Ram Nath Kovind
-
అస్థిరమైనా ప్రజాస్వామ్యమే మేలు!
జమిలి ఎన్నికల గురించిన చర్చ నేడు దేశంలో వాడిగా, వేడిగా జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా జమిలి ఎన్నికలకు ఆమోద ముద్ర వేసింది. అయితే ఇటు ప్రజలలోనూ, అటు అనేక రాజకీయ పక్షాలలోనూ అనేక ప్రశ్నలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది ఎన్నికల వ్యయాలు, రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్లు పాలించడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడగలదు. రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా లేకుండా చేయగలదు.జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన లోతుపాతులూ, సాధ్యా సాధ్యాలూ వంటి అంశాలను కాసేపు పక్కన పెడదాం. జమిలి ఎన్ని కల అనుకూల వాదనలకు ప్రాతిపదికగా వున్న కొన్ని అంశాలను చూద్దాం. జమిలి ఎన్నికల వలన పదే పదే ఎన్నికలు జరిగే పరిస్థితి పోయి, ఆ మేరకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అనేది ఒక వాదన. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొంటుందనేది మరో వాదన. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు గాను, దేశ వ్యాప్తంగా అయిన మొత్తం ఖర్చును సుమారుగా 50 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 2024ల ఎన్నికల ఖర్చు, 2019 నాటి కంటే రెట్టింపై అది సుమారుగా 1–1.35 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంది. ఈ ఖర్చులను పైపైన చూస్తే , ఎన్నికల పేరిట చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చయిపోతోందని అనిపించక మానదు. కానీ, దీన్ని ప్రభుత్వ లేదా ఎన్నికల కమిషన్ వ్యయాలు... పార్టీలు, అభ్యర్థుల వ్యయాలుగా విడగొట్టి చూస్తే వాస్తవం మెరుగ్గా అర్థం అవుతుంది. 2019లోని ఎన్నికల ఖర్చులో, ఎన్నికల కమిషన్ వాటా కేవలం 15% అనేది గమనార్హం. అంటే, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదే లెక్క ప్రకారం, 2024లో ఎన్నికల మొత్తం వ్యయంలో 15 వేల కోట్ల రూపా యలు మాత్రమే ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వ్యయంగా ఉంది. ఎన్నికల వ్యయాలలో సింహభాగం నిజానికి ప్రైవేటు అభ్యర్థులది. దీని వలన, అటు దేశ ఖజానాకో, ప్రజల పన్ను డబ్బుకో వచ్చి పడిన ముప్పేమీ లేదు.సమస్య నాయకులకే!నిజానికి, రాజకీయాలు వ్యాపారంగా మారిన నేటి కాలంలో, అభ్యర్థులు చేసే ఈ ఖర్చులు, జనం డబ్బును తిరిగి జనానికి చేరుస్తు న్నాయి. ఈ కోణం నుంచి ఆలోచిస్తే, పదే పదే ఎన్నికలు రావడం వలన జనానికి వచ్చిపడే నష్టం ఏమీ లేదు. అది కేవలం రాజకీయ నాయకుల సమస్య. 2024 ఏప్రిల్– జూన్ కాలంలో (2024–25 ఆర్థిక సంవత్సరం తాలూకు తొలి త్రైమాసికం) దేశ ఆర్థిక వ్యవస్థ, సుమారు 21 నెలల మందగమనం తర్వాత, కొంత కోలుకోవడాన్ని గమనించొచ్చు. ఆ కాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, దాని తాలూకు ఖర్చులు ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఉద్దీపనలుగా పని చేశాయి. బాడుగ కార్లు మొదలుకొని, బ్యానర్లు, పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్‌ల ఖర్చులు, సోషల్ మీడియా ప్రచార ఖర్చులు... వీటితో పాటుగా ఎటుకూడి ‘ఓటుకు నోటు’ను జనానికి అలవాటు చేశారు కాబట్టి, ఆ వ్యయాలు కూడా కలగలిపి దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఉద్దీపన కావడంలో ఆశ్చర్యం లేదు.ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేసిన అనేక మంది రాజకీయ నేతలు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు దాపురించాయి. కాబట్టి, జమిలి ఎన్నికల రూపంలో ఐదు సంవత్స రాల సుస్థిర పాలనను హామీ చేసుకోవడం అనేది అటు అభ్యర్థులకూ, ఇటు పాలక పార్టీలకూ వెసులుబాటుగానే కనపడినా... అది ప్రజలకు మాత్రం సుదీర్ఘకాల సాధికారత లేని స్థితినీ, పరిపాలన బాగా లేకున్నా భరించక తప్పని స్థితినీ తెచ్చిపెడుతుంది. ఇక్కడి ప్రశ్న రాజకీయ నాయకులకూ, పాలక పార్టీలకూ వాటి పాలనా అధికార వ్యవధిని గ్యారెంటీ చేసే జమిలి ఎన్నికలు మెరుగా? లేదా... ప్రజలకు ఎంతో కొంత నేతల అందుబాటునూ, సాధికారతనూ హామీ చేసే సజీవమైన అస్థిరతే మెరుగా అన్నది!కాలవ్యవధికి గ్యారెంటీయా?మన దేశంలో ఉన్నది ప్రధానంగా పార్లమెంటరీ వ్యవస్థ. మన లోక్ సభ, రాజ్య సభలకు తరచుగా మధ్యంతర ఎన్నికలు వస్తూనే ఉండటం తెలిసిందే. గెలిచిన అభ్యర్థుల మరణాలు, వారి రాజీనా మాలు తదితర అనేక కారణాల వలన కూడా మధ్యంతర ఎన్నికలు వస్తూ ఉంటాయి. కాబట్టి, జమిలి ఎన్నికల పేరిట ఐదేళ్ల పాటు నికరంగా, సుస్థిరంగా పాలించి తీరగలమన్న ఆశ అంత వాస్తవికమై నదేమీ కాదు. పదే పదే ఎన్నికలు రాకుండా నివారించగలిగితే, పాలక పక్షాలు అనేక విధాన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాయన్న వాదన కూడా ఉన్నది. ఇది కేవలం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో పాలక పక్షాలకు కావలసిన సుస్థిర పాలనను హామీ చేసే వాదన మాత్రమే. నిజానికి, గతం నుంచి ఇటువంటి వాదన వేరొక రూపంలో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఏ విధంగా పరస్పరం ఆరోపణలూ, ప్రత్యారోపణలూ చేసుకున్నా, ఎన్నికల అనంతరం అటు పాలక పక్షం... ఇటు ప్రతిపక్షమూ రెండూ కలగలిసి దేశ అభ్యున్నతికి పాటు పడాలి అన్నది. ఈ వాదన పూర్తిగా అసంబద్ధమైనది. అధికార పక్షం తాను ప్రాతినిధ్యం వహించే వర్గాల, సమూహాల ప్రయోజనాల కోసం పని చేస్తూ పోతుంటే... మరో పక్కన, భిన్నమైన ప్రయోజనాలు వున్న సామాజిక వర్గాలు, సమూ హాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిపక్షాలు అనివార్యంగా పాలక పక్షంతో తలపడక తప్పని స్థితి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించటం పేరిట, యజమానులు లేదా పెట్టు బడిదారులకు అనుకూలమైన విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తే, అది సహజంగానే కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సుస్థిరత పేరిట ప్రభు త్వాలకు ఆ ఐదు సంవత్సరాల కాల వ్యవధిని గ్యారెంటీ చేయడం ఆ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించని ఇతరేతర వర్గాలకు నియంతృత్వంగానే పరిణమించగలదు. సుస్థిర నియంతృత్వమా? అస్థిర ప్రజాస్వామ్యమా?నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాల క్రమంలో, పేద ప్రజలకూ, సామాన్య జనానికీ ఇచ్చే సబ్సిడీలు లేదా రాయితీలపై నిరంతరంగా కోతలు పడుతున్నాయి. ప్రధాని మోదీనే స్వయంగా ‘రేవడి సంస్కృతి’ (ఉచితాల సంస్కృతి)పై చర్చ జరగా లంటూ చెప్పడాన్ని గమనించవచ్చు. ఈ సంక్షేమ వ్యయాలు లేదా ‘ఉచితాల’ గురించిన చర్చ అంతిమంగా అనేక దేశాలలో పొదుపు చర్యల రూపంలో ఆర్థిక మాంద్య స్థితికీ, అస్థిరతకూ కారణం కావడాన్ని కళ్ళ ముందే చూస్తున్నాం. గతంలో, అనేక లాటిన్ అమెరికా దేశాలలోనూ... యూరోప్‌లోని గ్రీస్‌లోనూ... ఈ మధ్య కాలంలోనే ఆసియా ఖండంలోని శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాలలోనూ సామాన్య జనానికి కల్పించే రాయితీలను పొదుపు చర్యల పేరిట తగ్గించి వేయడం ఏ విధంగా సామాజిక విస్పోటనాలకూ, పోరా టాలకూ దారి తీసిందో చూశాం. ఇటువంటి, ప్రజా వ్యతిరేక, సంక్షేమ వ్యతిరేక నిర్ణయాలను మధ్య మధ్యలో వచ్చి పడే ఎన్నికల లేదా ప్రజా తీర్పుల భయం లేకుండా ఐదేళ్ల పాటు నిరాఘాటంగా తీసుకోగలిగే టందుకు మాత్రమే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియ ఉపయోగపడ గలదు. కాబట్టి, ఇప్పటికే ప్రజలకు దూరమైన రాజకీయ వ్యవస్థలో రాజకీయ పక్షాలు, రాజకీయ నేతలను అదుపు చేయగలిగేటందుకు ప్రజలకు ఉన్న కాస్తంత అవకాశాన్ని కూడా, ఈ జమిలి ఎన్నికలు లేకుండా చేసేయగలవు. జమిలి ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఎన్నికల వ్యయాలు లేదా రాజకీయ సుస్థిరతలకు సంబంధించిన అంశం కానే కాదు. అది, దేశ రాజకీయాలపై సామాన్య జనానికి పట్టు వుండాలా... లేదా కార్పొ రేట్లు, ధనవంతులు లేదా వారి అనుకూల రాజకీయ పక్షాలకు పట్టు ఉండాలా అనే అంశానికి సంబంధించింది అనేది సుస్పష్టం. సుస్థిర ప్రజా వ్యతిరేక పాలన కంటే, నిరంతరంగా ప్రజలకు లోబడిన, వారికి లొంగి వుండే అస్థిర రాజకీయ వ్యవస్థే మేలు.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
జమిలికి జై
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి. త్వరలో అమలు కమిటీ జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 1967 దాకా జమిలి ఎన్నికలే స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి. రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సుకోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది. అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి. -
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలుదేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది. -
రెండు దశల్లో ‘జమిలి’ ఎన్నికలు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచింది. రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కమిటీ సభ్యులైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్.కె.సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, లోక్‌సభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్మును నివేదిక అందజేశారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల ఈ నివేదికలో ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా అన్ని రకాల స్థానిక సంస్థలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. జమిలి ఎన్నికలతో అభివృద్ధి వేగవంతం అవతుందని, దేశానికి మేలు జరుగుతుందని ఉద్ఘాటించింది. ఈ ఎన్నికల కోసం కోవింద్ కమిటీ రాజ్యాంగానికి మొత్తం 18 సవరణలు సూచించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే.... రామ్‌నాథ్ కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ 191 రోజులపాటు విస్తృత పరిశోధన సాగించింది. భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం తదితర దేశాల్లో అమల్లో ఉన్న జమిలి ఎన్నికల ప్రక్రియలను అధ్యయనం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే కోవింద్ కమిటీ సిఫార్సుల చేసిందని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఈ సిఫార్సుల ప్రకారం రాజ్యాంగానికి కనిష్ట సవరణలతో జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. 32 పార్టీల మద్దతు జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోవింద్ కమిటీ సేకరించింది. అభిప్రాయం చెప్పాలంటూ 62 పార్టీలకు సూచించగా, 47 పార్టీలు స్పందించాయి. ఇందులో 32 పార్టీలు జమిలికి జైకొట్టాయి. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మిగిలిన 15 పార్టీలు స్పందించలేదు. బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఏఐఏడీఎంకే, బిజూ జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్(యూ), శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి వ్యతిరేకించాయి. త్వరలో లా కమిషన్ నివేదిక ఏకకాలంలో ఎన్నికలపై లా కమిషన్ త్వరలో తన నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు ప్రారంభించాని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సూచించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులు ► లోక్‌సభలో హంగ్, అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్లీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త సభను ఏర్పాటు చేయాలి. ► ఎన్నికలు జరిగి కొత్తగా కొలువుదీరిన లోక్‌సభ ఐదేళ్లు కొనసాగదు. అంతకంటే ముందున్న సభ గడువు ఎన్నాళ్లు మిగిలి ఉంటుందో అప్పటివరకు మాత్రమే కొత్త సభ మనుగడ సాగిస్తుంది. ► రాష్ట్రాల శాసనసభలు లోక్‌సభ కాల వ్యవధి ముగిసేవరకు(ముందుగా రద్దయితే తప్ప) పనిచేస్తాయి. ► జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 83(పార్లమెంట్ కాల వ్యవధి), ఆర్టికల్ 172(శాసనసభ కాల వ్యవధి)కు సవరణ చేయాలి. ► ఆర్టికల్ 83, ఆర్టికల్ 172కు సవరణ చేయడానికి రాష్ట్రాల అమోదం అవసరం లేదు. ► జమిలి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదించి ఒక ఉమ్మడి ఓటరు జాబితా, ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325కి సవరణ చేయాల్సి ఉంటుంది. ► స్థానిక సంస్థలతో ఏకకాలంలో ఎన్నికల కోసం ఆర్టికల్ 324ఏను సవరించాలి. ► ఆర్టికల్ 325, ఆర్టికల్ 324ఏకు సవరణ చేయాలంటే రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ► ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. జమిలి ఎన్నికలతో ఇలాంటి సమస్యలు పరిష్కరించవచ్చు. ► జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక పటిష్టమైన చట్టబద్ధ యంత్రాంగాన్ని రూపొందించాలి. -
జమిలి అమలుకు అవరోధాలు
