Lawrence Bishnoi
-
సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా, ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పేరును ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. షూటింగ్లో ఉన్న ఇతర సిబ్బంది అతడిని బంధించారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు గుర్తు తెలియని వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం శివాజీ పార్కు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్‌కు గతంలో లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. -
బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే..
న్యూఢిల్లీ: పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్‌కు అంతకంతకూ ఉచ్చు బిగుస్తోంది. ‘మేడమ్ మాయ’తోపాటు ఈ ముఠాలోని నలుగురు సభ్యులను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ మేడమ్ మాయకు ప్రత్యేకమైన పనులను ఇచ్చేవాడని సమాచారం.మేడమ్ మాయ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీనితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలను సంబంధితులకు అందజేసే పనిని మేడం మాయనే చేస్తుంటారు. గ్యాంగ్‌లో మేడమ్ మాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఏ ముఠా సభ్యునికి బెయిల్ ఇవ్వాలో, ఏ నేరస్తుని ఏ జైలు నుండి ఎక్కడికి మార్చాలో మేడమ్ మాయనే డిసైడ్ చేస్తుంటారు.రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడమ్ మాయ ఈ ముఠాలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జైలులో ఉన్న లారెన్స్ గ్యాంగ్ సభ్యుల పూర్తి వివరాలు మేడమ్ మాయ వద్ద ఉన్నాయి. జైలులో ఉన్న నేరస్తులు అందించే సందేశాలను ఆమె స్థానిక ముఠాకు చేరవేస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న పలువురు నేరస్తులతో ఆమెకు మంచి పరిచయాలున్నాయి.మహిళా నేరస్తురాలు మేడం మాయ అసలు పేరు సీమా అలియాస్ రేణు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఆమెను మేడమ్ మాయ అని పిలుస్తారు. మేడమ్ మాయపై జైపూర్, ఢిల్లీ, హర్యానాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠాలోని ఏడుగురు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె జైపూర్‌లో ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇది కూడా చదవండి: దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం.. -
లారెన్స్ బిష్ణోయ్‌ని కేంద్రం సంరక్షిస్తోంది: కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆయన ఆరోపించారు.ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విధ్వంసం సృష్టిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడని, అక్కడి నుంచే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో భద్రతపై అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రశ్నలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు. #WATCH | In the Delhi Assembly, AAP MLA and party's national convener Arvind Kejriwal says, "In the last 10 years, Delhi's law and order is going from bad to worse, especially since 2019 when Amit Shah became the Home Minister...He is unable to handle Delhi...Incidents of murder… pic.twitter.com/vjCa9rGK4h— ANI (@ANI) November 29, 2024గత పదేళ్లలో ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2019లో అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుండి ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో ఆయన అసమర్థులుగా కనిపిస్తున్నారని, ఢిల్లీలో హత్యాయుత ఘటనలు తరచూ జరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జనానానికి దోపిడీ కాల్స్ వస్తున్నాయని, గ్యాంగ్ వార్, కాల్పులు బహిరంగంగానే జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
యూఎస్‌లో అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కానీ హత్య కేసులో కాదు!
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అన్మోల్ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించింది. అయితే అక్రమ పత్రాలతో అమెరాకలోకి ప్రవేశించిన కేసులో అతడిని పోలీసీలు అరెస్ట్ చేశారు. అన్మోల్ బిష్ణోయ్ తమ నిర్భంధంలో ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అమెరికాలోని ఎఫ్‌బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో టచ్‌లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అభ్యర్థించింది. అయితే యూఎస్ అధికారులు అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించినది కాదు కాబట్టి అతడిని ఇప్పల్లో భారత్‌కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించారు.కాగా అన్మోల్ బిష్ణోయ్ 2002లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసుతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.బిష్ణోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తూ ఉంటాడు. పంజాబ్‌లోని ఫజిల్కాకు చెందిన బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో భావించారు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో ఆన్మోల్‌ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అన్మోల్ బిష్ణోయ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అంతేగాకుండా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఈ రివార్డు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు.. భారత్‌కు అప్పగించేది అప్పుడే..
