Mahabubabad District Latest News
-
ప్రధాన వీధుల్లో పోలీసుల కవాతు
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటనకు మహబూబాబా ద్ జిల్లాలో ధర్నా చేపట్టడం సబబుకాదని, ఆ ఉద్దేశంతోనే మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించి పోలీసు అనుమతి నిరాకరించామని తెలిపారు. రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు, భరోసా కల్పించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బీఎన్ఎస్ఎస్–163(144 సెక్షన్) అమలు చేస్తున్నామన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామన్నారు. కవాతులో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఏఆర్, సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు. భారీగా మోహరించిన బలగాలు -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
గూడూరు: విద్యార్థులు ఇష్టంతో చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులన్నీ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో సమావేశమై ప్రతీరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం మండల స్థా యి చెకుముకి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. జిల్లాస్థాయికి ఎంపికై న వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదో తరగతి తొలిమెట్టు మహబూబాబాద్అర్బన్: విద్యార్థుల చదువులో విజయానికి తొలిమెట్టు పదో తరగతి అని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని, పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గిరిజ, వసంత, శ్రీవాణి, రమేష్, సంజీవ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎస్డీఎం
మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాల టీపన్ కోసం ఓ అధికారిణి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు పట్టించిన సంఘటన జిల్లా కలెక్టరేట్లో గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన తాళ్ల కార్తీక్ జిల్లాలోని కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామ శివారున ఉన్న సర్వే నంబర్ కే.41667/ 77లో 2.50 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నా డు. ఆ భూమికి సంబంధించిన వివరాలు, వివాదా లు, అనుమానాల నివృత్తి, టీపన్ కోసం జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ అధికారిణి కె.జ్యోతిశర్మబాయిని సంప్రదించాడు. సదరు భూమికి టీపన్ ఇవ్వాలంటే చలానా కట్టాల్సిఉంటుందని, అందుకు రూ.5 వేలు ఇవ్వాలని ఆమె చెప్పగా కార్తీక్ అక్టోబర్ 28న డబ్బులు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ టీపన్ కోసం పలుమార్లు సంబంధిత కార్యాలయానికి వస్తున్నా పనిపూర్తికాకపోగా ఆమె మళ్లీ రూ.20 వేలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పగా ఈ నెల 12న లంచం ఇవ్వడం ఇష్టంలేక కార్తీక్ వరంగల్‌లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్తీక్ నుంచి సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ అధికారి జ్యోతిశర్మబాయి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి జ్యోతిశర్మబాయిని శుక్రవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. టీపన్ ఇవ్వడానికి రూ.20వేలు డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు -
పత్తి వాహనాల బారులు
పెద్దవంగర: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని చిన్నవంగర పరిధి ఎల్బీతండాలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పారంభించారు. కాగా గురువారం కొనుగోలు కేంద్రం వద్ద వాహనాలు బారులుదీరాయి. అధికారులు చొరవ తీసుకోక పోవడంతో రైతులు సీసీఐ కేంద్రం ఎదుట వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. దీంతో తొర్రూరు–వలిగొండ ప్రధాన రహదారిపై వాహనాలు నిలవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విక్రయాలు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పత్తి రైతులు కోరుతున్నారు. ఉచిత చేపపిల్లలతో ముదిరాజ్‌ల అభివృద్ధినెల్లికుదురు: ప్రభత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలతో ముదిరాజ్ కులస్తులు అభివృద్ధి చెందాలని జిల్లా మత్స్యశాఖ అధికారి వీరన్న అన్నారు. మండంలంలోని నెల్లికుదురు, ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం, చిన్ననాగారంతో పాటు 11 గ్రామాల్లోని 30 చెరువుల్లో 51,60,00 ఉచిత చేప పిల్లలను ముదిరాజ్‌లతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, నాయకులు యాకాంతం, శ్రీనివాస్, నర్సయ్య ముదిరాజ్‌లు గుండ వెంకన్న, యాకూబ్, ఆలి, శ్రీపతి, విష్ణు, సురేష్, సంపత్, అశోక్, వెంకన్న, సోమయ్య పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనమహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం గ్రూప్–4 ద్వారా జిల్లాకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు వెరిఫికేషన్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 71మంది అభ్యర్థులు రెవెన్యూ శాఖ కు ఎంపిక కాగా.. వారిలో 61మంది హాజరయ్యారు. వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిందని అధికారులు పేర్కొన్నారు. క్రీడల్లో రాణించాలిమహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీసీ హాస్టళ్ల విద్యార్థులకు గురువారం జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి మాట్లాడుతూ.. వాలీబాల్, కోకో, కబడ్డీ, రన్నింగ్ తదితర క్రీడలు నిర్వహించామని, 350మంది పాల్గొన్నారని చెప్పారు. ఇందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా యువజన క్రీడల శాఖఅధికారి అనిల్, గ్రౌండవాటర్ శాఖ అధికారి సురేష్, పీడీలు, పీఈటీలు ఉన్నారు. ఆకస్మిక సందర్శనకేసముద్రం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మండల కేంద్రంలోని ఈజీఎంఎం, ఎంపీడీఓ కార్యాలయాలను అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈమేరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. -
మత్తు వదిలించేనా?
