Mulugu District News
-
జోనల్ క్రీడా పోటీల్లో బాలికల ప్రతిభ
ములుగు రూరల్ : జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో ములుగు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులు పతకాల సాధించి, పలు క్రీడలలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నర్మద బాయి, ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల ఆవరణలో ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు లక్షేట్టిపేటలో కాళేశ్వరం 10వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాల క్రీడా పోటీలు జరిగాయి. ఈ క్రీడల్లో ములుగు సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ క్రీడా అంశాలలో స్వర్ణ పతకాలు–8, రజత –2, కాంస్య–2 సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్, అండర్–19 కబడ్డీలో రన్నరప్, చెస్ స్వర్ణం, అండర్–14లో టెన్నికాయిట్‌లో రన్నరప్‌గా నిలిచి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని, మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో స్వాతి, త్రివేణి, శ్రీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అభినందించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏటూరునాగారం/ములుగు రూరల్ : జిల్లాలోని గిరిజన భవన్లో 68వ అండర్–17 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) కరాటే సెలక్షన్ పోటీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ పోటీల్లో ఏటూరునాగారం కరాటే క్లబ్‌కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బు తెలిపారు. ఈ పోటీల్లో ఏటూరునాగారం గ్రామానికి చెందిన సీహెచ్ ఐశ్వర్య, కె.శ్రీహరిణి, అలువాల విఘ్నశ్రీ, విశాల్, గణేశ్, హర్షవర్ధన్, అన్వేష్, దినేష్, చరణ్, రూమేశ్ బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌కి ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14లోపు విభాగంలో బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహించారు. ఏటూరునాగారం (మల్లంపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి రాజేష్ బాక్సింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా డీఈఓ పాణిని హాజరై విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. పీడీ శ్రీధర్, పీఈటీ ప్రశాంత్, అంకయ్య, వాసుదేవ్, రహీం పాషా, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శోభన్‌బాబు, తిరుపతి, హేమాద్రి పాల్గొన్నారు. -
పశుగణన.. ఆన్లైన్ నమోదు
ములుగు రూరల్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంపదకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పశువుల పాత్ర కీలకం. భూ మిలేని అనేక మంది కుటుంబాలకు ప్రాథమిక ఆ దాయ వనరు పశువులే అని చెప్పడంలో అతిశయో క్తి లేదు. ప్రభుత్వం అక్టోబర్ 25 నుంచి 2025 ఫిబ్రవరి 29 వరకు పశు గణన నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. పశుగణనలో 16 రకాల పశుజాతుల వివరాలు సేకరించనున్నారు. పశుగణనలో భాగంగా తెల్లజాతి పశువులైన ఆవులు, ఎద్దులు, గేదెజాతి పశువులు, గొర్రెలు , మేకలు, పందులు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పెంపుడు కుక్కలు, ఒంటెలు, పొట్టి గుర్రాలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్ల రకాలను లెక్కించనున్నారు. ఐదేళ్ల్లకోసారి లెక్కింపు.. పశుగణన 1919వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకోసారి పశుగణన లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు పశుగణన చేపట్టారు. 2019లో జరిగిన పశుగణనలో జిల్లాలో తెల్లజాతి పశువులు 70,126, గేదెలు 48,109, గొర్రెలు 91,869, మేకలు 56,303, పందులు 585 మొత్తం 2,66,992 నమోదు చేశారు. 21వ పశుగణన నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ములుగు జిల్లాలోని తొమ్మిది మండలాలలో మొత్తం 174 గ్రామ పంచాయతీల్లో 99,459 ఇళ్లను సర్వే చేయనున్నారు. 29 మంది పశుగణన కర్తలు, 9 మంది పర్యవేక్షకులు, ఇద్దరు నోడల్ అధికారులు సర్వేలో పాల్గొననున్నారు. పశుగణనతో జిల్లాలో ఏఏ రకాల పశువులు ఉన్నాయనే విషయం తెలవడంతో పాటు వైద్య చికిత్స, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల సరఫరా సులభతరంగా ఉంటుందని అన్నారు. రైతులకు ఆర్థికపరమైన సబ్సిడీ రుణాల అందించడం కోసం, డెయిరీ ఫాం మంజూరు చేసేందుకు ఉపయోగపడుతాయని అన్నారు.తొలిసారి ఆన్లైన్.. పశుగణన గ్రామాలు, పట్టణాలు, డెయిరీ, కోళ్లు, గొర్రెల ఫాం, దేవాలయాలు, గోశాలలు, పశు వైద్యకళాశాలల్లో సర్వే నిర్వహిస్తారు. ఎన్యుమరేటర్లు జిల్లాలోని అన్ని ఇళ్లను సందర్శించి పూర్తి సమాచారాన్ని తీసుకుంటారు. సర్వే నిర్వహించిన ప్రతి ఇంటికీ స్టిక్కరింగ్ చేస్తారు. పశు పోషణలో ఉన్న రైతులు, కుటుంబాల వివరాలను సేకరించడంతోపాటు పశువుల వయసు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. మొదటిసారి ఆన్లైన్లో పశుగణన వివరాలను నమోదు చేపడుతున్నారు. సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నారా.. లేదా.. అంచనా మేరకు నమోదు చేస్తున్నారా.. అనే విషయంపై పశువైద్యాధికారులు, సూపర్వైజర్లు వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. సర్వే వివరాలను నోడల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. పశుగణనకు రైతులు సహకరించాలి పశుగణనకు రైతులు, ప్రజలు సహకరించాలి. రైతుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పశుగణనను చేపడుతోంది. పశుగణన ఆధారంగా జిల్లాలో ఉన్న పశువులకు టీకాలు, వ్యాధి నివారణ మందులు సరిపడా అందేలా చూస్తాం. – కొమురయ్య, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి●జిల్లాలో 99,459 ఇళ్ల సర్వే ఐదేళ్లకోసారి లెక్కింపు.. 16 రకాల పశుజాతుల నమోదు 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి -
ఐలాపురానికి తరలిన అధికారులు
శబరిమలకు స్పెషల్ రైళ్లు.. కాజీపేట జంక్షన్ మీదుగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారులు, భక్తులకు స్పెషల్ రైళ్ల సర్వీస్‌లు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.వాతావరణం ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుంది. సాయంత్రం నుంచి చల్లగాలులు, రాత్రి పొగమంచుతో చలి తీవ్రత ఉంటుంది.– 8లోuఏటూరునాగారం/కన్నాయిగూడెం : దట్టమైన అటవీ ప్రాంతం..ఐటీడీఏకు 37 కిలోమీటర్ల దూరంలోని గిరిజన పల్లెకు అధికార యంత్రాంగం తరలివెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేను జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఐలాపురంలోని 209 కుటుంబాలు బహిష్కరించాయి. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న ములుగు జిల్లాలో కేవలం ఒకే ఒక గ్రామస్తులు బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు బుధవారం గిరిజన పల్లెకు పరుగులు పెట్టారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో పాటు జిల్లా, మండల అధికారులు అడవిబాట పట్టారు. ఐలాపురంలోని 209 కుటుంబాలతో పీఓ సమావేశమయ్యారు. ఐలాపురం గ్రామంలో 1983లో దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశ్రమ పాఠశాలను మంజూరు చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు మార్గం లేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య పీఓకు వివరించారు. రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. సర్వే చేయాలి అంటే తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన పీఓ గ్రామంలో ఉన్న సమస్యలను, రోడ్డు మార్గం ఏర్పాటుకు మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు సర్వే చేసేందుకు అంగీకరించారు. దీంతో 20 ఎన్యుమేటర్లతో ఒకే రోజు సర్వే చేసి ముగించారు. జాతర ఏర్పాట్ల పరిశీలన ఐలాపురంలో సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని, జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. జాతరకు సిరివంచ నుంచి వచ్చే భక్తులకు అడవిమార్గంలో దారిని చదును చేయించాలని, గద్దెల వద్ద విద్యుత్ దీపాలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ఆర్చీ నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించాలని పూజారులు, గ్రామస్తులు కోరారు. ఈమేరకు పీఓ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను ముందుగా గుర్తించి నివేదిక ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రంను ఆదేశించారు. అలాగే మినీ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అడవిమార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు, అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా పనిచేయాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యాలు, బోధన, భోజనాన్ని పీఓ పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వీరభద్రం, తహసీల్దార్ వేణు, ఎంపీడీఓ అనిత, స్పెషల్ ఆఫీసర్ ఏపీడీ వెంకటనారాయణ, ఎంపీఓ సాజీదాబేగం, ఆర్అండ్బీ డీఈఈ కుమారస్వామి, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, అటవీశాఖ అధికారులు, ఎస్డీసీ డీటీ అనిల్, జీసీడీఓ సుగుణ, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒకే రోజు 20 మందితో 209 కుటుంబాల సర్వే మినీ మేడారం, ఐలాపురం జాతరపై దృష్టి -
బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
ములుగు : జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ బాలల దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో నిలిచిన చిన్నారులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా పురస్కారాలు అందుకోవడం జరుగుతుందన్నారు. బాలలు సమాజానికి అమూల్యమైన సంపద అని వారందరు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల బాలికలు ఎలాంటి వివక్షకు గురికా కుండా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వద్వర్యంలో రూపొందించిన బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీయు సోషల్ వర్కర్ జ్యోతి, ఓఆర్డబ్ల్యూ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమ అధికారి శిరీష -
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనతో భరోసా
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన జ్యోతి (పీఎంజేజే) బీమా యోజనను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ పథకం పేదలకు భరోసా ఇస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లనుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్‌తో అనుసంధానమైన సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఏడాదికి రూ.436లు ప్రీమియం చెల్లించాలని, ఆటోమెటిక్ డెబిట్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. మరణం సంభవిస్తే రూ.2 లక్షలు సాయం వర్తిస్తుంది. అలాగే 18 ఏళ్లనుంచి 70 ఏళ్లలోపు వారు సంవత్సరానికి రూ.20లు ప్రీమియం చెల్లిస్తే మరణం సంభవిస్తే రూ. 2లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.లక్ష బీమా వర్తిస్తుంది. ఈనెల 22వ తేదీన ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు పీఓ పేర్కొన్నారు. బీమా కావాల్సిన వారు వారి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం, నామిని వివరాలు, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న మొబైల్‌ను వెంట తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి ములుగు : జిల్లాలోని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గిరిజన జర్నలిస్టులు తెలిపారు.ఈ మేరకు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో ప్రాధాన్యం కల్పించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఐటీడీఏ ద్వారా సంక్షేమ పథకాలలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్య సునీల్, పోరిక శరత్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వైద్యశిబిరం ములుగు రూరల్ : మండలంలోని జంగాలపల్లి గ్రామంలో మూడో రోజు ఉచిత వైద్యశిబిరం కొనసాగింది. ఈ శిబిరంలో పలు వ్యాధులపై జిల్లా వైద్యాధికారి గోపాలరావు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ ప్రజలు వైద్యశిబిరాలను వినియోగించుకోవాలన్నారు. బీపీ, షుగర్, మలేరియా, డెంగీ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మూడో రోజు వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి, వ్యాధులపై అవగాహన కల్పించారు. బుధవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో 145 మందికి వైద్యసేవలు, 32 మంది రక్త నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ రణధీర్, సైక్రియాటిస్ట్ డాక్టర్ నమ్రత, వైశాలి, నవ్య రాణి, ఇన్చార్జ్ మాస్ మీడియా అధికారి సంపత్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు, ఎంఎల్‌హెచ్‌పీఎస్ నవ్య, దీపిక, ఆరోగ్య విస్తరణ అధి కారి సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. పగిలిన పైపులైన్.. ఎగిసిన నీరు కాటారం: కాటారం మండల కేంద్రానికి సమీపంలో భూపాలపల్లి వైపుగా జాతీయ రహదారిని ఆనుకొని కేటీపీపీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్ గేట్ వాల్వ్ బుధవారం పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నుంచి చెల్పూర్ సమీపంలోని కేటీపీపీకి నీటి సరఫరా కోసం గతంలో భారీ పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పెద్ద గేట్వాల్స్ అమర్చారు. నీటి పీడనం కారణంగా మండల కేంద్రానికి సమీపంలో గేట్‌వాల్వ్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సుమారు గంట పాటు నీరు వృథాగా పారింది. సమాచారం అందుకున్న సిబ్బంది నీటి సరఫరాను నిలిపివేశారు. -
బదిలీలకు సబ్ రిజిస్ట్రార్ల ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖలో బదిలీలు ఎప్పుడంటూ సబ్ రిజిస్ట్రార్లు ఎదురుచూస్తున్నారు. జూలై 31వ తేదీన జీరో ట్రాన్స్ఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ ఐజీ, ప్రభుత్వం ప్రకటించిన బదిలీల ఉత్తర్వులతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అటెండర్‌స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జోన్లో భాగంగా జోన్–1 బదిలీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లానుంచి ఉమ్మడి వరంగల్‌కు గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లతోపాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏకకాలంలో జూలై 31వ తేదీన బదిలీల ప్రకటన, ఆగస్టు 1న జాయినింగ్లతో పూర్తిగా నూతన అధికారులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారిపోయాయి. ఓడీ పేరిట అక్టోబర్‌లో మరో జాబితా సాధారణ, లాంగ్ స్టాండింగ్ బదిలీలకు బదులుగా కొత్తగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో అక్టోబర్ 15న ఓడీ (ఆన్ డ్యూటీ) పేరిట బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో జోన్లను దాటి హైదరాబాద్ వరకు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు 19 మందికి స్ధాన చలనం కలిగింది. రెండు నెలల గడువులోనే మరో కార్యాలయానికి బదిలీకావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 20 మందితో మరో జాబితా.. ‘మా జిల్లాకు మేము పోతాం. మాకు చాలా దూరమవుతుంది’ అంటూ సబ్ రిజిస్ట్రార్లు ఇటీవల రెవెన్యూశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. ఇప్పటికే ఓడీ పేరిట 19 మంది గ్రేడ్–1, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, ఇదే కోవలో మరో 20 మందితో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బదిలీ జాబితా వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్లు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. లాంగ్ లీవ్‌లో పలువురు.. ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి వరంగల్‌కు బదిలీపై వచ్చిన గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు తాము ఇంత దూరం ప్రయాణం చేయలేమని, ఈ కార్యాలయాల్లో పని చేయలేమంటూ కొందరు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నామని మరికొందరు లాంగ్ లీవ్ పెట్టారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చిట్స్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌లో ఓడీ పేరిట 19 మంది ట్రాన్స్ఫర్ 20 మందితో మరో జాబితా రెడీ సొంత జిల్లాకు పోతామంటూ అభ్యర్థనలు -
పులి ఉన్నట్టా.. లేనట్టా?