కాలిఫోర్నియా/ముంబయి:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. సోమవారం(నవంబర్ 18) తెల్లవారుజామున అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.తొలుత అమెరికా పోలీసులు అన్మోల్ను విచారించిన తర్వాత ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులకు అప్పగించే అవకాశం ఉందని ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. తర్వాతే భారత్‌కు అన్మోల్ను అప్పగిస్తారని ముంబై పోలీసులు భావిస్తున్నారు. గతేడాది తన అన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ అరెస్టయిన తర్వాత అన్మోల్ భారత్ వదిలి అమెరికా పారిపోయాడు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో పాటు పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు.ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు పట్టుబడ్డ నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. అన్మోల్కు సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షలిస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. -
గ్యాంగ్స్టర్ల స్థావరాలపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ల అరాచకాలను అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కౌశల్ చౌదరి గ్యాంగ్, హిమాన్షు భావు గ్యాంగ్, కాలా జాతేడి, హషీమ్ బాబా, చేను గ్యాంగ్, గోగి గ్యాంగ్, నీరజ్ బవానియా, టిల్లూ తాజ్‌పురియా గ్యాంగ్‌లతో సంబంధమున్న వాంటెడ్ నేరస్థుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.ఢిల్లీలోని ఔటర్ ఢిల్లీ, ద్వారకా ఏరియా, ఈశాన్య ఢిల్లీ, నరేలా, కంఝవాలా, సంగమ్ విహార్ తదితర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందం, ప్రత్యేక పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉన్న పలువురు షూటర్లు, హెంచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలోని గ్యాంగ్స్టర్లు ఇటీవలి కాలంలో తమ అనుచరుల ద్వారా కాల్పులు, హత్యా ఘటనలకు పాల్పడుతున్నారు. 2024 అక్టోబరులో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేసింది. వీరిని పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలలో అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.బాబా సిద్ధిఖీ కేసులో అరెస్టయిన షూటర్లను స్పెషల్ సెల్ విచారిస్తోంది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. 2022లో నమోదైన రెండు ఎన్ఐఏ కేసుల్లో అతనిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
అసలు హీరో అనిల్‌ను వదిలేసి.. లారెన్స్‌కు ప్రాధాన్యం.. కరెక్ట్ కాదు!
ఒక లక్ష్యం కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూ, పని చేస్తున్నవారు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. 48 ఏళ్ల అనిల్ బిష్ణోయ్ అటువంటివాడే. ఆయన విద్యావంతుడే కాదు రైతు కూడా! ఆవాలు, పత్తి పండించేవాడు. వన్యప్రాణుల ప్రేమికుడు, జంతువులు... ముఖ్యంగా కృష్ణ జింకలు అంటే ఆయనకు చిన్నతనం నుంచీ ప్రేమ ఎక్కువ! జంతువులను వేటాడేవారిని అతడు తీవ్రంగా నిరసిస్తాడు. హనుమాన్‌గఢ్‌లోని శ్రీగంగానగర్‌లో జంతువులను రక్షించే మిషన్‌ను ప్రారంభించడానికి వేటగాళ్లే కారణం అంటాడు అనిల్.