ఒక దేశ రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలకు, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు నిర్ణీత తేదీలు ఉండటం సర్వ సాధారణం. అయితే, భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కానీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీ కాలం మధ్యలోనూ, మరికొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవ సరంగా సమయం, ఖర్చు చేయకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అనేది దాని అమలు సాధ్యతపైనే ఆధారపడి ఉంది. ఒక దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలుకు రాజ్యాంగ సవరణలు, ఇతర పరిశీలనల విషయమై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ... దీనికి సంబంధించి ప్రజల సూచనలను కోరింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనకు ప్రధాన కారణం సమయం, ఖర్చు, ఆదా చేయడం. ఈ రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయి. కానీ, సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో దాదాపు ఎక్కడా సమాఖ్య స్థాయిలో, ప్రాంతీయ (రాష్ట్ర) స్థాయులలో ఏకకాల ఎన్నికలు జరగడం లేదు. నిజానికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం– న్యాయంపై ఏర్పర్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిన 79వ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా, స్వీడన్ దేశాల్లోని రెండు కేసులను మాత్రమే ఉదాహరించింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి పాదిస్తున్న దక్షిణాఫ్రికాలో ఎన్నికలు 1994లో మాత్రమే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్... సమాఖ్య, ప్రాంతీయ స్థాయులలో (వెస్ట్రన్ కేప్ మినహా) దేశమంతటా విజయం సాధించడం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 25 ఏళ్లలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చిన భారతదేశ పరి స్థితికి ఇది భిన్నమైనది కాదు. భారతదేశంలో మరింత స్పర్థాత్మక రాజకీయ దృశ్యం కారణంగా, ఆ తర్వాత హంగ్ అసెంబ్లీలు (హంగ్ పార్లమెంటు కూడా), పార్టీని మొత్తంగా ఖాళీ చేసి వేరే పార్టీలోకి గెంతేయడం (ఫ్లోర్ క్రాసింగ్) మొదలైనవి కనిపించడం ప్రారంభమైంది. ఫలితంగా చట్టసభల రద్దు, ఎన్నికలు, వివిధ సమయాల్లో పార్లమెంటుకు, రాష్ట్రాలకు (శాసనసభ లేకుండా) ఆరు నెలల కంటే ఎక్కువ విరామం ఏర్పడుతూ వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థితి ప్రజాస్వా మ్యానికి ఆమోదయోగ్యం కాదు. పైగా భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. స్వీడన్ విషయానికి వస్తే ఆ దేశం మునిసి పాలిటీలు, రీజియన్లలో ఏకీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉంది, కానీ రీజియన్లలో మాత్రం ఫెడరల్ వ్యవస్థలోని ప్రావిన్సుల వలె ఉండదు. పైగా వాటి మధ్యన క్రమానుగత సంబంధం లేదు. ముఖ్యంగా, రెండూ వేర్వేరు రకాల పనులను చేపట్టే స్థానిక ప్రభుత్వ రూపాలు. స్వీడిష్ రాజ్యాంగం ముందస్తు ఎన్నికలను అనుమతిస్తుంది. అయితే ఇవి రద్దు అయిన కాలం నుండి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే పరిమిత మవుతాయి. ఒక దేశంలోని రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలు, సమాఖ్య పార్లమెంట్ల ఎన్నికలకు నిర్ణీత తేదీలు ఉండటం చాలా సాధారణ లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న కెనడా సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ స్థాయిలోనూ, దాని ప్రావిన్సు లలోనూ రెండు చట్టాలను రూపొందించింది. ఎన్నికల నిర్వహణకు ఒక నిర్ణీత తేదీని ప్రతి పాదిస్తుంది, ఆ తేదీ ప్రావిన్స్ నుండి ప్రావిన్స్‌కు మారుతూ ఉంటుంది. ఫెడరల్ ఎన్నికల షెడ్యూల్ వేరొక దానిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియాలో ఫెడ రల్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల (వాటిలో చాలా వరకు) కాలావధులు వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తద్వారా అక్కడ జమిలి ఎన్నికలను మినహాయించారు. ‘నిర్దిష్ట తేదీ, పదవీకాలం’ ఎన్నికల నమూనా తక్షణమే అమెరికాను గుర్తు చేస్తుంది. అక్కడ అధ్యక్ష, గవర్నర్ ఎన్నికలు ప్రతి నాలుగు సంవ త్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పని చేయనట్లయితే వారి స్థానంలోకి రాగల యోగ్యత ఉన్నవారి కోసం ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఆ ప్రక్రియ ద్వారా పూర్తి కాలాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది, అయితే ఇది కొన్నిసార్లు ‘ప్రజల స్థాయిలో’ ఎన్ని కల్లో పోటీ చేయకుండానే 1974లో గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా మారడం వంటి క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ప్రతి రెండు సంవ త్సరాలకు ఒకసారి అమెరికా కాంగ్రెస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగు తాయి. ప్రైమరీలకు సంబంధించి అమెరికన్ సంప్ర దాయం ప్రకారం, దేశం ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం ఎన్నికల మోడ్‌లో ఉంటుంది. భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమి టంటే – రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీకాలం మధ్య లోనూ, మరి కొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్ని కలు జరపాల్సి ఉంటుంది. సమాఖ్య, ప్రాదేశిక ఎన్నికలను వేరు చేయడం వల్ల ఓటర్లు తమ రాష్ట్రం లేదా ప్రావిన్స్‌లో ఉన్న నాయకులు లేదా జాతీయ ఎన్నికల సమస్యల కారణంగా ఇటూ అటూ అవగల సంభావ్యతకు గురికాకుండా ఉంటారని నమ్మకం. పోరులో ఉన్న ప్రాంతీయ పార్టీలకు (లేదా పార్టీలకు) ప్రత్యేక గుర్తింపు లేనప్పుడు అలాగే ఓటర్లు సులభంగా గుర్తించగలిగేలా పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాను సూచించే కారణం లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవసరంగా సమయం, డబ్బులు ఖర్చు చేయకూడదనే ఆలోచన ఆమోదయోగ్యమైనదే. జర్మనీలో ఇటీవల నేపాల్ అనుభవాల నుండి, ఎక్కువ రాజకీయ సుస్థిరతను అందించే రాజ్యాంగపరమైన నిబంధనలు సాధ్యమయ్యే అవకాశం కనిపించింది. ఉదాహరణకు, జర్మన్ బేసిక్ లా, 2015 నేపాలీ రాజ్యాంగం అవిశ్వాసంలో సాను కూల ఓట్లను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి తీర్మానంతో పాటు తదుపరి నాయకుడి పేరు కూడా ఉండాలి. బ్రిటన్ లో, కెనడాలో కూడా పార్లమెంటు నిబంధనలను పరిష్కరించే ప్రయత్నాలు... కామన్వెల్త్ సంప్రదాయం ద్వారా సభను రద్దు చేసి, తాజా తీర్పును కోరే హక్కును ప్రధానమంత్రి కలిగి ఉండటం ద్వారా విఫలమయ్యాయి. నేపాల్‌లో అదే సంప్రదాయాన్ని అమలు చేయాలని కోరినప్పుడు, దానిని సుప్రీంకోర్టు 2021లో రెండు సందర్భాల్లో అనుమతించకపోగా, కొత్త నాయకుడిని ఎన్నుకో మని సభను కోరింది. మధ్యంతర ఎన్నికలపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 2017లో ఎన్ని కైన సభ పూర్తి ఐదేళ్ల కాల వ్యవధిలో పాలన సాగించేలా అది దోహదపడింది. మంజీవ్ సింగ్ పురి వ్యాసకర్త భారత మాజీ రాయబారి -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్‌తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
One Nation, One Election: జమిలి ఎన్నికలపై సూచనలివ్వండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచనలివ్వాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ కమిటీ ప్రజలను కోరింది. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి చట్ట పరమైన పరిపాలనా ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టాల్సిన మార్పులను తెలపాలని పిలుపునిచ్చింది. జనవరి 15వ తేదీలోగా అందిన సూచనలను పరిశీలనకు పరిగణిస్తామని ఒక నోటీసులో తెలిపింది. సూచనలను onoe.gov.in వెబ్సైట్లో పోస్టు చేయాలని సూచించింది. లేదా sc& hlc@gov.in కి మెయిల్ చేయవచ్చని వివరించింది. ఈ నోటీసును ఆరు జాతీయ పార్టీలకు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీలకు పంపినట్లు తెలిపింది. ఇదే అంశంపై లా కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటామంది. -
One Nation, One Poll: జమిలి ఎన్నికలు...కోవింద్‌తో లా కమిషన్ భేటీ
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను కమిటీ ముందు ఉంచింది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది. వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది. -
అది రాష్ట్రపతిని అవమానించడమే: ఖర్గే
ఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి కేంద్రం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. సినీ తారలను ఆహ్వానించిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రపతిని విస్మరించడం ఆ హోదాను.. ఆ హోదాలో ఉన్న ఆమెను అవమానించినట్లేనని మండిపడ్డారు. శనివారం రాజస్థాన్ జైపూర్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఓ కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగాన్ని అనుసరించి.. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తిని ఇలా అవమానించడం దారుణం. పార్లమెంట్ ప్రారంభం అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. సినీ తారలను ఆహ్వానిస్తారా. ఇది రాష్ట్రపతిని అవమానించడమే. కాంగ్రెస్‌లో అన్ని కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, బీజేపీ ఎవరినీ దగ్గరకు రానివ్వదు’’ అని ఖర్గే అన్నారు. అంతేకాదు.. గతంలో రామ్ నాథ్ కోవింద్‌ను సైతం పార్లమెంట్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ ఆహ్వానించలేదనే విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. అది అంటరానితనమే అవుతుందన్నారు. ఒకవేళ అంటరాని వాడిగా భావించే వ్యక్తితో శంకుస్థాపన జరిపించినా.. సహజనంగానే వాళ్లు గంగాజలంతో శుద్ధి కార్యక్రమం నిర్వహించేవాళ్లేమో అని ఖర్గే బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేనేలేదని ఖర్గే అన్నారు. కేవలం ఇండియా కూటమికి భయపడే రిజర్వేషన్ అంశం.. అదీ ఎన్నికల ముందర బీజేపీ తెచ్చిందని విమర్శించారాయన. -
జమిలి ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (ఒక దేశం, ఒకే ఎన్నికలు) అధ్యయనం కోసం ఏర్పాటు కమిటీ తొలి భేటీ ముగిసింది. శనివారం ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. జమిలిపై అభిప్రాయాల సేకరణ చేపట్టడంతో పాటు సూచనలను తీసుకోవాలనుకుంటోంది. జమిలి కమిటీ తొలి భేటీలో సభ్యులకు సమావేశం అజెండా వివరించారు జమిలి కమిటీ చైర్మన్ కోవింద్. ఈ సమావేశంలో సభ్యులతో పాటు హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి మేఘ్‌వాలా పాల్గొన్నారు. భేటీ అంతిమంగా జమిలి ఎన్నికలపై అభిప్రాయాల కోసం.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలను ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించింది. జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించనున్నట్లు సమాచారం. వీళ్లతో పాటు పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం అందించనుంది. ఇక.. లా కమిషన్ నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేపట్టాలని కోవింద్ కమిటీ నిర్ణయించింది. -
ఒక దేశం - ఒకే ఎన్నికపై కసరత్తులు వేగవంతం
-
ఒక దేశం-ఒకే ఎన్నికపై కసరత్తులు వేగవంతం
-
రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చీఫ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కమిటీ ఎజెండాపై చర్చించారు. న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన కార్యదర్శి రీటా వశిష్ట తదితరులు కోవింద్‌ను కలిశారు. జమిలి ఎన్నికల విషయంలో అధ్యయనం చేయాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. చట్టపరమైన విషయాలపై చర్చించుకున్నారు. ఉన్నత స్థాయి కమిటీకి నితిన్ చంద్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై అధ్యయనం కోసం 8 మంది సభ్యులతో హైలెవెల్ కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనికేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
జమిలి ఎన్నికలపై.. హైలెవెల్ కమిటీ