పలిమెల : మండలంలోని కామన్పల్లి –ముకునూరు రహదారిలోని కిష్టాపురం పహాడ్ వద్ద పెద్ద పులి సంచరిస్తుందని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం తిరిగి గాలింపు చేపట్టినట్లు ఎఫ్ఆర్ఓ నాగరాజు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద పులి అనవాళ్లు, పాదముద్రలు గుర్తించలేదని తెలిపారు. నేడు (గురువారం) కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే అధికారులు ఎలాంటి నిర్ధారణ చేయకపోవడంతో పులి ఉందా.. లేదా అని స్థానికుల్లో సందిగ్ధం నెలకొంది. నియామకం కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కొరిపల్లి ప్రశాంత్ జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ తెలంగాణ నార్త్‌జోన్ అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానవహక్కుల మండలి ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు అయిలినేని శ్రీనివాస్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
కాళోజీ కళాక్షేత్రం ఆవిష్కృతం
హన్మకొండ అర్బన్: జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ.4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేశారు. గ్రేటర్ మాస్టర్ ప్లాన్–2041 మ్యాపును విడుదల చేశారు. అనంతరం కళాక్షేత్రం భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కాళోజీ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈసందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యమంత్రికి కాళోజీ జీవితం, అక్కడి వస్తువుల గురించి వివరించారు. అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైనీ నిర్మించిన బయోపిక్‌ను వీక్షించారు. ఈసందర్భంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహం ఆవిష్కరణ -
సర్వేలో ములుగు టాప్
ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నాటికి జిల్లాలోని తొమ్మిది మండలాల వ్యాప్తంగా 99.38 శాతం సర్వే పూర్తయ్యింది. ఈవిషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు ఎన్యురేటర్లు, సూపర్వైజర్లను, యంత్రాంగాన్ని అభినందించారు. చిన్న జిల్లాను ఆదర్శంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1,005 ఎన్యుమరేషన్ బ్లాకులు ఉండగా.. 97,552 ఇళ్లకు గానూ 96,945 ఇళ్లలో ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేశారు. మిగతా ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, వలసవెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయని వారు ఉన్నట్లు అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు తెలిపారు. రేపటి నుంచి సేకరించిన వివరాలను ఆన్లైన్ చేయనున్నారు. సర్వే వివరాలు.. మంగళవారం నాటికి 99.38 శాతం పూర్తి అభినందించిన మంత్రి సీతక్క -
ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న సీఎం రేవంత్రెడ్డిరేపు డెడికేటెడ్ బీసీ కమిషన్ రాకవరంగల్: హనుమకొండ కలెక్టరేట్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దామాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు, సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్‌కు సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలతో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి ములుగు రూరల్: రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఐ కరాటే క్రీడల్లో జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈమేరకు మంగళవారం మండలంలోని బండారుపల్లి శివారులోని గిరిజన భవన్లో జిరిగిన కరాటే జిల్లా స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. అండర్–17 విభాగంలో బాలబాలికలు క్రీడల్లో పాల్గొన్నారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, పీడీలు రాజు, నాగేందర్, మల్లయ్య, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి.. వెంకటాపురం(కె): ఏజెన్సీలో చట్టాలు, హక్కుల రక్షణ కోసం ఆదివాసీ యువత ఉద్యమించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మంగళవారం మండల పరిధి రాచపల్లిలో ఆదివాసీ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతానికి వలస వస్తున్నారని అక్రమ వలసలను అరికట్టాలన్నారు. ఆదివాసీ చట్టాలను అధికారులు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ యువత జాతి మనుగడ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆది నారాయణ, చంటి, లక్ష్మయ్య, సాయిబాబు తదితరులు ఉన్నారు. జంగాలపల్లిలో కొనసాగిన మెగా వైద్య శిబిరంములుగు రూరల్: మండలంలోని జంగాలపల్లిలో రెండో రోజు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొత్తం 10 బృందాలు గ్రామంలోని 540 ఇళ్లను సందర్శించాయి. బృంద సభ్యులు ప్రతీ కాలనీలో సర్వే నిర్వహించి నిల్వ ఉన్న నీటిని తొలగించారు. దోమలు వృద్ధి చెందకుండా క్లోరినేషన్ చేపట్టారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రెండో రోజు వైద్య శిబిరంలో 212 మందికి ఓపీ సేవలు అందించి 45 మంది నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్ తెలిపారు. 145 మందికి బీపీ, 50 మందికి మధుమేహం పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాతా సంరక్షణ ఆరోగ్యం, పోషణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ దుర్గారావు, వైద్యులు వైశాలి, నవ్యరాణి, నందకిషోర్, రవళి, నవ్య, తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ డీఆర్లు విడుదల చేయాలని నిరసనములుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలని రిటైర్మెంట్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం డిమాండ్ చేశారు. ఈమేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం సంఘ సభ్యులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బానోత్ దేవ్‌సింగ్, రాష్ట్ర బాధ్యులు దుర్గం సూరయ్య, సలహాదారులు బాలునాయక్, సదానందం, జగ్గునాయక్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. సాక్షి, వరంగల్: ఓరుగల్లు వేదికగా మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మహిళాలోకం కదిలి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి మహిళలు నగరానికి తరలివచ్చారు. ఎక్కడ చూసినా వారే కనిపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ‘రానున్న పదేళ్లలో మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాం. ఒకప్పుడు టాటా, బిర్లాలుంటే.. ఇప్పుడు అంబానీ, అదానీలను మించిన పారిశ్రామికవేత్తలుగా మహిళలను మారుస్తాం’ అని స్పష్టం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా.. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం) లో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే చారిత్రక వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అభివృద్ధికి సుమారు రూ.ఆరువేల కోట్లు కేటాయించాం. వరంగల్ అభివృద్ధి చెందితే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే. నగరాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు’ అని సీఎం చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ‘ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది మన ఆడబిడ్డనే. ఆనాడు భద్రకాళి అమ్మవారు, సమ్మక్క–సారలమ్మ తల్లుల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని ‘మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదుగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది’ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, సారయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పాల్గొన్నారు. స్టెప్పులే స్టెప్పులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మహిళలు సభకు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి రాగానే.. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు మన రేవంతన్న’ అనే పాటకు మహిళలు స్టెప్పులు వేశారు. సభలో అర్జున అవార్డు గ్రహీతలు ఇషాసింగ్, నిఖత్ జరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండలం ఎన్యుమరేషన్ ఎన్యుమరేటర్లు మొత్తం ఇళ్లు పూర్తయినవి శాతం బ్లాకులు ములుగు 179 148 20,930 20,427 97.60 వెంకటాపురం(ఎం) 95 81 11,077 11,077 100 గోవిందరావుపేట 101 77 10,114 10,007 98.94 ఎస్ఎస్ తాడ్వాయి 110 67 7,525 7,604 101.05 ఏటూరునాగారం 104 64 9,379 9,274 98.88 కన్నాయిగూడెం 41 32 4173 4127 98.90 మంగపేట 124 104 14,979 14,979 100 వెంకటాపురం(కె) 146 75 10,772 10,800 100.26 వాజేడు 105 65 8,603 8,650 100.56 మొత్తం 1,005 713 97,552 96,945 99.38సీఎం పర్యటన సాగిందిలా... మధ్యాహ్నం 2.39 గంటలకు: హైదరాబాద్ నుంచి హనుమకొండకు ప్రత్యేక హెలికాప్టర్లో రాక.. ముందుగా నగరం మొత్తం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 2.50 : కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజాకవి కాళోజీ కాంస్య విగ్రహావిష్కరణ 2.54: హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన రూ.4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన 2.57 : కాళోజీ కళాక్షేత్రం భవన ప్రారంభోత్సవం 2.59 : కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫొటో గ్యాలరీ సందర్శన 3.18 : ఆడిటోరియాన్ని సందర్శించి.. ప్రజాకవి కాళోజీపై రూపొందించిన బయోపిక్వీక్షణ 3.30 : కాళోజీ కళాక్షేత్రం నుంచి బస్సులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి పయనం 3.41 : ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణానికి రాక, ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ సందర్శన సాయంత్రం 4.16: మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికపైకి రాక, ఆ తర్వాత ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి 5.22: సీఎం ప్రసంగం మొదలు.. 34 నిమిషాలు కొనసాగిన స్పీచ్ 5.58 : 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన 6.00 : సభాస్థలి నుంచి సీఎం హైదరాబాద్‌కు పయనం న్యూస్రీల్సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి దూరంసభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం.. మరోసారి కాంగ్రెస్‌పార్టీలో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్ర సందర్భంగా మొదలైన వీరిమధ్య మనస్పర్థలు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంకా సద్దుమణగలేదన్న విషయం ఈ అతిపెద్ద సభతో మరోసారి బహిర్గతమైనట్లయ్యింది. దొంతి మాధవరెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా సీనియారిటీ పరంగా సముచిత స్థానమిచ్చి గౌరవించకపోవడం వల్లనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే దొంతి దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కుర్చీ దొరకక.. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణికి సీటు దొరక్కపోవడంతో ఇబ్బందిపడ్డారు. వేదికపైకి.. అక్కడున్న సిబ్బంది వెనకాల కుర్చీ తీసుకొచ్చి వేయడంతో ఆమె కూర్చున్నారు. ‘ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం’ నుంచి సీఎం వరాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి వరంగల్ అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృది్ధ చెందినట్లే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి సభికులనుంచి అనూహ్య స్పందన అంతకుముందు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన స్టాళ్ల పరిశీలన హన్మకొండ చౌరస్తా: ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని సభా ప్రాంగణం ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషీ, పెయింటింగ్స్, మాస్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులను వ్యాపారం ఎలా ఉంది.. ఏయే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు.. టర్నోవర్ ఎంత? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలన్నీ ఇలాగే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ దర్శనం.. గొప్ప అనుభూతి అని డైరీలో రాశారు. కాగా, పలు స్టాళ్ల నిర్వాహక మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. వరంగల్‌లో నార్కొటిక్ పీఎస్.. ప్రారంభించిన సీఎం – వివరాలు 8లోu -
మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతా
ములుగు/ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతానని మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాల్లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. లైబ్రరీ ఆవరణలో నూతన మరుగుదొడ్లకు శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంస్కార హీనుల్ని పెంచిపోషిస్తున్న బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తెల్లారినుంచి ఇష్టమొచ్చినట్లు యూట్యుబ్ చానళ్లు, దొంగమీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న సంస్కారహీనులను బీఆర్ఎస్ పెంచిపోషిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి డివైడర్లపై మంగళవారం మంత్రి మొక్కలు నాటారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖతో కలిసి తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ఇబ్బందులకు గురిచేశారని, మహిళలపై దుష్ప్రచారం చేస్తే పురుగులు పట్టిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట కలెక్టర్ దివాకర టీఎస్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ ఎస్ఈ అజయ్‌కుమార్, డీపీఓ దేవరాజ్, డీడబ్ల్యూఓ శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ, ఈఓ పెంట రఘు తదితరులున్నారు. తండాల అనుసంధానానికి ప్రాధాన్యం.. తండాల అనుసంధానం, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తూ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశారు. సీతక్క మాట్లాడుతూ.. జాకారం నుంచి ఇంచెన్చెరువుపల్లి గ్రామానికి రూ.2.20 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, వెంకటేశ్వర్లపల్లి నుంచి మాడలక్ష్మారెడ్డిపల్లి వరకు రూ.80 లక్షలతో బీటీ రో డ్డు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి యేసు నగర్ వరకు రూ.80 లక్షలతో, ఆర్అండ్బీ రోడ్డు నుంచి దేవనగర్ వయా యాపలగడ్డ వరకు రూ.1.20 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క -
బుగులోనికి భారీగా భక్తజనం
రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులో జరుగుతున్న శ్రీ బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు నాలుగో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం వేలాదిమంది వచ్చి మొక్కులు సమర్పించారు. భక్తులు భారీగా తరలిరావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. భక్తుల గోవింద నామస్మరణతో గుట్ట మార్మోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి జాతరకు హాజరై మొక్కులు చెల్లించారు. పోలీసుల సేవలు.. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ సందీప్‌కుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో అడుగడుగునా పోలీసుల సేవలు కనిపించాయి. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. జాతర కమిటీ ఏర్పాట్లలో నిమగ్నం జాతరలో మెదటి రోజు భక్తులు ఇబ్బందిపడడంతో జాతర కమిటీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. జాతర ఈఓ బిల్లా శ్రీనివాస్, చైర్మన్ రొంటాల వెంకటస్వామి, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలించారు. కిటకిటలాడిన స్వామి సన్నిధి జాతర ప్రాంగణంలో విడిది -
తొలి రోజు ప్రశాంతం
నిమిషం ఆలస్యం నిబంధనతో గేటుబయట నిలిచిపోయిన అభ్యర్థి లలితఅభ్యర్థిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న కానిస్టేబుల్ యాకూబ్ ములుగు: జిల్లాలో ఆదివారం తొలిరోజు గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 2,173మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,182 మంది మాత్రమే హాజరయ్యారు. 991మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యం నిబంధనతో 9 సెంటర్లలో 10 మంది వరకు పరీక్ష కేంద్రాలకు వచ్చి వెనుదిరిగారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల సెంటర్‌కు వెళ్లాల్సిన అభ్యర్థి భవాని జూనియర్ కళాశాలకు వెళ్లింది. హాల్‌టికెట్ తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడి సిబ్బంది పక్కనే ఉన్న సెంటర్‌కి వెళ్లాలని సూచించారు. అప్పటికే కేవలం రెండు నిమిషాల సమయం ఉండడంతో స్పందించిన కానిస్టేబుల్ యాకూబ్ తన ద్విచక్రం వాహనంపై సెంటర్‌కు సకాలంలో గేట్ లోపలికి పంపించారు. వెంకటాపురం(ఎం) మండలానికి చెందిన లలిత జాతీయ రహదారి పై బస్సు దిగి ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు చేరుకునే లోపే గేటు మూసివేయడంతో వెనుదిరిగారు. నేడు (సోమవారం) గ్రూప్–3 మూడో పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరుగనుంది. అదనపు కలెక్టర్ పరిశీలన ములుగు రూరల్: జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) సంపత్‌రావు అభ్యర్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు.గ్రూప్–3 పరీక్షకు 1,182మంది హజరు -
విజయోత్సవ సభకు తరలిరావాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఈనెల 19న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ప్రజా పాలన విజయోత్సవ సభకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలను భారీగా తరలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు, సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం మేడారంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. సభకు ప్రజలు, మహిళలను తరలించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జిల్లా నుంచి వేలాదిమంది ప్రజలను తరలించి ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ సమావేశానికి ముందుగా మంత్రి సీతక్క సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అఽధ్యక్షురాలు రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మండల గౌరవ అధ్యక్షుడు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి పరామర్శ ములుగు రూరల్: మండలంలోని బంజరుపల్లి గ్రామానికి చెందిన కంచె రాధిక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. రాధిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.మంత్రి సీతక్క -
ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండలపరిధిలోని దానవాయి పేట గ్రామంలో ఆదివారం గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ఊరు మా రాజ్యం’ అనే నినాదంలో ఆదివాసీలకు ప్రత్యేక స్వయం పాలన ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీసా చట్టాన్ని అమలు చేయకుండా రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న భూబాగాన్ని అంతా కలిపి ఆదివాసీలకు ప్రత్యేక స్వయం పాలన ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో చేలే పవన్, రాజు, అట్టం లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పసునూటి రాజేందర్‌ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రకటించారు. ఏరియాకు చెందిన పసునూటి రాజేందర్ 32సంవత్సరాలుగా యూనియన్‌లో పని చేస్తున్నారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నందున యూనియన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని యూనియన్‌లో కల్పించినందుకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, జనక్ప్రసాద్లకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలంభూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగానికి ఏడు శాత మే బడ్జెట్ కేటాయించి ఎన్నికల హమీని విస్మరించారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల విద్యాసంస్థలను నెలకోల్పాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోసెఫ్, పవన్, లక్ష్మణ్, రక్షిత, శివ, రాజు, నవీన్ పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠరేగొండ: మండలంలోని భాగిర్థిపేట గ్రామంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాషీర్, తిరుపతి, భిక్షపతి, శ్రీనివాస్, సంతోష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సభకు తరలిరావాలి.. ఈ నెల 19న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సభకు ముఖ్య మంత్రి రానున్నారని, ఈ సభను ఉమ్మడి రేగొండ మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. -
కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ
కాళేశ్వరం: కార్తీకమాసం ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. లక్షముగ్గులు వేసి లక్షవత్తులు వెలిగించి దీపారాదన చేశారు. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. సామూహిక దీపాలంకరణ నిర్వహించారు. దీపాలంకరణలో పాల్గొన్న భక్తులకు పసుపు, కుంకుమ, అక్షింతలు అందజేశారు. దీంతో ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ పూజలు, లడ్డూప్రసాదాల ద్వారా రూ.4.25లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
ఏటూరునాగారం: జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లానుంచి రామన్నగూడెం విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు జెడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు రక్షిత, మైథిలి తయారుచేసిన ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికై ందని చెప్పారు. విద్యార్థుల గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యను డీఈఓ అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ జాతీయస్థాయికి ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రతిభకు గుర్తింపు లభించిందని గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సభను విజయవంతం చేయాలి గోవిందరావుపేట: ఈ నెల 19న హనుమకొండలో నిర్వహించే విజయోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాల నాగమణి ఆధ్వర్యంలో మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి కల్యాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారీ బహిరంగ సభకు మండలం నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు. -
పరిపాలనా సౌలభ్యమేది?
