Delhi air pollution
-
ఢిల్లీలో జీఆర్ఏపీ ఉపసంహరణకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం మెరుగుపడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 161గా నమోదైంది. దీంతో ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య కట్టడికి విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన ప్లాన్-4 (జీఆర్ఏపీ) ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. గాలి నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో జీఆర్ఏపీ ఆంక్షలను ఉపసంహరించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. గా గత నెల రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యంగా తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఒకానాక దశలో ఏక్యూఐ 500 స్థాయికి కూడా చేరడంతో. దీంతో ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను (జీఆర్‌పీఏ) అమలు చేసింది. దీని ప్రకారం నగరం పరిధిలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధాన్ని విధించారు. అలాగే ప్రభుత్వ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే విధులకు హాజరవ్వాలని, మిగిలిన వారు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతులకు ఆన్లైన్లో క్లాస్‌లు నిర్వహించారు. ఇదిలా ఉండగా గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. -
మృత్యుకుహరంగా మహానగరం
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది. ఊపిరాడేనా?ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది. ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?విదేశాల అనుభవాలుప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది. అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి. అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.ప్రభుత్వాల ముందున్న కర్తవ్యంఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు. చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు -
Delhi: కొద్దిపాటి ఉపశమనం.. తగ్గని కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్యం కాస్త ఉపశమించింది. దీంతో అక్కడి ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే కాలుష్య స్థాయి ఇప్పట్లో ఆశించినంతలా తగ్గేలా కనిపించడంలేదు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా జనం పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.కొద్ది రోజుల క్రితం 400 దాటిన కాలుష్య సూచీ ఇప్పుడు 300 నుంచి 400 మధ్యలో ఉంటోంది. ఢిల్లీవాసులు కాలుష్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను వినియోగిస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీబీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం ఏక్యూఐ కొద్ది రోజుల క్రితం వరకూ ప్రమాదకర కేటగిరీలో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీవాసులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని నుంచి ఉపశమనం కోసం వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది. ‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్లైన్ క్లాస్‌లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్ను(CAQM) ఆదేశించింది.ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్‌పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి సూచించింది. -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్‌లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్‌పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్పర్గంజ్, రోహిణి, వజీర్పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది. ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -
హస్తినలో మొదలైన ఎన్నికల హడావుడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో క్రమంగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే తమ ఎన్నికల కసరత్తును బీజేపీ, ఆప్ పార్టిలు ముమ్మరం చేసి దాడి, ఎదురుదాడులను మొదలు పెట్టాయి. ఆప్ నేత కైలాశ్ గహ్లోత్ బీజేపీలో చేరిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ఢిల్లీ ప్రజలతో సంప్రదింపులు జరుపుతుండగా, మరోవైపు బీజేపీ తమ ఢిల్లీ నేతలను క్రియాశీలం చేసింది. గురువారం 11 మందితో ఆప్ తొలిజాబితాను సైతం విడుదల చేసింది. పోటీపోటీగా ఆప్, బీజేపీ..వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాల అమలులో ఆప్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్‌లపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీజేపీ, అనంతరం సైతం ఏమాత్రం తగ్గకుండా అంతకంతకూ పెరుగుతున్న యమునా నది కాలుష్యం, పెరిగిన వాయు కాలుష్యం, తాగునీటి ఎద్దడి, ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందని సహకారం వంటి అంశాలపై గడిచిన నాలుగు నెలలుగా తన పోరాటాన్ని ఉధృతం చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై గడిచిన వారం రోజులుగా పోస్టర్ వార్తో పాటు వీధి పోరాటాలు చేస్తోంది. ఇక ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని ఆప్ ఎదురుదాడి చేస్తోంది. ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అసాధారాణ అధికారాలు కట్టబెట్టి, సమస్యలను జటిలం చేస్తోందని ఆప్ సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. ఈ పరిణామాలు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ఆప్ కీలక నేత, మాజీ మంత్రి కైలాశ గహ్లోత్ బీజేపీలో చేరారు. దీనికి బదులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝాని తన పార్టీలో చేర్చుకుంది ఆప్. ఈడీ కేసుల భయంతోనే గహ్లోత్ పార్టీ మారారని ఆప్ ఆరోపిస్తే, కేజ్రీవాల్‌కు రాజకీయ ఆశయాలు పెరగడం వల్లే ఆయన పార్టీ మారారని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ఇక మరోపక్క ఎన్నికల అభ్యర్థులను త్వరగా ఖరారు చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ సచ్‌దేవా ఇప్పటికే పార్టీ స్టీరింగ్ కమిటీ, మెనిఫెస్టోకమిటీతో భేటీలు జరుపగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ వీధి సభలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 70 స్థానాలకు గానూ 2015లో 67, 2020లో 62 స్థానాలు గెలిచిన ఆప్ తిరిగి 60కి పైగా స్థానాలను గెలిచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. పొత్తు లేదు.. కాంగ్రెస్‌తో పోరే ఇక ఢిల్లీ ఎన్నికల సన్నాహాల్లో పూర్తిగా వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా రెండు పార్టిలు ఏడింటిలో ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీచేసి అన్నిచోట్ల పరాజయం పాలయ్యాయి. అనంతరం జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉంటుందని భావించినా, సీట్ల సర్దుబాటు కుదరక రెండు పార్టిలు ఒంటరిగానే పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ రెండు పార్టిలు విడివిడిగానే కొట్లాడుతాయని ఇప్పటికే సంకేతాలు వెళ్లడంతో కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్‌లు న్యాయ్ యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆప్ తొలి జాబితా విడుదలఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చిన వారే సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే సిద్ధమైంది. 