Nirmal District Latest News
-
నిర్మల్
విధులకు సమాయత్తం ఆదిలాబాద్ శిక్షణ కేంద్రంలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్‌పరేడ్ నిర్వహించనున్నారు. శిక్షణ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు.విద్యాశాఖ గాడినపడేనా..!?● బాధ్యతలు చేపట్టిన కొత్త డీఈవో ● రామారావు ఎదుట సవాళ్లు ఎన్నో.. ● లైవ్ లొకేషన్ అమలు చేస్తారా.. ● సార్లను బడిబాట పట్టిస్తారా.. ● సంఘాల నేతలకు కళ్లెం వేస్తారా.. గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 20248లోu నిర్మల్: కేవలం.. పదోతరగతి ఫలితాల్లో ఉత్తమం అనిపించుకున్న జిల్లా విద్యాశాఖ గత ఏడాదికాలంలో చాలా విషయాల్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక్క యూబిట్ వ్యవహారం చాలు.. జిల్లా విద్యాశాఖలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏస్థాయిలో పేరుకుపోయాయో చెప్పడానికి. పది ఇరవై మంది కాదు.. ఏకంగా వందల్లో ఉపాధ్యాయులు కాసుల కక్కుర్తిలో పడి బడిని, తరగతి గదిని, తమపైనే ఆశలు పెట్టకున్న విద్యార్థులనీ గాలికొదిలేశారు. పాఠాలు చెప్పాల్సిన చోట.. సెల్ఫోన్లో ‘కాయిన్’ల లెక్కలు వేసుకున్నారు. చివరకు కొందరు ఊచలను లెక్కపెట్టేదాకా వెళ్లారు. బడి ముఖం చూడకుండా రియల్ఎస్టేట్, ఫైనాన్స్ అంటూ తిరిగే సార్లూ చాలానే ఉన్నారు. ఇక కొంతమంది సంఘాల పేర్లు చెప్పుకునే ఉపాధ్యాయుల కథ వేరే ఉంది. ఏకంగా డీఈవోపైనే ఆజమాయిషీ చెలాయించే స్థాయికి వెళ్లిన సందర్భాలు విద్యాశాఖలో లెక్కలేనితనానికి తార్కాణంగా నిలిచాయి. ఇలా దారితప్పిన విద్యాశాఖను కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఈవో రామారావు గాడిన పెడతారా..!? సర్కారు బడిని నమ్ముకున్న విద్యార్థులకు అండగా నిలుస్తారా..!? అని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. కరువైన పర్యవేక్షణ.. ఒకప్పుడు డీఈవో తనిఖీకి వస్తున్నారని తెలియగానే స్కూళ్లన్నీ అలర్ట్ అయ్యేవి. సార్లందరూ విద్యార్థులను ముందుగానే ప్రిపేర్ చేసేవారు. డీఈవోలు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ బడుల్లో అవసరాలే కాదు.. విద్యార్థుల పఠన నైపుణ్యాలనూ పరీక్షించేవారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో చాలామంది ఉపాధ్యాయులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నా.. కనీసం తమ వృత్తికి న్యాయం చేయని ఉపాధ్యాయులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడైనా డీఈవోగా బాధ్యతలు చేపట్టిన రామారావు గాడిన పెడతారని జిల్లా ఆశిస్తోంది. ఇష్టారీతిన సంఘాల నేతలు.. పదేళ్లకాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా విద్యాశాఖలో పలు సంఘాల పేర్లు చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆరోపణలు ఉన్నాయి. తమకు, తమవాళ్లకు నచ్చినచోట పోస్టింగ్‌లు, డిప్యూటేషన్లను ఇప్పించుకోవడంపైనా ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వాటిపైనా కొత్త డీఈవో దృష్టిపెట్టాల్సిన అవసరమూ ఉంది. ‘ప్రథమం’ నిలుపాలి.. జిల్లా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలుస్తూ రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది కూడా అదేతీరులో ముందుకు సాగాల్సిన అవసరమూ ఉంది. వ్యవస్థలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో.. అంతకుమించి ఉత్తములైన ఉపాధ్యాయులూ ఉన్నారు. చాలామంది విద్యార్థుల కోసం పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. ప్రత్యేక తరగతులు, పర్యవేక్షణలతో జిల్లా పేరును నిలుపాల్సిన బాధ్యత కూడా కొత్త డీఈఓపైనే ఉంది. బడిపిల్లలకు న్యాయం చేద్దాం.. జిల్లాలో చదువుకుంటున్న బడిపిల్లలందరి భవిష్యత్తు బాగుండేలా అందరం సమష్టి బాధ్యతతో పనిచేద్దాం. కొత్తగా బాధ్యతలు చేపట్టా. ముందు జిల్లాపై అవగాహన పెంచుకుని, విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తా. – పి.రామారావు, డీఈవో ‘లైవ్ లొకేషన్’ ఎక్కడా..!? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయుల హాజరుపై దృష్టి పెడుతోంది. తాజాగా మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బయోమెట్రిక్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ జిల్లాలో ఎప్పటి నుంచో ఏకంగా లైవ్‌లొకేషన్ విధానం అమలులో ఉంది. నాలుగేళ్ల క్రితమే సర్కారు బడిని గాడిన పెట్టడానికి అప్పటి కలెక్టర్ ముషరఫ్‌అలీ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, ఆశిష్సంగ్వాన్ దీన్ని కొనసాగించారు. లైవ్‌లొకేషన్ పెట్టకున్నా.. ఇతరులతో పెట్టించినా.. వాళ్లు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో ఉపాధ్యాయుల హాజరు శాతం పెరగడంతో పాటు పక్కాగా బడి వేళలను పాటించారు. కానీ కొంతకాలంగా ‘లైవ్వ్ లొకేషన్’ వ్యవస్థనే నీరుగారుస్తూ వస్తున్నారు. గత డీఈవో కూడా దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుత కలెక్టర్ కూడా ఈ విధానంపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరుకు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే ఉన్న ‘లైవ్‌లొకేషన్’ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్త డీఈవోపైనే ఉంది. యూబిట్ కేసుల్లో ‘స్టార్లు’.. రాష్ట్రంలోనే సంచలనంగా మారి, ప్రస్తుతం ఈడీ దృష్టిలో ఉన్న యూబిట్ కేసులో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వందల్లో ఉండటం తెలిసిందే. ఇప్పటికీ కొంతమంది ‘స్టార్లు’ తెరవెనుక ఈ దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్లాసురూముల్లోనే ‘కాయిన్’ల దందాలు చేస్తూ.. కళ్లముందున్న పిల్లలకు ద్రోహం చేస్తున్న ఇలాంటి ‘స్టార్ల’నూ గాడిన పెట్టాల్సిన అవసరముంది.న్యూస్‌రీల్ -
‘సీఎం పదవిని కాపాడుకోవడానికే విమర్శలు’