పేరుకే కొత్త మండలాలు ● పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని ప్రభుత్వ కార్యాలయాలు ● ఉమ్మడి మండలాల నుంచే కార్యకలాపాలు ● ఇబ్బంది పడుతున్న ప్రజలుసేవలు అందడం లేదు పలిమెల మండలం ఏర్పాటు జరిగి ఎనిమిదేళ్లు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖల సేవలు అందడం లేదు. కేవలం పోలీస్‌స్టేషన్ మినహా ఏ కార్యాలయం స్థానికంగా లేదు. ఏదైనా అవసరం పడితే పాత మండలమైన మహదేవపూర్‌లోని కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతుంది. మండల కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. – జనగామ శ్రీనివాస్, పలిమెల పాత మండలానికే వెళ్లాల్సి వస్తోంది.. రెండేళ్ల క్రితం కొత్తపల్లిగోరి మండలంగా ఏర్పాటైనందుకు చాలా సంతోష పడ్డాం. రేగొండ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ తప్పుతుందని అనుకున్నాం. కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఏదైనా పని కోసం రేగొండకు వెళ్లాల్సి వస్తోంది. – దండెబోయిన సంతోష్, గాంధీనగర్కాటారం: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి కొత్త మండలాలు పేరుకే పరిమితమయ్యాయి. మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రాలేదు. ఒకటి, రెండు కార్యాలయాలు మినహా మిగితా ఏ కార్యాలయాల ఏర్పాటు నూతన మండలాల్లో జరగకపోవడంతో ప్రజలకు పరిపాలనా సౌలభ్యం జరగడం లేదు. అంతకుముందు ఉన్న మండలాల నుంచే పాలన సాగుతోంది. పలిమెల మండల పరిస్థితి.. ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన పలిమెల మండలంలో రెండేళ్ల కిందట పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. మండలం ఏర్పాటు జరిగిన వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి హుటాహుటిన అధికారులను కేటాయించారు. కొంత కాలానికి పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెవెన్యూ, పంచాయితీరాజ్, వ్యవసాయశాఖలను కలుపుకొని మండల సమీకృత భవనం ఏర్పాటు చేశారు. భవనం ప్రారంభించినప్పటికీ ఏ ఒక్క రోజు ఆ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగలేదు. కొత్తపల్లిగోరి మండల పరిస్థితి.. కొత్తపల్లిగోరి రెవెన్యూ కార్యాలయాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రా రంభించారు. ఆ తర్వాత పాఠశాల భవనంలో తా త్కాలిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇటీవల మండలానికి వ్యవసాయశాఖ అధికారిని కేటాయించారు. మండలం ఏర్పా టు జరిగిన రెండేళ్లు గడుస్తున్పప్పటికీ పలు ప్రభు త్వ శాఖల మండల స్థాయి అధికారుల కేటాయింపు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు గానీ ఏర్పాటు కాలేదు. సమీకృత భవనానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మండలాల నుంచే పరిపాలన.. 2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. మహదేవపూర్ మండలంలో భాగమైన పలిమెలను, చిట్యాల మండలంలో భాగమైన టేకుమట్లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో 2022లో రేగొండ మండలం నుంచి కొత్తపల్లిగోరిని మండలంగా ఏర్పాటు చేశారు. నూతన మండలాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిపాలన మొత్తం ఉమ్మడి మండలాల నుంచే కొనసాగుతుంది. పలిమెల మండలానికి మహదేవపూర్‌లో, కొత్తపల్లిగోరి మండలానికి రేగొండలో, టేకుమట్లకు చిట్యాలలో నుంచి పాలన సాగుతోంది.జిల్లా వివరాలు..రెవెన్యూ డివిజన్లు 2(భూపాలపల్లి, కాటారం) మండలాలు 12 నూతన మండలాలు 3 (పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి) పలిమెల మండలం వివరాలు గ్రామపంచాయతీలు 08 రెవెన్యూ గ్రామాలు 17టేకుమట్ల మండలం వివరాలుగ్రామపంచాయతీలు 24 రెవెన్యూ గ్రామాలు 18కొత్తపల్లిగోరి మండలం వివరాలుగ్రామపంచాయతీలు 14 రెవెన్యూ గ్రామాలు 7టేకుమట్ల మండల పరిస్థితి.. 2016న టేకుమట్ల మండలం ఏర్పాటు జరిగింది. చిట్యాల మండలం నుంచి విడిపోయి టేకుమట్లగా ఏర్పాటు జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మండల తహసీల్దార్ కార్యాలయం, గ్రామపంచాయతీలో ఎంపీడీఓ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఓ కార్యాలయం రైతువేదికలో ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు మినహా ఏ ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేదు. మండల కేంద్రంలో ఏడాది క్రితం ప్రారంభించిన తహసీల్దార్ కార్యాయం, ఎంపీడీఓ కార్యాలయం పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. -
ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం
సాక్షి ప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వేడుకలకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల కోసం శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరగగా.. శనివారం మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ హనుమకొండలో ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హనుమకొండకు చేరుకున్న టీపీసీసీ చీఫ్, మంత్రుల బృందానికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ.. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 19న హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సక్సెస్‌పై గంటన్నరకు పైగా ఆయన ఈ కీలక భేటీ నిర్వహించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున నిర్వహించే ఈ విజయోత్సవ సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ప్రజలను తరలించే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా సీఎం కాన్వాయ్ ఇందిరా మహిళా శక్తి ప్రాంగణానికి చేరేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి హెలిపాడ్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో లక్ష మంది మహిళలు ఉండేలా చూడాలని టీపీసీసీ చీఫ్ ప్రజాప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. జన సమీకరణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభం, ఏర్పాట్లపై నేడు, రేపు అధికారులతో మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి:టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. హనుమకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని.. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు ఆయా రంగాలను అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తోందని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో రైతులకు రుణమాీఫీ చేశామని, 40 శాతం కాస్మోటిక్స్ చార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు. కేసీఆర్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. పదేళ్లలో నిరుద్యోగులను విస్మరించి తన కుటుంబ సభ్యులకు మాత్రం రాజకీయ ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంటుందని, అందరం కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్ట్స్ కళాశాలలోని ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’లో సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, వాహనాల పార్కింగ్ ఇతర అంశాలను కలెక్టర్ ప్రావీణ్య.. వారికి వివరించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మహ్మద్ రియాజ్, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రజా పాలన విజయోత్సవ సభా వేదికకు నామకరణం.. ఓరుగల్లులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిర జయంతి రోజునే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీ.. దిశానిర్దేశం -