2025, ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 11మంది అభ్యర్థులతో తొలి జాబితాను జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ గురువారం విడుదల చేశారు. ఛత్తర్పూర్ అభ్యర్థిగా బ్రహ్మసింగ్ తన్వర్, బదార్పూర్ అభ్యర్థిగా రామ్‌సింగ్ నేతాజీ, లక్ష్మీనగర్ అభ్యర్థిగా బీబీ త్యాగీ, సీలంపూర్ అభ్యర్థిగా చౌదరి జుబిర్ అహ్మద్, సీమాపురి అభ్యర్థిగా వీర్‌సింగ్ ధింగాన్, రోహ్తాస్ నగర్ అభ్యర్థిగా సరితాసింగ్, ఘోండా అభ్యర్థిగా గౌరవ్ శర్మ, విశ్వాస్‌నగర్ అభ్యర్థిగా దీపక్ సింగ్లా, కర్వాల్‌నగర్ అభ్యర్థిగా మనోజ్ త్యాగి, కిరారీ అభ్యర్థిగా అనిల్‌ఝా, మటియాలా అభ్యర్థిగా సోమేశ్ షోకీన్‌ల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. 11మంది అభ్యర్థుల జాబితాలో ఆరుగురు ఇతర పార్టిల నుంచి వచ్చినవారే ఉన్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చివారు కావడం గమనార్హం. ఛత్తర్పూర్, కిరాడీ అభ్యర్థులుగా ఖరారైన బ్రహ్మ సింగ్ తన్వర్, అనిల్ ఝాలు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు. వీరు ఈ ఏడాది ఆ పార్టీకి రాజీనామా చేసి ఆప్‌లో చేశారు. వీరు ఇరువురూ రెండుసార్లు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా కూడా గెలిచారు. ఇక, దీపక్ సింఘ్లా కిందటి ఎన్నికల్లో బీజేపీ నేత ఓమ్ ప్రకాశ్ శర్మ చేతిలో ఓటమిపాలయ్యారు. సరితా సింగ్ ఆప్ విద్యార్ధి విభాగం ఛత్ర యువ సంఘర్షణ సమితి అధ్యక్షురాలు. రోహతాస్ నగర్ నుంచి గతంలో గెలిచారు. -
Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కాస్త ఉపశమించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) గత ఎనిమిది రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఉంది. అయితే ఈరోజు(గురువారం) గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది.నేటి ఉదయం ఢిల్లీ ఎక్యూఐ ప్రమాదకర స్థాయి నుంచి కాస్త తగ్గి, వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఈరోజు ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 384గా నమోదైంది. మొన్నటి వరకూ ఏక్యూఐ 500 స్థాయిని తాకింది. ఈరోజు ఢిల్లీలో గాలి కాస్త పరిశుభ్రంగా మారినప్పటికీ, పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. మరోవైపు ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా రాజధానిలో ఆన్లైన్లో పటాకుల అమ్మకాలను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అక్టోబర్ 14న ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, కాల్చడంపై పూర్తి నిషేధం విధించింది. మరోవైపు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలో 50 శాతం సామర్థ్యంతో కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. 50 శాతం సిబ్బంది ఇంటి నుంచే పని చేయనున్నారు. గ్రాప్ మూడవ, నాల్గవ దశల కింద ఢిల్లీ ఎన్సీఆర్లోపి పలు జిల్లాల్లో పాఠశాలలను మూసివేతను తప్పనిసరి చేశారు. అలాగే గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లలోని ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు సమయాల్లో పనిచేయనున్నాయి.ఇది కూడా చదవండి: సగం మంది ఇంటి నుంచే పనిచేయండి -
కాలుష్యానికి కళ్లెం.. బీజింగ్ చెప్పిన పాఠం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలు తోడేస్తోంది. విషపూరితమైన గాలి పీలుస్తున్న జనం ఆసుపత్రులపాలవుతున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వాయు కాలుష్యం కాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ నివేదిక ప్రకారం.. కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రతిఏటా దాదాపు 12,000 మంది మరణిస్తున్నారు. లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలో ప్రతిఏటా నమోదవుతున్న మొత్తం మరణాల్లో 11.5 శాతం మరణాలకు కాలుష్యమే కారణం కావడం గమనార్హం. ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌గా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితులే 2013 దాకా చైనా రాజధాని బీజింగ్‌లోనూ కనిపించేవి. కానీ, ప్రస్తుతం బీజింగ్ సిటీ కాలుష్యం ముప్పు నుంచి చాలావరకు బయటపడింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందన్నది ఆసక్తికరం. వాయు కాలుష్యంపై పోరాటం విషయంలో చైనా అనుభవాలు, సాధించిన విజయాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) మంగళవారం బీజింగ్‌లో 137 కాగా, ఢిల్లీలో 750గా నమోదైంది. ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం ఉత్పత్తి అయ్యే విషయంలో ఢిల్లీ, బీజింగ్‌లో ఒకేలాంటి పరిస్థితులు ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రెండు నగరాల్లోనూ ఉన్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీకి ఉన్న అదనపు ముప్పు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో చైనాది ప్రపంచంలోనే మొదటి స్థానం. మొత్తం ప్రపంచ ఉద్గారాల్లో డ్రాగన్ దేశం వాటా 30 శాతం. అయినప్పటికీ బీజింగ్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎలా అందుతోంది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి? బీజింగ్‌లో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడాన్ని చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ ‘సోహో’ అధినేత, బిలియనీర్ పాన్ షియీ 2011లో తొలిసారిగా సోషల్ మీడియా పోస్టు ద్వారా బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.2013లో కాలుష్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో తొలుత యువత పాలుపంచుకున్నారు. క్రమంగా ఇదొక ప్రజా పోరాటంగా మారింది. వాయు కాలుష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజింగ్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమ ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రెండు వారాలపాటు అవిశ్రాంతంగా ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం దిగివచ్చింది. కాలుష్యంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు అప్పటి చైనా అత్యున్నత నాయకుడు లీ కెఖియాంగ్ స్పష్టంచేశారు. పేదరికంపై జరుగుతున్న యుద్ధం తరహాలో కాలుష్యంపైనా యుద్ధం సాగిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాదు కాలుష్య నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించారు. అధికారులను పరుగులు పెట్టించారు. నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ → కాలుష్యాన్ని కట్టడి చేయడానికి చైనా సర్కారు ‘నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేసింది. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు కేటా యించింది. → బీజింగ్‌లో మొట్టమొదటిసారిగా 2013లో వా యు నాణ్యత గణాంకాలను ప్రచురించారు. అప్పటిదాకా ఈ సమాచారం కోసం అమెరికా రాయబార కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. → 2013 నుంచి సొంతంగానే సమాచారం సేకరించి, ప్రజలకు చేరవేయడం ప్రారంభించారు. → జాతీయ వాయు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్యాన్ని 25 శాతం తగ్గించాలని ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సీరియస్‌గానే రంగంలోకి దిగారు. → తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న 100 ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొన్నింటిని ఆధునీకరించారు. → కాలుష్య ఉద్గారాల విషయంలో కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. కాలం చెల్లిన 2 కోట్ల పాత వాహనాలను రోడ్డెక్కనివ్వలేదు. వాటిని స్క్రాప్‌గా మార్చేశారు. → 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను ఉన్నతీకరించారు. పాత వాటి స్థానంలో ఆధునిక బాయిలర్లు అమర్చారు. → బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మంగళం పాడేశారు. సహజ వాయువుతో కరెంటును ఉత్పత్తి చేసి, 60 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. → విద్యుత్‌తో నడిచే వాహనాలు బీజింగ్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు అతి తక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. వాటికి పలు రాయితీలు అందిస్తోంది. → 2013లో చైనా ప్రభుత్వం ప్రారంభించిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం మొదలైంది. గాలి నాణ్యత క్రమంగా మెరుగుపడింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో బీజింగ్ సిటీ ఇప్పుడు కాలుష్య రహిత నగరంగా మారింది. ఇండియా చేయాల్సిందేమిటి? ఇండియాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే, వారణాసి, పట్నా తదితర పెద్ద నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా కాలుష్యం ఊబిలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఇండియా సిటీల స్థానం భద్రంగా ఉంటోంది. కాలుష్యాన్ని తరిమికొట్టి స్వచ్ఛంగా మార్చడానికి బీజింగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్యం నుంచి జనానికి విముక్తి కల్పించడానికి బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెబుతున్నారు. నిపుణుల సూచనలు ఏమిటంటే..→ వాయు నాణ్యతను మెరుగుపర్చడానికి అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. → శిలాజ ఇంధనాల వాడకానికి కళ్లెం వేయాల్సిందే. → పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు పెరగాలి. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కాలుష్యానికి కారణమవు తోంది. ఈ పరిస్థితి మారాలి. → కాలుష్య నియంత్రణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. → వ్యాపారం, వాణిజ్యం, ఎగుమతులతోపాటు రాజకీయ పలుకుబడి సాధించే విషయంలో చైనాతో పోటీ పడుతున్న భారత్ కాలుష్య నియంత్రణ విషయంలో ఎందుకు పోటీపడడం లేదన్నదే నిపుణుల ప్రశ్న. → కాలుష్య నియంత్రణను కేవలం స్థానిక ప్రభుత్వాలకే వదిలివేయకూడదు. ఇందుకోసం జాతీయ స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరం. → చక్కటి ప్రణాళికాబద్ధమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గిపోవాలి. ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా సాధనాలను ఉపయోగించుకుంటే కాలుష్యం చాలావరకు తగ్గిపోతుంంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Delhi Pollution: ఢిల్లీలో వరస్ట్ మార్నింగ్
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తారు.మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది. 👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్, 👉51-100 ఉంటే సంతృప్తికరం, 👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం, 👉201-300 నుంచి పూర్, 👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్, 👉401 నుంచి 450 ఉంటే సివియర్, 👉450 పైనే ఉంటే వెరీ సివియర్ ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.ప్రైవేట్ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా పని చేయించుకోవాలని అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్? -
ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
-
Supreme Court: కాలుష్యాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని సృష్టించే ఏ రకమైన కార్యకలాపాలనూ ఏ మతమూ ప్రోత్సహించబోదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాదంతా బాణసంచాను ఢిల్లీ పరిధిలో నిషేధించాలా వద్దా అనే అంశంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్నాసరే దీపావళి వేళ ఢిల్లీ వ్యాప్తంగా విపరీతంగా బాణసంచా కాల్చడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత కేసును సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం విచారించింది. ‘‘కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ రక్షణ కల్పిస్తోంది. కాలుష్యకారక ఏ పనినీ ఏ మతమూ ప్రోత్సహించదు. సరదాగా బాణసంచా కాల్చినాసరే తోటి పౌరుల ఆరోగ్యకర జీవన హక్కుకు భంగం వాటిల్లినట్లే’’ అని వ్యాఖ్యానించింది. సంవత్సరం పొడవునా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అంశంపై ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ‘‘ సంబంధిత అన్ని వర్గాలతో సంప్రతింపులు జరపండి. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేయండి’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడంపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలనూ కోర్టు కోరింది. ఢిల్లీ పోలీసులకు చీవాట్లునిషేధం ఉన్నాసరే ఊపిరాడనంతగా బాణసంచా కాల్చుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఢిల్లీ పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ నిషేధించాలంటూ గతంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు బేఖాతరు చేశారని స్పష్టమైంది. గతంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం అనుమతులు తీసుకున్న సంస్థలకు మా ఉత్తర్వుల కాపీలు అందినట్లు కనపించట్లేదు. మొదట ఢిల్లీ పోలీసులు చేయాల్సిన పని లైసెన్స్ దారులు టపాకాయలు విక్రయించకుండా అడ్డుకో వాలి. అమ్మకాలను ఆపేశారని, నిషేధం అమల్లోకి వచ్చిందని, ఆన్లైన్ వేదికలపై విక్రయాలు, డెలివరీ సౌకర్యాలను స్తంభింపజేసేలా సంబంధిత వర్గాల కు ఢిల్లీ పోలీసు కమిషనర్ తక్షణం సమా చారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. క్షేత్రస్థాయిలో నిషేధాన్ని అమలు చేయా ల్సిన బాధ్యత స్థానిక పోలీస్స్టేషన్లదే. అక్టోబర్ 14వ తేదీదాకా మా ఉత్తర్వులు ఎవరికీ అందకుండా ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆలస్యం చూస్తుంటే మాకే ఆశ్చర్యంవేస్తోంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.సాకులు చెప్పిన పోలీసులుదీనిపై ఢిల్లీ పోలీసులు తప్పును ఆప్ సర్కార్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. ఢిల్లీపోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదించారు. ‘‘ మాకు ఉత్తర్వులు రాలేదు. దసరా అయి పోయిన రెండ్రోజుల తర్వాత ఆప్ సర్కార్ ఆదేశా లు జారీచేసింది. ఆదేశాలు వచ్చాకే మేం నిషేధం అమలుకు ప్రయత్నించాం’’ అని భాటీ అన్నారు. దీపావళి, ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వా యునాణ్యత దారుణంగా పడిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలుకా కపోవడంపై కోర్టు ధిక్కరణగా భావించింది. -