నిర్మల్‌చైన్‌గేట్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆపార్టీ సీనియర్ నాయకుడు రావుల రాంనాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన హోదాను మరిచి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నరేంద్ర మోదీకి, గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నాడని వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. సోనియాగాంధీకి గులాంగిరి చేస్తున్న మీరు ఇటలీకి గులాంగిరివి కావా అని ప్రశ్నించారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు. ఆరు గ్యారెంటీలు, 240 హామీలు వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో ప్రజలు క్షమించరన్నారు. -
అవగాహన ఉండాలి
మహిళలకు చట్టాలపై ● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్‌టౌన్: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో షీ టీం, భరోసా సిబ్బందితో కలిసి లైంగిక వేధింపులు, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, పోక్సో చట్టాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థుల భద్రత, రక్షణ కొరకు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆకతాయిలు వేధింపులకు గురిచేసినా మానసికంగా, శారీరకంగా హింసించినా, సోషల్ మీడియా ద్వారా వేధించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మైనర్ అయితే కౌన్సిలింగ్, మేజర్ అయితే కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా లాంటివి మీ దృష్టికి వస్తే డయల్ 100 లేదా 1098 లేదా షీ టీం 8712659550 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ వినోద్, షీ టీం భరోసా మహిళా ఎస్సై సుమంజలి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్గానిక్ పత్తి.. విదేశాలకు ఎగుమతి
చెన్నయ్ మీదుగా జర్మనీకి సరఫరా.. పత్తి పంట చేతికి వచ్చాక పత్తిని తీసే విధానంపై అవగాహన కల్పించడానికి జర్మనీ దేశస్తులు ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. పత్తిని తీశాక ఇంద్రవెల్లి మండలంలో జిన్నింగ్ చేసి అక్కడి నుంచి చెన్నయ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సదన్ ఫాస్ట్ ఇండియా కంపెనీ నుంచి జర్మనీ దేశానికి తరలిస్తారు. ఈ పత్తితో జర్మనీలో టవల్స్, బెడ్షీట్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రతీ సంవత్సరం పత్తి పండించి ఎగుమతి చేస్తుండగా.. ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందుగా 800 మందితో పంట పండించగా.. ప్రస్తుతం ఆ రైతులు సంఖ్య 5,500మందికి చేరింది.జన్నారం: పత్తి పంట చేతికి రావాలంటే రసాయన ఎరువులు వాడాల్సిందే. మొలక నుంచి మొదలు పత్తి పంట చేతికొచ్చే వరకు చీడపీడల నుంచి రక్షణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేస్తారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల రైతులు పూర్తిగా సేంద్రియ ఎరువులతో పత్తి పండిస్తున్నారు. దిగుబడి వచ్చిన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ రైతులు, జర్మనిలోని డిబెల్ల టెక్స్టైల్ కంపెనీ ప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు మండలాల్లో సుమారు 5,500మందికి పైగా రైతులు ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారని చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ సీఈవో నందకుమార్ తెలిపారు. సేవా కార్యక్రమాలు జర్మనీ, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు రైతులతో ఆర్గానిక్ పంట పండించడమే కాకుండా వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. సిర్పూర్ మండలంలో కంప్యూటర్ ల్యాబ్, సిర్పూర్–యూ మండలం రాఘవాపూర్‌లో విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. జన్నారం మండలంలో ప్రోత్సాహం రైతులు ముందుకు వస్తే జన్నారం మండలంలో కూడా ఆర్గానిక్ పత్తి పంట పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఈ మండలంలోని గిరిజన గ్రామాలను ఎంచుకుని ఆర్గానిక్ పంటపై అవగాహన కల్పించి రైతులు ముందుకు వస్తే వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతియేటా ఉమ్మడి జిల్లా నుంచి తరలింపు చెన్నయ్ మీదుగా జర్మనీకి.. బట్టలకు వినియోగం క్వింటాల్‌కు రూ.500 అదనంఅ‘ధనం’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, కెరమెరి, ఆసిఫాబాద్, సిర్పూర్–యూ, జైనూర్, ఉట్నూర్ మండలాల్లోని 170 గ్రామాల్లో ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారు. ఈ ఏడాది ఆయా గ్రామాల్లోని 5,500 మంది రైతులు 7,900 ఎకరాల్లో పత్తి సాగు చేసి 55,300 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పత్తికి మార్కెట్ ధర కన్న పది శాతం ఎక్కువ ధర చెల్లిస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని గ్రహించి ఈ ధర చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,500 ఉండగా.. సంస్థ రూ.8వేలు చెల్లిస్తోంది. దీంతోపాటు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన సేంద్రియ ఎరువులకు సహకారం అందిస్తున్నారు. -
గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పట్టుదలతో చదివి కొలువులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు నిర్వహించామన్నారు. జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలకు కోడింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం ఇటీవల వివిధ కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ అది, లైబ్రేరియన్ రాథోడ్ మోహన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఔదార్యం చాటుకున్న చైర్మన్ నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ తన ఔదార్యం చాటుకున్నారు. కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిని వచ్చేందుకు సమయం వృథా అవుతోంది. దీనిని గుర్తించిన ఆయన వా రికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన వారోత్సవాల ముగింపు సందర్భంగా మధ్యాహ్న భోజ నాన్ని ప్రారంభించారు. పోటీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు సుమారు మూడు నెలలపాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. ● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ -
డీఈవో రామారావు బాధ్యతల స్వీకరణ
నిర్మల్‌రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారిగా పి.రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా ఎఫ్ఏసీ డీఈవోగా జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో డీఈవోగా పనిచేసిన రవీందర్‌రెడ్డి రిలీవ్ అయి ములుగు ఎఫ్ఏసీ డీఈవోగా బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈవోను కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సన్మానించారు. అనంతరం డీఈవో బాసరకు వెళ్లి జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది పూలమాల, శాలు వాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాసర బాలుర, బాలికల ఉన్న త పాఠశాలలు, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ‘పది’ విద్యార్థుల ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది వెంకటరమణ, భోజన్న, భానుప్రసాద్, తదితరులు ఉన్నారు. -
పీజీ కాలేజీని కాపాడాలని గవర్నర్‌కు ఫిర్యాదు
నిర్మల్: కాలేజీలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఉన్నా.. జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు మెయిల్ ద్వారా యూనివర్సిటీల చాన్స్లరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఫిర్యాదు చేశారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు ఉపయోగపడాల్సిన కాలేజీ భవనాన్ని నర్సింగ్ కళాశాలకు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సిన అధికారులే ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని, పీజీ కాలేజీని పునరుద్ధరించాలని ఫిర్యాదులో కోరినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పీజీ కాలేజీని కాపాడాలని గవర్నర్‌కు ఫిర్యాదు
నిర్మల్: కాలేజీలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఉన్నా.. జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కాలేజీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు మెయిల్ ద్వారా యూనివర్సిటీల చాన్స్లరైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఫిర్యాదు చేశారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు ఉపయోగపడాల్సిన కాలేజీ భవనాన్ని నర్సింగ్ కళాశాలకు కేటాయించడం దారుణమన్నారు. జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాల్సిన అధికారులే ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని, పీజీ కాలేజీని పునరుద్ధరించాలని ఫిర్యాదులో కోరినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జోనల్ పోటీల్లో భైంసా బాలికల సత్తా..
భైంసాటౌన్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కంజరలో జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జోనల్ స్థాయి పోటీల్లో భైంసా పట్టణంలోని బాలికల గురుకుల విద్యార్థినులు సత్తా చాటారు. జోనల్ స్థాయిలో 18 పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. 17 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయులు విద్యార్థినులు, పీఈటీని మంగళవారం అభినందించారు. అండర్ –14, 200మీ. పరుగుపందెం, లాంగ్‌జంప్‌లో ఎల్.ఆకాంక్ష మూడోస్థానం, షాట్‌పుట్‌లో ఎం.సంజన (మొదటి), బి.స్నేహిత(రెండోస్థానం), డిస్కస్‌త్రోలో జి.పూజ(రెండో స్థానం) సాధించగా, అండర్–17 చెస్ పోటీలో కె.అనుష్క(మొదటి), షాట్పు, 400 మీల పరుగులో కె.అనుశ్రీ(రెండు, మూడు), డిస్కస్‌త్రోలో జయశ్రీ మొదటి బహుమతి పొందారు. అండర్–19, 800 మీ.ల పరుగులో కె.హర్షిత రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారు.. అండర్–14 కబడ్డీలో స్నేహిత, ఖోఖోలో ఎస్.శ్రీనిధి, సీహెచ్.సంధ్య, ఎల్.ఆకాంక్ష, అండర్– 17 ఖోఖోలో బి.శరణ్య, అండర్ –19లో జే.ప్రకృతి, అండర్–17 వాలీబాల్‌లో జె.సునయన, అండర్–19లో బి.తేజ, అథ్లెటిక్స్‌లో కె.అనుష్క, ఎల్.ఆకాంక్ష, ఎం.సంజన, బి.స్నేహిత, జి.పూజ, కె.అనుశ్రీ, పి.జయశ్రీ, కె.అనుశ్రీ, కె.హర్షిత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల జూనియర్ కళాశాల/పాఠశాలకు చెందిన విద్యార్థులు 10వ జోనల్‌స్థాయి పోటీల్లో ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 18న నిజామాబాద్‌లోని కంజర గ్రామంలో నిర్వహించిన టెన్నికాయిట్ అండర్–19 విభాగంలో పాఠశాలకు చెందిన కె నిరోజ, జె.రుచితలు ప్రతిభను కనబర్చి మొదటి బహుమతి సాధించారు. అండర్–17విభాగంలో క్యారమ్ పోటీల్లో కావేరి, గంగోత్రి ద్వితీయ బహుమతి సాధించారు. ఈపోటీల్లో అండర్–19విభాగం నుంచి రాష్ట్రస్థాయి టెన్నీకాయిట్ పోటీలకు కె.నిరోజ, జె.రుచితి ఎంపికయ్యారు. కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు సీహెచ్.అపర్ణ ఎంపికై ంది. అండర్–19 ఖోఖో పోటీలకు జి.మానస, అండర్–17 విభాగంలో కబడ్డీ పోటీలకు కీర్తన అనే విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాధిక వివరించారు. వివిధ విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు సీనియర్ వైస్‌ప్రిన్సిపాల్ నిహారిక, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ స్వరూప, పీఈటీ సుస్మిత, పీఈటీ సుప్రియ అభినందించారు. సాంఘిక సంక్షేమ పాఠశాలకు ఓవరాల్ చాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయికి 17మంది ఎంపిక -
పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..!