న్యూఢిల్లీ: అధికార బీజేపీ ఎంతోకాలంగా తెరపైకి తెస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరో కీలక ముందడుగు పడింది. లోక్ సభతో పాటు, అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల దాకా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై లోతుగా అధ్యయనం జరిపి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యం వహిస్తారు. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్ సహా విపక్షాలకు కూడా కమిటీలో చోటు దక్కడం విశేషం. కేంద్రం తరఫున హోం మంత్రి అమిత్ షా, ప్రధాన విపక్షం కాంగ్రెస్ నుంచి లోక్ సభలో ఆ పక్ష నేత అదీర్ రంజన్ చౌధరి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ తక్షణం రంగంలో దిగి పని చేయడం ప్రారంభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేస్తుంది. కాగా ఈ కమిటీలో చేరేందుకు అ«దీర్ రంజన్‌తిరస్కరించడం గమనార్హం. కమిటీ ఏమేం చేస్తుందంటే... ► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే ఏం చేయాలో సిఫార్సులు చేస్తుంది. ► దీనికి రాజ్యాంగంలో, ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితర చట్టాలు, నిబంధనలకు చేయాల్సిన సవరణలు, మార్పులను సూచిస్తుంది. ► రాజ్యాంగంలోని సంబంధిత అధికరణలకు చేయాల్సిన సవరణలను రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సిన ఆవశ్యకత ఉందో లేదో పరిశీలిస్తుంది. ► జమిలి ఎన్నికలు సాధ్యపడాలంటే అందుకు అడ్డంకిగా మారగల హంగ్ సభ, అవిశ్వాస తీర్మానాలు, పార్టీ ఫిరాయింపులు తదితర సమస్యలు, వాటిని అధిగమించాల్సిన విధానాలను పరిశీలిస్తుంది. ► తమ పరిశీలన, అధ్యయనానికి తోడ్పడేలా, తుది సిఫార్సుల రూపకల్పనలో ఉపకరించేలా ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు చేసినా, విజ్ఞాపనలు చేసినా కమిటీ స్వీకరిస్తుంది. -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరో తెలుసా?
దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం.. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జాకిర్ హుస్సేన్ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు. జాకిర్ హుస్సేన్ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జ్ఞానీ జైల్ సింగ్ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. ఆర్. వెంకట్రామన్ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. శంకర్‌దయాళ్ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు. దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. అంతకుముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్ హయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమైంది. దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. అంతకుముందు బిహార్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!) -
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్‌గా విజయ్ సాంప్లా
న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్ సాంప్లా ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్సీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో పంజాబ్‌లోని హోషియార్పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: (క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో) -
నెదర్లాండ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం
ఆమ్స్టర్డ్యామ్: నెదర్లాండ్ రెండు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. ఆమ్స్టర్డామ్లోని డామ్ స్క్వేర్ వద్ద సైనిక వందనం స్వీకరించారు రాష్ట్రపతి కోవింద్. రాజు అలగ్జాండర్, రాణి మాగ్జిమా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు భారత రాష్ట్రపతి. ప్రధాని మార్క్ రూటెతో చర్చలు జరపనున్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం క్యుకెన్హాఫ్ను సందర్శిస్తారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ.. రష్యా సంచలన ఆరోపణ -
ఘనంగా ‘పద్మ పురస్కారాల ’ ప్రదానోత్సవం (ఫోటోలు)
-
దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ హోలీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రంగుల కేళీ హోలీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. आप सभी को होली की हार्दिक शुभकामनाएं। आपसी प्रेम, स्नेह और भाईचारे का प्रतीक यह रंगोत्सव आप सभी के जीवन में खुशियों का हर रंग लेकर आए। — Narendra Modi (@narendramodi) March 18, 2022 రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘హోలీ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ, మత సామరస్యం సయోధ్యకు సజీవ ఉదాహరణ. హోలీ అందరి జీవితాల్లో ఆనందం, ఉత్సాహం. కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు होली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। रंगों का पर्व होली, सामुदायिक सद्भाव और मेल-मिलाप का जीवंत उदाहरण है। यह वसंत ऋतु के आगमन का शुभ समाचार लेकर आता है। मेरी कामना है कि यह त्योहार सभी देशवासियों के जीवन में आनंद, उमंग और नई ऊर्जा का संचार करे। — President of India (@rashtrapatibhvn) March 18, 2022 ప్రధాని మోదీ, రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. CM Sri KCR has conveyed #Holi greetings to the people of the State. Hon'ble CM stated that the festival of colours conveys the message of unity and togetherness. Wished people to celebrate the festival with joy and with eco-friendly colours.#HappyHoli pic.twitter.com/clrRdgjRjO — Telangana CMO (@TelanganaCMO) March 18, 2022 -
తూర్పు నౌకాదళ కేంద్రంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ
సాక్షి విశాఖపట్నం: విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఘనంగా జరిగింది. నావికా దళాలు త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఘనంగా గౌరవ వందనం చేశాయి. PFR-22లో భాగంగా నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు, 10 వేల మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములకు సంబంధించిన నౌకాదళ శక్తిసామర్ధ్యాలను రివ్యూ చేశారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో జరిగిన ఈ 12వ ఫ్లీట్ రివ్యూ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ... "కోవిడ్-19" మహమ్మారి సమయంలో నేవీ పాత్ర శ్లాఘనీయం. స్నేహపూర్వక దేశాలకు వైద్య సహాయం అందించారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించారు" అని పేర్కొన్నారు. అంతేకాదు భారత నౌకాదళం నిరంతర నిఘా, సంఘటనలపై సత్వర ప్రతిస్పందన, అలుపెరగని ప్రయత్నాలు సముద్రాల భద్రతను కాపాడుకోవడంలో అత్యంత విజయవంతమైందని రాష్ట్రపతి చెప్పారు. ఈ మేరకు సాయుధ దళాల సుప్రీం కమాండర్ మాట్లాడుతూ.. "నౌకలు, విమానాలు, జలాంతర్గాముల అద్భుతమైన కవాతు ప్రదర్శించింది. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధతను కూడా ఈ కవాతు ప్రదర్శించింది" అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్ర ప్రాంతంలోనే జరుగుతోందని మన వాణిజ్యం, ఇంధన అవసరాలలో గణనీయమై భాగం మహాసముద్రాల ద్వారానే తీరుతుందని కోవింద్ స్పష్టం చేశారు. భారత నావికాదళ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, మన సముద్ర శక్తికి సంబంధించిన ఇతర అంశాల సంసిద్ధతను సమీక్షిస్తున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నాని చెప్పారు. భారత నావికాదళం మరింత స్వావలంబనగా మారుతోందని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో ముందంజలో ఉందని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశం అణు జలాంతర్గాములను నిర్మించడం చాలా గర్వించదగ్గ విషయంగా రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. అంతేగాక 1971 యుద్ధ సమయంలో విశాఖపట్నం నగరం అద్భుతమైన సహకారం అందించిందని చెప్పారు. (చదవండి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్) -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్ (ఫోటోలు)
-
విశాఖకు ప్రముఖల తాకిడి.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణ): ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం విశాఖ రానున్నారు. ప్రముఖుల రాకతో పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖ చేరుకుంటారు. ఆయనకు ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సాయంత్రం 5.55 గంటకు సీఎం తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్ చౌహన్, కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి రూపాల పురుషోత్తమ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి (ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్) బి.ఆనంద్, కేంద్ర ఎర్త్ అండ్ సైన్స్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రవిచంద్రన్, గవర్నర్ కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెకట్రరీ ఆర్.పి.సిసోడియా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు రఘునాధరావు, బి.కృష్ణమోహన్ తదితరులు వస్తున్నారు. -
Statue of Equality: హైదరాబాద్ పర్యటనలో రామ్‌నాథ్ కోవింద్
-
రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
-
ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
-
Budget Session: ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పిన చిదంబరం
► కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అన్నారు. మోదీ సర్కార్ వద్ద ఏ డేటా ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో గంగానదిలో తేలిన మృతదేహాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం చెప్పిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు . ► ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోలు ఉండేవి కావని ప్రధాని మోదీ అన్నారు. పేదలు కనీస అవసరాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది కాదని తెలిపారు. మహాత్మా గాంధీనే కాంగ్రెస్‌ను వద్దనుకున్నారని మోదీ చెప్పారు. ► రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనాతో దేశం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొందని తెలిపారు. కరోనాతో ఎన్నో జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశం ఏనాడో బాగుపడేదని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లు అవుతున్న కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ► రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్టు కేసులతో ఒక పరీక్ష మూడేళ్లపాటు నడుస్తోందని, దీని వల్ల విద్యార్థులు ఎంతో మంది నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడోరోజు ఉభయ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. చదవండి: లతకు పార్లమెంటు నివాళి -
మళ్లీ ‘భువికి’ రామానుజులు!
సాక్షి, హైదరాబాద్: జాతులు.. వర్గాలు.. ఆడ.. మగ.. మనిషి.. జంతువు.. అంతా సమానమే.. పరమాత్మ దృష్టి అన్నీ ఒకటే అంటూ సమానత్వాన్ని చాటిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యులు మరోసారి మనముందు వెలుస్తున్నారు. ఓవైపు భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు.. అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో.. ♦ రామానుజుల ప్రాంగణం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా నిలుస్తోంది. చినజీయర్ స్వామి చిరకాల వాంఛను నిజం చేస్తూ 2016లో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి 2,700 శిల్పులు ఈ రాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. ♦ ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మం ది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్)‡ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 108 పుణ్యక్షేత్రాల దర్శన అనుభూతితో.. ♦ ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ♦ ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెయిన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్‌లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. ♦ రామానుజుల సమతామూర్తి, పక్కనే ఉన్న ఫౌంటెయిన్, ఇతర భవనాలపైన కనువిందు చేసేలా.. ప్రత్యేక కాంతిపుంజాల విన్యాసాలతో జరిగే ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) షో మంత్రముగ్ధులను చేస్తుంది. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 18 నిమిషాల పాటు ఈ 3డీ షో నిర్వహిస్తారు. ఇందులో రామానుజులు ప్రబోధించిన సమానత్వాన్ని చాటే ఘట్టాలు కనివిందు చేస్తాయి. ఏకకాలంలో 3,600 మంది తిలకించొచ్చు. ఇక రెండు లక్షల మొక్కలతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రత వైఫల్యాలను గురించి తెలియజేశారు. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రధానికి ఫోన్ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోదీని నిరసన కారులు అడ్డుకోవడంతో.. ఒక ఫైఓవర్‌పై 20 నిముషాలపాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కువచ్చేశారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో విచారణ! -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్) -
20 నుంచి 25 వరకు రాష్ట్రపతి విడిది!