పంట వ్యర్థాలు దహనం చేస్తే భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే గాలి కాలుష్యం ఎక్కువైందన్న ఆరోపణలొస్తుండటం తెలిసిందే. దీనిని కట్టడి చేసేందుకు రైతులపై జరిమానాలను భారీగా విధించాలని గురువారం కేంద్రం నిర్ణయించింది. పంట వ్యర్థాలకు నిప్పుపెట్టే రైతులకు జరిమానాలను భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు విధించనున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలు తెలిపాయి. తాజా నిబంధనల ప్రకారం.. రెండెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు తన పొలంలోని వ్యర్థాల్ని కాలిస్తే రూ.5వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇది రూ.2,500 మాత్రమే ఉంది. అదేవిధంగా, 2 నుంచి 5 ఎకరాల భూమి గల రైతు ఇదే పనిచేస్తే రూ.5 వేలు బదులు ఇకపై రూ.10వేలు కట్టాల్సిందే. అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలకు నిప్పుపెడితే రూ.30వేల వరకు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్రం ప్రకటించింది. ఇవి ‘కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చట్టం–2021’లో భాగమని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్క్‌ను దాటడంతో జనం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఏమిటంటూ గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం సరైన చట్టాలను రూపొందించలేకపోతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జరిమానాలను విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్రం ప్రకటించింది. పంజాబ్ రైతు సంఘాల నిరసన పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన యంత్రాలను అందించడానికి బదులుగా కేంద్రం జరిమానాలను భారీగా పెంచడంపై పంజాబ్‌లోని రైతు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. వ్యర్థాల నిర్వహణకు యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో మరోమార్గం లేక దహనం చేస్తున్నామే తప్ప, ఉద్దేశపూర్వకంగా కాదని వారంటున్నారు. కాలుష్యానికి కారణమంటూ రైతుల వైపు వేలెత్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 30 శాతం మంది రైతులకు మాత్రమే పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను అందజేసిందని వివరించారు. పంట వ్యర్థాల వల్ల జరిగే కాలుష్యం కంటే పరిశ్రమలు, రవాణా రంగం వల్లే గాలి కాలుష్యం ఎక్కువని పర్యావరణ నిపుణురాలు సునీతా నారాయణ్ తెలిపారు. -
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర
న్యూఢిల్లీ: శీతాకాలంలో దేశ రాజధానిని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టకుండా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు కోర్టు తిట్ల తలంటుపోసింది. వ్యర్థాలను తగలబెట్టిన వారికి నామామాత్రపు జరిమానాలు వేస్తూ వదిలేస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిపై అక్టోబర్ 23వ తేదీన తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కోర్టు బుధవారం సమన్లు జారీచేసింది. విధి నిర్వహణలో విఫలమైన ఆయా ప్రభుత్వాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం)ను కోర్టు ఆదేశించింది. సంబంధిత కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం బుధవారం విచారించింది. దహనాలను నివారించేందుకు 2021 జూన్‌లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) ప్రాంతంలో అమలుచేయాల్సిన సీఏక్యూఎం నిబంధనలను గాలికొదిలేసిన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇదేం రాజకీయ అంశం కాదుగా: ‘‘తగలబెట్టడం వల్ల శీతాకాలంలో ఢిల్లీ మొత్తం పొగచూరుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై అధికారగణం ఒత్తిడి ఉంటే వారికీ మేం సమన్లు జారీచేస్తాం. రాష్ట్రాల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పంజాబ్ ప్రభుత్వం గత మూడేళ్లలో నిబంధనలను అతిక్రమించిన వారిలో ఒక్కరిపై కూడా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టలేదు. తప్పుచేసిన వారిని విచారించేందుకు ఎందుకంత భయపడుతున్నారు?. ఇదేం రాజకీయ అంశం కాదు. కమిషన్ నిబంధనలను ఖచి్చతంగా పాటించాల్సిందే. ఇందులో రాజకీయాలకు తావులేదు. మీరే నియమాలను ధిక్కరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నారు. నామామాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. పంటభూముల్లో ఎక్కడెక్కడ పంటవ్యర్థాలను తగలబెడుతున్నారో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మీకు లొకేషన్ పంపుతోంది. మీరే అది ఎక్కడుందో దొరకట్లేదని కుంటి సాకులు చెబుతున్నారు’’అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి: పంజాబ్ కోర్టు ఎదుట పంజాబ్ తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదించారు. ‘‘పొలాల్లో వ్యర్థాలను కాలి్చన ఘటనలపై అధికారులు నమోదుచేసిన రెవిన్యూ రికార్డులు తప్పులతడకగా ఉంటున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఆదేశాలకు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి’’అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికీ చీవాట్లు ‘‘కేంద్రప్రభుత్వం వాయు నాణ్యతా నిర్వహణ కమిషన్‌ను కోరలు పీకిన పాములా మార్చేసింది. ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటిని అమలుచేసే బాధ్యత, సర్వాధికారాలు దానికి అప్పజెప్పలేదు. వాయుకాలుష్య సంబంధ నిపుణులను సీఏక్యూఎంలో ఎంపికచేయలేదు. సీఏక్యూఎం సభ్యుల విద్యఅర్హతలు అద్భుతంగా ఉన్నాయిగానీ అవి గాలినాణ్యత రంగానికి ఎందుకూ పనికిరావు’అని వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదించారు. సభ్యుల్లో ఒకరు గతంలో మధ్యప్రదేశ్ కాలుష్యనియంత్రణ మండలికి ఆరేళ్లు చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ‘‘అక్కడ సారథిగా ఉండటమనేది అసలైన అర్హత కాబోదు. కాలుష్య నియంత్రణ మండలి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?. వాయుకాలుష్యరంగ నిపుణులతో కమిషన్‌ను పటిష్టంచేయాలి’అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఢిల్లీ ప్రాంతంలో సీఏక్యూఎం చట్టం, 2021 ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించటంలో సీఏక్యూఎం పూర్తిగా విఫలమైంది. దహనం ఘటనలను యద్దప్రాతిపదికన అడ్డుకోవాల్సిన బాధ్యత మీదే’అని కమిషన్‌పై కోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. -
హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో క్షీణిస్తున్న వాయు కాలుష్యం కేసులో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల దహనం సమస్యను పరిష్కరించేందుకు ఆ రాష్ట్రాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరై, పరిస్థితిని వివరించాలని సర్వోన్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొందిఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అసానుద్దీన్ అమానుల్లా, ఆగస్టిన్ జార్జ్ మాషిస్‌లతో కూడిన ధర్మాసనం దేశాలు ఇచ్చింది. కాలుష్య నిరోధక చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను విచారించాలంటూ జూన్ 2021న తాము జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రెండు రాష్ట్రాలపై మండిపింది. తమ ఉత్తర్వులను పాటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హె చ్చరించిందికాగా దేశ రాజధాని దిల్లీలో ప్రతీ శీతాకాలం గాలి నాణ్యత దారుణంగా పడిపోతూ ఉంటుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తనను తాను ‘నిస్సహాయతగా’ ప్రకటించుకోవాలని కోర్టు చీవాట్లు పెట్టింది. ‘ఇక మేము ఏం చేయలేము... మేము నిస్సహాయులమని వారిని వారే ప్రకటించుకోనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పంజాబ్, హర్యానా రెండూ గత మూడు సంవత్సరాలుగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా పంట వ్యర్థాలను కాల్చే రైతులపై చర్యలు తీసుకోలేదని, కేవలం నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధించాయని కోర్టు పేర్కొంది.ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు న్యాణ్యతను పర్యవేక్షించి, నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్‌ను కూడా తీవ్రంగా విరుచుకుపడింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని సీఏక్యూఎంను సుప్రీం అడిగింది. ఇదేమీ రాజకీయ అంశం కాదని పేర్కొంది. ఉల్లంఘనల కట్టడిలో విఫలమైనందుకు గానూ పంజాబ్, హరియాణా ప్రభుత్వ అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
