Beast
-
విజయ్ సినిమా చూసి థియేటర్లో నిద్రపోయా: హీరోయిన్
తమిళ నటి అదితి బాలన్ శాకుంతలం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానికి సోదరిగా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15 నిమిషాల్లో నిద్రలోకి..విజయ్‌కు నేను పెద్ద అభిమానిని. వింటేజ్ విజయ్ అంటే చాలా ఇష్టం. అతడి అన్ని సినిమాలు చూస్తాను. అన్నింటిలోకెల్లా కిల్లీ నా ఫేవరెట్ మూవీ. ఒకసారేమైందంటే పాండిచ్చేరిలో దాదాపు 20 మంది ఫ్రెండ్స్ కలిసి బీస్ట్ సినిమా చూసేందుకు వెళ్లాం. 15 నిమిషాల వరకు బాగానే చూశాం. నానా హంగామా చేశాం. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. నేనైతే ఏకంగా నిద్రపోయాను. నా ఫ్రెండ్స్ అది కూడా వీడియో తీశారు. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంనిజంగానే బీస్ట్ మూవీ చూస్తుంటే తెలియకుండానే నిద్ర ఆవహించింది అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటివి అయ్యుండి హీరో గురించి ఇలాగే మాట్లాడతావా? అని మండిపడుతున్నారు. కాగా అదితి బాలన్.. అరువి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేస్తోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీస్ట్ ఫ్లాప్.. నాపై కోపంగా ఉందా? అని విజయ్ను అడిగా: జైలర్ డైరెక్టర్
నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'కోలమావు కోకిల' చిత్రంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన శివకార్తికేయన్‌తో 'డాక్టర్' సినిమా తీయగా ఇది ఈజీగా వంద కోట్ల క్లబ్లో చేరింది. తర్వాత విజయ్ హీరోగా 'బీస్ట్' తీశాడు. దీనికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ రూ.200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఇతడు దర్శకత్వం వహించిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.220కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెల్సన్ దిలీప్ కుమార్ 'బీస్ట్' నెగెటివ్ టాక్‌పై స్పందించాడు. 'మేము సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మేమేం చేయలేము. మా కష్టంలో నిజాయితీ ఉంది. కానీ, వర్కవుట్ కాలేదు. సరే, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ కష్టపడతాం మరింత కొత్తగా ప్రయత్నిస్తాం. అయితే బీస్ట్ సినిమా రిజల్ట్ నెగెటివ్ వచ్చినప్పుడు నేను కూడా విజయ్‌తో మాట్లాడాను. నీకేమైనా కోపంగా ఉందా? అని అడిగాను. దానికతడు నాకెందుకు నీపై కోపం ఉంటుంది? అని తిరిగి ప్రశ్నించాడు. అంటే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది కదా అని చెప్పగానే అయ్యో అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడే వచ్చి నేనెందుకు కోప్పడతాను. మనం కష్టపడి సినిమా తీశాం. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. దానికి మనమేం చేయగలం.. నెక్స్ట్ టైం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అయినా మన స్నేహాన్ని సినిమాల వరకే పరిమితం చేస్తున్నావా? అన్నాడు. ఆ మాట నా మనసుకు తాకింది. జైలర్ సినిమా రిలీజయ్యాక విజయ్ నాకు అభినందనలు తెలిపాడు. కంగ్రాచ్యులేషన్స్, నీ సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉంది అని మెసేజ్ చేశాడు' అని చెప్పుకొచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్. చదవండి: బాలీవుడ్ నటి ఇంట విషాదం.. తండ్రి పాడె మోస్తూ -
జైలర్ మూవీ పై పగ తీర్చుకుంటున్న దళపతి ఫ్యాన్స్..
-
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!
ప్రస్తుతం సౌత్‌లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరో అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు పరాజయం కావడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. పూజా స్టాఫ్ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి నిర్మాతలు ఒక్కసారిగా చుక్కలు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్‌తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట. దీంతో ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, తన స్టాఫ్‌కు అయిన ఖర్చులను ఆమె భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజా కూడా దీనిపై నోరు విప్పకుండ ఆ బిల్లును తానే కట్టాలని నిర్ణయించుందని సినీవర్గాల నుంచి సమాచారం. అయితే అ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. మరి దీనిపై పూజా, బీస్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గతంలో పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. -
'అరబిక్ కుతు' పూర్తి వీడియో సాంగ్ చూశారా..
Arabic Kuthu Full Song Released From Beast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా చేసిన ఈ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైంది. అయితే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్ఎక్స్టీలో మే 11 నుంచి 'బీస్ట్' స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే సినిమా మాట ఎలా ఉన్నా ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని దుమ్ములేపింది. తాజాగా 'అరబిక్ కుతు' పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. విజయ్ స్టెప్పులు, పూజా హెగ్డే గ్లామర్‌తో నిండిన ఈ సాంగ్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. (చదవండి: Rajinikanth 169: ‘బీస్ట్’ ఎఫెక్ట్.. రజనీకాంత్‌తో సినిమా క్యాన్సిల్! ) The most expected video song of #HalamithiHabibo is herehttps://t.co/oVRBhkN9yc@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @jonitamusic @selvaraghavan @manojdft @AlwaysJani @Nirmalcuts @KiranDrk #BeastModeON #Beast #ArabicKuthuVideoSong — Sun Pictures (@sunpictures) May 9, 2022 -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. జయేశ్ భాయ్ జోర్దార్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 13న విడుదలకు సిద్దమైంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, రత్నాపాఠక్ షాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకాంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మలు ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు: దీ కశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ ‘బీస్ట్’ మూవీ దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు మే 12: ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్(తెలుగు) మే 13: మోడర్న్ లవ్ ముంబై(హిందీ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మే 13: స్నీకరెల్లా ఆహా మే 13: కుతుకు పత్తు(తమిళం) నెట్‌ఫ్లిక్స్ మే 12: సేవేజ్ బ్యూటీ వెబ్ సిరీస్ -
ఓటీటీలో పాన్ ఇండియా సినిమాల సందడి, మేలో బిగ్ ఫెస్టివల్!
List Of Upcoming OTT Movies In May 2022: మొన్నటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన పాన్ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నుంచి కేజీయఫ్ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్‌లో నయా జోష్ మొదలైంది. ముందుగా మే 11న బీస్ట్ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 13న థియేటర్స్‌లో విడుదలైంది. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు అనేదే బీస్ట్ కథ. ఈ చిత్రానికి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన రావడం, తరువాతి రోజు(ఏప్రిల్ 14) కేజీయఫ్2 విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద బీస్ట్ బోల్తాపడింది. దీంతో అనుకున్నదానికి కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్. మే 11న సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక మే 13న 2022 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ది కశ్మీర్ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి ఇక మే20న మరో పాన్ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఓటీటీలో విడుదల కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. జూన్ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్ ప్రకారం మే 20 నుంచే జీ అండ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. తొలుత ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఈ రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నుంచి మాత్రం సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉందనుంది. ఆర్ఆర్ఆర్తో పాటు మరో పాన్ ఇండియా చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 27న అమెజాన్ ప్రైమ్ లో కేజీయఫ్ 2 విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ నిజంగానే మే 27న ఓటీటీలోకి కేజీయఫ్ 2 వస్తే.. రాకీభాయ్ ఫ్యాన్స్‌కు పండగే. (చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్!) మరో వైపు ఆచార్య ఓటీటీ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్యకు ఆశించినంత ఆదరణలేకపోవడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎర్లీ ప్రీమియర్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య ప్రొడ్యూసర్స్ తో 18 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండు ఓటీటీల్లోకి బీస్ట్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. బీస్ట్ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా వచ్చే బుధవారం(మే 11) నుంచి ఎప్పుడైనా ఓటీటీలో చూసేయొచ్చు. Can you feel the POWER💥TERROR💥FIRE💥BECAUSE BEAST ARRIVES ON NETFLIX ON MAY 11 💪 in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi. pic.twitter.com/7M5uuvlnsA — Netflix India (@NetflixIndia) May 4, 2022 Watch the latest blockbuster #Beast starring #ThalapathyVijay on Sun NXT from May 11 onwards#BeastOnSunNXT #BeastModeON #PoojaHegde @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @KiranDrk @anbariv @valentino_suren pic.twitter.com/Z3jZGsIIiC — SUN NXT (@sunnxt) May 3, 2022 చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో పరుగెత్తుతూ కనిపించిన ఆలియా.. ఆ జానర్లో ఉన్న ఒకే ఒక్క తెలుగు హీరో శ్రీ విష్ణు – రాజమౌళి -
Rajinikanth 169: ‘బీస్ట్’ ఎఫెక్ట్.. రజనీకాంత్‌తో సినిమా క్యాన్సిల్!
