Chennai
-
కోటీశ్వరుడిగా గుకేశ్.. ప్రైజ్‌మనీపై స్పందించిన వరల్డ్ చాంపియన్
కఠిన శ్రమ, అంకిత భావం ఉంటే ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని దొమ్మరాజు గుకేశ్ నిరూపించాడు. పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, గుకేశ్ ఈ ఘనత సాధించడంతో అతడి తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారిలది కీలక పాత్ర.కోటీశ్వరుడిగా గుకేశ్ఇక వరల్డ్ చాంపియన్‌గా గుకేశ్ రూ. 11.45 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన విజయంతో జాతి మొత్తాన్ని గర్వపడేలా చేసిన ఈ గ్రాండ్ మాస్టర్‌కు తమిళనాడు ప్రభుత్వం ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుకేశ్ కోటీశ్వరుడైపోయాడు.నా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ఇకపైఈ విషయం గురించి గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రైజ్‌మనీ నాకు ఎంత ముఖ్యమైనదో మాటల్లో చెప్పలేను. అయితే, డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. నిజానికి నేను చెస్ ఆడటం మొదలుపెట్టినపుడు మా కుటుంబం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ స్థాయికి చేర్చడానికి... నా తల్లిదండ్రులు ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు.అయితే, ఇప్పుడు కాస్త మేము సౌకర్యవంతంగా జీవించగలుగుతాం. ఇకపై వాళ్లు దేనికీ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. తనకు తెలిసింది కొంతేనని.. ఇంకా నేర్చుకోవాల్సి ఎంతో ఉందంటూ గుకేశ్.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటానని చెప్పకనే చెప్పాడు.అప్పుడే మా అమ్మకు సంతోషంఇక తన తల్లి తనకు గొప్ప చదరంగ ఆటగాడిగా కంటే.. గొప్ప మనిషిగా గుర్తింపు వచ్చినపుడే ఎక్కువ సంతోషిస్తానని చెప్పిందని ఈ సందర్భంగా గుకేశ్ వెల్లడించాడు. కాగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న నాలుగు రోజుల తర్వాత గుకేశ్ స్వదేశంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సింగపూర్ సిటీ నుంచి అతడు సోమవారం చెన్నైకి చేరుకున్నాడు.పుట్టి పెరిగి ఆటలో ఓనమాలు చేర్చుకున్న గడ్డపై విశ్వ విజేత హోదాలో గుకేశ్‌కు సోమవారం భారీ స్థాయిలో ఘన స్వాగతం లభించింది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ప్రతినిధులు, తమిళనాడు రాష్ట్ర అధికారులతో పాటు అతను చదువుకున్న వేలమ్మాల్ స్కూల్ విద్యార్థులు, వర్ధమాన చెస్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో గుకేశ్‌కు వెల్కమ్ చెప్పారు. అతని ఫోటోలు, ఇతర చెస్ చిత్రాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంలో ఈ యువ చాంపియన్ విమానాశ్రయం నుంచి ముందుగా తన ఇంటికి వెళ్లాడు. ఆపై వేలమ్మాల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. తల్లిదండ్రులు రజనీకాంత్, పద్మాకుమారి అతని వెంట ఉన్నారు. ఇక మంగళవారం గుకేశ్‌కు స్థానిక కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో ప్రత్యేక సన్మానం జరిగే అవకాశం ఉంది. ఇదే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొని ఇప్పటికే ప్రకటించిన రూ.5 కోట్ల బహుమతి పురస్కారాన్ని గుకేశ్‌కు అందించనున్నారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం వల్లే‘నాకు మద్దతు పలికిన అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి సహకారం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వరల్డ్ చాంపియన్‌గా నిలవడం చాలా గొప్పగా ఉంది. భారత ఆటగాడు మరోసారి విశ్వ విజేత కాగలిగాడు. నా ఈ విజయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎంతో ఉంది. గత ఏడాది గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ నిర్వహించి నాకు స్పాన్సర్షిప్ అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు.అక్కడ గెలవడంతో క్యాండిడేట్స్ విజయానికి పునాది పడింది. ఇలాంటి సహకారం ఉంటే రాష్ట్రం నుంచి మరెంతో మంది ఆటగాళ్లు పైస్థాయికి చేరతారు. ఈ రోజు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే కొన్ని రోజులు కలిసి సంబరాలు చేసుకుందాం’ అని గుకేశ్ వ్యాఖ్యానించాడు.ఆయన సహకారం మరువలేనిదితన చాంపియన్‌షిప్ విజయంపై స్కూల్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానిస్తూ... ‘చెస్‌లో విజయం అంటే బాగా ఆడితేనే సరిపోదు. ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దానిని అధిగమించాలి. అందుకే మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ సహకారం తీసుకున్నాను. ఆయనతో కలిసి పని చేయడం నాకు కలిసొచ్చింది’ అని వెల్లడించాడు. కాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన గుకేశ్ తండ్రి కుమారుడి ప్రయాణంలో తోడుండేందుకు తన వృత్తిని త్యాగం చేయగా.. తల్లి పద్మాకుమారి ఉద్యోగం(మైక్రోబయాలజిస్ట్) చేస్తూ కుటుంబాన్ని పోషించారు. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
తమిళనాడు: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పలువురు మృతి
చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారి సహా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. తమిళనాడులోని దిండిగుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మొదట ఆసుపత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అనంతరం, భవనం మొత్తానికి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ టెండర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించగా రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో, ఆసుపత్రిలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా ఏడుగురు మృతిచెందగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన, అస్వస్థతకు గురైన రోగులను 50 అంబులెన్స్‌ల సాయంతో ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.#TamilNadu : #HospitalFireAt least 6 people, including a child and 3 women died and 6 others were injured, after a #fire broke out at a four-story private Hospital in #Dindigul on Thursday night.Reportedly the victims succumbed to suffocation caused by the thick #smoke that… pic.twitter.com/2Iac9Qt5Gh— Surya Reddy (@jsuryareddy) December 12, 2024 -
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
భారత్ తొలి హైపర్‌లూప్ ట్రాక్ సిద్ధం
చెన్నై: భారత రవాణా రంగంలో మరో కలికితురాయి. ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్‌లో 410 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ (410 మీటర్లు) పూర్తయింది. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్‌లూప్ బృందం,ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్‌ను నిర్మించినట్లు చెప్పారు. హైపర్ లూప్ టెక్నాలజీహైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ..దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనేది ఓ సిద్ధాంతం. ఇప్పుడి హైపర్‌లూప్ ట్రాక్‌ను టెస్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు. ఈ హైపర్‌లూప్ ఈ పద్దతిపై ట్రయల్ రన్ చేస్తారు. -
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
ఎస్జే సూర్యకు గౌరవ డాక్టరేట్.. కారణం ఇదే
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్యకు చెన్నైలోని 'వేల్స్ విశ్వవిద్యాలయం' గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక ఈరోజు (డిసెంబర్ 1) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్.జె.సూర్యను గౌరవ డాక్టరేట్‌తో 'వేల్స్ విశ్వవిద్యాలయం' సత్కరించింది. 25 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా గౌరవ డాక్టరేట్ లభించింది. వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గతేడాదిలో రామ్ చరణ్ డాక్టరేట్‌ను పొందిన విషయం తెలిసిందే.దర్శకుడిగా కాస్త విరామం తీసుకున్న ఎస్జే సూర్య తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్ హిట్‌గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఒక రకంగా ఈ సినిమాతోనే పవన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకు ఎస్జే సూర్య పట్ల చాలామంది ఫిదా అయిపోయారు. -
వణికించే చలిలో వరదలు..చెన్నైని చెల్లాచెదురు చేసిన ‘ఫెంగల్’(ఫొటోలు)
-
Cyclone Fengal: ఏటీఎంకు వెళ్లి వ్యక్తి మృతి