భైంసాటౌన్: జిల్లా తూనికలు, కొలతల శాఖలో అధికారుల పర్యవేక్షణలోపంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. లైసెన్స్డ్ కాంటా రిపేరర్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం సరైన తనిఖీ చేయకుండానే స్టాంపింగ్ చేస్తున్నారు. ఇదే కాకుండా, ఇన్చార్జి బాధ్యతల నెపంతో అధికారులు క్షేత్రస్థాయిలో ఎలక్ట్రానిక్, మానువల్ కాంటాలను సకాలంలో తనిఖీలు చేయడం లేదు. వాటికి స్టాంపింగ్ సైతం సకాలంలో వేయకపోవడంతో తూకాల్లో మోసాలతో ఓ వైపు వినియోగదారులు, రైతులు నష్టపోతుండగా, జాప్యం కారణంగా మరోవైపు కాంటాల యజమానులు జరిమానాలు భరించాల్సి వస్తోంది. వేల సంఖ్యలో.. జిల్లాలో వేలసంఖ్యలో ఎలక్ట్రానిక్, మాన్యువల్ కాంటలు ఉన్నాయి. పదుల సంఖ్యలో వేబ్రిడ్జిలు, పెట్రోల్ పంపులు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖకు సంబంధించి సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేసి వినియోగదారులకు కచ్చితమైన సేవలు అందించాల్సి ఉండగా, జిల్లాకు రెగ్యులర్ అధికారి లేక, ఇన్చార్జి బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మళ్లీ పరిశీలిస్తా.. స్టాపింగ్ విషయంలో ఆలస్యమైంది. డ్యూ ఫీ వసూలు విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా చూస్తాం. ఇన్చార్జి బాధ్యతలతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదు. మరోసారి పరిశీలిస్తాం. పొరపాట్లు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా చూస్తాం. – భూలక్ష్మి, తూనికలు కొలతల అధికారి. జిల్లా తూనికలు కొలతల శాఖలో ఇష్టారాజ్యం కాంట్రాక్టర్లతో చేతులు కలిిపిన అధికారులు? తనిఖీ లేకుండానే కాంటాలపై స్టాంపింగ్భైంసాటౌన్ పట్టణంలోని ఓ వర్తకుడికి చెందిన ఎలక్ట్రానిక్ కాంటాకు గతేడాది జూన్ 10న స్టాంపింగ్ చేశారు. ఈ ఏడాది జూన్ 9తో గడువు ముగిసింది. మరోమారు స్టాంపింగ్ చేయాలంటే డ్యూ ఫీ చెల్లించాలి. కానీ, ఓ లైసెన్స్డ్ కాంటా రిపేరర్ డ్యూ ఫీ లేకుండానే ఇటీవల కాంటాకు సీల్ వేశాడు. అనంతరం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి స్టాంపింగ్ వేశారు. గాంధీగంజ్‌లో పలువురు భూసార్ ట్రేడర్లకు చెందిన పలు ఎలక్ట్రానిక్ కాంటాలకు సైతం ఈ ఏడాది జూన్‌లోనే స్టాంపింగ్ గడువు ముగియగా, డ్యూ ఫీ లేకుండా కాంటాలకు స్టాంపింగ్ వేసినట్లు తెలిసింది. ఇష్టారీతిన సర్వీస్ చార్జీ..! ఇదిలా ఉండగా, గుర్తింపు పొందిన లైసెన్స్డ్ కాంటా రిపేరర్ ఇష్టారీతిన సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కాంటాకు రూ.1,800 వసూలు చేస్తుండగా, ఇందులో నుంచి శాఖకు ఆన్లైన్లో రూ.300–400 మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన మొత్తం సర్వీస్ చార్జీ కింద తీసుకున్నాడు. ఇలా ప్రభుత్వ శాఖకు మించి ప్రైవేట్ వ్యక్తి సర్వీసు చార్జీ ఎక్కువగా ఉండడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసు రుసుం వసూలు చేస్తున్న రిపేరర్లు ఏడాదిలోపు కాంటాకు ఏం జరిగినా మరమ్మతు చేయాలి. కానీ, దుకాణదారులకు ఈ విషయమై అవగాహన లేక స్థానికంగా ఉన్నవారికి డబ్బులు చెల్లించి రిపేర్ చేయించుకుంటున్నారు. -
ముజ్గి పాఠశాలలో ప్రపంచ టాయిలెట్ డే
నిర్మల్ రూరల్: ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా మండలంలోని ముజ్గి ఉన్నత పాఠశాల విద్యార్థులకు డీఆర్డీవో విజయలక్ష్మి మంగళవారం అవగాహన కల్పించారు. విద్యార్థులు తప్పకుండా టాయిలెట్‌ను వినియోగించాలని సూచించారు. విద్యార్థులంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇంటిని, బడిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన స్వచ్ఛ కార్మికులను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీవో గజానంద్, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్, ఏపీవో తుల రామకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
నిర్మల్
ఎక్సైజ్ శాఖకు మద్యం బాటిళ్ల అప్పగింత నిర్మల్‌టౌన్: ఎకై ్సజ్ శాఖకు నిర్మల్ ఆర్టీసీ అధికారులు మంగళవారం మద్యం బాటిళ్లు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వస్తున్న రాజధాని బస్సులో దొరికిన 3 బాటిళ్లను డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ శాఖకు అసిస్టెంట్ డిపో మేనేజర్ రాజశేఖర్ సమక్షంలో అప్పగించారు. బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024సర్వే సజావుగా నిర్వహించాలి ● డీపీవో శ్రీనివాస్ కుంటాల: సమగ్ర కుటుంబ సర్వేను సజావుగా నిర్వహించాలని డీపీవో శ్రీనివాస్ సూచించా రు. మండలంలోని కల్లూరులో కొనసాగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. సర్వేకు వెళ్లే ముందు ఇంటి యజమానికి సమాచారం ఇవ్వాలన్నారు. కుటుంబ యజమానులు ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు. ● నాగమ్మ చెరువు, కరిసెల గుట్టను గుల్లచేస్తున్న మాఫియా ● అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణానికి తరలింపు ● అడ్డుకున్న వీడీసీ సభ్యులు.. అయినా తరలింపు ఆపని కాంట్రాక్టర్సారంగపూర్: ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మట్టి తరలించాలన్నా.. గుట్టలను పగలగొట్టాలన్నా.. చెరువులు, కుంటల్లో నీళ్లు ఇతర పనులకు వినియోగించాలన్నా.. అనుమతి తప్పనిసరి. కానీ, సారంగాపూర్ మండలంలో మాత్రం దేనికీ అనుమతి తీసుకోరు. అడిగేవారు లేకపోవడంతో ప్రకృతి సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. జామ్ గ్రామ సమీపంలోని చెరువు, గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలించుకుపోతున్నారు. ‘తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత’ అన్నట్లుగా ఈ దందా సాగుతోంది. సారంగాపూర్ మండలం జామ్ గ్రామ సమీపంలో ఉన్న కరిసెలగుట్ట ఒకప్పుడు పండ్ల చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో పచ్చగా కళకళలాడేది.