నెల్సన్ దిలీప్ కుమార్.. ‘బీస్ట్’ విడుదలకు ముందు అతను ఓ స్టార్ డైరెక్టర్. యంగ్ టాలెంట్‌కు ప్రతిరూపం. అతని మేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిశాయి. కానీ ‘బీస్ట్’ విడుదల తర్వాత పొగిడిన నోళ్లే తిడుతున్నాయి. అతను స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి పనికిరాడని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ అయితే నెల్సన్‌పై గుర్రుగా ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమ హీరోకు బీస్ట్ లాంటి ప్లాప్ అందించాడని ఫైర్ అవుతున్నారు. కోలమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాలను అంతబాగా తీసి బీస్ట్ ను మాత్రం వరస్ట్ గా తీసాడని స్వయంగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. (చదవండి: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు ఏ హీరో డేట్స్ ఇవ్వడం లేదు!) ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన కారణంగా రజనీకాంత్ తో చేయాల్సిన నెల్సన్ సినిమాకు బ్రేక్ పడిందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీస్ట్ రిలీజ్ కు ముందుకే రజనీకాంత్ నెలన్స్ ను పిలిచి తన కొత్త చిత్రం దర్శకత్వం వహించాల్సిందిగా కోరాడు. బీస్ట్ నిర్మించిన సన్ పిక్చర్స్ వెంటనే వీరి కాంబినేషన్ లో సినిమా కూడా ఎనౌన్స్ చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. అసలే కోలీవుడ్ కు బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు తలైవా.ఈ సమయంలో బీస్ట్ డైరెక్టర్ తో సినిమా అంటే.. ఆయన అభిమానులే భయపడుతున్నారు. మరోవైపు రజనీకాంత్ సన్నిహితులు మాత్రం నెల్సన్ దర్శకత్వంలో సూపర్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ఇంత నెగిటివిటీని, ఇంత ప్రెజర్ ను తట్టుకుని నెల్సన్ సూపర్ స్టార్ తో సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు అనేది ఇఫ్పుడు హాట్ టాపిక్ మారింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బీస్ట్ సినిమాలో స్క్రీన్‌ప్లే ఏమైనా బాగుందా?: విజయ్ తండ్రి అసహనం
తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఏప్రిల్13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మీద అసహనం వ్యక్తం చేశాడు. బీస్ట్ మంచి కలెక్షన్లు రాబడుతుందేమో కానీ స్క్రీన్‌ప్లేలో అసలు మ్యాజిక్ మిస్సయిందని చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌తో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 'అరబిక్ కుతు సాంగ్‌ను డైహార్డ్ ఫ్యాన్స్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో నేనూ అలాగే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్ కేవలం విజయ్ స్టార్డమ్ మీదే నమ్మకం పెట్టుకుని నడిచినట్లు ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్ ఉండాలి. కానీ సినిమాలో అదెక్కడా కనిపించనే లేదు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్ ఏం చేస్తారు? వారు ఎలా ప్రవర్తిస్తారు? అనేది లోతుగా తెలుసుకుని సినిమాను తెరకెక్కించాల్సింది. బీస్ట్ సినిమా సక్సెస్‌పై అనుమానించాల్సిన అవసరమే లేదు. సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, హీరో.. వీళ్ల వల్లే బీస్ట్ సక్సెస్ అయింది అని తెలిపాడు. కానీ విజయానికి కారణమైనవారి జాబితాలో డైరెక్టర్ నెల్సన్ పేరును ప్రస్తావించలేదు. కాగా సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. చదవండి: స్టార్ హీరోలతో స్టెప్పులేయించిన బాబా భాస్కర్ 'తెలుగు వారి హిందీ దర్శకుడు' తాతినేని చివరి సినిమా ఏదంటే? -
'బీస్ట్' ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు ?.. వచ్చేది ఆరోజే !
Vijay Beast Movie OTT Release Date Confirmed: కరోనా కాలం, లాక్డౌన్ తర్వాత సినిమాలు థియేటర్లలో పాటు ఓటీటీల్లో కూడా ఎప్పుడు రిలీజవుతాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిన్న, పెద్ద హీరోలు, సినిమాలు అంటూ ఎలాంటి బేధం లేకుండా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం బీస్ట్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. కళానిధి మారన్ నిర్మాతగ వ్యవహించిన 'బీస్ట్' ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓటీటీ అప్డేట్ వచ్చింది. మే రెండో వారంలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ మూవీ ప్రొడక్షన్ హౌజ్ సన్ టీవీ నెట్‌వర్క్‌కు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఓటీటీలో 'బీస్ట్' తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది. ఇక బీస్ట్ హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ప్రస్తుత సమాచారం ప్రకారం 'బీస్ట్' మే 13న అన్ని భాషల్లో ఓటీటీలో సందడి చేయనుందని తెలుస్తోంది. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ ఎలా ఉందంటే.. -
సాక్షి ఆడియన్స్ పోల్.. 'బీస్ట్'పై ప్రేక్షకుల రివ్యూ
Audience Review On Vijay Beast Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన విలక్షణమైన నటనతో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా 'ఇళయదళపతి' అని పిలుచుకుంటారు. సందేశాత్మకంగా, వైవిధ్యంతో ఉన్న భిన్నమైన సినిమాలు చేస్తుంటాడు విజయ్. అందుకే విజయ్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో సైతం అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే వాళ్లందరికి పండగే. ఈసారి భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న రిలీజైంది విజయ్ 'బీస్ట్' మూవీ. 'కోకోకోకిల', 'వరుణ్ డాక్టర్' వంటి చిత్రాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, అరబిక్ కుతు సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో 'బీస్ట్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'బీస్ట్' వీక్షకులను ఎంతమేరకు మెప్పించిందో 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూ ఏంటో తెలుసుకుందామా ! -
‘బీస్ట్’మూవీ రివ్యూ
-
బంపర్ ఆఫర్, బీస్ట్ మూవీ చూసిన వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితం!
Chennai Theatres Offered Free Of Cost Petrol To FDFS Tickets: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బీస్ట్ మూవీ బుధవారం(ఏప్రిల్ 13) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు విడుదల అనగా చెన్నై వారం నుంచి బీస్ట్ మూవీ సందడి మొదలైంది. ప్రతి థియేటర్ ముందు విజయ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఈ రోజు ఉదయం నుంచే థియేటర్ల వర్ద విజయ్ ఫ్యాన్స్ భారీ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాల అభిషేఖాలు, బాణా సంచాలు పెలుస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. చదవండి: బీస్ట్ బాగోలేదట, థియేటర్‌కు నిప్పంటించిన ఫ్యాన్స్! ఈ నేపథ్యంలో బీస్ట్ మూవీ చూసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఫస్ట్‌షో చూసిన వారికి విరుద్ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికి వారు ఓ కండిషన్ కూడా పెట్టారు. ఎఫ్డీఎఫ్ఎస్(ఫస్ట్ డే ఫస్ట్ షో) కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా ఈ థియేటర్లో ఫస్ట్ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు. చదవండి: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి సందడి షురూ! విశేషాలెన్నో! ఇక్కడ ఒక ఎఫ్డీఎఫ్ఎస్ టికెట్ ధర రూ. 500 ఉండగా మిగతా థియటర్లో రూ. 400 నుంచి రూ. 300లుగా ఉంది. మరోవైపు చెన్నైలోని పలు చోట్లు విజయ్ ఫ్యాన్స్ సైతం ప్రేక్షకులకు లీటర్ ప్రెట్రోల్ను ఉచితంగా ఇస్తున్నారు. మక్కళ్ ఇయ్యక్కం తరపున అభిమానులంతా భీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులు లీటర్ ప్రెట్రోల్ను ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే బీస్ట్ మూవీ చూసేందుకు ఒన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే సందడి చేసింది. ఈ మూవీలోని అరబిక్ కుత్తు పాట ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. -
‘బీస్ట్’మూవీ రివ్యూ
టైటిల్ : బీస్ట్ జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్ , విటివి గణేశ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్ సంగీతం : అనిరుధ్ ఎడిటింగ్: ఆర్.నిర్మల్ సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస విడుదల తేది : ఏప్రిల్ 13, 2022 విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే.. వైవిధ్యం కచ్చితంగా ఉంటుందని సినీ అభిమానులు అంచనా వేస్తారు. అందుకు తగ్గట్టే.. విజయ్ విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయినా.. ఆయన ప్రతి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి మార్కెటింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘బీస్ట్’ కూడా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో నేడు(ఏప్రిల్ 13) విడుదలైంది. ‘కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాలతో కోలీవుడ్‌లో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ‘భీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘బీస్ట్’ని ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. ‘బీస్ట్’ కథేంటంటే.. వీర రాఘవన్ అలియాస్ వీర(విజయ్) భారత ‘రా’ ఏజెంట్. ఏ సీక్రెట్ ఆపరేషన్ని అయినా ఈజీగా చేసే సత్తా ఉన్నోడు. ఓ సారి రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉగ్రవాదుల అధినేత ఉమర్ ఫరూఖ్‌ని పట్టుకునేందుకు ఓ ఆపరేషన్ చేపడతాడు. అది విజయవంతం అయినప్పటికీ.. చిన్న పొరపాటు కారణంగా ఓ చిన్నారి మృతి చెందుతుంది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన వీర.. వృత్తిని వదిలేసి చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడ అనుకోకుండా ప్రీతి(పూజాహెగ్డే)తో పరిచయం ఏర్పడుతుంది. ఓ సారి ఆమెతో కలిసి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్కి వెళ్తాడు. అదే సమయంలో ఆ మాల్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. తమ లీడర్ ఉమర్ ఫరూఖ్‌ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఆ సమయంలో ఉమర్ ఫరూఖ్‌ని పట్టుకున్న రా ఏజెంట్ వీర ఏం చేశాడు? ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ రాఘవన్)తో వీర కుదుర్చుకున్న డీల్ ఏంటి? టెర్రరిస్టుల హైజాక్‌కి కేంద్ర హోంశాఖ మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? దాన్ని వీర ఎలా బయటపెట్టాడు? చివరకు టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న 150 మంది ప్రజలను ఒక్కడే ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... దాదాపు 190 కోట్ల రూపాయల బడ్జెట్, విజయ్ లాంటి స్టార్ హీరో, పూజా హెగ్డే లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్.. నెంబర్ వన్ టెక్నీషియన్స్ ..ఇలాంటి టీమ్ దొరికితే ఏ దర్శకుడైనా కథను ఓ రేంజ్లో సమకూర్చుకుంటాడు. నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం చాలా సింపుల్, రొటీన్ స్టోరీని ఎంచుకోవడం నిజంగా విచిత్రమే. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు? ఇదే బీస్ట్ కథ. ఇంతకు మించి కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. సినిమా అంతా మాల్ చుట్టే తిరుగుతుంది. విజయ్‌ది వన్‌మ్యాన్ షో. పోనీ అతని ప్రత్యర్థులు అంటే ఉగ్రవాదులు అయినా క్రూరంగా వ్యవహరిస్తారా? అంటే అదీ లేదు. తమ సభ్యులు చనిపోతుంటే కూడా ప్రజలకు ఎలాంటి హానీ కలిగించకపోవడం మరో విచిత్రం. విజయ్ ఒక్కడితోనే యాక్షన్ సీన్స్ చేయిస్తే చాలు.. ప్రత్యర్థులు ఎలా ఉన్నా పర్లేదు అనుకున్నాడేమో దర్శకుడు. పైగా సీరియస్ సిచ్యుయేషన్‌లో కామెడీ సీన్స్ చొప్పించాడు. అది అక్కడక్కడ వర్కౌట్ అయినా.. కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆసక్తిగా అనిపించదు. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే కనిపెట్టగలడు. క్లైమాక్స్ కూడా చాలా రోటీన్. సినిమాలో హీరో కొట్టే ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే..‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్తదేమి కాదు. పోకిరిలో మహేశ్ బాబు నోట ఆ డైలాగ్ ఎప్పుడో విన్నారు. ఇప్పుడు విజయ్ చెప్తే అంతగా.. ఇంప్రెస్ కాలేరు. ఇక ఈ సినిమాలో లాజిక్ల జోలికి అసలే వెళ్లొద్దు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో మాజీ రా ఏజెంట్ అయిన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాదులపై దాడి చేసి, ఉమర్ ఫరూఖ్‌ని తీసుకురావడం.. ఏ యాంగిల్లో ఆలోచించినా.. లాజిక్ కనిపించదు. ప్రతి సీన్లో విజయ్ స్టైలిష్‌గా కనిపించడం, యాక్షన్ సీన్లో చెలరేగిపోవడం సినిమాకు కలిసొచ్చింది. అలాగే సెల్వరాఘవన్ విటివి గణేశ్ బేస్ వాయిస్‌తో చెప్పే పంచ్‌లు డైలాగులు, కామెడీ కొంతమేర ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. రా ఏజెంట్ వీర రాఘవన్ పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. యాక్షన్స్ సీన్స్‌లో అయితే చెలరేగిపోయాడు. తెరపై చాలా స్టైలిష్‌గా కనిపించాడు. కథనంతా తన భుజాన వేసుకొని ముందుకు నడిపించాడు. తనను తెరపై ఎలా చూస్తే అభిమానులు ఆనందపడతారో అలానే కనిపించాడు. 'అరబిక్ కుత్తు’ పాటలో డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రీతిగా పూజా హెగ్డే పర్వాలేదు. అయితే ఆమె పాత్రకు కొంచెం కూడా ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ఏదో ఉందా ..అంటే ఉంది అన్నట్లుగా తెరపై అలా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ అధికారి అల్తాఫ్ హుస్సేన్‌గా సెల్వ రాఘవన్ మంచి నటనను కనబరిచాడు. ఆయన వేసే సెటైరికల్ పంచ్‌లు నవ్వులు పూయిస్తాయి. విటివి గణేశ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ మూవీకి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. ‘అరబిక్ కుత్తు’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్స్‌లో ఈ సాంగ్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్.నిర్మల్ ఎడిటింగ్ పర్వాలేదు. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
బీస్ట్ బాగోలేదట, థియేటర్‌కు నిప్పంటించిన ఫ్యాన్స్!
పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే అభిమానుల అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. సినిమా అదిరిందంటే పాలాభిషేకాలు, బాగోలేదంటే పోస్టర్లు చించడాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దు మీరి ప్రవర్తించారు. నోటికి కాకుండా ఏకంగా చేతికి పని చెప్పారు. బీస్ట్ నచ్చకపోవడంతో థియేటర్‌కే నిప్పంటించారు. తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం (ఏప్రిల్ 13న) రిలీజైంది. అయితే సినిమాకు పొద్దుటినుంచే నెగెటివ్ టాక్ స్టార్ట్ అయింది. సినిమా రంజుగా లేదంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్తే చివరికి నిరాశతో వెనుదిరిగి రావాల్సి వస్తోందంటూ దిగులుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని మండిపడుతున్నారు కొందరు నెటిజన్లు. Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster pic.twitter.com/P5X9tbhQLx — 🔥 Ajith Kumar🔥 (@Anythingf4AJITH) April 13, 2022 చదవండి: విజయ్ ‘బీస్ట్’ మూవీ టాక్ ఎలా ఉందంటే.. విజయ్ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, నేనెంత?: హీరో -
బీస్ట్ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 13)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ విడుదలైన తర్వాత కోలివుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా ‘బీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్..భారత్ తరపు ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. ఓ షాపింగ్ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి, ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించారనేదే ఈ మూవీ కథ. రా ఏజెంట్‌గా విజయ్ అద్భుతంగా నటించాడనేది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. విజయ్ అభిమానులకు కావాల్సినంత యాక్షన్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రం తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో ‘బీస్ట్’ టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం ‘రా’ టైటిల్‌తో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #Beast Overall a Decent Action Comedy Entertainer! A good 1st half followed by an average 2nd half. The film is a perfect blend of comedy and action. On the flipside, the 2nd half feels dragged at parts especially last 20 minutes Will be a Hit at the Box Office 👍 Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) April 13, 2022 ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందని, విజయ్ తనదైన కామెడీతో నవ్వించాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిన అరబిక్ కుత్తు సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఈలలు వేయిస్తుందట. #Beast - Good first half excluding interval sequences.. Second half falls flat and medicore.. Only saviour @actorvijay and @anirudhofficial ... Comedy works though.. 👍👍 — Venkat.. (@lazyguy_2020) April 13, 2022 విజయ్ తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడని, ‘రా’ ఏజెంట్ వీర రాఘవన్ పాత్రలో ఒదిగిపోయాడని చెబుతున్నారు. కామెడీ, డాన్స్, నేపథ్య సంగీతం చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. అయితే స్క్రీన్‌ప్లే అంతగా వర్కౌట్ కాలేదట. కథని సీరియస్‌గా గానీ, కామెడీగా కానీ ముందుకు తీసుకెళ్లకుండా గజీబిజీగా తెరకెక్కించాడని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కథ కూడా రొటీన్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు. #Beast - Thalapathy is stylish, energetic & settled act. VTV Ganesh scores well among d huge cast. Songs, BGM, Camera work, Dance gud. Outdated plot, Comedy scenes r enjoyable at parts. No logics. Not so interesting screenplay by Nelson. Neither Serious nor comedy. DISAPPOINTED! — paari (@paripichai) April 13, 2022 #Beast first half slow very slow very very slow but steady in somewhat matters the most in the end. Lot of logical questions need to be answered in the second half. #Valimai️ first half thousand times better than this one. #BeastReview — Rajen De Vijay (@RDVijay45) April 13, 2022 #Beast 👍🔥 4 out of 5 Perfect mix of comedy and action. Exactly what we expect from Nelson! #BeastModeON #BeastMovie — Jagruk Bollywood (@AskJagruk) April 13, 2022 #Beast Review : “Nelson Disappoints” 👉Rating : 2/5 ⭐️ ⭐️ Positives: 👉#ThalapathyVijay 👉Comedy 👉First Half Negatives: 👉No Proper Story & Execution 👉Screenplay 👉Poor Direction 👉Weak Climax#BeastMovie #BeastFDFS #BeastModeON — nature love (@hfyijjgffgyyuu) April 13, 2022 #Beast - #Anirudh music and camera is only good. Strictly for #Thalapathy fans. Ave Movie Bring back Atlee na🥲#BeastModeON#BeastMovie Rating : 2.5/5#BeastFDFS — Suriya Fans Rage (@4006Akash) April 13, 2022 #Beast Below average content which banks more on nelson’s usp rather than heroic stuff..Comedy worked out in parts.. — Ravi (@ravi_437) April 13, 2022 #BEAST Honest Review Thalapathy One Man show💥 Full n full Thalapathy movie💯 First half - Pure mass 🔥 Second half -Verithanam 💥 Especially interval 🥵🔥@anirudhofficial 💯🥁🔥@Nelsondilpkumar pakka Fan boy sambavam💯 Family audience 💜👍 pic.twitter.com/xMaYjo34zz — 🍫𝙉𝙖𝙫𝙚𝙚𝙣 𝙑𝙟💜ᵛᶠᶜ (@Naveen___Vj) April 13, 2022 -
విజయ్ ‘బీస్ట్’కు తెలుగులో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్.. అన్ని కోట్లా?
కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌కి టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. ‘తుపాకి’ తర్వాత తన ప్రతి సినిమా తెలుగులో విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ నెపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘బీస్ట్’ విడుదలకు ముందే తెలుగులో భారీ బిజినెస్‌ని జరుపుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఈ మూవీ దాదాపు 10 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాలో రూ.3.5కోట్ల బిజినెస్ చేసిందట. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4.40 కోట్లు, సీడెడ్‌లో రూ.2.1 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. దాదాపు 505 థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ 10.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. విజయ్ గత చత్రం ‘మాస్టర్’కు తెలుగులో రూ.4 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఏకంగా రూ. 6 కోట్లు వరకు విజయ్ మార్కెట్ పెరగడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. ఇక బీస్ట్ మూవీ విషయానికొస్తే.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. -
పొలిటికల్ ఎంట్రీపై విజయ్‌పై హాట్ కామెంట్స్..