చెన్నై: ఫెంగల్ తుపానుతో తమిళనాడు అతలాకుతలం అవుతున్న వేళ.. చెన్నైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్లిన ఓ యువకుడు.. శవమై వరద నీటిలో తేలుతూ కనిపించాడు.తుపాను కారణంగా చెన్నై సహా తమిళనాడు అంతటా కుండపోత కురుస్తోంది. ఈ క్రమంలో ఓ ఏటీఎంలో వరద నీరు చేరింది. అయితే అది గమనించకుండా లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి.. కరెంట్ షాక్ కొట్టి మృతిచెందాడు. ఆపై యువకుడి మృతదేహం వర్షపు నీటిలో తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. -
Cyclone Fengal: చెన్నై ఎయిర్‌పోర్టు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.భారీ వర్షాలు..పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4— Sreeram (@sreeram) November 30, 2024 వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024మత్స్యకారులకు ఆదేశం..ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.విద్యాసంస్థలు బంద్తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
గేలి చేసినచోటే గెలిచి చూపిద్దాం!
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమంది ట్రాన్స్జెండర్ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది. ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత. (క్రేజీ.. డీజే..)గురుకులం...ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్జెండర్లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్‌స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్‌లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్జెండర్లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్‌ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.మన కోసం మనంకుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్అక్షర బలంశ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం (శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
చెన్నైలో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ (ఫొటోలు)
-
హ్యుందాయ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.ఇందుకోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ తెలిపింది. -
24న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఈవెంట్
-
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
తెలుగువారిపై కామెంట్స్.. సినీ నటి కస్తూరికి రిమాండ్
తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుకాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల పరిపాలనలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంది. (ఇది చదవండి: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరి అరెస్ట్)క్షమాపణలు చెప్పిన కస్తూరిఅలా వచ్చినవారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొంది. అలాగైతే ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై చెన్నైలో నివసించే తెలుగు వారు మండిపడ్డారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలుగువారికి కస్తూరి క్షమాపణలు చెప్పింది. -
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి
తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్‌లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్‌కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ విజేత అరవింద్
చెన్నై: వరుసగా రెండో ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్‌కు దక్కింది. గత ఏడాది ఈ టైటిల్‌ను తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ దక్కించుకోగా... ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిరీ్ణత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్, అరోనియన్ (అమెరికా), భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. చివరిదైన ఏడో రౌండ్లో అరవింద్ 64 ఎత్తుల్లో పర్హామ్ (ఇరాన్)పై గెలుపొందగా... లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. ఓవరాల్‌గా మెరుగైన టైబ్రేక్ స్కోరు కారణంగా అరవింద్ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించగా... అర్జున్, అరోనియన్ మధ్య జరిగిన సెమీఫైనల్లో అరోనియన్ గెలిచి ఫైనల్లో అరవింద్‌తో తలపడ్డాడు. ఫైనల్లో అరవింద్ 2–0తో అరోనియన్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌కు మూడో స్థానం లభించింది. -
Arjun Erigaisi: ప్రపంచ రెండో ర్యాంకర్‌గా..
