Shreyas Iyer
-
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అయ్యర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును అయ్యర్ తన మెరుపు సెంచరీతో అదుకున్నాడు. కేవలం 133 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 16 ఫోర్లు,4 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ దేశీ, గౌరవ్ యాదవ్, గురువర్దన్ సింగ్, అంకిత్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.రెండో సెంచరీ.. కాగా ఈ టోర్నీలో శ్రేయస్‌కు ఇది రెండో సెంచరీ. ఈ దేశీవాళీ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 138.66 స్ట్రైక్ రేటుతో 312 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అయ్యర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఈ ముంబై ఆటగాడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. తిలక్ వర్మకు చేదు అనుభవం
విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ VHTలో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడింది.అయితే, ఈ లిస్ట్-‘ఏ’ మ్యాచ్‌లో ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.టాస్ గెలిచిన ముంబై.. తిలక్ వర్మ డకౌట్నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(64), అభిరథ్ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్ తిలక్ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.ఇక మిడిలార్డర్లో అలెగాని వరుణ్ గౌడ్(1), రోహిత్ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాశ్(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 38.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళఅదే విధంగా తనుష్ కొటియాన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ(19), ఆయుశ్ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్ తామోర్(0), సూర్యాంశ్ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్(5), శార్దూల్ ఠాకూర్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.అయ్యర్ ధనాధన్.. తిలక్ సేనకు చేదు అనుభవంమరో ఎండ్ నుంచి తనుష్ కొటియాన్(37 బంతుల్లో 39 నాటౌట్) సహకారం అందించగా.. అయ్యర్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్‌రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్ సేనపై జయభేరి మోగించింది.ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్ -
అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కర్ణాటక జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది. 383 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. కర్ణాటక బ్యాటర్లలో కృష్ణన్ శ్రీజిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.లక్ష్య చేధనలో శ్రీజిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 101 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అనీష్ కేవీ(82), ప్రవీణ్ దూబే(65) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో జునేద్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటాడు.అయ్యర్ సెంచరీ వృథా..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 4 వికెట్ల నష్టానికి 382 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(114) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు అయాష్ మాత్రే(78), హార్దిక్ తమోర్(84), శివమ్ దూబే(63) హాఫ్ సెంచరీలతో రాణించారు.కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విధ్యాదర్ పటేల్, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ముంబై ఓటమి పాలవ్వడంతో శ్రేయస్ అయ్యర్ సెంచరీ వృథా అయిపోయింది. కర్ణాటక రికార్డు..కాగా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ చేసిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో ఆంధ్ర జట్టు తొలి స్ధానంలో ఉంది. 2011/12 సీజన్లో గోవాపై 384 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేజ్ చేసింది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే..! భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ) తొలి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.కాగా వీహెచ్‌టీ 2024-25 ఎడిషన్ రౌండ్ వన్‌లో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆయుశ్, హార్దిక్ హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(6) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే(78)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ విశ్వరూపంఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ధనాధన్ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.టీ20 తరహాలో వీరబాదుడుకాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు.మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు.ముంబై వర్సెస్ కర్ణాటక తుదిజట్లుకర్ణాటకమయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.ముంబైఅంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
