bhagwant mann
-
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.లెప్టోస్పిరోసిస్ అంటే ..?లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. లక్షణాలు..ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. వ్యాధి తీవ్రత..దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. నిర్థారించడం కష్టమైతే..ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.ఎందువల్ల అంటే..కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలిసారిగా..1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
సీఎం భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్కు గడ్కరీ లేఖ రాశారు.ఒకవేళ పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. -
వినేశ్ ఫోగట్ అనర్హత: ‘కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు సెలవుల మీద వెళ్లారా?’
చంఢీఘఢ్: ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అనర్హత వేటుపై అభిమానులు, రాజకీయ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చూస్తూ.. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వినేశ్ ఫోగట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చర్కీ దాద్రిలోని రెజ్లర్ ఇంటికి వెళ్లిన సీఎం మాన్.. అక్కడ వినేశ్ ఫోగట్ మామ మహావీర్ ఫోగట్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification in the Paris Olympics, Punjab CM Bhagwant Mann says"...I don't want to connect with this politics. But please tell me have the members of the Indian Olympic Association gone there on holiday? Indian Olympic Association… pic.twitter.com/Pw7NSW4WUJ— ANI (@ANI) August 7, 2024‘రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల పని. ఇప్పడు ఆమెపై అనర్హత వేటుపడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించదా? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అభ్యంతరం తెలపలేదు. ఇంత పెద్ద స్థాయి ఈవెంట్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి సెలవుల కోసం వెళ్లారా? ’అంటూ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. కానీ, ఆమెపై అనర్హత వేటు పడిన వెంటనే ‘ఎక్స్’లో ట్వీట్ పెట్టారు’విమర్శలు చేశారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 మరోవైపు.. వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. ‘వినేశ్‌కు న్యాయం చేయాలి’అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కేవలం ట్వీట్ చేయటం సరికాదు.. ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రీడలు, క్రీడాకారులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. -
Olympics: ప్యారిస్ వెళ్లేందుకు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ
ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు పారిస్ వెళ్లేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతుగా మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ఫ్రాన్స్ రాజధానిని సందర్శించాల్సి ఉంది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్యారిస్ వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించింది. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది.కాగా సీఎం భగవంత్ మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ప్యారిస్ పర్యటనకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. సీఎం, తన భార్య డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ మాన్, ఇద్దరు సహాయకులు, మరో అయిదుగురు భద్రతా అధికారులు, సీఎంఓ నుంచి 10 మంది సీనియర్ అధికారుల ప్యారిస్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆలస్యంగా అనుమతి కోరడం వల్ల భద్రతా కారణాలతో తిరస్కరించినట్లు ఎమ్ఈఏ పేర్కొంది.భారత్ నుంచి ఒలింపిక్ కంటెంజెంట్లో పంజాబ్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. హాకీ జట్టులో పది మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి చెందినవారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ప్యారిస్ వెళ్లడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయడంలో మా అధికారులు ఆలస్యం చేశారు, అయితే హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్‌లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.అయితే తనకు అనుమతి నిరాకరించడంపై మాన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ సమాఖ్య విధానంపై బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. 2022లోనూ సింగపూర్ వెళ్లేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రస్తావించారు. గత ఏడాది గోపాల్ రాయ్‌కి కూడా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని, ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రతిదానికీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. -
ఓటు వేశాక పంజాబ్ సీఎం భార్య ఏమన్నారంటే..