పెద్ద పెద్ద ఇప్ప చెట్లు గిరిజనులకు ఉపాధి కల్పించేవి. వన భోజనాలకు గ్రామస్తులు ఈ గుట్టకే వచ్చేవారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు. పక్కనే నాగ మ్మ చెరువు నుంచి వచ్చే స్వచ్ఛమైన చల్ల గాలితో ఎంతో ఆహ్లాదంగా అనిపించేది. మొరం మాఫియా కన్ను ఈ గుట్టపై పడింది. దీంతో క్రమంగా కరిగి పోతూ కరిసెలగుట్ట కళ తప్పింది. ఇప్పుడు చుట్టూ కందకాలు దర్శనమిస్తున్నాయి. దీంతో కరిసెలగుట్ట కందకాల దిబ్బలా మారిపోయింది. వేసవిలో మొ రం మాఫియా చెరువునూ వదలడం లేదు. అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో మట్టిని తరలించుకుపోతోంది. దీంతో చెరువులో గుంతలు బావులను తలపిస్తున్నాయి. నీళ్లు తాగేందుకు వెళ్లే పశువులు ఈ గుంతల్లో పడి మృతిచెందుతున్నాయి. ఈతకు వెళ్లే చిన్నారులు, చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకూ ప్రమాదం పొంచి ఉంది. నిర్మల్, మహారాష్ట్రలకు తరలింపు.... కొంతమంది రాత్రి సమయాల్లో యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుపుతూ నిర్మల్‌తోపాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు రెవెన్యూ అధికారులుగానీ, అటు మైనింగ్ అధికారులుగానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం ఇవ్వగానే వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క వాహనాన్ని సీజ్ చేసిన దాఖలాలు లేవు. న్యూస్రీల్వీడీసీ సభ్యులు అడ్డుకున్నా... తాజాగా జామ్ నుంచి మహవీర్‌తండాకు రోడ్డు వేస్తున్న కాంట్రాక్టరు పెద్దపెద్ద వాహనాల ద్వారా మొరం తరలించుకుపోతున్నాడు. విషయం తెలుసుకున్న జామ్, చిన్నూరు, పెద్దూరు వీడీసీ సభ్యులు తవ్వకాలను అడ్డుకున్నారు. అయినా వినిపించు కోకుండా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాడు. మొరం తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. కానీ, ఎలాంటి ఫీజు చెల్లించకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండానే మొరం తరలించుకుపోతున్నారు. ఇష్టానుసారం తవ్వకాలు..మొరం తవ్వకాలు జరిపితే ఒక క్రమపద్దతిలో జరపాలి. కానీ నాగమ్మ చెరువులో మాత్రం ఎవరికి తోచిన ప్రాంతంలో వారు తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో చెరువంతా పెద్దపెద్ద గుంతలు, కందకాలే ఉన్నాయి. కరిసెల గుట్టను ఆనుకుని ఉన్న ఎత్తయిన గుట్టను కూడా సగానికి తవ్వేశారంటే మొరం దందా ఏమేరకు సాగుతోందో ఊహించుకోవచ్చు. చర్యలు తీసుకుంటాం... కరిసెలగుట్ట వద్ద, నాగమ్మ చెరువు పక్కనే మొరం తవ్వుతున్నారని సమాచారం అందింది. ఆర్ఐని పంపించి తవ్వకాలను నిలిపివేయించాం. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరిపితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కరిసెల గుట్ట అధికారుల పర్యవేక్షణలో ఉంది. – శ్రీదేవి, తహసీల్దార్, సారంగాపూర్ -
విస్తృతంగా ప్రజాపాలన విజయోత్సవాలు
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో మంగళవారం ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రజాపాలన కళాయాత్ర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కళాయాత్ర ప్రతినిధులు ప్రొఫెసర్ అలేఖ్య పుంజల, అంతడుపుల నాగరాజు నేతృత్వంలోని బృందాలు రాష్ట్రమంతా పర్యటిస్తాయని వెల్లడించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా కళాకారుల బృందం ఈనెల 21న సాంస్కృతిక కార్యక్రమాలను పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సహా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని, వేదిక వద్ద అత్యవసర సేవల కోసం వైద్య బృందం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీపీఆర్వో విష్ణువర్ధన్, సీపీవో జీవరత్నం, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌గోపాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రచారరథం ప్రారంభం ప్రజాపాలన కళాయాత్ర ప్రచార వాహనాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి డిసెంబర్ 7 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కళాకారుల బృందం పర్యటిస్తుందన్నారు. సమన్వయ సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ -
పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ కృషి
నిర్మల్‌చైన్‌గేట్: దేశంలో పేదరిక నిర్మూలనకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు ఆదేశాల మేరకు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 107వ జయంతిని జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు చిన్ను మాట్లాడుతూ ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఇందిర స్ఫూర్తితోనే దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఎంపీపీ రామేశ్వరరెడ్డి, దేవరకోట దేవాలయ చైర్మన్ శ్రీనివాస్, నిర్మల్ మండల అధ్యక్షుడు కుంట వేణుగోపాల్, కౌన్సిలర్లు కత్తి నరేందర్, సైండ్ల శ్రీధర్, అజర్, అయ్యన్నగారి పోశెట్టి, కొంతం గణేశ్, నాయకులు సబ కలీమ్, మాజర్, సురేందర్, అర్షద్, నవీద్, శ్యామ్, శ్రీధర్, ఓద్నం నరేందర్, గుల్లె రాజన్న పాల్గొన్నారు. -
‘మహా’ తీర్పు ఇచ్చేందుకు..