టీ20 ఫార్మాట్లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోటోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగాఈ నేపథ్యంలో భారత్‌లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్‌ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకుఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’ -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే (ఫొటోలు)
-
సుర్యాంశ్ షేడ్గే ఊచకోత.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి మధ్యప్రదేశ్‌కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్‌ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దేశవాలీ క్రికెట్లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది. -
రఫ్పాడించిన రహానే.. విధ్వంసకర సెంచరీ మిస్.. అయితేనేం..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ అజింక్య రహానే పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బరోడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన రహానే సెంచరీ దిశగా పయనించాడు.శతకానికి రెండు పరుగుల దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు రహానే. అయితేనేం తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైకి విజయం అందించి.. ఫైనల్‌కు చేర్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ముంబై జట్టు బరోడాతో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. బరోడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది.రాణించిన శివాలిక్ శర్మబరోడా ఇన్నింగ్స్‌లో శివాలిక్ శర్మ(36 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ శశ్వత్ రావత్(33), కెప్టెన్ కృనాల్ పాండ్యా(30), ఆల్‌రౌండర్ అతిత్ సేత్(14 బంతుల్లో 22) ఫర్వాలేదనిపించారు. ఇక ముంబై బౌలర్లలో పేసర్లు సూర్యాంశ్ షెడ్గే రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. శివం దూబే, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి ఒక్కో వికెట్ తీశారు. ఇక స్పిన్ బౌలర్లు తనుష్ కొటియాన్, అథర్వ అంకోలేకర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టిన రహానేఇక బరోడా విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలో షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్ పృథ్వీ షా(8) అవుటయ్యాడు. అయితే, ఆ ఆనందం బరోడాకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ అజింక్య రహానే బరోడా బౌలింగ్‌ను చితక్కొట్టాడు.కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు. అయితే, అభిమన్యు సింగ్ బౌలింగ్‌లో విష్ణు సోలంకికి క్యాచ్ ఇవ్వడంతో రహానే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. తృటిలో సెంచరీ అతడి చేజారింది. సూర్య విఫలంమిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 46 పరుగులతో రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఏడు బంతులు ఆడిన స్కై కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. శివం దూబే 0, సూర్యాంశ్ షెడ్గే 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఇక రహానే ధనాధన్ బ్యాటింగ్ కారణంగా ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో బరోడాను ఓడించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024 ఫైనల్ చేరింది.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
SMAT: టీమిండియా స్టార్ల మెరుపులు.. సెమీస్ చేరిన జట్లు, షెడ్యూల్
ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ తదితరులు ఈ టోర్నీలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక ఈ టీ20 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. మధ్యప్రదేశ్, బరోడా, ముంబై, ఢిల్లీ జట్లు టాప్-4లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్ తదితర అంశాలను గమనిద్దాం. అంతకంటే ముందు.. ఈ నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన తీరుపై ఓ లుక్కేద్దాం.పృథ్వీ షా, సూర్యాంశ్, శివమ్ దూబే మెరుపులు గ్రూప్ ‘ఇ’ టాపర్‌గా క్వార్టర్స్‌లో అడుగు పెట్టిన ముంబై అదే జోరు కొనసాగిస్తూ విదర్భను మట్టికరిపించింది. ఆలూరులో బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అథర్వ తైడె (41 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), అపూర్వ్ వాంఖడె (33 బంతుల్లో 51; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించగా... శుభమ్ దూబే (19 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలిచింది.సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు విరుచుకుపడటంతో 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 83 పరుగులు చేసింది.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), సూర్యకుమార్ యాదవ్ (9) విఫలం కాగా... ఆఖర్లో శివమ్ దూబే (37 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సూర్యాంశ్ (36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది.వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోఆలూరు: పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (33 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/23) ఆకట్టుకోవడంతో... సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట సౌరాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసింది. చిరాగ్ జానీ (45 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. అరి్పత్ గౌడ్ (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చివర్లో హర్‌ప్రీత్ సింగ్ (9 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, 3 క్యాచ్‌లు బెంగళూరు: బెంగాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బరోడా 41 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ చేరింది. బరోడాకు ఆడుతున్న భారత స్టార్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టడంతోపాటు 3 క్యాచ్‌లు తీసుకున్నాడు. మొదట బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.శాశ్వత్ రావత్ (40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అభిమన్యు సింగ్ (37; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీ, కనిష్క్ సేత్, ప్రతీప్తా ప్రమాణిక్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగాల్ తడబడింది. 18 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, లుక్మన్ మెరివాలా, అతిత్ సేత్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. అనూజ్ అదుర్స్బెంగళూరు: వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర అర్ధశతకంతో చెలరేగడంతో ఢిల్లీ జట్టు ముస్తాక్ అలీ టోర్నీ సెమీఫైనల్‌కు చేరింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది.అనూజ్ రావత్‌తో పాటు ఓపెనర్లు యశ్ ధుల్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాడు ప్రియం గార్గ్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో పోరాడగా... రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) విఫలమవడంతో ఉత్తరప్రదేశ్‌కు పరాజయం తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3... ఆయుష్ బదోనీ, సుయాశ్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెమీ ఫైనల్స్ షెడ్యూల్, వేదిక, టైమింగ్స్తొలి సెమీ ఫైనల్:👉ముంబై వర్సెస్ బరోడా- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- ఉదయం 11 గంటలకు ఆరంభం.రెండో సెమీ ఫైనల్: 👉మధ్యప్రదేశ్ వర్సెస్ ఢిల్లీ- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం- డిసెంబరు 13(శుక్రవారం)- సాయంత్రం 4.30 నిమిషాలకు ఆరంభం.ఇప్పటి వరకు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించింది వీరేసకీబుల్ గనీ ఈ సీజన్లో 353 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా ఉండగా.. కరణ్ లాల్ 338, అభిషేక్ పోరెల్ 335, అజింక్య రహానే 334, తిలక్ వర్మ 327 పరుగులు సాధించారు.మరోవైపు.. జగ్జీత్ సింగ్ 18 వికెట్లతో టాప్ బౌలర్‌గా ఉండగా.. కుమార్ కార్తికేయ 15, ముకేశ్ చౌదరి 15చ శ్రేయస్ గోపాల్ 14, కేవీ శశికాంత్ 14 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్‌లో ఆర్సీబీ పేసర్ -
రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్‌తో పాటు వెటరన్ ఆజింక్య రహానే (34 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ నిఖిల్ నాయక్ (47), అజిమ్ ఖాజీ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. అర్శిన్ కులకర్ణి (19), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19), త్రిపాఠి (16), రామకృష్ణ ఘోష్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో తనుశ్ కోటియన్ 3, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి తలో 2, రాయ్స్టన్ డయాస్, సూర్యాంశ్ షెడ్గే చెరో వికెట్ పడగొట్టారు.172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. శ్రేయస్, రహానే