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 20వ తేదీన హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌లో విడిది చేస్తారని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్ పూర్తిగా ఖరారు కాకపోయినా.. రాష్ట్రపతి వస్తారన్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత సంవత్సరం రాష్ట్రపతి ఇక్కడ విడిదికి రాలేదు. కోవిడ్ తగ్గిందనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ పేరుతో మళ్లీ కేసులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రపతి వస్తారా? లేదా? అన్నదానిపై తుది సమాచారం లేదని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రపతిగా ఉన్నవారు డిసెంబర్లో హైదరాబాద్ నగరంలో విడిది చేయడం ఆనవాయితీగా వస్తోంది. -
నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్ మాజీ’
సాక్షి, ఇంటర్నెట్: తల్లి ప్రేమ గురించి పూర్తిగా చెప్పడానికి ఈ ప్రపంచంలో సరైన పదాలు లేవు. అమ్మ అన్న పిలుపులో అమృతం ఉంటుంది. అందుకే దేవతలు సైతం.. ఆ ప్రేమను పొందడానికి మనుషులుగా పుడతారని చెప్పుకుంటారు. అంత గొప్పది తల్లి మనసు. తాను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే బిడ్డ క్షేమం, సుఖసంతోషాల గురించి అనునిత్యం పరితపిస్తుంది. తన ఆయుషు కూడా పోసుకుని బిడ్డ నిండ నూరేళ్లు.. చల్లగా బతకాలని కోరుకుంటుంది తల్లి. అటువంటిది.. తన కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను తీర్చే శక్తి ఎవరికి లేదు. ఆమె బాధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. అది చూసి ప్రతి ఒక్కరి మనసు బాధతో విలవిల్లాడుతోంది. ఆ వివరాలు.. శత్రువులతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన అమరులకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బిలాల్ అహ్మద్ మాగ్రే వీర మరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో మాగ్రే తీవ్రంగా గాయపడినప్పటికి తన ప్రాణాలను పణంగా పెట్టి.. ముష్కరులతో భీకరంగా పోరాడి.. పౌరులను కాపాడాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. మాగ్రే సాహసానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు సైన్యంలో మూడవ అత్యున్నత పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రకటించింది. (చదవండి: ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన కశ్మీర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కొడుకు తరఫున ఈ పురస్కారాన్ని ఆందుకోవడానికి మాగ్రే తల్లి సారా బేగం ఢిల్లీకి వచ్చారు. ఇక అవార్డు ప్రకటించిన అనంతరం నాటి భద్రతా ఆపరేషన్‌లో మాగ్రే చూపించిన సాహసం.. ప్రాణాలు పణంగా పెట్టి ముష్కరులను ఎదిరించిన తీరు.. పౌరులను కాపాడిన విధానం గురించి వర్ణించారు. కొడుకు పేరు మైక్‌లో వినపడగానే ఆ తల్లి పేగు కదిలింది. బిడ్డ జీవితం అంతా ఆమె కళ్ల ముందు మెదిలింది. ఇక కుమారుడు లేడనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసింది. లోపల నుంచి దుఖం తన్నకువచ్చింది. కానీ తాను ఏడిస్తే.. కొడుకు చేసిన సాహసం తక్కువవతుందని భావించిన ఆ తల్లి.. తన బాధను దిగమింగుకుంది. భోరున ఏడవాలని అనిపించినా.. అతి కష్టమ్మీద దుఖాన్ని ఆపుకుంది. అనంతరం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ చేతుల మీదుగా కుమారుడికి లభించిన శౌర్యచక్ర పతకాన్ని ఆందుకుంది. (చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా') ఆ తల్లి మనోవేదనకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వీరమాతకు సెల్యూట్ చేస్తున్నారు నెటిజనులు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత సారా బేగం తన వెనుక కూర్చున్న సీనియర్ మంత్రులను పలకరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తల్లిని ఓదార్చారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) నాడు ఏం జరిగింది అంటే.. బారాముల్లాలోని ఓ ఇంటి వద్ద ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అవార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. "బిలాల్ అహ్మద్ మాగ్రే స్వయంగా రూమ్ ఇంటర్వెన్షన్ ఆపరేషనల్ పార్టీలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనంతరం ఆయన ఉగ్రవాదుల టార్గెట్ హౌస్‌లో చిక్కుకున్న పౌరులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో దాక్కున్న ఉగ్రవాది అనేక హ్యాండ్ గ్రెనేడ్లను కాల్చాడు’’. ‘‘మాగ్రేతో పాటు అతని కార్యనిర్వాహక సహచరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫలితంగా మాగ్రే, అతడి పార్టీ కమాండర్ ఎస్సై అమర్ దీప్, సోనూ లాల్ అనే ఒక పౌరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి," అని ప్రశంసా పత్రంలో ఉంది. అంతేకాక తీవ్రంగా గాయపడినప్పటికీ, మిస్టర్ మాగ్రే "అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించి.. గాయపడిన వారిని, ఇతర పౌరులను బయటికి తరలించాడు" అని పేర్కొంది. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికి. స్పృహ కోల్పోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడని పేర్కొంది. చదవండి: అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు -
‘ఖేల్ రత్నా’లకు పట్టాభిషేకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’కు ఈసారి ఏకంగా 12 మందిని ఎంపిక చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్)... 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్... పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనీ లేఖరా (పారా షూటింగ్), మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), సుమిత్ అంటిల్ (పారా అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్)... 22 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్, 19 ఏళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్న కెప్టెన్ సునీల్ ఛెత్రిలకు ‘ఖేల్ రత్న’తో గౌరవించారు. ‘ఖేల్ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ‘అర్జున అవార్డు’ను అత్యధికంగా 35 మందికి అందజేశారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులు 15 మంది, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు నుంచి ఇద్దరు ఉన్నారు. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తోపాటు భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా కూడా ‘అర్జున’ అందుకున్న వారిలో ఉన్నారు. ‘అర్జున’ అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డును లైఫ్‌టైమ్ కేటగిరీలో ఐదుగురికి... రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి అందజేశారు. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకున్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్
Shikhar Dhawan Honoured With Arjuna Award, Video: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2021లో మొత్తం 62 మందికి ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ రాష్ట్రపతి చేతుల మీదగా అర్జున అవార్డు అందుకున్నాడు. అధేవిధంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్రత్నఅవార్డులను .. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా జనవరి 26న ఈ అవార్డులను ప్రకటిస్తారు. చదవండి: రిజ్వాన్ కోలుకోవడంలో భారత డాక్టర్ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే.. #WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn — ANI (@ANI) November 13, 2021 -
అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్
ఒడిశాకు చెందిన 102 ఏళ్ల టీచర్ నందా ప్రస్తీ మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో నందా చేసిన సేవలకు ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇంతకు మించిన మరో విషయం నెటిజన్లను ఆకర్షించింది. అవార్డు అందుకున్న ప్రస్తీ రాష్ట్రపతి కోవింద్‌ను నిండైన చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విటర్లో వేల రియాక్షన్లను అందుకుంటోంది. చదవండి: పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది నందా సర్ అని కూడా పిలువబడే ప్రస్ట్రీ ఒడిశాలోని జాజ్పూర్లో పిల్లలతోపాటు పెద్దలకు ఉచిత విద్యాను అందించేందుకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే అతని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. ‘రాష్ట్రపతి కోవింద్ సాహిత్యం, విద్య కోసం చేసిన కృషికి నందా ప్రస్తీకి పద్మశ్రీని ప్రదానం చేశారు. ఒడిశాలోని జాజ్పూర్లో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలకు ఉచిత విద్యను అందించిన 102 ఏళ్ల “నందా సర్”, రాష్ట్రపతిని ఆశీర్వదిస్తున్నారు. అని భారత రాష్ట్రపతి ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!! కాగా ప్రస్తీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యపై ఆయనకున్న అంకిత భావాన్ని అభినందిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతిని ఆశీర్వదించడం ఎంతో అమూల్యం, విలువైనదని కొనియాడుతున్నారు. ‘మాటల్లో వర్ణించలేనిది. ఇది నేను కలలుగన్న భారతం. నిజమైన గురువు.. అద్భుతమైన ఫోటో. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ President Kovind presents Padma Shri to Shri Nanda Prusty for Literature & Education. 102-yr-old “Nanda sir”, who provided free education to children and adults at Jajpur, Odisha for decades, raised his hands in a gesture of blessing the President. pic.twitter.com/4kXPZz5NCJ — President of India (@rashtrapatibhvn) November 9, 2021 ఇదిలా ఉండగా సోమవారం, మంగళవారం రెండు రోజులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివిద రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో ఏడు పద్మ విభూషణ్‌లు, 10 పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందించారు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకూ ఉన్నారు. -
పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
సాక్షి, వెబ్‌డెస్క్: ట్రాన్స్జెండర్లు.. ఈ పేరు వినగానే చాలా మందికి రోడ్డు మీద భిక్షాటన చేసుకునేవారే గుర్తుకు వస్తారు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటు. వారిలో కూడా చాలామంది మంచి ఉద్యోగాలు చేసేవారు.. సమాజసేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నావారు కూడా ఉన్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మంజమ్మ జోగతి. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికి మిగతా వారికి భిన్నంగా జీవితాన్ని గడుపుతోంది. ఫోక్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక అవార్డు తీసుకునే వేళ మంజమ్మ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజనులు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ) కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గాను మంజమ్మ జోగతి రికార్డులకెక్కారు. పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తనదైన స్టైల్లో ఆశీర్వదించి, నమస్కరించిన తీరు సభికుల్ని ఆకట్టుకుంది. మంజమ్మ తన చీర కొంగుతో రామ్‌నాథ్‌కు దిష్టి తీసినట్లు చేశారు. ఇది వారి స్టైల్లో ఆశీర్వదించడం అన్నమాట. రామ్‌నాథ్ కోవింద్ కూడా మంజమ్మ ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఇది చూసిన సభికులు చప్పట్లతో వారివురిని ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇక దేశంలో పద్మశ్రీ అందుకున్న(2019లో) తొలి ట్రాన్స్ జెండర్‌గా నిలిచారు మంజమ్మ. (చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!) మంజమ్మ జీవితం.. మంజమ్మ దశాబ్దాలపాటు సామాజిక, ఆర్థిక పోరాటాలు చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తట్టుకుని.. నిలబడి.. నేడు సన్మానాలు అందుకున్నారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. యుక్త వయసులో తనను తాను స్త్రీగా గుర్తించిన తర్వాత మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఇక ఆమె కుటుంబం మంజమ్మను జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. ట్రాన్స్జెండర్ల సంఘం తమను తాము రేణుకా ఎల్లమ్మ దేవత సేవలో అంకితం చేసుకునే ప్రక్రియే జోగప్ప. ఇలా మారిన వారు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు. పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్యనే మంజమ్మ జోగతి పలు కళారూపాలు, జోగతి నృత్యం, స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా జానపద పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. (చదవండి: బిగ్‌బాస్ 5: ఆ అరగంట ఎలాంటి కట్ లేకుండా..) మంజమ్మ సేవలకు గాను 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత అనగా 2019లో, ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. చదవండి: భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను -
ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జ్యుడీషియల్ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరింది. జిల్లా జడ్జిల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. న్యాయవాదుల నుంచి కూడా న్యాయమూర్తులుగా ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల విచారణ వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. పి.శ్రీసుధ: 1967, జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. డాక్టర్ జి.రాధారాణి: 1963, జూన్ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఎన్.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్ ఆవరణలోని స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
కంటి ఆపరేషన్ చేయించుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. గురువారం ఉదయం ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. President Ram Nath Kovind underwent cataract surgery at Army Hospital (Referral & Research), New Delhi today morning. The surgery was successful and he has been discharged from the hospital: Ajay Kumar Singh, Press Secretary to the President pic.twitter.com/DQcxf0Wnf8 — ANI (@ANI) August 19, 2021 -
స్వాతంత్య సమరయోధుల త్యాగాలను మరిచిపోలేం: రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్ విజేతలను అభినందించారు. కరోనాపై పోరు ఇంకా ముగియలేదని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని రాష్ట్రపతి తెలిపారు. -
ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పతకాలతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మరింత పెంచారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. అనంతరం వారితో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా.. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. https://t.co/6W1xZNwvV6 — President of India (@rashtrapatibhvn) August 14, 2021 -
భూలోక స్వర్గంలా కశ్మీర్‌ను చూడాలనుకుంటున్నా..