నిర్మల్: ‘యా దాదా.. మత్దాన్ కరా.. ఆపల్యా మహారాష్ట్రాత్ నివడణుకా ఆహేత్..’ అంటూ సొంత రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు రావాలంటూ పిలుపు రావడంతోనే మరాఠాలు మహారాష్ట్ర తరలివెళ్లారు. బుధవారం మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో మంగళవారం రాత్రి వరకు జిల్లా నుంచి వందలాది ఓట ర్లు మహారాష్ట్రలోని స్వస్థలాలకు బయల్దేరి వెళ్లా రు. మరాఠాలు విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యవసా య, వ్యాపారాలరీత్యా జిల్లావ్యాప్తంగా మరాఠాలు స్థిరపడ్డారు. సరిహద్దులోని చాలా గ్రామాల్లో ఓటర్లకు తెలంగాణ, మహారాష్ట్రలో రెండుచోట్లా ఓట్లు ఉన్నాయి. ధర్మాబాద్, భోకర్, కిన్వట్ తాలు కాల నుంచి జిల్లాకు వచ్చిన మరా ఠాలకు ఇక్కడ ఓట్లు ఉన్నాయి. వాళ్లు తమ స్వస్థలాల్లోనూ ఓటుహక్కును కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే చాలామంది ఓటేసేందుకు తరలివెళ్లారు. -
సమయపాలన పాటించాలి
పెంబి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో రాజేందర్ సూచించారు. పెంబి పీహెచ్‌సీని మంగళవారం సందర్శించారు. యాంటీబయోటిక్ మందులు అవసరం మేరకే ఉపయోగించాలని సూచించారు. అతిగా వాడితే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయని తెలిపారు. ఈమేరకు రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మీడియా, విస్తరణ అధికారి రవీందర్, డీపీహెచ్‌ఎన్‌వో సాయమ్మ, వైద్యాధికారి శివకుమార్, శాంతన్రెడ్డి, ఫార్మసిస్టు శ్రీనివాస్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో రాజేందర్ -
వైద్య కళాశాలలో వైట్‌కోట్ వేడుక
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైట్‌కోట్ వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతీ మెడికల్ కాలేజీలో తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులు అకడమిక్ విద్య నుంచి క్లినికల్ విద్యలో ప్రవేశించే క్రమంలో వైట్‌కోట్ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే స్థానిక మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైట్‌కోట్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యవత్తిలో ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ తమ వృత్తికి న్యాయం చే స్తామని మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో జి ల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్, డాక్టర్ దరహాస, డాక్టర్ దినేష్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా వాసులు
నిర్మల్ రూరల్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు లభించింది. రాష్ట్ర సహాధ్యక్షులుగా ఎ.లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నోముల శరత్చందర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వీర్బా పాటిల్‌ను ఎన్నుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వీరు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న ముగ్గురికీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏ.మురళీ మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్‌ఖాన్, కోశాధికారి పోల ధర్మరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ముస్కు పరమేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ముగిసిన గ్రూప్–3 పరీక్షలు
● పేపర్– 3కి 4,665 మంది హాజరునిర్మల్రూరల్: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. రెండో రోజు సోమవారం పేపర్– 3 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 8,124 మంది విద్యార్థులకు 4,665 మంది(57.42 శాతం) హాజరయ్యారు. 3,459 మంది గైర్హాజరయ్యారు. శాంతినగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇందులో రీజనల్ కోఆర్డి నేటర్ పీజీ.రెడ్డి, డిపార్ట్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ రాజు ఉన్నారు. -
‘మహా’ ఎలక్షన్ ఎఫెక్ట్..!
● జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో వైన్స్, కల్లు దుకాణాలు బంద్ ● ఐదు రోజులు నిలిచిపోనున్న అమ్మకాలుభైంసాటౌన్: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు మహారాష్ట్రకు సరిహద్దున 5 కి.మీ.ల పరిధిలో తెలంగాణలో ఉన్న వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేసినట్లు భైంసా ఎకై ్సజ్ సీఐ నజీర్‌హుస్సేన్ సోమవారం తెలిపారు. మహారాష్ట్రలో ఈనెల 20న పోలింగ్ ఉండగా, 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ కారణంగా ఈనెల 18 సాయంత్రం 6 నుంచి కౌంటింగ్ ముగిసేవరకు దుకాణాలు మూసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో భైంసా ఎకై ్సజ్ శాఖ పరిధిలోని కుభీర్, తానూర్, బాసర మండలాల్లోని 22 ఆయా గ్రామాల్లో కల్లు దుకాణాలు, బాసరలో ఓ వైన్స్‌లో ఐదురోజులపాటు మద్యం, కల్లు అమ్మకాలు నిలిచిపోనున్నాయి. 5 కి.మీ. పరిఽధిలోని గ్రామాలివే.. కుభీర్ మండలం హల్దా, రంగశివిని, పార్డి(బి), మార్లగొండ, బెల్గాం, పల్సి, సిర్పెల్లి, నిగ్వ, సావ్లి(1,2) మహాలింగి, బామ్ని, తానూర్ మండలంలోని బెల్తరోడ, బోరిగాం, మొగిలి, తొండాల, దౌల్తాబాద్, జౌల(కె), జౌల(బి), ఎల్వత్, బాసర మండలంలోని బద్రెల్లి, లాబ్ధి గ్రామాల్లోని కల్లు దుకాణాలతోపాటు బాసరలోని వైన్స్ మూసి ఉండనున్నాయి. -
మోతాదుకు మించి మందులు వాడొద్దు
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్నిర్మల్చైన్గేట్: మోతాదుకు మించి మందులు వాడడం అనర్థకమని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌పై జిల్లా వైద్య అధికారులకు సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రాజేందర్ మాట్లాడుతూ మోతాదుకు మించి మందులు ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ పారాసైట్స్, శిలీంద్రాలకు డ్రగ్ రెసిస్టెన్సీ కారణంగా ఇన్ఫెక్షన్ తగ్గక, వ్యాధి తీవ్రత పెరిగి, మరణా లు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించా రు. దీనిని నిరోధించడానికి, నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నా రు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇధ్రిస్ గౌరీ, నిర్వాహణాధికారులు రవీందర్‌రెడ్డి, సౌమ్య, రాజా రమేశ్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికా రి బారె రవీందర్, జిల్లాలోని వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు. -
మరఠ్వాడలో మనోళ్లు..!