సాక్షి, చెన్నై: సినిమాల్లో దళపతిగా ఉన్న తాను తలైవా (నాయకుడి)గా అవతరించడం అనేది కాలం చేతుల్లోనే ఉందని సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ పయనాన్ని కాలంతో పాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు. సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీస్ట్ చిత్రం విడుదల వేళ విజయ్ తన స్వరాన్ని మార్చారు. రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న తెర మీదకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్లో ఆదివారం రాత్రి చిట్‌చాట్ కార్యక్రమం జరిగింది. బీస్ట్ చిత్ర దర్శకుడు నెల్సన్ సంధించిన ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా, సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి. తనదైన శైలిలో.. నెల్సన్ ప్రశ్నలకు తన దైన స్టైల్లో విజయ్ సమాధానాలు ఇచ్చారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్ వివరించారు. అలాగే తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్‌తో ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని, దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంజయ్ తెర మీద కనిపిస్తాడా...? లేదా కెమెరా వెనుక ఉంటాడా..? అనేది తెలియదని, తాను అందరిలాగే ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే, అవకాశాలు వస్తున్న మాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ పయనం గురించి గుర్తు చేస్తూ, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలి నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ అభిమానుల గెలుపును గుర్తు చేస్తూ విల్సన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇందుకు విజయ్ సమాధానం ఇస్తూ, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. అలాగే, దళపతిగా ఉన్న తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని, అభిమానులే నిర్ణయిస్తారని ముగించడం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
అందుకే మీడియాకు దూరంగా ఉంటా: హీరో విజయ్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అయితే తన తాజా చిత్రం 'బీస్ట్' ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా 'బీస్ట్' చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో తెలిపాడు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారన్నాడు. అయితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. ఆ వ్యాఖ్యలు చేసింది అసలు నేనేనా అనుకునేలా నా మాటలు మార్చి రాసారన్నాడు. ఇక దాంతో నువ్విలా మాట్లాడావంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ తన సన్నిహితులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు. అలా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాయడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని తెలిపాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ బయటి వాళ్లందరికీ తెలియవు. వారందరూ ఆ వార్తలను నమ్ముతారు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్
Upcoming Movies Web Series Theatres And OTT April 3rd Week: 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', గని తర్వాత మరో రెండు భారీ సినిమాలు ప్రేక్షకులను, మూవీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి కన్నడకు, మరొకటి కోలీవుడ్‌కు చెందిన సినిమాలైన తెలుగులోనూ వాటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఆ సినిమాల్లోని హీరోలే. అవును. వారే 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్ ఒకరైతే, తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ మరొకరు. వీరిద్దరు నటించిన చిత్రాలు ఈ వారంలో థియేటర్లలో హల్చల్ చేయనున్నాయి. మరీ ఆ చిత్రాలేంటీ.. విడుదల ఎప్పుడు అనే విషయాలతోపాటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూద్దాం. 1. బీస్ట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా విభిన్న కథలతో అలరిస్తున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుత్తు' సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 13న ఈ మూవీ విడుదల కానుంది. 2. కేజీఎఫ్: చాప్టర్ 2 'కేజీఎఫ్ 1'లో గరుడను రాకీ భాయ్ చంపే విధానం ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యపరిచింది. అయితే గరుడ మరణాంతరం ఏం జరిగింది ? గరుడ తర్వాత కేజీఎఫ్‌ను దక్కించుకునేందుకు అధీర ఏం చేశాడు ? అనే ప్రశ్నలతో 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షుకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ ఉత్కఠకు తెరదింపుతూ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్ 1' దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే రోజున బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'జెర్సీ' విడుదల కావాల్సింది. కానీ 'కేజీఎఫ్ 2', 'బీస్ట్' చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు 1. ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్ 14 (సోనిలివ్) 2. గాలివాన (వెబ్ సిరీస్): ఏప్రిల్ 14 (జీ5) 3. దహనం: ఏప్రిల్ 14 (ఎంఎక్స్ ప్లేయర్) 4. బ్లడ్ మేరీ: ఏప్రిల్ 15 (ఆహా) చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. -
రష్మిక కాదు.. పూజానే మా ఫస్ట్ ఛాయిస్ : దిల్‌రాజు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులో ‘బీస్ట్’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు పూజా హెగ్డేపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పూజా హెగ్డే లక్కీ గర్ల్‌గా మారిందని, టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీలో కూడా ముందు పూజానే హీరోయిన్గా అనుకున్నామని దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయని అన్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం సహా విజయ్- పూజా కాంబినేషన్ వెంటవెంటనే రిపీట్ అవుతుందని తీసుకోలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఛాన్స్ రష్మిక మందన్నా కొట్టేసింది. -
యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్
Shahid Kapoor Jersey Postponed New Release Date Here: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదలకు ఇంకా 3 రోజులు ఉందనగా మరోసారి జెర్సీని పోస్ట్‌పోన్ చేస్తూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చదవండి: స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్ ఇదే వారం పాన్ ఇండియా చిత్రాలు కేజీఎఫ్ 2, బీస్ట్‌లు విడుదల అవుతోన్న నేపథ్యంలో జెర్సీ టీం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెర్సీ పోస్ట్‌పోన్ అయిందని, ఏప్రిల్ 22కు ఈ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్ అదర్శ్ ట్వీట్ చేశాడు. ‘ఎక్స్‌క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ మరో వారానికి వాయిదా పడింది. నిన్న(ఆదివారం) రాత్రి మేకర్స్ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 ఏప్రిల్ 22న జెర్సీ థియేటర్లోకి రానుంది’ అంటూ తరణ్ ఆదర్శ్ రాసుకొచ్చాడు. కాగా క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... BREAKING NEWS... #Jersey POSTPONED by one week... Will arrive in *cinemas* on 22 April 2022... The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV — taran adarsh (@taran_adarsh) April 11, 2022 చదవండి: RK Roja: కామెడీ షో జబర్దస్త్‌కు ఆర్కే రోజా గుడ్‌బై -
స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్‌పై పూజా కామెంట్స్
Pooja Hegde Interesting Comments On Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా ‘బీస్ట్’. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పూజా హెగ్డే మాట్లాడుతూ విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: కామెడీ షో జబర్దస్త్‌కు ఆర్కే రోజా గుడ్‌బై ‘ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే విజయ్‌తో కలిసి నటించాలనేది నా కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ మూవీలోని అరబిక్ కుతు నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది’ అని పేర్కొంది. అనంతరం పూజా, విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘విజయ్ చాలా కూల్ పర్సన్. ఫ్రెండ్లీగా ఉంటారు. పని పట్ల ఆయన చూపించే అంకితభావం, కష్టపడేతత్త్వం నాలో స్ఫూర్తిని నింపాయి. ఇక నా బర్త్‌డే రోజున విజయ్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. చదవండి: యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు! నాకు తెలియకుండా బర్త్‌డే పార్టీకి ప్లాన్ చేశారు. బీస్ట్ మూవీ సెట్లో ప్రత్యేకంగా పార్టీ అరెంజ్ చేశారు. అది చూసి షాక్ అయ్యా. ఒక పెద్ద హీరో అయ్యిండి నా బర్త్‌డే పార్టీని నిర్వహించడం నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. విజయ్ ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. నిజంగా ఆ బర్త్‌డే నాకు చాలా స్పెషల్. ఈ మధురజ్ఞాపకాన్ని ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ పూజా చెప్పుకొచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులోనూ అదే పేరుతో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. -
పూజా హెగ్డేపై దిల్‌రాజు కామెంట్స్.. షాక్ అయిన ఆడియెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించారు. తెలుగులో ‘బీస్ట్’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిర్మాత దిల్‌రాజు పూజాహెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ పూజా..మన కాజా, అడుగుపెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశాడుడు. దీంతో ఆడియెన్స్ అరుపులతో హోరెత్తించారు. అంతటితో ఆగకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఇవ్వమని కూడా స్టేజ్‌మీదే అడిగేశారు.చివరగా పూజాను పాన్ ఇండియా హీరోయిన్ అంటూ ప్రశంసించాడు. -
సందడిగా 'బీస్ట్' ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
విజయ్ స్టార్ హీరోలా కాదు.. ప్రేక్షకునిగా ఆలోచిస్తారు: ‘దిల్’ రాజు
‘‘విజయ్‌గారు ‘బీస్ట్’ వంటి వైవిధ్యమైన కథని ఎంచుకోవడం గ్రేట్. కథ వినేటప్పుడు ఆయన ఓ స్టార్ హీరోలా కాకుండా ప్రేక్షకునిగా ఆలోచిస్తారు. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆలోచించి కథలు ఎంచుకుంటారు.. అలాంటి చిత్రమే ‘బీస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ తమిళ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘బీస్ట్’ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ.. ‘‘నెల్సన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ‘కొలమావు కోకిల, డాక్టర్’ వంటి వైవిధ్యమైన చిత్రాలు తీసిన ఆయన మూడో సినిమాకే విజయ్‌గారితో పనిచేసే అవకాశం అందుకోవడం గ్రేట్. విజయ్‌గారి 66వ సినిమాని మా బ్యానర్లో నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. పూజా హెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అవడం హ్యాపీ’’ అన్నారు. ‘‘బీస్ట్’ సినిమా ట్రైలర్స్, మ్యూజిక్‌కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన వస్తోంది’’ అన్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘‘కత్తి, మాస్టర్’ చిత్రాల తర్వాత విజయ్ సార్‌తో నేను చేసిన హాట్రిక్ ఫిల్మ్ ‘బీస్ట్’. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు వారి కోసం టాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా’’ అని సంగీత దర్శకుడు అనిరు«ధ్ అన్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ– ‘‘తమిళ సినిమాతో నా ప్రయాణం ప్రారంభమైనా ఇన్నేళ్లకు ‘బీస్ట్’ లాంటి సినిమాతో మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా ‘బీస్ట్’. విజయ్ సార్ ఓ స్టార్ హీరో అయినా చాలా కష్టపడతారు.. అదే నాలో స్ఫూర్తి నింపింది’’ అన్నారు. -
‘బీస్ట్’ సినిమా రిలీజ్.. ఫ్యాన్స్‌ని హెచ్చరించిన విజయ్
సాక్షి, చెన్నై: బీస్ట్ చిత్ర విడుదల నేపథ్యంలో అభిమానుల దూకుడుకు కళ్లెం వేయడానికి సినీ నటుడు దళపతి విజయ్ సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలను, అధికారుల్ని విమర్శించే విధంగా, అవహేళన చేసే రీతిలో వ్యవహరించ వద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన చిత్రాలన్నీ వివాదాల నడుమ తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందుగా చోటు చేసుకునే పరిణామాలే దీనికి ప్రధాన కారణం అవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తమిళ కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందుగా ఈనెల 13వ తేదీ విజయ్ నటించిన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఈ చిత్రం విడుదల వివాదాలకు తావ్వివకుండా దళపతి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. ఏడాది తర్వాత తన చిత్రం విడుదల అవుతుండటంతో అభిమానుల దూకుడు, వివాదాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గురువారం విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ అభిమాన సంఘాల్ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. చట్ట పరంగా చర్యలు.. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని ... ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని హెచ్చరించారు. మీడియాలో కానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీమ్స్ వంటి అవహేళన చేసే ధోరణుల్ని అనుసరించ వద్దు అని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గతంలో కఠినంగా వ్యవహరించి, అభిమాన సంఘం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ఈసారి ఆజ్ఞలను అతిక్రమించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. -
రాఖీభాయ్‌తో పోరుకు విజయ్, షాహిద్ సై.. విజయం ఎవరిది?
