందోళన ఉన్నా వారు వేచి చూసే ధోరణి వల్ల అది మరింత ఎక్కువ అవుతుంది. మీ ఆరోగ్యం మీద సందేహం వస్తే ఆలస్యం చేయవద్దు. వెంటనే వైద్య సలహా తీసుకోండి’ అంటున్నారు ‘ఎండిలైవ్ బై’ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వోంట్రెల్ రౌండ్‌ట్రీ. -
వీటిపై ‘శీత’ కన్నేయండి
ఈ కాలంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటికి ఎంతో మంచిది. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ కాలంలో తీసుకో వలసిన పండ్లు, కూరగాయలు ప్రకృతి చేసిన ఏర్పాటు వల్ల విరివిగా దొరుకుతూనే ఉంటాయి. అయితే తీసుకోకూడని ఆహారం మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అయితే వాటికి దూరంగా ఉండటం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారమేంటో చూద్దాం.ఈ కాలంలో తీసుకోకూడని ఆహార పదార్థాలలో ముందు వరసలో ఉండేది...నూనెలో వేయించిన చిరుతిళ్లు...వీటికి ఉదాహరణ సమోసాలు, పకోడీలు, బజ్జీలు. చలి చలిగా ఉన్న వాతావరణంలో వేడి వేడి బజ్జీలు, పకోడీలు, సమోసాలు లాగించడానికి బాగుంటుంది కానీ అరుగుదలకే చాలా కష్టం అవుతుంది. అజీర్తి, యాసిడిటీ, కడుపు ఉబ్బరం వస్తాయి. ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండటమే మేలు.డెయిరీ ఫుడ్...మీగడ, జున్ను, పాల ఉత్పత్తులు శరీరానికి బలవర్థకమే కానీ అది ఈ సీజన్లో అంతమంచిది కాదు. పాల ఉత్పత్తులు ఒంటికి వెచ్చదనాన్నివ్వడమొక్కటే కాదు, శ్లేష్మకరం కూడా. చల్లని వాతావరణంలో సైన సైటిస్ వచ్చేలా చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులున్నవారికి సమస్యలు కలిగిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం అంత మంచిది కాదు. రెడ్ మీట్...చలికాలంలో రెడ్ మీట్ తీసుకోరాదు. రెడ్‌మీట్‌కు మంచి ఉదాహరణ మటన్, బీఫ్, పోర్క్. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై దు్రçష్పభావం పడుతుంది. అధికమొత్తంలో కొవ్వు ఉండటం మూలాన అరుగుదల లోపిస్తుంది. కడుపు ఉబ్బరం వస్తుంది. ఒకోసారి అది గుండెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బండ్లమీద అమ్మే పదార్థాలు...బండ్లమీద అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే పానీపూరి, చాట్ వంటి వాటిని ఎప్పుడు తీసుకున్నా మంచిది కాదు కానీ ఈ సీజన్లో తీసుకోవడం బొత్తిగా మంచిది కాదు. స్ట్రీట్‌ఫుడ్ తినడం రోగనిరోధక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపి, బలహీనపరుస్తుంది. ఫలితంగా శరీరం రకరకాల వ్యాధుల బారిన పడుతుంది. అందువల్ల స్ట్రీట్ ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. శీతల పానీయాలు...చల్లటి వాతావరణంలో చల్లటి పానీయాలు, ఐస్‌క్రీములూ తీసుకోవడం వల్ల వాటిని అరిగించడానికి, జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా కష్టం అవుతుంది. దానివల్ల జీర్ణవ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుంది. గొంతులో గరగర, నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. సిట్రస్ జాతి పండ్లు...విటమిన్ సీ అధికంగా ఉండే కమలా, బత్తాయి, నిమ్మ వంటి పండ్లు తీసుకోవడం వల్ల వాటిని అరిగించే క్రమంలో కడుపులో తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అసిడిటీ, గొంతు మంట వంటి ఇబ్బందులు కలుగుతాయి.ఆవకాయ వంటి ఊరగాయలు...వింటర్లో ఊరగాయలు తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిల్వ ఉండటం కోసం ఊరగాయలలో ఉప్పు, నూనె, కారం వంటివి కొంచెం ఎక్కువమొత్తంలో వాడతారు. వాటిని అరిగించడం జీర్ణవ్యవస్థకు కాస్తంత భారమైన పనే. ఊరగాయలలో కూడా మామిడికాయలతో పెట్టిన ఆవకాయ, మాగాయ వంటివి తినడమంటే జీర్ణవ్యవస్థకు మరింత పని పెట్టినట్టే కాబట్టి వాటికి కాస్తంత దూరంగా ఉండటం మంచిది. మసాలా పదార్థాలు...మసాలాలు దట్టించి చేసిన పదార్థాలంటే భారతీయులకు అందులోనూ తెలుగు వాళ్లకు చాలా ఇష్టం. అయితే ఈ సీజన్లో మసాలాలను దేహం అరిగించుకోలేదు కాబట్టి వాటిని కూడా దూరం పెట్టడమే మేలు.