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
వాజేడు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై 14వ విడత సామాజిక తనిఖీలో భాగంగా శనివారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జరిగిన పనులపై ప్రిసైడింగ్ అధికారి మెరుగు వెంకట నారాయణ, జిల్లా విజిలెన్స్ అధికారి సాంబయ్య, ఎంపీడీఓ విజయ, ఏపీఓ సత్యేందర్, ఎస్ఆర్పీ నాగరాజుల సమక్షంలో చేపట్టిన పనులను వివరించారు. అంతకు ముందు చేపట్టిన సామాజిక తనిఖీల్లో ఏ ఏ గ్రామాల్లో ఎంత మేరకు తప్పిదాలు చోటు చేసుకున్నది సామాజిక తనిఖీ బృందాలు అధికారులకు వివరించారు. రూ.55,083 మేర తప్పిదాలు చోటు చేసుకోగా వెంటనే వాటిని చెల్లించాలని ఉపాధి సిబ్బందిని, రికవరీ చేసుకోవాలని ఏపీఓను అధికారులు ఆదేశించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వెంకటాపురం(ఎం) : మేలు జాతి పశువుల పెంపకం ద్వారా రైతులు పాల దిగుబడి పెంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా పశు వైద్యాధికారి కొమురయ్య పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఇంచెంచెరువుపల్లిలో గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 124 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ మందులను పంపిణీ చేశారు. 75 దూడలకు నట్టల నివారణ మందును వేశారు. సూపర్వైజర్ ఐలుమల్లు, గోపాల మిత్రలు పాల్గొన్నారు. ‘వెసులుబాటు కల్పించండి’ వాజేడు : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొలతల్లో కోల్పోతున్న గృహాలకు వెసులుబాటు కల్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. మండలంలో జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో కొలతలు వేస్తున్నారు. ఈ కొలతల్లో రహదారి వెంట ఉన్న గ్రా మాల్లోని ఇళ్లు కోల్పోయే అవకాశాలు ఉ న్నా యి. నానాకష్టాలు అనుభవించి నిర్మించుకున్న ఇళ్లు ఇప్పుడు విస్తరణ పనుల్లో కోల్పోతే తాము ఇబ్బందులు పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ర హదారి విస్తరణ పనుల్లో కొంత వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం) : మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామి కి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించగా, టూరిజం గైడ్లు ఆలయ విశిష్టతను పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని ప్రకృతి అందాలను తిలకించారు. గ్రంథాలయ వారోత్సవాలు ములుగు : విద్యాసముపార్జనకు గ్రంథాలయాలు నెలవని పలువురు కవులు, రచయితలు అన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లాకేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలో కవులు, రచయితలు గ్రంథాలయ పితామహుడు ఎస్వీ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించారు. దుర్గం మల్లయ్య, వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు దుర్గం సూరయ్య, సాదయ్య, శ్రీనివాస్,రాజు, లెనిన్, హమీద్, నాగేందర్, రాజమౌళి, కుమారస్వామి, సమ్మక్క, నిఖిల్, రాకేష్ పాల్గొన్నారు. ఫిక్స్డ్ వేతనం చెల్లించాలి ● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ ములుగు రూరల్ : గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందజేస్తున్న ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఆశ కార్యకర్తలతో కలిసి శనివారం జిల్లా వైద్యాధికారి గోపాల్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశలకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో వారు శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన గోపాల్‌రావును ఆశ కార్యకర్తల యూనియన్ నాయకులు శాలువాలతో సన్మానించా రు. గుండెబోయిన రవిగౌడ్, సత్యవతి, సరిత, శివ కుమారి, రమాదేవి, ప్రసన్నకుమారి పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
టోల్ ఫ్రీ నంబర్.. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై వారి ఫొటో సరిగా కనబడనిచో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో పాటు డిక్లరేషన్ పత్రంపై గెజిటెడ్ అధికారులు సంతకం, ముద్ర తప్పనిసరి. సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 18004257109 ఏర్పాటు చేశారు.ములుగు : గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు అధికారులు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లాకేంద్రంతో పాటు చుట్టు పక్కల తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆది, సోమవారాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. 17వ (నేడు) తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం 12:30 నిమిషాల వరకు (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ), మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు(పొలిటికల్ అండ్ సొసైటీ), 18వ (సోమవారం) ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్ష రెండున్నర గంటల పాటు ఉండనుంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్.. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100మీటర్ల వరకు పోలీసులు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో పరీక్షలు పూర్తయ్యేంత వరకు జిరాక్స్ సెంటర్లు, ఇతర బుక్‌స్టాల్స్‌ను మూసి ఉంచనున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌తో పాటు ఏఎన్ఎం/హెల్త్ అసిస్టెంట్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. అభ్యర్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజనల్ ఫొటో ఐడీని తమ వెంట తీసుకురావాలి. సమాధానాలు నీలం/నలుపు బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే రాయాలి. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అభ్యర్థులను బయటికి పంపరు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడనున్నారు. సురక్షిత తాగునీటిని అందించనున్నారు. అభ్యర్థులకు అనుగుణంగా ఏటూరునాగారం నుంచి నాలుగు, హనుమకొండ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 2,173మంది గ్రూప్–3 అభ్యర్థులు జిల్లాలో తొమ్మిది సెంటర్ల ఏర్పాట్లు నేడు రెండు పేపర్లు, రేపు ఒకటిపరీక్ష కేంద్రాలు ఇవే.. జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల సాధన హైస్కూల్, ములుగు బాలుర ఉన్నత పాఠశాల, ములుగు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, ములుగు బాలాజీ ఇంటిగ్రేటెడ్ హైస్కూల్, ములుగు ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్, ములుగు తెలంగాణ మోడల్ స్కూల్, బండారుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రేమ్‌నగర్ అన్ని ఏర్పాట్లు చేశాం.. గ్రూప్–3 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇన్విజిలేటర్లు, ఫ్లోర్ ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్, ఫ్లైయింగ్స్వ్కాడ్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. తొమ్మిది సెంటర్లలో 2,173మంది అభ్యర్థులు రెండు రోజుల పాటు పరీక్షలు రాయనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం పరీక్ష రాసేవారు 8గంటల నుంచి 9:30 నిమిషాల మధ్య, సాయంత్రం పరీక్ష రాసేవారు మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి 2:30 నిమిషాల మధ్యలో వస్తేనే అనుమతి ఇస్తారు. – టీఎస్ దివాకర, కలెక్టర్2,173మంది అభ్యర్థులు నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన కేంద్రాల్లో 2,173మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 8మంది దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గదితో పాటు అదనంగా 50నిమిషాల సమయం కేటాయించనున్నారు. పరీక్షల నిర్వహణకు 9మంది పరిశీలకులు, 9మంది సూపరింటెండెంట్స్, ముగ్గురు ఫ్లైయింగ్సా్వ్క్డ్, 10మంది ఇన్విజిలేటర్లు, 120 ఫ్లోర్ ఇన్విజిలేటర్లను నియమించారు. వీరికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. -