బిష్ణోయ్ కమ్యూనిటీ వారికి కృష్ణ జింక పవిత్ర జంతువు. ఈ కమ్యూనిటీ వారి గురువైన భగవాన్ జాంబేశ్వర్ అడవినీ, వన్యప్రాణులనూ రక్షించాలనీ, తద్వారా మాత్రమే పర్యావరణ పరి రక్షణ ఉంటుందనీ చెప్పేవారు! ఆ బోధనల ప్రభావం బిష్ణోయ్ కమ్యూ నిటీపై ఎక్కువ ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మీద ఇదే ప్రాంతంలో జింకను చంపిన కేసు నమోదు అవ్వడం గమనార్హం. ఇప్పుడు ఆయనకు చంపుతామనే బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి బిష్ణోయ్ సమాజానికి చెందినవారు సల్మాన్‌ను తమ మందిర్‌కు వచ్చి క్షమాపణ కోరమన్నారు. దీనిని ఆసరా చేసుకుని జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగస్టర్ ముఠా బెదిరింపులకు దిగిందని అంటారు. జాతీయ మీడియా అసలు హీరో అనిల్‌ను వదిలేసి లారెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు.హనుమాన్ గఢ్ జిల్లా శ్రీగంగా నగర్‌కు చెందిన అనిల్ చిన్న నాటి నుంచే జింకల వేటగాళ్ల పట్ల కోపంగా ఉండేవాడు! వారిని పోలీస్‌లకు పట్టించేవాడు, సాక్ష్యం చెప్పి వారికి శిక్షలు పడే విధంగా చూసేవాడు! 30 ఏళ్లుగా ఈ సంరక్షకుడు 10 వేల కృష్ణ జింకలను వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడాడు! వాటి రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. గత మూడు దశా బ్దాలుగా జింకల రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాడు. చదవండి: ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!50 పంచాయతీలలో కృష్ణ జింకల సహజ అవాసాలకు కలిగిన నష్టం, వేటగాళ్ల దుశ్చర్యల గురించి ప్రచార కార్యక్రమం చేపట్టాడు. కృష్ణ జింకలకు నీరు వంటి కనీస వసతులు కల్పించడానికి పూనుకుని... తన గ్రామ ప్రజల నుంచి రెండు లక్షల రూపాయలు చందా పోగు చేశాడు. దానికి తన సొంత డబ్బు కొంత జతచేసి కృష్ణ జింకల అవసరాలను తీర్చడానికి 60కి పైగా చిన్న, మధ్య తరహా నీటి వనరులను ఏర్పాటు చేశాడు. వాటికి గాయాలు అయినపుడు చికిత్స ఏర్పాట్లు కూడా చేశాడు.చదవండి: వ్యక్తిగా రతన్ టాటా ఎలా ఉండేవారు?1990లో సూరత్ గఢ్‌లో కళాశాల చదువు చదువుతున్న కాలంలోనే అటవీ రక్షణ, వన్య ప్రాణుల రక్షణ మీద జరిగిన ఒక సదస్సులో అనిల్ పాల్గొన్నాడు. ‘ఈ సదస్సు నా మనస్సుపై చాలా ప్రభావాన్ని చూపింది’ అంటాడు అనిల్! బీఏ. బీఈడీ చదువు పూర్తి కాగానే గ్రామానికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. రాజస్థాన్ లోని 12 జిల్లాలలో 3,000 మంది వివిధ ఉద్యోగాలు చేసుకునే వారితో కలిసి వన్యప్రాణ రక్షణ మీద, శాంతి ర్యాలీలు, సమావేశాలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పటి దాకా వేటగాళ్ల మీద 200లకు పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో 30 కేసులు ముగింపు దశకు చేరాయి. కొందరికి జరిమానాలు పడ్డాయి. అనిల్ బిష్ణోయ్ తుంహే సలాం! – ఎండి. మునీర్సీనియర్ జర్నలిస్ట్ -
సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.చదవండి: సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండేచదవండి: ‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’ -
అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు
న్యూఢిల్లీ:గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్‌లో బెదిరింపుల కేసు నమోదైంది. భీమ్‌సేన చీఫ్ సత్పల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించినందుకు అన్మోల్‌పై కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన్వర్‌ను ముక్కలుముక్కలుగా నరికేస్తామంటూ అన్మోల్ గ్యాంగ్ బెదిరించినట్లు సమాచారం.అన్మోల్ జింబాబ్వే,కెన్యా ఫోన్ నెంబర్లను వాడుతూ అమెరికా, కెనడాల నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్మోల్ను భారత్ తీసుకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతడి ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఇదీ చదవండి: భీమ్ ఆర్మీచీఫ్ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి -
హైదరాబాద్‌లో ఫుల్ సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్.. కారణం ఇదే..!