ఏప్రిల్ 14న తుపాన్ వేగంతో వస్తున్నాడు రాఖీభాయ్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ అభిమానులను అదే రోజు పలకరించనున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పడం.. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ఉండడంతో కేజీఎఫ్2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే రాఖీభాయ్‌ని ఢీ కొట్టేందుకు ఇటు విజయ్, అటు షాహిద్ కపూర్ రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ 2 విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే ఏప్రిల్ 13న విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ థియేటర్స్‌లోకి రాబోతుంది. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలోని ‘అరబిక్ కత్త’సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా బంపర్ హిట్ కొట్టడంతో రాఖీభాయ్ వసూళ్లకు బీస్ట్ పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు బాలీవుడ్ లో రాఖీభాయ్ స్పీడ్ కు గట్టిగానే బ్రేకులు వేస్తానంటున్నాడు షాహిద్ కపూర్. గతంలో నాని నటించిన సూపర్ హిట్ ఫిల్మ్, అతని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్.తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఇంకాస్త బెటర్ గా, బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించే విధంగా తెరకెక్కించాడు.రీసెంట్ గా రిలీజైన న్యూ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేస్తోంది. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్న రోజే(ఏప్రిల్ 14) జెర్సీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది.కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కనిపిస్తున్న సినిమా కావడంతో, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ కు ఈ చిత్రం కూడా కొంత కోత పెట్టే అవకాశాలు బాగానే ఉన్నాయి. చదవండి: ఆన్సర్ షీట్లో 'పుష్ప' డైలాగ్స్ రాసిన టెన్త్ స్టూడెంట్ విజయ్ బీస్ట్ గా మారినా,షాహిద్ కపూర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినా తాను సృష్టించే విధ్వంసం ముందు తక్కువే అంటున్నాడు రాఖీభాయ్.ప్రశాంత్ నీల్ లాంటి మెగా మేకర్ అండతో,కనివిని ఎరుగని వయలెన్స్ తో కేజీఎఫ్ 2 ఆడియెన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తోందనే నమ్మకంగా ఉన్నాడు హీరో యశ్. పైగా అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తుండటం తనకు అదనపు బలంగా చెప్పుకొస్తున్నాడు రాఖీభాయ్. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. -
విజయ్ బీస్ట్ మూవీపై షారుక్ ట్వీట్, దళపతి ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?
Shah Rukh Khan Interesting Comments On Vijay: దళపతి విజయ్, బీస్ట్ మూవీపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల హిందీలో విడుదలైన బీస్ట్ ట్రైలర్ చూసిన షారుక్ విజయ్‌పై ప్రశంసలు కురిపించాడు. మేరకు ఆయన ట్వీట్ చేస్తూ విజయ్‌కి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో బీస్ట్ ట్రైలర్‌ను కూడా షేర్ చేశాడు. ఈ సందర్బంగా ‘నేను డైరెక్టర్ అట్లీతో కూర్చున్నాను. నాలాగే ఆయన కూడా విజయ్‌కి పెద్ద ఫ్యాన్. బీస్ట్ ట్రైలర్ చూశాను. అద్భుతంగా ఉంది. బీస్ట్ మూవీ టీం అందరికి శుభాకాంక్షలు’ అంటూ కింగ్ ఖాన్ రాసుకొచ్చాడు. చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా ఇక అది చూసిన విజయ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ స్వయంగా బీస్ట్ ట్రైలర్‌ను ప్రశంసించడం గర్వంగా ఉంది. అలాగే ఆయన విజయ్‌కు ఫ్యాన్ అంటూ చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది. ఒక అద్భుతమైన ట్రైలర్‌కు కింగ్ ఖాన్ నుంచి జన్యున్ ప్రశంసలు. అలాగే భవిష్యత్తులో షారుక్, విజయ్ కలిసి ఓ సినిమా తీస్తారని ఆశిస్తున్నాం’ అంటూ విజయ్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేశారు. చదవండి: తమిళనాడులో కూడా విజయ్ 'బీస్ట్'కు చుక్కెదురు! మరో నెటిజన్ ‘ఇది షారుక్, విజయ్ ఫ్యాన్స్ అంత్యంత సంతోషించే విషయం. థ్యాంక్యూ కింగ్ ఖాన్. త్వరలోనే షారుక్, విజయ్‌లు కలిసి ఓ మూవీ చేయాలని ఆశిస్తున్నాము. దీనిని ఆలోచించండి అంటూ డైరెక్టర్స్ అట్లీ, జగదీశ్ బ్లిస్లను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా బీస్ట్ ట్రైలర్ అన్ని భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్, విజయ్ స్టెమినా చూస్తుంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ మూవీ ఏప్రిల్ 13న దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. Sitting with @Atlee_dir who is as big a fan of @actorvijay as I am. Wishing the best for beast to the whole team…trailer looks meaner…. Leaner… stronger!!https://t.co/dV0LUkh4fI — Shah Rukh Khan (@iamsrk) April 5, 2022 -
తమిళనాడులో కూడా విజయ్ 'బీస్ట్'కు చుక్కెదురు!
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇటీవలే ఈ సినిమాని కువైట్‌లో నిషేధించారు. ఇక తాజాగా చిత్రంలో ఇస్లాంవాదులను తీవ్రవాదులుగా చిత్రీకరించారంటూ తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా 'బీస్ట్'ను తమిళనాడులో సైతం నిషేధించాలంటూ డిమాండ్ చేశాడు. ఈ మేరకు ముస్తఫా తమిళనాడు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. ఇలా విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే బీస్ట్' చిత్రం పై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదలపై అంతటా ఆసక్తి నెలకొంది. -
విజయ్ 'బీస్ట్' రిలీజ్‌కు అక్కడ నిషేధం.. కారణం ఇదే..
Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కానీ ఈ ట్రైలర్‌తో 'బీస్ట్' చిక్కుల్లో పడ్డాడు. ఈ ట్రైలర్లో షాపింగ్ మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడనేది చూపించారు. దాదాపు ఈ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నందున గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ 'బీస్ట్'ను నిషేధించింది. అరబ్ దేశాలను విలన్లుగా, టెర్రరిస్టులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశాలు అంగీకరించవని తెలిసిందే. టెర్రరిస్టులు ఎక్కువగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని టాక్ ఉంది. అయితే యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్భ్ దేశాల్లో 'బీస్ట్' రిలీజ్‌కు మార్గం సుగమం అయింది. -
'అరబిక్ కుతు' తెలుగు వెర్షన్ వచ్చేసింది.. విన్నారా..!
Telugu Version Of Arabic Kuthu Halamithi Habibo From Beast Released: తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన 'అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ ఎంత క్రేజ్ సంపాందించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో 260 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు తాజాగా ఈ సాంగ్‌కు తెలుగు వెర్షన్ వచ్చింది. ఇప్పటివరకు తమిళ్లో అదరగొట్టిన ఈ పాట తెలుగులోనూ అలరించనుంది. కోలీవుడ్ సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. ఈ తెలుగు వెర్షన్‌కు శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించగా తమిళ వెర్షన్లో హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. భాష, ఆ పదాలు అర్థం కాకపోయినా పదాల క్యాచీగా ఉండటం, విజయ్, పూజా హెగ్డె స్టెప్పులు, సంగీతానికి ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
ఉగాది ఫీస్ట్ ఇచ్చిన బీస్ట్, ఆకట్టుకుంటున్న ట్రైలర్
Vijay Beast Trailer Launched : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. డాక్టర్ ఫేం నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజా అప్డేట్ వచ్చేసింది. ఉగాది రోజు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఏప్రిల్ 2(ఉగాది) కొద్ది సేపటి క్రితం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. చదవండి: సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్.. కాగా సౌత్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో బీస్ట్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో మేకర్స్ నేడు విడుదల చేశారు. దీంతో ట్రైలర్ విడులైన కొద్ది క్షణాల్లోనే వేలల్లో వ్యూస్ రాబట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 13న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్ సీన్స్ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అనే డైలాగ్ ఈళలు వేయించాలే ఉంది. ఇక ఇందులో విజయ్ లుక్, ఫైట్ సీన్స్ మరో లెవల్లో ఉన్నాయి. 2.56 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. చెప్పాలంటే ఈ ఉగాది సందర్భంగా విజయ్ ఫ్యాన్స్‌కు బీస్ట్ ట్రైలర్ మంచి ఫీస్ట్ ఇచ్చేలా కనిపిస్తుంది. కాగా యంగ్ మ్యూజిక్ సన్సెషన్ అనిరుద్ రవిచంద్రన్ స్వరాలను అందిస్తున్న ఈ మూవీలోని పాటలకు వీపరితమైన రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల విడుదలైన అరబిక్ కుత్తు పాట సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
'కేజీఎఫ్ 2' Vs 'బీస్ట్'.. సినీ విశ్లేషకులు ఏమన్నారంటే ?