● ఎనిమిది నియోజకవర్గాలో కీలకం.. ● ప్రచారంలోనూ జిల్లా నేతలు ● ‘మహా’ సంగ్రామంపై స్థానికంగా ఆసక్తినిర్మల్: జిల్లాను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీల మరాఠాలు అధికార సాధనే ఏకై క లక్ష్యంగా సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇలాంటి ‘మహా’పోరులో మనోళ్లు కూడా కీలకంగా ఉన్నారు. జిల్లా సరిహద్దున గల మరఠ్వాడ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మనోళ్ల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీలన్నీ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తున్నాయి. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో మకాం వేసి, సరిహద్దు ఆవల ఉన్న మరాఠా నియోజకవర్గాల్లో చక్రం తిప్పే పనిలో ఉన్నారు. ఇక్కడ మరాఠీ.. అక్కడ తెలుగు.. నిజాం పాలన అటు రాయలసీమ ప్రాంతాల నుంచి ఇటు మహారాష్ట్ర వరకూ సాగింది. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బణి, ఔరంగాబాద్ వరకూ నిజాం పాలనలో ఉన్నాయి. మరఠ్వాడ ప్రాంతానికి కూడా సెప్టెంబర్ 17నే విముక్తి లభించింది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని భైంసా, బోథ్, భోకర్, కిన్వట్ ఏరియాల్లో పలు తెలుగు ప్రజలున్న గ్రామాలు మహారాష్ట్రలోకి, మరాఠీ మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉన్న ఊళ్లు తెలంగాణలోకి వచ్చాయి. ఈక్రమంలోనే జిల్లాలో ఉన్న సరిహద్దు గ్రామాల్లో మరాఠీ మాట్లాడితే.. మహారాష్ట్రలోని చాలా ఊళ్లల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడుతుండటం కనిపిస్తుంది. బంధాలు – బంధుత్వాలు.. పక్కపక్కనే ఉండటం, భాషాబంధాలూ కలువడంతోపాటు బంధుత్వాలనూ బలంగానే కలిపేసుకుంటూ వస్తున్నారు. నిర్మల్ నుంచి నాందేడ్, పర్బణి, ఔరంగాబాద్ వరకూ బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆడబిడ్డలను అక్కడికి ఇస్తూ, అక్కడి నుంచి కోడళ్లను తెచ్చుకుంటున్నారు. కొన్ని కులాలు, కుటుంబాలు తరాలుగా మహారాష్ట్రలోని తమ బంధువులతోనే సంబంధాలు కలుపుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ధర్మాబాద్ నుంచి కారంపొడి తెచ్చుకోవడం, నాందేడ్‌లో వైద్యం చేయించుకోవడం జిల్లావాసులకు కామన్. ప్రధానంగా సారంగపూర్, కుంటాల, కుభీర్, భైంసా, తానూరు, ముధోల్, బాసర, లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, నిర్మల్ మండలాల నుంచి మహారాష్ట్ర ప్రాంతాలతో బలమైన అనుబంధాలు ఉన్నాయి. ఎనిమిది చోట్ల కీలకం.. జిల్లాతోపాటు తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని చాలాప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నారు. సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, భోకర్, కిన్వట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జిల్లాతో సంబంధాలు కలిగిఉన్నవారు, అక్కడ స్థిరపడిన జిల్లావాసులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లోనూ వీరి ఓట్లే కీలకం కానున్నాయి. ఇక నర్సి, నయగావ్, నాందేడ్, దెగ్లూర్ నియోజకవర్గాల్లోనూ జిల్లా సంబంధీకుల ఓటర్లు ప్రభావితంగానే ఉన్నారు. ఇక చాలామందికి జిల్లాతోపాటు మహారాష్ట్రలోనూ ఓట్లు ఉండటం గమనార్హం. భోకర్, ధర్మబాద్ తదితర ప్రాంతాలకు చెందిన చాలా కుటుంబాలు భైంసా, నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. ఇప్పటికీ వారు రెండుచోట్ల ఓట్లు వేస్తున్నారు.ప్రచారంలోనూ.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లేయడంలోనే కాదు.. ఓట్లను రాబట్టడంలోనూ మనవాళ్లే కీలకంగా మారారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సహా బీజేపీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు సరిహద్దు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా సరిహద్దున భైంసాలో మకాం వేసి, మరాఠా నియోజకవర్గాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు చేశారు. ఇక పక్కనే ఉన్న రాష్ట్రం, అక్కడి వాళ్లతో బలమైన బంధుత్వాలు కలిగి ఉండటంతో మరాఠాపోరులో ఎవరు గెలుస్తారనే దానిపైనే జిల్లా అంతా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారమే ఉండటంతో జిల్లాలో ఉన్న మరాఠాలు ఇప్పటికే తమ సొంతప్రాంతాలకు వెళ్లిపోయారు. -
నేటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్
● పరీక్షల బహిష్కరణ కూడా.. ● కేయూ వీసీకి నోటీసు అందజేత మంచిర్యాలఅర్బన్/కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు సోమవారం యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. 90శాతం కళాశాలలు నాలుగు, ఐదు నెలల నుంచి అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గత నెలలో 14నుంచి కూడా కళాశాలలు బంద్ చేయగా అదే నెల 17న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వారం రోజుల్లోపే విడుదలకు హామీనివ్వడంతో బంద్ విరమించామని, కానీ నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే వరకూ కళాశాలలు తెరవబోమని స్పష్టం చేశారు. కేయూ పరిధిలో ఈ నెల 26 నుంచి జరిగే డిగ్రీ కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా బహిష్కరించనున్నామని స్పష్టం చేశారు. వీసీకి నోటీసు అందజేసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రవీంద్రనాథ్, బాధ్యులు జి.వేణుమాధవ్, గోలి వెంకట్, ఎం.శ్రీనివాస్, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు. -
నిర్మల్