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. -
‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారు. కాబట్టే జూన్ 4న కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఆప్ భాగస్వామ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటవని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆప్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవంత్ మాన్ ప్రసంగించారు. కేజ్రీవాల్ నియంతృత్వ శత్రువు. ప్రతి చోటా నేను ఇదే మాట చెప్పాను. చెబుతున్నాను. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచన. మీరు ఆ వ్యక్తిని అరెస్టు చేయొచ్చు. కానీ ఆలోచనను కాదు అని ప్రశంసల వర్షం కురపించారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన ఢిల్లీ ఆప్ కార్యకర్తలకు భగవంత్ మాన్ కృతజ్ఞతలు తెలిపారు. సమయం లేదు మిత్రమా‘కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12 గంటలకు బదులుగా మాకు 18 గంటలు పని ఉంది. మొదటి మూడు రౌండ్ల సర్వేలు మోదీ 400 సీట్లు గెలవలేరని తేలింది. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే ఎన్నికల్లో గెలవలేరని’ ఆయన ఆరోపించారు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలోక్రికెట్ పరిభాషలో క్రేజీవాల్‌ను ఉద్దేశిస్తూ ‘కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారని’అన్నారు. అదే ఉత్సాహంతో పంజాబ్‌లో ఆప్ హవా కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తుడిచిపెట్టుకుపోయి. మొత్తం 13 లోక్‌సభ సీట్లు ఆప్కే దక్కుతాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. -
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదని.. ఆయన ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. వ్యక్తిని అర్టెస్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్నిఅరెస్ట్ చేయలేరని అన్నారు. ఢిల్లీలో ఆప్ నిర్వహించిన బహిరంగ సభలో భగవంత్ సింగ్ పాల్గొని మాట్లాడారు.‘‘అరవింద్ కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత ప్రజాదారణ కలిగి ఉన్న నేత. ఆయన విషయంలో ఏం జరగిందో మొత్తం దేశం చూసింది. దేశంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదు.. ఒక సిద్ధాంతం. వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్ని అరెస్ట్ చేయలేరు. మే 25న బీజేపీ పని అయిపోతుంది. పంజాబ్‌లో 13 స్థానాల్లో ఆప్ గెలుస్తుంది. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి పోలిటికల్ పిచ్‌కు వచ్చారు. ఆయన అవుట్ కాలేదు. కేవలం రిటైర్డ్ హర్ట్ అయ్యారు. అదే రాజకీయ క్షేత్రంలోకి మళ్లీ తిరిగి వచ్చారు’’ అని భగవంత్ సింగ్ అన్నారు.ఢిలీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ నిన్న(శుక్రవారం) మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యత బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
ఎంపీ టికెట్ నిరాకరణ.. ఆప్‌లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దల్వీందర్ సింగ్ గోల్డీ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.దల్వీందర్ కాంగ్రెస్ నుంచి సంగ్రూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్ సింగ్‌కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్‌పాల్ సింగ్ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్ సింగ్ పార్టీ చేరికపై భగవంత్ మాన్ మాట్లాడుతూ.. నా తమ్మడు, కష్టపని చేసే యువకుడు గోల్డీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ స్థానం నుంచి భగవంత్ మాన్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గోల్డీ పరాజయం పాలయ్యారు. ఆప్‌లో చేరిన అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించాని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ, రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. -
మరోసారి కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ సీఎం
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.గతంలో ఓ సారి కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. -
పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ..
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' కలిశారు. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్‌తో కలిసి వచ్చిన భగవంత్.. కేజ్రీవాల్‌తో అరగంట సేపు కలిసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థులకు అందించే కనీస సౌకర్యాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి అందించడంలేదని ఆయన ఆరోపించారు. భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పాఠక్ చెప్పారు. జైలులో ఉన్నా.. ఆయన ఢిల్లీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం నుంచి సమస్యలపై చర్చించడానికి ఇద్దరు మంత్రులను పిలుస్తానని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన కోరినట్లు సందీప్ పాఠక్ అన్నారు. #WATCH | Delhi: After meeting AAP convener and Delhi CM Arvind Kejriwal in Tihar Jail, Punjab CM Bhagwant Mann says, "It was very sad to see that he isn't getting the facilities which are available even to hardcore criminals. What's his fault? You're treating him as if you have… https://t.co/HA4Xu1a1lE pic.twitter.com/HkihsLbPMK — ANI (@ANI) April 15, 2024 -
ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం
జలంధర్: లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం జలంధర్‌లోని స్థానిక హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రి బల్కర్ సింగ్, నకోదర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రమణ్ అరోరా, జలంధర్ లోక్‌సభ సీటు పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ముగ్గురు ఇన్ఛార్జ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 14న జలంధర్ అభ్యర్థిగా తమ సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను ప్రకటించింది. అయితే, రింకూ మార్చి 27న పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రింకూతో పాటు ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. గత ఏడాది జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో రింకు 58,691 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన దోబా ప్రాంతంలో కీలక దళిత నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే దళితుల ప్రాబల్యం ఉన్న జలంధర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని సీఎం భగవంత్ మాన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. "జలంధర్ లోక్‌సభ స్థానంపై దృష్టి అంతా ఉంది. పార్టీ ఎలాగైనా ఈ సీటును మళ్లీ గెలవాలనుకుంటోంది" అని సీఎం మాన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. -
మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం.. కుమార్తె ఫోటో షేర్ చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్‌కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb — Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024 -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్‌కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్‌లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్‌కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్‌ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
ఇండియా కూటమికి డబుల్ షాక్!