సాక్షి, హైదరాబాద్: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయాన్ని అందుకున్నాడు. సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో గురువారం చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో 21 ఏళ్ల అర్జున్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ర్యాంకింగ్స్‌లో 2805.8 ఎలో రేటింగ్ పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానా 2805 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన భారత ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. లైవ్ రేటింగ్స్ అనేవి ప్రతి టోర్నీలో రౌండ్ రౌండ్‌కూ మారుతుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ‘ఫిడే’ ప్రచురించే అధికారిక ర్యాంకింగ్స్‌నే ప్లేయర్ తుది ర్యాంక్‌గా పరిగణిస్తారు. గత నెలలో సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ఐదో రౌండ్ తర్వాత లైవ్ రేటింగ్స్‌లో అర్జున్ తొలిసారి 2800 పాయింట్లను అందుకున్నాడు.ఈ ఘనత సాధించిన 16వ చెస్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. అయితే అదే టోర్నీలోని ఆరో రౌండ్లో, ఏడో రౌండ్లో అర్జున్ తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడంతో అతని లైవ్ రేటింగ్ 2800లోపు వచ్చింది. నవంబర్ 1న ‘ఫిడే’ అధికారికంగా వెలువరించిన ర్యాంకింగ్స్‌లో అర్జున్ 2799 రేటింగ్‌తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌గా ఉన్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలోని మిగిలిన నాలుగు రౌండ్లలో అర్జున్ రాణిస్తే డిసెంబర్ 1న విడుదలయ్యే తదుపరి ర్యాంకింగ్స్ లో అధికారికంగా 2800 రేటింగ్ పాయింట్లతో మూడు లేదా రెండో ర్యాంక్‌లో నిలుస్తాడు. -
‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!
ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్లే ఎక్కువగా వచ్చేవారు. వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది. ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్ల బండి వేగంగా దూసుకుపోతోంది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై (చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?) -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్‌ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్‌దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
కమలా.. విజయాన్ని కాంక్షిస్తూ పూజలు
సాక్షి, చైన్నె: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గతంలో ఎన్నికై , ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ గెలుపు కోసం ఆమె పూర్వీకుల గ్రామంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రిటన్, అమెరికాల నుంచి ఆమె మద్దతుదారులు పలువురు ఇక్కడకు వచ్చి పూజలలో లీనమయ్యారు. అమెరికా అధ్యక్షురాలుగా ఆమె తన పూర్వీకుల గ్రామానికి వస్తారన్న ఆశాభావాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. వివరాలు.. కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి తరపు తాత, ముత్తాతలు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.దీంతో తమ ఇంటి బిడ్డగా కమలా హ్యారిస్‌ను ఆ గ్రామస్తులు భావిస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరును గతంలో ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో రోజూ పూజలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు అప్పట్లో మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అధ్యక్ష బరిలో కమల హరిస్ నిలబడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొట్టే విధంగా కమలా దూసుకెళ్లారు. హోరాహోరీగా ఈ ఇద్దరి మధ్య సమరం నెలకొంది. మంగళవారం పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా 47వ ప్రిసిడెంట్ కమల హరిస్ లేదా ట్రంప్..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో గతంలో వలే కమలా గెలుపు కోసం పూర్వీక గ్రామస్తులు పూజలపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికే కాకుండా, కమలా హారీస్ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కుల దైవంగా ఉన్న ధర్మ శాస్త ఆలయంలో కమలా గెలుపు కాంక్షిస్తూ నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం అయితే, ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం పూర్తి ఫలితాలు వెలువడనున్నడంతో కమలా హరిస్పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ల నుంచి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె పేరు కలిగిన టీ షర్టులను ధరించి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కమలా తప్పకుండా ఈ ఎన్నికలలో గెలుస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షురాలుగా తమ గ్రామానికి కమల వస్తారన్న నమ్మకం ఉందని, ఆమె తప్పకుండా గెలుస్తారని తులసేంద్ర పురం వాసులు పేర్కొంటున్నారు. కులదైవం ఆలయం ధర్మ శాస్తలో అందరం మొక్కుకున్నామని, తమ కులదైవం ఆమెను ఆశీర్వదిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇక్కడ పూజలు జరిగాయని, ఆమె గెలిచారని గుర్తుచేశారు. కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినానంతరం భారత్ , అమెరికా మధ్య బంధం మరింత బలోపేతం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఆలయ పరిసరాలు గ్రామంలో కమలా హరిస్ గెలుపును కాంక్షిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.