రాణించడంతో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో అంగ్క్రిష్ రఘువంశీ 21, షమ్స్ ములానీ 14 (నాటౌట్), హార్దిక్ తామోర్ (9 నాటౌట్) పరుగులు చేయగా.. పృథ్వీ షా, సూర్యాంశ్ షెడ్గే డకౌట్ అయ్యారు. మహా బౌలర్లలో ముకేశ్ చౌదరీ 4 వికెట్లు పడగొట్టగా.. అర్శిన్ కులకర్ణి ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, నవంబర్ 24న జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ రికార్డు స్థాయిలో 26.75 కోట్లకు అమ్ముడుపోయాడు. అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో భారీ ధర. ఇదే వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. గత 5 ఇన్నింగ్స్‌ల్లో ముంబై తరఫున శ్రేయస్ చేసిన స్కోర్లు..142- రంజీ ట్రోఫీ233- రంజీ ట్రోఫీ47- రంజీ ట్రోఫీ130 నాటౌట్ (57)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ71 (39)- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ -
వేలంలో భారత క్రికెటర్లకు కాసుల పంట.. తొలి రోజు ఎవరు ఎంత ధర పలికారంటే..?
-
ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2025 మెగా వేలం నిన్న (నవంబర్ 24) సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలం తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. తొలి రోజు వేలంలో నాలుగు ఆర్టీఎమ్ కార్డులు (రచిన్ రవీంద్ర (సీఎస్కే), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఢిల్లీ), నమన్ ధిర్ (ముంబై), అర్షదీప్ సింగ్ (పంజాబ్)) వాడుకోబడ్డాయి. నిన్న వేలంలో అన్ని ఫ్రాంచైజీలచే మొత్తం రూ. 467.85 కోట్లు ఖర్చు చేయబడింది. నిన్నటి వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ వారీగా అమ్ముడుపోయిన ఆటగాళ్లు..సీఎస్కే:నూర్ అహ్మద్ (10 కోట్లు)రవిచంద్రన్ అశ్విన్ (9.75 కోట్లు)డెవాన్ కాన్వే (6.25 కోట్లు)సయ్యద్ ఖలీల్ అహ్మద్ (4.8 కోట్లు)రచిన్ రవీంద్ర (4 కోట్లు, RTM)రాహుల్ త్రిపాఠి (3.4 కోట్లు)విజయ్ శంకర్ (1.2 కోట్లు)ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (14 కోట్లు)మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)టి నటరాజన్ (10.75 కోట్లు)జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (9 కోట్లు, RTM)హ్యారీ బ్రూక్ (6.25 కోట్లు)అషుతోష్ శర్మ (3.80 కోట్లు)మోహిత్ శర్మ (2.20 కోట్లు)సమీర్ రిజ్వి (95 లక్షలు)కరుణ్ నాయర్ (50 లక్షలు)గుజరాత్ టైటాన్స్: జోస్ బట్లర్ (15.75 కోట్లు)మొహమ్మద్ సిరాజ్ (12.25 కోట్లు)కగిసో రబాడ (10.75 కోట్లు)ప్రసిద్ద్ కృష్ణ (9.50 కోట్లు)మహిపాల్ లోమ్రార్ (1.70 కోట్లు)మనవ్ సుతార్ (30 లక్షలు)కుమార్ కుషాగ్రా (65 లక్షలు)అనుజ్ రావత్ (30 లక్షలు)నిషాంత్ సంధు (30 లక్షలు)కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు)అన్రిచ్ నోర్జే (6.50 కోట్లు)క్వింటన్ డికాక్ (3.60 కోట్లు)అంగ్క్రిష్ రఘువంశీ (3 కోట్లు)రహ్మానుల్లా గుర్బాజ్ (2 కోట్లు)వైభవ్ అరోరా (1.80 కోట్లు)మయాంక్ మార్కండే (30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్: రిషబ్ పంత్ (27 కోట్లు)ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు)డేవిడ్ మిల్లర్ (7.5 కోట్లు)అబ్దుల్ సమద్ (4.2 కోట్లు)మిచెల్ మార్ష్ (3.4 కోట్లు)ఆర్యన్ జుయల్ (30 లక్షలు)ముంబై ఇండియన్స్:ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు)నమన్ ధిర్ (5.25 కోట్లు, RTM)రాబిన్ మింజ్ (65 లక్షలు)కర్ణ్ శర్మ (50 లక్షలు)పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్(26.75 కోట్లు)యుజ్వేంద్ర చహల్(18 కోట్లు)అర్షదీప్ సింగ్ (18 కోట్లు, RTM)మార్కస్ స్టోయినిస్ (11 కోట్లు)నేహల్ వధేరా (4.2 కోట్లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4.2 కోట్లు)విజయ్‌కుమార్ వైశాఖ్ (1.8 కోట్లు)యశ్ ఠాకర్ (1.60 కోట్లు)హర్‌ప్రీత్ బ్రార్ (1.5 కోట్లు)విష్ణు వినోద్ (95 లక్షలు)రాజస్థాన్ రాయల్స్: జోఫ్రా ఆర్చర్ (12.50 కోట్లు)వనిందు హసరంగ (5.25 కోట్లు)మహీశ్ తీక్షణ (4.40 కోట్లు)ఆకాశ్ మధ్వాల్ (1.20 కోట్లు)కుమార్ కార్తీకేయ (30 లక్షలు)ఆర్సీబీ:జోష్ హాజిల్‌వుడ్ (12.50 కోట్లు)ఫిల్ సాల్ట్ (11.50 కోట్లు)జితేశ్ శర్మ (11 కోట్లు)లియామ్ లివింగ్‌స్టోన్ (8.75 కోట్లు)రసిఖ్ దార్ (6 కోట్లు)సుయాశ్ శర్మ (2.6 కోట్లు)సన్‌రైజర్స్ హైదరాబాద్:ఇషాన్ కిషన్ (11.25 కోట్లు)మొహమ్మద్ షమీ (10 కోట్లు)హర్షల్ పటేల్ (8 కోట్లు)అభినవ్ మనోహర్ (3.20కోట్లు)రాహుల్ చాహల్ (3.20 కోట్లు)ఆడమ్ జంపా (2.40 కోట్లు)సిమ్రన్‌జీత్ సింగ్ (1.50 కోట్లు)అథర్వ తైడే (30 లక్షలు) -
శ్రేయస్ అయ్యర్‌పై కనకవర్షం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి! కానీ..