ఢిల్లీలో వాయు కాలుష్యం.. కేంద్ర ప్యానెల్‌పై సుప్రీం మండిపాటు
న్యూఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో కేంద్ర గాలి నాణ్యత కమిటీపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండపడింది. దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM).. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయలేదని సుప్రీంకోర్టు జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం తెలిపిందిచట్టాన్ని పూర్తిగా మరిచారని, ఏ కమిటీలు ఏర్పాటు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా తెలియజేయాలని కేంద్ర ప్యానెల్‌ను ప్రవ్నించింది. అంతా గాలికి వదిలేశారని మండిపడింది‘ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా? మీరు తీసుకున్న ఒక్క చర్యను మాకు వివరించండి. వాయు కాలుష్య చట్టంలోని సెక్షన్ 12ay ఏ ఆదేశాలను ప్రయోగించారు. అన్నింటినీ గాలికి వదిలేశారు. ఎన్సీఆర్ పరిధి ప్రాంతాల్లో ఏం చేశారో చూపించలేదు.’ అని జస్టిస్ ఓకా పేర్కొన్నారు.అయితే CAQM ఎలాంటి చర్య తీసుకోలేదని తాము చెప్పడం లేదు కానీ ఆశించిన విధంగా పని చేయలేదని బెంచ్ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి తాము సమావేశం అవుతున్నామని CAQM చైర్మన్ రాజేష్ వర్మ తెలియజేయగా.. సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంత సమయం సరిపోతుందా? మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయా? పంట వ్యర్ధాలు తగులబెట్టే సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయా అని కోర్టు ప్రశ్నించింది.అలాగే తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా చైర్మన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. రెండు వారాల క్రితమే చైర్మన్ చేరారని తెలిపారు. పంజాబ్, హర్యానా అధికారులు, పొల్యూషన్ బోర్డుతో సమావేశాలు జరిగాయని, వారి ప్రధాన కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారని CAQM చైర్మన్ తెలిపారు. అనంతరం కాలుష్య నియంత్రణకు ఏర్పాటు చేసిన సమావేశాల వివరాలు, చర్యలను తమ ముందుకు తీసుకురావాలని చెబుతూ.. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం. -
కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..?
ఢిల్లీ: పంట వ్యర్థాల దహనాలపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రతిఏటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారుచేయడం సరికాదని తెలిపింది. పీల్చే గాలిని కలుషితం చేయడం ప్రజలను హత్య చేయడమేనని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు ఏం పట్టదా..? అని ప్రశ్నించింది. ఈ సమస్యపై చర్చించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు సమావేశం నిర్వహించాలని కోరింది. శుక్రవారం నాటికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని గడువు విధించింది. "పంజాబ్, హర్యానా సహా పొరుగురాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ప్రధాన కారణం. పంట వ్యర్థాలు కాల్చడం ఆపేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎలా నిలిపివేస్తారో మాకు తెలియదు. అది మీ పని. ఢిల్లీ కాలుష్యం తగ్గేందుకు వెంటనే ఏదో ఒకటి చేయండి" అని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయ చర్చ కారాదని జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కాలుష్యంతో పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 20-50 రోజులు మాత్రమే తమ రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేతలు ఉంటాయని పంజాబ్ అటార్ని జనరల్ తెలిపిన క్రమంలో ఇది అదే సమయమని తెలిపిన జస్టిస్ కౌల్.. కాలుష్యంపై అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బలవంతంగానైనా, ప్రోత్సాహకాల ద్వారానైనా పంట వ్యర్థాల కాల్చివేతలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణం అవుతున్నందున.. ఢిల్లీలోకి వెహికిల్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కౌల్ ధర్మాసనం కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతలపై స్పందిస్తూ.. పంట మార్పిడి విధానాలను అనుసరించాలని సూచించింది. ఏదేమైనా ఈ అంశంపై ఓర్పు వహించే అవకాశమే లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Delhi Air Pollution Updates: ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం -
Delhi air pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజులుగా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. సాధారణం కంటే ఇది 3 డిగ్రీలు తక్కువ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇక వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో మంగళవారం ఉదయం 9 గంటలకు 358గా రికార్డయ్యింది. అంటే గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ప్రభుత్వ సమాచారం ప్రకారం.. నగరంలో ఏక్యూఐ గరిష్టంగా 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462గా నమోదయ్యింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం మంది పిల్లల్లో శ్వాస సమస్యలు ప్రపంచంలో వాయు నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న నగరాల జాబితాలో ఢిల్లీ సైతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1,650 నగరాల్లో సర్వే చేసి ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసింది. భారత్‌లో మనుషుల మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉంది. దేశంలో ప్రతిఏటా 20 లక్షల మంది వాయు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ఢిల్లీలో నివసించే పిల్లల్లో సగం మంది పిల్లలు (దాదాపు 20.2 లక్షల మంది) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం, రోడ్డుపై దుమ్మూ ధూళి, శిలాజ ఇంధనాల వినియోగం మితిమీరడం, తీవ్రమైన చలి.. వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్య కల్లోలం దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. శీతాకాలంలో సమస్య మరింత ముదురుతోంది. ఏక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు అర్థం. ఈ ఏడాది నవంబర్ 27న హైదరాబాద్‌లో ఏక్యూఐ 272గా నమోదయ్యింది. 2019లో ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో ఏక్యూఐ 150గా రికార్డయ్యింది. నగరంలో మూడేళ్లలోనే కాలుష్య తీవ్రత భారీగా పెరగడం గమనార్హం. కరోనా ముందు కాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం 55 శాతానికి పైగానే పెరిగినట్లు స్పష్టమవుతోంది. గాలిలో కంటికి కనిపించని దూళి కణాల సంఖ్యను సూచించే ‘పీఎం 2.5’ కౌంట్ కూడా నగరంలో ‘అనారోగ్యకర’ స్థాయిలో ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాలను బట్టి తెలుస్తోంది. పీఎం 2.5 ఎక్కువగా ఉంటే మనుషుల్లో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పీఎం 2.5 స్థాయి 12 యూజీ–ఎం3 కంటే తక్కువగా ఉంటే ‘ఆరోగ్యకరం’గా గుర్తిస్తారు. కానీ, హైదరాబాద్‌లో ఇటీవల ఇది ఏకంగా 93.69 యూజీ–ఎం3గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. -
కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ–రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్సీఆర్) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలు చేస్తుంటుంది. -
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
మూతపడిన ఢిల్లీ విద్యాసంస్థలు.. మళ్లీ ఆన్లైన్ క్లాసులు!!