నవంబర్ 8న వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సి బ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాం– 2, 3 వైపు ప్లాస్టిక్ సంచులు, బుట్టలతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చే యగా.. గుట్టురట్టయ్యింది. ఒడిశాలోని గంజాం జిల్లా తలపాడు గ్రామానికి చెందిన బా బిత కుమారి పాణిగ్రహి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తుండగా.. గంజాయి లభ్యమైంది. ● ‘పుష్ప’ సినిమా తరహాలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొందరు ఒడిశాలోని నా టుగురులో 338కిలోల గంజాయి కొని 96 ప్యాకెట్లుగా మార్చి ట్రాక్టర్ ట్రాలీ కింద భద్రపర్చి వరంగల్ నుంచి కామారెడ్డికి సెప్టెంబర్ 21న తరలిస్తుండగా.. హసన్‌పర్తి మండలం అనంతసాగ ర్ వద్ద యాంటీ డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. ● సెప్టెంబర్ 28న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి మరిపెడ నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తూ గాలివారిగూడెం సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అందులో రూ.31.75 లక్షల విలువైన 127 కిలోల ఎండు గంజాయి లభించింది.● ఆగస్టు 28న సుబేదారి పోలీసులు హనుమకొండ అంబేడ్కర్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మంగపేట మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.23 వేల విలువైన 880 గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు.●● వరంగల్ జిల్లా ఖానాపురం, చెన్నారావుపేటకు చెందిన ముగ్గురు యువకులు హనుమకొండలోని పెగడపల్లి డబ్బాల సమీపంలో గంజాయి సేవిస్తూ ఇటీవల కేయూసీ పోలీసులకు పట్టుబడ్డారు.జోరుగా గంజాయి దందా యువతే టార్గెట్‌గా బిజినెస్ విచ్చలవిడిగా విక్రయాలు రెండు కమిషనరేట్లు, నాలుగు జిల్లాలకు కేంద్రంగా నగరం డబ్ల్యూఎన్‌పీఎస్ ఏర్పాటుతో భరోసా.. -
– మామునూరు/మడికొండ
మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల, మడికొండలోని సీటీసీలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్లు అట్టహాసంగా జరిగాయి. 9నెలల ట్రైనింగ్‌కు ట్రైనీ కానిస్టేబుళ్లు దీక్షాంత్ పరేడ్‌తో వీడ్కోలు పలికారు. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ప్రధాన అంశాలను అభ్యర్థులు ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. శిక్షణను ముగించుకుని విధులలో చేరనున్న తమ బిడ్డలను చూసేందుకు ఉమ్మడి పది జిల్లాల నుంచి తల్లిదండ్రులు వచ్చారు. వారి పిల్లల పరేడ్, విన్యాసాలు చూస్తూ ఆనందంలో మునిగిపోయారు. పరేడ్ అయిపోగానే ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషంగా గడిపారు. పీటీసీలో జరిగిన కార్యక్రమానికి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య హాజరుకాగా, సీటీసీలో సీపీ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. – వివరాలు 8లోu -
ఉపాధ్యాయుల డిప్యుటేషన్!
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు మొదలుకొని కొత్త ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే అన్ని పాఠశాలల్లో ఉపాధ్యామ పోస్టులు భర్తీ కావడంతో తక్కువ విద్యార్థులు ఉన్న చోట ఎక్కువ ఉపాధ్యాయులు, ఎక్కువ విద్యార్థులు ఉన్నచోట తక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయుల సేవలను సద్వినియోగం చేసుకోవడం, వర్క్ అడ్జెస్ట్మెంట్( పని విభజన)కోసం విద్యాశాఖ అధికారులు కరసత్తు ప్రారంభించారు. ఉపాధ్యాయుల అవసరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే పనిలో విద్యాశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు 1,221 ఉన్నాయి. ఇందులో 98,112 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధించేందుకు అన్ని కేడర్ల ఉపాధ్యాయులు 3,423 మంది ఉన్నారు. అయితే కొత్తగా డీఎస్సీ ద్వారా 356 మంది ఉపాధ్యాయులను భర్తీ చేశారు. పోస్టుల మంజూరు ఉన్న పాఠశాలకు కొత్త ఉపాధ్యాయులను నియమించారు. అయితే జిల్లాలో 159మేరకు పాఠశాలల్లో విద్యార్థులు లేరని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే పని ఉపాధ్యాయులపై పెట్టినా.. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటంతో ఇప్పటికిప్పుడు విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలతోపాటు, పిల్లలు లేని పాఠశాలల్లో పనిచేసే వారిని కూడా వేరేచోటుకు పంపించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంఈఓల ద్వారా జాబితా మండల విద్యాశాఖ అధికారుల(ఎంఈఓ) ద్వారా పని విభజన జాబితాను తెప్పించినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికా రి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాంప్లెక్స్ బాధ్యులతోపాటు, ప్రధానో పాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయుల అవసరా ల నివేదికను తీసుకొని ఎంఈఓ జిల్లా విద్యాశా ఖ అధికారికి పంపినట్లు తెలిసింది. ఇలా జిల్లాలోని 190 మందికి పైగా ఉపాధ్యాయులను తాము పనిచేస్తున్న చోటు నుంచి మరోచోటు కు డిప్యుటేషన్ వేసే పనిలో విద్యాశాఖ ఉంది.టీచర్ల పని విభజనపై కసరత్తు ఏంఈఓల ద్వారా వివరాల సేకరణ విద్యార్థులు లేని.. ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న పాఠశాలల గుర్తింపు ఆ స్కూళ్ల నుంచి వేరేచోటుకు డిప్యుటేషన్ -
త్వరలో మానుకోటలో మహాధర్నా
మహబూబాబాద్: మహబూబాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి ని రాకరించారని, త్వరలోనే హైకోర్టు అనుమతితో మహాధర్నా నిర్వహిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మానుకోట ధర్నా విషయంలో పోలీస్‌లు, కాంగ్రెస్ హైడ్రామా బట్టబ యలైందన్నారు. లగచర్ల ఘటన గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేందుకే మానుకోట మహాధర్నాకు పిలుపునిచ్చామని, ధర్నాకు అనుమతి ఇవ్వకపోగా 144 సెక్షన్ విధించి మానుకోటలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాళ్లతో కొడతామని మాట్లాడిని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్‌పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లగచర్లతోనే సీఎం రేవంత్‌రెడ్డి కౌన్ డౌన్ ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత , మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న, నాయకులు యాకూబ్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, రవికుమార్, వెంకన్న, కన్నా, అశోక్, రంజిత్, ఫరీద్ ఉన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ -
No Headline
సాక్షిప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ను తమ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నారు గంజాయి విక్రయదారులు. కొత్త పంథాలో, సరికొత్త ఎత్తుగడలతో గంజాయిని తరలిస్తూ, విక్రయిస్తున్నారు. పోలీ సులు ఎప్పటికప్పుడు తనిఖీలతో చెక్ పెడుతున్నప్పటికీ.. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్నట్లుగా ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈజీ మనీ కోసం కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. విశాఖపట్నం, ఒ డిశా నుంచి వరంగల్ మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న ముఠా..నగరంలో నూ ఏజెంట్లను ఏర్పరుచుకుని గంజాయి విక్రయిస్తోంది.కాగా..సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను మంగళవారం ప్రారంభించారు.ఈనేపథ్యంలో వరంగల్‌ను డ్రగ్స్‌ఫ్రీ కేంద్రంగా మార్చేందుకు మరింత సీరియస్‌గా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. స్కూల్ స్థాయి నుంచే.. యువతతో పాటు కొందరు స్కూల్ స్థాయి నుంచే గంజాయి వినియోగిస్తున్నారు. రాత్రి సమయంలో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణలు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట, చిన్నవడ్డేపల్లి చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, ఖిలావరంగల్ గుండు చెరువు, రాతికోట, ఎనుమాముల మార్కెట్ శివారు, కాకతీయ కెనాల్ ప్రాంతాలు, హనుమకొండలోని బంధం చెరువు, న్యూశాయంపేట రైల్వే ట్రాక్, ఔటర్ రింగ్ రోడ్డు, పలివేల్పుల, వడ్డేపల్లి చెరువు కట్ట, హాస్టళ్లు, అద్దె రూములను అడ్డాగా చే సుకొని విద్యార్థులు బృందాలుగా ఏ ర్పడి గంజాయి తాగుతున్నారు. ఇటీవల అమ్మాయిలు సైతం గంజాయికి అలవాటు పడుతున్నట్లు తెలిసింది. కట్టడి చేసేందుకు డబ్ల్యూఎన్‌పీఎస్.. డ్రగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌తో పాటు మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇక్కడే హెడ్‌క్వార్టర్‌గా డీఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.88 కోట్ల విలువైన 35,319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 389 కేసులు నమోదు చేసినట్లు అధికారులు డబ్ల్యూఎన్‌పీఎస్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. రవాణా మార్గాలివే.. గంజాయిని ప్రధానంగా ఏడు మార్గాల ద్వారా వయా వరంగల్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం నుంచి వరంగల్ ఒక మార్గం, చిత్రకొండ, సీలేరు, డోర్నకల్, మోతుగూడెం, లక్నవరం ఎక్స్ రోడ్, రాజమండ్రి మరోమార్గం. కలిమెల, కుంట (ఛత్తీస్‌గఢ్), చెట్టి (చింతూరు), భద్రాచలం మరోమార్గం. భద్రాచలం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, వరంగల్, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున గంజాయి తరలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదో రూటు రాజమండ్రి, అశ్వారావుపేట, కల్లూరు, తల్లాడ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ కాగా.. పాడేరు, జి మాడ్గుల, చోడవరం, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్‌కు గంజాయి తరలుతోంది. అలాగే చింతపల్లి, లంబసింగి, నర్సిపట్నం, కోటనందూరు, తుని, జగ్గంపేట, రామచంద్రాపురం, చింతూరు, గుండాల, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, జనగామ, హైదరాబాద్‌కు వెళ్తుండగా..ఇదేదారిలో జనగామ నుంచి వరంగల్‌కు చేరుతుంది. అరకు, ఎస్.కోట, దేవరపల్లి, పెందుర్తి, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, కోదాడ నుంచి వరంగల్, హైదరాబాద్‌కు.. వరంగల్ నుంచి మహారాష్ట్రకు వివిధ మార్గాల ద్వారా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి, కేసులు, విలువ యూనిట్ కేసుల డిస్పోస్డ్ డ్రగ్ విలువ సంఖ్య (కిలోల్లో) (రూ.కోట్లలో) వరంగల్ 21 1,245.439 3.07 మహబూబాబాద్ 24 515 1.29 జేఎస్ భూపాలపల్లి 25 636.39 1.59 ఖమ్మం 48 853.577 1.96 భద్రాద్రి కొత్తగూడెం 271 32,069.181 80.17 మొత్తం 389 35319.587 88.08 -
వేగంగా ఇంటింటి సర్వే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. మొదట ఇబ్బందిపడిన ఎన్యుమరేటర్లు..ప్రస్తుతం గాడినపడ్డారు. అయితే జిల్లాలో అధికారుల లెక్కలకు మించి కుటుంబాల సంఖ్య పెరగడంతో ఎన్యుమరేటర్లపై అదనపు భారం పడుతోంది. అయితే సర్వే త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిరావడంతో క్షేత్రస్థాయిలో వేగం పెంచారు. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘాపెట్టి సర్వేను వేగవంతం చేస్తున్నారు. పెరిగిన కుటుంబాలు ప్రభుత్వం నిర్వహించే ఆర్థిక, సామాజిక, కుల, ఉద్యోగ, ఆదాయ సర్వేకోసం జిల్లాలోని 18మండలాల పరిధిలోని 461గ్రామ పంచాయతీలు,అందులోని కుటుంబాల వివరాలు సేకరించారు. ముందుగా స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 2,45,939 కుటుంబాలు ఉంటాయని అంచనా వేశా రు. అయితే తర్వాత మరోసారి లెక్కించగా కుటుంబాల సంఖ్య 2,66,603కు చేరింది. అంటే ముందుగా వేసిన లెక్కలకు 20,664 కుటుంబాలు పెరిగా యి. సర్వేపూర్తయ్యే నాటికి మరిన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లపై భారం.. ముందుగా వేసిన లెక్కల ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతీరోజు 15 కుటుంబాలు సర్వే చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,884 మంది అవసరం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి మొదలైన శాఖలకు చెందిన వారికి డ్యూటీలు వేశారు. అయితే ఇందులో కొంతమంది ఆరోగ్యం, కుటుంబ కారణాలతో సర్వే చేయలేమని అధికారులకు విన్నవించి వైదొలిగారు. అదేవిధంగా డ్యూటీలు వేసే అధికారులకు అవగాహన లేకపోవడంతో మరికొందరికి ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎన్యుమరేటర్ల సంఖ్యను 2,034కు పెంచారు. అయినప్పటికీ కుటుంబాలకు సరిపడా ఎన్యుమరేటర్లను పెంచేందుకు వీలుకాలేదు. కాగా ముందుగా ప్రతీరోజు 15 కుటుంబాల సర్వే చేయాలని చెప్పగా.. ప్రస్తుతం 20కి పైగా కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. ఒక్కో ఎన్యుమరేటర్ 175 నుంచి 180 వరకు కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. సర్వే వివరాలు జిల్లాలో కుటుంబాలు అర్బన్ : 38,845 రూరల్ : 2,27,758 మొత్తం : 2,66,603 సర్వే పూర్తి చేసిన కుటుంబాలు అర్బన్ : 35,267(90.8శాతం) రూరల్ : 2,01,233(88.4శాతం) మొత్తం : 2,36,500(88.7శాతం)గాడినపడిన ఎన్యుమరేటర్లు పెరిగిన కుటుంబాలతో అదనపు భారం 89శాతం సర్వే పూర్తి.. మిగిలింది 30వేల కుటుంబాలే..ఆలస్యంగా ప్రారంభమై.. ఒక్కో ఇంటి సర్వేకు అర్ధగంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే సర్వే చేసేవారిలో కొందరు వయస్సు మీదపడిన వారు, కంటి చూపు మందగించిన వారు, తక్కువ చదువుకున్నవారు ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికీ పలు కుటుంబాల ఇంటి ముందు స్టిక్కర్లు అంటించకపోవడంతో ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. అదేవిధంగా సర్వేకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే, మరోరోజు వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు సర్వేకు సహకరించకపోగా.. ఎదురు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నట్లు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. మొత్తంగా తొలినాళ్లతో పోలిస్తే సర్వే వేగం పుంజుకుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనం ద్వారా మేధాశక్తి పెరుగుతుందని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. స్థానిక జిల్లా గ్రంథాలయంలో బుధవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం రిటైర్డ్ గ్రంథ పాలకులు లక్ష్మణ్, నరేందర్, ఉప్పలయ్యను అదనపు కలెక్టర్ సన్మానించారు. తర్వాత విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాంనర్సయ్య, విజేందర్, వీరేందర్, భూలక్ష్మి, భాస్కర్, అభిషేక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిమహబూబాబాద్ రూరల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ జి. మురళీధర్ అన్నారు. మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామంలోని ఆయుష్మాన్ మందిర్ (సబ్ సెంటర్)ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నా రు. గర్భిణులను ట్యాగ్ ఫెసిలిటీస్‌కు పంపించాలని, 102 వాహనాన్ని వినియోగించుకోవా లన్నారు. పుట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. 12 వారాల్లో గర్భిణులను నమోదు చేయాలని, రెండు వారాలకు మించి దగ్గు ఉంటే తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయను త్వరగా గుర్తించి ఆరునెలల వరకు మందులు వాడితే వ్యాధి నయమవుతుందని తెలిపారు. రికార్డులను పరిశీలించి అన్ని ఆన్లైన్లో నమో దు చేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డిమహబూబాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడని, ఆయన చేసి ఉద్యమాలేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రస్తుత కేంద్ర మంత్రికిషన్‌రెడ్డి కృషి చేశారని, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని నిరాహార దీక్ష చేశారని అన్నారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలకు పెద్దపీట వేసే కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు మోసంగి మురళి, ధర్మారపు వెంకన్న, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాధవపెద్ది శశివర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, జిల్లా కార్యదర్శి భాను శ్రీనునాయక్ పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన డీఈఓ రవీందర్రెడ్డిమహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈఓగా వ్యవహరిస్తున్న రాజేశ్వర్ యథావిధిగా ఏఈడీగా విధులు నిర్వర్తించనున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓ రవీందర్‌రెడ్డిని విద్యాశాఖ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గూడూరు:ధాన్యం కొనుగోలు కేందాల్లో నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని అయోధ్యపురం, గూడూ రులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ శ్వేత, ఐకేపీ ఏపీఎం రవీందర్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు కేసముద్రం: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని రకాల వసతులు కల్పించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ఉప్పరపల్లి, కేసముద్రంవిలేజ్, కల్వల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, ధాన్యంలోని తేమను పరిశీలించారు. ఇన్చార్జ్ తహసీల్దార్ ఎర్రయ్య, ఏఓ వెంకన్న, సీఈఓ వెంకటాచలం, గోపాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహకరించాలి.. మహబూబాబాద్ రూరల్:ఽదాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సహకరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఏఓ తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, ఏపీఎం తిలక్, ఏపీఓ రమేష్ రెడ్డి, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
పొంగిపొర్లిన ట్యాంకు నీళ్లు
కురవి: మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి నీళ్లు పొంగిపొర్లడంతో ధాన్యం తడిసిముద్దయిన ఘనట మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కురవి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని మూడు రోజులుగా తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. నాగన్న గుడి ఆవరణలో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఉంది. రోజు మాదిరిగానే భగీరథ నీటిని ట్యాంకులోకి ఎక్కించారు. అయితే అది నిండి రాత్రంతా పొంగిపొర్లిన నీటితో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. బుధవారం ఉదయం రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నానాపాట్లు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని సొసైటీ అధికారులు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు అత్తునూరి లక్ష్మి, సీతయ్యతోపాటు మరికొందరు రైతులు వేడుకుంన్నారు. తడిసి ముద్దయిన ధాన్యం -
వానరానికి విద్యుత్ షాక్
● సీపీఆర్ చేసి బతికించిన యువకుడు కురవి: సీరోలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదవశాత్తు వానరానికి బుధవారం విద్యుత్ షాక్ తగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కాగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న అదే గ్రామానికి చెందిన యువకుడు అడిగె నాగరాజు సమయస్ఫూర్తితో వానరానికి సీపీఆర్ చేశాడు. కాసేపటి తర్వాత వానరం లేచింది. కాగా సీపీఆర్ చేసి వానరాన్ని బతికించిన నాగరాజును గ్రామస్తులు, పోలీసులు అభినందించారు. -
మానుకోటలో ఉత్కంఠ
సాక్షి, మహబూబాబాద్: రాజకీయ గొడవలు, ఘర్షణలకు నిలయమైన మానుకోటలో మరోసారి ఉ త్కంఠ నెలకొంది. లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా జిల్లాలో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు కేటీఆర్‌ను ఆహ్వానించడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానుకోట తహసీల్ ఎ దుట గురువారం నిర్వహించే ధర్నాకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి లగచర్ల గిరిజనులకు మద్దతు తెలపాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వగా.. గతంలో గిరిజనులకు అన్యాయం జరిగినప్పుడు రా ని కేటీఆర్ ఇప్పుడెందుకు వస్తున్నారు?ఆయనను అడ్డుకోండి అని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చా రు. ఇలా ఒకరు ధర్నా నిర్వహిస్తామని ప్రకటించ డం.. మరొకరు కేటీఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. పోటాపోటీగా విలేకరుల సమావేశాలు.. పోలీసులు అరెస్టు చేసిన లగచర్ల గిరిజనులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఆ పార్టీ నాయకులు బుధవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మానుకోట జిల్లా గిరిజనుల మద్దతు తెలిపేందుకు ధర్నా నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ప్రకటించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ రాకను తప్పుపడుతూ.. ఆయనను జిల్లాలో అడుగుపెట్టనివ్వబోమని, అడుగడుగునా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మానుకోట గిరిజనులపై జరిగిన దాడులు కేటీఆర్‌కు కనిపించలేదా.. అప్పుడెందుకు రాలేదని ప్రశ్నించారు. అనుమతి కోసం నిరీక్షణ.. కేటీఆర్ పాల్గొనే మహాధర్నాకు జిల్లా పోలీసులు బుధవారం రాత్రి వరకు అనుమతి ఇవ్వలేదు. ముందుగా మానుకోట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎస్పీని కలిసి అనుమతి కోరేందుకు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వెళ్లారు. అయితే రాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. లగచర్ల గిరిజనులకు మద్దతుగా నేడు బీఆర్ఎస్ ధర్నా కేటీఆర్ రాకపై కాంగ్రెస్ ఆగ్రహం అడ్డుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యేల హెచ్చరిక అర్ధరాత్రి వరకు ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులులగచర్ల బాధితులకు న్యాయం జరగాలి నేటి కేటీఆర్ ధర్నాను విజయవంతం చేయాలి ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ కేటీఆర్ ధర్నాను అడ్డుకుంటాం.. విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్– వివరాలు 8లోu -
విత్తన, ఎరువుల షాపుల తనిఖీ
గంగారం: మండలంలోని విత్తన, ఎరువుల షాపులను డీఏఓ విజయనిర్మల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగారం, కోమట్లగూడెంలోని రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాలు, పెద్ద ఎల్లాపూర్, మామిడిగూడెంలోని ఓడీసీఎంఎస్ షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్స్‌లను పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు వెంటనే రశీదులు ఇవ్వాలన్నారు. పెద్ద ఎల్లాపూర్ గ్రామంలో పొద్దుతిరుగుడు, మిర్చి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కోమట్లగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఏఓ రాంబాబు, డీహెచ్ఎస్ఓ జినుగు మరియన్న, తహీసీల్దార్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా ఇంటింటి సర్వే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. మొదట ఇబ్బందిపడిన ఎన్యుమరేటర్లు..ప్రస్తుతం గాడినపడ్డారు. అయితే జిల్లాలో అధికారుల లెక్కలకు మించి కుటుంబాల సంఖ్య పెరగడంతో ఎన్యుమరేటర్లపై అదనపు భారం పడుతోంది. అయితే సర్వే త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిరావడంతో క్షేత్రస్థాయిలో వేగం పెంచారు. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘాపెట్టి సర్వేను వేగవంతం చేస్తున్నారు. పెరిగిన కుటుంబాలు ప్రభుత్వం నిర్వహించే ఆర్థిక, సామాజిక, కుల, ఉద్యోగ, ఆదాయ సర్వేకోసం జిల్లాలోని 18మండలాల పరిధిలోని 461గ్రామ పంచాయతీలు,అందులోని కుటుంబాల వివరాలు సేకరించారు. ముందుగా స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 2,45,939 కుటుంబాలు ఉంటాయని అంచనా వేశా రు. అయితే తర్వాత మరోసారి లెక్కించగా కుటుంబాల సంఖ్య 2,66,603కు చేరింది. అంటే ముందుగా వేసిన లెక్కలకు 20,664 కుటుంబాలు పెరిగా యి. సర్వేపూర్తయ్యే నాటికి మరిన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లపై భారం.. ముందుగా వేసిన లెక్కల ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతీరోజు 15 కుటుంబాలు సర్వే చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,884 మంది అవసరం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి మొదలైన శాఖలకు చెందిన వారికి డ్యూటీలు వేశారు. అయితే ఇందులో కొంతమంది ఆరోగ్యం, కుటుంబ కారణాలతో సర్వే చేయలేమని అధికారులకు విన్నవించి వైదొలిగారు. అదేవిధంగా డ్యూటీలు వేసే అధికారులకు అవగాహన లేకపోవడంతో మరికొందరికి ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎన్యుమరేటర్ల సంఖ్యను 2,034కు పెంచారు. అయినప్పటికీ కుటుంబాలకు సరిపడా ఎన్యుమరేటర్లను పెంచేందుకు వీలుకాలేదు. కాగా ముందుగా ప్రతీరోజు 15 కుటుంబాల సర్వే చేయాలని చెప్పగా.. ప్రస్తుతం 20కి పైగా కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. ఒక్కో ఎన్యుమరేటర్ 175 నుంచి 180 వరకు కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. సర్వే వివరాలు జిల్లాలో కుటుంబాలు అర్బన్ : 38,845 రూరల్ : 2,27,758 మొత్తం : 2,66,603 సర్వే పూర్తి చేసిన కుటుంబాలు అర్బన్ : 35,267(90.8శాతం) రూరల్ : 2,01,233(88.4శాతం) మొత్తం : 2,36,500(88.7శాతం)గాడినపడిన ఎన్యుమరేటర్లు పెరిగిన కుటుంబాలతో అదనపు భారం 89శాతం సర్వే పూర్తి.. మిగిలింది 30వేల కుటుంబాలే..ఆలస్యంగా ప్రారంభమై.. ఒక్కో ఇంటి సర్వేకు అర్ధగంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే సర్వే చేసేవారిలో కొందరు వయస్సు మీదపడిన వారు, కంటి చూపు మందగించిన వారు, తక్కువ చదువుకున్నవారు ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికీ పలు కుటుంబాల ఇంటి ముందు స్టిక్కర్లు అంటించకపోవడంతో ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. అదేవిధంగా సర్వేకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే, మరోరోజు వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు సర్వేకు సహకరించకపోగా.. ఎదురు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నట్లు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. మొత్తంగా తొలినాళ్లతో పోలిస్తే సర్వే వేగం పుంజుకుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. -
బదిలీలకు సబ్ రిజిస్ట్రార్ల ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖలో బదిలీలు ఎప్పుడంటూ సబ్ రిజిస్ట్రార్లు ఎదురుచూస్తున్నారు. జూలై 31వ తేదీన జీరో ట్రాన్స్ఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ ఐజీ, ప్రభుత్వం ప్రకటించిన బదిలీల ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అటెండర్‌స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జోన్లో భాగంగా జోన్–1 బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఉమ్మడి వరంగల్‌కు గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లతోపాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏకకాలంలో జూలై 31వ తేదీన బదిలీల ప్రకటన, ఆగస్టు 1న జాయినింగ్లతో పూర్తిగా నూతన అధికారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారిపోయాయి. ఓడీ పేరిట అక్టోబర్‌లో మరో జాబితా సాధారణ, లాంగ్ స్టాండింగ్ బదిలీలకు బదులుగా కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అక్టోబర్ 15న ఓడీ (ఆన్ డ్యూటీ) పేరిట బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో జోన్లను దాటి హైదరాబాద్ వరకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు 19 మందికి స్ధాన చలనం కలిగింది. రెండు నెలల గడువులోనే మరో కార్యాలయానికి బదిలీకావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 20 మందితో మరో జాబితా.. ‘మా జిల్లాకు మేము పోతాం. మాకు చాలా దూరమవుతుంది’ అంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఓడీ పేరిట 19 మంది గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, ఇదే కోవలో మరో 20 మందితో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బదిలీ జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్లు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.లాంగ్ లీవ్‌లో పలువురు.. ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్‌కు బదిలీపై వచ్చిన గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు తాము ఇంత దూరం ప్రయాణం చేయలేమని, ఈ కార్యాలయాల్లో పని చేయలేమంటూ కొందరు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని మరికొందరు లాంగ్ లీవ్ పెట్టారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌లో ఓడీ పేరిట 19 మంది ట్రాన్స్ఫర్ 20 మందితో మరో జాబితా రెడీ సొంత జిల్లాకు పోతామంటూ అభ్యర్థనలు -
వేగంగా ఇంటింటి సర్వే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. మొదట ఇబ్బందిపడిన ఎన్యుమరేటర్లు..ప్రస్తుతం గాడినపడ్డారు. అయితే జిల్లాలో అధికారుల లెక్కలకు మించి కుటుంబాల సంఖ్య పెరగడంతో ఎన్యుమరేటర్లపై అదనపు భారం పడుతోంది. అయితే సర్వే త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిరావడంతో క్షేత్రస్థాయిలో వేగం పెంచారు. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘాపెట్టి సర్వేను వేగవంతం చేస్తున్నారు. పెరిగిన కుటుంబాలు ప్రభుత్వం నిర్వహించే ఆర్థిక, సామాజిక, కుల, ఉద్యోగ, ఆదాయ సర్వేకోసం జిల్లాలోని 18మండలాల పరిధిలోని 461గ్రామ పంచాయతీలు,అందులోని కుటుంబాల వివరాలు సేకరించారు. ముందుగా స్థానిక అధికారులు చెప్పిన వివరాల ప్రకారం 2,45,939 కుటుంబాలు ఉంటాయని అంచనా వేశా రు. అయితే తర్వాత మరోసారి లెక్కించగా కుటుంబాల సంఖ్య 2,66,603కు చేరింది. అంటే ముందుగా వేసిన లెక్కలకు 20,664 కుటుంబాలు పెరిగా యి. సర్వేపూర్తయ్యే నాటికి మరిన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లపై భారం.. ముందుగా వేసిన లెక్కల ప్రకారం ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతీరోజు 15 కుటుంబాలు సర్వే చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 1,884 మంది అవసరం ఉంటుందని విద్య, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, గ్రామీణాభివృద్ధి మొదలైన శాఖలకు చెందిన వారికి డ్యూటీలు వేశారు. అయితే ఇందులో కొంతమంది ఆరోగ్యం, కుటుంబ కారణాలతో సర్వే చేయలేమని అధికారులకు విన్నవించి వైదొలిగారు. అదేవిధంగా డ్యూటీలు వేసే అధికారులకు అవగాహన లేకపోవడంతో మరికొందరికి ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించారు. ఇలా ఎన్యుమరేటర్ల సంఖ్యను 2,034కు పెంచారు. అయినప్పటికీ కుటుంబాలకు సరిపడా ఎన్యుమరేటర్లను పెంచేందుకు వీలుకాలేదు. కాగా ముందుగా ప్రతీరోజు 15 కుటుంబాల సర్వే చేయాలని చెప్పగా.. ప్రస్తుతం 20కి పైగా కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. ఒక్కో ఎన్యుమరేటర్ 175 నుంచి 180 వరకు కుటుంబాల సర్వే చేయాల్సి వస్తోంది. సర్వే వివరాలు జిల్లాలో కుటుంబాలు అర్బన్ : 38,845 రూరల్ : 2,27,758 మొత్తం : 2,66,603 సర్వే పూర్తి చేసిన కుటుంబాలు అర్బన్ : 35,267(90.8శాతం) రూరల్ : 2,01,233(88.4శాతం) మొత్తం : 2,36,500(88.7శాతం)గాడినపడిన ఎన్యుమరేటర్లు పెరిగిన కుటుంబాలతో అదనపు భారం 89శాతం సర్వే పూర్తి.. మిగిలింది 30వేల కుటుంబాలే..ఆలస్యంగా ప్రారంభమై.. ఒక్కో ఇంటి సర్వేకు అర్ధగంట సమయం పడుతుందని అంచనా వేశారు. అయితే సర్వే చేసేవారిలో కొందరు వయస్సు మీదపడిన వారు, కంటి చూపు మందగించిన వారు, తక్కువ చదువుకున్నవారు ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికీ పలు కుటుంబాల ఇంటి ముందు స్టిక్కర్లు అంటించకపోవడంతో ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. అదేవిధంగా సర్వేకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉంటే, మరోరోజు వెళ్లి సర్వే చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు సర్వేకు సహకరించకపోగా.. ఎదురు ప్రశ్నలు వేసి విసిగిస్తున్నట్లు ఎన్యుమరేటర్లు చెబుతున్నారు. మొత్తంగా తొలినాళ్లతో పోలిస్తే సర్వే వేగం పుంజుకుందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తరిమికొడతారు
హన్మకొండ చౌరస్తా: ‘ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రూ. వేల కోట్ల నిధులు మంజూ రు చేస్తే ఏం తెచ్చారని కొందరు అజ్ఞానులు అడుగుతున్నారు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ద్రో హులను ప్రజలే తరిమికొట్టే రోజులొస్తాయి’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయోత్సవసభతో ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్త రూపం దాల్చబోతుందన్నారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులుంటే రూ.200 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు టెండర్లను పిలిస్తే కమీషన్లకు కక్కుర్తి పడే నాయకుల తీరుతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. అది మరిచిన కొందరు మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అన్నారు. జీఓలను చదివే కనీస జ్ఞానం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ జీవిత కాలంలో తీసుకురాలేనన్ని నిధులు ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లతో సరిపెడితే కాంగ్రెస్ సర్కారు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించిందన్నారు. నాడు సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ప్రకారం ఎయిర్‌పోర్టు భూసేకరణ, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు. పదేళ్లు భూకబ్జాలతో నగరాన్ని భ్రష్టుపట్టించిన దొంగలు నేడు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారా యణ, విజయశ్రీరజాలి, నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కూచన రవళి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు వేల కోట్ల నిధులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
No Headline
హన్మకొండ: రేవంత్ రెడ్డి మాటలు సీఎం హోదాకే అవమానకరమని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్‌లోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని విమర్శించే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఇరువురిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుస్తామని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని 8 స్థానాల్లో గెలిపించారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 8 స్థానాలు మాత్రమే వచ్చాయన్నారు. కాజీపేటకు వ్యాగన్ పరిశ్రమ మంజూరు చేసి ఇప్పుడు దీనిని కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయిందని విమర్శించారు. వరంగల్ మహానగర అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని తెలంగాణ ద్రోహి అంటే నాలుక చీరుస్తామన్నారు. కిషన్ రెడ్డిని గుజరాత్‌కు వెళ్లు అంటున్న రేవంత్.. మీరు ఇటలీకి పోతారా అని ప్రశ్నించారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ కాకతీయుల గడ్డ ఓరుగల్లుకు స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇచ్చిన ఘనత ప్రధాని మోదీది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించడం చూసి ఓర్వలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకో అని హితువు పలికారు. నోటి దురుసు మంచిది కాదన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ పెసరు విజయ్ చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గుజ్జ సత్యనారాయణ రావు, కొలను సంతోశ్ రెడ్డి, జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, చల్ల జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
No Headline
హన్మకొండ: సీఎం రేవంత్ రెడ్డివి చిల్లర మాటలని, ఆయనొక చీటర్, బ్రోకర్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తూర్పారబట్టారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వవా.. గంజాయి మొక్కలాంటి నిన్ను పీకి అవతల పారేస్తామన్నారు. అబద్ధాలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చి సీఎం అయ్యావన్నారు. ‘నన్ను రాక్షసుడన్నావు.. అవును నేను రాక్షసుడినే. పని చేసే రాక్షసుడిని.. నా ప్రజల కోసం ఏమైనా చేస్తా’ అని అన్నారు. నీ మాటలు నమ్మి ఓటేసిన ప్రతీ ఒక్కరిని మోసం చేశావన్నారు. సీఎం హోదాలో ఏమీ మాట్లాడుతున్నావో సోయి ఉందా అని ప్రశ్నించారు. విజయోత్సవ సభలు పెట్టుకోవడం కాదు.. నమ్మి ఓటేసిన ప్రజల సమస్యలు పట్టించుకో అని హితవు పలికారు. నాడు సోనియాను బలిదేవత అని, నేడు దేవత అని ఆమె కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటానని మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ వల్లే కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మితమైందన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సభ వంచన సభ అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి 5 ఏళ్లు కొనసాగలేదని, రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విజయోత్సవ సభలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తారని ఆశించిన వారికి భంగం కలిగిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, అతడి అనుచరులు చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్ మాట్లాడారు. సమావేశంలో గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, నాయకులు పాల్గొన్నారు. -
నవోదయలో ప్రవేశాలకు మరో అవకాశం..
ఖిలా వరంగల్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ మామునూరులో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాట చేసింది. ఇందులో ఏటా 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తూ ప్రవేశాలు స్వీకరిస్తోంది. అయితే ప్రస్తుతం 2025–26 సంవత్సరానికి సంబంధించి 9,11వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఖిలా వరంగల్ మండలం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి. 11వ తరగతిలో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారే దరఖాస్తు చేసుకోవాలి. 9వ తరగతిలో ప్రవేశాలకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 1, 2010 నుంచి జూలై 31, 2012 మధ్య జన్మించిన వారు, 11వ తరగతిలో ప్రవేశాలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జాన్ 1, 2008 నుంచి జూలై 31, 2010 మధ్య జన్మించి ఉండాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు నవంబర్ 26వ తేదీలోపు httpr:IIcbreitmr.nic.in2024nvrix వెబ్ సైట్, లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 08, 2025న జరగనుంది. 9,11వ తరగతుల్లో ఖాళీలు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తులకు ఆహ్వానం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి నవోదయలో ప్రవేశాల కోసం విద్యార్థులకు మరో అవకాశం కల్పించాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికాప్రకారం పరీక్షకు సన్నద్ధమై ఉత్తీర్ణత సాధించాలి. – బి.పూర్ణిమ, నవోదయ ప్రిన్సిపాల్ , మామునూరు -
కేటీఆర్ ధర్నాను అడ్డుకుంటాం..
మహబూబాబాద్ రూరల్ : బీఆర్ఎస్ హయాంలో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. ఖబడ్దార్ కేటీఆర్.. మానుకోటలో ధర్నా ఎలా చేస్తారో చూద్దాం, ఇక్కడి నుంచి తరిమికొడుతామన్నారు. మానుకోటలో అభివృద్ధి పేరిట గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను లాక్కున్నారని, పరిహారంకూడా ఇవ్వలేదన్నారు. మెడికల్ కళాశాల భూముల విషయంలో పోరాడినందుకు వార్డు కౌన్సిలర్ బానోత్ రవిని హత్య చేయించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ భూ కబ్జాలు చేసిన సమయంలో కేటీఆర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎటుపోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేసిన ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వపరం చేస్తామన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మృతిచెందిన వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ భార్య పూజ మాట్లాడుతూ మెడికల్ కళాశాల భూముల విషయంలో తన భర్తను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చంపించాడని, నాడే రెండు రూ. కోట్లు, కారు ఇస్తామని చెప్పారన్నారు. సమావేశంలో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, కేసముద్రం, మానుకోట ఏఎంసీల చైర్మన్లు ఘంట సంజీవరెడ్డి, ఇస్లావత్ సుధాకర్, ఎండీ.ఖలీల్, అంబటి వీరభద్రం, బండి శ్రీను, గునిగంటి కమలాకర్, నీరుటి లక్ష్మీనారాయణ, చిట్టెం వెంకన్న, ఎదల్ల యాదవరెడ్డి, శంతన్ రామరాజు, గుగులోత్ రాములునాయక్, అరెందుల వెంకటేశ్వర్లు, గుగులోత్ వెంకట్, భూక్య విజయ, చలమల్ల నారాయణ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు శ్రీను, హరిసింగ్, విజయమ్మ, జగన్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ -
లక్నవరం.. పర్యాటకుల స్వర్గధామం
గోవిందరావుపేట : లక్నవరం.. పర్యాటకుల స్వర్గధామమని, రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో రూ. 7 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సా రథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉండడంతోపాటు దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారక్క జాతర ములుగు జిల్లాకు గుర్తింపు తెచ్చిపెడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తామన్నారు. ఐలాండ్ అనుభూతి పొందేందుకు అండమాన్, మాల్దీవులు లాంటి సుందర ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో కూడా అలాంటి టూరిజం స్పాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కనుచూపు మేర నీరు.. చుట్టూ పచ్చని కొండల మధ్యలో 12 దీవులతో ప్రకృతి అందాలను కలబోసుకున్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కుమార్ కేంద్రం ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటా యించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పర్యాటక ప్రాంతాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటా యించాలని కోరుతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్ పాల్గొన్నారు. అందుబాటులోకి మూడో ద్వీపం రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ధనసరి సీతక్క