మెగా వేలం-2025లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తగ్గేదేలే అన్నట్లు రేసులో మున్ముందుకు దూసుకుపోయాయి.నువ్వా- నేనా అన్నట్లు ఢిల్లీ, పంజాబ్ తలపడటంతో శ్రేయస్ అయ్యర్ ధర రూ. 20 కోట్లు దాటింది. దీంతో కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోగా.. సరైన కెప్టెన్లు లేని కారణంగా ఢిల్లీ, పంజాబ్ మాత్రం అయ్యర్ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి. ఆఖరికి ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్ తమ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు మొదటి ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన మరో టీమిండియా స్టార్, పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పంజాబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది.కెప్టెన్ కోసం..ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ సొంతం. అయినప్పటికీ కోల్‌కతా రిటెన్షన్‌కు ముందు అతడిని వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి హాట్‌కేకు అవుతాడని అంతా ముందే ఊహించారు. అందుకు తగ్గట్లుగానే అయ్యర్ భారీ ధర పలకడం విశేషం. కాగా పంజాబ్ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అంతేకాదు వేలానికి ముందు కేవలం ఇద్దరిని రిటైన్ చేసుకుని అందరినీ విడిచిపెట్టింది.దీంతో రూ. 110.5 కోట్ల పర్సు వాల్యూతో వేలంలోకి వచ్చింది. దీంతో అయ్యర్ కోసం ఈ మేర ఖర్చు చేసింది. అయితే, పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనడంతో అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.కాగా ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి.. 3127 పరుగులు చేశాడు.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతంMissed watching that stunning Shreyas bidding process❓We have you covered here with the snippets 🎥 🔽#TATAIPLAuction | #TATAIPL | @ShreyasIyer15 | @PunjabKingsIPL | #PBKS pic.twitter.com/a7jAki8LVz— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్‌కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్‌హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది. వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్‌లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్‌పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లపై రూ. కోట్లు కురవనున్నాయి.విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది. 116 మందిపైనే వేలం వెర్రి వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం. ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్‌ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్‌రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.అర్ష్‌దీప్ అ‘ధర’హో ఖాయం అంతర్జాతీయ క్రికెట్లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్‌దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్‌దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చేందుకు పంత్‌ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్‌కే ఉన్నాయి.బట్లర్ వైపు ఆర్సీబీ చూపు పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్‌జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్‌కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. శ్రేయస్‌తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.వేలంలో కాసుల వర్షం కురవనుందా?కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు
దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్నెస్ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.తాజా సీజన్లో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్ కోటియాన్, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సిద్ధేశ్ లాడ్, యువ ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబై జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, అంగ్క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్ లాడ్, సూర్యాన్ష్ షెడ్గె, సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమోర్, ఆకాశ్ ఆనంద్, షమ్స్ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్ కోటియాన్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, రోస్టన్ డియాస్, జునేద్ ఖాన్.చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి! -
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్న సూర్యకుమార్..!
ముంబై జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో అయ్యర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సారథిగా వ్యహరిస్తాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఎంసీఎ మాత్రం అయ్యర్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.ఈ దేశీవాళీ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో రహానే ఆడనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఇక టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నట్లు వినికిడి. అయ్యర్ కెప్టెన్సీలో అతడు ముంబై తరపున బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఇటీవలే సూర్య కెప్టెన్సీలోని భారత జట్టు దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై స్టార్ ప్లేయర్లు శివమ్ దూబే, ముషీర్ ఖాన్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముంబై ప్రాబుబుల్స్పృథ్వీ షా, ఆయుష్ మ్హత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, సూర్యాంశ్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్దేష్ లాడ్, హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), షా ముపార్కర్, సాయి పార్క్రాజ్, సాయి పార్క్, , హిమాన్షు సింగ్, సాగర్ ఛబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్, యోగేష్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడి, శశాంక్ అత్తార్డే, జునేద్ ఖాన్ -
