Chief Minister
-
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थीVIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం? -
ఎంపీగా ఓడిన కొద్ది వారాలకే సీఎం
శ్రీనగర్: జూన్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లాలో ఓటమిని చవిచూసిన ఒమర్ అబ్దుల్లా కేవలం కొద్ది వారాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గతంలోనూ ఇలాగే 38 ఏళ్ల వయసులో తొలిసారిగా జమ్మూకశ్మీర్ సీఎంగా పగ్గాలు చేపట్టి రికార్డ్ సృష్టించారు. అత్యంత పిన్న వయసులో సీఎం అయి 2009–14 కాలంలో రాష్ట్రాన్ని పాలించారు.స్కాట్లాండ్లోని స్ట్రాత్క్లీడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేస్తూ చదువును మధ్యలో వదిలేసిన ఒమర్ 1998లో తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 28 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభకు ఎన్నికై అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 1999లోనూ జయకేతనం ఎగరేసి పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. గోధ్రా ఉదంతాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ సమరంలో అడుగుపెట్టి చతికిలపడ్డారు. 2002లో నేషనల్ కన్ఫెరెన్స్ కంచుకోట గందేర్బల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనామక ఖాజీ మొహమ్మద్ అఫ్జల్చేతిలో ఓడిపోయారు. తర్వాత 2004లో మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టారు. తర్వాత జమ్మూకశ్మీర్ అటవీప్రాంతాన్ని శ్రీ అమర్నాథ్ ఆలయబోర్డ్కు 2008లో ఇచ్చేందుకు నాటి అటవీమంత్రిగా అఫ్జల్ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా అసంతృప్తి నెలకొంది. దీన్ని అవకాశంగా మలచుకున్న ఒమర్ ఆందోళనలు లేవనెత్తారు. పార్టీ బలాన్ని పెంచి ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచించి ఎన్సీని అతిపెద్ద పార్టీగా అవతరింపజేశారు. దీంతో 38 ఏళ్ల వయసులో ఒమర్ కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 54 ఏళ్ల ఒమర్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అబ్దుల్లాల కుటుంబం నుంచి సీఎం అయిన మూడోవ్యక్తి ఒమర్. గతంలో ఈయన తాతా షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చదవండి: నేనెందుకు అరెస్టయ్యానో మీకు తెలుసా? -
జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ విషెస్..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. సురిందర్ కుమార్ చౌదరీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి మంచి జరగాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ ప్రాంత అభివృద్ధి కోసం తాము ఒమర్ అబ్దుల్లా సర్కారుతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతేగాక ప్రమాణస్వీకారానికి ముందు ఒమర్ అబ్దుల్లా కూడా జమ్ముకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.చదవండి: J&K cabinet: మంత్రి పదవి ఆఫర్.. తిరస్కరించిన కాంగ్రెస్ <Congratulations to Shri Omar Abdullah Ji on taking oath as the Chief Minister of Jammu and Kashmir. Wishing him the very best in his efforts to serve the people. The Centre will work closely with him and his team for J&K's progress. @OmarAbdullah— Narendra Modi (@narendramodi) October 16, 2024ఇక జమ్ముకశ్మీర్ రాష్ట్రం జమ్ముకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఓమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు వచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇది. -
ఒమర్అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఖరారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఫైనల్ అయింది. తాను సీఎంగా బుధవారం (అక్టోబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈమేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.సీఎంగా ప్రమాణ స్వీకారానికి లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఇదీ చదవండి: హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు -
ఈనెల 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 90 స్థానాలకుగానూ 48 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 15న పంచకులలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులో ఉంటారో లేదో అనేది తెలియాల్సి ఉందని, ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.కాగా ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ... మరోసారి బీసీ నేత అయిన ఆయనకే రాష్ట్ర పగ్గాలను అప్పగించనుంది అధిష్టానం. ముఖ్యమంత్రితోపాట మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. -
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దూసుకెళ్లోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్థీ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సైనీవైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం సైనీ.. కాంగ్రెస్ అభ్యర్థి మేమా సింగ్‌పై భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మూడో సారి బీజేపీకి అధికారం ఇచ్చినందకు ధన్యావాదాలు. మోదీ నాయకత్వం వల్లే విజయం సాధ్యమైందన్నారు. #WATCH | Kurukshetra: Haryana CM Nayab Singh Saini says "I want to thank the 2.80 crore people of Haryana for putting a stamp on the works of BJP for the third time. All this is only because of PM Modi. Under his leadership, we are moving forward. He spoke to me and gave his… pic.twitter.com/jPmMecyA8D— ANI (@ANI) October 8, 2024ఇదిలా ఉండగా.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికే 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్(46)ను అధికార బీజేపీ దాటేసింది. ఇక, ముందంజలో ఉన్న 49 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా బీజేపీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ పట్టున్న పలు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. BIG BREAKING NEWS 🚨 BJP heading for landslide victory in Haryana.BJP is leading on 51 assembly seats. Congress reduced to only 34. No one had imagined it even in dreams.Haryana CM Nayab Singh Saini dedicates Historic Haryana Hat-trick to PM Modi.#HaryanaElectionResult pic.twitter.com/xelrupD7At— ASHER (@ASHUTOSHAB10731) October 8, 2024 -
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో అత్యంత సమస్యాత్మక ప్రావిన్స్‌గా మారిన ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గుండాపుర్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుండాపుర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్)కి చెందిన నేత. ఆయన పార్టీ నిరసనల్లో పాల్గొంటున్న సందర్భంలో అరెస్టయ్యారు. అయితే ఆయన అరెస్ట్‌ను పాక్ ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.పాక్ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటూనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖాన్ పార్టీ చేపట్టిన నిరసనకారులకు గుండాపుర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి కేపీ హౌస్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పీటీఐ తెలిపింది.‘పాక్ రేంజర్లు కేపీ హౌస్‌లోకి బలవంతంగా ప్రవేశించి ముఖ్యమంత్రి గుండాపుర్ను అరెస్టు చేసే ప్రయత్నంలో దూకుడు ప్రదర్శించారు. అధికార దుర్వినియోగం చేశారు. ఇది పాకిస్తాన్లో అమలవుతున్న చట్టవిరుద్ధమైన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది’ అంటూ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. కాగా అక్రమ ఆయుధాలు, మద్యం రికవరీకి సంబంధించి ముఖ్యమంత్రిని కోర్టులో హాజరుపరచడానికి ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి: జావెలిన్ దిగిందా లేదా! -
కోర్టులపై నమ్మకం ఉంది, త్వరలోనే నిజాలు బయటకు: సిద్దరామయ్య
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ విషయంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్ నాకు అండగా నిలిచింది. నా పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించాయి. నేను పేదల పక్షాన ఉన్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు బీజేపీ, జేడీఎస్‌లు నాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుతున్నాయి’ అని మండిపడ్డారు.అయితే తనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంపై చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ నిపుణలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 17A కింద విచారణ రద్దు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.‘ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు. వారి ఆశీస్సులే నాకు రక్షణ. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతాను. ఈ పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుంది. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం. బీజేపీ, జేడీఎస్‌ల ఈ ప్రతీకార రాజకీయాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.మరోవైపు సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేతలు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు. తమ బాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన 100శాత స్వచ్చమైన సీఎం అని ప్రకటించారు. శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము సీఎంకు అండగా ఉంటాం. ఆయనకు మద్దతు ఇస్తాం. ఆయన ఎల్లప్పుడు రాష్ట్రం, పార్టీ కోసం మంచి పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇక కోర్టు తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తం అవ్వనుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయిందని.. ఇక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ’ అని కన్నడలో బీజేపీ పోస్టు చేసింది. -
కౌన్ బనేగా ఢీల్లీ సీఎం? రేసులో వీళ్లే!
ఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే.. కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఢిల్లీ సీఎం పీఠంపై ఆప్ ఎవరీ కూర్చోబెడుతుందనే చర్చ ఇప్పటికే పార్టీ వర్గాల్లో మొదలైంది. సీఎం పదవికీ మంత్రులు అతిషీ, గోపాల్ రాయ్, కైలేశ్ గహ్లోత్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు తెరమీదకు వస్తున్నాయి.మనీష్ సిసోడియా ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ (సోమవారం) సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లనున్నారు. ఇరు నేతలు లిక్కర్ స్కామ్ కేసులో బైయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం సమావేశం కావటం ఇదే తొలిసారి. ఇక.. నిన్న కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇరునేతలు భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికపై ఇరు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎం రేసులో మనీష్ సిసోడియా కూడా ఉన్నారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సునీతా కేజ్రీవాల్కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో ఆప్ నుంచి సునితా కేజ్రీవాల్ ప్రచారాల్లో ముందుండి నడిపించారు. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో ఆమె క్రమం తప్పకుండా మీడియా సమావేశాలలో నిర్వహించారు. సీఎం కేజ్రీవాల్ సందేశాలను ప్రజలకు చదివి వినిపించారు. ఢిల్లీ, రాంచీలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీల్లో కూడా పాల్గొంన్నారు. తన భర్త కేజ్రీవాల్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకోవటంపై విమర్శలు గుప్పించారు.అతిషీవిధాన సంస్కరణలు, సామాజిక సమస్యలపై అతిశీ డైనమిక్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసిన ఆప్ పార్టీ వ్యవహారాలను అన్నీ తానై చూశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషించారామె. క్యాబినెట్ మంత్రుల్లో ఆమె 14 శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్ మరియు ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారామె. అతిషి ఢిల్లీ అసెంబ్లీలో విద్యకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె బలమైన వాక్చాతుర్యం ఉన్న నేతగా ఆప్‌లో గుర్తింపు పొందారు. ఈ అనుకూలతలన్ని ఆమెను తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ముందువరసలో నిలబెట్టాయి.గోపాల్ రాయ్ఆప్లో మంత్రి గోపాల్ రాయ్.. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. 49 ఏళ్ల గోపాల్ రాయ్ విద్యార్థి క్రియాశీలక రాజకీయ నేపథ్యం కలిగిన ఉన్నారు. ప్రస్తుతం పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి, సాధారణ పరిపాలన వంటి శాఖల మంత్రి ఉన్నారు. గోపాల్ రాయ్ ఢిల్లీలోని శ్రామిక వర్గ సంఘాలతో అనుబంధం ఉంది. కార్మిక హక్కులు, పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు విస్తృతంగా కృషి చేశారు. కాలుష్య నియంత్రణ నుంచి కార్మిక సంక్షేమం వరకు ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకంగా వ్యవహరించినఅనుభవ ముఖ్యమంత్రి పోటీదారుల్లో ఒకరిగా చేర్చింది.ఆయనపై ప్రచారంలో కాల్పులు జరగగా.. పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు.కైలాష్ గహ్లోత్ఢిల్లీ రాజకీయల్లో కీలకమైన వ్యక్తి ప్రస్తుతం ఆప్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో.. ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల పరిచయం, రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నాలతో రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటంలో గణనీయమైన పురోగతి సాధించింది. 50 ఏళ్ల కైలాష్ గహ్లోత్.. బలమైన పరిపాలనా సామర్థ్యాలను కలిగిన ఆప్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
‘కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం.. 48 గంటల రహస్యం ఏంటి?’
ఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఆదివారం చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు జరిగేంత వరకు వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని, ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతే తాను మళ్లీ సీఎం పదవిని స్వీకరిస్తానని కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు. కేజ్రీవాల్ రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నిస్తోంది.‘‘ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు కోరుతున్న 48 గంటలు( రెండు రోజులు) సమయం చాలా మిస్టరీగా ఉంది. మరోకరిని సీఎంగా నియమించటం కోసం ఈ రెండురోజులు ప్రయత్నం చేస్తారా? లేదా ఇంకేదైనా వ్యవహారాలు సర్దుబాబు చేసుకుంటారా? అసలు జైలు నుంచి బయటకు రావటంతోనే సీఎం పదవి రాజీనామాకు 48 గంటల సమయం తీసుకోవటం ఎందుకు? ఈ 48 గంటలకు తర్వాత ఏం జరుగుతుంది? 48 గంటల వెనక ఉన్న రహస్యాన్ని ఢిల్లీ, మొత్తం దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’’ అని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది నిలదీశారు.2021లో ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీని ఏడాది తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సూటిగా ప్రశ్నించారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌తో సంబంధం లేకుంటే.. ఏడాది అనంతరం ఆ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారు?. మద్యం పాలసీ కుంభకోణంలో మొత్తం ఆప్ పార్టీ ప్రమేయం ఉంది. అందుకే ఆప్ నేతలు జైలుకు వెళ్లారు. మద్యం పాలసీ పేరుతో సీఎం కేజ్రీవాల్ వారిని దోచుకున్నారని ఢిల్లీ ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.VIDEO | "This 48-hour time which he (Arvind Kejriwal) has sought is enshrined in mystery that for which he is trying to find a replacement or trying to do some placements. It is ridiculous for a CM who is having overwhelming majority in the Assembly. If he is having an iota of… pic.twitter.com/YR1GnuIZT4— Press Trust of India (@PTI_News) September 15, 2024చదవండి: జార్ఖండ్‌కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ -
నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చర్చకు జూనియర్ డాక్టర్ల మరోసారి నిరాకరించారు. ఈ క్రమంలో సీఎం మమత సంచలన కామెంట్స్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నట్టు మమత చెప్పుకొచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అభయ ఘటనపై ఆందోళనల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో మరోసారి చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30మంది కాకుండా.. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. దీంతో డాక్టర్లు ఎవరూ చర్చలకు రాలేదు. ఈ సందర్భంగా డాక్టర్ల కోసం సీఎం దీదీ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశారు. అనంతరం, సీఎం మమత మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. ఇప్పుడు కూడా వారితో చర్చించేందుకే ముందుకు వచ్చాం. అభయ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కారణంగా చేతనే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నట్టు వారితో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కాగా.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. చివరగా.. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. డాక్టర్లతో చర్చించేందుకు దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. అయితే, వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. వైద్యులకు దేశ ప్రజలు అండగా నిలవండి. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైద్యులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రయోజనం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee says "I tried my best to sit with the junior doctors. I waited 3 days for them that they should have come and settle their problem. Even when they didn't accept the verdict of the… pic.twitter.com/qLD207vSd6— ANI (@ANI) September 12, 2024కాగా, బెంగాల్లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూడాల ఆందోళనలు చేపట్టారు. దీంతో బెంగాల్లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపించేందకు మమతా సర్కార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా గురువారం లేఖను పంపారు. ఈరోజు ఐదు గంటలకు చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చివరగా ట్విస్ట్ ఇస్తూ.. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. అయితే, ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవడంతో ముఖ్యమంత్రి మమతతో చర్చించేందుకు జూనియర్ డాక్టర్లు ఎవరూ సీఎం ఆఫీసుకు వెళ్లలేదు. West Bengal CM Mamata Banerjee says "I am ready to resign from the Chief Minister of West Bengal. I am not concerned about the post. I want justice, I am only concerned about justice getting served"#MamtaBanerjee #Westbangal #RGKarDoctor #RGKarProtestpic.twitter.com/KjaJzWcGXC— Vijay Singh (@VijaySikriwal) September 12, 2024 -
మణిపూర్‌లో హింస.. కేంద్రానికి సీఎం బిరేన్ సింగ్ డిమాండ్!
ఇంఫాల్: మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న దాడులతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఆరుగురు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ నియంత్రణ కోసం సీఎం ఎన్ బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ కమాండ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర భద్రతా సలహాదారు, సైన్యం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూనిఫైడ్ కమాండ్ నియంత్రణను సీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.సీఎం బీరెన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తమ డిమాండ్లను లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు అందజేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డిమాండ్ల జాబితాలో ప్రముఖంగా.. యూనిఫైడ్ కమాండ్ అప్పగించడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మణిపూర్‌లో అమలులో ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 355 ప్రతి రాష్ట్రాన్ని దురాక్రమణ, అంతర్గత దాడుల నుంచి రక్షించే బాధ్యతను కేంద్రానికి ఇచ్చింది. ఇక.. ఈ ఆర్టికల్‌ను విధించడం అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడానికి కేంద్రం సిద్ధమైనట్లే అని సమాచారం.గత ఏడాది మేలో జాతుల మధ్య చెలరేగిన హింసను నిర్మూలించిచి శాంతిని నెలకొల్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సీఎం బిరేన్ సింగ్‌లో సహా బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ సమగ్రతను కాపాడాలని, సరిహద్దు ఫెన్సింగ్‌ను పూర్తి చేయాలి, అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన సింసలో ఇప్పటి వరకు 220 మంది మృతిచెందగా.. సుమారు 50 వేల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. -
ముఖ్యమంత్రులు రాజులేం కాదు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమను తాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని, మనం పెత్తందారీ వ్యవస్థలో లేమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాష్ట్ర అటవీ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఏకపక్ష ధోరణితో ఒక ఐఎఫ్ఎస్ అధికారిని రాజాజీ టైగర్ రిజర్వు డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని సీఎంను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రనా ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.’ఈ దేశంలో జన విశ్వాస సిద్ధాంతం లాంటిది ఉంది. కార్యనిర్వాహక అధిపతులుగా ఉన్న సీఎం పాత రోజుల్లో రాజుల మాదిరిగా వ్యవహరించకూడదు. ఆ కాలంలోవారు ఏం చేప్తే అది చేసేశారు. కానీ మనం ఫ్యూడల్ యుగంలో లేము. కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా చేయగలరా? బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందని, అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ఎందుకు అంత ప్రత్యేక ప్రేమ?ఆయన్ను నియమించొద్దంటూ ప్రత్యేక నోట్ ఉంది. దాన్ని డిప్యూటీ సెక్రటరీ నుంచి మంత్రి దాకా అంతా ఆమోదించారు. అయినా సీఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు’ అని ధర్మాసనం మండిపడింది. దీంతోసెప్టెంబర్ 3నే రాహుల్ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.రాహుల్ అనే ఐఎఫ్ఎస్ అధికారి కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు అధిపతిగా ఉండేవారు. అయితే, పులులు సంచరించే అడవిలో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనుమతించారన్న ఆరోపణలతో రెండేండ్ల కిందట ఆయన్ని పదవీచ్యుతుణ్ని చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అదే రాహుల్‌ను రాజాజీ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌గా ధామీ నియమించారు. దీనిని సీనియర్ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. -
భీకర వరదల ధాటికి ఆంధ్రప్రదేశ్ విలవిల... వేలాది హెక్టార్లలో పంటలు నీటిపాలు... కేంద్రం నుంచి సాయం అందగానే సహాయక చర్యలు ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-
ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి,యాదాద్రిజిల్లా: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను ఏదైనా అంటే నిజమవుతుందని చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి మిస్ అయిందని, ఆయన భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతారని రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు.శుక్రవారం(ఆగస్టు30) భువనగిరిలో పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించడం ఇటు కాంగ్రెస్ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
Karnataka: గవర్నర్ V/s సీఎం.. హైకోర్టుకు సిద్దరామయ్య
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముడా అధికారులు తన భార్యకు భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు, తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు.కాగా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి..సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.అయితే ఆ ఆరోపణలను సిద్దరామయ్య తోసిపుచ్చారు. అతాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది అని విమర్శించారు. -
మహా అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరైనా సరే శివసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంవీయే భాగస్వామ్యాలైన కాంగ్రెస్, ఎన్సీపీ శరద్‌పవార్ ప్రకటించిన అభ్యర్ధికి భేషరతుగా మద్దతిస్తామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర అత్మగౌరవాన్ని కాపాడే పోరాటమని పేర్కొన్నారు.‘ఎంవీఏ కూటమిలో సీఎం అభ్యర్థిపై ఊహాగానాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ చవాన్ అయినా, శరద్ పవార్ అయినా సరే, కూటమిలోని నేతలందరూ తాము సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేర్లను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను’ అని తెలిపారు.అదే విధంగా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని ఎంవీఏ భాగస్వాములను ఆయన కోరారు. 'ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే సీఎం పదవి దక్కుతుందనే నిబంధనను మేం పాటించాం. ఇంతకుముందు పొత్తుల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించాం. కాబట్టి ముందుగా సీఎం ముఖాన్ని ప్రకటించాలని, ఆ తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించగలమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన వర్గానికి పార్టీ గుర్తు వెళ్లిపోవడంపై స్పందిస్తూ.. వాల్లు నా'విల్లు-బాణం' గుర్తును దొంగిలించినప్పటికీ, నేను వారి వెన్నుముకకు నిప్పు పెట్టడానికి 'లైటింగ్ టార్చ్'ని గుర్తుగా ఎంచుకున్నాను’ అని చెప్పారు..కాగా 2022లో శివసేనను చీల్చుతూ ఏక్నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే షిండే వర్గానికి అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉండటంతో గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం 'శివసేన' పార్టీ పేరును, దాని విల్లు, బాణం గుర్తును కేటాయించింది. -
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ భట్టాచార్య (80) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమేరకు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన .. కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2౦౦౦ నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భట్టాచార్యకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.భట్టాచార్య మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ‘భట్టాచార్య దశాబ్దాలుగా తెలుసు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బట్టాచార్యను పలు మార్లు ఇంటికి వెళ్లి పరామర్శించాను. కానీ గురువారం ఆయన మరణ వార్త తెలిసింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. Shocked and saddened by the sudden demise of the former Chief Minister Sri Buddhadeb Bhattacharjee. I have been knowing him for last several decades, and visited him a few times when he was ill and effectively confined to home in the last few years.My very sincere condolences…— Mamata Banerjee (@MamataOfficial) August 8, 2024 -
గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (సోమవారం) గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం పటేల్ ఎనలేని కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.‘గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌కు జన్మదిన శుభాకాంక్షలు. గుజరాత్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర యువతకు సాధికారత కల్పించేందుకు ఆయన ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సుదీర్ఘమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ దాదా భగవాన్ ఆలయాన్ని సందర్శించారు. దీంతో పాటు శివాలయంలో జలాభిషేకం నిర్వహించారు. భూపేంద్ర పటేల్ 1962 జూలై 15న అహ్మదాబాద్‌లో జన్మించారు. 2022 డిసెంబర్ 12న గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. Best wishes to Gujarat CM Shri Bhupendrabhai Patel on his birthday. He’s making commendable efforts to boost Gujarat’s development and empower the state’s youth. Wishing him a long and healthy life in service of the people. @Bhupendrapbjp— Narendra Modi (@narendramodi) July 15, 2024 -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్‌లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ.. మోదీ శుభాకాంక్షలు
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి బీజేపీ నేత పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా మరో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, రెండు దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్ ప్రమాణం చేయడం విశేషం.ఇక, గురువారం ఉదయం ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజుజులతో పాటుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరయ్యారు. కాగా, పెమా ఖండూ 2016లో మొదటి సారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు గానూ 46 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందే పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. #WATCH | Pema Khandu takes oath as the Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/413tSLcgrY— ANI (@ANI) June 13, 2024 మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫేమా ఖండూకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. అరుణచల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహా, మంత్రి వర్గం పాటుపడాలని కోరారు. Prime Minister Narendra Modi congratulates Pema Khandu on taking oath as the Chief Minister of Arunachal Pradesh. pic.twitter.com/VkJpqMGh8E— ANI (@ANI) June 13, 2024ఇదిలా ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్ కేబినెట్లో రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. బీజేపీ ఓ మహిళకు (రాష్ట్రంలో) క్యాబినెట్ బెర్త్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మహిళా సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Itanagar: After swearing-in ceremony, the first woman minister in Arunachal Pradesh cabinet in 2 decades, Dasanglu Pul says, "I am delighted, women of the entire state are delighted. BJP has given a cabinet berth to a woman (in the state) for the first time. I thank the… pic.twitter.com/EelwJSJD9z— ANI (@ANI) June 13, 2024 -
ఒడిశా సీఎంగా ‘మాఝీ’ ప్రమాణస్వీకారం
భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ బుధవారం(జూన్ 12) సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తన ప్రమాణస్వీకారానికి హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ను సీఎం మోహన్ చరణ్ ఆహ్వానించారు. బుధవారం ఉదయం స్వయంగా నవీన్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానాన్ని అందించారు.ఆహ్వానాన్ని మన్నించి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇటీవల లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిషాలో బీజేపీ 78 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజుజనతాదల్ 51 సీట్లతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది. -
ఒడిశాలో బీజేపీ సంచలన నిర్ణయం
-
మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై దాడి
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్ సింగ్ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ నుంచి జిరిబమ్ జిల్లాకు వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూరిటీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.