చంఢీగర్: ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది. పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఒంటరిగానే పోటీ.. ఇండియా కూటమికి సీఎం మమత షాక్ ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇదీ చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ ఆప్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కొనసాగడం సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్,ఆప్ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు రెండు పార్టీల మధ్య దూరం పెంచుతున్నాయి. కాంగ్రెస్ అనేది ఒక చరిత్రగా మారిందని పంజాబ్ సీఎం, ఆప్ అగ్రనేత భగవంత్‌మాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ తీహార్ జైలులో పుట్టింది. ఆ పార్టీకి చెందిన సగం మంది నేతలు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆప్ నమ్మదగిన పార్టీ కాదు. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు పొత్తు రాజకీయాలు అర్థం కావు. ఆప్ ఇండియా కూటమిలో ఉందో లేదో వాళ్లకే తెలియాలి. కూటమిలో ఉండాలంటే ఆప్ ఇతర పార్టీలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సోమవారం ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ పార్టీ గురించి తల్లులు పిల్లలకు కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ఉండేదని పిల్లలకు కథ చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్, ఆప్‌పై విరుచుకుపడుతోంది. ఇదీచదవండి..కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు -
సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్
బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్జిందర్ అన్నారు. ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘాటాల విషయంలో పంజాబ్‌పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు. పంజాబ్ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. The real reason for rejection of Punjab Tableau is that it prominently showed pics of Arvind Kejriwal & Bhagwant Mann rather than Mai Bhago Ji or martyrs! Mann Sahab is shamelessly lying; and worst is he has surrendered Punjab’s sovereignty in the feet of Kejriwal. Tussi Ta… pic.twitter.com/qF81TUHOyC — Manjinder Singh Sirsa (@mssirsa) December 29, 2023 ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలకు పంజాబ్ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్ నేత ప్రియాంఖ్ కక్కర్ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తర్ఖండ్లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్‌లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు. చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ.. -
మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..
చండీగఢ్: పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో సోమవారం ఉదయం ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్ సింగ్ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతోపాటు జశ్వంత్ సింగ్, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్ సింగ్ ఆప్‌లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్‌ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్‌కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు -
సీఎం మాన్కు గవర్నర్ ఘాటు లేఖ.. ఆప్ సీరియస్
చండీగఢ్: ఆప్ సర్కార్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్‌లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం భగవంత్ మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్కు పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం మాన్‌ను గవర్నర్ హెచ్చరించారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు. పొలిటికల్ హీట్.. అంతేకాకుండా.. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గవర్నర్ పురోహిత్ లేఖపై ఆప్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పంజాబ్‌కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.. వీలైతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. ఇది కూడా చదవండి: రైలు బోగీలో పేలిన సిలిండర్.. పలువురు మృతి -
పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్‌కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్‌కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి.. కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్‌కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది . -
నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి? 10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్‌లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము. 2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది. मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं? जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है 88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है। नीयत होनी चाहिए काम करने की। —CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4 — AAP (@AamAadmiParty) June 18, 2023 ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా?