MEPMA
-
గొలుసుకట్టు.. కొల్లగొట్టు
పలమనేరు: మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా రాజేష్ పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు పట్టణానికే చెందిన ఓ హోటల్ యజమాని ద్వారా బయటి వ్యక్తుల ద్వారా డాయ్ యాప్ కథ మొదలైంది. రాజేష్ పనిచేసే కార్యాలయంలో 26 వార్డులకు చెందిన 40మంది దాకా ఆర్పీ(రిసోర్స్‌పర్సన్)లున్నారు. వీరి ఆధ్వర్యంలో పట్టణంలోని పది వేలమంది గ్రూపు సభ్యులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తొలుత కార్యాలయంలోని ఆర్పీలు, సీవోలను ఇందులోకి దించి వారికి నిత్యం డబ్బులు ఖాతాలోకి వచ్చేలా చేశారు. వీరి ద్వారా గ్రూపుల్లోని మహిళలను ఇందులోకి వచ్చేలా చేసి మోసానికి పాల్పడ్డారు. ఇప్పటికే పలు చోట్ల ఇదేతరహా మోసాలు పలమనేరులో జరిగినట్టే చిత్తూరులోనూ యాప్ మోసం తాజాగా బయటపడింది. ఇక్కడే కాక గుంటూరు, అనంతపూర్, తెలంగాణాలోని పలుచోట్ల గతంలో యాప్ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి పోలీసులు సైతం యాప్‌లను నమ్మి మోసపోరాదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో కొన్నాళ్ల పాటు స్థానికుల ద్వారా యాప్ కార్యకలాపాలను నిర్వహించి ఆపై యాప్‌ను మాయం చేస్తున్నారు. మోసపోయామని గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. పలమనేరులో ఈ నెల 21న యాప్ కనిపించకుండా పోయేనాటికి దీని బారిన వేలాది మంది పడినట్టు తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీతో నడిచేయాప్ డాయ్ యాప్ సాధరణ ప్లేస్టోర్లా కాకుండా లింక్ద్వారా మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇది పూర్తిగా ఆరి్టఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తుంది. మనకు యాప్ నుంచి వచ్చే కాల్స్ కేవలం వినేందుకు మాత్రమే మాట్లాడేందుకు వీలు కాదు. వీటికి ఎలాంటి అనుమతులుండవు. కేవలం సిస్టమ్ ద్వారా ఎక్కడినుంచో మొత్తం నెట్వర్క్ జరుగుతుంది. ఇందులో కాస్త తెలివైన వారిని మేనేజర్‌గా నియమించుకొని మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంటారు. మొదట్లో జనానికి ఆశచూపి క్రెడిట్ అవుతున్న మొత్తం భారీ స్థాయిలో చేరే సరికి యాప్‌ను కనిపించకుండా చేసేస్తారు. ఆపై ఏమీ చేసినా యాప్ కనిపించదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు.» పలమనేరుకు చెందిన రాజేశ్వరి, మహిళా గ్రూపులోని ఆర్పీ మాటలు నమ్మి అప్పులు తెచ్చి రూ.1.90 లక్షలు డాయ్ యాప్‌లో కట్టి మోసపోయింది. ఇదంతా తన భర్తకు తెలియకుండా చేసింది. ఇప్పుడు భర్త ఆమెతో గొడవపడి,ఇంటి నుంచి తరిమేశాడు. » పట్టణానికి చెందిన అనిల్‌కుమార్ అప్పు చేసి మరీ రూ.93 వేలను యాప్‌లో కట్టి పోగొట్టుకున్నాడు. » స్థానిక కొత్తపేటకు చెందిన భాగ్యలక్ష్మి బంగారాన్ని తాకట్టు పెట్టి ఇందులో రూ.లక్ష కట్టింది. » భర్తలేని వసంతి చిన్నకొట్టు ద్వారా జీవనం సాగిస్తూ ఇందులో రూ.3 లక్షలు పోగొట్టుకుంది. ఇంకా అనురాధ, వాణి, దివ్యలే కాదు జిల్లాలోని వేలాదిమంది గొలుసుకట్టు యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయలు మోసపోయారు.డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలమనేరులో జరిగిన డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ పలమనేరు ప్రాంతంలో డాయ్ యాప్ వలలో బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మెప్మా పీడీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామన్నారు. కమిటీలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్, పోలీసుశాఖ తరపున సీఐ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఈ నెల 29, 30 తేదీల్లో పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి కార్యాలయపు పనివేళల్లో విచారణ జరుపుతుందన్నారు. డాయ్ యాప్ బాధితులు విచారణ కమిటీకి ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు.» ‘డాయ్’ బాధితులకు బెదిరింపులు» చైన్ లింక్‌లో ‘మెప్మా’ పేరు వాడొద్దంటూ హుకుం » రూ.30 లక్షల వరకు మహిళలకు కుచ్చు టోపీ » ‘లక్కీ’ వారియర్ వాట్సప్ గ్రూప్ పేరిట లావాదేవీలు చిత్తూరు అర్బన్: సామాన్యుల ఆశ ను ఆధారంగా చేసుకుని రూ.కోట్లలో దోచుకున్న ‘డాయ్’ (డాటామీర్ ఏఐ) సంస్థ బాధితులు చిత్తూరు నగరంలోనూ వెలుగు చూస్తున్నారు. పలమనేరు పట్టణంలో వెలుగు చూసిన ఈ భారీ మోసంలో దాదాపు రూ.30 కోట్ల వరకు బాధితుల నుంచి రాబట్టుకున్న డాయ్ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీని బాధితులు చిత్తూరులో కూడా ఉన్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో పనిచేసే ఓ ఉద్యోగి పాత్ర ఇందులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో) కొందరు ఈ స్కీమ్‌లో చేరి మహిళలపై ఒత్తిడి పెంచి డాయ్ సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ చైన్‌లింక్ ద్వారా రూ.30 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నట్లు పలువురు స్వయం సహాయక మహిళలు ఆరోపిస్తున్నారు. మొబైల్‌ఫోన్ యాప్‌లలో వచ్చే పలు ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తుందనే అత్యాశతో ఈ సంస్థలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరి, బాధితులుగా మారారు. యాప్‌లో ఒకర్ని చేర్చి, వారు మరో పది మందిని ఇందులో చేరి్పస్తే కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో నగదు వస్తుందనే మరో మోసానికి కూడా తెరతీశారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఇద్దరు ఉద్యోగులను నమ్మిన మహిళా సంఘాల సభ్యులు రూ.30 లక్షల వరకు ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ప్రధానంగా మహిళా సంఘాలను పర్యవేక్షించే కొందరు రిసోర్స్ పర్సన్లు కమిషన్‌కు ఆశపడి పెద్ద సంఖ్యలో మహిళల్ని ఇందులో సభ్యులుగా చేరి్పంచారు. కార్పొరేషన్‌కు చెందిన మహిళా మార్టు, స్వయం సహాయక సంఘాల్లోని పలువురు సభ్యులు ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆటో నడుపుతున్న వ్యక్తి భార్య ఒకరు తన చుట్టుపక్కల మహిళల ద్వారా రూ.10 లక్షలను డాయ్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు వెలుగుచూసింది. ఈ మోసం బయటకు పొక్కడంతో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ మెప్మా పేరు ఎక్కడా వాడొద్దని, ఎదైనా ఉంటే పలమనేరు వెళ్లి తేల్చుకోవాలని ఓ ఉద్యోగి బాధిత మహిళల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.రూ.3 వేలకు వారంలో రూ.5,292 డాయ్ యాప్‌లో సభ్యులుగా చిత్తూరుకు చెందిన మహిళల్ని పెద్ద సంఖ్యలో చేరి్పంచడంలో మెప్మాలోని ఉద్యోగితో పాటు కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. లక్కీ వారియర్ పేరిట వాట్సప్ గ్రూప్‌ను తయారుచేసి, పెట్టుబడులు పెట్టేవాళ్లను సభ్యులుగా చేర్చారు. ఎఫ్ఈ రూబోట్ పేరిట ఒక్కసారి రూ.3 వేలు పెడితే రోజుకు రూ.756 చొప్పున వారంలో రూ.5,292, రూ.7 వేలు పెడితే రూ.13,813, రూ.9 వేలు పెడితే అయిదు రోజుల్లో రూ.13,365 వస్తుందని ప్రచారం చేశారు. మహిళల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని బోర్డు తిప్పేశారు. బాధ ఎవరికి చెప్పుకోవాలో గ్రూపుల్లో ఉండే మాకు యాప్ గురించి ఏమీ తెలీదు. మా ఆర్పీ డబ్బులు బాగా సంపాదించే మార్గమని మా చేత కట్టించారు. నేను అప్పు చేసి ఇందులో డబ్బులు కట్టా. ఇప్పుడు ఆర్పీలను అడిగితే మాకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది మేమేమి చేసేదంటున్నారు. ఇంక మేము ఎవరికి చెప్పినా పోయిన డబ్బు వచ్చేలాలేదే. – రాజేశ్వరి, గ్రూపు సభ్యురాలు, పలమనేరులాభం వస్తా ఉందని నమ్మి..నాకు తెలిసిన వాళ్లు చెప్పినమాట విని రెట్టింపు లాభం ఉంటుందని డబ్బులు కట్టా. మొదట్లో కొన్ని రోజులు డబ్బులు వచ్చాయి. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టా. ఆపై మొబైల్లో యాప్ కనిపించకుండా పోయింది. అప్పుచేసిన డబ్బు మొత్తం పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచడం లేదు. – అనిల్‌కుమార్, పలమనేరునగలు తాకట్టు పెట్టి కట్టా మా ఆర్పీ చెప్పింది కాబట్టి నమ్మి ఇందులో చేరా. రోజుకి 200 వస్తా ఉంది కదా ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయన ఆశపడ్డా. దీంతో నగలను తాకట్టు పెట్టి ఇందులో కట్టాను. ఇప్పుడు మోసపోయానని తెలిసింది. మా ఇంట్లోవాళ్లు ఎందుకు ఇలా చేశావని గొడవకు దిగారు. ఇకపై గ్రూపుల్లో అప్పు డబ్బు కట్టేందుకు కూడా కుదరకుండా పోయింది. – భాగ్యలక్ష్మి, పలమనేరు యాప్‌లను నమ్మి మోసపోకండి గొలుసుకట్టు, యాప్‌లను నమ్మి డబ్బులు కట్టొద్దని ముందునుంచి చెబుతూనే ఉన్నాం. కానీ అత్యాశకుపోయి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఊరికే డబ్బులిస్తామా. దానికి గ్యారెంటీ చూస్తాం కదా ఇందులో మాత్రం ఎలా పెడతారో అర్థంకాదు. ఇకనైనా ప్రజలు ఇలాంటి వాటి జోలికెళ్లకుండా ఉండాలి. – విష్ణు రఘువీర్, డీఎస్పీ, పలమనేరు -
జగనన్న మహిళా మార్టులకు జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి న సంస్కరణలకు మరోసారి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజ న–జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకుగా ను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)ను అ వార్డులు వరించాయి. 2023–24 సంవత్సరానికి గా ను సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్) అవార్డు, పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (ప్రయిస్) పురస్కారం వచ్చాయి.ఈ అవార్డులు మెప్మాకు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అవార్డులను అందుకున్నారు. స్టేట్ మిషన్ మేనేజర్లు ఆది నారాయణ, రంగాచార్యులు, ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రభావతి పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం కృషితో..సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే నగదుతో మహిళలను స్వయం ఉపాధి వైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత మహిళలను ప్రోత్సహించి 2 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యుల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్టులను 15 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే పెట్టుబడిదారులు, ఉద్యోగులు, నిర్వాహకులు, వాటాదార్లుగా ఉన్న ఈ మార్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్టులు ఏర్పాటు చేసిన అతితక్కువ కాలంలోనే రూ.60 కోట్లకు పైగా వ్యాపారం చేయడం గమనా ర్హం. వీటి నిర్వహణ పనితీరును పరిశీలించిన కేంద్రం స్పార్క్ అవార్డు ప్రదానం చేసింది. ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో మెప్మా విభాగం అత్యుత్తమ పనితీరు కనబర్చింది. వీధి వ్యాపారులకు సరైన సమయంలో ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు సరైన మార్గంలో వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించినందుకుగాను ప్రయిస్ అవార్డును ప్రదానం చేశారు. -
పట్టణ మహిళలకు సుస్థిర జీవనోపాధి
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడడంతోపాటు సుస్థిర జీవనోపాధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పట్టణ పేదరిక నిర్మూనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులందరికీ సుస్థిర జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 11 మునిసిపాలిటీల్లో జగనన్న మహిళా మార్టులు, జగనన్న ఈ–మార్ట్, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు, చేయూత జీవనోపాధి యూనిట్లు వంటివి ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా పట్టణ ప్రగతి యూనిట్లను కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేయనున్నారు. మెప్మా పరిధిలో 123 పట్టణ స్థానిక సంస్థల(యూఎల్బీ)లో 25 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా 13.50 లక్షల మంది ప్రత్యక్షంగా స్వయం ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారిలో అత్యధిక మందితో పట్టణ ప్రగతి యూనిట్లు, ఆహా క్యాంటీన్లు, మెప్మా అర్బన్ మార్కెట్లు, చేయూత, జీవనోపాధి యూనిట్లు ఏర్పాటుచేసి స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలని మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఇటీవల జిల్లాల మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పరిధిలో సమావేశాలు ముగిశాయి. రాయలసీమ జిల్లాల పథక సంచాలకులు, సిబ్బందికి నెల్లూరులో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. ఎస్‌హెచ్‌జీలు బలోపేతం: మెప్మా ఎండీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా వివిధ సంక్షేమ పథకాలు ఎంత మందికి అందాయి.. ఇంకా పొందాల్సిన వారు ఎవరైనా ఉన్నారా.. అనేదానిపై సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అర్బన్ స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని, ప్రతి సభ్యురాలిని స్వయం ఉపాధి వైపు మెప్మా ప్రోత్సహిస్తుందని చెప్పారు. వారికి అందుతున్న చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, జగనన్న తోడు... వంటి పథకాలతో ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఆ నగదుతో వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే పలు దఫాలుగా మహిళలకు శిక్షణనిచ్చి, వారితో పలు వ్యాపార సంస్థలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగిలిన సభ్యులకు అవసరమైన సహకారం అందించేందుకు స్వయంగా సభ్యులతో మాట్లాడాలని తమ సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటిని చక్కదిద్దుకునే మహిళలు వ్యాపారాన్ని విజయవంతంగా చేయగలరని తమ జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టులు, ఆహా క్యాంటీన్లు నిరూపించాయన్నారు. ఆయా యూనిట్ల బలోపేతం కోసం నిరంతరం శిక్షణ, పర్యవేక్షణ అందించాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఏపీ టిడ్కో గృహాల లబ్ధిదారులకు యూఎల్బీల పరిధిలో 100శాతం బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు. -
‘ప్రగతి’ పయనంలో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళ స్వయంశక్తితో ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం అందించిన వివిధ పథకాల నిధులతో స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడంతో పాటు, వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిపై ఆసక్తి గల 142 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యుల(ఎస్‌హెచ్‌జీ)కు ఆసక్తి ఉన్న రంగాలలో పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చింది. ఆయా పరిశ్రమలు పర్యావరణ హితమైనవిగా ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమల స్థాపన, వ్యాపార విధానాలు, ముడిసరుకు లభ్యత వంటి అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2.50 లక్షల చొప్పున దాదాపు రూ.4 కోట్ల నిధులను మెప్మా ఇందుకోసం వెచ్చించింది. ఇప్పటికే యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తవగా, మరో 10 రోజుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. యూనిట్లు ఏర్పాటు తర్వాత స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కూడా మెప్మా ఎండీ విజయలక్ష్మి ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిక్షణ పొందిన ట్రేడ్స్‌లో నిపుణులతో అవసరమైన సహకారం అందించనున్నారు. ఆరు ట్రేడ్లలో 142 మందికి శిక్షణ పూర్తి నాలుగున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయించి మెప్మా విజయం సాధించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అదే మహిళలతో పరిశ్రమలు నెలకొల్పి, పర్యావరణ హితమైన సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మహిళా ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటుపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చారు. అన్ని మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టుల్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్, పేపర్ ప్లేట్ల తయారీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్, ఆర్టీఫిషియల్ జ్యూవెలరీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి తయారీ, కారం, మసాలా పొడులు, మిల్లెట్స్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 142 మందికి ప్రభుత్వమే యంత్రాలు, ముడిసరుకును ఉచితంగా ఇచ్చి మొత్తం 111 యూనిట్లను పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మెప్మాతో మెరుగైన జీవితం టైలరింగ్‌లో అనుభవం ఉంది. ఇంట్లోనే కుట్టుపని ప్రారంభించా. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. పట్టణ మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో మెప్మాను సంప్రదించాను. వారు కంప్యూటర్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది నాకెంతో ఉపయోగపడుతుంది. ముడిసరుకు సేకరణ, వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో పూర్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే ఉచితంగా యంత్రాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. – టి.తనూజ స్రవంతి, విశాఖపట్నం నాపై నమ్మకం పెరిగింది సొంతంగా పరిశ్రమ పెట్టి కనీసం నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇంట్లోనే క్లాత్ బ్యాగ్‌లు కుడుతుంటాను. వాటిపై అవసరమైన బ్రాండింగ్ కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారంపైనా అవగాహన లేదు. ఈ ఏడాది ఎస్‌హెచ్‌జీలో చేరాను. మెప్మా ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఉచిత శిక్షణలో స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, వ్యాపార మెళకువలు తెలుసుకున్నాను. నేను పూర్తిస్థాయిలో వ్యాపారం చేయగలనన్న నమ్మకం లభించింది. – బి.రాజేశ్వరి, ఏలూరు మహిళా ప్రగతి లక్ష్యంగా శిక్షణ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయం. అందుకు అనుగుణంగా మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసి విజయం సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళా ప్రగతి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు కోరుకున్న రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇంటిని చక్కదిద్దుకుంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహిళలకు మెప్మా అండగా ఉంటుంది. పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్థ్యం మహిళలకు ఉంది. మార్కెటింగ్ విషయంలో మెప్మా వారికి అండగా నిలబడుతుంది. పదిరోజుల్లో 111 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్లు ఏర్పాటు తర్వాత వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
‘పట్టణ మహిళల ప్రగతి’కి తోడ్పాటు
సాక్షి, అమరావతి: ఆర్థికంగా కాస్త ఆసరా ఇచ్చి అండగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్మిన వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా వారిని ప్రోత్సహిస్తూనే ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దిశగా సహకరిస్తోంది. జగనన్న మహిళామార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు విజయవంతం కావడంతో పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) మరో ముందడుగు వేసింది. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో, పర్యావరణ హితమైన సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ చేపట్టింది. ఈ అంశంపై గత నెలలో పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశా«దికారులతో మెప్మా మిషన్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 165 సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదించారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. యూనిట్ల ఏర్పాటు, నిర్వహణపై ఆయా రంగాల నిపుణులతో వచ్చే నెలలో మహిళలకు శిక్షణ ఇస్తారు. గత నాలుగున్నరేళ్లుగా మెప్మా పట్టణ పొదుపు సంఘాల మహిళలను వ్యాపార యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 11 మహిళా మార్టులు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో 140కి పైగా ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా అర్బన్ మార్కెట్లు సైతం ఏర్పాటు చేసి, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు. ఇవన్నీ విజయవంతం కావడంతో మెప్మా పర్యావరణ హిత సూక్ష్మ పరిశ్రమలను పట్టణ మహిళా ప్రగతి యూనిట్ల పేరిట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళల ఆసక్తి మహిళల ఆధ్వర్యంలో స్థాపించే సూక్ష్మ పరిశ్రమలకు అవసరమైన మూలధనం సేకరణ, పరిశ్రమ స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్ వంటి అంశాలపై వచ్చే నెలలో నిపుణులతో శిక్షణనివ్వాలని మెప్మా నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 యూఎల్బీల నుంచి 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపారు. ఇలా వచ్చిన ఆసక్తుల్లో మొత్తం 165 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇద్దరు సభ్యుల నుంచి 35 మంది సభ్యుల వరకు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వాడిపోయిన పూల నుంచి అగర్బత్తీల తయారీ, పేపర్ కప్పులు, ప్లేట్లు తయారీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, జ్యూట్ బ్యాగ్‌ల మేకింగ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అరటినార ఉత్పత్తులు, మిల్లెట్స్‌తో నూడుల్స్ తయారీ, డ్రై వెజిటబుల్ ఫ్లేక్స్ తయారీ వంటివి ఉన్నాయి. అద్దె భారం లేకుండా చర్యలు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా మెప్మా కృషి చేస్తోంది. సాధారణంగా పట్టణాల్లో చిన్న వ్యాపారం పెట్టాలన్నా గదుల అద్దె అధికంగా ఉంటుంది. మెప్మా ఏర్పాటు చేసే మహిళా ప్రగతి యూనిట్లను మున్సిపల్ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల భవనాల అద్దె భారం, అడ్వాన్స్ చెల్లింపులు పెద్దగా ఉండవు. ఇది మహిళలకు ఊరటనిస్తుంది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.2.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
మహిళా మార్ట్.. లాభాల్లో బెస్ట్
సాక్షి, అమరావతి : పట్టణాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు సంఘటితమై విజయం సాధించారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అందించిన సాయంతో జగనన్న మహిళా మార్ట్లను నెలకొల్పి లాభాల బాటలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 పట్టణాల్లో ఏర్పాటు చేసిన మార్ట్లు నెలకు సగటున రూ.79.40 లక్షల వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. పొదుపు సంఘాల్లోని మహిళలు కేవలం రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టి.. తమ ఇంటికి అవసరమైన సరుకులను డిస్కౌంట్ ధరకు పొందుతూనే రోజువారీ అమ్మకాల ద్వారా ఏడాదికి రూ.19 లక్షల నికర లాభాలను ఆర్జిస్తున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన స్వయం సహాయక సంఘాల్లోని 37,308 మంది మహిళలు మెప్మా ఎండీ విజయలక్ష్మి ప్రోత్సాహంతో మార్ట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఒక్కో సభ్యురాలు కేవలం రూ.150 చొప్పున రూ.55,96,200 పెట్టుబడిగా పెట్టి గత ఏడాది మే నెలలో జగనన్న మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ ఏడాదిన్నరలో రూ.4.89 కోట్ల అమ్మకాలు చేసి, రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటాదారులకు రూ.20 లక్షల మొత్తాన్ని డివిడెంట్‌గా పంచి.. మిగిలిన రూ.10 లక్షలను సభ్యుల అంగీకారంతో మరో వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించారు. ఆర్థిక స్వావలంబన దిశగా.. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా మహిళా సమాఖ్యలు ఉన్నా వీరు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకునేవారు. వారికి మెరుగైన ఆర్థిక స్వావలంబన ఉండాలని, సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలన్న లక్ష్యంతో ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి సమాఖ్య సభ్యులను సూపర్ మార్కెట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారు. ఆసక్తి గల సభ్యులతో రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టించి ‘జగనన్న మహిళా మార్ట్’లను ఏర్పాటు చేశారు. 2021 జనవరిలో పులివెందులలో తొలి మార్ట్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఈ స్టోర్ రూ.2.50 కోట్ల వ్యాపారం చేయడంతో పాటు సుమారు రూ.18 లక్షల లాభాన్ని ఆర్జించింది. దాంతో వాటాదారులకు డివిడెండ్ చెల్లించారు. ఇప్పుడు తిరుపతి పట్టణంలోని మహిళా మార్ట్ వాటాదారులు డివిడెంట్ అందుకోనున్నారు. కాగా.. ఈ రెండేళ్ల కాలంలో పులివెందుల, రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, మారా>్కపురం, ఒంగోలు పట్టణాల్లో 10 జగనన్న మహిళా మార్ట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇది సమైక్య విజయం పెట్టుబడిదారులు, అమ్మకందారులు, కొనుగోలుదారులు మహిళలే. మార్ట్ల నిర్వహణ కోసం మెప్మా ఆధ్వర్యంలోశిక్షణ ఇచ్చాం. మార్ట్ ఏర్పాటు, నిర్వహణ ప్రతి దశను ఎస్‌హెచ్‌జీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏడాదిన్నలో రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించింది. ఇందులోని సభ్యులకు రూ.20 లక్షల డివిడెండ్ చెల్లించి.. మిగతా మొత్తంతో సభ్యుల అంగీకారంతో కొత్త వ్యాపారంలో ప్రారంభిస్తాం. ఇందులోనూ మహిళలే సభ్యులుగా ఉండి వచ్చిన లాభాలను పంచుకుంటారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగేలా చేయడమే మెప్మా లక్ష్యం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్‌ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్‌తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు
సాక్షి, హైదరాబాద్: పట్టణ/గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా/సెర్ప్)ల ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెప్మాలో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేలు వర్తింపజేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెర్ప్‌లోని 3,974 మంది ఉద్యోగులకు సైతం పేస్కేలు వర్తింపజేస్తూ గత మార్చి 18న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జీవోలు బయటకు వచ్చాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వర్తింపు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు 2023 ఏప్రిల్ 1 నుంచి పేస్కేల్ వర్తించనుంది. ప్రస్తుత కనీస వేతనానికి సమీపంలో ఉన్న పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. మెప్మా ఉద్యోగులకు ప్రస్తుత కనీస వేతనానికి రక్షణ కల్పిస్తారు. సెర్ప్ ఉద్యోగుల ప్రస్తుత స్థూల వేతనం, ఇతర అలవెన్సులకు రక్షణ లభించనుంది. పేస్కేలు వర్తింపజేసినా సెర్ప్, మెప్మా ఉద్యోగులు ఇప్పటి తరహాలోనే రిజిస్టర్డ్ సొసైటీ ఉద్యోగులుగా కొనసాగుతారని, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించినట్టు లేదా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్టు పరిగణించడానికి వీలు లేదు. కాగా, వీరికి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా ఇకపై ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే మెప్మాలో రెగ్యులర్/కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ పోస్టులను సృష్టించాలని ఆ ఉత్తర్వులు స్పష్టం చేశాయి. మెప్మా కొత్త పేస్కేళ్లు ఇలా: మెప్మా ఉద్యోగులకు వారి హోదాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ పేస్కేళ్లను వర్తింపజేయనున్నారు. స్టేట్ మిషన్ డైరెక్టర్లకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు సూపరింటెండెంట్, ఎంఐఎస్ మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్లకు సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్లకు కామన్ అసిస్టెంట్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు/జూనియర్ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేట ర్లకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్, ఆఫీస్ సబా ర్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్ పే–స్కేళ్లు వర్తింపజేస్తారు. సెర్ప్‌లో పేస్కేళ్లు .. సెర్ప్‌లోని మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లు/ఆఫీస్ సబార్డినేట్లకు ఆఫీస్ సబార్డినేట్, మండల్ బుక్ కీపర్లకు రికార్డు అసిస్టెంట్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు సీనియర్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్లకు సూపరింటెండెంట్, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీఓ, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్/ప్రాజెక్టు సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్లకు డ్రైవర్ల హోదాలో ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేలు వర్తింపజేస్తారు. మెప్మాలో అడ్డదారిలో నియామకాలు? మెప్మా ఉద్యోగులకు పేస్కేలు వర్తింపజేస్తామని దాదాపు ఏడాది కిందటే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మెప్మాలో కొంత మంది అధికారులు తమ పిల్లలను, బంధువులను దొడ్డిదారిలో నియమించుకున్నారని ఆరోపణలు న్నాయి. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోతో వారికి సైతం ప్రయోజనం కలగనుందని విమర్శలు వస్తున్నాయి. -
పట్టణాల్లో ‘ఆహా’ క్యాంటీన్లు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు, మార్కెట్లకు సరుకులు తెచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నడుంబిగించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతం కావడం, సమాఖ్య సభ్యులు ఆదాయం సముపార్జించడంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 110 యూఎల్బీల్లో 140 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తోంది. రూ.13 వేల చొప్పున ప్రభుత్వ సాయం పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంగా మెప్మా కృషి చేస్తోంది. ‘ఆహా’ క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వే, మార్కెటింగ్ అధికారులతో మెప్మా అధికారులు మాట్లాడి అనుమతులు తీసుకున్నారు. క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతినెలా రూ. 500 చొప్పున స్థానిక టౌన్ లెవెల్ ఫెడరేషన్ (పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీ)లో జమ చేసి మరింత మందికి ఆ ర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహారాన్ని రుచి, శుచిగా ఇంటి వద్దే వండి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన కియోస్‌్కల్లో విక్రయిస్తారు. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, అవసరాలను బట్టి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు విక్రయించేలా అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 40కే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. మహిళలకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల్లో గల ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోంది. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టుల తరహాలో మహిళలకు ఉపాధి కల్పించనున్నాం. ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించేందుకు 140 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తాం. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అంటే ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకుంటారు. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. – వి. విజయలక్ష్మి, మెప్మా ఎండీ ఒక్కపూట రూ. 3 వేల వ్యాపారం పదిహేను రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్ ప్రారంభించాం. ముగ్గురం సభ్యులం కలిసి సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టాం. కేవలం 2.30 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. పూటకు రూ. 3 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయించాం. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యాపారం, ఆదాయం వస్తుంది. పదార్థాలు మా ఇళ్లల్లోనే తయారు చేసి తెస్తున్నాం. ఆహా క్యాంటీన్‌తో మాకు ఉపాధి లభించింది. – పి.జయలక్ష్మి, ఆహా క్యాంటీన్ నిర్వాహకురాలు, కర్నూలు -
స్పార్క్ ర్యాంకింగ్‌లో ఏపీకి మొదటి స్థానం.. అవార్డు అందుకున్న మెప్మా డైరెక్టర్
సాక్షి, అమరావతి: పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థకు జాతీయస్థాయి స్పార్క్ ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది. దీనదయాళ్ అంత్యోదయ అమలులో మెప్మా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొదటి స్థానం ప్రకటించింది. కేరళలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మికి స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబీ రాజేష్ చేతుల మీదగా అవార్డు ప్రదానం చేశారు. చదవండి: అర్హులందరికీ జగనన్న సురక్షతో లబ్ధి: సీఎం జగన్ -
జగనన్న మహిళా మార్టులు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టుల నిర్వహణ అద్భుతంగా ఉందని కేరళకు చెందిన అధికారులు కితాబిచ్చారు. అతి తక్కువ పెట్టుబడితో స్వయం సహాయక సంఘాల మహిళలు సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంత ఘన విజయం సాధించడం దేశంలో ఎక్కడా చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళలను స్వయం శక్తిగా తీర్చిదిది్దన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) కృషిని అభినందించారు. ఈ తరహా మార్టులను కేరళ రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఏపీలోని స్వయం సహాయక సంఘాల మహిళల ప్రగతిని, స్థితిగతులను పరిశీలించేందుకు గతనెలలో కేరళకు చెందిన కుడుంబశ్రీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాఫర్ మాలిక్ ఆధ్వర్యంలో అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా వారు శ్రీకాకుళంలోని జగనన్న మహిళా మార్టును, విశాఖపట్నంలోని అర్బన్ మార్కెట్లను పరిశీలించారు. నిర్వహణకు ఏకీకృత సాఫ్ట్వేర్ రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టుగా తొలి జగనన్న మహిళా మార్టును పులివెందులలో ‘మెప్మా’ ఏర్పా టు చేసింది. తర్వాత వివిధ దశల్లో రాయచోటి, అద్దంకి, పుంగనూరు, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళంలో మొత్తం 7 మహిళా మార్టులను అందుబాటులోకి తెచ్చారు. అన్ని స్టోర్లలోనూ స్థానిక పట్టణా ల్లోని స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళా రూ.150 చొప్పున వాటాగా పెట్టారు. ఒక్కో స్టోర్‌లో 8 వేల నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదారులుగా ఉన్నారు. ఒక్కో మార్ట్ నెలకు రూ.13.50 లక్షల నుంచి రూ.32.56 లక్షల వరకు అమ్మకాలు చేస్తున్నాయి. మొత్తం అన్ని మార్టుల నిర్వహణకు మెప్మా అధికారులు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రతి వస్తువు అమ్మకంపై వచ్చే లాభాలు సైతం కంప్యూటర్లో కనిపిస్తుండడంతో 7 మార్టుల సంఘాలు అమ్మకాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. మన మార్ట్ మోడల్ నచ్చింది.. జగనన్న మహిళా మార్టుల పనితీరు కేరళ అధికారులకు బాగా నచ్చింది. త్వరలో గుంటూరు, రాజమండ్రి, ఒంగోలు, మంగళగిరి, విజయవాడల్లోనూ జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తాం. లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండడంతో మార్టులకు మంచి ఆదరణ లభిస్తోంది. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
మహిళోదయం
శ్రీకాకుళానికి చెందిన సుగుణరెడ్డి, రత్నకుమారి, రమాదేవి, నాగలక్ష్మి, విజయ ఇంటిని చక్కదిద్దుకునే దిగువ మధ్యతరగతి గృహిణులు. 18,364 మంది మహిళా సమాఖ్య సభ్యులతో కలసి పట్టణంలో ఫిబ్రవరిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.150 చొప్పున మొత్తం రూ.27,54,600 స్త్రీనిధిగా సేకరించారు. మొదటి నెలలో రూ.10,75,013 మేర వ్యాపారం చేయడంతోపాటు రూ.లక్ష లాభం కూడా ఆర్జించారు. కస్తూరి, ప్రీతి, ఇందిర, ప్రియ, హిమబిందు చిత్తూరుకు చెందిన మహిళా సమాఖ్య సభ్యులు. పట్టణంలో 26,850 మంది సభ్యులతో కలసి జగనన్న మహిళా మార్ట్ నెలకొల్పారు. రూ.40,27,500 స్త్రీనిధిని సేకరించి నెలకు రూ.32,56,152 మేర వ్యాపారం చేస్తున్నారు. ఏ బిజినెస్ స్కూల్లో పట్టాలు పొందలేదు.. ఆ మాటకొస్తే పెద్దగా చదువుకోలేదు.. గతంలో వ్యాపార అనుభవం కూడా లేదు. సంఘటితంగా మారి ‘పొదుపు’ బాట పట్టారు. సామాన్య మహిళలైన వీరంతా జగనన్న మహిళా మార్టుల ద్వారా వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తున్నారు. పులివెందుల, అద్దంకి, రాయచోటి, తిరుపతి, పుంగనూరు సహా మొత్తం ఏడు చోట్ల జగనన్న మహిళా మార్ట్లను సమాఖ్య సభ్యులే నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్నారు. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అందించిన శిక్షణతో ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. ఏడు మార్టుల్లో 1.19 లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులు వాటాదార్లుగా రూ.1.79 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ప్రతి నెలా రూ.1.35 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. సభ్యులే కమిటీలుగా ఏర్పడి సరుకు కొనుగోలు, నాణ్యత, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇంటి సరుకుల కోసం చేసే ఖర్చును తగ్గించుకునేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్టణ ప్రాంత మహిళల్లో కొత్త శక్తిని నింపుతోంది. – సాక్షి, అమరావతి రెండేళ్ల క్రితం పులివెందులలో ‘మెప్మా’ అందించిన సాయంతో ప్రారంభమైన ‘జగనన్న మహిళా మార్ట్’ ప్రస్థానం ఏడు పట్టణాలకు విస్తరించింది. మహిళా సమాఖ్యలోని సభ్యులంతా దిగువ మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఇంటి అవసరాల సరుకులు కొనేందుకు ప్రతి నెలా కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. మహిళా మార్టుల్లో వాటాదార్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. షాపులో సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్ల కంటే సభ్యులకు 0.50% అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక్కో కుటుంబం నెలకు కనీసం రూ.700 నుంచి రూ.1,000 వరకు ఆదా చేయగలుగుతోంది. పేదలకు అది పెద్ద మొత్తమే. రూ.150 వాటాకు జీవితకాల సభ్యత్వంతోపాటు లాభాల్లో ఏటా 33 శాతం డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్నారు. మూడేళ్లలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు కొనుగోళ్లలో అదనపు డిస్కౌంట్ దక్కుతోంది. 6 వేల నుంచి 37 వేల మంది సభ్యులు పట్టణ ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యల సభ్యులతో మెప్మా స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించి వ్యాపారంపై పూర్తి అవగాహన కల్పించాక వాటాదార్లుగా చేర్చుకుంటున్నారు. పట్టణాన్ని బట్టి ఒక్కో మార్టులో 6 వేల మంది నుంచి గరిష్టంగా 37 వేల మంది వరకు వాటాదార్లుగా ఉన్నారు. పులివెందుల స్టోర్‌లో 8 వేల మంది రూ.12 లక్షలు పెట్టుబడిగా పెట్టి ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వ్యాపారం చేస్తున్నారు. తిరుపతిలో 37,309 మంది సభ్యులు కలిసి రూ.56 లక్షలు వాటాగా పెట్టి ప్రతి నెలా రూ.29.88 లక్షల మేర వ్యాపారం చేస్తున్నారు. ‘స్వయం’కృషితో ఎదిగిన స్త్రీ శక్తి మహిళా సమాఖ్యలు ప్రభుత్వం అందించే సాయాన్ని ఇన్నేళ్లు ఇంటి అవసరాలకే వినియోగించుకుంటుండగా వారికి ఆర్థిక స్వావలంబన ద్వారా సుస్థిర జీవనోపాధికి మార్గం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ‘మెప్మా’ ఎండీ విజయలక్ష్మి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభ్యులంతా కలిసి సూపర్ మార్కెట్లు నెలకొల్పవచ్చని మహిళలకు వివరించారు. వారితో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేశారు. సమాఖ్య సభ్యులపై భారం లేకుండా ఒక్కొక్కరి పెట్టుబడి కేవలం రూ.150గా నిర్ణయించారు. ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో 2021 జనవరి 3న తొలి మార్ట్‌ను పులివెందులలో ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలోనే ఈ స్టోర్ రూ.2.50 కోట్ల మేర వ్యాపారం చేయడంతో పాటు వాటాదార్లకు లాభాల్లో 33 శాతం డివిడెంట్‌గా చెల్లించింది. గతేడాది జనవరిలో రాయచోటిలో నెలకొల్పిన జగనన్న మహిళా మార్ట్ మొదటి నెలలోనే రూ.14 లక్షల మేర వ్యాపారం చేసింది. ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రారంభమైన స్టోర్ సైతం రూ.10.72 లక్షల వ్యాపారం నిర్వహించింది. ఈ మూడు స్టోర్లు విజయవంతం కావడంతో తిరుపతి, పుంగనూరు, చిత్తూరులోనూ జగనన్న మహిళా మార్ట్లను మెప్మా ఎండీ అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోనూ మార్ట్‌ను ప్రారంభించారు. ఏడుచోట్ల నెలకు రూ.1.35 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు. నాణ్యతే ప్రమాణంగా వ్యాపార శిక్షణ వ్యాపారం ఏదైనా సరే నాణ్యతే పెట్టుబడిగా ఉంటే మంచి సరుకులు ఎక్కడున్నా కొనుగోలుదారులు వస్తుంటారు. ఈ సూత్రంతోనే స్టోర్ల భాగస్వాములైన మహిళా సమాఖ్య సభ్యులకు మెప్మా శిక్షణ ఇచ్చింది. స్టోర్ నిర్వహణ, సరుకుల కొనుగోలు, నాణ్యత పరిశీలనకు, ఖాతాల నిర్వహణకు వాటాదార్లుగా ఉన్న మహిళలతోనే కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో వ్యాపార నిర్వహణ తేలికైంది. ఎక్కడ నాణ్యమైన సరుకులు దొరుకుతాయో అక్కడి నుంచే నేరుగా కొనుగోలు చేసి అమ్మకానికి ఉంచుతున్నారు. మహిళా సమాఖ్య సభ్యులు సొంతంగా తయారు చేసిన వస్తువులను సైతం ఇక్కడ విక్రయించే ఏర్పాట్లు చేశారు. మార్ట్‌ల్లో గృహ అవసరాలకు వినియోగించే అన్ని వస్తువులను అమ్ముతున్నారు. పెద్దగా లాభాలు ఆశించకుండా నాణ్యమైన సరుకులను అందిస్తుండటంతో ప్రజలకు వీటిపై నమ్మకం పెరిగింది. ప్రతి మార్ట్‌లోనూ ఒకే ధర ఉంటుంది. అన్నింటికీ ఒకే సాఫ్ట్వేర్ వినియోగిస్తుండడంతో నిర్వహణ తేలికైంది. జగనన్న మహిళా మార్టులు కార్పొరేట్ సూపర్ మార్కెట్లను తలదన్నేలా ఉండడమే కాకుండా లాభాల బాటలో నడుస్తున్నాయి. ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా... ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు పట్టణ పేద మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జగనన్న మహిళా మార్ట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఏడు స్టోర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు వీటి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛందంగా రూ.150 పెట్టుబడిగా పెడుతున్నారు. పులివెందుల స్టోర్ వాటాదారులు డివిడెంట్ కూడా తీసుకున్నారు. అన్ని స్టోర్లలోనూ ఒకే విధంగా మార్కెట్ కంటే తక్కువ ధరలుంటాయి. అన్ని స్టోర్లను అనుసంధానిస్తూ ఏకీకృత సాఫ్ట్వేర్ రూపొందించాం. స్థానిక మున్సిపాలిటీకి చెందిన వ్యాపార సముదాయల్లో షాపులను నెలకొల్పడం ద్వారా అద్దె భారం తగ్గుతోంది. సరుకులు కొనుగోళ్లను మార్ట్ కమిటీ సభ్యులే స్వయంగా చూసుకుంటున్నారు. మార్ట్లు అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ప్రతి మునిసిపాలిటీలో ఒక స్టోర్ ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నాం. – విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
మహిళా మార్ట్.. సరుకులు భేష్
ఒక్క ఆలోచన వేలాది మందికి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందేలా చేసింది. అందరి చూపు ఆ మార్ట్‌పై నిలిచేలా పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఎవరిపైనా పెట్టుబడి భారం పడకుండా చిన్నపాటి మొత్తంతో డ్వాక్రా సభ్యులే అంతాతామై నిర్వహించేలా ఆవిర్భవించిన జగనన్న మహిళా మార్ట్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.పేద ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈ మార్ట్ ఏర్పాటైంది. సాక్షి, కడప: ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ద్వారా రూ.150 పెట్టుబడితో.. సుమారు రూ.12 లక్షల వ్యయంతో మహిళా మార్ట్ రూపుదిద్దుకుంది. బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరలకే సరుకులను అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు సభ్యులందరికీ అదనంగా 2 శాతం రాయితీతో సరుకులను అందిస్తుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన మహిళలందరికీ ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో సొమ్ము అందించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళిక రూపొందించింది. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా పాత బస్టాండు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఈ మార్ట్‌ను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా విజయవంతంగా నడుపుతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందజేయడం ద్వారా పేదలకు అనుకూలంగా ఉంటుందన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు తోడు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషితో ఈ మార్ట్ రూపుదిద్దుకుంది. ఏది కావాలన్నా హోల్ సేల్ ధరకే ప్రజల నిత్యావసరాలకు సంబంధించి ఏది కావాలన్న జగనన్న మహిళా మార్ట్‌లో లభిస్తుంది. డ్వాక్రా ఉత్పత్తులు, తిను బండారాలు (డ్వాక్రా మహిళలు తయారు చేసిన), ఒడియాలు, అప్పడాలు, డోర్ కర్టన్స్, నైటీలు, డోర్ మ్యాట్లు, చీపుర్లు అందుబాటులో ఉంచారు. పప్పుల దగ్గర నుంచి బెల్లం వరకు.. ఆవాల నుంచి అల్లం వరకు.. ప్రతి నిత్యావసర వస్తువు ఈ మార్ట్‌లో లభిస్తోంది. బయట మార్కెట్ కంటే ఇక్కడ ధర తక్కువ. హోల్‌సేల్ ధరకే సరుకులను అందించడంతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ప్రతినిత్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్‌లో కొనుగోలు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. 8 వేల మంది భాగస్వామ్యం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 8 వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద రూ.150 చొప్పున వసూలు చేసి, రూ.12 లక్షల పెట్టుబడి సొమ్ముతో మార్ట్‌ను నెలకొల్పారు. 2021 జనవరి 3వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా (పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత డ్వాక్రా గ్రూపులు పెరగడంతో మరో 5 వేల మంది సభ్యులు పెట్టుబడి సొమ్ము చెల్లించి భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చారు. లాభాల్లో 60 శాతాన్ని రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టిన ప్రతి మహిళకు ఏటా బోనస్ రూపంలో అందించనున్నారు. భారీగా వ్యాపారం ప్రస్తుతం ఈ మార్ట్‌లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. నెలలో ఐదారు రోజులు లక్ష రూపాయల వ్యాపారం సాగుతోంది. నెలకు సరాసరిన రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సమస్యల్లేకుండా దినదినాభివృద్ధి చెందుతోంది. డ్వాక్రా సభ్యులకు రాయితీ కార్డులు పులివెందులలోని డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మార్ట్ పేరుతో గుర్తింపు కార్డులను ఇచ్చారు. జగనన్న మార్ట్‌కు వచ్చి సరుకులు కొనుగోలు చేసిన వారికి సొమ్ము మొత్తమ్మీద 2 శాతం రాయితీ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.3 వేల సరుకులు కొనుగోలు చేస్తే.. బయటి మార్కెట్‌తో పోలిస్తే అందరికీ 20 శాతం చొప్పున రూ.600 ఆదా అవుతోంది. దీనికి తోడు డ్వాక్రా మహిళలకు 2 శాతం అంటే రూ.60 అదనంగా మిగులుతోంది. మార్ట్‌లో ఏడుగురు డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. సరుకుల గ్రేడింగ్ మొదలు.. ప్యాకింగ్, బిల్లు కౌంటర్ వరకు డ్వాక్రా మహిళలే అన్ని పనులు చూస్తున్నారు. సరుకులు బాగున్నాయి జగనన్న మహిళా మార్ట్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రధానంగా సరుకుల నాణ్యత చాలా బాగుంది. ఈ మార్ట్‌ను మహిళలే నిర్వహిస్తున్నారు కాబట్టి సరుకులు, వస్తువులను ఓపికగా అందిస్తున్నారు. ఏదీ కావాలన్న మార్ట్‌లో లభిస్తోంది. – ప్రియాంక (శ్రీసాయినగర్), పులివెందుల ఉపాధి లభించింది జగనన్న మహిళా మార్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడే పని చేస్తున్నా. సరుకుల గ్రేడింగ్ మొదలుకుని ప్యాకింగ్ వరకు అన్నీ చూసుకుంటాం. మెప్మా నుంచి ప్రతినెలా రూ.7,500 ఇస్తున్నారు. నాతోపాటు మరో ఆరుగురు ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. నిత్యం సరుకుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు. – పుష్పలత, డ్వాక్రా గ్రూపు సభ్యురాలు, పులివెందుల తూకం, నాణ్యతలో కచ్చితత్వం జగనన్న మహిళా మార్ట్‌లో సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటోంది. తూకం, నాణ్యతలోనూ కచ్చితత్వం ఉంటోంది. మార్ట్ ప్రారంభించినప్పటి నుంచి మేము ఇక్కడే సరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు కూడా రూ.3 వేలతో సరుకులను కొనుగోలు చేశాం. – బోనాల కళావతి, పులివెందుల సరసమైన ధరలకే సరుకులు ఈ ఏడాది జనవరిలో జగనన్న మహిళా మార్ట్‌ను స్థాపించాం. డ్వాక్రా మహిళలకు కార్డులిచ్చి రాయితీపై సరుకులు అందిస్తున్నాం. ఇతర ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు, సరుకులు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి భాగస్వామ్యంతోనే ఈ మార్ట్‌ను ముందుకు నడిపిస్తున్నాం. ఏడాదికొకసారి పెట్టుబడి పెట్టిన ప్రతి డ్వాక్రా మహిళకు బోనస్ రూపంలో ఆదాయం పెంచుతాం. – పి.అబ్బాస్ ఆలీఖాన్,సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, పులివెందుల -
యువతకు ప్రభుత్వ బాసట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతీ, యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో దీన్‌దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం(డీఏవై–ఎన్యూ ఎల్ఎం) మార్గదర్శకాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 35 మునిసి పాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14 రంగాలలో 28 కోర్సులు పట్టణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి డిగ్రీ సమాన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు శిక్షణకు అర్హులు. విద్యార్హత, అభ్యర్థుల అభిరుచులకు అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ శిక్షణ కేంద్రాలతో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఎస్డీసీ) ద్వారా ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 69 ఉత్తమ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు. -
జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్లైట్ వ్యవహారం
సాక్షి, ప్రకాశం: కందుకూరు మెప్మాలో ఓ బంగారు బ్రాస్లెట్ వ్యవహారం తీవ్ర చర్చగా మారింది. పొదుపు సంఘాల గ్రూపుల నిర్వహణలో జరుగుతున్న అవినీతి వ్యవహారానికి ప్రతీకగా ఈ బ్రాస్లెట్ కథ చర్చనీయాంశమైంది. ఓ మహిళా సీఓ మెప్పు కోసం ఆర్పీలు అంతా కలిసి సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయడం... ఆ డబ్బులతో అమ్మగారికి బ్రాస్లెట్ చేయించడం, ఇది కాస్త బయటకు వచ్చి వ్యవహారం రచ్చగా మారింది. దీంతో బ్రాస్లెట్ డబ్బులను సదరు సీఓ తిరిగి ఆర్పీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. మెప్మాలో జరుగుతున్న అవినీతి, మహిళల నుంచి డబ్బుల వసూలు కార్యక్రమానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. అసలేం జరిగింది..? పట్టణ మెప్మా విభాగంలో పనిచేసే ఓ మహిళా సీఓ అవినీతి వ్యవహారానికి ఈ బ్రాస్లెట్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఇటీవల కాలంలో ఆమె ఇంట్లో ఓ వేడుక జరిగింది. ఈ వేడకకు ఆమెకు విలువైన కానుక ఇవ్వాలని రిసోర్స్ పర్సన్స్(ఆర్పీలు) నిర్ణయించారు. దీనికి గాను వారి పరిధిలోని ప్రతి సంఘం నుంచి కొత్త మొత్తాన్ని వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన డబ్బులతో సదరు సీఓకు కానుక ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో విలువైన బంగారు బ్రాస్లెట్ను చేయించారు. వేడుక రోజు బ్రాస్లెట్ను సదరు సీఓకి అందజేశారు. ఈ వ్యవహారం కాస్త రచ్చగా మారింది. విషయం ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి దాకా చేరింది. దీంతో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ఇప్పుడు మెప్మాలో పెద్ద చర్చనీయాశంగా మారింది. వెంటనే అప్రమత్తమైన సదరు సీఓ బ్రాస్లెట్ కోసం చేసిన ఖర్చు మొత్తాన్ని ఆర్పీలకు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. దీంతో అసలు మొత్తం ఈ వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే దానిపై ఇటు సీఓ, అటు ఆర్పీల్లో చర్చగా మారింది. అయితే మెప్మాలో ఈ వ్యవహారం కొత్తేమి కాదు, రుణాలు ఇప్పించాలన్నా, ప్రభుత్వం ఏమైనా పథకాలు వచ్చినా ప్రతి సంఘం నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. గత ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ తరుపున ఆర్పీలు జోరుగా ఓటర్లకు డబ్బులు పంచారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పట్టణ మెప్మాలో జరుగుతున్న అవినీతి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విషయం నా దృష్టికి వచ్చింది.. విచారణ చేయిస్తా.. కందుకూరు మెప్మాలో బ్రాస్లెట్ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. అలాగే డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై త్వరలోనే విచారణ చేయిస్తాను. ఇలా డబ్బులు వసూలు చేయడం అనేది నిజంగా క్షమించరాని విషయమే. ఈ వ్యవహారాలపై త్వరలోనే విచారణ జరుపుతాం, కందుకూరులో సమావేశాలు నిర్వహించి మెప్మా సిబ్బందిలో మార్పు తీసుకుచ్చేందుకు కృషి చేస్తాను. -రఘు, మెప్మా ఇన్చార్జి పీడీ కమీషన్ వ్యాపారం.. ఇటీవల కాలంలో పొదుపు సంఘాల మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు వంటి పథకాలను అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకాల్లో వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తుండగా, చేయూత పథకం కింద రూ.18,750లను ఆర్థిక సాయం అందిస్తుంది. జగనన్నతోడు పథకం కింద చిరువ్యాపారులకు రూ.10వేల రుణాలు మంజూరు చేస్తుంది. ఈ పథకాల్లో ఆసరా, జగనన్నతోడు పథకాలతో సీఓలు, ఆర్పీలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ క్రమంలో పొదుపు సంఘాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సీసీల వ్యవహారశైలిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది ఒక్క కేవలం మెప్మాకి మాత్రమే పరిమితం కాదు, వెలుగు విభాగంలో మండలాల్లో పనిచేసే సీసీలది ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు కందుకూరు, ఉలవపాడు వంటి ప్రాంతాల్లో వెలుగులోనికి వచ్చాయి. వీటిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రూరల్ ప్రాంతంలో కూడా సంఘానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని బేరంపెట్టినట్లు సమాచారం. ఇలా అధికారులే నేరుగా పొదుపు సంఘాలతో కమీషన్ వ్యాపారం చేస్తున్నట్లు తయారైంది పరిస్థితి. డబ్బులు అడిగే సీసీల సమాచారం ఇవ్వాలని, తమకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రచారం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు రావడం లేదు. -
మాస్కులు పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్ డైరెక్టర్ నవీన్ కుమార్ మాస్కులను అందచేశారు. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, మెప్మా అడిషనల్ డైరెక్టర్ శివపార్వతి పాల్గొన్నారు. (ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు: సీఎం జగన్) కాగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో... విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం కలిగింది. అయితే ఈ మాస్క్‌ల తయారీని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే మాస్కులకు అవసరమైన క్లాత్‌ను ఆప్కోనుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 16 కోట్ల మాస్కులు తయారుచేయడానికి 1 కోటి 50 లక్షల మీటర్లకుపైగా క్లాత్ అవసరం అవుతోంది. ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కో నుంచి తీసుకున్నారు. మిగతా క్లాత్ త్వరలోనే అందబోతోంది. (కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్‌లు) స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40వేల మంది టైలర్లను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన వారితో పనిచేయిస్తున్నారు. ఒక్కో మాస్క్‌కు దాదాపు రూ.3.50 చొప్పున సుమారు రూ.500లకుపైనే ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్క్‌లు తయారుచేయగా వీటిని పంపిణీ కోసం తరలిస్తున్నారు. వచ్చే 4–5 రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్క్‌లు తయారీ కోసం సన్నద్ధమవుతున్నారు. మాస్క్‌ల తయారీ, పంపిణీలపై వివరాలతో కూడా రియల్‌టైం డేటాను ఆన్లైన్లో పెడుతున్నారు. (‘16 కోట్ల మాస్కులు తయారు చేసింది ఏపీ మహిళలే’) -
చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు: బొత్స
సాక్షి, విజయవాడ : గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు ముందే వస్తే ఎందుకు అమలు చేయలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం మన్సిపల్ కమిషనర్లు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాల వల్లనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందని విమర్శించారు. ఒక్క మున్సిపల్ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేసిందని, అన్నా క్యాంటీన్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమేనని అందుకు బొగ్గు కొరత కారణమన్నారు. ప్రభుత్వంపై కన్నా లక్ష్మీ నారాయణ చేస్తున్న విమర్శలు ఏ దృష్టితో చేస్తున్నారో ఆయనే చెప్పాలని స్పష్టం చేశారు. 110 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని బొత్స వెల్లడించారు. మరోవైపు నిరాశ్రయులకు పునరావాసం కల్పించేందుకు ముగ్గురు అధికారులు, మూడు ఎన్జీవోలతో కలిసి అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు జరిగిన వర్క్‌షాప్ సమావేశంలో ఎమ్ఎ అండ్ యుడి శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ.. మోప్మా ద్వారా షల్టర్ ఫర్ హోంలెస్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమాలు, ప్రాథమిక ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి నలభై మందికి పైగా ఎన్జీవోలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆ శాఖ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. పురపాలక కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయన్న ఆయన షల్టర్లు ఉన్నాయన్న విషయం చాలామంది కమిషనర్లకు తెలీదని వ్యాఖ్యానించారు. అధికారులు ఆఫీసులకు పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో వెళ్తేనే ఫలితాలు ఉంటాయని సూచించారు. ఒక స్థాయిలో మార్కెట్లో మంచి పేరు వచ్చాక ఆన్లైన్ సైట్లకు లింక్ చేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. అంతేకాక, యువతకు స్కిల్ ట్రైనింగ్, ఎంప్లాయిమెంట్ సరిగ్గా జరగడం లేదని సమావేశ దృష్టికి తీసుకొచ్చారు. -
తిరుపతి మెప్మాలో ‘సోగ్గాడు’
సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు యువతులతో సరసాలు.. మాటలతో దగ్గరకి చేర్చుకోవడం చేస్తూ సరి కొత్తపాత్రలో కనిపిస్తాడు. అదే తరహాలో తిరుపతి మెప్మాలో ఓ ప్రధాన ఉద్యోగి మహిళలతో ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనగారి రాసలీలలపై బాధిత మహిళలు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. సాక్షి, తిరుపతి: ఇటీవల కడప జిల్లా నుంచి బదిలీపై తిరుపతి మెప్మాకు వచ్చిన ఓ ఉద్యోగి చెప్పిందే వేదంలా ఉంది. ఆయన ఔనంటే రుణం అందుతుంది.. మాఫీ అవుతుంది.. కాదంటే అంతే. ఇంత ఘనుడైన ఈయన గారిని ప్రసన్నం చేసుకునేందుకు పొదుపు సంఘాల, ఇతర రుణాలను స్వాహాచేసిన వారు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ ఉద్యోగికి కార్యాలయంలోనే రాచమర్యాదలు జరుగుతున్నాయి. ఇందుకు ఆ ఉద్యోగికి ఇష్టమైన వంటలు వండుకొచ్చేది ఒకరైతే.. అవసరమైతే కాళ్లు పట్టేందుకు ఇంకొకరు పోటీపడుతున్నట్లు మెప్మా వర్గాలు వెల్లడిస్తున్నాయి. కార్యాలయంలోని ఆ ఉద్యోగి ఛాంబర్‌లోనే మధ్యాహ్నం వెరైటీ వంటలను వండుకొచ్చి ఆయన గారికి వడ్డిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ అధికారి చిల్లర చేష్టలకు దిగుతున్నారని సంఘాల సభ్యులు వాపోతున్నారు. ఇదే విషయం ఇప్పటికే సంబంధిత మెప్మా పీడీ జ్యోతి దృష్టికి వెళ్లింది. అలాగే కొంతకాలంగా వేధింపుల ఆగడాలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా ‘ప్రత్యేక’ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిర్యాదుల ఆధారంగా ఆ ఉద్యోగిని ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగం నుంచి తొలగించేందుకు దస్త్రాలు సిద్ధమైనట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. చెప్పినట్లు వినాల్సిందే.. వివిధ రుణాలు, సంఘాల లావాదేవీలపై తన వద్దకు వచ్చే మహిళలతో ఆ ఉద్యోగి డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అందిరితోనూ ఆ ఉద్యోగి ఇలానే మాట్లాడుతున్నారని మహిళలు వాపోతున్నారు. తనకు నచ్చినట్లు వ్యవహరించకుంటే మరోలా ఇబ్బందిపెట్టడం, ఒత్తిడి తెచ్చే మాటలు మాట్లాడుతున్నారని ఓ మహిళ తన ఆవేదనను సాక్షితో పంచుకున్నారు. మరో అధికారిపై ఆరోపణలు.. ఇదే కార్యాలయంలో మరో ప్రధాన ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తిపైన ఆరోపణలున్నాయి. ఆయనపై వేధింపుల ఆరోపణలు కాకుండా ఆర్థిక లావాదేవీల్లోని లోటుపాటులను గుర్తించి సొమ్ము చేసుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. డీఫాల్టర్లుగా ముద్రపడిన వారు, ఇతర ఖర్చుల నుంచి దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఆ ఉద్యోగితో సత్సంబంధాలు కొనసాగించే మహిళల ఆధారంగా మిగిలిన వారిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. చెప్పినట్లు వినకుంటే అతను తనదైన శైలిలో వేధింపులకు గురిచేస్తున్నారు. అందరి ఎదుట తిట్టడం, బెదరించడం వంటివి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో కొందరు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కార్యాలయంలోకే మటన్, చికెన్ వెరైటీలతోపాటు చేపల పులుసులను తీసుకొచ్చి ఆయనకు వడ్డిస్తున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజూ కార్యాలయం విందు పసందులతో రంజుగా ఉంటోంది. మధ్యాహ్నం అయితే ఆ ఉద్యోగి ఛాంబర్లో వంట వడ్డించే వారు మినహా ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అనేక ఆరోపణలతో ఆ ఉద్యోగిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందడంతో పైస్థాయి అధికారులు ఆ ఉద్యోగిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది చదవండి : దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!! -
కేసీఆర్ తాతా.. ఆదుకో
కామారెడ్డి క్రైం: మెప్మా రిసోర్స్ పర్సన్లు చేపట్టిన సమ్మె ఆదివారం 26వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో రిసోర్స్ పర్సన్లతోపాటు వారి పిల్లలు పాల్గొన్నారు. ‘కేసీఆర్ తాతా.. మా కుటుంబాలను ఆదుకోవా, మా అమ్మల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి’ అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీల ప్రతినిధి దత్తేశ్వరి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. శనివారం ప్రభుత్వ ప్రతినిధిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు కొందరు తమను కించపర్చే విధంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి నిరసనగా పిల్లలతో కలిసి సమ్మెలో పాల్గొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. -
మెప్మా.. ముడుపులేంటి చెప్మా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. లంచం ఇవ్వనిదే రుణాలు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా రుణాలు ఇస్తున్నారు. ప్రతి రుణానికి రూ.5 వేల చొప్పున సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. మెప్మాలో పనిచేసే ఆర్సీ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి.. రుణాలు పొందే లబ్ధిదారుల నుంచి వసూలు చేసి ఇవ్వాలని గత ప్రాజెక్ట్ డైరెక్టర్ నిబంధన పెట్టారు. ప్రతి పది గ్రూపులకు ఒక ఆర్సీ ఉంటా రు. వీరు గ్రూపుల నుంచి ఏమేరకు రుణాలు వసూలు కావాల్సి ఉంది, పాత రుణం ఎప్పటికి పూర్తవుతుంది, కొత్తగా రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు చెబుతుంటారు. వీరికి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు. వారికి వేతనాలు చెల్లించే పేరిట లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదాస్పదం అవుతోంది. ప్రతి లబ్ధిదారు నుంచి రూ.5 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్ము జిల్లాస్థాయి వరకూ పంపిణీ అవుతోందని సమాచారం. ఇతరుల నుంచీ.. స్వయం సహాయక సంఘాల మహిళల భర్తలు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు.. వారి పిల్లల చదువు కోసం కూడా మెప్మా ద్వారా రుణాలు ఇస్తారు. ఈ విభాగంలో ఏడాది జిల్లాలోని అన్ని పట్టణాలకు 983 యూనిట్లు మంజూరు కాగా.. 612 యూనిట్లకు రుణాలిచ్చారు. దీంతోపాటు తోపుడు బళ్ల వ్యాపారులకు రుణాలు ఇవ్వడం, నైపుణ్య అభివృద్ధి పథకం కింద నిరుద్యోగుల స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇప్పించి, రుణాలు మంజూరు చేయడం వంటి పథకాలు ఉన్నాయి. ఐదు మున్సిపాలిటీలలో స్త్రీ నిధి బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాల వారీగా ఇచ్చే రుణాలకు సంబంధించి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. రూ.లక్ష రుణం పొందితే రూ.5 వేలు సమర్పించుకోవాలి్సందే. అంతకు తక్కువ ఇస్తే ఊరుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పైసా ఇవ్వక్కర్లేదు మెప్మా పీడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశరావును ఈ విషయమై వివరణ కోరగా.. రుణాల కోసం ఎవరికీ పైసా చెల్లించాలి్సన అవసరం లేదన్నారు. ఎవరైనా సొమ్ము డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతి ఆరోపణలు వస్తే క్లస్టర్, మండల, జిల్లా స్థాయి అధికారినైనా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు. -
‘ఆటో’ రాణులు
త్వరలో ‘షీ’ ఆటోలు – మెప్మా ఆధ్వర్యంలో 200 మంది మíßహిళలకు ఉపాధి – 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ – ప్రయోగాత్మకంగా కర్నూలులో శ్రీకారం కల్లూరు(రూరల్)/కర్నూలు(టౌన్): హైదరాబాద్ తరహాలో కర్నూలులోనూ షీ ఆటోలకు ప్రణాళిక సిద్ధమైంది. మహిళలు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే పరిస్థితి లేకపోవడం.. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలతో ఇళ్లకు చేరుకునేందుకు బిక్కుబిక్కుమనే పరిస్థితుల్లో తెరపైకి వచ్చిన షీ ఆటో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అనుమతితో కర్నూలులో ప్రయోగాత్మకంగా షీ ఆటోలు నడిపేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) శ్రీకారం చుడుతోంది. శిక్షణను ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించే దిశగా వేస్తున్న ఈ అడుగు ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది. మహిళల రక్షణే ధ్యేయంగా.. మగ వారికే పరిమితమైన ఆటో రంగంలో రాణించేందుకు మహిళలు కూడా ముందుకొస్తున్నారు. కర్నూలు నగరంలో 20వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఉపాధి పేరిట ఆటోలు నడుపుతున్న కొందరు డ్రైవర్లు మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇందుకు జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసులో ఉదాహరణలు. రెండేళ్ల క్రితం కర్నూలు నగరానికి చెందిన రవికుమార్ అనే ఆటో డ్రైవర్ మహిళలకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడం, దోచుకోవడం వంటి ఘనలతో ఆటో డ్రైవర్లు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. చీకటి పడితే మహిళలు ఒంటరిగా ఆటోలో ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు భరోసాగా షీ ఆటోలను మెప్మా తెరపైకి తీసుకొచ్చింది. 200 మందికి ఉపాధి.. 90 రోజుల పాటు శిక్షణ ‘షీ’ ఆటోల పేరుతో పొదుపు గ్రూపుల్లో మహిళలను 200 మందిని ఎంపిక చేసి డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 90 రోజుల పాటు శిక్షణనిచ్చి ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణం సైతం అందిస్తారు. మొదట 100 మంది మహిళలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆ తర్వాత మరో వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ‘షీ’ ఆటోలతో అనుసంధానం చేసి నిరంతరం ఉపాధి కల్పించేందుకు మెప్మా అధికారులు నివేదికలు రూపొందించారు. విద్యార్థులను స్కూళ్ల వద్ద వదిలిపెట్టడం.. ఆ తర్వాత తిరిగి ఇళ్లకు చేర్చడం ద్వారా ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. మిగతా సమయంలో నగరంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి నెలకు కనీసం రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదించే వెసులుబాటు కల్పించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పొదుపు మహిళలను ఎంపిక చేసి బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పించడం.. నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. ‘షీ’ఆటోలకు త్వరలో శ్రీకారం పొదుపు గ్రూపు మహిళలచే షీ ఆటోలను త్వరలో నడుపుతాం. మహిళలకు శిక్షణనిచ్చి రుణం ద్వారా ఆటోలను పంపిణీ చేస్తాం. ఇందుకోసం సోమవారం జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోనున్నాం. 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాం. -
మెప్మాలో కీచకులు
పేట్రేగుతున్న కామాంధులు ఎవరికీ చెప్పలేక కుమిలిపోతున్న మహిళలు తిరుపతి సెంట్రల్: మెప్మాలో కీచకలు తిష్టవేశారు. ఆర్థిక వెతలనే ఆసరాగా చేసుకుని మహిళలను లైంగిక వైధింపులకు గురిచేస్తున్నారు. మాటవినకపోతే బ్యాంక్ నుంచి తీసుకున్న లింకేజీ రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేయిస్తున్నారు. అదీ కుదరకపోతే పైఅధికారులతో ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇవిగో సాక్షాలు తిరుపతిలోని జానకిరామ సమాఖ్యలో అన్నపూర్ణ సంఘం సభ్యురాలు, స్పందన మాజీ కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళ మెప్మా ద్వారా ఏడాది క్రితం బ్యాంక్ నుంచి లింకేజీ రుణం తీసుకుని ‘సుగుణ డ్వాక్రా క్యాంటీన్ ’ ఏర్పాటు చేశారు. ఇటీవల కంటి ఆపరేషన్ కోసం రెండు నెలలు క్యాంటీన్ మూసివేశారు. బ్యాంకు రుణం సకాలంలో చెల్లించలేకపోయారు. మెప్మాలో ఆదుకునే వారు కరువయ్యారు. మెప్మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ నుంచి వేధింపులు.. అసభ్యకర మాటలు, బ్యాంక్ అధికారుల ఒతిళ్లు ఎక్కువయ్యాయి. వీటిని ఖండించాల్సిన ఓ సీవో స్థాయి మహిళ కూడా సదరు అధికారి ‘చెప్పినట్టు’ నడుచుకోవాలి.. అంటూ వేధింపుల్లో భాగమైందని బాధిత మహిళ వారం కిత్రం మీడియా ఎదుట బోరుమన్నారు. ఇదిలావుండగా సంఘంలోని ఓ మహిళా సభ్యురాలు కుమార్తెకు ఉద్యోగం తీసిచ్చినందుకు సదరు అధికారి ఆ సభ్యురాలిని రాత్రి 8గంటలకు ‘లీలామహల్ సెంటర్’కు రావాలనడంతో ఆమె అవాక్కయినట్టు సమాచారం. ఇలాంటి సంఘటనలపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన చేయి అభయ హస్తమేనట ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లు, చంద్రన్న బీమా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. చంద్రన్నబీమా చేసి ఎవరైనా చనిపోతే రూ.30 వేలకు రూ.1,000, రూ.1లక్ష బ్యాంక్ లోను తీసిస్తే రూ.10వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. సదరు అధికారి సంతకం ఉంటేనే లోను ఇచ్చేలా బ్యాంకు అధికారులను సైతం మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. మెప్మాలో ఓ ‘పెద్ద’ సారు తన వెనకుండారని, ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే అల్లుడు చూసుకుంటారని సదరు అధికారి తరచూ అంటుండేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రన్న బీమా పేరుతో సంఘంలో సంబంధం లేని వారి నుంచి దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. స్కాలర్షిప్లను సైతం తన జేబులో వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడం నేరం. అలాంటివి మెప్మాలో జరిగే అవకాశం లేదు. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. తిరుపతిలో జరుగుతున్న సంఘటనపై విచారణ చేయిస్తా. తప్పు చేసినట్టు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –నాగపద్మజ, జిల్లా పథక సంచాలకులు, మెప్మా -
మెప్మా లక్ష్యం నెరవేర్చాలి
20 లక్షల కుటుంబాలను నగదు రహితం వైపు నడిపించాలి ఒక్కో రీసోర్స్పర్సన్కు 300 కుటుంబాల బాధ్యత సమీక్ష సమావేశంలో మెప్మామిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య హిందూపురం అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో ఉన్న 20 లక్షల కుటుంబాలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించడమే మన లక్ష్యమని, 2017 ఫిబ్రవరి 15 నాటికి దీనిని నేరవేర్చాల్సిన బాధ్యత రీసోర్స్పర్సన్లపై ఉందని మెప్మామిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య అన్నారు. ఆ దిశగా ఒక్కో రీసోర్స్‌పర్సన్ దాదాపు 300 కుటుంబాల బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక జేవీఎస్ ప్యారడేజ్ హాల్లో సోమవారం పీడీ సావిత్రి అధ్యక్షతన మెప్మా జిల్లా సమీక్షా సమావేశం, నగదురహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో చిన్నతాతయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. బ్యాంకు రుణాలు ఇప్పించే సమయంలో రీసోర్స్పర్సన్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అలా కాకుండా వారికి తగినంత పరితోషికం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల సమావేశాలకు జనాలను తీసుకొచ్చే వారిలా కాకుండా ప్రతి కుటుంబానికీ రెండింతల ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలన్నారు. ఆ దిశగా వారికి 15 రోజులు శిక్షణ అందించాలని పీడీని ఆదేశించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లోని సమాఖ్య సభ్యులందరూ మురికివాడలను దత్తత తీసుకుని వారి అభివృద్ధికి పాటుపడాలని, వారిని కూడా నగదురహిత లావాదేవీల వైపు నడిపించాలని సూచించారు. తర్వాత జిల్లాలోని 14 మున్సిపాల్టీల టీపీఓ, మెప్మా సిబ్బందితో సాయంత్రం వరకు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీబీ మేనేజర్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటికీ ఒక్కడే
సంఘాలు ఎన్నో.. పోస్టులు కొన్నే..! నగర పంచాయతీ ‘మెప్మా ’విభాగంలో ఖాళీలతో తిప్పలు పట్టించుకోని అధికారులు జోగిపేట: జోగిపేట నగర పంచాయతీలోని మెప్మా విభాగంలో అన్ని పోస్టులు ఖాళీగా ఉండటంతో డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో 20 వార్డులకు గాను సమాఖ్యలకు సంబంధించి 350 గ్రూపుల్లో 4,300 మంది సభ్యులున్నారు. ఆయా సంఘాల్లో పొదుపులు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు, స్వయం ఉపాధి రుణాల మంజూరు అంశాల్లో మెప్మా సిబ్బంది మహిళా సంఘాలకు సహాయం చేయాల్సి ఉంటుంది. మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహకారం అందించి వారు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలి. జోగిపేట, అందోలును కలిపి మూడేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మెప్మా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. 500 గ్రూపుల ఇళ్లకు ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉండాలి. పట్టణంలో కనీసం ముగ్గురికిపైగా సీఓలు ఉండాలి. ఒక టౌన్ మిషన్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీ వలంటీర్లు ఉండాలి. టీఎంసీ(టౌన్ మిషన్ కోఆర్డినేటర్)లు ప్రభుత్వ పథకాలపై మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. మెప్మా సోషల్ వెల్ఫేర్పై తెలియజేయాలి. కమ్యూనిటీ ఆర్గనైజర్లు వారి పరిధిలోని మహిళా గ్రూపులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచలను చేయాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ది కూడా ముఖ్యమైన బాధ్యతనే. సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు గ్రూపుల వివరాలను తెలియజేయాలి. టీడబ్ల్యూడీ వలంటర్ గ్రూపులోని వికలాంగులుగా ఉన్న సభ్యులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలను తెలియజేయాలి. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తోంది. బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపుల్లో సభ్యులకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేశారు. అన్నింటికీ ఒక్కడే మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తోంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను బ్యాంకుల ద్వారా అందజేస్తోంది. అలాంటి విభాగానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జోగిపేట నగర పంచాయతీలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఒక్కరే పని చేస్తున్నారు. ఆయన ఇన్చార్జి టీఎంసీ, సీఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీగా వ్యవహరిస్తున్నారు. 4,300 మంది మహిళా సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మూడేళ్లయినా ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూపు మహిళలు కోరుతున్నారు. సిబ్బంది తక్కువ నగర పంచాయతీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇన్చార్జి టీఎంసీ ఒక్కరే అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రూపుల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో రుణాలు. సలహాలు, సూచనలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు మహిళలకు తెలియజేసే బాధ్యత సిబ్బందిదే. పూర్తి స్తాయి సిబ్బందిని నియమించాలి. - కళావతి, గ్రూపు లీడర్ ఖాళీలు వాస్తవమే జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి మెప్మా విభాగంలో అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. టీఎంసీ, సీఓ టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఓగా ఉన్న నేను కొన్ని సంవత్సరాలుగా ఇన్చార్జి టీఎంసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సిబ్బంది లేకున్నా అన్ని రకాల విధులను నిర్వహిస్తున్నా. - భిక్షపతి, మెప్మా ఇన్చార్జి టీఎంసీ ఖాళీలను భర్తీ చేయాలి నగర పంచాయతీలో మెప్మా విభాగంలో ఉన్న టీఎంసీ, సీఓ, టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీల కారణంగా గ్రూపుల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కరే అన్ని బాధ్యతలను చూడాల్సి వస్తోంది. నాలుగు వేలకుపైగా మహిళలున్నారు. ప్రభుత్వం మెప్మా సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలి. - ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్పర్సన్ -
చేతివృత్తుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం
ఆరిలోవ: రెండో వార్డులో జీవీఎంసీ పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ(మెప్మా), జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్(ఎన్యూఎల్ఎం) సంయుక్తంగా చేతి వృత్తుల్లో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటుచేశాయి. ఈ శిక్షణ తరగతులను శనివారం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు ప్రారంభించారు. ఇక్కడ 80 మంది మహిళలకు టైలరింగ్, మరో 80 మంది మహిళలకు బ్యుటీషియన్లోను శిక్షణ ఇవ్వనున్నారు. వారికి సరిపడా మిషన్లు, బ్యుటీషియన్ సామాన్లు అందుబాటులో ఉంచారు. వారికి శిక్షణ ఇవ్వడానికి ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటుచేశారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే వెలగపూడి ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి శిక్షణ వల్ల మహిళలు వారి కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు మూడు నెలల పాటు జరుగుతాయన్నారు. రోజుకు ఆరు గంటలు పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యుటీషియన్లో రెండు నెలలు, టైలరింగ్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసిరావు, స్థానిక నాయకులు గాడి సత్యం, మోది అప్పారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.