స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
టీమిండియా ఓపెనర్, తమ స్టార్ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై క్రికెట్ అసోసియేషన్ శుభవార్త అందించింది. ఇటీవల రంజీ జట్టు నుంచి అతడిని తొలగించిన యాజమాన్యం.. దేశీ టీ20 టోర్నీ కోసం మళ్లీ పిలుపునిచ్చేందుకు సిద్ధమైంది. కాగా దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో టీమిండియాలోకి దూసుకువచ్చిన పృథ్వీ షా.. తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయినిలకడలేని ఆటతీరుతో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పోటీలో వెనుకబడి టీమిండియా ఓపెనర్‌గా తన స్థానాన్ని కోల్పోయాడు. 2018లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పృథ్వీ.. 2021లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 5 టెస్టులు, 6 వన్డేలు ఆడిన ఈ ముంబై బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 339, 189 పరుగులు చేశాడు.ముంబై తరఫున ఆడుతూఅదే విధంగా.. టీమిండియా తరఫున ఒకే ఒక్క టీ20 ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పృథ్వీ షా.. ముంబై తరఫున ఆడుతూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు.. విజయ్ హజారే ట్రోఫీ(వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20)లో ఆడుతూనే.. ఐపీఎల్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకంటున్నాడు.ఇంగ్లండ్ గడ్డపై రాణిస్తూఅలాగే ఇంగ్లండ్ దేశీ టోర్నీల్లోనూ పాల్గొంటున్న పృథ్వీ షా.. అక్కడ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో తొలుత పృథ్వీ షాకు అవకాశం ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్.. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టింది. ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా పృథ్వీపై వేటు వేసింది.శ్రేయస్ అయ్యర్ కూడాఈ నేపథ్యంలో తాజాగా ముంబై ప్రాబబుల్స్ జట్టులో పృథ్వీ పేరు కనిపించడం విశేషం. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో పాల్గొనే అవకాశం ఉన్న ఆటగాళ్ల పేరును ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసింది. ఇందులో పృథ్వీ షాతో పాటు టీమిండియా స్టార్, ప్రస్తుతం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లతో పాటు వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.అతడు మాత్రం మిస్‌అయితే, ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ మాత్రం ఈ లిస్టులో మిస్సయ్యాడు. ఇటీవల భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైన అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కానీ.. అక్కడ ఆసీస్-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. కాగా నవంబరు 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానుంది. ఇందులో రంజీ సారథి రహానేనే ముంబైకి నాయక త్వం వహించే అవకాశం ఉంది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో పాల్గొనబోయే ముంబై ప్రాబబుల్ జట్టుపృథ్వీ షా, ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, శ్రీరాజ్ ఘరత్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే, ఇషాన్ ముల్చందానీ, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, ఆకాశ్ పార్కర్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, సాగర్ చాబ్రియా, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్స్టన్ డైస్, యోగేశ్ పాటిల్, హర్ష్ తన్నా, ఇర్ఫాన్ ఉమైర్, వినాయక్ భోయిర్, కృతిక్ హనగవాడీ, శశాంక్ అటార్డే, జునేద్ ఖాన్. చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే! -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ తన సత్తా ఎంటో మరోసారి శ్రేయస్ చూపించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 201 బంతుల్లో తన తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 228 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 24 ఫోర్లు, 9 సిక్స్‌లతో 233 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్‌తో పాటు సుద్దేశ్ లాడ్(150 బ్యాటింగ్) సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 117 ఓవర్లు ముగిసే సరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసింది.అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ కారణంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయ్యర్ చివరగా ఇండియా తరపున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్యర్‌కు తన వెన్ను గాయం తిరగబెట్టడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఆ తర్వాత రంజీల్లో ఆడాలన్న బీసీసీఐ అదేశాలు దిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత దిగివచ్చిన శ్రేయస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిదద్దమయ్యాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో అతడు ఆడాడు. ఇప్పుడు రంజీ సీజన్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అద్బుత డబుల్ సెంచరీతో అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది! -
IPL 2025: కేకేఆర్ విడిచిపెట్టింది.. సెంచరీలతో విరుచుకుపడ్డారు..!
ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్‌దీప్ సింగ్‌ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్‌కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్‌కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. -
సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఈ సీజన్లో తొలుత మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఒడిషాపై శ్రేయస్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ శ్రేయస్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 15వ సెంచరీ. శ్రేయస్ అటాకింగ్ సెంచరీతో సత్తా చాటడంతో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితికి చేరింది. 72 ఓవర్ల అనంతరం ముంబై 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. శ్రేయస్‌కు జతగా సిద్దేశ్ లాడ్ (91) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రఘువంశీ 124 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 18 పరుగులకు వెనుదిరగగా.. కెప్టెన్ అజింక్య రహానే డకౌటయ్యాడు. ఒడిషా బౌలర్లలో బిప్లబ్ సమంత్రే రెండు వికెట్లు పడగొట్టగా.. సూర్యకాంత్ ప్రధాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, శ్రేయస్ అయ్యర్ తిరిగి టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. ఆతర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం టీమిండియాలో రీ ఎంట్రీనే లక్ష్యంగా శ్రేయస్ రంజీట్రోఫీలో ఆడుతున్నాడు. శ్రేయస్ వరుస సెంచరీలు చేసి సెలెక్టర్లకు సవాలు విసిరాడు. టీమిండియా మిడిలార్డర్ బలహీనంగా కనబడుతున్న తరుణంలో శ్రేయస్ సెలెక్టర్ల పాలిట ఆశాకిరణంగా కనిపిస్తుంటాడు.మరోవైపు శ్రేయస్‌ను తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ఇటీవలే వదిలించుకున్న విషయం తెలిసిందే. శ్రేయస్ కేకేఆర్‌ను గత సీజన్లో ఛాంపియన్‌గా నిలిబెట్టినా అతన్ని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. నవంబర్ 24, 25 తేదీల్లో జెద్దా వేదికగా జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ పాల్గొంటాడు. శ్రేయస్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. శ్రేయస్‌తో పాటు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సిరాజ్ లాంటి 48 మంది భారతీయ స్టార్ క్యాప్డ్ ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొననున్నారు. -
IPL Auction: వేలంలోకి టీమిండియా స్టార్లు.. వాళ్లిద్దరి కనీస ధర తక్కువే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2025 వేదిక ఖరారైంది. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్–2025 వేలంపాట జరగనుందని మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా... వరుసగా రెండో ఏడాది విదేశాల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ముందుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహిస్తారని వార్తలు వచ్చినా బీసీసీఐ మాత్రం జిద్దా నగరాన్ని ఎంచుకుంది. 👉ఇక ఇటీవల ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా విడుదల కాగా... 1574 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ఇందులో 1165 మంది భారత ఆటగాళ్లు, 409 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 1224 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 👉ఇందులో జాతీయ జట్టుకు ఆడిన భారత ఆటగాళ్లు 48 మంది ఉండగా... 965 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అప్పటి నుంచి ఒక్క టీ20 ఆడలేదు.. కానీ👉ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్ వచ్చే ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఏకంగా రూ. 1 కోటీ 25 లక్షల కనీస ధరకు తన పేరును నమోదు చేసుకోవడం విశేషం. 👉ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టు ఆడుతున్న సమయంలోనే ఈ వేలం జరగనుంది. ఒక్కో జట్టు రీటైన్ ఆటగాళ్లను కలుపుకొని అత్యధికంగా 25 మంది ప్లేయర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు కాకుండా... ఇంకా 204 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వేలంలో 641.5 కోట్లు ఖర్చురిటెన్షన్ విధానంలో పలువురు ప్రధాన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసుకోవడంతో... రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్‌లాంటి పలువురు భారత స్టార్ ఆటగాళ్లు వేలానికి రానున్నారు. మొత్తంగా 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ప్లేయర్ల కోసం రూ. 641.5 కోట్లు వేలంలో ఖర్చు చేయనున్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. రిటెన్షన్ గడువు ముగిసేసరికి 10 జట్లు రూ. 558.5 కోట్లు ఖర్చు పెట్టి 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ వద్ద రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి కనీస ధర రూ. 2 కోట్లుఇక ఈసారి వేలంలోకి రానున్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితరులు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.వీరితో పాటు ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ కృష్ణ, టి.నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ తదితర ద్వితీయ శ్రేణి భారత క్రికెటర్లు సైతం రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది.వీరి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుఅయితే, ముంబై బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ల బేస్ ప్రైస్ మాత్రం రూ. 75 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లోనూ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. మరోవైపు.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. అయితే, గతేడాది వేలంలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అతడిని ఈసారి ఏదో ఒక ఫ్రాంఛైజీ కనీసం బేస్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.చదవండి: Ind vs Aus BGT: కేఎల్ రాహుల్‌పై దృష్టి -