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సికందర్’. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. ఈమేరకు సల్మాన్ భాగ్యనగరానికి వచ్చారు. ఈ మూవీకి సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సికందర్‌గా సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమైంది.'కిక్' సినిమా తర్వాత సాజిద్, సల్మాన్ కలయికలో రానున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి బెదిరింపుల కాల్స్ వస్తుండటంతో ఆయన సెక్యూరిటీని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడికెళ్లినా ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇప్పుడు షూటింగ్ కోసం ఇలాంటి పరిస్థితిల్లో హైదరాబాద్‌కు సల్మాన్ రావడంతో అందరిలోనూ ఆసక్తిగా ఉంది.హైదరాబాద్‌లో రాయల్ ప్యాలెస్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సికిందర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించనున్నారు. నవంబర్ 7వరకు సల్మాన్ షూటింగ్లో పాల్గొననున్నారు. వచ్చే ఏడాది ఈద్‌కి 'సికందర్' సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కు ఎలాంటి డూప్ సాయం లేకుండా సల్మాన్ నటించనున్నారు. -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు వార్నింగ్స్.. ఆయనతో మూడేళ్లు ఉన్నా : సోమీ అలీ
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తి సల్మాన్ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో తనను సల్మాన్ తీవ్రంగా కొట్టాడని కూడా ఆమె పేర్కొంది. అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తున్న సమయంలో దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ గురించి చాలామంది నటీనటులు మాట్లాడుతుండేవారని ఆమె చెప్పింది. అయితే, వారి పేర్తు ఎత్తకుండా 'అండర్ వరల్డ్' అని చెప్పేవారు. సల్మాన్‌తో సుమారు మూడేళ్ల పాటు గ్యాలెక్సీ అపార్ట్మెంట్లో తాను ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని గుర్తుచేసుకుంది. ఓసారి అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు సోమీ అలీ తెలిపింది. అయితే, ఆ ఫోన్ కాల్ తానే లిఫ్ట్ చేసినట్లు ఆమె చెప్పింది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం తనకు తెలయదని ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఫోన్లో ఇలా వార్నింగ్ ఇచ్చాడు. 'సల్మాన్‌కు పలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఆయన ప్రియురాలిని కిడ్నాప్ చేయబోతున్నామని.' అన్నారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆమె చాలా భయపడిపోయినట్లు తెలిపింది. 'ఫోన్ కాల్ గురించి వెంటనే సల్మాన్‌తో చెప్పాను. నేను చాలా భయపడుతున్నానని చెప్పడంతో ఆయనలో కూడా కాస్త భయం మొదలైంది. అయితే, రెండురోజుల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని సల్మాన్ తెలిపారు. మరోసారి వార్నింగ్ ఫోన్ కాల్ రాలేదు. కానీ, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.' అని సోమీ అలీ చెప్పింది.సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్ నటి అని తెలిసిందే. సుమారు ఎనిమిదేళ్లుగా సల్మాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారని సమాచారం. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం అక్కడ పెద్దగా ఛాన్సులు రావడంలేదు. -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్‌కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. -
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. అంతే రేంజ్లో దూకుడుగా పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఆయన్ను అంతం చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు కాల్స్ వచ్చాయి. దీంతో సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటున్నారు. అక్టోబర్ 30న సల్మాన్‌ను రూ. 2కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంత సమయం క్రితం అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం రూ. 5 కోట్లు కావాలని బెదిరింపులకు దిగిన కూరగాయల వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో మాదిరే ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది. సల్మాన్‌ను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన్ను ప్రాణాలతో వదిలేయాలంటే రూ. 2 కోట్లు ఇప్పించాలని మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు బాంద్రాకు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫాను అరెస్ట్ చేశారు. 2022 నుంచి ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి మెసేజ్‌లు సల్మాన్‌కు వచ్చాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్ గెలాక్సీ అపార్ట్మెంట్లోని అతని నివాసానికి సమీపంలో ఉన్న ఒక బెంచ్‌పై కూడా సల్మాన్‌ను బెదిరిస్తూ ఒక లేఖ కనుగొనబడింది. అప్పట్నించి ఈ కేసులో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.1998లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడారు. అయితే, కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు చాలా పవిత్రంగా చూస్తారు. వీటిని సల్మాన్ వేటాడటం ఆ వర్గానికి చెందిన వారికి నచ్చలేదు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని లారెన్స్ బిష్ణోయ్ ఒక గ్యాంగ్‌ను తయారు చేశాడు. అతన్ని అంతం చేసేందుకే ఉన్నామంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్నిసార్లు సల్మాన్‌పై హత్యాయత్నం కూడా చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. -
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్యూ: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్ పోలీసులపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్లో ప్రసారం చేశారు.కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో సిట్ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్ కస్టడీలో ఉండగా లారెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్ హోం శాఖ కార్యదర్శి గుర్కిరత్ కిర్పాల్ సింగ్ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు కాల్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగిన దగ్గర నుంచి బెదిరింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ఓ మెసేజ్ రాగా.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో వాట్సాప్స్ మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)ఈ క్రమంలోనే వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాపు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యమైన బాబా సిద్దిఖీ కొడుకు జీషన్ సిద్దిఖీని కూడా చంపేస్తామని బెదిరించాడు. ఇలా చేసిన 20 ఏళ్ల గుఫ్రన్ని అరెస్ట్ చేసిన కాసేపటికే సల్మాన్‌కి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.అప్పుడెప్పుడో కృష్ణజింకలని వేటాడిన కేసు ఇప్పటికీ సల్మాన్‌ఖాన్ వెంటాడుతూనే ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. పలుమార్లు చంపుతామని బెదిరిస్తూనే ఉన్నారు. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని కూడా అన్నారు. కానీ భద్రత పెంచుకోవడం తప్పితే సల్మాన్ నుంచి క్షమాపణ గురించి స్పందన లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. కండోమ్ కంపెనీపై కేసు పెడితే?) -
పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరికలు
పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.చదవండి: చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అలాగే అన్మోల్ను పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కాగా గత ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మీన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో అన్మోల్కు ప్రమేయం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య వంటి కారణాలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. బాబా సిద్దిఖీ హత్యతో అన్మోల్ బిష్ణోయ్ పేరు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారుఅన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. గత ఏడాది నకిలీ పాస్‌పోర్ట్‌తో భారత్ నుంచి పారిపోయిన అన్మోల్.. అనంతరం కెన్యా, కెనడాలో గుర్తించారు. ప్రస్తుతం అతడు కెనడాలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామన్న కూరగాయల వ్యాపారి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ కొద్దిరోజుల క్రితం బెదిరింపు మెసేజ్ పెట్టిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన షేక్ హుస్సేన్ (24)గా గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో హుస్సేన్ కూడా అదే గ్యాంగ్‌కు సంబంధించిన వ్యక్తి అంటూ సల్మాన్ నుంచి రూ. కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ చేశాడు.సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కూరగాయల వ్యాపారి షేక్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే తాను ఇలాంటి ప్లాన్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయినప్పటికీ అతన్ని పూర్తిగా విచారించిన తర్వాతే కోర్టులో హాజరుపరచనున్నారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులకు కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. అయితే, ఒకరోజు తర్వాత అతను మరో సందేశం ఇలా పంపించాడు. 'నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండి' అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి.. జంషెడ్పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. -
సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్
మహారాష్ట్రతోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనం రేపిన ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో కీలకవిషయం వెలుగుచూసింది మాజీ మంత్రి అయిన సిద్ధిఖీని హత్య చేసే ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో షూటర్లు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గల ఉద్దేశం తెలియనప్పటీకి నిందితులు స్నాప్‌చాట్ ద్వారా నిందితులు తరచూ అన్మోల్తో సంభాషణలు జరిపినట్లు గుర్తించామని తెలిపారు.కెనడా, అమెరికాలకు చెందిన నిందితులతో అన్మోల్కు పరిచయం ఉందని, నిందితుడి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు స్నాప్‌చాట్ ద్వారా ఒకరితో ఒకరు టచ్‌లో ఉండేవారని, మెసెజ్ వచ్చిన తర్వాత వారు దానిని వెంటనే తొలగించేవారని పేర్కొన్నారు.. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల స్నాప్‌చాట్‌ను నిశితంగా పరిశీలించగా.. షూటర్లు, ప్రవీణ్ లోంకర్ నేరుగా అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలిందని ముంబై పోలీసులు తెలిపారు.స్నాప్‌చాట్‌లో 24 గంటల్లోపు చాట్ మాయమయ్యే ఆప్షన్‌ను ఉపయోగించి నిందితులు సంప్రదింపులు జరుపుకునేవారని, దానిద్వారానే అన్మోల్ వారికి సిద్దిఖీ, అతడి కుమారుడి ఫొటోలు పంపాడని నిందితులు పేర్కొన్నట్లు వెల్లడించారు. అయితే 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవ్వడం వల్ల వారి సంభాషణలను సేకరించలేకపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. సిద్దిఖీని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న షూటర్లు దాడికి ముందు అటవీ ప్రాంతంలో చెట్లను లక్ష్యంగా చేసుకొని షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొన్నారన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.కాగా దసరా సందర్భంగా బాబా సిద్ధిక్ ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల బాణాసంచా పేలుస్తుండగా దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిచంపిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన్ని లీలావతి ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం సిద్దిఖీని చంపింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు పేర్కొంది. దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. -
‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’
ముంబై: ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. రూ. కోటి రివార్డు ఇస్తామంటూ క్షత్రియ కర్ణిసేన ప్రకటించింది. క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్.. లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజ్ సేకావత్ ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే.. భద్రతా సిబ్బందికి మేము ప్రకటించిన రివార్డు అందజేస్తాం. లారెన్స్ బిష్ణోయ్ విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభ్వుం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అమర్ షహీద్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని హత్య చేసిన నిందితుల్లో లారెన్స్ బిష్ణోయ్ కూడా ఒకరు’’ అని అన్నారు.लॉरेंस बिश्नोई के एनकाउंटर के लिए क्षत्रिय करणी सेना ने घोषित किया इनाम। सुनिए क्या कह रहे है डॉ. राज शेखावत। #LawrenceBishnoi #KarniSena #SalmanKhan #BabaSiddique #BabaSiddiqui #Gujarat pic.twitter.com/zaHn3O8ens— Achlendra Kr. Katiyar (@achlendra) October 21, 2024డిసెంబర్ 5, 2023న జైపూర్‌లో గుర్తుతెలియని దుండగులు.. కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. బిష్ణోయ్‌కు సంబంధించిన బలమైన క్రిమినల్ సిండికేట్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పని చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా ఈ గ్యాంగ్ బాధ్యత వహించటం గమనార్హం. కెనడాలోని ఏపీ ధిల్లాన్, గిప్పీ గరేవాల్ నివాసాల వెలుపల కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన కేసులో కూడా అతని పేరు ఉంది. చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్ -
‘సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్‌ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్‌లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
సిద్ధిఖీ కేసు: ‘నిందితుల ఫోన్లో జీషన్ ఫొటో’
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగి వారంరోజులు గడుస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా కీలక విషయాలు బయటపెట్టారు. బాబా కుమారుడు జీషన్ సిద్దిఖీ ఫొటోను నిందితుడి ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. హత్య కేసు కేసు.. సూత్రధారి బాబా కుమారుడు జీషన్ సిద్ధిఖీ ఫొటోనే షూటర్లతో పంచుకోవడానికి సోషల్ మీడియా అప్లికేషన్ యాప్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.Baba Siddique murder case | A picture of Baba Siddique's son Zeeshan Siddique was found in the phone of the accused in Baba Siddique's murder. This picture was shared with the accused by their handler through Snapchat. Investigation revealed that the shooters and conspirators…— ANI (@ANI) October 19, 2024షూటర్లు, కుట్రదారులు సమాచారాన్ని చేరవేయటం కోసం ఈ అప్లికేషన్‌ను ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ యాప్‌లో సమాచారం చేరిన వెంటనే ఆటో డిలీట్ అయ్యే ఫీచర్ ఉండటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు షూటర్లలో గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇక.. నాలుగో నిందితుడు హరీష్ కుమార్ బలక్రమ్ నిసాద్‌ను సోమవారం యూపీలో అరెస్టు చేసి శుక్రవారం ముంబైకి తీసుకువచ్చారు. చదవండి: బాబా సిద్దిఖీ హత్య కేసులో మరో ఐదుగురు అరెస్ట్కానిస్టేబుల్ సస్పెండ్బాబా సిద్ధిఖీ హత్య జరిగిన సమయంలో ఆయనతో పాటే ఉన్న పోలీస్ సెక్యూరిటీ గార్డు కానిస్టేబుల్ శ్యామ్ సోనావానే సస్పెండ్ అయ్యారు. ఆయనపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.Baba Siddique Murder case | Police security guard Constable Shyam Sonawane, present with late NCP leader Baba Siddique at the time of the murder has been suspended. An internal investigation is also going on: Mumbai Police— ANI (@ANI) October 19, 2024ఇక.. బాబా సిద్ధిఖీ తామే హత్య చేయించామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, దావూద్ ఇబ్రహీం వంటి అండర్‌వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని కారణంగా టార్గెట్ చేసినట్లు ఆ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.చదవండి: సిద్ధిఖీ కేసు: 65 బుల్లెట్లు, యూట్యూబ్ వీడియోలు, బైక్‌తో ప్లాన్