● దాసా అడ్మిషన్లతో ప్రతి ఏటా 90మందికి చోటు ● స్థానిక విద్యార్థులతో కలిసిపోతున్న ఫారినర్స్ ● ఇక్కడి చారిత్రక ప్రదేశాలకు ఫిదా ● బతుకమ్మ పండుగ, సర్వపిండి ఎంతో ఇష్టమని వెల్లడి ● స్వదేశానికి వెళ్లినా ఓరుగల్లు సంస్కృతీసంప్రదాయాలకు గౌరవం
విదేశీయులం కాదు మేం ఓరుగల్లు స్వదేశీయులం అంటున్నారు.. నిట్ వరంగల్ క్యాంపస్‌లో విద్యనభ్యసిస్తున్న ఫారినర్స్. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను అక్కున చేర్చుకుని నిట్ క్యాంపస్ అమ్మలా ఆదరిస్తోంది. వారి భద్రతకు పెద్దపీట వేస్తోంది. సొంతూరిలో ఉన్న అనుభూతిని కల్పిస్తోంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. – కాజీపేట అర్బన్సంతోషంగా బతుకమ్మ ఆడుతా మాది ఖతర్. నాకు నిట్ వరంగల్‌కు రావాలంటే మొదట భయం వేసింది. అడ్మిషన్ తీసుకున్నాక స్నేహితులు పెరిగారు. భయం పూర్తిగా తగ్గిపోయింది. మా దగ్గర లేని ఎన్నో పండుగలను నిట్ వరంగల్‌లో జరుపుకుంటాం. నాకు ప్రత్యేకంగా బతుకమ్మ ఆట అంటే చాలా ఇష్టం. ఎంతో ఉత్సాహంగా నేను మా స్నేహితులం బతుకమ్మ ఆడతాం. పండుగలు జరుపుకోవడం అంటే ఆనందం పంచుకోవడమే కాకుండా పరస్పరం ఒకరి గురించి మరొకరం తెలుసుకునే అవకాశం ఉంటుంది. – గాయత్రి, ఖతర్, మెకానికల్ సెకండియర్ ఇంటిని తలపించే వాతావరణం నిట్ వరంగల్ క్యాంపస్ సొంత ఇంటిని తలపించేలా ఉంది. నేను భూటాన్ నుంచి వచ్చినా కూడా.. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు అంటే చాలా ఇష్టమయ్యేలా నిట్ వరంగల్ నేర్పించింది. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు కై ట్స్ ఎగురవేస్తున్నాం. దసరా, దీపావళి, హోలీ పండుగలను కలర్ఫుల్గా జరుపుకుంటున్నాం. భూటాన్‌లోని మా సొంత ఊరికి వెళ్లినప్పుడు తెలంగాణ పండుగలను మా వారికి పరిచయం చేస్తున్నా. – సోనమ్ షెవాంగ్, భూటాన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెకండియర్నిట్ చాలా బాగుంది.. నిట్ వరంగల్ క్యాంపస్ చాలా బాగుంది. అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. రష్యా కంటే కూడా నిట్ వరంగల్ క్యాంపస్ ఎంతో సేఫ్ అనిపిస్తుంది. తరచూ నగరంలోని భద్రకాళి, వేయిస్తంభాల ఆలయం దర్శిస్తుంటా. నిట్ వరంగల్‌కు దగ్గరలో ఉన్న దాబాలో టేస్టీ ఫుడ్ తినడం చాలా ఇష్టం. ఎంటెక్ కూడా నిట్‌లో చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ ఏడాది నిట్‌లో నిర్వహించే టెక్నోజియాన్, స్ప్రింగ్‌స్ప్రీ ప్రోగ్రాంలో తెలుగు విద్యార్థులతో పోటీ పడి పాల్గొంటున్నా. – సామ్రాట్, రష్యా, సీఎస్ఈ ఫోర్త్ ఇయర్ తెలంగాణ ఫుడ్ చాలా ఇష్టం నేను ఇండోనేషియా నుంచి నిట్ వరంగల్‌లో దాసా ద్వారా అడ్మిషన్ పొందిన తర్వాత ఇక్కడి ఫుడ్‌ను టేస్ట్ చేయడం ప్రారంభించా. నిట్‌లోని హాస్టల్స్‌లో అందించే నార్త్ ఇండియన్తోపాటు తెలంగాణ ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకంగా తెలంగాణ చికెన్, సర్వ పిండి ఎంతో ఇష్టంగా తింటాను. ఇండోనేషియాకు వెళ్లడం కంటే ఇండియాలోనే ఉండిపోవాలని ఉంది. – ఫర్రాస్ చైదర్, ఇండోనేషియా, మెకానికల్ థర్డ్ ఇయర్ ●పరదేశీ విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్న వరంగల్ నిట్నిట్ వరంగల్‌లో విదేశీ విద్యార్థులు చేరేందుకు 2001లో అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా దాసా భవనం ఏర్పాటు చేశారు. కాగా.. ప్రతీ ఏడాది బీటెక్ ప్రథమ సంవత్సరంలోకి 1,300 మంది విద్యార్థులు జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా జోసా అడ్మిషన్స్‌తో ప్రవేశం పొందుతున్నారు. 1,300 సీట్లలో 90 సీట్లను డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్(దాసా) పేరిట విదేశీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తోంది. ఈ విద్యాసంస్థలో ఇండోనేషియా, రష్యా, ఖతర్, నేపాల్, నైజీరియా తదితర దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారు. అడ్మిషన్ ఫీజు తక్కువే.. విదేశాల్లో రూ.లక్షల్లో అడ్మిషన్ ఫీజులు ఉండగా.. నిట్ వరంగల్‌లో దాసా విద్యార్థులకు 42,500 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు దాసా ద్వారా నిట్ వరంగల్‌లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాబోధనతోపాటు క్యాంపస్ సెలక్షన్స్‌కు ప్రత్యేక వేదికగా నిలుస్తున్న నిట్ వరంగల్‌లో చేరేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. భద్రత, స్నేహభావానికి ప్రతీక ఓరుగల్లు విదేశీయులు తమ సొంత ఊరిలో ఎలా స్వేచ్ఛగా భద్రంగా జీవనం కొనసాగిస్తారో.. అంతకు మించి భద్రతను కల్పిస్తున్నది ఓరుగల్లు నగరం. ఇక్కడ విద్యనభ్యసించేందుకు తమ పిల్లలను పంపించేందుకు విదేశాల్లో ఉన్నవారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇక్కడి పండుగల్లో స్థానిక విద్యార్థులతో కలిసి విదేశీయులు పాల్గొంటున్నారు. -
కార్తీక శోభ
కార్తీక పౌర్ణమి నేపథ్యంలో శుక్రవారం ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.. మహిళలు భక్తితో దీపాలు వెలిగించారు. గోదావరి పరివాహక ప్రాంత భక్తులు నదీ స్నానం ఆచరించి నదిలో దీపాలను వదిలారు. ఉసిరి, తులసి చెట్టు వద్ద పూజలు చేసి కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. – సాక్షి నెట్వర్క్మహిళా ఓటర్లే అధికం.. సుమారు ఎనిమిదిన్నర నెలల వ్యవధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లతో పాటు చనిపోయిన, ఇతర ప్రాంతాలకు మారిన వారిని తొలగిస్తూ.. అక్టోబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించింది. ఈమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో 14,86,220 మంది పురుష ఓటర్లు, 15,46,039 మంది మహిళలు, 499 ఇతరులు కలిపి మొత్తం 30,32,758 మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఈజాబితాలోనూ పురుషలకంటే మహిళా ఓటర్లే 59,819 ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో చనిపోయిన, మరో ప్రాంతానికి మార్పిడి చేసుకున్న, రెండేసి ఓట్లు, ఇంకా ఇతర కారణాల తో 27,338 మంది పేర్లు తొలగించి, 55,21 9 మంది కొత్త ఓట ర్లను చేర్చినట్లు ఎన్ని కల సంఘం డ్రాఫ్ట్ జా బితాలో వెల్లడైంది. కాగా.. జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయొచ్చని ప్ర కటించిన ఎన్నికల సంఘం.. ఈనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించేలా ఉదయం నుంచి సాయంత్రం వర కు పోలింగ్స్టేషన్లలో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉండేలా ఆదేశించింది.