Yash KGF 2 Vijay Beast Trade Experts About Collections: ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన భారీ బడ్జెట్, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. తాజాగా ఈ ఏప్రిల్‌లో సినిమా ఆడియెన్స్‌ను మరో రెండు భారీ సినిమాలు కనువిందు చేయనున్నాయి. ఒకటి సెన్సేషనల్ హిట్ సాధించిన 'కేజీఎఫ్' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 2'. ఇక మరొ మూవీ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'బీస్ట్'. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న 'కేజీఎఫ్ 2' ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన 'బీస్ట్' ఒకరోజు ముందుగా ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తొలుత ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సింది. కానీ విజయ్ తన 'బీస్ట్' సినిమాను ఒక రోజు ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. అయితే ఈ రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఎలా ఉండనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళనాడు థియేటర్, మల్టీఫ్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపూర్ ఎం సుబ్రమణ్యం మాట్లాడుతూ 'ఏప్రిల్ మధ్యలో రెండు భారీ బడ్జెట్ చిత్రాల విడుదల కారణంగా థియేటర్ యజమానులు రెండు సినిమాలకు స్క్రీన్ల సంఖ్యను తగ్గించవలసి వస్తుంది. కనీసం ఒక వారం గ్యాప్‌తో విడుదల చేసుంటే అటు నిర్మాతలకు, ఇటు థియేటర్ యజమానులకు మరింత లాభదాయకంగా ఉండేది.' అని తెలిపారు. 'ఎప్పుడైనా సరే ఒక పెద్ద సినిమా విడుదలనే అనువైనది. అయితే వివిధ భాషల్లో రిలీజవుతున్న కేజీఎఫ్ 2 మాతృక భాష కన్నడ, బీస్ట్ మాతృక భాష తమిళం కాబట్టి పెద్ద సమస్య ఏం ఉండకపోవచ్చు.' అని ట్రేడ్ నిపుణుడు రమేష్ బాలా పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 2 పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. అయితే కేజీఎఫ్ 2, బీస్ట్ రిలీజ్ అంచనాలు పూర్తిగా భిన్నమైనవి. బీస్ట్ అనేది ప్రాథమికంగా ఒక తమిళ చిత్రం. ఇది ఇతర భాషల్లోకి డబ్ చేయబడింది. కానీ ఉత్తరాదిన విజయ్‌కు మంచి స్టార్డమ్ ఉంది. 'తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ కారణంగా బీస్ట్దే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. అలాగే కన్నడ సినిమా అయినా కేజీఎఫ్ 1కు నార్త్తోలోనూ ఘన విజయం సాధించిన చరిత్ర ఉన్నందున కేజీఎఫ్ 2 కూడా మంచి పోటీ ఇవ్వనుందనే చెప్పవచ్చు.' అని బాలా తెలిపారు. 'గతంలో ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తన పోటీదారులతో ఎలా పోరాడిందో పక్కనపెడితే కేజీఎఫ్ 2, బీస్ట్ ఒకేసారి విడుదల కానున్నాయి. వారాంతంలో ఈ సినిమాలకు మంచి బిజినెస్ ఉండనుంది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ వీకెండ్. ఎందుకంటే తమిళ నూతన సంవత్సరం, విషు పండుగతో సహా 5 రోజులు సెలవులు ఉన్నాయి. అలాగే ఇది వేసవి ప్రారంభం. మాకు తెలిసి వేసవిలో 5-10% ప్రేక్షకులు అదనంగా థియేటర్లకు వస్తారు. పండుగ రోజులు ఉండటం వల్ల రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించే అవాకశం ఉంది. ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా ముఖ్యమైనదని, ఈ కరోనా పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నందున సినిమా మరింత వాయిదా వేసి ఇతర తేదిల్లో విడుదల చేయడం ఉత్తమం.' అని పరిశ్రమ, ట్రేడ్ నిపుణుడు శ్రీధర్ పిళ్లై తెలిపారు. చదవండి: 'బీస్ట్' నుంచి మరో సాంగ్.. 'జాలీ ఓ జింఖానా' అంటూ విజయ్ సింగింగ్ -
'కేజీఎఫ్ 2'కి పోటీగా విజయ్ 'బీస్ట్'..!
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఇక తాజాగా 'బీస్ట్' విడుదల తేది గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే 200 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరనుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14న మరో పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ 2' విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. కాగా 'కెజియఫ్' చిత్రం పాన్ ఇండియా లెవల్లో పెద్ద హిట్ కావడంతో 'కేజీఎఫ్ 2' పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. మార్చి 27న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల ఓ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే ఒకేసారి ఇద్దరు పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. There is always a thunder before the storm!#KGFChapter2 Trailer on March 27th at 6:40 pm. Stay Tuned: https://t.co/grk8SQMTJe@Thenameisyash @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @bhuvangowda84 @RaviBasrur #KGF2TrailerOnMar27 pic.twitter.com/CYcWx9vK1j — Prashanth Neel (@prashanth_neel) March 3, 2022 -
విజయ్ 'బీస్ట్'గా వచ్చేది అప్పుడే..
Vijay Pooja Hegde Starrer Beast Movie Release Date Out: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బీస్ట్ మూవీ విడుదల తేది ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా పంచుకుంది. ఈ పోస్టర్లో విజయ్ గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుతు, జాలీ ఓ జింఖానా పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. అరబిక్ కుతు సాంగ్ అయితే యూట్యూబ్‌లో ఏకంగా 210 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకోగా జాలీ ఓ జింఖానా సాంగ్ 20 మిలియన్ వ్యూస్ సాధించింది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ 'బీస్ట్'కు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మాతగా బాధ్యతలు చెపట్టగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కేజీయఫ్ 2' మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరీ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. #BeastFromApril13@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #Beast pic.twitter.com/htH6dTPX2q — Sun Pictures (@sunpictures) March 22, 2022 -
100M వ్యూస్‌తో దుమ్మురేపుతున్న అరబిక్ కుతు సాంగ్
Beast Movie Of Vijay And Pooja Hegde Arabic Kuthu Song: తమిళ స్టార్ విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. ఇటీవలె ఈ మూవీ నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 48గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఈ పాట ఇప్పుడు ఏకంగా 100మిలియన్ వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. రిలీజైన 4రోజుల్లోనే 50మిలియన్ వ్యూస్, వారం రోజుల్లోనే 70 మిలియన్ వ్యూస్, తాజాగా 12 రోజుల్లో 100మిలియన్ వ్యూస్‌ని దాటింది. అంతేకాకుండా 3.7మిలియన్స్‌కి పైగా లైక్స్ సాధించడం విశేషం. ఎక్కడ చూసిన ఈ అరబిక్ కుతు సాంగ్ ట్యూన్ మోరుమ్రోగుతోంది. హలమితి హబిబో అంటూ కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్యూన్ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు. తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించారు. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. Celebrating #HalamithiHabibo’s sensational records 🔥@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @Siva_Kartikeyan @hegdepooja @jonitamusic @manojdft @AlwaysJani @Nirmalcuts #Beast #ArabicKuthu #BeastFirstSingle pic.twitter.com/yn6VqpjA1J — Sun Pictures (@sunpictures) February 26, 2022 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు, గ్లోబల్ టాప్ సాంగ్‌గా గుర్తింపు
Arabic Kuthu Song Records: తలపతి విజయ్, పూజా హెగ్డేల తాజా చిత్రం బీస్ట్. ఇటీవల మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు సంచలన సృష్టించింది. విడుదలైన గంటల వ్యవధిలోనే మిలియన్‌పైగా వ్యూస్ తెచ్చుకుంది. దీంతో అరబిక్ కుతు పాన్ వరల్డ్ సాంగ్‌గా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో విజయ్, పూజలు వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలెబ్రెటీల వరకు ఈ పాటకు కాలు కదుపుతున్నారు. ఇక ఇన్‌స్టాలో హలమితి హబిబో అంటూ రీల్స్ చేస్తున్నారు. ఇటీవల సమంత సైతం ఈ పాటకు రిల్ చేసి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. చదవండి: రష్మిక మొత్తం ఆస్తి, ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రెజెంట్ 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేందుకు రెడీగా ఉన్న అరబిక్ కుత్తు.. 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇక ఈ పాటకు టాంజెనియన్ టిక్ టాకర్ కిలి పాల్ కూడా స్టేప్పులేశాడు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ అరబిక్ కుతు సాంగ్ ట్యూన్ మోరుమ్రోగుతోంది. ఒక్క పాటతో సెన్సేషనల్‌గా మారిన విజయ్ బీస్ట్ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 14న సినిమా థియేటర్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చదవండి: విజయ్ పిరికివాడు: అనన్య షాకింగ్ కామెంట్స్ -
ఎయిర్ పోర్ట్‌లో ‘అరబిక్ కుతు’ పాటకు సమంత డ్యాన్స్, పూజా హెగ్డే స్పందన
Samantha Ruth Prabhu Dances To Arabic Kuthu Song: తలపతి విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు పాట నెట్టింట సంచలన సృష్టించింది. విడుదలైన కాసేపటికే మిలియన్‌పైగా వ్యూస్ తెచ్చుకుని యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట లిరిక్స్యే వినిపిస్తున్నాయి. సామాన్య జనం నుంచి సెలబ్రెటీల వరకు ఈ పాటకు రీల్ చేస్తూ స్టెప్పులేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసింది. షూటింగ్ నేపథ్యంలో ట్రావెల్ చేస్తున్న ఆమె ఎయిరోపోర్ట్‌లో అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఫ్యాన్స్‌తో పంచుకుంది. విరామ సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అరబిక్ కుతు సాంగ్‌కి డ్యాన్స్ చేసి.. ‘రాత్రి పూట ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఈ లిరిక్స్‌కు కాలు కదిపాను’ అంటూ విజయ్, పూజా హెగ్డే, అనిరుద్‌తో పాటు బీస్ట్ మూవీ టింను ట్యాగ్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన పూజ హెగ్డే స్పందిస్తూ.. ‘సామ్.. నువ్వు అద్భుతం. నిజమే, 2022లో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయేమో’ అంటూ పోస్ట్ చేసింది. కాగా ఇటీవల పూజ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడంపై సమంత, చిన్మయి శ్రీపాద, డైరెక్టర్ నందిని రెడ్డి మధ్య నడిచిన ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. పూజ వ్యాఖ్యలపై వాళ్లు సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత పూజ హెగ్డే ట్విట్టర్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Arabic Kuthu: అసలు ఆ పాటను ఎలా రాశాడబ్బా?