శ్రీనగర్: కశ్మీర్‌ను భూమ్మీద స్వర్గంలా చూడాలన్నది తన ఆశ అని, అయితే దురదృష్టవశాత్తూ హింస చోటుచేసుకుంటోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజలు పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్ వెళ్లిన ఆయన మంగళవారం కశ్మీర్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘కశ్మీరీయత’లో హింసకు చోటే లేదని, కానీ అది నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కశ్మీర్లో కొత్త ఉరవడి సాగుతోందని, గతకాలపు వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత పురాతనమైన రుగ్వేద రచన కశ్మీర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు. తత్వశాస్త్రం వర్ధిల్లిన ప్రాంతంగా కశ్మీర్‌ను ఆయన కొనియాడారు. అలాంటి వారసత్వ సంపదను కొనసాగించాల్సిన బాధ్యత కశ్మీర్ యువతపై ఉందని చెప్పారు. దాన్ని కొనసాగించాలంటూ రాష్ట్రపతి యువతను అభ్యర్థించారు. దేశం మొత్తం కశ్మీర్ వైపు గర్వంగా చూస్తోందని, ఇక్కడి యువత సివిల్ సర్వీసెస్ నుంచి వ్యాపారాల వరకు అన్నింటిలోనూ ముందడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతేడాది తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల కశ్మీర్ భూలోక స్వర్గంలా మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లల్లేశ్వరి రచనల్లో కశ్మీర్ శాంతి భద్రతలకు పెట్టింది పేరని, నాటి పరిస్థితులు మళ్లీ తిరిగి రావాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్ యూనివర్సిటీ నుంచి గత ఎనిమిదేళ్లలో 2.5లక్షలకు పైగా విద్యార్థులు డిగ్రీ పట్టాలను, 1000 మంది డాక్టరేట్లను పొందారని గుర్తు చేస్తూ అభినందించారు. -
బంగ్లాదేశ్ నుంచి మోదీ, దీదీలకు 2,600 కేజీల మామిడి పళ్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేమంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు మామాడి పళ్లు పంపించారు. హరిభంగా రకానికి చెందిన సుమారు 2,600 కిలోగ్రాముల మామిడి పండ్లను పంపించారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేబ్‌కు కూడా ఈ మామిడి పళ్లలో వాటా ఉంది. మామిడిపండ్లు సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు చేరుకోగా.. ఆ తర్వాత వాటిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించారు. మామిడిపండ్లు ఆదివారం బెనపోల్ పెట్రోపోల్ ల్యాండ్ బార్డర్ ద్వారా కోల్‌కతాకు చేరుకోగా.. ఆ తరువాత రైలు ద్వారా ఢిల్లీకి రవాణా చేయబడ్డాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ, "మాకు చాలా తీపి, రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయి. మేము వాటిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాము. మేము మా ఆనందాన్ని మా మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాము. చారిత్రాత్మకమైన ముజిబ్ బోర్షోతో పాటు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన మామిడి పండ్లను మా పొరుగువారు, స్నేహితులకు ఇచ్చి.. మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాము’’ అని తెలిపారు. హరిభంగా మామిడి పళ్లను బంగ్లా వాయువ్య భాగంలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా రంగపూర్ జిల్లా వీటి సాగుకు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో, పీఎం హసీనా ‘హిల్సా’ చేపలను పంపిన సంగతి తెలిసిందే. భారతదేశం-బంగ్లాదేశ్ మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీ ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాలతో పాటు బంగ్లా జాతిపిత బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రవాణా, వాణిజ్యాన్ని పెంచడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్ భూటాన్‌కు మామిడి పండ్లను పంపింది. అలానే నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాధ్యక్షులు, ప్రధానులకు సరుకులను పంపుతుంది. -
రాష్ట్రపతి నోట జీతం ప్రస్తావన.. రచ్చ రచ్చ
ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ల జీతం, సెలబ్రిటీల సంపాదన గురించి జనాల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. ‘ఫలానా వాళ్లు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు?’ లాంటి హెడ్డింగ్‌లకు దక్కే ఆదరణే అందుకు ఉదాహరణ. అయితే తమ జీతాలు, సంపాదన గురించి వాళ్లు బహిరంగంగా మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ తన జీతం, కట్టింగ్ల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ: తాజాగా ఓ న్యూస్ ఛానెల్ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురించి ట్విటర్ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘‘ దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న వ్యక్తి నేను. నా నెల సంపాదన ఐదు లక్షలు. కానీ, అందులో 3 లక్షల దాకా ట్యాక్స్, కట్టింగ్ల రూపంలోనే పోతున్నాయి. ఆ లెక్కన నాకు మిగిలేది తక్కువే. అంటే మిగిలినవాళ్ల కంటే నేనేం బెటర్ కాదు. ఒక టీచర్ నాకంటే ఎక్కువే సేవింగ్స్ చేస్తున్నాడు’’ అంటూ సరదాగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అంతే.. राष्ट्रपति बोले- मुझे 5 लाख प्रति महीना तनख्वाह मिलती है जिसमें से पौने 3 लाख टैक्स चला जाता है, हमसे ज्यादा बचत तो एक टीचर की होती है#presidentkovind #UttarPradesh pic.twitter.com/D6MAgmFCZm — News24 (@news24tvchannel) June 27, 2021 రెండు వాదనలతో.. ఇక రాష్ట్రపతి జీతంలో ట్యాక్స్ కట్టింగ్లు ఉండవని, ఆ విషయం తెలియక ఆయన అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కొందరు ట్విటర్ ద్వారా హేళన చేస్తున్నారు. పైగా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతరత్రా అలవెన్స్‌లు కూడా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో రాజ్యాంగంలోని ప్రతులంటూ కొన్ని ఆధారాలను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు. పెన్షన్ యాక్ట్ 1951 ప్రకారం.. రాష్ట్రపతి జీతంపై పన్ను విధించరని చెప్తున్నారు. అయితే అదంతా ఉత్తదేనని, రాష్ట్రపతి జీతంలో కట్టింగ్లు ఉంటాయని వాదిస్తున్నారు. ఇంకొందరేమో మరి ఆ ట్యాక్స్ కట్టింగ్ల జీతం ఎటుపోతుందోనని ఇంటర్నెట్ ద్వారా ఆరా తీస్తున్నారు. ఈ వివాదం ఎటు నుంచి ఎటో వెళ్లి.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కరోనా టైంలో జీతాల్లో కొంత వాటాను(30 శాతం దాకా) త్యాగం చేసినవాళ్లలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. చదవండి: రాష్ట్రపతి కాన్వాయ్ కోసం ఆగిన ఊపిరి! -
Ramnath Kovind: కలలో కూడా అనుకోలేదు!
లక్నో/కాన్పూర్: గ్రామీణ నేపథ్యం ఉన్న తనలాంటి సామాన్యుడు దేశ అత్యున్నత పదవిని పొందగలగడని కలలో కూడా ఊహించలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్దేహత్ జిల్లాలోని తను పుట్టిన ఊరు పారౌంఖ్ పౌరులనుద్దేశించి ఆదివారం కోవింద్ ప్రసంగించారు. స్వస్థలాన్ని చూడగానే భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి.. మోకాళ్లపై వంగి అక్కడి నేలకు నమస్కరించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కోవింద్ తన సొంతూరికి రావడం ఇదే ప్రథమం. ‘నాలాంటి సామాన్య పల్లెటూరి పిల్లవాడు దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దాన్ని నిజం చేసింది. నేను ఏ స్థాయికి చేరుకున్నా, ఆ ఘనత ఈ నేలకు, ఈ మట్టికి, ఇక్కడి ప్రజలకే చెందుతుంది’ అని కోవింద్ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇతర స్వాతంత్య్ర సమర యోధులకు కోవింద్ నివాళులర్పించారు. అక్కడి మిలన్ కేంద్రం, వీరాంగన ఝల్కారీ బాయి ఇంటర్ కాలేజ్‌లను సందర్శించారు. ‘నా కుటుంబ విలువల ప్రకారం, కులాలకతీతంగా గ్రామంలోని అత్యంత వృద్ధురాలిని అమ్మగా, అత్యంత వృద్ధుడిని తండ్రిగా భావిస్తాం. ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. తన గ్రామం మట్టివాసన, ఇక్కడి జ్ఞాపకాలు తన హృదయంలో పదిలంగా ఉన్నాయన్నారు. ‘పారౌంఖ్ అంటే నా దృష్టిలో కేవలం ఒక గ్రామం కాదు. ఇది నా మాతృభూమి. దేశ సేవకు స్ఫూర్తినిచ్చిన నేల. ఆ స్ఫూర్తితోనే మొదట హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. ఆ తరువాత రాజ్యసభకు, ఆపై రాజ్‌భవన్‌కు.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నా’నన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది ప్రధానమంత్రులయ్యారని, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని మాత్రం తానేనని కోవింద్ వెల్లడించారు. అందరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులు రాష్ట్రపతిభవన్‌ను చూసేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తానన్నారు. స్కూల్లో తన క్లాస్మేట్స్ అయిన జస్వంత్ సింగ్, చంద్రభాన్ సింగ్, దశరథ్ సింగ్‌లను కలుసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. -
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అనూప్ చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన సునీల్ అరోరా ఈ ఏడాది ఏప్రిల్ 12న పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్‌లో మొత్తం ముగ్గురు సభ్యులు ఉంటారు. (చదవండి: యూఎన్ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఈయనే!) -
Indu Jain: టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ కన్నుమూత
ముంబై: కరోనా వైరస్ దేశంలో వినాశనం సృష్టిస్తూనే ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ సామాన్యులతో పాటు వేలాది మంది ప్రముఖులను సైతం పొట్టన బెట్టుకుంటోంది. తాజాగా టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్(84) కరోనా మహమ్మరి బారినపడి గురువారం కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్జీవోగా తీర్చిదిద్దారు. 1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్ జైన్ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ సంతాపం ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టైమ్స్ గ్రూప్ ఛైర్పర్సన్ ఇందూజైన్ మృతి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి, సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. అమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. Saddened by the demise of Times Group Chairperson Smt. Indu Jain Ji. She will be remembered for her community service initiatives, passion towards India’s progress and deep-rooted interest in our culture. I recall my interactions with her. Condolences to her family. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 13, 2021 చదవండి: ఆక్సిజన్ అందక మరో 15 మంది మృత్యువాత -
48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించడంతో న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ రమణ ఈ పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్ర వరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం కోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా (1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) సేవలందించారు. పదవిలో కొనసాగుతుండగానే రాజీనామా చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే. రైతు కుటుంబం నుంచి..: వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం. ఆయన 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునళ్లలోనూ ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా, రైల్వేలకు అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2019 మార్చి 7 నుంచి అదే ఏడాది నవంబర్ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2019 నవంబర్ 27 నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న నియమితులయ్యారు. 10.3.2013 నుంచి 20.5.2013 వరకు ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ రమణ వెలువరించిన తీర్పుల్లో కొన్ని... ►అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జమ్మూ కశ్మీర్లో ఏడాదిపాటు ఇంటర్నెట్ నిషేధానికి ముగింపు. ►సుప్రీంకోర్టు వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం. ►శివసేన వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో బలపరీక్ష అంశంలో నైతికతను పునరుజ్జీవింపచేయడం. సత్వర న్యాయం లక్ష్యం: నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్న జస్టిస్ రమణ సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్ రమణ సారథ్యంలో న్యాయసేవల అథారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా సమయంలో 2,878 గృహ హింస కేసులకు సంబంధించి న్యాయ సాయం, 60 లక్షల మంది వలస కార్మికులు, 36,435 మంది ఒంటరి వ్యక్తులు, 1,04,084 మంది సీనియర్ సిటిజన్లకు సేవలు అందించినట్లు తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ–లోక్ అదాలత్‌లో 4.11 లక్షల కేసులను పరిష్కరించినట్లు తెలిపింది. 2,06,190 మంది ఖైదీలు లీగల్ సర్వీస్ క్లినిక్‌ల ద్వారా సేవలు పొందారు. జాతీయ, రాష్ట్రస్థాయి అదాలత్‌లు నిర్వహించి 48 లక్షల కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్‌తో కలసి నల్సా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది. -
ఢిల్లీ ఎయిమ్స్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
మార్చి 30న రాష్ట్రపతి కోవింద్‌కు బైపాస్ సర్జరీ..
సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌ను ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో మార్చి 30న ఏయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు. The President has been under observation after a routine medical checkup. He thanks all who enquired about his health and wished him well. — President of India (@rashtrapatibhvn) March 27, 2021 -
ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ (ఆర్ అండ్ ఆర్) లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. President Ram Nath Kovind visited Army Hospital (R&R) following chest discomfort this morning. He is undergoing routine check-up and is under observation. His condition is stable: Army Hospital (R&R) (file photo) pic.twitter.com/A5hfrA3HXW — ANI (@ANI) March 26, 2021 -
వ్యాక్సిన్ : రామ్‌నాథ్ కోవింద్ సహా..పలువురు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తొలిడోస్‌ను స్వీకరించారు. ముఖ్యంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మేఘాలయ గవర్నర సత్యపాల్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి సహా, ఇతర రాజకీయ ప్రముఖులు వాక్సిన్ అందుకున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫుట్‌బాల్ దిగ్గజం పీలే, సీనీ రంగ ప్రముఖుడు చారుహాసన్, కూడా కరోనా టీకాను స్వీకరించడం గమనార్హం. మరోవైపు సీరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీరంసీఈవో భార్య నటాషా పూనావాలా మంగళవారం వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి -
‘అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి?’
లక్నో: అమ్మను ఉరి తీస్తే నా పరిస్థితి ఏంటి.. ఈ ప్రశ్న చదువుతుంటేనే కడుపులో పేగు బాధతో మెలిపెడుతోంది కదా. అలాంటిది తన కళ్ల ముందే తల్లి చనిపోతుందని తెలిస్తే.. 12 ఏళ్ల ఆ చిన్నారి మనసు ఎంత విలవిల్లాడుతుందో ఊహించుకోండి. తల్లి లేకుండా అసలు బిడ్డలు తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఎన్ని జన్మలు అనుభవించినా తనివి తీరనది తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి బంధం తర్వలోనే తనకు దూరం కాబోతుందని తెలిసి ఆ చిన్నారి విలవిల్లాడాడు. తన కోసం అయినా అమ్మను క్షమించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఇంతకు ఆ చిన్నారి ఎవరు.. ఎందుకు అతడి తల్లి చనిపోతుంది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా షబ్నం అనే పేరు మార్మోగుతుంది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఉరిశిక్ష అనుభవించబోతున్న తొలి మహిళ షబ్నం. ఉత్తరప్రదేశ్ మథురలో నివాసం ఉండే ఈమె.. ప్రేమించిన వ్యక్తితో విహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో లవర్‌తో కలిసి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల క్రితం అనగా 2008 ఏప్రిల్ 14న షబ్నం తన ప్రియుడు సలీంతో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా హతమార్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మథుర కోర్టు విచారించింది. ఇక నిందితులు షబ్నం, ఆమె ప్రియడు ఇద్దరికి మరణశిక్ష విధిస్తూ.. సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో వచ్చిన మథుర కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇదే రిపీట్ కావడంతో 2015లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క్షమాభిక్ష కోరారు. కానీ ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో త్వరలోనే వీరిని ఉరి తీయాల్సిందిగా మథుర కోర్టు, జైలు అధికారులను ఆదేశించింది. ఇక కుటుంబ సభ్యులను హతమార్చే సమయానికే షబ్నం గర్భవతిగా ఉంది. జైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. తనతో పాటే కుమారుడిని పెంచింది. అయితే ఖైదీగా ఉన్న తల్లి దగ్గర పిల్లలు ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. ఈ క్రమంలో 2015లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి షబ్నం కుమారుడిని ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చింది. దాంతో షబ్నం కాలేజీ స్నేహితుడైన సైఫి, ఆమె కుమారుడి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. పిల్లాడిని తనతో పాటు తీసుకెళ్లి పెంచసాగాడు. ఈ సందర్భంగా సైఫి మాట్లాడుతూ.. ‘‘చదువుకునే రోజుల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా నేను చాలా వీక్‌గా ఉండేవాడిని. అప్పుడు షబ్నం నాకు ఎన్నో సార్లు డబ్బు సాయం చేసింది. ఆమె వల్ల నేను కాలేజీ చదువు పూర్తి చేయగలిగాను. ఆమె నాకు అక్క కన్నా ఎక్కువ. చదువు పూర్తయ్యాక నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిందని తెలిసి నేను షాక్ అయ్యాను. వెళ్లి ఆమెను కలవాలని అనుకున్నాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం సైఫి బులంద్‌షహర్‌లో జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ‘‘ఇదే సమయంలో షబ్నం కుమారుడి దత్తతకు సంబంధించిన యాడ్ చూశాం. గతంలో తను నన్ను ఆదుకోకపోయి ఉంటే.. ఇప్పుడు ఇంత మంచి స్థితిలో ఉండేవాడిని కాదు. ఆమె నాకు చేసిన మేలుకు రుణం తీర్చుకునే అవకాశం లభించింది. ఆమె కుమారుడి బాధ్యత నేనే తీసుకోవాలనుకున్నాను. దీని గురించి నా భార్యతో కూడా మాట్లాడాను. ఆమె కూడా అంగీకరించింది’’ అని తెలిపాడు. ‘‘ఆ తర్వాత మేం భార్యభర్తలిద్దరం జైలుకు వెళ్లి షబ్నమ్‌ని కలిశాము. ఆమె కుమారుడిని మాతో పాటు తీసుకెళ్తాం.. అతడి బాధ్యతను మేం తీసుకుంటాం అని అడిగాం. ఆమె అంగీకరించింది. ఇక బాబును ఎన్నటికి అతడి తల్లి పుట్టిన ఊరికి తీసుకెళ్లకూడదని భావించాం. ఇంతవరకు ఒక్కసారి కూడా అక్కడకు తీసుకెళ్లలేదు. జైలులో తనకు పెట్టిన పేరు మార్చి.. తాజ్ అని పెట్టాం’’ అని తెలిపారు. ‘‘తల్లి గురించి తాజ్‌కు అన్ని వివరాలు తెలుసు. ఎంతైనా కన్న తల్లి కదా. ఆమె మీద ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. ఇక తర్వలోనే షబ్నమ్‌ను ఉరి తీస్తారని తెలిసి ఆ చిన్నారి మనసు విలవిల్లాడుతుంది. అందుకే తన తల్లిని క్షమించాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కోరుతున్నాడు. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్‌ని దాఖలు చేశాడు. పాపం అమ్మ చనిపోతే నా పరిస్థితి ఏంటంటూ ఆ చిన్నారి అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే చివరి ప్రయత్నంగా క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతూ రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాడు. చూడాలి ఏమవుతుందో అన్నాడు’’ సైఫి. చదవండి: ఏడుగురి హత్య: మహిళకు ఉరిశిక్ష.. దేశంలో తొలిసారి న్యాయవాదుల హత్య: ఆ కేసులే కారణమా? -
రాష్ట్రపతి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 12;10 గంటలకు మదనపల్లికి చేరుకోనున్నారు. 12:30 గంటలకు స్థానిక ఆశ్రమం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం 3:20కు మదనపల్లి నుంచి బయలుదేరి 3:40 సదుం చేరుకొంటారు. అక్కడ పిపల్ గ్రూప్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి 4:50 గంటలకు బెంగుళూరుకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం రోజు జిల్లా అధికారులు పర్యవేక్షించారు. చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి -
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : జనవరి 29 నుంచి(శుక్రవారం) పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు గురువారమే ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం పార్లమెంటు సచివాలయం మూడు చోట్ల ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేసింది. చదవండి: 16 పార్టీల ప్రకటన.. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ 33 పనిదినాలపాటు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనుండగా.. ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున లోక్‌సభ, రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలలో యథావిధిగా జీరో అవర్, ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్రం ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు రైతు ఉద్యమం, కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. -
రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
ముంబయి: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ నాయకులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సహకారం అందించాలని అభిమానులు, అనుచరులను కోరుతూ నటుడు అక్షయ్ కుమార్ ఒక వీడియోను పంచుకున్నారు. తన వంతు కర్తవ్యంగా కొత్త మొత్తాన్ని అందించినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంకు తమకు తోచినంత సహాయం అందించాలని పేర్కొన్నాడు.(చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత) ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసి 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్ ను ఆ బృందానికి అందజేశారు. హీరోయిన్ ప్రణీత కూడా రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. దేశీయ విరాళాల ద్వారానే రామ్ మందిర్ నిర్మాణం పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. దేశంలోని 5,25,000 గ్రామాలలో నిధుల సేకరణ ప్రచారం జరగనుంది. సేకరించిన డబ్బును 48 గంటలలోపు బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ కలెక్షన్ డ్రైవ్ జనవరి 15న నుంచి ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. రామమందిరం నిర్మాణం 36 నెలల నుంచి 40 నెలల సమయంలో పూర్తవుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు. -
కోర్టుల మితివీురిన జోక్యం రాజ్యాంగ అతిక్రమణే
సాక్షి, అమరావతి: శాసన వ్యవస్థ హక్కులు, అధికారాల్లో న్యాయస్థానాలు మితిమీరి జోక్యం చేసుకోవడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ జోక్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అవరోధాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ‘అఖిల భారత స్పీకర్ల సదస్సు’ ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో మొదటి రోజు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలతో పాటు అన్ని రాష్ట్రాల స్పీకర్లు పాల్గొన్నారు. ఈ సదస్సులో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. వ్యవహారపరమైన లోపాలున్నాయనే ఆరోపణల ఆధారంగా శాసనసభ వ్యవహారాలు, నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 విస్పష్టంగా పేర్కొందన్నారు. అందుకు విరుద్ధంగా ఇటీవల న్యాయస్థానాలు తరచూ శాసన వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వస్తుండటం రాజ్యాంగ అతిక్రమణే అని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభ ఆమోదించిన ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, ‘సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు’లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బిల్లుల అంశంలో రాష్ట్ర శాసనసభ, మండలి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక వ్యవస్థ, నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయని, ఈ అంశంలో కొందరు రాజకీయ దురుద్దేశంతోనే న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. ఇలాంటి కేసులను విచారించే ముందు వాటి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను న్యాయస్థానాలు పరిశీలించాలని సీతారాం కోరారు. పరిపాలన ముందుకు సాగేదెలా.. కీలక, సున్నితమైన అంశాలు రాగానే వాటిపై వెంటనే వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగ వ్యవస్థలు సిద్ధంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందని కూడా స్పీకర్ సీతారాం అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో కూలంకషంగా చర్చించిన తర్వాత పాస్ చేసిన బిల్లులు అమలు కాకపోవడం బాధిస్తోందని, సభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారి అమలుకాకపోతే పరిపాలన ముందుకు సాగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ దురుద్దేశ పూర్వకంగా కోర్టులను ఆశ్రయించడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడి.. రాజ్యాంగ వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటోందని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధులను గుర్తించి ఒకదానిని ఒకటి గౌరవిస్తేనే రాజ్యాంగంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. -
ఎయిర్ ఇండియా వన్‌లో రాష్ట్రపతి తొలి ప్రయాణం
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్–బీ777 తన గగన విహారాన్ని మంగళవారం ప్రారంభించింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ అందులో తొలి ప్రయాణం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఎయిరిండియా వన్–బీ777 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వన్‌బీ77 విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహాలోనే.. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ తరహాలోనే ఎయిరిండియా వన్ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు వీవీఐపీల కోసం వాడుతున్న బీ747–400 స్థానంలో ఈ కొత్త బీ777ను తీసుకువచ్చారు. పాత విమానంతో పోలిస్తే ఈ విమాన ఇంధన సామర్థ్యం, రేంజ్ అధికం. రెండు బీ777 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఒక్కో విమానాన్ని రూ.703.83 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తొలి ప్రయాణం సందర్భంగా రాష్ట్రపతి.. పైలట్లను, క్రూ మెంబర్లను, ఎయిర్ ఇండియా బృందాన్ని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను అభినందించారు. ఎయిరిండియా వన్ పైలెట్లు, సిబ్బందితో రాష్ట్రపతి దంపతులు ఎయిరిండియా వన్‌బీ777 ప్రత్యేకతలివే.. ► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత ఆధునిక సౌకర్యాలను కలిగిన ఎయిరిండియా వన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణించగలదు. ► ఎలాంటి వాతావరణ విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. ► క్షిపణి దాడుల నుంచి తనను తాను రక్షించుకునే స్వీయ రక్షణ వ్యవస్థను దీనికి అమర్చారు. ► లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ► కాగా, ఈ విమానం అమెరికాలో సిద్ధమై అక్టోబర్ 1న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్థానిక పద్మావతి అతిథిగృహం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి.. అర్చకులతో కలసి ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీలను అందజేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ కుటుంబ సమేతంగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్‌కుమార్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. తిరుమల నుంచి సాయంత్రం రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి 5.30 గంటలకు వైమానికదళ విమానంలో అహ్మదాబాద్ వెళ్లారు. రాష్ట్రపతి దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి రేణిగుంటలో ఘనస్వాగతం తిరుమల శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదనరెడ్డి, వెంకటేగౌడ్, ఎంఎస్ బాబు, ఆదిమూలం, శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి పరిచయం చేశారు. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతిరాణా టాటా, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమే‹Ùరెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను అడ్డగించిన విజిలెన్స్ అధికారులు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ఆలయంలోకి వెళ్లిన అనంతరం కలెక్టర్‌ను, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ విజయారావును లోపలికి వెళ్లకుండా ఆపేశారు. తాను కలెక్టర్‌నని చెప్పినా.. ‘మీ పేర్లు నా వద్ద ఉన్న లిస్టులో లేవు’ అంటూ నిలువరించారు. దీంతో కలెక్టర్ వెనుదిరిగి తన వాహనం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అదనపు ఎస్పీ సుప్రజ కలెక్టర్ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం రేణిగుంట (చిత్తూరు జిల్లా): రాష్ట్రపతి కోవింద్‌కు స్వాగతం పలికేందుకు మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. -