Delhi NCR Air Pollution latest news in Telugu సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాయులష్యం తీవ్రస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలను మూసివేయవల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ సూచనల మేరకు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఢిల్లీలోని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలోని ఆఫ్‌లైన్ క్లాసులన్నీ రద్దుచేయబడ్డాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఈ విషయంతో మరింత కఠినంగా వ్యవహరించింది. వాయుకాలుష్యం కారణంగా ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. మరి విద్యార్ధులు మాత్రం స్కూళ్లకు ఎందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయవల్సిందిగా ఆదేశించింది. ఆన్లైన్లో మాత్రమే తరగతులు నిర్వహించవల్సిందిగా సూచించింది. ఐతే పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణకు విద్యాసంస్థలను తెరవచ్చని కూడా పేర్కొంది. కాగా బుధవారం ఢిల్లీ వాయు నాణ్యత మరింత క్షీణించింది. గురువారం నాటికి పరిస్థితి ఇంకా అద్వాన్నంగా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికల ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో బుధవారం ఢిల్లీ వాయునాణ్యత 370గా నమోదుకాగా, గురువారం ఉదయం 7 గంటల సమయంలో 416గా చూపించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆఫ్‌లైన్ క్లాసులన్నింటినీ రద్దు చేసింది. చదవండి: Nepal: అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కను కున్నావా..? తోసుకెళ్తున్నారు.. -
ఈ యంత్రంతో ఢిల్లీ వాయుకాలుష్యం పరార్!! మామూలోడు కాదు..
చలికాలం వచ్చిందంటే చాలు... ఢిల్లీలోని ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్స్‌ను చూస్తే... గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. వాయు కాలుష్యమా మజకా! మరి అలాంటి వాయు కాలుష్యం గుండెల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను పరుగెత్తిస్తున్నాడు ఈ కుర్రాడు... విద్యుత్ మోహన్‌కు చిన్నప్పుడు నానమ్మ ఒక కథ రకరకాల వెర్షన్లలో చెప్పేది. ఆ కథ ఇలా ఉంటుంది... ‘అనగనగా ఒక పచ్చటి ఊరు. ఊళ్లో అందరూ బోలెడు మంచివాళ్లు. ఇలా ఉంటే రాచ్చసుడికి నచ్చుతుందా ఏమిటి? ఏదో ఒకరోజు ఆ ఊరి మీద పడి అరాచకం సృష్టించేవాడు....’ పెద్దయ్యాక విద్యుత్‌కు తెలిసింది ఏమిటంటే, బామ్మ చెప్పిన కథలోని ఆ రాక్షసుడు ఎక్కడికీ పోలేదని....దిల్లీలో ఉన్నాడని! రాక్షసుడు ఏమిటి, దిల్లీలో ఉండడం ఏమిటీ?! ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీలో ‘వాయు కాలుష్యం’ రూపంలో ఆ రాక్షసుడు వచ్చి ప్రజలను రకరకాలుగా బాధిస్తాడు. ఈ రాక్షసుడు ఎక్కడి నుంచో రావడం లేదు...మన తప్పిదాల నుంచే వస్తున్నాడు. చలికాలం వస్తుంటే భయపడే ఢిల్లీవాసుల్లో విద్యుత్ కుటుంబం ఒకటి. ఢిల్లీలో వాయుకాలుష్య ప్రభావం ఇంతా అంతా కాదు. బామ్మతో సహా విద్యుత్ కుటుంబ సభ్యులు ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను ఎదుర్కొన్నారు. చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! ఏనాటికైనా వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలనేది విద్యుత్ కల. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ తరువాత కాలంలో కార్యరూపం దాల్చింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రకరకాలుగా ఉపయోగపడే యంత్రాన్ని కనిపెట్టాలనే తన కల ‘టకాచార్’తో నిజమైంది. ఢిల్లీ వాయుకాలుష్య కారణాలలో పంట వ్యర్థాలను బహిరంగప్రదేశాలలో కాల్చడం ఒకటి. రైతులు కొత్త పంటకు సిద్ధమయ్యే క్రమంలో ఈ ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. పైగా ఇది ఖర్చుతో కూడిన పని. మరోవైపు కాలుష్యం. విద్యుత్ మోహన్ తయారుచేసిన యంత్రంతో కొబ్బరిచిప్పలు, పంటవ్యర్థాలను ఉపయోగకరమైన ఇంధనంగా మలచవచ్చు. ఈ ప్రక్రియలో వాయుకాలుష్యానికి ఆస్కారం ఉండదు. వాయునాణ్యత పెరుగుతుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరకుతుంది. మొదట్లో ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లో ఉపయోగించారు. తరువాత దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. ‘కాఫీ రోస్టర్’ ప్రిన్సిపుల్ ఆధారంగా పనిచేసే ఈ యంత్రానికి మన ప్రధాని నుంచి ప్రశంసలు లభించాయి. ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది...మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ‘టకాచార్’ (టక–డబ్బు చార్–కార్బన్) యంత్రం ఆవిష్కరణతో ‘ఎకో ఆస్కార్’గా పిలవబడే ఎర్త్‌షాట్ ప్రైజ్(బ్రిటన్) గెలుచుకున్నాడు విద్యుత్. తన కాన్సెప్ట్‌తో దగ్గరగా ఉండే కెవిన్ కుంగ్(యూఎస్)తో కలిసి ‘టకాచార్’ రిసైక్లింగ్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. దీని ద్వారా దేశీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా సేవలు అందించాలనేది అతడి లక్ష్యం. ‘వేయి శుభములు జరుగు నీకు’ అని ఆశీర్వాదం ఇద్దాం.. చదవండి: పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!! -
పకడ్బందీ చర్యలు అవసరం
దేశ రాజధాని నగరాన్ని ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్న వాయు కాలుష్యంపై మంగళవారం లోక్‌సభలో చర్చ మొదలైంది. బిల్లులపైనా, రాజకీయపరమైన అంశాలపైనా తీవ్ర వాగ్యుద్ధాలు రివా జుగా మారిన చట్టసభలో చాన్నాళ్ల తర్వాత ఒక అత్యవసరమైన... పౌరుల మనుగడకు ముప్పుగా పరిణమించిన అంశంపై చర్చ జరగడాన్ని స్వాగతించాలి. అయితే 545మంది సభ్యులుండే లోక్ సభలో ఈ చర్చకు నిండా వందమంది ఎంపీలు కూడా లేకపోవడం విచారకరం. రోడ్లపై తిరిగే వాహ నాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పంతో వాటి నంబర్ప్లేట్ల ఆధా రంగా కార్లను అనుమతించే సరి–బేసి సంఖ్య విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఈసారి కూడా అమల్లోకి తెచ్చింది. అయితే పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటును పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రైతులతో మాన్పించడంలో అక్కడి ప్రభుత్వాలు మరోసారి విఫలమయ్యాయి. పంట వ్యర్థాలను తగ లబెట్టకుండా వేరే ప్రత్యామ్నాయాలను చూపిస్తే రైతులు వాటినే అనుసరించేవారు. వాటితో బయో గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చని చాన్నాళ్లక్రితమే నిపుణులు సూచించారు. కానీ ఇంతవరకూ ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు తగలబెడు తున్నారని అంచనా. అంతమాత్రం చేత మొత్తం సమస్యంతటికీ ఇదే ప్రధాన కారణమని చెప్పడం సరికాదు. ఢిల్లీలో తిరిగే లక్షలాది వాహనాలు, ధూళి, ఆ నగరం చుట్టుపట్ల ఉండే పరిశ్రమలు, విద్యు దుత్పత్తి కేంద్రాలు, నిర్మాణ కార్యకలాపాలు వగైరా కారణాలెన్నో ఉన్నాయి. ఏటా నవంబర్ నెల వచ్చేసరికి ఢిల్లీ వాతావరణం ప్రమాదకరంగా ఉంటున్నది. ఊపిరితిత్తుల్ని సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన ధూళి కణాలు ఆ వాతావరణంలో నిండిపోతున్నాయి. ఆ నగర వాసులు దాదాపు మూడునెలలపాటు సూర్యోదయాన్ని చూడటం అసాధ్యమవుతోంది. ఒక ప్పుడు శీతాకాలం వస్తోందంటే దేశంలోని ఇతర ప్రాంతాల తరహాలోనే ఉత్తర భారతం కూడా పులకించిపోయేది. కానీ ఈమధ్యకాలంలో అదంతా మారింది. బడికెళ్లే పిల్లలున్న తల్లులు, ఉద్యో గాలు చేసేవారు మాస్క్‌లు కొనడం పెరిగింది. స్తోమత ఉన్నవారు, అవకాశం ఉన్నవారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆ మూడు నాలుగు నెలలూ వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న అరకొర చర్యల ప్రభావంపై నమ్మకంలేనివారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా మందలించినా, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పెద్దగా ఫలితం ఉన్న దాఖలా లేదు. కార్లలో వెళ్లేవారు అద్దాలు బిగించుకుని ఏసీ పెట్టుకోవడమో, స్కూళ్లకు సెలవులివ్వడమో ఈ సమస్యకు పరిష్కారం కాదు. లోక్‌సభ చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులంతా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలకంటే, వాటి ప్రచారానికే అధికంగా ఖర్చు పెట్టారని విమర్శించారు. అయితే సభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు గనుక ఈ ఆరోపణలకు గట్టిగా బదులిచ్చేవారు లేక పోయారు. లేకపోతే ఈ వాగ్యుద్ధం గంటల తరబడి సాగేది. కాలుష్యంపై వాణిజ్య ప్రకటనల కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు పెట్టిందని, అందులో సరి–బేసి విధానానికే రూ. 70 కోట్లు వెచ్చించిందని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఢిల్లీలో విస్తృతంగా కాలుష్య నియంత్రణ టవర్లు నిర్మించడం అవసరమన్న ఒక సభ్యుడి సూచన సమస్యకు పరిష్కారం అనుకోలేం. వాటివల్ల ఎంతో కొంత నివా రణ సాధ్యం కావొచ్చు. కానీ కాలుష్య కారకాలను పూర్తిగా అరికట్టడంపై దృష్టి పెట్టడం అవసరం. నాలుగురోజుల క్రితం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగిన తీరు గమనిస్తే కాలుష్య నివారణ సంకల్పం ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. 29మంది సభ్యులుండే ఆ కమిటీలో చైర్మన్‌తోపాటు హాజరైంది కేవలం నలు గురు మాత్రమే. కమిటీలో సభ్యులుగా ఉన్న వేరే రాష్ట్రాల ఎంపీలు రాలేకపోతే ఎంతోకొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ న్యూఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో కేవలం బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు మాత్రమే ఈ కమిటీలో సభ్యత్వం ఉండగా ఆయన కూడా గైర్హాజరయ్యారు. నేతల తీరిలా ఉంటే అధికారులైనా సక్రమంగా లేరు. ఆ సమావేశానికి హాజరై సభ్యులకు వారు సమస్య మూలాలను వివ రించవలసివుంది. కానీ వారికి కూడా తీరికలేకపోయింది! హాజరుకావాల్సిన అధికారుల్లో హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాలు, పర్యావరణం, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ అభివృద్ధి సంస్థ తదితర అనేక శాఖల, విభాగాల వారున్నారు. అంటే ఎంపీలు హాజ రైనా వారి సందేహాలు తీర్చేవారెవరూ ఉండేవారు కాదు. బుధవారం మరోసారి ఈ కమిటీ సమా వేశం కాబోతోంది. గత సమావేశంలో సభ్యులు, ఉన్నతాధికారుల నిర్వాకంపై విమర్శలొచ్చినందు వల్ల రేపు కమిటీ సమావేశం కిటకిటలాడే అవకాశం ఉంది. ఢిల్లీ, చుట్టుపట్ల ప్రాంతాల వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం క్లోరైడ్, కాడ్మియం, పాదరసం వంటి అణువులుంటున్నాయి. ఇవి ఆస్తమా, క్షయ వంటి వ్యాధులతోపాటు కేన్సర్, హృద్రోగం వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తున్నాయి. పౌరుల ప్రాణా లను తోడేస్తున్నవాటిలో వాయు కాలుష్యం అయిదో స్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మనసుంటే మార్గముంటుంది. చైనా రాజధాని బీజింగ్ వాతావరణంలో ప్రమా దకరమైన అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) పరిమితికి మించి 45 రెట్లు ఎక్కువున్నాయని 2014 నాటి నివేదిక చెప్పగా, ఆ దేశం పకడ్బందీ చర్యలు తీసుకుని కేవలం అయిదేళ్లలో దాన్ని పూర్తిగా అదు పులోనికి తెచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తరిమేయడానికి ప్రభు త్వంతోపాటు అన్ని పార్టీలూ ఏకం కావాలి. బుధవారం లోక్‌సభలో కొనసాగే చర్చ ఆ దిశగా తీసు కునే చర్యలకు నాంది పలకాలని ఆశిద్దాం. -
ఢిల్లీలో నిరసన: హాలీవుడ్ హీరో మద్దతు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరుతోంది. దీంతో ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై.. అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంతమంది గ్రూపులుగా చేరి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ నటుడు, పర్యావరణ ప్రేమికుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదిక ఢిల్లీ నిరసనకారులకు మద్దతు తెలిపాడు. ‘న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుమారు 1500 వందల మంది సమూహాంగా చేరి నగరంలో ప్రమాదకరంగా మారుతోన్న వాయు కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 10.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇది ప్రపంచ వాయు కాలుష్యా మరణాల గణాంకాలలో 5వ స్థానంలో ఉంది’ అని ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అదే విధంగా ఈ నిరసనకు.. కొద్ది గంటలోపే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ఈ క్రమంలో... కాలుష్య నివారణకై భారత ప్రధాని కార్యాలయం ఓ ప్రత్యేక కమిటీని నియమించిందని, ఈ కమిటి సమస్యపై సుదీర్ఘ విచారణ చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక కూడా ఇవ్వనుందని లియోనార్డో తన పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram #Regram #RG @extinctionrebellion: Over 1500 citizens gathered in at India Gate, in New Dehli, to demand immediate action on the cities hazardous pollution levels. According to the World Health Organisation, air pollution in India is estimated to kill about 1.5 million people every year; these statistics make air pollution the fifth-largest killer in India. People of all ages joined the demonstration, which succeeded to directly trigger action for Indian citizens: 1. The Indian Prime Ministers office set up a special panel to address the issue, within a few hours of the protest. The panel is due to report on the issue within 2 weeks. 2. The Supreme Court of India asked the Central Government and respective state governments to fix the crop and waste burning issue of Dehli within a week. 3. The Center accepted that Green Fund will be used to combat toxic air pollution. 4. The Indian Prime Minister asked the Agriculture Ministry to distribute equipment urgently so that crop burning is no longer necessary. Despite these promises, the air is still unsafe and activists will keep the pressure on until the air pollution reaches safe levels. The protest was organised by a collaboration of movements; @xrebellionind @LetMeBreathe_In @FridaysForFutureIndia_ along with other activists. Photography by Arjun Mahatta and co, via @FridaysForFuture #RightToBreathe #ExtinctionRebellion #IndiaGate #SolutionNotPollution #ActNow #RebelForLife A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on Nov 18, 2019 at 7:24am PST అలాగే లియోనార్డో డికాప్రియో క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూప్, ఎక్స్‌టింక్షన్ రెబెలియన్లు వంటి సామాజిక సంస్థల గురించి ఇన్‌స్టా పోస్టులో ప్రస్తావిస్తూ.. ‘ ఈ కార్యకర్తలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే కాలుష్యం తీవ్రత స్థాయి తగ్గి.. సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తుంది’ అని రాసుకోచ్చిన ఈ పోస్టుకు ‘నాకు మంచి భవిష్యత్తు కావాలి’ అంటూ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ చిన్నారి ఫోటోను జత చేశారు. అదే విధంగా న్యూఢిల్లీలోని కాలుష్యం గురించి ప్రస్తావించారు. కాగా చెన్నై నీటి సంక్షోభం గురించి కూడా అతడు ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పర్యావరణ ప్రేమికుడైన ఈ హలీవుడ్ నటుడు వాతావరణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు 1998లోనే తన పేరు మీద ఓ సంస్థను స్థాపించాడు. ఆహార కాలుష్యంపై 2016లో వచ్చిన ఓ డాక్యూమెంటరీ నిమిత్తం 2015లో భారత్‌కు కూడా వచ్చాడు. -
అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని
న్యూఢిల్లీ: అయోధ్య అంశంపై ఎటువంటి అనవసర ప్రకటనలు, వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులను కోరారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించారు. వివాదానికి తావిచ్చే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మంత్రులకు చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు తీర్పును ఓటమి లేదా గెలుపుగా భావించరాదన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ ఢిల్లీ కాలుష్య వ్యవహారంపై మొదటి సారి స్పందించారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్యంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు అవసరమైన యంత్రాలను వెంటనే అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖను బుధవారం ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత మల్టీమోడల్ ప్లాట్‌ఫాం ‘ప్రగతి’ 31వ సమావేశాల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా రోజూవారీగా నమోదవుతున్న కాలుష్యస్థాయిని సమీక్షిస్తున్నారని తెలిపింది. మోదీ ఈ సమావేశంలో రూ. 61 వేల కోట్ల రూపాయల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులను సమీక్షించారు. -
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం