Mukesh Ambani
-
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
వంద మందిలో ఒకే ఒక్కడు.. ముఖేష్ అంబానీ
వ్యాపార రంగంలో ఫార్చూన్ (Fortune) అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరుగా నిలిచారు. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త ఆయనొక్కరే కావడం విశేషం. శక్తిమంతుల జాబితాలో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఆరుగురు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు 40 పరిశ్రమల నుండి ఉన్నారు. వీరిలో 30 నుండి 90 ఏళ్ల వరకు పలు వయసులవారు ఉన్నారు. ఇందులో వ్యవస్థాపకులు, ప్రముఖ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆవిష్కర్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఇక ఇందులో స్థానం పొందిన ఐదుగురు భారతీయ సంతతి సీఈవోలలో నలుగురు టెక్ దిగ్గజాల సీఈవోలు కాగా, ఒకరు మేకప్ బ్రాండ్‌ను నడుపుతున్నారు.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటభారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఫార్చూన్ జాబితాలో జాబితాలో 3వ స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈసారి టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 52వ స్థానంలో, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 69వ స్థానంలో ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 74వ ర్యాంక్, మేకప్ బ్రాండ్ ఐస్ లిప్స్ ఫేస్ (ELF) సీఈవో తరంగ్ అమిన్ 94వ ర్యాంక్ దక్కించుకున్నారు. -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
దానగుణంలో వీరే టాప్: మొదటిస్థానంలో నాడార్.. రెండో స్థానంలో
-
దానగుణంలో హెచ్‌సీఎల్ నాడార్ టాప్..
ముంబై: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్‌గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్‌కేర్‌కి రూ. 626 కోట్లు లభించాయి. రిచ్ లిస్ట్‌లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు ▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లుWho are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024 -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్‌లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్‌ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్‌మెడ్స్ ఫ్రెష్‌పిక్ -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్‌లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు డౌయిన్, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
జియోకు కస్టమర్లు షాక్.. కోటి మంది గుడ్ బై..!
-
ఆస్కార్ రిటైరయ్యింది..!
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం ముంబైలోని అంటీలియా వద్ద పేలుడు పదార్థాలను కనిపెట్టి పెను ప్రమాదాన్ని నివారించిన పోలీసు జాగిలం ‘ఆస్కార్’విధుల నుంచి విశ్రాంతి తీసుకుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న అంబానీ నివాసం సమీప పార్కింగ్ ప్లేస్‌లో 2021 ఫిబ్రవరి 25న ఆగంతకులు ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ను ఇది పసిగట్టింది. అప్పట్లో ఈ విషయం దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆస్కార్ బుధవారం తోటి శునకం మిలోతోపాటు రిటైరయ్యింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకకు అదనపు కమిషనర్ వినీత్ సాహూ సహా పలువురు అధికారులు హాజరై జాగిలాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముంబై పోలీసు విభాగం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీడీఎస్)లో 2014లో చేరిన ఆస్కార్ పదేళ్లపాటు వీఐపీ భద్రతతోపాటు బెదిరింపులు, బెదిరింపు కాల్స్ సమయంలో విధులను సమర్ధవంతంగా నిర్వహించిందని ఓ అధికారి తెలిపారు. మిలో కూడా వీఐపీలు, కీలక సంస్థల భద్రతతోపాటు అనుమానాస్పద బ్యాగుల తనిఖీ విధుల్లో పాల్గొందని చెప్పారు. రిటైరయ్యాక ఈ రెండు జాగిలాలకు ఏసీ వసతి సౌకర్యంతోపాటు రవాణా సమయంతో ఏసీతో కూడిన వాహనం సమకూర్చుతామని, ఇవి అందించిన సరీ్వసులకు గుర్తింపుగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేశామని చెప్పారు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్‌ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతులలో ఒకరు, భారతీయ పారిశ్రామిక వేత్త 'ముకేశ్ అంబానీ' వ్యాపార సామ్రాజ్యం గురించి, వారి ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అంబానీ దగ్గర డ్రైవర్ జాబ్ చేసే వ్యక్తి జీతం ఎంత ఉంటుందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసుకోవాలానే ఆసక్తి కూడా ఉండొచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2024 అక్టోబర్ 19 నాటికి ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని 15వ సంపన్న వ్యక్తిగా.. ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. అయితే ఈయన వ్యక్తిగత వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేశారు. ఈ వేతనం 2008 - 2009 ఆర్ధిక సంవత్సరం నుంచి కొనసాగుతోంది.అంబానీ డ్రైవర్ జీతం2017లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం ప్రకారం, అంబానీ డ్రైవర్ జీతం నెలకు రూ.2 లక్షలు. అంటే ఏడాదికి రూ. 24 లక్షలన్నమాట. జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా కూడా డ్రైవర్‌కు లభిస్తాయి. 2017లోనే డ్రైవర్ జీతం రెండు లక్షలు అంటే.. ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి అంబానీ కారు డ్రైవ్ చేసివారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వీరికి డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. లగ్జరీ కార్లను, బులెట్ ప్రూఫ్ కార్లను ఎలా డ్రైవ్ చేయాలి? వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా బాగా అవగాహన ఉంటుంది. ఈ కారణంగానే సంపన్నుల డ్రైవర్లకు జీతాలు ఎక్కువగా ఉంటాయి. -
గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.. రతన్ టాటాకు అంబానీ ఫ్యామిలీ నివాళి
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
రిలయన్స్‌కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్‌లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్‌ల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్‌చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్‌ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్‌ల పోర్ట్‌ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
కాబోయే తొలి టాప్10 ట్రిలియనీర్లు వీళ్లేనా?
ప్రపంచంలో కొందరి సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే లక్షల కోట్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ వారిని మల్టీ బిలియనీర్లు అనేవారు. ఇప్పుడు కొత్త టైటిల్ రాబోతోంది. అదే ట్రియనీర్. అంటే 1000 బిలియన్లు ఒక ట్రిలియన్కి సమానం. అయితే ఇప్పటి వరకూ ఎవరూ అధికారింగా ట్రిలియనీర్ టైటిల్ పొందలేదు. ఆ టైటిల్ సాధించే దిశగా టాప్ 10లో ఎవరెవరుంటారు అనే దానిపై ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ జాబితాను తయారు చేసింది.ఎలాన్ మస్క్ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఎలాన్ మస్క్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ 195 బిలియన్ డాలర్లు. ఇది సగటున ఏడాదికి 109.88 శాతం చొప్పున పెరుగుతోంది. దీని ప్రకారం ఆయన 2027 కల్లా ట్రిలియన్ డాలర్ల సంపదను చేరుకుంటారు. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరా లింక్ వంటి సంస్థలకు అధినేతగా ఉన్నారు.గౌతమ్ అదానీభారత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ట్రిలియనీర్ అయ్యేవారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 84 బిలియన్ డాలర్లున్న గౌతమ్ అదానీ నెట్‌వర్త్ ఏటా సగటున 122.86 శాతం వృద్ధి చెందుతోంది.జెన్సెన్ హువాంగ్చిప్ కంపెనీ ఎన్విడియా కోఫౌండర్, సీఈవో జెన్సెన్ హువాంగ్ నెట్‌వర్త్ 77 బిలియన్ డాలర్లు కాగా సంవత్సానికి 111.88 శాతం పెరుగుతోంది. దీని ప్రకారం 2028 కల్లా ట్రిలియనీర్ జాబితాలోకి చేరనున్నారు.ప్రజోగో పంగెస్టుబరిటో పసిఫిక్ వ్యాపార సమ్మేళం అధినేత ప్రజోగో పంగెస్టు కూడా ట్రిలియనీర్ కానున్నవారి జాబితాలో ఉన్నారు. ఈయన 2028 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. 43.4 బిలియన్ డాలర్లున్న పంగెస్టు నెట్‌వర్త్ ఏటా సగటున 135.95 శాతం పెరుగుతోంది.బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబంఎల్వీఎంహెచ్ ఫౌండర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 223 బిలియన్ డాలర్లు. ఇది ఏటా 29.33 శాతం వృద్ధి చెందుతోంది. ఈ లెక్కన 2030 కల్లా ఆర్నాల్ట్ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలోకి రానుంది.మార్క్ బుకర్బర్గ్మెటా ఫౌండర్, చైర్మన్, సీఈవో అయిన మార్క్ బుకర్‌బర్గ్ 2030 నాటికి ట్రిలియనీర్ కానున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడిగా ఉన్న బుకర్‌బర్గ్ నెట్‌వర్త్ ఏటా 35.76 శాతం వృద్ధి చెందుతోంది.ఫిల్ నైట్ కుటుంబంనైక్ చైర్మన్ ఫిల్ నైట్, ఆయన కుటుంబం సంయుక్తంగా 40.9 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఇది సంవత్సరానికి సగటున 7.99 శాతం పెరుగుతోంది. 2030 నాటికి ఈ కుటుంబం ట్రిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకోనుంది.ముఖేష్ అంబానీఆసియా అపర కుబేరుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2033 కల్లా ట్రిలియనీర్ కానున్నారు. ఆయన నెట్‌వర్త్ ఏటా సగటున 28.25 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.మైకేల్ డెల్డెల్ టెక్నాలజీస్ చైర్మన్ సీఈవో మైకేల్ డెల్ ప్రస్తుత నెట్‌వర్త్ 91 బిలియన్ డాలర్లు. ఇది సంవత్సరానికి 30.89 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. దీని ప్రకారం ఆయన 2033 నాటికి ట్రిలియన్ డాలర్ క్లబ్లో చేరనున్నారు.స్టీవ్ బామర్మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ ప్రస్తుత నెట్‌వర్త్ 121 బిలియన్ డాలర్లు. 25.76 శాతం చొప్పున ఏటా వృద్ధి చెందుతోంది. ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక ప్రకారం ఈయన 2034 నాటికి ట్రిలియనీర్ అయ్యే అవకాశం ఉంది. -
ఐకానిక్ ఇషా అంబానీ, స్టైలిష్ లుక్స్ (ఫోటోలు)
-
అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.మూడు విషయాలుపెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj— Harsh Goenka (@hvgoenka) October 5, 2024 -
అంబానీకి మార్కెట్ సెగ.. రూ. 1.32 లక్షల కోట్లు ఆవిరి!
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది.షేర్ మార్కెట్లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45 (1.51%) తగ్గింది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ..రిలయన్స్ షేరులో భారీ క్షీణత కనిపించినప్పటికీ దేశంలో ముఖేష్ అంబానీనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. అక్టోబర్ 4 నాటికి అంబానీ రియల్ టైమ్ నెట్‌వర్త్ రూ.916055 కోట్లు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నిరంతర విదేశీ మూలధన ప్రవాహం కారణంగా మార్కెట్ క్రాష్ అయింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా అనిశ్చితి కారణంగా గ్లోబల్ క్రూడ్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్లను దెబ్బతీసింది. -
ప్రజా ధనంతో కొడుకు పెళ్లా?.. ముకేష్ అంబానీపై రాహుల్ ధ్వజం
చండీగఢ్: ప్రముఖ వ్యాపారవేత, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం వేల కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని.. అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొమ్మేనని ఆరోపించారాయన.హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అంబానీ తన కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా? అది ఎవరిది.. అదంతా మీ(ప్రజల) డబ్బు.. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చేయాలంటే అక్కడ.. మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేదు.. మీ పిల్లల పెళ్లిళ్లకు మీరు బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది(పలువురు పారిశ్రామికవేత్తలు) మాత్రం తమ వివాహాలు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు’ అని విమర్శలు గుప్పించారు.#WATCH | Haryana | Addressing a public rally in Sonipat's Gohana, Congress MP & LoP Rahul Gandhi says, "Did you see Ambani wedding? It went on for 15 days you all saw. Did you see Modi ji at the wedding? You saw it right. Did you see Rahul Gandhi there? It should be clear now who… pic.twitter.com/mh3N3E4CQc— ANI (@ANI) October 1, 2024రైతులు బ్యాంకుల్లో, వేరే వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటేనే తన కుటుంబంలో వివాహాలు జరిపించగలుగుతున్నారు. ప్రధాని మోదీ.. మీ జేబులో నుంచి డబ్బులు తీసుకొని ఆ 25 మంది జేబుల్లోకి వేస్తున్నాడని మండిపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. భారత సైనికుల నుంచి పెన్షన్, క్యాంటీన్, అమరవీరుల హోదాను లక్కోవడానికి అగ్నిపథ్ వంటి పథకాలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు.#WATCH | Sonipat, Haryana: Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi while addressing a rally said, "There is everything for Adani, Ambani and billionaires....What is the meaning of Agniveer Yojana?... This scheme has only one aim - snatch away the money for… pic.twitter.com/1nFIlYmCtW— ANI (@ANI) October 1, 2024 ఇదిలా ఉండగా.. వ్యవసాయం ప్రధాన వృత్తిగా సాగుతున్న హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. అటు 10 సంవత్సరాల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కృషి చేస్తోంది. అక్టోబర్ 8న వెలువడే ఫలితాలతో అటు రెండు పార్టీల భవితవ్యం తేలనుంది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
వయాకామ్18 బోర్డులో అంబానీలు
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది. స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్సీఎల్టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్నర్స్ పార్ట్నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.