తిరుమల పర్యటన : రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
-
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ : తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు తిరుమలకు రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి, అమరావతి: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు మంగళవారం ఉదయం తిరుపతికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్త తెలిపారు. ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ వారికి రాష్ట్ర గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలుకుతారు. తర్వాత రోడ్డుమార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. రాష్ట్రపతి దంపతులతో కలసి పద్మావతి అమ్మవారు, శ్రీవారి దర్శనానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వెళతారు. రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పద్మావతి విశ్రాంతి భవనం, రాంభగీచ వసతి భవనాలు, వరాహ స్వామి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో ప్రతి చోటా తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. -
నితీష్ కొత్త సర్కారుకు రెండు రోజులే.. అప్పుడే వివాదం
పట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజుల్లోనే వివాదం చెలరేగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెవాలాల్ చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే ఈ వివాదానికి కారణం. గతంలో మెవాలాల్ భాగల్పూర్ వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పని చేశారు. ఆయన హయాంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీంతో పాటు 2017లో లంచం తీసుకుని అర్హతలేని వారిని యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే బిహార్‌లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే సర్కార్ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదల్) మండిపడింది. ఈ మేరకు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా మంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదని.. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసమే అవినీతిపరులకు నితీష్ పదవులు కట్టబెడుతున్నారని తేజస్వీ ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని తాను చెప్తే అందుకు విరుద్ధంగా నితీష్ ప్రభుత్వం మెవాలాల్‌ను మంత్రిని చేసి అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలను మెవాలాల్ తోసిపుచ్చారు. ఈ అంశాలపై విచారణ కొనసాగుతోందని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోర్టులో తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవన్నారు. తనపై ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని.. తనపై కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. అవినీతి పరుడైన తేజస్వీ యాదవ్‌కు ఇతరులను విమర్శించే అర్హత లేదన్నారు. చాలా మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై అవినీతి కేసులున్న విషయాన్ని ఈ సందర్భంగా మెవాలాల్ గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో తన మేనల్లుడు అరెస్టయ్యాడన్న తేజస్వి ఆరోపణలను ఆయన ఖండించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించారని, తమపై ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మెవాలాల్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెవాలాల్ చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మెవాలాల్ తర్వాతి కాలంలో మళ్లీ పార్టీలోకి వచ్చారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) -
హత్యా బెదిరింపులు.. గవర్నర్ ఉక్కిరిబిక్కిరి
గవర్నర్ హోదా అంటే పూలపాన్పు కాదు.. పదునైన ముళ్లపై పాదరక్షలు లేని కాలినడకేనని తమిళనాడు గవర్నర్లకు తరచూ అనుభవం ఎదురవుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకోలేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. చివరకు బదిలీ అయ్యేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలపై ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, చెన్నై : వేర్వేరు రాష్ట్రాల వారు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన వారిలో అధికశాతం కత్తిమీద సాము పరిస్థితిని ఎదుర్కొన్నారు. లౌక్యం తెలిసిన ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రభుత్వంపై మింగుడు పడలేకపోయారు. ప్రస్తుత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు సైతం అదే పరిస్థితులు ఎదరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేయడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. గవర్నర్ ఆమోదముద్ర కోసం వేచిచూడకుండా రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీచేసింది. దీంతో మరో ఆలోచనకు తావివ్వకుండా విధిలేని పరిస్థితుల్లో గవర్నర్ ఆమోదించారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులోని ఏడుగురు శిక్షా ఖైదీల విడుదలపై గవర్నర్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. రెండేళ్లయినా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా గవర్నరే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామాకాన్ని చేశారు. ఈ వీసీల్లో కొందరు ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అన్నావర్సిటీ వీసీ సూరప్ప, ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ కారణంగా గవర్నర్ పేరు కూడా రచ్చకెక్కింది. ఇలా తమిళనాడులో జరిగే అనేక వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం తెరపైకి రావడంపై కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెళ్లేందుకా..కొనసాగేందుకా? అనేక అంశాల మధ్య నలుగుతున్న గవర్నర్ బన్వరిలాల్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రిని ఇప్పటికే కలిశారు. శుక్రవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. గవర్నర్ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం వెనుక కారణాలపై అన్వేషణ సాగుతోంది. బదిలీ కోసమా లేక కేంద్రంలో బదిలీ ఆలోచనలకు తెరదించి తమిళనాడులోనే కొనసాగేందుకా ఈ ఢిల్లీ పర్యటన అని చర్చ మొదలైంది. అన్నావర్సిటీ వీసీకి హత్యా బెదిరింపులు అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సూరప్ప హత్యాబెదిరింపులకు గురయ్యారు. అన్నా వర్సిటీకి ప్రత్యేక అంతస్థు కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆయన ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రానికి లేఖరాసిన ఆయనను వీసీ బాధ్యతల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, అనేక వర్గాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీసీ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అన్నావర్సిటీకి ప్రత్యేక అంతస్తు అవసరం లేదని కేంద్రానికి లేఖరాసింది. ఈ వివాదాల నేపథ్యంలో వీసీ సూరప్పను తుపాకీతో కాల్చి చంపుతానని వీరప్పన్ అనే పేరుతో వర్సిటీకి ఒక ఉత్తరం చేరింది. చెన్నై కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దశమి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని రాష్ట్రపతి పేర్కొనగా, విజయదశమి ప్రజలకు స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నామని ప్రధాని ఆకాంక్షించారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని, అయితే ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలుగజేయాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. (రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)) కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని జయిస్తామని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జవాన్లను గుర్తు చేసుకుంటూ వారి కోసం దీపం వెలిగించాలని కోరారు. -
ప్రధాని కోసం మరో ప్రత్యేక విమానం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించడం కోసం మరో విమానం సిద్ధం అయ్యింది. వారు ప్రయాణించడానికి రెండు బోయింగ్ 777 విమానాలు సిద్ధం చేయగా వాటిలో రెండోది ప్రేజ్ శనివారం నాడు రాజధాని ఢిల్లీకి చేరుకోనుంది. వీటిలో మొదటి విమానం, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీలో ల్యాండ్ అయ్యేలా కాన్ఫిగర్ చేయబడింది. బోయింగ్ 777-300 ఈఆర్ అనే రెండు విమానాలు 2018లో ఎయిర్ ఇండియాలో చేరాయి. ఈ రెండు విమానాలు క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి 2024లో అమెరికా అధ్యక్షుడికి ఏర్పాటు చేయబోయే విమానాలులాగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-200 బీ సిరీస్ విమానాలు సిద్ధం చేస్తున్నారు. ఇవి కూడా వాటితో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు రాష్టపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎవరు విదేశాలకు ప్రయాణించాలన్నా ప్రతిసారి ప్రభుత్వం ఎయిర్ ఇండియాను అభ్యర్థించి విమానాలను సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా వారి కోసమే ప్రత్యేకవిమానం వచ్చేసింది. ఇవి ఈ ఏడాది ఆగస్టులోనే ఇండియాకు రావాల్సి ఉండగా కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. ఎయిర్ ఇండియాతో పాటు భారత వైమానిక దళం నుంచి వచ్చిన పైలట్ల ఈ విమానాన్ని నడుపనున్నారు. చదవండి: అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు -
బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి
సాక్షి, చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అకాల మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం దేశ సంగీత రంగానికి తీరని లోటు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది’ అని రాష్ట్రపతి ట్విటర్లో పేర్కొన్నారు. బాలుని పాటల జాబిల్లిగా అభిమానులు కీర్తిస్తారని గుర్తు చేశారు. పాటల ప్రపంచానికి బాలు సేవలకుగాను పద్మ భూషణ్, జాతీయ అవార్డులు, మరెన్నో పురస్కారాలు వరించాయని తెలిపారు. (చదవండి: ఒక శకం ముగిసింది!) దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు మృతి దురదృష్టకర సంఘటన అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. బాలు మరణంతో దేశ సాంస్కృతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. బాలు సుమధుర గొంతుక యావత్ భారతంలోని ప్రతి ఇంటికి సుపరిచితమని ప్రధాని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పాటల ప్రపంచానికి సేవ చేసిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ‘ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు, శేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు. బాలు మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, అనారోగ్యానికి గురైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) -
రాష్ట్రపతితో భేటీ కానున్న గులాంనబీ ఆజాద్
సాక్షి, ఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై కేంద్ర వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు సమావేశాలు ముగిసేవరకు సభను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆజాద్ సహా మరికొంత మంది విపక్షనేతలు నేడు రాష్ట్రపతిని కలిసి కేంద్ర వైఖరికి నిరసనగా ఓ లేఖను సమర్పించనున్నారు. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు గులాంనబీ ఆజాద్ లేఖ రాశారు. ఈ బిల్లులు కార్మికుల జోవనోపాధిని ప్రభావితం చేస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బిల్లులను ఆమెదించడం ప్రజాస్వామ్యానికి మచ్చలా మారుతుందంటూ అభివర్ణించారు. మరోవైపు సస్పెన్షన్లను ఎత్తివేసే వరకు సభకు రాబోమని విపక్షాలు ప్రకటించాయి. (58 దేశాలు, రూ. 517 కోట్లు) కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో 24 గంటల ఏకధాటి నిరసన అనంతరం ఎంపీలు తమ దీక్షను విరమించారు. తదనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సైతం ఒకరోజు దీక్షకు దిగడం మరో విశేషం. అయితే సస్పెండ్ అయిన రాజ్యసభ సభ్యులు తమ ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పిన తర్వాతే సస్పెన్షన్ రద్దు చేయడాన్ని పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇక పార్లమెంటు సమావేశాలు నేడు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు1వ తేదీ వరకూ ఇవి కొనసాగాల్సి ఉండగా కొంతమంది సభ్యులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఒకింత ఆందోళన నెలకొంది. దీంతో షెడ్యూల్ కన్నా 8 రోజుల ముందే సభను వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకి వచ్చాయి. (ఎంపీల సస్పెన్షన్ : సమావేశాలు బహిష్కరణ) -
నూతన విద్యా విధానం అమలుకు ఏపీ సిద్ధం