Vijay Beast Arabic Kuthu Song Lyricist Details: గంటలో మిలియన్న్నర వ్యూస్.. అంతే రేంజ్లో లైక్స్. సినిమా వాళ్లంటే పడిచచ్చే తమిళ తంబీలు, విజయ్ ఫ్యాన్స్ హోల్‌సేల్‌గా బీస్ట్ ‘అరబిక్ కుతు’ సాంగ్ పాటకి ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విజయ్ స్టైలిష్ స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. బీస్ట్ సినిమా కోసం సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు మాత్రమే కాదు.. పాట రాసిన హీరో శివకార్తికేయన్కే మేజర్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ అభిమానులు. యస్.. టీవీ నటుడి నుంచి కష్టపడి నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఇగో లేని హీరోగా అతనికి పేరుంది. అందుకే అతడంటే కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. మిగతా భాషల్లోనూ అతనికి అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. గేయ రచయితగానూ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య Etharkkum Thunindhavan కోసం ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు బీస్ట్ కోసం అరబిక్ టచ్‌తో అరబిక్ కుతు సాంగ్ అందించాడు. నిజానికి ఈ పాట షార్ట్ టైంలో ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్ ఇచ్చిన అరబిక్ టచ్. ఇందుకోసం తానేమీ అరబిక్‌ను అవపోసన, బట్టీ పట్టలేదని అంటున్నాడు శివకార్తికేయన్. తాజాగా ఓ మీడియా బైట్‌లో మాట్లాడుతూ.. జస్ట్.. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పాడు. అలా అరబిక్ కుతుకు తన పని తేలికయ్యిందని అంటున్నాడు శివకార్తికేయన్. ఇక ఈ సాంగ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సాంగ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్(ఎన్నో అర్థవంతమైన పాటల్ని రాసిన ముత్తుకుమార్.. 2016లో జాండిస్‌తో చనిపోయారు) కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్. దీంతో సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషన్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బీస్ట్.. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ పాడిన అరబిక్ కుతు సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. సాంగ్ హిట్‌ను సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు మీమ్స్ పేజీలు ఈ సాంగ్ లిరిక్స్‌లోని పదాలతో ట్రోలింగ్ చేస్తూ నవ్వులు పంచుతున్నారు. -
ఆ సంచలన దర్శకుడితో రజినీకాంత్
గత కొంత కాలంగా అనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నప్పటకీ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాత్రం సినిమాలు చేయడం ఆపలేదు. అలా ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ మద్య వచ్చిన పెద్దన్న సినిమా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చాలా రోజుల పాటు వాయిదాలు వేస్తూనే చివరికి దాన్ని పూర్తి చేసారు. అయితే ఆ సినిమా తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్నాడు రజినీ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇక సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ వార్తలతో తన అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్ళిపోయారు. అయితే సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే.. త్వరలోనే రజినీకాంత్ తన 169వ చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రజినీ మరో కుర్ర దర్శకుడితో పని చేయబోతున్నట్టు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'బీస్ట్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్‌తో తన తదుపరి సినిమా చేయడానికి సూపర్ స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన 'డాక్టర్' చిత్రంతో ఈ దర్శకుడు బ్లాక్బప్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రజినీకాంత్ గత కొన్నేళ్లుగా జయాపజయాలతో సంబంధం లేకుండా పా రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివ లాంటి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేస్తూ యంగ్ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
విజయ్ ఫ్యాన్స్‌కు శుభవార్త! బీస్ట్ రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆర్నెళ్ల క్రితం రిలీజైంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. బీస్ట్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో వెల్లడించింది. ఈ మేరకు హీరో విజయ్ సరికొత్తగా కనిపిస్తున్న పోస్టర్ వదిలింది. ఇందులో ఏప్రిల్ నెలలో సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఏ తేదీ అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. Happy New Year Nanba ❤ ⁰From team #Beast @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @manojdft @Nirmalcuts @anbariv #BeastFromApril pic.twitter.com/xNYz8kGYwP — Sun Pictures (@sunpictures) December 31, 2021 జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది బీస్ట్. చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
షాకింగ్ : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్..
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జిమ్‌లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్‌లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
విజయ్ ‘బీస్ట్’ మూవీకి గుడ్‌బై చెప్పిన పూజా హెగ్డే
విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బీస్ట్’. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తాజాగా ‘బీస్ట్’ చిత్రంలో విజయ్, పూజా తమ వంతు షూటింగ్ పార్ట్స్‌ను పూర్తి చేశారు. ‘‘బీస్ట్’ సినిమా షూటింగ్ నాకు మంచి ఆనందాన్ని ఇచ్చింది. హాయిగా నవ్వుకుంటూ, హ్యాపీగా షూటింగ్ పూర్తి చేశాం.. నాకైతే షూటింగ్ చేసినన్ని రోజులూ ఏదో వెకేషన్లో ఉన్నట్లే అనిపించింది. హీరో విజయ్ స్టైలిష్ యాక్షన్, దర్శకుడు నెల్సన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ‘బీస్ట్’ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళతాయి’’ అని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
విజయ్‌కి విలన్‌గా ప్రముఖ దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ‘సాని కాయిదమ్’ చిత్రంతో యాక్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ మరో ప్రధాన పాత్రధారి. తాజాగా సెల్వరాఘవన్ ‘బీస్ట్’ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఉపారు. విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘బీస్ట్’ సినిమాలో నటించే కొందరి యాక్టర్స్ పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు. సెల్వరాఘవన్‌తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్ ఫరూకీ, షైన్ టామ్ చాకో, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికాల్లు కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో సెల్వరాఘవన్ విలన్ రోల్ చేయనున్నారని టాక్. ఇక దర్శకుడిగా ‘నానే వరువేన్’, ‘యుగానికి ఒక్కడు 2’ చిత్రాలను సెల్వరాఘవన్ తెరకెక్కించనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
షాక్ : కార్తీని గుర్తుపట్టలేకపోయిన హీరో విజయ్
‘బీస్ట్’ సెట్స్‌కు వెళ్లారు ‘సర్దార్’. హీరో విజయ్, దర్శకుడు నెల్సన్ కుమార్ కాంబినేషన్లో ‘బీస్ట్’ సినిమా షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్’ సినిమా చిత్రీకరణ జరగుతోంది. పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో వేసిన సెట్లో సర్దార్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా షాట్ గ్యాప్‌లో ‘సర్దార్’ గెటప్‌లోనే ‘బీస్ట్’ సెట్స్‌కి కార్తీ వెళ్లారు. ఆ గెటప్‌లో కార్తీని గుర్తుపట్టలేకపోయారు విజయ్. ఆ తర్వాత విజయ్‌తో కార్తీ మాట్లాడటం మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి, విజయ్ షాక్ అయ్యారట. కాసేపు హీరోలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారని సమాచారం. -
మిస్టర్ పశువు
రావణాసురుడు సీతను బంధించాడు.. రాక్షసుడు! కీచకుడు ద్రౌపదిని వేధించాడు..రాక్షసుడు! ఇంద్రుడు అహల్యను మోసగించాడు.. రాక్షసుడే! వీళ్లంతా పరస్త్రీని వేధించి రాక్షసులయ్యారు. మరి మొగుడే మృగంలా ప్రవర్తిస్తే? ఇఫ్ హి బికమ్స్ ఎ బీస్ట్ ఇన్ ద బెడ్రూమ్? వాడు... మిస్టర్ పశువు! వాడికి... సంకెళ్లు రెడీ!! రాత్రి .. పన్నెండుంపావు. వాక్... వ్వా.... క్...వాంతి చేసుకుంటోంది ప్రణవి. అంతకు ముందు జరిగింది గుర్తొచ్చి పొట్టలోంచి తన్నుకొస్తోంది వికారం. ఉండుండి కక్కుతోంది. మనసులో ఉన్న ఏవగింపూ బయటకు వస్తోంది వాంతి రూపంలో! ఓ పదిహేను నిమిషాలకు కడుపు ఖాళీ అయిపోయింది. కాని మెదడు ఇంకా భారంగానే ఉంది. తల నొప్పి మొదలైంది. మొహం కడుక్కొని టవల్‌తో తుడుచుకుంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు భర్త. ఓ వికృత చేష్ట తర్వాత అలసిపోయిన మృగంలా కనిపించాడు ప్రణవికి.దుఃఖం ఆగట్లేదు. బెడ్ అంచు మీద కూర్చోని టవల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. అసలు నిద్ర పట్టిందో లేదో కూడా తెలియదు! ఆ బాధ, ఆ వికారం, ఆ వాంతులు, ఏవగింపు, జుగుప్స .. ఆ రాత్రే కొత్త కాదు. మొదలూ కాదు. ఆఖరిది కూడా కాదు ప్రణవికి. కొన్నాళ్లే... సంబరం! ప్రణవి, మోహన్ పెళ్లయి పదకొండు నెలలవుతోంది. పెద్దలు కుదిర్చిందే. పెళ్లయిన నెల అంతా సవ్యంగా, నార్మల్‌గా గడిచింది. నిజం చెప్పొద్దూ... మోహన్ లాంటి వ్యక్తి భర్తగా దొరికినందుకు ప్రణవీ మురిసిపోయింది. తమ బంధువుల్లోని ఆడపిల్లల సంసారాలతో తన కాపురాన్ని పోల్చుకొని పొంగిపోయింది. తన అదృష్టాన్ని తలచుకొని తబ్బిబ్బయింది. హనీమూన్ తర్వాత తొలిసారిగా తల్లిగారింటికి వెళ్లిన ప్రణవి మొహంలో ఆనందాన్ని పసిగట్టి ఇంటివాళ్లూ సంతోషపడ్డారు. కాని ఈ సంబరమంతా ఒక్క నెలరోజులే సాగింది! ఊహించని ఉన్మాదం మోహన్లోని అసలు మనిషి బయటకు వచ్చాడు. రాత్రవుతోందంటే చాలు ప్రణవికి చెమటలు పట్టేవి. వెన్నులోంచి వణుకొచ్చేది. అసలే ఆ పిల్లకు సెక్సువల్ లైఫ్‌కి సంబంధించిన నాలెడ్జ్ తక్కువ. పెళ్లికి ముందు దాని గురించి చెప్పినవాళ్లూ లేరు. అమ్మ చెప్పినా.. అమ్మమ్మ చెప్పినా.. మేనత్త చెప్పినా.. నానమ్మ చెప్పినా.. అత్తమామలకు, భర్తకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి.. తల్లిగారింటి మర్యాద ఎలా కాపాడాలి.. అత్తింటి గుట్టు ఎంత చక్కగా గుప్పిట్లో దాచాలనే తప్ప సంసార జీవితం ఎలా ఉంటుంది.. ఎలా ఉండాలి.. ఏది నార్మల్.. ఏది అబ్నార్మల్.. అనే విషయాల గురించి ఊసే లేదు ఎవరి మాటల్లోనూ! అందుకే పది నెలల నుంచి పడకగదిలో భర్త అబ్నార్మల్ ప్రవర్తనను నార్మల్ అనుకునే భరిస్తూ వస్తోంది. తన ఒంటి నిండా భర్త పంటి గాట్లే. ప్రైవేట్ పార్ట్స్ పుండవుతున్నాయి. ఒళ్లు పులిసిపోతోంది. తన నోటిని కూడా అసహ్యం చేస్తున్నాడు. తెల్లవారి అన్నం తినలేకపోతోంది. ఈ పదినెలలలో చాలా బరువు తగ్గింది. ప్రాణం కళ్లలోకి వచ్చింది. అయినా కనికరం చూపట్లేదు భర్త. చివరకు బహిష్టు సమయాల్లోనూ తనను వదలట్లేదు. ఇక తన వల్ల కాదు అనుకుంది. ప్రతి రాత్రీ కంపరం ఎప్పటిలాగే భోజనం ముగించుకొని బెడ్రూమ్లోకి వెళ్లాడు మోహన్. వంటిల్లు సర్దుతూ, గిన్నెలు కడుక్కుంటూ గదిలోకి రావడానికి తాత్సారం చేస్తున్న భార్యను వచ్చేవరకు పిలుస్తూనే ఉన్నాడు. అసహ్యాన్ని, నిస్సహాయతను, బాధను, భయాన్ని పంటిబిగువున పట్టి ఉంచి లోపలికి వెళ్లింది ప్రణవి. మోహన్లోని పర్వర్షన్ ఒళ్లు విరుచుకుంది. ప్రణవిని బొమ్మలా చేసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఉన్మాదాన్ని భరించలేని ప్రణవి అప్పటికప్పుడే భర్తని విడిపించుకుని, ఎప్పుడో సమాచారం సేకరించి పెట్టుకున్న ఓ ఎన్జీవో హోమ్‌కి పరుగున బయల్దేరి వెళ్లింది ఆ చీకట్లోనే! ‘బీస్టియాలిటీ’ని భరించనక్కర్లేదు ప్రణవి భర్త సెక్సువల్ బిహేవియర్ సోడొమీ, ఫెలేషియో కిందకు వస్తుంది. అంటే ఆనల్ సెక్స్, సకింగ్ లేక లికింగ్ ఆఫ్ జెనైటల్స్! ఇలాంటి విపరీతమైన ప్రవర్తనతో చాలామంది మహిళలు శారీరక హింసకు, ఎవర్షన్కు గురవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, కాపురం అంటే అలాగే ఉంటుందేమోనని భరిస్తున్నారు. కాని ఇలాంటి ప్రవర్తన సాధారణం కాదు. సెక్సువల్ పర్వర్టెడ్నెస్, అన్ నేచ్యురల్ సెక్స్. ఇలాంటి అసహజమైన శృంగారాన్ని బీస్టియాలిటీ లేదా బెస్టియాలిటీ అంటారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఇవి నేరాలు కూడా. శారీరక కలయిక అన్నది సహజంగా, సౌకర్యంగా, అనందంగా ఉండాలి. అంతేకాని అసహజంగా, రాక్షసంగా ఉండకూడదు. ఈ ప్రవర్తన మానసిక హింస కిందకు కూడా వస్తుంది. ఇలాంటి బాధలు పడే మహిళలు హిందూ వివాహచట్టం సెక్షన్ 13 (2- జీజీ) ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడే గ్రౌండ్. ప్రణవికి ఈ సెక్షన్ ధైర్యాన్ని ఇచ్చింది. లీగల్ కన్సల్టెంట్ సహాయం, భరోసాతో విడాకులకు కేస్ వేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరింది. అయితే ఇక్కడ ప్రణవి విషయంలో ఇంకో అన్యాయం కూడా జరిగింది. ప్రణవితో కంటే ముందే మోహన్‌కు ఇంకో అమ్మాయితో పెళ్లయింది. మోహన్ పైశాచిక ప్రవృత్తిని భరించలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రణవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె విడాకుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ రహస్యం బయటపడింది. ప్రణవికి విడాకులు మంజూరయ్యాయి. ఇవన్నీ ఆలస్యంగా తెలుసుకున్నందుకు, తమ కూతురి బాధను అర్థం చేసుకోనందుకు పశ్చాత్తాపపడ్డారు ప్రణవి తల్లిదండ్రులు. ఇప్పుడు ప్రణవి నిర్ణయాన్ని ఆమోదించడమే కాక ఆమెకు కొండంత అండగా నిలబడ్డారు ఆ పేరెంట్స్! ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com నశించిన సహనం ‘మీ ఆయన ఆగడాల గురించి మీ ఇంట్లో వాళ్లకెప్పుడూ చెప్పలేదా?’ గృహహింస ఎదుర్కొంటున్న స్త్రీల కోసం, ఒంటరి స్త్రీల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలో ఉన్న లీగల్ కన్సల్టెంట్ అడిగింది ప్రణవిని. ‘చెప్పాను మేడమ్. పెళ్లయిన ఆర్నెల్లకే. ముందు అందరూ అలాగే ఉంటారేమో అనుకొని సహించా. ఆ పిచ్చి రోజురోజుకూ ఎక్కువవుతుంటే అమ్మకు చెప్పా. అర్థం చేసుకోలేదు. తప్పించుకుంటున్నానుకొని నాకే సుద్దులు చెప్పి తిరిగి పంపించింది. అలా పంపిన రెండునెలలకే వచ్చి మళ్లీ చెప్పా. ఈసారి నానమ్మ, అమ్మ కలిసి క్లాస్ తీసుకున్నారు. ‘దొంగవేషాలు వేయకు.. పొద్దస్తమానం కాపురం వదులుకొని పుట్టింటికి వస్తే ఏ మొగుడు ఊరుకుంటాడు? ఇంకో దాని వలలో పడతాడు జాగ్రత్త. వెళ్లు.. వెళ్లి మీ ఆయన చెప్పినట్టు నడుచుకో’ అని మళ్లీ పంపించారు. ఇక చెప్పడం అనవసరమని భరించడం మొదలుపెట్టా. కానీ.. ఈమధ్య భరించే స్థితీ పోయింది మేడమ్’ అంటూ చేతుల్లో మొహం దాచుకొని గుండెపగిలేలా ఏడుస్తోంది ప్రణవి. తన చెయిర్లోంచి లేచి ఎదురుగా ఉన్న ప్రణవి దగ్గరికి వచ్చి ఆమె భుజాలు పట్టుకుంది లీగల్ కన్సల్టెంట్ అనునయంగా.. అభయంగా! - సరస్వతి రమ -
జుకర్‌బర్గ్ ఇంట్లో 'స్టార్‌వార్స్' దండు!
త్వరలోనే విడుదలకానున్న 'స్టార్ వార్స్' సిరీస్‌లోని ఏడో ఛాప్టర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫేస్బుక్ స్థాపకుడు జుకర్‌బర్గ్ కూడా 'స్టార్ వార్స్' అభిమానే. అందుకే తన అభిమానాన్ని వినూత్నరీతిలో ఆవిష్కరిస్తూ ఆయన తన ఇంట్లోనే 'సార్వార్స్' దళాన్ని ఆవిష్కరించారు. తన ముద్దుల కూతురు 'మాక్స్'ను 'స్టార్‌వార్స్' యోధురాలి దుస్తుల్లో అలంకరించారు జుక్. ఆ చిన్నారి వద్ద ఓ చిన్ని గ్రీన్‌లైట్ ఖడ్గాన్ని, స్టార్‌వార్స్ చిహ్నాలైన డార్త్ వాడర్ మాస్క్, చ్యుబాకా మస్క్ ఉంచారు. దీంతో చిన్నపాటి యుద్ధయోధురాలిగా తయారైన 'మాక్స్'.. తండ్రి ఫొటోలు తీస్తుండగా గంభీరంగా పోజు ఇచ్చింది. 'మాక్స్' యే కాదు తన బుజ్జికుక్క 'బీస్ట్'ను కూడా స్టార్‌వార్స్ యోధుడిగా మార్చారు ఆయన. దానికి ఓ రెడ్‌లైట్ ఖడ్గాన్ని ఇచ్చారు. దీంతో 'బీస్ట్' కూడా ఓ సూపర్ పోజు ఇచ్చింది. అన్నట్టు 'బీస్ట్'కు రెండు చికెన్ లెగ్‌పీసులు విందుగా ఇస్తేనే ఇందుకు ఒప్పుకున్నదట. మొత్తానికి జుకర్‌బర్గ్ ఇంట్లో రెడీ అయిన ఈ 'స్టార్‌వార్స్' దండు ఫేస్బుక్ వాసులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
బీస్ట్.. ‘ఫేస్బుక్’ హీరో..
రాజ వైభోగం అంటే ఈ శునకానిదే! ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ అల్లారుముద్దుగా పెంచుకునే ఈ బొచ్చుకుక్కకు అభిమానుల సంఖ్య లక్షల సంఖ్యలోనే. కచ్చితంగా చెప్పాలంటే హంగేరియన్ జాతికి చెందిన ఈ బుజ్జి ‘బీస్ట్’కు 19,13,857 మంది ఫేస్బుక్లో ‘లైక్స్’ కొట్టారు. ఇది ఒక్కోసారి ఒక్కో అవతారంలో కనిపిస్తుంది. ఒకసారి పొట్టి గొర్రె పిల్లలా మరోసారి పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లా అన్నమాట. ఇది పరుగు పెట్టిందంటే రేసుగుర్రం దీని ముందు బలాదూరే. అన్నట్లు మేతకు వెళ్లిన గొర్రెల మందకు కూడా ఇది కాపలా కాస్తుంది. ఇక జుకెర్‌బర్గ్ మాట జవదాటదు. ‘డాడీ’ ఆజ్ఞ ఇచ్చేదాకా కళ్ల ముందు మాంసం ముక్కలు ఊరిస్తున్నా కట్టుదాటదు. అప్పుడప్పుడు ఫేస్బుక్ ఉద్యోగులతో కలసి కంప్యూటర్ ముందు తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఓసారి ఏమైందో తెలుసా...? దీని అల్లరి చేష్టలు భరించలేక జుకెర్‌బర్గ్ ఓ బాత్రూమ్లో బంధించాడు. మరి బీస్ట్ ఊరుకుందా? నోటికి అందినవల్లా కొరికి పారేసి తమ జాతి సత్తా చూపించింది.