చలో.. ప్రకృతి ఒడికి ప్రకృతి ప్రేమికులకు నిర్మల్ జిల్లా మామడ మండలం స్వాగతం పలుకుతోంది. యెంగ న్న, తుర్కం చెరువులకు ఇప్పటికే వలస పక్షులు తరలివచ్చాయి. మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 20248లోu దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి నిర్మల్‌చైన్‌గేట్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అదనపు కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీతో కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సత్తి సాయన్న, కో కన్వీనర్ కె.ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యం, సెక్రెటరీ కె.భగవాన్, సత్యనారాయణ, నరసయ్య, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. ● వడ్డీ బకాయిలు విడుదల ● 2,566 ఎస్‌హెచ్‌జీలకు లబ్ధి ● జిల్లాకు రూ.1.10 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ● డిసెంబర్‌కు ముందు బకాయిలపై స్పష్టత ఇవ్వని సర్కార్నిర్మల్చైన్గేట్: స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి కార్యాలయానికి లేఖ అందింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి బకాయిలు మంజూరు చేస్తున్నట్లు ఈ లేఖలో వెల్లడించారు. జిల్లాల్లో 2,566 సంఘాలకు రూ.1.10 కోట్లు విడుదల కాగా, ఈ నిధులను వడ్డీ లేని రుణాలకు అర్హత పొందిన సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో 11,983 సంఘాలు.. జిల్లాలోని 11,983 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలలో 1,34,002 మంది సభ్యులుగా ఉన్నారు. సంఘాల్లోని సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఆదాయం వచ్చే ఆస్తులను కొనుగోలు చేసి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధితోపాటు వివిధ రకాల రుణాలను అందిస్తారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీని నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వడ్డీ విడుదల చేయలేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటవెంటనే విడుదల చేస్తోంది. స్వయం ఉపాధి.. మహిళా సంఘాలలో సభ్యులు తీసుకున్న రుణాలతో ఇతరులపై ఆధారపడకుండా తాను ఆర్థికంగా ఎదగడంతోపాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల వివిధ రకాల రుణాలు తీసుకుని క్యాంటీన్, పెరటికోళ్ల పెంపకం, గేదెల షెడ్డు (పాల ఉత్పత్తి)తో ఇతరులకు ఉపాధి చూపించే రంగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సభ్యులకు రుణాలను అందించటమే కాకుండా వారు ఆదాయం వచ్చే యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. పాత బకాయిల మాటేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి రావడంతో గతేడాది డిసెంబర్ నుంచి బకాయిలను మహిళా సంఘాల సభ్యులకు చెల్లిస్తోంది. ఇలా ఇప్పటివరకు నాలుగు నెలల బకాయిలు చెల్లించినప్పటికీ అంతకు ముందు బకాయిలపై ప్రకటన చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2019–20 నుంచి వేలాది సంఘాలకు వడ్డీ బకాయిలు పేరుకుపోవడంతో వాటిని విడుదల చేస్తుందా లేదా అనే అయోమయం సంఘాల్లో నెలకొంది. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బకాయిలు కూడా అందాల్సి ఉంది. సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల సభ్యులు సంఘం ద్వారా తీసుకున్న రుణాలు ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ నిధులు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించి, తిరిగి రుణం పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అందించటం జరుగుతుంది. – విజయలక్ష్మి డీఆర్డీవో న్యూస్రీల్రిజిస్ట్రేషన్ తప్పనిసరి నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో దివ్యంగుల సంక్షేమానికి నిర్వహించే ఆశ్రమాలు, పాఠశాలలు, వివిధ సంస్థల నిర్వహణకు తప్పనిసరిగా ఆర్పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంక్షేమ అధికారి పైజాన్ అహ్మద్ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ 25లోపు నిర్మల్ జిల్లా, దివ్యాంగుల, వయోవృద్దులు, ట్రాన్సెండర్ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 25 తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోని సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివరాలకు, సందేహాల నివృత్తికి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం(ఎఫ్–17 రూమ్‌లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.వివరాలు: మండలాలు 19గ్రామ సమైక్య సంఘాలు 505 స్వయం సహాయక సంఘాలు 11,983 సభ్యులు 1,34,002మండలాల వారీగా మాఫీ అయిన వడ్డీ.. మండలం మాఫీ అయిన మొత్తం (రూ.లలో) బాసర 2,26,715 భైంసా 7,24,856 దస్తూరాబాద్ 3,42,378 దిలావర్పూర్ 5,65,442 కడెం 7,16,450 ఖానాపూర్ 4,02,152 కుభీర్ 8,05,315 కుంటాల 3,73,674 లక్ష్మణచాంద 10,82,538 లోకేశ్వరం 7,42,232 మామడ 7,48,086 ముధోల్ 4,73,287 నర్సాపూర్(జి) 6,15,445 నిర్మల్ రూరల్ 9,29,391 పెంబి 1,58,153 సారంగపూర్ 9,85,896 సోన్ 5,69,268 తానూర్ 5,46,898 -
బడిని పునఃప్రారంభించాలి
కడెం: మండలంలోని పాండ్వపూర్ పంచాయతీ పరిధి పాండ్వపూర్తండా, కాశిగూడ గ్రామాలకు చెందిన 30 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్‌నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పాండ్వపూర్ తండాకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. గతంలో ఈ రెండు గ్రామాల విద్యార్థుల కోసం గ్రామంలో పాఠశాలను నడిపించారని తెలిపారు. మూడేళ్లుగా ఉపాధ్యాయులు రాక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. డ్యాంగూడలో పాఠశాల ఉన్నా దారి లేదని, పొలాలు దాటి వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారని తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలను తెరిపించాలని రాజేశ్‌తోపాటు తల్లిదండ్రులు కోరుతున్నారు.