సాక్షి, అమరావతి : భారత ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం 2020 ను భవిష్యత్తు అవసరాల అనుగుణంగా తీర్చిదిద్దారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 21వ శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, రానున్న సమస్యలను నూతన విధానం పరిష్కరించగలదన్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత విద్యావిధానంలో మార్పులు ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం 2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సులో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ సదస్సులో నూతన విద్యా విధానం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానం -2020 ను తాను స్వాగతిస్తున్నానన్న గవర్నర్, ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలని యోచిస్తోందని బిశ్వ భూషణ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. (పాఠశాలల్లో ఇక ‘బ్రేక్ ఫాస్ట్’) పరిశోధనలలో నాణ్యత, నవ్యతతో పాటు పేటెంట్ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తి హక్కులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల పక్షాన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. రాష్ట్రంలో సంస్థాగత పరిశోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి పరిశోధనా మండలిని ఏర్పాటు చేయటమే కాక, విద్యా సంస్ధలను పరిశ్రమలతో అనుసంధానించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానం -2020 యొక్క సిఫారసులకు అనుగుణంగా ఆన్లైన్, డిజిటల్ విద్యకు ప్రాముఖ్యతను ఇస్తూ, మిశ్రమ అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని గౌరవ గవర్నర్ అన్నారు. గ్రామీణ, వెనుకబడిన విద్యార్థులకు ఆన్లైన్ విద్యకు అవకాశం కల్పించడానికి, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతికత లభ్యతలో అంతరాన్ని తగ్గించడానికి ఇ-లెర్నింగ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారని వివరించారు. నూతన పాలసీ సిఫారసులను అధ్యయనం చేయడానికి, రాష్ట్రంలోని నిర్దిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలసీ అమలు కోసం విధాన చర్యలు, మార్గదర్శకాలను సూచించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలను ప్రోత్సహిస్తూ, జాతీయ విద్యా విధానం 2020 ను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ సదస్సులో విజయవాడ రాజ్ భవన్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కళాశాల విద్యా కమీషనర్ ఎంఎం నాయక్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్యా హేమచంద్రా రెడ్డి, గవర్నర్ వారి సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు. -
సిక్కోలుకు జాతీయ గౌరవం
కాశీబుగ్గ: కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆసపాన మధుబాబు రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో జరగాల్సిన అవార్డు ప్రధానోత్సవం కరోనా కారణంగా ఆన్‌లైన్‌కు పరిమితమైంది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అ వార్డులు పొందిన మధుబాబు తొలిసారిగా జాతీయ అవార్డును ఆన్లైన్లో అందుకున్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాష బోధన, వీసీఆర్ ప్రజెంటేషన్, మన టీవీ లైవ్ ప్రజెంటేషన్, స్టడీ అవర్స్ నిర్వహణ, నైట్ విజిటింగ్, ఆదివారం ప్రత్యేక తరగతుల నిర్వహణ వంటి అంశాలతో ఆయన ఆకట్టుకున్నారు. సమయం దొరికితే వృధా చేయకుండా విద్యార్థులే సర్వస్వంగా భావించి నిరంతర ఉపాధ్యాయుడిగా, నిత్య విద్యారి్థగా మసలుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడియో కాల్ ద్వారా మధుబాబుకు అభినందనలు తెలిపారు. మధు బాబు మాట్లాడుతూ స్వయంగా వెళ్లలేని పరిస్థితి అయినప్పటికీ వీడియో కాన్ఫరెన్సులో కలిసి మాట్లాడుకోవడం ఆనందాన్ని ఇచ్చిందనన్నారు. -
గవర్నర్‌కు రాష్ట్రపతి ఫోన్
సాక్షి, హైదరాబాద్: ‘జాతీయ విద్యా విధానం– 2020’పై ఈ నెల 7వ తేదీన జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ఫోన్లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై వీడియో కాన్ఫరెన్స్ సన్నాహాల్లో భాగంగా రాష్ట్రపతి, గవర్నర్ మధ్య సంభాషణ జరిగింది. విద్యా రంగంలో అన్ని స్థాయిల్లో నాణ్యత పెరగడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానంతోపాటు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి విద్యా రంగ నిపుణులతో ఇటీవల వెబినార్ నిర్వహించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. వెబినార్‌లో వచ్చిన సూచనలు, సలహాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని గవర్నర్ తెలిపారు. ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయాలను ఎక్సలెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దడంపై వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లు, ఇతరులతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించిన విషయాన్ని రాష్ట్రపతికి నివేదించారు. ‘కనెక్ట్ చాన్స్‌లర్’, ‘చాన్స్‌లర్ కనెక్ట్స్ అలుమ్ని’వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగం కావడం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ తమిళిసై వివరించారు. విద్యా రంగంలో నాణ్యత కోసం గవర్నర్ తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి తెలుసుకున్నారు. -
గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి ఫోన్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్లో చర్చించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గవర్నర్‌కు శుక్రవారం ఫోన్ చేశారు. ‘జాతీయ విద్యావిధానం–2020’ అంశంపై త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబోయే సమావేశం గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య గురించి కూడా రాష్ట్రపతి కోవింద్ కోవింద్ గవర్నర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ తమిళిసై వెబ్‌నార్ నిర్వహించిన విషయం విదితమే. -
స్వాతంత్య్ర దినోత్సవం: ప్రముఖుల విషెస్
74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దేశంలో పుట్టడం మనందరి అదృష్టమని ఆయన అన్నారు. ఎందరో వీరుల ప్రాణ త్యాగాలు పోరాటల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది అని, వారందరిని ఈ సందర్భంగ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కరోనాలాంటి విపత్కర పరిస్థితులను దేశం ఎదుర్కొంటుందని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది వలస కార్మికులు, సామాన్యుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారందరిని ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. అలాగే గల్వన్ లోయలో చైనా చేసిన దురాక్రమణలను విజయవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ఐకమత్యంగా ఉండి దేశ ఉన్నతికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. Full text of #PresidentKovind’s address to the nation on the eve of the 74th Independence Day. 🇮🇳 English: https://t.co/MlTZ6otbQV Hindi: https://t.co/DgPHHgRPFV pic.twitter.com/TBATnb9Z01 — President of India (@rashtrapatibhvn) August 14, 2020 దేశ ప్రజలందరికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి చెప్పిన మాటలు 130 మంది భారతీయులలో స్ఫూర్తిని నింపాయని కొనియాడారు. దేశ ప్రజలందరూ జాతి ఉన్నతికి, అభివృద్ధికి, సమగ్రతకు, ఐక్యతకు పాటు పడాలని మోదీ పిలుపునిచ్చారు. #स्वतंत्रतादिवस के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। जय हिंद! Happy Independence Day to all fellow Indians. Jai Hind! — Narendra Modi (@narendramodi) August 15, 2020 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing my very good friend @PMOIndia @narendramodi and all the people of #IncredibleIndia a joyful #IndiaIndependenceDay . You have so much to be proud of. स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं 🇮🇱🤝🇮🇳 pic.twitter.com/OaW7tHgKrH — Benjamin Netanyahu (@netanyahu) August 14, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యానికి కారణమయిన అమరవీరులకు, దేశ భక్తులకు నా కృతజ్ఞతలు. మన దేశ విలువలు కాపాడుతూ, జాతి అభ్యున్నతికి పాటు పడతామని ఈ సందర్భంగా అందరం ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆయన ట్వీట్ చేశారు. As India celebrates its 74th Independence day, I salute the great men & women whose unswerving determination & patriotism gifted us the freedom we relish today. Let's pledge to uphold & safeguard the values of our nation & contribute to its progress. Jai Hind! #IndependenceDay — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2020 కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. समस्त देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। 🇮🇳 जय हिंद 🇮🇳 pic.twitter.com/OtvRzuWpzH — Smriti Z Irani (@smritiirani) August 15, 2020 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ప్రజలందరికి ట్విట్టర్ వేదికగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.#IndependenceDayIndia2020 pic.twitter.com/EX8bSoWDpQ — Vijayasai Reddy V (@VSReddy_MP) August 15, 2020 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజలందరికీ రక్షకులు నర్సులు
న్యూఢిల్లీ: ఎదుటివారని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతోన్న రక్షకులు అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులను అభివర్ణించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో నర్సింగ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి కోవింద్ రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్‌నాథ్ కోవింద్ వారిని సత్కరించారు. సహజంగా రక్షాబంధన్ రోజు, తమ సోదరుల నుంచి అక్కాచెల్లెళ్ళు రక్షణను కోరకుంటారు. అయితే నర్సులు మాత్రం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో సోదరులకు, ప్రజలందరికీ రక్షణగా నిలుస్తారు అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నర్సులపై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ మహమ్మారితో పోరాడుతోన్న వారికి సేవలందిస్తూ కరోనా బారిన పడినప్పటికీ తిరిగి కోలుకుని, నూతన శక్తితో విధులను నిర్వర్తించిన సైనిక విభాగంలోని నర్సులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. నర్సులందరికీ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. -
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి వీరు చర్చించినట్టుగా అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ శుక్రవారం లద్దాఖ్‌లో ఆకస్మిక పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు. లేహ్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు. అలాగే నిములో ఉన్న ఫార్మర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ఉద్వేగపూరితంగా, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మరోవైపు ఆర్మీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మోదీ, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి : సెల్యూట్.. బ్రేవ్ హార్ట్స్!) ఈ భేటీకి సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా చేసింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను ఆయనకు వివరించారు’ అని పేర్కొంది. Prime Minister @narendramodi called on President Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today. pic.twitter.com/yKBXCnfboE — President of India (@rashtrapatibhvn) July 5, 2020 -
రాష్ట్రపతికి రంగరాజన్ లేఖ
సాక్షి, మొయినాబాద్ : కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్‌కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు. -
ఇకపై ఆర్బీఐ పర్యవేక్షణలో సహకార బ్యాంకులు
ఢిల్లీ : బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదం తెలిపారు. సహకార బ్యాంకుల నిర్వహణ, నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ, సహకార, రాష్ట్ర సహకార బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 24న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1540 సహకార బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రానున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకులతోపాటు 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాకులు ఉన్నాయి. దీంతో కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ నియంత్రణలోకి తీసుకువచ్చే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫ్రిబవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నప్పటికీ, కరోనా కేపథ్యంలో అది సాధ్యం కాలేదు. దీంతో తాజాగా ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం సహకార బ్యాంకులకు కూడా బ్యాంకింగ్ రెగ్యలేషన్ యాక్ట్, 1949 వర్తించే విధంగా సవరణలు చేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సహకార బ్యాంకులను మరింత బలోపేతం చేయనుంది. ఇతర బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో పాలన, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు బ్యాంకింగ్ నియంత్రణ కోసం ఆర్బీఐతో ఇప్పటికే అందుబాటులో ఉన్న అధికారాలను ఈ ఆర్డినెన్స్ మరింత విస్తరించనుంది. అయితే ఈ సవరణలు రాష్ట్ర సహకార చట్టాల కింద ఉన్న సహకార సంఘాల రాష్ట్ర రిజిస్ట్రార్లతో పాటు ప్రాథమిక వ్యయసాయ క్రెడిట్ సొసైటీలకు(పీఏసీఎస్) వర్తించదు. బ్యాంకింగ్ రెగ్యలేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 45 ప్రకారం బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూడాలి. ప్రజల ఆసక్తి , డిపాజిటర్లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడటానికి చర్చలు పాటు ఎలాంటి మారిటోరియం లేకుండా బ్యాంకింగ్ పునర్నిర్మాణం లేదా సమ్మేళనం కోసం ఈ ఆర్డినెన్స్‌ను తెచ్చినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. (ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్ కొరకు) -
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి) రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. (కేసీఆరే స్టార్) ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అంటూ మరో ట్వీట్లో ఏపీ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకంక్షలు!! కేసీఆర్ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం!! ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !!జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. (కలలు నెరవేరుతున్న కాలం) తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. — President of India (@rashtrapatibhvn) June 2, 2020 తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana pic.twitter.com/zsTM3HemRF — Vice President of India (@VPSecretariat) June 2, 2020