IPL 2025: మెగా వేలం డేట్స్ ఫిక్స్! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిందని.. ఈ నెల ఆఖరి వారంలో రియాద్ వేదికగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. అదే విధంగా.. వేలం రెండు రోజుల పాటు సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రైట్ టూ మ్యాచ్ కార్డు అందుబాటులోకికాగా మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచడం సహా రైట్ టూ మ్యాచ్(ఆర్టీఎమ్) కార్డు అందుబాటులోకి రావడంతో ఫ్రాంఛైజీలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. కీలకమైన ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకుని.. స్టార్లు అయినా సరే తమకు భారం అనుకుంటే.. వాళ్లను వదిలించుకున్నాయి.వదిలించుకున్నాయిరాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్(ఇంగ్లండ్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐడెన్ మార్క్రమ్(సౌతాఫ్రికా), ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ ఏడాది టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌లను రిలీజ్ చేయడం ఇందుకు ఉదాహరణ.ఆ తేదీల్లోనే వేలం!ఇక పది జట్లు కలిపి మొత్తంగా 46 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఇక ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే.. అందులోనూ పది మంది అన్క్యాప్డ్ ఇండియన్స్ కావడం విశేషం. కాగా ఈ సీజన్లో కూడా సొంతగడ్డపై కాకుండా విదేశంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇందుకోసం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నవంబరు 24, 25 తేదీల్లో వేలం నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబరు 19న దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మెగా వేలం-2025 రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?రాజస్తాన్ రాయల్స్ 👉సంజూ సామ్సన్-భారత్- రూ. 18 కోట్లు 👉యశస్వి జైస్వాల్- భారత్- రూ. 18 కోట్లు 👉రియాన్ పరాగ్- భారత్- రూ. 14 కోట్లు 👉ధ్రువ్ జురెల్- భారత్- రూ. 14 కోట్లు 👉హెట్‌మైర్-వెస్టిండీస్ రూ. 11 కోట్లు 👉సందీప్ శర్మ- భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదుగుజరాత్ టైటాన్స్👉రషీద్ ఖాన్-అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు 👉శుబ్‌మన్ గిల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉సాయి సుదర్శన్- భారత్- రూ. 8.50 కోట్లు 👉రాహుల్ తెవాటియా- భారత్ రూ. 4 కోట్లు 👉షారుఖ్ ఖాన్ భారత్- రూ. 4 కోట్లు 👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుఢిల్లీ క్యాపిటల్స్ 👉అక్షర్ పటేల్- భారత్- రూ. 16.50 కోట్లు 👉కుల్దీప్ యాదవ్- భారత్ రూ. 13.25 కోట్లు 👉ట్రిస్టన్ స్టబ్స్- దక్షిణాఫ్రికా రూ. 10 కోట్లు 👉అభిషేక్ పొరెల్- భారత్ రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు లక్నో సూపర్ జెయింట్స్ 👉నికోలస్ పూరన్- వెస్టిండీస్- రూ. 21 కోట్లు 👉రవి బిష్ణోయ్- భారత్- రూ. 11 కోట్లు 👉మయాంక్ యాదవ్ -భారత్- రూ. 11 కోట్లు 👉మోహసిన్ ఖాన్- భారత్- రూ. 4 కోట్లు 👉ఆయుష్ బదోని- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు సన్‌రైజర్స్ హైదరాబాద్ 👉హెన్రిచ్ క్లాసెన్- దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు 👉ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు 👉అభిషేక్ శర్మ- భారత్- రూ. 14 కోట్లు 👉ట్రావిస్ హెడ్- ఆస్ట్రేలియా- రూ. 14 కోట్లు 👉నితీశ్ రెడ్డి- భారత్- రూ. 6 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుముంబై ఇండియన్స్ 👉జస్ప్రీత్ బుమ్రా- భారత్- రూ. 18 కోట్లు 👉సూర్యకుమార్- భారత్- రూ. 16.35 కోట్లు 👉హార్దిక్ పాండ్యా- భారత్- రూ. 16.35 కోట్లు 👉రోహిత్ శర్మ- భారత్- రూ. 16.30 కోట్లు 👉తిలక్ వర్మ- భారత్- రూ. 8 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుచెన్నై సూపర్ కింగ్స్ 👉రుతురాజ్ గైక్వాడ్- భారత్- రూ. 18 కోట్లు 👉మతీశా పతిరన- శ్రీలంక- రూ. 13 కోట్లు 👉శివమ్ దూబే- భారత్- రూ. 12 కోట్లు 👉రవీంద్ర జడేజా- భారత్- రూ. 18 కోట్లు 👉ధోనీ - భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చుకోల్కతా నైట్ రైడర్స్ 👉రింకూ సింగ్- భారత్- రూ. 13 కోట్లు 👉వరుణ్ చక్రవర్తి- భారత్ -రూ. 12 కోట్లు 👉సునీల్ నరైన్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉ఆండ్రె రసెల్- వెస్టిండీస్- రూ. 12 కోట్లు 👉హర్షిత్ రాణా- భారత్- రూ. 4 కోట్లు 👉రమణ్‌దీప్ సింగ్- భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం లేదురాయల్ చాలెంజర్స్ బెంగళూరు 👉విరాట్ కోహ్లి- భారత్- రూ. 21 కోట్లు 👉రజత్ పాటిదార్- భారత్ -రూ. 11 కోట్లు 👉యశ్ దయాళ్- భారత్- రూ. 5 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చుపంజాబ్ కింగ్స్ 👉శశాంక్ సింగ్- భారత్- రూ. 5.5 కోట్లు 👉ప్రభ్‌సిమ్రన్ సింగ్ -భారత్- రూ. 4 కోట్లు 👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు 👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.చదవండి: BGT 2024: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్ చేసుకుంది. అయితే పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.మళ్లీ సొంతగూటికి?కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు. ఐపీఎల్-2020లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్-2022 సీజన్ ముందు విడిచిపెట్టింది. ఈ క్రమంలో అయ్యర్ స్ధానంలోనే తమ రెగ్యూలర్ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్‌గా రిషబ్‌ను విడిచిపెట్టి అయ్యర్‌ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.చదవండి: IND vs NZ: నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో